director bobby
-
బాలకృష్ణ 'డాకు మహారాజ్' టీజర్ రిలీజ్
కొన్నిరోజులుగా అనుకుంటున్నట్లే బాలకృష్ణ కొత్త సినిమాకు 'డాకు మహారాజ్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. దాదాపు 96 సెకన్ల నిడివి ఉన్న టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో నల్లని గుర్రంపై కనిపించిన బాలయ్యకు.. డైరెక్టర్ బాబీ అదిరిపోయే ఎలివేషన్ ఇచ్చాడు. దానికి తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేరే రేంజ్ అనేలా కొట్టాడు.(ఇదీ చదవండి: అల్లు వారి పెళ్లి సందడి.. ఆశీర్వదించిన చిరు, బన్నీ)'ఈ కథ వెలుగుని పంపే దేవుడిది కాదు, చీకటిని శాసించే రాక్షసులది కాదు, ఆ రాక్షసులని ఆడించే రావణుడిది కాదు, ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఓ రాజుది.. కండ్ర గొడ్డలి పట్టిన యమధర్మరాజుది.. మరణాన్నే వణికించిన మహారాజుది' అనే వాయిస్ ఓవర్ ఆగగానే.. 'మహారాజ్, డాకు మహారాజ్' అని బాలకృష్ణ చెప్పడం ఆకట్టుకుంది.ఇందులో బాలయ్యతో పాటు చౌందిని చౌదరి, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, బాబీ డియోల్ తదితరులు నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు అధికారికంగా తేదీని ప్రకటించారు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 12 సినిమాలు) -
చిరంజీవి ఇంటికి పిలిచి ఆఫరిస్తే రిజెక్ట్ చేశా..
-
'చిరంజీవి పిలిచి మరీ ఆఫరిచ్చినా చేయలేదు.. నాకు మెసేజ్ చేసి'
పవర్, సర్దార్ గబ్బర్ సింగ్, జై లవకుశ, వెంకీ మామ, వాల్తేరు వీరయ్య సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకరచయిత బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర. కొన్ని సినిమాలకు రచయితగా కొన్నింటికి దర్శకుడిగా మరికొన్నింటికి స్క్రీన్‌ప్లే రైటర్‌గా పని చేశాడు. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేస్తున్నాడు. తాజాగా అతడు ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. చిరంజీవి ఓసారి సినిమా ఆఫర్ ఇస్తే చేయనని చెప్పినట్లు తెలిపాడు. ఆచార్య షూటింగ్లో చిరు.. అప్పుడే.. డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ.. 'వెంకీ మామ సినిమా అయిపోయాక ఓసారి చిరంజీవి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆయన అప్పుడు ఆచార్య సినిమా షూటింగ్లో ఉన్నారు. తన పిలుపు మేరకు వెళ్లి కలిశాను. ఆయన లూసిఫర్ అనే మలయాళ సినిమా చూశావా? అని అడిగారు. చూశానన్నాను. అప్పటికే లూసిఫర్ రీమేక్‌లో చిరంజీవి చేయబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. దీంతో ఆ ప్రాజెక్టు డైరెక్షన్ నాకే అప్పజెప్పుతారా? ఏంటని మనసులో అనుకున్నాను. ఇంతలో మెగాస్టార్.. ఆ సినిమా మరోసారి చూడు.. లూసిఫర్ రైట్స్ తీసుకున్నాం. ఇద్దరు ముగ్గురు డైరెక్టర్స్‌ని అనుకుంటున్నాం.. నువ్వు కూడా బానే చేస్తావనిపించింది. ఓసారి సినిమా చూసి నీ అభిప్రాయం చెప్పు అని అడిగారు. సరేనని సెలవు తీసుకున్నాను. వెంకీమామ బలవంతం మీద చేశా రెండు రోజుల్లో లూసిఫర్ పాతికసార్లు చూశాను. కానీ ఆ మూవీ నాకు కనెక్ట్ కాలేదు. ఎందుకంటే సర్దార్ గబ్బర్ సింగ్ నేను రాసిన కథ కాకపోవడం వల్ల అది అనుకున్నంత సక్సెస్ కాలేదు. అప్పుడే నేను బలంగా ఫిక్సయ్యాను.. మనం రాసిన కథ కాకుండా వేరేవాళ్ల కథలతో సినిమా చేయకూడదని నిశ్చయించుకున్నాను. కానీ వెంకీ మామ కథ బలవంతం మీద చేశాను. అయితే లూసిఫర్ రీమేక్ అడిగినప్పుడు నో చెప్పడానికి చాలా ఇబ్బందిపడ్డాను. ఎప్పటికీ చిరుతో సినిమా చేయలేననుకున్నా ఎందుకంటే చిరంజీవి అభిమానిని అని చెప్పుకునే నేను ఆయన అవకాశం ఇచ్చినప్పుడు కాదంటే తర్వాత తనతో ఎప్పటికీ సినిమా చేయలేనేమోనని భయపడ్డాను. నరకం అనుభవించాను. రెండు రోజుల తర్వాత చిరంజీవిని కలిశాను. నేను సొంతంగా రాసుకున్న కథలనే బలంగా తీయగలను. వేరొకరి కథలో నేను మార్పుచేర్పులు చేయలేను. నేను చూసిన మాస్ చిరంజీవి లూసిఫర్ కథలో కనిపించలేదు అన్నాను. దీంతో చిరంజీవి.. సరే, వదిలెయ్.. దానికి చాలామంది ఉన్నార్లే.. అన్నారు. ఇక జన్మలో మెగాస్టార్ నాతో సినిమా చేయరనుకున్నాను. వెంటనే ఇంకో ఆఫర్.. వెళ్లేముందు తనతో ఓ సెల్ఫీ దిగాను. అప్పుడాయన.. నువ్వు చూసిన చిరంజీవి ఏం చేస్తుంటాడు? ఎప్పుడు కథ చెప్తావ్? అని వెంటనే నాకు మరో ఆఫర్ ఇచ్చారు. నేను షాకవుతూనే 20 రోజుల్లో వస్తానన్నాను. 18 రోజుల తర్వాత నీకు రెండు రోజుల సమయమే ఉంది అని ఆయన దగ్గరి నుంచి మెసేజ్ వచ్చింది. సరిగ్గా 20వ రోజు తన దగ్గరకు వెళ్లి వాల్తేరు వీరయ్య సినిమా కథ చెప్పడం, తను ఒప్పుకోవడం జరిగింది' అని చెప్పుకొచ్చాడు బాబీ. చదవండి : హనుమంతు చేసిన మ్యాజిక్.. చూసేకొద్దీ చూడాలనిపించేలా.. -
చిరంజీవి సినిమా.. రవితేజ చేయనన్నాడు: దర్శకుడు బాబీ
గతేడాది వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ రెండు వందల కోట్లకుపైగా రాబట్టింది. ఇందులో రవితేజ కీలక పాత్రలో నటించాడు. నిజానికి మొదట్లో రవితేజను ఈ సినిమా కోసం అనుకోలేదట. తీరా అనుకున్నాక మాస్ మహారాజ సినిమా చేయనన్నాడట. ఆ విశేషాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు దర్శకుడు బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర. నాకు బ్రేక్ ఇచ్చింది రవితేజ 'నేను ఈ సినిమా కథ చెప్పగానే చిరంజీవి ఓకే అన్నారు. అప్పటికింకా రవితేజ పాత్ర రాసుకోలేదు. కానీ నాకే ఎక్కడో తెలియని అసంతృప్తి. రవితేజ లాంటి ఓ వ్యక్తి ఉంటే బాగుంటుందనిపించింది. రచయితగా ఎన్నో కష్టాలు పడుతూ, అద్దె కట్టడానికి కూడా ఇబ్బంది పడుతున్న రోజుల్లో రవితేజ నన్ను గుర్తించి దర్శకుడిగా నాకో అవకాశం ఇచ్చారు. అలా ఆయనతో పవర్ సినిమా తీశాను. అప్పటినుంచి పెన్ను పట్టుకుంటే చాలు రవితేజయే గుర్తొస్తుంటాడు. అలా ఓరోజు వాల్తేరు వీరయ్య కథ సెకండాఫ్‌లో రవితేజను తీసుకొద్దాం అని నా టీమ్‌కు చెప్పాను. వాళ్లు ఓకే అన్నారు. కానీ అప్పటికే చిరంజీవితో 80 శాతం సినిమా పూర్తయింది. రవితేజ పాత్రపై ఆరు నెలలు కష్టపడ్డా అలాంటి సమయంలో తమ్ముడి పాత్రను హైలైట్ చేసి మళ్లీ షూటింగ్ చేద్దామంటే ఏమంటారోనని భయపడ్డాను. రవితేజ పేరు చెప్పకుండా సెకండాఫ్‌లో తమ్ముడి పాత్ర ఇలా ఉంటుందని చిరుకు చూచాయగా చెప్పాను. ఆయన వెంటనే ఆ తమ్ముడి పాత్ర చేసేది రవితేజ కదా.. అదిరిపోయిందన్నారు. నిర్మాతకు చెప్తే ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బడ్జెట్ పెరిగినా ఓకే, మేము చూసుకుంటాం.. కానీ మిస్‌ఫైర్ కాకుండా చూసుకో అని సుతిమెత్తగా హెచ్చరించారు. అప్పటివరకు షూట్ చేసిన సెకండాఫ్ పక్కనపడేశాం. అయితే రవితేజ ఎప్పుడూ సపోర్టింగ్ రోల్ చేయలేదు. ఆయన్ను ఎలా అడగాలా? అని నాలో నేనే మథనపడ్డాను. ఆరు నెలలపాటు ఆ పాత్రను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దుకుని ఆ తర్వాత రవితేజ దగ్గరకు వెళ్లాను. రవితేజ ఒప్పుకోలేదు సర్, నాకు రేపు ఒక గంటపాటు సమయం కేటాయిస్తే కథ చెప్తాను అన్నాను. చిరంజీవి సినిమా అయిపోయాక మాట్లాడుకుందాం అన్నారు. నేను ఓ క్షణం ఆగి చిరంజీవి సినిమా కథే వినమంటున్నానని చెప్పాను. ఆయన సినిమాలో నాకోసం ఓ పాత్ర అనుకుంటున్నావా? అని నేరుగా అడిగేశారు. అందుకు నేను అవును సర్, ముందు కథ చెప్తాను.. నచ్చితేనే చేయండి అన్నాను. ఆయన మాత్రం వద్దులే అబ్బాయ్.. ఇప్పటికే నాకు వరుసగా సినిమాలున్నాయ్.. మళ్లీ నువ్వు కథ చెప్పాక నచ్చలేదంటే బాగోదు. చిరు అన్నయ్య సినిమాను రవి రిజెక్ట్ చేశాడన్న పేరు వద్దన్నారు. మొత్తానికి సరేనన్నారు సర్, మీరు కథ వినండి.. నచ్చకపోతే చేయొద్దు. అసలు నేను మిమ్మల్ని సంప్రదించిన విషయం కూడా ఎవరికీ చెప్పనన్నాను. అప్పటికీ ఆయన ఒప్పుకోలేదు. కట్ చేస్తే తెల్లారి కలుద్దామన్నారు. వెళ్లి కథ చెప్పగా.. అన్నయ్యతో ఎప్పటినుంచో చేయాలనుంది, చేసేద్దాం అన్నారు. అలా వారిద్దరి కాంబినేషన్ కుదిరింది' అని చెప్పుకొచ్చాడు బాబీ. కాగా వాల్తేరు వీరయ్య చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. ప్రకాశ్ రాజ్, బాబీ సింహా, కేథరిన్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. -
చిరంజీవి 'వాల్తేరు వీరయ్య'కు 365 రోజులు.. ఎక్కడో తెలుసా..?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ ‘వాల్తేరు వీరయ్య’. 2023 సంక్రాంతి కానుకగా జనవరి 13 ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. గతేడాది బాక్సాఫీస్ హిట్‌గా భారీ విజయాన్ని అందుకుంది. శుత్రిహాసన్, రవితేజ నటించిన ఈ చిత్రం టాలీవుడ్లో గతేడాది అత్యధిక కలెక్షన్స్ (రూ. 236 కోట్లు) రాబట్టిన చిత్రంగా రికార్డుకెక్కింది. ఒకప్పుడు సినిమాలు 100 రోజుల పాటు థియేటర్లలో కనిపిస్తేనే అదొక రికార్డు.. ఇప్పటి రోజుల్లో ఏ సినిమా అయినా కానివ్వండి బాక్సాఫీస్ వద్ద మినిమమ్ రూ. 100 కోట్లు వచ్చాయా..? అని చూస్తున్నారు. అలా అయితేనే నేటి రోజుల్లో సినిమా హిట్ అనేస్తున్నారు. అలాంటిది చిరంజీవి వాల్తేరు వీరయ్య 365 రోజుల వేడుకకు రెడీగా ఉంది. ఏపీలోని అవనిగడ్డలో ఉన్న రామకృష్ణ థియేటర్లో రోజుకు నాలుగు ఆటలతో విడుదల రోజు నుంచి ఇప్పటి వరకు విజయవంతంగా సినిమా కొనసాగుతుంది. మరో రెండు రోజుల్లో 365 రోజులు పూర్తి చేసుకుని తెలుగు ఇండస్ట్రీలో వాల్తేరు వీరయ్య సరికొత్త రికార్డ్‌ను క్రియేట్ చేయనుంది. నేడు సాయింత్రం (జనవరి 9) అవనిగడ్డలోని రామకృష్ణ థియేటర్లో మెగా ఫ్యాన్స్ 365 రోజుల వేడుక చేయనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. గతేడాదిలో వాల్తేరు వీరయ్య 200 రోజుల వేడుకను చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో జరిపింది. ఆ సమయంలో చిరంజీవి ఇలా మాట్లాడారు. 'అత్యధిక రోజులు సినిమా ప్రదర్శితమై, విజయానికి గుర్తుగా షీల్డు అందుకున్నందుకు ఒళ్లు పులకరిస్తోంది. చరిత్రను మళ్లీ తిరగరాసినట్టు అనిపిస్తోంది' అని సంతోషం వ్యక్తం చేశారు. అలా పాతరోజులను ఆయన మళ్లీ గుర్తుచేసుకున్నారు. వాల్తేరు వీరయ్య నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. -
బాలయ్య పాత సినిమాకు 109 సినిమాకు లింక్..!
-
'మధురపూడి గ్రామం అనే నేను' ట్రైలర్ రిలీజ్ చేసిన డైరెక్టర్ బాబీ
శివ కంఠమనేని హీరోగా చేస్తున్న సినిమా 'మధురపూడి గ్రామం అనే నేను'. కళ్యాణ్ రామ్ 'కత్తి' ఫేమ్ మల్లి దర్శకత్వం వహిస్తున్నారు. క్యాథలిన్ గౌడ హీరోయిన్. మణిశర్మ సంగీతమందిస్తున్నారు. ముప్పా వెంకయ్య చౌదరి సారథ్యంలో జి. రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే పాటలు, టీజర్‌కి అలరిస్తుండగా.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి ఈ తెలుగు సినిమా!) చాలారోజుల తర్వాత డైరెక్టర్ మల్లి ఓ మంచి సినిమా చేశారు. ట్రైలర్ చూశాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒక ఊరిలో జరిగే కథ. రా అండ్ రప్టిక్గా ఉంటూనే ఎమోషన్స్‌తో నిండి ఉంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అని డైరెక్టర్ బాబీ.. ట్రైలర్‌ని లాంచ్ చేసిన తర్వాత చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: ఫారెన్ టూర్లో విజయ్-రష్మిక.. అది నిజమేనా?) -
వారి కళ్లల్లో ఆ నమ్మకం కనిపిస్తోంది
‘‘దిల్ సే’ సినిమా ట్రైలర్ చాలా బాగుంది.. ఒక పాజిటివ్ వైబ్ కనిపిస్తోంది. ఈ చిత్రంతో విజయం అందుకుంటామనే నమ్మకం యూనిట్ కళ్లల్లో కనిపిస్తోంది. అందుకు తగ్గట్టే ‘దిల్ సే’ పెద్ద విజయం సాధించాలి’’ అని డైరెక్టర్ బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర)’’ అన్నారు. రాజా విక్రమ్ హీరోగా భరత్ నరేన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దిల్ సే’. శ్రీ అక్కియన్ ఆర్ట్స్ బ్యానర్‌పై శ్రీధర్ మరిసా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 16 నుంచి ఓ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ని బాబీ కొల్లి విడుదల చేశారు. భరత్ నరేన్ మాట్లా డుతూ– ‘‘ఈ సినిమాలో మాస్క్ వేసుకున్న అమ్మాయి (హీరోయిన్) ఎవరు? అనేది ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించడానికే చెప్పడం లేదు’’ అన్నారు. ‘‘దిల్ సే’ నా మొదటి చిత్రం’’ అన్నారు రాజా విక్రమ్. -
తెలుగు స్టార్స్ డైరెక్టర్స్ కి షాకిచ్చిన తమిళ్ స్టార్స్
-
వాలంటైన్స్ డే స్పెషల్: తెలుసా మనసా నుంచి మెలోడీ సాంగ్
‘కేరింత’ ఫేమ్ పార్వతీశం హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ తెలుసా మనసా. డెబ్యూ డైరెక్టర్ వైభవ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో జష్విక హీరోయిన్గా నటిస్తోంది. న్యూ ఏజ్ ప్లాటోనిక్ లవ్‌స్టోరిగా ఈ చిత్రాన్ని శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై వర్షా ముండాడ, మాధవి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ మెలోడీ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీ ఈ పాటను తాజాగా లాంచ్ చేశారు. అనంతరం ఆయన మాటాడుతూ.. ఈ పాట విన్నానని, చాలా బాగుందన్నారు. న్యూ ఏజ్ ప్లాటోనిక్ లవ్‌స్టోరిగా వస్తున్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటూ చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలిపారు. ‘మనసు మనసుతో..’ అంటూ మెలోడియస్గా సాగే ఈ పాట సంగీత ప్రియులను బాగా ఆకట్టుకుంటోంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మరోసారి ఈ పాటలో ఆయన తనదైన మార్క్ చూపించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా.. నిజమైన ప్రేమలోని లోతును ఆవిష్కరించేలా, హృదయానికి హత్తుకునేలా ఉంది ఈ పాట. వనమాలి రాసిన ఈ పాటను శ్రీకృష్ణ అద్భుతంగా ఆలపించారు. ప్రసాద్ ఈదర సినిమాటోగ్రఫీ ఈ పాటకు మరింత అందాన్నిచ్చింది. -
డైరెక్టర్‌కు మెగాస్టార్ ఖరీదైన గిఫ్ట్, ధర ఎంతంటే?
మెగాస్టార్ చిరంజీవిని ఒకసారి నేరుగా చూడాలి, ఒక్కసారైనా కలిసి సెల్ఫీ తీసుకోవాలి.. ఇలా కలలు కనేవాళ్లు చాలామంది. ఈ కోవలోకే వస్తాడు దర్శకుడు బాబీ. చిన్నప్పటినుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాడు. మెగాస్టార్ మూవీ రిలీజైందంటే చాలు తండ్రితో కలిసి థియేటర్‌కు పరుగెత్తుకుంటూ వెళ్లేవాడు. అలాంటిది ఇప్పుడేకంగా ఆయనతో కలిసి సినిమానే తీశాడు. వాల్తేరు వీరయ్యతో చిరుకు బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చాడు. కానీ ఈ సినిమాను తన తండ్రికి చూపించలేకపోయాడు. సినిమా మధ్యలోనే బాబీ తండ్రి కన్నుమూశారు. తండ్రి మరణించి గుప్పెడంత శోకంలో ఉన్నా సరే షూటింగ్‌కు వెళ్లాడంటే బాబీ అంకితభావం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. సినిమా కోసం ప్రాణం పెట్టిన బాబీకి మెగాస్టార్ మర్చిపోలేని కానుక ఇచ్చాడట. వాల్తేరు వీరయ్య హిట్ అయిన నేపథ్యంలో బాబీని ఇంటికి విందుకు పిలిచాడట. భోజనం ముగిశాక అతడికి లగ్జరీ కారు కానుకగా ఇచ్చినట్లు టాక్. దీని విలువ దాదాపు రెండు కోట్ల రూపాయల మేర ఉంటుందని తెలుస్తోంది. ఈ మేరకు ఓ వార్త ఫిల్మీదునియాలో వైరల్‌గా మారింది. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాలంటే చిరంజీవి, బాబీలలో ఎవరో ఒకరు స్పందించేవరకు ఆగాల్సిందే! చదవండి: హీరోయిన్‌తో విద్యార్థి అనుచిత ప్రవర్తన, వీడియో వైరల్ -
కాకినాడలో వాల్తేరు వీరయ్య టీం సందడి!
మెగాస్టార్ చిరంజీవి బాబీ దర్శకత్వంలో నటించిన లేటెస్ట్ సినిమా 'వాల్తేరు వీరయ్య'. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తుంది. వింటేజ్ లుక్‌లో చిరు స్టైల్‌కి ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. మూడు రోజుల్లోనే వాల్తేరు వీరయ్య వందకోట్లు కలెక్ట్ చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో మూవీ భారీ విజయంతో వాల్తేరు వీరయ్య టీం ఫుల్ జోష్‌లో ఉంది. ఇదిలా ఉంటే సంక్రాంతి పండుగ సందర్బంగా డైరెక్టర్ బాబీ కాకినాడలో పర్యటించాడు. కాకినాడలోని పద్మప్రియ థియేటర్‌కు సందర్శించిన బాబీ ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడాడు. ‘నేను 20 ఏళ్ల నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమాని. ఆయనతో హిట్ సినిమా చేయడం ఆనందంగా ఉంది. సినిమాలో ప్రతి సన్నివేశం ప్రాణం పెట్టి తీశాం. మూవీ ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. అవకాశం వస్తే చిరంజీవితో భవిష్యతుల్లో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉంటాను’ అని వ్యాఖ్యానించాడు. కాగా ఆయనతో పాటు సినీ దర్శకుడు కల్యాణ్ కృష్ణ, వింటేజ్ సంస్థ అధినేత శివరామ్, చిన్ని, బెనర్జీలు కూడా పాల్గొన్నారు. -
సంధ్య థియేటర్లో సినిమా చూడటానికి వచ్చిన చిరంజీవి కూతుళ్లు
మెగాస్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా వచ్చేసింది. చిరంజీవి నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా నేడు(శుక్రవారం)గ్రాండ్‌గా విడుదల అయ్యింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో అర్థరాత్రి నుంచే ప్రీమియర్ షోలతో థియేటర్ల దగ్గర పండగ వాతావరణం నెలకొంది. డప్పులు, డ్యాన్సులతో థియేటర్ల వద్ద ఫ్యాన్స్ తెగ సందడి చేస్తున్నారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాడ్ రోడ్డులోని సంథ్య థియేటర్ వద్ద తెల్లవారుజామున 4గంటలకే సినిమా షో పడింది. ఈ థియేటర్లో డైరెక్టర్ బాబీ, దేవీ శ్రీ ప్రసాద్‌లతో పాటు చిరంజీవి కూతుళ్లు సుష్మిత, శ్రీజలు వచ్చారు. అభిమానులతో కలిసి సినిమా చూస్తూ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. -
తండ్రి చనిపోయిన రెండురోజులకే సెట్‌కు వచ్చేశాడు: చిరంజీవి
సినిమాను ప్రాణం పెట్టి తీస్తారు దర్శకనిర్మాతలు. సినిమా ఆడిందంటే సంతృప్తి చెందుతారు, ఆడలేదంటే తర్వాతి మూవీని మరింత కసిగా తెరకెక్కిస్తారు. సినిమా రిలీజ్ కోసం అభిమానులెంతగా పడిగాపులు కాస్తారో అంతకంటే వేయిరెట్లు ఎక్కువ ఆతృతతో ఎదురుచూస్తుంటారు డైరెక్టర్స్. తమ వ్యక్తిగత కష్టనష్టాలను పక్కనపెట్టి పూర్తిగా సినిమా కోసమే పరితపిస్తుంటారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ బాబీ. తండ్రి చనిపోయి కొండంత శోకంలో ఉన్నా కూడా రెండు రోజుల్లో తిరిగి వాల్తేరు వీరయ్య సెట్‌కు వెళ్లి షూటింగ్ మొదలుపెట్టాడు ఆయన. ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో చిరంజీవి చెప్పుకొచ్చాడు. 'బాబీ తన తండ్రిని ఎంతగానో ప్రేమిస్తాడు. తండ్రి కోసం అంతలా పరితపించే మనిషి నాన్న చనిపోయిన రెండు రోజులకే షూటింగ్‌కు వచ్చాడు. ఆయన పెద్ద కర్మ అయిపోయేవరకు రాకపోవడమే న్యాయమని మేము భావించాం. కానీ అతడు మాత్రం చిన్నకర్మ పూర్తికాగానే నెక్స్ట్ డే షూటింగ్‌కు వచ్చాడు. మేమంతా ఆశ్చర్యపోయాం. మీతో పని చేయడం వల్ల నాన్నగారి నిష్క్రమణను కూడా మర్చిపోయాను. మీ సాంగత్యంలో ఆ బాధ తెలియలేదు అని అతడు నాతో ఎన్నోసార్లు చెప్పాడు. సినిమా కోసం చివరి నిమిషం వరకు కష్టపడ్డాడు. అతడి శ్రద్ధాసక్తులు చూస్తే ముచ్చటేసింది. అందుకే స్టేజీపై అతడిని ముద్దుపెట్టుకున్నా' అన్నాడు చిరంజీవి. చదవండి: నాపై విషప్రయోగం జరిగింది, చేసింది అతడే: మెగాస్టార్ థియేటర్లో పూజారి మాస్ డ్యాన్స్ -
'నువ్వు శ్రీదేవి అయితే.. ఆ అయితే..' వాల్తేరు వీరయ్య సాంగ్ వచ్చేసింది
మెగాస్టార్ చిరంజీవి బాబీ డైరెక్షన్లో నటిస్తున్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. శ్రుతి హాసన్ ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే బాస్ పార్టీ పేరుతో తొలి సింగిల్ పాటను రిలీజ్ చేసిన చిత్రబృందం తాజాగా మరో పాటతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రంలోని రెండో సింగిల్ పాటను మేకర్స్ విడుదల చేశారు. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఈ చిత్రంలోని సెకండ్ సింగిల్ పాట'నువ్వు శ్రీదేవి అయితే.. ఆ అయితే.. నేనే చిరంజీవి అవుతా.. రాయే రాయే రాయే చేసేద్దాం రబ్బో' అంటూ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటను ఫ్రాన్స్‌లోని మంచుకొండల్లో కొద్ది రోజుల క్రితమే షూట్ చేశారు. ఇటీవలే ఈ పాట షూటింగ్ పూర్తి కావడంతో చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. -
స్టయిలిష్ లుక్‌లో చిరంజీవి.. వాల్తేరు వీరయ్య కొత్త పోస్టర్ రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి బాబీ డైరెక్షన్లో నటిస్తున్న చిత్రం వాల్తేరు వీరయ్య. శ్రుతి హాసన్ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో వరుసగా అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌కు మాంచి ట్రీట్ ఇస్తున్నారు మేకర్స్. ఇక ముఠామేస్త్రి తరహాలో చిరంజీవి పూర్తి స్థాయి మాస్ పాత్రలో నటిస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. తాజాగా ఈ సినిమా నుంచి చిరంజీవి లేటెస్ట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. చుట్టూ గన్స్.. మధ్యలో స్టైలిష్ గాగుల్స్‌తో స్టన్నింగ్ లుక్‌లో కనిపిస్తున్న చిరు ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఈ పోస్టర్ శాంపిల్ మాత్రమేనని, ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ మొత్తం థియేటర్లలో పూనకాలు తెప్పించడం పక్కా అంటూ డైరెక్టర్ బాబీ ట్వీట్ చేశారు. Presenting you all the new Avatar of our Megastar @Kchirutweets in #WaltairVeerayya 🔥 Ee poster Sample matrame, I promise ee episode motham POONAKALU guarantee in theatres 😎 Spot the Standees at your nearest theatres, Click your selfies and tag #WaltairVeerayyaOnJan13th 👍🏻 pic.twitter.com/9l24d13CbX — Bobby (@dirbobby) December 16, 2022 -
ఎవ్వరికీ చెప్పొద్దు.. ఆ సాంగ్ లీక్ చేస్తున్నా.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'వాల్తేరు వీరయ్య’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఓ ప్రత్యేక సాంగ్‌ను ఫ్రాన్స్‌లో షూట్ చేస్తున్నారు. ఈ పాటను దట్టమైన మంచు పర్వతాల్లో శృతిహాసన్, మెగాస్టార్ చిరంజీవిపై చిత్రీకరించారు. తాజాగా మెగాస్టార్ షూటింగ్‌కు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అది కాస్తా వైరల్ కావడంతో ఫ్యాన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. జనవరి 13 థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మెగాస్టార్ మాట్లాడుతూ.. 'హాయ్ ఫ్రెండ్స్ నేను ఫ్రాన్స్ నుంచి మాట్లాడుతున్నాను. ఈనెల 12న నేను శృతిహాసన్‌తో చేసిన ఓ సాంగ్ ఫినిష్ చేశాం. ఈ షూట్ గురించి మీతో షేర్ చేసుకుంటున్నందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. ఎందుకంటే ఆ లోకేషన్స్ కానీవ్వండి. సాంగ్ కానీవ్వండి. సో బ్యూటీఫుల్. ఈ లోకేషన్ సౌత్ ఆఫ్ ఫ్రాన్స్‌లో ఉంది. ఆ పేరు లేజే లేజే. ఇది స్విట్జర్లాండ్, ఇటలీ బార్డర్లో ఉన్న మౌంటెన్స్‌లో ఉంటుంది ఈ ప్రాంతం. ఈ పాట కోసం యూనిట్ మొత్తం చాలా కష్టపడింది. దాదాపు -8 డిగ్రీల చలిలో ఈ పాటను షూట్ చేశాం. నిజంగా ఆ లోకేషన్ చాలా అందంగా ఉంటుంది. మేము పడిన కష్టానికి తగిన ఫలితం వచ్చింది. ఈ విషయాన్ని మీతో పంచుకునేందుకు నేను ఆగలేకపోయాను. అయితే మీకోసం ఈ పాట నుంచి ఓ చిన్న బిట్‌ను లీక్ చేస్తున్నా. ఎవరికీ చెప్పకండి. త్వరలోనే మీ ముందుకు లిరికల్ సాంగ్ రానుంది.' అంటూ మెగాస్టార్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. 'నువ్వు శ్రీదేవి అయితే.. నేను చిరంజీవిని.. రాయే రాయే రాయే' అంటూ సాగే సాంగ్ లిరిక్స్ లీక్ చేస్తున్నా అంటూ నవ్వుతూ చెప్పారు మెగాస్టార్. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) -
అటు విహార యాత్ర.. ఇటు వీరయ్య యాత్ర.. మెగాస్టార్ ట్వీట్ వైరల్
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్, వాల్తేరు వీరయ్య చిత్రాలతో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న వాల్తేరు వీరయ్య సంక్రాంతి బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ రిలీజ్ తేదీ కూడా ప్రకటించారు మేకర్స్. జనవరి 13న థియేటర్లలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ కోసం మెగాస్టార్ విదేశాలకు బయలుదేరాడు. ఈ విషయాన్ని చిరు తన ట్విటర్లో పంచుకున్నారు. మెగాస్టార్ తన ట్వీట్లో రాస్తూ..' ఫ్యామిలీతో అటు విహార యాత్ర. హీరోయిన్‌తో ఇటు వీరయ్య యాత్ర' అంటూ పోస్ట్ చేశారు. కుటుంబసభ్యులతో పాటు హీరోయిన్ శృతిహాసన్‌తో కలిసి దిగిన ఫోటోలను ఆయన షేర్ చేశారు. తాజాగా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఫ్యామిలీ తో అటు విహార యాత్ర హీరోయిన్ తో ఇటు వీరయ్య యాత్ర 😊 #EuropeBeckons #WaltairVeerayya pic.twitter.com/EnhJxSlFq4 — Chiranjeevi Konidela (@KChiruTweets) December 8, 2022 -
సంక్రాంతి బరిలో నిలిచిన వాల్తేరు వీరయ్య.. రిలీజ్ డేట్ ఫిక్స్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'వాల్తేరు వీరయ్య’. తాజాగా ఈ సినిమాకు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చేసింది. సంక్రాంతికే థియేటర్లలో సందడి చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ మేరకు మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేశారు. జనవరి 13 థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. 'ఈ సంక్రాంతికి థియేటర్లలో మాస్ మూలవిరాట్ దర్శనానికి ఇది సమయం' అంటూ మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి సైతం సంక్రాంతికి కలుద్దాం అంటూ ట్వీట్ చేశారు. ఈ చిత్ర దర్శకుడు బాబీ 'జనవరి 13న మూలవిరాట్ ఆగమనం' అంటూ ట్వీట్ చేశారు. అధికారిక ప్రకటన రావడంతో మెగాస్టార్ సంక్రాంతి బరిలో నిలిచారు. దీంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జనవరి 13 "మాస్ మూలవిరాట్"ఆగమనం 🔥🎯 #WaltairVeerayya #WaltairVeerayyaOnJan13th https://t.co/FtDWVC4TkS — Bobby (@dirbobby) December 7, 2022 సంక్రాంతి కి కలుద్దాం 🔥🎯@RaviTeja_offl @dirbobby @shrutihaasan @CatherineTresa1 @ThisIsDSP @konavenkat99 @MythriOfficial @SonyMusicSouth pic.twitter.com/dLBKLphlZk — Chiranjeevi Konidela (@KChiruTweets) December 7, 2022 This Sankranthi, it's time for the MASS MOOLAVIRAT darshanam in theatres 🔥#WaltairVeerayya GRAND RELEASE WORLDWIDE on 13th JAN, 2023 💥 Megastar @KChiruTweets @RaviTeja_offl @dirbobby @shrutihaasan @CatherineTresa1 @ThisIsDSP @konavenkat99 @MythriOfficial @SonyMusicSouth pic.twitter.com/Z7aiNFxOax — Mythri Movie Makers (@MythriOfficial) December 7, 2022 -
మెగాస్టార్ 'వాల్తేరు వీరయ్య' క్రేజీ అప్డేట్.. ఫస్ట్ సింగిల్ ఆరోజే..!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల ఈ మూవీ టైటిల్ ఖరారు చేసిన చిత్రబృందం తాజాగా మరో క్రేజీ అప్డేట్తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్ విడుదల తేదీని ప్రకటించింది. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ తన ట్విటర్లో వెల్లడించింది. (చదవండి: మెగాస్టార్‌కు విద్యార్థుల సర్ప్రైజ్.. ఒకేసారి ఆరు వేలమంది కలిసి..!) వాల్తేరు వీరయ్య సినిమా ఫస్ట్ సింగిల్ ఈనెల 23న సాయంత్రం 4.05 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. రవితేజ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ కథానాయిగా నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. మరోవైపు ఈ సినిమాలోని ఓ ఐటం సాంగ్‌లో బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా కనిపించనుంది. Get ready for the biggest party of the year 🤩🤩#WaltairVeerayya first single #BossParty on November 23rd at 4.05 PM 💥💥 Megastar @KChiruTweets @RaviTeja_offl @dirbobby @shrutihaasan @CatherineTresa1 @UrvashiRautela @ThisIsDSP @konavenkat99 @SonyMusicSouth pic.twitter.com/s725DcvosQ — Mythri Movie Makers (@MythriOfficial) November 20, 2022 -
వాల్తేరు వీరయ్యలో ఊర్వశి రౌతేల ఐటెం సాంగ్! క్లారిటీ వచ్చేసింది!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్, వాల్తేరు వీరయ్య చిత్రాలతో బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈచిత్రం ప్రస్తుతం షూటింగ్‌ను శరవేగంగా జరపుకుంటోంది. ఇటీవల ఈ మూవీ టైటిల్ ఖరారు చేసిన ఈ మూవీ నుంచి తాజా ఆసక్తికర అప్డేట్ బయటికొచ్చింది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేల ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన లేదు. తాజాగా చిత్ర బృందం విడదల చేసిన ఓ ఫోటోతో ఈ వార్తలపై స్పష్టత వచ్చేసింది. సినిమాలో ఐటెం సాంగ్‌కు చిరుతో కలిసి ఆమె స్టెప్పులేసినట్లు తెలుస్తోంది. చదవండి: బర్త్‌డే సర్ప్రైజ్.. వర్షకు కాస్ట్లీ నెక్లెస్ గిఫ్ట్ ఇచ్చిన ఇమ్మాన్యుయేల్! ఇటీవల ఈ పాటకు సంబంధించిన షూటింగ్ కూడా జరిగినట్లు తెలుస్తోంది. దర్శకుడు మెహర్ రమేశ్ బర్త్‌డేను వాల్తేరు వీరయ్య సేట్లో సెలబ్రేట్ చేశారు. మూవీ సెట్లో ఆయనతో కేక్ కట్ చేయించిన ఫొటోను డైరెక్టర్ బాబీ ట్విటర్లో షేర్ చేస్తూ ఆయన పుట్టిన రోజును వాల్తేరు వీరయ్య సెట్లో నిర్వహించడం ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. అయితే ఈ ఫొటోలో చిరంజీవి, డైరెక్టర్ బాబీ, మెహర్ రమేశ్ ఇతర క్రూడ్‌తో పాటు నటి ఊర్వశి రౌతేల కూడా దర్శనమించింది. దీంతో ఈ చిత్రంలో ఆమెతో అదిరిపోయే స్పెషల్ సాంగ్‌ను ప్లాన్ చేశారని స్పష్టమైందంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా రామ్ పోతినేని-బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కబోయే ఓ సినిమాలో ఆమె ఐటమ్ సాంగ్ చేయబోతున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: విశ్వక్ సేన్, అర్జున్ వివాదంపై స్పందించిన తమ్మారెడ్డి భరద్వాజ Wishing dearest @MeherRamesh Anna a very happy birthday 🎂 🎉 Super happy to Celebrate your birthday on our #WaltairVeerayya sets along with Boss @KChiruTweets 😍 May you be blessed with best of everything, have a Blockbuster year ahead. ❤️#HBDMeherRamesh pic.twitter.com/OoIMSrue31 — Bobby (@dirbobby) November 6, 2022 -
మెగాస్టార్‌కు విద్యార్థుల సర్ప్రైజ్.. ఒకేసారి ఆరు వేలమంది కలిసి..!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న యాక్షన్ ఎంటర్టైనర్ 'వాల్తేరు వీరయ్య'. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. దీపావళి సందర్భంగా విడుదల చేసిన టైటిల్, మెగాస్టార్ ఫస్ట్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా దర్శకుడు తన ట్విటర్లో షేర్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. (చదవండి: మెగా 154 టైటిల్ వచ్చేసింది, ఆకట్టుకుంటున్న చిరు మాస్ లుక్) హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్శిటీ విద్యార్థులు చిరంజీవిపై అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' లుక్‌ను విద్యార్థులు రీ క్రియేట్ చేశారు. యూనివర్శిటీ మైదానంలో సుమారు ఆరువేల మంది విద్యార్థులు కూర్చుని మెగాస్టార్ రూపాన్ని ఆవిష్కరించారు. దీనికి సంబంధించి విజువల్స్‌ను యూనివర్శిటీలో జరిగిన క్యాన్సర్‌పై పోరాటం కార్యక్రమంలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్‌కు సర్ప్రైజ్ ఇస్తూ వీడియోను ప్రదర్శించారు. విద్యార్థుల ప్రేమకు ఫిదా అయిన చిరు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. మెగాస్టార్ పట్ల మీకున్న ప్రేమ ఈ వీడియో చూస్తే తెలుస్తోంది అంటూ దర్శకుడు బాబీ ట్విటర్ వేదికగా షేర్ చేశారు. దీనిపై నెటిజన్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. రవితేజ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ కథానాయిగా నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. What a great tribute to our Megastar @KChiruTweets garu from the students and Management of Mallareddy college 👌👏👏 Clearly shows your love and affection towards BOSS 🙌, Big thanks from me and the entire team of #WaltairVeerayya 🙏❤️@MythriOfficial https://t.co/nv932COUnH — Bobby (@dirbobby) October 30, 2022 -
'వాల్తేరు వీరయ్య' టైటిల్ టీజర్, చిరు ఫస్ట్‌లుక్ రిలీజ్
-
మెగా 154 టైటిల్ వచ్చేసింది, ఆకట్టుకుంటున్న చిరు మాస్ లుక్
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ కేఎస్ రవీంద్ర(బాబీ) కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మెగా 154గా అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతుంది. ఇటీవల ఈ మూవీ డబ్బింగ్ పనులు కూడా మొదలయ్యాయి. అయితే ఇప్పటి వరకు ఈ మూవీ టైటిల్‌ను చిత్ర బృందం రివీల్ చేయలేదు. వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ప్రచారంలో ఉండగా.. దీనిపై అధికారిక ప్రకటన లేదు. తాజాగా దీపావళి పండగ సందర్భంగా మెగా అభిమానులకు సర్ప్రైజ్ అందిస్తూ ఈ మూవీ టైటిల్ పోస్టర్‌తో పాటు టైటిల్ టీజర్‌ను చిత్రం బృందం రిలీజ్ చేసింది. చదవండి: మరోసారి మాజీ ప్రియుడితో సుష్మితా, నటిపై నెటిజన్ల అసహనం ఈ మూవీకి వాల్లేరు వీరయ్య అనే టైటిల్ ఖరారు చేసింది మూవీ యూనిట్. ఇందుకు సంబంధించి పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ టైటిల్ పోస్టర్లో చిరు సరికొత్త లుక్‌తో ఆకట్టుకున్నారు. చెవికి పోగు, లుంగీ, గళ్లా చొక్కాతో బీడి కాలుస్తూ మాస్ లుక్‌తో దర్శనమిచ్చారు. ఈ టైటిల్ పోస్టర్, టీజర్‌కు ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన వస్తోంది. కాగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతీ హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: సినిమాల్లోకి ఖుషి కపూర్.. చెల్లికి నా సలహా ఇదే: జాన్వీ కపూర్ -
మెగా ఫ్యాన్స్‌కు దీపావళి సర్ప్రైజ్.. ఆ మూవీ క్రేజీ అప్డేట్
మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. అదే జోష్‌తో తన నెక్ట్ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉన్నారు మెగాస్టార్. భోళా శంకర్, డైరెక్టర్ బాబీ దర్శకత్వంతో చిరు 154వ చిత్రంగా మూవీ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర దర్శకుడు ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. దీపావళి కానుకగా మెగా154 అఫీషియల్ టైటిల్ టీజర్ విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈనెల 24 ఉదయం 11.07 నిమిషాలకు బాస్ వస్తున్నాడు అంటూ పోస్టర్‌ను ట్వీట్ చేశారు. ఈ ప్రకటనతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కాగా ఈ చిత్రంలో చిరంజీవి సరసన శ్రుతి హాసన్ నటిస్తుండగా, మాస్ మహారాజా రవితేజ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతి కానుకగా ఈ మూవీని గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి వాల్తేరు వీరయ్య టైటిల్ పరిశీలనలో ఉండగా.. అక్టోబర్ 24న క్లారిటీ రానుంది. This Diwali it's Gonna be a "MEGA BLAST" 💥💥💣 💣 Our #Mega154 Title Teaser Launch on 24th October at 11.07 AM❤️🔥 Trust me,... Poonakalu Loading 🔥🤙 Megastar @KChiruTweets Mass Maharaja @RaviTeja_offl @shrutihaasan @ThisIsDSP @konavenkat99 @MythriOfficial @SonyMusicSouth pic.twitter.com/ZRZmvUoKAl — Bobby (@dirbobby) October 20, 2022