
మెగాస్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా వచ్చేసింది. చిరంజీవి నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా నేడు(శుక్రవారం)గ్రాండ్‌గా విడుదల అయ్యింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో అర్థరాత్రి నుంచే ప్రీమియర్ షోలతో థియేటర్ల దగ్గర పండగ వాతావరణం నెలకొంది. డప్పులు, డ్యాన్సులతో థియేటర్ల వద్ద ఫ్యాన్స్ తెగ సందడి చేస్తున్నారు.
హైదరాబాద్ ఆర్టీసీ క్రాడ్ రోడ్డులోని సంథ్య థియేటర్ వద్ద తెల్లవారుజామున 4గంటలకే సినిమా షో పడింది. ఈ థియేటర్‌లో డైరెక్టర్ బాబీ, దేవీ శ్రీ ప్రసాద్‌లతో పాటు చిరంజీవి కూతుళ్లు సుష్మిత, శ్రీజలు వచ్చారు. అభిమానులతో కలిసి సినిమా చూస్తూ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment