sushmitha
-
కొత్త సినిమాకు బ్లాక్‌బస్టర్ డైరెక్టర్‌ను ఓకే చేసిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన 'భోళా శంకర్' సినిమా సాధారణ ప్రేక్షకులకే కాదు మెగా ఫ్యాన్స్‌కి కూడా నచ్చలేదని చెప్పవచ్చు. దీంతో చిరుతో పాటు దర్శకుడు మెహర్ రమేశ్‌పైనా విమర్శలు వచ్చాయి. మెగస్టార్ లాంటి పెద్ద నటుడితో సినిమా తీస్తున్నప్పుడు కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేదని ఆయనపై విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా చిరంజీవి కూడా రీమేక్స్ సినిమాలను మరోసారి తీయకండని ఫ్యాన్స్ కూడా కోరారు. (ఇదీ చదవండి: సీఎం యోగి పాదాలను తాకడంపై క్లారిటీ ఇచ్చిన రజనీకాంత్) దీంతో ఆయన నుంచి వచ్చే కొత్త ప్రాజెక్ట్‌లు ఎలా ఉంటాయని అందరిలోనూ ఉత్కంఠత నెలకొంది. ఇందులో భాగంగా యూవీ క్రియేషన్స్ నుంచి చిరంజీవి తర్వాతి సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన కథను 'బింబిసార' మూవీ ఫేమ్ డైరెక్టర్ వశిష్ఠ కథను రెడీ చేశారు. మెగా 157 సినిమాను వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటంచారు. సోషియో ఫాంటసీగా ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. పోస్టర్లో పంచభూతాల గుర్తులను వశిష్ట చూపించాడు. టైటిల్ ఇదేనా..? డైరెక్టర్ వశిష్ఠ, మెగాస్టార్ కాంబో నుంచి వస్తున్న ఈ సినిమా సోషియో ఫాంటసీ నేపథ్యంలో అనగా అంజి, జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాల మాదిరిగా ఉండబోతోందని సమాచారం. ఆ సినిమాలో శ్రీదేవి దేవకన్యలా భూమి మీదకు వచ్చి మానవుడైనా చిరంజీవిని ప్రేమించగా. అప్పుడు ఎదురైన ఇబ్బందులను చిరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశాడో చూశాం. (ఇదీ చదవండి: చిరంజీవిని మెప్పించిన డైరెక్టర్ వశిష్ఠ గురించి పూర్తి వివరాలు) ఇక్కడ కూడా అలాంటి కాన్సెప్ట్‌తో కొందరు దేవకన్యలు భూమిపైకి రావడం వంటి ముఖ్యమైన కాన్సెప్ట్‌తో మెగా 157 ఉండనున్నట్లు సమాచారం. పంచభూతాలను చిరు ఎలా అధిగమిస్తాడనే కథాంశం మీద స్టోరీ లైన్ ఉండవచ్చు. ఈ సినిమాలో చాలామంది హీరోయిన్స్ కనిపిస్తారని తెలుస్తోంది. మరి ఆ హీరోయిన్లు ఎవరు అన్నది అయితే తెలియాల్సి ఉంది. కాగా ఈ సినిమాకు 'ముల్లోక వీరుడు' అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేసినట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. #Mega157 🔮 This time, its MEGA MASS BEYOND UNIVERSE ♾️ The five elements will unite for the ELEMENTAL FORCE called MEGASTAR ❤️🔥 Happy Birthday to MEGASTAR @KChiruTweets Garu ❤️@DirVassishta @UV_Creations#HBDMegastarChiranjeevi pic.twitter.com/llJcU6naqX — UV Creations (@UV_Creations) August 22, 2023 -
మేనకోడలుకోసం అపొలోకి వచ్చిన అత్తలు శ్రీజ,సుష్మిత
-
శ్రీశైలం మల్లీఖార్జున స్వామిని దర్శించుకున్న మెగాస్టార్ సతీమణి సురేఖ
-
ఇది నా మనసుకు ఎంతో దగ్గరైన సినిమా : సుస్మితా కొణిదెల
సంతోష్ శోభన్, గౌరి జి.కిషన్ జంటగా ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్రీదేవి శోభన్ బాబు’. సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలవుతోంది. సంతోష్ శోభన్ మాట్లాడుతూ–‘‘1970 నేపథ్యంలో ఓ పల్లెటూరులో జరిగే అందమైన కథ ఇది’’ అన్నారు. ‘‘నా మనసుకు ఎంతో దగ్గరైన సినిమా ఇది’’ అన్నారు నిర్మాత సుస్మిత. ‘‘ఈ సినిమా చూసిన తర్వాత మన కుటుంబ సభ్యులందరూ కలుసుకుంటే బావుంటుందనే ఆలోచన వస్తుంది’’ అన్నారు ప్రశాంత్. ఈ కార్యక్రమంలో నటి గౌరి జి.కిషన్, నిర్మాత విష్ణు ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శరణ్య పొట్ల పాల్గొన్నారు. -
సంధ్య థియేటర్లో సినిమా చూడటానికి వచ్చిన చిరంజీవి కూతుళ్లు
మెగాస్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా వచ్చేసింది. చిరంజీవి నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా నేడు(శుక్రవారం)గ్రాండ్‌గా విడుదల అయ్యింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో అర్థరాత్రి నుంచే ప్రీమియర్ షోలతో థియేటర్ల దగ్గర పండగ వాతావరణం నెలకొంది. డప్పులు, డ్యాన్సులతో థియేటర్ల వద్ద ఫ్యాన్స్ తెగ సందడి చేస్తున్నారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాడ్ రోడ్డులోని సంథ్య థియేటర్ వద్ద తెల్లవారుజామున 4గంటలకే సినిమా షో పడింది. ఈ థియేటర్లో డైరెక్టర్ బాబీ, దేవీ శ్రీ ప్రసాద్‌లతో పాటు చిరంజీవి కూతుళ్లు సుష్మిత, శ్రీజలు వచ్చారు. అభిమానులతో కలిసి సినిమా చూస్తూ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. -
షోరూం ప్రారంభోత్సవంలో మెగా డాటర్స్, అమల సందడి.. ఫొటోలు వైరల్
జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లో కళామందిర్ రాయల్ చీరల షోరూం సోమవారం ప్రారంభమైంది. సినీ నటి అమల అక్కినేని, మెగాస్టార్ చిరంజీవి కుమార్తెలు సుష్మిత కొణిదెల, శ్రీజ కొణిదెల షోరూంను ప్రారంభించారు. కార్యక్రమంలో లగడపాటి పద్మ, ఫిక్కీ చైర్మన్ సుబ్రా మహేశ్వరి, కళామందిర్ సుమజ, ఝాన్సీ, కూచిపూడి నృత్యకారిణి దీపికారెడ్డి, ఫ్యాషన్ డిజైనర్ దివ్యారెడ్డి, ఎండి. కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ఇది 49వ స్టోర్ అని తమ వద్ద ప్రత్యేకమైన పైతాని, సిల్క్, కోట, పటోల, హ్యాండ్లూమ్, ఖాదీ చీరలు అందుబాటులో ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా అమల మాట్లాడుతూ.. చీర కట్టులోనే మహిళల ఔన్నత్యం దాగి ఉంటుందన్నారు. చీర కట్టడం అంటే తనకు ఎంతో ఇష్టమని, ఇక్కడ ఎన్నో డిజైనరీ బ్రాండ్లు కనువిందు చేస్తున్నాయన్నారు. -
బాగా కష్టపడ్డా కానీ.. మొదటి ర్యాంక్ ఊహించలేదు: గ్రూప్–1 టాపర్ సుష్మిత
సాక్షి, హైదరాబాద్(చిక్కడపల్లి): బాగా కష్టపడ్డా కానీ.. మొదటి ర్యాంక్ వస్తుందని ఊహించలేదంటూ ఏపీపీఎస్సీ గ్రూప్–1 ఫస్ట్ ర్యాంకర్ రాణి సుష్మిత పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా పీఠాపురానికి చెందిన ఆమె ఏపీ గ్రూప్స్ ఫలితాల్లో టాప్ ర్యాంక్ సాధించారు. బుధవారం హైదరాబాద్ అశోక్ నగర్‌లోని ఏకేఎస్–ఐఏఎస్ అకాడమీలో సుష్మిత మీడియాతో మాట్లాడారు. డిప్యూటీ కలెక్టర్ ర్యాంక్ ఉద్యోగం రావడం ఆనందంగా ఉందన్నారు. ఆమె తండ్రి శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. తల్లి పద్మప్రియ ఇంటి వద్దే ఉంటారు. హిందీ పండిట్ అయిన తన తాత పి.ఎల్.ఎన్.శర్మ ప్రోత్సాహంతో గ్రూప్స్ చదవి ర్యాంక్ సాధించానని సుష్మిత చెప్పారు. తన లక్ష్య సాధనలో తల్లిదండ్రుల పాత్ర ఆమోఘమైందని వెల్లడించారు. బాగా శ్రమిస్తేనే ర్యాంక్ సాధించడం సాధ్యమని గ్రూప్స్ రాసేవారికి సూచించారు. 10వ తరగతి వరకు పిఠాపురంలో చదువుకున్న సుష్మిత కాకినాడలో బీఎస్సీ బయోటెక్నాలజీ పూర్తి చేశారు. హెల్త్ కేర్ మేనేజ్మెంట్లో పీజీ చేశారు. అదే హెల్త్‌కేర్‌లో డాక్టరేట్ పూర్తి చేశారు. బెంగళూరులో నివసిస్తున్న ఈమె భర్త రవికాంత్ సివిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. వీరికి సురవ్ కశ్యప్ అనే అబ్బాయి ఉన్నాడు. చదవండి: (Rapthadu: ఆర్టీఓగా ఎంపికైన రైతు బిడ్డ) ఏపీపీఎస్సీ పరీక్షల్లో తెలంగాణ అభ్యర్థులు తమ సత్తా చాటారు. నాన్ లోకల్ కేడర్ కింద తెలంగాణ అభ్యర్థులు ఇద్దరు తమ ప్రతిభను చాటుకున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు చెందిన పవన్ డీఎస్పీగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఐదేళ్లు యూపీఎస్సీ కోసం కష్టం పడ్డా. ఆ ప్రయత్నంలోనే ఇప్పుడు నాన్ లోకల్ కేడర్ కింద ఏపీలో డీఎస్పీగా ఎంపిక కావడం ఆనందంగా ఉంది’అని అన్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వంలో సీడీపీవోగా పనిచేస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన సింధూ ప్రియ కూడా నాన్ లోకల్ కేడర్ కింద డీఎస్పీగా ఎంపికయ్యారు. ఎంపికపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు. చదవండి: (మారుమూల రైతు కుటుంబంలో పుట్టి.. లెక్చరర్ నుంచి డిప్యూటీ కలెక్టర్‌గా..) -
మా కుమార్తె ఏం తప్పు చేసింది.. ఎందుకు తీసుకెళ్లరు
సాక్షి, కడప(చెన్నూరు): అత్త, భర్త పెట్టే వేధింపులు భరించలేకపోవడంతోపాటు సంసారానికి తీసుకెళ్లడంలేదని ఓ వివాహిత ముండ్లపల్లె గ్రామంలోని అత్త ఇంటి ముందు ధర్నా చేపట్టింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని రామనపల్లె గ్రామానికి చెందిన పెడబల్లి సుబ్బారెడ్డి, సరోజనమ్మ రెండో సంతానమైన సుస్మితను ముండ్లపల్లె గ్రామానికి చెందిన బండి వెంకట కృష్ణారెడ్డి, మాధవిల కుమారుడు బండి సురేంద్రనాథ్‌రెడ్డికి ఇచ్చి పెద్దల సమక్షంలో 2020 ఆగస్టు 5వ తేదీన వివాహం జరిపించారు. వివాహ సమయంలో కట్నకానుకల కింద రూ.15 లక్షల నగదు, 20 తులాల బంగారు నగలు ఇచ్చారు. వివాహమైనప్పటి నుంచి అత్త మాధవి, భర్త సురేంద్రనాథ్‌రెడ్డి వేధింపులకు గురి చేస్తున్నారని సుస్మిత వాపోయింది. వివాహమైన రెండు నెలల నుంచే బిడ్డలు పుట్టలేదని, పుట్టకపోతే నా కుమారుడికి వేరే పెళ్లి చేస్తామని అత్త నన్ను మానసిక ఇబ్బందులకు గురి చేసేదని చెప్పారు. తాను గర్భం దాల్చడంతో కాన్పు కోసం పుట్టింటికి వెళ్లానన్నారు. బాబు పుట్టి తొమ్మిది నెలలైనా అత్త, భర్త ఇంటికి తీసుకెళ్లలేదని వాపోయింది.మా అమ్మానాన్నలు పెద్ద మనుషులను పంపించి తనను తీసుకెళ్లాలని చెప్పినప్పటికీ వాళ్లు ససేమిరా అన్నారన్నారు. తమ కుమార్తెను ఎందుకు తీసుకెళ్లరని, ఏ తప్పు చేసిందో చెప్పాలని నిలదీయడంతో వారు మండ్లపల్లె నుంచి కడపకు వెళ్లారన్నారు. చదవండి: (ఆ దంపతులేమయ్యారు?.. దారి తప్పి తప్పారా లేక మరేదైనా..!) తన భర్తను అత్త చెప్పుచేతల్లో పెట్టుకుని ఇబ్బందులకు గురి చేస్తోందని సుస్మిత ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎంబీఏ వరకు చదివానని, బెంగళూరులో రెండేళ్లు ఉద్యోగం చేశానని చెప్పారు. తనను ఉద్యోగం మాన్పించిందన్నారు. తన భర్తకు రైల్వేలో ఉద్యోగం వచ్చిందని, నెలకు రూ.30 వేలు జీతం అని తెలిసి కూడా ఉద్యోగం వద్దని, ఇంటి వద్దనే వ్యాపారం చేసుకోమని సలహా ఇచ్చిందని సుస్మిత తెలిపారు. మా అత్త ఎందుకు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తోందో తెలియడంలేదన్నారు. ఇప్పుడు తొమ్మిది నెలల పసికందును కూడా చూడలేదంటే వారెంత కర్కోటకులో అర్థం చేసుకోవవచ్చన్నారు. విజేత మహిళా మండలి అధ్యక్షురాలి సంఘీభావం సుస్మితకు విజేత మహిళా మండలి అధ్యక్షురాలు అరుణకుమారి సంఘీభావం తెలిపి అండగా నిలిచారు. ఆమెకు న్యాయం జరిగే వరకు పోరాటాలు కొనసాగిస్తామన్నారు. బాధితురాలు సుస్మిత సమస్య తన దృష్టికి రావడంతో ఎస్ఐ శ్రీనివాసులురెడ్డి భార్యాభర్తలిద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి ఆమెకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. -
తండ్రి బర్త్‌డేకు సర్ప్రైజ్ ఇవ్వబోతోన్న సుస్మిత కొణిదెల
మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. చిరంజీవి సైరా నరసింహ రెడ్డి మూవీకి ఆమె కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇటీవల ఆమె తన భర్త విష్ణు ప్రసాద్‌తో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ను అనే ప్రొడక్షన్ హోజ్‌ను లాంచ్ చేసింది. జీ5 ఒరిజినల్ సిరీస్ షూట్ ఎఫైర్‌ను నిర్మించిన సుస్మిత. ఆగస్టు 22న తన తండ్రి చిరంజీవి పుట్టినరోజున ఓ ఆసక్తికర ప్రకటన చేయబోతుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ట్విటర్ ద్వారా వెల్లడించింది. చదవండి: మళ్లీ వాయిదా పడిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ! వెబ్ సిరీస్ తర్వాత తన రెండో ప్రాజెక్ట్‌ను ప్రకటించబోతున్నానంటూ ట్విటర్లో ఓ టీజర్ విడుదల చేసింది. ఈ సందర్భంగా సుస్మిత ‘గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ నుంచి మీకు మరో ఫన్ను అందించబోతున్నామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. అదేంటో డాడీ బర్త్‌డే సందర్భంగా ఆగష్టు 21. 8.2021 తేదీన వెల్లడిస్తాను’ అంటూ ఆమె రాసుకొచ్చింది. దిమ్మలపాటి ప్రశాంత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. (చదవండి: బాలయ్య సినిమాకు నో చెప్పిన విలక్షణ నటుడు) I am excited to share with you all that there is something fun coming your way from @GoldBoxEnt It’s our golden reveal on 21.8.21, on the occasion of Dad’s birthday #VishnuLaggishetty @saranyapotla @dimmalaprasanth #GoldBoxEntertainments#HBDMegastarChiranjeevi pic.twitter.com/mOzjlUV1J7 — sushmita konidela (@sushkonidela) August 19, 2021 -
'ఏక్ మినీ కథ' హీరోకు ఛాన్స్ ఇచ్చిన సుష్మిత కొణిదెల!
మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత కొన్ని రోజుల క్రితం భర్త విష్ణుప్రసాద్‌తో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్ మెంట్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ బ్యానర్లో ‘షూటౌట్ ఎట్ ఆలేరు’ అనే వెబ్ సిరీస్‌ను కూడా నిర్మించింది. ఇప్పుడు ఓ సినిమాను ప్రొడ్యూస్ చేయనుంది. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘8 తూట్టాక్కళ్’ (8బుల్లెట్లు) అనే సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని భావిస్తుందట. ఇప్పటికే మూవీ రీమేక్ హక్కులను కూడా కొన్నారట. గణేశ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీలో సంతోష్ శోభన్‌ను హీరోగా ఫైనల్ చేయారట. 'ఏక్ మినీ కథ' సినిమాతో క్రేజ్ సంపాదించుకున్న సంతోష్ శోభన్‌కు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. దీంతో ఇప్పటికే ఆయనకు పలు సినీ అవకాశాలు వస్తున్నాయి. తాజాగా నందిని రెడ్డి సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లు ఫిల్మ్‌నగర్ టాక్. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు సమాచారం. చదవండి : నయనతారలో నచ్చేది అదే : విఘ్నేష్ శివన్ మరో బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సమంత -
Sushmita Konidela: సుష్మిత చేతిలోకి ఎనిమిది బుల్లెట్లు
హీరో చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత కొన్ని రోజుల క్రితం భర్త విష్ణుప్రసాద్‌తో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్ మెంట్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి ‘షూటౌట్ ఎట్ ఆలేరు’ అనే వెబ్ సిరీస్‌ను నిర్మించారు. ఇప్పుడు సినిమా నిర్మించనున్నారట. తమిళ సినిమా ‘8 తూట్టాక్కళ్’ (8బుల్లెట్లు) అనే సినిమా రీమేక్ హక్కులు కొన్నారట. వెట్రి, అపర్ణా బాలమురళి జంటగా శ్రీ గణేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2017లో విడుదలై మంచి విజయాన్ని దక్కించుకుంది. తెలుగు రీమేక్‌లో ఓ యువ హీరో నటించనున్నారట. పూర్తి వివరాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. -
చిరు బర్త్‌డే: ఫ్యాన్స్‌కు మెగా డాటర్ స్పెషల్ గిఫ్ట్
మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డేను అభిమానులు పండుగలా సెలబ్రేట్ చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో బహిరంగ వేడుకలు జరిపే అవకాశంలో లేకపోవడంతో తమ అభిమాన హీరోకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగా అభిమానులతో పాటు సినీ ప్రముఖులు సైతం చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వీరిలో మెగా హీరోలు కూడా ఉన్నారు. ఇక చిరు బర్త్‌డే సందర్భంగా ఆయన పెద్ద కుమార్తె సుష్మితా కొణిదెల మెగా ఫ్యాన్స్‌కు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. ‘జీ 5’ ఓటీటీ కోసం భర్త విష్ణుప్రసాద్‌తో కలిసి నిర్మిస్తున్న వెబ్ సిరీస్ ‘షూట్-అవుట్ ఎట్ ఆలేరు’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. (చదవండి : చిరు బర్త్‌డే : ప్రముఖుల శుభాకాంక్షలు) చిరంజీవి తనయ సుష్మిత కొణిదెల నిర్మాణ సంస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. తన భర్త విష్ణు ప్రసాద్‌తో కలిసి ‘గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్’ నిర్మాణ సంస్థను ఆమె నెలకొల్పారు. ‘జీ 5’ అసోసియేషన్‌తో ఒక వెబ్ సిరీస్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ‘షూట్-అవుట్ ఎట్ ఆలేరు’ టైటిల్ ఖరారు చేశారు. మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారం ఉదయం ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. రెగ్యులర్ మోషన్ పోస్టర్స్ టైపులో కాకుండా స్టోరీ టెల్లింగ్ మోషన్ పోస్టర్ విడుదల చేయడం విశేషం. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ ప్రధాన కీలక పాత్రలు వహిస్తున్న ఈ వెబ్ సిరీస్‌కి ఆనంద్ రంగా దర్శకుడిగా వ్యవహరించనున్నారు. హైదరాబాద్‌లోని ఓ పోలీస్, కొంత మంది కరుడు గట్టిన నేరస్థుల కథల ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. -
గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో స్నేహా రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గ్రీన్ ఇండియా చాలెంజ్ ఉద్యమంలా కొనసాగుతుంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ చాలెంజ్‌ను స్వీకరించి.. పర్యావరణ పరిరక్షణ కోసం తమ వంతుగా మొక్కలు నాటుతున్న సంగతి తెలిసిందే. తాజాగా హీరో అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి ఈ చాలెంజ్‌లో పాలుపంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత నుంచి చాలెంజ్‌ను స్వీకరించిన ఆమె.. నేడు పిల్లలతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం అయాన్, అర్హలు మొక్కలకు నీళ్లు పోశారు. (వాళ్లిద్దరూ డిశ్చార్జ్ అయ్యారు : అభిషేక్) ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ చాలెంజ్‌కు తనను నామినేట్ చేసినందుకు సుష్మితకు థ్యాంక్స్ చెప్పారు. తదుపరి ఈ చాలెంజ్‌కు తన భర్త అల్లు అర్జున్‌తో పాటు మరో ఇద్దరిని నామినేట్ చేశారు. (బిగ్‌బాస్ ఎంట్రీపై శ్రద్ధా దాస్ క్లారిటీ) View this post on Instagram Thanks @sushmitakonidela for nominating me :) #greenindiachallenge #harahaitohbharahai I nominate @alluarjunonline @rsingareddy @meghanajrao A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) on Jul 27, 2020 at 5:14am PDT -
సంగీతం నేపథ్యంలో...
సుదీప్, సుస్మిత, సందీప్, రాజ్‌సింగ్ ముఖ్య తారలుగా ఆర్.ఎస్ సురేష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆగ్రహం’. ఎస్.ఎస్ చెరుకూరి క్రియేషన్స్ పతాకంపై సందీప్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ని దర్శకుడు పూరి జగన్నాథ్ విడుదల చేసి, చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలిపారు. సురేష్ మాట్లాడుతూ– ‘‘సంగీతానికి ప్రాధాన్యం ఉన్న విభిన్న కథా చిత్రమిది. అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. మే ఆఖరులో విడుదల చేయాలనుకుంటున్నాం. మా సినిమా మోషన్ పోస్టర్ని విడుదల చేసిన పూరి జగన్నాథ్‌గారికి ప్రత్యేక కృతజ్ఞతలు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సందీప్ చెరుకూరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మూర్తి ఆడారి పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా:ఆర్.కె, సంగీతం: ఆర్.ఆర్.రవిశంకర్. -
మోసపోయిన బుల్లితెర నటి
సాక్షి, యశవంతపుర(కర్ణాటక): రాష్ట్రస్థాయి పదవి ఇప్పి స్తామని బుల్లితెర నటి నుంచి డబ్బులు తీసుకుని మోసం చేసిన ఘటన అన్నపూర్ణేశ్వరినగర పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. రఘ చంద్రప్ప, సంగీత అనే ఇదరు తన వద్ద రూ. 10 లక్షలు నగదు తీసుకుని మోసం చేశారని బుల్లితెర నటి సుశ్మిత ఇటీవల అన్నపూర్ణేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు... ఆదిశక్తి మహిళ సంఘం రాష్ట్రస్థాయి మహిళా అధ్యక్షరాలిగా నియమిస్తామంటూ నమ్మించి సుశ్మిత నుంచి వీరు రూ. 10 లక్షలు తీసుకున్నారు. రోజులు గడుస్తున్నా కూడా నియామకం జరగక పోవడంతో పాటు నగదు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ప్రాణాలు తీస్తామని వారు హెచ్చరించినట్లు సుశ్మిత పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. సరోజ అనే మహిళ వద్ద కూడా వీరు డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. -
నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి
జగిత్యాల రూరల్: కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం అంతర్గామ్ గ్రామంలో విషాదం అలముకుంది. ఓ చిన్నారి నీటి తొట్టిలో పడి ప్రాణాలు కోల్పోయింది. జలేందర్, సుమంత దంపతుల కుమార్తె సుష్మిత(3) బుధవారం ఉదయం ఆడుకుంటూ ఇంటి సమీపంలోనే ఉన్న పెద్దమ్మతల్లి ఆలయం వద్దకు వెళ్లింది. అక్కడే ఉన్న నీటితొట్టిపైకి ఎక్కి ఆడుకుంటూ అందులో పడిపోవడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయింది. అరగంట సేపు తల్లిదండ్రులు తమ కూతురు కోసం వెతకగా చివరికి ఆలయం వద్ద నీటితొట్టిలో విగతజీవిగా కనిపించడంతో కన్నీరుమున్నీరయ్యారు. -
కూతురి సంగీత్‌లో చిందేసిన చిరు
మెగా ఫ్యామిలీ అంతా పెళ్లిపనుల్లో బిజీగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపిస్తున్న మెగా కుటుంబసభ్యులు అన్ని కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. తాజాగా ఈ పెళ్లివేడుకల్లో సంగీత్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. చాలాకాలం తరువాత చిరు స్టెప్పేయటం ఈ వీడియోలో కనిపిస్తుండటంతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. చిరు సూపర్ హిట్ పాట 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు'కు తన పెద్దకూతురు సుష్మితతో కలిసి చిందేస్తూ కనిపించాడు చిరు. డెస్టినేషన్ మ్యారేజ్ కాన్సెప్ట్‌తో జరిగిన శ్రీజ పెళ్లి వేడుకలు బెంగళూరులోని చిరు ఫాంహౌస్‌లో ఘనంగా జరుగుతున్నాయి. మార్చి 28న, తన చిన్ననాటి స్నేహితుడు, జ్యువెలరీ డిజైనర్ అయిన కళ్యాణ్ తో శ్రీజ వివాహం ఘనంగా జరిగింది. మెగా కుటుంబసభ్యులతో పాటు వారికి అత్యంత సన్నిహితులైన అతికొద్ది మంది మాత్రమే ఈ వేడుకలకు హాజరయ్యారు. -
సుస్మితకు నాలుగు స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో నగరానికి చెందిన సోమ సుస్మిత నాలుగు స్వర్ణాలు సొంతం చేసుకుంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఆదివారం ఈ పోటీలు ముగిశాయి. సీనియర్ విభాగంలో బ్యాలెన్సింగ్ బీమ్, ఫ్లోర్ ఎక్సర్సైజ్, వాల్టింగ్, అన్ఈవెన్ బార్లలో సుస్మిత మొదటి స్థానంలో నిలిచింది. చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆదివారం చివరి రోజు అండర్-17, సీనియర్స్ విభాగాల్లో ఆరు ఈవెంట్లు జరిగాయి. ఈ చాంపియన్‌షిప్ ఆంధ్రప్రదేశ్ జిమ్నాస్ట్‌ల హవా కొనసాగింది. పెద్ద సంఖ్యలో రాష్ట్ర క్రీడాకారులు పతకాలు సాధించారు. ఇతర ఫలితాలు: అండర్-17 (పోమెల్ హార్స్): 1. నీరజ్ (కేరళ), 2. ధర్మేందర్ (ఏపీ), 3. సంజీవ్ (ఏపీ). (రింగ్స్): 1. సంజీవ్ (ఏపీ), 2. ధర్మేందర్ (ఏపీ), 3. ప్రశాంత్ (కేరళ). (టేబుల్ వాల్ట్): 1. ధర్మేందర్ (ఏపీ), 2. విక్రమ్ (ఏపీ), 3. శ్యామ్‌సుందర్ (కర్ణాటక), (ప్యార్లల్ బార్స్): 1. నీరజ్ (ఏపీ), 2. ధర్మేందర్ (ఏపీ), 3. ప్రశాంత్ (కేరళ), (హారిజాంటల్ బార్): ధర్మేందర్ (ఏపీ), 2. సంజీవ్ కుమార్ (ఏపీ), 3. నీరజ్ (కేరళ) సీనియర్స్: (ఫ్లోర్ ఎక్సర్సైజ్): 1. లఖన్ వాల్మీకీ (ఏపీ), 2. తేజదీప్ (ఏపీ), 3. వివేక్ సింగ్ .(పోమెల్ హార్స్): 1. మణికంఠ (ఏపీ), 2. తేజదీప్ (ఏపీ), 3. వివేక్ సింగ్ (ఏపీ), (రింగ్స్): 1. కాసుల నాయుడు (ఏపీ), 2. తేజదీప్ (ఏపీ), 3. వివేక్ సింగ్ (ఏపీ), (టేబుల్ వాల్ట్): 1. తేజదీప్ (ఏపీ), 2. లఖన్ వాల్మీకీ (ఏపీ), 3. కాసుల నాయుడు (ఏపీ), (ప్యార్లల్ బార్స్): 1. తేజ దీప్ (ఏపీ), 2. లఖన్ వాల్మీకీ (ఏపీ), 3. వివేక్ సింగ్ (ఏపీ), (హారిజాంటల్ బార్): 1. వివేక్ సింగ్ (ఏపీ), 2. కాసుల నాయుడు (ఏపీ), 3. లఖన్ వాల్మీకీ (ఏపీ).