మోసపోయిన బుల్లితెర నటి | TV Artist Sushmitha Complaint On Fraud Case In Karnataka | Sakshi
Sakshi News home page

Published Wed, Sep 12 2018 11:34 AM | Last Updated on Wed, Sep 12 2018 4:00 PM

TV Artist Sushmitha Complaint On Fraud Case In Karnataka - Sakshi

బుల్లితెర నటి సుశ్మిత, రఘు చంద్రప్ప

సాక్షి, యశవంతపుర(కర్ణాటక): రాష్ట్రస్థాయి పదవి ఇప్పి స్తామని బుల్లితెర నటి నుంచి డబ్బులు తీసుకుని మోసం చేసిన ఘటన అన్నపూర్ణేశ్వరినగర పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది. రఘ చంద్రప్ప, సంగీత  అనే ఇదరు తన వద్ద రూ. 10 లక్షలు నగదు తీసుకుని మోసం చేశారని బుల్లితెర నటి సుశ్మిత ఇటీవల అన్నపూర్ణేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వివరాలు... ఆదిశక్తి మహిళ సంఘం రాష్ట్రస్థాయి మహిళా అధ్యక్షరాలిగా నియమిస్తామంటూ నమ్మించి సుశ్మిత నుంచి వీరు రూ. 10 లక్షలు తీసుకున్నారు. రోజులు గడుస్తున్నా కూడా నియామకం జరగక పోవడంతో పాటు నగదు తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేయడంతో ప్రాణాలు తీస్తామని వారు హెచ్చరించినట్లు సుశ్మిత పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. సరోజ అనే మహిళ వద్ద కూడా వీరు డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement