tv artist
-
తెలుగు టెలివిజన్ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికలు.. జీఎస్ హరి ప్యానెల్ మేనిఫెస్టో విడుదల
తెలుగు టెలివిజన్ ఆర్టిస్టు అసోషియేషన్ (Artists Association of Telugu Television) కార్యవర్గం ఎన్నికల సందర్భంగా జీఎస్ హరి ప్యానెల్ సభ్యులు మేనిఫెస్టో విడుదల చేశారు. ఫిలిం చాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేనిఫెస్టో రిలీజ్ చేశారు. తాము గెలిస్తే తెలుగు టెలివిజన్ ఆర్టిస్టులకు పలు ప్రయోజనాలు అమలు చేస్తామని ఈ సందర్భంగా హామీలు ఇచ్చారు. కాగా.. ఈనెల 31న ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా సీనియర్ టీవీ నటుడు విజయ్ యాదవ్ మాట్లాడుతూ.. 'టెలివిజన్ కళాకారుల సంక్షేమమే ధ్యేయంగా వినోద్ బాల ఆధ్వర్యంలో 27 ఏళ్ల క్రితం మా తెలుగు టెలిజవిన్ ఆర్టిస్టు అసోషియేషన్ అసోసియేషన్‌ను ప్రారంభించాం. ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమలు చేశామని ఘనంగా చెప్పగలుగుతున్నాం. మా అసోసియేషన్‌కు మాత్రమే సొంత బిల్డింగ్ ఉంది. వందలాది మంది ఆర్టిస్టుల సమస్యలు పరిష్కరించాం. తెలుగు ఆర్టిస్టులకు మాత్రమే అవకాశాలు ఇవ్వాలనేదే మా ప్రయత్నం. సీరియల్ షూటింగ్ టైమింగ్ విషయాలపై మేము ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నాం. కరోనా సమయంలో చిరంజీవి ట్రస్ట్, అప్పటి మంత్రి శ్రీనివాస్ యాదవ్‌ల సహకారంతో ఆర్టిస్టులందరికి సహాయం చేశాం. పేద కళాకారులకు పెన్షన్ ఇచ్చాము. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. సమర్థులైన జీఎస్ హరి ప్యానెల్ సభ్యులను భారీ మెజారిటీతో గెలిపించుకుంటే టెలివిజన్ కళాకారుల సమస్యలు తీర్చుతూ, సంక్షేమంపై దృష్టిపెడతాం.' అని అన్నారు.జీఎస్ హరి ప్యానెల్ నుంచి అధ్యక్ష అభ్యర్థి జీఎస్ హరి మాట్లాడుతూ.. 'నటుడుగా ఒక దశలో నా జీవితం అయిపోయిందనుకున్న సమయంలో నన్ను ఆదుకుని నా నట జీవితాన్ని నిలబెట్టింది టీవీ రంగం. కరోనా సమయంలో పెద్దలు చిరంజీవి , తలసాని శ్రీనివాస్ సహకారంతో ఇంటింటికి నిత్యావసర వస్తువులు అందించే బాధ్యత తీసుకున్నది మన అసోషియేషన్. నిరంతరం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామని గర్వంగా చెప్పగలను. విజయ్ యాదవ్, వినోద్ బాల ఆధ్వర్యంలో నా మీద నమ్మకంతో నాకు అధ్యక్ష అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. నాకు అన్నం పెట్టిన ఈ పరిశ్రమ సంక్షేమం కోసం నేను నిరంతరం ప్రయత్రిస్తానని ఈ సందర్బంగా హామీ ఇస్తున్నా.' అని అన్నారు. కాగా.. ప్రధాన కార్యదర్శి (జనరల్ సెక్రటరీ) అభ్యర్థి గుత్తికొండ భార్గవ తమ జీఎస్ హరి ప్యానెల్ నుంచి మేనిఫెస్టో విడుదల చేశారు. తమ ప్యానెల్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.ఈ సమావేశంలో జీఎస్ హరి ప్యానెల్ నుంచి అధ్యక్ష అభ్యర్థి జీఎస్ హరి, జనరల్ సెక్రటరీ అభ్యర్థి భార్గవ గొట్టికొండ, ట్రీజరర్ అభ్యర్థి చెన్నుపాటి సుబ్బారావు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి రాంజగన్, వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థులు జీఎస్ శశాంక్, కృష్ణ కిషోర్, ఉమాదేవి, ఆర్గనైజింగ్ సెక్రటరీ అభ్యర్థులు బ్యాంక్ శ్రీనివాస్, దీప్తి వాజ్‌పేయి, జాయింట్ సెక్రటరీ అభ్యర్థులు మేక రామకృష్ణ, వికాస్, దీప దుర్గంపూడి, మహిళ ఈసీ మెంబర్స్ అభ్యర్థులు రాగ మాధురి, లిరిష, మహతి రిజ్వాన, లక్ష్మిశ్రీ, ఈసీ మెంబర్స్ అభ్యర్థులు బాలాజీ, శివకుమార్ కముని, విజయ్ రెడ్డి, ద్వారకేష్, మురళికృష్ణ రెడ్డి, గోపికర్, మురళికృష్ణ, టీవీ నటీనటులు తదితరులు పాల్గొన్నారు.జీఎస్ హరి ప్యానెల్ మేనిఫెస్టో హామీలు ఇవే :1. ఒక్కో తెలుగు సీరియల్లో ఒక్క పర భాష ఆర్టిస్ట్ కి మాత్రమే అనుమతి2. వీక్లీ షూటింగ్ డేట్స్ బ్లాకింగ్ పద్దతిని నిర్మాతలు, ఛానెల్స్‌తో మాట్లాడి రద్దు చేస్తాం3.అర్హులైన పేద కళాకారులకు పెన్షన్లు4. మెడిక్లైమ్ పాలసీ 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంపు5. నాగబాబు సహకారంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో టీవీ నగర్ కృషి6. మహిళ సభ్యులకు ప్రత్యేక రక్షణ కల్పిస్తాం.7. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ అవార్డులు మన తెలుగు టీవీ కళాకారులకు అమలు8. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ద్వారా మన సభ్యులై ఉండి అక్కడ నివాసం ఉంటున్న వారికి తెల్ల రేషన్ కార్డుల కోసం ప్రయత్నం9. టాలెంట్ సెర్చ్ నిర్వహించి ఛానల్స్ వారికి, కొత్త తెలుగు కళాకారులకు మధ్య వారధిలా వ్యవహరిస్తాం.10. ఈఎస్ఐ స్కీం వర్తింప చేస్తాం11 ప్రావిడెంట్ ఫండ్ స్కీం అమలు చేస్తాం12. ప్రతి మెంబర్‌కి వర్క్ కల్పిస్తాం -
101 మంది పేద కళాకారులకు ఉచితంగా రూ. 6 కోట్ల భూమి..
V Vijay Kumar Gives 101 Plots To Poor Artist: టెలివిజన్‌లోని 24 క్రాఫ్ట్స్ లో ఉండే వెనుకబడిన పేద కళాకారులకు 101 ఫ్లాట్స్‌ను విజన్ వి.విజయ్ కుమార్ ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే గోపీనాథ్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం విజన్ వి. విజయ్ కుమార్ ఇచ్చిన మాట ప్రకారం 101 మంది నిరుపేద టీవీ కళాకారులకు ఉచితంగా ఇళ్ల స్థలాలు పత్రాలను తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు కె.వి.రమణాచారి చేతుల మీదుగా అందజేశారు. విజయ్ కుమార్ మాట్లాడుతూ 'చాలా మంది కోట్ల విలువజేసే భూమిని ఎందుకు ఇవ్వడం అన్నారు. అయితే నా దృష్టిలో మన పిల్లలకు మనం కోట్ల ఆస్తిని ఇవ్వడం ముఖ్యం కాదు. మన చుట్టూ ఉన్న పేద కార్మికులకు సహాయం చేస్తే మనకంటూ ఒక దైవ శక్తి వస్తుంది. ఆ దైవ శక్తి ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. అదే విధంగా మన పిల్లకు మంచి నాలెడ్జ్, ఆలోచనలు ఇస్తే వారు కూడా సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేస్తారనేది నా అభిప్రాయం.' అని తెలిపారు. చదవండి: పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. ఇప్పుడు మరో నటుడితో ప్రేమాయణం తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. 'టెలివిజన్‌లోని ఒక్కొక్క క్రాఫ్ట్ నుంచి ఐదుగురు కళాకారులను సెలెక్ట్ చేసుకొని విజయ్ కుమార్ 101 ఫ్లాట్స్ ఇవ్వడం మంచి విషయం. సుమారు రూ. 6 కోట్ల విలువ చేసే భూమిని ఇవ్వడం గొప్ప విషయం. పేదవాడి ఆశీర్వాదాలు మనకు జీవితకాలం తోడుగా ఉంటాయి. విజయ్‌కు వారి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటూ వారి బిజినెస్ దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.' అని పేర్కొన్నారు. -
టీవీ నటి దారుణ హత్య.. ఉగ్రవాదులను మట్టుబెట్టిన పోలీసులు
శ్రీనగర్: టీవీ ఆర్టిస్ట్ అమ్రీన్ భట్ హత్య కేసును.. 24 గంటల్లో సాల్వ్ చేశారు పోలీసులు. నటిని హత్య చేసిన ఉగ్రవాదుల్ని ఎట్టకేలకు ఎన్కౌంటర్లో మట్టుపెట్టారు. జమ్ము కశ్మీర్ టీవీ నటి అమ్రీన్ భట్ Amreen Bhatను బుద్గం జిల్లాలో కాల్చి చంపారు టెర్రరిస్టులు. అయితే వాళ్లను ట్రాప్ చేసిన జమ్ము పోలీసులు.. పుల్వామా జిల్లా అవంతిపోరా అగన్హంజిపోరా దగ్గర గురువారం రాత్రి ఎన్కౌంటర్లో మట్టుపెట్టారు. చనిపోయిన ఇద్దరు ఉగ్రవాదులు లష్కర్ ఈ తాయిబా గ్రూప్ సభ్యులుగా నిర్ధారించారు. ఎల్ఈటీ కమాండర్ లతీఫ్ ఆదేశాలతోనే వీళ్లిద్దరూ టీవీ నటిని పొట్టనబెట్టుకున్నట్లు కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఇదిలా ఉంటే.. శ్రీనగర్ సౌరా ఏరియాలో జరిగిన మరో ఎన్కౌంటర్లో.. ఇంకో ఇద్దరు ఉగ్రవాదుల్ని పోలీసులు ఏరిపారేశారు. గత మూడు రోజుల్లో కశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లలో పది మంది ఉగ్రవాదులు హతమయ్యారు. -
పెళ్లికి ముందే అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు
సాక్షి, బనశంకరి(కర్ణాటక): వివాహానికి ముందు తనపై భర్త అత్యాచారానికి పాల్పడ్డాడని బుల్లి తెరనటి బసవనగుడి మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కట్నం కావాలని కూడా వేధిస్తున్నారని, హత్య చేస్తామని బెదిరిస్తున్నారని భర్త, అతని తల్లిదండ్రుల మీద ఆరోపించింది. వివరాలు... ఇద్దరూ కూడా టీవీ, సినీ రంగంలో రాణించాలని పనిచేస్తున్నారు. సోషల్ మీడియాలో పరిచయం కాగా, టీవీల్లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించాడు. ఒకరోజు కలుద్దామని సూచించాడు. సరేనని ఆమె ఇంటికి ఆహ్వానించగా, లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనేకసార్లు వాంఛలు తీర్చుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని అడగడంతో అప్పటినుంచి దూరంగా ఉండసాగాడు. ఎంతో ఒత్తిడి చేసి స్నేహితులతో ఒప్పించడంతో గుడిలో పెళ్లి చేసుకున్నామని తెలిపింది. అత్తవారింటికి తీసుకెళ్లిన తరువాత.. బలవంతంగా తాళి కట్టానని భర్త చెప్పుకున్నాడు. ఆరోజు నుంచి గొడవలు జరుగుతున్నాయని, కట్నం తేవాలని ఒత్తిడి చేస్తూ కులం పేరుతో దూషిస్తున్నాడని వాపోయింది. తాను తీవ్ర అనారోగ్యం పాలై ఆస్పత్రిలో ఉన్నట్లు తెలిపింది. పోలీసులు ఇద్దరి నుంచీ సమాచారం సేకరించి దర్యాప్తు చేపట్టారు. -
మోడ్రన్ వంటలక్కను చూశారా?
-
బుల్లితెర ‘గుండన్న’ మనోడే
‘దేవమ్మా..దేవమ్మా...అంబిక ఇంటివద్ద ఇద్దరమ్మాయిలను చూశాను. ఒకవేళ వారు మీ పిల్లలై ఉంటారేమోనమ్మా...ఆవు చేన్లో మేస్తే దూడ గట్టులో మేస్తుందా... మీ అత్తమ్మలా నీవు అబద్దాలు చెబుతున్నావ్... నా కళ్లు నన్ను మోసం చేయలేవు శ్రీవల్లీ.. ఆడపిల్లల్ని చూశాక నాకనిపించింది. వాళ్లు దేవమ్మ పిల్లలేనని.. అంటూ ఈ టీవీలో ప్రసారమైన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సీరియల్లో దేవమ్మ అనుచరుడి పాత్ర పోషించిన గుండన్న మనోడే. సాక్షి, ఆదిలాబాద్ : ‘కలలు కనాలి.. వాటిని సాకారం చెయ్యాలి’ అని అన్నపెద్దల మాటలు నిజమని నిరూపించాడు.. సంకల్పానికి, ప్రతిభకు పేదరికం అడ్డురాదని తెలియజేశాడు ఈ యువకుడు. కెరమెరి మండలంలోని బారేమోడి గ్రామానికి చెందిన నికోడే సానాజి, కమలాబాయి దంపతులకు ముగ్గురు కూతుర్లు, ఇద్దరు కుమారులు. వారిలో చిన్నవాడు మధూకర్ అలియాస్ మధు. ప్రాథమిక విద్యాభ్యాసం బారేమోడిలో, 6వ తరగతి కెరమెరిలోని నవో దయ, 8వ సిర్పూర్(టీ)లో, 9,10వ కెరమెరి ఉన్నత పాటశాలలో, ఇంటర్ ప్రభుత్వ జూని యర్ కళాశాలలో పూర్తి చేశాడు. పదోతరగతి చదువుతుండగా పేపర్లో వచ్చిన యాడ్ చూసి సినిమా రంగంలో నటించేందుకు పాస్‌ఫొటో పంపించాడు. కానీ మూడేళ్ల వరకు ఎలాంటి సమాధానం రాలేదు.. 2010 వరంగల్ లో డిగ్రీ చదువుతుండగా తరచూ హైదరాబాద్‌లోని ఆయా స్టూడియోల్లోకి వెళ్లి వస్తుండేవాడు. (తెలంగాణ : అడ్డదారిలో ఎక్స్టెన్షన్లు) దిల్ రాజు కార్యాలయం చుట్టూ 50కి పైగా చక్కర్లు సినిమా, సీరియల్ పై ఉన్న మోజుతో హైదరాబాద్‌లోని ప్రముఖ దర్శక, నిర్మాత దిల్ రాజు కార్యాలయానికి 50కి పైగా చక్కర్లు కొట్టాడు. కానీ ఎవ్వరూ దరి చేరనివ్వలేదు. ఇలా కాదని 2011 లో సినిమా కార్యాలయంలో శిక్షణ కోసం రూ.5000 చెల్లించాడు. కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. అనంతరం ఇతనిలో ఉన్న పట్టుదల చూసి “సాయిబాబా’ సినిమాలో ఓపాత్ర కోసం రూ.లక్ష కట్టామన్నారు. అంత స్థోమత లేకపోవడంతో ఆ అవకాశం కూడా చేజారి పోయింది. (పరిశ్రమలకు అన్ని విధాలా ప్రోత్సాహం) నాటకరంగంలో అడుగు 2017లో తెలంగాణ ప్రభుత్వం భాషా సంఘం ఆధ్వర్యంలో రంగస్థల నటుడిగా 40రోజులు శిక్షణ పొందాడు. అనంతరం ‘నక్షత్రం’ ‘ఫిదా’ సినిమాలో క్యారెక్టర్ పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన తెలంగాణం నాటకం రజాకార్ల పాత్రలో పోషించి ఆహూతుల నుంచి మన్ననలు పొందాడు. ఆదిలాబాద్, బాసర, నిర్మల్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో నిర్వహించిన కుమురం భీం, పోలీస్ తదితర నాటకాల్లో ప్రతిభ కనబర్చాడు. హైదరాబాద్‌లోని క్రిష్ణానగర్లో ఉంటూ టెక్నీషియన్‌గా పనిచేశాడు. ఈ తరుణంలోనే సొంతంగా 80 వీడియోలు తయారు చేశాడు. వాటిని డైరెక్టర్, ప్రొడ్యూసర్లకు చూపించాడు. దీంతో ఆయనలో ఉన్న ప్రతిభను గుర్తించి 2019లో ‘నిన్నే పెళ్లాడతా’ సీరియల్లో రౌడీ క్యారెక్టర్ ఇప్పించారు. అక్కడి నుంచి అతని ప్రయాణం ప్రారంభమైంది. (15 రోజుల్లోగా పంపేయండి ) మధు నటించిన సీరియల్లు ప్రస్తుతం జీటీవీలో వస్తున్న ‘నిన్నే పెళ్లాడతా’ లో రౌడీ పాత్ర, స్టార్‌మాలో వస్తున్న ‘కథలో రాజకుమారి’ లో తండ్రి పాత్ర, జీ తెలుగులో వస్తున్న ‘అత్తారింట్లో అక్కా చెల్లెల్లు’ లో రౌడీ క్యారెక్టర్, ఈ టీవీలో వస్తున్న మిష్టర్ అండ్ మి సెస్ భాను’లో పోలీస్ పాత్రలో, మ్యాంగో వెబ్ సిరీస్‌లో మాంత్రికుడి పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. తపన, దృఢసంకల్పం కావాలి ప్రతి మనిషిలో ఏదో ఒక గుణం ఉంటుంది. అదేమిటో మనకు తెలుసు. దాన్ని సాధించాలంటే తపన, కృషి, దృఢసంకల్పం తప్పనిసరి. పదోతరగతిలో ఉన్నప్పుడు శ్రీ మంజూనాథ సినిమా చూసి ఇంప్రెస్ అయ్యా. నేనెందుకు తెరపై కనిపించకూడదని అనుకున్నా. అప్పుడే నా ప్రయాణం మొదలైంది. అప్పుడే స్క్రీన్ పై కనిపించాలనే తపన నన్ను మీ ముందుకు తెచ్చింది. – నికోడే మధూకర్(మధు), ఆర్టిస్ట్ -
అనుమానాస్పదంగా సినీ ఆర్టిస్ట్ మృతి
సాక్షి, హైదరాబాద్(అమీర్‌పేట): సినీ ఆర్టిస్ట్, టీవీ యాంకర్‌గా పని చేస్తున్న పర్తి విశ్వశాంతి (33) మృతి చెందిన ఘటన ఎల్లారెడ్డి గూడ ఇంజనీర్స్ కాలనీలోని ఫ్రిబ్‌జీ రెసిడెన్సీ చోటు చేసుకుంది. అపార్ట్ మెంట్ ఫ్లాట్ నెంబర్.5లో అద్దె ఉంటున్న ఈమె గత మూడు రోజులుగా ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి స్థానికులు ఇంటి తలుపులు పగలగొట్టి చూశారు. బెడ్రూంలో విగత జీవిగా కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాళ్లు బెడ్‌పై, ముఖం నేలపై పడి ముఖం మీద గాయాలై రక్తస్రావం జరిగినట్లు గుర్తించారు. గదిలో ఖాళీ మద్యం బాటిళ్లు ఉన్నాయి. టీపాయ్ మీద స్నాక్స్ ఉండటంతో తీసుకోవడానికి వెళ్లి మద్యం మత్తులో అదుపుతప్ప కిందిపడి చనిపోయి ఉండవచ్చు లేదా ఎవరైనా చంపేసారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ మార్చరీకి తరలించారు. మృతరాలి తల్లి ఇటీవలే సొంత ఊరికి వెళ్లిందని పోలీసులు తెలిపారు. -
ఆయనతోనే కలిసి ఉంటా : నటుడి భార్య
బెంగళూరు : బుల్లితెర నటుడు రాజేశ్, ఆయన భార్య శ్రుతిల మధ్య విడాకుల వివాదం తీవ్రస్థాయికి చేరింది. తాను రాజేశ్ ముఖం చూసి పెళ్లి చేసుకోలేదని మనసు చూసి పెళ్లి చేసుకోవటం వల్ల విడాకులు తీసుకోవటం తనకు ఇష్టం లేదన్నారు. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నట్లు శ్రుతి ఆరోపించారు. పోలీసులు విచారించి చార్జ్‌షీట్‌ను కోర్టుకు సమర్పించారు. అయితే ఇప్పటి వరకు పోలీసులు తనను గానీ, తన కుటుంబసభ్యులను గానీ విచారణ చేయలేదని ఆమె పేర్కొన్నారు. తను కోర్టుకు విడాకుల అర్జీ కూడా పెట్టుకోలేదన్నారు. తనకు విడాకులు తీసుకోవటం ఇష్టం లేదని.. భర్తతోనే కలిసి జీవించాలని నిర్ణయించినట్లు శ్రుతి తెలిపారు. రాజేశ్ తల్లి తనను కట్నం కోసం వేధిస్తూ రెండో పెళ్లికి అవకాశం కావాలని అడగటం వల్లనే తను పోలీసుస్టేషన్‌కు వెళ్లినట్లు పేర్కొన్నారు. కాగా శృతి అనే యువతితో 2017లో రాజేశ్‌కు వివాహమైంది. అయితే కట్నం కోసం తనను వేధిస్తున్నట్లు శృతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజేష్ మరో మహిళతో అనైతిక సంబంధం కొనసాగిస్తున్నాడని ఆరోపించారు. ఈ క్రమంలో తమది సంప్రదాయమైన కుటుంబమని, శృతి బయట మాంసం తిని ఇంటికి వచ్చి తన తల్లిని వేధిస్తున్నట్లు రాజేశ్ అరోపించాడు. కట్నం విషయంలో తాను శృతిని వేధించలేదన్నాడు. విడాకులు కావాలని గతంలో శృతి కోర్టులో కేసు వేసిందని, కట్నం కోసం తాను వేధించినట్లు అయితే అప్పట్లో ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదని రాజేష్ పేర్కొన్నాడు. దీంతో వివాదం మరింత ముదిరింది. -
సూర్యవంశం అంజలి
‘మనల్ని మనం నిరూపించుకోవాలంటే నిరంతరం కష్టపడుతూనే ఉండాలి. వచ్చిన అవకాశాలను వినియోగించుకోవాలి. మొదట్లో అవకాశాల కోసం చాలా తపన పడ్డాను. విలన్ రోల్స్నీ వదులుకోలేదు. తర్వాత నే కోరుకున్న పాజిటివ్ రోల్స్ వరించాయి’ అంటూ తన గురించి చెప్పడం మొదలుపెట్టిన అంజలి అసలు పేరు మైథిలీ. తెలుగింటి అమ్మాయి మైథిలీ బుల్లితెరపైన రాణించడానికి పడిన తపనను ఈ విధంగా వివరించింది. ‘తెలుగింట పుట్టి తెలుగువారికి టీవీ ద్వారా చేరువకావడం నా అదృష్టంగా భావిస్తుంటాను. నా మొట్టమొదటి సీరియల్ ‘ఆడదే ఆధారం’, ఆ తర్వాత మూడుముళ్ల బంధం. దాదాపు మొదట్లో నాకు వచ్చిన పాత్రలన్నీ విలన్ క్యారెక్టర్లే. దీంతో కొంచెం భయమేసేది అన్నీ నెగిటివ్ క్యారెక్టర్లేనా అని. అష్టాచెమ్మా సీరియల్ తర్వాత మరో అవకాశం కోసం ఎదురుచూస్తూనే డ్యాన్స్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నాను. నెగిటివ్ నుంచి పాజిటివ్ ఏడాదిన్నర క్రితం జీ తెలుగులో వచ్చే ‘సూర్యవంశం’ సీరియల్లో ‘అంజలి’ పాత్ర నన్ను వరించింది. ఇలాంటి పాత్రకోసం చాలాకాలంగా ఎదురు చూశాను. ఇప్పుడు అంజలిగా చాలా మందికి చేరువయ్యాను. ఇందులో అంజలి చాలా జోవియల్‌గా, కొంచెం సెన్సిటివ్‌గా ఉంటుంది. అంజలి – కార్తీక్లది మంచి జంట. వీరిద్దరి మధ్య ఉండే బంధం చాలా అందంగా ఉంటుంది. ఈ సీరియల్ నుంచి ఇప్పుడు తమిళ్లో మరో అవకాశం వచ్చింది. ఆ పాత్ర డ్యాన్స్ కమ్ పాజిటివ్ రోల్. ‘అష్టాచెమ్మా’ లో మధుర పాత్ర నెగిటివ్ రోల్ అయినా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత సూర్యవంశంలో అంజలి రోల్ మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ రెండు రోల్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. కూచిపూడి డ్యాన్సర్ కూచిపూడిలో నాకు సర్టిఫికెట్ కూడా ఉంది. ఆర్టిస్టు అవకాశాలు రాకపోతే కూచిపూడి డ్యాన్సర్‌గా స్థిరపడేదాన్ని. స్కూల్ డేస్‌లో నందనవనం, ధన, పాండురంగడు.. మొదలైన సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశాను. ఎక్కడ ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా నా ఫొటోలు పంపేదాన్ని. ‘అందమైన భామలు’ టీవీ ప్రోగ్రామ్‌లో టాప్ ఫైవ్ లిస్ట్‌లో ఉన్నాను. అయితే, పోటీలో గెలవలేదు. దీంతో చాలా ఏడ్చాను. చాలా సెన్సిటివ్‌గా ఉండేదాన్ని. అమ్మ నన్ను చాలా మార్చింది. సినిమాల్లో చేయాలని ఉండేది. కానీ, అవకాశాలు ఎలా వస్తాయో తెలియదు. సినిమా ఆఫీస్‌లకు వెళ్లి నా ప్రొఫైల్, ఫొటోలు ఇచ్చి వచ్చేదాన్ని. ఆ తర్వాత ఫోన్ వస్తుందని చాలా ఎదురుచూసేదాన్ని. రాకపోవడంతో డీల్ పడేదాన్ని. సీరియల్స్‌లో అవకాశాలు రావడంతో హ్యాపీగా ఉన్నాను. నటిస్తూనే డిగ్రీ పూర్తిచేశాను. అమ్మ బెస్ట్ ఫ్రెండ్ మాది గుంటూరు. అమ్మానాన్నలకు నేను , అన్నయ్య సంతానం. అన్నయ్య ఇంజనీరింగ్ పూర్తి చేసి జాబ్ చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి అన్నయ్య నాకు చాలా సపోర్ట్. నేను డ్యాన్సర్‌గా రాణించడం కోసం చదువులో వెనకబడకూడదని అన్నయ్య క్లాస్‌లోనే నన్నూ జాయిన్ చేశారు. నేను మిస్ అయిన క్లాసులు అన్నయ్య చెప్పేవాడు. నాకు నోట్స్ రాసిపెట్టేవాడు. మా నాన్నగారు మల్లికార్జునరావు స్కూల్ హెడ్మాస్టర్. ప్రభుత్వ ఉద్యోగం కావడంతో తరచూ ట్రాన్స్ఫర్లు ఉండేవి. మా అమ్మ లలిత నా విషయంలో ఎక్కువ కేర్ తీసుకుంది. తను క్లాసికల్ డ్యాన్సర్. కానీ, తన కలను నెరవేర్చుకోలేకపోయానని నాకు కళ పట్ల ఆసక్తి కలిగేలా చేసింది. అమ్మ వల్ల నేను కూచిపూడి డ్యాన్సర్‌ని అయ్యాను. అంతేకాదు, జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్.. ప్రతీ ఆర్ట్‌లోనూ ప్రవేశం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది అమ్మ. నాన్నగారు మా బాధ్యత అమ్మకే అప్పజెప్పేవారు. ‘పిల్లలు వాళ్లనుకున్న ఫీల్డ్‌లో ఎదిగేలా జాగ్రత్తలు తీసుకో. నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది’ అనేవారు. మేం కూడా అవకాశాలను వదులుకోలేదు. ఇప్పటికీ నా ప్రొఫెషన్లో అమ్మ సపోర్ట్ ఉంటుంది. నాకు ఫ్రెండ్స్ సర్కిల్ చాలా చాలా తక్కువ. మా అమ్మనే నాకు బెస్ట్ ఫ్రెండ్. నాకు బాధనిపించినా, సంతోషమేసినా అమ్మతోనే షేర్ చేసుకుంటాను. – నిర్మలారెడ్డి బిజీ బిజీగా ఉండటం ఇష్టం నన్ను ‘సూర్యవంశం’ అంజలిగా చాలా మంది గుర్తుపడతారు. నా పాత్రను, నటనను మెచ్చుకుంటుంటారు. వచ్చిన అవకాశానికి, చేస్తున్న కృషికి చాలా ఆనందపడుతుంటాను. ఎప్పుడూ బిజీ బిజీగా ఉండటం నాకు ఇష్టం. నెలలో రెండు మూడు సీరియల్స్‌లో యాక్ట్ చేసేలా ప్లాన్ చేసుకుంటాను. సీరియల్స్ షెడ్యూల్ లేని టైమ్‌లో డ్యాన్స్ ప్రోగ్రామ్‌లు ప్లాన్ చేసుకుంటాను. నెలలో కనీసం 2–3 డ్యాన్స్ షోలైనా ఉంటాయి. పెద్ద పెద్ద ఆలోచనలైతే లేవు. క్లాసికల్ డ్యాన్సర్‌ని కాబట్టి డ్యాన్స్ ఇన్స్ట్యూట్ పెట్టాలి. ఇలా యాక్టింగ్‌లోనే కొనసాగాలి. ప్రేక్షకుల నుంచి మంచి పేరు తెచ్చుకోవాలి.’ -
కారు ప్రమాదం.. ఇద్దరు టీవీ ఆర్టిస్టులు మృతి
మొయినాబాద్ రూరల్(చేవెళ్ల): ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి కారు చెట్టును ఢీకొనడంతో ఇద్దరు టీవీ ఆర్టిస్టులు మృతిచెందారు. టీవీ ఆర్టిస్టులు ఓ సీరియల్ చిత్రీకరణలో భాగంగా హైదరాబాద్ నగరం నుంచి సోమవారం రాత్రి వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవులకు వెళ్లారు. అనంతగిరి గుట్టలపై షూటింగ్ అనంతరం కారులో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. మొయినాబాద్ మండలం అప్పారెడ్డిగూడ బస్టాప్ వద్ద మంగళవారం తెల్లవారు జామున వీరి కారు ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి చెట్టును ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో నిర్మల్ ప్రాంతానికి చెందిన భార్గవి (20) అక్కడికక్కడే మృతి చెందగా, భూపాలపల్లి జయశంకర్ జిల్లాకు చెందిన అనుషారెడ్డి (21) ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందారు. కారు డ్రైవర్ చక్రితో పాటు మరో వ్యక్తి వినయ్‌కుమార్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు మొయినాబాద్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. -
తెలుగింటి ముగ్గు
ముత్యాల ముగ్గు భూమిగా యామిని తెలుగింటి వారికి సుపరిచితమే. ఇతర భాషా హీరోయిన్స్ మన తెలుగు సీరియల్స్‌ను ఏలేస్తున్నా యామిని మాత్రం తన అందం, అభినయంతో వారికి గట్టిపోటీ ఇస్తూ సీరియల్స్‌లో టాప్ హీరోయిన్గా దూసుకుపోతుంది. ‘కళ్లతో అన్నీ కనిపిస్తాయి కానీ కొన్ని మాత్రం మనసుతోనే చూడాలి’ అంటూ జీ తెలుగు సీరియల్లో ప్రసారమయ్యే మీనాక్షి సీరియల్ ద్వారా మరోసారి ఆకట్టుకోనుంది యామిని. ‘మొదటిసారి తెలుగు సీరియల్లో అనుకోకుండా ఆఫర్ వచ్చినప్పుడు ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదు. చాలా ప్రయాసమీద అమ్మానాన్నలను ఒప్పించి మరీ చేశాను. జీ తెలుగు మంచి ప్రాజెక్ట్స్‌తో నాకు చాలా సపోర్ట్ ఇచ్చింది. భూమిగా ముత్యాలముగ్గు సీరియల్లో చాలా మంచి పేరొచ్చింది. నేను పుట్టి పెరిగింది వరంగల్‌లోనే. తెలుగమ్మాయినని గర్వంగా చెప్పుకుంటాను ఇండస్ట్రీలో. డిగ్రీ పూర్తి చేశాను. స్కూల్లో ఉన్నప్పుడు కల్చరల్ ఈవెంట్స్‌లో చురుగ్గా పాల్గొనేదాన్ని. డ్యాన్స్ అంటే ఉండే ఇష్టం వల్ల ఫ్యామిలీలో ఏ అకేషన్ అయినా సందడి చేసేదాన్ని. ఈవెంట్స్ ఆర్గనైజర్ ద్వారా సీరియల్ అవకాశం వచ్చింది. ముత్యాల ముగ్గు సీరియల్ ఇప్పటికి మూడేళ్లు అవుతోంది. దీనికి ముందు చిన్నకోడలు, పుట్టింటిపట్టుచీర.. వంటి సీరియల్స్ చేశాను. ఒక్కో సీరియల్‌కి ఒక్కో ప్రాధాన్యత ఉంది. మనసున్న మీనాక్షి పల్లెటూరి అమ్మాయిగా, పెద్దింట్లో కోడలుగా చేసిన పాత్రలన్నీ ఒక ఎత్తు అయితే అంధురాలిగా యాక్ట్ చేసే పాత్ర ఒక సవాల్. మీనాక్షి సీరియల్ నాకా అవకాశం ఇచ్చింది. ఆడిషన్స్ టెస్ట్ చేసిన డైరెక్టర్ నేనే ఆ పాత్రకు సూటబుల్ అవుతాను అన్నారు. బ్లైండ్ క్యారెక్టర్ ఎలా చేయాలి అని భయంతో ముందు వద్దనుకున్నాను. అలాగే రెండు సీరియల్స్ ఒకే టైమ్‌లో ఎలా చేయడం అని సందేహించాను. కానీ, నా టీమ్ ఇలాంటి అవకాశాలు కావాలనుకున్నా దొరకవు అన్నారు. అప్పుడే ఇదొక ఛాలెంజ్‌గా ఎంచుకున్నాను. మీనాక్షి పాత్ర చాలా జోవియల్‌గా అంతకుమించి ధైరస్తురాలిగా ఉంటుంది. ముత్యాల ముగ్గు సీరియల్లో భూమి క్యారెక్టర్‌కు నాకు చాలా దగ్గర పోలిక ఉన్నట్టు అనిపిస్తుంది. అమ్మ కూచిని... నాకు మా కుటుంబంతో టైమ్ స్పెండ్ చేయడం అంటే ఎక్కువ ఇష్టం. అందుకే అమ్మను నాతోపాటే ఉండమని కోరాను. మా అమ్మ రోజుమొత్తం నాతోనే ఉంటుంది. తనకు చాలా సహనం ఎక్కువ. తన సపోర్ట్ లేకపోతే నేను లేను. నెలలో ఇరవై రోజులు షూటింగ్లో పాల్గొంటే మిగతా రోజులు ఇల్లు వదిలి బయటకి రాను. ఇంట్లో ఉంటే టీవీ చూస్తూ గడిపేస్తాను. పాత సినిమా అయినా సరే మళ్లీ మళ్లీ చూస్తాను. ఇతర భాషల కథానాయికలు ఇక్కడ తెలుగమ్మాయిలకూ మంచి స్కోప్ ఉంది. అయితే, ఇతర భాషల అమ్మాయిలు ఎక్కువ కనిపించడానికి కారణం వాళ్లు ఈ వాతావరణంలో త్వరగా అడ్జెస్ట్ అవుతారని, ఫ్యామిలీ దూరంగా ఉన్నా భయపడరు, బాధపడరు అని. ఈ ఇండస్ట్రీ గురించి వారికి ఎక్కువ అవగాహన ఉంది. మన దగ్గరా ఈ రంగం పట్ల ఆసక్తి చూపేవారున్నారు. టర్నింగ్ పాయింట్స్ మాది పెద్ద కుటుంబం. మంచి జాబ్ ఉండాలి. ట్యాగ్వేసుకొని సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేయాలి అనుకున్నదాన్నే. కానీ, లైఫ్‌లో చాలా టర్నింగ్ పాయింట్స్ వస్తాయి. వాటిని నేర్పుగా మలచుకోవాలని నా జీవితం నుంచే నేను నేర్చుకున్నాను. నా ఫెర్ఫార్మెన్స్ పట్ల మాత్రమే నేను శ్రద్ధ పెడతాను. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోను. చాలా మంది సినీనటి సౌందర్య లాగా అనిపిస్తారు అని అంటుంటారు. నాకు ఆ మాట చాలా ఆనందాన్నిస్తుంది. వారి మాటలకోసమైనా ఆమెలా నటించేందుకు ప్రయత్నిస్తుంటాను. నా కోసం తెలుగులో అవకాశాలు ఉన్నంతవరకు ఈ ఫీల్డ్‌లో కొనసాగుతాను’. – నిర్మలారెడ్డి -
బుల్లితెర నటుడిపై కట్నం వేధింపుల కేసు
కర్ణాటక, యశవంతపుర : కట్నం వేధింపుల నేపథ్యంలో బుల్లితెర నటుడు రాజేశ్ ధ్రువపై కుమారస్వామి పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు..శృతి అనే యువతితో 2017లో రాజేశ్‌కు వివాహమైంది. అయితే కట్నం కోసం తనను వేధిస్తున్నట్లు శృతి కుమారస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజేష్ మరో మహిళతో అనైతిక సంబంధం కొనసాగిస్తున్నాడని శృతి ఆ ఫిర్యాదులో పేర్కొంది. ఇదిలా ఉండగా శృతి చేసిన ఆరోపణలు అవాస్తవమని రాజేష్ పేర్కొన్నారు. తమది సంప్రదాయమైన కుటుంబమని, శృతి బయట మాంసం తిని ఇంటికి వచ్చి తన తల్లిని వేధిస్తున్నట్లు అరోపించారు. కట్నం విషయంలో తాను శృతిని వేధించలేదన్నారు. విడాకులు కావాలని గతంలో శృతి కోర్టులో కేసు వేసిందని, కట్నం కోసం తాను వేధించినట్లు అయితే అప్పట్లో ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదని రాజేష్ పేర్కొన్నారు. -
బుల్లితెర నటుడు మృతి
తమిళనాడు, పెరంబూరు: బుల్లితెర నటుడు విజయ్‌రాజ్(43) శనివారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. పళని, ఇడుంబన్మలైకు చెందిన విజయ్‌రాజ్ కోలంగళ్, మెట్టిఒళి, నాదస్వ రం మెగా సీరియళ్లలో నటించారు. ఎండన్ మగన్ వంటి కొన్ని చిత్రాల్లోనూ నటిం చిన విజయ్‌రాజ్ మూడు రోజుల క్రి తం దీపావళి పండుగను కుటుం బ సభ్యులతో జరుపుకోవడానికి సొంత ఊరు వెళ్లారు. అక్కడ శనివారం సాయంత్రం అనూహ్యంగా గుండెపోటుకు గురవడంతో ఆయన్ని కుటుంబసభ్యులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. విజయ్రాజ్ను పరీక్షించిన వైద్యులు తను మార్గమధ్యంలోనే మరణించినట్లు తెలిపారు. విజయ్‌రాజ్‌కు భార్య, కూతురు ఐశ్వర్య ఉన్నారు. -
మోసపోయిన బుల్లితెర నటి
సాక్షి, యశవంతపుర(కర్ణాటక): రాష్ట్రస్థాయి పదవి ఇప్పి స్తామని బుల్లితెర నటి నుంచి డబ్బులు తీసుకుని మోసం చేసిన ఘటన అన్నపూర్ణేశ్వరినగర పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. రఘ చంద్రప్ప, సంగీత అనే ఇదరు తన వద్ద రూ. 10 లక్షలు నగదు తీసుకుని మోసం చేశారని బుల్లితెర నటి సుశ్మిత ఇటీవల అన్నపూర్ణేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు... ఆదిశక్తి మహిళ సంఘం రాష్ట్రస్థాయి మహిళా అధ్యక్షరాలిగా నియమిస్తామంటూ నమ్మించి సుశ్మిత నుంచి వీరు రూ. 10 లక్షలు తీసుకున్నారు. రోజులు గడుస్తున్నా కూడా నియామకం జరగక పోవడంతో పాటు నగదు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ప్రాణాలు తీస్తామని వారు హెచ్చరించినట్లు సుశ్మిత పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. సరోజ అనే మహిళ వద్ద కూడా వీరు డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. -
టీఆర్ఎస్లో చేరిన నటుడు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ముందుస్తు ఎన్నికల నేపథ్యంలో రాజకీయ చేరికలు ఊపందుకున్నాయి. టీవీ, ఫిలిం యాక్టర్, హైకోర్టు అడ్వకేట్ జే.ఎల్. శ్రీనివాస్ కుందన్‌బాగ్‌లోని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో శుక్రవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. ఖమ్మం జిల్లాకు చెందిన తాను గత 30 సంవత్సరాలుగా నగరంలో నివాసం ఉంటూ సుమారు 200 పైగా సినిమాలు, ఎన్నో సీరియల్స్‌లో విభిన్న పాత్రలు పోశించినట్లు వెల్లడించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, బంగారు తెలంగాణ కోసం ఆయన వేస్తున్న బాటలకు ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరుతున్నట్లు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో టీవీ సీరియల్ కళాకరులతో కలిసి 31 జిల్లాల్లో విసృతంగా ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. -
పాపులారిటి కోసమే..
పెరంబూరు: పోలీసులను తప్పుగా చిత్రీకరించాలన్నది తన ఉద్దేశం కాదు. పాపులారిటీ కోసమే అలా చేశాను అని బుల్లితెర నటి నిలాణి పోలీసుల విచారణలో వివరించింది. ఇటీవల తూత్తుకుడి కాల్పులు సంఘటన రాష్ట్రంలో కలకలానికి దారి తీసిన సంగతి తెలిసిందే. నటుడు రజనీకాంత్ లాంటి వారే ఈ వ్యవహారంలో తీవ్ర వ్యతిరేకతను చవిచూసిన విషయం విదితమే. కాగా ఆ సంఘటనలో పోలీసుల కాల్పులను, ప్రజల హాహా కారాలను, ప్రాణాలు బలిగొన్న దృశ్యాలను బుల్లితెర నటి నిలాణి పోలీసు దుస్తులు ధరించి వీడియో తీసి కామెంట్స్‌తో సహా దాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీంతో స్థానిక వడపళనికి చెందిన రిషీ అనే వ్యక్తి గత 22వ తేదీన వడపళని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు బుల్లితెర నటి నిలాణిపై కేసు నమోదు చేసి ఇన్స్పెక్టర్ చంద్రు నేతృత్వంలో దర్యాప్తు చేపట్టారు.అందులో ఈ వీడియోను తీసిన యువతి స్థానిక సాలిగ్రామానికి చెందిన బుల్లితెర నటి నిలాణి అని తెలిసింది. బుధవారం వేకువ జామున పోలీసులు నీలాణిని నీలగిరి జిల్లా కున్నూర్‌లో అరెస్ట్ చేశారు. విచారణలో నిలాణి ఇచ్చిన వాంగ్మూలంలో తంజావూరుకు చెందిన తనకు చిన్నతనం నుంచి నటన అంటే చాలా ఇష్టం అని, అయితే సినిమాలో అవకాశాలు రాకపోవడంతో బుల్లితెరపై చిన్న చిన్న పాత్రలు ధరిస్తున్నట్లు చెప్పిందన్నారు. ఇటీవల జల్లికట్టు పోరాటంలో పాల్గొన్నానని, అయినా తనకు గుర్తింపు రాకపోవడంతో తూత్తుకుడి కాల్పుల సంఘటన వీడియో తీసి పాపులర్ అవ్వాలన్న ఆలోచనతోనే అలా చేశానని, అంతే గానీ పోలీసులను తప్పుగా చిత్రీకరించాలన్నది తన ఉద్దేశం కాదని నిలాణి పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. -
టీవీ నటుడిపై యువతి ఫిర్యాదు
చెన్నై,పెరంబూరు: తనను ప్రేమించి మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అయ్యాడంటూ బుల్లితెర నటుడిపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు చూస్తే స్థానిక కొడుమియూర్, గాంధీనగర్ 5వ వీధిలో దివ్య అనే యువతి నివశిస్తోంది. ఈమె ఒక ఒక ప్రైవేట్ సంస్థలో గ్రాఫిక్స్ డిజైనర్‌గా పనిచేస్తోంది. దివ్య ఆదివారం నీలాంగరై పోలీస్‌స్టేషన్‌లో ఒక ఫిర్యాదు చేసింది. అందులో తాను ఒక ప్రైవేట్ సంస్థలో గ్రాఫిక్స్ డిజైనర్‌గా పని చేస్తున్నానని, తనకు గాంధీనగర్ ప్రాంతానికి చెందిన నవీన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడిందని పేర్కొంది. మా మధ్య పరిచయం కొంతకాలానికి ప్రేమగా మారిందని చెప్పింది. దీంతో తాము పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా, ఆ విషయాన్ని తమ కుటుంబసభ్యులకు చెప్పడానికి భయపడ్డామన్నారు. దీంతో కుటుంబ సభ్యులకు తెలియకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నామని తెలిపింది. ఈ విషయం తమ బంధువులకు తెలియదని చెప్పింది. పెళ్లి అయినా ఎవరి ఇంటిలో వారు ఉంటూ తరచూ కలుసుకుంటున్నామని, ఫోన్లో మాట్లాడుకుంటున్నామని చెప్పింది. అలాంటిది ఇటీవల నవీన్ ప్రవర్తనలో మార్పు రావడం గుర్తించానని అంది. దీంతో అతని గురించి ఆరా తీయగా తనను దూరంగా పెట్టి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అయ్యాడన్న దిగ్భ్రాంతి కలిగించే విషయం తెలిసిందని చెప్పింది. నవీన్ నీలాంగరైలోని ఒక కల్యాణ మండపంలో పెళ్లి చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసిందని, కాబట్టి ఆ పెళ్లిని ఆపాలని ఆ ఫిర్యాదులో దివ్య పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరుపుతున్నారు. నవీన్ బుల్లితెర నటుడని తెలిసింది. -
టీవీ ఆర్టిస్టుపై అత్యాచారం కేసులో.. యువకుడి అరెస్టు
సాక్షి, హైదరాబాద్: టీవీ ఆర్టిస్టును నిర్బంధించి పలుమార్లు అత్యాచారం చేసిన నిందితున్ని ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలోని ధర్మవరం ఎస్‌బీకాలనీకి చెందిన కొమ్మారశెట్టి గిరీశ్ (27) అనంతపురంలోని ఓ మెడికల్ షాప్‌లో పనిచేస్తున్నాడు. ఎల్బీనగర్లో ఉండే ఓ సినిమా ఆర్టిస్టు (34)తో కామన్ ఫ్రెండ్ ద్వారా గిరీశ్‌కు పరిచయం ఏర్పడింది. తన అవసరానికి రూ.లక్ష కావాలని ఆమె గిరీశ్‌ని కోరడంతో, డబ్బు తీసుకోడానికి అనంతపురం రావాలని చెప్పాడు. 2016 నవంబర్‌లో టీవీ ఆర్టిస్టు అనంతపురం వెళ్లి గిరీశ్‌ను కలిసింది. ఈ విషయం మాట్లాడిన అనంతరం కూల్‌డ్రింక్‌లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చాడు. దీంతో ఆమె స్పృహ తప్పడంతో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె అర్ధనగ్న చిత్రాలు, వీడియోలు సెల్ఫోన్లో రికార్డు చేసి బ్లాక్మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారం చేశాడు. కళ్యాణదుర్గం బైపాస్ రోడ్డులో గది అద్దెకు తీసుకొని ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నాడు. ఆ మహిళ దగ్గర ఉన్న బంగారు ఆభరణాలు సైతం తీసుకొని స్థానికంగా ఉన్న బ్యాంక్‌లో తనఖా పెట్టి డబ్బులు తీసుకున్నాడు. తప్పించుకున్న బాధితురాలు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్‌ను ఆశ్రయించింది. ఆయన ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం అనంతపురం వెళ్లి గిరీశ్‌ను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించింది. -
బుల్లితెర నటిపై కేసు నమోదు
హైదరాబాద్ : బుల్లితెర నటి శ్రీవాణిపై రంగారెడ్డి జిల్లా వికారాబాద్ పోలీస్ స్టేషన్‌పై కేసు నమోదు చేశారు. తమ ఇల్లు కూలగొట్టిందని శ్రీవాణిపై ఆమె వదిన అనూష పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల శ్రీవాణి సోదరుడు బాబ్జీ అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ నేపథ్యంలో తమ ఆస్తిని కాజేయాలని శ్రీవాణి చూస్తోందని అనూష పోలీసులకు రాసిన ఫిర్యాదులో పేర్కొంది. -
టీవీ నటికి మెసేజ్‌లతో వేధింపులు
హైదరాబాద్ : గుర్తు తెలియని వ్యక్తి అసభ్యకర సందేశాలతో మానసిక వేధింపులకు గురి చేస్తున్నాడంటూ ఓ బుల్లి తెర నటి బంజారాహిల్స్ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనగర్ కాలనీలోని గణపతి కాంప్లెక్స్ సమీపంలో నివసించే ఎస్. భారతి(40) కొన్ని టీవీ షోలలో నటిస్తోంది. గత మూడు నెలల నుంచి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ నుంచి ఆమెకు అసభ్యకర మెసేజ్‌లు వస్తున్నాయి. ఆ మెసేజ్ ల వల్ల తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నానని, సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ భారతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
టీవీ నటి దీప్తి ఆత్మహత్య
హైదరాబాద్: బాలానగర్ ప్రాంతంలోని ఫతే నగరలో దీప్తి(30) అనే టీవీ నటి ఆత్మహత్యకు పాల్పడింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన చెందిన దీప్తి ఆలియాస్ రామలక్ష్మీ ఫతేనగర్‌లోని ఓ అపార్టుమెంటులో నివాసముంటుంది. శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లోనే ఉరివేసుకుందని పోలీసులు తెలిపారు. ఆమె ఆత్యహత్య పాల్పడుతూ ఐ ప్యాడ్ లో సెల్ఫీ ఫొటోలను కూడా తీసుకుంది. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీప్తి ఆడదే ఆధారం, ఆహ్వానం తదితర సీరియల్స్ లో నటించింది. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. ఎలాంటి సూసైడ్ నోట్ ఇంట్లో వదలకపోవడం, ఎవరూ కూడా ఆమె గురించిన వివరాలు చెప్పలేకపోవడంతో దర్యాప్తు ఇంకా ముందుకు సాగట్లేదు. -
టివి ఆర్టిస్ట్ ఫణికుమార్ అరెస్ట్
-
నిరుద్యోగులకు టీవీ ఆర్టిస్ట్ టోకరా
-
వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ టీవీ ఆర్టిస్ట్
-
వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ టీవీ ఆర్టిస్ట్
హైదరాబాద్ : హైదరాబాద్‌లో అర్ధరాత్రి నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మోతీనగర్‌లోని ఓ అపార్ట్మెంట్లోవ్యభిచారం చేస్తుండగా... ఓ టీవీ ఆర్టిస్ట్‌ను పట్టుకున్నారు. ఆమెతో పాటు మరో ఇద్దర్నీ అరెస్ట్ చేసి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పట్టుబడిన టీవీ ఆర్టిస్ట్ కుంకుమ పువ్వు సీరియల్లో నటిస్తున్న ఓ నటిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి కోర్టుకు తరలించనున్నారు. మరోవైపు వ్యభిచార నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
టీవీ నటుడు కల్యాణ్ చక్రవర్తి ఆత్మహత్య
భీమవరం : బుల్లితెర ఆర్టిస్ట్ కల్యాణ్ చక్రవర్తి ఆత్మహత్య చేసుకున్నారు. తన స్వస్థలం అయిన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆయన ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే కల్యాణ చక్రవర్తి ఆత్మహత్య చేసుకున్నారని స్థానికులు అంటున్నారు. తహసిల్దార్ గా పనిచేసి పదవీ విరమణ చేసిన కల్యాణ్ చక్రవర్తి తల్లి రెండేళ్ల క్రితమే మరణించారు. వీళ్లకు ఉన్న ఇల్లు కూడా కొన్నాళ్ల క్రితం అమ్మేసినట్లు తెలిసింది. ఈయనకు ఇంకా పెళ్లి కాలేదు. టీవీ సీరియళ్లతో పాటు కొన్ని సినిమాల్లో కూడా కల్యాణ్ చక్రవర్తి నటించినట్లు చెబుతున్నారు. ఇటీవలి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో అవి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారని స్థానికులు అంటున్నారు. -
వ్యభిచారం కేసులో పట్టబడ్డ టీవీ ఆర్టిస్ట్
హైదరాబాద్: హైదరాబాద్ ఎల్బీనగర్లోని ఓ వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఓ టీవీ ఆర్టిస్ట్ పాటు ముగ్గురు విటులు, ముగ్గురు యువతులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. అరెస్టయిన టీవీ నటుడు పలు సీరియల్స్‌లో నటించినట్టు సమాచారం. -
తినడానికి లేకపోతే పోలీసులే అన్నం పెట్టారు:విజయరాణి
హైదరాబాద్:తినడానికి తిండిలేని పరిస్థితుల్లో ఉన్న తనకు పోలీసులే అన్నం పెట్టారని టీవీ ఆర్టిస్టు బత్తుల విజయరాణి మీడియా ముందు వాపోయింది. ప్రస్తుతం తన వద్ద చిల్లి గవ్వ కూడా లేదని తెలిపింది. బెంగళూరులో పట్టుబడిన ఆమెను సీసీఎస్ పోలీసులు శుక్రవారం విచారించారు. పోలీస్ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ గగ్గోలు పెట్టుకుంది. తాను రూ. 10 కోట్లకు పైగా చిట్టీలతో మోసం చేయలేదని, కేవలం తాను జూనియర్ ఆర్టిస్టులకు మాత్రమే రూ.4 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలిపింది. అసలు కంటే వడ్డీలే ఎక్కువ కట్టానని, అప్పులపాలు కావడంతో పారిపోయానని, తన వద్ద చిల్లిగవ్వలేదని విజయరాణి విచారణలో తెలిపింది. కోట్లాది రూపాయలు దోచుకుందని ఒకవైపు బాధితులు చెప్తుంటే... మరోవైపు ఆమె తన వద్ద ఒక్కపైసాకూడా లేదని చెప్పడంతో ఈ కేసును పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. విజయరాణిని విచారించిన సీసీఎస్ పోలీసులు .. ఆమె టీవీ ఆర్టిస్టుల వద్ద చిట్టీల పేరుతో రెండు కోట్లను వసూలు చేసిందని తెలిపారు. ఇప్పటికే ఆమె పేరిట ఉన్న ఆస్తులను జప్తు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆస్తులతో వచ్చిన డబ్బులను బాధితులకు అందజేస్తామన్నారు. -
చేతులేత్తేసిన ‘చిట్టీలరాణి’
అసలు కంటే వడ్డీలే ఎక్కువ కట్టానని వెల్లడి తన వద్ద చిల్లిగవ్వలేదని పోలీసుల విచార ణలో ఏకరవు సాక్షి, సిటీబ్యూరో: బెంగళూరులో పట్టుబడిన టీవీ ఆర్టిస్టు బత్తుల విజయరాణి (46)ని సీసీఎస్ పోలీసులు గురువారం నగరానికి తీసుకొచ్చారు. ఓ రహాస్య ప్రదేశంలో సీసీఎస్ ఏసీపీ విజయ్‌కుమార్ ఆమెను విచారిస్తున్నారు. విజయరాణి రూ.10 కోట్లకుపైగా చిట్టీలు, అధిక వడ్డీల పేరుపై డబ్బులు వసూలు చేసుకొని పారిపోయిందని బాధితుల కథనం ప్రకా రం నిన్నటి వరకూ అనుకున్నారు. అయితే విచారణలో మాత్రం అందుకు భిన్నంగా కథనాలు వినిపిస్తున్నాయి. అసలు తాను ఎవరికీ ఒక్కపైసా కూడా ఇవ్వాల్సి లేదని, అసలు కంటే వడ్డీలే ఎక్కువ కట్టానని, అప్పులపాలు కావడంతో పారిపోయానని, తన వద్ద చిల్లిగవ్వలేదని విజయరాణి విచారణలో ఏకరువు పెట్టినట్టు సమాచారం. కోట్లాది రూపాయలు దోచుకుందని ఒకవైపు బాధితులు చెప్తుంటే... మరోవైపు ఆమె తన వద్ద ఒక్కపైసాకూడా లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని పోలీసులంటున్నారు. అసలు ఈ ఉదంతంలో వడ్డీల పేరుతో ఆమెకు ఎంత మంది ఎంత డబ్బు ఇచ్చారు..? ఆమె వద్ద చిట్టీలు ఎవరు ఎత్తుకున్నారు..? ఇంకా చిట్టీలు ఎత్తుకోని వారు ఎందరు?.. చిట్టీలు ఎత్తుకుని డబ్బులు కట్టని వారు ఎంత మంది?... ఇలా బాధితుల నుంచి వేర్వేరుగా వివరాలను సీసీఎస్ పోలీసులు సేకరిస్తున్నారు. ఆ తర్వాతే డబ్బు ఎవరి వద్ద ఉంది అనే అంశం తేలుతుందని పోలీసులు భావిస్తున్నారు. వియజరాణి వద్ద నిజంగా డబ్బు లేదా? ఉండే నాటకం ఆడుతుందా.. అనే కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు. విజయరాణి ఎదుటే బాధితులను కూర్చోబెట్టి ప్రశ్నించాలని పోలీసులనుకుంటున్నారు. నగరంలోని ఆమె రెండు ఇళ్లతో పాటు గుడివాడలోని ఇల్లును కూడా విక్రయించిందని తేలింది. విక్రయించగా వచ్చిన డబ్బు ఎక్కడ ఉంది? ఎవరికిచ్చింది అనే విషయంపై కూడా పోలీసులు దృష్టి పెట్టారు. వడ్డీల రూపంలో ఆమె నుంచి ఎవరెవరు ఎంత పెద్దమొత్తం తీసుకున్నారు అనే వివరాలపై ఇప్పటికే సీసీఎస్ పోలీసులు ఆరా తీశారు. అధిక వడ్డీలు ఇవ్వడం వల్లనే ఆమె నష్టపోయిందా అనేది సందేహం కలిగిస్తోంది. గతనెలలో నమోదైన కుట్ర, మోసం కేసులో విజయరాణితో పాటు ఆమెకు సహకరించిన మరో 11 మందిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఇక ఆమె ఇళ్లను ఖరీదు చేసిన వారిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. నిజానికి వీరు ఆమెకు నగదు ఇచ్చి ఇళ్లు ఖరీదు చేశారా? లేక వారికి డబ్బులు బాకీ ఉంటే ఇళ్లను కబ్జా చేశారా అనే విషయాలు తేలాల్సి ఉంది. ఆమె విక్రయించిన మూడిళ్లను ఇప్పటికే పోలీసులు సీజ్ చేశారు. బెంగళూరుకు పారిపోయిన విజయరాణి బృందం అక్కడ కూడా నాలుగు ఇల్లు మార్చి పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది. ప్రతి రోజు సెల్నెంబర్లను మారుస్తూ పోలీసుల దృష్టి మరల్చింది. -
'రూ.3కోట్లు వసూలు చేసిన మాట నిజమే'
హైదరాబాద్ : తోటి నటీనటులకు చిట్టీల పేరుతో శఠగోపం పెట్టి పారిపోయిన టీవీ ఆర్టిస్టు బత్తుల విజయరాణి తాను రూ. 3 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు స్వయంగా అంగీకరించింది. బెంగళూరులో నిన్న విజయలక్ష్మిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు ఇంకా విచారిస్తున్నారు. అధిక వడ్డీకి కూడా ఆమె రుణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరికొంతమందిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు వున్నాయి. చిట్టీల పేరుతో పలువురు ఆర్టిస్టులకు డబ్బు ఎగగొట్టిన విజయరాణి నెల రోజుల క్రితం పరారైన విషయం తెలిసిందే. బాధితుల ఫిర్యాదు మేరకు విజయరాణితో పాటు చెల్లెలు బి.సుధారాణి, నాని, శరణ్, శ్రీనివాస్‌రావు, హరిబాబు, దుర్గ, రమేష్‌లపై చీటింగ్, కుట్ర కేసులను సీసీఎస్ పోలీసులు నమోదు చేశారు. విజయరాణికి చెందిన రెండు ఇళ్లతో పాటు కారును కూడా పోలీసులు సీజ్ చేశారు. వారి కోసం ఆరు పోలీస్ ప్రత్యేక బృందాలు వెతికాయి. కూకట్‌పల్లిలోని ఓ లారీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయ సిబ్బంది ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రత్యేక బృందం బెంగుళూరు వెళ్లి వారిని పట్టుకుంది. బత్తుల విజయరాణి, పాలరాజు, చిట్టీలు, టీవీ ఆర్టీస్టులు, tv artist, Battula Vijayarani, Palaraju, ccs police -
'రూ.3కోట్లు వసూలు చేసిన మాట వాస్తవమే'
-
’చిట్టీ’లమ్మ చిక్కింది
-
‘చిట్టీలరాణి’ దొరికేనా..!
హైదరాబాద్ : టీవీ ఆర్టిస్టులకు రూ.10 కోట్లకుపైగా శఠగోపం పెట్టి పారిపోయిన టీవీ ఆర్టిస్టు బత్తుల విజయరాణి నెల కావొస్తున్నా నేటికీ ఆచూకీ దొరకలేదు. బాధితుల ఫిర్యాదు మేరకు సీసీఎస్ డీసీపీ పాలరాజు ఆమెతో పాటు చెల్లెలు బి.సుధారాణి, నాని, శరణ్, శ్రీనివాస్‌రావు, హరిబాబు, దుర్గ, రమేష్‌లపై చీటింగ్, కుట్ర కేసు నమోదు చేశారు. విజయరాణిని అరెస్టు చేయాలని బాధితులు వరుసగా ఆందోళనలు చేయడంతో నిందితురాలికి చెందిన రెండు ఇళ్లతో పాటు కారును పోలీసులు సీజ్ చేశారు. అయితే నేటి వరకు అసలు నిందితురాలి ఆచూకీ తెలియరాలేదు. ఇంటి సామానులతో సహా ఆమె బెంగుళూరుకు పారిపోయి ఉంటుందని కూకట్‌పల్లిలోని ఓ లారీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయ సిబ్బంది ఇచ్చిన క్లూ ఆధారంగా ప్రత్యేక బృందం బెంగుళూరు వెళ్లి వచ్చింది. అయినా ఆమె ఆచూకీ దొరకలేదు. రెండేళ్ల నుంచే పక్కా పథకం వేసుకున్న విజయరాణి చిట్టీల పేరుతోనే కాకుండా తెలిసివారందరి దగ్గర అధిక వడ్డీ పేరుతో కోట్లాది రూపాయలు అప్పు చేసింది. అంతేకాకుండా తన కుమారుడు సినిమాలో హీరో అవుతున్నాడని నమ్మించి బంధువులు వద్ద నుంచి బంగారు ఆభరణాలను సైతం తీసుకుంది. ఆ తరువాత తన పేరుపై ఉన్న ఆస్తులన్నింటినీ అమ్మేసి ఇంటి సామానుతో పారిపోయింది. ఇంతవరకు ఆమె, మిగిలిన నిందితుల ఆచూకీ లభించకపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. అయితే, నిందితుల కోసం గాలిస్తున్నామని, ఇతర రాష్ట్రాలకు కూడా ప్రత్యేక బృందాలను పంపినా ఇంత వరకు ఆచూకీ లభించలేదని, త్వరలోనే అరెస్టు చేస్తామని సీసీఎస్ అధికారులు అంటున్నారు. -
తెర వెనుక నేర వేషాలు
రూ.10 కోట్లకు కుచ్చుటోపీ పెట్టిన టీవీ ఆర్టిస్ట్ విజయరాణి హత్యాయత్నం కేసులో చిక్కిన సినీనటుడు రెహమాన్ డ్రగ్స్ కేసులో అరెస్టైన హీరో ఉదయ్ సాక్షి, సిటీబ్యూరో : తెరపై వివిధ క్యారెక్టర్లలో జీవిస్తున్న నటీనటులలో కొందరు తెరవెనుక మాత్రం నేర ‘వేషాలు’ వే స్తున్నారు. వారం రోజుల వ్యవధిలో ముగ్గురు ఆర్టిస్టులు నేరాలకు పాల్పడటమే దీనికి నిదర్శనం. నేరబాట పట్టిన వారిలో ఒకరు టీవీ ఆర్టిస్టు విజయరాణి, మరొకరు సినీ ఆర్టిస్టు అబ్దుల్ రహమాన్, మూ డో వ్యక్తి వర్ధమాన నటుడు ఉదయ్ ఉన్నారు. వీరు ఒక్కొక్కరూ ఒక్కో రీతిలో నేరానికి పాల్పడ్డారు. డ్రగ్స్ కేసులో... తాజాగా వర్థమాన నటుడు ఉదయ్ కిరణ్ డ్రగ్స్ సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కడం కలకలం రేపింది. గతంలోనూ డ్రగ్స్ సరఫరా, కొనుగోలు వ్యవహారాల్లో సినీనటులు పట్టుబడిన ఉదంతాలున్నాయి. సినీ పరిశ్రమలోని కొందరు మాదక ద్రవ్యాల ముఠాలతో సంబంధాలు నెరపడం ఆందోళన కలిగిస్తోంది. హత్యాయత్నం కేసులో.... రక్తచరిత్ర సినిమాలో విలన్‌గా నటించిన అబ్దుల్ రెహమాన్ వారం క్రితం పట్టపగలు అందరిముందు ఓ వ్యక్తిని కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. పరారీలో ఉన్న రెహమాన్‌ను అరెస్టు చేసినట్టు డీసీపీ వి.సత్యనారాయణ సోమవారం వెల్లడించారు. బంజారాహిల్స్‌లో నివాసముంటున్న రెహమాన్ ఇంటి యజమానురాలితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలి మరిది, చింతల్‌బస్తీకి చెందిన మహ్మద్ ఫయాజ్ తన స్నేహితులతో కలిసి పక్షం రోజుల క్రితం రెహమాన్‌పై దాడి చేశాడు. దీంతో ఫయాజ్‌పై కక్ష పెంచుకున్న రెహమాన్ ఈనెల 18న చాచానెహ్రూపార్క్ వద్ద ఒంటరిగా ఉన్న అతడిని కత్తితో పొడిచి పారిపోయాడు. సకాలంలో ఫయాజ్ను ఆసుపత్రికి తరలించడంతో బతికిబట్టకట్టాడు. నగలు కూడా... చిట్టీల రాణి ఉదంతంలో సోమవారం మరికొందరు బాధితులు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించి తమ గోడు చె ప్పుకున్నారు. చిట్టీలు, అధిక వడ్డీ పేరుతో విజయరాణి తమ తోటి టీవీ ఆర్టిస్టుల వద్ద రూ.10 కోట్ల వరకు వసూలు చేసి పా రిపోయిందని మాత్రమే ఇప్పటి వరకు అందరికీ తెలుసు. అయితే, తాజాగా మరో ఉదంతం వె లుగు చూసింది. తన కుమారుడు సినీ హీరో అ వుతున్నాడని చెప్పి విజయరాణి తనకు తెలిసిన 20 మంది నుంచి బంగారు నగలు తీసుకుంది. మొత్తం కేజీ బంగారం తీసుకొని ఉడాయించిం ది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయిం చారు. కాగా, రాణిని త్వరగా అరెస్టు చేసి బాధితులను ఆదుకోవాలని దర్శక, నిర్మాత తమ్మినేని భరద్వాజ డీసీపీ పాలరాజును కలిసి కోరారు. అలాగే దర్శకుడు దాసరి నారాయణరావు కూడా నగర పోలీసు కమిషనర్‌కు ఫోన్ చేసి బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. దొరక్కుంటే కేసు సీఐడీకి అప్పగిస్తాం : డీజీపీ నిందితురాలు విజయరాణి రెండుమూడు రో జు ల్లో దొరక్కుంటే సీసీఎస్ దర్యాప్తు చేస్తున్న ఈకేసును సీఐడీకి అప్పగిస్తానని డీజీపీ బి.ప్రసాదరావు టీవీ ఆర్టిస్టులకు హామీ ఇచ్చారు. న్యాయం చేయాలని బాధిత ఆర్టిస్టులు సోమవారం డీజీపీ ని కలవగా ఆయన ఈ విధంగా స్పందించారు. -
టీవీ ఆర్టిస్ట్ విజయరాణిపై కేసు నమోదు
హైదరాబాద్ : చిట్టీల పేరుతో జూనియర్ ఆర్టిస్టులను రూ.10 కోట్ల మేర నిండా ముంచిన నటి బత్తుల విజయరాణిపై సీసీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. ఈ సందర్భంగా సీసీఎస్ డీసీపీ పాలరాజు మాట్లాడుతూ విజయరాణి సుమారు రూ.5 కోట్లు వసూలు చేసినట్లు 120మంది బాధితుల నుంచి ఫిర్యాదులు అందాయని తెలిపారు. రెండు దర్యాప్తు బృందాలతో విచారణ కొసాగుతోందని ఆయన పేర్కొన్నారు. కాగా కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన బత్తుల విజయరాణి (46) టీవీ సీరియల్స్‌లో నటిస్తూ అమీర్‌పేట న్యూ శాస్త్రినగర్‌లో నివాసముంటోంది. 12 ఏళ్లుగా చిట్టీల వ్యాపారం కూడా నడుపుతోంది. రూ. 5లక్షల నుంచి రూ. 50 లక్షల విలువైన చిట్టీల్లో సుమారు 400 మంది నటులు సభ్యులుగా చేరారు. గత నాలుగైదు నెలలుగా చిట్టీలు పాడిన వారికి ఆమె ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయి. దీంతో వారు ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చారు. రేపు మాపు అంటూ విజయరాణి వాయిదా వేస్తూ వస్తోంది. ఇది తెలిసి ఆమెకు లక్షల రూపాయల్లో బదులు ఇచ్చిన మరికొందరు కూడా తమ డబ్బులు తిరిగిచ్చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో విజయరాణి ఉన్నట్లుండి బుధవారం నుంచీ కనిపించకుండా పోయింది. దీనిపై బాధితులు జూనియర్ ఆర్టిస్టుల సంఘాన్ని ఆశ్రయించగా.. వారు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. దీంతో వారు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ డీసీపీ జి.పాలరాజును ఆశ్రయించారు. ఆ తర్వాత నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. -
10కోట్లకు శఠగోపం పెట్టిన బుల్లితెర నటి
-
10కోట్లకు శఠగోపం పెట్టిన బుల్లితెర నటి
హైదరాబాద్ : చిట్టీల పేరుతో ఓ బుల్లితెర నటి ఘరానా మోసానికి పాల్పడింది. టీవీ ఆర్టిస్ట్ విజయరాణి...జూనియర్ ఆర్టిస్టుల వద్ద సుమారు 10కోట్ల రూపాయాల వరకూ వసూలు చేసి ఉడాయించింది. గత కొంతకాలంగా విజయరాణి ఎంతో నమ్మకంగా స్థానికంగా చిట్టీలు నిర్వహించేది. సమయానికి చిట్టీ డబ్బులు ఇచ్చివేసేది. నమ్మకం కుదరటంతో పలువురు జూనియర్ ఆర్టిస్ట్‌లు ఆమె వద్ద చిట్టీలు వేశారు. పెద్ద మొత్తంలో చిట్టీలు వేసిన ఆమె...అదును చూసుకుని పరారైంది. దాంతో ఆలస్యంగా విషయం తెలుసుకున్న బాధితులు సీసీఎస్ పోలీసుల్ని ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న విజయరాణి కోసం గాలిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.