
తమిళనాడు, పెరంబూరు: బుల్లితెర నటుడు విజయ్‌రాజ్(43) శనివారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. పళని, ఇడుంబన్‌మలైకు చెందిన విజయ్‌రాజ్ కోలంగళ్, మెట్టిఒళి, నాదస్వ రం మెగా సీరియళ్లలో నటించారు. ఎండన్ మగన్ వంటి కొన్ని చిత్రాల్లోనూ నటిం చిన విజయ్‌రాజ్ మూడు రోజుల క్రి తం దీపావళి పండుగను కుటుం బ సభ్యులతో జరుపుకోవడానికి సొంత ఊరు వెళ్లారు. అక్కడ శనివారం సాయంత్రం అనూహ్యంగా గుండెపోటుకు గురవడంతో ఆయన్ని కుటుంబసభ్యులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. విజయ్‌రాజ్‌ను పరీక్షించిన వైద్యులు తను మార్గమధ్యంలోనే మరణించినట్లు తెలిపారు. విజయ్‌రాజ్‌కు భార్య, కూతురు ఐశ్వర్య ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment