టీవీ నటికి మెసేజ్‌లతో వేధింపులు | TV Artist harassed by offensive SMS | Sakshi
Sakshi News home page

టీవీ నటికి మెసేజ్‌లతో వేధింపులు

Published Fri, Mar 11 2016 7:00 PM | Last Updated on Sun, Sep 3 2017 7:30 PM

టీవీ నటికి మెసేజ్‌లతో వేధింపులు

టీవీ నటికి మెసేజ్‌లతో వేధింపులు

హైదరాబాద్ : గుర్తు తెలియని వ్యక్తి అసభ్యకర సందేశాలతో మానసిక వేధింపులకు గురి చేస్తున్నాడంటూ ఓ బుల్లి తెర నటి బంజారాహిల్స్ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనగర్‌ కాలనీలోని గణపతి కాంప్లెక్స్ సమీపంలో నివసించే ఎస్. భారతి(40) కొన్ని టీవీ షోలలో నటిస్తోంది. గత మూడు నెలల నుంచి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ నుంచి ఆమెకు అసభ్యకర మెసేజ్‌లు వస్తున్నాయి. ఆ మెసేజ్ ల వల్ల తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నానని, సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ భారతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement