బంజారాహిల్స్ (హైదరాబాద్) : ఫోన్‌లో యువతులను వేధిస్తున్న ఓ యువకుడిని బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విజయవాడకు చెందిన నందమాల గోపి అలియాస్ వంశీ(25) సూరారం కాలనీలో నివసిస్తూ జగద్గిరిగుట్టలోని వినాయక మెటల్స్‌లో పని చేస్తున్నారు. రెండు నెలల క్రితం వరకు బంజారాహిల్స్ రోడ్ నంబర్- 2లోని ఇందిరానగర్‌లో అద్దెకుండేవాడు. పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడి నుంచి సూరారం ప్రాంతానికి మకాం మార్చాడు.
కాగా ఇతనికి ఇటీవల రోడ్డుపై ఒక సిమ్‌కార్డు దొరికింది. అది పని చేస్తుండటంతో రాత్రిపూట తన ఫోన్‌లో ఆ సిమ్ కార్డు వేసి ఇందిరానగర్‌కు చెందిన ఓ యువతికి అసభ్యకర సందేశాలతో పాటు ఫోన్లు కూడా చేస్తున్నాడు. నెల రోజుల నుంచి ఆ యువతికి ఫోన్ చేసి వేధిస్తూ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. అంతే కాకుండా చాలా మంది యువతుల నంబర్లు సేకరించి వారికి కూడా ఫోన్లు చేస్తున్నాడు. పలువురి కాపురాల్లో చిచ్చు కూడా పెట్టాడు. ఈ నేపథ్యంలోనే ఇందిరానగర్‌కు చెందిన ఇద్దరు యువతులు తమకు వస్తున్న అసభ్యకర ఫోన్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాల్‌డేటా సేకరించిన బంజారాహిల్స్ పోలీసులు నిందితుడు గోపి అలియాస్ వంశీని నిర్భయచట్టం కింద అరెస్టు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు.
యువతులను ఫోన్‌లో వేధిస్తున్న ప్రబుద్ధుడు అరెస్ట్
Published Tue, Jun 2 2015 8:01 PM | Last Updated on Sun, Sep 3 2017 3:07 AM
Advertisement
Advertisement