phone
-
కాలం చెల్లిన చైనా ‘చేప కథ’
ఏ శాస్త్రంలోని నూతన ఆవిష్కరణ అయినా సామాజిక శాస్త్ర పర్యావరణ గీటురాయి మీద దాని మానవీయ విలువను నిర్ధారించుకోక తప్పదు. 2004 డిసెంబర్లో ‘ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ’ (ఐసీటీ) మన బడుల్లో పాఠంగా మొదలయింది. అది మొదలు గత రెండు దశాబ్దాలలో దానికి మొలకెత్తిన చిలవలు పలవలు... ఊడలు దిగిన మ్రానులైన పరిస్థితుల్లో, మన మానసిక వైఖరులు మన మానవీయ విలువలను ఎలా ప్రభావితం చేస్తున్నాయి? అన్నప్పుడు కొంచెం తేడాతో అందరం అందులో మునకలు వేయడం అయితే నిజం. మనకంటే ముందే ఈ అనుభవమున్న సంపన్న దేశాల్లో దీని పర్యవసానాలపై అధ్యయనం మొదలయింది కనుక ఈ ప్రపంచీకరణ కాలంలో ఆ కొలమానాలు మనమూ వాడుకోవచ్చు. గత పదేళ్ళలో పెరిగిన ‘సోషల్ మీడియా’ మన మీద పెంచుతున్న ఒత్తిడితో ఏర్పడిన ‘ఇన్ఫర్మేషన్ ఎకో సిస్టం’లో ఇప్పుడు మనం ఉన్నాం. అదొక నూతన పర్యావరణంగా మారి, మన ఆలోచనలు అభిప్రాయాలు అందుకు అనుగుణంగా మార్చుతూ, మూడు రంగాలలో మన జీవితాల్ని అది ప్రభావితం చేస్తున్న దని ఫిబ్రవరి 2023లో ఎవాన్ కుహెన్ ఒక వెబ్‌సైట్‌కు రాసిన ‘వాట్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ఎకో సిస్టం?’ వ్యాసంలో అంటారు. గుర్తించిన ఆ మూడింటిలో ‘సివిల్ సొసైటీ’ (పౌరసమాజం) ఒకటి. ఈ పరిశీలన వెలుగులో కొత్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ‘పౌర సమాజం’ సంగతి ఏమిటి? మన పండితులు పామ రుల అభిప్రాయాలపై ఎటువంటి ‘సమాచార’ పర్యా వరణ ప్రభావం ఉంది. ప్రభావశీలురైన ముగ్గురు ప్రముఖులు 2025 ఫిబ్రవరిలో వెలుబుచ్చిన అభిప్రా యాలలో నుంచి వాటిపై ‘సమాచార పర్యావరణ’ ప్రభావం ఏ మేర ఉందో చూద్దాం. ఫిబ్రవరి మొదటివారంలో ప్రభుత్వ కార్యదర్శులతో ఏర్పాటుచేసిన ఒక సమీక్ష సమావేశంలో ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ – ‘‘మీరు ఫిర్యాదుల పరిష్కారం మొదటి ప్రాధాన్యతగా చూడాలి, రెవెన్యూశాఖ నుంచి భూ కబ్జాలు వల్ల లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తుతున్నాయి. డాక్యుమెంట్స్ ఫోర్జరీ ఎక్కువ అయిపోయింది... వీటిని మీరు ఎలా పరిష్కరిస్తారు అనేది మీకే వదిలి పెడుతున్నాను’’ అన్నారు. ఇది విన్నాక ఈ ధోరణి మూలాలు ఎక్కడ ఎందుకు మొదలయింది వెతికితే, రాజధాని హైదరాబాద్ నుంచి విజయవాడకు మారిన 2015 తర్వాత నుంచి రాజకీయం అంటేనే ‘భూమి విలువ’ అన్నట్టుగా మారింది. ‘‘అమరావతిలో అన్నీ పోను ఎనిమిది వేల ఎకరాలు మిగులుతాయి, ఎకరం 20 కోట్లు చొప్పున అమ్మితే 160 కోట్లు వస్తాయి...’’ తరహా మాటలు అధికార కేంద్రాల నుంచి వస్తే, ‘సోషల్ మీడియా’ దానికి విస్తృత ప్రచారం ఇచ్చింది. ఇప్పుడు తెనాలి ప్రాంతానికి చెందిన ఏ.పి. ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్’ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్. మహేంద్ర దేవ్ కూడా విశాఖలో– ‘‘కొత్త రాష్ట్రానికి అమరావతి వంటి ‘గ్రీన్ ఫీల్డ్ కేపిటల్’ ఉండడం అవసరం’’ అంటూ పనిలో పనిగా –‘‘ఉచితాలు అనుచితం’’ అని కూడా అనేశారు. పోనీ అది నిజమనుకుందాం. మరి వారే ‘‘బాపట్ల సమీపాన 20 ఏళ్ళనాడు ఆగిపోయిన ‘వాన్ పిక్’ ఈ పదేళ్లలో పూర్తి అయివుంటే, ‘ఉచితాలు’ తీసుకునేవారు అవి మాని అక్కడే ఏదో ఒక ‘లేబర్’ పని చేసుకుని బతికేవారు’’ అని కూడా అనొచ్చు కదా? చివరికి ఏమైంది గత పదేళ్ళలో ‘రాజధాని’ చుట్టూ ‘సోషల్ మీడియా’ వ్యాప్తి చేసిన ‘ఇన్ఫర్మేషన్ ఎకో సిస్టం’ కింద నలిగి కేంద్ర హోంశాఖ నియమించిన శివరామకృష్ణన్ కమిషన్ నిపుణుల అభిప్రాయాలు ఇటువంటి ప్రకట నల కింద సమాధి అయ్యాయి.రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బా రావు కూడా ఇదే విశాఖ నుంచి ఉచితాలు గురించి – ‘ఫ్రీబీస్’ ఎందుకు? అంటూ ఎప్పుడో పాతదైన ‘చైనా వారి చేప’ కథ చెప్పారు. అది చైనాలో నిజమేమో. ఇక్కడ ‘చేపలు’ పట్టడం నేర్పడం కోసం పెట్టిన ‘స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం’ ఏమైందో చూశాం. అయినా – ‘ఫ్రీబీస్’ ఎందుకు? అంటే, ఈ ‘ఉచితాలు’ పొందే వారు కూడా ఏమంత సంతోషంగా ఏమీ లేరు. కారణం కళ్ళముందు సంపన్న వర్గాల వద్దకు చేరుతున్న సంపద, వారి విజయగాథలు, వైభవంగా జరిగే వారి పెళ్ళిళ్ళు, ఫ్యామిలీ ఫంక్షన్స్... వాటి గురించి ‘సోషల్ మీడియా’ కథలుగా చెబుతుంటే వింటూ, తమకు అందే అరకొరను వాళ్ళు తూకం వేస్తున్నారు. అధికార కేంద్రాలకు దగ్గరయితే, అక్రమ ఆదాయ వనరులు ఎలా పెరుగుతాయో ‘సోషల్ మీడియా’ వారికి నిత్యం కళ్ళకు కట్టిస్తున్నది.విషయం ఏమంటే, ప్రభుత్వ పరిపాలనలోకి ‘టెక్నాలజీ’ వచ్చాక, అవినీతికి చిల్లులున్న చీకటి మార్గాలు మూతపడి అదాయ వనరులకు గండి పడితే, ప్రత్యామ్నాయాన్ని ప్రకృతి వనరుల్లో వెతు క్కుంటున్నారు. అభివృద్ధి మారుమూల గ్రామాలకు ప్రవేశిస్తుంటే, బయటకు వెళుతున్న మట్టి, కంకర చూస్తున్నదే. వాటి వివరాలు ‘సోషల్ మీడియా’ 24 గంటలూ జనానికి చూపిస్తున్నది. ఈ అక్రమ లావా దేవీల చిట్టా సామాన్యుడికి అరచేతిలో ‘ఫోన్’లో దొరుకుతుంటే, ప్రభుత్వం అరాకొరా ఉచితంగా ఇచ్చే రొట్టె ముక్కను ఇవ్వాలా వద్దా? అంటూ మళ్ళీ అదే పాత చర్చ అంటే, వారి వద్ద పాండిత్యం పరిహాసం అవుతుందేమో!జాన్సన్ చోరగుడి వ్యాసకర్త అభివృద్ధి – సామాజిక అంశాల వ్యాఖ్యాత -
Uttarakhand: మంచు చరియల కిందే ఇంకా 8 మంది
ఉత్తరాఖండ్: పర్వత రాష్ట్రం ఉత్తరాఖండ్(Uttarakhand)లో భారీగా కురుస్తున్న హిమపాతం భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది. బద్రీనాథ్‌లోని మానా గ్రామం సమీపంలో సరిహద్దు రోడ్డు సంస్థ (బీఆర్ఓ) శిబిరంపై మంచు చరియలు విరిగిపడటంతో 55 మంది కార్మికులు మంచులో కూరుకుపోయారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం సంభవించింది. ఈ దరిమిలా భారత సైన్యం, రెస్క్యూ ఆపరేషన్ బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. రెస్క్యూ సిబ్బంది మంచు పెళ్లల నుంచి 47 మందిని సురక్షితంగా వెలికి తీసుకువచ్చారు. మరో ఎనిమిదిమందిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.రెండవ రోజున సహాయక చర్యలు తిరిగి ప్రారంభించిన భారత సైన్యం(Indian Army) మంచులో కూరుకుపోయిన మరో 14 మంది సిబ్బందిని రక్షించింది. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారికి వైద్య చికిత్స అందించేందుకు హెలికాప్టర్ల ద్వారా జోషిమఠ్‌కు తరలించామని అధికారులు తెలిపారు. ఇంకా మంచులోనే కూరుకుపోయిన సిబ్బందిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. నిన్న(శుక్రవారం) రాత్రి చీకటి పడ్డాక సహాయక చర్యలను నిలిపివేశారు.హిమపాత మరింతగా పెరగడంతో మంచులో కూరుకుపోయిన కార్మికులను కనుగొనడం రెస్క్యూ సిబ్బంది(Rescue crew)కి సవాలుగా మారింది. మొదటి రోజున రెస్క్యూ బృందాలు 33 మంది కార్మికులను రక్షించగలిగాయి. ఈ ప్రాంతంలో ఏడు అడుగుల మేరకు మంచు పేరుకుపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నదని ఉత్తరాఖండ్ విపత్తు నిర్వహణ కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్ తెలిపారు. ఇండో-టిబెట్ సరిహద్దులోని చివరి గ్రామమైన మానా వద్ద మంచును తొలగించే పనిలో నిమగ్నమైన 55 మంది కార్మికులు మంచులో కూరుకుపోయారు.సీఎంతో మాట్లాడిన ప్రధాని మోదీ ఉత్తరాఖండ్ మంచు చరియల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న ముఖ్యమంత్రి పుష్కర్ ధామి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. తాజాగా ఘటనా స్థలంలో కొనసాగుతున్న పనుల గురించి తెలుసుకునేందుకు సీఎం దామికి ప్రధాని మోదీ ఫోన్ చేశారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు.ఇది కూడా చదవండి: తప్పుడు స్పెల్లింగ్‌తో పట్టాలు.. లక్షల విద్యార్థులు లబోదిబో -
మా పెళ్లిని సింపుల్‌గా చేసుకోవడానికి కారణం అదే: రకుల్ ప్రీత్ సింగ్
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు, నిర్మాత అయిన జాకీ భగ్నానీని పెళ్లాడింది ముద్దుగుమ్మ. గతేడాది ఫిబ్రవరి 2024లో గోవాలో ఓ ప్రైవేట్ వేడుకలో వీరి పెళ్లి వేడుక జరిగింది. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌లో సన్నిహితులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు పాల్గొన్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రకుల్ ప్రీత్ సింగ్ ఆసక్తికర విషయాలు పంచుకుంది. ముఖ్యంగా తన పెళ్లికి సంబంధించిన మధురమైన జ్ఞాపకాలను షేర్ చేసుకుంది. మీ పెళ్లిని ఎందుకు ప్రైవేట్‌గా ఉంచారన్న ప్రశ్నపై రకుల్ స్పందించింది.రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ..'మేము ఎల్లప్పుడూ చాలా సింపుల్‌గా ఉండాలని కోరుకుంటా. మేము సౌకర్యంగానే ఉండటానికి ఇష్టపడతాం.. కానీ ఎక్కువ లగ్జరీగా ఉండాలని ఎప్పుడూ కోరుకోలేదు. అన్నిటికంటే ఎక్కువగా ఆ మధురమైన క్షణాలు, సంతోషంగా ఉండేందుకే ఎక్కువ విలువ ఇస్తాం. అందుకే మా పెళ్లిని అతిథులతో కలిసి ఆస్వాదించాలనుకున్నాం. ఆ మూడు రోజులు మా జీవితంలో గుర్తుండిపోవాలని ఆశించాం. అందువల్లే నో-ఫోన్ పాలసీ పెట్టాం. అంతే తప్ప ఫోటోలు లీక్ చేస్తారని కాదు. మా పెళ్లి చిత్రాలను మేమే మొదట బయట పెట్టాలకున్నాం. అలాగే పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశాం. నా పెళ్లి దుస్తుల్లో కూడా డ్యాన్స్ చేశాను.' అని తెలిపింది. కాగా.. రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం మేరే హస్బెండ్ కి బివి చిత్రంలో కనిపించనుంది. ఈ చిత్రంలో అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్ నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 22న విడుదల కానుంది. -
ఫోన్ సరిగ్గా ఛార్జింగ్ పెట్టడం తెలుసా..?
స్మార్ట్‌ఫోన్‌ను సరిగ్గా ఛార్జింగ్ చేయడం తెలుసా అంటే మీరేంమంటారు.. ‘ఇదేం ప్రశ్న..? సాధారణంగా ఛార్జింగ్ కేబుల్‌తో ఛార్జ్ పెడితే సరి’ అనుకుంటారు కదా. కానీ సరైన సమయంలో, సరైన విధంగా స్మార్ట్‌ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టకపోతే బ్యాటరీ పాడయ్యే అవకాశం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ఫోన్‌కు ఛార్జింగ్ పెడుతున్నప్పుడు ఎలాంటి అంశాలు గమనించాలో తెలుసుకుందాం.ఇతర ఛార్జర్లను ఉపయోగించడంప్రతిఫోన్కు ప్రత్యేకంగా కంపెనీ ఛార్జర్ తయారు చేస్తుంది. ప్రతిసారి ఆ ఛార్జర్‌తోనే ఛార్జ్ చేయాలి. లేదంటే ఫోన్ పాడవుతుంది. పొంతన లేని ఛార్జర్లు కరెంట్ వోల్టేజ్‌ను కొన్నిసార్లు అధికంగా, ఇంకొన్నిసార్లు తక్కువగా సరఫరా చేస్తాయి. ఇది బ్యాటరీని దెబ్బతీస్తుంది. కాబట్టి సర్టిఫైడ్ ఛార్జర్లను వినియోగించాలి.రాత్రంతా ఛార్జింగ్చాలామందికి లేట్‌నైట్ వరకు ఫోన్ ఉపయోగించి ఛార్జ్ చేసి పడుకోవడం అలవాటు. రాత్రంతా కరెంట్ సరఫరా అవ్వడంతో ఓవర్ ఛార్జింగ్ అవుతుంది. దాంతో బ్యాటరీ బల్జ్ అయ్యేందుకు దారితీస్తుంది.ఛార్జింగ్ చేస్తూ ఫోన్ వాడడంఛార్జింగ్ చేసినప్పుడు ఎట్టిపరిస్థితిలో ఫోన్ వాడకూడదు. తప్పని పరిస్థితిలో వాడాల్సి వస్తే ఛార్జింగ్ రిమూవ్ చేసి వాడుకోవాలి. ఇది చాలా సాధారణ విషయంగా కనిపించినా ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం ఇబ్బంది పడాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి.సాఫ్ట్వేర్ అప్డేట్లను విస్మరించడంఆపరేటింగ్ సిస్టమ్ సర్వీసు అందిస్తున్న కంపెనీలు, మొబైల్ తయారీ కంపెనీ నిత్యం వాటి సాఫ్ట్‌వేర్‌లో అప్డేట్లను అందిస్తాయి. క్రమం తప్పకుండా వాటిని అప్డేట్ చేసుకోవాలి. బ్యాటరీ, ఛార్జింగ్ సమస్యలకు సంబంధించిన అప్డేట్లను కంపెనీ అందిస్తే వెంటనే సమస్యలు పరిష్కారం అవుతాయి.0% నుంచి 100% వరకుఫోన్ వాడుతున్నప్పుడు మొత్తం ఛార్జింగ్ అయిపోయేంత వరకు చూడకుండా సుమారు 40 శాతం బ్యాటరీ ఉన్నప్పుడే ఛార్జ్ పెట్టాలి. తరచుగా 0% నుంచి 100% వరకు ఛార్జింగ్ చేయడం వల్ల బ్యాటరీపై అనవసరమైన ఒత్తిడి పడుతుంది.చలి, వేడికి దగ్గరగా..విపరీతమైన వేడి, చలి రెండూ ఫోన్ బ్యాటరీని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. ఫోన్‌ను నేరుగా వేడి ప్రదేశంలో ఛార్జ్ చేయడం లేదా ఎండలో వదిలివేయడం చేయకూడదు. అదేవిధంగా, చాలా చల్లని వాతావరణంలో ఛార్జింగ్ చేయడం కూడా బ్యాటరీకి హాని కలిగిస్తుంది.దెబ్బతిన్న కేబుల్‌తో ఛార్జింగ్పగిలిన లేదా దెబ్బతిన్న, అతుకులున్న ఛార్జింగ్ కేబుల్స్ వాడకూడదు. ఇవి అస్థిరమైన ఛార్జింగ్, షార్ట్ సర్క్యూట్లకు కారణమవుతాయి. కొన్నిసార్లు అగ్ని ప్రమాదాన్ని కలిగిస్తాయి.ఇదీ చదవండి: టెల్కోల ఆశలన్నీ ప్రభుత్వం పైనే!ఛార్జింగ్ పోర్ట్‌ను శుభ్రం చేయకపోవడంఫోన్ ఛార్జింగ్ పోర్ట్‌లో దుమ్ము పేరుకుపోతూంటుంది. ఇది పేలవమైన కనెక్షన్, ఛార్జింగ్ సమస్యలకు దారితీస్తుంది. మృదువైన బ్రష్ లేదా కంప్రెస్డ్ ఎయిర్ ఉపయోగించి పోర్ట్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. -
ఫోన్ కట్ చేసిన పవన్! నేను మాట్లాడను
-
వాట్సాప్‌లో మునిగిపోవడం వల్లే ఘోరం!
తిరువనంతపురం: కేరళ కన్నూరు స్కూల్ బస్సు ప్రమాదం ఘటనలో విస్తుపోయే విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. సరిగ్గా ప్రమాదం జరిగిన సమయంలోనే.. డ్రైవర్ ఫోన్ నుంచి వాట్సాప్ స్టేటస్ అప్లోడ్ అయ్యి ఉంది. దీంతో డ్రైవర్ ఫోన్లో మునిగిపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.కన్నూరు జిల్లా వలక్కై శ్రీస్కంధపురం వద్ద బుధవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేట్ స్కూల్‌కు చెందిన బస్సు ఒకటి బోల్తాపడడంతో ఓ చిన్నారి మృతి చెందగా, 15 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం ధాటికి బస్సు కిటీకిలోంచి చిన్నారి బయట ఎగిరిపడగా.. ఆ వెంటనే బస్సు ఆమె మీద పడడంతో చిధ్రమయ్యింది. కలవరపరిచే ఆ దృశ్యాలు సోషల్ మీడియాకు చేరాయి.#Kerala : A tragic accident occurred in Valakkai, Sreekantapuram, #Kannur, when a school bus belonging to Chinmaya School overturned, claiming the life of an 11-year-old student and injuring 13 others.The deceased, Nedya S Rajesh, a Class 5 student, lost her life after falling… pic.twitter.com/csNHtZAiv3— South First (@TheSouthfirst) January 1, 2025అయితే నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ వాదనను డ్రైవర్ నిజాం తోసిపుచ్చాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతను.. తాను బస్సు నడుపుతూ ఫోన్ వాడలేదని.. ఎలాంటి వాట్సాప్ స్టేటస్(Whatsapp Status) అప్లోడ్ చేయలేదని.. బహుశా ఫోన్ టచ్ అయ్యి అలా జరిగి ఉంటుందని చెబుతున్నాడు. అంతేకాదు బస్సు బ్రేకులు పడకపోవం వల్లే యాక్సిడెంట్ జరిగిందని అంటున్నాడతను. అయితే.. యాక్సిడెంట్ టైంకే డ్రైవర్ వాట్సాప్ స్టేటస్ అప్లోడ్ అయిన విషయాన్ని స్థానిక చానెల్స్ ప్రముఖంగా ప్రసారం చేస్తున్నాయి.ఇక బస్సును పరిశీలించిన మోటార్ వెహికిల్స్ డిపార్ట్మెంట్ అధికారులు ఆ డ్రైవర్ వాదనను కొట్టిపాస్తున్నారు. బ్రేకులు కండిషన్లోనే ఉన్నాయని చెబుతున్నారు. అలాగే బస్సు ఫిట్నెస్ సర్టిఫికెట్ కిందటి నెల డిసెంబర్ 29తో ముగియగా.. తిరిగి ఈ ఏడాది ఏప్రిల్ దాకా రెన్యువల్ అయినట్లు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం(Driver Negligence) వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. మరోవైపు..స్థానికులు మాత్రం సర్వీస్ రోడ్డు నుంచి మెయిన్ రోడ్డుకు వెళ్లే ప్రమాదకరమైన మలుపు కారణంగానే ఈ ఘోరం జరిగిందని, తరచూ ఇక్కడ పలు ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతుండడం గమనార్హం.అప్పటికే ఆలస్యమైంది..శ్రీస్కంధపురం స్కూల్ బస్సు ప్రమాదం(School Bus Accident)లో చనిపోయిన స్టూడెంట్ను ఐదో తరగతి చదువుతున్న నెద్యా రాజేష్(11)గా గుర్తించారు. ప్రమాదం జరిగిన తర్వాత అక్కడికి చేరుకున్న స్థానికులు పిల్లలను బయటికి తీసుకొచ్చి ఆస్పత్రికి తరలించారు. అయితే.. బస్సు కింద నలిగిపోయిన నెద్యాను మాత్రం కాస్త ఆలస్యంగా గుర్తించినట్లు చెబుతున్నారు వాళ్లు.‘‘పెద్ద శబ్దం రాగానే ఇక్కడున్న కొందరం పరిగెత్తాం. బోల్తా పడ్డ బస్సులోంచి పిల్లల రోదనలు వినిపించాయి. వాళ్లను బయటకు తీసి నీళ్లు తాగించాం. డ్రైవర్ సహా పిల్లల్లో కొందరికి గట్టి దెబ్బలే తగలడంతో వెంటనే ఆస్పత్రికి తరలించాం. కానీ, ఓ అమ్మాయి బస్సు కిందే ఉందన్న విషయం కాసేపటికి తెలిసింది. ఆమెను బయటకు తీసేసరికి బాగా రక్తం పోయి స్పృహ లేకుండా ఉంది. ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది’’ అని స్థానికుడొకరు తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 15 మందికి చికిత్స అందుతుండగా.. ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
పీఎస్‌కు వచ్చిన వివాహితను ట్రాప్ చేసిన సీఐ.. ప్లాట్ కొనిస్తా అంటూ..
నల్లగొండ క్రైం: తన భార్యతో నల్లగొండ పట్టణ టూటౌన్ సీఐ డానియల్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఓ వ్యక్తి ఎస్పీ శరత్చంద్ర పవార్‌కు శనివారం ఫిర్యాదు చేశాడు. సదరు సీఐ తన భార్యతో కాపురం చేయనీయకుండా మనోవేధనకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఫిర్యాదు విషయాన్ని బాధితుడు విలేకరులకు తెలిపాడు. వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణానికి చెందిన దంపతులు వారి సొంత ఇంటిని విక్రయించుకున్నారు. దానికి సంబంధించిన దస్తావేజులు తీసుకునేందుకు పట్టణంలో ఓ బ్యాంకు వెళ్లారు. ఆ తర్వాత భార్య పట్టణంలోని టూటౌన్ సీఐ వద్దకు వెళ్లి తనపై పలు ఆరోపణలతో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో సీఐ డానియల్ ఆమెతో చనువు పెంచుకుని తన భార్యకు తరచూ ఫోన్, చాటింగ్ చేస్తూ.. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని బాధితుడు తెలిపాడు. తనను పదేపదే స్టేషన్‌కు పిలిపించి బెదిరించారని.. ఊళ్లో ఉన్న పొలం అమ్ముకుని వస్తే కేసులు తీసివేస్తామని, భార్యతో విడాకులు ఇప్పిస్తానని వేధించాడని పేర్కొన్నాడు.తన భార్యకు ప్లాటు కొనిస్తానని, డబ్బులు ఇస్తానని నమ్మబలికి లోబరుచుకున్నాడని ఆరోపించాడు. తన భార్య సెల్‌ఫోన్ తనిఖీ చేయగా సీఐతో చాటింగ్‌లు చేసిన విషయం తెలిసిందని.. ఈ చాటింగ్ తదితర ఆధారాలతో ఎస్పీకి ఫిర్యాదు చేశానని బాధితుడు తెలిపాడు. తన భార్య, సీఐతో తనకు ప్రాణహాని ఉందని పేర్కొన్నాడు. కాగా.. ఈ ఘటనపై సీఐ డానియల్ స్పందిస్తూ తనపై చేసిన ఫిర్యాదులో వాస్తవం లేదని తెలిపారు. భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా తనపై నిందలు వేస్తున్నారని పేర్కొన్నారు.ఫిర్యాదుపై విచారణ చేస్తున్నాం– ఎస్పీ శరత్చంద్ర పవార్సీఐపై వచ్చిన ఫిర్యాదుపై నల్లగొండ డీఎస్పీ విచారణ చేస్తున్నారని, ఫోన్ చాటింగ్ పరిశీలిస్తున్నామని ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. డీఎస్పీ నివేదిక ఆధారంగా సీఐపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
చెత్తకుప్పలో దొరికిన ఆ సెల్‌ఫోన్ ఎవరిది?
నేలకొండపల్లి: నేలకొండపల్లిలో గత మంగళవారం రాత్రి దంపతులు ఎర్రా వెంకటరమణ – కృష్ణకుమారి హత్యకు గురైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపగా.. ప్రత్యేక పోలీసు బృందాల విచారణ కొనసాగుతోంది. అయితే, ఇప్పటివరకు మిస్టరీ వీడకపోగా శుక్రవారం కీలక ఆధారంగా భావిస్తున్న సెల్‌ఫోన్ పోలీసుల చేతికి చిక్కినట్లు సమాచారం. ఈ ఫోన్ కాల్ డేటాతో పాటు ఫోన్ లభించిన ప్రాంతానికి సమీపాన ఉన్న షాపు నుంచి సీసీ కెమెరాల పుటేజీ సేకరించడంతో దర్యాప్తులో అడుగు ముందుకు పడినట్లు భావిస్తున్నారు.చెత్త కుప్పలో ఫోన్నేలకొండపల్లిలో పెట్రోల్ బంక్ ఎదురుగా గ్రామపంచాయతీ స్వీపర్ శుక్రవారం ఉదయం చెత్త తొలగిస్తుండగా ఓ చోట సెల్‌ఫోన్ లభించింది. దీంతో ఆమె స్థానిక పోలీసులకు అప్పగించింది. ఈ విషయం తెలియగానే ప్రత్యేక బృందాలు సైతం సదరు స్వీపర్ ఇంటికి సైతం వెళ్లి విచారించారు. అంతేకాక సెల్‌ఫోన్ దొరికిన ప్రాంతంలో ఓ దుకాణం నుంచి సీసీ కెమెరాల పుటేజీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్ నిందితులు పారిపోయే క్రమంలో కింద పడిందా, లేక మృతుల ఫోన్‌ను తీసుకెళ్లే క్రమాన వదిలేశారా అనే విషయాన్ని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తుండగా స్పష్టత ఇవ్వడం లేదు. హంతకుల ఫోన్ అయితే హత్య జరిగిన రోజే లభించేదని, రెండు రోజుల తర్వాత దొరకడంతో నిందితులు మళ్లీ ఇక్కడకు వచ్చి, వెళ్లారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈనేపథ్యాన సెల్‌ఫోన్ కాల్‌డేటా, సీపీ కెమెరాల పుటేజీ ఆధారంగా దర్యాప్తులో వేగం పెంచినట్లు పోలీసువర్గాల ద్వారా తెలిసింది. ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి, కూసుమంచి సీఐ సంజీవ్‌తో పాటు వివిధ పోలీస్స్టేషన్ల ఎస్సైలు శుక్రవారం సైతం మండల కేంద్రంలో పర్యటించి పలువురు అనుమానితులను విచారించినట్లు సమాచారం. ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా సెల్‌ఫోన్ దొరికిన మాట వాస్తవమేనని చెప్పినా ఇతర వివరాలు వెల్లడించేందుకు మాత్రం నిరాకరించారు. -
ఒళ్లో వేసుకుంటే ఫోన్ ఛార్జింగ్!
ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందంటే ఛార్జర్ కోసం వెతకాల్సిన పనిలేదు. అదేంటి ఛార్జర్ లేకుండా ఫోన్ ఎలా ఛార్జ్ అవుతుందనేగా మీ అనుమానం.. సింపుల్.. ఫోన్‌ను మీ ఒళ్లో పెట్టుకోండి. వెంటనే ఛార్జింగ్ అవుతుంది. అవునండి.. మీరు విన్నది నిజమే. ఇదో కొత్తరకం టెక్నాలజీ. థెర్మో ఎలక్ట్రిక్ టెక్స్టైల్స్ అనే టెక్నాలజీతో ఇది సాధ్యమేనని శాస్త్రవేత్తలు తెలియజేశారు. ఈమేరకు స్వీడన్‌లోని ఛామర్స్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని నిరూపించారు.థెర్మో ఎలక్ట్రిక్ టెక్స్టైల్స్ సాంకేతిక ద్వారా మనం ధరించే దుస్తుల్లోని సిల్క్ దారాలను ఉపయోగించి విద్యుత్తును తయారు చేస్తున్నారు. ఆ సిల్క్ దారాలకు కండక్టివ్ ప్లాస్టిక్ అనే లోహాన్ని పూయడం ద్వారా బ్యాటరీ లేకుండానే విద్యుత్తుని ఉత్పత్తి చేయొచ్చని నిరూపించారు. ఈ టెక్నాలజీ ద్వారా బయటి వాతావరణం, శరీర ఉష్ణోగ్రత వ్యత్యాసాల నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ టెక్నాలజీను విభిన్న పరిస్థితుల్లో పరీక్షించి, మరింత మెరుగ్గా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.ఉపయోగాలెన్నో..సంప్రదాయ బ్యాటరీలు లేకుండా చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్యాటరీ అవసరంలేని సెన్సార్ల వంటి వాటికి ఈ సాంకేతికతతో విద్యుత్‌ను సరఫరా చేయవచ్చని చెబుతున్నారు. కొన్ని సంస్థలు వినియోగదారుల హృదయ స్పందనలను ట్రాక్ చేయడానికి, ఆరోగ్య కొలమానాలను పర్యవేక్షించడానికి టెక్స్టైల్ సెన్సార్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. వాటికి ఈ థెర్మో ఎలక్ట్రిక్ టెక్స్టైల్స్ ద్వారా ఎనర్జీని అందించవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ఆర్మీ ఉద్యోగులకూ, విద్యుత్ సదుపాయం లేని ప్రాంతాల్లో ఉండేవారికీ ఉపయోగపడేలా ఈ దుస్తుల్ని రూపొందిస్తున్నారు.ఇదీ చదవండి: క్షీణిస్తున్న ఫారెక్స్ నిల్వలు.. కారణాలుఏ ప్రమాదం లేదు..అసలే కరెంటుతో వ్యవహారం.. అలాంటిది మనం ఎలక్ట్రిక్ టెక్స్టైల్స్ ధరించొచ్చా అనే సందేహం అవసరం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటితో మానవులకు ఎలాంటి హాని ఉండదంటున్నారు. ఈ ప్రక్రియతో ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సైతం తగ్గించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అమెరికా వ్యాప్తంగా... జాత్యహంకార మెసేజ్‌లు
వాషింగ్టన్: జాత్యాహంకార సందేశాలు అమెరికాలో ఆందోళన రేపుతున్నాయి. మిడిల్ స్కూల్ విద్యార్థులతో పాటు నల్లజాతీయులనే లక్ష్యంగా చేసుకుని బెదిరింపు ఫోన్ సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. న్యూయార్క్, అలబామా, కాలిఫోర్నియా, ఒహాయో, పెన్సిల్వేనియా, టెనెసీ వంటి పలు రాష్ట్రాల్లో ఈ ఉదంతాలపై కేసులు నమోదయ్యాయి. సందేశాల్లో వాడిన పదాలు భిన్నంగా ఉన్నా బెదిరింపులు మాత్రం ఒకేలా ఉన్నాయని బాధితులు చెబుతున్నారు. కొందరిని స్వస్థలం చిరునామా చెప్పాలంటూ బెదిరించగా మరికొందరిని రాబోయే అధ్యక్ష పాలన గురించి హెచ్చరించారు. ఈ సందేశాలపై న్యాయ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ఎఫ్‌బీఐ తెలిపింది. ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్, ఫెడరల్, స్టేట్ లా ఎన్ఫోర్స్మెంట్తో కలిసి దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. ఒహాయో అటార్నీ జనరల్ కార్యాలయం కూడా ఈ విషయాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. కించపరిచే వ్యాఖ్యలు పోలింగ్ జరిగిన గత బుధవారం సాయంత్రం తన 16 ఏళ్ల కుమార్తె ఫోన్‌కు సందేశం వచి్చనట్టు కాలిఫోరి్నయాలోని లోడీకి చెందిన తాషా డన్హామ్ చెప్పారు. ‘‘నా కూతురిని తక్షణం నార్త్ కరోలినాలోని ఒక తోటకు రావాలని ఆదేశించారు. ఆరా తీస్తే అక్కడో మ్యూజియం ఉంది’’అని తెలిపారు. ఈ పరిణామాలు తమను కలవరపరుస్తున్నాయన్నారు. పెన్సిల్వేనియాలోని మాంట్గోమెరీ కౌంటీలో ఆరుగురు మిడిల్ స్కూల్ విద్యార్థులకు కూడా ఇలాంటి సందేశాలే అందాయి. దక్షిణ కరోలినాలోని క్లెమ్సన్, అలబామా వంటి పలు విశ్వవిద్యాలయాల విద్యార్థులు తమకూ ఇలాంటి సందేశాలు వచి్చనట్టు చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూ టెనెసీలోని నాష్‌విల్లేలో ఉన్న చరిత్రాత్మక నల్లజాతి విశ్వవిద్యాలయం ఫిస్క్ ప్రకటన విడుదల చేసింది. కొంతమంది విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్న ఈ సందేశాలు తీవ్రంగా కలవరపెడుతున్నాయని తెలిపింది. మిస్సోరీ స్టేట్ వర్సిటీ చాప్టర్లో సభ్యులుగా ఉన్న నల్లజాతి విద్యార్థులకు కూడా సందేశాలు వచ్చాయి. వాటిలో ట్రంప్ గెలుపును ప్రస్తావించారు. నల్లజాతి విద్యార్థులను పత్తి ఏరడానికి ఎంపిక చేశారంటూ అందులో పేర్కొన్నారని మిస్సోరి ఎన్ఏఏసీపీ అధ్యక్షుడు నిమ్రోద్ చాపెల్ చెప్పారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఈ సందేశాల వెనుక ఎవరున్నారో ఇంకా తెలియలేదని లాయర్స్ కమిటీ ఫర్ సివిల్ రైట్స్ అండర్ లా డిజిటల్ జస్టిస్ ఇనిషియేటివ్ డైరెక్టర్ డేవిడ్ బ్రాడీ తెలిపారు. మేరీలాండ్, ఓక్లహామా వంటి 10కి పైగా రాష్ట్రాలతో పాటు డీసీలోనూ ఇలాంటి ఈ ఉదంతాలు చోటుచేసుకున్నట్టు అంచనా వేశారు. దీనిపై తమ ఇంటెలిజెన్స్ విభాగం దర్యాప్తు చేస్తోందని పోలీసులు తెలిపారు. ఈ విద్వేష ఘటనలపై పలు పౌర హక్కుల చట్టాలను వర్తింపజేయవచ్చని బ్రాడీ చెప్పారు. సదరన్ పావర్టీ లా సెంటర్ ప్రెసిడెంట్, సీఈఓ మార్గరెట్ హువాంగ్ సహా పలు ఇతర పౌర హక్కుల సంస్థల నేతలు ఈ సందేశాలను ఖండించారు. ‘‘విద్వేషాలకు అమెరికాలో స్థానం లేదు. 2024లోనూ బానిసత్వ ప్రస్తావనలు తీవ్రంగా కలవరపరుస్తున్నాయి. నల్లజాతి అమెరికన్ల జీవితాలు ప్రమాదంలో పడ్డాయి’’అని ఎన్ఏఏసీపీ అధ్యక్షుడు, సీఈఓ డెరిక్ జాన్సన్ ఆందోలన వెలిబుచ్చారు. -
జత్వానీ ఫోన్, ల్యాప్‌టాప్‌ను ఎఫ్ఎస్ఎల్కు పంపండి
సాక్షి, అమరావతి: తన ఫిర్యాదు ఆధారంగా సినీ నటి జత్వానీపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె నుంచి స్వాదీనం చేసుకున్న మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, ఐపాడ్లను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్)కు పంపి పూర్తి స్థాయిలో విశ్లేíÙంచి, సీల్డ్ కవర్లో నివేదిక ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ వ్యాపారవేత్త కుక్కల విద్యాసాగర్ హైకోర్టులో మంగళవారం ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు.. దీనిపై లోతుగా విచారణ జరుపుతామని తెలిపింది. ఇప్పుడు అంత సమయం లేనందున విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. అప్పటివరకు జత్వానీ ఫోన్లు, ఉపకరణాల్లో డేటా భద్రపరచాలంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప మంగళవారం ఉత్తర్వులిచ్చారు. విద్యాసాగర్ తరఫున టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. జత్వానీ ఫోన్, ఇతర ఎల్రక్టానిక్ ఉపకరణాలను తిరిగి ఆమెకిచ్చేందుకు పోలీసులు సిద్ధపడుతున్నారని తెలిపారు. వాటిలో చాలా కీలక సమాచారం ఉన్నందున ఎఫ్ఎస్ఎల్కు పంపి పూర్తిస్థాయిలో విశ్లేషణ చేయించి, ఆ నివేదికను సీల్డ్ కవర్లో కోర్టు ముందుంచేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ దమ్మాలపాటి ఈ అనుబంధ పిటిషన్‌ను వ్యతిరేకించారు. వాటిలోని డేటాను భద్రపరచాలని హైకోర్టు ఇప్పటికే పోలీసులను ఆదేశించిందన్నారు. అనుబంధ పిటిషన్ ద్వారా ఈ ఉత్తర్వులను సవరించాలని కోరుతున్నారని తెలిపారు.రిమాండ్‌పై పిటిషన్ విచారణ కూడా 16కి వాయిదా జత్వానీ ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో తనను రిమాండ్‌కు పంపుతూ కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ విద్యాసాగర్ దాఖలు చేసిన వ్యాజ్యంలో కూడా న్యాయమూర్తి తదుపరి విచారణను జస్టిస్ జ్యోతిర్మయి ఈ నెల 16కి వాయిదా వేశారు. విద్యాసాగర్‌ను కస్టడీకి ఇవ్వాలంటూ విజయవాడ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించాలని కోర్టును పట్టుపట్టవద్దంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను 16 వరకు పొడిగించారు. కాంతిరాణా, గున్నీ పిటిషన్లపై విచారణ వాయిదా సినీ నటి కాదంబరీ జత్వానీ ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పోలీసు అధికారులు కాంతి రాణా, విశాల్ గున్నీ, హనుమంతరావు, సత్యనారాయణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై తదుపరి విచారణ ఈ నెల 3కి వాయిదా పడింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, ఇదే వ్యవహారంలో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లుకు హైకోర్టు తాత్కాలిక ఊరటనిచ్చింది. ఆయనపై ఈ నెల 3వ తేదీ వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్ కృపాసాగర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
నెతన్యాహుతో మాట్లాడిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో ఫోన్లో సంభాషించారు. పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై ఆయన చర్చించారు. ప్రస్తుత ప్రపంచంలోనే ఉగ్రవాదానికి చోటులేదని తేల్చిచెప్పారు. ప్రాంతీయ ఉద్రిక్తతలను నివారించడం ఎంతో అవసరమని నొక్కిచెప్పారు. అదే సమయంలో బందీలందరినీ సురక్షితంగా విడుదలయ్యేలా చూడాలన్నారు. పశ్చిమాసియాలో సాధ్యమైనంత త్వరగా శాంతి, సుస్థిరతలను నెలకొల్పే ప్రయత్నాలకు భారత్ మద్దతుగా నిలుస్తుందని నెతన్యాహూకు హామీ ఇచ్చినట్లు ప్రధాని మోదీ ‘ఎక్స్’లో తెలిపారు. అయితే, ప్రత్యేకంగా ఏ సంఘటననూ ప్రధాని మోదీ ప్రస్తావించలేదు. -
ఫ్రాన్స్ స్కూళ్లలో ఫోన్లు స్విచ్ఛాఫ్
పారిస్: సెల్‌ఫోన్.. ప్రపంచమంతటా కేవలం పెద్దలకే కాదు, పిల్లలకు సైతం వ్యసనంగా మారిన సమాచార సాధనం. ఫోన్ చేతిలో లేకుండా ఒక్క క్షణం కూడా గడవని పరిస్థితి. హెల్‌ఫోన్ మారిన సెల్‌ఫోన్ పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలను దెబ్బతీస్తున్నట్లు పలు అధ్యయనాల్లో గుర్తించారు. అంతేకాదు ఆధునిక యుగంలో ఎన్నో నేరాలకు ఫోన్లు కారణమవుతున్నాయి. ఈ జాడ్యాన్ని వదిలించడానికి ఫ్రాన్స్ ప్రభుత్వం నడుం కట్టింది. వచ్చే ఏడాది నుంచి పిల్లలు పాఠశాలలో ఉన్నప్పుడు ఫోన్లు వాడకుండా పూర్తి నిషేధం విధించబోతోంది. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా 50 వేల మందికిపైగా విద్యార్థులకు ఫోన్లు నిషేధిస్తూ ఉత్తర్వు తీసుకొచి్చంది. ఇది ఇప్పటికే అమల్లోకి వచి్చంది. ఫ్రెంచ్ మిడిల్ స్కూళ్లలో చదువుతున్న 11 ఏళ్ల నుంచి 15 ఏళ్ల విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో ఉన్నంతసేపు ఫోన్లు పూర్తిగా స్విచ్ఛాఫ్ చేయాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించింది. ఈ కార్యక్రమానికి ‘డిజిటల్ విరామం’ అని నామకరణం చేసింది. ఫోన్ల తెరల ముందు విద్యార్థులు సాధ్యమైనంత తక్కువ సమయం గడిపేలా చేస్తే వారిలో కొత్త విషయాలు నేర్చుకొనే సామర్థ్యం పెరుగుతుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మానుయేల్ మాక్రాన్ చెబుతున్నారు. ఫ్రాన్స్‌లోని నర్సరీలు, ఎలిమెంటరీ స్కూళ్లలో మొబైల్ ఫోన్లతోపాటు ఇతర ఎల్రక్టానిక్ కమ్యూనికేషన్ పరికరాల వినియోగంపై 2018 నుంచే నిషేధం అమల్లో ఉంది. ఉన్నత పాఠశాలల్లో చదువుకొనే 15 నుంచి 18 ఏళ్ల పిల్లలు తరగతి గదిలో ఫోన్ వాడకుండా నిషేధించారు. అయితే, వారు ఫోన్లు తప్పనిసరిగా స్విచ్ఛాఫ్ చేయాలన్న నిబంధన లేదు. -
రూ.15 వేలలోపు కొన్ని పాపులర్ 5జీ ఫోన్లు (ఫొటోలు)
-
ఐఫోన్, ఐప్యాడ్ వాడుతున్నారా ..? హై రిస్క్ వార్నింగ్..!
-
టెక్కీ: జైలుకైనా పంపండి.. ఇంటికి మాత్రం వెళ్లను!
దొడ్డబళ్లాపురం: బెంగళూరులో గత 12 రోజులుగా కనబడకుండా పోయిన టెక్కీ విపిన్ గుప్తా ఢిల్లీ వద్ద నోయిడాలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కొడిగేహళ్లి పోలీసులు నోయిడాకు వెళ్లి అతనిని తీసుకువచ్చారు. మాన్యతా టెక్‌పార్క్ కంపెనీలో ఐటీ ఇంజినీర్‌గా పనిచేస్తున్న విపిన్ గుప్తా, భార్య పిల్లలతో కలిసి స్థానికంగా నివసిస్తున్నాడు. 4వ తేదీన కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంట్లో చెప్పకుండా తన కవాసకి బైక్‌లో వెళ్లిపోయాడు. గంట తరువాత బ్యాంకు ఖాతా నుంచి రూ.1.80 లక్షలు డ్రా అయ్యాయి. ఫోన్ కూడా స్విచాఫ్ చేసుకున్నాడు. రెండు రోజుల తరువాత భార్య కొడిగేహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్తను వెతికిపెట్టాలని సోషల్ మీడియా ద్వారా పోలీసు శాఖకు వేడుకుంది. డబ్బుల కోసం తన భర్తను ఎవరో కిడ్నాప్ చేసారని వాపోయింది. విషయం రచ్చ కావడంతో పోలీసులు మూడు బృందాలుగా విడిపోయి గుప్త కోసం వేట ప్రారంభించగా నోయిడాలో ఉన్నట్టు గుర్తించి తీసుకువచ్చారు. కుటుంబ కలహాల కారణంగా మనశ్శాంతి కోసం ఇల్లు వదిలి వెళ్లిపోయినట్లు అతడు చెబుతున్నాడు. భార్యాభర్తల కలహం పోలీసులను పరుగులు పెట్టించింది. -
ఫోన్లో తలాక్ చెప్పాడు... ఫిక్స్ అయిపోయాడు!
రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి పని నిమిత్తం కువైట్‌కు వెళ్లి జీవిస్తున్నాడు. అయితే అతనికి పాకిస్థాన్‌కు చెందిన మహిళ పరిచయం అవ్వగా.. ఆమెను వివాహం చేసుకునేందుకు భారత్‌లోని తన భార్యకు ఫోన్ చేసి ట్రిపుల్ తలాక్ చెప్పాడు. అయితే సోమవారం అతడు జైపూర్ భారత ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కాగానే పోలీసులు అరెస్ట్ చేశారు.వివరాలు.. రాజస్థాన్‌లోని చురుకు చెందిన 35 ఏళ్ల రెహ్మాన్ కువైట్‌లో పనిచేస్తున్నాడు. అతడికి హనుమాన్‌గఢ్‌లోని భద్ర ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల ఫరీదా బానోతో 2011లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కుమార్తె, కుమారుడు ఉన్నారు. అయితే, రెహ్మాన్‌కు పాకిస్థాన్‌కు చెందిన మెహ్విష్ అనే మహిళతో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమకు దారి తీసింది.ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో రెహ్మాన్ కువైట్ నుంచి భారత్‌లో ఉంటున్న తన భార్యకు ఫోన్ ద్వారా త్రిపుల్ తలాక్ చెప్పాడు. అనంతరం సౌదీ అరేబియాలో పాక్ మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమె గత నెల టూరిస్ట్ వీసాపై చురుకు వచ్చి రెహ్మాన్ తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో మొదటి భార్య ఫరీదా బానో తన భర్త రెహ్మాన్‌పై కేసు పెట్టింది. తనను అధిక కట్నం కోసం వేధించారని, ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు తీసుకున్నారని ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఈ క్రమంలో సోమవారం కువైట్ నుంచి జైపూర్ విమానాశ్రయానికి చేరుకున్న రెహ్మాన్‌ను హనుమాన్‌ఘర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. ప్రాథమిక విచారణ అనంతరం అతడిని అరెస్ట్ చేసినట్లు హనుమాన్‌గఢ్ డిప్యూటీ ఎస్పీ రణ్వీర్ సింగ్ తెలిపారు. -
దొంగలించి పడ్డ మీఫోన్ ఎలా గుర్తించాలి...!
-
మీ ఫోన్ పోయిందా? డోంట్ వర్రీ...ఈజీగా కనిపెట్టేయండిలా..!
-
టీడీపీ అరాచకం.. తలలు పగిలినా, ఎస్పీ ఫోన్ కూడా ఎత్తలేదు.. అనిల్ కుమార్ యాదవ్ సంచలన కామెంట్స్
-
ఫోన్ బాగు చేయించలేదని యువతి ఆత్మహత్య
జైపూర్: సెల్‌ఫోన్ బాగు చేయించమని తల్లిదండ్రులను అడిగితే నిరాకరించారని ఓ యువతి ఆత్మహత్య చేసు కుంది. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వేలాల గ్రామానికి చెందిన ప్యాగ సారక్క, స్వామి దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. కూతురు సాయిషుమా (19) మంచిర్యాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఇంట్లో ఉన్న సెల్‌ఫోన్ పాడైపోవడంతో బాగు చేయించమని అడిగింది. దీంతో తరచూ సెల్‌ఫోన్ పాడు చేస్తున్నా వని తల్లి మందలించింది. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు బాగాలేవని, కొద్ది రోజుల తర్వాత బాగు చేయిస్తామని చెప్పింది. ‘అన్న అడిగితే బాగు చేయిస్తారు కానీ తాను అడిగితే మాత్రం ఏమీ చెయ్యరు’ అంటూ సాయిషుమా మనస్తాపం చెందింది. తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లిన తర్వాత ఇంట్లోనే ఉరేసుకుంది. కాసేపటి తర్వాత గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన కిందికి దించినా అప్పటికే మృతిచెందింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై నాగరాజు తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ హెడ్‌క్వార్టర్ ఎక్కడ అంటే..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మ లుపు తిరుగుతోంది. ఇది హైదరాబాద్‌లోని ఎస్ఐ బీ కార్యాలయం కేంద్రంగా సాగగా సిరిసిల్ల, వరంగల్‌లో ఎస్ఐబీ పోలీసులు కొందరు వార్ రూంలు ఏర్పాటు చేసి, ట్యాపింగ్‌కు పాల్పడ్డారు. వరంగల్‌లో ఓ నాయకుడు చెప్పిన నంబర్లు ట్యాప్ చేసినట్లుగా ఆరోపణలు వస్తుండగా అదే తరహాలో సిరిసిల్ల లోనూ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. సిరిసిల్ల కు చెందిన ఓ కీలక నేత కూడా కొన్ని నంబర్లు ఇచ్చి, స్థానిక వార్ రూం ద్వారా పలువురు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు నిర్ధారించారు. పంజగుట్ట పోలీసుల విచారణలో ఆ నాయకుడు ఎవ రు? ట్యాప్ చేయమని ఎవరెవరి నంబర్లు ఇచ్చా డు? వార్ రూం ఎక్కడ నుంచి నిర్వహించారు? అందులో ఎవరెవరు పని చేశారు? తదితర అంశాలపై విచారణ అధికారులు వివరాలు సేకరించినట్లు స మాచారం. ట్యాప్ అయిన జాబితాలోని మెజారిటీ వ్యక్తులు కాంగ్రెస్ సీనియర్లు, అందులోనూ సీఎం రేవంత్‌రెడ్డికి సన్నిహితులు కావడం గమనార్హం. వార్ రూం ఎంతకాలం నడిచిందో? గత డిసెంబర్ 4న ఎన్నికల ఫలితాలతో అప్రమత్తమైన అప్పటి సిరిసిల్ల డీఎస్పీ ప్రణీత్‌రావు సీసీ కెమెరాలు ఆపేసి, వార్ రూంలోని దాదాపు 50 హార్డ్ డిస్కులను ధ్వంసం చేసిన విషయం విధితమే. దీనిపై మార్చి 10న పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదవడం, 12న డీఎస్పీని సిరిసిల్లలో అరెస్టు చేయడం చకచకా జరిగిపోయాయి. ప్రణీత్‌రావు, ఆయన బృందం రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంగానే వార్ రూం ఏర్పాటు చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అది ఎంతకాలం నడిచింది? ఎవరెవరి కాల్స్ రికార్డ్ చేశారు? అన్న విషయాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు. వార్ రూం నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన ఎస్సై, ముగ్గురు కానిస్టేబుళ్ల ద్వారా వివరాలు సేకరించినట్లు తెలిసింది. వీరు ట్యాప్ చేసిన కాల్స్‌లో ముఖ్యమైన వాటిని కాపీ చేసి, ప్రణీత్‌రావుకు ఇచ్చేవారని సమాచారం. ప్రణీత్‌రావు ధ్వంసం చేసిన హార్డ్ డిస్కుల్లో సిరిసిల్ల కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయని సమాచారం. సిరిసిల్లకే పరిమితం కాలేదా? వార్ రూంలో పనిచేసిన సభ్యులు కేవలం సిరిసిల్ల కు మాత్రమే పరిమితం కాలేదని, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలువురు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నా రు. ముఖ్యంగా పెద్దపల్లిలో ముగ్గురు కీలక ప్రతిపక్ష నేతల అనుచరులకు చెందిన కోట్లాది రూపాయలను అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోలీసులు ఉమ్మడి జిల్లాతోపాటు, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పట్టుకున్నారు. కరీంనగర్, జగిత్యాల ప్రతిపక్ష నేతలు డబ్బులు ఖర్చు చేయకుండా వారి కున్న ఆర్థిక మూలాలను ముందే గుర్తించి, కట్టడి చేశారన్న దిశగానూ దర్యాప్తు సాగుతోంది. సూట్‌కేసు పరిమాణంలో ఉండే ట్యాపింగ్ పరికరాలను ఓ వ్యాన్‌లో పెట్టుకొని, టార్గెట్ చేసిన నాయకుడి ఇంటికి 200 మీటర్ల దూరంలో ఉంటే చాలు.. ఆయన కాల్స్ మాత్రమే కాదు, ఇంట్లోవారు, ఆ చుట్టుపక్కల వారి కాల్స్ కూడా వినే వీలుంటుంది. 2022లోనే అనుమానించిన ఎంపీ సంజయ్ 2022 మే 25వ తేదీన అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కరీంనగర్‌లోని ఓ ప్రధాన మీడియా సంస్థ విలేకరితో హిందూ ఏక్తా యాత్రపై చర్చించారు. ఆ ఫోన్ కట్ అయిన కొన్ని నిమిషాల్లోనే ఎంపీ నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు. దీంతో ఆయన అనుచరులు సదరు విలేకరే పోలీసులకు సమాచారం ఇచ్చాడంటూ వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనతోపాటు మరిన్ని సంఘటనలు గుర్తు చేసుకున్న ఎంపీ సంజయ్ తనతోపాటు తన అనుచరుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు అనుమానించారు. -
నథింగ్ ఫోన్ గురించి తెలుసా..
నథింగ్.. అంటే ఏమీలేదు అనుకోకండి. అదో ప్రతిష్టాత్మక బ్రాండ్ మొబైల్ పేరు. కంపెనీ లాంచ్ చేసినవి రెండు ఫోన్లైనా కావాల్సినంత ప్రచారం లభించింది. వన్‌ప్లస్ సహ వ్యవస్థాపకుడైన కార్ల్‌పై స్థాపించిన బ్రాండ్ ఇది. ట్రాన్సపరెంట్ లుక్‌లో లాంచ్ అయిన నథింగ్ ఫోన్ 1, 2 ఇప్పటికే మంచి మార్కులు కొట్టేశాయి. ధరే కాస్త అధికంగా ఉండడంతో చాలామంది ఆసక్తి చూపలేదు. దీంతో మిడ్ రేంజ్లో తాజాగా నథింగ్ ఫోన్ 2ఏ పేరిట ఓ ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. నథింగ్ ఫోన్ 2ఏ మూడు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ + 128జీబీ వేరియంట్ ధర రూ.23,999గా కంపెనీ నిర్ణయించింది. 8జీబీ+256జీబీ వేరియంట్ రూ.25,999గా ఉంది. 12జీబీ+ 256జీబీ వేరియంట్ ధర రూ.27,999గా పేర్కొంది. మార్చి 12 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. లాంచ్ ఆఫర్ కింద తొలిరోజు కొనుగోలు చేసేవారికి రూ.19,999కే ఈ ఫోన్‌ను అందిస్తామని కంపెనీ ప్రకటించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డు ద్వారా రూ.2వేలు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద మరో రూ.2వేలు చొప్పున తగ్గింపు పొందొచ్చు. నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. బ్లాక్, వైట్ కలర్స్‌లో లభిస్తుంది. ఫోన్ స్పెసిఫికేషన్స్.. ఆండ్రాయిడ్ 14 ఆధారిత నథింగ్ ఓఎస్ 2.5తో పనిచేస్తుంది. మూడేళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్డేట్స్, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి. 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే ఇచ్చారు. 30Hz నుంచి 120Hz రిఫ్రెష్ రేటుతో ఈ డిస్ప్లే పనిచేస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో వస్తోంది. 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంది. ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో ప్రాసెసర్‌ను అమర్చారు. వెనకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 50 ఎంపీ+ 50 ఎంపీ చొప్పున రెండు కెమెరాలు అమర్చారు. ముందువైపు 16 ఎంపీ కెమెరా ఉంది. ఈ ఫోన్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. నథింగ్ బడ్స్, నెక్ బ్యాండ్ నథింగ్ సబ్ బ్రాండ్ సీఎంఎఫ్ ఈ సందర్భంగా రెండు కొత్త ఆడియో ఉత్పత్తులను విడుదల చేసింది. సీఎంఎఫ్ బడ్స్, నెక్‌బ్యాండ్ ప్రోను తీసుకొచ్చింది. ఈ రెండూ మార్చి 6 నుంచి ఫ్లిప్‌కార్ట్, మింత్రాలో లభిస్తాయి. బడ్స్ ధరను రూ.2,499గా కంపెనీ నిర్ణయించింది. 42db నాయిస్ క్యాన్సిలేషన్‌తో ఈ బడ్స్ వస్తున్నాయి. సింగిల్ ఛార్జ్‌తో 8 గంటల పాటు పనిచేస్తాయి. ఛార్జింగ్ కేసు 35.5 గంటల బ్యాకప్ ఇస్తుంది. ఇదీ చదవండి: ఇషా అంబానీ ప్రయత్నం ఫలిస్తుందా..? నెక్‌బ్యాండ్ ప్రో ధర రూ.1999గా నిర్ణయించింది. హైబ్రిడ్ ఏఎన్సీ టెక్నాలజీ, 50db నాయిస్ క్యాన్సిలేషన్‌తో దీన్ని తీసుకొచ్చింది. ఐపీ55 వాటర్, స్వెట్, డస్ట్ రెసిస్టెన్స్‌తో వస్తోంది. సింగిల్ ఛార్జ్‌తో 37 గంటల పాటు పనిచేస్తుంది. 10 నిమిషాల ఛార్జింగ్‌తో 18 గంటల పాటు వీటిని వినియోగించుకోవచ్చని కంపెనీ పేర్కొంది. -
మొబైల్ రంగాన్ని శాసించనున్న ఏఐ..
ఫీచర్ పోన్ నుంచి స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన తర్వాత క్రమంగా కెమెరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లపై వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపారు. వారి ఊహలకు తగ్గట్టుగానే కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్‌ను ప్రవేశపెట్టాయి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. అవసరమైతేనే కొత్త ఫోన్ కొందామనే ధోరణికి వినియోగదారులు వచ్చేశారు. మడత పెట్టేందుకు వీలున్న స్మార్ట్ఫోన్లు కొంత ఆకర్షించినా.. ధర బాగా ఎక్కువ కావడంతో, కొనుగోళ్లు పరిమితంగానే ఉంటున్నాయి. ఈ క్రమంలోనే దిగ్గజ కంపెనీలు విడుదల చేస్తున్న జనరేటివ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత గల స్మార్ట్ఫోన్లు.. మళ్లీ ఈ రంగంలో భారీ మార్పులకు కారణం అవుతాయని, అమ్మకాలు పెంచేందుకు దోహద పడతాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏఐ టూల్‌కు కొద్దిగా సమాచారం అందిస్తే, మనకు ఆకర్షణీయంగా అనిపించే కంటెంట్‌ను అందించే సామర్థ్యం ఉంటుంది. గూగుల్ విడుదల చేసిన పిక్సెల్ 8 స్మార్ట్‌ఫోన్‌లోని అల్గారిథమ్ వల్ల బృందంలోని సభ్యుల ముఖ కవళికల్లో ఆకర్షణీయంగా ఉన్న వాటిని కెమెరా ఒడిసి పట్టుకుని ప్రత్యేక చిత్రంగా మనకు అందిస్తుంది. వాయిస్ డిక్టేషన్, వేరే భాషల్లోకి ట్రాన్స్‌లేట్ చేయడం వంటివి రియల్‌టైమ్‌లోనే జరుగుతాయి. మన వినియోగానికి అనువుగా బ్యాటరీ ఛార్జింగ్ వేగాన్ని మారుస్తాయి. బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కువ సమయం ఉండేలా, అంతర్గత వ్యవస్థలో మార్పులు చేస్తాయి. వేగవంతమైన ప్రాసెసర్ తాజాగా అందుబాటులోకి వచ్చిన శామ్సంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా ఫోన్లో ఏఐ ఆధ్వర్యంలో పనిచేసే స్నాప్‌డ్రాగన్ జెన్ 3 ప్రాసెసర్, ప్రస్తుతం ప్రపంచంలో అందుబాటులో ఉన్న వాటిల్లో వేగవంతమైనదని కంపెనీ పేర్కొంది. మనం ఒక వ్యక్తి ఫోటో తీసినప్పుడు, అతడు ధరించిన దుస్తులు, కళ్లజోడు, చేతి వాచీ, హ్యాండ్ బ్యాగుల వంటివి నచ్చాయనుకోండి. నచ్చిన వస్తువుపై సర్కిల్ డ్రా చేసి సెర్చ్ చేస్తే ఆ వస్తువు తయారు చేసిన కంపెనీ పేరు, వాటి ధర, అవి సమీపంలో ఎక్కడ లభిస్తున్నాయి వంటి వివరాలు సెకన్లలో డిస్ప్లే అవుతాయి. మనం ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడుతుంటాం. అవతలి వ్యక్తి ఇంగ్లీషులో మాట్లాడినా, మనం తెలుగులో వినాలనుకుంటే.. ఏఐ ఆ మాటలను మనకు తెలుగులోనే వినిపిస్తుంది. జవాబుగా మనం తెలుగులోనే మాట్లాడినా, ఆ పదాలను ఇంగ్లీషులోకి మార్చి.. వెనువెంటనే వారికి అందిస్తుంది. సర్వీసులు ఉచితమేనా అధిక క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీలే ప్రస్తుతానికి ఈ ఏఐ రంగంలో ఉత్పత్తులు తీసుకొస్తున్నాయి. ఏఐలో ప్రాసెసర్లు, చిప్‌ల వాడకం అధికంగా ఉంటుంది. వాటికి పెద్దమొత్తంలో పెట్టుబడుతులు అవసరమవుతాయి. చిన్న కంపెనీలు ఆ ఖర్చును భరించలేవు. అదే పెద్ద కంపెనీల వద్ద అధికంగా పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లు ఉంటారు. కాబట్టి వారికి సాధ్యం అవుతుంది. ఇదీ చదవండి: సంబంధంలేని ఫొటోలు.. విమర్శలు ఎదుర్కొంటున్న గూగుల్ జెమిని అయితే కంపెనీలు వీటిని ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాయి. వీటిల్లో అందిస్తున్న ఫీచర్లకు నిర్వహణ వ్యయాలు కూడా ఉంటాయి కాబట్టి, భవిష్యత్తులో ఛార్జీలను వసూలు చేసే పరిస్థితులు కూడా రావొచ్చొని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
‘ఏం చేయనున్నారు’..ఫోన్‌కు దూరంగా ఎలోన్ మస్క్!
టెక్ మొఘల్ ఎలోన్ మస్క్ ఇకపై తాను కొన్ని నెలల పాటు ఫోన్‌ను వినియోగించడం లేదని ఎక్స్.కామ్‌లో పోస్ట్ చేశారు. ఆడియో, వీడియో కాల్స్ కోసం ఎక్స్.కామ్‌ను వినియోగిస్తున్నట్లు చెప్పారు. మస్క్ ట్విట్లో ఏమన్నారంటే.. ‘నేను కొన్ని నెలల పాటు ఫోన్‌ను వినియోగించడం మానేస్తున్నాను. బదులుగా ఆడియో, వీడియో కాల్స్ కోసం ఎక్స్.కామ్‌ను ఉపయోగిస్తున్నా’ అని ట్వీట్లో పేర్కొన్నారు. In a few months, I will discontinue my phone number and only use X for texts and audio/video calls — Elon Musk (@elonmusk) February 9, 2024 మస్క్ ఎక్స్.కామ్‌ను ఎవ్రిథింగ్ యాప్‌గా మారుస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా ఎక్స్.కామ్‌లో ట్వీట్లు మాత్రమే కాకుండా ఆడియో, వీడియో కాల్స్ మాట్లాడుకునేందుకు గత ఏడాది అక్టోబర్ కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చారు. అయితే మస్క్ ఎక్స్.కామ్‌ను ప్రమోట్ చేసేందుకు ఫోన్‌కు దూరంగా ఉంటున్నారంటూ పలు నివేదికకు వెలుగులోకి వచ్చాయి. 2023లో ఎక్స్.కామ్‌లో ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే ‘ఎర్లీ వెర్షన్ ఆఫ్ వీడియో అండ్ ఆడియో కాలింగ్ ఆన్ ఎక్స్’ ఫీచర్‌ను అందించడం ప్రారంభించారు. ఎక్స్.కామ్ వెబ్సైట్ ప్రకారం.. ఎక్స్.కామ్ యూజర్లందరికి కాల్స్ చేసుకునే సదుపాయం లేదు. కేవలం ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకున్న యూజర్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది అని వెల్లడించింది. -
పార్లమెంట్ అలజడి కేసులో వెలుగులోకి కీలక అంశాలు
జైపూర్: పార్లమెంట్లో అలజడి సృష్టించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుల ఫోన్లను దహనం చేసిన స్థలాన్ని పోలీసులు గుర్తించారు. అక్కడ కాలిపోయి శిథిలావస్థలో ఉన్న సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల బట్టలు కాల్చి వేసిన ప్రదేశాన్ని కూడా పోలీసులు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా నిందితులను తీసుకువెళ్లి విచారణ చేపట్టారు. Parliament security breach: Police recover burnt phone parts of accused in Rajasthan Read @ANI Story | https://t.co/Jpwc9HIqR6#ParliamentSecurityBreach #Parliament #LokSabha #RajyaSabha pic.twitter.com/OkVJKYfMM7 — ANI Digital (@ani_digital) December 17, 2023 పార్లమెంట్లో మొత్తం ఏడుగురు నిందితులు గందరగోళం సృష్టించిన విషయం తెలిసిందే. లోక్‌సభ లోపల, పార్లమెంట్ ఆవరణలో పొగ బాంబులతో నిందితులు అరాచకం సృష్టించే పనిచేశారు. ఒంటికి మండే లేపనాలు పూసుకుని ఆత్మాహుతికి పాల్పడటానికి ప్రయత్నించారు. కానీ చివరికి స్మోక్ క్యానిస్టర్లను ప్రయోగించాలని నిర్ణయానికి వచ్చారు. సాగర్ శర్మ, డి.మనోరంజన్, అమోల్ షిండే, నీలం దేవి, ప్రధాన నిందితుడు లలిత్ ఝాలను పోలీసు ప్రత్యేక విభాగం తాలూకు కౌంటర్ ఇంటలిజెన్స్ విభాగం విచారిస్తోంది. నిందితులకు ఏడు రోజుల కస్టడీ విధించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా వారు ఆశ్రయం పొందిన, కుట్ర పన్నిన ప్రాంతాలకు శుక్రవారం రాత్రి వారిని తీసుకెళ్లారు. అలాగే నిందితులకు లోక్‌సభ పాస్‌లు సిఫార్సు చేసిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా స్టేట్మెంట్ను కూడా నమోదు చేయాలని భావిస్తున్నారు. లోక్‌సభలో కలకలం జరిగిన తీరుపై పార్లమెంటు అనుమతితో సీన్ రీ కన్స్ట్రక్ట్ చేసే ఆలోచన కూడా ఉన్నట్టు సమాచారం. లలిత్‌కు సహకరించిన మహేశ్ కుమావత్, కైలాశ్‌లకు క్లీన్చిట్ ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. లలిత్‌ను బుధవారం పార్లమెంటు ప్రాంగణం నుంచి పారిపోయి అతను రాజస్థాన్‌లో తలదాచుకున్న నగౌర్‌కు కూడా తీసుకెళ్లారు. అక్కడ తనతోపాటు సన్నిహితుల సెల్ ఫోన్లను ధ్వంసం చేశానని లలిత్ చెప్పిన ప్రదేశంలో ఆధారాలు సేకరించారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసేందుకు దేశంలో అరాచకం సృష్టించాలని భావించినట్లు కీలక సూత్రధారి లలిత్ ఝా కస్టడీ విచారణ సందర్భంగా ఢిల్లీ పోలీసులకు తెలిపాడు. లలిత్ ఝా తన ఫోన్‌ను ఢిల్లీ-జైపూర్ సరిహద్దులో విసిరివేసినట్లు అంగీకరించాడు. ఈ కుట్ర ప్రణాళికను అమలు చేయడానికి ముందు ఢిల్లీలో అనేకమార్లు కలిసినట్లు లలిత్ ఝా చెప్పాడు. ఇతర నిందితుల ఫోన్లను ధ్వంసం చేసినట్లు వెల్లడించాడు. ఇదీ చదవండి: రాజస్థాన్ బీజేపీ కొత్త చీఫ్‌గా కైలాష్ చౌదరి -
కమలంలో కొత్త లొల్లి
సాక్షి, హైదరాబాద్: నామినేషన్ల దాఖలు చివరిరోజు అభ్యర్థుల జాబితాలో కొన్ని మార్పులు చేసి, ఇదివరకే ప్రకటించిన వారికి బీఫాంలు ఇవ్వకపోవడం బీజేపీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. టికెట్లు దక్కని వారితో పాటు జాబితాలో ప్రకటించినా బీఫామ్స్ దక్కని వారిలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. శుక్రవారం ప్రకటించిన 14 మంది అభ్యర్థుల జాబితా అంతా వివాదాస్పదం కావడంతో సమస్య మరింత ముదిరింది. వేములవాడలో తుల ఉమకు బదులు వికాస్‌రావుకు, సంగారెడ్డిలో రాజేశ్వర్ దేశ్‌పాండేకు బదులు పులిమామిడి రాజుకు బీఫామ్‌లు ఇవ్వడంతో తుల ఉమ, దేశ్‌పాండే కన్నీటి పర్యంతం అయ్యారు. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలవనున్నట్లు ప్రకటించడంతో పార్టీ నాయకులు వారిని బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. చివరి క్షణంలో పలువురికి చెయ్యి బీసీ మహిళ (కురుమ) ఉమకు టికెట్ కోసం ఈటల రాజేందర్ గట్టిగా పట్టుబట్టారు. ఆమెకు సీటు కేటాయించకపోతే తాను ఎన్నికల్లో పోటీ చేయనని అల్టిమేటమ్ కూడా ఇచ్చారు. దీంతో నాయకత్వం దిగివచ్చినట్టు ప్రచారం జరిగింది. కానీ చివరకు బీఫామ్ ఇవ్వలేదు. సంగారెడ్డిలో పులిమామిడి రాజుకు కూడా సీటు కేటాయించాలని ఈటల కోరారు. దీంతో ఏదో ఒక సీటు ఎంపిక చేసుకోవాలని అధిష్టానం సూచించిందని, గెలిచే అవకాశాలున్న సంగారెడ్డి వైపు ఈటల మొగ్గుచూపినట్టుగా తెలుస్తోంది. కాగా తనను నామినేషన్ వేసుకోమని చెప్పి బీఫామ్ ఇవ్వకపోవడంపై తీవ్ర మనస్థాపానికి గురైన దేశ్‌పాండే.. కిషన్‌రెడ్డికి ఫోన్‌చేసి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ హెచ్చరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జాబితాలో బెల్లంపల్లి స్థానానికి ఏమాజీ పేరుంటే శ్రీదేవిని, ఆలంపూర్లో మారెమ్మ ప్లేస్‌లో రాజగోపాల్‌ను బీజేపీ ఖరారు చేయడం కూడా వివాదానికి తెరతీసింది. అనూహ్యంగా కంటోన్మెంట్ సీటు... సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ను చివరి నిమిషం వరకు కాంగ్రెస్‌లోనే ఉండి ఇంకా బీజేపీలో చేరని సాయి గణే‹Ùకు కేటాయించడంపై కూడా పారీ్టవర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇక్కడ మాజీ డీజీపీ కృష్ణప్రసాద్‌కు నామినేషన్ వేసేందుకు సిద్ధం కావాలంటూ చెప్పిన బీజేపీ.. ఆయనకు మొండిచేయి చూపి సాయి గణే‹Ùకు టికెట్ కేటాయించడం పారీ్టలో తీవ్ర చర్చనీయాంశమైంది. అదేవిధంగా తుది జాబితాలో పోటీకి సుముఖంగా లేని మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావుకు మల్కాజిగిరి సీటును కేటాయించడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. మల్కాజిగిరి టికెట్ కోసం ఆకుల రాజేందర్, బీజేవైఎం అధ్యక్షుడు భానుప్రకాష్ మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో నాయకత్వం మధ్యే మార్గంగా రామచంద్రరావుకు అవకాశం ఇచ్చినట్టు సమాచారం. దీంతో భానుప్రకాష్ పారీ్టకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. శేరిలింగంపల్లి టికెట్‌ను రవికుమార్ యాదవ్‌కు కేటాయించడంతో గత కొంతకాలంగా ఇక్కడ పనిచేస్తూ ఈ సీటును గట్టిగా కోరుకున్న గజ్జెల యోగానంద్ ఎలాంటి కార్యచరణకు దిగుతారనేదది చర్చనీయాంశమైంది. బీసీలకు 36 సీట్లు బీజేపీ ప్రకటించిన మొత్తం 111 సీట్లలో (జనసేనకు 8 సీట్లు) బీసీలు–36, ఓసీ–44 (రెడ్డి–29, వెలమ–8, కమ్మ–3, బ్రాహ్మణ–2, వైశ్య–1, నార్త్ ఇండియన్అగర్వాల్–1) ఎస్సీ 19+2 (రిజర్వ్‌డ్‌తో పాటు అదనంగా 2 జనరల్ సీట్లు (నాంపల్లి, చాంద్రాయణగుట్ట), ఎస్టీలకు 10 కేటాయించారు. బీసీలకు ఇతర పారీ్టల కంటే అధిక సీట్లనే కేటాయించినా.. 40కి పైగా సీట్లు కేటాయిస్తామనే హామీని నేతలు నిలబెట్టుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా మాదిగలకు ఎక్కువ ప్రాధా న్యం దక్కింది. 21 స్థానాలను ఎస్సీలకు కేటాయించగా, అందులో మాదిగ సామాజిక వర్గానికి 14, మాల సామాజిక వర్గానికి 7 ఇచ్చారు. బీసీలకు కేటాయించిన 36 సీట్లలో ముదిరాజ్ 9, మున్నూరు కాపు 7, యాదవ 5, గౌడ 5, పెరిక 2 లోధ్ 2 పద్మశాలి, ఆరే కటిక, లింగాయత్, వాలీ్మకి బోయ, ఆరే క్షత్రియ, విశ్వకర్మలకు ఒక్కో సీటు కేటాయించారు. -
హమాస్ దాడుల్లో కూతురు మాయం.. అమెరికా వ్యాపారి కన్నీటిగాథ
జెరూసలేం: ఇజ్రాయెల్‌లో నోవా వేడుకపై హమాస్ పాశవిక దాడి ఎందరో జీవితాల్లో చీకట్లు నింపింది. అయినవారిని పోగొట్టుకున్న బంధువుల ఆర్తనాదాలు ఆకాశాన్నంటుతున్నాయి. తమవారు ఎమయ్యారో..? చనిపోతే మృతదేహాలు ఎక్కడున్నాయో..? తెలియక అయోమయంలో కన్నీరుపెడుతున్నారు. ఈ క్రమంలో కూతురుని పొగొట్టుకున్న ఓ అమెరికా వ్యాపారి ధీనగాథ సదరు పాఠకుల హృదయాలను కలచివేస్తోంది. వాల్డ్‌మాన్ ఇజ్రాయెల్ ఆధారిత అమెరికా వ్యాపారి. కంప్యూటర్ నెట్వర్క్ బహుళజాతి సరఫర సంస్థ మెల్లనాక్స్ వ్యవస్థాపకుడు వాల్డ్‌మెన్. ఆయన కూతురు డేనియల్(24), ఆమె ప్రియుడు నోమ్ షాయ్‌తో కలిసి అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లో జరిగిన నోవా వేడుకకు హాజరైంది. ఈ క్రమంలోనే హమాస్ దళాలు దాడులు జరిపాయి. విషయం తెలుసుకున్న వాల్డ్‌మెన్.. కూతురు జాడ కోసం ఇజ్రాయెల్ చేరుకున్నారు. తన కూతురును హమాస్ దళాలు బందీగా పట్టుకెళ్లి ఉంటాయని భావించిన వాల్డ్‌మెన్.. చనిపోయినవారి జాబితాలో తన కూతురు కూడా ఉందని తెలుసుకుని కుంగిపోయారు. తన వద్ద ఉన్న ఆపిల్ వాచ్‌తో కూతురు ఫోన్‌ను ట్రాక్ చేయగా.. అక్టోబర్ 11న దిగ్బ్రాంతికర విషయాలు ఆయనకు తెలిశాయి. డేనియల్‌కు సంబంధించిన కారు, వారి వస్తువులు మొదట దర్శనమిచ్చాయి. అక్కడ తన కూతురు, ఆమె ప్రియున్ని హమాస్ దళాలు చంపిన తీరు అతి క్రూరంగా ఉందని ఆయన వెల్లడించారు. కనీసం ఐదుగురు ఉగ్రవాదులు తన కూతురు ఉన్న కారును చుట్టుముట్టి దాడి చేశారని వెల్లడించారు. కారులో తప్పించుకునే ప్రయత్నంలో ఈ దాడి జరిగిందని వెల్లడించారు. డేనియల్, ఆమె ప్రియుడు నోమ్ షాయ్ త్వరలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారని కన్నీరు పెట్టుకున్నారు. ఇటీవలే ఇద్దరూ తమ కుక్కతో కలిసి కొత్త ఫ్లాట్‌లోకి మారారని చెప్పారు. హమాస్ దాడులను ఖండించిన ఆయన.. డేనియల్, నోమ్ షాయ్‌కి ఒకే దగ్గర అంత్యక్రియలు జరిగినట్లు తెలిపారు. ఇదీ చదవండి: 'ఇక్కడి నుంచి తీసుకెళ్లండి..' హమాస్ బందీలో యువతి ఆవేదన -
తుపాను సమయంలో ఫోన్ వాడకూడదా? దీనిలో నిజమెంత?
పిడుగులు పడుతున్నప్పుడు మొబైల్ ఫోన్లను ఉపయోగించకూడదని చాలామంది అంటుంటారు. ఆ సమయంలో ఫోన్లను వినియోగిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని, పిడుగుపాటుకు గురయ్యే అవకాశాలు పెరుగుతాయని కూడా చెబుతారు. ఇదేవిధంగా ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వాతావరణంలో ఇంటర్నెట్ వాడకూడదని కూడా అంటుంటారు. దీనివెనుకగల కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మొబైల్ ఫోన్లు విద్యుత్తును ఆకర్షిస్తాయని, మెరుపు మెరిసినప్పుడు దానిలోని విద్యుత్ శక్తిని ఫోన్ తన వైపుకు ఆకర్షిస్తుందని చాలామంది నమ్ముతారు. ఫలితంగా ఇంటిపై పిడుగు పడే అవకాశాలుంటాయని చెబుతారు. దీని వెనుక ఉన్న లాజిక్ గురించి కొందరు ఏమంటారంటే.. మెరుపులోని విద్యుత్ ఫోన్టవర్ ద్వారా మీ ఫోనును చేరుకుంటుందని అంటుంటారు. తుఫాను సమయంలో మెరుపులు, పిడుగులలోని విద్యుత్ ఫోన్‌కు చేరుకుని అది పేలవచ్చని, లేదా ఇంటిపై పిడుగులు పడవచ్చని చెబుతుంటారు. అయితే ఇందులో ఎంత నిజం ఉందో, నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం మొబైల్ ఫోన్లు సిగ్నల్స్ కోసం రేడియో తరంగాలను, ఎలక్ట్రిక్ మాగ్నెటిక్ వేవ్స్ ను స్వీకరిస్తాయి. ఈ తరంగాల గుండా విద్యుత్ ఎప్పుడూ ప్రవహించదు. అంటే ఈ రేడియో తరంగాల ద్వారా విద్యుత్తు మీ ఫోన్‌కు ఎప్పటికీ చేరదు. మొత్తంగా చూస్తే పిడుగుపాటు సమయంలో మొబైల్ ఫోన్ వాడకూడదనేది కేవలం భ్రమ మాత్రమేనని చెప్పవచ్చు. ఎవరైనా తుఫాను సమయంలో కూడా మొబైల్ ఫోన్‌ను నిరభ్యరంతరంగా ఉపయోగించవచ్చు. అయితే వైర్డ్ టెలిఫోన్ విషయంలో కొంతమేరకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: ‘ఓం’పై నేపాల్‌కు ఎందుకు ద్వేషం? -
తల్లి ఫోనులో మునక.. కొడుకు నీట మునక!
అమెరికాలోని టెక్సాస్‌లో గల ఒక వాటర్‌పార్క్‌లో మూడేళ్ల బాలుడు మునిగి మృతి చెందాడు. ఆ బాలుని తల్లి గంటల తరబడి ఫోన్లో మునిగిపోయి ఉండటమే ఈ ఘటనకు కారణమని టెక్సాస్ పోలీసులు పేర్కొన్నారు. ది న్యూయార్క్ పోస్ట్‌తో ఆమె తరపు న్యాయవాది మాట్లాడుతూ లైఫ్‌గార్డులు శ్రద్ధ వహించకపోవడమే దీనికి కారణమని గతంలో ఆరోపించారు. ఎల్ పాసోలోని క్యాంప్ కోహెన్ వాటర్ పార్కులో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుని తల్లి జెస్సికా వీవర్ (35) నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమనే ఆరోపణలు సర్వత్రా వినిపించాయి. కాగా ఆమె తన ఏకైక సంతానం ఆంథోనీ లియో మాలావే మృతికి అక్కడి లైఫ్‌గార్డుల నిర్లక్ష్యమే కారణమంటూ కోర్టును ఆశ్రయించారు. ఎల్ పాసో టైమ్స్ తెలిపిన వివరాల ప్రకారం గతమే నెలలో కోహెన్ వాటర్ పార్కులో బాలుడు మృతి చెందడానికి ఆ బాలుని తల్లే కారణమని పలువురు ప్రత్యక్ష సాక్షులు విచారణలో వెల్లడించారు. ఈ కేసులో ఆమెను గత ఆగష్టు 30న ఇండియానాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో విచారణ అనంతరం ఆమె దోషిగా తేలడంతో సెప్టెంబరు 22న ఆమెను ఎల్ పాసో కౌంటీ జైలుకు తరలించారు. అయితే ఆ తరువాత ఆమెను $100,000 ష్యూరిటీ బాండ్‌పై విడుదల చేసినట్లు ఆ వార్తా సంస్థ తెలిపింది. ఈ సంఘటన జరిగిన సమయంలో పార్క్‌లో విధులు నిర్వహిస్తున్న 18 మంది లైఫ్గార్డ్లలో ఒకరు, కొలనులోని నాలుగు అడుగుల లోతులో మునిగిన మూడు సంవత్సరాల చిన్నారిని బయటకు తీశారు. స్విమ్మింగ్ సమయంలో ఉపయోగించే రక్షణ పరికరాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఆ బాలుడు లైఫ్ వెస్ట్ ధరించలేదు. క్యాంప్ కోహెన్ వద్ద ఏర్పాటు చేసిన బోర్డులలో ఆరేళ్లలోపు పిల్లలు ఈత కొట్టే సందర్భంలో వారి తల్లిదండ్రులు వారిని పర్యవేక్షించాలని రాసివుంది. కాగా ప్రత్యక్ష సాక్షి అయిన ఒక మహిళ ఆ బాలుని తల్లి వీవర్ ఘటన జరిగిన సమయంలో గంటల తరబడి పోనులో మునిగిపోయి ఉందని తెలిపారు. పైగా పిల్లాడిని పట్టించుకోకుండా, అక్కడి దృశ్యాలకు ఫోటో తీయడంలో మునిగిపోయిందని తెలిపారు. పిల్లవాడిని నీటిలో నుండి బయటకు తీయడానికి ఏడు నిమిషాల ముందువరకూ ఆ మహిళ తన ఫోన్లో నిమగ్నమై, పాటను ప్లే చేస్తూ, హాయగా విశ్రాంతి తీసుకున్నదని మరో సాక్షి తెలిపారు. ఇది కూడా చదవండి: నోబెల్ విజేతకు ఎన్ని కోట్లు ఇస్తారు? ఎంతతో మొదలై ఎంతకు పెరిగింది? -
ఫోన్ కవర్లో కరెన్సీ నోట్లు పెడుతున్నారా?.. ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే?
మన దేశంలో చాలామంది తమ స్మార్ట్ ఫోన్ కవర్ లోపలివైపు 10, 20, 50, 100, 500 నోట్లు పెడుతుంటారు. రూపాయి నోట్లను ఫోన్ కవర్లో పెడితే అత్యవసర సమయంలో పనికి వస్తుందని భావిస్తుంటారు. అయితే ఇలా చేయడం ఎంతవరకూ ప్రమాదకరంగా పరిణమిస్తుందో చాలామందికి తెలియదు. కరెన్సీ నోట్లను ఇలా పెట్టడంవలన ఆ ఫోను కలిగినవారి ప్రాణాలు గాలిలో కలసిపోయే అవకాశం ఉంది. ఫోన్ కవర్లో రూపాయినోట్లను ఉంచడం ఎందుకు ప్రమాదకరమో ఇప్పుడు తెలుసుకుందాం. వేడిని బయటకు విడుదల కానివ్వదు ఫోన్‌ను నిరంతరం ఉపయోగిస్తున్నప్పుడు అది వేడిగా మారడాన్ని గమనించే ఉంటాం. ఫోన్ వేడెక్కిన వెంటనే ఫోన్ వెనుక భాగంలో దాని ప్రభావం కనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఫోన్ కవర్లో కరెన్సీ నోటు ఉన్నట్లయితే, అప్పుడు ఫోన్ నుంచి వేడి బయటకు విడుదల కాదు. దీంతో ఆ ఫోను పేలిపోయేందుకు అవకాశం ఏర్పడుతుంది. అందుకే ఫోన్‌కు బిగుతుగా ఉండే కవర్‌ను ఉపయోగించకూడదని నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే అది ఫోన్ పేలిపోయేలా చేస్తుందని అంటుంటారు. నోట్ల రసాయనాలు ప్రాణాంతకం కరెన్సీ నోట్లను కాగితంతో తయారు చేస్తారు. అలాగే అనేక రకాల రసాయనాలను కూడా ఉపయోగిస్తారు. ఫోన్ వేడెక్కిన సందర్భంలో.. అది బయటకు వెలువడకుండా రసాయినాలతో కూడిన కరెన్సీ నోటు అడ్డు పడితే ఆ పోన్ పేలిపోయేందుకు అవకాశం ఏర్పుడుతుంది. అందుకే పొరపాటున కూడా ఫోన్ కవర్లో ఎలాంటి కరెన్సీ నోటును ఉంచకూడదని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఫోన్ కవర్ బిగుతుగా ఉన్నా, అది పేలిపోయే అవకాశం ఉందని, అందుకే ఫోన్ కవర్ ఎంపికలో జగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘హార్మోనియం’ను నెహ్రూ, ఠాగూర్ ఎందుకు వ్యతిరేకించారు? రేడియోలో 3 దశాబ్దాల నిషేధం వెనుక.. -
ఫోన్ ఛార్జింగ్‌పై బాస్ ఆగ్రహం.. టాయిలెట్ ఫ్లష్ చేయద్దంటున్న నెటిజన్లు!
ఉద్యోగ జీవితంలో పలు సమస్యలు ఎదురవుతుంటాయనే విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఒక ఉద్యోగి సోషల్ మీడియాలో తన ప్రొఫిషినల్ లైఫ్‌లో ఎదురైన ఒక అనుభవాన్ని వెల్లడించాడు. తాను తన కార్యాలయంలో విచిత్రమైన అనుభవాన్ని ఎదుర్కొన్నాననని దానిలో పేర్కొన్నాడు. వైరల్ అవుతున్న రెడ్డిట్ పోస్టులో @Melodic-Code-2594 అనే ఖాతా కలిగిన యూజర్ తన బాస్ తాను ఆఫీసులో ఫోన్ ఛార్జ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారని పేర్కొన్నాడు. ‘వ్యక్తిగత ఉపయోగం కోసం కంపెనీ విద్యుత్ చోరీ చేశానని’ బాస్ ఆరోపించాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ యూజర్ తన పోస్టులో.. ‘ఆఫీసులో తాను ఫోన్ ఛార్జ్ చేసినందుకు మా బాస్ నాతో.. వ్యక్తి గత అవసరాలకు కంపెనీ విద్యుత్ చోరీ చేస్తున్నారు. మీ లాంటి వాళ్లకు ఎలా చెప్పాలి? నేనేమీ రోజంతా ఫోనులోనే మునిగిపోను. అప్పుడప్పుడు రాత్రి వేళ బెడ్‌మీదకు చేరేముందు ఫోన్ చార్జ్ చేయడం మరచి పోతుంటానంతే. ఇది డెస్క్ జాబ్’ అని బాస్ సీరియస్‌గా చెప్పాడని వివరించారు. ఈ పోస్టును చూసిన యూజర్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్..‘మీ బాస్ పెద్ద మూర్ఖుడు. ఫోన్ ఛార్జింగ్ పెడితే కంపెనీ కరెంట్ చోరీ చేసినట్లు అవుతుందన్నాడంటే.. అక్కడి గాలి పీల్చినా, నీటిని తాగినా చోరీ చేశావని అంటాడేమో’ అని కామెంట్ చేశాడు. మరో యూజర్..‘మీ బాస్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవద్దన్నాడంటే.. ఆఫీసులోని ఫోనుకు వచ్చిన ఏ కాల్‌ను రిసీవ్ చేసుకోకూడదు. ఎందుకంటే అప్పుడు కంపెనీ ఫోను టాక్‌టైమ్, బ్యాటరీ పవర్ చోరీ చేసినట్లువుతుందని’ పేర్కొన్నాడు. మరో యూజర్ ‘ఆఫీసులోని టాయిలెట్ యూజ్ చేసినప్పుడు ఫ్లష్ చేయవద్దని మీ బాస్‌కు చెప్పండి. ఎందుకంటే అలా చేస్తే కంపెనీకి చెందిన నీరు వృథా అవుతుందని వివరించండి’ అని సలహా ఇచ్చాడు. ఇది కూడా చదవండి: అందం.. నేర సామ్రాజ్యంలోకి అడుగిడితే.. లేడీ డాన్ లవ్ స్టోరీస్! -
కిల్లర్ ఫీచర్స్‌తో టెస్లా ఫోన్: డైరెక్ట్ మార్స్ నుంచి కాల్స్..?
TeslaPhone: ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ మరో సంచలనానికి తెరతీయనున్నారు అంటూ ఒక వార్త వైరల్‌గా మారింది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కిల్లర్ ఫీచర్స్‌తో కొత్త మొబైల్ ఫోన్ లాంచ్ చేయనున్నట్టు మస్క్ (పేరడీ) పేరుతో ఉన్న ట్విటర్ ఖాతాలో టెస్లా ఫోను ఫోటోను షేర్ చేశారు. దీంతో నెటిజన్లు చాలామందిఆశ్చర్యంలో మునిగి పోయారు. ప్రశ్నల వర్షం కరిపించడంతో ఈ ట్వీట్ సంచలనంగా మారింది. వెనుక టెస్లా పేరుతో, మోటాలిక్ లుక్‌లో ఆకర్షణీయంగా ఉండటం మరింత ఆసక్తికర చర్చకు దారి తీసింది. టెస్లా ఫోన్ వినియోగానికి ఆసక్తిగా ఉన్నారా అంటూ యూజర్లను ప్రశ్నించడంతో ముఖ్యంగా టెస్లా ఫోన్ పిక్ చూసిన కొంతమంది ట్వీపుల్ ప్రశ్నల, సందేహాలు వ్యక్తం చేశారు. నెలకు 100 డాలర్లతో స్టార్ లింక్ ద్వారా ప్రపంచంలో ఎక్కడైనా వినియోగించే విధంగా అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తే తాను ఆసక్తిగా ఉన్నట్లు ఒక అభిమాని ట్వీట్ చేశారు. మార్స్(అంగారక) గ్రహం నుంచి కూడా ఉపయోగించుకోవచ్చని మస్క్ తెలిపారు. అంతేకాదు ఐఫోన్ 12 మినీ కంటే మెరుగ్గా ఉంటుందని హామి ఇవ్వడం గమనార్హం. సూపర్ స్టన్నింగ్ ఫోన్ ఫోటోతోపాటు, ఇందులో ప్రీ ఇన్స్టాల్ అయి ఉంటుందనడంతో అందరూ తప్పులో కాలేశారు. ఆనక ఇది నకిలీ(పేరడీ) ఖాతా అని తెలిసి ‘డామిట్’ అనుకున్నారు. ట్విటర్ ఐకానిక్ బర్డ్ లోగోను మార్చి 'X' గా మార్చి మస్క్ అందర్నీ ఆశ్చర్యపరిచ్చారు. స్పేస్ ఎక్స్ అధినేత ఎక్స్‌పై తనకున్న మోజును చాటు కున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో టెస్లా ఫోన్ అనగానే మస్క్ (పేరడీ) పోస్ట్ నెట్టింట సంచలనంగా మారింది. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత తరుణంలో నకిలీ వార్తలు పెను సంచలనంగామారుతున్నాయి. ముఖ్యంగా ఏఐ ఎంట్రీ తరువాత ఈ ప్రమాదం మరింత పెరిగింది. అందుకే సోషల్‌మీడియాలో ప్రతీ అంశానికి నిశిత పరిశీలన, ఫ్యాక్ట్‌చెక్ అనేది చాలా కీలకం. Would you use the Tesla Phone? X comes pre-installed. pic.twitter.com/jSwTQcuDr2 — Elon Musk (Parody) (@ElonMuskAOC) July 31, 2023 -
లవ్ ఫెయిల్యూర్.. ప్రేమికురాలితో ఫోన్లో మాట్లాడుతూనే
సాక్షి, వరంగల్: ప్రేమికురాలితో ఫోన్లో మాట్లాడుతూనే ఓ ప్రేమికుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ నగరంలోని బొల్లికుంటలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం.. ఖిలావరంగల్ మండలం బొల్లికుంట గ్రామానికి చెందిన జున్న చేరాలు కుమారుడు జున్న గణేష్(25) ఖోఖోలో జాతీయస్థాయి క్రీడాకారుడిగా ఎదిగాడు. ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీలో పీపీడీ చదువుతున్నాడు. గణేష్‌కు ఐనవోలు మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. విషయం అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులకు తెలిసింది. దీంతోవారు ఆదివారం సాయంత్రం ఆగ్రహంతో బొల్లికుంటకు వచ్చి గణేష్‌ను బెదిరించారు. దీంతో ప్రేమ విఫలమైనట్టేనని మనస్తాపానికిలోనైన గణేష్ సోమవారం ఉదయం 11 గంటలకు కుటుంబసభ్యులు వ్యవసాయ పనులకు వెళ్లగా, ప్రేమికురాలతో మాట్లాడుతూ ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తర్వాత కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకోగా, ఫ్యాన్‌కు వేలాడుతూ గణేష్ మృతదేహం కనిపించింది. మృతుడి తండ్రి చేరాలు సమాచారంతో ఎస్ఐ కృష్ణవేణి సంఘటనా స్థలికి చేరుకుని ఆత్మహత్యకు గల కారణాలను తల్లిదండ్రుల నుంచి సేకరించింది. గణేష్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్ తెలిపారు. ప్రేమికురాలితో ఫోన్లో మాట్లాడుతూనే ఆత్మహత్య చేసుకున్న అంశంపై పోలీసులను వివరణ కోరగా, గణేష్ ఉరి వేసుకున్న చోట ఫోన్‌కింద పడి ఉందని, దీనిపై పూర్తి దర్యాప్తు చేసిన తర్వాత వివరాలు తెలుస్తాయన్నారు. చదవండి: తాగి ఊగుతూ.. ఊగి ఆగతూ.. ఆగి తన్నుకుంటూ.. ఆకతాయిల వీరంగం! -
మొబైల్ చూస్తూ జారిపడ్డ ప్రధాని.. తలకు తీవ్ర గాయం
ఫిజీ ప్రధానమంత్రి సితివేణి రబుకా ప్రమాదానికి గురయ్యారు. మొబైల్ ఫోన్ చూస్తూ కింద పడిపోవడంతో ఆయన తలకు దెబ్బతగిలింది. దీంతో ప్రధాని చైనా అధికారిక పర్యటనను అనూహత్యంగా రద్దు చేయాల్సి వచ్చిందని ఫిజీలోని చైనా రాయబార కార్యాలయం బుధవారం ప్రకటించింది. కాగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో కలిసి గెంగ్డూలో జరిగే ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల ప్రారంభోత్సవానికి ఫిజీ ప్రధాని హాజరు కావాల్సి ఉంది. ఈ పర్యటన రెండు దేశాల మధ్య ఒక ముఖ్యమైన దౌత్య కార్యక్రమంగా నిలవనుంది. అయితే తలకు గాయం కావడంతో చైనా పర్యటన అకస్మాత్తుగా రద్దు అయ్యిందని స్వయంగా ప్రధాని వెల్లడించారు. ఫోన్‌ని చూస్తుండగా మెట్లపై నుంచి జారిపడ్డానని, ఫలితంగా తలకు గాయమైందని తెలిపారు. ఈ దురదృష్టకర సంఘటన కారణంగా రేపు రాత్రి పర్యటకు రావడం లేదని చైనాకు తెలియజేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఓ వీడియో ద్వారా తన ఆరోగ్య పరిస్థితిని వివరించారు. చదవండి: మోదీ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం.. లోక్‌సభలో ఎవరి బలం ఎంతంటే! ‘బుధవారం ఉదయం ప్రభుత్వానికి చెందిన కొత్త బిల్డింగ్ ప్రవేశ ద్వారం వద్ద మొబైల్ చూస్తూ పొరపాటున మెట్లు జారి కిందపడిపోయాను. ఈ ప్రమాదంలో తలకు గాయమైంది. ఇప్పుడే ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చాను’ అని పేర్కొన్నారు. ఇక వీడియోలో అతని చొక్కాపై కొద్దిగా రక్తపు మరకలు సైతం కనిపిస్తున్నాయి. దీంతో తలకు దెబ్బ గట్టిగానే తగిలినట్లు తెలుస్తోంది. కాగా గాయం నుంచి కోలుకున్న తర్వాత అధికారిక పర్యటనల కోసం భవిష్యత్తులో చైనా నుంచి ఆహ్వానాలు అందుతాయని రబుకా ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ పర్యటన రద్దు ఫిజీ, చైనాల మధ్య దౌత్య సంబంధాలపై ప్రభావం చూపదని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. An update on the deferment of my trip to China due to an injury that I sustained earlier today due to a misstep at the entrance to the New Wing of Government Buildings. pic.twitter.com/SYKrRUQPHF — Sitiveni Rabuka (@slrabuka) July 25, 2023 -
JioBharat phone: సక్సెస్‌ను పట్టేసిన అంబానీ.. ఇక దూకుడే..
ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 17.69 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో భారతదేశపు అత్యంత విలువైన కంపెనీగా కొనసాగుతోంది. అనేక రంగాల్లో విజయవంతంగా వ్యాపారాలు నిర్వహిస్తోంది. భారత టెలికాం పరిశ్రమలో అత్యధిక మార్కెట్ వాటాతో తిరుగులేని సంస్థగా ఉన్న రిలయన్స్ జియో బ్రాండ్ గత కొన్నేళ్లుగా అనేక ఉత్పత్తులను భారతీయ మార్కెట్‌కు సరసమైన ధరతో అందిస్తోంది. అందులో భాగంగా ఇటీవలే జియో భారత్ వీ2 (JioBharat V2) ఫోన్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.999 మాత్రమే. భారతదేశంలో ఇంటర్నెట్ కలిగిన అత్యంత చవకైన ఫోన్ ఇదే. మరిన్ని ఫోన్ల ఉత్పత్తి.. ట్రయల్ దశలో రూ.99 కోట్ల విలువైన 10 లక్షల ఫోన్లను మాత్రమే రిలయన్స్ జియో విక్రయానికి ఉంచింది. ఈ ఫోన్లన్నీ అమ్ముడుపోయిన తర్వాత మరిన్ని జియో భారత్‌వీ2 ఫోన్లను తయారు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన తర్వాత రిలయన్స్ జియో ‘జియో భారత్’ ఫోన్ల అమ్మకాల్లో పురోగతిని గమనించిందని, 10 లక్షల ఫోన్ల విక్రయాల ట్రయల్ పూర్తవ్వగానే ఈ ఫోన్ల ఉత్పత్తిని మరింత పెంచేందుకు సిద్ధమైందని బ్రోకరేజ్ సంస్థ బీఎన్పీ పారిబాస్ ఓ నివేదికలో పేర్కొంది. జియో భారత్ వీ2 ఫోన్లలో 1.77 అంగుళాల QVGA TFT స్క్రీన్, 1000mAh రిమూవబుల్ బ్యాటరీ ప్రధాన ఫీచర్లు. ఇంకా ఇందులో జియో సినిమా, తాజా వెబ్ సిరీస్‌లు, బ్లాక్‌బస్టర్ సినిమాలు, హెచ్‌బీఓ ఒరిజినల్స్, స్పోర్ట్స్ కంటెంట్ టీవీ షోలతో సహా విస్తారమైన నాన్-స్టాప్ వినోదాన్ని అందించే యాప్ ప్రధానంగా ఉంటుంది. అలాగే ప్రముఖ ఉచిత మ్యూజిక్ యాప్ జియో సావన్, జియో ప్లే వంటివి కూడా ఉన్నాయి. ఇదీ చదవండి: Nokia 110 4G/2G: నోకియా చిన్న ఫోన్ రూ. 1,699లకే.. యూపీఐ పేమెంట్లూ చేసుకోవచ్చు! ప్రస్తుతానికి కార్బన్ కంపెనీ భాగస్వామ్యంతో జియో భారత్ వీ2 ఫోన్లను రిలయన్స్ జియో ఉత్పత్తి చేస్తోంది. ఇందు కోసం రానున్న రోజుల్లో ఇతర కంపెనీలూ రిలయన్స్ జియోతో జత కలిసే అవకాశం ఉంది. అతి తక్కువ ధరతోపాటు ఈ ఫోన్ కోసం రిలయన్స్ సరసమైన డేటా ప్లాన్లను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. -
‘మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు’ అనగానే బామ్మ ఆగ్రహంతో..
ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక బామ్మకు సంబంధించిన వీడియో అందరినీ తెగ నవ్విస్తోంది. ఈ వీడియోలో బామ్మ ఫోనులో మాట్లాడుతూ కనిపిస్తుంది. ఆమె మాటలను విన్నవారంతా తెగ నవ్వుకుంటున్నారు.ఆ బామ్మ హరియాణాకు చెందినది. వీడియోలో బామ్మ ఏమి మాట్లాడుతున్నదో తెలిస్తే ఎవరైనా విస్తుపోవలసిందే. వీడియోలో కంప్యూటర్ జనరేటెడ్ వాయిస్ వినిపిస్తుంటుంది. ‘మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు’ అని దానిలో వినిపిస్తుండగా, ఆ వాయిస్ విన్న బామ్మ కోపంతో తన ధోరణిలో మాట్లాడుతుంటుంది. వీడియోలో ముందుగా బామ్మ ఫోన్ చేస్తూ కనిపిస్తుంది. అటువైపు నుంచి రింగ్ వినిపిస్తుంది గానీ, ఎవరూ లిఫ్ట్ చేయరు. ఇంతలో కంప్యూటర్ రికార్డెడ్ వాయిస్ వినిపిస్తుంది. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదంటూ బామ్మకు ఒక యువతి గొంతు వినిపిస్తుంది. అంతే ఆ బామ్మ ఆగ్రహంతో ఆ కంప్యూటర్ వాయిస్ నిజమైనదేనని భావిస్తూ క్లాస్ పీకుతుంది. ఇది విన్న ఎవరైనా తమ నవ్వును అదుపుచేసుకోలేరు. అయితే ఆ బామ్మకు అసలు విషయం తెలియక ఫోనులో ఎవరో యువతి మాట్లాడుతున్నదని భావిస్తూ, ఆపకుండా మాట్లాడుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ChatBot भाई, संभलकर आइयो India में, अम्मा तुमको भी ना छोड़ने वाली हैं. 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣 pic.twitter.com/YKjGC5ajoW — Rahul Prakash, IPS (@rahulprakashIPS) March 18, 2023 ఇది కూడా చదవండి: యువకుని ప్రాణాలు తీసిన మూమూస్ ఈటింగ్ ఛాలెంజ్ -
‘ఇక చూసింది చాలు పడుకో’ అని తల్లి అనడంతో..
ఆ 16 ఏళ్ల కుర్రాడు పొద్దస్తమానం పోన్ చూస్తుండాన్ని గమనించిన తల్లి అతనిని మందలించింది. దానిని తట్టుకోలేకపోయిన ఆ కుర్రాడు అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన యూపీలోని ఇటావా పరిధిలోని ఒక గ్రామంలో చోటుచేసుకుంది. 10వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల రాజు(మార్చిన పేరు) రాత్రంతా మేలుకుని ఫోను చూస్తుండటంతో అతని తల్లి మందలించింది. ‘ఇక చూసింది చాలు పడుకో’ అంటూ అతని నుంచి ఫోను లాక్కొన్ని, స్విచ్ ఆఫ్ చేసింది. అయితే రాజు తన మొండి పట్టుదల వీడక పోను ఇంకా చూస్తానని మొండికేశాడు. అమ్మ లాగిపెట్టి కొట్టిందని.. కుమారుని మొండితనాన్ని చూసిన తల్లి ఆగ్రహంతో అతని చెంప చెళ్లుమనిపించింది. దీంతో రాజు ఆ ఫోనును నేలకేసి పగులగొట్టి, గది తలుపులు వేసుకున్నాడు. కొద్దిసేపటి తరువాత రాజు చెల్లెలు.. గదిలో నుంచి బయటకు రమ్మని అతనిని కోరింది. అరగంట గడిచినా గదిలో నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. దీంతో రాజు తల్లి అనుమానంతో కిటికీలో నుంచి గదిలోకి తొంగి చూసింది. లోపల రాజు ఫ్యానుకు ఉరివేసుకున్న స్థితిలో కనిపించాడు. వెంటనే తల్లి గట్టిగా కేకలు వేసింది. కిందకు దింపి ఆసుపత్రికి తరలించగా.. కుమారుడు ఉన్న స్థితిని చూసిన తల్లి గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు వారి ఇంటికి చేరుకున్నారు. వారు గది తలుపులు బద్దలుకొట్టి, రాజును కిందకుదించి ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి, రాజు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ వార్త వినగానే రాజు తల్లి పెద్దపెట్టున రోదించసాగింది. ఈ సమాచారం పోలీసులకు తెలియడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని,మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ఏది ఇంపు?.. ఏది కంపు?.. సీక్రెట్ వెనుక సింపుల్ లాజిక్! -
అధికారుల వింత రూల్స్.. బస్సు డ్రైవర్, కండక్టర్ల ఫోన్ల చెకింగ్.. ఎందుకంటే..?
ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్ రోడ్డు రవాణా శాఖ ఏ వింతైన నిబంధనను తీసుకువచ్చింది. ఇకపై బస్సుల్లో డ్రైవర్లు, కండక్టర్ల ఫోన్లను కూడా తనిఖీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. చెకింగ్ అధికారుల రూట్ వివరాలను బస్సు డ్రైవర్లు తమ సహోద్యోగులకు చేరవేస్తున్నారని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. చెకింగ్ అధికారుల రూట్‌కు అనుగుణంగా ఇతర రూట్లలోని ఉద్యోగులు విధులను నిర్వర్తిస్తున్నారని తమ దర్యాప్తులో తేలినట్లు వెల్లడించింది. సంస్థ ప్రయోజనాల కోసం ఈ నియమాన్ని తీసుకొచ్చినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. అధికారులు బస్సుల్లో చెకింగ్ చేసే సమయంలో మొదట బస్సు డ్రైవర్, కండక్టర్ ఫోన్లను చెక్ చేస్తారని మేనేజింగ్ డైరెక్టర్ అన్నపూర్ణ గార్గ్ తెలిపారు. చెకింగ్ సమయంలో డ్రైవర్, కండక్టర్ సహోద్యోగులకు సంబంధిత వివరాలను పంపినట్లు తేలితే కఠిన శిక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా ఉద్యోగులు ఈ అక్రమాలకు పాల్పడుతున్నారని కనుగొన్నట్లు వ్లెడించారు. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖా మంత్రి దయా శంకర్ సింగ్ కూడా ఈ నిబంధనలపై స్పందించారు. ఉద్యోగులందరూ ఈ నియమాలను పాటించాలని సూచించారు. అక్రమాలకు పాల్పడితే విధుల నుంచి తప్పిస్తామని ఉద్యోగులను హెచ్చరించారు. దీనిపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఫోన్‌ను వాడడం తమ వ్యక్తిగత హక్కు అని చెబుతున్నాయి. వ్యక్తిగత వివరాలు సెల్ఫోన్లో భద్రపరుచుకుంటామని వెల్లడించాయి. చెకింగ్‌ల పేరిట తమ వ్యక్తిగత హక్కుకు భంగం వాటిల్లుతుందని తెలిపాయి. ఈ నిబంధనల నుంచి ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించాయి. ఇదీ చదవండి: పండుగ సెలవుల్లో విషాదం: రెస్టారెంట్లో పేలిన సిలిండర్.. 31 మంది దుర్మరణం -
మీ ఫోన్ లోనే బీపీ చెక్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసుకోండి
-
ఇంకా నయం! ఆ ఫోన్ ఏ నదిలోనో, సముద్రంలోనో పడలేదు..!
ఇంకా నయం! ఆ ఫోన్ ఏ నదిలోనో, సముద్రంలోనో పడలేదు..! -
‘ఒక తాలీకి మరొకటి ఉచితం’.. ప్రలోభానికిలోనైన మహిళ ఎలా మోసపోయిందంటే...
ఇటీవలి కాలంలో ఆన్లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇందుకోసం మోసగాళ్లు పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు.తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఇటువంటి ఘరానా మోసం చోటుచేసుకుంది. ఒక మహిళ ప్రముఖ రెస్టారెంట్‌కు చెందిన యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫుడ్ ఆర్డర్ చేసింది. ఇంతలోనే ఆమె బ్యాంకు ఖాతాలోని రూ.90 వేలు మాయమయ్యాయి. వివరాల్లోకి వెళితే మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఉదంతం గత ఏడాది నవంబరు 27న చోటు చేసుకోగా, దీనిపై చాలా ఆలస్యంగా ఈ ఏడాది మే 2న సైబర్ సెల్‌కు ఫిర్యాదు అందింది. బాధితురాలి పేరు సవితా శర్మ(40)ఆమె ఒక బ్యాంకులో అధికారిగా పనిచేస్తున్నారు. ఆమె పోలీసులకు ఇచ్చిన రిపోర్గులో...తనకు గత ఏడాది తన స్నేహితురాలి నుంచి ఫోన్ వచ్చిందని, తరువాత ఆమె ఫేస్‌బుక్‌లోని ఒక లింకు పంపిందని తెలిపారు. ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నాక పుడ్‌కు సంబంధించిన ఒక ఆఫర్ తనకు అందిందన్నారు. వారు ఇచ్చిన ఫోను నంబరుకు కాల్ చేయగా, ఎవరూ లిఫ్ట్ చేయలేదన్నారు. అయితే కొద్దిసేపటి తరువాత తనకు మరో నంబరు నుంచి ఫోను వచ్చిందన్నారు. ఈ కాల్ చేసిన వ్యక్తి తాము సాగర్ రత్న రెస్టారెంట్ నుంచి ఫోను చేస్తున్నామని ఒక తాలీ(భోజనం) బుక్ చేసుకుంటే మరొక తాలీ ఉచితంగా ఇస్తామని తెలిపారు. అయితే ఇందుకు ఒక యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని చెబుతూ, దానికి సంబంధించిన యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌ను ఆ వ్యక్తి తెలియజేశాడని తెలిపారు. వెంటనే ఆ మహిళ ఆ యాప్ ఇన్స్టాల్ చేసి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఫీడ్ చేసింది. ఇది జరిగిన కొద్దిసేపటికి ఆమెకు తన బ్యాంకు ఖాతా నుంచి రూ.40 వేలు విత్‌డ్రా చేసినట్లు మెసేజ్ వచ్చింది. రెండు సెకెన్ల తరువాత రూ. 50 వేలు డ్రా అయినట్లు మరో మెసేజ్ వచ్చింది. వెంటనే తాను మోసపోయానని గ్రహించి, తన క్రెడిట్ కార్డు బ్లాక్ చేయించానని బాధితురాలు తెలిపింది. కాగా బాధితురాలి నుంచి ఫిర్యాదు అందుకున్న సైబర్ పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. వారు సాగర్ రత్న రెస్టారెంట్ ప్రతినిధులను సంప్రదించగా, తమకు దీనిపై ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు. కాగా ఇటువంటి ఆన్లైన్ వ్యవహారాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. -
పొలంలో ఫోన్ మాట్లాడుతుండగా రైతుపై పిడుగు.. అక్కడికక్కడే..
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ లఖీంపూర్ ఖేరీలో విషాద ఘటన జరిగింది. శ్రీపాల్ అనే 50 ఏళ్ల రైతు పొలంలో ఫోన్ మాట్లాడుతుండగా అతనిపై పిడుగు పడింది. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబసభ్యులు అతని మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. పొలం పనులకు వెళ్లి తిరిగి వస్తాడనుకున్న వ్యక్తిని విగతజీవిగా చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా.. పోలీసులు రైతు ఇంటికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శ్రీపాల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందిస్తామని రెవెన్యూ అధికారులు హామీ ఇచ్చారు. ఈ రైతు పొలం పనుల కోసం వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే వాతావరణం ఒక్కసారిగా మారి వర్షం పడే సూచనలు కన్పించాయి. ఈ సమయంలోనే ఆయనకు కుటుంబసభ్యులు ఫోన్ చేయడంతో.. వారితో మాట్లాతుండగా పిడుగు అతనిపైనే పడింది. దీంతో అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఫోన్ భారీ శబ్దంతో సడన్‌గా ఆగిపోవడంతో కుటంబసభ్యులు భయంతో పొలానికి పరుగులు తీశారు. వ్యవసాయ క్షేత్రంలో శ్రీపాల్‌ను విగతజీవిగా చూసి షాక్ అయ్యారు. చదవండి: ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీక్.. ఆరుగురు మృతి, పలువురికి అస్వస్థత -
సెల్‌ఫోన్ పోయిందా.. అధైర్యపడకండి.!
● సీపీ ఏవీ రంగనాథ్ వరంగల్ క్రైం : సెల్‌ఫోన్ పోయిందా ..అధైర్యపడవద్దని వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడింటి రిజిస్టార్ (సీఈఐఆర్)లో కొ న్ని వివరాలు నమోదు చేస్తే ఫోన్ ఎక్కడుందో తెలు సుకునే అవకాశం ఉంటుందని సీపీ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో సెల్‌ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైందని, ఫోన్ పోతే బాధపడొద్దని సూచించారు. కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన సీఈఐఆర్ అనే పోర్టల్ ద్వారా సెల్ఫో న్ పోయిన వ్యక్తి ముందుగా సంబంధిత పోలీస్ స్టే షన్లో ఫిర్యాదు చేసి rwww.ceir.gov.in వెబ్సైట్లో లాగిన్ కావాలని తెలిపారు. అందులో ఐఎంఈఐ నంబర్, కంపెనీ పేరు, మోడల్, సెల్‌ఫోన్ కొనుగోలు చేసిన బిల్లు తదితర వివరాలు నమోదు చేయాల న్నారు. దీంతో పాటు రాష్త్రం, జిల్లా, మండలం, తదితర వివరాలను నమోదు చేస్తే 24 గంటల్లో ఫోన్ పనిచేయకుండా చేస్తుందని తెలిపారు. అవగాహన కల్పించాలి... ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో సెల్‌ఫోన్ వాడుతున్న వినియోగదారులకు ఫోన్ పోతే ఏం చేయాలనే విషయాలపై, సీఈఐఆర్పై అవగాహన కల్పించాలని సీపీ తెలిపారు. బ్లూకోల్ట్, పెట్రోకార్ సిబ్బంది అవగాహన కల్పిస్తారన్నారు. దీంతో పాటు ప్రజలకు అ వగాహన కల్పించడానికి పోస్టర్లు విడుదల చేశారు. -
ఫోన్ పోయిందా.. నో వర్రీస్.. ఏపీ పోలీసులు పట్టేస్తారు
కోనేరు సెంటర్ (మచిలీపట్నం): సెల్‌ఫోన్ మనిషికి నిత్యావసరమైపోయింది. అది లేకుండా అడుగు ముందుకు వేయలేని పరిస్థితి. అలాంటి ఫోన్ ఒక్కసారిగా పోతే అన్ని బంధాలు తెగిపోయినట్లుగా జనం భావిస్తున్నారు. ముఖ్యంగా యువతీ, యువకులు చేతిలో సెల్‌ఫోన్ పోతే ఇక జీవితమే లేదన్న స్థాయిలో మదనపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులు పోగొట్టుకున్న సెల్ఫోన్ల రికవరీపై జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. దీనికోసం మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టం (ఎంఎంటీఎస్) అనే కొత్త సాంకేతికతను తీసుకొచ్చారు. డేటాతోనే ఆందోళన.. జిల్లాలో సెల్‌ఫోన్ చోరీలు సాధారణంగా మారిపోయాయి. సెల్‌ఫోన్ పోగొట్టుకున్న బాధితులు వాటి ఖరీదు గురించి ఆలోచించనప్పటికీ ఫోన్లో భద్రపరచుకుంటున్న డేటా విషయంలో ఎక్కువ ఆవేదనకు గురవుతున్నారు. సుదూర ప్రాంతాల్లో ఉన్న హితులు, స్నేహితులు, బంధువుల ఫోన్ నంబర్లతో పాటు పలు విలువైన, అత్యంత కీలకమైన పత్రాలను సైతం సెల్ఫోన్లోనే భద్రపరచుకోవటం ప్రస్తుత పరిస్థితుల్లో పరిపాటిగా మారింది. వినియోగంలో ఉంటేనే.. జిల్లాలో 200 సెల్ఫోన్లు రికవరీ చేసిన పోలీసులు మిగిలిన ఫోన్లు వాడుకలో లేకపోవటంతో రికవరీ చేయటం ఒకింత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ దొంగిలించిన మొబైల్‌ను ఏ క్షణాన ఉపయోగించినా రికవరీ చేస్తారు. అయితే బాధితులు ఫిర్యాదులో పూర్తి పేరు, చిరునామాతో పాటు కాంటాక్ట్ నంబరు, 15 అంకెలతో కూడిన ఐఎంఈఐ నంబర్‌ను తెలియజేయాలి. పై వాటిలో ఏ ఒక్కటి సరిగా లేకపోయినా ఫోన్లు రికవరీ చేయటం కష్టం. ఈ నేపథ్యంలో వాట్సాప్ నంబర్లో సమాచారం పొందుపరిచేటప్పుడు బాధితులు తగిన జాగ్రత్తలు తీసుకుని పూర్తి సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇలా ఫిర్యాదు చేయాలి.. సెల్ఫోన్లను రికవరీ చేసేందుకు చర్యలు చేపట్టిన ఎస్పీ అందుకోసం మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టం (ఎంఎంటీఎస్) అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగంలోకి తీసుకువచ్చారు. సెల్‌ఫోన్ పోగొట్టుకున్న బాధితులు ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా 9490617573 అనే వాట్సాప్ నంబర్‌కు ‘హాయ్’ అని లేదా ‘హెల్ప్’ అని మెసేజ్ పెట్టి యాప్ అడిగే ప్రశ్నలకు పూర్తి సమాధానాలు ఇచ్చి, ఫిర్యాదును ఆన్లైన్ చేసుకోవాలి. వాట్సాప్ నంబరు ద్వారా అందిన ఫిర్యాదును ఐటీ కోర్ టీం సిబ్బంది, సీసీఎస్ సిబ్బంది స్వీకరించి సెల్ఫోన్లను రికవరీ చేసేందుకు చర్యలు చేపతారు. ఈ విధానాన్ని జనవరి మాసంలో ఎస్పీ ప్రారంభించగా.. మొదటి మూడు నెలల్లోనే దాదాపు 1700 ఫిర్యాదులు జిల్లా పోలీసులకు అందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీటిల్లో ఇప్పటి వరకూ దాదాపు రూ. 50 లక్షల విలువ చేసే సుమారు 200 సెల్ఫోన్లను రికవరీ చేశారు. ఉపయోగంలో ఉంటే వెంటనే రికవరీ.. జిల్లాలో ఇప్పటి వరకు 1700 ఫిర్యాదులు అందాయి. వీటిని ఐటీ కోర్ టీంకు అందజేస్తున్నాం. ఫోన్లను రికవరీ చేసేందుకు జిల్లాలో ప్రత్యేక టీంలను రంగంలోకి దింపాం. రూ. 50 లక్షల విలువ చేసే 200 సెల్ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశాం. అతి త్వరలోనే మిగిలిన ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేస్తాం. – జాషువ, ఎస్పీ, కృష్ణా జిల్లా -
నా ఫోన్ పోయింది: పోలీసులకు బండి సంజయ్ ఫిర్యాదు
సాక్షి, కరీంనగర్/ హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఫోన్ ఎక్కడుంది? అనేది చర్చనీయాంశమయ్యింది. కలకలం రేపిన పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కుట్రలో సూత్రధారిగా అనుమానిస్తూ పోలీసులు సంజయ్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా అరెస్టు అయినప్పటి నుంచి ఆయన ఫోన్ కన్పించకుండా పోయింది. అయితే బెయిల్‌పై విడుదలైన సంజయ్..ఆదివారం దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరెస్టు సమయం నుంచి తన వ్యక్తిగత ఫోన్ కన్పించడం లేదని పేర్కొంటూ పట్టణ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానిని ఎలాగైనా వెదికి పెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వాస్తవానికి ఆ ఫోన్ తన సోదరి పేరు మీద ఉందని, భద్రతా పరమైన కారణాల నేపథ్యంలో తాను ఆమె పేరు మీద ఉన్న సిమ్‌కార్డు వాడుతున్నానని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఆదివారం రాత్రి పార్టీ లీగల్ సెల్ నేతలతో భేటీ అయిన సంజయ్.. తన ఫోన్‌ను పోలీసులే మాయం చేశారని ఆరోపించడం గమనార్హం. కాగా రాత్రి పార్టీ లీగల్ సెల్ నేతలతో భేటీ అయిన సంజయ్..తన ఫోన్‌ను పోలీసులే మాయం చేశారని ఆరోపించారు. అసలు ఆ రోజు ఏం జరిగింది? అరెస్టు అనంతరం సంజయ్‌ను పోలీసులు బొమ్మల రామారం తీసుకెళ్తున్న క్రమంలో ఆయన ఫోన్ కనిపించకుండా పోయింది. వరంగల్ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఆ ఫోన్ సాయంతోనే ఏ–2 ప్రశాంత్‌తో సంజయ్ (ఏ–1) పదేపదే సంభాషించారు. ఈ కేసు ఛేదనకు ఎంతో కీలకమైన సాంకేతిక ఆధారం కావడంతో కుట్ర కేసు మొత్తం ఫోన్ చుట్టే తిరుగుతోంది. అయితే ఆ ఫోన్ సంజయ్ సమీప అనుచరుడైన బోయినపల్లి ప్రవీణ్ రావు వద్ద ఉండి ఉంటుందని ఓ సీనియర్ పోలీసు అధికారి అనుమానం వ్యక్తం చేశారు. బ్యాటరీ అయిపోవడం వల్ల స్విచ్ ఆఫ్ అయి ఉంటుందని, చివరిగా అది సిద్దిపేట టవర్ లొకేషన్ చూపించిందని, తప్పనిసరిగా బండి అనుచరులే దాన్ని దాచారని, ఆధారాలు దొరక్కుండా ఇప్పటికే ధ్వంసం చేసి ఉండే అవకాశాలు కూడా లేకపోలేదని ఆయన అభిప్రాయపడ్డారు. అది పోలీసుల పనే..: సంజయ్ తన సెల్‌ఫోన్‌ను పోలీసులే మాయం చేశారని బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్లో పోలీసులు తనను అక్రమంగా అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి సిద్దిపేట వెళ్లే వరకు తన చేతిలోనే ఉన్న ఫోన్ ఆ తర్వాత మాయం అయ్యిందని పేర్కొన్నారు. మాయం చేసినవారే తనను ఫోన్ అడగడం సిగ్గు చేటన్నారు. వివిధ అంశాలపై చర్చించేందుకు ఆదివారం రాత్రి రాష్ట్ర లీగల్ సెల్ నేతలతో భేటీ అయిన సందర్భంగా బండి మాట్లాడారు. కేసీఆర్ తన దగ్గర పెట్టుకున్నట్టున్నారు.. ‘మంత్రులు, ఎమ్మెల్యేలు చాలామంది నాకు ఫోన్లు చేశారు. ఆ విషయం తెలిసి సీఎం కేసీఆర్ మూర్ఛపోయారు. నా ఫోన్ బయటకు వస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయనే భయంతో కేసీఆర్ తన దగ్గర పెట్టుకున్నట్టున్నారు. ఇతరుల ఫోన్ల సంభాషణలు వినడమే ఆయన పని..’అని సంజయ్ ఆరోపించారు. ‘బీజేపీ కార్యకర్తలు దేనికీ భయపడరు. దేశం, ధర్మం కోసం పోరాడుతూనే ఉంటారు. పేపర్ లీకేజీ విషయంలో కేసీఆర్ కొడుకు రాజీనామాకు డిమాండ్ చేస్తున్నాం. రాజీనామా విషయంలో కేసీఆర్ కుటుంబానికో న్యాయం? ఇతరులకో న్యాయమా?..’అని ప్రశ్నించారు. నిర్బంధాలు పెరిగే అవకాశం ‘రాబోయే రోజుల్లో బీజేపీ కార్యకర్తలపై నిర్బంధాలు మరింత పెరిగే అవకాశం ఉంది. పెద్ద సంఖ్యలో కేసులు నమోదు చేసి జైలుకు పంపేందుకు కేసీఆర్ ప్రభుత్వం కుట్ర చేస్తోంది. అందువల్ల లీగల్ సెల్ పార్టీ కార్యకర్తలకు పూర్తి స్థాయిలో అండగా నిలవాలి. మీరున్నారనే ధైర్యం, కాపాడతారనే విశ్వాసంతోనే కార్యకర్తలంతా కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడుతున్నారు. మీరు మాకు అండగా ఉండండి..’అని సంజయ్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సర్కార్ తీరును, పోలీసుల వైఖరిని సంజయ్ తప్పుపట్టారు. ‘ప్రధాని మోదీని అవమానించేలా తిడతారు. ఆయన దిష్టి»ొమ్మలను తగలబెడతారు. వ్యతిరేకంగా పోస్టర్లు అంటిస్తారు. కేసీఆర్‌ను తిడితే మాత్రం నాన్ బెయిలబుల్ కేసులు పెడతారు. పాత కేసులను తిరగదోడి జైలుకు పంపుతున్నారు..’అని ధ్వజమెత్తారు. చదవండి: ఈనెల 14న తెలంగాణకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బండి సంజయ్ ఫిర్యాదు కాపీ -
‘ఫోకస్’ తప్పుతోంది
కంచర్ల యాదగిరిరెడ్డి : అర నిమిషం తీరిక లేదు... అర్ధరూపాయి సంపాదన లేదు.. ఈ సామెత వింటుంటే ఈ తరం బడిపిల్లలు గుర్తుకు వస్తున్నారు. ఎప్పుడు చూసినా పుస్తకాల్లో తలమునకలై ఉంటారు. బాగా చదువుతున్నారే అని మురిసిపోయినా.. పరీక్షల్లో వచ్చిన మార్కులు చూస్తే అత్తెసరు. ఈ తరం పిల్లల్లో ఎక్కువ మంది ఫోకస్డ్గా లేకపోవడమే దీనికి కారణమని నిపుణులు చెప్తున్నారు. అసలు పెద్దవారి ఏకాగ్రత కూడా బాగా తగ్గిపోతోందని.. స్మార్ట్ఫోన్లు, ఇతర డిజిటల్ పరికరాలు, మాధ్యమాల వల్లే ఈ పరిస్థితి నెలకొందని స్పష్టం చేస్తున్నారు. దృష్టి మళ్లే దారులెన్నో.. మునుపటితో పోలిస్తే పిల్లల దృష్టి మళ్లేందుకు స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, టీవీలు ఇలా ఎన్నో కారణమవుతున్నాయి. నిత్యం ఎవరో ఒకరి నుంచో, ఏదో వాట్సాప్ గ్రూపులోనో మెసేజీలు రావడం, ఫేస్బుక్ నోటిఫికేషన్లు, స్మార్ట్ వాచ్ మెసేజ్.. ఇలా తరచూ మన దృష్టిని తప్పిస్తున్నాయని, దీనివల్ల తదేకంగా ఒక పనిని శ్రద్ధగా చేసే శక్తిని కోల్పోతున్నామని నిపుణులు చెప్తున్నారు. సెల్ఫోన్లు రాకముందు, సాంకేతిక విప్లవం లేనప్పుడు మనుషులు ఎలా ఉన్నారు? ఇప్పుడెలా ఉన్నారన్నదానిపై అమెరికాలోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్, అండ్ హ్యూమన్ డెవలప్మెంట్’ఇటీవల ఓ అధ్యయనం చేసింది. 1946–1975 మధ్య కాలంలో పుట్టి, రకరకాల రంగాల్లో పనిచేస్తున్న వారిని, 1976–2000 మధ్య పుట్టి పలు రంగాల్లో ఉన్న వారిని, ప్రైమరీ స్కూల్, హైసూ్కల్, కాలేజీ విద్యార్థులను ప్రశ్నించి.. ఐక్యూ టెస్ట్ పెట్టింది. ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా దేశాల్లో ఈ అధ్యయనం సాగింది. ఏ పనికైనా ఫోకస్ అవసరం! మనం ఏ పనిచేయాలన్నా ఫోకస్ అనేది చాలా అవసరం. లేకుంటే ఏ పని సరిగా, త్వరగా పూర్తి చేయలేం. తరాలు మారుతున్న కొద్దీ ఫోకస్ టైం మారుతూ వస్తోందని అధ్యయనంలో తేలింది. ఉదాహరణకు బేబీ బూమర్లు అంటే 1946–1964 మధ్య పుట్టినవాళ్లకు ఫోకస్ టైం ఇరవై నిమిషాలు ఉండేది. తర్వాతి తరం జనరేషన్ ఎక్స్ అంటే 1965–1980 మధ్య పుట్టినవారి ఏకాగ్రత 12 నిమిషాలకు చేరింది. 1981, ఆ తర్వాత పుట్టినవారికి ఇది కేవలం ఎనిమిది నుంచి 12 నిమిషాలే.. ఫోకస్ పెట్టలేక పోయినప్పుడు అరగంటలో చేయాలనుకున్న పని గంట, గంటన్నర పడుతుంది. పైగా చేసే పనిలో నాణ్యత ఉండదని.. యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి సమస్యలూ వస్తాయని, మానసిక ఒత్తిడి పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. నాలుగేళ్ల కితం జరిగిన ఒక పరిశోధన ప్రకారం.. ఇంటర్నెట్ వాడకం మన మెదడులోని పలు ప్రాంతాల్లో మార్పులకు కారణమవుతుందని తేలింది. ఇలా మారిపోయే విషయాల్లో మన జ్ఞాపకాలూ ఉన్నాయని వెల్లడైంది. ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్, అండ్ హ్యూమన్ డెవలప్మెంట్’అధ్యయనం ప్రకారం కూడా.. నిద్రకు ఉపక్రమించే ముందు స్మార్ట్‌ఫోన్ లేదా ఇతర డిజిటల్ స్క్రీన్లను చూడటం వల్ల నిద్రకు చేటు కలుగుతుంది. అది కాస్తా వారి రోజువారీ కార్యక్రమాలపై ప్రభావం చూపుతుంది. వాటితో కేవలం పరధ్యానమే.. కంప్యూటర్ల వాడకంతో మనుషుల మానసిక స్థితిపై కలిగే ప్రభావంపై ఇంకో అధ్యయనం కూడా జరిగింది. ఆ్రస్టేలియాకు చెందిన డాక్టర్ షరోన్ హార్వుడ్ నిర్వహించిన ఆ అధ్యయనం ప్రకారం.. టెక్నాలజీ అనేది మన మేధో సామర్థ్యాన్ని వెంటనే మార్చేస్తుందనడం పూర్తిగా వాస్తవమేమీ కాదు. యుగాలుగా రకరకాల పరిస్థితు లను ఎదుర్కొని పరిణామం చెందిన మెదడు పనితీరు ఒక్క తరంలో మారిపోదని ఆమె చెప్తున్నా రు. కాకపోతే డిజిటల్ పరికరాలు మన మనసును పరధ్యానంలో పడేస్తాయని స్పష్టం చేస్తున్నారు. పక్కన ఉన్నా ప్రభావమే.. మన పరిసరాల్లో స్మార్ట్‌ఫోన్, ఇతర డిజిటల్ స్క్రీన్ డివైజ్ ఉంటే చాలు మన ఏకాగ్రత స్థాయి గణనీయంగా తగ్గిపోతుందంటున్నారు నిపుణులు. ఆలోచించడం, గుర్తుంచుకోవడం, భావోద్వేగాల నియంత్రణకు కారణమైన విషయాలపై దృష్టిపెట్టడం వంటివాటిపై స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్, కంప్యూటర్ల వంటివి ప్రభావం చూపగలవని ఎన్నో అధ్యయనాల్లో తేలిందని స్పష్టం చేస్తున్నారు. చేతుల్లో, లేదా జేబులో, పక్కన టేబుల్‌పైనో స్మార్ట్‌ఫోన్ ఉంటే.. మన మనసు చేసే పనిపై కాకుండా ఫోన్‌కు వచ్చే నోటిఫికేషన్లు లేదా అది చేసే శబ్దాలపై పడుతుందని వెల్లడైందని వివరిస్తున్నారు. క్షణం విడిచి ఉండలేకుండా.. రోజులో గంటా రెండు గంటల పాటు స్మార్ట్‌ఫోన్ అందుబాటులో లేకపోయినా సరే నానా హైరానా పడే వారి సంఖ్య బాగా పెరిగిందని నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే పాశ్చాత్యదేశాల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారని.. మన దేశంలోనూ ఆ పరిస్థితి వస్తోందని హెచ్చరిస్తున్నారు. తక్షణ తృప్తి (ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్) కారణంగానే మనుషులు డిజిటల్ పరికరాలకు బానిసలవుతున్నట్టు వివరిస్తున్నారు. చాలా దేశాల్లో పిల్లలు నిపుణులు సూచించిన దాని కంటే ఎక్కువ సమయం డిజిటల్ తెరల ముందు గడుపుతుండటం ఆందోళనకరమని స్పష్టం చేస్తున్నారు. సమస్యను గుర్తించడం ఎలా? ♦ చేపట్టిన పనిని పూర్తి చేసేందుకు కష్టపడుతుంటే, కష్టం అనిపిస్తుంటే, అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోతుంటే ఫోకస్ కోల్పోయామని అర్థం. ♦ అకారణంగా చిరాకు అనిపిస్తున్నా, మన దృష్టి సులువుగా పక్కదారి పడుతున్నా, రెస్ట్‌లెస్‌గా అనిపిస్తున్నా.. ఫోకస్ కోల్పోయామని స్పష్టంగా తెలుస్తుంది. ♦ ముఖ్యమైన అంశాలను అప్పటికప్పుడు మర్చిపోతుంటే ఫోకస్ పోతున్నట్టే. ఏమిటి పరిష్కారం? ♦ ఫోకస్ పెంచుకునేందుకు సులువైన మార్గాలెన్నో ఉన్నాయి. మన ఏకాగ్రతను దెబ్బతీస్తున్న మొబైల్ ఫోన్ నోటిఫికేషన్, కంప్యూటర్ నోటిఫికేషన్ వంటివి ఆఫ్ చేయాలి లేదా అత్యవసరమైనవే వచ్చేలా సెట్ చేసుకోవాలి. ♦ ఏ పని ముందు చేయాలి? ఏ పని తరువాత చేయాలి? దేనికి ప్రాధాన్యత ఎక్కువ? దేనిని నిర్ణీత సమయం (డెడ్‌లైన్)లోపు పూర్తి చేసుకోవాలన్న దానిపై కొంత వర్క్ చేసుకుని ప్రాధాన్య క్రమంలో పూర్తి చేయడం నేర్చుకుంటే ఫోకస్ పెరుగుతుంది. ♦ ప్రతిరోజు మైండ్ ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయాలి. అంటే పూర్తిగా చేసే పనిపైనే ధ్యాస నిలిపాలి. ఉదాహరణకు.. ఉదయం లేవగానే బ్రష్ చేసేటప్పుడు ఆ బ్రషింగ్పై మాత్రమే, కాఫీ తాగేటప్పుడు దానిపై మాత్రమే ధ్యాస నిలిపేందుకు ప్రయత్నించాలి. ఇలా అన్ని పనులకూ వర్తింపజేయాలి. దీనిని రోజూ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఫోకస్ ఆటోమేటిగ్గా పెరుగుతుంది. –విశేష్ , సైకాలజిస్ట్ ఇంటర్నెట్కు బానిసవుతున్న జనం ప్రపంచవ్యాప్తంగా జనం ఇంటర్నెట్కు బానిసగా మారుతున్నారని పలు అధ్యయనాల్లో తేలింది. వాటి ప్రకారం.. రోజులో ఒక్కొక్కరూ కనీసం 149 నిమిషాల పాటు స్మార్ట్‌ఫోన్‌ను చూస్తూ గడుపుతున్నారు. ప్రతి ఐదుగురిలో ఒకరు రాత్రిళ్లు నిద్రలేచి మరీ సోషల్ మీడియా పోస్టులు చూసుకుంటున్నారు. వీడియో గేమ్స్ ఆడే యువకులు వారంలో వాటిపై గడిపే సమయం 8 గంటలకు పైనే.. అమెరికాలో ట్రాఫిక్ ప్రమాదాల్లో 26శాతం స్మార్ట్‌ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేయడం వల్లనే జరుగుతున్నాయి! -
అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాడుపని.. ఆ వీడియో చూస్తూ అడ్డంగా బుక్..!
అగర్తల: త్రిపుర బీజేపీ ఎమ్మెల్యే జాదవ్ లాల్ నాథ్ వివాదంలో చిక్కుకున్నారు. అసెంబ్లీలో బడ్జెట్ సెషన్ జరుగుతుండగా ఆయన ఫోన్లో అశ్లీల వీడియోలు చూసినట్లు ఓ వీడియో బయటకు వచ్చింది. దీంతో ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రజాప్రతినిధి అయి ఉండి అసెంబ్లీలో ఇలాంటి పనులు చేయడమేంటని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. జాదవ్ లాల్ నాథ్ బాగ్బస్సా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్‌కు సంబంధించి అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో ఆయన ఫోన్లో వీడియోలు చూస్తూ కన్పించారు. ఈ క్రమంలోనే ఓ ఆశ్లీల వీడియోను చూస్తున్న సమయంలో వెనకాల ఉన్న సభ్యులెవరో రికార్డు చేశారు. అది బయటకు రావడంతో తీవ్ర దుమారం చెలరేగింది. చదవండి: ఛీ, తను కూతురేనా?.. ప్రియుడితో మాట్లాడొద్దన్నందుకు కన్నవాళ్లను దారుణంగా.. ఈ వ్యవహారంపై బీజేపీ సీరియస్ అయింది. వెంటనే వివరణ ఇవ్వాలని జాదవ్‌కు సమన్లు పంపింది. అయితే ఆయన మాత్రం ఇంకా వీటిపై స్పందించలేదు. అసెంబ్లీ సెషన్ అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. బీజేపీ నేతలు అసెంబ్లీలో అశ్లీల వీడియోలు చూడటం ఇది తొలిసారేం కాదు. 2012లో కూడా కర్ణాటక అసెంబ్లీలో ఇద్దరు మంత్రులు లక్ష్మణ్ సవాది, సీసీ పాటిల్.. అశ్లీల వీడియోలు చూస్తూ కన్పించారు. అనంతరం తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే బీజేపీ దీనిపై విచారణ జరిపి వారు తప్పుచేయలేదని నిర్ధరించుకున్న తర్వాత తిరిగి మంత్రి పదువులు ఇచ్చింది. చదవండి: రాహుల్ గాంధీని కోర్టుకు ఈడుస్తా.. కాంగ్రెస్ నేతపై లలిత్ మోదీ ఫైర్.. -
కూలీ చేతికి రూ. 1.4 లక్షల ఫోన్..ఆ తర్వాత ఏం జరిగిందంటే..
ఓ రైల్వే కూలీ చేతికి సుమారు రూ. 1.4 లక్షల ఫోన్ దొరికింది. ఐతే అతను ఆ ఫోన్‌ని నేరుగా రైల్వే పోలీసులకు ఇచ్చేసి తన నిజాయితీని చాటుకున్నాడు. ఈ ఘటన ముంబైలోని దాదర్ స్టేషన్లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..దశరత్ దౌండ్ అనే రైల్వే కూలి దాదార్ రైల్వే స్టేషన్లో కూలీగా 30 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. అతని రోజువారీ సంపాదన రూ. 300. ఐతే అతను ఎప్పటిలానే ఆరోజు కూడా అమృత్‌సర్‌కి వెళ్లే రైలు ఆగి ఉన్న ఫ్లాట్ ఫాం 4 వద్ద తన పనిని ముగించుకుని ఇంటికి పయనమవుతున్నాడు. ఆ క్రమంతో రాత్రి సుమారు 11.40 గంటల సమయంలో ఒక ఖరీదైన ఫోన్ కనిపించింది. అది ఫ్లాట్‌ఫాంపై నడుస్తుండగా సీటింగ్ ఏరియాలో పడి ఉండటంతో అక్కడున్న ప్రయాణికులను ఆ ఫోన్ గురించి వాకబు చేస్తే మాది కాదనే చెప్పారు. దీంతో దశరత్ నేరుగా రైల్వే పోలీసులకు అసలు విషయం చెప్పి ఆ ఫోన్‌ని ఇచ్చేశాడు. ఆ తర్వాత పోలీసులు ఆ ఫోన్ ఎవరిదని అని ట్రేస్ చేస్తుండగా..అది అమితాబచ్చన్‌కి విశ్వసనీయ మేకప్ ఆర్టిస్ట్ దీపక్ సావంత్‌కి చెందన ఫోన్ అని తేలింది. దీంతో పోలీసులు ఆ ఫోన్‌ని బాధితుడు సావంత్‌కి అందజేసి ఈ విషయం చెప్పడంతో అతను ఒక్కాసారిగా ఆశ్చర్యపోయాడు. తన ఫోన్ తనకు తిరిగి లభించినందుకు బహుమతిగా ఆ కూలికి రూ. 1000 కూడా ఇచ్చాడు సావంత్. ఆ కూలీని పోలీసుల తోపాటు సావంత్ కుటుంబం కూడా ఎంతగానో ప్రశంసించింది. ఈ మేరకు కూలీ దశరత్ మాట్లాడుతూ.. ఈ ఘటనను మర్చిపోయానని, సడెన్‌గా పోలీసుల నుంచి కాల్ రావడంతో ఈ విషయం గురించి తెలిసిందని చెబుతున్నాడు. అయినా తనకు గాడ్జెట్లపై ఎలాంటి అవగాహన లేదని, పైగా తాను ఎవరి వస్తువుని తన వద్ద ఉంచుకోనని చెప్పాడు. ఏదీఏమైనా ఇలాంటి వ్యక్తులు ఉండటం అత్యంత అరుదు. (చదవండి: క్లాస్ రూం చుట్టూ పరిగెత్తించి మరీ టీచర్‌పై దాడి.. పేరెంట్స్ అరెస్టు) -
అవును... ఇది నిజమే!
► జపాన్ లోని ఆసోచి కొండల్లో ‘విండ్ ఫోన్’ అనే టెలిఫోన్ బూత్ ఉంది. ‘విండ్ ఫోన్ ఏమిటి? అక్కడెక్కడో కొండల్లో ఉండడం ఏమిటి?’ అనుకుంటున్నారా! విషయంలోకి వస్తే...2011లో జపాన్ లో భూకంపం వచ్చి ఎంతోమంది చనిపోయారు. చనిపోయిన వారితో ఆత్మీయులకు మాట్లాడే అవకాశం లేదు. వారు ఎక్కడో ఉన్నట్లుగానే భావించి ఫోన్లో మాట్లాడి మనసులో ఉన్న బాధను దించుకోవడమే ఈ ‘విండో ఫోన్’ ఉద్దేశం. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌లో కూడా ‘విండ్ ఫోన్’లు ఏర్పాటయ్యాయి. ► పెరూలో ‘టకనాకుయ్’ పేరుతో ప్రతి సంవత్సరం ‘ఫైటింగ్ ఫెస్టివల్’ జరుగుతుంది. ‘టకనాకుయ్’ అంటే ఒకరితో ఒకరు తలపడడం. అంతమాత్రాన ఈ ఫైటింగ్ ఫెస్టివల్లో రక్తం కారేలా కొట్టుకోరు. ఒక విధంగా చెప్పాలంటే ఉత్తుత్తి ఫైటింగ్ అన్నమాట! మనసులో ఉన్న కోపం, ఒత్తిడి, ఆందోళనను వదిలించుకోవడానికి ఈ ‘ఫైటింగ్ ఫెస్టివల్’ ఉపయోగపడుతుందనే నమ్మకం ఉంది. దీనికి ఎంతో పురాతనమైన చరిత్ర ఉంది. -
ఫోన్ ట్యాపింగ్ డ్రామాపై కోటంరెడ్డి స్నేహితుడు రామశివారెడ్డి క్లారిటీ
సాక్షి, నెల్లూరు జిల్లా: ఎమ్మెల్యే కోటం రెడ్డి ఫోన్ టాపింగ్ డ్రామాపై ఆయన స్నేహితుడు రామశివారెడ్డి స్పష్టత నిచ్చారు. ఆ ఆరోపణలపై మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘నాది ఆండ్రాయిడ్ ఫోన్. నా ఫోన్ లో ప్రతీకాల్ రికార్డవుతుంది. కోటంరెడ్డి చెప్పింది ట్యాపింగ్ కాదు.. రికార్డింగ్ మాత్రమే. కేవలం యాదృచ్చికంగా కాల్ రికార్డయింది’’ అని చెప్పారు. ‘‘ఉద్ధేశపూర్వకంగా రికార్డ్ చేసిన కాల్ కాదు. ట్యాపింగ్ అంటూ ఇంత వివాదం అవుతుందని ఊహించలేదు. ట్యాపింగ్ అంటూ కోటంరెడ్డి ఇంత హంగామా చేసినందుకే వాస్తవాలు చెబుతున్నా.. నా ఫోన్‌ను ఫోరెన్సిక్‌కు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా’’ అని రామశివారెడ్డి తేల్చి చెప్పారు. ‘‘నేను ఎవరో సీఎం జగన్‌కు తెలీదు. ఏదో ఊహించుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. మా ఇద్దరివీ ఐఫోన్లు అని కోటంరెడ్డి అబద్ధం చెప్పారు. నాపై ఎవరి ఒత్తిడీ లేదు.. వాస్తవం చెప్పేందుకే మీడియా ముందుకొచ్చా’’ అని రామశివారెడ్డి స్పష్టం చేశారు. తనకు 30 ఏళ్లుగా వైఎస్ కుటుంబంతో అనుబంధం ఉందన్నారు. వైఎస్ కుటుంబంపై విశ్వాసం ఉందని ఆయన అన్నారు. చదవండి: కోటంరెడ్డికి ఊహించని షాక్.. దెబ్బ అదుర్స్! -
అదే పనిగా ఫోన్లో మాట్లాడుతున్న కూతురు.. కొట్టి చంపిన తండ్రి..
ముషీరాబాద్: వద్దని చెప్పినా ఫోన్ అదే పనిగా ఫోన్ మాట్లాడుతుందనే కోపంతో గొంతునులిమి చంపాడు ఆ కసాయి మారు తండ్రి. ఈ దారుణ ఘటన ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. సీఐ జహంగీర్ యాదవ్ కథనం ప్రకారం....రహిమున్నీసా అలియాస్ సన్నూబేగం.. బెహ్రాన్ దేశంలో హౌస్‌కీపింగ్ పనిచేస్తోంది. బేగంపేటకు చెందిన అక్బర్‌తో మొదటి వివాహం జరగగా పదేళ్ల క్రితం రైలు ప్రమాదంలో అతను మరణించాడు. అప్పటికే వారికి షేక్ ఆయాజ్, నౌసీన్ ఉన్నీసా, యాసీన్ ఉన్నీసా(17) అనే ముగ్గురు సంతానం కలిగారు. మొదటి భర్త అక్బర్ మృతి తర్వాత రహిమున్నీసా ముషీరాబాద్‌కు చెందిన ఆటో డ్రైవర్ మహ్మద్ తౌఫిక్‌ను వివాహం చేసుకుంది. కాగా, ముగ్గురి పిల్లల్లో ఆయాజ్ షేక్ బేగంపేటలోని తన నాయన మ్మ దగ్గర నివసిస్తుండగా ఇద్దరు అమ్మాయిలు మారు తండ్రితోనే ఉంటున్నారు. రెండవ కూమార్తె యాసీన్ ఉన్నీసా(17) నిత్యం ఫోన్లో మాట్లాడుతుండడంతో పలు మార్లు తౌఫిక్ అలా మాట్లాడొద్దని హెచ్చరించాడు. తాజాగా ఆదివారం తెల్లవారు జామున 3గంటల సమయంలోనూ యాసీన్ ఫోన్లో మాట్లాడుతూ ఉండడాన్ని గమనించిన తౌఫిక్ ఆవేశంతో ఫోన్ లాక్కున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నావని, ఫోన్ పాస్వర్డ్ చెప్పాలని నిలదీశాడు. చెప్పకపోవడంతో చెంపలమీద రెండు దెబ్బలు వేశాడు. దీంతో బెదిరిపోయిన యాసిన్ గట్టిగా ఏడుస్తుండడంతో చుట్టుపక్కల వాళ్లు వింటారు ఏడవొద్దంటూ గట్టిగా గొంతు నులమడంతో స్పృహతప్పి పడిపోయింది. వెంటనే తన సోదరి నౌసీన్ ఉన్నీసా హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తీసుకువెళ్లగా డాక్టర్లు పరీక్షించి అప్పటికే యాసీన్ మరణించినట్లు నిర్ధారించారు. దీంతో తౌఫిక్ ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. చదవండి: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య.. సూసైడ్ నోట్ రాసి.. -
విమానం టేక్ అఫ్ టైంలో ఫోన్ మిస్సింగ్.. పైలెట్ కిటికిలోంచి వంగి మరీ..
ఓ ప్రయాణికుడు విమానం ఎక్కే ముందు తన ఫోన్‌ని మర్చిపోయాడు. ఐతే ఇంతలో విమానంలో ప్రయాణికులంతా ఎక్కేశారు. ఇక బయలుదేరుతుంది అనేలోపు ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఈ విషయాన్ని డల్లాస్ చెందిన ఎయిర్‌లైన్ ఫేస్బుక్లో పేర్కొంది. వివరాల్లోకెళ్తే...కాలిఫోర్నియాలోని లాంట్ బీజ్ ఎయిర్‌పోర్ట్‌లో సౌత్ వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానం ప్రయాణికులంతా ఎక్కేయడంతో టేకాఫ్‌కి రెడీ అయ్యింది. ఇంతలో గ్రౌండ్ సిబ్బంది గేట్ వద్ద ఒక ప్రయాణికుడు ఫోన్ మర్చిపోవటాన్ని గుర్తించారు. దీంతో వారు వెంటనే అప్రమత్తమై టేకాఫ్ అవుతున్న విమానం దగ్గరకు వచ్చి ప్రయాణికుడి ఫోన్ ఇచ్చేందుకు వస్తారు. విషయం గ్రహించిన ఫైలెట్ కిటికిలోంచి వంగి మరీ సిబ్బంది నుంచి ఫోన్‌ని అందుకున్నాడు. ఆ తర్వాత ప్రయాణకుడికి అతను మర్చిపోయిన ఫోన్‌ని అందజేశారు. అందుకు సంబంధించిన వీడియోని డల్లాస్ ఎయిర్‌లైన్ ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ...మా సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌ని ప్రేమించండి. ఇలా మా సిబ్బంది అప్రమత్తమై ప్రయాణికులకు సాయం చేయడాన్ని కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ అంటారు అని పేర్కొంది. దీంతో ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. When our Employees at @LGBairport noticed a Customer's phone left behind in a gate area after a flight that was already boarded and pushed back from the gate, they didn't hesitate. #WorldKindnessDay pic.twitter.com/cf3gJy8Nmy — Southwest Airlines (@SouthwestAir) November 13, 2022 (చదవండి: వామ్మో! భగభగమండే సూర్యుని ఉపరితలంపై స్నేక్) -
హైకోర్టు జడ్జికే దమ్కీ.. పోలీస్ అధికారులపై వేటు
లక్నో: పోలీసు సబ్ ఇన్స్పెక్టర్, ఇద్దరు కానిస్టేబుల్స్ నేరుగా హైకోర్టు జడ్జితో మీ ఇల్లు ఎక్కడా, ఎక్కడికి రావాలి అని ప్రశ్నించడంతో సస్పెండ్ అయ్యారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... గత ఆదివారం అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ప్రకాష్ సింగ్ జిల్లాకు వచ్చినప్పుడూ ఈ ముగ్గురు పోలీసులకు ఎస్కార్ట్ డ్యూటీ పడింది. దీంతో ఆ ముగ్గురు పోలీసులు న్యాయమూర్తితో ఫోన్లో ఇల్లు ఎక్కడ ఉంది, ఎక్కడకు రావాలి అని నేరుగా ప్రశ్నించారు. దీంతో న్యాయమూర్తి సీరియస్ అయ్యి పోలీస్ సూపరింటెండ్‌కి పిర్యాదు చేశారు. అంతే అధికారులు అదేరోజు ఆ ముగ్గురు పోలీసులను తక్షణమే సస్పెండ్ చేశారు. ఐతే ఈ విషయామై నేరుగా న్యాయమూర్తిని సంప్రదించకూడదని అధికారులు తెలిపారు. న్యాయమూర్తి ప్రోటోకాల్‌ని పర్యవేక్షిస్తున్నావారి వద్ద నుంచి సమాచారం తెలుసుకోవాలని చెప్పారు. ఐతే వారు న్యాయమూర్తి ఫోన్ నెంబర్ ఎలా సంపాదించారనేది తెలియరాలేదన్నారు. (చదవండి: స్టాలిన్ ఎందుకు మౌనంగా ఉన్నారు? పరువు, గౌరవం కోసం ఎంతకైనా వెళ్తా...నటీ ఖుష్బు సీరియస్) -
జెలెన్ స్కీతో ఫోన్లో సంభాషించిన మోదీ
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తమ భూభాగాల రక్షణ కోసమే ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్నామని అవసరమనుకుంటే అణుదాడికి కూడా దిగుతామని కరాఖండిగా చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో మోదీ ఫోన్లో మాట్లాడారు. అదీకూడా పుతిన్ పెద్ద సంఖ్యలో బలగాలను సమీకరిస్తానని బహిరంగా ప్రకటించిన రెండు వారాల తర్వాత ఇరు నాయకులు ఫోన్లో సంభాషించుకోవడం విశేషం. పైగా పుతిన్ తమ దాడిని ముఖ్యంగా నాటో సభ్య దేశాలైన యూఎస్ దాని మిత్రదేశాలకు వ్యతిరేకంగా చేస్తున్న గొప్ప యుద్ధంగా అభివర్ణించుకున్నాడు కూడా. ఈ మేరకు ఫోన్లో మోదీ....ఉక్రెయిన్‌లో తూర్పు ప్రాంతాల రష్యా బలగాల దాడి గురించి ప్రస్తావిస్తూ...అణుదాడుల విషయమై ఆందోళన వ్యక్తం చేశారు. పైగా ఇరు దేశాల నాయకులు శత్రుత్వాన్ని విరమించుకోవాలని హితవు పలికారు. చర్చలు, దౌత్యమార్గాల ద్వారా సమస్యని పరిష్కరించుకోవాల్సిందిగా పునరుద్ఘాటించారు. వివాదానికి ఎప్పుడూ సైనిక పరిష్కారం ఉండదని కూడా దృఢంగా చెప్పారు. అలాగే ఎలాంటి శాంతి ప్రయత్నాలకైనా సహకరించేందుకు భారత్ ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటుందని తెలియజేసినట్లు ప్రధాని మంత్రి కార్యాలయం పేర్కొంది. (చదవండి: బంగ్లాదేశ్‌లో సగం పైగా జనాభా అంధకారంలోనే...) -
కేంద్ర మంత్రిని గుర్తుపట్టని అధికారి.. ఉద్యోగానికి ఎసరు?
లక్నో: పైఅధికారులు ఫోన్ చేస్తేనే ఎంతో హడావిడి చేస్తారు అధికారులు. అలాంటిది కేంద్ర మంత్రి ఫోన్ అంటే మరి ఎలా ఉంటుంది? కానీ, ఫోన్ చేసిన కేంద్రమంత్రి గొంతును గుర్తుపట్టకపోవడం వల్ల ఓ అధికారి ఉద్యోగానికే ఎసరు తెచ్చింది. కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి, ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథీ నియోజకవర్గ ఎంపీ స్మృతి ఇరానీ ఫోన్ చేయగా ఓ శాఖలో పని చేస్తున్న క్లర్క్ గుర్తించకపోవటంతో ఆయనపై దర్యాప్తునకు ఆదేశించారు. ఏం జరిగింది? అమేథీ లోక్‌సభ నియోజకవర్గంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆగస్టు 27న పర్యటించారు. అదే సమయంలో ముసఫిర్ఖానా తహసిల్‌లోని పూరే పహల్వాన్ గ్రామానికి చెందిన కరుణేశ్(27) అనే వ్యక్తి తన తల్లికి పెన్షన్ మంజూరు కాలేదనే విషయాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అందుకు స్థానిక కార్యాలయంలో క్లర్క్ దీపక్ కారణమని పేర్కొన్నారు. పెన్షన్ దరఖాస్తును ఇంకా అతడు ధ్రువీకరించలేదని తన గోడు వెల్లబోసుకున్నాడు. వెంటనే స్పందించిన స్మృతి ఇరానీ.. ఆ అధికారికి ఫోన్ చేశారు. కానీ, ఆ వ్యక్తి మాత్రం కేంద్ర మంత్రి గొంతును గుర్తు పట్టలేకపోయారు. దీంతో ఆమె పక్కనే ఉన్న జిల్లా ఉన్నతాధికారి ఆ ఫోన్ తీసుకొని క్లర్క్‌తో మాట్లాడారు. వెంటనే కార్యాలయానికి రావాలని స్పష్టం చేశారు. ఈ విషయంపై విచారణ జరపాలని జిల్లా అధికారులకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సూచించారు. కరుణేశ్ ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన అధికారులు.. క్లర్క్ నిర్లక్ష్యం వహించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై ముసఫిర్ఖానా సబ్‌డివిజినల్ మేజిస్ట్రేట్ విచారణ జరుపుతారని.. నివేదిక ప్రకారం నిర్లక్ష్యం వహించిన అధికారిపై చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: మోదీ రోజుకు ఏడు సార్లు నమాజ్ చేసేవారు.. కాంగ్రెస్ మహిళా నేత వ్యాఖ్యలపై దుమారం.. -
సెల్ఫీ పిచ్చి తెచ్చిన తంటా ... ఏకంగా అగ్ని పర్వతంలోనే జారీ...
సెల్ఫీల పిచ్చితో ఇటీవల యువత ఎంత భయానక ప్రమాదాలను కొని తెచ్చుకంటున్నారో చూస్తేనే ఉన్నాం. మనం ఉన్నది ప్రమాదకరమైన ప్రదేశం వద్ద అన్న విషయం మర్చిపోయి మరీ సెల్ఫీ మోజుతో ప్రాణాల పైకి తెచ్చుకుంటున్నారు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి సెల్ఫీ పిచ్చితో చావు అంచు వరకు వెళ్లొచ్చాడు. వివరాల్లోకెళ్తే...ఒక అమెరికన్ టూరిస్ట్ తన కుటుంబంతో సహా ఇటలీలోని ప్రఖ్యాత అగ్ని పర్వతం అయిన మౌంట్ వెసువియస్ పర్వతం వద్దకు వెళ్లాడు. అక్కడ అతను తన కుటుంబంతో కలిసి ఆ అగ్నిపర్వత వద్ద సెల్ఫీలు తీసుకుంటున్నాడు. ఇంతలో అతని ఫోన్ ప్రమాదవశాత్తు ఆ అగ్ని పర్వతం బిలంలో పడిపోయింది. తన ఫోన్ కోసం అని ఆ అమెరికన్ టూరిస్ట్ ఆ అగ్నిపర్వతం బిలంలోకి దిగడానికి యత్నిస్తున్నాడు. ఐతే అతను ప్రమాదవశాత్తు పట్టుతప్పి ఆ బిలంలోకి పడిపోయాడు. అతను బిలంలోకి పడిపోవడాన్ని గుర్తించిన స్థానిక గైడ్లు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పట్టారు. ఈ మేరకు పోలీసులు కూడా రంగంలోకి దిగి హెలికాప్టర్ సాయంతో ఆ వ్యక్తిని రక్షించారు. ఐతే పోలీసులు అతనిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. వాస్తవానికి అతను ఈ అగ్నిపర్వతం వద్దకు వెళ్లేందుకు ఎలాంటి అనుమతి తీసుకోలేదు. ఇది చాలా ప్రమాదాకరమైన ప్రదేశం అని పర్యాటక సందర్శనకు నిషేధించారు. ఆ టూరిస్ట్ ఎలాంటి అనుమతి లేకుండానే తన కుటుంబంతో సహా అక్కడకు రావడంతో అతనిపై కేసు నమోదు చేశారు పోలీసులు. (చదవండి: గోటబయ పరార్.. లంకలో ఎమర్జెన్సీ: బయట కనిపిస్తే కాల్చివేతే) -
అదిరిపోయే ఫీచర్లతో నథింగ్ ఫోన్ (1).. ధర ఎంతంటే!
ఎట్టకేలకు నథింగ్ ఫోన్ (1) స్మార్ట్ ఫోన్ భారత్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ ఫోన్ ఎలా ఉంది. ఫోన్ ధరెంత? ఫీచర్లు ఎలా ఉన్నాయనే విషయాల గురించి తెలుసుకుందాం. దేశీయ మార్కెట్లో శాంసంగ్, షావోమీ, రియల్ మీ స్మార్ట్ ఫోన్లకు గట్టి పోటీ ఇస్తూ విడుదలైన నథింగ్ ఫోన్ (1) ధర రూ.32,999గా ఉంది. వన్ ప్లస్ కో- ఫౌండర్ కార్ల్ పీ సొంతంగా స్మార్ట్ ఫోన్ నథింగ్‌ను విడుదల చేశారు. విడుదలైన ఈ ఫోన్ వన్ ప్లస్‌కు చెందిన 'వన్ ప్లస్ నార్డ్ 2టీ' కంటే నథింగ్ ఫోన్ (1) ఫోన్ బాగుంటుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నథింగ్ ఫోన్ (1)ఫీచర్లు నథింగ్ ఫోన్ (1) ఫోన్ 6.55 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్, 4,500ఎంఏహెచ్ బ్యాటరీ, 33డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్, 15డబ్ల్యూ క్యూఐ వైర్లెస్ ఛార్జింగ్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో 10-బిట్ ఓఎల్ఈడీ డిస్ప్లే ప్యానల్, హెచ్డీఆర్10 ప్లస్ సపోర్ట్, 402పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 1200 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 240హెచ్ జెడ్ టచ్ శాంప్లింగ్ సదుపాయం ఉంది. దీంతో పాటు ఈ ఫోన్లో క్వాల్కం స్నాప్ డ్రాగన్ 778జీ ప్లస్ చిప్ సెట్, 12జీబీ ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జీబీ యూఎఫ్ఎస్ 3.1స్టోరేజ్ సపోర్ట్ ఉంది. ఈ ఫోన్లో డ్యూయల్ కెమెరా సెటప్, 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 766 సెన్సార్ (ఓఐఎస్ ప్లస్ ఈఐఎస్),50 ఎంపీ శాంసంగ్ జేఎన్1 ఆల్ట్రా వైడ్ సెన్సార్(ఈఐఎస్)16 ఎంపీ సోని ఐఎంఎక్స్ 471 ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. వన్ ప్లస్ నార్డ్2 టీ వర్సెస్ నథింగ్ ఫోన్ (1) ధరలు మనదేశంలో నథింగ్ ఫోన్ (1), వన్ ప్లస్ నార్డ్2 మధ్య వ్యత్యాసం ఎలా ఉందో చెక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నథింగ్ ఫోన్ మూడు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. 8జీబీ ర్యామ్ ..128జీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ. 32,999, 8జీబీ ర్యామ్..256జీబీ ఫోన్ ధర రూ. 35,999, 12జీబీ ర్యామ్.. 256 జీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ.38,999గా ఉంది. ఇక వన్ ప్లస్ నార్డ్2 టీలో కేవలం రెండు వేరియంట్ స్టోరేజ్ సదుపాయం ఉంది. 8జీబీ ర్యామ్ 128జీబీ (రూ. 28,999), 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మాత్రమే ఉంది. ఈ వేరియంట్ స్టోరేజ్ ఫోన్ ధర (రూ. 33,999).గా ఉంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అదిరిపోయే గాడ్జెట్, ఫోన్లో మీరు అరిచి గీపెట్టినా ఎవ్వరికి వినబడదు!
సాధారణంగా నలుగురిలో ఫోన్ మాట్లాడటం మహా కష్టం. అదీ ఆఫీసుల్లో, ప్రయాణాల్లో ఇంకా కష్టం. మనం మాట్లాడితే పక్కవారు మన రహస్యాలను వింటున్నారా? మాటలను గమనిస్తున్నారా? ఇలా ఎన్నో భయాలతో.. ఫోన్లో అవతల వ్యక్తికి చెప్పాలనుకున్నది చెప్పలేం. మరోవైపు మన ఫోన్ సంభాషణలతో పక్కవాళ్లకు ఇబ్బంది కలుగుతుందేమోననే భయం కొన్నిసార్లు ముఖ్యమైన ఫోన్‌కాల్స్‌ను కూడా మాట్లాడనివ్వదు. పోనీ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మాట్లాడదామంటే.. అవతల వ్యక్తికి మన మాట సరిగా వినిపించకపోవడమో, చెవుల్లో ఇయర్ ఫోన్స్ ఉండటంతో.. మనమెంత బేస్‌లో మాట్లాడుతున్నామో మనకు తెలియకపోవడమో ఇలా చాలా సమస్యలు ఉంటాయి. దాంతో ఏదైనా రహస్యం చెప్పాలంటే.. తర్వాత చెబుతానులే అనేస్తాం. మాట దాటేస్తాం. అలాంటి సమస్యకు చెక్ పెడుతోంది ఈ ఉష్మీ హెడ్ ఫోన్స్. చక్కగా వందమందిలో ఉన్నా రహస్యాలను ఆపాల్సిన పనిలేకుండా చేస్తుంది ఈ డివైజ్. దీన్ని మెడలో వేసుకుని, సంబంధిత యాప్ స్మార్ట్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటే చాలు. ఫోన్ రాగానే దాని ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకుని.. మెయిన్ బోర్డ్ డివైజ్‌ని పెదవులకు దగ్గరగా బిగించుకోవాలి. దీంట్లో సైజ్ అడ్జస్టబుల్ సిస్టమ్ ఉంది. ఔటర్ స్పీకర్స్, మినీ జాక్, ఎయిర్ ఛానల్, మైక్రోఫోన్ ఇలా హై టెక్నాలజీతో రూపొందిన ఈ డివైజ్ ఎంత గట్టిగా మాట్లాడినా మన వాయిస్‌ని క్యాప్చర్ చేసి.. బయటికి అస్సలు వినిపించనివ్వకుండా ఫోన్లో అవతల వ్యక్తికి మాత్రం స్పష్టంగా వినిపించేలా చేస్తుంది. స్మార్ట్ ఫోన్ యాప్‌తో లైబ్రరీ మాస్కింగ్ సౌండ్లను ఎంచుకోవడానికీ, వాల్యూమ్‌ను సర్దుబాటు చేయడానికీ వీలుంటుంది. బయటి నుంచి వచ్చే శబ్దాలను ఇది చాలా సులభంగా నివారిస్తుంది. ఒకవేళ ఏ కారణం చేతైనా క్యాప్చర్ అయినా వాటిని తగ్గించి మన మాటను మాత్రమే అవతలవారికి వినిపించేలా చేస్తుంది. ఆప్షన్స్‌ను బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. -
ఆ ఆనందం వెలకట్ట లేనిది!: హృదయాన్ని కదిలించే వైరల్ వీడియో!:
ఇంతవరకు మనం ఎన్నో వైరల్ వీడియోలు చూశాం. చాలా వరకు మనస్సుకు హత్తుకునేవి, కదిలించేవి చూశాం. అచ్చం అలాంటి వైరల్ వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. పైగా తమిళ నటుడు మాధవన్‌ని సైతం ఆకట్టుకుంది. (చదవండి: అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరానికి ప్రపంచంలోనే అతిపెద్ద తాళం!) అసలు విషయంలోకెళ్తే...ఆ వీడియోలో ఒక కొడుకు తన తల్లి పుట్టిన రోజు సందర్భంగా బహుమతి తీసుకువచ్చి ఇస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే ఆమె సందేహంగా ఆ కవర్ని తెరుస్తుంది. ఆ తర్వాత ఆమె అందులో ఉన్న రూ. 8 వేలు ఖరీదు చేసే ఫోన్‌ని చూసి ఒక్కసారిగా చాలా సంబరపడిపోతుంది. పైగా ఆ ఆనందం మాటల్లో చెప్పలేనది, వెలకట్టలేనిది. ఈ మేరకు మనసును కదిలించే ఈ వీడియోకి "ఈ ఆనందాన్ని వెలకట్ట లేం" అనే క్యాప్షన్‌ని జోడించి మరీ విఘ్నేష్ అనే యూజర్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియో ఎంతో మంది నెటిజన్లను కదిలించింది. ఆఖరికి తమిళనటుడు మాధవన్ సైతం "తల్లి ముఖంలో తెచ్చిన ఆనందం వెలకట్ట లేనిది" అని తమిళంలో క్యాప్షన్ ఇచ్చి మరీ రీట్విట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వస్తున్నాయి మీరు కూడా ఓ లుక్కేయండి. (చదవండి: 60 మిలియన్లకు కోవిడ్ కేసులు..మృతుల సంఖ్య 8 లక్షలకుపైనే!) Adhula Irundha Mobile-oda Velai Verum 8800 Rs Dhan...! Aana Enga Amma Patta Sandhoshathuku Velayae Kidayaadhu ❤️ Birthday Gift..! pic.twitter.com/4QZJE7Ocii — Vignesh (@VigneshSammu) January 5, 2022 -
మిస్డ్ కాల్ వచ్చింది..రూ.46లక్షలు పోయాయి
ఈజీగా డబ్బులు సంపాదించడం ఎలా? ఇప్పుడు దీని గురించి సైబర్ నేరస్తులు ఆలోచిస్తున్నారు. ఓవైపు కరోనా, కొత్తగా పుట్టుకొస్తున్న టెక్నాలజీలు.వెరసీ సైబర్ నేరస్తులు డబ్బులు సంపాదించడం చాలా ఈజీ అవుతుంది. కోవిడ్ కారణంగా సైంబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, ఫోన్ కాల్స్, ఓటీపీల పట్ల అప్రమత్తంగా ఉండాలని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నా.. కొంతమంది ఆ సూచనల్ని లైట్ తీసుకుంటున్నారు. దీన్ని అదునుగా చేసుకొని కేటుగాళ్లు మిస్డ్ కాల్ ఇచ్చి బ్యాంక్ అకౌంట్లలో మనీనీ కాజేస్తున్నారు. అహ్మాదాబాద్ శాటిలైట్ ఎక్స్టెన్షన్లో నివాసం ఉండే రాకేష్ షా కెమికల్ బిజినెస్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇంట్లో ఉన్న రాకేష్‌కు గుర్తు తెలియని నెంబర్ నుంచి మిస్డ్ కాల్ వచ్చింది. మిస్డ్ కాల్ వచ్చిన తర్వాత మొబైల్లో సిగ్నల్ లేకపోవడం, సిమ్ కార్డులు బ్లాక్ అయ్యాయి. దీంతో తన సిమ్ కార్డులు పనిచేయడం లేదని సదరు టెలికాం నెట్‌వర్క్‌కు చెందిన కస్టమర్ కేర్‌కి కాల్ చేశాడు. రాకేష్ ఫిర్యాదుతో నిర్వాహకులు నాలుగు గంటల్లో సిమ్‌లు యాక్టివేట్ అవుతాయని చెప్పారు. సరిగ్గా అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యిందని మరోసారి కంపెనీకి ఫిర్యాదు చేశాడు. మరుసటి రోజు ఉదయం సిమ్‌ను యాక్టివేట్ చేసే సమయంలో మళ్లీ రెండు సిమ్ కార్డ్‌లు బ్లాక్ అయినట్లు గుర్తించాడు. వెంటనే సంబంధిత సిమ్ నెట్ వర్క్‌కు సంబంధించిన స్టోర్ నిర్వాహకుల్ని నేరుగా సంప్రదించాడు. రాకేష్ ఫోన్‌ను చెక్ చేసిన స్టోర్ ప్రతినిధులు కోల్‌కతాలో రెండు సిమ్ కార్డ్‌లను బ్లాక్ చేసినట్లు గుర్తించారు. అంతేకాదు తనకు తెలియకుండా బ్యాంక్ ట్రాన్సాక్షన్లు జరిగినట్లు అనుమానించాడు. సంబంధిత బ్యాంక్‌లను సంపద్రించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సైబర్ నేరస్తులు తన బ్యాంక్ అకౌంట్లో ఉన్న రూ.46 లక్షలు కాజేశారని కంగుతిన్నాడు. ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ ద్వారా సోనాయ్ దాస్, రోహిత్ రాయ్, రాకేష్ విశ్వకర్మ బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ అయినట్లు బ్యాంక్ అధికారులు నిర్ధారించారు. దీంతో అప్రమత్తమైన రాకేషన్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 11 ట్రాన్సాక్షన్ల ద్వారా రూ.46.36 లక్షలు విత్‌డ్రా అయ్యాయని, బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించిన ఓటీపీలను సేకరించడం ద్వారా బ్యాంక్‌లో డబ్బులు మాయమైనట్లు పోలీసులు తెలిపారు. చదవండి: గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక..! -
ఒక్క అంకె తప్పుగా ఇవ్వడంతో ఆ మహిళకు 4,500 మిస్డ్ కాల్స్!
మన ఫోన్‌కి అదే పనిగా కాల్స్ వస్తేనే చాలా చికాకుగా ఉంటుంది. అలాంటిది అదే పనిగా మిస్డ్ కాల్స్ వస్తే అబ్బా ఏంటిది అని విసుగ్గా అనిపిస్తుంది. కానీ యూకేకి చెందిన ఒక మహిళకి ఏకంగా 4500 మిస్డ్ కాల్స్ వచ్చాయంటా తెలుసా!. (చదవండి: ఏకంగా పామునే హెయిర్ బ్యాండ్‌గా చుట్టుకుంది!! వైరల్ వీడియో) అసలు విషయంలోకెళ్లితే....యూకేలోని ఉత్తర ఐర్లాండ్‌లోని బాంగోర్కు చెందిన హెలెన్ ఫోన్ మొత్తం మిస్డ్ కాల్స్‌తో నిండిపోయింది. అయితే ఆమె బిజినెస్ కాంటాక్ట్ నెంబర్ని హెల్ప్ లైన్ నెంబర్ అని తప్పగా భావించడంతో ఆమెకు తెగ కాల్స్ వచ్చాయి. ఈ మేరకు ఆమె బిజినెస్ కాంటాక్ట్ నెంబర్‌కి డిపార్ట్మెంట్ ఫర్ ది ఎకానమీ డెలివరీ చేసిన స్పెండ్ లోకల్ స్కీమ్ ఫోన్ నెంబర్‌కి ఒక అంకె తేడా ఉండటంతో వారు తప్పుగా హెలెన్ బిజినెస్ కాంటాక్ట్ నెంబర్ని ఇచ్చారు. దీంతో ఆ లోకల్ స్కీమ్‌కి చెందిన కస్టమర్లంతా తమ కార్డు బ్యాలెన్స్ చెక్ చేయండి అంటూ హెలెన్స్కి రకరకాలు కాల్స్ చేశారు. అయితే వారిలో కొంతమంది వృద్ధుల ఉంటే వారికి తనవంతుగా సాయం చేసింది. మరికొందరికి అసలు విషయాన్ని వివరించింది కూడా. ఏది ఏమైనా ఎన్ని కాల్స్ రిసీవ్ చేసుకోగలరు ఎవరైనా. చివరికి ఆమె ఇక మిగతా ఏ కాల్ని రిసీవ్ చేసుకోవడం మానేసింది. దీంతో ఆమె ఫోన్ మొత్తం మిస్డ్ కాల్స్‌తో నిండిపోయింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఫర్ ది ఎకానమీ సదరు మహిళకు క్షమాపణలు చెప్పింది కూడా. (చదవండి: అవిభక్త కవలలు ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించారు!!) -
ఫోన్ కొట్టేశాడని ఏకంగా తలకిందులుగా వేలాడదీశారు...ఐతే చివరికి!!
కొంతమంది చేసే పనులు అత్యంత హేయమైనవిగా ఉంటాయి. అసలు స్వతహాగా వాళ్లు మంచి వాళ్లైనప్పటికీ వారి జోలికి వచ్చిన లేక వారి సంబంధించిన వస్తువులు పోయినప్పుడు అపరిచితుడిలా మారిపోయి అత్యంత ధారుణానికి వడిగడుతుంటారు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి ఎంత ధారుణమైన పని చేశాడో చూడండి. (చదవండి: పారా సెయిలింగ్ మళ్లీ ఫెయిల్ !... ఇద్దరు మహిళలకు చేదు అనుభవం!!) అసలు విషయంలోకెళ్లితే....మొబైల్ ఫోన్ దొంగిలించాడనే ఆరోపణతో ఒక మత్స్యకారుడిని తోటి మత్స్యకారుల బృందం చేపల వేట బోటుకు తలకిందులుగా వేలాడదీసి దాడి చేసింది. అయితే ఈ ఘటన బందూర్లోని మంగళూరు ఫిషింగ్ హార్బర్లో లంగరు వేసిన ఫిషింగ్ బోట్లో చోటు చేసుకుంది. అంతేకాదు దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తిపై మత్స్యకారుల బృందం దాడి చేసిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పైగా మత్స్యకారులంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు సెల్‌ఫోన్‌ను దొంగిలించాడనే ఆరోపణతో దాడి చేసిన మత్స్యకారుడిని వైలా శీనుగా గుర్తించి అరెస్టు చేశాం అని చెప్పారు. అతేకాదు ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. (చదవండి: పంజాబ్ కోర్టు కాంప్లెక్స్‌లో పేలుడు) -
అమానుషం: అందరు చూస్తుండగా.. రోడ్డుపై యువతిని బైక్‌తో ఈడ్చుకెళ్లి..
న్యూఢిల్లీ: బైకుపై వచ్చిన కొందరు దుండగులు మహిళ చేతిలోని ఫోన్‌ని లాకెళ్లడంతో పాటు ఆమెను బైకుతో కొంత దూరం ఈడ్చుకెళ్లారు. ఈ అమానవీయ ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని షాలిమార్ బాగ్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. రోడ్డుపై ఓ మహిళ చేతిలో ఫోన్ పట్టుకుని నిల్చుని ఉంది. ఇదంతా గమనించిన ఇద్దరు వ్యక్తులు వేగంగా ఆమె వైపు బైకు నడుపుకుంటూ మహిళ చేతిలోని ఫోన్‌ని లాక్కొన్నారు. దీన్ని ప్రతిఘటించిన ఆమె వెంటనే బైకుపై ఉన్న ఓ వ్యక్తి చొక్కాను గట్టిగా పట్టుకుంది. దీంతో అక్కడి నుంచి పారిపోయేందుకు ఆ దొంగలు ప్రయత్నించారు. ఈ క్రమంలో మహిళను రోడ్డుపై 150 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లారు. చివరకు ఆ ప్రాంతం నుంచి ఆగంతకులు పారిపోగా , ఘటనా స్థలంలో ఉన్న కొందరు ఆమెను రక్షించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చదవండి: లీనా నాయర్ సీఈవో ఘనత.. తన శైలిలో మహీంద్రా స్పందన -
కూల్‌గా కూర్చోని ఫోన్ తెరిచాడు.. ఒక్కసారిగా మంటలు.. షాకింగ్ వీడియో
ఓ వైపు స్మార్ట్ ఫోన్ విక్రయాలు పెరుగుదలతో పాటే వాటి రిపేర్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇక కొన్ని ఫోన్లు వాటి లోపల సాంకేతిక సమస్య మరేదో కారణం వల్ల వాడుతున్నప్పుడో, లేదా జేబులో పెట్టుకున్నప్పుడో పేలిన ఘటనలు బోలెడు ఉన్నాయి. అందుకే నిపుణుల ఛార్జింగ్ పెట్టినప్పుడు మొబైల్‌ని వాడకూడదని సూచిస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి ఫోన్‌ని రిపేర్ చేయాలని ప్రయత్నిస్తుండగా అది హఠాత్తుగా పేలిన ఘటన వియత్నాంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. షాపులోని ఓ వ్యక్తి తన డెస్క్ ముందు కూర్చోని ఫోన్ రిపేర్ చేస్తుంటే... సడెన్‌గా అది పెద్ద శబ్దంతో పేలింది. హఠాత్తుగా ఫోన్ పేలి మంటలు వచ్చాయి. అదృష్టవశాత్తు అతను అప్రమత్తంగా ఉండడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అనంతరం దాన్ని జాగ్రత్తగా తీసి... షాప్ బయటకు విసిరేశాడు. అతను ఆలస్యం చేసి ఉంటే... పెద్ద అగ్ని ప్రమాదం జరిగేదే. అక్కడి సీసీటీవీ కెమెరా ఈ దృశ్యాన్ని రికార్డ్ చేసింది. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు స్పందిస్తూ.. "ఇదే ఫోన్ పాకెట్లో పేలితే ఎలా ఉంటుందో ఊహించుకోండి" అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా... "లక్కీ బాయ్ నీకు ఏమీ కాలేదు" అని మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు. చదవండి: హే! ఇది నా హెయిర్ స్టైయిల్... ఎంత క్యూట్‌గా ఉందో ఈ ఏనుగు!! -
రేషన్ బియ్యం పేరుతో మహిళల ఫోన్ నంబర్లు.. అర్థరాత్రి ఫోన్ చేసి
పామిడి: అర్ధరాత్రి సమయంలో మహిళలకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్న ఆకతాయిని స్థానికులు గుర్తించి దేహశుద్ధి చేశారు. వివరాలు.. పామిడి మండలం పాళ్యం గ్రామానికి చెందిన యువకుడు అశోక్.. రేషన్ బియ్యం కొనుగోలు చేస్తానంటూ చాలా మంది మహిళల ఫోన్ నంబర్లు సేకరించుకున్నాడు. ఈ క్రమంలోనే వారికి అర్ధరాత్రి సమయంలో అపరిచిత నంబర్ల నుంచి ఫోన్ చేస్తూ వేధించేవాడు. ఇటీవల మండల కేంద్రంలోని పామిడమ్మ వీధికి చెందిన మహిళకు అర్ధరాత్రి ఫోన్ చేసి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కుటుంబసభ్యులు జోక్యం చేసుకుని మాట్లాడారు. మంగళవారం నెహ్రూ కాలనీలోని ఓ ప్రైవేట్ స్కూల్ వద్ద అశోక్‌ని గుర్తించి, నిలదీయడంతో వారితో వాగ్వాదానికి దిగాడు. సహనం కోల్పోయిన బాధితులు ఒక్కసారిగా అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. విచారణలో వారం రోజుల క్రితం పామిడిలోని మదీనా కాలనీలో ఓ మహిళపై అతను దాడి చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. -
చార్జింగ్కు పెట్టి ఫోన్లో మాట్లాడిన యువతి, అక్కడికక్కడే..
ఫోన్ చార్జింగ్ పెట్టినప్పుడు ఉపయోగించకూడదని, ఆ సమయంలో కాల్స్ మాట్లాడటం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తుంటారు. ఎందుకంటే అలా ఫోన్ చార్జింగ్ పెట్టి ఉపయోగిస్తుంటే.. అందులోంచి మంటలు రావడం, బ్యాటరీ పేలి.. గాయపడిన ఘటనలు బోలెడు ఉన్నాయి. తాజాగా ఓ యువతి ఫోన్‌కు చార్జింగ్ పెట్టి మాట్లాడుతుండగా ప్రమాదవశాత్తు మృతి చెందింది. ఈ ఘటన బ్రెజిల్లో చోటు చేసుకుంది. అయితే ఆ దేశంలో ఈ తరహా ఘటన జరగడం ఇది మూడో సారి. అది కూడా ఒక వారంలోనే. ది సన్‌లో వచ్చిన సమాచారం ప్రకారం.. 18 ఏళ్ల రాడ్జా తన ఫోన్‌ని ఉపయోగిస్తుండగా, శాంటారెమ్‌లోని తన ఇంటిపై పిడుగుపడింది. దీంతో ఆమె విద్యుత్ షాక్‌కు గురై స్పృహ కోల్పోయింది. అయితే కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దురదృష్టవశాత్తు, రాడ్జా అప్పటికే మృతి చెందింది. గతవారం కూడా అపొలినారియా జిల్లాలో చార్జింగ్ పెట్టి ఫోన్ ఉపయోగించి పిడుగుపాటుకు గురై ఓ వ్యక్తి చనిపోయాడు. అలాగే కౌన్సిలర్ రాయ్‌ముండో బ్రిటో కూడా ఇలాగే చార్జింగ్ పెట్టి ఫోన్ ఉపయోగించి.. పిడుగుపాటుకు గురయ్యాడు. దీంతో.. ఫోన్ చార్జింగ్ పెట్టి.. ఎవ్వరూ కాల్స్ ఎత్తకూడదని.. ఫోన్ ఉపయోగించకూడదని.. బ్రెజిల్ ప్రభుత్వ అధికారులు ప్రజలను హెచ్చరించారు. చదవండి: Fact Check: హెలికాప్టరుకు ఉరేసి ఉరేగించిన తాలిబన్లు?.. అసలు నిజం ఇది! -
మార్కెట్లో విడుదల కానున్న బడ్జెట్ ఫోన్
హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేసేందుకు సిద్ధమైంది. వచ్చే (సెప్టెంబర్) నెలలో ఇన్ఫినిక్స్ హాట్ 11ను విడుదల చేయనున్నట్లు స్మార్ట్ ఫోన్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే ఇన్ఫినిక్స్ నోట్ 7, ఇన్ఫినిక్స్ హాట్ 9, ఇన్ఫినిక్స్ హాట్ 10ఎస్ బడ్జెట్ ఫోన్లతో రూరల్ ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇన్ఫినిక్స్ సంస్థ తాజాగా ఇన్ఫినిక్స్ హాట్ 11 విడుదల ప్రకటనతో ఆఫోన్ ఫీచర్లు, ధర ఎంత? అనే విషయంపై స్మార్ట్ ఫోన్ యూజర్లు ఆసక్తిని కనబరుస్తున్నారు.ప్రస్తుతం ఆన్ లైన్లో విడుదలైన ధర, ఫీచర్లు ఇలా ఉన్నాయి. ఇన్ఫినిక్స్ హాట్ 11 ఫీచర్లు రెండు మెమరీల వేరియంట్ తో 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్,6జీబీ ర్యామ్, 64జీబీ స్టోర్‌తో ఇన్ఫినిక్స్ హాట్ 11 ధర రూ.9,999గా ఉండగా నుంది. మీడియాటెక్ హెలియో G88 సిస్టమ్-ఆన్-చిప్ తో అందుబాటులోకి రానుండగా.. పూర్తి స్థాయిలో ఫీచర్లను ఇన్ఫినిక్స్ సంస్థ విడుదల చేయలేదు. -
ఫోన్లో మాట్లాడుతుందని అనుమానం పెంచుకున్నాడు..
సాక్షి,పటాన్చెరు టౌన్: ఇతరులతో ఫోన్లో మాట్లాడుతుందని అనుమానం పెంచుకున్న భర్త..భార్యను సుత్తితో తలపై కొట్టి హత్య చేసిన సంఘటన పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వేణుగోపాల్‌రెడ్డి, క్రైం సీఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని చిట్కుల్ వడ్డెర కాలనీకి చెందిన రాజేశ్వరి(23)కి మూడు సంవత్సరాల క్రితం మెదక్ జిల్లా కౌడిపల్లి మండల పరిధిలోని వెంకటరావుపేట గ్రామానికి చెందిన మేక వేలుతో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత చిట్కుల్లోని వడ్డెరకాలనీలోనే కాపురం పెట్టారు.రెండున్నరేళ్ల కుమారుడు రాజేష్ ఉన్నాడు. మేక వేలు రాయి కొట్టే పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో భార్య ఇతరులతో ఎక్కువగా ఫోన్లు మాట్లాడుతుందని అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయమై తరచు ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. ఈ 16వ తేదీన కూడా ఇద్దరు గొడవ పడగా, కుటుంబసభ్యులు సర్దిచెప్పారు. మనసులో కక్ష పెట్టుకున్న మేక వేలు బుధవారం ఉదయం రాళ్లు కొట్టేందుకు ఉపయోగించే సుత్తితో భార్య రాజేశ్వరి తలపై గట్టి కొట్టాడు. దీంతో ఆమె గట్టిగా అరుపులు వేయగా, మేక వేలు ఇంటి నుంచి పరారయ్యాడు. చుట్టుపక్కల వారు, కుటుంబసభ్యులు గమనించి పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందిందని డాక్టర్లు చెప్పారు. మృతదేహానికి పోస్టుమార్టమ్ చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా, భార్యను హత్య చేసిన మేక వేలు పటాన్చెరు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కుటుంబ సభ్యుల క్రూరత్వం, ఫోన్లో మాట్లాడుతున్నారని..
భోపాల్: దేశంలో మహిళల కోసం ఎన్ని చట్టాలు రూపొందించిన వారి పై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రత్యేకంగా వారి రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు, ఇంకెన్నో కార్యక్రమాలు చేపడుతున్నా అవేవి వారిని కాపాడలేకపోతున్నాయనే చెప్పాలి. ఓ వైపు బయట వాళ్ల నుంచి లైంగిక దాడులు, మరో వైపు కుటుంబ సభ్యుల నుంచి ఆచారాలు పేరుతో ఆగడాలు.. ఇలా వాళ్లపై హింసాకాండలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల ఓ యువతిని కుటుంబ సభ్యులే చెట్టుకు వేలాడదీసి కర్రలతో కొట్టగా.. తాజాగా సభ్య సమాజంలో ఇలాంటి ఘటనలు కూడా జరుగుతాయా అనే సందేహం కలిగేలా.. బంధువులతో ఫోన్లో మాట్టాడారని నేపంతో కుటుంబ సభ్యులే యువతులపై క్రూరంగా ప్రవర్తించారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. ఇద్దరు యువతులు వారి బంధువులతో ఫోన్ మాట్లాడుతున్నట్లు కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో కోపంతో ఆ యువతులను ఇంట్లోని వారే దారుణంగా హింసించారు. కాగా వీడియో బయటకు రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో.. యువతులు కొట్టకండి అని కుటుంబ సభ్యులను వేడుకుంటున్నా కనికరం లేకుండా వాళ్లను కర్రలు, రాళ్ళతో కొట్టారు. వారిని హింసించిన వారిలో ఓ మహిళ కూడా ఉండడం గమనార్హం. తాండా పోలీస్ స్టేషన్ అధికారుల ప్రకారం.. ఈ సంఘటన జూన్ 22 న పీపాల్వా గ్రామంలో జరగగా, వీడియో కాస్త జూన్ 25 న పోలీసులకు చేరింది. దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. తాజాగా ఈ వీడియో వైరల్‌గా మారింది. I have received another complaint of a woman being brutally beaten up by a mob. If anyone can update me on this case : wrt location and date. What kind of a barbaric society have we become, the person is laughing while filming this! No fear of the law? Contempt of SC judgments! pic.twitter.com/kl1CNUIs6S— Tehseen Poonawalla Official 🇮🇳 (@tehseenp) July 4, 2021 -
ఫోన్ మాట్లాడుతూ లోతైన బావిలో.. కేకలు వేసినా ఫలితం లేదు
పలమనేరు: ఫోన్ మాట్లాడుతూ.. పరాకుగా కాలుజారి 60 అడుగుల లోతున్న పాడుబడ్డ బావిలో పడిపోయాడు. ఈత రావడంతో కొద్దిసేపు ఈది చెట్ల వేర్లను పట్టుకుని నిలదొక్కుకున్నాడు. రక్షించమని కేకలు వేశాడు. నిర్మానుష్యంగా ఉన్న అటువైపు ఎవరూ రాకపోవడంతో ప్రయోజనం లేకపోయింది. దాదాపు 17 గంటల తర్వాత అతడి కేకలు పశువులు మేపుకొనే వ్యక్తికి వినిపించాయి. దీంతో అతడి ప్రాణాలు దక్కాయి. మరో 3 గంటలకు అతడిని పైకి తీశారు. మొత్తం 20 గంటలపాటు మృత్యుపోరాటం చేశాడతడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగింది. పలమనేరుకు చెందిన రియల్ ఎస్టేట్ దళారి చంద్రశేఖర్ గురువారం మధ్యాహ్నం పట్టణానికి సమీపంలోని ఓ దాబాలో భోజనం చేసి ఫోన్ మాట్లాడుతుండగా, దాబా వెనుక ఉన్న మెట్లు లేని బావిలో కాలుజారి పడ్డారు. 60 అడుగుల లోతైన ఆ బావిలో 12 అడుగుల నీరుంది. ఈదుకుంటూ కొంతసేపటి తర్వాత చెట్ల వేర్లను పట్టుకుని నీటిపైకి చేరుకున్నాడు. ఎవరైనా కాపాడాలంటూ గట్టిగా అరిచాడు. అటువైపు ఎవరూ రాకపోవడంతో అతని గోడు ఎవరికీ తెలియలేదు. గురువారం రాత్రంతా బావిలోనే గడిపాడు. శుక్రవారం ఉదయం పశువులు మేపడానికి జీవన్ అనే యువకుడు వెళ్లాడు. బావిలోంచి అరుపులు రావడంతో వెళ్లి చూసిన జీవన్‌కుమార్‌కు చంద్రశేఖర్ కనిపించాడు. అగ్ని మాపక సిబ్బంది తాడు సాయంతో చంద్రశేఖర్‌ను బావిలోంచి బయటకు లాగారు. తాను ప్రాణాలతో బయటపడాతానని అనుకోలేదన్న చంద్రశేఖర్.. తనను కాపాడిన జీవన్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. -
ఊసరవెల్లిలా రంగులు మార్చే ఫోన్, అందరి దృష్టి దానిపైనే
మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో ఈసారి అందరి దృష్టి ఇన్ఫినిక్స్ కాన్సెప్ట్ 2021 ఫోన్‌పై పడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ ఫోన్లో ఫీచర్స్‌ని ఇన్ఫినిక్స్ చేర్చింది. రంగులు మార్చేస్తుంది డ్యూయల్ కలర్ ఛేంజింగ్ బ్యాక్ కవర్ ఈ ఫోన్ ప్రత్యేకత. ఇన్ఫినిక్స్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్ కలర్ మారుతుందని ఇన్ఫినిక్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మేనేజర్ జెస్సీ ఝాంగ్ తెలిపారు. గతంలో ఈ తరహా ఫీచర్‌తో ఏ ఫోన్ రాలేదు. ఒక రకంగా ఈ ఫోన్ ఊసరవెల్లిలా రంగులు మార్చేస్తుంది. క్రేజీ ఫీచర్లు యువతను ఆకట్టుకునేలా అనేక ఫీచర్లను ఇన్ఫినిక్స్ తన రాబోయే ఫోన్లో జోడించనుంది. అందులో కలర్ ఛేంజింగ్ బ్యాక్ ప్యానెల్‌తో పాటు 4000 mAh బ్యాటరీ అందివ్వనుంది దీనికి తోడుగా 160 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇవ్వడం వల్ల 10 నిమిషాల్లోనే ఈ ఫోన్ ఫుల్ ఛార్జ్ అవుతుంది. 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ అందివ్వనుంది. 3డీ గ్లాస్ కవరింగ్, 60 ఎక్స్ జూమ్ వంటి ఫీచర్లు అందించింది. అంతేకాదు ఫోన్ ఎక్కువగా వాడుతున్నా... ఛార్జింగ్ చేసే సమయంలో వేడెక్కకుండా ఉండే టెక్నాలజిని ఉపయోగిస్తున్నట్టు ఇన్ఫినిక్స్ తెలిపింది. చదవండి : Gravton Quanta EV: రూ.80కే.. 800 కిలోమీటర్లు ప్రయాణం -
Phone Hacking : మీ ఫోన్ హ్యాక్ అయ్యిందా? గుర్తించండిలా?!
రోజు రోజుకి టెక్నాలజీ అభివృద్ది చెందుతుంది. అయితే అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అన్నే నష్టాలు ఉన్నాయని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మనం వాడే గాడ్జెట్స్ అంటే మొబైల్స్, కంప్యూటర్, స్మార్ట్ వాచెస్ వినియోగం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని అంటున్నారు. చదవండి: దేశంలో ఇళ్ల ధరలు పెరిగాయ్ ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం బాగా పెరిగిపోయింది. కానీ వినియోగదారులు ఒక్కోసారి పూర్తిగా అవగాహాన లేకుండా ఫోన్ వినియోగించడంతో హ్యాకర్స్ దీన్ని అస్త్రంగా మార్చుకుంటున్నారు. భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేయడం, లేదంటే వ్యక్తిగత సమాచారాన్ని బహిర్ఘతం చేసి రోడ్డు కీడ్చుతున్నారు. ఇలాంటి సమయాల్లో ఫోన్‌ను హ్యాక్ అయ్యేందో? లేదో తెలుసుకొని అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని టెక్ నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇప్పుడు మన ఫోన్ హ్యాక్ అయ్యిందో? లేదో? తెలుసుకుందాం. హ్యాక్ అయిన ఫోన్ గుర్తించండి ఇలా!: ♦మీరు ఫోన్‌ను జాగ్రత్తగానే ఉంచుకుంటారు. కానీ ఒక్కోసారి బ్యాటరీ ఛార్జీంగ్ అయిపోతుంది. అలా బ్యాటరీ ఛార్జింగ్ అయిపోవడానికి కారణం హ్యాకింగ్‌కు గురైందని అర్ధం చేసుకోవాలి. వెంటనే వ్యక్తిగత సమాచారాన్ని స్టోర్ చేసుకొని, బ్యాటరీ మార్చుకోవాలి. ♦ఒక్కోసారి ఫోన్ డెడ్ అవుతుంటుంది. ఇలాఫోన్ డెడ్ కావడానికి హ్యాకర్లు మాల్ వేర్ ను మన సెల్ ఫోన్ లోకి సెండ్ చేస్తారు. అలా వచ్చిన మాల్ వేర్ ఫోన్ లో ఉన్న సమాచారాన్ని సేకరిస్తారు. ♦ ఒక్కోసారి మీ ఫోన్ నుంచి టెక్ట్స్, కాల్స్ చేయలేరు. అలా వస్తున్నాయంటే సైబర్ నేరస్తులు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నట్లే లెక్క. మాల్ వేర్ సాయంతో మీ బ్యాంక్ అకౌంట్లలో ఉన్న డబ్బును కాజేస్తుంటారు. మిమ్మల్ని ఏమార్చేందుకు అన్ వాంటెండ్ కాల్స్, మెసేజ్‌లు సెండ్ చేస్తుంటారు. కావాలంటే మీకు వచ్చే కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఒక్కసారి చెక్ చేయండి. కానీ మీరు గుర్తించలేరు. ♦ మీఫోన్ గూగుల్ క్రోమ్ లో మీకు కావాల్సిన సమచారం కోసం అన్వేషిస్తున్నారు. ఆ సమయంలో కొన్ని అనుమానాస్పద పాప్ అప్ యాడ్స్ వస్తుంటాయి. యాహు మీరు లక్షల్లో ఫ్రైజ్ మనీని గెలుచుకున్నారు. మీకు ఆఫ్రైజ్ మనీ కావాలంటే మేం అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానాలు ఇవ్వాలని రిక్వెస్ట్‌లు పంపిస్తుంటారు. మీరు ఫోన్ నెంబర్ ఇచ్చారంటే మీకు కాల్స్ వస్తుంటాయి. మీ ఫోన్ కాల్ ఆధారంగా మీజేబును ఖాళీ చేస్తుంటారు. హ్యాకర్స్‌లో కొంతమంది క్లిక్ చేస్తే డబ్బులు వచ్చేలా పాప్ అప్ యాడ్స్ పంపుతుంటారు. మీతో బలవంతం క్లిక్ చేసే మీ బ్రెయిన్ ను వాష్ చేస్తుంటారు. కాబట్టి ఇలా యాడ్స్ పట్ల అప్రమత్తంగా ఉంటే మంచిది ♦ ఒక్కసారి హ్యాకర్ మీ ఫోన్లోకి ఎంటర్ అయ్యాడంటే.. మీ జీమెయిల్, బ్యాంక్ అకౌంట్లలోకి ఈజీగా వెళతాడు.పాస్‌వర్డ్‌ను రీసెట్ చేయడం,ఈమెయిల్స్‌ను పంపుతుంటారు. మీ డేటాను సేకరించి.. మీపేరు మీద క్రెడిట్ కార్డ్ లు తీసుకోవడం. మీ బ్యాంక్ అకౌంట్లలో ఉన్న మనీని కాజేస్తుంటారు. ఇదిగో ఇలాంటివి సమస్యలు మీకు ఎదురవుతుంటే మీ ఫోన్ ను హ్యాక్ కు గురవుతుందని గుర్తుంచుకోవాలి. -
మొబైల్ లవర్స్ కోసం పేపర్ ఫోన్!
అవునన్నా కాదన్నా మనం డిజిటల్ ప్రపంచంలోకి వచ్చాం. అయితే ‘అతి’ ఎప్పుడు మంచిది కాదని చరిత్ర చెబుతూనే ఉంది. సెల్‌ఫోన్ అతివాడకం వలన వచ్చే మానసిక సమస్యలు పక్కన పెడితే అసలు మనం మాట్లాడే భంగిమ సవ్యంగా లేదని, అది ‘టర్టెల్ నెక్ సిండ్రోమ్’కు దారితీస్తుందని అంటున్నారు శాస్త్రనిపుణులు. ‘సెల్‌ఫోన్ నా శరీరంలో భాగం. అది లేకుండా నేను లేను’ అనుకునే అతి సాంకేతిక ప్రేమికులను దారి మళ్లించడానికి లండన్ డిజైన్ స్టూడియో ‘స్పెషల్ ప్రాజెక్ట్స్’ పేపర్ ఫోన్ యాప్ రూపొందించింది. కాల్ చేయడం, కాల్ రిసీవ్ చేసుకోవడం సంగతి సరే, ప్రతి అతి చిన్న విషయానికి కూడా సెల్‌ఫోన్‌పై ఆధారపడకుండా మనం తప్పనిసరి, అత్యవసరం అనుకున్న సమాచారాన్ని ఏ-4 పేపర్‌కు బదిలీ చేస్తుంది ఈ పేపర్ ఫోన్. కాసేపు అయినా ఫోన్‌కు దూరంగా ఉండేలా చేస్తుంది. ముఖ్యమైన సమాచారాన్ని ప్రింట్ తీసుకొనిపెట్టుకోవడం ద్వారా కొంత సేపు అయిన ఆ డిజిటల్ బయట పడవచ్చు. అసలు యూజర్లు ఏయే విషయాలపై ఎక్కువగా సెల్‌ఫోన్‌పై ఆధారపడుతున్నారు, అందులో ముఖ్యమైనవి ఏమిటి? కానివి ఏమిటి? అనే విషయంపై వందలాది మందిని ఇంటర్వ్యూ చేసి సమాచారాన్ని సేకరించారు. ‘టెక్నాలజీని బ్యాలెన్స్ చేయడానికి పేపర్ ఫోన్ ఒక మార్గం’ అంటున్నాడు ‘స్పెషల్ ప్రాజెక్ట్’ కో-ఫౌండర్ ఆడ్రియన్. చదవండి: బిల్ గేట్స్ కు ఎన్ని ఎకరాల భూమి ఉందో మీకు తెలుసా? -
సార్! మా అమ్మ ఫోన్ కనిపెట్టండి.. ప్లీజ్..
బెంగళూరు : కరోనా వైరస్ మహమ్మారి ఎన్నో కుటుంబాలను చెల్లా చెదురు చేసింది. బంధాలను తెంచి, దిగమింగలేని విషాదాలను మిగిల్చింది. అయిన వాళ్లను కోల్పోయి, వారి జ్ఞాపకాలతో భారంగా కాలం వెల్లదీస్తున్న వారు కొందరైతే.. ఆ జ్ఞాపకాలను పథిలం చేసుకోవాలని పరితపిస్తున్న వారు మరికొందరు. కర్ణాటకకు చెందిన ఆ చిన్నారి కూడా కరోనాతో చనిపోయిన తల్లి జ్ఞాపకాలను పథిలం చేసుకోవాలనుకుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులకు కన్నీటి లేఖను రాసింది... వివరాలు.. కర్ణాటకలోని కొడగుకు చెందిన తొమ్మిదేళ్ల హిృతీక్ష తల్లి కొద్దిరోజుల క్రితం కరోనా వైరస్ బారిన పడి మృతి చెందింది. ఆ చిన్నారికి కడసారి చూపుకూడా దక్కలేదు. అయితే, తల్లి జ్ఞాపకాలు నిండిఉన్న ఫోన్‌నైనా దక్కించుకుందామనుకుంది. ఆసుపత్రికి ఫోన్ చేయగా.. ఫోన్ కనిపించటం లేదని జవాబొచ్చింది. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన హిృతీక్ష కొడగు పోలీసులను ఆశ్రయించింది. తన తల్లి జ్ఞాపకాలు నిండిఉన్న ఫోన్‌ను కనిపెట్టండంటూ భావోద్వేగపూరిత ఫిర్యాదు లేఖను వారికి అందించింది. ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ కావటంతో పోలీసులపై ఒత్తిడి పెరిగింది. దీంతో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఫోన్ కోసం అన్వేషణ ప్రారంభించారు. ఈ ఘటనపై హిృతీక్ష బంధువు ఒకరు మాట్లాడుతూ.. ‘‘ పాప తల్లి ఆసుపత్రిలో ఉండగా మేము ఫోన్ చేశాము. ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. మరుసటి రోజు ఆమె చనిపోయిందని మాకు కబురందింది. మేము ఆమె ఫోన్ కావాలని అడిగాము. అయితే, ఫోన్ కనిపించటం లేదని చెప్పారు. ఆ ఫోన్ కావాలని అప్పటినుంచి పాప ఏడుస్తూనే ఉంది. అందులో చనిపోయిన తల్లికి సంబంధించిన చాలా ఫొటోలు ఉన్నాయంట’’ అని అన్నారు. -
ప్రేయసిపై కన్నేసిన కంప్యూటర్ సెంటర్ యజమాని, దాంతో
సాక్షి, కేజీఎఫ్(కర్ణాటక): కంప్యూటర్ సెంటర్ యజమాని హత్య కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. నగరానికి చెందిన రాజేంద్ర ప్రసాద్, మేల్విన్‌లు నిందితులు. కంప్యూటర్ సెంటర్ యజమాని ముకుందన్ వద్ద రాజేంద్రప్రసాద్ ప్రియురాలు పనిచేసేది. ఆమెపై కన్నేసి పెళ్లి చేసుకోవాలని ముకుందన్ వేధించసాగాడు. దీంతో ఆమె పని వదిలేసినప్పటికీ అతడు ఫోన్లు చేస్తూ ఒత్తిడి చేశాడు. దీంతో ప్రేయసి సలహాతో మేల్విన్‌తో కలిసి రాజేంద్ర ప్రసాద్ ముకుందన్‌ను ఏప్రిల్ 28న హత్య చేశాడు. అండర్సన్పేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కాగా విచారణ జరిపి నిందితులను అరెస్టు చేశారు. యువతి పరారీలో ఉంది. చదవండి: ఫేస్బుక్ పరిచయం.. నగ్నంగా వీడియో కాల్.. కట్ చేస్తే.. -
ఫోన్ దొంగిలించిన పక్షి.. వీడియో వైరల్
సాధారణంగా ఫోన్ మనజీవితంలో ఒక భాగమైపోయింది. కొంత మందిని దీన్ని ఆరోప్రాణంగా కూడా భావిస్తారు. అయితే.. ఇలాంటి ఫోన్‌ను ఎవరైన ఎత్తుకుపోతే ఇంకేమైనా ఉందా... అయితే తాజాగా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఫోన్‌ను ఎత్తుకుపోయింది. ఏ దొంగలో కాదూ.. ఒక పక్షి. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళ్తే.. ఒక మహిళ తన మిత్రులతో కలిసి టెర్రాస్ పైన సరదాగా మాట్లాడుకుంటున్నట్లున్నారు. వారి ఫోన్లను పక్కన పెట్టేసి మరీమాటల్లో మునిగిపోయారు. అయితే, ఎక్కడి నుంచి వచ్చిందో కానీ.. ఒక పక్షి వచ్చి పిట్ట గోడ మీద ఉంచిన స్మార్ట్‌ఫోన్‌ను నోటితో కరుచుకుని అక్కడి నుంచి ఎగురుకుంటు వెళ్లిపోతుంది. అయితే , ఒక్కసారి షాక్‌కు గురైన ఆ మహిళ ఆ పక్షి వెంట పరిగెత్తింది. ఆఫోన్ నాదీ.. నాదీ నాకిచ్చేయ్ అంటూ అరుస్తు దాని వెంట పడింది. ఆమెతో ఉన్న మిత్రులు మాత్రం ఆ పక్షిని పట్టుకొవడం మానేసి, తన సహచరి ఫోన్ కోసం పడుతున్న సరదా సన్నివేశాన్ని ఫోన్లో వీడియో తీస్తు.. తెగ నవ్వుకుంటున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘ పాపం, ఆ పక్షి తినే పదార్థం అనుకొని ఉంటుందేమో.. ఎవరికైన గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుందేమో’.. అని ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. -
ఫోన్ వాడేది లేదంటున్న అమీర్ ఖాన్!
సినిమా కోసం నటించేవాళ్లు కొంతమందైతే, జీవించేవాళ్లు మరికొంత మంది! తన పాత్ర పర్ఫెక్ట్గా రావడం కోసం ఎంతకైగా తెగిస్తారు, ఏదైనా చేస్తారు. అలా చాలామంది హీరోలు తమ శరీరాలను సిక్స్ప్యాకులు, ఎయిట్ ప్యాకులుగా మలిచారు. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే గుర్రపు స్వారీలు, బైక్ రైడింగులు, కత్తియుద్ధాలు ఇలా అన్ని కళలనూ నేర్చుకుంటారు. పాత్రలో లీనమైపోయేందుకు ఫ్యామిలీకి దూరంగా ఉంటూ ఫోన్లను సైతం పక్కన పెట్టేస్తుంటారు. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కూడా ఇదే కోవకు చెందుతాడు. తను నటిస్తోన్న లాల్ సింగ్ చద్దా కోసం ఫోన్‌ను స్విచ్చాఫ్ చేశాడు. (చదవండి: అమీర్ ఖాన్ 'విక్రమ్ వేదా' లేదా?) వ్యక్తిగత జీవితం, కెరీర్ రెండూ దేనికదే సెపరేట్‌గా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడట. ఫోన్ వల్ల ఏకాగ్రతగా షూటింగ్ చేయలేనని మొబైల్ స్విచ్ఛాఫ్ చేసినట్లు తెలుస్తోంది. ఏదైనా అర్జంట్ పనైతే తన మేనేజర్‌కు కాల్ చేయమని బంధువులకు చెప్పి ఉంచాడట. అంతే కాదు, అమీర్ సోషల్ మీడియా అకౌంట్లను కూడా ప్రస్తుతం అతడి టీమే చూసుకుంటోందట. అయితే ఇదంతా లాల్ సింగ్ చద్దా షూటింగ్‌కు శుభం కార్డు పడేవరకు కాదు సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యేవరకు. కాగా మూడేళ్ల తర్వాత అమీర్, కరీనా మరోసారి ఈ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. గతంలో వీరిద్దరు 3 ఇడియట్స్, తలాష్‌లో జోడీగా నటించారు. (చదవండి: ఆ టెక్నిక్‌తో ఆఫీసుల్లోకి ఈజీగా వెళ్లేవాడిని : పంకజ్ త్రిపాఠి) -
ఫోన్ చేసి విసిగిస్తావా అంటూ..
అనంతపురం క్రైం: ఇంటికి త్వరగా రమ్మని ఫోన్లో విసిగించిందని భార్యపై రాడ్‌తో దాడి చేసి గాయపరిచిన భర్త ఉదంతం వెలుగుచూసింది. రుద్రంపేటలో వెల్డింగ్ వర్కర్ టోపీఖాన్, చంద్రకళ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు సంతానం. మంగళవారం రాత్రి ఎంతసేపటికీ భర్త ఇంటికి రాకపోవడంతో చంద్రకళ పలుమార్లు ఫోన్ చేసింది. తర్వాత తప్పతాగి ఇంటికి చేరుకున్న టోపీఖాన్ ఫోన్ చేసి తనను విసిగిస్తావా అంటూ ఆగ్రహంతో ఊగిపోయి రాడ్‌తో భార్యపై దాడిచేశాడు. గొంతుపై కాలుతో తొక్కాడు. ఘటనపై బాధితురాలు నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు టోపీఖాన్‌పై 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు. చదవండి: డబుల్ మర్డర్: భూతవైద్యుడి ఎంట్రీ.. కేసు కీలక మలుపు -
ఫోన్‌పై 28 రోజుల దాకా కరోనా
న్యూఢిల్లీ : కరోనా వైరస్ విషయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలియజేసే పరిశోధన సారాంశమిది. మనం నిత్యం ఉపయోగించే వస్తువుల ఉపరితలంపై కరోనా వైరస్ 28 రోజుల వరకు జీవించి ఉంటుందని ఆస్ట్రేలియా నేషనల్ సైన్స్ ఏజెన్సీ పరిశోధనలో వెల్లడైంది. కరెన్సీ నోట్లు, గ్లాసులు, స్మార్ట్ఫోన్ల స్క్రీన్లు, స్టెయిన్లెస్ స్టీల్ వస్తువులపై ఈ వైరస్ 28 రోజులదాకా జీవిస్తుందని తేలింది. మనం నిత్యజీవితంలో ఉపయోగించే వస్తువులను తరచుగా శుభ్రం చేసుకోవాలని, చేతులను సైతం శుభ్రం చేసుకోవాలని పరిశోధకులు సూచించారు. తక్కువ ఉష్ణోగ్రతల్లో కరోనా వైరస్ ఎక్కువ కాలం మనుగడ సాగిస్తుందని, అలాగే సున్నితంగా ఉండే ఉపరితలాలపై దీని జీవన కాలం అధికమని పరిశోధనలో స్పష్టమైంది. ప్లాస్టిక్ నోట్ల కంటే కాగితపు కరెన్సీ నోట్లు కరోనా వైరస్ ఆవాసానికి అనుకూలమని చెప్పొచ్చు. 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఈ వైరస్ సున్నితమైన ఉపరితలాలపై 28 రోజుల దాకా జీవించి ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. -
సివంగిలా దూకి....దొంగకు చుక్కలే!
సాక్షి, జలంధర్: తన చేతిలోని ఫోన్ లాక్కుని పారిపోతున్న దుండగులకు ఒక బాలిక (15) చుక్కలు చూపించింది. ఏ మాత్రం పట్టువిడవకుండా.. సివంగిలాగా దూకి వాడి ఆటకట్టించింది. సీసీటీవీలో ఈ రికార్డైన ఈ దృశ్యాలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పంజాబ్ లోని జలంధర్ నగరంలో ఈ ఘటన జరిగింది. ఓ వీధిలోంచి నడుచుకుంటూ వెళుతున్న అమ్మాయి నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఫోన్ లాక్కున్నారు. అనంతరం సిద్ధంగా ఉన్న బైక్ పై పారిపోయే ప్రయత్నంలో ఉండగానే, మెరుపు వేగంగా కదిలింది ఆ అమ్మాయి. వెనుక కూర్చున్న ఒక దొంగను దొరక బుచ్చుకుంది. అతగాడు బైక్ దిగి ఆ అమ్మాయిని కొడుతున్నా ఏ మాత్రం వెరవలేదు..పట్టువిడవలేదు. అలానే అతని కాలర్ పట్టుకుంది. చేతికి దొరికిన ఆ దొంగను పారిపోనివ్వకుండా నిలువరించింది. ఈ లోపు స్థానికులు రావడంతో బైక్ పై ఉన్న మరో దొంగ మాత్రం పారిపోగా, దొరిగిన దొంగకు బడిత పూజ చేశారు. దీంతో ఆ అమ్మాయి తెగువ, ధైర్యంపై అభినందనలు కురుస్తున్నాయి. #Punjab: 15-year-old girl fights snatchers to save her mobile phone in #Jalandhar pic.twitter.com/MTqYvwiXPr— The Tribune (@thetribunechd) September 1, 2020 -
అమ్మానాన్న బాగున్నారా?
న్యూశాయంపేట : పేద విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించేందుకు రాష్ట్రప్రభుత్వం గురుకులాలు ఏర్పాటుచేస్తోంది. చదువుకునే సమయంలో రోజుల తరబడి తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. అయితే, తమ తల్లిదండ్రులతో మాట్లాడాలన్నా, వారి క్షేమ సమాచారాలు తెలుసుకోవాలన్నా ఫోన్ల వాడకాన్ని భద్రతా చర్యల కారణంగా ప్రిన్సిపాళ్లు అనుమతించడం లేదు. తద్వారా ఎపుడో వారం, పదిహేను రోజులకోసారి తల్లిదండ్రులు వస్తే తప్ప మాట్లాడే వెసలుబాటు కలగడం లేదు. దీనికి పరిష్కారం ఓ మార్గం అందుబాటులోకి వచ్చింది. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో... విద్యార్థులు తమ తల్లిదండ్రులతో అప్పుడప్పుడు మాట్లాడుకోవడానికి, వారియోగ క్షేమాలు తెలుసుకోవడానికి ఇటీవల అలైన్ గ్రూప్ ఓ నూతన టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. ప్రిన్సిపాళ్లు తమ క్యాంపస్ ఆవరణలో ఉండే విద్యార్థుల సంఖ్యకు తగిన సామర్థ్యంలో ఫోన్ అమరుస్తారు. ఏ విద్యార్థి అయితే తగిన రుసుము చెల్లించి స్మార్ట్ కార్డ్ తీసుకుంటారో వారి తల్లిదండ్రుల ఫోన్ నంబర్లను మాత్రమే ఆ ఫోన్లో నిక్షిప్తం చేస్తారు. తద్వారా ముందస్తు నమోదు చేసి నంబర్‌కు మాత్రం ఫోన్ చేసుకునే వెసలుబాటు కలుగుతుంది. దీంతో ఫోన్లు దుర్వినియోగం అవుతాయనే బాధ కూడా ఉండదు. తాజాగా ఈ ఫోన్లను వరంగల్ అర్బన్ జిల్లా హంటర్ రోడ్డులోని బాలికల మైనార్టీ గురుకులం(హన్మకొండ) పాఠశాలలలో ఏర్పాటు చేశారు. సురక్షితం స్మార్డ్ కార్డ్ ఫోన్‌తో విద్యార్థులు తమ తల్లిదండ్రులకు మాత్రమే ఫోన్ చేసుకునేందుకు వీలుంటుంది. ఈ ఫోన్లో ఔట్‌గోయింగ్ కాల్స్ మాత్రమే చేసుకోవచ్చు. తగిన రుసుము చెల్లించి కార్డు కొనుగోలు చేసిన విద్యార్థి పేరెంట్స్ అందించిన మూడు ఫోన్ నంబర్లు నిక్షిప్తం చేస్తారు. బిగించిన ఫోన్లో మూడు బటన్లు ఉంటాయి. ఓ విద్యార్థి తన కార్డును స్వైప్ చేశాక ఏదో ఒక నంబర్ నొక్కితే అందులో ముందే ఫీడ్ చేసిన సెల్‌ఫోన్ నంబర్‌కు కాల్ వెళ్తుంది. ప్రిన్సిపాళ్లు నిర్ణయించిన సమయంలో ఫోన్ చేసేలా నిబంధన విధించారు. హాస్టళ్లలో ఉచితంగా బిగింపు హాస్టళ్లలో ఈ ఫోన్లను ఎలాంటి రుసుము తీసుకోకుండానే ‘అలైన్’ సంస్థ బాధ్యులు ఏర్పాటు చేస్తారు. ప్రతినెల ప్రతినిధి వచ్చి ఫోన్ బాగోగులు చూసి వెళ్తాడు. లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్ ప్రతీ నిమిషానికి 60 పైసలు కట్ అవుతాయి. స్మార్ట్ కార్డ్ కొనుగోలు చేసినప్పుడు రూ.200 చెల్లించాలి. అందులో రూ.వంద టాక్‌టైమ్ వస్తుంది. టాక్‌టైమ్స్ అయిపోయాక తిరిగి తగిన రుసుము చెల్లించి రీచార్జ్ చేసుకోవచ్చు. విద్యార్థులకు ఎంతో ఉపయోగం ఈ ఫోన్‌తో విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంది. గతంలో స్కూల్ ఫోన్ ఒకటే ఉండటంతో విద్యార్థులను వారి తల్లిదండ్రులతో మాట్లాడించాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి. ఇప్పుడు కొత్త ఫోన్‌తో వారికి కేటాయించిన సమయాల్లో ఫోన్ చేసుకొని సంతోషంగా ఉంటున్నారు.– వాసవి, పిన్సిపాల్, బాలికల మైనార్టీ గురుకులం -
మరోసారి సల్మాన్ ఆగ్రహం, వీడియో వైరల్
సాక్షి,ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ మరోసారి ఫ్యాన్స్‌పై అసహనం ప్రకటించి వార్తల్లో నిలిచారు. తనతో సెల్ఫీ క్లిక్ చేయడానికి ప్రయత్నించిన అభిమాని పట్ల సల్మాన్ ప్రవర్తన ఆయన పలువురిని దిగ్భ్రాంతికి గురి చేసింది. గోవా ఎయిర్పోర్ట్ నుంచి బయటికి నడిచి వస్తున్న హీరో సల్మాన్‌తో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించాడు ఒక వ్యక్తి. దీనిపై కోపం తెచ్చుకున్న సల్మాన్ ఈ వ్యక్తి నుండి మొబైల్ చటుక్కున లాక్కున్నా డు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గోవా అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం ఈ ఉదంతం చోటు చేసుకుంది. తరువాత అతను విమానయాన సంస్థలో పనిచేస్తున్న గ్రౌండ్ స్టాఫ్‌గా గుర్తించారు. వీడియో వైరల్ అయిన తరువాత ఈ సంఘటన గురించి విచారించి ఈ విషయాన్ని ధృవీకరించామని విమానాశ్రయ సీనియర్ అధికారి చెప్పారు. దీనిపై ఎలాంటి కేసు నమోదు కాలేదన్నారు. కాగా సల్మాన్ ప్రస్తుతం రాధే చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ ఏప్రిల్ నాటికి (ఈద్) సల్మాన్ రాధే మూవీ , అక్షయ్ కుమార్ చిత్రం లక్ష్మీ బాంబ్ చిత్రంతో పోటీ పడనుంది. దీంతో పాటు సాజిద్ నాడియా వాలాతో కభీ ఈద్ కభీ దీపావళి అనే సినిమాకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. -
మరోసారి సల్మాన్ ఆగ్రహం, వీడియో వైరల్
-
ఫోన్ చూసుకుంటూ వెళ్తే..
ఇటీవలి కాలంలో జనాలు.. మొబైల్ ఫోన్లకు బానిసలుగా మారుతున్న సంగతి తెలిసిందే. కొందరైతే ఫోన్ల ధ్యాసలో పడి వారి పరిసరాల్లో ఏం జరుగుతుందో గమనించకుండా .. ప్రమాదాల బారిన పడుతున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల అలాంటి ఘటనే స్పెయిన్‌లోని ఉత్తర మడ్రిడ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మెట్రో స్టేషన్లో ప్రయాణికులు రైలు కోసం ఎదురుచూస్తున్నారు. రైలు ఫ్లాట్‌పామ్‌పైకి వస్తున్న సమయంలో ఓ మహిళ లేచి ముందుకు నడవసాగింది. అయితే మొబైల్ చూడటంలో బిజీగా ఉన్న ఆమె.. ఫ్లాట్‌పామ్ ఎక్కడివరకు ఉందో కూడా చూసుకోకుండా వెళ్లారు. దీంతో ఆమె ట్రైన్‌కు ముందు కొద్ది దూరంలో పట్టాలపై పడిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీల్లో రికార్డు అయింది. ఈ వీడియోను మడ్రిడ్ మెట్రో అధికారులు ట్విటర్లో పోస్ట్ చేశారు.అయితే ఈ ప్రమాదం నుంచి ఆమె స్వల్ప గాయాలతో బయటపడినట్టుగా సమాచారం. ⚠ Por tu seguridad, levanta la vista del móvil cuando vayas caminando por el andén.#ViajaSeguro #ViajaEnMetro pic.twitter.com/0XeQHPLbHa — Metro de Madrid (@metro_madrid) October 24, 2019 -
ఫోన్ కొట్టు.. ఓటు పట్టు..
సాక్షి, ఆర్మూర్(నిజామాబాద్): హలో.. జ్యోతి గారేనా మాట్లాడేది.. మీకు ఆసరా పథకంలో భాగంగా వితంతు పింఛన్ అందుతోందా.. పింఛన్ తీసుకోవడంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా.. ఇప్పుడు మీకు నెలకు వెయ్యి రూపాయల పింఛన్ వస్తోంది కదా.. టీఆర్ఎస్కి ఈ ఎన్నికల్లో ఓటు వేసి గెలిపిస్తే నెలకు రెండు వేల 16 రూపాయల పింఛన్ వస్తుంది.. కాబట్టి మీరు టీఆర్ఎస్ అభ్యర్థికే ఓటు వేయండి అంటూ ఒక మహిళ గొంతు జ్యోతికి వివరించింది. ఈ విషయం తన కుటుంబ సభ్యులతో పాటు కాలనీవాసులకు చెప్పగా అయ్యో ఇలాంటి ఫోన్లు మా అందరికీ వస్తున్నాయంటూ ఆసరా పథకంలో భాగంగా వృద్ధాప్య పింఛన్, వికలాంగుల పింఛన్, వితంతు పింఛన్, బీడీ కార్మికుల జీవన భృతి పొందుతున్న మహిళలు చర్చించుకుంటున్నారు. రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా అవుతోందా.. ఎకరానికి ఎనిమిది వేల రూపాయల పెట్టుబడి వ్యయం అందిందా.. రైతు బీమా పథకంలో పేరు నమోదు చేయించుకున్నారా తదితర సమాచారాన్ని చేరవేస్తూ ఫోన్లు చేస్తున్నారు. మరో వైపు కాంగ్రెస్, బీజేపీలు సైతం తాము అధికారంలో ఉన్న సమయంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమలు చేస్తున్న పథకాలను సైతం ఓటర్లకు ఫోన్ల ద్వారా వివరిస్తున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంలో సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ విజయం సాధించేందుకు ఉన్న ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా సద్వినియోగం చేసుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. నేటి రోజుల్లో సెల్ ఫోన్ ఉపయోగించని ఓటరు ఉండడన్నది ఎవరూ కాదనలేని నిజం. ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఓటర్లను తమకు అనుకూలంగా మల్చుకొనే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ప్రత్యేకంగా కాల్ సెంటర్ల వారితో ఒప్పందాలు చేసుకొని తమ నియోజకవర్గాల పరిధిలోని లబ్ధిదారులు, ఓటర్ల ఫోన్ నంబర్లను వారికి చేరవేస్తున్నారు. ఇంకేముంది సదరు కాల్ సెంటర్ ఉద్యోగులు ఒకటికి పది సార్లు ఓటర్లకు ఫోన్లు చేస్తూ తమ పార్టీ గొప్పతనాన్ని తమ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి బలాబలాలను ఓటర్లకు వివరిస్తున్నారు. మరికొందరు అభ్యర్థులు ఒక అడుగు ముందుకు వేసి తనకు ఓటు వేసి గెలిపించాలంటూ ఓటర్లను విజ్ఞప్తి చేస్తూ వాయిస్ రికార్డు చేసి ఫోన్లు చేస్తూ ఆ వాయిస్ రికార్డును వినిపిస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం నిర్వహిస్తే ఇంటర్నెట్ ఉపయోగించే యువకులు, ఉద్యోగులు, చదువుకున్న వారికి మాత్రమే సమాచారం చేరడానికి ఆస్కారం ఉంది. కానీ ఫోన్ చేసి వివరాలు చెపితే సెల్ ఫోన్ ఉపయోగించే మహిళలు, వృద్ధులు, నిరక్ష్యరాస్యులకు సైతం సమాచారం చేరవేసే ఆస్కారం ఏర్పడుతుంది. ఇది గ్రహించిన అభ్యర్థులు సెల్ ఫోన్ల ద్వారా ఓటర్లకు ఫోన్లు చేయిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకొనే పనిలో పడ్డారు. దీంతో సోషల్ మీడియాతో పాటు కొత్త పుంతలు తొక్కుతున్న ఎన్నికల ప్రచారంపై సెల్ ఫోన్లు ఉపయోగించే ప్రతిఒక్కరూ చర్చించుకుంటున్నారు. -
తమిళనాడులో అమానుషం
సాక్షి, చెన్నై: తమిళనాడులో అమానుషం చోటుచేసుకుంది. సెల్‌ఫోన్ చోరీచేశాడన్న అనుమానంతో ఓ బాలుడిని గ్రామస్తులు కొట్టి చంపారు. కరూర్జిల్లా జగదాబి అల్లాలి గౌండనూర్ గ్రామానికి చెందిన ఇలంజియం కుమారుడు బాలసుబ్రమణి(15) బడికి వెళ్లకుండా అల్లరి చిల్లరగా తిరుగుతూ వచ్చాడు. శనివారం రాత్రి ఆ ప్రాంతానికి చెందిన టైలర్ మునుస్వామి తన సెల్‌ఫోన్ కనిపించడం లేదంటూ బాల సుబ్రమణిని నిలదీశాడు. తాను తీయలేదని వారించినా మునుస్వామి ఖాతరు చేయలేదు. మునుస్వామితో పాటు ఆ గ్రామానికి చెందిన పలువురు బాల సుబ్రమణిని స్తంభానికి కట్టిపడేసి చితక్కొట్టారు. స్పృహ తప్పడంతో అలాగే వదలి వెళ్లిపోయారు. ఆదివారం ఉదయాన్నే బాల సుబ్రమణిని మళ్లీ ప్రశ్నించేందుకు అక్కడికి వచ్చారు. అయితే, రాత్రి కొట్టిన దెబ్బలకు రక్తస్త్రావం అధికంగా కావడంతో రాత్రంతా ప్రాణాలతో కొట్టుమిట్టాడి బాలుడు మరణించాడు. సమాచారం అందుకున్న కరూర్ పోలీసులు బాలుడి మృత దేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. నిందితులు మునుస్వామి, పరమ శివం, సెల్వకుమార్, మణివేల్, మునియప్పన్‌లను అరెస్టు చేశారు. బాలుడ్ని చితక్కొడుతుంటే వేడుకలా చూస్తుండిపోయిన పలువురు గ్రామస్తులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టుల భయంతో కొందరు పరారీలో ఉన్నారు. -
ప్రియుడు ఫోన్ చేయలేదని..
నోయిడా : ప్రియుడు ఫోన్ చేయలేదన్న బాధతో భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందో యువతి. ఈ సంఘటన శనివారం సాయంత్రం నోయిడా నగరంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని కస్‌జంగ్ ప్రాంతానికి చెందిన శివాని(25) నోయిడాలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఆమె గత కొద్ది నెలలుగా బరోలాలోని ఓ అద్దె ఇంట్లో నివాసముంటోంది. శనివారం సాయంత్రం సమయంలో ఆమె గ్రేట్ ఇండియా ప్లేస్ మాల్లోని మూడవ అంతస్తు నుంచి కిందకు దూకింది. నేలపై రక్తపు మడుగులో పడివున్న ఆమెను గుర్తించిన మాల్ సిబ్బంది దగ్గరలోని కైలాశ్ ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. మార్గం మధ్యలోనే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై మాల్ సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వారు సంఘటనా స్థలంలో ఓ సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రిముడు స్పందించకపోవటం మూలానే తను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు యువతి సూసైడ్ నోట్లో పేర్కొంది. ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ.. ఆమె చాలా సేపు ఎస్కలేటర్ దగ్గరలో ఫోన్ పట్టుకు కూర్చుందని, కొద్ది సేపటి తర్వాత పై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుందని తెలిపాడు. పోలీసు అధికారి మాట్లాడుతూ.. యువతి తన చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్లో పేర్కొందని తెలిపారు. శివాని తల్లిదండ్రులను సంప్రదించటానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. ప్రియుడే ఆమె చావను ప్రేరేపించాడా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
అమ్మకోసం ఫోన్ ఆర్డర్ చేస్తే..
సాక్షి,న్యూఢిల్లీ: ఆన్లైన్ షాపింగ్ అంటేనే వినియోగదారులు భయపడే మరో సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన ద్వారా ఆర్డర్ చేసిన ఢిల్లీకి చెందిన ఒక వినియోగదారుడికి చేదు అనుభవం ఎదురైంది. రూ.35 వేల ఫోన్ బుక్ చేస్తే మైండ్ బ్లైండయ్యే గిఫ్ట్ వచ్చింది. దీంతో లబోదిబోమన్న కస్టమర్ పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే, ఢిల్లీకి చెందిన మానస్ సక్సేనా మాతృదినోత్సవం సందర్భంగా కన్నతల్లికి బహుమతి ఇద్దామనుకున్నారు. దీంతో ఓ ఈ-కామర్స్ సంస్థను సంప్రదించి స్మార్ట్ ఫోన్ ఆర్డర్ ఇచ్చి డబ్బు చెల్లించారు. ఇక్కడే ఈయనకు ఈ కామర్స్ సైట్ దిమ్మతిరిగే షాకిచ్చింది. మే 26న ఆన్లైన్లో వన్‌ప్లస్ 6 ఫోన్‌ను ఆర్డర్ చేసి రూ. 34,999ను డెబిట్ కార్డు ద్వారా పే మెంట్ చేశారు. మే 27న పార్శిల్ వచ్చింది. అయితే ఫోన్ కు బదులుగా పార్సిల్లో మార్బుల్ స్టోన్స్ దర్శనమిచ్చాయి. దీంతో అవాక్కయన ఆయన ఆన్లైన్ సంస్థకు ఫిర్యాదు చేశారు. వారు సరిగా స్పందించడకపోవడంత పోలీసులను ఆశ్రయించారు. సెక్షన్ 420 కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. డెలివరీ బాయ్, లేదా ఏజెన్సీ ప్రమేయం వుండొచ్చన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
త్వరలోనే మంచిరోజులు వస్తాయ్: ఆసారాం
జోధ్‌పూర్: మైనర్ బాలికపై రేప్ కేసులో జీవితఖైదు శిక్షపడి జో«ద్‌పూర్ జైలులో ఉన్న వివాదాస్పద గురువు ఆసారాం బాపు ఓ శిష్యుడితో ఫోన్లో మాట్లాడిన ఆడియో క్లిప్ ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. 15 నిమిషాల నిడివి ఉన్న ఆ క్లిప్‌లో ఆసారాం మాట్లాడుతూ.. ‘జైలులో నేనుండేది తాత్కాలికమే. త్వరలోనే మంచి రోజులు వస్తాయి. మనం చట్టాలు, వ్యవస్థను గౌరవించాలి’ అని చెప్పాడు. తన ఆశ్రమాన్ని స్వాధీనం చేసుకునేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని ఆసారాం ఆరోపించాడు. ఈ ఆడియో క్లిప్‌పై జోధ్‌పూర్ సెంట్రల్ జైలు డీఐజీ విక్రమ్ స్పందించారు. ప్రతి ఖైదీకి నెలకు ఇద్దరు వ్యక్తులతో 80 నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడే అవకాశం ఇస్తామన్నారు. శుక్రవారం ఆసారాం సబర్మతీలోని ఓ శిష్యుడితో మాట్లాడినట్లు చెప్పారు. -
సోదరుడు ఫోన్ లాక్కున్నాడని..
పరిగి: సోదరుడు ఫోన్ లాక్కున్నాడని మనస్తాపానికి గురైన ఓ ఇంటర్ విద్యార్థిని ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని ఖుదావంద్‌పూర్‌లో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబీకుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నసీర్ కూతురు నౌసిన్బేగం(17) పరిగిలోని విజ్ఞాన్ జూనియర్ కళాశాలలో ఇంటర్ రెండో ఏడాది చదువుతోంది. ప్రస్తుతం దోమ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వార్షిక పరీక్షలు రాస్తుంది. బుధవారం పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. అయితే, మంగళవారం ఆమె ఇంట్లో చదువుకుంటుంది. ఈక్రమంలో నౌసిన్బేగం తన అన్న ఫోన్ తీసుకుని స్నేహితురాలితో మాట్లాడింది. విషయం గమనించిన ఆయన ‘తెల్లారితే పరీక్ష పెట్టుకుని ఫోన్‌తో ఆటలేంట’ని మందలించి నౌసిన్బేగం నుంచి ఫోన్ లాక్కుని బయటకు వెళ్లిపోయాడు. మృదుస్వభావి అయిన ఆమె మనస్తాపానికి గురై ఇంట్లో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. గమనించిన కుటుంబీకులు స్థానికుల సాయంతో మంటలు ఆర్పి వెంటనే పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 80 శాతం శరీరం కాలిపోయిందని వైద్యులు తెలిపారు. ప్రథమ చికిత్స నిర్వహించి ఉస్మానియాకు రెఫర్ చేశారు. చావుబతుకులతో కొట్టుమిట్టాడుతున్న నౌసిన్బేగం నుంచి న్యాయమూర్తి భారతి వాగ్మూలం సేకరించారు. అనంతరం ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా విద్యార్థిని మార్గంమధలో మృతి చెందింది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందలేదు. -
మహిళలు ఫోన్ మాట్లాడితే ఫైన్
‘‘మొదటిసారి ఫోన్ మాట్లాడుతూ ‘దొరికితే’ పంచాయతీ విధించిన జరిమానా చెల్లించాలి. రెండవసారి దొరికితే మాత్రం నలుగురిలో సిగ్గుతో తలదించుకొని ఏ శిక్షకైనా సిద్ధపడాలి’’ ‘‘మహిళల రక్షణ కోసమే మేమీ నిర్ణయం తీసుకున్నాం. వాళ్లు ఫోన్లో మాట్లాడటం వల్ల చాలా సమస్యలు తలెత్తుతున్నాయి’’ అంటున్నారు షూపూర్ జిల్లాలోని సహారియా గిరిజన తెగ పెద్దలు! మధ్యప్రదేశ్‌లోని షూపూర్ జిల్లాలో సహారియా తెగకు చెందినవి 27 గ్రామాలున్నాయి. ఈ తెగకు ఒచా గ్రామ పంచాయతీగా ఉంది. ఈ పంచాయతీ భోపాల్‌కి 400 కిలోమీటర్ల దూరం ఉండగా, సరిహద్దు రాష్ట్రం రాజస్థాన్. ఒచా గ్రామ పంచాయతీలోని 27 గ్రామాలలోని మహిళలు ఎవరైనా మొబైల్ ఫోన్లలో మాట్లాడుతున్నట్టు పంచాయతీకి తెలిస్తే శిక్షలు విధిస్తారు! అయితే అవి ఎలాంటి శిక్షలో ముందుగా చెప్పరు. ‘‘మొదటిసారి ఫోన్ మాట్లాడుతూ ‘దొరికితే’ పంచాయతీ విధించిన జరిమానా చెల్లించాలి. రెండవసారి దొరికితే మాత్రం నలుగురిలో సిగ్గుతో తలదించుకొని ఏ శిక్షకైనా సిద్ధపడాలి’’ అంటాడు రస్వరప్ అనే ఆదివాసి. ఇతను ఒచా గ్రామ పెద్ద. ఇక బైస్రామ్ అనే మరో ఆదివాసి పెద్ద ఏమంటున్నారో వినండి. ‘‘మా సహారియా తెగ అమ్మాయిలు బయటి వారితో మాట్లాడటం, వాళ్లను పెళ్లి చేసుకోవడం జరుగుతోంది. బయటి వారు మా తెగలోకి రావడం వల్ల మా భూముల మీద హక్కులు మేం కోల్పోయే పరిస్థితి వస్తోంది. అందుకే మా తెగ కాని వారిని పెళ్లి చేసుకోనివ్వకూడదని మేమీ నిర్ణయం తీసుకున్నాం. మా నిర్ణయానికి విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే ఆ కుటుంబం పంచాయతీ విధించిన శిక్షకు కట్టుబడి ఉండాల్సి ఉంటుంది’’ అంటున్నారు బైస్రామ్. పంచాయతీ పెద్దలు ఈ విషయం గురించి ఇంకాస్త చెబుతారు. ‘‘కావాలంటే మహిళలు ఫోన్లో మా ముందు ఎవరితోనైనా మాట్లాడచ్చు. మమ్మల్ని దాటి మాత్రం ఎవరూ మాట్లాడకూడదు’’ అని నిషేధాజ్ఞలు విధించారట! షూపూర్ కలెక్టర్ పి.ఎల్.సోలంకి ఈ విషయంపై స్పందించడానికి పెద్దగా ఏమీ లేనట్లుంది! ‘‘నాకూ ఈమధ్యే తెలిసింది. మహిళల్ని ఫోన్ల నుంచి దూరం చెయ్యడం సరికాదు. అయితే, అక్కడ ఎవరూ ఈ నిషేధాన్ని తప్పు పట్టడం లేదు. గిరిజనుల్లో అవగాహన ఏర్పడటానికి ప్రయత్నిస్తున్నాం’ అని మాత్రం అంటున్నారు! –ఎన్.ఆర్ -
చంచల
కంపెనీకారు వచ్చేసిందమ్మా.. నేను వెళ్లొస్తా అమ్మా... అంటూ బయటికి వేగంగా నడిచింది చంచల.కారు డోర్ తీసి కూర్చున్న చంచల.. కాస్త ఆశ్చర్యంగా.. ‘నీ పేరు?’ అంది.‘‘అప్పల్రాజు మేడం’’‘‘మరి సింహాద్రీ?’’‘‘ఆడు మా బావకొడుకు మేడం... ఆడికి నిన్న రాత్రి నుంచీ జ్వరం. అందుకని నేనొచ్చేను మేడం’’ అన్నాడు అప్పల్రాజు.చంచల ఫోన్లోనే ఆఫీస్ మెయిల్స్ చెక్ చూసుకుంటుంది. అప్పల్రాజు కారును సీతమ్మధార వద్దున్న వెంకటేశ్వర ఆలయం ముందు ఆపేడు.‘‘ఈయాల.. శనివారం కదా మేడం.. వెంకన్న బాబును చూసి వేగంగా వచ్చేస్తాను’’ అంటూ కదిలాడు అప్పల్రాజు.కాసేపటికి ‘‘మేడం.. ప్రసాదం తీసుకోండి!’’ అని చంచలకు పులిహోర ఉన్న డొప్పను అందించాడు అప్పల్రాజు. పులిహోర డొప్పను అందుకున్న చంచల.. కళ్లకు అద్దుకుని తినసాగింది.పదినిమిషాలు అయ్యాక అప్పల్రాజు కారును స్లో చేసి... వెనక్కి తిరిగి చూశాడు. చంచల ఓ పక్కకి వాలిపోయి ఉండటాన్ని చూసి నవ్వుతూ జేబులోని ఫోన్ అందుకున్నాడు.‘‘ఆ.. నేనే.. పని ఫినిష్ అయ్యింది. పావుగంటలో నీ ముందుంట. పిట్టను తీసుకో.. నాకు సొమ్ము ఇచ్చుకో..’’ అని ఫోన్ కట్‌చేసి కారును వేగంగా ముందుకు పోనిచ్చాడు. చంచల భారంగా కళ్లు తెరచింది. పరిసరాలను పరిశీలనగా చూసి ఆశ్చర్యపోయింది. ఉన్న చోటు నుంచి కదిలేందుకు ప్రయత్నించి విఫలమైంది. అప్పల్రాజు ఇచ్చిన ప్రసాదంలో మత్తు మందు ఉందనీ.. తనను తెలివిగా కిడ్నాప్ చేశారని గ్రహించింది.అంతలో తలుపులు తెరుచుకున్నాయి.‘హలో.. నువ్వు క్షేమంగానే ఉన్నావ్!’ అంటూ దగ్గరకు వచ్చి నోటికి ఉన్న గుడ్డను విప్పేశాడు ఓ గడ్డం వ్యక్తి.‘ఎవరు నువ్వు... నన్నెందుకు తీసుకొచ్చావ్?’‘నా పేరు గురుపాదం, అందాన్ని వేటాడ్డమే నా పని’ అన్నాడావ్యక్తి నిర్లక్ష్యంగా తన గడ్డాన్ని సవరించుకుంటూ...‘నీకేం కావాలి?’‘లాభం! అందంతో వచ్చే లాభం! నువ్వు ఇక తిరిగి ఇంటికి వెళ్లే ఆశలు వదులుకో.. త్వరలోనే నిన్ను అరబ్ షేకులకు బేరం పెడతా. లక్షలు.. లక్షలు పట్టేస్తా!! ఇప్పటిదాకా చాలా మంది అమ్మాయిలని నీలానే కిడ్నాప్ చేసి అమ్మేశా. కాదంటే ఈ గదిలోనే చంపేస్తా.’ అన్నాడు గురుపాదం.గుండెల్లో పిడుగు పడినట్లు అయ్యింది చంచలకు...‘హెల్ప్.. హెల్ప్..’ అంటూ గట్టిగా అరిచింది.ఆమె అరుపులకు ఫక్కున నవ్విన గురుపాదం.. ఆమె చేతికి కాళ్లకి ఉన్న కట్లును కూడా విప్పేస్తూ.. ‘‘నువ్వు తప్పించుకోలేవ్.. పాపా! ఎందుకంటే నువ్వు శివారుల్లో ఉన్న రాజావారి తోట బంగళాలో ఉన్నావ్ నీ అరుపు కనీసం ఈ గది గోడలను కూడా దాటదు. తప్పించుకునే ప్రయత్నాలు మాని.. మెప్పించే ప్రయత్నం చెయ్యి!’’ అంటూ గది తలుపులు వేసి వెళ్లిపోయాడు గురుపాదం. ‘‘గురుపాదం.. నీకు లోను శాంక్షన్ అయ్యిందయ్యా... ఇదిగో కాగితాలు, లోన్ సెక్షన్‌కి వెళ్లి చెక్కు తీసుకో... మరి... నీ వంతు లాంఛనం....?’ అంటూ నసిగాడు బ్యాంక్ మేనేజర్.‘అది అలా వుంచండి సార్.. లేత పిట్ట వచ్చింది. ఈ రాత్రికి.. మీరొస్తే.... బాగుంటుంది. మళ్లా రెండు రోజుల్లో అరబ్ షేక్‌లు పట్టుకుపోతారు...’ అన్నాడు గురుపాదం చాలా చనువుగా.. అంగీకారంగా తలూపాడు బ్యాంక్ మేనేజర్. ఆ రోజు రాత్రి... బ్యాంక్ మేనేజర్ చంచల ముందు మైకంలో తూలుతున్నాడు. చంచల పరిస్థితిని అర్థం చేసుకుంది. ఈ ముసలివాడిని మందులో ముంచి తప్పించుకోవాలనుకుంది. అనుకున్నదే తడవుగా.. ఎదురుగా ఉన్న విస్కీ బాటిల్ తీసుకుని అతని చేతిలో ఉన్న గ్లాస్లో పోసి.. అతడి నోటికి అందించింది. అతడు ఆమెను చూస్తూ.. గ్లాస్ మీద గ్లాస్ ఖాళీ చేసి మత్తుగా మంచం మీదకు ఒరిగిపోయాడు. ఏమాత్రం ఆలస్యం చెయ్యని చంచల.. బ్యాంక్ మేనేజర్ జేబులోంచి సెల్ ఫోన్ బయటకు తీసి.. పోలీస్ స్టేషన్‌కి ఫోన్ చేసింది సహాయం కోరింది. అలికిడి కావడంతో ఖాళీ విస్కీ బాటిల్ అందుకున్న చంచల.. తలుపు వెనక దాక్కుంది. గదిలోపల కొచ్చిన గురుపాదం తల పగలగొట్టింది. కానీ, బయట తలుపులు తీసేందుకు ప్రయత్నించిన చంచలకు.. కిటికీలోంచి ఇంటి చుట్టూ ఉన్న గూండాలు కనిపించారు. దాంతో తప్పించుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చెయ్యకుండా పోలీసుల రాకకోసం ఎదురుచూస్తూ ఉండిపోయింది.పోలీస్ సైరన్ విన్న గూండాలు పారిపోగా.. ఎస్సై గిరి.. కానిస్టేబుళ్లతో కలిసి తలుపు తీసుకుని వేగంగా లోనికొచ్చాడు. రక్తపు మడుగులో కదల్లేని స్థితిలో పడి ఉన్న గురుపాదాన్ని, మత్తులో తూలుతున్న బ్యాంక్ మేనేజర్ని కస్టడీలోకి తీసుకుంటూ.. చంచల సమయస్పూర్తిని అభినందించాడు. - మోహనారుద్ర -
మా స్మార్ట్ మమ్మీ!!
ఆఫీసులో ఆ రోజెందుకో కొంచెం సీరియస్‌గా ఉంది వాతావరణం. బాయ్ తెచ్చిచ్చిన కాఫీ చప్పరిస్తూ, బాస్ మాటలను అందరం శ్రద్ధగా వింటున్నాం. ఇంతలో మీటింగ్‌కి ముందే పీకనొక్కేసి జేబులోకి తోసేసిన ఫోన్ నుంచి వైబ్రేషన్లు మొదలయ్యాయి. నిశ్శబ్దంగా ఉన్న ఆ ఏసీ ఛాంబర్లో నా ఫోన్ శబ్దాలు అసహనం కలిగిస్తున్నాయందరికీ! అదృష్టవశాత్తూ అదే సమయంలో బాస్‌కి కూడా ఫోన్ రావడంతో అదే అదనుగా మెల్లగా ఫోన్ బయటకు తీసి, కాల్ చేసింది ఎవరా అని చూశా. అమ్మ... అప్పటికే నాలుగైదు మిస్స్డ్ కాల్స్ ఉన్నాయందులో. ఎవరి ఫోన్ అయినా ఇగ్నోర్ చేయొచ్చు కానీ, అమ్మ ఫోన్‌కి రెస్పాండ్ ఇవ్వకపోయానంటే మాత్రం తిప్పలు తప్పవు. గతంలో ఇలాగే నేను ఫోన్ తియ్యకపోయేసరికి ఆమె కంగారుగా మా ఆఫీసులో తనకు తెలిసిన అందరికీ ఫోన్లు చేసేసింది. ఆఖరికి ఆఫీసులో మా బాస్ తర్వాత బాస్ అంతటి వాణ్నీ వదిలిపెట్టలేదు. దాంతో నేను మెల్లగా రీడయల్ చేశా. గభాల్న ఆన్సర్ చేసి, ‘‘ఎక్కడున్నావ్... ఎన్నిసార్లు చేసినా, లిఫ్ట్ చేయకపోతుంటే టెన్షన్ వచ్చింది’’ అంటూ నిష్ఠూరాలు పోయింది. ‘‘ఇక్కడే చచ్చాన్లే... ఇంతకీ ఏంటో చెప్పు’’ అన్నా కొంచెం విసుగ్గా. కొద్ది నిశ్శబ్దం తర్వాత ‘‘ఏం లేదులే... పొద్దుటునించీ వైఫై రావట్లేదు... ఏం తోచక చస్తున్నాననుకో’’ అంది. నాకు ఒళ్లు మండుకొచ్చింది. ‘‘ఇందుకా ఇన్నిసార్లు ఫోన్ చేసింది... ఏమైందో ఏంటో అని భయపడి చచ్చాననుకో’’అంటూ విసుగ్గా ఫోన్ పెట్టేశా. ‘‘నేను కాసేపటిలో వచ్చేస్తాను కానీ, ఈలోగా మీరు అయిడియాలు రాసుంచండి’’ అని చెప్పి హడావిడిగా ఎక్కడికో వెళ్లిపోయారు బాస్. టైమ్ దొరికింది కదా... ఆగుతానా నేను... బయటికి రాగానే తిరిగి అమ్మకి ఫోన్ చేసి, ‘‘ఏంటమ్మా! రోజూ నేనా టైమ్‌లో మీటింగ్‌లో ఉంటానని తెలిసి కూడా అవతలేదో సీరియస్ మ్యాటరున్నట్లు అన్నిసార్లు ఫోన్ చేశావ్. భయమేసింది’’ అన్నాను. ‘‘నాకు ఇంక కాలక్షేపం ఏముంది... ఆ ఫోన్ చూసుకోవడం తప్ప. అదీ పాపం... ఆ పిచ్చోడు కొనివ్వబట్టి కానీ, నాతో మాట్లాడేదెవరు, నా మొహం చూసేవారెవరు... పొద్దుగూకులూ ఆ గదిలో ఒక్కదాన్నే పడుండటం తప్ప. మీ ఆవిడగానీ, నీ సంతానం గానీ నాతో మాట్లాడతారా ఏమన్నానా? ఇవ్వాళ్ల కూడా నువ్వటెళ్లగానే మీ ఆవిడ కూడా పిల్లల్ని తీసుకుని బయల్దేరింది ‘అక్కా వాళ్ల ఇంటికి వెళ్ళొస్తా’ నంటూ... అసలు పొరపాటు చేశాలే. నువ్వు నాకు ఆ జియో సిమ్ ఇస్తానన్నప్పుడు తీసుకోనుంటే బాగుండేది.. కరెంట్ పోగానే నెట్టు ఆగిపోకుండా ఉండేది’’ అమ్మ వాక్ప్రవాహం ఆగడం లేదు. నిజమే కదా అనిపించి నాకు జాలేసింది. ‘‘సర్లే... ఆ సీపీయూ పక్కనే నల్లటి డబ్బాలాంటిది ఉంటుంది కదా... దానికి రెండు స్విచ్చులుంటాయి.. అవి ఆన్‌లో ఉన్నాయో లేదో చూసుకుంటూ ఉండాలెప్పుడూ...’’ అంటూ డైరెక్షన్లిచ్చి తిరిగి నా పనిలో మునిగిపోయా. అసలు మా ఇంట్లో కరెంట్ పోయినా,నెట్ రాకపోయినా ముందుగా ఇబ్బంది పడేది అమ్మ, ఆ తర్వాత మూడున్నరేళ్ల మా చిన్నదీ. పొద్దుగూకులూ ఫోన్‌తోనే దాని ఆటలన్నీ. పెద్దదానికేమో సిస్టమ్ ఆపరేట్ చెయ్యడం వచ్చు. యూట్యూబ్ పెట్టుకుని గేమ్సూ అవీ చూసేస్తుంటుంది. మా ఆవిడకేమో పని ధ్యాస, ఇల్లు సర్దుడూ తప్ప ఎవరితోనూ పెద్దగా మాట్లాడదు. పాపం! అమ్మకేమో మొదటినుంచీ నలుగురిలో ఉండటం, కబుర్లు చెప్పడం అలవాటు కాబట్టి మాటల కోసం మొహం వాచిపోయి ఉంటుంది. నేను కాస్త ఖాళీగా కనిపిస్తే చాలు... పక్కన కూచుని కబుర్లు చెబుతుంటుంది. నాక్కూడా ఈ మధ్య ఆమెతో గడిపేందుకు సరిగా తీరిక దొరకడం లేదు. దాంతో ఆమెకి ఫోనే ప్రపంచంగా మారిపోయింది. పాపం! నిజానికి ఈ వాట్సప్పులూ, ఫేస్‌బుక్కులూ మొన్నటి దాకా ఆమెకూ తెలీదు. ఈ మధ్యనే తన చిన్ననాటి స్నేహితుల మూలంగా తనూ ‘స్మార్ట్’అయిపోయింది. ఎప్పుడో యాభై ఏళ్ల క్రితం అమ్మతో కలిసి చదువుకున్న స్కూల్మేటొకాయన ఫేస్బుక్లో నా ఫొటోతోబాటూ ఉన్న అమ్మ ఫొటోలు చూసి గుర్తుపట్టి నా ద్వారా అమ్మను కాంటాక్ట్ చేశాడు. తర్వాత ఆమెను బతిమాలీ బామాలీ అందరూ కలిసి ఆమెను పూర్వవిద్యార్థి సమ్మేళనానికి తీసుకెళ్లారు. వాళ్లలో ప్రభుత్వంలో పెద్ద ఆఫీసర్‌గా పని చేసి రిటైరైన ఒకాయన వద్దు వద్దంటున్నా వినకుండా ఆమెకు ఒక స్మార్ట్‌ఫోన్ కొనిచ్చాడు. అంతటితో ఆగకుండా ఆ ఫోన్లో వాట్సప్పూ, ఫేస్బుక్కూ ఇన్స్టాల్ చేసి, వాటిని ఆపరేట్ చేయడం ఎలాగో నేర్పించాడు... స్వతహాగా తెలివిగల మా అమ్మ అన్నిటినీ ఠకాఠకా నేర్చేసుకుని, తన పాత నొక్కుడు ఫోన్ పక్కన పడేసి,స్మార్ట్ మదర్ అయిపోయింది. తొందరలోనే తను మా అందరికన్నా బిజీ అయిపోయింది ఫేస్బుక్కూ, వాట్సప్పులలో. వాటి పుణ్యమా అని ఇప్పుడు నాకు ఫోన్ చేయడం, మా పెద్దదానితో ‘తిండి తినకపోతే చిక్కిపోతావ్, అది తినూ, ఇది తినూ అని సతాయించడం... పొద్దుగూకులూ ఆ సిస్టమ్ చూడ్డమేనా, హోమ్ వర్క్ చేసుకునేదేమైనా ఉందా’’ అంటూ గొడవ పడటం మానేసింది. పైపెచ్చు మా చిన్నదెప్పుడైనా ఏడుస్తుంటే పిలిచి, దగ్గర కూచోబెట్టుకుని తన ఫోన్లోని వీడియోలూ, ఫొటోలూ చూపిస్తూ, మాక్కొంచెం ఊరట కనిపించింది. ఇదేదో బాగానే ఉందిలే అనుకున్నాం నేనూ అక్కా వాళ్లూ. నేను మా ఆఫీసులోని వాళ్లకీ, తెలిసిన వాళ్లకీ కూడా ‘‘మా అమ్మ వాట్సప్పు వాడుతుంది తెలుసా’’ అని గర్వంగా చెప్పుకోవడం మొదలు పెట్టాను. అయితే, త్వరలోనే మాకు ‘స్మార్ట్’ సమస్యలూ మొదలయ్యాయి. ఫోన్లో తెలుగు కీ బోర్డ్ పెట్టుకుని నాకూ, మా అక్కా వాళ్లకూ, పిన్నీ వాళ్లకీ, తనకు ఆ ఫోన్ కొనిచ్చినాయనకీ ఎడాపెడా మెసేజీలు చేయడం... ఏదో హడావుడిలో ఉండి రిప్లై ఇవ్వకపోతే ‘‘చూసి కూడా రిప్లై ఇవ్వలేదే’’ అని నిష్ఠూరాలు పోవడం మొదలు పెట్టింది. ఫేస్బుక్లోనేమో తను వయసులో ఉన్నప్పటి ఫొటోని ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుంది. దాంతో ఆమె యంగ్ అనుకుని కొందరు ఆకతాయిలు ‘‘హాయ్... యూ ఆర్ సో స్వీట్’’అంటూ మెసేజీలు, చాటింగ్‌లు చేయడం మొదలు పెట్టారు. అవి మా దగ్గరకు తీసుకొచ్చి చూపించి నవ్వుకోవడం, కొంచెం వికటిస్తే తనలో తనే భయపడ్డం... గ్యాలరీలో ఫొటోలు చూసుకుంటుంటే పొరపాటుగా ఎవరికో వెళ్లాయి, వాటిని డిలీట్ చేయడం ఎలా అని కంగారు పడటం... పక్కరూమ్లో ఉన్న నాకు కూడా ‘‘ఏంటీ అట్లా ఉన్నావ్... ఆఫీస్‌లో ఎవరన్నా ఏమైనా అన్నారా... లేకపోతే మీ ఆవిడేమైనా పుట్టింటికెళ్తానంటోందా’’ అని వాట్సప్ చేయడం... లేదంటే ‘ఒకసారిటొచ్చిపో’ అని మెసేజీలివ్వడం... గ్యాలరీలో ఎప్పటినుంచో ఉన్న ఫొటోలు పొరపాటుగా డిలీటయిపోయాయి. ఎలా వస్తాయి అని అడగడం... ఫోన్ మెమరీ ఫుల్లయిపోయిందనీ, నెట్టు రావడం లేదనీ, వైఫై ఆన్ చేయడం మర్చిపోయి, డేటా ఆన్ చేసేసరికి బ్యాలన్సంతా అయిపోయిందని బాధపడటం... ఇలాగన్నమాట. అసలు అంతకుముందు సన్డే సప్లిమెంట్లలో తెలుగు పదకేళీలు పూర్తిచేయడమంటే అమ్మకు ఇష్టమని ఆమెకోసం ఆదివారం నాడు నాలుగైదు పేపర్లు వేయించేవాణ్ణి... ఇప్పుడు వైఫై పెట్టించాల్సొచ్చింది!! మొన్నామధ్య రోడ్డు బాగు చేస్తుండే సరికి కేబుల్ వైర్లు తెగిపోయి, రెండు మూడురోజులపాటు నెట్ సరిగా పని చేయలేదు. కరెంట్ కూడా వస్తూ పోతూ ఉంది. దాంతో చేసేదేం లేక ఎప్పటెప్పటివో సన్డే సప్లిమెంట్లు ముందేసుకుని కూచుని పజిల్స్ పూర్తి చేస్తూ... మధ్యమధ్యలో తెలియని పదాల కోసం ఫోన్లు చేసి మాట్లాడుతూ కనిపించింది. అయితే ఆ సంబరం ఎన్నాళ్లుంటుంది... కేబుల్ వైర్లు కలవకుండా ఉంటాయా? కరెంటు రాకుండా ఉంటుందా? సిస్టమ్ పని చేయకుండా ఉంటుందా? అదిగో... మళ్లీ పోన్ రింగవుతోంది. అమ్మే చేస్తోంది.. బహుశా మళ్లీ వైఫై పని చేయడం లేదేమో! అప్డేట్ అవ్వండే! ఒక్కసారి.. పైన ఫొటోలో ఉన్న బామ్మగారిని చూడండి. ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నారు. ఈ వయసులో ఇంకెవరితో మాట్లాడతారు? మనవరాళ్లు, మనవళ్ల గురించి కొడుకు, కూతురితో డిస్కస్ చేస్తున్నారని తప్పులో కాలేయకండి. ఇంటర్నెట్ స్పీడ్ పెంచమని కంప్లైట్ చేస్తున్నారామె. మాములు బామ్మ కాదండీ బాబు. అప్డేటేడ్ బామ్మగారు. అంతేనా.. ఆమెని ఎవరైనా బామ్మ అంటే ఊరుకోరు. ‘కాల్ మీ బేబీ. బేబీ షామిలి’ అంటారు. ఇప్పుడు అర్థమైందిగా ఎంత అప్డేటెడ్ బామ్మగారో. ‘అప్ డేట్ అవ్వండే. గంటల తరబడి అద్దం ముందు నిలబడి మిమ్మల్ని మీరు చూసుకోవడం కాదు... మిమ్మల్ని పదిమందీ చూసేలా తయారవ్వండి’ అని మనుమరాళ్లను ఊదరగొడుతుంటుంది. మోడరన్ బామ్మగా రోహిణీహట్టంగడి నటించిన ఈ సీన్ ఏన్టీఆర్, సమంత నటించిన ‘రామయ్యా.. వస్తావయ్యా’ సినిమాలోనిది. – డి.వి.ఆర్.భాస్కర్ -
పేలిన స్మార్ట్‌ఫోన్..బెంబేలెత్తిన ప్రయాణికులు
న్యూడిల్లీ: ఢిల్లీనుంచి బయలుదేరిన జెట్ ఎయిర్వేస్ విమానంలో సడెన్‌గా కలకలం రేగింది. 80 మంది ప్రయాణికులతో ఇండోర్ వెళుతున్న విమానంలో ఉన్నట్టుండి దట్టమైన పొగ అలుముకోవడంతో ప్రయాణీకుల పై ప్రాణాలు పైనే పోయాయి. అయితే వెంటనే అప్రమత్తమైన సిబ్బంది,కారణాలను కనుక్కొని ప్రయాణికులను శాంతింప చేశారు. ఒక ప్రయాణీకురాలి హ్యాండ్‌బ్యాగ్‌లో ఉన్న మొబైల్ ఫోన్ పేలడంతో ప్రయాణీకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఢిల్లీ నుంచి ఇండోర్ వెడుతున్న జెట్ ఎయిర్ వేస్ విమానంలో శుక్రవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఢిల్లీలో ప్యాకేజింగ్ బిజినెస్ చేస్తున్న , ఢిల్లీలో మాయూర్ విహార్-ఐకి చెందిన అతుల్ ధాల్ , భార్య అర్పితా ధాల్, 18 నెలల వయసున్న కుమారుడు , తండ్రితో కలిసి దీపావళి పండుగకు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. స్నాక్స్ ఇస్తుండగా పొగ అలుముకోవడాన్ని విమాన సిబ్బంది గమనించారు. వెంటనే సీటు కిందనుంచి బ్యాగును బయటకుతీసి, ఇతర ప్రయాణీకుల సాయంతో మంటల్ని ఆర్పారు. తమ సీటు కిందనుంచి శబ్దం రావడంతోపాటు, బాగా పొగరావడాన్ని గమనించామని అతుల్ ధాల్ తెలిపారు. బ్యాగులో ఉన్న మొత్తం మూడు సెల్ఫోన్లు ఉండగా, అందులో ఒకటి పేలిదంటూ వివరించారు. ఈ సంఘటనను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌కు నివేదించామని జెట్ ఎయిర్వేస్ ప్రకటించింది. డీజీసీఏ సూచించిన మార్గదర్శకాల ప్రకారం అన్ని అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నామనీ, మొబైల్ పరికరాన్ని తదుపరి దర్యాప్తు కోసం కస్టడీలోకి తీసుకున్నామని . మరోవైపు పేలిన స్మార్ట్‌ఫోన్ ఏ కంపెనీది తదితర వివరాలను మాత్రం వెల్లడించలేదు. -
చెమటతో చార్జింగ్
లాస్ఏంజిలెస్: మనుషుల స్వేదాన్ని ఉపయోగించి ఎలక్ట్రానిక్ పరికరాలను చార్జ్ చేసేసాంకేతి కతను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీని ఉపయోగించి చర్మానికి అంటిపెట్టుకొని ఉండేలా పట్టీ(స్కిన్ పాచ్)ని రూపొందించారు. సాధారణంగా బ్యాటరీల్లో వినియోగించే లోహాలను కాకుండా ఈ స్కిన్ పాచ్‌లో ఎంజైమ్స్‌ను ఉపయోగించామని దీన్ని అభివృద్ధి చేసిన కాలిఫోర్నియా వర్సిటీ పరిశోధకులు చెప్పారు. చెమటలో ఉండే లాక్టిక్ యాసిడ్‌ను ఉపయోగించుకుని పరికరంలో అమర్చిన బయో ఫ్యూయల్ సెల్స్ చార్జ్ అవుతాయని తెలిపారు. -
ప్రపంచంలో అతిచిన్న ప్రాస్సెసర్ ఫోన్
-
మోస్ట్ హాక్-ప్రూఫ్ స్మార్ట్‌పోన్ ఇదేనట!
హ్యాకింగ్ భయాలతో ఆందోళన చెందుతున్నస్మార్ట్ఫోన్ ప్రేమికులకు శుభవార్త. సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ కంపెనీ మెకఫే ఇంతకుముందెన్నడూ లేని ఒక సరికొత్త ప్రైవసీ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది. మోస్ట్ హాక్-ప్రూఫ్ స్మార్ట్‌పోన్‌ను తయారుచేసే ప్రణాళికలను ఆయన ఇటీవల ట్విట్టర్ లో వెల్లడించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను హ్యాక్ చేయడం చాలా కష్టమని తెలిపారు. ‘న్యూస్‌వీక్’ వెబ్సైట్ తో మాట్లాడిన మెకఫే సంస్థ వ్యవస్థాపకుడు జాన్ మెకఫే ప్రపంచంలోనే తొలి పూర్తి ప్రైవేట్ స్మార్ట్‌ఫోన్ ఇదేనని కూడా ప్రకటించారు. ‘జాన్ మెకఫే ప్రైవసీ ఫోన్’ పేరుతో ఈ ఏడాదే ఈ ఫోన్ అందుబాటులోకి వస్తుందని మెకఫే చెప్పారు. అయితే ఇది సాధారణ వినియోగదారుల కోసం కాదట... వ్యాపారవేత్తలు, సమాచార భద్రత కోరుకునే వారి కోసం దీన్ని తయారుచేశామన్నారు. ఇక ధర విషయానికి వస్తే సుమారు రూ. 65వేలు (1000 డాలర్లు) ఉంటుందని చెప్పారు. ‘ప్రపంచంలోనే తొలి ట్రూలీ ప్రైవేట్ స్మార్ట్‌ఫోన్ అని జాన్ ట్వీట్ చేశారు. దీంతోపాటు ప్రైవసీ స్మార్ట్‌ఫోన్ ఫొటోను షేర్ చేశారు. డెన్మార్క్‌లో డిజైన్ చేసి, అమెరికాలో డెవలప్ చేసి, యూరోప్‌లో అసెంబుల్డ్ చేసిన ఈ స్పెషల్ స్మార్ట్‌ఫోన్‌ను ఎంజీటీ, మెకఫే సంస్థలు సంయుక్తంగా తయారుచేస్తునట్టు వివరించారు. అయితే ఈ ఫోన్ స్పెసిఫికేషన్ల గురించి మాత్రం వెల్లడించలేదు. దీని అఫీషియల్ లాంచింగ్ ముందు పూర్తి వివరాలు ప్రకటిస్తామన్నారు. ఈ డివైస్ హార్డ్‌వేర్ భద్రత అంశంలో కీలక ప్రాత పోషించనుందన్నారు. "హార్డ్‌వేర్ భద్రతకు మూలం..సాప్ట్వేర్ అభద్రతకు ఆధారం అన్నట్టుగా ట్వీట్ చేశారు. కాగా యూజర్ల డేటాను రక్షించేందుకు ఆపిల్, గూగల్ ఆపరేటింగ్ సిస్టం ప్రైవసీ పద్దతులను పాటిస్తోంటే..మరి ఈ మెకఫీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోనుందో ఇంకా రివీల్ కావల్సి ఉంది. -
ఫోన్ మాట్లాడుతూ భవనంపై నుంచి పడి యువతి మృతి
చైతన్యపురి: అపార్ట్మెంట్ టెర్రస్‌పై ఫోన్లో మాట్లాడుతున్న ఓ యువతి ప్రమాదవశాత్తు నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన సరూర్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పత్తిపాక గ్రామానికి చెందిన ఏదుల కుమార్ బతుకుదెరువు కోసం రెండేళ్ల క్రితం నగరానికి వచ్చి సరూర్‌నగర్‌లోని జనప్రియ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు. కుమార్‌కు నలుగురు కూతుళ్లు. నాల్గో కూతురు మమత (18) దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. మమత గురువారం అపార్ట్మెంట్ రెండో అంతస్తులో టెర్రస్‌పై ఫోన్లో మాట్లాడుతూ ప్రమాదవశాత్తు కిందపడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. -
ఢిల్లీలో మొబైల్ స్టోర్‌లో మహిళల రచ్చ
-
భారత్ మా నిజమైన భాగస్వామి
• మోదీతో ఫోన్లో ట్రంప్ • అమెరికా రావాలని మోదీకి ఆహ్వానం న్యూఢిల్లీ/వాషింగ్టన్: భారత్ తమకు నిజమైన భాగస్వామి అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటిం చారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాలుగు రోజుల తర్వాత భారత ప్రధాని మోదీకి ట్రంప్ మంగళవారం రాత్రి ఫోన్ చేశారు. జనవరి 20న బాధ్యతలు స్వీకరించిన తర్వాత ట్రంప్ బ్రిటన్, కెనడా, మెక్సికో, ఇజ్రాయెల్, ఈజిప్టు దేశాల అధినేతలతో ఫోన్లో సంభాషించారు. తాజాగా మోదీకి ఫోన్ చేశారు. ఉగ్రవాదంపై పోరాటానికి ఇరు దేశాలు భుజం భుజం కలిపి పనిచేయాలని, రక్షణ, ఆర్థిక సంబం ధాలను మరింత బలోపేతం చేయాల ని ఈ సందర్భంగా ట్రంప్, మోదీ నిర్ణయించారు. ఫోన్ సంభాషణ సంద ర్భంగా ట్రంప్ భారత్‌లో పర్యటిం చాల్సిందిగా మోదీ ఆహ్వా నించారు. ద్వైపాక్షిక పర్యటన నిమి త్తంగా మోదీ అమెరికా రావాలని ట్రంప్ కూడా ఆహ్వానించారు. ప్రపంచ వ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కో వడంతో భారత్ తమకు నిజమైన మిత్రదేశం, భాగస్వామి అని ట్రంప్ పేర్కొన్నట్టు వైట్‌హౌస్ తెలిపింది. -
మోదీకి ట్రంప్ ఫోను
న్యూఢిల్లీ: నాలుగు రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్.. మంగళవారం రాత్రి 11.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. ఈ విషయాన్ని వైట్‌హౌస్ కార్యాలయం మీడియా కార్యదర్శి సీన్ స్పైసర్ వెల్లడించారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక వరుసగా వివిధ దేశాధినేతలతో మాట్లాడుతున్న ట్రంప్ ఇప్పటికే కెనడా, మెక్సికో, ఇజ్రాయెల్, ఈజిప్టు దేశాధినేతలకు ఫోన్ చేసి మాట్లాడారు. మంగళవారం రాత్రి ప్రధాని మోదీ ట్రంప్‌కి మరోసారి శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల మధ్య సైనిక, ఆర్థిక రంగాల్లో భాగస్వామ్యం బలోపేతంపై చర్చించారు. వచ్చే ఏడాది మోదీని అమెరికా పర్యటనకు రావాలని ట్రంప్ ఆహ్వానించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సవాళ్లును అధిగమించడంలో భారత్ ఓ నిజమైన స్నేహితునిగా ట్రంప్ అభివర్ణించారు. భద్రతపరమైన అంశాలతో పాటు పలు కీలక అంశాలపై ఇరు నేతలు చర్చించినట్లు వైట్ హౌస్ కార్యాలయం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. అధ్యక్షుడిగా ఎన్నికైతే భారత్, ఇజ్రాయెల్ సహా పలు దేశాలతో సంబంధాలు మరింత మెరుగుపడేలా కృషి చేస్తామంటూ ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలుపొందిన వెంటనే అభినందించిన తొలి ఐదుగురు నేతల్లో మోదీ కూడా ఒకరు. -
పొడవని పొత్తు?
• ఎస్పీ–కాంగ్రెస్‌ల మధ్య కుదరని సయోధ్య • 99 సీట్లు ఇస్తామన్న ఎస్పీ.. 120కి తగ్గేది లేదన్న కాంగ్రెస్.. అఖిలేశ్‌కు సోనియా ఫోన్ లక్నో, న్యూఢిల్లీ: యూపీలో ఆదిలోనే మహాకూటమి ఏర్పాటుకు బ్రేక్ పడగా... తాజాగా ఎస్పీ–కాంగ్రెస్‌ల మధ్య పొత్తుపై ప్రతిష్టంభన వీడలేదు. బీజేపీ, బీఎస్పీల్ని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌తో పొత్తుకు తహతహలాడిన అఖిలేశ్ 99 సీట్లు ఇస్తామన్నా... కాంగ్రెస్ మరిన్ని సీట్లకు పట్టుబట్టడంతో సయోధ్యపై నీలి నీడలు కమ్ముకున్నాయి. 85 సీట్లకు మించి ఇచ్చేది లేదంటూ శుక్రవారం స్పష్టం చేసిన ఎస్పీ... శనివారం దిగివచ్చి మరో 14 సీట్లకు ఓకే చెప్పింది. 150 స్థానాలు ఇవ్వాలంటూ మొదట్లో డిమాండ్ చేసిన కాంగ్రెస్... చివరకు 120 స్థానాలు ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పేసింది. సీట్ల సంఖ్యపై తగ్గేది లేదని చెపుతూ... మొదటి రెండు దశలకు అభ్యర్థుల్ని కూడా ఖరారు చేసేసింది. శుక్రవారం సమాజ్‌వాదీ పార్టీ 210 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించడంతో కాంగ్రెస్ ఉలిక్కిపడింది. ఎస్పీ జాబితాలో కాంగ్రెస్‌కు చెందిన 8 సిట్టింగ్ స్థానాలు సహా గాంధీల కంచుకోటలు అమేథీ, రాయ్‌బరేలీ పరిధిలోని స్థానాలు ఉండడంతో ఆ పార్టీలో కలవరం మొదలైంది. దీంతో ప్రియాంక గాంధీ తరఫున ప్రత్యేక ప్రతినిధిగా యూపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ గులాం నబీ ఆజాద్ రంగంలోకి దిగారు. ఎస్పీతో పొత్తు చర్చలు జరిపినా ఎలాంటి పురోగతి కనిపించలేదు. కాంగ్రెస్ డిమాండ్లకు తలొగ్గేది లేదంటూ సమాజ్‌వాదీ కూడా స్పష్టం చేసింది. పొత్తు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయంటూ ఎస్పీ ఎంపీ నరేష్ అగర్వాల్ తేల్చి చెప్పారు. ‘పొత్తు దాదాపు ముగిసినట్లే. కాంగ్రెస్‌కు యూపీ సీఎం 100 సీట్ల వరకూ ఇస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ మాత్రం 120 సీట్లు ఇస్తేనే ఒప్పుకోవాలనే ఆలోచనలో ఉంది’ అని చెప్పారు. మేం కూడా తగ్గేది లేదు.. కాంగ్రెస్: పొత్తుపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కోసం వేచి ఉండకుండా ఎస్పీ అభ్యర్థుల్ని ప్రకటించేసిందని, ఆ పార్టీ నాయకత్వం రాజీ ధోరణితో వ్యహరించడం లేదనేది కాంగ్రెస్ ఎదురుదాడి చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నిక కమిటీ శనివారం సమావేశమై మొదటి రెండు దశల్లో 140 సీట్లకు అభ్యర్థుల్ని ఖరారు చేసింది. తాము కూడా పట్టువీడేది లేదంటూ ఎస్పీకి పరోక్ష సంక్షేతాలు పంపింది. ఎస్పీతో పొత్తు ముగిసినట్లేనా అని ఆజాద్‌ను ప్రశ్నించగా.. ‘వేచి చూడండి. ఆదివారం ఉదయం తెలుస్తుంది’ అని పేర్కొన్నారు. ఆదివారం సమాజ్‌వాదీ మేనిఫెస్టోను అఖిలేశ్ యాదవ్ విడుదల చేయనున్నారు. ఎస్పీ–కాంగ్రెస్‌లు కలిసి ఉమ్మడిగా మేనిఫెస్టో విడుదల చేస్తారని భావించినా... కూటమిపై సందిగ్ధతతో ఎస్పీ మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. సీట్ల పంపకంపై సందిగ్ధత నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ రంగంలోకి దిగారు. యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్‌తో ఫోన్లో ఆమె మాట్లాడారు. ప్రచారకుల జాబితాలో అడ్వాణీకి దక్కని చోటు యూపీ తొలి, రెండో విడత ఎన్నికల్లో పార్టీ ముఖ్య ప్రచారకుల జాబితాను బీజేపీ శనివారం విడుదల చేసింది. జాబితాలో బీజేపీ సీనియర్ నేత అడ్వాణీ, ఎంపీ వరుణ్ గాంధీ, యూపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు వినయ్ కటియార్ పేర్లు లేకపోవడం గమనార్హం. ప్రధానిమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్, రాజ్‌నాథ్, ఉమా భారతి, సంజీవ్ బల్యన్, కల్రాజ్ మిశ్రా, మేనకా గాంధీలు పార్టీ తరఫున ప్రచారం చేయనున్నారు. -
బ్రేకింగ్ న్యూస్ జర్నలిస్టు ఇక లేరు!
హాంగ్ కాంగ్: ప్రఖ్యాత జర్నలిస్టు క్లేర్ హాలింగ్ వర్త్ (105)ఇకలేరు. జర్మన్ ట్యాంకులు కెట్వైస్ పోలిష్ పట్టణం చుట్టు ముట్టాయంటూ రెండవ ప్రపంచయుద్ధ వార్తను ముందుగా ప్రపంచానికి అందించిన బ్రిటిష్ జర్నలిస్టు క్లేర్ కన్నుమూశారు. లండన్ డెయిలీ టెలిగ్రాఫ్ జర్నలిస్టుగా పనిచేస్తున్న ఆమె 1939, ఆగస్టు లో నాజీల దాడిని రిపోర్టు చేసి రెండవ ప్రపంచ యుద్ధ వార్తను బ్రేక్ చేసిన ఘనతను సాధించారు. 1911 అక్టోబర్ 10న ఇంగ్లాండ్ లో జన్మించిన క్లేర్ హాలింగ్ వర్త్ లండన్ డైలీ టెలిగ్రాఫ్ లో 27 వయస్సులో జర్నలిస్టులు కరియర్ మొదలు పెట్టారు. కేవలం ఒక వారంలోనే రెండవ ప్రపంచయుద్ధ వార్తతో జీవితకాలానికి మంచి పేరును సాధించారు. అసామాన్య ప్రతిభా పాటవాలతో జర్నలిజంలో అనేక అవార్డులను ఆమె గెలుచుకున్నారు. ముఖ్యంగా 'వాట్ ద పేపర్ సే' అనే జీవిత సాఫల్య పురస్కారాన్నికూడా అందుకున్నారు. విధి నిర్వహణలో అనేకస్లారు మృత్యువు నుంచి తృటిలో తప్పించుకున్నారు. దశాబ్దాల పాటు తన సేవలందించిన హాలింగ్ వర్త్ ప్రమాదానికి చేరులో వార్తలను సేకరించడంలో దిట్ట. దాదాపు 100 మంది మృతికి కారణమైన 1946 లో, జెరూసలేంలో కింగ్ డేవిడ్ హోటల్ ను ఉగ్రవాదుల కూల్చివేసిన ఘటనలో ఆమె హోటల్ కు కేవలం 300 గజాల (మీటర్లు) దూరంలో ఉన్నారు. అలాగే వియత్నాం యుద్ధం, అల్జీరియన్ స్వాతంత్ర్య పోరాటంలో తదితర క్లిష్టమైన ఘట్టాలను ఆమె కవర్ చేశారు. జెండర్ వివక్షను ఎదుర్కొంటూనే జీవితంలో వృత్తిలో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. జీవిత చరమాంకంలో కూడా అనేక అంతర్జాతీయ పత్రిలకు ఆర్టికల్స్ రాసేవారు. ముఖ్యంగా ఇంటర్నేషనల్ హెరాల్డ్ ట్రిబ్యూన్ , ఆసియా వాల్ స్ట్రీట్ జర్నల్ కు వ్యాసాలు రాశారు. ఇటీవలే ఆమె 105 వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఆమె మరణంతో జాతీయ, అంతర్జాతీయ మేధావులు, జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు. కాగా క్వీన్ ఎలిజబెత్ II బ్రిటిష్ సామ్రాజ్యంలో ఆర్డర్ ఆఫ్ ఆఫీసర్ గా హాలింగ్ వర్త్ పనిచేశారు. అలాగే మాజీ బ్రిటిష్ ప్రధానమంత్రి టెడ్ హీత్ , మాజీ హాంగ్ కాంగ్ గవర్నర్ క్రిస్ పాటెన్ సహా, పలు బ్రిటిష్ సైనికాధికారులు ఆమెకు అభిమానులుగా ఉండటం ఆమె జర్నలిజం ప్రతిభకు నిదర్శనం. -
కనిమొళికి రాహుల్ గాంధీ ఫోన్
చెన్నై: డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్య పరిస్ధితి గురించి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలుసుకున్నారు. డీఎంకే నేత కనిమొళికి ఫోన్ చేసిన రాహుల్.. కరుణానిధి ఆరోగ్యంపై ఎంక్వైరీ చేశారు. కాగా, అలెర్జీ, శ్వాసకోశ సమస్యలతో గురువారం ఉదయం కరుణానిధి కావేరి ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. కరుణానిధి అలెర్జీ సమస్యతో ఇబ్బందిపడుతున్నారని ఆయనకు కొద్ది రోజుల పాటు ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందించాలని పేర్కొంది. కరుణానిధి ఆసుపత్రిలో చేరడంతో డీఎంకే నేతలు ఒక్కసారిగా ఆసుపత్రికి క్యూ కట్టారు. దీనిపై స్పందించిన డీఎంకే నేత స్టాలిన్ నేతలెవరూ ఆసుపత్రికి రావొద్దని విజ్ఞప్తి చేశారు. కరుణానిధి ఆరోగ్యం బాగానే ఉన్నారని చెప్పారు. -
సిగ్నల్స్ లేకపోయినా ఫోన్ పని చేస్తుంది
-
10 రోజులూ పేపర్లు, మొబైల్‌కు సీఎం దూరం
ధర్మశాల: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పదిరోజుల పాటు మెడిటేషన్ కోర్సులో పాల్గొనేందుకు హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లారు. కేజ్రీవాల్ ఈ పది రోజులు ఎవరినీ కలవరు. ఆయన భద్రత సిబ్బంది కూడా దూరంగా ఉంటారు. కేజ్రీవాల్ న్యూస్ పేపర్లు, టీవీలకు దూరంగా ఉండటంతో పాటు మొబైల్ ఫోన్ కూడా వాడరు. సోమవారం ధర్మశాలకు వచ్చిన కేజ్రీవాల్ కు ఆప్ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ నెల 12 వరకు ఆయన ఇక్కడే గడపనున్నారు. ధర్మకోట్లోని హిమాచల్ విపాస్సన సెంటర్లో బస చేస్తారు. మెడిటేషన్ కోర్సు మంగళవారం ప్రారంభమై, ఈ నెల 11 వరకు కొనసాగుతోంది. ఆ మరుసటి రోజు కేజ్రీవాల్ ఢిల్లీకి తిరిగివెళతారు. -
ఫోన్ మాట్లాడుతూ బస్సు డ్రైవింగ్
ఆర్టీసీ డ్రైవర్‌కు రూ. వెయ్యి జరిమానా భాగ్యనగర్‌కాలనీ : ఫోన్ లో మాట్లాడుతూనే బస్సు నడుపుతూ ఓ ఆర్టీసీ డ్రైవర్ కూకట్పల్లి ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. సదరు డ్రైవర్‌కు పోలీసు లు చలానా విధించారు. మియాపూర్ డిపోకు చెంది న బస్సు (ఏపీ11జెడ్ 6563) శుక్రవారం కూకట్పల్లి వై జంక్షన్ వద్దకు చేరుకుంది. ఆ సమయంలో డ్రైవర్ సెల్ఫోన్లో మాట్లాడుతూ ఆ బస్సు నడుపుతున్నాడు. ఈ విషయం గమనించిన ట్రాఫిక్ పోలీసులు డ్రైవర్‌ను పట్టుకున్నారు. అతడికి రూ. వెయ్యి చలాన్ విధించారు. అనంతరం ట్రాఫిక్ ఎస్ఐ సైదులు మాట్లాడుతూ... వాహనం నడుపుతూ ఫోన్లో మాట్లాడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారిపైనైనా చర్యలు తీసుకుంటామన్నారు. -
వంట ఎంత సులభం...
ఒకప్పుడు అన్నం వండాలంటే స్టౌ పైనే వండాలి. కానీ ఇప్పుడో... బియ్యాన్ని కడిగి కుక్కర్లో వేస్తే సరిపోతుంది. అన్నం అయ్యాక కుక్కర్ దానంతట అదే ఆఫ్ అవుతుంది. అయితే.. చాలామందికి బియ్యం కడగటం, నీళ్లు కొలిచి పోయడం కూడా కష్టంగా ఉందట. అందుకే అలాంటివారి కోసం ఓ కంపెనీ ఈ ‘రోబోటిక్ రైస్ కుక్కర్’ను తయారు చేసింది. దీనివల్ల బియ్యం కడిగే శ్రమ కూడా తప్పినట్టే. ఎలా అంటే.. ఇందులో అమర్చిన డబ్బాల్లో ఒకేసారి కిలోన్నర బియ్యం, అయిదు లీటర్ల నీళ్లు పోసి ఉంచితే చాలు. మీ ఫోన్ ద్వారా ఎప్పుడు కావాలంటే... అప్పుడు కుక్కర్‌ను ఆన్ చేయొచ్చు. ఎన్ని కప్పుల బియ్యం అవసరమన్నది అక్కడ ఉన్న ఆప్షన్ల ద్వారా ప్రెస్ చేయాలి. దాంతో కుక్కరే బియ్యం కడిగి, ఎన్ని నీళ్లు అవసరమో పోసి అన్నం వండేస్తుంది. ఆఫీసు లేదా మార్కెట్ నుంచి బయలుదేరే ముందు ఫోన్ ద్వారా కుక్కర్ ఆన్ చేస్తే సరి.. ఇంటికొచ్చే సరికి వేడివేడి అన్నం రెడీగా ఉంటుంది. అలాకాకుండా, ఒకసారి టైం సెట్ చేస్తే... రోజూ అదే సమయానికి అన్నం రెడీ అవుతుంది. -
షాక్..
పట్టుకోండి చూద్దాం అప్పటి వరకు మౌన మునిలా ఉన్న వాతావరణం ఉన్నట్టుండి ఉగ్రరూపం దాల్చింది. రాక్షసులందరూ కట్టగట్టుకొని అరుస్తున్నట్లు ఆకాశంలో శబ్దాలు వినిపిస్తున్నాయి. కాసేపట్లో భారీ వర్షం వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హారికకు మనసులో భయంగా ఉంది. ఇంట్లో ఒంటరిగా ఉండడం హారికకు ఇదే మొదటిసారి. కుటుంబ సభ్యులందరూ ఒక పెళ్లి కోసం బెంగళూరు వెళ్లారు. ఎగ్జామ్స్ లేకపోతే... తాను కూడా పెళ్లికి వెళ్లేది. ‘‘ఈసారి ఎలాగైనా సరే... మంచి మార్కులు తెచ్చుకోవాలి’’ అని మనసులో గట్టిగా అనుకుంది. గాలి హోరును, ఆకాశం నుంచి వినిపించే శబ్దాలను పట్టించుకోకుండా చదువులో నిమగ్నమైపోయింది హారిక. ఇంతలో ఫోన్ మోగింది. ‘‘అప్పటి నుంచి నాన్నగారి ఫోన్‌కు ప్రయత్నిస్తున్నాను. నాట్ రీచబుల్... అని వస్తోంది. నాన్నగారు ఊళ్లో లేరా?’’ ‘‘అమ్మా, నాన్న, తమ్ముడు పెళ్లికి వెళ్లారు అంకుల్. రేపు సాయంత్రానికి వచ్చేస్తారు’’ అని చెప్పింది హారిక. ఫోన్ చేసిన వ్యక్తి సబ్ ఇన్స్పెక్టర్ ఆనంద్. హారిక వాళ్ల ఇంటి దగ్గరలోనే ఉంటాడు. హారిక నాన్న శేఖర్‌కు ఆనంద్ క్లోజ్‌ఫ్రెండ్. అప్పుడే డ్యూటీ నుంచి వచ్చిన ఆనంద్, శేఖర్‌తో కాసేపు మాట్లాడిపోదామనుకున్నాడు. కానీ ఫోన్ కలవక పోవడంతో ఇంట్లోనే ఉండిపోయాడు. కాసేపటికి..... గాలి గట్టిగా వీస్తోంది. కిటికీ వైపు నుంచి ఏదో పెద్ద శబ్దం వినిపించింది. ‘‘ఎవరూ?’’ అంటూ స్టడీరూమ్ నుంచి బయటికి వచ్చింది హారిక. ఎవరూ కనిపించకపోవడంతో మళ్లీ స్టడీరూమ్లోకి వెళ్లింది. ‘ఎక్కడి నుంచి వచ్చింది ఆ శబ్దం? పిల్లి దూరి ఉంటుంది’ అనుకుంది. రెండు నిమిషాల తరువాత... ఏదో అలికిడి కావడంతో స్టడీరూమ్ నుంచి బయటికి వచ్చింది హారిక. అంతే... వెనక నుంచి ఎవడో గట్టిగా పట్టుకున్నాడు. కణతల దగ్గర గన్ పెట్టాడు. ‘‘నీ ప్రాణాలు పోవడమా? రక్షించుకోవడమా? అన్నది పూర్తిగా నీ చేతుల్లో ఉంది. మీ ఇంట్లో ఉన్న డబ్బు, నగలు... ఎక్కడ ఉన్నాయో చెబితే... నీకేమీ కాదు...’’ అన్నాడు ఆ దొంగ. షాక్ నుంచి కోలుకోని హారిక ఏం మాట్లాడలేదు. ‘‘మాట్లాడవేం....’’ గద్దించాడు దొంగ. ఈలోపే ఫోన్ మోగింది... ‘‘నువ్వు అడిగినట్లే డబ్బు, నగలు ఎక్కడ ఉన్నాయో చెబుతాను. అయితే ఆ ఫోను ఎత్తనివ్వు’’ అన్నది హారిక. ‘‘ఇంట్లో దొంగ దూరాడని చెప్పడానికా?’’ కళ్లెర్ర చేశాడు దొంగ. ‘‘కాదు... నేను ఆ ఫోన్ అటెండ్ చేయకపోతే... నేనేదో ప్రమాదంలో ఉన్నారనుకుంటారు. అందుకే...’’ అంది తెలివిగా హారిక. ‘‘సరే, మాట్లాడు. నా గురించి ఒక్క మాట చెప్పినా... నీ ప్రాణాలు తీస్తాను’’ అని బెదిరించాడు దొంగ. ఫోన్ ఎత్తింది హారిక. అటు నుంచి హారిక అమ్మ రజనీ: ‘ఎలా ప్రిపేరవుతున్నావు?’ ‘‘నోట్స్ కోసం ఆ రవిని హెల్ప్ అడిగాను. నీరజను హెల్ప్ అడిగాను. శ్రీని హెల్ప్ అడిగాను... ప్లీజ్ ఎమర్జెన్సీ అని కూడా చెప్పాను. కానీ ఎవరూ హెల్ప్ చేయలేదు’’ అని ఫోన్ పెట్టేసింది హారిక. ఇది జరిగిన పదినిమిషాల్లోనే ఆ ఇంటిని పోలిసులు చుట్టుముట్టారు. దొంగను అరెస్ట్ చేసి పోలిస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లాడు ఇన్స్పెక్టర్ ఆనంద్. ఇప్పుడు చెప్పండి... హారిక ప్రమాదంలో ఉన్నట్లు బయటి ప్రపంచంలో ఎవరికీ తెలియదు. మరి ఎలా ఈ ప్రమాదం నుంచి హారిక బయట పడింది? ఫోన్లో మ్యూట్ బటన్ ఉపయోగించి ‘ఆ రవిని నోట్స్ కోసం అడిగాను’, ‘నీరజను అడిగాను’, ‘శ్రీని అడిగాను’ అనే మాటలు వినబడకుండా కేవలం ‘హెల్ప్’ ‘హెల్ప్’ ‘హెల్ప్’ ‘ప్లీజ్ ఎమర్జెన్సీ’ అనేవి మాత్రమే తల్లికి వినబడేలా చేసింది హారిక. దీంతో కూతురు ప్రమాదంలో ఉందని గ్రహించి వెంటనే ఇన్స్పెక్టర్ ఆనంద్కి ఫోన్ చేసింది రజనీ. -
జాతీయ గీతాన్ని అవమానించిన ఫరూక్ అబ్దుల్లా
కోల్ కతా: నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా జాతీయ గీతాన్ని అవమానించారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ఫరూక్ ముందు వరుసలో కూర్చున్నారు. జాతీయగీతాన్ని ఆలపిస్తున్న సమయంలో అందరూ లేచి నిలుచున్నారు. ఫరూక్ మాత్రం ఫోన్ లో మాట్లాడుతూ కనిపించారు. రాజ్యాంగంలోని 51(ఎ) అధికరణ ప్రకారం జాతీయ పతాకాన్ని, గీతాన్ని గౌరవించడం ప్రతీ పౌరుని ప్రాథమిక విధి. -
డిన్నర్ సమయంలో ఒకే..!
స్మార్ట్ ఫోన్ల ఒరవడి పెరిగిన తర్వాత ప్రతి విషయం జనాన్ని భయపెడుతున్నాయి. ఫోన్ ఎక్కువగా మాట్లాడితే క్యాన్సర్లు వస్తాయని, బుద్ధిమాంద్యం సంక్రమిస్తుందంటూ కొందరు వైద్య పరమైన సమస్యలను వెల్లడిస్తుంటే... మరి కొందరు ఫోన్ మాట్లాడేందుకు, టెక్ట్స్ సంభాషణలకు కొన్ని సమయాలు మాత్రమే అనుకూలం అని చెప్తుంటారు. అయితే ఫోన్ సంభాషణలకు, టెక్స్ ఛాటింగ్ కు రాత్రి భోజన సమయం మంచిదేనంటున్నారు తాజా అధ్యయనకారులు. రాత్రి భోజన సమయంలో ఫోన్ మాట్లాడ్డం వల్ల ఎటువంటి సమస్యలు ఉండవని పరిశోధకులు చెప్తున్నారు. బంధువులు, చుట్టాలనుంచి కాల్స్ వచ్చినా, సామాజిక మాధ్యమాల్లో ఛాటింగ్ చేసినా ఎటువంటి సమస్యలు ఉండవని చెప్తున్నారు. ముఖ్యంగా భోజనం చేస్తుండగా ఫోన్ వాడకం మంచిది కాదనే విషయంపై పరిశోధనలు నిర్వహించిన మిచిగన్ యూనివర్శిటీ పరిశోధక విద్యార్థి మోసర్.. భోజనం చేస్తూ కాండీక్రష్ వంటి గేమ్స్ ఆడటం, ఫేస్ బుక్ లో వచ్చిన వీడియోలు చూడటం వంటివి భిన్నమైనా... ఛాటింగ్, కాల్స్ వంటివి సమస్యలు తెస్తాయన్నది బూటకం అని తేల్చి చెప్పారు. ప్రపంచంలో ఇంగ్లీషు మాట్లాడే దేశాల్లోని సుమారు 8 నుంచి 88 ఏళ్ళ మధ్య వయసున్న 1,163 మంది పై పరిశోధనలు నిర్వహించారు. భోజన సమయంలో మొబైల్ వాడేవారి ఆలోచనలపై సర్వే నిర్వహించారు. వారు పనిచేసే రంగాన్నిబట్టి వారి ఆలోచనా విధానం ఆధారపడి ఉండటాన్ని గమనించారు. సామాజిక మాధ్యమాలను వినియోగించడంలో ఎక్కువ సమయం పట్టొచ్చని, భోజన సమయంలో మెసేజింగ్, ఫోన్ కాల్స్ చేయడంవల్ల పెద్దగా నష్టం ఉండదని తేల్చి చెప్పారు. చిన్నపిల్లలు ఎక్కువగా వారి మిత్రులతో సంభాషిస్తుంటారని, అదీ పగటి సమయంలోనే ఎక్కువగా ఉంటుందని సర్వేల్లో గమనించిన అధ్యయనకారులు... ముఖ్యంగా రాత్రి భోజన సమయంలో మధ్య వయస్కులే ఎక్కువగా ఫోన్ వినియోగిస్తున్నట్లు గమనించారు. దీంతో వారికి పెద్దగా నష్టం కలగదని తెలుసుకున్నారు. సాధారణంగా భోజన సమయంలో వార్తా పత్రికలు, పుస్తకాలు చదవడం, టీవీలు చూడటం పై ఎన్నో ఏళ్ళక్రితమే పరిశోధనలు జరిగాయని, ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్ల ట్రెండ్ కొత్త సవాలుగా మారిందని సహ పరిశోధకురాలు, ప్రొఫెసర్ సరితా ఛోయెనెబెక్ తెలిపారు. ఫోన్ వాడే సమయంలో అర్జెంట్ కాల్స్ ను, మెయిల్స్ ను కూడ పట్టించుకుంటారో లేదో చెప్పలేమన్నారు. అయితే స్మార్ట్ ఫోన్ అభివృద్ధి పరిచేవారు మాత్రం పరికరాల్లో మరింత విజిబులిటీ పెంచాలని పరిశోధకులు సూచిస్తున్నారు. -
గాలిలో మీ ఫోన్ ఫీచర్లు కనిపిస్తే..!
మన ఫోన్లోని ఫీచర్స్‌ని స్క్రీన్ మీద కాకుండా త్వరలో గాలిలో చూడబోతున్నామా? అంటే అవుననే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఎప్పుడైనా వర్చువల్ స్ర్కీన్ పేరు విన్నారా? అదేనండీ ఎదురుగా కంటికి కనిపించకపోయినా సాఫ్ట్వేర్ సాయంతో చూపడం. ప్రస్తుతం పరిశోధనలో ఉన్న ఈ టెక్నాలజీని ఉపయోగించే మేజిక్ లీప్ అనే అమెరికన్ స్టార్టప్ మనకు కావలసినప్పుడు అవసరమైన చోట దీన్ని ఉపయోగించుకునేలా తయారుచేయడానికి నిర్ణయించుకుంది.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. ఇందులో గాలిలోనే యాప్స్ సాయంతో వర్క్, ఆన్లైన్ షాపింగ్, ఎంటర్టైన్మెంట్ తదితరాలను చేసుకోవడం ఉంది. ఈ వీడియో అంతా ఒక గదిలోనే చిత్రించడం వల్ల పగటిపూట ఎలా పనిచేస్తుందోననే అనుమానాలూ ఉన్నాయి. అయితే, కంపెనీ దీని గురించి ఎలాంటి సమాచారం అధికారికంగా ప్రకటించకపోయినా కళ్లజోడు లేక కాంటక్ట్ లెన్స్‌లను ఉపయోగించడం వల్ల పగటిపూట కూడా ఈ టెక్నాలజీని వాడేందుకు ప్రణాళికను సిద్ధంచేస్తోంది. ఇది మైక్రోసాఫ్ట్ 2015లో విడుదల చేసిన హాలోగ్రామ్(కాంతితో ఏ ఆకారన్నయినా తయారుచేసుకోవడం)ను పోలినట్లుగా ఉంది. ఇప్పటికే గూగుల్ ఈ టెక్నాలజీ మీద పరిశోధనలు చేస్తూ 3డి కళ్లజోడు పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. వాస్తవానికి 2015లోనే విడుదల కావాల్సిన గూగుల్ కళ్లజోడుకు మరికొన్ని ఫీచర్స్‌ను జతచేసేందుకు ఆ పనిని విరమించుకుంది. ప్రస్తుతం గూగుల్‌తో పాటు ఆలీబాబా, క్వాల్కామ్లు ఈ ప్రాజెక్టులపై భారీగా పెట్టుబడులు పెట్టాయి. -
బ్లాక్‌బెర్రీ నుంచి మరో కొత్త ఆండ్రాయిడ్ ఫోన్.!
న్యూఢిల్లీ: బ్లాక్‌బెర్రీ నుంచి మరో కొత్త ఆండ్రాయిడ్ ఫోన్ త్వరలో మార్కెట్లోకి రానుంది. ఇప్పటికే తన తొలి ఆండ్రాయిడ్ ఫోన్ ప్రివ్ పేరుతో రిలీజ్ చేసిన బ్లాక్‌బెర్రీ.. తక్కువ ధరలో ఫోన్ ను అందుబాటులో తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇటీవల న్యూఢిల్లీ వచ్చిన బ్లాక్‌బెర్రీ సీఈఓ జాన్ చెన్ ఈ విషయాన్ని తెలియజేశారు. ప్రివ్ ధర ఎక్కువ ఉండటంతో పాటు, దానికి తోడు నిలబడే మరో ఫోన్ ఏదీ సంస్థ నుంచి లేకపోవడం వల్లే విజయం సాధించలేకపోయిందని చెప్పారు. బ్లాక్‌బెర్రీ ఓఎస్10 విజయంపై స్పందిస్తూ మొబైల్స్‌లో భారీ విజయాన్ని సాధించలేకపోయినా.. ప్రభుత్వాలు ఈ ఓఎస్‌ను ఉపయోగించడానికి ఇష్టపడుతున్నాయని తెలిపారు. మిగతా ఫోన్ల మాదిరి బ్లాక్‌బెర్రీ ఇండియాలో పెద్ద మొత్తాన్ని పెట్టుబడి పెడుతున్నట్లు చెప్పారు. రాబోయే ఆండ్రాయిడ్ మొబైల్ ధర ఇండియాలో రూ.25,000లు ఉంటుందని తెలిపారు. -
జేబులో ఉన్న మొబైల్‌తో మంటలు!
ఇస్లామాబాద్: మొబైల్ ఫోన్ చార్జింగ్ పెడుతుంటే పేలిపోయిన ఘటనలు మనం చూశాం. అయితే జేబులో ఉన్న మొబైల్ ఫోన్‌కు అకస్మాత్తుగా మంటలంటుకున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాకిస్తాన్లో జరిగిన ఈ ఘటనలో ఓ వ్యక్తి అప్పుడే బస్ దిగి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. అతని జేబులోని మొబైల్ ఫోన్ బ్యాటరీ నుండి అకస్మాత్తుగా మంటలు వెలువడి చూస్తుండగానే అతన్ని మొత్తం కమ్మేశాయి. దీంతో ఆర్తనాదాలు చేస్తూ అతడు రోడ్డుపై పరిగెడుతోంటే.. అక్కడి వారు భయభ్రాంతులకు లోనయ్యారు. ఇంతలోనే అక్కడి స్థానిక మార్కెట్లోని ఓ వ్యక్తి బకెట్‌తో నీళ్లు తీసుకొచ్చి అతనిపై పోయడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. అయితే ప్రస్తుతం అతని పరిస్థితి ఎలా ఉందనే విషయం తెలియరాలేదు. సంఘటనా స్థలంలో ఉన్న వ్యక్తి ఎవరో దీనిని వీడియో తీసి ఆన్లైన్లో పోస్ట్ చేశారు. -
రూ.5 కోట్లు... అదే ఫైనల్
♦ తండ్రికి ఫోన్ చేసి బెదిరించిన అభయ్ కిడ్నాపర్ ♦ అంత డబ్బు లేదని వేడుకున్న బాలుడి తండ్రి ♦ సికింద్రాబాద్ రావాలని చెప్పిన దుండగుడు సాక్షి, సిటీబ్యూరో: షాహినాయత్‌గంజ్ పరిధి నుంచి రాజ్‌కుమార్ కుమారుడు అభయ్‌ను బుధవారం సాయంత్రం కిడ్నాప్ చేసిన దుండగులు అతడి తండ్రితో రెండుసార్లు ఫోన్ చేసి మాట్లాడారు. రాత్రి 10.05 గంటలకు తొలి ఫోన్‌కాల్ రాగా... 11.14 గంటలకు రెండో కాల్ వచ్చింది. డబ్బు డిమాండ్ చేస్తూ కిడ్నాపర్ రెండోసారి ఫోన్ చేసినప్పుడు జరిగిన సంభాషణ రికార్డు మీడియాకు అందింది. 2.31 నిమిషాల నిడివితో ఉన్న ఈ ఆడియో ఎడిట్ చేసినట్లు తెలుస్తోంది. అందులో రెండుచోట్ల పాత సంభాషణలు మరోసారి వినిపించడం... స్పష్టమైన ముగింపు లేకపోవడంతో ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కిడ్నాపర్ అంటూ ఫోన్ చేసిన వ్యక్తి అటు హిందీ, ఇటు ఉర్దూ సైతం స్పష్టంగా మాట్లాడలేకపోయాడు. దీన్ని బట్టి మరో వర్గానికి చెందిన వ్యక్తి కావచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. బాలుడి తండ్రి రాజ్ కుమార్, కిడ్నాపర్ల మధ్య సంభాషణ ఇదీ... తండ్రి: హలో... కిడ్నాపర్: హలో... తండ్రి: హాజీ... (చెప్పండి) కి: బోలేనా దస్ కరోడ్ హోనా బోల్కే (రూ.పది కోట్లు కావాలని చెప్పానుగా) తం: కిత్తా పైసే బోలే సాబ్? (ఎంత మొత్తం చెప్పారు సార్?) కి: దస్ కరోడ్ (రూ. పది కోట్లు) తం: ఆప్ కౌన్ బోల్రే భయ్యా? (మీరు ఎవరు మాట్లాడుతున్నారు భయ్యా) కి: కిడ్నాపర్ బోల్రా హు (కిడ్నాపర్‌ని మాట్లాడుతున్నా) తం: హా..! (ఆ..!) కి: కిడ్నాపర్ బోల్ రహా హు (కిడ్నాపర్‌ని మాట్లాడుతున్నా) తం: హమారీసే క్యా దుష్మనీ హైసాబ్? (మాతోం ఏం శత్రుత్వం ఉంది సార్?) కి: ---- (ఫోన్ డిస్ట్రబెన్స్ వచ్చింది) తం: హా సాబ్... ఆవాజ్ నహీ ఆరీ ఆప్మీ ఫోన్ పే సహీ....(సార్... మీ మాటలు సరిగ్గా వినిపించట్లేదు) కి: కిత్తే దేతే? (ఎంత ఇస్తారు?) తం: రాత్ మే కిత్తే రహేంగే సాబ్ హమారే పాస్... దో లాఖ్, పాంచ్ లాఖ్... పాంచ్ లాఖ్ తక్పడే రహతే పూరాబీ నికాల్ దియేతో ఘర్ మే... పాంచ్ లాఖ్ రహతా... ఔర్ దస్బీస్ తులా సోనా రహతా లేడీస్ క... (రాత్రికి రాత్రంటే మా దగ్గర ఎంత ఉంటుంది సార్! రూ.రెండు లక్షలు.. ఐదు లక్షలు... రూ.ఐదు లక్షల వరకు ఉంటుంది. మహిళలకు సంబంధించిన పది, 20 తులాల బంగారం ఉంటుంది.) కి: పాంచ్ కరోడ్ లాస్ట్ (రూ.5 కోట్లు... ఇదే ఆఖరి బేరం) తం: ఉత్తా రహేంగేనా సాబ్ ఘర్మే కాసే రహేంగే సాబ్ పైసే? (మా దగ్గర అంత మొత్తం ఎలా ఉంటుంది? ఎక్కడి నుంచి వస్తుంది?) కి: ఘర్మే నహీ ఐసే ఝూటే మత్ బోలో. పాంచ్ కరోడ్. (ఇంట్లో లేవు... ఇలాంటి అబద్ధాలు చెప్పవద్దు. రూ.5 కోట్లు) తం: హా సాబ్ (ఏంటి సార్) కి: పాంచ్ కరోడ్ (రూ. 5 కోట్లు) తం: పాంచ్ కరోడ్ కిత్తో హోతే సాబ్. పాంచ్ సాత్ సూట్‌కేస్ హోతే బడేబడే. (రూ. ఐదు కోట్లంటే ఎంతో తెలుసా సార్? ఐదేడు పెద్ద పెద్ద సూట్ కేసులు కావాలి.) కి: జాదా బాతా నై కర్నా (ఎక్కువగా మాట్లాడవద్దు) తం: పాంచ్ సాత్ లాఖ్ రుపే ఘర్మే నికల్ జాతే పూరే పేమెంట్. (మొత్తం కలిపి ఐదేడు లక్షలు ఉంటుంది.) కి: కిత్తే? (ఎంత?) తం: పాంచ్ లాఖ్ సాత్ లాఖ్ నికల్ జాతే. దస్ బీస్ తులే సోనా నికల్ జాతా. (ఐదేడు లక్షల నగదు, పది, 20 తులాల బంగారం) కి: ఝూటే మత్ కరో (అబద్ధాలు ఆడద్దు) తం: హా భయ్యా (ఏంటి భయ్యా?) కి: ఝూటే మత్ కరో (అబద్ధాలు ఆడద్దు) తం: మై ఝూటే మత్ కర్తుమ్నా భయ్యా ఝూట్ క్యూం కరూంగా మే? (నేను మీ దగ్గర అబద్ధాలు ఆడను కద భయ్యా? ఎలా ఆడగలను?) కి: సునో.... ఆప్ కుచ్ భీ కరో... పాంచ్ కరోడ్ లాస్ట్ అండ్ ఫైనల్... ఆప్ కో హోనా హైతో ఆప్కే బచ్చేసే పూఛో... కౌసే దేఖ్ రహాహూ.. ఆనేకే బాద్ పూంఛో.... (వినండి.. మీరే ఏమైనా చేయండి. ఐదు కోట్లు ఫైనల్. కావాలంటే మీ అబ్బాయి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఎలా చూసుకున్నానో అడగండి.) తం: మై నాంపల్లి తక్ ఆయాహు (నేను నాంపల్లి వరకు వచ్చాను) కి: సునో... సునో పాంచ్ కరోడ్ లాస్ట్ అండ్ ఫైనల్ (వినండి. ఐదు కోట్లే ఆఖరి మాట) తం:భయ్యా మై ఆప్కో హాత్ జోడ్తాహు... ఇత్తే పైసే కైసే ఆతే ఆపీ బతానే మేరేకో... (భయ్యా మీకు చేతులెత్తి దండం పెడతా.. అంత డబ్బు ఎలా వస్తుందో మీరే చెప్పండి) కి: బోల్దేతుం సున్లేలో... ఆప్కా బచ్చా కల్ సుబే ఛే బజే ఆజాతే. (చెప్తున్నాను వినండి... మీ అబ్బాయి రేపు (గురువారం) ఉదయం 6 గంటలకల్లా వచ్చేస్తాడు) తం: హా సాబ్ (చెప్పండి సార్) కి: కల్ సుబే ఛే బజే ఆజాతే.. ఆనేకా బాద్ పూచో కైసే దేఖ్హ్రాహూ (రేపు ఉదయం ఆరు కల్లా వచ్చేస్తాడు. వచ్చాక అడగండి ఎలా చూసుకున్నానో) తం: మై కైసే ఆనా ఆప్కే పాస్? (మీ దగ్గరకు నేను ఎలా రావాలి?) కి: సికింద్రాబాద్ ఆజావో (సికింద్రాబాద్‌కు వచ్చెయ్) తం: ఆప్ అబిడ్స్ తన్ నై ఆసక్తే.. అబిడ్స్ తక్... (మీరు ఆబిడ్స్ వరకు రాలేరా?) కి: నై ఆసక్తే... సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆనా. (రాలేను... మీరే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు రావాలి) తం: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆనా? (సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు రావాలా?) - ఆడియో ఇక్కడితో ఆగిపోయింది. -
వీఐపీలే లక్ష్యంగా..
♦ ప్రభుత్వ విప్‌కు ఫోన్ చేసి ♦ డబ్బులడిగిన అగంతకుడి అరెస్ట్ యాదగిరిగుట్ట: వీఐపీలనే లక్ష్యంగా చేసుకుని.. ఫోన్లు చేసి, బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న నిందితుడిని నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ బహదూర్‌పురలోని సుల్తాన్ షాహి, లాల్ దర్వాజకు చెందిన మొండ్రాయి కృష్ణమాదిగ మందకృష్ణ మాదిగ పేరు చెప్పుకొని సంఘ కార్యక్రమాలకు ఫండ్ కోసం అని వీఐపీలకు ఫోన్ చేసి సులువుగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశాడు. ఇలా 2010లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావుకు ఫోన్‌చేసి పార్టీ ఫండ్ కింద 2 లక్షలు కావాలని డిమాండ్ చేశాడు. ఎమ్మెల్యే శంకర్రావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్టయి నాలుగు నెలలు చంచల్‌గూడ జైలులో శిక్ష అనుభవించాడు. మళ్లీ జైలు నుంచి బయటకు వచ్చి పలువురు వీఐపీలకు ఫోన్లు చేసి బెదిరించగా, వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇతడిపై రౌడీషీట్‌కూడా తెరిచారు. ఇదే క్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీతకు కూడా ఫోన్ డబ్బులు కావాలని బెదిరించాడు. ఆమె పోలీసులను ఆశ్రయించడంతో వలపన్ని శనివారం అతడిని అరెస్టు చేశారు. -
ఫోన్లోనే కథ విని ఓకే చెప్పిన నిర్మాత
ఇవాళ కథ చెప్పి నిర్మాతను ఒప్పించడం దర్శకుడికి అంత సులభం కాదు. అలాంటిది తన కథను ఫోన్లో చెప్పి నిర్మాతను సంతృప్తిని కలిగించి చిత్రాన్ని పూర్తి చేశారు దర్శకుడు కామ్రన్. ఈయన కథ,కథనం,మాటలు,దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన చిత్రం నవరసతిలగమ్. ఇంతకు ముందు బర్మా చిత్రాన్ని నిర్మించిన స్కోయర్ స్టోన్ ఫిలింస్ అధినేత సుదర్శన్ వెంబుట్టి కే.జయచందర్రావుతో కలిసి నిర్మిస్తున్న చిత్రం నవరసతిలగమ్. మాకాపా.ఆనంద్ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆయనకు జంటగా నటి సృష్టి డాంగే నటించారు. ఇతర ప్రధాన పాత్రల్లో కరుణాకరన్, జయప్రకాశ్, ఇళవరసు, పావా లక్ష్మణన్, మీరాక్రిష్ణన్, లక్ష్మి, మహదేవన్ నటించారు. ఇదర్కుదానే ఆశైపట్టాయ్ బాలకుమారా, వల్లవనుక్కుమ్ పుల్లుం ఆయుధమ్ చిత్రాల ఫేమ్ సంగీత దర్శకుడు సిద్ధార్థ్ విపిన్ ఈ చిత్రం ద్వారా నటుడిగా పరిచయం కావడం విశేషం. ఇందులో ఆయన ఒక ముఖ్య పాత్రను పోషించారు. చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ కథా చిత్రం అని చెప్పారు. హీరో తన తండ్రి సంపాదించిన డబ్బునంతా రియల్ ఎస్టేట్‌లో పోగొట్టుకోవడంతో పాటు తన స్నేహితుడు కరుణాకరన్ డబ్బును అదే వ్యాపారంలో పెడతారన్నారు. ఈ డబ్బుతో అయినా సక్సెస్ అయ్యాడా?లేదా? అన్నదే చిత్రం ఇతి వృత్తం అన్నారు. ఈ చిత్ర కథను విదేశాల్లో ఉన్న నిర్మాత సుదర్శన్ వెంబుట్టికి ఫోన్లోనే మూడు గంటల పాటు వినిపించినట్లు తెలిపారు.అలా ఫోన్లోనే కథ విని చిత్రం చేసిన తొలి నిర్మాత ఆయనే అవుతారని,అదే విధంగా ఫోన్లోనే కథ చెప్పి నిర్మాతకు సంతృప్తిని కలిగించి దర్శకత్వం వహించిన తొలి దర్శకుడిని తానే అవుతానని అన్నారు.నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ నవరసతిలగమ్ చిత్రాన్ని ఈ నెల 19న విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు. -
విస్మయపరుస్తున్న గడాఫీ చివరి క్షణాల వీడియో
సుమారు ఐదు సంవత్సరాల తర్వాత అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసే వీడియో వెలుగులోకి వచ్చింది. అతి పెద్ద నియంతగా పేరు తెచ్చుకున్న గడాఫి.. నెత్తురోడుతూ దిక్కులేని పరిస్థితిలో కనిపించాడు. ఆయన చివరిక్షణాలు ఎలా ముగిశాయన్న వివరాలను తాజా ఫుటేజీ చెప్తోంది. దెబ్బలతో రక్తంకారుతున్న శరీరం, తలకు పాయింట్ చేసిన గన్...అతి దీనమైన స్థితిలో ఉన్నగడాఫీ వీడియోను లిబియన్ రెబల్స్ మొబైల్ ఫోన్లో తీసినట్లు తెలుస్తోంది. లిబియా తిరుగుబాటుదారులు ఆ వీడియో కల్నల్ గడాఫీ హత్యకు కొద్ది క్షణాల ముందే చిత్రించారు. రెబల్ ఫైటర్ అయ్ మాన్ అల్మాని అక్టోబర్ 2011 లో తీసుకున్న వీడియో ఫుటేజ్ ను తాజాగా బయట పెట్టాడు. గడాఫీ చనిపోయేందుకు ముందు అతడిచుట్టూ సాయుధ తిరుగుబాటుదారులు నిలబడి ఉన్నట్లు వీడియోలోని దృశ్యాల ద్వారా తెలుస్తోంది. తలకు, ఒంటికి గాయాలై... రక్తస్రావంతో ఉన్న గడాఫీ తనను ప్రాణాలతో వదిలేయమని అభ్యర్థిస్తున్నట్లు కూడ వీడియో ఫుటేజ్ లో వినిపిస్తోంది. కొన్ని క్షణాల తర్వాత తిరుగుబాటుదారుడు గడాఫి తలపై అతడి గోల్డెన్ గన్ పెట్టి కాల్చి చంపినట్లు వీడియో వివరిస్తోంది. అయితే ఆ నియంతకు తగిన శిక్షే పడిందని తాజాగా వీడియో ఫుటేజ్ బయటపెట్టిన అల్మానీ చెప్తున్నాడు. గడాఫీ హత్యకు వాడిన హ్యాండ్ గన్ తనవద్దే ఉందని, ఆ ఆయుధం లిబియన్ విప్లవానికి చిహ్నంగా మారిందని అంటున్నాడు. గడాఫీ హత్య తర్వాత విస్తృతంగా బయటికొచ్చిన చిత్రాలు హత్యకు అల్మానీయే కారణమని చెప్తున్నా... నిజానికి తాను గన్ పేల్చలేదని, తర్వాత నేలపై పడి ఉన్న ఆ బంగారు తుపాకీనీ తన చేతిలోకి తీసుకున్నానని చెప్తున్నాడు. అప్పట్నుంచీ గడాఫీ విధేయులు తనను చంపేస్తామని బెదిరిస్తూనే ఉన్నారని అంటున్నాడు. ఇపుడు తాను బయట పెట్టిన కొత్త ఫుటేజ్... గడాఫీ హత్యలో తనకన్నా ఇతరులదే అధిక పాత్ర ఉన్నట్లు రుజువు చేస్తుందని అల్మానీ భావిస్తున్నాడు. -
కడప సెంట్రల్ జైలులో సెల్‌ఫోన్ కలకలం
-
ఆన్లైన్ మోసానికి బలయ్యాడు
-
ఛేజ్ చేసి ..తాట తీసింది...
న్యూఢిల్లీ : టెన్నిస్ దిగ్గజం , వరల్డ్ నెంబర్ వన్ సెరెనా విలియమ్స్ ఓ దొంగ ఆట కట్టించిన తీరు ఆకట్టుకుంటోంది. తన ఫోన్ దొంగిలించి పారిపోవడానికి ప్రయత్నించిన ఆ ప్రబుద్ధుడిని ఛేజ్ చేసి మరీ పట్టుకుని తాట తీసింది. 21 టైటిల్స్ ను తన ఖాతాలో వేసుకున్న బ్లాక్ థండర్ సెరెనానే ఈ ఇంటరెస్టింగ్ స్టోరీని స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. సోదరి వీనస్ విలియమ్స్ , మరో టెన్నిస్ తార కరోలినా వాజ్నియాకితో కలిసి సెరెనా ఓ చైనీస్ రెస్టారెంట్ కు వెళ్లింది. అక్కడే ఆమెకు ఈ చేదు అనుభవం ఎదురైంది. కుర్చీలో ఉంచిన ఆమె మొబైల్ ను కొట్టేసిన ఆ చోర శిఖామణి అక్కడ నుంచి చల్లగా జారుకున్నాడు. అయితే ఈ విషయాన్ని గమనించిన సెరినా వెంటనే అప్రమత్తం అయింది. వాడు అంత కంటే వేగంగా కదిలాడు. అంతే ఇక ఊరుకుంటుందా.. టెన్నిస్ కోర్టులో తన అద్బుత షాట్లతో చెలరేగిపోయే సూపర్ స్టార్ మెరుపు వేగంతో కదిలింది. వాడిని ఛేజ్ చేసి పట్టుకుని రఫ్ఫాడించింది. దొంగిలించిన తన మొబైల్ ను వెనక్కి తీసుకుంది. ఈ చర్యతో ఈ అమెరికన్ టెన్నిస్ స్టార్ పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి. -
జేబులో పట్టే కొత్త రోబో ఫోన్...
టోక్యో... జపాన్‌కు చెందిన బహుళ జాతి సంస్థ 'షార్ప్' ఇప్పుడు మీ జేబులో చక్కగా ఇమిడిపోయే కొత్త రోబో ఫోన్‌ను అందుబాటులోకి తెస్తోంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా రోబోట్ ఫోన్‌ను ఈ సంస్థ పరిచయం చేస్తోంది. రోబోహోన్ పేరిట రానున్న ఈ స్మార్ట్ ఫోన్... అన్ని ఎండ్రాయిడ్, స్మార్ట్ ఫోన్లలాగే కాల్స్ మాట్లాడేందుకు, ఫోటోలు తీసేందుకు, మ్యాప్‌లు చూపించేందుకు ఉపయోగపడుతుంది. దీనితోపాటు.. డ్యాన్స్ చేయడం కూడా ఈ ఫోన్లో ప్రత్యేకత. చిన్నపాటి టచ్ స్క్రీన్ ఉండే ఈ బుజ్జి రోబో ఫోన్లో ఒక్కో స్క్రీన్ మీద కేవలం నాలుగు ఐకాన్లు మాత్రమే కనిపించే అవకాశం ఉంది. ప్రసిద్ధ టోక్యో ప్రొఫెసర్.. అండ్ రోబోటిసిస్ట్.. టొమోటకా తకహాషి అభివృద్ధి పరచిన ఈ కొత్త పరికరాన్ని వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. రోబోహోన్ ప్రయోగం ద్వారా ప్రాథమికంగా ఈ ఫోన్.. మాట్లాడే సౌకర్యం కలిగి ఉంటుంది. టచ్ స్క్రీన్ లో మరోభాగం ఇంటర్నెట్. ఫోన్ వెనుక భాగంలో రెండు అంగుళాల టచ్ స్క్రీన్ ఉంటుంది. ముఖం భాగంలో లోపల కెమెరా, ప్రొజెక్టర్ అమర్చారు. ఈ ఫోన్‌కు అదనంగా కనిపించే రోబోట్ చేతులు, కాళ్ళు అది నడిచేందుకు వీలుగా ఉంటాయి. అయితే ఈ ఫోన్ మీరు కోరితే డాన్స్ కూడా చేస్తుంది. ఫోన్లో టెక్స్ట్ సందేశాలతో పాటు... ప్రొజెక్టర్ ఆధారంగా ప్రాజెక్ట్ ఫొటోలు, వీడియోటెక్స్ కనిపించే అవకాశం ఉంది. ఓ బొమ్మను నిలబెట్టినట్లే ఈ ఫోన్‌ను ఎక్కడైనా నిలబెట్టి ఫోటోలు తీయొచ్చు. యూజర్ వాయిస్‌ను, ముఖాన్ని గుర్తించగలిగే సామర్థ్యం కూడ ఈ ఫోన్‌కు ఉన్నాయి. అయితే వచ్చే ఏడాది మార్కెట్లోకి రానున్న ఈ కొత్త ఫోన్ ధర వివరాలు మాత్రం కంపెనీ ఇంకా బయట పెట్టలేదు. -
కాల్ డ్రాప్స్‌పై ప్రధాని సీరియస్
తక్షణమే పరిష్కరించాలని ఆదేశం న్యూఢిల్లీ: ఫోన్ రింగొస్తుంది. ఎత్తేసరికి అవతలి గొంతు వినిపించదు. మళ్లీ చేయాల్సిందే..! మరికొన్ని సందర్భాల్లో మాట్లాడుతుండగానే ఫోన్ కట్ అవుతుంది. మళ్లీ చేయాల్సిందే...! టెలికామ్ వినియోగదారులు ఎదుర్కొంటున్న ఇలాంటి కాల్‌డ్రాప్ సమస్యలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. సామాన్యులపై ప్రభావం చూపే ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాల్ డ్రాప్ సమస్య డేటా కనెక్టివిటీకి కూడా విస్తరించే ప్రమాదం ఉందని, అలా జరగకుండా చూడాలని సూచించారు. డిజిటల్, గ్రామీణ మౌలిక సదుపాయాలు మొదలైన అంశాల పురోగతిని సమీక్షించిన మోదీ.. ఈ మేరకు ఆదేశాలిచ్చినట్లు మంగళవారం ప్రధాని కార్యాలయం తెలియజేసింది. ‘‘కాల్ డ్రాప్ సమస్య పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై అధికారుల్ని మోదీ ప్రశ్నించారు. మారుమూల ప్రాంతాలకూ మొబైల్ కనెక్టివిటీ విస్తరించేలా రైల్వే, ఇతర కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలను సమర్ధంగా ఉపయోగించుకోవాలని సూచించారు. 1,000 రోజుల్లోగా దేశంలోని అన్ని గ్రామాలకూ విద్యుత్ సౌకర్యం కల్పించే ప్రతిపాదనను పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. డిజిటల్ ఇండియా కార్యక్రమానికి అనుగుణంగా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు లక్ష్యాలుండాలని చెప్పారు’’ అని ఆ ప్రకనటనలో వివరించారు. ప్రభుత్వం తగినంత స్పెక్ట్రం ఇవ్వకపోవడం వల్ల కాల్ డ్రాప్స్‌ను అడ్డుకోలేకపోతున్నామని, సేవలు మెరుగుపర్చలేకపోతున్నామని టెల్కోలు ఆరోపిస్తున్నాయి. అయితే టెలికం కంపెనీలు తగినంత ఇన్వెస్ట్ చేయకపోవడం వల్లే ఈ సమస్య వస్తోందంటూ కేంద్రం చెబుతోంది. కాగా కాల్ డ్రాపింగ్ సమస్య పరిష్కరించేందుకు మొబైల్ ఆపరేటర్లు నెట్‌వర్క్‌ను మెరుగుపర్చుకోవాలని టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ సూచిం చారు. ఇందుకోసం టవర్ల ఏర్పాటు, రేడియేషన్ భయాల తొలగింపు తదితర అంశాలన్నింటికి సంబంధించి విధానాలపరంగా ప్రభుత్వం పూర్తి మద్దతిస్తుందని దక్షిణాసియా టెలికం రంగ నియంత్రణ మండలి కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పేర్కొన్నారు. -
దారుణమా?
రైతులకు భరోసా! - రుణాల ఇబ్బందులపై ఫోన్ చేయండి - సమస్యలను తీరుస్తామని బ్యాంకర్ల హామీ - సెప్టెంబర్ 20లోగా వంద శాతం రుణాల పంపిణీ - రైతులకు ఎళ్లవేళలా అందుబాటులో ఉండండి - వ్యవసాయ అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశం సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రైతన్నలూ మీరు పంట రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగి.. తిరిగి అలిసిపోయారా? మీ పాత రుణాలు రీ షెడ్యూల్ కావడం లేదా? రుణాలు అడిగితే స్థానిక బ్యాంక్ మేనేజర్ రేపు మాపంటూ విసిగిస్తున్నారా? పంట అదును దాటిపోతున్నా రుణం చేతికందడం లేదా? బ్యాంకు అధికారుల తీరు మీకు ఇబ్బందికరంగా ఉందా? అయితే మీ ఖాతా ఏ బ్యాంకులో ఉంటే ఆ బ్యాంకు అధికారులకు నేరుగా ఫోన్ చేయండి. ఫిర్యాదుల్ని వెంటనే పరిష్కరిస్తామని ఆయా బ్యాంకుల ఉన్నతాధికారులు భారీ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు హామీ ఇచ్చారు. రైతులు, ఎస్సీ, ఎస్టీ,బీసీ కార్పొరేషన్ లబ్ధిదారులు, మహిళా సంఘాలు ఎవరికైనా సరే రుణాలు ఇవ్వకుండా బ్యాంకర్లు ఇబ్బంది పెడితే తమకు ఒక్క ఫోన్ కొడితే స్పందిస్తామని, సెప్టెంబర్ 20 లోగా రైతు రుణాలను 100 శాతం పూర్తి చేస్తామని వారు మంత్రికి మాటిచ్చారు. గురువారం కలెక్టరేట్లో మంత్రి హరీశ్‌రావు జిల్లా ప్రజా ప్రతినిధులతో కలిసి బ్యాంకు, వ్యవసాయ శాఖ అధికారులతో పంట రుణాలు, రుణమాఫీ అమలుపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ ఏడాది రూ 1997.25 కోట్ల పంట రుణాలు అందించాల్సి ఉండగా.. బ్యాంకులు ఇప్పటి వరకు కేవలం రూ 241.57 కోట్లు మాత్రమే రైతులకు రుణాలు ఇచ్చాయి. రైతు రుణమాఫీ రెండవ ఫేజ్ కింద రాష్ట్రం విడుదల చేసిన రూ 485 కోట్లను బ్యాంకులు ఇప్పటి వరకు క్రెడిట్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తుండటం, మరో వైపు జిల్లాలో చెదురుమదురు వర్షాలు కురుస్తుండటంతో మంత్రి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. లీడ్ బ్యాంక్ అథమ స్థానం.. జిల్లాలో లీడ్ బ్యాంక్‌గా ఉన్న ఎస్బీఐ రైతుల పంట రుణాలు ఇవ్వడంతో అథమ స్థానంలో ఉంది. ఈ ఏడాది మొత్తం రూ. 580 కోట్ల టార్గెట్ ఇవ్వగా ఇప్పటి వరకు కేవలం రూ. 70 కోట్లు మాత్రమే రుణాలు అందించారు. అది కూడా అంకెల గారడీ చేసిన చూపిన లెక్కలే. దీనిపై హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. లీడ్ బ్యాంక్ అధికారుల తీరుపై మండిపడ్డారు. బ్యాంకు అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలనలు చేయకుండానే ఫీల్డు విజిట్ ఫీజు వసూలు చేస్తున్నారని, దీనితో పాటు ప్రాసెస్ ఫీజు కూడా వసూలు చేస్తున్నారని సిద్దిపేట వ్యవసాయ అధికారి అనిల్ కుమార్ ఫిర్యాదు చేశారు. అలాగే.. రైతులతో మొత్తం రుణాలు కట్టించుకొని వారి ఖాతాలు మూసివేసి, ఇక కొత్త రుణాలు ఇవ్వడం లేదని, రెండో ఫేజ్‌లో రైతుల ఖాతాలో పడిన డబ్బును కూడా తిరిగి ఇవ్వడం లేదని జహీరాబాద్ వ్యవసాయ అధికారి టీ ప్రవీణ, బ్యాంకుల్లో తగినంత సిబ్బంది లేక రుణాల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతోందని గజ్వేల్ ఏడీఏ శ్రావణ్ కుమార్ ఫిర్యాదు చేశారు.వ్యవసాయ శాఖ అధికారులు లేవనెత్తిన సమస్యలకు సమాధానాలు చెప్పలేక బ్యాంకర్లు నీళ్లు నమిలారు. సాఫ్ట్ వేర్లో సమస్యలు ఉత్పన్నం అయ్యాయని మరో బ్యాంకు అధికారి, అధికారిక నిర్ణయాలకు సంబంధించిన ఉత్తర్వులు బ్రాంచ్ మేనేజర్ వరకు అందక పోవడంతో ఇబ్బంది ఏర్పడినట్లు మరొక బ్యాంక్.. రోజుకు రూ. నాలుగు కోట్లు ఇచ్చినా రుణాలు తరగటం లేదని మరో బ్యాంకు.. ఇలా ఎవరికి వారుగా తలో సాకు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. సెప్టెంబర్ 20 లోపు రుణాలు అందిస్తామని ఒక డెడ్‌లైన్ పెట్టుకున్నారు. దీంతో స్పందించిన హరీశ్‌రావు.. సెప్టెంబర్ 21న మరోసారి సమీక్షా సమావేశం నిర్వహిస్తామని, అప్పుడు 100 శాతం రుణాలు పంపిణీ చేసి, ఆయా నివేదికలతో రావాలని అధికారులకు చెప్పారు. రైతులకు సహకరించని బ్యాంకులపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. రైతులకు అందుబాటులో ఉండాలి: మంత్రి హరీశ్‌రావు ‘జిల్లాలో మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. మరో వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. వ్యవసాయ అధికారులు రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలి’ అని మంత్రి అన్నారు. వారం రోజుల పాటు అధికారులు స్థానికంగా ఉండాలన్నారు. కరువులో గుండె నిబ్బరం కోల్పోతున్న రైతాంగానికి ధైర్యం చెప్పాలని, వారిలో ఆత్మ విశ్వాసం పెంచే విధంగా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు ఇబ్బడిముబ్బడిగా బోర్లు వేసుకుని అప్పుల పాలవుతున్నారని, దీని నివారించే విధంగా రైతులకు నచ్చజెప్పాలన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల ఇళ్లకు ప్రత్యేకంగా వెళ్లి ఈ ఏడాది వాళ్లు వేయాల్సిన పంటలు వివరాలు చెప్పి, ఎప్పటికప్పుడు వారి కుటుంబంలో ధైర్యం నూరిపోయాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సోలిపేట, బాబూమోహన్, చింతాప్రభాకర్,గూడెం మహిపాల్‌రెడ్డి, మదన్‌రెడ్డి, కిష్టారెడ్డి, ఎమ్మెల్సీలు సూధాకర్‌రెడ్డి, రాములు నాయక్, కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. ఎస్బీఐ ఏజీఎం 9949098409, ఆంధ్రా బ్యాంక్ డీజీఎం 9100105454 గ్రామీణ వికాస్ బ్యాంక్ ఏజీఎం 9440903949, లీడ్ బ్యాంక్ 9849530020 -
ప్లూటోను దాటి.. ఫోన్ చేసింది!
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన న్యూ హారిజాన్స్ వ్యోమనౌక మంగళవారం ప్లూటో మరుగుజ్జు గ్రహాన్ని అతిసమీపం నుంచి దాటివెళ్లిన అనంతరం 13 గంటలకు భూమికి ఫోన్ చేసింది! ముందుగా ప్రోగ్రామ్ చేసి ఉంచిన సందేశాలు, ఫోన్‌కాల్‌ను న్యూ హారిజాన్స్ ప్రసారం చేసిందని బుధవారం నాసా వెల్లడించింది. సౌరకుటుంబం చివరలో నెప్ట్యూన్ తర్వాతి కక్ష్యలో ఉన్న ప్లూటోను న్యూ హారిజాన్స్ మంగళవారం ఉదయం 12,500 కి.మీ. సమీపం నుంచే దాటి వెళ్లడం, మానవ నిర్మిత మైన ఒక వ్యోమనౌక ప్లూటో సమీపంలోకి వెళ్లడం ఇదే తొలిసారి కావడం తెలిసిందే. ఆటోమోడ్లో గంటకు 49 వేల కి.మీ. వేగంతో గ్రహశకలాలతో కూడిన కూపర్‌బెల్ట్ ప్రాంతంలో మరింత ముందుకు ఈ వ్యోమనౌక ప్రయాణిస్తోందని నాసా తెలిపింది. ప్లూటోను సమీపించిన సమయంలో యాంటెన్నాలను ఈ వ్యోమనౌక అటువైపుగా తిప్పుకొన్నందున భూమితో 21 గంటల పాటు సంబంధాలు తెగిపోయి ఉత్కంఠకు గురిచేసిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కూపర్‌బెల్ట్‌లోని వస్తువుల గురించి న్యూ హారిజాన్స్ పెద్దమొత్తంలో ఫొటోలు, సమాచారం సేకరిస్తోందని, ఆ సమాచారమంతా భూమికి పంపేందుకు 16 నెలలు పడుతుందని తెలిపారు. -
భత్కల్ను తప్పించేందుకు ఐఎస్ఐఎస్ కుట్ర
హైదరాబాద్ :రాష్ట్ర రాజధాని హైదరాబాద్ దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లతో పాటు దేశవ్యాప్తంగా సుమారు 40 బాంబు పేలుళ్ల కేసులో నిందితుడైన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది యాసిన్ భత్కల్ను జైలు నుంచి తప్పించేందుకు ఐఎస్ఐఎస్ పథకం వేసింది. అయితే ఈ విషయాన్ని కేంద్ర నిఘా వర్గాలు పసిగట్టాయి. ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న భత్కల్ తన భార్య జహిదాతో ఫోన్లో మాట్లాడినట్లు నిఘావర్గాలు గుర్తించాయి. తనను త్వరలో ఐఎస్ఐఎస్ జైలు నుంచి తప్పిస్తుందని అతడు..ఢిల్లీలో ఉంటున్న భార్యకు ఫోన్లో చెప్పినట్లు సమాచారం. డమాస్కస్‌లోని స్నేహితులు.. తనను త్వరలో జైలు నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారని, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత డమాస్కస్ వెళ్లిపోదామని భత్కల్ తన భార్యతో చెప్పినట్లు తెలుస్తోంది. భత్కల్ చెప్తున్న డమాస్కస్‌లోని స్నేహితులు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులుగా కేంద్ర నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అంతేకాక చర్లపల్లి జైలు నుంచి భత్కల్ తన భార్యకు 10 ఫోన్‌కాల్స్ చేశాడని... భార్యతోపాటు ఇంకొంతమందితోనూ అతడు ఫోన్లో మాట్లాడాడని ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. యాసిన్ భత్కల్ ఫోన్‌కాల్స్‌ను రికార్డ్ చేసిన కేంద్ర నిఘా వర్గాలు... అతని వెనకున్న ఉగ్రవాదులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చర్లపల్లి జైలు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు భత్కల్‌కు సెల్ ఫోన్ ఎలా అందుబాటులోకి వచ్చిందనే దానిపై కూడా ఆరా తీస్తున్నారు. -
బతక లేక.. చావులేఖ!
బాపట్ల : అప్పటివరకు బాపట్ల రైల్వేస్టేషన్‌లోని రెండో నంబర్ ప్లాట్‌ఫాంపై కనిపించింది ఆ మహిళ. ఇద్దరు కవలపి ల్లలకు వారికి నచ్చిన తినుబండారాలను కూడా కొనిపించింది. అమ్మమ్మ వాళ్ల ఊరికి వెళుతున్నాం. గొడవ చేయకూడదు అంటూ వారిని సముదాయించింది. అమ్మా.. నేను మాచవరం వస్తున్నా అంటూ తల్లికి ఫోన్ చేసి చెప్పింది. అంతలోనే.. అందరూ చూస్తుండగానే ఒంగోలు వైపు నుంచి విజయవాడకు వెళుతున్న గూడ్సు రైలు కిందకు దూకేసింది. కళ్ల ముందే జరిగిన ఈ ఘటనను చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. కొద్దిసేపటికి ఆ ప్రాంతం అంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనలో మండలంలోని చెరువుజమ్ములపాలేనికి చెందిన మెట్ల నాగవర్ధని(28), తులసీరామ్(5), తరుణశ్రీ(5) రైల్వే పట్టాలపై చెల్లాచెదురుగా మాంసపు ముద్దల్లా పడి ఉన్న దృశ్యం అందరినీ కలిచివేసింది. ఆమె తీసుకు వచ్చిన బ్యాగ్, రాసిన సూసైడ్ నోట్ ప్లాట్‌ఫాంపైనే ఉండగా వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తల్లి నాగమల్లేశ్వరి క థనం ప్రకారం.. మాచవరానికి చెందిన నాగవర్ధనికి ఏడేళ్ల కిందట చెరువుజమ్ములపాలేనికి చెందిన మెట్ల శ్రీనివాసరావుతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కవల పిల్లలు. భర్త శ్రీనివాసరావుతో కలిసి కర్ణాటక రాష్ట్రం రాయచూర్‌లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పిల్లలు నాయనమ్మ ఇంట్లో ఉండి స్థానిక పబ్లిక్ స్కూల్లో చదువుతున్నారు. ఇటీవలే నాగవర్ధని రాయచూర్ నుంచి బాపట్లకు వచ్చింది. ఆస్తి వివాదాలు కారణంగా తన కుమార్తె ఫోన్ చేసి అత్త, మామ, ఆడపడుచు, ఆడపడుచు భర్త వేధింపులకు గురిచేస్తున్నారని ఫోన్లో చెప్పినట్లు ఆమె తల్లి నాగమల్లేశ్వరి విలపిస్తూ తెలిపింది. అదే విషయాన్ని సూసైడ్ నోట్లో కూడా రాసిందని పేర్కొంది. -
ఫోన్లతో ఏపీ సీఎం చంద్రబాబు బిజీ బిజీ
-
కుమార్తెతో మాట్లాడించలేదని తండ్రి ఆత్మహత్య
రావులపాలెం (తూర్పు గోదావరి): తన కుమార్తెతో మాట్లాడించడం లేదని మనస్థాపం చెందిన తండ్రి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ఊబలంక గ్రామానికి చెందిన మడికి వెంకన్న(40) వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. అతడి భార్య జీవనోపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లింది. దీంతో కుమార్తెను వెంకన్న అత్తగారింట్లో ఉంచాడు. ఇటీవల కుమార్తెను చూడడానికి వెళ్లగా, అతడి అత్తింటివారు కుమార్తెతో మాట్లాడించలేదు. ఫోన్ చేసినా ఇవ్వకపోవడంతో మనస్థాపం చెందాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఇంటి వద్ద పురుగుమందు తాగాడు. స్థానికులు అతడిని గమనించి 108లో కొత్తపేట ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. ఎస్సై పీవీ త్రినాథ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
యువతులను ఫోన్లో వేధిస్తున్న ప్రబుద్ధుడు అరెస్ట్
బంజారాహిల్స్ (హైదరాబాద్) : ఫోన్లో యువతులను వేధిస్తున్న ఓ యువకుడిని బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విజయవాడకు చెందిన నందమాల గోపి అలియాస్ వంశీ(25) సూరారం కాలనీలో నివసిస్తూ జగద్గిరిగుట్టలోని వినాయక మెటల్స్‌లో పని చేస్తున్నారు. రెండు నెలల క్రితం వరకు బంజారాహిల్స్ రోడ్ నంబర్- 2లోని ఇందిరానగర్‌లో అద్దెకుండేవాడు. పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడి నుంచి సూరారం ప్రాంతానికి మకాం మార్చాడు. కాగా ఇతనికి ఇటీవల రోడ్డుపై ఒక సిమ్‌కార్డు దొరికింది. అది పని చేస్తుండటంతో రాత్రిపూట తన ఫోన్లో ఆ సిమ్ కార్డు వేసి ఇందిరానగర్‌కు చెందిన ఓ యువతికి అసభ్యకర సందేశాలతో పాటు ఫోన్లు కూడా చేస్తున్నాడు. నెల రోజుల నుంచి ఆ యువతికి ఫోన్ చేసి వేధిస్తూ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. అంతే కాకుండా చాలా మంది యువతుల నంబర్లు సేకరించి వారికి కూడా ఫోన్లు చేస్తున్నాడు. పలువురి కాపురాల్లో చిచ్చు కూడా పెట్టాడు. ఈ నేపథ్యంలోనే ఇందిరానగర్‌కు చెందిన ఇద్దరు యువతులు తమకు వస్తున్న అసభ్యకర ఫోన్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాల్‌డేటా సేకరించిన బంజారాహిల్స్ పోలీసులు నిందితుడు గోపి అలియాస్ వంశీని నిర్భయచట్టం కింద అరెస్టు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. -
ఫోన్ ప్రేమ వికటించింది!
- సహజీవనం చేసి,పరారైన ప్రేమికుడు - తమ ఇంటికి వద్దన్న బాధితురాలి కుటుంబసభ్యులు - ఐసీడీఎస్ చొరవతో పోలీసులకు ఫిర్యాదు పెద్దపంజాణి: ఫోన్ ప్రేమ వికటించింది. దీంతో బాధితురాలు ఐసీడీఎస్ పోలీసులను ఆశ్రయించింది. ఫోన్లో సంభాషణలతోనే రెండు మనసులు ఒక్కటయ్యాయి. ఇద్దరూ కలుసుకోవాలని నిర్ణయించుకుని పలమనేరుకు చేరుకున్నారు. రహస్యంగా ఓ ఇంటిని అద్దెకు తీసుకుని, సహజీవనం చేశారు. అతడికి ఆ అమ్మాయిపై మోజు తీరిపోగానే పారిపోయాడు. దీంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకెళితే... పెద్దపంజాణి మండలంలోని పోలేపల్లె గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి ఆరో తరగతి వరకూ చదువుకుంది. ఆరు నెలల క్రితం ఆమె ఫోన్‌కు ఒక మిస్ కాల్ వచ్చింది. ఆ నంబర్‌కు ఆమె తిరిగి ఫోన్ చేసింది. అరగొండకు సమీపంలోని గొల్లపల్లె గ్రామానికి చెందిన ప్రేమ్‌కుమార్‌తో పరిచయమైంది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. 25 రోజుల క్రితం ఒకరినొకరు కలుసుకుని పెళ్లి చేసుకోవాలని ఇళ్ల నుంచి రహస్యంగా పారిపోయి వచ్చి, పలమనేరు లో కలుసుకున్నారు. అక్కడే ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. 20 రోజుల పాటు ఇద్దరూ పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేశారు. ఐదు రోజుల క్రితం ప్రేమ్‌కుమార్ విజయవాడలో ఉద్యోగం కోసం వెళుతున్నానని, ఈనెల 15వ తేదీన తిరిగి వచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పి, జారుకున్నాడు. అద్దె డబ్బులు ఇవ్వలేదని ఇంటి యజమాని ఇల్లును ఖాళీ చేయమన్నాడు. దీంతో ఆ యువతి ప్రేమ్‌కుమార్‌కు ఫోన్ చేయగా నీవు పుట్టింటికి వెళ్లాలని, తాను విజయవాడ నుంచి రాగానే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అతని మాటల్లో నిజం లేదని గుర్తించిన ఆ యువతి బుధవారం రాత్రి పలమనేరు పోలీసులను ఆశ్రయించిం ది. అయితే పెద్దపంజాణి మండలానికి సంబంధించిన కేసు అయినందున అక్కడే ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించగా పెద్దపంజాణికి చేరుకుంది. ఈ విషయాన్ని పెద్దపంజాణి పోలీసులు ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. బాధితురాలి కుటుంబ సభ్యులను సంప్రదించగా తమను కాదని వెళ్లిన అమ్మాయి తమకు అక్కర్లేదని, తమ ఇంటికి రానివ్వమ్మని తెగేసి చెప్పేశారు. దీంతో చేసేది లేక ఐసీడీఎస్ అధికారులు మదనపల్లెలోని చైల్డ్ హోంలో ఉంచి, గురువారం ఉదయం అమ్మాయి ని పోలేపల్లెకు తీసుకెళ్లారు. ఆ యువతి కుటుంబ సభ్యులను పలకరించగా ముందు రోజు చెప్పిన మాటే మళ్లీ చె ప్పారు. చేసేది లేక పెద్దపంజాణి పోలీస్ స్టేషన్లో నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి, బాధితురాలికి న్యాయం చేయాలని కోరారు. పోలీసులు రెండు రోజులు గడువు కోరడంతో బాధితురాలిని తిరిగి మదనపల్లెలోని చైల్డ్ హోంకు తరలించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్, ఏసీడీపీవో ఎల్లమ్మ, సూపర్వైజర్ సులోచన పాల్గొన్నారు. -
ఫోన్‌కాల్‌తో ఘరానా మోసం
కోస్గి : ‘బ్యాంక్ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాం.. మీ ఏటీఎం లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించాలి.. మోసగాళ్లు ఉన్నారు జాగ్రత్త!’ అంటూ ఓ వైపు హెచ్చరిస్తూనే సదరు వ్యక్తుల ఖాతాల నుంచి డబ్బులను క్షణాల్లో మాయంచేసిన సంఘటన సోమవారం పట్టణంలో చోటుచేసుకుంది. బాధితుడి కథనం మేరకు.. పట్టణానికి చెందిన బాల్‌రాజ్ వృత్తి రీత్యా డీసీఎం డ్రైవర్. స్థానిక ఎస్బీహెచ్, ఎస్బీఐలో ఖాతాలు కలి గిఉన్నాడు. ఇదిలాఉండగా, ఈ నెల 7న (07739069614 నెంబరుతో) ఫోన్‌చేసి బ్యాంక్ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామని, తమ ఖాతాదారులను కొందరు మోసగాళ్లు మోసం చేస్తుండటంతో బ్యాంక్ వారు ఏటీఎం కార్డులకు కొత్త నెంబర్లను జారీ చేస్తున్నారని నమ్మిం చారు. ఎలాంటి అనుమానం రాకుం డా బాల్‌రాజ్ దగ్గర ఉన్న రెండు ఏటీఎం కార్డులకు ముందుగానే రెండు పిన్ నెంబర్లను తెలియజేశాడు. అనంతరం పాత పిన్ నెంబర్‌ను బ్లాక్ చేయాలని, మోసగాళ్లు నిజమైన నెంబర్లను రాబట్టి బాధితుడిని ఫోన్లైన్లో ఉండమని క్షణాల్లో ఎస్బీహెచ్ ఖాతా నుంచి రూ.14 వేలు, ఎస్బీఐ ఖాతా నుంచి రూ.మూడు వేలు డ్రా చేశారు. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న బాధితుడు బ్యాంకుకు వెళ్లి ఆరాతీశా డు. సదరు నెంబర్ బీహార్ ప్రాంతానికి చెందినదిగా ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ సంఘటనపై బాధితుడు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై స్థానిక ఎస్బీహెచ్ మేనేజర్ నాగేశ్వర్రావు మాట్లాడు తూ.. కొన్ని రోజులుగా ఢిల్లీ, బీహార్, జార్ఖండ్ ప్రాంతాల నుంచి ఖాతాదారులకు ఫోన్‌చేసి డబ్బులు డ్రా చేసేం దుకు ప్రయత్నిస్తున్న సంఘటనలపై ఫిర్యాదులు వస్తున్నాయని ఈ విషయంలో ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. -
ఎయిర్టెల్ నెట్‌వర్క్‌కు అంతరాయం
-
ఎయిర్టెల్ నెట్‌వర్క్‌కు అంతరాయం
హైదరాబాద్ : ఎయిర్టెల్ నెట్‌వర్క్‌కు శనివారం ఉదయం అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఉదయం ఆరు గంటల నుంచి ఎయిర్టెల్ నెట్ వర్క్ పనిచేయటం లేదు. దాంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. దాంతో ఎయిర్టెల్ కస్టమర్ కేర్ కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఫిర్యాదు చేసినా స్పందించటం లేదని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా నెట్వర్క్ పునరుద్దరణకు మరో గంట సమయం పడుతుందని సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అమ్మ నాన్న... ఓ ప్రేమ...
13-19 కేరెంటింగ్ అవగాహన అవసరం.. అందరూ ఆ దశను దాటి వచ్చినవారే! అందరూ ఆ దశను అర్థం చేసుకోవడం పట్ల నిర్లక్ష్యం చేసేవారే! ఎందుకలా?! జీవితంలో అత్యంత ప్రాధాన్యం గల కౌమార దశను అర్థం చేసుకునేదెలా? సరైన మార్గం చూపేదెలా?! ఆ మార్గం చూపే ప్రయత్నమే ఈ 13-19... సమస్య: 1 కాలేజీ నుంచి ఇంటికి చేరాల్సిన గీతిక అర్థరాత్రి అవుతున్నా ఎలాంటి సమాచారమూ లేదు. ఫోన్ స్విచ్చాఫ్, స్నేహితులను సంప్రదిస్తే ‘తెలియదు’ అనే సమాధానం. కూతురు ఏమైందో అన్న ఆందోళనతో పోలీసు కంప్లైంట్ ఇచ్చారు గీతిక తల్లిదండ్రులు. వారం రోజుల తర్వాత కూతురి ఆచూకి తెలిసింది. అప్పటికే నచ్చినవాడిని పెళ్లి చేసుకుందని తెలిసి ఆశ్చర్యపోయారు. ‘చదువుతున్నది ఇంటర్మీడియెట్ సెకండియర్. అప్పుడే పెళ్లేంటి?’ ఇంటికి వచ్చేయమని బతిమిలాడారు. తను చేసుకున్నవాడు సరైన వాడు కాదని నచ్చజెప్పారు. గీతిక వినలేదు. ఏడాది తిరక్కుండానే తల్లిదండ్రులను వెతుక్కుంటూ వచ్చింది. భర్త ఏ పనీ చేయడని, రోజూ నరకం చూపిస్తున్నాడని, తను గర్భవతిని అని. భర ్త మీద కేసు పెట్టింది. తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. సమస్య : 2 పందొమ్మిదేళ్ల రమ్య ఇంజనీరింగ్ ఫస్టియర్. ఇంటికి ఆలశ్యంగా రావడం, స్నేహితులతో కంబైన్డ్ స్టడీ అని అబద్దాలు చెప్పడం, ఆమె నడవడికలో వచ్చిన మార్పులు చూసి తల్లిదండ్రి నిలదీశారు. తనంటే ప్రాణమంటున్న వ్యక్తిని వారం క్రితం పెళ్లి చేసుకున్నానని, మతమార్పిడి కూడా చేసుకున్నానని చెప్పేసరికి ఇంట్లో అంతా షాక్ అయ్యారు. సమస్య : 3 వసంత జూనియర్ ఇంటర్ చదువుతోంది. తండ్రి చనిపోతే తల్లే అన్నీ అయ్యి కూతురుని సాకుతోంది. ఓ రోజు తల్లికి తనో వ్యక్తిని ప్రేమిస్తున్నానని చెప్పింది. కూతురు ఇచ్చిన అడ్రస్ని తీసుకొని అబ్బాయి ఇంటికి వెళ్లిన తల్లి అక్కడ పరిస్థితి చూసి ఆశ్చర్యపోయింది. తన కూతురు ప్రేమిస్తున్న వ్యక్తి ఓ జులాయి. చదువు, సంస్కారం, ఆస్తి.. ఏమీ లేవు. కూతురుకు అవన్నీ కళ్లకు కట్టి చూపించింది. అయినా వసంత వినలేదు. ‘నేను చదువుతున్నాను కదా! సంపాదిస్తాను. అతడిని మార్చుకుంటాను’ అని పంతం పట్టింది. వద్దని పట్టుబడితే కూతురు ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. అలాగని చూస్తూ చూస్తూ కూతురిని స్లమ్ ఏరియాలో ఎలా ఉంచుతుంది. ఏమీ అర్థం కాలేదు ఆ తల్లికి... టీనేజ్ దాటకుండానే ‘ప్రేమ’ పేరుతో అమ్మాయిలు గడప దాటుతున్నారు. తల్లిదండ్రులకు చెప్పకుండా పెళ్లి చేసుకున్న అమ్మాయిల జాబితాను ఒక్కసారి గమనిస్తే, కాసేపు వారితో మాట్లాడితే లోపం ఎక్కడ ఉందో తెలిసిపోతుంది. పిల్లల్లో ఇంటి పట్ల విముఖత ఇలా... ఇంట్లో తీవ్రమైన క్రమశిక్షణ. కౌమారంలో ఉన్న పిల్లలు చేసే ప్రతి చిన్న పనిని తప్పు పట్టడం, వ్యతిరేకతను చూపించడం.అమాయకత్వం. త్వరగా ఎదుటివారిని నమ్మడం. బయటి వారు చూపే ‘అభిమానం’ నిజమైందని అనుకోవడం. అమ్మాయిలను ట్రాప్ చేయాలని అనుకునేవారు ముందుగా వారి అందాన్ని పొగుడుతారు. అమ్మాయిలు ఏం కోరినా ఎంత కష్టమైనా వెంటనే వాటిని అమర్చుతారు. కావల్సినంత సమయం కేటాయిస్తారు. పట్టించుకోకపోతే చేతులపై బ్లేడ్లతో కోసుకోవడం, వాతలుపెట్టుకోవడం, పచ్చబొట్లు పొడిపించుకోవడం.. వంటివి చేస్తుంటారు. ‘నేను కాదంటే ఏమైపోతాడో’ అనే భావనను అబ్బాయిలు(కొంతమంది) అమ్మాయిల్లో కల్పిస్తారు. దీంతోఅమ్మాయిలు తమది ‘అజరామరమైన ప్రేమ’ అనే భావనకు లోనవుతారు. విమర్శ సరైనది కాదు... సినిమాల్లోనూ, టీవీల్లోనూ చూపించే కథనాలలో ‘ప్రేమ’ ప్రధాన కథాంశంగా ఉంటుంది. కానీ, ఇంట్లో తల్లిదండ్రులు, బయట సమాజం మొత్తం ‘ప్రేమ’కు వ్యతిరేకత చూపుతుంది. ఏదైతే వద్దంటారో అదే చేసి చూపాలనుకునే నైజం టీనేజ్ దశలో అమితంగా ఉండటం వల్ల, ప్రేమకు త్వరగా ఆకర్షితులవడం ప్రధానంగా ఉంటుంది. అంతా అయిపోయాక పిల్లలను తప్పుపట్టడం, దండించడం కాదు. టీనేజ్ దశలోనే ఇలాంటి సమస్యలు వస్తాయి కాబట్టి, ప్రేమ-ఆకర్షణల మీద విస్తృతంగా పిల్లలతో చర్చించాలి. {పేమలో ఉన్నప్పుడు కలిగే ఉద్విగ్నత పెళ్లి తర్వాత ఉండదని, భాగస్వామిలో చూడాల్సిన లక్షణాలు వేరేగా ఉంటాయని వివరించాలి. కానీ నూటికి 99 శాతం అలా జరగడం లేదు. పిల్లలు చేసిన పొరపాటుకు తల్లిదండ్రులు విమర్శనే ప్రధానాంశంగా తీసుకుంటున్నారు. ‘ఫలానవారి అమ్మాయి ఎవరితోనో వెళ్లిపోయిందట’ అనగానే ఇంట్లో తీవ్రంగా స్పందిస్తుంటారు. ‘మా అమ్మాయే అలాంటి పనిచేస్తేనా.. చంపేద్దుం. వారికి కల్చర్ తెలియదు. క్యారెక్టర్ లేదు. ఎంత విలువ తక్కువ పని...’ అంటూ పిల్లల ముందే అంటుంటారు. దీంతో తమ ప్రేమ గురించి ఇంట్లో చెప్పాలనుకున్నా నోరు నొక్కేసుకుంటారు. ‘అమ్మనాన్నలు ఎలాగూ ఒప్పుకోరు’ అని ముందే నిర్ధారణకు వచ్చిన అమ్మాయిలు ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోతుంటారు. ‘ప్రేమిస్తున్నాను’ అని అమ్మాయి ఇంట్లో చెబితే అవతలి వ్యక్తి గురించి పూర్తి అవగాహనకు రాకముందే ‘చెడు’గా చెప్పడం మొదలుపెడతారు. డబ్బు, చదువు, వ్యక్తిత్వం.. ఇవేవీ అబ్బాయిలో లేవని ఏకరువు పెడతారు. దీంతో తమ అమర ప్రేమకు ఇవన్నీ ముడిపెడుతున్నారన్న భావన అమ్మాయిల్లో కలుగుతుంది. తమ ప్రేమను విజయవంతం చేసుకోవడం వైపే మొగ్గుచూపుతారు. - నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి . టీనేజ్ దశలో ‘ప్రేమ’ పట్ల ఆకర్షితులవడం సహజంగా జరుగుతుంది. ‘కోరిక’ కలిగింది కాబట్టి ఎలాగైనా కలిసి బతకాలి అనే అభిప్రాయం నుంచి ఈ దశలోనే ‘జీవితభాగస్వామి అంటే ఎలా ఉండాలి? ఎలాంటి లక్షణాలు చూసి ఎంపిక చేసుకోవాలి..’ అనే విషయాల పట్ల తల్లిదండ్రులే కాదు టీచర్లూ, సామాజిక మాధ్యమాలు అవగాహన కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పదేళ్లుగా టీనేజ్ టెంప్టేషన్స్ పై పిల్లలకూ, తల్లిదండ్రులకూ కౌన్సెలింగ్ ఇస్తూ వస్తున్నాను. ఇప్పటి వరకు దాదాపు 3 వేల మందితో మాట్లాడి ఉంటాను. అందులో కనీసం 4-5 వందల మంది టీనేజ్ అమ్మాయిలు తల్లిదండ్రులకు చెప్పకుండా ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోవడం, ఆ తర్వాత భంగపడి ఇల్లు చేరడం చూశాను. అమ్మాయిలు, వారి తల్లిదండ్రుల బాధ కళ్లారా చూశాను. 23 జిల్లాల్లో 300 వరకు టీనేజ్ ప్రేమల మీద కాలేజీలలో కార్యక్రమాలు ఏర్పాటు చేశాను. అక్కడ అబ్బాయిలు-అమ్మాయిలు ‘ప్రేమ-ఆకర్షణ’లకు సంబంధించిన ఎన్నో సందేహాలు అడగడం చూశాను. అంటే, ఈ వయసు వారికి తగినంత అవగాహన కల్పించడంలో అన్ని వ్యవస్థలు వైఫల్యం బాటన పయనిస్తున్నాయి. చదువు తప్ప మరో ప్రపంచం లేనట్టుగా ఉన్న నేటి సమాజంలో రేపటి యువతను కాపాడుకునే బాధ్యత మనందిరి మీదా ఉంది. - డా. వీరేందర్, సైకాలజిస్ట్ -
బాత్రూమ్లో దాక్కొని పోలీసులకు ఫోన్ చేసింది..
* కట్నం కోసం చిత్ర హింస *హత్య చేసేందుకు యత్నం *బాత్రూమ్లో దాక్కొని పోలీసులకు ఫోన్ చేసిన నవవధువు *రక్షించిన పోలీసులు హైదరాబాద్ : ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ నవ వధువును సికింద్రాబాద్ గోపాలపురం పోలీసులు రక్షించారు. భర్త, అత్తల చిత్రహింసలు భరించలేని ఆమె బాత్రూమ్లోకి వెళ్లి గడియ వేసుకుని 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే అప్రమత్తమై పోలీసులు బాధిత యువతిని రక్షించారు. ఈ సంఘటన నిన్న తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... కరీంనగర్ కు చెందిన హనుమాన్, మధురవాణి దంపతుల కుమార్తె అరుణ (22)ను రెజిమెంటల్‌బజార్‌కు చెందిన జి.చంద్రశేఖర్ (26) అనే ప్రైవేట్ ఫొటోగ్రాఫర్‌తో ఆగస్టు 15న పెళ్లి జరిగింది. చంద్రశేఖర్ తండ్రి కొద్దికాలం క్రితమే మృతి చెందగా.. తల్లి లక్ష్మితో తాతాచారి కాలనీలో ఉంటున్నాడు. వివాహ సమయంలో లక్ష రూపాయలతో పాటు కొంత బంగారాన్ని కట్నంగా అరుణ తల్లిదండ్రులు ఇచ్చారు. రెండు నెలలపాటు అరుణను బాగానే చూసుకున్న భర్త, అత్త ఆ తర్వాత తమ విశ్వరూపం చూపించారు. చంద్రశేఖర్ నిత్యం పీకలదాకా మద్యం తాగి ఇంటికి వచ్చేవాడు. ఆ సమయంలోనే అత్త లక్ష్మి కట్నం ప్రస్తావన తేవడంతో అదనపు కట్నం కావాలని వేధించేవాడు. తల్లిదండ్రులకు అదనపు కట్నం ఇచ్చే స్తోమత లేకపోవడంతో అరుణ అత్తింతివారి వేధింపులను భరిస్తూ వచ్చింది. ఇటీవల వేధింపులు తీవ్రమయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటికి వచ్చిన చంద్రశేఖర్ తల్లి సహాయంతో అరుణను చిత్రహింసలు పెట్టాడు. గొంతు నులిమే ప్రయత్నం చేయడంతో పాటు గదిలో నిర్భందించి కొట్టబోయాడు. దీంతో తనను చంపేస్తారని భావించిన అరుణ తన ప్రాణాలను కాపాడుకునేందుకు శనివారం తెల్లవారు జామున 3.30కి బాత్రూమ్లోకి పరుగెత్తింది. వెళ్తూ .. వెళ్తూ భర్త సెల్ ఫోన్‌ను వెంట తీసుకెళ్లి 100 నెంబర్‌కు డయల్ చేసి.. భర్త తనను బంధించి చిత్రహింసలు పెడుతున్న తీరును ఫిర్యాదు చేసింది. పోలీస్ కంట్రోల్‌రూమ్ సిబ్బంది గోపాలపురం పోలీసులను అప్రమత్తం చేశారు. గోపాలపురం పోలీసులు రెజిమెంటల్ బజార్‌లోని తాతాచారి కాంపౌండ్‌కు వెళ్లి బాత్రూమ్లో తలదాచుకున్న అరుణను రక్షించారు. అదే సమయంలో ఆమె భర్త చంద్రశేఖర్, అత్త లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి నుంచి ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేశారు. భర్త, అత్తను రిమాండ్‌కు తరలించారు. -
సాయికుమార్‌కు వైఎస్ జగన్ పరామర్శ
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రముఖ సినీ నటుడు సాయికుమార్‌ను పరామర్శించారు. సాయికుమార్ తండ్రి, సీనియర్ నటుడు పీజే శర్మ ఆదివారం మరణించిన సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ పీజే శర్మ మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. సోమవారం జగన్ సాయికుమార్‌కు ఫోన్ చేసి ఓదార్చారు. పీజే శర్మ మణికొండలోని ఆయన నివాసంలో ఆదివారం ఉదయం తీవ్రమైన గుండె పోటుతో కన్నుమూశారు. ఆదివారం సాయంత్రం ఎర్రగడ్డలోని శ్మశాన వాటికలో పీజే శర్మ అంత్యక్రియలు నిర్వహించారు. -
సదస్సు మధ్యలో చంద్రబాబుకు ప్రధాని ఫోన్!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు సిద్ధమైన ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన టీడీపీకి కేబినెట్లో చోటు కల్పించే అంశంపై మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడుకు గురువారం ఫోన్ చేశారు. ఆ సమయంలో చంద్రబాబు ఢిల్లీలో జరుగుతున్న ఇండియన్ ఎకనామిక్ సమ్మిట్‌లో మాట్లాడుతుండగానే ప్రధాని నుంచి ఫోన్ వచ్చింది. దీంతో చంద్రబాబు ఉన్నపళంగా పక్కకు వెళ్లి ఫోన్ మాట్లాడి వచ్చారు. దీనిపై సమ్మిట్‌లో ప్రతినిధులు చంద్రబాబును ప్రశ్నించగా ‘రెండు రోజుల్లో మీకూ తెలుస్తుంది కదా..’ అని ఆయన వ్యాఖ్యానించారు. మరోసారి ఇదే విషయాన్ని వారు ప్రస్తావించగా ‘‘ఆయన (మోదీ) నా నుంచి సమాచారం కోరేందుకు ప్రయత్నిస్తుంటే నేనేమో ఆ సమాచారాన్ని దాచేందుకు ప్రయత్నిస్తున్నా’’ అంటూ చంద్రబాబు చమత్కరించారు. -
స్మార్ట్ స్వాప్
అర్బన్ యూత్‌కి.. నేడు నచ్చింది రేపు నప్పదు. కొత్త లుక్, సరికొత్త ఆప్షన్స్‌తో రోజుకో రకం అప్డేటెడ్ గాడ్జెట్స్ మార్కెట్లోకి వచ్చిపడుతున్నాయి. న్యూ వెర్షన్స్ ఇలా రిలీజయ్యాయో లేవో.. అప్పటి వరకూ సేవలందించిన స్మార్ట్‌ఫోన్ పాత చింతకాయ పచ్చడిలా తోస్తుంది. ఇంకేముంది క్రెడిట్ కార్డు గీకేసి.. కొత్త ఫోన్‌ను సొంతం చేసుకోవడం సిటీ యువతకు కామన్. పాత ఫోన్‌ను రేటు రాకున్నా ఎవరికైనా అమ్మేసి నయా ఫోన్‌తో ఎంజాయ్ చేసేస్తుంటారు. కానీ, పాత ఫోన్‌ను ఎవరికి, ఎలా, ఎక్కడ అమ్మాలో తెలియదు. రూరల్ కుర్రాళ్లకు.. మార్కెట్లోకి వస్తున్న కొత్త కొత్త ఫోన్లు చూసి మురిసిపోవడం తప్ప.. కొనడం కష్టమైన పని. అలాగని సెకండ్ హ్యాండ్ మార్కెట్లో వేలకు వేలు పెట్టి ఫోన్ కొనే సాహసం చేయలేరు. అక్కడంతా మోసమనే టాక్ వెళ్లనివ్వదు. సిటీలోని నయాట్రెండ్‌ను.. గ్రామాల్లోని కొత్త ఆశలకు లింకప్ చేస్తూ.. ముగ్గురు కుర్రాళ్లు ఓ సొల్యూషన్ కనిపెట్టారు. దాని పేరు మోస్వాప్. కొత్త ఫోన్ వచ్చింది కదా అని పాతఫోన్‌ను ఎవరికో ఉచితంగా ఇవ్వలేం. ల్యాప్‌ట్యాప్, టాబ్లెట్ల పరిస్థితీ అంతే. కార్తీక్ ఆనంద్‌రెడ్డి దీని గురించి బాగా ఆలోచించారు. అతనికి ఇంజనీరింగ్ క్లాస్మేట్స్ అచ్యుత్‌రెడ్డి, యోగేశ్వర్ జత కలిశారు. దేశం మొత్తమ్మీద ఈ సమస్యకు లోకల్‌గా ఉన్న సెకెండ్‌హ్యాండ్ మార్కెట్లు తప్ప మరో పరిష్కారం లేదని గ్రహించి.. మోస్వాప్ కంపెనీని స్థాపించారు. కార్తీక్ సరోజినీదేవి హాస్పిటల్ సూపరింటెండెంట్ కె.నర్సారెడ్డి ఏకైక కుమారుడు. ఢిల్లీలో ఎన్ఈసీ కంపెనీలోఆరంకెల జీతాన్ని కాదని మోస్వాప్ స్థాపనకు సిద్ధపడ్డాడు. అచ్యుత్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఇన్ఫోసిస్‌లో జాబ్‌ను పక్కన పెట్టాడు. యోగేశ్వర్ కూడా అంతే. వీరి ప్రయోగం ఇంట్లో వారిని ఆందోళనలో పడేసినా లెక్కచేయకుండా సెకండ్హ్యాండ్కి ఫస్ట్‌క్లాస్ పరిష్కారం కనుక్కున్నారు. అంతా ఆన్లైనే... మోస్వాప్ కంపెనీ పేరుతో ఉన్న వెబ్‌సైటే వీరిని సెకెండ్ హ్యాండ్ ఎలక్ట్రానిక్ వస్తువుల్ని అమ్మేవారి దగ్గరకి చేరుస్తోంది. ‘మా వెబ్సైట్ ఠీఠీఠీ.ఝౌటఠ్చీఞ.జీలో లాగిన్ అయ్యాక అందులో ఐదు రకాల ఆప్షన్లు కనిపిస్తాయి. సెల్‌ఫోన్స్, టాబ్లెట్స్, ఐపోడ్స్, మ్యాక్, ల్యాప్టాప్స్.. ఇందులో మీది ఏ ఆప్షనో సెలక్ట్ చేసుకుంటే వెంటనే అందులో వెరైటీలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. మోడల్, వెర్షన్ వంటి వివరాలన్నీ సెలక్ట్ చేసుకుని సబ్మిట్ చేస్తే వెంటనే మేం మీకు ఫోన్ చేసి మీ ఇంటికొచ్చి మీరు అమ్మాలనుకుంటున్న వస్తువును తీసుకుంటాం. మాకు మీరు వస్తువును అప్పగించినట్టు ఒక డాక్యుమెంట్‌పై సంతకం చేసి ఇస్తాం. ఆ వస్తువు పనితీరును గమనించాక దానికి తగ్గ ఖరీదుని మీకు అందజేస్తాం. ఒకవేళ మేం ఆఫర్ చేసిన ప్రెస్ నచ్చకపోతే వెబ్సైట్ ప్రైస్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. దాని ద్వారా మీ ధర అంచనా కూడా చెప్పొచ్చు’ అంటూ తన కంపెనీ ప్రత్యేకతను వివరించారు కార్తీక్. నిజమే!..ఈ-సర్వీస్ సిటీ యూత్‌కు చాలా అవసరం. స్మార్ట్ మార్కెటింగ్ సిటీలో సేకరించిన స్మార్ట్ గాడ్జెట్స్‌ను మార్కెటింగ్ చేయడంలోనూ వీరు హండ్రెడ్ పర్సంట్ సక్సెస్ అయ్యారు. ‘మాది నల్గొండ జిల్లా మోత్కూరు. ఊరికెళ్లినపుడు అక్కడ నా స్నేహితులు నా చేతిలోని ఫోన్ చూసి ఖరీదెంత, ఫీచర్లేంటని ఆరాలు తీస్తున్నారు. వారికి కూడా లేటెస్ట్ స్మార్ట్ఫోన్లను వాడాలని ఉంటుంది. కానీ గ్రామాల్లో ఫోన్లకు పాతికవేలు పోస్తామంటే ఇంట్లోవాళ్లు కొట్టడం ఒక్కటే తక్కువ. పైగా అంత స్థోమత కూడా ఉండదు. అలాంటి చోట ఇలాంటి సెకండ్ హ్యాండ్ ఫోన్లకు భలే గిరాకీ ఉంటుందని తెలుసుకుని దాదాపు అన్ని తెలంగాణ జిల్లాల్లో ఏజెంట్లను పెట్టుకున్నాం. మెడికల్ షాపులు నడిపేవాళ్లను, స్టూడెంట్లను ఎంపిక చేసి వారికి కమీషన్ బేసిస్‌పై ఈ మార్కెటింగ్‌ని అప్పగించాం. దాంతో మా సేల్స్ చాలా ఈజీగా జరిగిపోతున్నాయి’ అంటూ తమ మార్కెటింగ్ సీక్రెట్ చెప్పారు అచ్యుత్‌రెడ్డి. మౌత్‌టాక్... ఈ ఏడాది జనవరిలో స్థాపించిన మోస్వాప్ కంపెనీ ఇప్పటి కి మూడు వేల ట్రాన్సాక్షన్లు చేసింది. వీటిలో తొంభైశాతం గ్రామాల్లోనే చేసింది. ఈ పది నెలల్లో వీరి కొనుగోళ్లు, అమ్మకాలన్నీ మౌత్‌టాక్ ద్వారానే నడిచాయి. అయితే ఈ కంపెనీకి ఫోన్లు అమ్ముతామంటూ ఢిల్లీ, చెన్నై వంటి సిటీలను నుంచి మెయిల్స్ వస్తున్నాయి. అక్కడ కూడా ఏజెంట్లను పెట్టుకునే ప్రయత్నంలో ఉంది మోస్వాప్. ‘ఇప్పటికే ముంబైలో మోస్వాప్ సేవలు అందుబాటులో ఉన్నాయి. న గరాల్లో ఉండే ప్రతి ఒక్కరికి మా కంపెనీ గురించి తెలియాలనేదే మా టార్గెట్. వారు వద్దనుకున్న వస్తువులను అమ్ముకోవడంలో ఎలాంటి ఇబ్బందులు పడకూడదు’ అని చెప్పారు కార్తీక్. భువనేశ్వరి, bhuvanakalidindi@gmail.com ఫొటోలు: సృజన్ పున్నా -
దత్తాత్రేయకు చత్తీస్‌గఢ్ సీఎం ఫోన్
హైదరాబాద్: బీజేపీ నాయకుడు, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయకు చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ఆదివారం ఫోన్ చేశారు. తెలంగాణలో నెలకొన్న విద్యుత్ సమస్యలపై రమణ్ సింగ్ ఆరా తీశారు. రమణ్ సింగ్ దత్తాత్రేయను చత్తీస్‌గఢ్ రావాల్సిందిగా ఆహ్వానించారు. చత్తీస్‌గఢ్, తెలంగాణల మధ్య రేపు జరగనున్న విద్యుత్ ఎంవోయూలో పాల్గొనాల్సిందిగా దత్తాత్రేయను కోరారు. దత్తాత్రేయ కాసేపట్లో చత్తీస్‌గఢ్‌కు బయల్దేరనున్నారు. -
సాక్షి పుణ్యమా అని...
శుక్రవారం... సెప్టెంబర్ 5... టీచర్స్‌డే... ఉదయం ఎనిమిదన్నరకు బ్రహ్మానందం నుంచి ఫోన్ కాల్. ‘‘ఈ రోజు ‘సాక్షి’లో వచ్చిన ‘గురు బ్రహ్మి’ ఆర్టికల్ ఎక్స్లెంట్... నాకు చెప్పకుండా నా శిష్యుల ఇంటర్వ్యూలు చేసి నన్ను భలే సర్ప్రైజ్ చేశారే’’ అని ఆనందం వెలిబుచ్చారు బ్రహ్మానందం. మళ్లీ వెంటనే ఆయన ‘‘ఉదయం నుంచి ఫోన్ల మీద ఫోన్లు. నా శిష్యులు చాలా మంది మాట్లాడారు. మీ ‘సాక్షి’ పుణ్యమా అని 35 ఏళ్లు వెనక్కు వెళ్లిపోయాను’’ అన్నారు. పత్రికల్లో వచ్చే తన ఇంటర్వ్యూలకు ఎప్పుడూ పెద్దగా స్పందించనట్టు కనపడే బ్రహ్మానందం ఈ ‘గురు బ్రహ్మి’ ఆర్టికల్ విషయంలో ఉద్వేగానికి గురయ్యారని అర్థమైంది. కట్ చేస్తే... ఆయన దగ్గర వాలిపోయాం. మళ్లీ ఆ ఆర్టికల్‌ను చూస్తూ ‘‘నేను పనిచేసిన డిగ్రీ కాలేజ్ ఫొటో, స్టాఫ్‌తో నేను దిగిన స్టిల్స్ చూస్తుంటే... నా మనసు ఆ రోజుల్లోకి వెళ్లిపోయింది’’ అన్నారు బ్రహ్మానందం. ఈలోగా ఆయన ఫోన్ మోగింది. మళ్లీ మరో అభినందన కాల్. మధ్య మధ్య అలా ఫోన్లు మాట్లాడుతూనే ‘సాక్షి’తో లెక్చరర్‌గా తన అనుభవాలను నెమరు వేసుకుంటూ... అనేక విషయాలు ముచ్చటించారు. కాలేజ్‌లో స్టూడెంట్స్‌ని మీరు బాగా డీల్ చేసేవారని మీ శిష్యులే చెప్పారు. ఆ టెక్నిక్ మీకు ఎలా అలవడింది? అది టెక్నిక్ అని నేననుకోవడం లేదు. మొదటి నుంచీ మనుషుల్ని బాగా డీల్ చేసే వరమేదో దేవుడు నాకిచ్చినట్టున్నాడు. అంతకుమించి నా వైపు ప్రిపరేషనేమీ లేదు. మామూలుగా హైస్కూలు స్టూడెంట్స్ అంటే చిన్నవాళ్లు కాబట్టి, దండించి అయినా దారిలోకి తీసుకురావచ్చు. ఇక్కడేమో డిగ్రీ స్టూడెంట్స్. టీనేజ్ దాటిపోయి ఉంటారు కాబట్టి, చెప్పిన మాట అస్సలు వినరు. కానీ మనదైన శైలిలో దారిలోకి తెచ్చుకోవాల్సిందే. మీ దగ్గర అలా తోక జాడించిన విద్యార్థులు ఎవరైనా ఉన్నారా? ఎందుకుండరండీ... ఉంటారు. ఇట్స్ నేచురల్. ఒకసారి నేను క్లాస్ చెబుతుంటే, ఓ తుంటరి ‘‘సార్... టైమైపోయింది’’ అని అరిచాడు. నేను వెంటనే ‘‘అప్పుడే నీకు టైమ్ అయిపోవడమేంటి? నీకు చాలా భవిష్యత్తు ఉందే’’ అన్నాను. దాంతో అమ్మాయిలంతా ఘొల్లుమని నవ్వారు. అతనికి అవమానమనిపించి ‘‘నాకు కాదు సార్... బెల్ కొట్టడానికి టైమైపోయింది’’ అన్నాడు. నేను వెంటనే దానికి కౌంటర్ ఇస్తూ, ‘‘బెల్ కొట్టడానికి ఓ మనిషి ఉన్నాడుగా... నీకెందుకు కంగారు’’ అన్నాను. అంతే! ఇక మళ్లీ అతను నోరెత్తితే ఒట్టు. ఇలా సీరియస్ వేలో కాకుండా, నవ్వుతూనే చురకలంటించేవాణ్ణన్నమాట. అందుకే నా దగ్గర వాళ్లు జాగ్రత్తగా ఉండేవారు. అదే పద్ధతి సినిమా ఇండస్ట్రీలో కూడా అనుసరిస్తున్నాట్టున్నారు? తప్పదు మరి. వెంకటేశ్వరస్వామి గుడికెళ్లి ‘ఓం నమఃశివాయ’ అంటే దేవుడికి కోపం వస్తుంది కదా! ఎక్కడ చదవాల్సిన మంత్రాలు అక్కడే చదవాలి. అయినా నేనెప్పుడూ నా హద్దుల్లో నేనుంటాను. మిగతావాళ్లను కూడా హద్దులు దాటనివ్వను. ఆ సూత్రం తెలిస్తే అందరికీ హాయి. సార్! మళ్లీ మీ లెక్చరర్ రోజుల్లోకి వెళ్దాం. మీరు లేడీస్ హాస్టల్ వార్డెన్‌గా కూడా చేశారట? అవును. మా డిగ్రీ కాలేజ్‌లోనే లేడీస్ హాస్టల్ ఉంది. వాళ్ల స్కాలర్‌షిప్‌ల వ్యవహారాలతో పాటు ఎలాంటి భోజనం పెట్టాలి లాంటి అంశాలన్నీ వార్డెన్ చూసుకోవాలి. ఈ బాధ్యతలను ఒక్కోసారి ఒక్కో లెక్చరర్ చూసుకోవాలి. అలా నేను కొన్నాళ్లు వార్డెన్‌గా చేశా. అలాగే ఎన్ఎస్ఎస్ ఆఫీసర్‌గా కూడా చేశా. అప్పట్లో మీ బెస్ట్ స్టూడెంట్ ఎవరు? అలా జడ్జ్ చేయడం కష్టం. బాగా చదివేవాడికి బిహేవియర్ కరెక్ట్‌గా ఉండకపోవచ్చు. బిహేవియర్ బాగున్నవాడు చదువులో రాణించకపోవచ్చు. మీరు మిమిక్రీ బాగా చేసేవారట కదా? అప్పట్లో ప్రముఖుల ముందు ఎప్పుడైనా చేశారా? పేర్లు గుర్తుకు రావడం లేదు. సాహితీవేత్త పురిపండా అప్పలస్వామి... ఇలా చాలామంది ఉన్నారు. జంధ్యాల గారు నా మిమిక్రీ టాలెంట్ చూసే కదా, నాకు సినిమా చాన్స్ ఇచ్చారు. రాత్రి ఎనిమిది గంటలకు మొదలుపెడితే, తెల్లవారుజామున నాలుగు గంటల వరకూ ఆయన ముందు మిమిక్రీ చేశా. మీ స్కూల్ వైస్ ప్రెసిడెంట్‌ను కూడా అనుకరించేవారట! అదంతా సరదా కోసమే. ఆ మాత్రం సరదా లేకపోతే ఊరు కాని ఊళ్లో మనల్ని ఎవరు పట్టించుకుంటారు చెప్పండి! మీ శిష్యులంతా మీకన్నా పెద్దవాళ్లలా కనిపిస్తున్నారు. మీరేమో ఇంకా...? అర్థమైంది మీ ప్రశ్న. ఇంత వయసు వచ్చినా నా ముఖంపై ముడతలు రాలేదేంటని ఈ మధ్యనే ఒకరడిగారు. దానికి నా సమాధానం ఒకటే. మనసులో మడతలు లేకపోతే, ముఖాన ముడతలు రావు. మంచి ఆలోచనలతో ఉన్నప్పుడు మన ముఖం ఎలా ఉంటుందో, చెడ్డ ఆలోచనలతో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఒక్కసారి చూసుకుంటే మనకే ఆ రహస్యం తెలిసిపోతుంది. ఓ మహానుభావుడు ఏం చెప్పాడంటే... "God is always ready with the camera. That's your responsibility to give him a good pose". మీరు రామాయణ, భారత, భాగవతాలు బాగా చదువుకున్నట్టున్నారు? చదువుకోవాలి కదండీ! వాటిపై నాకెంత పట్టు ఉందో, నాకు నేనుగా చెప్పుకోకూడదు. భాగవతం మీద కొన్ని గంటలు మాట్లాడగలను. అసలు మన దగ్గరున్న సాహితీ సంపద ఇంకెవరి దగ్గర ఉంది చెప్పండి! పోతన భాగవతంలోని ‘ఎవ్వనిచే జనియించు’ పద్యం ఒకసారి చదవండి. దీనిముందు ఓషో ఫిలాసఫీ లాంటివి ఎక్కడ నిలుస్తాయి! గురువుగా మీ ప్రత్యేక ముద్ర ఏంటి? నేను చాలా యాక్టివ్‌గా, జోవియల్‌గా ఉంటాను. నా చుట్టుపక్కల వాతావరణం డల్‌గా ఉంటే నాకస్సలు నచ్చదు. మనం యాక్టివ్‌గా ఉంటే, మన లైఫ్ కూడా యాక్టివ్గానే ఉంటుంది. ఇందిరాగాంధీ వాకింగ్ స్టయిల్ ఎప్పుడైనా చూశారా? అంత ఎనర్జీ ఉండాలి. సినిమా ఇండస్ట్రీలో కూడా మిమ్మల్ని గురువుగా భావించేవాళ్లు ఉన్నారు. వాళ్లను మీరెలా గైడ్ చేస్తుంటారు? ఇక్కడ గైడ్లు, క్లాస్‌లూ అంటూ ఏమీ ఉండవు. మనసు విప్పి మాట్లాడుకుంటే అన్నీ తెలుస్తుంటాయ్. అన్ని సమస్యలూ పరిష్కారం అవుతుంటాయ్. అప్పుడప్పుడూ సరదాగా పవన్‌కల్యాణ్, త్రివిక్రమ్ లాంటివాళ్లు నా దగ్గరకు వస్తుంటారు. నేనేమీ వాళ్లకు గురువును కాదే! ఇది సత్సంగం లాంటిది. ఒక అంశం మీద గంటలు గంటలు మాట్లాడుకున్న రోజులు చాలా ఉన్నాయి. ఒకసారి వాళ్లిద్దరూ ఉదయం 9 గంటలకు మా ఇంటికొచ్చి, సాయంత్రం 5 గంటల వరకు ఉన్నారు. ముగ్గురం అంతసేపూ మాట్లాడుకుంటూనే ఉన్నాం. రకరకాల టాపిక్స్ మా మధ్య నడిచాయి. అన్నట్లు ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా మళ్లీ పాఠం చెబుదామనిపించిందా? ఒకవేళ అనిపించినా, చెప్పలేని పరిస్థితి నాది. ఎందుకంటే బ్రహ్మానందం కామెడీ మానేసి పద్యాలూ పాఠాలూ చెబుతున్నాడని రకరకాలుగా అనుకుంటారు. ఎందుకంత బాధ! నన్ను ఇలా ఉండనివ్వండి బాబూ..! - పులగం చిన్నారాయణ సడన్‌గా శంకర్ ఫోన్... ఓ పక్క ‘సాక్షి’తో సంభాషిస్తూనే, మరోపక్క వరుసగా వస్తున్న ఫోన్లు మాట్లాడుతున్నారు బ్రహ్మానందం. దాదాపుగా అన్నీ ‘గురు బ్రహ్మి’ ఆర్టికల్ గురించే. ఒకతనైతే ఫుల్స్టాప్, కామాలు లేకుండా ఆయనను పొగుడుతూనే ఉన్నాడు. అప్పుడు చూడాలి బ్రహ్మానందం ఎక్స్ప్రెషన్స్. ఈ హడావిడిలో ఇంకో ఫోన్ వచ్చింది. ‘‘నేను సార్... డెరైక్టర్ శంకర్‌ని’’ అనగానే, బ్రహ్మానందానికి మొదట ఏమీ అర్థం కాలేదు. ‘ ‘ఎవరు?’’ అని మళ్లీ రెట్టించి అడిగారు. ‘‘డెరైక్టర్ శంకర్‌ని సార్... చెన్నై నుంచి మాట్లాడుతున్నా’’ అనగానే, బ్రహ్మానందానికి అర్థమైపోయింది. ‘‘శంకర్గారూ... ఎలా ఉన్నారు?’’ అని ఆప్యాయంగా అడిగారు బ్రహ్మానందం. ‘‘బావున్నాను సార్... మొన్న ‘ఆగడు’ ఆడియో ఫంక్షన్‌కి వచ్చినప్పుడు మిమ్మల్ని కలవలేకపోయాను. దూకుడు, రేసుగుర్రం సినిమాల్లో మీ కామెడీ అదిరిపోయింది. నా వైఫ్, పిల్లలకు తెలుగు తెలియదు కానీ, మీ కామెడీని బాగా ఎంజాయ్ చేస్తారు. మా ఫ్యామిలీ మొత్తం మీ ఫ్యాన్స్. ‘ఆగడు’లో కూడా చేశారుగా. అది కూడా చూస్తా. మీ గురించి నిర్మాత ఏఎమ్ రత్నంగారు అప్పట్లో చాలాసార్లు చెప్పారు. త్వరలో మీతో నా సినిమాలో ఫుల్ లెంగ్త్ కేరెక్టర్ చేయించుకుంటా’’ అన్నారు శంకర్. ఇలా ఇద్దరూ చాలాసేపు ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. -
వదంతుల కలకలం
జాగరణ చేసిన జనం భయంతో వీధుల్లోకి వచ్చిన ప్రజలు సాక్షి నెట్వర్క్ : జిల్లాలో వదంతులు కలకలం సృష్టించాయి. అప్పుడే పుట్టిన శిశువు మాట్లాడిందని... దీంతో అనర్ధం జరుగుతుందని... పిల్లలను పడుకోనివ్వవద్దని... లేకుంటే భూకంపం వస్తుందనే ప్రచారం దావనలంలా వ్యాపించింది. సెల్‌ఫోన్ సౌకర్యంతో ఒక మండలం నుంచి మరో మండలానికి, ఒక గ్రామం నుంచి మరో గ్రామం, తండాలకు.. ఇలా జిల్లావ్యాప్తంగా పుకార్లు షికారు చేశాయి. దీంతో బుధవారం అర్ధరాత్రి ప్రజలు కంటిమీద కునుకులేకుండా తెల్లవార్లూ జాగరణ చేశారు. భయంతో ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. డోర్నకల్‌లో మహిళలు బొడ్రాయి వద్దకు చేరి తెల్లవారే వరకు కోలాటం ఆడారు. మెయిన్రోడ్లో అర్ధరాత్రి హోటళ్లు, పాన్‌షాప్‌లు తెరుచుకున్నాయి. కురవి మండల కేంద్రంలోని గుడి పరిసర ప్రాంతాల్లో శిశువు పుట్టిందని ప్రచారం జరగడంతో తులిస్యా, లింగ్యా, లచ్చిరాం, రేకులతండా, రాంచంద్రాపురంలల్లో జనం బజార్లకు వచ్చి గుమిగూడారు. చెంచులు డప్పులతో ఊరేగింపుగా వస్తుంటే కురవి ఎస్సై భీమేష్ వారిని చెల్లాచెదురు చేశారు. గుడిలో మైక్ వేసిన అనంతరం కల్లాపు చల్లారు. మరిపెడ, నర్సింహులపేట, మహబూబాబాద్, గూడూరు, కేసముద్రం, కొత్తగూడ, ఏటూరునాగారం, వెంకటాపురం, మంగపేట, కమలాపురం, గోవిందరావుపేట, నల్లబెల్లి, నర్సంపేట, రఘునాథపల్లి, రాయపర్తి, ఆత్మకూరు, సంగెం, ములుగు, హసన్‌పర్తి, వర్ధన్నపేట తదితర మండలాలతోపాటు నగరంలోనూ వదంతులు వ్యాపించడంతో ప్రజలు భయంభయంగా గడిపారు. మూఢనమ్మకాలను విశ్వసించొద్దు పాప పుట్టగానే మాట్లాడుతుందని, గేదెకు ఓ మూడు తలల ఆడ శిశువు జన్మించిందని, ఇద్దరు కవలలు పుట్టారని... వీరు పుట్టగానే రాత్రి వేళ పడుకుంటే భూకంపం వచ్చి చనిపోతారని హెచ్చరించినట్లు వస్తున్నవన్నీ మూఢనమ్మకాలే. వీటిని ఎవరూ నమ్మొద్దు. కరీంనగర్ జిల్లాలో ఒకప్పుడు ఓ స్త్రీ రేపురా అని ఇంటి గోడలపై రాసేవారు. గత ఏడాది హన్మకొండ నగరంలోని వడ్డేపల్లి ప్రాంతంలో ఏడు అడుగుల వ్యక్తి తిరుగుతున్నాడంటూ పుకారు రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇవన్నీ వట్టి పుకార్లే అని తర్వాత తేలింది. ఈ తరహా ప్రచారాలకు ఇప్పటివరకు శాస్త్రీయ అధారాలు లభించలేదు. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా ఉండే ఇలాంటి వందతులను నమ్మెద్దు. సమాజంలో ఉన్న కొందరు స్వార్థపూరిత శక్తులు ఇలాంటి వదంతులను ప్రచారంలోకి తెస్తాయి. ప్రజలు వీటిని నమ్మి ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దు. గేదె కడుపున మానవ శిశువు జన్మించినట్లు ఎక్కడైనా జరిగితే మాకు చెప్పండి. మేము నిజనిర్ధారణ కమిటీ వేసి నిజాలేమిటో తేలుస్తాం. -డాక్టర్ బి.జగదీశ్‌బాబు, జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు -
మీ చెయ్యే.. మీ ఫోన్ స్క్రీన్..!
మీరు డ్రైవింగ్‌లో ఉన్నారు.. ఈలోగా మీ ఫోన్‌కు ఓ మెసేజ్ వచ్చింది.. ఫోన్ తీయకుండానే దాన్ని మీ చేతిపైనే చూసుకోగలిగితే.. బావుంటుంది కదూ? త్వరలోనే ఇది నిజం కానుంది. టైమ్తోపాటు ఈమెయిల్స్, ఎస్సెమ్సెస్‌లు, ఫేస్బుక్ పోసు ్టలు, నోటిఫికేషన్లు, రిమైండ ర్లు.. వీటన్నింటినీ కూడా చేతిపైనే చూసుకోవచ్చు. ‘రిటా ట్’ అనే ప్రొజెక్షన్ వాచ్‌తో ఇది సుసాధ్యం కానుంది. దీనిని చేతికి పెట్టుకుని, బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ చేసుకుంటే చాలు.. మన చెయ్యే ఫోన్ స్క్రీన్ అయిపోతుంది. టైమ్ చూడాలనుకుంటే ఒక్కసారి చేతిని ఊపితే సరిపోతుంది. ఏదైనా నోటిఫికేషన్ వస్తే.. ఈ వాచ్ వైబ్రేట్ అవుతుంది. ఎవరైనా ఫోన్ చేసినా, ఆ వివరాలు చేతిపై ప్రత్యక్షమైపోతాయి. ఉక్రెయిన్‌కు చెందిన మైకేల్ మెడ్విడ్ ఈ ప్రొజెక్టర్ వాచ్‌ను రూపొందించాడు. దీని ధర దాదాపు రూ.7వేలు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఇది అందుబాటులోకి రానుంది. -
ఇకపై ఫోన్ పోతే.. దొరకడం కష్టమే!
-
వైఎస్ జగన్‌కు చంద్రబాబు ఫోన్
-
సెబితే ఇనరా... మీ సంగతి సూస్తా!
- బెదిరింపులకు దిగుతున్న బొత్స -వైఎస్ఆర్ సీపీ నేతలకు ఫోన్ చేసి పార్టీ మారాలంటూ వేధింపులు -ఓటమి భయంతోనే ఇదంతా.. - అసెంబ్లీ మెట్లెక్కేందుకు అడ్డదారులు తొక్కుతున్న మాజీ మంత్రి చీపురుపల్లి, న్యూస్‌లైన్: - ‘ఏరా బాగున్నావా... ఏం ఎందుకలా సేశావు... నేనేం తప్పు సేసాను, నువ్వేం సెప్పినా సేసాను కదేటి. అల్లప్పుడు అన్నాయంగా అది చేయమన్నా సేసాను కదేటి, మరి పార్టీ ఒదిలి ఎల్లిపోవడమేంటి, మన పార్టీలోకి వచ్చేయ్’ - ‘ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉన్నా ఇక్కడ మాత్రం నేనే ఎమ్మెల్యేను అవుతా. ఎమ్మార్వో నుంచి రాష్ట్ర కార్యదర్శి దాకా నా పేరు చెబితే ప్రతీ అధికారి పలుకుతాడు, ఏ పనైనా సేయించగలను, ఇంకా కాదంటే తరువాత ఒక్కొక్కడి సంగతి సూస్తా’ - ఇవి ఏదో సినిమాలోని ప్రతినాయకుడి డైలాగులు కావు. సాక్షాత్తూ రాష్ట్ర మాజీ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నేరుగా ఫోన్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో జరుగుతున్న సంభాషణలు. ఒకప్పుడు మకుటం లేని మహారాజుగా జిల్లాలో ఓ వెలుగు వెలిగిన బొత్స సత్యనారాయణ మళ్లీ ఎలాగైనా అసెంబ్లీ మెట్లెక్కాలని ఆరాటపడుతూ అడ్డదారులు తొక్కుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడూ బెదిరింపు రాజకీయాలతో తన హవాను కొనసాగించారు. తరువాత పరిస్థితులు మారాయి. ప్రజలు ఈసడించుకున్నారు. పట్టించుకునే వారే కరువయ్యారు. అయినా చింత చచ్చినా పులుపు చావదన్నట్టు ఇప్పుడు కూడా ఆదే తరహా రాజకీయాలు చేస్తున్నారని చీపురుపల్లిలో పలువురు నాయకులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రె స్ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో చీపురుపల్లిలో కూడా అదే పరిస్థితి ఉండడంతో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు ఏం చేయాలో పాలుపోక సతమతమవుతున్నారు. ప్రజాస్వామ్యంగా రాజకీయాలు చేస్తే గెలుపు సాధ్యం కాదని అర్థమైన ఆయన బెదింపులకు దిగుతున్నారు. కాంగ్రెస్‌ను వీడి వైఎస్ఆర్ సీపీలోకి వెళ్లిన మాజీ, తాజా సర్పంచ్‌లు, ఇతర నేతలపై పార్టీ మారాలంటూ తీవ్రంగా ఒత్తిడి తీసుకువస్తున్నారు. పాత విషయాలు కదుపుతూ, ఏం చేయాలన్నా తానే చేయగలనంటూ ఓ వైపు నచ్చజెబుతూ, మరోవైపు బెదిరింపులకు దిగుతున్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కుదేలవడంతో ఆ నేతలు కుట్రలకు తెరలేపారు. ఒక వైపు తప్పుడు ప్రచారం చేస్తూ మరో వైపు టీడీపీతో గూడుపుఠాణి జరుపుతున్నారు. అయితే కాంగ్రెస్‌కు, లేదంటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని కుమ్మక్కు ప్రచారం చేస్తున్నారు. ఇదంతా చేస్తున్నప్పటికీ గట్టెక్కగలమో లేదోనన్న భయంతో నేరుగా మాజీ మంత్రి బొత్స రంగంలోకి దిగారు. చీపురుపల్లి మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులకు ఫోన్ చేస్తున్నారు. బెదిరింపులతో పాటు డబ్బు ఆశ కూడా చూపిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే గుండెల నిండా గూడుకట్టుకున్న అభిమానంతో కాంగ్రెస్‌ను వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వారంతా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారేది లేదంటూ తెగేసి చెబుతున్నారు. -
నాదే పొరపాటు!
వేదిక మొన్నీమధ్యే నాకో పెళ్లి సంబంధం వచ్చింది. అబ్బాయి బాగున్నాడు. ఉద్యోగం కూడా మంచిది. పెళ్లి చూపులయ్యాక ఇంటికెళ్లి ఫోన్ చేస్తామన్నారు. సంబంధం తెచ్చినాయనకు ఫోన్ చేసి అమ్మాయి వయసు కొంచెం ఎక్కువున్నట్లుంది అన్నారట. అంతే - ఆ సంబంధం క్యాన్సిల్ అయిపోయింది. విషయం తెలిసిన దగ్గర నుంచి అమ్మ డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. '‘ఆరోజు నీకు ఎంతగా నచ్చజెప్పినా వినలేదు. అంతా నా ఖర్మ’’ అంటూ అమ్మ నన్ను తిట్టనిరోజు లేదు. మొదట్లో అమ్మ మాటల్ని లెక్కచేసేదాన్ని కాదు. ఇప్పుడు నాకు కూడా భయం మొదలైంది. అమ్మ మాటలకు బాధేస్తోంది. అది గమనించిన అమ్మ తిట్టడం మానేసి తనలో తానే బాధపడడం మొదలెట్టింది. నేను చేసిన పొరపాటు ఏమిటంటే - నాకు ఉద్యోగం వచ్చిన కొత్తలో ఒక సంబంధం వచ్చింది. అబ్బాయి బాగున్నాడు. ఐదంకెల జీతం. అంతా బాగుంది. ‘‘ఇప్పుడే కదా ఉద్యోగంలో చేరాను. ఓ ఏడాది వరకూ పెళ్లి మాట ఎత్తకండి’’ అని అమ్మకూ, నాన్నకూ గట్టిగా చెప్పాను. నాన్న వెంటనే ఒప్పుకున్నారు. అమ్మ మాత్రం నన్ను ఒప్పించడానికి చాలా ప్రయత్నించింది. నేను ససేమిరా అన్నాను. ఏడాది తర్వాత వచ్చిన సంబంధాల్లో కొన్ని నాకు నచ్చలేదు. కొన్ని నాన్నకు నచ్చలేదు. అలా చూస్తుండగానే ఐదేళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు నా వయసు ముప్ఫైకి దగ్గరపడుతోంది. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరూ ‘అమ్మాయికి వయసెక్కువ’ అంటున్నారు. ఆ మధ్య వచ్చిన ఒక సంబంధం వారికి నేను బాగా నచ్చాను. కానీ, అబ్బాయి వయసు నలభై వరకు ఉంటాయి. దాంతో, ఆ సంబంధం వదులుకున్నాం. ‘‘ఎంచక్కా ఉద్యోగం వచ్చిన కొత్తల్లో పెళ్లి చేసుకుంటే ఎంత బాగుండేది’’ అంటూ అందరి దగ్గరా అంటోంది మా అమ్మ. ఇప్పుడు నాకు కూడా నిజమేననిపిస్తోంది. నా నిర్ణయం కారణంగా అమ్మానాన్నలు కూడా ఇబ్బందిపడుతున్నారు. ఈ ‘వేదిక’ ద్వారా అమ్మాయిలకు నేను చెప్పేదేమిటంటే కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల మాట వినకపోతే చాలా నష్టపోతాం. - శ్రీలత, హైదరాబాద్ -
లావుగా ఉన్నావంటూ...
విజయవాడ(గుణదల), న్యూస్‌లైన్: నిశ్చితార్థం జరిగింది... కట్నం కింద కొంత డబ్బు అడ్వాన్స్‌గా తీసుకున్నాడు... తీరా పెళ్లి ముహూర్తం పెట్టుకున్నాక నీవు లావుగా ఉన్నావు.. నిన్ను పెళ్లి చేసుకోనంటూ పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో బాధితులతో పాటు సీపీఐ కార్యకర్తలు స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. బాధితుల కథనం ప్రకారం... విజయవాడలోని మాచవరంలో ఉంటున్న యువతికి హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన పాలెం విక్రమనాయుడుతో పెళ్లి సంబంధం కుదిరింది. ఫిబ్రవరి 6న పెద్దల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది. మే 12న పెళ్లి జరిపించాలని నిర్ణయించుకున్నారు. కట్నకానుకలు, లాంఛనాలు కలిపి రూ.5 లక్షల వరకు ఇచ్చేందుకు యువతి కుటుంబీకులు అంగీకరించారు. నిశ్చితార్థం రోజున రూ.2 లక్షలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో నాలుగురోజుల కిందట విక్రమనాయుడు కాబోయే భార్యకు ఫోన్ చేసి ‘నువ్వు లావుగా ఉన్నావు.. వెంటనే తగ్గాలి.. లేకపోతే ఈ పెళ్లి జరగదు. ఒకవేళ పెళ్లి జరగాలంటే మరో రూ.3 లక్షలు అదనంగా ఇవ్వాలి’అని డిమాండ్ చేశాడు. దీంతో అవాక్కైన ఆమె ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పింది. మోసపోయామని గ్రహించిన యువతి తల్లిదండ్రులు మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
జైలు నుంచే తేజ్‌పాల్ మహిళతో ఫోన్ మంతనాలు
పనాజీ: లైంగిక ఆరోపణల కేసులో జైలు పాలైన తెహల్కా మాజీ చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్.. జైలు నుంచే ప్రతి రోజూ ఓ మహిళా వ్యాపర భాగస్వామితో ఫోన్లో సంభాషించేవారని విచారణలో తేలింది. జైలు అధికారులు ఈ నివేదికన మర్గావో జిల్లా, సెషన్స్ కోర్టుకు బుధవారం సమర్పించారు. తేజ్‌పాల్ జైలు గది నుంచి సిమ్‌ను సీజ్ చేసినట్టు అధికారులు చెప్పారు. ఈ సిమ్ పనాజీకి చెందిన ఓ మహిళ పేరుతో తీసుకున్నారు. తేజ్‌పాల్ ఢిల్లీకి చెందిన షీలా లుంకడ్ అనే మహిళతో మాట్లాడినట్టు జైలు అధికారులు తెలిపారు. షీలాతో పాటు ఢిల్లీకే చెందిన మంజరితో సంభాషించేవారని, ఆయన సిమ్‌లో ఇతర ఫోన్ నెంబర్లు ఉన్నట్టు చెప్పారు. ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో తేజ్‌పాల్, ఆయన భార్య గీతన బత్రా, షీలా, రాజీవ్ లుకండ్ భాగస్వాములు. జైల్లోకి ఫోన్‌ను ఎలా అనుమతించారే కోణంలో విచారణ జరుపుతున్నారు.