![Elon Musk Discontinue His Phone And Use For X About Audio And Video Calls - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/9/elon%20musk.jpg.webp?itok=pKJqjjtn)
టెక్ మొఘల్ ఎలోన్ మస్క్ ఇకపై తాను కొన్ని నెలల పాటు ఫోన్‌ను వినియోగించడం లేదని ఎక్స్.కామ్‌లో పోస్ట్ చేశారు. ఆడియో, వీడియో కాల్స్ కోసం ఎక్స్.కామ్‌ను వినియోగిస్తున్నట్లు చెప్పారు.
మస్క్ ట్విట్‌లో ఏమన్నారంటే.. ‘నేను కొన్ని నెలల పాటు ఫోన్‌ను వినియోగించడం మానేస్తున్నాను. బదులుగా ఆడియో, వీడియో కాల్స్ కోసం ఎక్స్.కామ్‌ను ఉపయోగిస్తున్నా’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
In a few months, I will discontinue my phone number and only use X for texts and audio/video calls
— Elon Musk (@elonmusk) February 9, 2024
మస్క్ ఎక్స్.కామ్‌ను ఎవ్రిథింగ్ యాప్‌గా మారుస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా ఎక్స్.కామ్‌లో ట్వీట్‌లు మాత్రమే కాకుండా ఆడియో, వీడియో కాల్స్ మాట్లాడుకునేందుకు గత ఏడాది అక్టోబర్ కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చారు. అయితే మస్క్ ఎక్స్.కామ్‌ను ప్రమోట్ చేసేందుకు ఫోన్‌కు దూరంగా ఉంటున్నారంటూ పలు నివేదికకు వెలుగులోకి వచ్చాయి.
2023లో ఎక్స్.కామ్‌లో ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే ‘ఎర్లీ వెర్షన్ ఆఫ్ వీడియో అండ్ ఆడియో కాలింగ్ ఆన్ ఎక్స్’ ఫీచర్‌ను అందించడం ప్రారంభించారు. ఎక్స్.కామ్ వెబ్‌సైట్ ప్రకారం.. ఎక్స్.కామ్ యూజర్లందరికి కాల్స్ చేసుకునే సదుపాయం లేదు. కేవలం ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న యూజర్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది అని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment