అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌కు తన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఎక్స్.కామ్ ఊహించని షాక్ ఇచ్చింది. ఆ సంస్థను కొనుగోలు చేసిన నాటి నుంచి అంటే అక్టోబర్ 2022 నుంచి డిసెంబర్ 20,2023 వరకు ఎక్స్. కామ్ విలువ 71.5 శాతం కోల్పోయింది. తాజాగా మస్క్ సెక్యూరిటీ ఫైలింగ్‌లో ఇదే విషయాన్ని తెలిపారు.
ఎలాన్ మస్క్.. ట్విటర్ కొనుగోలు టెక్ ప్రపంచంలో అతిపెద్ద డీల్. ఈ కొనుగోలు విలువ అక్షరాల 44 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 3.37 లక్షల కోట్లు). అయితే మస్క్ ట్విటర్‌ను సొంతం చేసుకున్న తర్వాత అందులో చేసిన మార్పులు, కొత్తగా తెచ్చిన సబ్‌స్క్రిప్షన్ సేవలతో పాటు ఇతర కారణాల వల్ల యూజర్లు భారీగా తగ్గారు.
12.5 బిలియన్ డాలర్లు ఎక్స్.కామ్ విలువ
పైగా స్టార్టప్స్‌తో పాటు పలు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలు ఎక్స్.కామ్‌లో యాడ్స్‌ను ఇవ్వడాన్ని నిషేధించాయి. కంటెంట్ నియంత్రణపై ఆందోళనలు వంటి అంశాలు తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా సంస్థ విలువ 12.5 బిలియన్ డాలర్లకు చేజారింది.
15 శాతం తగ్గిన నెలవారి యూజర్లు
ఫిడిలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్ నివేదిక ప్రకారం.. మస్క్ ట్విటర్‌ను అక్టోబర్ 2022లో కొనుగోలు చేయగా.. జులై,2023న దాని పేరును ఎక్స్.కామ్‌గా మార్చారు. అదే సమయంలో ట్విటర్‌ను కొనుగోలు అనంతరం ప్రారంభ దశలో నెలవారి యూజర్లు 15 శాతం తగ్గినట్లు ఫిడిలిటీ పేర్కొంది.
ట్విటర్ సంస్థలోకి బాస్‌గా అడుగుపెట్టిన మస్క్.. వచ్చీరాగానే 50 శాతం ఉంది ఉద్యోగుల్ని ఫైర్ చేశారు. అదే సమయంలో అన్నీ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లలో కంటే ట్విటర్‌లో సమాచారం అంతా నిరాధారమైనవి అంటూ యురోపియన్ యూనియన్ మస్క్‌కు వార్నింగ్ ఇచ్చాయి.
యాక్సియోస్ రిపోర్ట్ ఆధారంగా..
నవంబర్ 2023 వరకు ఎక్స్. కామ్ నష్టాల్ని పరిణామాలను పరిగణనలోకి తీసుకకుంది. నవంబర్‌లో ప్రకటనలు ఆగిపోవడంతో ఎక్స్.కామ్ విలువ 10.7 శాతం నష్టపోయింది. నవంబర్‌లో డిస్నీ, యాపిల్, కోకా కోలాతో సహా ప్రధాన ప్రకటనదారులు ఎలాన్ మస్క్ యాంటిసెమిటిక్ పోస్ట్‌లకు ఆమోదించడం ఆగ్నికి ఆజ్యం తోడైనట్లు.. దిగ్గజ కంపెనీలు ఎక్స్. కామ్‌లో యాడ్స్ ఇవ్వడాన్ని నిలిపివేశారు.
Comments
Please login to add a commentAdd a comment