x.com
-
వైఎస్సార్సీపీ రీట్వీట్‌తో నీళ్లు నమిలిన నారా లోకేష్
సాక్షి,అమరావతి : రాష్ట్ర అప్పులపై నారా లోకేష్ కాకిలెక్కలు చెప్పారు. కళ్లార్పకుండా అబద్దాలను చెప్పడంలో తండ్రి చంద్రబాబును మించిన తనయుడిగా చెలామణి అవుతున్నారు. నారా లోకేష్ తాజాగా ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఉమ్మడి రాష్ట్రంలో అప్పులను మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనే అని చూపుతూ ట్వీట్లో పేర్కొన్నారు. విభజన సమయానికి ఏపీ వాటా అప్పుల వడ్డీ రూ.7,488 కోట్లు ఉంది. చంద్రబాబు సీఎం అయ్యాక రాష్ట్ర అప్పులు బాగా పెరిగాయి.ఇదే అంశాన్ని వైఎస్సార్సీపీ ఆధారాలతో సహా నిరూపించింది. వైఎస్సార్సీపీ రీట్వీట్‌తో లోకేష్ నీళ్లు నమిలారు. ఆర్థిక విధ్వంసుడు తన తండ్రేనని తేలడంతో కిక్కురుమనకుండా లోకేష్ సైలెంట్ అయ్యారు. ఈ తొమ్మిది నెలల్లోనే లక్షన్నర కోట్ల అప్పులు చేసిన చంద్రబాబు.. ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయలేదు. మరి ఆ లక్షన్నర కోట్లకు లెక్కలు చెప్పమంటే చంద్రబాబు,లోకేష్ నోరెత్తకపోవడంపై రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. .@naralokesh.. నీ ట్వీట్ చూస్తుంటే పబ్లిక్ ఫైనాన్స్‌పై నీకు బేసిక్ నాలెడ్జ్ కూడా లేదని అర్థమవుతోంది మార్కెట్ రుణాలపై వడ్డీ చెల్లింపునకే రాష్ట్ర ప్రభుత్వం పరిమితం అనుకోవడం నీ అవివేకంరాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పుల్లో 75% మార్కెట్ రుణాలే కాదు..ఇంకా మిగతా వాటిల్లో కూడా చాలా… https://t.co/ZTVFSAL3IP— YSR Congress Party (@YSRCParty) February 17, 2025 -
భక్తుల ప్రాణాలు తీసిన వారిని ఎందుకు కాపాడుతున్నారు?
సాక్షి,తిరుపతి : కోరి కొల్చినవారికి కొంగు బంగారమై కొలువుదీరిన కలియుగ ప్రత్యక్ష దైవం చెంత తిరుపతిలో (tirupati stampede) తొక్కిసలాట జరిగింది. కేవలం పాలకుల చేతగానితనం వల్ల ఆరు నిండు ప్రాణాలు బలికావటం, 43 మందికి పైగా గాయపడటం చరిత్ర ఎరుగని విషాదం. అయితే ఇంతటి మహా విషాదానికి కారణమైన అధికారుల్ని ఎందుకు కాపాడుతున్నారంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా (rk roja) కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తొక్కిసలాట ఘటనపై గురువారం రాత్రి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేర్వేరుగా స్టేట్మెంట్లు ఇవ్వడంపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందించారు. రోజా తన ట్వీట్లో ఏమన్నారంటే?ప్రాణాలు తీసిన వారిని ఎందుకు కాపాడుతున్నారు..?వైకుంఠ ఏకాదశి దర్శన టోకన్లు పొందడం కోసం పరితపించిన భక్తులు..!! కానీ కూటమి ప్రభుత్వం, నిర్లక్ష్యం కారణంగా ఆరు మంది తమ ప్రాణాలను కోల్పోయారు. ఈ ఘటనకు టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, ఎస్పీ సుబ్బారాయుడు ప్రధాన కారణం. ఈ విషయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రజల్లో అగ్రహాం రావడంతో సమాజ మెప్పు కోసం అంగీకరించారు.ప్రాణాలు తీసిన వారిని ఎందుకు కాపాడుతున్నారు..?వైకుంఠ ఏకాదశి దర్శన టోకన్లు పొందడం కోసం పరితపించిన భక్తులు..!!కానీ @JaiTDP @JanaSenaParty @BJP4Andhra ప్రభుత్వం మరియు @TTDevasthanams నిర్లక్ష్యం కారణంగా 6 మంది తమ ప్రాణాలను కోల్పోయారు.ఈ ఘటన కు టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈఓ వెంకయ్య…— Roja Selvamani (@RojaSelvamaniRK) January 10, 2025పవన్ మాటలలోనే విధినిర్వహణలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈఓ శ్యామల రావు, అదనపు ఈఓ వెంకయ్యచౌదరిలు పూర్తిగా విఫలం అయ్యారు అని స్పష్టమయింది. మరి ఈ కీలక స్థానంలో ఉన్న ప్రధాన అధికారులు, పాలకండలి వైఫల్యమే కదా. తొక్కిసలాటకి కారణం ఫలితంగా ఆరుగురు భక్తులు తమ నిండు ప్రాణాలు కోల్పోయారు.అందుకు కారణమైన టీటీడీ ఛైర్మన్, ఈఓ, అదనపు ఈఓలపై చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఎందుకు అడగరు? అంటే సమాజంలో ఉన్న అభిప్రాయం తాను చెప్పడం ద్వారా ప్రజలు మెప్పు పొందటం, చంద్రబాబుకు ఇష్టమైన అధికారులపై చర్యలు కోరకుండా తన రాజకీయ ప్రయోజనాలు కాపాడుకోవడం..!! ఇదేనా మీ సనాతన ధర్మం..? ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వేర్వేరుగా వచ్చారంటేనే అర్దం అవుతుంది మీ వ్యూహం ఏమిటో!!’ ట్వీట్లో పేర్కొన్నారు.👉చదవండి : తొక్కిసలాట ఘటనపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ తలోమాట -
మణిపూర్ హింసకు స్టార్‌లింక్ వినియోగం.. మస్క్ ఏమన్నారంటే?
ఇంఫాల్: మణిపూర్‌లో హింసాత్మక ఘటనలో అగంతకులు స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నారనే ఆరోపణలపై స్పేస్ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ స్పందించారు.మణిపూర్‌లో ఇటీవల పెద్దఎత్తున హింస చెలరేగింది. జిరిబామ్ జిల్లాలో ముగ్గురు వ్యక్తులు అనుమానస్పదంగా మృతి చెందడంతో స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ నిరసనలకు దిగారు. 24 గంటల్లోపు హంతకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఇంఫాల్‌లో ముగ్గురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేల ఇళ్లపై కొందరు దుండగులు దాడిచేసి నిప్పుపెట్టారు. ముఖ్యమంత్రి బిరెన్ సింగ్ అల్లుడి ఇళ్లు సహా ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు ఆందోళన చేశారు. Acting on specific intelligence, troops of #IndianArmy and #AssamRifles formations under #SpearCorps carried out joint search operations in the hill and valley regions in the districts of Churachandpur, Chandel, Imphal East and Kagpokpi in #Manipur, in close coordination with… pic.twitter.com/kxy7ec5YAE— SpearCorps.IndianArmy (@Spearcorps) December 16, 2024అయితే, ఈ ఆందోళన అనంతరం,భద్రతా బలగాలు ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పాటు కొన్ని ఇంటర్నెట్ పరికరాలను స్వాధీనం చేసుకున్నాయి. కైరావ్ ఖునౌ అనే ప్రాంతం నుండి స్వాధీనం చేసుకున్న వస్తువులలో ఇంటర్నెట్ శాటిలైట్ యాంటెన్నా, ఒక ఇంటర్నెట్ శాటిలైట్ రూటర్, 20 మీటర్ల ఎఫ్టీపీ కేబుల్స్ లభ్యమయ్యాయని రాష్ట్ర పోలీసులు ధృవీకరించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న పరికరాలలో ఒకదానిపై స్టార్‌లింక్ లోగో ఉన్నట్లు గుర్తించారు. దీంతో సంఘ విద్రోహ శక్తులు స్టార్‌లింక్ శాటిలైట్‌ను వినియోగిస్తున్నారు. స్టార్‌లింక్ అధినేత ఎలాన్ మస్క్ ఈ దుర్వినియోగాన్ని నియంత్రిస్తారని ఆశిస్తున్నాము’అంటూ నెటిజన్లు ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌పై మస్క్ స్పందించారు. ‘ఇది తప్పు. స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలు భారత్‌లో నిలిపివేసినట్లు స్పష్టం చేశారు. -
10 రూపాయిల వాటర్ బాటిల్ ఖరీదు వంద రూపాయలా?
ఢిల్లీ: రూ.10 వాటర్ బాటిల్ రూ.100కి అమ్మడం ఏంటి? అని ప్రశ్నిస్తూ ఓ ఐటీ ఉద్యోగి ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఐటీ ఉద్యోగి పల్లబ్దే ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ ఈవెంట్లో రూ.10 వాటర్ బాటిల్‌ను రూ.100కి అమ్ముతున్నట్లు గుర్తించాడు. ఇదే విషయాన్ని ప్రముఖ ఫుడ్‌డెలివరీ సంస్థ జొమాటాను అడిగారు.How is @zomato allowed to sell Rs. 10 water bottles for Rs. 100 at concert venues where no one is allowed to bring their own bottles?@VijayGopal_ pic.twitter.com/clQWDcIb7m— Pallab De (@indyan) December 17, 2024 ‘తాము పాల్గొన్న ఈవెంట్లో వాటర్ బాటిల్స్ నిషేదం.ఈవెంట్ నిర్వహించే వాళ్లే వాటర్ బాటిళ్లనూ అమ్ముతున్నారు. దాహం వేస్తుంది కదా అని రూ.10 వాటర్ బాటిళ్లను రెండింటిని కొనుగోలు చేశా. రూ.20 ఇచ్చా. కానీ సదరు వాటర్ బాటిల్ అమ్మే వ్యక్తి నా నుంచి రూ.200 వసూలు చేశారు.‘ఎవరూ తమ సొంత వాటర్ బాటిళ్లను తీసుకురావడానికి అనుమతించని ఈవెంట్లో రూ.10 వాటర్ బాటిల్‌ను రూ.100కి విక్రయించడానికి జొమాటోకి అనుమతి ఎలా వచ్చింది? అని అడుగుతూ రెండు వాటర్ బాటిళ్ల ఫొటోల్ని ట్వీట్లో జత చేశాడు.పల్లబ్ ట్వీట్‌పై జొమాటో స్పందించింది. తాము, ఆ వాటర్ బాటిల్స్‌ను అమ్మలేదని, టికెటింగ్ పార్ట్నర్గా ఉన్నట్లు తెలిపింది. అయినప్పటికీ కస్టమర్‌కు కలిగిన అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. -
తెలంగాణ అప్పుల చిట్టా విప్పిన కేటీఆర్.. కాంగ్రెస్‌పై ప్రివిలేజ్ మోషన్
సాక్షి,తెలంగాణ భవన్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్‌ను ప్రవేశపెట్టనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పులపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ‘బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలైందని, కేసీఆర్ రూ.7లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించారంటూ’ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని బీఆర్ఎస్ నేతలు ఖండిస్తున్నారు. అప్పుల అంశంపై సోమవారం కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘ రాష్ట్ర అప్పులు రూ. 7 లక్షల కోట్లంటూ అసెంబ్లీని, తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేలా కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా మేము ప్రివిలేజ్ మోషన్‌ను ప్రవేశపెడతాం. ఆర్బీఐ నివేదిక ప్రకారం అప్పు రూ. 3.89 లక్షలు మాత్రమే అని పేర్కొంది. కానీ రూ.7లక్షల కోట్ల అప్పులంటూ ఆర్థిక మంత్రి ప్రసంగం పూర్తిగా అవాస్తవం ‘ హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్’ నివేదిక తేల్చిందని అన్నారు.డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అప్పులపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారంతో బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారు. కావున తెలంగాణ శాసనసభ కార్యవిధానం, కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని 168 (1) నిబంధన ప్రకారం బీఆర్ఎస్ శాసనసభా పక్షం తరపున ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకు సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నాం’ అని ట్విట్లో పేర్కన్నారు. We will be moving a privilege motion against the Congress Govt for its repeated attempts to mislead the legislature & the people of Telangana by stating that the total state debt is 7 lakh crore where as RBI report exposed their lies stating that the debt is only 3.89 lakh crore… pic.twitter.com/Of7N3Yk0I1— KTR (@KTRBRS) December 16, 2024 -
తెలంగాణ ప్రజలు బీజేపీ పాలన కోరుకుంటున్నారు : ప్రధాని మోదీ
ఢిల్లీ : బీఆర్ఎస్ దుష్టపాలన భయంకరమైన జ్ఞాపకాలు, ఇప్పటికే కాంగ్రెస్ పాలనతో విసిగిన ప్రజలు బీజేపీ పాలన కోరుకుంటున్నారని ప్రధాని మోదీ అన్నారు.ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ప్రధాని మోదీ కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో పాటు ఇతర బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హజరయ్యారు. అనంతరం ఈ భేటీపై ఎక్స్ వేదికగా మోదీ స్పందించారు. ‘‘తెలంగాణ బీజేపీ శాసనసభ్యులతో, ఎంపీలతో చాలా మంచి సమావేశం జరిగింది. రాష్ట్రంలో మా పార్టీ ఉనికి వేగంగా విస్తరిస్తోంది. తెలంగాణ ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్‌తో విసిగిపోయారు అంతేకాక బీఆర్ఎస్ దుష్టపాలన వల్ల కలిగిన భయంకరమైన జ్ఞాపకాలతో ఉన్నారు. ఎంతో ఆశతో బీజేపీ వైపు చూస్తున్నారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భాజపా తన స్వరాన్ని గట్టిగా వినిపిస్తూనే ఉంటుంది. మా కార్యకర్తలు మా అభివృద్ధి ఎజెండాను వివరిస్తూనే ఉంటారు’’ అని ట్వీట్లో పేర్కొన్నారు.అంతకు ముందు భేటీలో తెలంగాణ బీజేపీ నేతలకు మోదీ దిశానిర్ధేశం చేశారు. ఈ భేటీలో విభేదాలు పక్కన పెట్టి, తెలంగాణలో బీజేపీ గెలుపే లక్ష్యంగా కలిసి పనిచేయాలని నేతలకి ప్రధాని మోదీ హితవు పలికారు.తెలంగాణ బీజేపీ శాసనసభ్యులతో, ఎంపీలతో చాలా మంచి సమావేశం జరిగింది.రాష్ట్రంలో మా పార్టీ ఉనికి వేగంగా విస్తరిస్తోంది. తెలంగాణ ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్‌తో విసిగిపోయారు అంతేకాక బీఆర్ఎస్ దుష్టపాలన వల్ల కలిగిన భయంకరమైన జ్ఞాపకాలతో ఉన్నారు. ఎంతో ఆశతో బీజేపీ వైపు చూస్తున్నారు.… pic.twitter.com/hkutfaIeF8— Narendra Modi (@narendramodi) November 27, 2024 -
కాంగ్రెస్ వలసవాద మనస్తత్వానికి ఇదే ఉదాహరణ : ఎంపీ విజయసాయిరెడ్డి
ఢిల్లీ: పార్లమెంట్లో కాంగ్రెస్ వ్యవహార శైలిపై రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీకి విదేశీ దర్యాప్తు సంస్థలపై ఉన్న నమ్మకం.. మన దర్యాప్తు సంస్థలపై లేకపోవడం దౌర్భాగ్యమని అన్నారాయన.ఉద్దేశపూర్వకంగానే వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కాంగ్రెస్ అసత్య ప్రచారానికి దిగింది. లోక్‌సభ వాయిదా తీర్మానంతో ఆయన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈ క్రమంలో తమ సొంత పార్టీ నేత, ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బాఘేల్ వ్యవహారాన్ని పక్కన పెడుతోంది. దీనిని బట్టే ఆ పార్టీ అర్ధసత్యాలు ప్రచారం చేస్తోందని అర్థమవుతోంది.ఆ పార్టీకి భారత దర్యాప్తు సంస్థలపై లేని నమ్మకం విదేశీ దర్యాప్తు సంస్థలపై ఉండడం మన దౌర్భాగ్యం. విదేశీ దర్యాప్తు సంస్థలపై కాంగ్రెస్‌కు ఉన్న నమ్మకం.. వాళ్ల వలసవాద మనసత్వానికి ఉదాహారణ నిలుస్తోంది’ అని ట్వీట్లో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.The Congress’ adjournment motion in the Lok Sabha conveniently targets @ysjagan garu while conspicuously shielding their own CM in Chhattisgarh. This selective narrative exposes Congress’ penchant for telling only half the story. Their faith in foreign agencies over Indian…— Vijayasai Reddy V (@VSReddy_MP) November 27, 2024 -
టాప్ న్యూస్ యాప్‌గా ఎక్స్: మస్క్
న్యూఢిల్లీ: భారత్‌లోని యాప్ స్టోర్‌లో సామాజిక మాధ్యమం ఎక్స్ (గతంలో ట్విటర్) ప్రస్తుతం టాప్ న్యూస్ యాప్ అని ఎలాన్ మస్క్ తెలిపారు. భారత్‌లో యాపిల్ యాప్‌స్టోర్‌లో ఎక్స్ మొదటి స్థానంలో నిలిచిన న్యూస్ యాప్ అని డోజ్‌డిజైనర్ అనే ఒక వినియోగదారు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన తర్వాత.. భారత్‌లో వార్తల కోసం ప్లాట్‌ఫామ్ నిజంగా నంబర్ వన్ అయిందని బిలియనీర్ ఎలాన్ మస్క్ అన్నారు.మస్క్ 2022 అక్టోబర్‌లో ఎక్స్‌ను (గతంలో ట్విటర్) 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. స్టాటిస్టా (Statista.com) ప్రకారం, దేశం వారీగా అత్యధిక ట్విటర్ యూజర్ల సంఖ్యలో సుమారుగా 25 మిలియన్లకు పైగా వినియోగదారులతో భారత్ మూడవ స్థానంలో ఉంది. మస్క్ ప్రకటన తరువాత అభినందనలు వెల్లువెత్తాయి.𝕏 is now #1 for news in India! https://t.co/beLobq1Dfo— Elon Musk (@elonmusk) November 22, 2024 -
కూటమి ప్రభుత్వంపై మా పోరాటం ఆగదు: తాటిపర్తి
సాక్షి,ప్రకాశం జిల్లా : యర్రగొండపాలెం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌కి పోలీసులు నోటీసులు అందించారు. ఎక్స్ వేదికగా నారా లోకేష్‌పై పెట్టిన పోస్టింగ్‌తో పాటు ఎన్నికల సమయంలో పెట్టిన నాలుగు కేసులకు సంబంధించి ఎర్రగొండపాలెం ఎస్సై చౌడయ్య నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపై ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా.. ఎన్నికుట్రలు చేసినా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను నొక్కేయాలనే కుట్రతోనే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై విచ్చలవిడిగా కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. అయినప్పటికీ కూటమి ప్రభుత్వంపై తమ పోరాటం ఆగదని అన్నారు. -
తడిగుడ్డతో గొంతు కోయడం అంటే ఇదేనేమో.. రేవంత్ పాలనపై కేటీఆర్ సెటైర్లు
సాక్షి, తెలంగాణ భవన్: సుఖం వస్తే ముఖం కడగడానికి తీరిక లేదంటే ఏమో అనుకున్నాం పది నెలల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల 25కు పైగా ఢిల్లీ, 26కు పైగా విదేశీ పర్యటనలు చూస్తే అర్దం అవుతుంది’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వ పాలనపై సెటైర్లు వేశారు. ఈ మేరకు కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తడిగుడ్డతో గొంతు కోయడం అంటే ఏంటో అనుకున్నాం కొనుగోళ్లు లేక తడుస్తున్న ఈ ధాన్యం చూస్తుంటే తెలుస్తుంది. కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడడం అంటే ఏంటో అనుకున్నాం కల్లాల వద్ద 20 రోజులుగా రైతన్నలు పడుతున్న బాధలు చూస్తే తెలుస్తుంది.మీసాలెందుకు రాలేదురా అంటే మేనత్త సాలు అని, గడ్డం ఎందుకు వచ్చిందిరా అంటే మేనమామ పోలిక అంటే ఏంటో అనుకున్నాం రుణమాఫీ, రైతుభరోసా, ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి కింద రూ.లక్ష 116, తులం బంగారం అడిగితే కాంగ్రెస్ నేతలు చెబుతున్న సాకులు చూస్తుంటే అర్దం అవుతుంది. అందితే జుట్టు అందకపొతే కాళ్ళు ఏమో అనుకున్నాం ఓట్ల కోసం నాడు నిరుద్యోగుల కాళ్లు పట్టుకుని, నేడు వారి మీద నిర్దాక్షిణ్యంగా లాఠీఛార్జ్ చేస్తుంటే అర్దం అవుతుందిసుఖం వస్తే ముఖం కడగడానికి తీరిక లేదంటే ఏమో అనుకున్నాం పది నెలల పాలనలో సీఎం, మంత్రుల 25కు పైగా ఢిల్లీ, 26కు పైగా విదేశీ పర్యటనలు చూస్తే అర్దం అవుతుంది. తేలుకు పెత్తనం ఇస్తే తెల్లవార్లు కుట్టిందంటే ఏమో అనుకున్నాం హైడ్రా,మూసీ సుందరీకరణ పేరుతో పేదలపై ప్రభుత్వ ప్రతాపం చూస్తుంటే అర్దం అవుతుందిఏరు దాటే వరకు ఓడ మల్లన్న ఏరు దాటిన తరువాత బోడ మల్లన్న అంటే ఏమో అనుకున్నాం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తే అర్దం అవుతుంది తడిగుడ్డతో గొంతు కోయడం అంటే ఏంటో అనుకున్నాం కొనుగోళ్లు లేక తడుస్తున్న ఈ ధాన్యం చూస్తుంటే తెలుస్తుంది కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడడం అంటే ఏంటో అనుకున్నాం కల్లాల వద్ద 20 రోజులుగా రైతన్నలు పడుతున్న బాధలు చూస్తే తెలుస్తుంది మీసాలెందుకు రాలేదురా అంటే మేనత్త సాలు అని, గడ్డం ఎందుకు…— KTR (@KTRBRS) November 7, 2024 -
సమస్యల్ని గాలికి వదిలేసి ఊరేగుతున్న సీఎం, మంత్రులు : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలోని సమస్యలు గాలికి వదిలేసి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఊరేగుతున్నారని మండిపడ్డారు.పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని తాజా మాజీ సర్పంచ్‌లు ఇవాళ పిలుపు నిచ్చిన ‘చలో హైదరాబాద్ పోరుబాట’ ఉద్రిక్తతలకు దారి తీసింది. హైదరాబాద్ పెద్దమ్మ గుడి నుంచి ఇవాళ సర్పంచుల పోరుబాట కార్యక్రమం ప్రారంభం కానుంది.అయితే, చలో హైదరాబాద్ పోరుబాటపై పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వస్తున్న మాజీ సర్పంచులను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ పెద్దమ్మ గుడి పిలుపుపై అప్రమత్తమైన పోలీసులు మాజీ సర్పంచులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. వారి అరెస్ట్‌పై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాంపెండింగ్ బిల్లులు ఇవ్వాలని ఏడాది కాలంగా అడిగినా ఇవ్వకపోవడంసిగ్గుచేటురాష్ట్రంలో నిత్యం అరెస్టుల పర్వమే కొనసాగుతోంది- పోలీసులతో సమస్యలను అణగదొక్కాలని చూస్తుంది ప్రభుత్వంరాష్ట్రంలోని సమస్యలు గాలికి…— KTR (@KTRBRS) November 4, 2024 రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పెండింగ్ బిల్లులు ఇవ్వాలని ఏడాది కాలంగా అడిగినా ఇవ్వకపోవడం సిగ్గుచేటు. రాష్ట్రంలో నిత్యం అరెస్టుల పర్వమే కొనసాగుతోంది. పోలీసులతో సమస్యలను అణగదొక్కాలని ప్రభుత్వం చూస్తుంది. రాష్ట్రంలోని సమస్యలు గాలికి వదిలి ముఖ్యమంత్రి, మంత్రులు ఊరేగుతున్నారు.సర్పంచుల కుంటుంబాలు రోడ్డున పడే దాకా ప్రభుత్వం స్పందించదా. శాంతియుత నిరసనకు పిలుపునిచ్చిన సర్పంచులను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు. పల్లె ప్రగతి పేరిట మేము చేపట్టిన కార్యక్రమాననికి తూట్లు పొడిచి నిధులు విడుదల చేయకుండా ఆపుతున్నారు. అరెస్ట్ చేసిన సర్పంచ్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం’ అని కేటీఆర్ ఎక్స్ వేదకగా ట్వీట్ చేశారు. -
‘ఎక్స్’లో ఉద్యోగాల కోత.. ఇంజినీర్లు ఇంటికి..!
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కంపెనీల్లో లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. తాజాగా ఎలాన్ మస్క్‌కు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్) భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం.‘ఎక్స్’ అమలు చేస్తున్న లేఆఫ్‌ల ప్రభావం ప్రధానంగా దాని ఇంజనీరింగ్ విభాగం ఉద్యోగులపై పడిందని సంస్థ వర్గాలు, వర్క్‌ప్లేస్ ఫోరమ్ బ్లైండ్‌లోని పోస్ట్‌లను ఉటంకిస్తూ ‘ది వెర్జ్’ నివేదిక పేర్కొంది. తొలగింపునకు గురైన ఉద్యోగుల సంఖ్య ఖచ్చితంగా తెలియరాలేదు. కంపెనీ కోసం మీరు చేసేందేంటో ఒక పేజీ సారాంశాన్ని సమర్పించాలని ఉద్యోగులను కోరిన రెండు నెలల తర్వాత లేఆఫ్‌లు వచ్చాయి.దీనిపై మస్క్ కానీ, ‘ఎక్స్’ అధికారులు గానీ ఇంకా వ్యాఖ్యానించలేదు. స్టాక్ గ్రాంట్ల గురించి ఎంతగానో ఎదురుచూస్తున్న సిబ్బందికి ఇటీవల ఎలాన్ మస్క్ ఈమెయిల్ పంపినట్లు వార్తా నివేదికలు వచ్చాయి. ఉద్యోగుల పనితీరు, ప్రభావం ఆధారంగా వారికి స్టాక్ ఆప్షన్స్ కేటాయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంటే స్టాక్‌ను పొందడానికి కంపెనీకి తాము చేశామో తెలియజేస్తూ నాయకత్వానికి ఒక పేజీ సారాంశాన్ని సమర్పించాలని సిబ్బందిని ఆదేశించిట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: సాఫ్ట్వేర్ ఇంజినీర్ల పరిస్థితేంటి? కలవరపెడుతున్న గూగుల్ సీఈవో ప్రకటన!ఎలాన్ మస్క్ యాజమాన్యంలో ఎంకెన్ని లేఆఫ్‌లు ఉంటాయోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. 2022లో ట్విటర్‌ను కొనుగోలు చేసిన మస్క్ దాదాపు 80 శాతం అంటే 6,000 మందికిపైగా ఉద్యోగులను తొలగించారు. డైవర్సిటీ, ఇన్‌క్లూషన్, ప్రొడక్ట్ డెవలప్మెంట్, డిజైన్ వంటి అన్ని విభాగాల్లోనూ లేఆఫ్‌లు అమలు చేశారు. కంటెంట్ మోడరేషన్ టీమ్‌ను కూడా విడిచిపెట్టలేదు. -
ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి,అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభ సందర్భంగా ప్రజలకు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణార్పణ చేసిన మహనీయుడు శ్రీ పొట్టి శ్రీరాములు. ఆయన అంకితభావం రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది’ అని పొట్టి శ్రీరాములు త్యాగాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. On Andhra Pradesh Formation Day, my warm greetings to the resilient and talented people of this remarkable state. Remembering the immense sacrifice of ‘Amarajeevi’ Potti Sriramulu Garu, whose dedication paved the way for the state’s formation. May Andhra Pradesh continue to…— Vijayasai Reddy V (@VSReddy_MP) November 1, 2024 -
ఇదేం రాజ్యం చంద్రబాబూ.. బద్వేల్ ఘటనపై వైఎస్ జగన్ ఆవేదన
సాక్షి,తాడేపల్లి : బద్వేల్లో కాలేజీ విద్యార్థినిని హత్యాచారం చేసిన ఘటనపై వైఎఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేమి రాజ్యం చంద్రబాబు అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.బద్వేల్ కాలేజీ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడి ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన రాష్ట్రంలో సంచలన రేకెత్తించింది. వరుసగా రాష్ట్రంలో అరాచక శక్తుల అగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోవడాన్ని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఈ మేరకు ట్వీట్ చేసిన వైఎస్ జగన్.. కూటమి ప్రభుత్వాన్ని కడిగిపారేశారు.రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌ను కాపాడలేకపోతున్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలలకు, బాలికలకు రక్షణ లేకుండా పోయింది. నిత్యం ప్రతి రోజు ఎక్కడో ఒక చోట హత్యలు,అత్యాచారాలు, వేధింపులు జరుతూనే ఉన్నాయి. బద్వేల్లో కాలేజీ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారని, ఈ దారుణ ఘటన హేయం, అత్యంత దుర్మార్గమన్నారు. ఈ ఘటన వెనుక ప్రభుత్వం, పోలీసుల వైఫల్యం ఉందన్నారు. ఒక పాలకుడు ఉన్నాడంటే ప్రజలు ధైర్యంగా ఉండాల్సింది పోయి నిరంతరం భయపడే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.లా అండ్ ఆర్డర్‌ను కాపాడలేకపోతున్నారు.. ఇదేమి రాజ్యం @ncbn గారూ? మహిళలకు, బాలికలకు రక్షణకూడా ఇవ్వలేకపోతున్నారు… ఇదేమి రాజ్యం? ప్రతిరోజూ ఏదోచోట హత్యాచారాలు, హత్యలు, వేధింపులు సర్వసాధారణమైపోయాయి. బద్వేలులో కాలేజీ విద్యార్థినిపై పెట్రోలుపోసి, నిప్పుపెట్టి ప్రాణాలు తీసిన ఘటన అత్యంత…— YS Jagan Mohan Reddy (@ysjagan) October 20, 2024 ‘చంద్రబాబు మీరు వైఎస్సార్సీపీమీద కక్షకొద్దీ, మా పథకాలను, కార్యక్రమాలను ఎత్తివేస్తూ రాష్ట్రంమీద, రాష్ట్ర ప్రజలమీద కక్ష సాధిస్తున్నారు. ఇది అన్యాయం కాదా? వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బాలికలు, మహిళల భద్రతకు పూర్తి భరోసానిస్తూ తీసుకొచ్చిన విప్లవాత్మక “దిశ’’ కార్యక్రమాన్ని ఉద్దేశపూర్వకంగా నీరుగార్చడం దీనికి నిదర్శనం కాదా? దీనివల్ల మహిళలు, బాలికల భద్రతను ప్రశ్నార్థకం చేసిన మాట వాస్తవం కాదా? “దిశ’’ యాప్‌లో SOS బటన్ నొక్కినా, చేతిలో ఉన్న ఫోన్‌ను 5సార్లు అటూ, ఇటూ ఊపినా వెంటనే కమాండ్ కంట్రోల్ రూంకు, అక్కడినుంచి దగ్గర లోనే ఉన్న పోలీసులకు సమాచారం వెళ్తుంది. వెంటనే పోలీసులు వారికి ఫోన్ చేస్తారు. వారు ఫోన్ ఎత్తకపోయినా లేదా ఆపదలో ఉన్నట్టు ఫోన్లో చెప్పినా ఘటన స్థలానికి నిమిషాల్లో చేరుకుని రక్షణ కల్పించే పటిష్ట వ్యవస్థను మీరు ఉద్దేశపూర్వకంగా నీరుగార్చలేదా? “దిశ’’ ప్రారంభం మొదలు 31,607 మహిళలు, బాలికలు రక్షణ పొందితే దాన్ని ఎందుకు దెబ్బతీశారు చంద్రబాబుగారూ? 1.56కోట్ల మంది డౌన్లోడ్ చేసుకుని భరోసా పొందుతున్న “దిశ’ ’పై రాజకీయ కక్ష ఎందుకు?దిశ కార్యక్రమాన్ని బలోపేతం చేయడానికి ప్రత్యేకంగా 13 పోక్సో కోర్టులు, 12 మహిళా కోర్టులు, ఫొరెన్సిక్ ల్యాబులు ఏర్పాటు చేశాం. ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాం. 900 బైక్‌లు, 163 బొలేరో వాహనాలను “దిశ’’ కార్యక్రమం కోసమే పోలీసులకు అందించి పెట్రోలింగ్‌ను పటిష్ట పరిచాం. 18 “దిశ’’ పోలీస్స్టేషన్లను పెట్టి, 18 క్రైమ్ మేనేజ్మెంట్ వాహనాలను సమకూర్చాం. వీటిని పోలీస్ కమాండ్ కంట్రోల్‌రూమ్‌కు అనుసంధానం చేశాం. మా హయాంలో శాంతిభద్రతలపై నేను చేసిన సమీక్ష సమావేశాలలో “దిశ’’ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే వాళ్లం. దీంతో పోలీసులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండేవారు.వీటన్నిటినీ నిర్వీర్యం చేసి ఏం సాధించాలనుకుంటున్నారు చంద్రబాబు? మీరు చేస్తున్నదల్లా మహిళల రక్షణ, సాధికారతకోసం అమలవుతున్న కార్యక్రమాలను, స్కీంలను ఎత్తివేసి, ఇప్పుడు ఇసుక, లిక్కర్ లాంటి స్కాంలకు పాల్పడుతూ పేకాట క్లబ్బులు నిర్వహించడం లాంటివి చేస్తున్నారు. ఇటు పోలీసు వ్యవస్థ కూడా అధికారపార్టీ అడుగులకు మడుగులొత్తుతూ ప్రతిపక్షంపై తప్పుడు కేసులు పెడుతూ వేధింపులకు దిగడమే పనిగా పెట్టుకుంది తప్ప మహిళలు, బాలికలు, చిన్నారుల రక్షణ బాధ్యతలను పట్టించుకోవడంలేదు. ఇదేమి రాజ్యం చంద్రబాబు?’అంటూ నిలదీశారు వైఎస్ జగన్.AP: మరో ప్రేమోన్మాది ఘాతుకం.. గాయపడిన విద్యార్థిని మృతి -
ఖర్గే ప్రసంగంపై అమిత్ షా సెటైర్లు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని అధికారం నుంచి తప్పించేంత వరకు తాను బతికే ఉంటానని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన ప్రసంగంపై కేంద్ర హోమంత్రి అమిత్‌షా స్పందించారు. ఖర్గే ప్రసంగం అసహ్యకరమైన, అవమానకరమైనది’గా అభివర్ణించారు.ఖర్గే ప్రసంగం ఆద్యంతం ప్రధాని మోదీ పట్ల కాంగ్రెస్‌కు ఉన్న ద్వేషం,భయం స్పష్టంగా తెలుస్తుంది. ఆయన తన ప్రసంగంతో కాంగ్రెస్, ఆ పార్టీ నేతలను మించిపోయారు’ అని అన్నారు. మోదీని అధికారం నుండి తొలగించిన తర్వాత మాత్రమే చనిపోతానని చెప్పి అనవసరంగా తన వ్యక్తిగత ఆరోగ్య విషయాలలోకి ప్రధాని మోదీని లాగారు’అని వ్యాఖ్యానించారు.Yesterday, the Congress President Shri Mallikarjun Kharge Ji has outperformed himself, his leaders and his party in being absolutely distasteful and disgraceful in his speech.In a bitter display of spite, he unnecessarily dragged PM Modi into his personal health matters by…— Amit Shah (@AmitShah) September 30, 2024 ఈ సందర్భంగా కాంగ్రెస్‌కు ప్రధాని మోదీ పట్ల ఎంత ద్వేషం,భయం ఉందో చూడండి. అందుకే కాంగ్రెస్ నేతలు మోదీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఖర్గే జీ మీరు ఆరోగ్యంగా ఉండాలని.. ప్రధాని మోదీ, నేను ఆ దేవుణ్ని ప్రార్థిస్తున్నాం. 2047 నాటికి విక్షిత్ భారత్‌ను రూపొందించే వరకు ఆయన జీవించాలని కోరుకుంటున్నా అని హోంమంత్రి అమిత్‌షా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. जब तक मोदी को नहीं हटाएँगे ...तब तक मैं ज़िंदा रहूँगा, आपकी बात सुनूँगा... आपके के लिए लड़ूँगा !! pic.twitter.com/M58zGxVNuX— Mallikarjun Kharge (@kharge) September 29, 2024మోదీ గురించి ఖర్గే ఏమన్నారంటేజమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం జమ్మూ సమీపంలోని జస్‌రోటీ గ్రామంలో నిర్వహించిన సభలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. ప్రసంగం మధ్యలో కాస్త అస్వస్థతకు గురయ్యారు. తూలిపడబోతుండగా సీనియర్ నేగలు పట్టుకున్నారు. వారి సాయంతోనే ఖర్గే ప్రసంగాన్ని కొనసాగించారు. ‘‘జమ్మూకశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదా దక్కేదాకా పోరాటం కొనసాగిస్తా. దీన్ని వదలను. నాకు 83 ఏళ్లు. నేను ఇంత తొందరగా చనిపోను. (ప్రధాని) మోదీని అధికారం నుండి తొలగించే వరకు నేను బతికే ఉంటాను. కశ్మీరీల బాధలు వింటా. వవారి సమస్యల పరిష్కారానికి పోరాడుతా. ఇంకా మాట్లాడాలనుంది.కానీ కళ్లు తిరగడంతో నేను మట్లాడలేకపోతున్నా.నన్ను క్షమించాలి ’’ అని అన్నారు. -
జోడో పోయే.. డోజో వచ్చే
ఢిల్లీ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో యాత్రకు సిద్ధమయ్యారు. గతేడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు భారత్ జోడో న్యాయ యాత్ర చేసిన రాహుల్..త్వరలో భారత్ డోజో యాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణనిచ్చే కేంద్రాలను డోజో అని పిలుస్తారు.ఈ సందర్భంగా..‘గత ఏడాది భారత్ జోడో న్యాయ యాత్ర పేరిట వేల కిలోమీటర్లు ప్రయాణించా.ఆ యాత్రలో ఫిట్‌గా ఉండేందుకు ప్రతి రోజు సాయంత్రం మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారు. యాత్రలో భాగంగా నేను బస చేసే ప్రాంతంలో యువ మార్షల్ ఆర్ట్స్ విద్యార్థుల్ని కలిశాను’ అని రాహుల్ గాంధీ ట్వీట్లో పేర్కొన్నారు. ఈ మార్షల్ ఆర్ట్స్‌ని యువతకు పరిచయం చేయాలన్నదే మా లక్ష్యం. మార్షల్ ఆర్ట్స్ ద్వారా ఎలాంటి హింస లేకుండానే సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవచ్చు. సమాజంలో అందరూ సేఫ్‌గా ఉండాలంటే ఇలాంటి టెక్నిక్స్ కచ్చితంగా నేర్చుకోవాలి’ అని ట్వీట్లో పేర్కొన్నారు.During the Bharat Jodo Nyay Yatra, as we journeyed across thousands of kilometers, we had a daily routine of practicing jiu-jitsu every evening at our campsite. What began as a simple way to stay fit quickly evolved into a community activity, bringing together fellow yatris and… pic.twitter.com/Zvmw78ShDX— Rahul Gandhi (@RahulGandhi) August 29, 2024 -
కంగనా రనౌత్ నోటి దురుసు వ్యాఖ్యలు.. సొంత ఎంపీపై బీజేపీ ఆగ్రహం
ధర్మశాల : రైతుల నిరసనలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హిమాచల్ ప్రదేశ్ మండి నియోజకవర్గ బీజేపీ ఎంపీ కంగన రౌనత్‌పై సొంత పార్టీ నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేసింది.2020 మోదీ ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది. రైతులు మాత్రం కేంద్రం తెచ్చిన చట్టాల్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో కేంద్రం రైతు చట్టాల్ని వెనక్కి తీసుకుంది. అయినప్పటికీ దేశంలో ఈ సాగు చట్టాలపై నిరసనలు కొనసాగేలా కుట్ర జరిగే అవకాశం ఉందని, రైతుల నిరసనలను మోదీ ప్రభుత్వం కట్టడి చేయాలని, లేదంటే భారత్ మరో బంగ్లాదేశ్ తరహా అశాంతి పరిస్థితులకు దారితీసే అవకాశం ఉందని కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పైగా అల్లర్లు సృష్టించే వారికి దేశం కుక్కలపాలైనా వారికేం పట్టదని విమర్శించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన పోరాటంలో మృతదేహాలు వేలాడుతూ కనిపించాయని, లైంగిక దాడులు చోటుచేసుకున్నాయని ఎక్స్ వేదికగా షేర్ చేసిన వీడియోలో ఆరోపించారు. బాలీవుడ్ క్వీన్ వ్యాఖ్యలు సొంత పార్టీలోనే దుమారం రేపాయి.కంగనా రౌనత్‌కు ఆ అధికారం లేదురైతుల నిరసన గురించి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ అధికారికంగా స్పందించింది. భవిష్యత్తులో అలాంటి ప్రకటనలు ఇవ్వకూడదని హెచ్చరించింది. రైతుల నిరసనపై కంగనా రౌనత్ వ్యాఖ్యల్ని మేం ఖండిస్తున్నాం.‘కంగనా రనౌత్‌కు పార్టీ తరపున విధానపరమైన విషయాలపై మాట్లాడే అధికారం లేదు. ఆమెకు అనుమతి కూడా ఇవ్వలేదు. భవిష్యత్తులో అలాంటి ప్రకటనలు చేయొద్దని బీజేపీ ట్వీట్ చేసింది. తప్పు.. ఇలా మాట్లాడకూడదుమరోవైపు కంగనా రనౌత్ వ్యాఖ్యలపై బీజేపీ పంజాబ్ యూనిట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి ఉద్రేకపూరిత ప్రకటనలు చేయడం మానుకోవాలని సూచించింది. ‘రైతులపై మాట్లాడటం కంగనా వ్యాఖ్యలకు పార్టీకి సంబంధం లేదు. ఆ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం. ప్రధాని మోదీ, బీజేపీ రైతు పక్షపాతి. ఆమె సున్నిత, మతపరమైన వ్యాఖ్యలు చేయకూడదు’ అని పంజాబ్ బీజేపీ నేత నాయకుడు హర్జిత్ గరేవాల్ అన్నారు. BJP expressed disagreement with its MP Kangna Ranaut's comments on farmers agitation, says she is not authorised to speak on policy issues. pic.twitter.com/xJ878F5pWK— Press Trust of India (@PTI_News) August 26, 2024 -
ddos attack : మస్క్ - ట్రంప్ ఇంటర్వ్యూ.. ఎక్స్ వేదికపై సైబర్ దాడి
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌పై డీడీఓఎస్ అటాక్ జరిగింది. దీంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్‌ను ఎక్స్ అధినేత ఎలోన్ మస్క్ ఆడియో ఇంటర్వ్యూ చేశారు. ఆ సమయంలో ఎక్స్‌పై డీడీఓఎస్ అటాక్ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో చాలా మంది వినియోగదారులకు ఆ ఇంటర్వ్యూ అందుబాటులోకి రాలేదని మస్క్ తెలిపారు. సమస్యను పరిష్కరిస్తామని ఆడియో ఇంటర్వ్యూని అందరికి అందిస్తామని చెప్పారు. డీడీఓఎస్ దాడి అంటే ఏమిటి?డీడీఓస్‘డిస్ట్రిబ్యూటెడ్ డినియల్ ఆఫ్ సర్వీస్ అటాక్’. సైబర్ నేరస్తులు డీడీఓఎస్ అటాక్‌ను ఎంపిక చేసిన సర్వర్,నెట్వర్క్ లపై దాడి చేస్తారు. తద్వారా టెక్నాలజీ సంబంధిత కార్యకలాపాలు స్తంభించి పోతాయి. సైబర్ సెక్యూరిటీ సంస్థ ఫోర్టినెట్ దీనిని సైబర్ క్రైమ్‌గా పరిగణలోకి తీసుకుంది. డీడీఓఎస్తో నిర్ధిష్ట వ్యక్తుల్ని,సంస్థల్ని టార్గెట్ చేస్తారు.ఉదాహరణకు ఎలోన్ మస్క్ - ట్రంప్ మధ్య ఆడియో ఇంటర్వ్యూ జరిగింది. ఆ ఇంటర్వ్యూని యూజర్లు యాక్సెస్ చేయకుండా అడ్డుకున్నట్లు చెప్పింది. We tested the system with 8 million concurrent listeners earlier today https://t.co/ymqGBFEJX0— Elon Musk (@elonmusk) August 13, 2024 -
వయనాడ్ విషాదం.. వివాదంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్
తిరువనంతపురం : కేరళ రాష్ట్రం వయనాడ్ జిల్లాలో ప్రకృతి ప్రకోపించింది. దీంతో దైవ భూమి కేరళ ఇప్పుడు మరుభూమిలా మారింది. అటవీ, కొండ ప్రాంతమైన వయనాడ్‌లో కొండ చరియలు విరిగి పడ్డాయి. ఈ దుర్ఘటనలో తాజా మరణాలు ఆదివారం (ఆగస్ట్4) ఉదయం 10.30 గంటల సమయానికి 357కి చేరుకున్నాయి. 200 మందికి పైగా ఆచూకీ తెలియాల్సి ఉంది.మరోవైపు కొండ చరియలు విరుచుకుపడడంతో సర్వం కోల్పోయి, తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్న బాధితులకు వైద్య సహాయం కొనసాగుతుంది. వారికి అండగా నిలిచేందుకు పలువురు ప్రముఖులు నేరుగా సహాయ కేంద్రాలను సందర్శిస్తున్నారు. మీకు మేం అండగా ఉన్నామంటూ వారిలో మనోధైర్యాన్ని నింపుతున్నారు. కావాల్సిన నిత్య సరాల్ని తీరుస్తున్నారు.మండక్కై జంక్షన్, చూరాల్మల ప్రాంతాలు భవనాలు, బురద నిందిన వీధులు, రాళ్లతో మృత్యు దిబ్బులుగా మారాయి. ఆ రెండు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడిపోక ముందు సుమారు 450 నుంచి 500 పైగా ఇళ్లుండేవి. కానీ ఇప్పుడు అవేమీ కనిపించడం లేదు. భారీ రాళ్లే దర్శనమిస్తున్నాయి. భద్రతా బలగాలు సహాయక చర్యల్ని ముమ్మురం చేస్తున్నాయి. 1300 మందికి పైగా ఆర్మీ జవానులు జాడ తెలియని వారికోసం అన్వేషిస్తున్నారు. ఈ తరుణంలో కేరళ రాజధాని తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశీ థరూర్ వయనాడ్ బాధితుల్ని పరామర్శించారు. బాధితుల పరిస్థితి, ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తాత్కాలికంగా వారికి కావాల్సిన బెడ్ షీట్లు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోని ప్రజా ప్రతినిధులందరూ వయనాడ్‌కు సహాయం చేయాలని ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇదే అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా లేఖ రాసినట్లు మీడియాకు వెల్లడించారు.ఇదే విషయంపై ఎక్స్ వేదికగా స్పందించారు. వయనాడ్ విషాదంపై మరపురాని రోజు కొన్ని జ్ఞాపకాలు అంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌పై వివాదం నెలకొంది.Some memories of a memorable day in Wayanad pic.twitter.com/h4XEmQo66WFor all the trolls: definition of “memorable”: Something that is memorable is worth remembering or likely to be remembered, because it is special or unforgettable. Thats all i meant. https://t.co/63gkYvEohv— Shashi Tharoor (@ShashiTharoor) August 3, 2024— Shashi Tharoor (@ShashiTharoor) August 3, 2024 ఇలాంటి విషాదాన్ని వివరించినందుకు ఆయన మెమరబుల్ అనే పదాన్ని ఎలా వినియోగిస్తారని బీజేపీ నేతలతో సహా పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు.కొండచరియలు విరిగిపడి 300 మందికి పైగా మరణిస్తే జ్ఞాపకం ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు.శశి థరూర్‌కి విపత్తులు, మరణాలు చిరస్మరణీయం చెప్పడం సిగ్గుగా ఉందని మరో యూజర్ ట్వీట్ చేశారు. బీజేపీ ఐటి సెల్ చీఫ్ ,బీజేపీ సీనియర్ నేత అమిత్ మాల్వియా..‘శశి థరూర్ మరణాలు, విపత్తులు చిరస్మరణీయం’ అని ట్వీట్ చేశారు.Deaths and disaster are memorable for Shashi Tharoor. https://t.co/40zjGW6c0b— Amit Malviya (@amitmalviya) August 3, 2024ఈ ట్వీట్ వివాదంపై శశిథరూర్ మరో ట్వీట్ చేశారు. ట్రోలర్స్ అందరికి అంటూ మెమొరిబుల్‌పై నా ఉద్ద్యేశ్యం వేరే ఉంది. పలు సందర్భాలలో ఊహించని సంఘటనల్ని, విషాదాల్ని గుర్తుచేసుకునే విధంగా నిలుస్తుందని అర్థం అంటూ వివరణిచ్చారు. -
ఢిల్లీ హైకోర్టుకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె.. అంజలి బిర్లా
ఢిల్లీ : లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె, ఐఆర్పీఎస్ అధికారిణి అంజలి బిర్లా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. యూపీఎస్సీ పరీక్షల్లో తొలి ప్రయత్నంలో ఉత్తీర్ణత సాధించారు. అయితే ఈ అంశంపై పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అంజలి బిర్లా తన తండ్రి ఓం బిర్లా అధికారాన్ని అడ్డం పెట్టుకొని యూపీఎస్సీ పరీక్షల్ని తొలి ప్రయత్నంలో పాసయ్యారంటూ పోస్టులు పెట్టారు. ఆ పోస్ట్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ పోస్టులపై ఆగ్రహం వ్యక్తం చేసిన అంజలి బిర్లా.. తన పరువు భంగం కలిగించేలా ఉన్నాయని, వాటిపై పరువు నష్టం దావా వేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు కోర్టు అంగీకరించింది. Anjali Birla, who is an IRPS officer and the daughter of Lok Sabha Speaker Om Birla, has filed a defamation suit in the Delhi High Court. She seeks the removal of social media posts that falsely allege she passed UPSC exams on her first attempt due to her father's influence.…— ANI (@ANI) July 23, 2024అయితే సోషల్ మీడియాలో తనపై వస్తున్న ఆరోపణల్ని అంజలి బిర్లా ఖండించారు. సోషల్ మీడియాలో తమపై ఉద్దేశ పూర్వకంగా జరుగుతున్న కుట్రగా అభివర్ణించారు. తనపై, తండ్రి ఓం బిర్లా పరువుకు భంగం కలిగించేలా పలువురు సోషల్ మీడియా పోస్టులు షేర్లు చేస్తున్నారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. పరువు నష్టం కలిగించే రీతిలో తప్పుడు, నిరాధారమైన ఆరోపణలను వ్యాప్తి చేయడం తమకు హాని కలిగించే స్పష్టమైన ఉద్దేశాలు ఉన్నాయని చెప్పారు.సోషల్ మీడియాలో పోస్టుల్లో అంజలి బిర్లా తన మొదటి ప్రయత్నంలోనే యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. ఎటువంటి పరీక్షలు, ఇంటర్వ్యూలలో పాల్గొనలేదు. ఆమె తండ్రి ఓం బిర్లా ద్వారా అంజలి బిర్లా ప్రయోజనం పొందారు అని అర్ధం వచ్చేలా పలు సోషల్ మీడియాలో పోస్టులు ఉన్నాయని ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో అంజలి బిర్లా ఆధారాల్ని జత చేశారు.యూపీఎస్సీ 2019 మెరిట్‌లిస్ట్‌లో అంజలి బిర్లాఆరోపణల నేపథ్యంలో పలు జాతీయ మీడియా సంస్థలకు అంజలి బిర్లా తన అడ్మిట్ కార్డ్ కాపీని ఇచ్చారు. సదరు మీడియా సంస్థలు సైతం యూపీఎస్సీ 2019 ఫలితాల మెరిట్ లిస్ట్‌లలో ఆమె రోల్ నంబర్ కూడా ఉంది. ఆమె నిజంగానే ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలకు హాజరైనట్లు తేలింది. -
ఉద్యోగులు ఇంటికెళ్లాక.. మస్క్ గురించి ఆసక్తికర విషయం!
ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరు, టెస్లా, స్పేస్ ఎక్స్‌ల బిగ్ బాస్ ఎలాన్ మస్క్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆటోమొబైల్, అంతరిక్షం, అంతర్జాలం (ఇంటర్నెట్, సోషల్ మీడియా) రంగాల్లో విజయవంతమైన కంపెనీలను ఆయన నడుపుతున్నారు.అయితే ఎలాన్ మస్క్ గురించి తాజాగా ఓ ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్)లో ఓ యూజర్ మస్క్ శ్రద్ధగా పనిచేస్తున్న త్రోబ్యాక్ ఫోటోను పంచుకున్నాడు. "జిప్2 (మస్క్ స్థాపించిన సాఫ్ట్వేర్ కంపెనీ)లో పనిచేసే ఇంజనీర్లు ఇళ్లకు వెళ్లగానే వారు రాసిన కోడ్‌ను తిరిగి రాసేవాడు. అలా వారానికి 120 గంటలు పనిచేసేవాడు. ఒక సీఈఓలా ఉండాలని ఆయన ఎప్పుడూ అనుకోలేదు" అని రాసుకొచ్చారు. నిజమే..ఎక్స్ యూజర్ తన గురించి పెట్టిన పోస్టుపై ఎలాన్ మస్క్ స్పందించారు. 'నిజమే' అంటూ ఆ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ పోస్ట్‌కు 2.3 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. విపరీతంగా కామెంట్లు, రీ పోస్టులు, లైక్‌లతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. Elon Musk used to rewrite code of engineers working at Zip2 after they went home, and used to work 120 hours a week. He never really wanted to be a CEO. pic.twitter.com/fQOyNRM0QD— DogeDesigner (@cb_doge) May 30, 2024 -
ట్విటర్ రీ బ్రాండింగ్‌పై మస్క్ ట్వీట్
ట్విటర్ పూర్తిగా ఎక్స్.కామ్‌గా రీబ్రాండ్ అయ్యింది. ఎక్స్.కామ్‌లో పలు కార్యకలాపాలు ట్విటర్ పేరు మీదే జరిగేవి. అయితే ఇప్పుడు పూర్తి ఎక్స్.కామ్ నుంచే జరుగుతున్నాయని ఆ సంస్థ అధినేత ఎలోన్ మస్క్ శుక్రవారం తెలిపారు.ఎలోన్ మస్క్ 2022 చివరిలో 44 బిలియన్ల డాలర్లు వెచ్చించి ట్విటర్‌ను కొనుగోలు చేశారు. ఆ తర్వాత జరిగిన పలు పరిణామాల అనంతరం గత ఏడాది జులైలో ట్విటర్‌ను ఎక్స్. కామ్‌గా రీ బ్రాండ్ చేస్తున్నట్లు మస్క్ వెల్లడించారు. అయితే నిన్నటి వరకు ట్విటర్ లోగో, బ్రాండింగ్ మారింది. కానీ డొమైన్ పేరు ట్విటర్‌గా కొనసాగుతూ వచ్చింది. తాజాగా ట్విటర్.కామ్ డొమైన్ స్థానంలో ఇప్పుడు ఎక్స్.కామ్ వచ్చి చేరినట్లు మస్క్ ట్వీట్లో పేర్కొన్నారు. పోస్ట్ పోస్ట్ చేయడం, లైక్ చేయడం, బుక్‌మార్క్ చేయడం లేదా రీట్వీట్ చేసేందుకు గాను యూజర్లు కొద్ది మొత్తంలో చెల్లింపులు చేయాల్సి ఉంటుందని గత నెలలో మస్క్ ప్రకటించారు. ఆ మొత్తం సబ్స్క్రిప్షన్ ఏడాదికి రూ.100లోపు ఉంటుందని అంచనా. ప్రస్తుతానికి ఈ సబ్స్క్రిప్షన్ పద్దతి న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్‌లో పరీక్షిస్తున్నారు. త్వరలో దీనిని ప్రపంచ వ్యాప్తంగా అమలు చేసేందుకు మస్క్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 2,500 కంటే ఎక్కువమంది ఫాలోవర్స్ కలిగి ఉన్న యూజర్ అకౌంట్లు ఎక్స్.కామ్‌లో ప్రీమియం ఫీచర్లను ఉచితంగా అందిస్తున్నట్లు మస్క్ ప్రకటించారు. 5000 కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న అకౌంట్లకు ప్రీమియం ప్లస్ ఉచితంగా లభిస్తుంది అని మస్క్ ట్వీట్లో పేర్కొన్నారు. -
ఏలియన్స్ ఉన్నట్లా? లేనట్లా?.. ఇంతకీ మస్క్ ఏమన్నారంటే?
ఏలియన్స్.. ఎప్పుడైనా.. ఎవరికైనా ఇంట్రెస్ట్ కలిగించే టాపిక్. ఎలియన్స్ ఉన్నాయా..? లేవా అనేది ఎప్పటికీ తేలని ప్రశ్నే..! అయితే.. ఇప్పుడు ఇదే విషయంపై స్పందించారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. ఎలియన్స్ లేవని తేల్చేశారు. ఏలియన్స్ నిజంగానే ఉన్నాయా..? అవి భూమ్మిదకు వచ్చాయా..? అప్పుడప్పుడు ఆకాశంలో కనిపించే UFOలు ఏలియన్స్‌వేనా..? ఇవి ప్రశ్నలు కాదు..! కొన్ని దశాబ్దాలుగా అందరినీ వేధిస్తున్న అనుమానాలు..! ఏలియన్స్ ఉన్నాయని.. మనుషులతో కాంటాక్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయని.. ఏదో ఒక సమయంలో కచ్చితంగా భూమిపైకి వస్తాయని నమ్మేవారు కొందరైతే.. అసలు ఏలియన్సే లేవని ఈజీగా కొట్టిపారేసేవారు మరికొందరు. ఇప్పుడు ఈ సెకండ్ లిస్ట్‌లోకి యాడ్ అయ్యారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. ఏలియన్స్ ఉన్నాయనేందుకు అసలు ఆధారాలే లేవని తేల్చిపారేశారు.ఎలాన్ మస్క్..! ఈ జనరేషన్‌కు పరిచయం అవసరం లేని పేరు..! తన మాటలు.. తన చేతలు.. తన ప్రయోగాలు.. అన్ని సెన్సేషనే..! ఎప్పుడూ వార్తల్లో ఉండే ఎలాన్ మస్క్.. కొత్త ప్రయోగాలు చేస్తూ.. కొత్త కొత్త టెక్నాలజీలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఎప్పుడూ ఏదో ఒక ప్రాజెక్టును చేపడుతూనే ఉంటారు. ఈ టెక్నాలజీలో కచ్చితంగా తన మార్క్‌ను చూపించిన ఘనత ఎలాన్ మస్క్‌కే దక్కింది. టెస్లా పేరుతో తయారు చేసిన కార్లు ఎంత పెద్ద హిట్టో.. మనిషి బ్రెయిన్లో చిప్ పెట్టేందుకు చేసిన ప్రయోగమూ అంతే సెన్సేషన్‌గా నిలిచింది. ఇదొక్కటే కాదు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో..! స్పేస్ ఎక్స్ పేరుతో శాటిలైట్లు లాంచ్ చేసినా.. సోషల్ మీడియా సెన్సేషన్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసి ఎక్స్ అని పేరు మార్చినా అది.. ఎలాన్ మస్క్‌కే సాధ్యం.అలాంటి ఇలాన్ మస్క్.. ఏలియన్స్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేపుతున్నాయి.. ఏలియన్స్ లేవని మస్క్ తేల్చిపారేశారు. ఏలియన్స్ ఉనికిపై తనకు ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు. HOW TO SAVE THE HUMANS పేరుతో జరిగిన డిబేట్లో పాల్గొన్న మస్క్.. ఏలియన్స్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఏలియన్స్ అనే జీవులు ఏవీ భూమిపై కాలు పెట్టలేదని తేల్చేశారు. కక్షలో స్పేస్ ఎక్స్‌కు చెందిన వేలాది బ్రాడ్ బ్యాండ్ స్పేస్ క్రాఫ్ట్‌లు ఉన్నాయని.. కానీ ఎప్పుడూ ఏలియన్స్ ఉనికి కనిపించలేదని తన వాదనలు వినిపించారు. అయితే.. ఎవరైనా ఆధారాలు చూపిస్తే మాత్రం ఏలియన్స్‌పై ప్రయోగాలు చేసేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. అయితే.. ఆషామాషీగా కాకుండా.. సీరియస్ ఆధారాలతోనే రావాలని చెప్పారు. కానీ.. ఎవరూ అలాంటి ఆధారాలు తీసుకురాలేరని.. ఏలియన్స్ ఉనికే లేదని చెప్పేశారు.మరి నిజంగానే ఏలియన్స్ లేవా..? లేక మనషులకు దూరంగా ఉన్నాయా..? ఏలియన్స్ ఉంటే.. ఎప్పటికైనా భూమిపైకి వచ్చి మనుషులకు కనిపిస్తాయా..? ఎలన్ మస్క్ అవన్నీ ఉత్తమాటలే అని కొట్టిపారేసినా మిలియన్ డాలర్ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి..! -
ఇండియాలో 2.12 లక్షల మందికి షాకిచ్చిన ఎలాన్ మస్క్!
ఎలాన్ మస్క్ (Elon Musk) నేతృత్వంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్ కార్ప్' (ట్విటర్) భారత్‌లోని 2 లక్షల మందికి పైగా యూజర్లకు పైగా షాకిచ్చింది. పిల్లలపై లైంగిక దాడులు, అశ్లీలతను, ఉద్రిక్తతలను ప్రోత్సహించే కంటెంట్ కట్టడిలో భాగంగా ఒక నెల వ్యవధిలో ఏకంగా 2,12,627 ఖాతాలను నిషేధించింది. ఫిబ్రవరి 26 నుండి మార్చి 25 వరకు భారతీయ సైబర్‌స్పేస్‌లో ఉగ్రవాదాన్ని ప్రచారం చేసినందుకు 1,235 ఖాతాలను కూడా తొలగించినట్లు ఈ సోషల్ మీడియా దిగ్గజం వెల్లడించింది. 2021 కొత్త ఐటీ నిబంధనలకు కట్టుబడి ఎక్స్ కార్ప్ తన నెలవారీ నివేదికలో ఈ చర్యలను వెల్లడించింది. మొత్తంగా ఈ రిపోర్టింగ్ సైకిల్లో దేశవ్యాప్తంగా 213,862 ఖాతాలపై ఎక్స్ నిషేధం విధించింది. ఎక్స్ కార్ప్ ప్రకారం, ఫిబ్రవరి 26 నుండి మార్చి 25 వరకు భారతీయ వినియోగదారుల నుండి 5,158 ఫిర్యాదులు అందాయి. తమ గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజం ద్వారా వీటిదని కంపెనీ పరిష్కరించింది. అంతేకాకుండా, ఖాతా సస్పెన్షన్లకు వ్యతిరేకంగా అప్పీళ్లకు సంబంధించిన 86 ఫిర్యాదులను కంపెనీ ప్రాసెస్ చేసింది. -
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ బీజేపీలో చేరుతున్నారా?
న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల తరుణంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రకాష్ రాజ్ బీజేపీలో చేరుతున్నారని సోషల్ ప్రచారం జోరందుకుంది. అయితే, తాను బీజేపీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై విలక్షణ నటుడు కొట్టిపారేశారు. దిస్కిన్ డాక్టర్ అనే ఎక్స్ అకౌంట్ యూజర్.. ప్రకాష్ రాజ్ బీజేపీలోకి చేరుతున్నారంటూ ట్వీట్ చేశారు. నిమిషాల వ్యవధిలో వైరల్‌గా మారింది. ప్రకాష్ రాజ్ స్పందన కంటే ముందే దాదాపు మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇక ఆ ట్వీట్‌కు విలక్షణ నటుడు స్పందించారు. ‘నన్ను కొనేంత సైద్ధాంతిక బలం బీజేపీకి లేదని’ వ్యంగ్యంగా స్పందించాడు ప్రకాష్ రాజ్. I guess they tried 😂😂😂 must have realised they were not rich enough (ideologically) to buy me.. 😝😝😝.. what do you think friends #justasking pic.twitter.com/CCwz5J6pOU — Prakash Raj (@prakashraaj) April 4, 2024 ఈ ఏడాది జనవరిలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు రాజకీయ పార్టీలు టికెట్ ఆఫర్ చేస్తున్నాయని అన్నారు. తాను మోదీని విమర్శిస్తున్నాను కాబట్టే టికెట్ ఇచ్చేందుకు ముందుకు వచ్చాయని, తన సిద్ధాంతాలు నచ్చి కాదని పేర్కొన్నారు.అలాంటి ట్రాప్‌లో తాను పడబోనన్న ప్రకాశ్ రాజ్.. తనను సంప్రదించిన పార్టీలేవో చెప్పలేదు. కాగా, 2019 సార్వత్రిక ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రకాశ్ రాజ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. -
యూట్యూబ్ టీవీకి పోటీగా ఎక్స్ టీవీ యాప్!
ఎక్స్.కామ్ బాస్ ఎలోన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. యూట్యూబ్ టీవీకి పోటీగా త్వరలో అమెజాన్, శామ్సంగ్ వినియోగదారుల కోసం టీవీ యాప్‌ను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు ఫార్చ్యూన్ మ్యాగజైన్ రిపోర్ట్ వెలుగులోకి వచ్చాయి. దీనిపై స్పందించిన మస్క్ స్మార్ట్ టీవీల్లో లాంగ్ ఫార్మ్ వీడియోలు త్వరలో అందుబాటులో తెస్తామని ప్రకటించారు. గతంలో ఎక్స్.కామ్‌ను ఎవ్రీథింగ్ యాప్ మార్చే యోచనలో ఉన్నట్లు మస్క్ వెల్లడించారు. అందుకు అనుగుణంగా యాప్‌లో నగదు లావాదేవీల సేవల్ని అందుబాటులోకి తెచ్చారు. ఆ తర్వాత గత అక్టోబర్‌లో ఎంపిక చేసిన వినియోగదారుల కోసం వీడియో, ఆడియో కాలింగ్ ప్రారంభ వెర్షన్‌ను విడుదల చేశారు. Coming soon https://t.co/JlnlSL7eS9 — Elon Musk (@elonmusk) March 9, 2024 ఇప్పుడు టీవీల్లో ఎక్స్.కామ్ టీవీ యాప్‌ను తెచ్చే పనిలో ఉన్నారు. ఇదే విషయంపై ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు మస్క్ క్లారిటీ ఇచ్చారు. త్వరలో వచ్చేస్తుంది. ఎక్స్.కామ్‌లోని లాంగ్ వీడియోలు టీవీల్లో చూసే వెసలు బాటు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. -
భారత ప్రభుత్వంపై మస్క్ కంపెనీ వ్యతిరేక స్వరం
తమ ప్లాట్‌ఫామ్‌లోని కొన్ని ఖాతాలు, పోస్ట్‌లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని ఎలాన్ మస్క్‌కు చెందిన సోషల్ మీడియా దిగ్గజం ‘ఎక్స్’ (గతంలో ట్విటర్) పేర్కొంది. ప్రభుత్వ ఆదేశాలను తాము పాటిస్తాం కానీ, వారి చర్యలతో ఏకీభవించబోమని ప్రకటించింది. అయితే కంపెనీ ఆరోపణలపై ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. ‘ఎక్స్’కు సంబంధించిన గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్ హ్యాండిల్లో ఈ మేరకు పోస్ట్‌లో వివరాలను కంపెనీ వెల్లడించింది. భారత ప్రభుత్వ చర్యలతో తాము ఏకీభవించడం లేదని, భావప్రకటనా స్వేచ్ఛను హరిస్తూ పోస్ట్‌లను తొలగించడం సరికాదని అభిప్రాయపడింది. అయితే భారత ప్రభుత్వ ఆదేశాలకు కట్టుబడి ఉంటామని తెలిపింది. "ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా భారత్‌లో మాత్రమే ఈ ఖాతాలు, పోస్ట్‌లను నిలిపివేస్తాం. అయినప్పటికీ మేము ఈ చర్యలతో విభేదిస్తున్నాం. ఈ పోస్ట్‌లకు భావప్రకటనా స్వేచ్ఛను కొనసాగిస్తున్నాం" అని పేర్కొంది. ప్రభుత్వ ఉత్తర్వును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ఇంకా పెండింగ్‌లో ఉందని ‘ఎక్స్’ తెలిపింది. ప్రభావిత యూజర్లకు కూడా ఈ చర్యల నోటీసును అందించినట్లు పేర్కొంది. గత ఏడాది జూన్‌లో నిర్దిష్ట సోషల్ మీడియా ఖాతాలు, ట్వీట్లను బ్లాక్ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా ‘ఎక్స్’ వేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. భారత ప్రభుత్వ ఆదేశాలను పాటించనందుకు కంపెనీకి హైకోర్టు రూ.50 లక్షల జరిమానా విధించింది. ఈ విషయంలో ప్రభుత్వ వైఖరిని హైకోర్టు సమర్థించిందని, దేశ చట్టాన్ని కంపెనీ తప్పక పాటించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. -
Elon Musk: మూడు లక్షల కోట్లు తగలెట్టేశాడు
అపర కుబేరుడు ఎలోన్ మస్క్ 21 ఏళ్ల కుర్రాడిపై ప్రతికారం తీర్చుకోవాలని అనుకున్నారు. ఇందుకోసం ఏకంగా రూ.3.50లక్షల కోట్లు తగలేశాడు. ఇప్పుడు ఇదే ప్రపంచ టెక్ వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది. మస్క్ 2022లో ‘వాక్ స్వాతంత్ర్యం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ’. ట్విటర్ (ఇప్పుడు ఎక్స్.కామ్‌గా మారింది) ను కొనుగోలు చేయాలన్న ఆలోచన వచ్చినప్పటి నుంచి ఎలోన్ మస్క్ చెబుతున్న మాటలివి. అత్యంత ప్రభావంతమైన సామాజిక మాధ్యమాల్లో ఒకటైన ట్విటర్లో దీనిపై నియంత్రణ ఉండటం సరికాదన్నది ఆయన అభిప్రాయం. అందుకే ట్విటర్ కొనుగోలు ఒప్పందం పూర్తయిన తర్వాత తొలి సందేశంలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. వాక్ స్వాతంత్ర్యం కాదు.. 21 ఏళ్ల కుర్రాడిపై అయితే మస్క్ ట్విటర్ కొనుగోలు చేయడానికి వాక్ స్వాతంత్ర్యం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కాదని, 21 ఏళ్ల కుర్రాడిపై ఆగ్రహంతో తీసుకున్న నిర్ణయం అంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వినడానికి వింతగా ఉన్నా.. అక్షరాల ఇదే నిజం అంటూ అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ బ్లూమ్‌బెర్గ్ జర్నలిస్ట్ కర్ట్ వాగ్నెర్ (Kurt Wagner) పలు సంచలన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఆయనే స్వయంగా ఓ పుస్తకాన్ని రాశారు. ‘బ్యాటిల్ ఫర్ ద బర్డ్’ బుక్‌లో ట్విటర్ కొనుగోలుకు ముందు అప్పటి సీఈఓ పరాగ్ అగర్వాల్‌కు, ఎలోన్ మస్క్ ఏం జరిగిందో కులంకషంగా వివరించారు. అది 2022 జనవరి నెల. ఆ నెలలో స్పేస్ఎక్స్, టెస్లా కంపెనీలతో యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ‘ఎలోన్ జెట్’ అనే ట్విటర్ అకౌంట్‌ను బ్లాక్ చేయాలని అప్పటి ట్విటర్ సీఈఓ పరాగ్ అగర్వాల్‌ను కోరారు. అందుకు ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఇదే విషయాన్ని బ్యాటిల్ ఫర్ ద బర్డ్‌లో ప్రస్తావించినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదిక సైతం పేర్కొంది. ఎలోన్ జెట్ అకౌంట్ ఎవరిది ఎలోన్ జెట్ ట్విటర్ అకౌంట్ 19 ఏళ్ల కుర్రాడు జాక్ స్వీనీ (Jack Sweeney)ది. అప్పట్లో జాక్ స్వీనీ తన టెక్నాలజీలో తనకున్న అపారమైన తెలివితేటలతో ఎలోన్ మస్క్‌ను బయపెట్టాడు. తన సొంత నైపుణ్యంతో విమానాల కదలికల్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే ఓ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించాడు. అలా ప్రైవేటు వ్యక్తుల విమానాలు ఎప్పుడు.. ఎక్కడ.. ఉన్నాయో ఇట్టే చెప్పేస్తున్నాడు. అందుకోసం ట్విటర్‌ను వేదికగా చేసుకున్నాడు. స్వీనీ ట్రాక్ చేస్తున్న విమానాల్లో ఎలోన్ మస్క్‌తో పాటు ఇతర ప్రముఖులు సైతం ఉన్నారు. 3లక్షలు వద్దు 37లక్షలు కావాలి ఇదే విషయం తెలుసుకున్న మస్క్.. స్వీనీని ట్విటర్లోనే (ఆ ట్వీట్‌ను కింద ఫోటోలో చూడొచ్చు) సంప్రదించారు. తన విమానాల్ని ట్రాక్ చేయడం ఆపాలని కోరారు. స్వీనీ విమానాల్ని ట్రాక్ చేయడం వల్లే తాను ఎంత నష్టపోతున్నానో వివరించారు మస్క్. అందుకు 5,000 (రూ.3.75 లక్షలు) డాలర్లు ఇస్తానని ఆఫర్ చేశారు. కానీ, స్వీనీ అందుకు నిరాకరించాడు. తనకు 50,000 డాలర్లు (దాదాపు రూ.37.55 లక్షలు) కావాలని డిమాండ్ చేశాడు. ఈ మొత్తంతో తాను స్కూల్ ఫీజు చెల్లించడంతో పాటు టెస్లా కారు కొనుక్కుంటానని తెలిపాడు. ‘బ్యాటిల్ ఫర్ ది బర్డ్’ ఈ ఘటన తర్వాత జరిగిన పరిణామాలపై ఈ నెల 20న విడుదల కానున్న బ్యాటిల్ ఫర్ ది బర్డ్‌లో “మస్క్ తన ప్రైవేట్ విమానాన్ని ట్రాక్ చేస్తున్న ట్విటర్ ఖాతాను తొలగించమని అగర్వాల్‌కు విజ్ఞప్తి చేశారు. అగర్వాల్ మస్క్ అభ్యర్థనను తిరస్కరించారు. ఇలా కొద్దిసేపటికే మస్క్ ట్విటర్ షేర్లను కొనుగోలు చేయడం ప్రారంభించారని కర్ట్ వాగ్నెర్ హైలెట్ చేశారు. 2022 అక్టోబర్‌లో ఎలోన్ మస్క్ ట్విటర్‌ని 44 బిలియన్ల డాలర్లకు కొనుగోలు చేశారు. అనంతరం ట్విటర్లో సిబ్బంది తొలగించారు. సగం కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించడమే కాకుండా, పలువురు జర్నలిస్టులతో పాటు జాక్ స్వీనీ ట్విటర్ అకౌంట్ ఎలోన్ జెట్‌ను సస్పెండ్ చేశారు. మస్క్ ట్విటర్‌ను ఎప్పుడు కొనుగోలు చేశారు? ►ఎలోన్ మస్క్ ఏప్రిల్ 14,2022 ఒక్క షేరును 54.20 చొప్పున మొత్తం షేర్లను 44 బిలియన్ డాలర్లకు అంటే (సుమారు రూ.3.50లక్షల కోట్లు) ట్విటర్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటన ►ఏప్రిల్ 25న ట్విటర్ సైతం తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్‌ను మస్క్‌కు అమ్ముతున్నట్లు ధృవీకరించింది. ►మస్క్- ట్విటర్ మధ్య ఫేక్ ట్విటర్ అకౌంట్లపై వివాదం నెలకొంది. పలు దఫాలుగా జరిగిన చర్చల అనంతరం జులై 8న మస్క్ మరో ప్రకటన చేశారు. ట్విటర్‌ను కొనుగోలు చేయడం లేదని, ఫేక్ అకౌంట్లకు సంబంధించి తాను అడిగిన సమాచారాన్ని ఇవ్వడంలో ట్విటర్ విఫలమైందన్న ఆరోపణలతో ఒప్పందాన్ని రద్దు చేసుకోనున్నట్లు వెల్లడించారు. ►ఎట్టకేలకు మస్క్-ట్విటర్ మధ్య కొనుగోలు ఒప్పందం పూర్తయింది. 3.50లక్షల కోట్లు వెచ్చించిన ఈ అపరకుబేరుడు ట్విటర్ బాస్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ట్విటర్‌ను ఎక్స్.కామ్‌గా మార్చారు. ఇప్పుడు దానిని ఎవ్రిథింగ్ యాప్‌గా మార్చే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు మస్క్. -
‘ఈ జీవితానికి ఇది చాలు’ : ఆనంద్ మహీంద్రా
ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా నెటిజన్లు హృదయాల్ని హత్తుకునేలా ఓ వీడియోని షేర్ చేశారు. వీడియో పాతదే. కానీ అందులో ఓ పదేళ్ల బాలుడు ఉన్నట్లు తన మనవళ్లు కూడా ఉంటే ఈ జీవితానికి ఇది చాలు అని అర్ధం వచ్చేలా ట్వీట్లో పేర్కొన్నారు. ఇంతకీ ఆ వీడియో ఏంటి? హృదయాల్ని హద్దుకునేలా ఆ వీడియోలో ఏముంది? ఈ సంఘటన 2022లో జరిగిన అర్జెంటీనా ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లోనిది. ఈ మ్యాచ్‌లో బోకా జూనియర్స్తో ఓడిపోయిన తర్వాత డిఫెన్సా వై జస్టిసియా టీం గోల్ కీపర్ ఎజెక్వియెల్ అన్‌సైన్ ఓటమి తట్టుకోలేక తన రెండు చేతుల్ని మైదానానికి వేసి గుద్దుతున్నాడు. అది చూసిన ఓ పదేళ్లు బాలుడు అయ్యో పాపం అనుకుంటూ తనని ఓదార్చేందుకు గ్రౌండ్లోకి దూసుకు వచ్చాడు. అనంతరం ఎజెక్వియెల్ను హత్తుకుని ఓదార్చాడు. ఆ వీడియోనే ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. అలాగే ‘నా ఇద్దరు మనవలూ నన్ను చూసేందుకు త్వరలో వస్తున్నారు. ఈ వీడియోలో కుర్రాడికి ఉన్నట్టే వాళ్లకి కూడా మంచి మనసు ఉంటే చాలు. అంతకుమించి ఇంకేమీ కోరుకోను’ అని కామెంట్ చేశారు. ఆనంద్ మహీంద్రా రీపోస్ట్ చేసిన ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. This little boy apparently ran on to the pitch after a match to console the losing goalkeeper. My 2 young grandsons will soon be visiting us & I would wish for nothing more than for them to have hearts as empathetic & large as this kid’s.. pic.twitter.com/fQ3uLbHo97 — anand mahindra (@anandmahindra) February 11, 2024 -
‘ఏం చేయనున్నారు’..ఫోన్‌కు దూరంగా ఎలోన్ మస్క్!
టెక్ మొఘల్ ఎలోన్ మస్క్ ఇకపై తాను కొన్ని నెలల పాటు ఫోన్‌ను వినియోగించడం లేదని ఎక్స్.కామ్‌లో పోస్ట్ చేశారు. ఆడియో, వీడియో కాల్స్ కోసం ఎక్స్.కామ్‌ను వినియోగిస్తున్నట్లు చెప్పారు. మస్క్ ట్విట్లో ఏమన్నారంటే.. ‘నేను కొన్ని నెలల పాటు ఫోన్‌ను వినియోగించడం మానేస్తున్నాను. బదులుగా ఆడియో, వీడియో కాల్స్ కోసం ఎక్స్.కామ్‌ను ఉపయోగిస్తున్నా’ అని ట్వీట్లో పేర్కొన్నారు. In a few months, I will discontinue my phone number and only use X for texts and audio/video calls — Elon Musk (@elonmusk) February 9, 2024 మస్క్ ఎక్స్.కామ్‌ను ఎవ్రిథింగ్ యాప్‌గా మారుస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా ఎక్స్.కామ్‌లో ట్వీట్లు మాత్రమే కాకుండా ఆడియో, వీడియో కాల్స్ మాట్లాడుకునేందుకు గత ఏడాది అక్టోబర్ కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చారు. అయితే మస్క్ ఎక్స్.కామ్‌ను ప్రమోట్ చేసేందుకు ఫోన్‌కు దూరంగా ఉంటున్నారంటూ పలు నివేదికకు వెలుగులోకి వచ్చాయి. 2023లో ఎక్స్.కామ్‌లో ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే ‘ఎర్లీ వెర్షన్ ఆఫ్ వీడియో అండ్ ఆడియో కాలింగ్ ఆన్ ఎక్స్’ ఫీచర్‌ను అందించడం ప్రారంభించారు. ఎక్స్.కామ్ వెబ్సైట్ ప్రకారం.. ఎక్స్.కామ్ యూజర్లందరికి కాల్స్ చేసుకునే సదుపాయం లేదు. కేవలం ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకున్న యూజర్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది అని వెల్లడించింది. -
‘క్లిక్ చేస్తే ఖల్లాస్’.. ప్రపంచంలోనే భారీ డేటా చోరీ!
ఇంటర్నెట్ యూజర్లకు, అమెరికాతో పాటు పలు దేశాల ప్రభుత్వాలకు సైబర్ నేరస్తులు షాకిచ్చారు. అమెరికా ప్రభుత్వ కార్యాలయాలకు చెందిన డేటాను చోరీ చేశారు. దీంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 26 బిలియన్ల యూజర్ల డేటా చోరీకి గురైనట్లు డిస్కవరీ, సైబర్ న్యూస్ సంస్థలకు చెందిన రీసెర్చర్లు నిర్ధారించారు. సైబర్ నేరస్తులు సేకరించిన డేటా మొత్తం ‘మదర్ ఆఫ్ ఆల్ బ్రీచెస్’ అనే అన్ సెక్యూర్ పేజీలో ఉందని తెలిపారు. ఈ సందర్భంగా లీకైన ఈ డేటాను చైనా మెసేజింగ్ జెయింట్ టెన్సెంట్, వైబో, అడోబ్, కాన్వా, లింక్డిన్, ఎక్స్.కామ్, టెలిగ్రాం ద్వారా సేకరించినట్లు తమ పరిశోధనల్లో గుర్తించినట్లు రీసెర్చర్లు అన్నారు. ఇక యూజర్ల డేటాతో పాటు అమెరికా, ప్రపంచంలోని ఆయా దేశాల ప్రభుత్వ డేటా సైతం సైబర్ నేరస్తుల చేతుల్లోకి వెళ్లినట్లు తేల్చారు. డేటాతో ఏం చేస్తారంటే? ఇక సైబర్ నేరస్తులు( థ్రెట్ యాక్టర్స్) తస్కరించిన డేటాను ఉపయోగించి భారీ మొత్తంలో సైబర్ దాడులు, యూజర్ల బ్యాంక్ అకౌంట్లతో పాటు ఇతర వ్యక్తిగత సమాచారం, ఫిషింగ్ స్కామ్స్, కొన్ని సంస్థల్ని లేదంటే, కంప్యూటర్లను లక్ష్యంగా చేసుకుని వాటిపై సైబర్ దాడులు చేసేందుకు వీలుగా ఉపయోగిస్తారని రీసెర్చర్లు వెల్లడించారు. ఆ ధీమా వద్దు అయితే, డేటా చోరీతో సైబర్ నేరగాళ్లు ఏమి చేస్తారులే’ అనే ధీమాతో కాకుండా దొంగిలించిన డేటాతో ఏం చేయొచ్చు? ఒకవేళ వినియోగిస్తే వాటి పర్యవసనాలు ఏ విధంగా ఉంటాయో గుర్తించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఈఎస్ఈటీ గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ అడ్వైజర్ జేక్మూర్ అన్నారు. ఫోన్, మెయిల్స్, వాట్సాప్ ఆడియోకాల్స్ తో పాటు ఇతర అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయొద్దని, అలాంటి లింక్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశారు. గతాన్ని గుర్తు చేసిన రీసెర్చర్లు ఈ సందర్భంగా ఇదే తరహాలో సైబర్ నేరస్తులు 2019లో వెరిఫికేషన్.ఐఓ తయారు చేసిన ఎలాంటి భద్రత లేని డేటాబేస్ నుంచి దాదాపు వన్ బిలియన్ రికార్డులు డేటా లీకైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఆ సమయంలో, ఇదే అతిపెద్ద, అత్యంత హానికరమైన లీకేజీల్లో ఒకటిగా పేరొందింది. ఈ డేటా చౌర్యం మైస్పేస్ (360 మిలియన్లు), ట్విటర్ (281 మిలియన్లు), లింక్డిన్ (251 మిలియన్లు), అడల్ట్ఫ్రెండ్ఫైండర్ (220 మిలియన్లు) వంటి సోషల్ నెట్ వర్క్ యూజర్లదని డిస్కవరీ, సైబర్ న్యూస్ రీసెర్చర్లు స్పష్టం చేశారు. -
3 లక్షల కోట్లు పెట్టి కొంటే ఎలాన్ మస్క్‌ను నట్టేటా ముంచేస్తోందా?
అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌కు తన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఎక్స్.కామ్ ఊహించని షాక్ ఇచ్చింది. ఆ సంస్థను కొనుగోలు చేసిన నాటి నుంచి అంటే అక్టోబర్ 2022 నుంచి డిసెంబర్ 20,2023 వరకు ఎక్స్. కామ్ విలువ 71.5 శాతం కోల్పోయింది. తాజాగా మస్క్ సెక్యూరిటీ ఫైలింగ్‌లో ఇదే విషయాన్ని తెలిపారు. ఎలాన్ మస్క్.. ట్విటర్ కొనుగోలు టెక్ ప్రపంచంలో అతిపెద్ద డీల్. ఈ కొనుగోలు విలువ అక్షరాల 44 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 3.37 లక్షల కోట్లు). అయితే మస్క్ ట్విటర్‌ను సొంతం చేసుకున్న తర్వాత అందులో చేసిన మార్పులు, కొత్తగా తెచ్చిన సబ్స్క్రిప్షన్ సేవలతో పాటు ఇతర కారణాల వల్ల యూజర్లు భారీగా తగ్గారు. 12.5 బిలియన్ డాలర్లు ఎక్స్.కామ్ విలువ పైగా స్టార్టప్స్‌తో పాటు పలు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలు ఎక్స్.కామ్‌లో యాడ్స్‌ను ఇవ్వడాన్ని నిషేధించాయి. కంటెంట్ నియంత్రణపై ఆందోళనలు వంటి అంశాలు తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా సంస్థ విలువ 12.5 బిలియన్ డాలర్లకు చేజారింది. 15 శాతం తగ్గిన నెలవారి యూజర్లు ఫిడిలిటీ ఇన్వెస్ట్మెంట్స్ నివేదిక ప్రకారం.. మస్క్ ట్విటర్‌ను అక్టోబర్ 2022లో కొనుగోలు చేయగా.. జులై,2023న దాని పేరును ఎక్స్.కామ్‌గా మార్చారు. అదే సమయంలో ట్విటర్‌ను కొనుగోలు అనంతరం ప్రారంభ దశలో నెలవారి యూజర్లు 15 శాతం తగ్గినట్లు ఫిడిలిటీ పేర్కొంది. ట్విటర్ సంస్థలోకి బాస్‌గా అడుగుపెట్టిన మస్క్.. వచ్చీరాగానే 50 శాతం ఉంది ఉద్యోగుల్ని ఫైర్ చేశారు. అదే సమయంలో అన్నీ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లలో కంటే ట్విటర్లో సమాచారం అంతా నిరాధారమైనవి అంటూ యురోపియన్ యూనియన్ మస్క్‌కు వార్నింగ్ ఇచ్చాయి. యాక్సియోస్ రిపోర్ట్ ఆధారంగా.. నవంబర్ 2023 వరకు ఎక్స్. కామ్ నష్టాల్ని పరిణామాలను పరిగణనలోకి తీసుకకుంది. నవంబర్‌లో ప్రకటనలు ఆగిపోవడంతో ఎక్స్.కామ్ విలువ 10.7 శాతం నష్టపోయింది. నవంబర్‌లో డిస్నీ, యాపిల్, కోకా కోలాతో సహా ప్రధాన ప్రకటనదారులు ఎలాన్ మస్క్ యాంటిసెమిటిక్ పోస్ట్‌లకు ఆమోదించడం ఆగ్నికి ఆజ్యం తోడైనట్లు.. దిగ్గజ కంపెనీలు ఎక్స్. కామ్‌లో యాడ్స్ ఇవ్వడాన్ని నిలిపివేశారు. -
‘ఎక్స్’లో పోస్టులు మాయం.. యూజర్ల గగ్గోలు!
మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫాం ఎక్స్ (ట్విటర్) సేవల్లో తరచూ అంతరాయం కలుగుతోంది. ఇటీవల మొరాయించిన ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం రోజుల వ్యవధిలో మళ్లీ స్తంభించడంతో యూజర్ల గగ్గోలు పెడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో గురువారం ఉదయం 11 గంటల తర్వాత ‘ఎక్స్’ సేవల్లో అంతరాయం ఏర్పడింది. అకౌంట్‌ను యాక్సెస్ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు విఫలం కావడంతో ఏం జరిగిందో తెలియక లక్షలాదిమంది యూజర్లు గందరగోళానికి గురయ్యారు. వెబ్సైట్, మొబైల్ యాప్ ఓపెన్ అవుతున్నా.. అసంపూర్తిగా ఉండడంతోపాటు పోస్టలు చేసేందుకు వీలు లేకుండా పోయింది. తమ పోస్టులు కూడా కనిపించకుండా పోయాయని కొందరు యూజర్లు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. తమకు ఎక్స్ అకౌంట్ యాక్సెస్ లభించలేదంటూ 67 వేల మందికిపైగా ఫిర్యాదు చేశారు. ఇండియన్ వెర్షన్ వెబ్‌సైట్స్‌కు ఇలాంటి ఫిర్యాదులు 4,800 వచ్చాయి. అయితే సేవల్లో అంతరాయంపై ఎక్స్ ఎలాంటి స్పందనా రాలేదు. -
‘నాకు చావంటే భయం లేదు’.. ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు!
అమెరికన్ బిజినెస్ టైకూన్ ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘కొంత మంది ప్రాణం పోతుందంటే భయపడ్తారు. నాకు చావంటే భయం లేదు.’’ అన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు బిజినెస్ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. అంతేకాదు అమెరికా ప్రభుత్వం నా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్ ఎక్స్.కామ్‌పై ఆంక్షలు విధిస్తే జైలుకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. మస్క్ చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేంతం కాన్స్పరెసి థియరిస్ట్ (Conspiracy theorist) అలెక్స్ జోన్స్ 2012లో శాండీ హుక్ స్కూల్ కాల్పుల ఘటనపై తప్పుడు ప్రచారం చేశారు. ఆ సమయంలో అలెక్స్ చేసిన వ్యాఖ్యలు తమ సంస్థ పాలసీలకు విరుద్ధంగా ఉన్నాయంటూ 2018లో ట్విటర్ (ఎక్స్.కామ్) ఆయన అకౌంట్‌ను బ్లాక్ చేసింది. గత ఏడాది ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత అలెక్స్ జోన్స్ ట్విటర్ అకౌంట్‌ను రీఓపెన్ చేస్తారా? అన్న ప్రశ్నలు లేవనెత్తడంపై మస్క్ స్పందించారు. వ్యూస్ కోసం ఎంతకైనా తెగిస్తారు ‘‘జోన్స్ యూజర్ల కోసం, వారి నుంచి వచ్చే వ్యూస్ కోసం ఎంతకైనా తెగిస్తారు. తన ఇన్ఫోవార్స్ వెబ్సైట్, య్యూట్యూబ్, ట్విటర్లో యూజర్లను సంపాదించేందుకు శాండీ హుక్ స్కూల్ పిల్లల మరణాలను జోన్స్ ఉపయోగించుకున్నారని’’ మస్క్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జోన్స్ ట్విటర్ అకౌంట్‌ను తిరిగి ఓపెన్ చేసేందుకు నిరాకరించారు. ముందు ట్రంప్.. ఆ తర్వాత జోన్స్ అకౌంట్ ఈ నేపథ్యంలో మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్లాక్ చేసిన ట్విటర్ అకౌంట్‌ను అన్‌బ్లాక్ చేశారు. సరిగ్గా నెల రోజుల తర్వాత గత శనివారం అలెక్స్ జోన్స్ ట్విటర్ అకౌంట్‌ను పునప్రారంభించాలా? వద్దా? అంటూ ఎక్స్. కామ్‌లో ఓ పోల్ పెట్టాడు మస్క్. మస్క్ పెట్టిన పోల్‌ను వీడియో తీసిన జోన్స్.. తన ట్విటర్ అకౌంట్‌పై నిషేధం ఎత్తివేసేలా తనకు అనుకూలంగా ఓటు వేయమని తన సపోర్టర్లకు పిలుపునిచ్చారు. పోల్ ముగిసిన కొన్ని గంటల తర్వాత ఇప్పుడు డిసెంబర్ 10న అదే బ్లాక్ లిస్ట్‌లో ఉన్న జోన్స్ అకౌంట్‌ను ఎక్స్.కామ్ బాస్ ఎలాన్ మస్క్ తిరిగి వినియోగించుకునేలా అనుమతి ఇచ్చారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చర్చా వేదికలో మస్క్ మరణంపై రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న వివేక్ రామస్వామి ‘ఎక్స్ స్పేస్’ అనే ఆన్లైన్ చర్చా వేదికలో పాల్గొన్నారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్షర్ మారియో నౌఫల్ దీన్ని నిర్వహించారు. ఈ లైవ్ ఆడియో చర్చా వేదికలో పాల్గొన్న మస్క్‌ను ఉద్దేశిస్తూ జోన్స్ ఇలా అన్నారు. జాన్ కెన్నెడీని హత్య చేసినట్లు ‘‘మస్క్ 43ఏళ్ల వయస్సులోనే అమెరికాకు 35వ అధ్యక్షుడైన జాన్ కెన్నెడీని హత్య చేసినట్లు, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేసేందుకు గూఢాచార సంస్థలు కుట్రలు పన్నుతున్నాయి. వారు ఇప్పటికే ప్రణాళికలు, బ్లూప్రింట్లతో సిద్ధం ఉన్నారు. ప్రస్తుతం ట్రంప్‌పై విషప్రయోగం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని గట్టిగా చెప్పగలను. ట్రంప్ తర్వాత నువ్వే. నిన్ను చంపకపోవచ్చు. కానీ విష ప్రయోగం జరగుతుంది’’ అని వ్యాఖ్యానించారు. చావా.. దానితో పెద్దగా పరిచయం లేదు అందుకు జోన్స్ వ్యాఖ్యలపై స్పందిస్తూ జోన్స్ ‘‘కొంతమంది చనిపోవడానికి భయపడతారు. కానీ నేను అలా కాదు. నాకు చావంటే భయం లేదని చెప్పాడు. ప్రస్తుతం ఈ అంశం వ్యాపార వర్గాల్లో కలకలం రేపుతుండగా.. మస్క్‌కు ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఎలాన్ మస్క్‌కి ఊహించని షాక్!
అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌కి ఊహించని షాక్ తగిలింది. మస్క్ యాజమాన్యంలోని సోషల్ మీడియా దిగ్గజం ‘ఎక్స్’లో అడ్వటైజ్ చేసుకునేందుకు డజన్ల కొద్దీ ప్రముఖ బ్రాండ్లు వెనక్కి తగ్గాయి. దీంతో ఎక్స్‌కు వచ్చే ప్రకటనల ఆదాయం ఏడాదికి 75 మిలియన్లు (దాదాపు రూ. 625 కోట్లు) నష్టపోవచ్చని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది . గత వారం ఎక్స్‌లో హిట్లర్, నాజీ పార్టీలకు మద్దతు పలుకుతూ కొన్ని పోస్ట్‌లు దర్శనమిచ్చాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వాల్ట్ డిస్నీ, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీతో సహా పలు కంపెనీలు ఎక్స్‌లో తమ అడ్వటైజ్లను నిలిపివేశాయి. ఈ తరుణంలో యాపిల్, ఒరాకిల్‌తో సహా ప్రధాన బ్రాండ్లకు సంబంధించిన ప్రకటనల పక్కన అడాల్ఫ్ హిట్లర్, నాజీ పార్టీకి మద్దతు తెలిపే పోస్ట్‌లు దర్శనమిచ్చాయి. దీనిపై స్వచ్ఛం సంస్థ మీడియా మేటర్స్ ఎక్స్‌పై పరువు నష్టం దావా వేసింది. బైబై ఎక్స్ ఈ వారం న్యూయార్క్ టైమ్స్ నివేదికలో ఎయిర్‌బీఎన్‌బీ, అమెజాన్, కోకోకోలా, మైక్రోసాఫ్ట్ కంపెనీలు 200 కంటే ఎక్కువ యాడ్స్‌ను ఎక్స్‌లో డిస్ప్లే చేశాయి. అయితే వీటిలో చాలా కంపెనీలు తమ యాడ్స్‌ను నిలిపేవేసే ఆలోచనలో ఉన్నట్లు టైమ్స్ నివేదిక పేర్కొంది. క్రమంగా తగ్గుతున్న ఆదాయం ఈ శుక్రవారం ఎక్స్‌కు వచ్చే 11 మిలియన్ల (దాదాపు రూ. 92 కోట్లు) ఆదాయం తగ్గినట్లు తెలుస్తోంది. కంపెనీలు ఎక్స్‌లో తమ ఉత్పత్తుల గురించి ప్రకటనలు చేసేందుకు మక్కువ చూపకపోవడంతో పాటు పెరిగిపోతున్న ఇతర ఖర్చులు కారణంగా ఎక్స్ ద్వారా వచ్చే ఆదాయంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నట్లు నివేదిక హైలెట్ చేసింది. అయితే, యాడ్స్ తగ్గిపోవడం, ఆదాయం వంటి అంశాలపై ఎక్స్ యాజమాన్యం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. -
దేశం మొత్తం ఇవే స్కాములు, ‘పిగ్ బుచరింగ్’పై నితిన్ కామత్!
ప్రముఖ ఆన్లైన్ ట్రేడింగ్ సంస్థ జిరోదా వ్యవస్థాపకుడు, సీఈఓ నితిన్ కామత్ సోషల్ మీడియా యూజర్లకు హెచ్చరికలు జారీ చేశారు.‘పిగ్ బుచరింగ్’ స్కామ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ పిగ్ బుచరింగ్ స్కామ్‌లు వందల నుంచి కోట్లలో జరుగుతున్నాయని ఎక్స్ (ట్వీట్టర్)లో పోస్ట్ చేశారు. పిగ్ బుచరింగ్ అంటే? పిగ్ బుచరింగ్ అనేది ఓ సైబర్ స్కామ్. ఆన్లైన్లో ఫేక్ మెసేజ్‌లు, యూజర్లను నమ్మించేలా ఫేక్ పేమెంట్లతో బురిడి కొట్టించి సొమ్ము చేసుకునే లాంటింది. ఈ కుంబకోణాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కామత్ పలు జాగ్రత్తలు చెప్పారు. పిగ్ బుచర్స్ ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లను క్రియేట్ చేసుకుంటారు. ఆన్లైన్లో యాక్టీవ్‌గా ఉండే యూజర్ల నమ్మకాన్ని గెలుచుకునేలా ఆ ఫేక్ ప్రొఫైల్‌తో ప్రేమ, ఫ్రెండ్షిప్ పేరుతో దగ్గరవుతారు. ఒక్కసారి యూజర్లు పిగ్ బుచర్స్‌ను నమ్మితే చాలు. ఇక వాళ్ల పని మొదలు పెడతారు.ఫేక్ జాబ్స్, అధికమొత్తంలో డబ్బులు సంపాదించుకునే అవకాశాల్ని కల్పిస్తున్నామంటూ ఆశచూపిస్తారు. ఆపై యూజర్ల అకౌంట్లలో ఉన్న మొత్తాన్ని దోచుకుంటారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఈ తరహా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని కామత్ చెప్పారు. ఇలాంటి వాటిని ఎవరూ ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని సలహా ఇచ్చారు. ఈ స్కాములు ఏ స్థాయిలో ఉంటాయంటే? ఈ తరహా సైబర్ స్కాములు ఏ స్థాయిలో ఉంటాయంటే.. సైబర్ నేరస్తుల చేతుల్లో మోసపోతున్నామని తెలియకుండా.. మరో స్కామ్‌లో ఇరుక్కుపోతారని కామత్ తన పోస్ట్‌లో చెప్పారు. ఎక్కువ మంది బాధితులు అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగాల ఉన్నాయంటూ ఫేక్ కంపెనీల నుంచి వచ్చే కాల్స్‌ను నమ్మి మోసపోతున్నారని తెలిపారు. అంతేకాదు యూజర్లను నమ్మించేలా జెండర్ మార్చి మారుపేర్లతో సోషల్ మీడియా అకౌంట్లను ఉపయోగిస్తారని జిరోధా సీఈఓ చెప్పారు. మయన్మార్ కేంద్రంగా ఏర్పాటు చేసిన ఓ ఫేక్ కంపెనీ చేసిన పిగ్ బుచర్స్ స్కామ్‌లో 16 మంది భారతీయులు మోసపోయినట్లు వెలుగులోకి వచ్చిన కథనాల్ని సైతం షేర్ చేశారు. పిగ్ బుచర్స్‌తో అప్రమత్తం ►వాట్సప్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, డేటింగ్ యాప్‌లలో అనుమానాస్పద మెసేజ్‌లకు రిప్లయి ఇవ్వకూడదు ►ఎవరైనా మిమ్మల్ని కొత్త యాప్‌లను డౌన్లోడ్ చేయమని లేదా లింక్‌లను క్లిక్ చేయమని అడిగితే వెంటనే వాటిని డిలీట్ చేయండి, లేదంటే నెంబర్‌ను బ్లాక్ చేయండి. ► స్కామర్లు యూజర్ల ఆశలు, భయాలు, కలలు, దురాశ వంటి భావోద్వేగాలతో ఆడుకుంటారు. ఎప్పుడూ తొందరపడి స్పందించొద్దు ► భయపడవద్దు. తొందర పడి తీసుకునే నిర్ణయాలతో ఇబ్బందులకు గురవుతుంటారు. ►అనుమానం వచ్చిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు, లాయర్లను సంప్రదించండి. ►ఎవరైనా ఉద్యోగం లేదా అధిక మొత్తంలో డబ్బులు సంపాదించుకునే అవకాశాలున్నాయని, ఇందుకోసం డబ్బులు కట్టాలని అడిగితే అది మోసంగా భావించాలి. ►ఆధార్, పాస్‌పోర్ట్ వంటి వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు, పెట్టుబడి వివరాలు ఇతర ఆర్ధిక పరమైన విషయాల్ని ఎవరితో పంచుకోవద్దని జిరోధా సీఈవో నిఖిల్ కామ్ యూజర్లను కోరారు. -
ఎలాన్ మస్క్ కొత్త ఎత్తుగడ! ఆదాయం కోసం ఎంత పని చేస్తున్నాడో తెలుసా?
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (గతంలో Twitter) అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) కొత్త ఎత్తుగడ వేశాడు. ‘ఎక్స్’లో ప్రస్తుతం వాడుకలో లేని యూజర్ అకౌంట్లను (Handles) అమ్మి సొమ్ము చేసుకోవాలనుకున్నాడు. ప్రముఖ అంతర్జాతీయ వార్తా పత్రిక ‘ఫోర్బ్స్’కు లభించిన ఈమెయిల్ల ప్రకారం.. ‘ఎక్స్’ ఉపయోగంలో లేని యూజర్ హ్యాండిల్స్‌ను విక్రయించడానికి ఒక ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. వాటిలో కొన్నింటిని 50 వేల డాలర్లకు (సుమారు రూ.41.5 లక్షలు) విక్రయించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఆ హ్యాండిల్స్‌ను రిజిస్టర్ చేసుకున్న యూజర్లతో మాట్లాడి వారి ఇనాక్టివ్ అకౌంట్ పేర్లను కొనుగోలు చేసేందుకు గానూ ‘హ్యాండిల్ టీమ్’ పేరుతో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు, ప్రక్రియలు, రుసుములు వంటి వివరాలను ‘ఎక్స్’ తమకు ఈమెయిల్ చేసినట్లు వాటిని అందుకున్నవారు ధ్రువీకరించారు. ముందే హింట్ ఇచ్చిన మస్క్ మస్క్ ఇలాంటిదేదో చేస్తాడని యూజర్లు ఎప్పటి నుంచో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యూజర్లు గణనీయమైన సంఖ్యలో హ్యాండిల్స్ తీసుకోవడం గురించి గతంలోనే స్పందించిన ఎలాన్ మస్క్ "హ్యాండిల్ మార్కెట్‌ప్లేస్" అవకాశం గురించి అప్పట్లో ప్రస్తావించాడు. ఇక్కడ వినియోగదారులు తమ ఖాతాలను ఒకరికొకరు విక్రయించవచ్చు. దీనికోసం ప్లాట్‌ఫామ్ రుసుము తీసుకుంటుందని తన ఆలోచనను పంచుకున్నారు. అయితే ఈ మార్కెట్ ఇప్పుడు పనిచేస్తుందో లేదో అన్నది అస్పష్టంగానే ఉంది. ఈ ట్విటర్ హ్యాండిల్స్ విక్రయం గురించి గతంలోనే ఆ సంస్థ ఉద్యోగుల్లో చర్చ జరిగినట్లు న్యూయార్క్ టైమ్స్ గత జనవరిలో ప్రచురించింది. ఇదీ చదవండి: Starlink: సాధించాం.. పట్టరాని ఆనందంలో ఎలాన్ మస్క్! -
ఎలాన్‌మస్క్ కుమారుడికి ఇండియన్ సైంటిస్ట్ పేరు
ప్రపంచ దిగ్గజ సంస్థ అయిన టెస్లా సీఈఓ ఎలాన్‌మస్క్ ఏం చేసినా సంచలనమే. వ్యాపార కార్యకలాపాలే కాకుండా వ్యక్తిగత వివరాలు వెల్లడించినా వైరల్‌గా మారడం ఖాయం. భారత ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌తో బ్రిటన్‌లో జరిగిన సమావేశంలో ఎలాన్‌మస్క్ తన కుమారుడికి సంబంధించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మస్క్, శివోన్ జిలిస్ దంపతుల కుమారుడికి భారతీయ పేరు నామకరణం చేసినట్లు చెప్పారు. 1983లో నోబెల్ బహుమతి పొందిన భౌతిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఎస్.చంద్రశేఖర్ పేరును తన కుమారుడికి నామకరణం చేస్తున్నట్లు మస్క్ దంపతులు తెలిపారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని మంత్రి తన ఎక్స్ ఖాతాలో పంచుకోవడంతో వైరల్ అయింది. ఇదీ చదవండి: ఆ ఫోన్ నంబర్లు మళ్లీ మూడు నెలలకే యాక్టివేట్ ప్రొఫెసర్ ఎస్.చంద్ర శేఖర్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. ఆయన నక్షత్రాల పరిణామం, వాటి నిర్మాణంపై ఎన్నో పరిశోధనలు చేశారు. ఆయన ‘చంద్రశేఖర్ లిమిట్’ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దీని ప్రకారం.. కొన్ని నక్షత్రాలు కాలక్రమేణా వాటి శక్తిని కోల్పోయి కుచించుకుపోతాయి. అయితే నక్షత్రాలకు ఉంటే వివిధ లక్షణాలను అనుసరించి అవి ఏ రకమైన స్థితిలోకి వెళతాయో కచ్చితంగా చెప్పవచ్చు. చంద్రశేఖర్ చేసిన పరిశోధనలకు గాను 1983లో విలియం ఏ.ఫ్లవర్‌తో కలిపి భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రదానం చేశారు. ఆయనకు నివాళిగా తన కుమారుడిని ప్రేమగా శేఖర్ అని పిలుస్తామని మస్క్ భార్య శివొన్ జిలిస్ తెలిపారు. ఆమె కెనడియన్ వెంచర్ క్యాపిటలిస్ట్. టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో నైపుణ్యం కలిగిన వ్యక్తి. A pleasant coincidence…@Rajeev_GoI & @elonmusk pic.twitter.com/011ZCNbasW — Liz Mathew (@MathewLiz) November 3, 2023 -
హాలోవీన్ వేషదారణలో ఎలాన్ మస్క్.. ఎంత క్యూట్‌గా ఉన్నారో!
హాలోవీన్.. ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా హాలోవీన్ జరుపుకుంటారు. మనం కలిపూజ ముందు రోజు భూత్ చతుర్దశిని జరుపుకున్నట్లే, పాశ్చాత్య దేశాలలో హాలోవీన్ జరుపుకుంటారు. తాజాగా హాలోవీన్ సందర్భంగా ‘ఎక్స్’ అధినేత ఎలాన్ మస్క్ కూడా ఓ క్యూట్ ఫొటోను షేర్ చేశారు. తాను ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడు శాంటాక్లాజ్ డ్రెస్ ధరించిన ఫొటోను మస్క్ పోస్టు చేశారు. ఈ మేరకు అందరికీ హాలోవీన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 👻🎃 Happy Halloween 🎃👻 [me dressed as Santa age 5] pic.twitter.com/YEViI8G46D — Elon Musk (@elonmusk) October 31, 2023 అధిక సంతానంపై మస్క్ ఏమన్నారంటే? అంతకుముందు, హంగరీ అధ్యక్షురాలు కటాలిన్ నోవాక్..‘సంతానం లేనివారితో పోలిస్తే పిల్లలున్నవారికి ఆర్థికంగా ప్రతికూలతలు ఉండాలా? హంగరీలో సంతానం ఉన్నవారు ఆర్థికంగా సానుకూలతలు కలిగి ఉండాలని కోరుకుంటున్నాం’ అంటూ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్‌పై మస్క్ స్పందించారు. తక్కువ సంతానం కలిగిఉంటే పర్యావరణానికి మంచిదని కొంతమంది భావిస్తారు. కానీ అది కరెక్ట్ కాదు. జనాభా రెట్టింపైనా పర్యావరణం బాగానే ఉంటుంది. సంతానం ఉన్నవారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. కొన్ని దేశాల్లో మాదిరిగా వారికి ఆర్థికంగా ఇబ్బందులు ఉండకూడదు. మనం తప్పక తర్వాతి తరాన్ని సృష్టించాలి. లేకపోతే అస్థిత్వాన్ని కోల్పోయే స్థితిలోకి జారుకుంటాం’ అని మస్క్ అన్నారు. -
ఎలాన్ మస్క్ కీలక ప్రకటన.. ఎక్స్.కామ్‌లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు
ఎక్స్.కామ్‌ను ఎవ్రీథింగ్ యాప్’గా మార్చే దిశగా ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా కంపెనీ నిర్వహించిన ఆల్ హ్యాండ్స్ మీటింగ్‌లో కీలక ప్రకటన చేశారు. ఎలాన్ మస్క్ తొలిసారి ఎక్స్.కామ్‌లో ఆల్ హ్యాండ్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో మస్క్, ఎక్స్ సీఈవోగా లిండా యాకరినో, ఉద్యోగులు, వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఉన్నత ఉద్యోగులు, స్టేక్ హోల్డర్స్ హాజరయ్యారు. ది వెర్జ్ నివేదిక ప్రకారం, యూజర్లు ఎక్స్‌లో ఆర్ధిక లావాదేవీలు ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించాలని మస్క్ కోరుకుంటున్నారు. ఎక్స్ వినియోగదారులకు బ్యాంక్ అకౌంట్‌తో అవసరం లేకుండా ఎక్స్‌లో అభివృద్ది చేసే తన ఫీచర్ ద్వారా వారి ఆర్థిక అవసరాలన్నింటినీ తీర్చగలిగేలా తీర్చిదిద్దేలా పనిచేస్తుంది. ఆ సౌకర్యం వచ్చే ఏడాది చివరి నాటికి అందుబాటులోకి రానున్నట్లు వెర్జ్ నివేదిక హైలెట్ చేసింది. ఎక్స్.కామ్‌లో చైనాలో మోస్ట్ పాపులర్ యాప్ వీచాట్‌లో రకరకాల ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. మెసేజింగ్, కాలింగ్‌తో పాటు మనీ ట్రాన్స్ ఫర్ అవకాశం కూడా ఉంది. ఒకే యాప్‌తో అనేక పనులకు ఉపయోగించుకునేలా దీన్ని రూపొందించారు. ప్రస్తుతం ఎక్స్ కూడా ఇలాగే పని చేయబోతోంది. వాస్తవానికి మస్క్ 1999లో ‘ఎక్స్’ అనే ఆన్లైన్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కొంత కాలానికి దాన్ని ‘పేపాల్’లో విలీనం చేశారు. అయితే ఎక్స్‌లో ఇప్పుడు ట్రాన్సాక్షన్లు చేసుకునేలా ఫీచర్లను అభివృద్ది చేస్తున్నారు. ఆ ట్రాన్సాక్షన్ ఫీచర్లు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలంటే వచ్చే ఏడాది చివరి నాటి వరకు ఎదురు చూడాల్సి ఉంది. -
పేరు మారిస్తే.. రూ.100 కోట్లిస్తా!
అపర కుబేరుడు, ఎక్స్ (ట్విటర్) అధినేత ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన నాటి నుంచి ఏదో ఒక అంశంపై నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. అలాంటి మస్క్ తాజాగా వికీపీడియా సంస్థకు భారీ ఆఫర్ చేశారు. మానవాళికి తెలిసిన విజ్ఞానాన్నంతా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ ఉచితంగా పొందగలిగే ప్రపంచాన్ని ఊహించండి’ అంటూ జిమ్మీ వేల్స్ అతి తక్కువ మంది వాలంటీర్లతో వికీపీడియాను రూపొందించారు. ఇప్పుడీ ఈ వికీపీడియా యూజర్ల నుంచి విరాళాలు సేకరించడంపై మస్క్ వ్యంగంగా స్పందించారు. ఓ బూతు పేరును సూచించి.. వికీపీడియాకు బదులు తాను ప్రతిపాదించిన పేరు పెట్టాలని మస్క్ కోరారు. తన ప్రతిపాదనను అంగీకరిస్తే రూ.100 కోట్లు ఇస్తానని కూడా ఆఫర్ చేశారు. నేనేమీ ఫూల్‌ని కాదు మస్క్ ట్వీట్‌తో ఓ యూజర్ వికీపీడియా పేరు మార్చిన తర్వాత మళ్లీ పాతపేరునే (వికీపీడియా) అప్డేట్ చేస్తే ఎలా అని ప్రశ్నించారు. అందుకు మస్క్ ‘నేనేమీ ఫూల్ కాదు. ఏడాది వరకు ఆపేరు అలాగే ఉంచాలి. మార్చడానికి వీలు లేదని రిప్లయి ఇచ్చారు. అంత డబ్బు ఎందుకు మరొక పోస్ట్‌లో.. వికీమీడియా ఫౌండేషన్‌కి ఎందుకు అంత డబ్బు కావాలి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వికీపీడియాను ఆపరేట్ చేయడానికి భారీ మొత్తంలో నిధులు అవసరం లేదు. మీరు మీ ఫోన్లో టెక్ట్స్‌ని తయారు చేసుకోవచ్చు. కాబట్టి, అంత డబ్బు దేనికి? ఇక యూజర్లని డబ్బులు ఎందుకు అడుగుతున్నారో చెప్పాలని మస్క్ ప్రశ్నించారు. -
ఆనంద్ మహీంద్రా ఫిదా, అరె!.. ఇ-బైక్ భలే ఉందే!
నిత్యం వ్యాపార వ్యవహారాల్లో తలమునకలయ్యే మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సరదాగా ఈ-బైక్‌ని నడిపారు. వెంటనే సదరు బైక్ వివరాల్ని ‘ఎక్స్’(ట్విటర్)వేదికగా వెల్లడించారు. సైకిల్ తొక్కటమంటే ఎవరికి ఇష్టముండదు? అన్నివయసుల వారికీ ఆసక్తే. చాలామంది సంప్రదాయ సైకిళ్లను ఇష్టపడుతుంటారు గానీ నేటి తరానికి ఎలక్ట్రిక్ బైకులంటే మక్కువ. రెండింటి ఉద్దేశం ఒకటే అయినప్పటికీ ఇ-బైకుల్లోని వివిధ భద్రత ఫీచర్లు బాగా ఆకట్టుకుంటుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ కేంద్రంగా ఐఐటీ- బాంబే పూర్వ విద్యార్ధులు నిషిత్ పరిక్, రాజ్ కుమార్ కెవాత్లు దేశంలోనే తొలిసారి ‘హార్న్‌బ్యాక్’(hornbakc) పేరుతో ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ బైక్‌ను మ్యాని ఫ్యాక్చరింగ్ స్టార్టప్‌ను ప్రారంభించారు. ఆ సంస్థ తయారు చేసిన ఈ-బైక్‌ను ఆనంద్ మహీంద్రా డ్రైవ్ చేశారు. A bunch of IIT Bombay guys have made us proud again. They’ve created the first foldable diamond frame e-bike with full-size wheels in the world. That makes the bike not only 35% more efficient than other foldable bikes but it makes the bike stable at higher than medium speed. And… pic.twitter.com/U1HHGD6rfL — anand mahindra (@anandmahindra) October 21, 2023 అనంతరం, 'ఐఐటీ బాంబే కుర్రాళ్లు మళ్లీ గర్వపడేలా చేశారు. ప్రపంచంలోనే పూర్తి స్థాయి చక్రాలతో మొట్టమొదటి ఫోల్డబుల్ డైమండ్ ఫ్రేమ్ ఇ-బైక్ ను రూపొందించారు. ఇది ఇతర ఫోల్డబుల్ బైక్‌ల కంటే వీళ్లు తయారు చేసిన ఇ-బైక్ 35శాతం కంటే ఎక్కువ సమర్థవంతంగా పని చేయడమే కాకుండా, మీడియం స్పీడ్ కంటే ఎక్కువ వేగంతో బైక్‌ను డ్రైవ్ చేయొచ్చు’ అంటూ మహీంద్రా ఈ ఇ-బైక్ నడుపుతున్న చిత్రాలను షేర్ చేస్తూ పోస్ట్ చేశారు. ‘మడతపెట్టిన తర్వాత లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేని ఏకైక బైక్ ఇది. ఆఫీసు కాంపౌండ్ చుట్టూ తిరగడానికి నా సొంత హార్న్ బ్యాక్ ఎక్స్1 ను తీసుకున్నాను! నేను వారి స్టార్టప్‌లో పెట్టుబడి పెట్టాను అని ఆయన చెప్పారు. ఈ ఫోల్డబుల్ ఇ-బైక్ గురించి మరిన్ని విశేషాలు ►హార్న్‌బ్యాక్ ఎక్స్1 గ్రే-ఆరెంజ్, బ్లూ-ఆరెంజ్ కలర్ వేరియంట్లో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.44,999. రూ.14,999 మూడు నెలల నో కాస్ట్ ఈఎంఐతో దీన్ని సొంతం చేసుకోవచ్చు. ►ఇందులో 36వీ, 7.65ఏహెచ్ బ్యాటరీని అమర్చారు. సింపుల్‌గా 2 పిన్ప్లగ్ పాయింట్‌తో బ్యాటరీని ఛార్జ్ చేయొచ్చు. దీనిని ఫుల్ ఛార్జ్ చేయడానికి నాలుగు గంటల సమయం పడుతుంది. ►కంపెనీ ప్రకారం, హార్న్‌బ్యాక్ ఇ-బైక్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే సగటున 45 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. స్టోరేజ్, ప్రయాణ సమయాల్లో వాహనదారులకు వీలుగా ఫోల్డబుల్‌గా తయారు చేసింది. ►కంపెనీ ఫిజికల్ స్టోర్ల నుంచి తన ఇ-బైక్‌ను విక్రయించడం లేదని పేర్కొంది. తమ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫామ్‌లలో కొనుగోలు చేయొచ్చు. ఎలక్ట్రిక్ సైకిళ్ల యొక్క అన్ని భాగాలపై కంపెనీ రెండు సంవత్సరాల వారంటీని అందిస్తుందని ఆనంద్ మహీంద్రా తెలిపారు. -
ఎలాన్ మస్క్ మరో సంచలన నిర్ణయం!
ఎక్స్(ట్విటర్) యూజర్లు యాడ్స్ వద్దనుకుంటే డబ్బులు కట్టాల్సిందేనంటూ ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా మస్క్ యూజర్లకు మరో భారీ షాకిచ్చినట్లు తెలుస్తోంది. ఎక్స్ అకౌంట్‌ను ఓపెన్ చేసినందుకే యూజర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ట్విటర్‌ను 44 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 3.37 లక్షల కోట్లు)కు కొనుగోలు చేసిన మస్క్ ఆ ఫ్లాట్‌ఫామ్‌లో ఆదాయ మార్గాల్ని అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా ఎక్స్ అకౌంట్ ఓపెన్ చేసినందుకు ఖాతాదారులు ఏడాదికి కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని మస్క్ నిర్ధారించారు. ప్రస్తుతం, రెండు దేశాల యూజర్ల నుంచి ‘నాట్ ఏ బోట్’ పేరుతో సబ్‌స్కిప్షన్‌ను వసూలు చేస్తున్నామని తెలిపారు. కొత్త అకౌంట్ ఓపెన్ చేస్తే డబ్బులు కట్టాల్సిందే ‘ఎక్స్ హెల్ప్ సెంటర్ పేజ్’లో ‘నాట్ ఏ బోట్’ పేరుతో ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. అందులో ‘మేము రెండు దేశాల్లోని కొత్త వినియోగదారుల కోసం కొత్త సబ్స్క్రిప్షన్ పద్ధతి ‘నాట్ ఎ బాట్’ని పరీక్షించడం ప్రారంభించాము. స్పామ్,మానిప్యులేషన్‌ను తగ్గించేలా ఇప్పటికే మేం చేస్తున్న ప్రయత్నాలు మరింత బలోపేతం చేసేలా ఈ టెస్ట్ చేస్తున్నాం. అయితే ఈ నగదు చెల్లింపులు ఇప్పటికే ఎక్స్ వినియోగిస్తున్న యూజర్లకు వర్తించదు’అని పోస్ట్‌లో హైలెట్ చేసింది. రెండు దేశాల్లో ‘నాట్ ఎ బాట్’ పద్ధతి ప్రస్తుతం న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్ దేశాల యూజర్లకు వర్తిస్తుంది. ఈ రెండు దేశాల్లో యూజర్ ఛార్జీలు ఎందుకు వసూలు చేస్తున్నారు? భవిష్యత్తులో ఇతర దేశాల్లో సైతం ఈ కొత్త సబ్స్క్రిప్షన్ మోడల్ని అమలు చేసే యోచనలో ఉన్నారా? అనేది తెలియాల్సి ఉంది. డబ్బులు చెల్లించ లేకపోతే సబ్స్క్రిప్షన్ చెల్లించలేని యూజర్లు కొత్త ఎక్స్ అకౌంట్లను ఓపెన్ చేసుకోవచ్చు.అయితే వారు పోస్ట్‌లను చూడటం, వీడియోలను చూడటం, ఇతర అకౌంట్లను ఫాలో అయ్యేందుకు వీలు లేదు. కేవలం చదివేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. వారు తమ సొంత కంటెంట్‌ను పోస్ట్ చేయలేరనే విషయాన్ని గుర్తించాలి. ధృవీకరించిన ఎలాన్ మస్క్ అదే విషయాన్ని ధృవీకరిస్తూ, మస్క్ ఒక ట్వీట్ చేశారు. ‘ఉచితంగా చదవండి, కానీ మీరు రాసింది పోస్ట్ చేయడానికి ఏడాదికి ఒక్క డాలర్ (83.29 Indian Rupee) చెల్లించాలి. నిజమైన వినియోగదారులను నిరోధించకుండా బాట్లతో పోరాడటానికి ఇది ఏకైక మార్గమని పేర్కొన్నారు. సైన్ అప్ చేయడం ఎలా? కాబట్టి, రెండు దేశాల్లోని కొత్త వినియోగదారులు ఎక్స్‌లో కొత్త అకౌంట్‌ను ఓపెన్ చేయాలంటే ముందుగా ఫోన్‌నెంబర్‌ను ధృవీకరించాలి. మొదటి దశపూర్తయిన తర్వాత తమ సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ని ఎంచుకోవచ్చు. వీటి ధరలు దేశం, కరెన్సీ ఆధారంగా మారుతాయి. చదవండి👉 హమాస్ ఉగ్రవాదుల బుల్లెట్ల వర్షం..‘టెస్లా నా ప్రాణం కాపాడింది’ -
ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం!
సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విటర్) అధినేత ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో మరో మూడు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్స్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు ఆ సంస్థ సీఈవో లిండా యక్కరినో తెలిపారు. పలు నివేదికల ప్రకారం..ఎక్స్.కామ్‌ను వినియోగించే సమయంలో యూజర్లకు ఎన్ని యాడ్స్ కావాలనుకుంటున్నాదో దానికి అనుగుణంగా డబ్బులు వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం వెరిఫైడ్ అకౌంట్లకు నెలకు రూ.650, ఏడాదికి రూ.6,800 చెల్లించి ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకున్నారో వాళ్లకి ఇది అవసరం లేదని బ్లూమ్‌బర్గ్ తెలిపింది. ఇజ్రాయెల్ ప్రధాని కలిసి.. గత నెలలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న మస్క్.. త్వరలో కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను పరిచేయం చేస్తామని, ప్రస్తుతం దానిపై పనిచేస్తున్నట్లు చెప్పారు. అయితే తాజాగా మస్క్ దానిని నిజం చేశారు. బేసిక్, స్టాండర్డ్, ప్లస్ పేరుతో బేసిక్, స్టాండర్డ్, ప్లస్ అనే పేరుతో తీసుకొస్తున్న ఈ ప్లాన్లకు పెట్టుబడిదారులతో జరిగిన సమావేశంలో ఎక్స్ సీఈవో లిండా యాకరినో ఆమోదం తెలిపారు. యాకరినో ప్రకారం.. టెస్టింగ్ దశలో ఉన్న బేసిక్ ప్లాన్‌లో పూర్తిస్థాయిలో యాడ్లు ఉంటాయి. స్టాండర్డ్‌లో బేసిక్‌తో పోలిస్తే యాడ్ల సంఖ్య సగానికి తగ్గుతుంది. ప్లస్‌లో ఎలాంటి యాడ్లు ఉండవు. ఉచితం కాదు.. డబ్బులు చెల్లించాల్సిందే మరోవైపు యూజర్లు చేజారిపోకుండా ఉండేలా వారికి మిలియన్ డాలర్లను చెల్లిస్తున్న విషయం తెలిసిందే. మానిటైజేషన్ పేరుతో కంటెంట్ క్రియేటర్లకు ఏడాదికి 20 మిలియన్ డాలర్లు చెల్లించాలని ఎక్స్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది జులై నుంచి ఎక్స్ యాడ్ రెవెన్యూ నుంచి కొంత మొత్తాన్ని యూజర్లకు అందించడం ప్రారంభించింది. కాగా, మస్క్ తీసుకుంటున్న వరుస నిర్ణయాలతో రానున్న రోజుల్లో ఎక్స్‌ను వాడుకోవాలంటే తప్పని సరిగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని మార్కెట్ నిపుణలు అంచనా వేస్తున్నారు. చదవండి👉 ఎలాన్ మస్క్‌కు భారీ షాకిచ్చిన ‘ఎక్స్’ మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్, విజయా గద్దె -
ఎలాన్ మస్క్‌కు భారీ షాకిచ్చిన ‘ఎక్స్’ మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్, విజయా గద్దె
టెస్లా, స్పేస్ ఎక్స్, ఎక్స్ (ట్విటర్) అధినేత ఎలాన్ మస్క్‌కు భారీ షాక్ తగిలింది. భారత సంతతికి చెందిన మాజీ ఎక్స్ సీఈవో పరాగ్ అగర్వాల్, పాలసీ హెడ్ విజయా గద్దె సహా ఇతర ఎగ్జిక్యూటివ్‌లు 1.1 మిలియన్ డాలర్ల లీగల్ ఫీజులను గెలుచుకున్నారు. పలు నివేదికల ప్రకారం..ఎక్స్‌లో పనిచేసే సమయంలో సంస్థ (ఎక్స్) కోసం నిబంధనల్ని ఉల్లంఘించి మరి పనిచేశాం. దీంతో చట్టపరమైన సమస్యలు ఎదురవుతున్నాయి. వాటిని ఎదుర్కొనేందుకు తమకు ఎక్స్ 1.1 మిలియన్ డాలర్ల మేర నష్టపరిహారం కావాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఫిర్యాదుపై సుదీర్ఘ కాలం పాటు జరిగిన విచారణ అనంతరం తాజాగా, డెలావేర్ ఛాన్సరీ కోర్టు న్యాయమూర్తి కాథలీన్ సెయింట్ జె. మెక్కార్మిక్ పరాగ్ అగర్వాల్ అతని బృందానికి అనుకూలంగా తీర్పునిచ్చారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. పరాగ్‌కు 40 మిలియన్ డాలర్లు నివేదికల ప్రకారం, ఈ ముగ్గురు టాప్ ఎగ్జిక్యూటివ్‌లు ట్విట్టర్‌ను విడిచిపెట్టినప్పుడు దాదాపు 90 నుంచి 100 మిలియన్ల ఎగ్జిట్ ప్యాకేజీని పొందారు. విధుల నుంచి తొలగించినందుకు నష్టపరిహారంగా పరాగ్ అగర్వాల్ దాదాపు 40 మిలియన్ల డాలర్ల భారీ మొత్తాన్ని అందుకున్నట్లు సమాచారం. -
ఆయన చేతుల్లోకి వచ్చాకే ఇలా.. మస్క్ గాలి తీసేసిన సీఈవో!
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’(ట్విటర్) ఎలాన్ మస్క్ (Elon Musk) ఆధీనంలోకి వచ్చాక డైలీ యాక్టివ్ యూజర్లను కోల్పోతున్నట్లు ఆ సంస్థ సీఈవో లిండా యాకరినో (Linda Yaccarino) ఇటీవల జరిగిన వోక్స్ మీడియా కోడ్ 2023 ఈవెంట్లో పాల్గొన్న ఆమె సీఎన్‌బీసీ ఇంటర్వ్యూలో కంపెనీ గురించి ఆక్తికర గణాంకాలను తెలియజేశారు. ఇంటర్వ్యూ జరుగుతున్నంత సేపూ తాను ఎక్స్‌లో కేవలం 12 వారాలు మాత్రమే ఉద్యోగంలో ఉన్నానని పదే పదే చెప్పుకొచ్చిన లిండా యాకరినో.. ఎలోన్ మస్క్ చేతుల్లోకి వచ్చిన తర్వాత ట్విటర్ రోజువారీ యాక్టివ్ యూజర్లను కోల్పోతున్నట్లు వెల్లడించారు. కంపెనీకి ప్రస్తుతం 225 మిలియన్ల రోజువారీ యాక్టివ్ యూజర్లు ఉన్నట్లు చెప్పారు. మస్క్ కంపెనీని కొనుగోలు చేయడానికి ముందున్న సంఖ్య కంటే 11.6 శాతం క్షీణించినట్లు తెలిపారు. మరోవైపు ఎలాన్ మస్క్ కూడా గతేడాది తాను టేకోవర్ చేయడానికి వారం ముందు ట్విటర్లో 254.5 మిలియన్ల డైలీ యాక్టివ్ యూజర్లు ఉన్నట్లు అప్పట్లో వరుస ట్వీట్లు చేశారు. కాగా ఎక్స్ తమ డైలీ యాక్టివ్ యూజర్ల సంఖ్యను 245 మిలియన్లకు సవరించినట్లు ‘ది ఇన్ఫఫర్మేషన్’ అనే టెక్నాలజీ పబ్లికేషన్ ద్వారా తెలుస్తోంది. ఎక్స్‌కి ప్రస్తుతం 225 మిలియన్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారని చెప్పిన లిండా అంతకుమందుకు నిర్దిష్ట సంఖ్య చెప్పకుండా 200 నుంచి 250 మిలియన్ల డైలీ యాక్టివ్ యూజర్లు ఉన్నారంటూ చూచాయిగా చెప్పారు. ‘మ్యాషబుల్’ నివేదిక ప్రకారం చూస్తే ముందు కంటే మస్క్ ఆధీనంలోకి వచ్చిన తర్వాత ట్విటర్ 3.7 శాతం డైలీ యాక్టివ్ యూజర్లను కోల్పోయింది. 2022 నవంబర్ మధ్యలో 259.4 మిలియన్ల డైలీ యాక్టివ్ యూజర్లను కలిగిన ట్విటర్.. ఆ తర్వాత దాదాపు 15 మిలియన్ల యూజర్లను కోల్పోయింది. ఇక మంత్లీ యాక్టివ్ యూజర్ల విషయానికి వస్తే ‘ఎక్స్’కి 550 మిలియన్ల మంత్లీ యాక్టివ్ యూజర్లు ఉన్నట్లు లిండా యాకరినో తెలిపారు. అయితే 2024లో కంపెనీ లాభదాయకంగా ఉంటుందని కోడ్ కాన్ఫరెన్స్ వేదికపై అన్నారు. -
ఎలాన్ మస్క్ క్రియేటర్లకు వందల కోట్లు చెల్లిస్తున్నారు.. మీరు తీసుకున్నారా?
ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ‘ఎక్స్ (ట్విటర్)’ యూజర్లకు శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు ఎక్స్ క్రియేటర్లకు సుమారు 20 మిలియన్లు (రూ.166 కోట్ల కంటే ఎక్కువ) చెల్లించినట్లు ఆ కంపెనీ సీఈవో లిండా యక్కరినో తెలిపారు. వెరిఫైడ్ యూజర్ల పోస్టులపై డిస్ప్లే అయ్యే యాడ్స్ ద్వారా సంస్థ సంపాదించిన మొత్తంలో కొంత భాగాన్ని ఈ ఏడాది జూలై నుంచి క్రియేటర్లకు చెల్లించడం ప్రారంభించింది. యూట్యూబ్‌లో వీడియోలకు, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులకు, వెబ్సైట్లలో ఆర్టికల్స్‌కు డబ్బులు వస్తాయి. అదే తరహాలో ఎక్స్.కామ్ సైతం ట్వీట్లకు డబ్బులు ఇస్తున్నట్లు అధినేత ఎలాన్ మస్క్ తెలిపిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో అర్హులైన క్రియేటర్లకు ఆ మొత్తాన్ని చెల్లించినట్లు సీఈవో లిండా ట్వీట్ చేశారు. ‘క్రియేట్,కనెక్ట్, కలెక్ట్ ఆల్ ఆన్ ఎక్స్’. క్రియేటర్లు ఆర్ధికంగా విజయం సాధించేలా వారికి అండగా నిలిస్తున్నాం ’అని యాకారినో పోస్ట్ చేశారు. అంతేకాదు, ఇప్పటికే క్రియేటర్ కమ్యూనిటీకి 20 మిలియన్లు చెల్లించాం. తొలిసారిగా జులై నెలలో 5 మిలియన్లు అందించినట్లు తెలిపారు. Create. Connect. Collect all on X. We’re enabling the economic success of new segments like creators. And so far we've paid out almost $20 million to our creator community. https://t.co/kk137uPkAo — Linda Yaccarino (@lindayaX) September 29, 2023 యాక్టీవ్‌గా ఉన్న క్రియేటర్లు డబ్బులు సంపాదించుకునే అవకాశాన్ని ఎక్స్.కామ్ కల్పిస్తుంది. మానిటైజేషన్ నిబంధనలకు లోబడి చేసే ట్వీట్లకు క్రియేటర్లు ‘యాడ్స్ రెవెన్యూ షేరింగ్ ప్రోగ్రామ్’ కింద భారత్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన క్రియేటర్లు డబ్బులు సంపాదించుకోవచ్చు. క్రియేటర్ యాడ్స్ రెవెన్యూ షేరింగ్ (ట్వీట్లతో డబ్బులు) సంపాదించేందుకు క్రియేటర్లు ఎక్స్ ప్రీమియం సభ్యుడై ఉండాలి. గత 5 నెలల్లో మీరు చేసిన పోస్ట్ లపై కనీసం 3 మిలియన్ ఆర్గానిక్ ఇంప్రెషన్స్, కనీసం 500 మంది ఫాలోవర్లను కలిగి ఉండాలి. చదవండి👉 ఎంతపని చేశావయ్యా ఎలన్ మస్క్? -
గూగుల్, మెటా,ఎక్స్‌కు భారత్ భారీ షాక్!
మెటా,ఎక్స్, గూగుల్ సంస్థలకు భారత్ భారీ షాక్ ఇవ్వనుంది. త్వరలో ఆయా సంస్థల నుంచి 18 శాతం ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్ విభాగం ఐజీఎస్టీ నుంచి ఓఐడీఏఆర్ సంస్థలకు ఇకపై మినహాయింపు ఇవ్వబోదని తెలుస్తోంది. అక్టోబర్ నుంచి భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విదేశీ అడ్వటైజింగ్, క్లౌడ్ సర్వీస్, మ్యూజిక్, సబ్స్క్రిప్షన్ సర్వీసులు, ఆన్లైన్ ఎడ్యుకేషన్ సేవలందిస్తున్న ఆయా కంపెనీలు నుంచి ఐజీఎస్టీని వసూలు చేసేందుకు కేంద్రం సిద్ధమైందంటూ ఈ అంశంలో ప్రమేయం ఉన్న ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు. ప్రస్తుతం, ఓఐడీఏఆర్ సంస్థలు ఎలాంటి ట్యాక్స్ చెల్లించే పనిలేదు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా సంస్థలకు పన్ను నుంచి మినహాయింపులు ఇస్తున్నాయి. కేవలం, బిజినెస్ టూ బిజినెస్ సర్వీస్‌లు అందించే కంపెనీలు మాత్రమే ట్యాక్స్‌లు చెల్లిస్తున్నాయి. తాజాగా పన్నుల విభాగం తీసుకున్న నిర్ణయంతో ఓఐడీఏఆర్ సంస్థలైన మెటా,ఎక్స్, గూగుల్ వంటి సంస్థల మీద పన్ను భారం పడనుంది. ఓడీఐఆర్ అంటే ఏమిటి? ఓడీఐఆర్ ని ఆన్ లైన్ ఇన్ఫర్మేషన్ డేటాబేస్ యాక్సెస్ అండ్ రిట్రీవల్ సర్వీసెస్ అని పిలుస్తారు. ఈ విభాగంలో సేవలందించే సంస్థలు వ్యక్తులు లేదంటే కస్టమర్లుతో ఎలాంటి భౌతిక సంబంధం ఉండదు. ఆన్లైన్ ద్వారా వినియోగదారుల అవసరాల్ని తీర్చుతాయి. గూగుల్,మెటా,ఎక్స్ తో పాటు ఆన్లైన్ ద్వారా కస్టమర్ల అవసరాల్ని తీర్చే కంపెనీలు ఈ ఓఐడీఐఆర్ విభాగం కిందకే వస్తాయి. -
కింగ్ లాంటి మస్క్‌ను ముప్పుతిప్పలు పెట్టించింది.. అప్పులపాలు చేసింది!
Elon Musk Borrowed: ప్రపంచ కుబేరుడు, అమెరికన్ బిలియనీర్ ఎలాన్ మస్క్ (Elon Musk) గురించి పరిచయం అక్కరలేదు. పలు బిజినెస్‌లతో వేల కోట్లు సంపాదించి అత్యంత సంపన్నడిగా ఎదిగాడు. ఆయన ఎన్ని వ్యాపారాలు చేసినా ఎప్పుడూ ఇబ్బందులు ఎదర్కోలేదు. వాటిని విజయవంతంగా నిర్వహించాడు. కానీ ట్విటర్ (Twitter) (ఇప్పుడు ‘ఎక్స్’) మాత్రం మస్క్‌ను ముప్పుతిప్పలు పెట్టించింది.. అప్పులపాలు చేసింది! (IT jobs data: దారుణంగా ఐటీ ఉద్యోగాలు.. ప్రముఖ జాబ్ పోర్టల్ రిపోర్ట్!) ట్విటర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు ఎలాన్ మస్క్ ఎన్ని ఇబ్బందులు పడ్డాడో చెప్పేందుకు తాజాగా ఓ విషయం వెలుగులోకి వచ్చింది. ట్విటర్ కొనుగోలు సమయంలో తనకు చెందిన రాకెట్ కంపెనీ స్పేస్ఎక్స్ (SpaceX) నుంచి 1 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.8,314 కోట్లు) రుణాన్ని తీసుకున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తాజాగా ఓ కథనం వెలువరించింది. ట్విటర్ కోసమేనా.. స్పేస్ఎక్స్ గత అక్టోబర్‌లో ఎలాన్ మస్క్‌కు 1 బిలియన్ డాలర్ల రుణాన్ని ఆమోదించగా ఆ మొత్తాన్ని మస్క్ అదే నెలలో డ్రా చేశారని కొన్ని పత్రాలను ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. కాగా అదే అక్టోబర్ నెలలో మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ట్విటర్ కొనుగోలు మస్క్ ఆర్థిక పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసిందని, టెస్లాతో సహా తన ఇతర కంపెనీలలో తన షేర్ల మీద రుణం తీసుకోవడానికి బ్యాంకులతో ఏర్పాట్లు చేసుకున్నాడని నివేదిక పేర్కొంది. ఇందుకోసం స్పేస్ఎక్స్ రుణదాతగా వ్యవహరించిందని తెలిపింది. కాగా స్పేస్ఎక్స్లో మస్క్‌కు అత్యధిక వాటా ఉంది. మార్చి నాటికి ఆయన కంపెనీలో 42 శాతం వాటా, దాదాపు 79 శాతం ఓటింగ్ శక్తి కలిగి ఉన్నట్లు ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్‌లో దాఖలు చేసిన నివేదికను ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది. -
ఎలాన్ మస్క్‌కు భారీ ఝలక్!
ఎక్స్. కామ్ అధినేత ఎలాన్ మస్క్‌కు హ్యాకర్లు ఝలక్ ఇచ్చారు. తమ దేశంలోనూ స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందించాలని వార్నింగ్ ఇస్తూ సూడాన్‌కు చెందిన యాకర్లు ఎక్స్. కామ్‌ను హ్యాక్ చేశారు. ఆపై సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ పనిచేయకుండా బ్లాక్ చేశారు. సుడాన్‌లోని ఓ రహస్య హ్యాకర్స్ బృందం ప్రపంచంలోని 12కు పైగా దేశాల్లో ఎక్స్. కామ్ పని చేయకుండా 2 గంటల పాటు నిలిపివేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. మైక్రో బ్లాగింగ్ సైట్లో తలెత్తిన అంతరాయంతో యూజర్లు ఇబ్బంది పడినట్లు బ్రిటిష్ మీడియా సంస్థ బీబీసీ నివేదించింది. ‘ఎలాన్ మస్క్‌కు మేమిచ్చే మెసేజ్ ఇదే. సూడాన్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందించాలంటూ హ్యాకర్స్ గ్రూప్ టెలిగ్రాం ఛానల్లో ఓ మెసేజ్‌ను పోస్ట్ చేసింది.ఎక్స్. కామ్‌ను తమ అదుపులోకి తీసుకోవడంతో యూకే, యూఎస్‌కు చెందిన 20,000 మంది తమకు ఫిర్యాదు చేసినట్లు డౌన్ డిటిటెక్టర్ తెలిపింది. ఎక్స్.కామ్ హ్యాకింగ్‌కు కారణం అయితే, జరిగిన అంతరాయాన్ని ఎక్స్.కామ్ యాజమాన్యం స్పందించలేదు. ఈ సందర్భంగా హ్యాకింగ్ గ్రూప్ సభ్యుడు హోఫా మాట్లాడుతూ.. సూడాన్‌లో కొనసాగుతున్న సివిల్ వార్‌పై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో డిస్ట్రిబ్యూటెడ్ డెనిషన్ ఆఫ్ సర్వీస్ (డీడీఓఎస్) హ్యాకింగ్ దాడి జరిగింది. కానీ ఇంటర్నెట్ పనితీరు కారణంగా మా నినాదాన్ని గట్టిగా వినిపించ లేకపోతున్నాం. తరచుగా ఇంటర్నెట్ సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపాడు. కాబట్టే తమకు శాటిలైట్ ఇంటర్నెట్ సేవలం అవసరమని పేర్కొన్నాడు. ప్రిగోజిన్‌కు వ్యతిరేకంగా హ్యాకింగ్ గ్రూప్‌కు రష్యా సైబర్ మిలటరీ యూనిట్‌కు మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. అయితే రష్యాతో తమకు ఉన్న అనుబంధాన్ని ఆ సంస్థ ఖండించింది. పుతిన్ ప్రభుత్వంపై తిరుగుబాటుదారుడు, వాగ్నర్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ పారామిలటరీని అంతం చేయడానికి రష్యా ప్రభుత్వానికి మద్దతుగా ఈ హ్యాకింగ్ గ్రూప్ జూన్‌లో ఓ మెసేజ్‌ను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ హ్యాకింగ్ గ్రూప్ గతంలో ఫ్రాన్స్, నైజీరియా, ఇజ్రాయెల్, అమెరికాలో అలజడి సృష్టించింది. -
మస్క్ కొడుకుని చూశారా? బుడతడు భలే ఉన్నాడే...
ప్రపంచ టాప్ బిలియనీర్, టెస్లా, ఎక్స్ (ట్విటర్) సంస్థల అధినేత ఎలాన్ మస్క్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ఆయన గురించి చాలా మందికి తెలుసు. కానీ ఎలాన్ మస్క్ కొడుకుని ఎప్పుడైనా చూశారా?.. ఇదిగో ఇక్కడ చూడండి.. తన సోషల్ మీడియా సంస్థకు చెందిన ‘ఎక్స్’ లోగో ముందు నిలబడి ఉన్న తన కొడుకు ఎక్స్ ఏఈఏ-12 (పేరు) ఫొటోను ‘ఎక్స్’లో షేర్ చేశారు ఎలాన్ మస్క్. ముద్దులొలుకుతున్న మస్క్ కొడుకు ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఖాకీ రంగు నిక్కరు, టెస్లా లోగోతో ఉన్న వైట్ టీషర్ట్ వేసుకున్న ఈ మూడేళ్ల బుడతడు బోసినవ్వులతో కెమెరాకు ఫోజుచ్చాడు. ఈ ఫొటోకు 75 మిలియన్లకు పైగా వ్యూస్, 10 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. బుడతడు భలే ఉన్నాడే అంటూ యూజర్లు కామెంట్లు పెడుతున్నారు. ఎక్స్ ఏఈఏ-12 (X AE A-XII) 2020లో జన్మించాడు. కెనడియన్ మ్యుజీషియన్ గ్రిమ్స్‌తో ఎలాన్ మస్క్‌కి ఈ బాలుడు మొదటి సంతానం. విచిత్రంగా ఉన్న ఈ పిల్లాడి పేరు గురించి తల్లి గ్రిమ్స్ గతంలో వివరణ ఇచ్చినా చాలా మందికి సరిగ్గా అర్థం కాలేదు. కొత్తగా బావుందని మాత్రం అందరూ కితాబు ఇచ్చారు. మస్క్- గ్రిమ్స్ జంట 2022లో సరోగసి ద్వారా ఎక్సా డార్క్ సైడెరెల్ మస్క్ అనే కుమార్తె పొందారు. 2018 నుంచి రిలేషన్షిప్లో ఉన్న ఈ జంట 2021 సెప్టెంబర్‌లోనే విడిపోయారు. తర్వాత 2021 నవంబర్‌లో షివోన్ జిలిస్‌తో కవలలను కన్నారు. కాగా కెనడియన్ రచయిత జస్టిన్ విల్సన్‌తో మస్క్‌కు ఐదుగురు పిల్లలు ఉన్నారు. pic.twitter.com/gcSXLMwsua — Elon Musk (@elonmusk) August 25, 2023 -
అదంతా ఉత్తదే! ఎలాన్ మస్క్‌పై షాకింగ్ రిపోర్ట్
ఎక్స్ (ట్విటర్) అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk)పై షాకింగ్ రిపోర్ట్ ఒకటి వెలువడింది. చిత్రమైన ఆలోచనలు, నిర్ణయాలు, విచిత్ర వ్యాఖ్యానాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే మస్క్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్నారు. అయితే ఇదంతా ఉత్తదే అని ఓ రిపోర్ట్ పేర్కొంటోంది. ఎక్స్ (ట్విటర్)లో ఎలాన్ మస్క్‌కు ఏకంగా 153.9 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే ఇందులో చాలా వరకు అకౌంట్లు ఫేక్ అని, కొన్ని యాక్టివ్ లో లేవని, మరికొన్ని కొత్త అకౌంట్స్ అని థర్డ్ పార్టీ రీసెర్చర్ ‘ట్రావిస్ బ్రౌన్’ సేకరించిన డేటా ఆధారంగా ‘మ్యాషబుల్’ (Mashable) అనే టెక్ వెబ్సైట్ నివేదించింది. మస్క్‌కి ఉన్న 153.9 మిలియన్ల మంది ఫాలోవర్లలో దాదాపు 42 శాతం అంటే 65.3 మిలియన్లకు పైగా ఖాతాలకు కనీసం ఒక్క ఫాలోవర్ కూడా లేరని ఈ నివేదిక పేర్కొంది. మస్క్‌ను అనుసరిస్తున్న ఒక్కో ఖాతాలకు సగటున ఉన్న ఫాలోవర్లు కేవలం 187 మంది. మస్క్ ఫాలోవర్లలో 0.3 శాతం అంటే 4,53,000 మంది మాత్రమే ఎక్స్ ప్రీమియం (ట్విటర్ బ్లూ) సబ్స్క్రైబర్లు. మస్క్ ఫాలోవర్లలో 62.5 మిలియన్ల మంది ఎప్పుడూ అసలు ఒక్క ట్వీట్ కూడా చేయలేదని రిపోర్ట్ వెల్లడించింది. -
‘ఎక్స్’లో మార్పులు.. యూజర్లకు భారీ షాక్!
ట్విటర్ (ఎక్స్) అధినేత ఎలాన్ మస్క్ యూజర్లకు షాకిచ్చారు. ఎక్స్ ఫ్లాట్ ఫామ్ నుంచి అకౌంట్లను బ్లాక్ చేసే ‘బ్లాక్’ ఆప్షన్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ‘టెస్లా ఓనర్స్ సిలికాన్ వ్యాలీ’ ఎక్స్ అకౌంట్ యూజర్ ‘బ్లాక్ అండ్ మ్యూట్’ ఈ రెండింటిలో మీరు దేనికి ప్రాధాన్యత ఇస్తారంటూ ప్రశ్నించిన సందర్భంగా ఎలాన్ మస్క్ పైవిధంగా స్పందించారు. బ్లాక్ ఆప్షన్ డిలీట్ చేస్తున్నట్లు తెలిపిన మస్క్.. యూజర్లు ఇతర అకౌంట్ల నుంచి ఏదైనా సమస్యలు తలెత్తితే మ్యూట్ అనే ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చని అన్నారు. ఇక తాము డిలీట్ చేసిన బ్లాక్ అనే ఫీచర్ వల్ల పెద్ద ఉపయోగం లేదనే అభిప్రాయాన్ని మస్క్ వ్యక్తం చేశారు. కానీ, ఎవరైతే మన అకౌంట్లను మ్యూట్ చేశారో వాళ్లు వారి ఎక్స్ అకౌంట్లో ఏ పోస్ట్‌లు పెడుతున్నారో, ఎన్ని కామెంట్స్, ట్వీట్లు, రీట్విట్లు ఎవరు చేస్తున్నారో తెలుసుకోవచ్చు. డైరెక్ట్‌గా మెసేజ్ చేయొచ్చు. ఇలా డైరెక్ట్ మెసేజ్‌లు చేస్తే వాటిని బ్లాక్ చేసుకోవచ్చు. ఆ పోస్ట్‌లను తన స్నేహితులకు పంపుకోవచ్చు. డైరెక్ట్‌గా మెసేజ్ కూడా చేసే అవకాశం ఉందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. మరోవైపు, సోషల్ మీడియాలో బ్లాక్ అనే ఆప్షన్ యూజర్ల భద్రత విషయంలో కీలకంగా వ్యవహరిస్తుంది. ఇప్పుడీ ఈ ఫీచర్‌ను తొలగించడంపై నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మస్క్ తీసుకున్న నిర్ణయం కారణంగా ఆన్లైన్లో వేధింపులు ఎక్కువయ్యే అవకాశం ఉందని ఎక్స్ వినియోగదారులు ఆరోపిస్తున్నారు. చదవండి👉ఎదురుచూపులకు ఫుల్స్టాప్.. జియో ఫైనాన్స్ లిస్టింగ్ ఎప్పటినుంచంటే? -
GST On X: ట్విటర్ నుంచి డబ్బులు వస్తున్నాయా? జీఎస్టీ తప్పదు!
న్యూఢిల్లీ: ప్రకటనల ఆదాయంలో వాటాల కింద సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఎక్స్ (గతంలో ట్విటర్) నుంచి వ్యక్తులకు వచ్చే ఆదాయం కూడా జీఎస్టీ పరిధిలోకి వస్తుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇలాంటి కంటెంట్ క్రియేషన్‌ను సర్వీసు కింద పరిగణిస్తారు, దాని ద్వారా వచ్చే ఆదాయంపై 18 శాతం ట్యాక్స్ వర్తిస్తుందని పేర్కొన్నారు. ఒక సంవత్సరంలో అద్దె ఆదాయం, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ, ఇతరత్రా ప్రొఫెషనల్ సర్వీసులు వంటి వివిధ సర్వీసుల నుంచి వచ్చే మొత్తం ఆదాయం రూ. 20 లక్షలు దాటిన పక్షంలో ఈ నిబంధన అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఎక్స్ ఇటీవల ప్రకటనలపై తనకు వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని ప్రీమియం సబ్‌స్క్రైబర్స్‌కి కూడా అందించడం ప్రారంభించింది. ఇందుకోసం సదరు సబ్‌స్క్రయిబర్స్ పోస్టులకు గత మూడు నెలల్లో 1.5 కోట్ల ఇంప్రెషన్లు, కనీసం 500 మంది ఫాలోయర్లు ఉండాలి. ఎక్స్ నుంచి తమకు ఆదాయం వచ్చినట్లు పలువురు సోషల్ మీడియా యూజర్లు ఈమధ్య పోస్ట్ చేశారు. -
ట్వీట్లతో రెచ్చిపోండి.. యూజర్లకు మస్క్ బంపరాఫర్
‘ట్వీట్లతో రెచ్చిపోండి.. దీని వల్ల ఏవైనా ఇబ్బందులు ఎదురై లీగల్‌గా అయ్యే ఖర్చులు నేను చూసుకుంటా’ అంటున్నారు ఎక్స్ (ట్విటర్) అధినేత ఎలాన్ మస్క్. ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగం బాగా పెరిగిపోయింది. ప్రతిఒక్కరూ ట్విటర్, ఇతర సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటున్నారు. ఇలా తమ సోషల్ మీడియా ఖాతాల్లో పలు అంశాలపై వివిధ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు స్పందిస్తుంటారు. ఈ క్రమంలో ఒక్కోసారి ఆయా కంపెనీల యాజమాన్యాల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. కొన్నిసార్లు ఆయా కంపెనీలు లీగల్‌గానూ ఉద్యోగులను ఇబ్బందులు పెడుతుంటాయి. అలాంటి వారికి అండగా నిలుస్తామని మస్క్ ప్రకటించారు. ఎక్స్ ప్లాట్ఫామ్లో ట్వీట్లు చేసే, లైక్ కొట్టే, కామెంట్లు చేసే ఉద్యోగులను వారి యాజమాన్యాలు, కంపెనీలు లీగల్‌గా వేధిస్తే దానికి ఎదుర్కొనేందుకు యూజర్లకు అండగా నిలుస్తామని, అందుకయ్యే మొత్తాన్ని భరిస్తామని మస్క్ తాజాగా ట్వీట్ చేశారు. ఇందుకు ఎటువంటి పరిమితి లేదని, అటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. దీనిపై అధిక సంఖ్యలో యూజర్లు ప్రతిస్పందించారు. మస్క్‌ను పొడగ్తలతో ముంచేస్తూ కామెంట్లు పెట్టారు. ట్విటర్ ఇటీవల దాని ఐకానిక్ బ్లూ బర్డ్ లోగోను తొలగించి దాని స్థానంలో ‘ఎక్స్’ను తీసుకొచ్చింది. ట్విటర్‌ను పూర్తిగా రీబ్రాండ్ చేసే ప్రయత్నంలో భాగంగా దాని అధినేత మస్క్ ఈ మార్పు చేశారు. ఇది జరిగిన కొన్ని రోజులకే ఆ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తున్న మంత్లీ యూజర్లు 540 మిలియన్లకు పైగా పెరిగారంటూ చూపించే గ్రాఫ్ షేర్ చేస్తూ "కొత్త గరిష్టానికి" చేరుకున్నట్లు ప్రకటించారు. Zuck × Musk fight: ‘జుక్ × మస్క్’ కుబేరుల కోట్లాట లైవ్.. ఆ ఆదాయంతో.. ఇలా మస్క్ ఓ వైపు కంపెనీలో సంస్థాగత మార్పులు చేసుకుంటూ పోతుంటే మరోవైపు దీనికి పోటీగా మెటా థ్రెడ్స్ యాప్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దాని నుంచి పోటీని ఎదుర్కొనేందుకు తమ యూజర్లకు మస్క్ ఈ ప్రకటించినట్లు తెలుస్తోంది. యాక్టివ్ యూజర్లు పెరిగినప్పటికీ ప్రకటనల ఆదాయంలో తగ్గుదల కారణంగా ప్రతికూల నగదు ప్రవాహం ఎదుర్కొంటున్నట్లు మస్క్ కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. If you were unfairly treated by your employer due to posting or liking something on this platform, we will fund your legal bill. No limit. Please let us know. — Elon Musk (@elonmusk) August 6, 2023 -
ఆ ఒక్క మాట జీవితాన్ని మార్చేసింది.. జాక్‌పాట్ కొట్టిన యువతి
ట్విటర్(ఎక్స్.కామ్)లో ట్రోలింగ్‌కు గురైన ఓ యువతి జాక్‌పాట్ కొట్టేసింది. ఎడ్యుకేషన్ పూర్తి చేసిన వెంటనే తమ సంస్థలో పనిచేసేందుకు ఆహ్వానం పంపారు ట్రూ కాలర్ సీఈవో అలాన్ మామెడి భారత్‌కు చెందిన ఏక్తా అనే యువతి కెనడాలో బయోటెక్నాలజీ విభాగంలో చదువుతున్నారు. ఈ క్రమంలో ఆ యువతి తన స్నేహితులతో సరదా గడిపేందుకు భయటకు వచ్చారు. అదే సమయంలో ఏక్తాకు ఓ యుట్యూబర్ మీ పేరు? ఎక్కడ నుంచి వచ్చారు? కెనడాకు ఎందుకు వచ్చారు?ఏం చదువుతున్నారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అందులో సదరు యూట్యూబర్ ఇక్కడికి ఎందుకు వచ్చారు అనే ప్రశ్నకు ఏక్తా.. ‘భారత్‌ను వదిలి రావడం నా కల’ అంటూ బదులిచ్చారు. ఆమె అర్ధం.. బాగా చదువుకుని కెనడాలో వ్యాపార వేత్తగా ఇక్కడే స్థిరపడాలని అనుకుంటున్నాని చెప్పారు. కానీ ఆమె స్పందనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని వదిలేయడం నీ డ్రీమా అంటూ ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. అయితే, ఈ ట్రోలింగ్‌పై ట్రూల్ కాలర్ సీఈవో అలాన్ మామెడి స్పందించారు.‘బయటి ప్రపంచం ఏమంటుందో వాటిని నువ్వు వినొద్దు అని ట్వీట్ చేశారు. చదువు పూర్తి చేసిన తర్వాత ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ట్రూ కాలర్ కార్యాలయంలో పనిచేసేందుకు స్వాగతం అంటూ జాబ్ ఆఫర్ ఇచ్చారు. ‘‘మీరు ఆమె మాటల్ని అపార్ధం చేసుకున్నారు. ట్రోలింగ్ చేయడం సరికాదు. ఏక్తా!! నిన్ను ఎగతాళి చేస్తున్న వారిని గురించి అస్సలు పట్టించుకోవద్దు. నువ్వు కూల్‌గా ఉండు. నీ కలల్ని నెరవేర్చుకునే దిశగా..వాటితోనే కలిసి జీవిస్తున్నావు. చదువు పూర్తి చేయ్ ట్రూ కాలర్ పనిచేసేందుకు మిమ్మల్ని స్వాగతిస్తున్నా అని పేర్కొన్నారు. ఏక్తాపై మామెడి ట్వీట్‌కు మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు అతని మాటలను ప్రశంసించగా, మరికొందరు విమర్శిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఇంటర్వ్యూలో ఆమె ఏమన్నారో మీరూ చూసేయండి. People really want to misunderstand her to make fun of her. This is not OK!! Ekta, don't listen to all these clowns making fun of you. I think you're cool and living the dream! When you're done with school, you're welcome to work at Truecaller in any of our offices around the 🌏 https://t.co/PuotNAMwKK — Alan Mamedi (@AlanMamedi) August 3, 2023 -
ట్వీట్లతో ‘X.COM’లో డబ్బు సంపాదించేయండి.. మీకు కావాల్సిన అర్హతలివే!
X's ads revenue programme: ట్విటర్ (x.com) అధినేత ఎలాన్ మస్క్ యూజర్లకు బంపరాఫర్ ప్రకటించారు. ట్విట్లతో డబ్బులు సంపాదించుకునే వెసలు బాటు కల్పించారు. ఇందుకోసం మస్క్ యాడ్ రెవెన్యూ షేరింగ్ ఫీచర్‌ను డెవలప్ చేశారు. దీని సాయంతో యూజర్లు ఎక్స్ డాట్ కామ్‌లో చేసే ట్వీట్లపై యూజర్ల ఎంగేజ్మెంట్ ఆధారంగా ఆయా కంపెనీల యాడ్స్ డిస్ప్లే కానున్నాయి. వాటికి అనుగుణంగా యూజర్లు మనీని ఎర్న్ చేయొచ్చు. ఈ ఫీచర్‌పై ఎక్స్.కామ్ యాజమాన్యం స్పందించింది. కంటెంట్ క్రియేటర్లు ఈ ఫీచర్ వినియోగించుకొని సోషల్ మీడియా(x.com) ఫ్లాట్‌ఫామ్‌లో నేరుగా డబ్బులు సంపాదించుకోవచ్చని తెలిపింది. ప్రస్తుతం, ఈ ఫీచర్ భారత్‌తో పాటు ప్రపంచ దేశాల్లో సైతం అందుబాటులోకి తెచ్చింది. ఎక్స్.కామ్‌లో యూజర్లు డబ్బులు సంపాదించుకునేందుకు కావాల్సిన అర్హతలు ►ఎక్స్.కామ్‌లో యాడ్స్ రెవెన్యూ షేరింగ్ ఫీచర్‌ను పొందాలంటే యూజర్లు ముందుగా ట్విటర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకోవాలి. లేదంటే ఎక్స్. కామ్ గుర్తింపు పొందిన సంస్థ ఉండాలి. ►మూడు నెలల లోపల యూజర్లు చేసిన ట్విట్లపై 15 మిలియన్ ఇంప్రెషన్స్ ఉండాలి. ►500 ఫాలోవర్స్ తప్పనిసరి. ►పైన పేర్కొన్న అర్హతలు ఉంటే యూజర్లు ఎక్స్.కామ్ నుంచి డబ్బులు పొందవచ్చు. ఇందుకోసం యూజర్లు వినియోగించే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్‌లలో స్ట్రైప్ ఆప్షన్ తప్పని సరిగా ఉండాలి. స్ట్రైప్ అనేది ఓ సర్వీస్ మాత్రమే. ఈ స్ట్రైప్ సర్వీసుల్ని ఆయా బ్యాంక్‌లు, ఇతర ఫైనాన్షియ్ కంపెనీలు అందిస్తుంటాయి. ఈ స్ట్రైప్ ఫ్లాట్‌ఫామ్ ద్వారా ఎక్స్. కామ్ యూజర్ల అకౌంట్లకు డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ►అంతేకాకుండా, అర్హులైన యూజర్లు కంపెనీ ప్రకటనల రాబడి వాటా నిబంధనల్ని కూడా పాటించాలి ►ఈ నిబంధనలలో క్రియేటర్ మానిటైజేషన్ ప్రమాణాలు, ఎక్స్.కామ్ నియమాలు ఉన్నాయి. సెట్టింగ్‌లలోని మానిటైజేషన్ ఆప్షన్‌ను యాక్సెస్ చేయడం ద్వారా వినియోగదారులు క్రియేటర్ సబ్స్క్రిప్షన్లు, యాడ్స్ రెవెన్యూ షేరింగ్ రెండింటికీ అప్లయ్ చేసుకోవచ్చు. ఇక, వినియోగదారులు యాడ్స్ రెవెన్యూ షేర్ నిబంధనల్ని ఉల్లంఘించినట్లు గుర్తిస్తే వారు ఎక్స్. కామ్ ద్వారా డబ్బులు సంపాదించుకునే అవకాశాన్ని కోల్పోతారు. ఎక్స్.కామ్‌లో సంపాదించిన డబ్బుల్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే ముందుగా, ఎక్స్.కామ్‌లోని ట్విట్ అనే ఆప్షన్‌పై మోర్‌పై ట్యాప్ చేయాలి. చేస్తే మీకు మానిటైజేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సైడ్ మెనూలో ‘‘జాయిన్ అండ్ పే అవుట్ సెటప్’’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేస్తే పేమెంట్ ప్రాసెస్ అవుతుంది. ఈ సమయంలో ఎక్స్.కామ్ నుంచి మీ బ్యాంక్ అకౌంట్‌కు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేందుకు మరికొన్ని ఆప్షన్స్‌లో అడిగిన వివరాల్ని ఎంటర్ చేయాలి. ఇదంతా పూర్తయితే వినియోగదారులు ఎక్స్. కామ్ క్రమం తప్పకుండా డబ్బులు చెల్లిస్తుంది. మినిమం 50 డాలర్ల ఉంటే ఎక్స్.కామ్ నుంచి డబ్బుల్ని డ్రా చేసుకోవచ్చు. అర్హులైన యూజర్లు ప్రతినెల చివరి వారంలో పెమెంట్స్ను పొందవచ్చని ఎక్స్.కామ్ యాజమాన్యం పేర్కొంది. చదవండి👉 ఎంతపని చేశావయ్యా ఎలన్ మస్క్?