నిత్యం వ్యాపార వ‍్యవహారాల్లో తలమునకలయ్యే మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సరదాగా ఈ-బైక్‌ని నడిపారు. వెంటనే సదరు బైక్ వివరాల్ని ‘ఎక్స్’(ట్విటర్)వేదికగా వెల్లడించారు.
సైకిల్ తొక్కటమంటే ఎవరికి ఇష్టముండదు? అన్నివయసుల వారికీ ఆసక్తే. చాలామంది సంప్రదాయ సైకిళ్లను ఇష్టపడుతుంటారు గానీ నేటి తరానికి ఎలక్ట్రిక్ బైకులంటే మక్కువ. రెండింటి ఉద్దేశం ఒకటే అయినప్పటికీ ఇ-బైకుల్లోని వివిధ భద్రత ఫీచర్లు బాగా ఆకట్టుకుంటుంటాయి.
దీన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ కేంద్రంగా ఐఐటీ- బాంబే పూర్వ విద్యార్ధులు నిషిత్ పరిక్, రాజ్ కుమార్ కెవాత్‌లు దేశంలోనే తొలిసారి ‘హార్న్‌బ్యాక్’(hornbakc) పేరుతో ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ బైక్‌ను మ్యాని ఫ్యాక్చరింగ్ స్టార్టప్‌ను ప్రారంభించారు. ఆ సంస్థ తయారు చేసిన ఈ-బైక్‌ను ఆనంద్ మహీంద్రా డ్రైవ్ చేశారు.
A bunch of IIT Bombay guys have made us proud again. They’ve created the first foldable diamond frame e-bike with full-size wheels in the world. That makes the bike not only 35% more efficient than other foldable bikes but it makes the bike stable at higher than medium speed. And… pic.twitter.com/U1HHGD6rfL
— anand mahindra (@anandmahindra) October 21, 2023
అనంతరం, 'ఐఐటీ బాంబే కుర్రాళ్లు మళ్లీ గర్వపడేలా చేశారు. ప్రపంచంలోనే పూర్తి స్థాయి చక్రాలతో మొట్టమొదటి ఫోల్డబుల్ డైమండ్ ఫ్రేమ్ ఇ-బైక్ ను రూపొందించారు. ఇది ఇతర ఫోల్డబుల్ బైక్‌ల కంటే వీళ్లు తయారు చేసిన ఇ-బైక్ 35శాతం కంటే ఎక్కువ సమర్థవంతంగా పని చేయడమే కాకుండా, మీడియం స్పీడ్ కంటే ఎక్కువ వేగంతో బైక్‌ను డ్రైవ్ చేయొచ్చు’ అంటూ మహీంద్రా ఈ ఇ-బైక్ నడుపుతున్న చిత్రాలను షేర్ చేస్తూ పోస్ట్ చేశారు.
‘మడతపెట్టిన తర్వాత లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేని ఏకైక బైక్ ఇది. ఆఫీసు కాంపౌండ్ చుట్టూ తిరగడానికి నా సొంత హార్న్ బ్యాక్ ఎక్స్1 ను తీసుకున్నాను! నేను వారి స్టార్టప్‌లో పెట్టుబడి పెట్టాను అని ఆయన చెప్పారు.
ఈ ఫోల్డబుల్ ఇ-బైక్ గురించి మరిన్ని విశేషాలు
►హార్న్‌బ్యాక్ ఎక్స్1 గ్రే-ఆరెంజ్, బ్లూ-ఆరెంజ్ కలర్ వేరియంట్‌లో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.44,999. రూ.14,999 మూడు నెలల నో కాస్ట్ ఈఎంఐతో దీన్ని సొంతం చేసుకోవచ్చు.
►ఇందులో 36వీ, 7.65ఏహెచ్ బ్యాటరీని అమర్చారు. సింపుల్‌గా 2 పిన్‌ప్లగ్ పాయింట్‌తో బ్యాటరీని ఛార్జ్ చేయొచ్చు. దీనిని ఫుల్ ఛార్జ్ చేయడానికి నాలుగు గంటల సమయం పడుతుంది.
►కంపెనీ ప్రకారం, హార్న్‌బ్యాక్ ఇ-బైక్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే సగటున 45 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. స్టోరేజ్, ప్రయాణ సమయాల్లో వాహనదారులకు వీలుగా ఫోల్డబుల్‌గా తయారు చేసింది.
►కంపెనీ ఫిజికల్ స్టోర్ల నుంచి తన ఇ-బైక్‌ను విక్రయించడం లేదని పేర్కొంది. తమ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫామ్‌లలో కొనుగోలు చేయొచ్చు. ఎలక్ట్రిక్ సైకిళ్ల యొక్క అన్ని భాగాలపై కంపెనీ రెండు సంవత్సరాల వారంటీని అందిస్తుందని ఆనంద్ మహీంద్రా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment