e-bikes
-
ప్యూర్ ఎలక్ట్రిక్ బైక్‌లపై రూ.20వేల డిస్కౌంట్
ముంబై: పండుగ సీజన్ సందర్భంగా ఎలక్ట్రిక్ టూ–వీలర్ల సంస్థ ప్యూర్ ఈవీ తమ రెండు మోడల్స్‌పై రూ. 20,000 డిస్కౌంటు ప్రకటించింది. ఎకోడ్రిఫ్ట్, ఈట్రైస్ట్ ఎక్స్ మోటర్సైకిల్స్పై ఇది వర్తిస్తుంది. దీనితో ప్రారంభ ధర రూ. 99,999కి తగ్గినట్లవుతుంది.నవంబర్ 10 వరకు ఈ ఆఫర్ ఉంటుందని సంస్థ వ్యవస్థాపకుడు డి. నిశాంత్ తెలిపారు. రోజువారీ వినియోగం కోసం ఎకోడ్రిఫ్ట్, శక్తివంతమైన రైడింగ్ అనుభూతి కోరుకునే వారి కోసం ఈట్రైస్ట్ ఎక్స్ (171 కి.మీ. రేంజి) అనువుగా ఉంటాయని వివరించారు. -
‘క్లిప్’ ఉంటే మీ సైకిల్ ఇక ఈ-సైకిల్
ప్రపంచవ్యాప్తంగా ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం బాగా పెరిగింది. ఈ–స్కూటర్లు, బైక్‌లే కాకుండా, ఈ–సైకిళ్లు కూడా వాడుకలోకి వచ్చాయి. మామూలు సైకిల్‌ను నడిపించాలంటే, పెడల్ తొక్కక తప్పదు. బలం ఉపయోగించక తప్పదు. ఎగుడు దిగుడు దారుల్లో ఎక్కువ దూరం సైకిల్ మీద వెళ్లాలంటే అలసట తప్పదు...ఇక అలాంటి ఇబ్బందేమీ ఉండదు. ఈ ‘క్లిప్’ను సైకిల్ ముందు చక్రం వైపు తగిలిస్తే చాలు, మామూలు సైకిల్ కూడా ఈ–సైకిల్‌గా మారిపోతుంది. ఇది ఎలక్ట్రిక్ మోటార్ క్లిప్. ఇది 26 అంగుళాలు, 28 అంగుళాల టైర్లకు సరిపోతుంది. దీనిలోని స్ప్రింగ్‌లోడెడ్ క్లాంప్ను ముందు చక్రం ఫోర్క్‌కు తగిలించుకుంటే, గట్టిగా పట్టి ఉంటుంది.ఇదీ చదవండి: హైదరాబాద్ హైస్పీడ్ ఎలక్ట్రిక్ బైక్లుఇందులోని లిథియం అయాన్ బ్యాటరీ ద్వారా సరఫరా అయ్యే విద్యుత్తుతో మామూలు సైకిల్ కూడా ఇట్టే ఈ–సైకిల్‌గా మారి, గంటకు గరిష్ఠంగా 25 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. అమెరికన్ కంపెనీ ‘క్లిప్ బైక్’ దీనిని రూపొందించింది. దీని ధర 499 డాలర్లు (రూ.41,799). -
ధోనీ... ఈసారి ఇలా కానియ్!
ఎం.ఎస్. ధోనీ కెప్టెన్షిప్ క్వాలిటీస్ మాత్రమే కాదు సరికొత్త హెయిర్ స్టైల్, సరికొత్త బైక్ కూడా నెటిజనులకు ఆసక్తికరమే. తాజాగా ధోని ‘డూడుల్ వీ3 ’ ఇ–బైక్ రైడింగ్ వీడియో వైరల్ అయింది. రోజుల వ్యవధిలోనే 1.3 మిలియన్ల వ్యూస్‌తో దూసుకు΄ోతుంది. ధోని రైడింగ్ వీడియోలు వైరల్ కావడం కొత్త కానప్పటికీ ఎకో–ఫ్రెండ్లీ మోడ్ ఆఫ్ ట్రాన్స్΄ోర్టేషన్ను ప్రమోట్ చేసే ఈ మేడ్–ఇన్–ఇండియా ఎలక్ట్రికల్ సైకిల్ వీడియో నెటిజనులలో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించింది. -
ఆనంద్ మహీంద్రా ఫిదా, అరె!.. ఇ-బైక్ భలే ఉందే!
నిత్యం వ్యాపార వ్యవహారాల్లో తలమునకలయ్యే మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సరదాగా ఈ-బైక్‌ని నడిపారు. వెంటనే సదరు బైక్ వివరాల్ని ‘ఎక్స్’(ట్విటర్)వేదికగా వెల్లడించారు. సైకిల్ తొక్కటమంటే ఎవరికి ఇష్టముండదు? అన్నివయసుల వారికీ ఆసక్తే. చాలామంది సంప్రదాయ సైకిళ్లను ఇష్టపడుతుంటారు గానీ నేటి తరానికి ఎలక్ట్రిక్ బైకులంటే మక్కువ. రెండింటి ఉద్దేశం ఒకటే అయినప్పటికీ ఇ-బైకుల్లోని వివిధ భద్రత ఫీచర్లు బాగా ఆకట్టుకుంటుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ కేంద్రంగా ఐఐటీ- బాంబే పూర్వ విద్యార్ధులు నిషిత్ పరిక్, రాజ్ కుమార్ కెవాత్లు దేశంలోనే తొలిసారి ‘హార్న్‌బ్యాక్’(hornbakc) పేరుతో ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ బైక్‌ను మ్యాని ఫ్యాక్చరింగ్ స్టార్టప్‌ను ప్రారంభించారు. ఆ సంస్థ తయారు చేసిన ఈ-బైక్‌ను ఆనంద్ మహీంద్రా డ్రైవ్ చేశారు. A bunch of IIT Bombay guys have made us proud again. They’ve created the first foldable diamond frame e-bike with full-size wheels in the world. That makes the bike not only 35% more efficient than other foldable bikes but it makes the bike stable at higher than medium speed. And… pic.twitter.com/U1HHGD6rfL — anand mahindra (@anandmahindra) October 21, 2023 అనంతరం, 'ఐఐటీ బాంబే కుర్రాళ్లు మళ్లీ గర్వపడేలా చేశారు. ప్రపంచంలోనే పూర్తి స్థాయి చక్రాలతో మొట్టమొదటి ఫోల్డబుల్ డైమండ్ ఫ్రేమ్ ఇ-బైక్ ను రూపొందించారు. ఇది ఇతర ఫోల్డబుల్ బైక్‌ల కంటే వీళ్లు తయారు చేసిన ఇ-బైక్ 35శాతం కంటే ఎక్కువ సమర్థవంతంగా పని చేయడమే కాకుండా, మీడియం స్పీడ్ కంటే ఎక్కువ వేగంతో బైక్‌ను డ్రైవ్ చేయొచ్చు’ అంటూ మహీంద్రా ఈ ఇ-బైక్ నడుపుతున్న చిత్రాలను షేర్ చేస్తూ పోస్ట్ చేశారు. ‘మడతపెట్టిన తర్వాత లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేని ఏకైక బైక్ ఇది. ఆఫీసు కాంపౌండ్ చుట్టూ తిరగడానికి నా సొంత హార్న్ బ్యాక్ ఎక్స్1 ను తీసుకున్నాను! నేను వారి స్టార్టప్‌లో పెట్టుబడి పెట్టాను అని ఆయన చెప్పారు. ఈ ఫోల్డబుల్ ఇ-బైక్ గురించి మరిన్ని విశేషాలు ►హార్న్‌బ్యాక్ ఎక్స్1 గ్రే-ఆరెంజ్, బ్లూ-ఆరెంజ్ కలర్ వేరియంట్లో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.44,999. రూ.14,999 మూడు నెలల నో కాస్ట్ ఈఎంఐతో దీన్ని సొంతం చేసుకోవచ్చు. ►ఇందులో 36వీ, 7.65ఏహెచ్ బ్యాటరీని అమర్చారు. సింపుల్‌గా 2 పిన్ప్లగ్ పాయింట్‌తో బ్యాటరీని ఛార్జ్ చేయొచ్చు. దీనిని ఫుల్ ఛార్జ్ చేయడానికి నాలుగు గంటల సమయం పడుతుంది. ►కంపెనీ ప్రకారం, హార్న్‌బ్యాక్ ఇ-బైక్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే సగటున 45 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. స్టోరేజ్, ప్రయాణ సమయాల్లో వాహనదారులకు వీలుగా ఫోల్డబుల్‌గా తయారు చేసింది. ►కంపెనీ ఫిజికల్ స్టోర్ల నుంచి తన ఇ-బైక్‌ను విక్రయించడం లేదని పేర్కొంది. తమ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫామ్‌లలో కొనుగోలు చేయొచ్చు. ఎలక్ట్రిక్ సైకిళ్ల యొక్క అన్ని భాగాలపై కంపెనీ రెండు సంవత్సరాల వారంటీని అందిస్తుందని ఆనంద్ మహీంద్రా తెలిపారు. -
ఈ–బైక్ కొనాలంటే.. త్వరపడండి!
సాక్షి, అమరావతి: ఈ–బైక్ కొనాలనుకుంటున్నారా. అయితే, త్వరపడండి. ఈ ఏడాది జూన్ 1వ తేదీ తర్వాత రిజిస్టర్ అయ్యే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై వర్తించే ఫేమ్–2 (దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ప్రోత్సాహం) పథకం కింద అందించే సబ్సిడీని తగ్గించాలని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం ఈ బైక్స్‌పై 15 శాతం నుంచి 40 శాతం వరకూ సబ్సిడీ లభిస్తుండటంతో వీటిని కొనుగోలు చేయడానికి వాహనదారులు ఆసక్తి చూపిస్తున్నారు. కాగా.. కేంద్ర నిర్ణయంతో ఇకపై వాహన ధరలో కేవలం 15 శాతం లేదా కిలోవాట్ అవర్ (కేడబ్ల్యూహెచ్)కు రూ.10 వేలు ఏది తక్కువైతే అది మాత్రమే సబ్సిడీగా లభించనుంది. భారీ షాక్ ఇది విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం కోసం కేంద్రం ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఎస్‌ఏఎంఈ) పథకాన్ని తీసుకొచ్చింది. ఇందుకోసం 2019–22 మధ్య మూడేళ్ల కాలానికి ఫేమ్ పథకంలో రూ.10 వేల కోట్లను కేటాయించింది. మన రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలు ఈ పథకం ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ)లను ప్రోత్సహించడానికి ప్రత్యేక విధివిధానాలను రూపొందించాయి. ఈ పథకాన్ని 2024 మార్చి 31 వరకూ పొడిగిస్తున్నట్టు కేంద్రం ఈ ఏడాది జనవరిలో ప్రకటించింది. దీనిద్వారా ప్రైవేట్ ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తోంది. ద్విచక్ర వాహనాలకు కిలోవాట్‌కు రూ.15 వేలను, త్రిచక్ర, నాలుగు చక్రాల వాహనాలకు రూ.10 వేలను, బస్సులకు రూ.20 వేలను రాయితీగా అందిస్తోంది. దీంతో ఏపీలో దాదాపు 22 వేలు, దేశవ్యాప్తంగా 4 లక్షల విద్యుత్ వాహనాల విక్రయం జరిగింది. కానీ సబ్సిడీని కుదిస్తున్నట్టు ప్రకటించి తాజాగా కేంద్రం పెద్ద షాక్ ఇచ్చింది. పెట్రోల్ వాహనాలతో పోలిస్తే 4.9 శాతమే నిజానికి అంతర్జాతీయంగా ఈవీల శాతం పెట్రోల్ వాహనాలతో పోలిస్తే 20 శాతంగా ఉంది. మన దేశంలో ఇది కేవలం కేవలం 4.9 శాతం మాత్రమే. కనీసం అంతర్జాతీయ బెంచ్ మార్క్‌ను చేరుకునే వరకైనా రాయితీలను కొనసాగిస్తే మంచిదనే వాదనలు మార్కెట్ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. అయితే భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కొన్ని నెలల క్రితమే దీని గురించి చెప్పుకొచ్చింది. రానున్న నాలుగేళ్లలో 1 మిలియన్ ఈవీ అమ్మకాల లక్ష్యాన్ని చేరుకోనున్నామని, ఆ తర్వాత సబ్సిడీని కొనసాగించలేమని స్పష్టం చేసింది. కానీ ఒక లీటర్ పెట్రోల్ 2.3 కిలోల కాలుష్యాన్ని విడుదల చేస్తుంది. ఈవీల కొనుగోలు తగ్గితే 2030 నాటికి 1 మిలియన్ కర్బన ఉద్గారాలను (కాలుష్యం) తగ్గించాలనే లక్ష్యాన్ని చేరుకోలేకపోవచ్చని పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఈవీ రంగంలోకి హీరో మోటోకార్ప్, వందల కోట్ల పెట్టుబడులు
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ వెహికల్స్‌పై దృష్టి సారించింది. కొనుగోలు దారులకు అభిరుచికి అనుగుణంగా ఈవీ వెహికల్స్‌ను తయారు చేయనుంది. ఇందుకోసం అమెరికాకు చెందిన జీరో మోటార్ సైకిల్స్‌తో జత కలిసింది. ఆ సంస్థలో రూ.490కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్లు హీరో మోటోకార్ప్ తెలిపింది. తద్వారా హీరో మోటోకార్ప్, జీరో మోటార్లు సంయుక్తంగా ఈవీ వెహికల్స్‌ను విడుదల చేయనున్నాయి. ప్రపంచంలోనే లార్జెస్ట్ టూవీలర్ తయారీ సంస్థగా పేరొందిన జీరో మోటార్స్ వెహిలక్స్, పవర్ ట్రైన్లను తయారు చేస్తుంది. తొలి బైక్ విడుదల మరోవైపు హీరో మోటోకార్ప్ మొబిలిటీ బ్రాండ్ విడా భాగస్వామ్యంతో అక్టోబర్ 7 తొలి ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేయనుంది. ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీ ఏథర్ ఎనర్జీలో 35 శాతానికి పైగా వాటా ఉన్న హీరో మోటాకార్ప్.. తాజాగా జీరో మోటార్స్‌లో పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. ఆ ప్రకటనతో ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. దీంతో గురువారం బీఎస్ఈలో కంపెనీ షేర్లు 2.11 శాతం తగ్గి రూ.2,534.20 వద్ద ముగిశాయి. -
ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు జూమ్..
న్యూఢిల్లీ: దేశీయంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రిచక్ర వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరగనున్నాయి. 2030 నాటికి మొత్తం అమ్మకాల్లో వీటి వాటా 50-70 శాతం వరకూ ఉండనుంది. ఆటోమోటివ్ విడిభాగాల తయారీ సంస్థల సమాఖ్య ఏసీఎంఏ, కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సే సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఏసీఎంఏ సదస్సు సందర్భంగా దీన్ని ఆవిష్కరించారు. ఈ నివేదిక ప్రకారం ప్యాసింజర్, భారీ వాణిజ్య వాహనాలతో పోలిస్తే నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉండటమనేది ఎలక్ట్రిక్ ద్వి, త్రిచక్ర వాహనాల విషయంలో ఆకర్షణీయ అంశంగా ఉండనుంది. దేశీయంగా ప్యాసింజర్, భారీ వాణిజ్య వాహనాల విభాగంలో విద్యుదీకరణ నెమ్మదిగా ఉండనుంది. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్లతో (ఐసీఈ) నడిచే వాహనాల ఆధిపత్యమే కొనసాగనుంది. 2030 నాటికి కొత్త వాహనాల అమ్మకాల్లో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల వాటా 10-15 శాతం, విద్యుత్ వాణిజ్య వాహనాల వాటా 5-10 శాతంగా ఉండనుంది. (బిలియనీర్ అదానీ భారీ పెట్టుబడులు: అంబానీకి షాకేనా?) నివేదిక ప్రకారం వచ్చే దశాబ్దకాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడమనేది వాహనాల పరిశ్రమ దిశను మార్చేయనుంది. యూరప్, చైనా మార్కెట్లు ఈ మార్పునకు సారథ్యం వహించనుండగా, మిగతా ప్రపంచ దేశాలు వాటిని అనుసరించనున్నాయి. ఈ దశాబ్దం మధ్య నాటికి భారత్, చైనాలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు గరిష్ట స్థాయికి పుంజుకోనున్నాయి. సమీప కాలంలో సరఫరాపరమైన అంతరాయాలు ఎదురైనప్పటికీ వాహనాల పరిశ్రమకు దీర్ఘకాలికంగా అవకాశాలు అత్యంత ఆశావహంగానే ఉన్నట్లు నివేదిక పేర్కొంది. పరిశ్రమ ముఖచిత్రం మారుతున్న నేపథ్యంలో దేశీ ఆటో విడిభాగాల పరిశ్రమ సాంప్రదాయ మార్కెట్లకే పరిమితం కాకుండా కొత్త మార్కెట్లకు కూడా ఎగుమతులను పెంచుకోవాల్సిన అవసరం ఉందని సూచించింది. (Swiggy, Zepto: లేట్ నైట్ అయినా సరే.. చిటికెలో డెలివరీ!) -
అల్లూరి జిల్లా: అక్కా.. తమ్ముడు.. ఓ స్కూటర్
అక్క కోసం ఓ తమ్ముడు తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. ఏకంగా బండిని బ్యాటరీతో నడిచేలా తయారు చేశాడు. ఇంకేంముంది.! అక్క తక్కువ ఖర్చుతో బ్యాటరీ స్కూటర్‌పై రయ్‌రయ్‌మంటూ దూసుకుపోతోంది. తమ్ముడు కృషిని అక్కతో పాటు ఇరుగుపొరుగు వారు ప్రశంసిస్తున్నారు. సాక్షి, అల్లూరి జిల్లా: జిల్లాలోని రాజవొమ్మంగికి చెందిన సామన సురేష్ స్థానికంగా ఎలక్ట్రీషియన్. ఫ్యాన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు రిపేర్ చేస్తూ ఉపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలో మోటారు ఏ విధంగా పని పని చేస్తుంది? బ్యాటరీ పనితనం తదితర అంశాలను బాగా ఆకళింపు చేసుకున్నాడు. కాగా.. రాజవొమ్మంగికి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో సురేష్ అక్క వెంకటలక్ష్మి బ్రాంచ్ పోస్ట్ మాస్టారుగా పనిచేస్తున్నారు. ఆమె రోజూ స్కూటర్‌పై విధులకు వెళ్తుంటుంది. ఈ క్రమంలో.. పెట్రోల్ ధరలు పెరగడం, ఒకటి రెండు సార్లు ఆమె తన భర్తను పెట్రోల్ కోసం డబ్బులు అడగటం సురేష్ చెవిన పడింది. పెట్రోల్‌తో నడిచే ఆ స్కూటర్ మైలేజ్ లీటరుకు 30 కిలోమీటర్లే వస్తోంది. కిలోమీటరుకు సుమారు రూ.4 ఖర్చవుతోంది. రోజూ 12 కిలోమీటర్ల దూరం వెళ్లి వచ్చేందుకు సుమారు రూ.96 అవసరం. ఇలా నెలకు రూ.2,880 ఖర్చవుతోంది. ఆమె చేసేది చిన్న ఉద్యోగం. అందులో సగం జీతం పెట్రోలు ఖర్చులకే పోతుండటంతో సురేష్ ఆలోచనలో పడ్డాడు. అప్పటికే.. సురేష్ బ్యాటరీతో నడిచే ఓ సైకిల్ తయారు చేసి ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించాడు. కానీ అక్కను సైకిల్‌పై పోస్టాఫీసుకు వెళ్లమనడం ఇష్టం లేక.. ఆమె ఉపయోగించే స్కూటర్‌కే బ్యాటరీలు అమర్చే పనిలో పడ్డాడు. మెదడుకు పదును పెట్టి దాదాపు రెండు వారాలు కష్టపడ్డాడు. అతని కృషి ఫలించింది. స్కూటర్‌ను ఇటు పెట్రోల్‌తో.. అలాగే బ్యాటరీతోనూ నడిచేలా తయారు చేశాడు. సురేష్ తెలివితేటలకు ఆమె మురిసిపోయారు. రయ్ రయ్‌మంటూ రోడ్లపై పరుగులు తీస్తున్న స్కూటర్‌తో మరింత అనుబంధం పెంచుకున్నారు. సెల్‌ఫోన్‌కు మాదిరిగానే బ్యాటరీ చార్జ్ చేస్తే సరిపోతుండటంతో వెంకటలక్ష్మి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇప్పుడిక బండిలో పెట్రోలు ఉందా లేదా చూడనవసరం లేకుండా ఝామ్మని ఆఫీసుకు దూసుకెళ్లిపోతున్నారు. 3 గంటలు చార్జ్ చేస్తే 60 కి.మీ. వెళ్లొచ్చు పెట్రోల్‌తో నడిచే స్కూటర్‌ను బ్యాటరీతో కూడా నడిచేదిగా తయారు చేసేందుకు తనకు రూ. 28,000 ఖర్చయిందని సురేష్ తెలిపారు. మూడు 12 ఓల్ట్స్ బ్యాటరీలతో తయారు చేసిన ఈ స్కూటర్‌కు మూడు గంటల పాటు చార్జ్ చేస్తే 60 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. పైకి పెట్రోల్ స్కూటర్ మాదిరిగా ఉన్న బ్యాటరీ స్కూటర్‌ను స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఇదీ చదవండి: కవిత్వమే ఆయుధమై.. చైతన్య తూటాలను పేల్చి.. -
Joy E-Bike: 500 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.115 ఖర్చు..!
దేశంలో ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల ఊపు అందుకుంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దేశీయంగా కూడా పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉండవచ్చు అని చాలా మంది ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ మధ్య మార్కెట్లోకి వచ్చిన ఓ ఎలక్ట్రిక్ బైక్ కేవలం 23 పైసలకు 1 కిలోమీటరు నడవనున్నట్లు కంపెనీ పేర్కొంది. జాయ్ ఇ-బైక్ మాన్స్టర్ ఎలక్ట్రిక్ బైకును ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 95 కిలోమీటర్ల ప్రయాణిస్తుంది. ఈ బైక్ మీద 500 కిలోమీటర్లు ప్రయాణించడానికి అయ్యే ఖర్చు కేవలం 115 రూపాయలే మాత్రమే అవుతుంది. సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, ఈ బైక్ 72V, 39 AH లిథియం అయాన్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ బైక్ 1500వాట్ డీసీ బ్రష్‌లెస్ హబ్ మోటార్‌తో పనిచేస్తుంది. జాయ్ ఈ-బైక్ మాన్స్టర్ ఫుల్ ఛార్జ్ చేయడానికి కనీసం 5 నుంచి 5.5 గంటల సమయం పడుతుంది. ఈ బైక్ బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేయడానికి 3.3 యూనిట్ల విద్యుత్ ఖర్చు అవుతుంది. ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 60 కి.మీ కాగా ఎలక్ట్రిక్ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.98,666గా ఉంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ Revolt Motors RV 400 వంటి ఇతర ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లతో పోటీపడుతుంది. జాయ్ ఈ-బైక్స్ ఎక్స్ షోరూమ్ ధరలపై సుమారు 12 వేల సబ్సిడీను గుజరాత్ ప్రభుత్వం అందిస్తోంది. ఈ సబ్సిడీ కేవలం గుజరాత్లో చదువుకునే తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి విద్యార్థులకు వర్తించనుంది. జాయ్ ఈ-బైక్స్ శ్రేణిలోని జెన్ నెక్ట్స్, వోల్ఫ్, గ్లోబ్, మాన్స్టర్ వేరియంట్లకు ఈ సబ్సిడీ లభించనుంది. (చదవండి: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుందా..?) -
ఈ- వాహనాలకు మేలు చేసిన కరోనా!
లండన్: ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకు పెరిగిపోతోన్న వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా ప్రపంచ దేశాల్లో, ముఖ్యంగా వాహన రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. పెట్రోలు, డీజిల్ వాహనాలు క్రమంగా మాయం అవుతున్నాయి. ఆ స్థానంలో ఈ–కార్లతోపాటు ఈ–బైకులు, ఈ–సైకిళ్లు వస్తున్నాయి. ప్రజల జీవన ప్రమాణాలు, అలవాట్లకు అనుగుణంగా వీటిలో వేల మోడల్స్ వస్తున్నాయి. 2020, ఏప్రిల్ నెల నాటికి ఇంగ్లండ్ రోడ్లపైకి దాదాపు మూడు లక్షల ఎలక్ట్రిక్ కార్లు రానున్నాయి. కరోనా వైరస్ కారణంగా ఎన్నో కష్టనష్టాలు ఎదురవుతోన్న ఎలక్ట్రానిక్ వాహనాలకు మాత్రం కరోనా కారణంగా మేలే జరిగింది. ఈ రంగానికి కొత్త ఊపునిచ్చింది. కరోనా వైరస్‌కు వాతావరణ కాలుష్యం కూడా తోడై ప్రమాదకర పరిస్థితులు ఉత్పన్నం అవుతుండడంతో ఎలక్ట్రానిక్ వాహనాల రంగానికి పలు దేశాల ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతనిస్తుండడంతో టార్గెట్లు ముందుకు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే బ్రిటన్‌లోని అతిపెద్ద సైక్లింగ్ కంపెనీ ‘హాల్‌ఫోర్డ్స్’ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎలక్ట్రిక్, హైబ్రీడ్ వాహనాల సర్వీసు రంగంలో అనూహ్యంగా దూసుకుపోయింది. ‘హాల్‌ఫోర్డ్స్’కు దేశంలో 300లకు పైగా ఆటోసెంటర్లను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ఏ కంపెనీకి లేనివిధంగా ఈ కంపెనీ 30 ఈ బైకుల మోడల్స్‌ను తీసుకొచ్చింది. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుబోతున్న ‘గ్జివోమి ఎం 365’ ఈ స్కూటర్ ఈ కంపెనీకి చెందినదే కావడం విశేషం. ఈ సైకిళ్లకు, సాధారణ సైకిళ్లకు పెద్ద తేడాలేదు, ఓ చిన్న బ్యాటరీ, దాంతో తిరిగే చిన్న మోటారు తప్ప. పైగా ఇన్సురెన్స్ అవసరం లేదు. రోడ్డు పన్ను అసలే లేదు. చదవండి: కరోనాకు వ్యాక్సిన్లు రావడం ఓ భ్రమేనా!? -
రివోల్ట్ ఇ-బైక్స్ లాంచ్
సాక్షి, హైదరాబాద్: రివోల్ట్ ఇంటెల్లి కార్పొరేషన్ తన ఈ-బైక్‌లను హైదరాబాద్ మార్కెట్లో లాంచ్ చేసింది. రివోల్ట్ ఆర్వీ 400, ఆర్వీ300 పేరుతో ఈ ఎలక్ట్రిక్ మోటారు సైకిళ్లను విడుదల చేసింది. ఈ సందర్భంగా టెలికార్ప్ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ మాట్లాడుతూ స్థిరమైన, సరసమైన ఎలక్ట్రిక్ వాహనాలను ప్రజలకు అందుబాటులో తెచ్చే క్రమంలో తమ నిబద్ధతను తమకొత్త వాహనాలు ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు. నగదు చెల్లించి తీసుకుంటే ఆర్వీ 400 బైక్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.1,03,999. దీనికి బుకింగ్ చార్జ్ రూ.3,999 అదనం. ఆర్వీ300 మోటార్ సైకిల్ ధర రూ. 84,999. దీనికి రూ.2,999 బుకింగ్ చార్జ్ అదనం. 38 నెలలు నెలకు రూ.3,999 చెల్లించి ఆర్వీ400ను ముందుగానే పొందే అవకాశంకూడా అందుబాటులో వుంది. ఆర్వీ300 బైక్‌కు నెలకు రూ.2,999 చొప్పున 36 నెలలు చెల్లించాలి. బుకింగ్ ఫీజు అదనం. ఆర్వీ 400 బైక్: 3.24 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ, ఇది ఒకసారి చార్జింగ్ చేస్తే 150 కిలోమీటర్లు వెళుతుందని చెప్పారు. గంట కు గరిష్ఠంగా 85 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అలాగే రివాల్ట్ గూగుల్ భాగస్వామ్యంతో కనెక్ట్ చేసిన హెల్మెట్‌ను కూడా అందిస్తుంది. ఇది రైడర్‌ను వాయిస్ కమాండ్, రివాల్ట్ స్టార్ట్ ఉపయోగించి బైక్‌ను ప్రారంభించడానికి అనుమతిస్తుంది. కాగా ఢిల్లీ పుణేలలో ఇప్పటికే ఈ బైక్‌లను ఇప్పటికే లాంచ్ చేసింది. -
ఈ-బైక్స్‌తో ఎంజాయ్..!
శ్రీకాకుళం సిటీ:‘చంద్రరావు రూరల్ పోలీస్ హెచ్‌సీగా పని చేస్తున్నారు. మూడేళ్ల కిందటి వరకు పెట్రోల్‌తో నడిచే బైక్‌ను నడిపేవారు. పెట్రోల్ ధరలు పెరగడంతో బైక్ నిర్వహణకు రోజుకు రూ.50 అయ్యేది. నెలనెలా ఖర్చు పెరగడంతో ఎలక్ట్ట్రానిక్ బైక్(ఈ-బైక్) గురించి తెలుసుకుని కొనుగోలు చేశారు. రెండున్నరేళ్లుగా అదే వాహనంపై నెలకు కేవలం సగటున రూ.50 లోపు ఖర్చుతోనే విధులకు వెళ్తున్నాడు..’ ఈయన ఒక్కరే కాదు జిల్లాలో వందలాది మంది పెరిగిన పెట్రోల్ ధరలతో విసిగిపోయే విద్యుత్ ఆధారిత బైక్‌లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఖర్చులను తగ్గించుకుంటున్నారు. మరోవైపు ఆర్టీఓ అధికారుల తనిఖీల గొడవ లేకుండా దర్జాగా రాకపోకలు సాగిస్తున్నారు. వివిధ కంపెనీల ఈ-బైక్‌లు సరసమైన ధరలకు అందుబాటులోకి రావడంతో కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. లెసైన్స్ అక్కర్లేదు...చార్జింగ్ ఉంటే చాలు.. బైకుపై రోడ్డెక్కాలంటే ఏమూల పోలీస్‌లు ఆపుతారో... లెసైన్స్ ఏదీ..పొల్యూషన్ ఎక్కడ..! అంటూ అడుగుతారనే భయాందోళనలతోనే అత్యధిక శాతం మంది వాహనచోదకులు హడలిపోవడం నిత్యం చూస్తుంటాం. అయితే, ఈ బైక్‌లకు ఇవే మీ అవసరంలేదు. కేవలం తక్కువ విద్యుత్ చార్జింగ్తోనే హ్యాపీగా ప్రయాణం చేసుకోవచ్చు. డ్రైవింగ్ లెసైన్స్, రిజిస్ట్రేషన్, బండి నంబర్ సిస్టమ్, పొల్యూషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్, హెల్మెట్లతో పాటు ముఖ్యంగా పెట్రోల్ వంటి ఖరీదైన ఇంధనాల వినియోగం అవసరం లేదు. దీంతో అధికమంది ఈ బైక్‌ల కొనుగోలుకు క్యూకడుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ ఈ బైక్‌ల వినియోగం ఏటా పెరుగుతూ వస్తోంది. కాలుష్య రహిత బైక్‌గా... ఇంధనాల కారణంగా పట్టణాలతో పాటు గ్రామాలు కూడా పూర్తిగా కాలుష్య ప్రాంతాలుగా మారిపోతున్నాయి. అయితే, పర్యావరణ సమస్యలు ఎక్కువవుతున్న ఈ రోజుల్లో ఎటువంటి కాలుష్యం లేనివిగా ఈ బైక్‌లు పేరుపొందారుు. విద్యుత్ ఆధారంగా ప్రయూణం చేయడంతో పొగ, ధ్వనులు కూడా రావు. అరుుతే, ఈ వాహనాలు 2004 నుంచి జిల్లాలో అందుబాటులోకి వచ్చినప్పటికీ, అప్పట్లో చైనా మేడ్ వాహనాలు కావడంతో పెద్దగా ఎవ్వరూ ఆసక్తి చూపలేదు. అప్పట్లో 23-27 వేల రూపాయల మధ్య ధరల్లో విక్రయించిన ఈ బైక్‌లు గంటకు కేవలం 25 కిలోమీటర్ల వేగం ఉండేది. తాజాగా ఇండియన్ మేడ్ వాహనాల స్పీడ్ 40 కిలోమీటర్ల వరకు ఉండడం, 200 కేజీల బరువు మోయగల సామర్థ్యం ఉండడంతో 40-60 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తులు, 18-25 ఏళ్ల లోపు వయసుగల యువతీయువకులు ఈ బైకుల కొనుగోళ్లపై దృష్టిసారిస్తున్నారు. ఈ-బైక్‌ల ధరలు కూడా రూ.41వేల నుంచి రూ.42 వేల మధ్యనే ఉన్నారుు. 1.25 యూనిట్ల ఖర్చుతో 70 కిలోమీటర్లు ...! వింటుంటే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజమే. కేవలం 1.25 యూనిట్ల విద్యుత్ ఖర్చుతో 70 కిలోమీటర్ల వరకు ఈబైకులపై ప్రయాణించే అవకాశముంది. ఇందులో అమర్చిన బ్యాటరీని 3-8 గంటల పాటు చార్జింగ్ (అంటే 1.25 యూనిట్లకు సమానం)చేయిస్తే చాలు.. ఎంచక్కా..70 కిలోమీటర్ల వరకు (40 కిలోమీటర్ల లోపు స్పీడ్‌తో) నగరాన్ని చుట్టేయవచ్చు. ఉదాహరణకు 25 వేల కిలోమీటర్ల (ఒక బ్యాటరీ లైఫ్) దూరం తిరగడానికి ఈ బైక్‌కు 12,250 రూపాయలు మాత్రమే ఖర్చు అయితే, అదే దూరం ప్రయాణించడానికి పెట్రోల్ బైక్‌కు రూ.47,500 ఖర్చు అవుతుంది. ఒక కిలోమీటర్ దూరం ప్రయాణానికి ఈ-బైక్‌కు అయ్యే విద్యుత్ ఖర్చు కేవలం 49 పైసలు మాత్రమే కాగా, పెట్రోల్ బైక్‌కు రూ. 1.90 పైసలు అవుతుంది. దీంతో ఇంధన ఆదాతో పాటు ఇతరత్రా బైక్ నిర్వహణ భారం పడదు. అందరికీ ఇష్టమే.. బ్యాటరీ బైకులు వినియోగమంటే అందరికీ ఇష్టమే. ఖర్చు తక్కువగా ఉండడంతో పాటు ఎటువంటి లెసైన్స్‌లు, ఇతరత్రాలేమీ అక్కర్లేదు. అయితే ఈ-బైక్స్ వినియోగాన్ని చిన్నచూపుగా చూస్తున్నారు. ఎక్కువ శబ్దాలు వచ్చే బైక్‌లంటే ఇష్టపడడమే దీనికి కారణం. ప్రస్తుతం భారతీయ కంపెనీ తయూరు చేసిన జె-500, డీలక్స్ రకాల బైకులకు డిమాండ్ ఉంది. - రెడ్డి రాజారావు, బాల భాస్కర ఆటో మొబైల్స్ యజమాని, శ్రీకాకుళం