ప్రపంచవ్యాప్తంగా ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం బాగా పెరిగింది. ఈ–స్కూటర్లు, బైక్‌లే కాకుండా, ఈ–సైకిళ్లు కూడా వాడుకలోకి వచ్చాయి. మామూలు సైకిల్‌ను నడిపించాలంటే, పెడల్ తొక్కక తప్పదు. బలం ఉపయోగించక తప్పదు. ఎగుడు దిగుడు దారుల్లో ఎక్కువ దూరం సైకిల్ మీద వెళ్లాలంటే అలసట తప్పదు...
ఇక అలాంటి ఇబ్బందేమీ ఉండదు. ఈ ‘క్లిప్’ను సైకిల్ ముందు చక్రం వైపు తగిలిస్తే చాలు, మామూలు సైకిల్ కూడా ఈ–సైకిల్‌గా మారిపోతుంది. ఇది ఎలక్ట్రిక్ మోటార్ క్లిప్. ఇది 26 అంగుళాలు, 28 అంగుళాల టైర్లకు సరిపోతుంది. దీనిలోని స్ప్రింగ్‌లోడెడ్ క్లాంప్‌ను ముందు చక్రం ఫోర్క్‌కు తగిలించుకుంటే, గట్టిగా పట్టి ఉంటుంది.
ఇదీ చదవండి: హైదరాబాద్ హైస్పీడ్ ఎలక్ట్రిక్ బైక్‌లు
ఇందులోని లిథియం అయాన్ బ్యాటరీ ద్వారా సరఫరా అయ్యే విద్యుత్తుతో మామూలు సైకిల్ కూడా ఇట్టే ఈ–సైకిల్‌గా మారి, గంటకు గరిష్ఠంగా 25 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. అమెరికన్ కంపెనీ ‘క్లిప్ బైక్’ దీనిని రూపొందించింది. దీని ధర 499 డాలర్లు (రూ.41,799).
Comments
Please login to add a commentAdd a comment