cycle
-
హైటెక్ కుర్రాడు..! 14 ఏళ్లకే ఆవిష్కరణలు..
ఎందుకు? ఏమిటి? ఎలా? అనే ఆసక్తి చిన్న వయసులోనే గగన్చంద్రలో మొదలైంది. ఆ ఆసక్తే గగన్‌ను ఆవిష్కరణల బాటలో నడిపిస్తోంది. ‘హైబ్రీడ్ త్రీ ఇన్ వన్’ సైకిల్ రూపకల్పనతో ప్రశంసలు అందుకుంటున్నాడు....సోలార్ విద్యుత్తు, బ్యాటరీ, అవసరమైనప్పుడు పెట్రోల్‌తోనూ నడిచే హైబ్రీడ్ త్రీ ఇన్ వన్ సైకిల్‌కు రూపకల్పన చేశాడు 14 ఏళ్ల గగన్ చంద్ర. ఎలాంటి ఖర్చు లేకుండా బ్యాటరీతో 35 కి.మీ దూరం వరకు ప్రయాణించడంతో పాటు సోలార్ విద్యుత్ సాయంతో రోజంతా ప్రయాణించేలా సైకిల్‌ను రూపొందించాడు.సాధారణ సైకిల్‌కు ఎలక్ట్రికల్ బ్యాటరీ, సోలార్ ప్యానెల్, హబ్ మోటారును అమర్చి హైబ్రీడ్ సైకిల్‌ను తయారుచేశాడు. ఈ సైకిల్‌కు డిజిటల్ స్పీడో మీటర్, సెంట్రల్ లాక్ సిస్టమ్ తోపాటు నావిగేషన్, జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశాడు. అధునాతన వాహనాల మాదిరిగానే ఈ సైకిల్‌కు ఉన్న జీపీఎస్ ద్వారా ఎక్కడి నుంచైనా ట్రాకింగ్ చేయవచ్చు. మొబైల్ వాయిస్ కమాండ్, అలెక్సా ద్వారా మ్యూజిక్, కాల్స్ ఆపరేట్ చేసేలా సైకిల్‌ను రూపొందించాడు. సైకిల్లో కంట్రోల్ బాక్స్‌ను గగన్ సొంతంగా తయారుచేశాడు. అవసరమైన సామాగ్రిని ఆన్లైన్లో కొనుగోలు చేశాడు. మొత్తం రూ. 20వేల వరకు ఖర్చయిందని, భవిష్యత్తులో ఈ ఖర్చును మరింత తగ్గిస్తాను అంటున్నాడు గగన్.నల్లమల అటవీ ప్రాంతమైన నాగర్‌కర్నూల్ జిల్లాలోని బల్మూరు మండల కేంద్రానికి చెందిన గౌరమోని గగన్ చంద్ర 9వ తరగతి విద్యార్థి. ఇటీవల పుదుచ్చేరిలో నిర్వహించిన ‘సదర్న్ ఇండియా సైన్స్ ఫేర్’లో మూడో బహుమతి అందుకున్నాడు. వివిధ రాష్ట్రాల నుంచి 250 మంది ఈ సైన్స్ ఫేర్‌లో పాల్గొన్నారు. ఫిబ్రవరిలో నిర్వహించనున్న జాతీయస్థాయి సైన్స్ ఫేర్‌కు ఎంపికయ్యాడు.‘నా కొడుకు రెండో తరగతి నుంచే పాత వస్తువులతో ప్రయోగాలు చేసేవాడు. వాడి పడేసిన వస్తువులతో లైట్లు, మోటార్లు, కూలర్లు తయారు చేసేవాడు. ఇల్లు చిన్నగా ఉండటంతో వాటిని పడేసేదాన్ని. అప్పుడప్పుడూ కోపడ్డాను. ఇప్పుడు అందరూ మెచ్చుకుంటుంటే సంతోషంగా ఉంది’ అంటుంది గగన్ తల్లి నాగరాణి.ఇక ఎలక్ట్రికల్ కారు ఎలక్ట్రికల్ సైకిల్ కొనేందుకు వెళ్తే అరవై వేలు చెప్పారు. దాంతో నేనే ఇరవై వేలతో సొంతంగా తయారుచేసుకున్నాను. విద్యార్థులకు ఉపయోగపడేలా ఇంకా తక్కువ ఖర్చులో అయ్యేలా చూస్తాను. భవిష్యత్తులో ఎక్కువ మంది ప్రయాణించేలా, తక్కువ ఖర్చులో ఎలక్ట్రికల్ కారును రూపొందించాలనుకుంటున్నాని చెబుతున్నాడు గగన్ చంద్ర.–పాదం వెంకటేశ్, సాక్షి, నాగర్‌కర్నూల్ (చదవండి: ఊబకాయం సమస్యకి వంటనూనె కారణమా..? మోదీ అందుకే అలా ..) -
పుష్ప క్రేజ్ మామూలుగా లేదుగా.. ఏకంగా 1600 కిలోమీటర్లు!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప మూవీ తర్వాత ఆయన రేంజ్ వరల్డ్ వైడ్‌గా పెరిగిపోయింది. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు సైతం అల్లు అర్జున్ అంటే పిచ్చి అభిమానం. ఇక విదేశాల్లోనే అంత క్రేజ్ ఉంటే మనదేశంలో ఏ రేంజ్లో ఉంటుందో చూస్తేనే అర్థమవుతోంది.తాజాగా ఓ వీరాభిమాని తన ఫేవరేట్ హీరోను కలిసేందుకు పెద్ద సాహసమే చేశాడు. యూపీలోని అలీగఢ్‌కు చెందిన ఓ అభిమాని ఏకంగా 1600 కిలోమీటర్లకు పైగా సైకిల్‌పై హైదరాబాద్‌కు వచ్చాడు. అల్లు అర్జున్ను కలిసేందుకు సైకిల్‌పై వచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు ఉత్తర్‌ప్రదేశ్ వాసి.దీంతో అతని అభిమానానికి ఫిదా అయిన అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యాడు. అతన్ని అప్యాయంగా పలకరించి వివరాలు ఆరా తీశాడు. పుష్ప-2 ప్రమోషన్స్ కోసం యూపీకి వస్తే కచ్చితంగా కలుస్తానని ఐకాన్ స్టార్ అతనితో అన్నారు. తనను కలిసిన అభిమానికి అల్లు అర్జున్ మొక్కను బహుమతిగా ఇచ్చాడు. అతనికి మంచి భోజనం పెట్టించి.. తిరిగి బస్సులో పంపించాలని తన సిబ్బందికి సూచించారు బన్నీ. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది."DEMI GOD" for his fans. Apt 🙏🙏🙏A fan from north India uttarpradesh, aligarh city came to meet his hero on cycle.🙏He is trying to meet from last few days Finally A fan moment for him! ♥️LOVE YOU ICON @alluarjun 🙌 pic.twitter.com/WJdogwJxWQ— Trends Allu Arjun ™ (@TrendsAlluArjun) October 16, 2024 -
‘క్లిప్’ ఉంటే మీ సైకిల్ ఇక ఈ-సైకిల్
ప్రపంచవ్యాప్తంగా ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం బాగా పెరిగింది. ఈ–స్కూటర్లు, బైక్‌లే కాకుండా, ఈ–సైకిళ్లు కూడా వాడుకలోకి వచ్చాయి. మామూలు సైకిల్‌ను నడిపించాలంటే, పెడల్ తొక్కక తప్పదు. బలం ఉపయోగించక తప్పదు. ఎగుడు దిగుడు దారుల్లో ఎక్కువ దూరం సైకిల్ మీద వెళ్లాలంటే అలసట తప్పదు...ఇక అలాంటి ఇబ్బందేమీ ఉండదు. ఈ ‘క్లిప్’ను సైకిల్ ముందు చక్రం వైపు తగిలిస్తే చాలు, మామూలు సైకిల్ కూడా ఈ–సైకిల్‌గా మారిపోతుంది. ఇది ఎలక్ట్రిక్ మోటార్ క్లిప్. ఇది 26 అంగుళాలు, 28 అంగుళాల టైర్లకు సరిపోతుంది. దీనిలోని స్ప్రింగ్‌లోడెడ్ క్లాంప్ను ముందు చక్రం ఫోర్క్‌కు తగిలించుకుంటే, గట్టిగా పట్టి ఉంటుంది.ఇదీ చదవండి: హైదరాబాద్ హైస్పీడ్ ఎలక్ట్రిక్ బైక్లుఇందులోని లిథియం అయాన్ బ్యాటరీ ద్వారా సరఫరా అయ్యే విద్యుత్తుతో మామూలు సైకిల్ కూడా ఇట్టే ఈ–సైకిల్‌గా మారి, గంటకు గరిష్ఠంగా 25 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. అమెరికన్ కంపెనీ ‘క్లిప్ బైక్’ దీనిని రూపొందించింది. దీని ధర 499 డాలర్లు (రూ.41,799). -
సైకిల్‌పై వచ్చిన స్టార్ హీరో.. వీడియో వైరల్!
కోలీవుడ్ స్టార్ హీరో, నిర్మాత విశాల్ చెన్నైలో సందడి చేశారు. చాలా సింపుల్‌గా సైకిల్ తొక్కుతూ కనిపించారు. నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి అయిన విశాల్ 68వ సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ సమావేశానికి హాజరయ్యేందుకు కార్యాలయానికి వచ్చారు. సైకిల్‌పై తమ అభిమాన హీరో రావడంతో ఫ్యాన్స్ చుట్టుముట్టారు. అక్కడే గేట్ దగ్గర ఉన్న అభిమానులతో విశాల్ కరచాలనం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. ఇటీవల మాలీవుడ్‌లో హేమ కమిటీ నివేదిక తర్వాత ఇండస్ట్రీలో మహిళల భద్రత అంశం చర్చనీయాంశంగా మారింది. దీంతో కొద్దిరోజుల క్రితమే నడిగర్ సంఘం సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. మరో పది రోజుల్లో నడిగర్ సంఘం ప్రత్యేక కమిటీ వేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయని.. త్వరలోనే ప్రకటన వస్తుందని విశాల్ వెల్లడించారు. ఎవరైనా వేధింపులకు పాల్పడినట్లు రుజువైతే ఇండస్ట్రీ నుంచి ఐదేళ్లపాటు నిషేధిస్తామని ఇటీవల నిర్ణయించిన సంగతి తెలిసిందే. VIDEO | Actor Vishal arrives on a bicycle to attend 68th South Indian Artist Association meeting being organised in Chennai.(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/EYP25aY3rb— Press Trust of India (@PTI_News) September 8, 2024 -
క్రియేటివిటీకి ఆనంద్ మహీంద్రా ఫిదా..!
-
Video: 14 ఏళ్లు ప్రధానిగా సేవలు.. ఓటమి తర్వాత సైకిల్‌పై ఇంటికి!
జీవితంలో ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని పెద్దలు చెబుతూ ఉంటారు. ఎంత ఆస్తి సంపాదించినా, ఎన్ని మంచి పనులు చేసినా.. గర్వం, అహంకారం దరిచేరకుండా నిరాడంబరంగా ఉండాలనేది దీని సారంశం. కొందరికి డబ్బు, అధికారం అందగానే గొప్పగా జీవిస్తుంటారు.. కానీ మరికొందరు తాము ఎంత పెద్ద స్థాయిలో ఉన్న సింపుల్‌గానే జీవిస్తుంటారు. అందుకు నిదర్శనంగా నిలిచారు. డచ్ ప్రధాని మార్క్ రుట్టే..ఇటీవల జరిగిన నెదర్లాండ్స్ ప్రధానమంత్రిగా 14 ఏళ్లు సేవలందించిన మార్క్ రుట్టే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే కొత్త పీఎంగా ఎన్నికైన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ డిక్ షూఫ్‌కు అధికారికంగా బాధ్యతలు అప్పగించి రుట్టే సాధారణ పౌరుడిగా సైకిల్ తొక్కుంటూ వెళ్లిపోయారు.రుట్టే సైకిల్‌పై వెళ్లిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఆయన సైకిల్‌పై అధ్యక్ష భవనం నుంచి బయటకు వస్తున్న సమయంలో కొంతమంది రుట్టేను చప్పట్లు కొట్టి ప్రశంసించడం వీడియోలో చూడొచ్చు. అయితే, రూట్టేకు ‘సైకిల్ రైడ్’ చేయడం ఇదే తొలిసారి కాదు. ఇంతకుముందు కూడా సభలకు సైకిల్‌పై వచ్చి తన నిరాడంబరతను, అంకితభావాన్ని చాటారాయన.అయితే డచ్ పద్ధతిలో ఇలా చేయడం ఆ దేశ ఆచారమని అంటున్నారు. ఎలాగైతే ఖాళీ చేతులతో ప్రజలకు ప్రాతినిధ్యం వహించడానికి వచ్చారో, అలాగే వెళ్లిపోవడం అక్కడ జరుగుతుందట. ఇక ఇక 14 ఏళ్లు నెదర్లాండ్స్ ప్రధానిగా సేవలు అందించిన మార్క్ రుట్టే.. వచ్చే ఏడాది 'నాటో' కొత్త సెక్రటరీ జనరల్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.After 14 years in power, this is how former Dutch Prime Minister Mark Rutte left the Prime Minister's Office after completing the ceremony of officially handing over power to his successor, Dick Schoof.#netherlands pic.twitter.com/exux8saX0D— Kiran Bedi (@thekiranbedi) July 6, 2024 -
‘సైకిల్’ దొంగ దొరికాడోచ్!
గుంటూరు: పొన్నూరు నియోజకవర్గంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి, తాయిలాల ఎరవేసి ఓట్లు దక్కించుకునేందుకు టీడీపీ పన్నాగం పన్నింది. విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసి తల్లిదండ్రుల మెప్పుపొందేందుకు భారీ సంఖ్యలో సైకిళ్లను కొనుగోలు చేసింది. టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల స్వగ్రామం చింతలపూడిలోని ఓ రైస్‌మిల్లులో నిల్వ చేశారు. సమాచారం అందుకున్న ఎన్నికల అధికారులు వాటిని సీజ్ చేశారు. శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు పొన్నూరు నియోజకవర్గం ఎన్నికల అధికారులకు ఫోన్ చేశారు. మండలంలోని చింతలపూడి గ్రామంలోని ఓ రైస్‌మిల్‌లో టీడీపీ నేత, ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర ఫొటో, సైకిల్ గుర్తుతో ఉన్న నూతన సైకిళ్లు వందల సంఖ్యలో ఉన్నాయని సమాచారం అందింది. వెంటనే అధికారులు హుటాహుటిన రైస్‌మిల్‌కు చేరుకుని వందల సంఖ్యలో ఉన్న సైకిళ్లను చూసి అవాక్కయ్యారు. అన్ని సైకిళ్లకు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ రంగు, గుర్తులు, అభ్యర్థి ఫొటో ఉండటంతో అన్ని సైకిళ్లను సీజ్ చేశారు. సంఘటనా స్థలానికి ఓ వ్యక్తి చేరుకుని తాను కోర్టు ద్వారా ఆక్షన్‌లో సైకిళ్లను దక్కించుకున్నానని, అధికారులకు తెలిపాడు. అయితే ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా సైకిళ్లు ఉన్నాయని, ఒకేచోట పార్టీ సింబల్స్‌తో ఇన్ని సైకిళ్లు ఉండరాదని తేల్చిచెప్పారు. కోడ్ ఉల్లంఘించిన కారణంగా 567 సైకిళ్లను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారి వరదరాజులు, ఏంపీడీవో రత్నజ్యోతి తెలిపారు. ధూళిపాళ్ల నరేంద్ర ఎన్నికల తాయిలాల పంపకంతోనే విజయం సాధించే ప్రక్రియకు ఎన్నికల అధికారులు అడ్డుకట్ట వేశారు. ఇవి చదవండి: ‘ఆమ్ ఆద్మీ’ని అంతం చేసే కుట్ర -
సైకిల్‌పై అద్వానీ.. పోస్టాఫీసులో కమల.. పెళ్లి జరిగిందిలా!
బీజేపీ మాజీ అధ్యక్షుడు, అటల్ ప్రభుత్వంలో ఉప ప్రధాని సేవలందించిన లాల్ కృష్ణ అద్వానీకి అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ను అందజేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ నేపధ్యంలో అద్వానీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. భారత రాజకీయాల్లో భీష్మ పితామహునిగా పేరొందిన అద్వానీ రాజకీయ జీవితంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా మార్గదర్శకునిగా నిలిచారు. కమలతో అద్వానీ వివాహం అత్యంత విచిత్ర పరిస్థితుల్లో జరిగింది. కమలా అద్వానీ పాకిస్తాన్‌లోని సింధ్‌లో జన్మించారు. ఆమె అసలు పేరు కమలా జగత్యాని. విభజన తర్వాత వారి కుటుంబం భారతదేశానికి తరలి వచ్చింది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన కమల చదువు పూర్తి చేసుకున్నాక, ఢిల్లీ పోస్టాఫీసులో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఇదీ చదవండి: ఎల్కే అద్వానీకి భారతరత్న.. మోదీ భావోద్వేగం అదే సమయంలో ఆమెకు లాల్ కృష్ణ అద్వానీ నుంచి వివాహ ప్రతిపాదన వచ్చింది. అప్పట్లో లాల్ కృష్ణ అద్వానీ జర్నలిస్టుగా పనిచేసేవారు. ప్యాంటు షర్టు వేసుకుని, సైకిల్‌పై ఆఫీసుకు వెళ్లేవారు. కమల అద్వానీలకు 1965, ఫిబ్రవరి 25న వివాహం జరిగింది. అద్వానీ భార్య కమలా అద్వానీ రాజకీయాల్లో కాలుమోపనప్పటికీ, పలు కార్యక్రమాలలో అద్వానీతో పాటు కనిపించారు. ఆమె అద్వానీ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేవారు. అలాగే అద్వానీ తినే ఆహారం మొదలుకొని, అతనిని కలుసుకునే వారి జాబితా వరకు అన్నింటిపై కమలా అద్వానీ ఒక కన్నేసి ఉంచేవారు. అద్వానీ ఒక సందర్భంలో తాను దేశానికే హోంమంత్రినని, ఇంటిలో తన సతీమణి కమలనే హోంమంత్రి అంటూ చమత్కరించారు. -
అది పాత సైకిలే.. కానీ వారి ఆనందం వెలలేనిది!
ఒక్కోసారి చిన్నచిన్న ఆనందాలు కూడా వెలకట్టలేనంత సంతృప్తినిస్తాయి. ఎవరికైనా చిన్నతనంలో కుటుంబంతో గడిపిన ప్రతి క్షణం జీవితాంతం గుర్తుండిపోతుంది. మనం బాల్యంలో అందుకున్న చిన్నపాటి మిఠాయి కూడా మనల్ని ఆనందడోలికల్లో ముంచెత్తుతుంది. ఇటీవల అటువంటి ఆనందాలను తిరగతోడే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ ఎమోషనల్ వీడియో చిన్నిచిన్ని సంతోషాలను ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో నేర్పుతుంది. తండ్రీకుమారుల ఆనందం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఎవరి హృదయాన్నయినా ఇట్టే ఆకట్టుకుంటుంది. ఈ 15 సెకన్ల వీడియోలో తండ్రీకొడుకులు తమ ఇంటి ముందు సైకిల్ దగ్గర నిలబడి ఉండటాన్ని గమనించవచ్చు. తరువాత తండ్రి ఆ సైకిల్‌కు పూలమాల వేసి, నీటిని చిలకరించిన తర్వాత, సైకిల్‌కు పూజ చేస్తాడు. దీనిని చూస్తూ పిల్లవాడు ఆనందంతో గెంతులేస్తుంటాడు. వీడియోలో కనిపిస్తున్న సైకిల్ పాతదే కావచ్చు కానీ వారి ఆనందం వర్ణించేందుకు వీలు కాకుండా ఉంది. ఈ వీడియోను ఐఎఎస్ అధికారి అవనీష్ శరణ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. వీడియోను షేర్ చేసిన ఆయన.. ‘ఇది సెకండ్ హ్యాండ్ సైకిల్ మాత్రమే. అయినా వారి ముఖాల్లో సంతోషాన్ని ఒక్కసారి చూస్తే.. కొత్త మెర్సిడెస్ బెంజ్ కొన్నట్లుగా ఉంది. ఈ వీడియోను ఇప్పటివరకూ 85 వేల మందికి పైగా లైక్ చేయగా, 3 వేల మందికి పైగా యూజర్లు వీడియోపై తమ ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. ఒక యూజర్ ‘బహుశా ప్రపంచంలోని ఖజానానంతా వెచ్చించినా ఇంతటి ఆనందాన్ని కొనుగోలు చేయలేకపోవచ్చు’ అని రాశారు. మరొక యూజర్ ‘వీరి సంతోషానికి ధర లేదు సార్’ అని రాశారు. అయితే కొంతమంది వినియోగదారులు ఈ వీడియోను షేర్ చేసే బదులు మీరు వారికి కొత్త సైకిల్ కొనుగోలు చేసి ఇవ్వవచ్చుకదా అని ఆ ఐఏఎస్ అధికారికి సూచించారు. ఇది కూడా చదవండి: ఖలిస్తానీ ఉగ్రవాదుల ఓసీఐ కార్డుల రద్దు? It’s just a second-hand bicycle. Look at the joy on their faces. Their expression says, they have bought a New Mercedes Benz.❤️ pic.twitter.com/e6PUVjLLZW — Awanish Sharan 🇮🇳 (@AwanishSharan) May 21, 2022 -
కాలువ శుభ్రం చేస్తుంటే వందలకొద్దీ సైకిళ్లు.. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి?
భారతదేశం అయినా విదేశాల్లో అయినా సరే ప్రతి పౌరుడి బాధ్యత తన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం. విదేశాల్లో రోడ్డుపై చెత్త వేయడం నేరంతో సమానం. ఇందుకు కఠినమైన నిబంధనలు అమలులో ఉన్నాయి. అయినా చాలామంది నిర్లక్ష్య ధోరణితోనే వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ఇందుకు నిదర్శనంగా నిలిచింది. ఈ వీడియోలో కాలువను శుభ్రం చేస్తున్న దృశ్యం కనిపిస్తుంది. మురుగునీటిలో నుంచి పెద్ద సంఖ్యలో సైకిళ్లు బయటకు వచ్చి, కుప్పగా ఏర్పడిన తీరు వీడియోలో కనిపిస్తుంది. నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. కాలువను శుభ్రం చేస్తున్న కార్మికులు నీటి అడుగునుంచి పలు సైకిళ్లను వెలికితీశారు. జేసీబీతో ఈ క్లీనింగ్ పనులను చేపట్టారు. ఈ క్లిప్ @fasc1nate అనే ఖాతాతో ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘ది గార్డియన్’ నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం వేలాది బైక్‌లు, సైకిళ్లను నదులు, చెరువులు, సరస్సులలో విసిరివేస్తున్నారు. ఇదేవిధంగా బైక్‌లు, సైకిళ్లు ప్రమాదవశాత్తు కూడా నీట మునుగుతున్నాయి. ఈ కారణంగా వాటిని శుభ్రపరిచే సమయంలో పెద్ద మొత్తంలో చెత్త బయటకు వస్తున్నది. కేవలం 2 నిమిషాల 9 సెకన్ల వీడియోను చూసిన వారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. ఇది పలువురి నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. పర్యావరణ పరిరక్షణ పరంగా ఇది ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఈ వీడియోకు 14 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కాయి. ఈ వీడియోను చూసిన యూజర్స్ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్ ఇన్ని సైకిళ్లు ఎక్కడి నుంచి వచ్చాయని రాయగా, మరొకరు ఈ సైకిళ్లను అమ్ముతారా? అని ప్రశ్నించారు. మరొక యూజర్ కాలువలోకి ఇంత పెద్ద సంఖ్యలో సైకిళ్లు ఎక్కడ నుండి వచ్చాయి? అని రాశారు. ఇది కూడా చదవండి: శాంతినికేతన్‌తో చైనాకు లింకు ఏమిటి? తాన్ యున్ జెన్ ఏం సాయం చేశారు? Finding some surprises while cleaning the canals of Amsterdam. pic.twitter.com/QsEJgj5GHM — Fascinating (@fasc1nate) September 18, 2023 -
సైకిల్ పై ప్రపంచ యాత్ర చేస్తున్న యువకుడుకి ఆతిథ్యం ఇచ్చిన సింగపూర్ తెలుగు ప్రజలు
కళ్లెదుటే కరోనాతో తన తండ్రి, ఎంతో మంది చనిపోవడం తెలంగాణా రాష్ట్రంలోని వరంగల్ జిల్లా గిర్మాజీపేటకు చెందిన రంజిత్ని కదిలించింది. కాలుష్యం మానవ రోగ నిరోధక శక్తిని బలహీనపరిచి, ప్రజల్ని సులువుగా కరోనా,ఇతర అనారోగాల బారిన పడేటట్లు చేస్తుందని తెలుసుకున్నాడు. అందుకే ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంగా,శారీరక దృఢత్వం కలిగి ఉండాలన్న ఆలోచనని కలిగించాలని- "సొల్యూషన్ టు పొల్యూషన్ (కాలుష్యానికి పరిష్కారం)" అనే లక్ష్యంతో యాత్ర ప్రారంభించాడు. దానికై కాలుష్యం కలిగించని,శారీరక వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని అందించే సైక్లింగ్ చెయ్యాలని ధృడ సంకల్పతో అడుగులు వేసాడు రంజిత్. 2021 ఏప్రిల్ 5న మొదలైన 'రంజిత్ ఆన్ వీల్స్ సైక్లింగ్ భారతదేశం దాటి ఇప్పుడు ఆసియా ఖండంలోని వియత్నాం, కంబోడియా,థాయిలాండ్,మలేషియా దేశాలను చుట్టి 29-ఆగష్టు 29, 2023 న సింగపూర్ చేరుకున్నాడు. మంచి సంకల్పంతో రంజిత్ చేస్తున్న ఈ యాత్రకి సింగపూర్ తెలుగు సమాజం ఆతిథ్యం ఇచ్చింది. రంజిత్ చేస్తున్న కృషిని కమిటీ అభినందించింది. ఈ సందర్భంగా తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో కాలుష్యం ఒకటని, దీనివల్ల మానవాళి రోగనిరోధక సన్నగిల్లితుందని, మనమంతా కనీసం వారంలో ఒక్కరోజైనా సైక్లింగ్ చెయ్యాలని, దీనివల్ల పర్యావరణం మెరుగుపడటంతో పాటు మనమంతా శారీరకంగా దృఢంగా ఉంటామని తెలిపారు. అందరూ రంజిత్ లక్ష్యం నెరవేరాలని కోరుకుంటున్నామని తెలిపారు. తరవాత కమిటీ సభ్యులు రంజిత్ ను సత్కరించారు. తన ప్రపంచ యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. రంజిత్ మాట్లాడుతూ, సింగపూర్ దేశం చాల బాగుందని ఇక్కడ పచ్చని చెట్లు అధికంగా ఉండటం, ప్రజలందరూ మెట్రో రైలు, సిటీ బస్ లాంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడటం, చాలాచోట్ల సైకిల్ వాడటం గమనించానని, కాలుష్యానికి అవకాశం తక్కువ ఉందని తెలిపారు. తెలుగు సమాజం వారిచ్చిన ఆతిథ్యానికి ధన్యవాదాలు తెలిపారు. రంజిత్ రెండు రోజులలో సింగపూర్ నుంచి ఇండోనేసియాలోని జకార్తాకు, తరువాత ఫిలిప్పైన్స్, ఇతర దేశాల గుండా ఆస్ట్రేలియా చేరుకొని సైక్లింగ్ పూర్తి చేయాలని ప్రణాళిక వేసుకున్నాడు. 2021 ఏప్రిల్ 5 నుండి ఇప్పటివరకు 22,300 కిలోమీటర్ల ప్రయాణం చేసాడు. ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, అమెరికా, యూరప్ ఖండాల్లో సైక్లింగ్ చేసే దిశగా ముందుకు వెళుతున్నానని వెల్లడించాడు. రంజిత్ ఆన్ వీల్స్ ఫేస్బుక్ పేజీ, ఇంస్టాగ్రామ్ ద్వారా దాదాపు 3 లక్షల 60 వేలమంది ఫాలోవర్స్ వున్న రంజిత్ నిత్యం వారికి తన ప్రయాణంలో విశేషాల్ని పంచుకుంటున్నాడు. ఆరోగ్యమే మహాభాగ్యమని మన పెద్దలు అన్నారు. కాలుష్యం తమ తమ పరిధిలో నియంత్రిస్తూ, తగిన శారిరక శ్రమ చేయడం ద్వారా తప్పకుండా తనకోరిక నెరవేరుతుంది. (చదవండి: సిఎక్స్ఓ ఫోరమ్: స్టార్టప్ కాన్సెప్ట్‌లకు గొప్ప మార్గనిర్దేశం) -
ఈ సైకిల్ కొనే డబ్బుతో కారు కొనేయొచ్చు! ధర తెలిస్తే షాక్ అవుతారు!
ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ 'లంబోర్ఘిని' (Lamborghini) అనగానే మొదట గుర్తొచ్చేది లగ్జరీ కార్లు. అయితే ఈ సంస్థ ఖరీదైన కార్లను మాత్రమే కాకుండా సైకిల్స్ కూడా విడుదల చేస్తుందని చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. ఈ నేపథ్యంలో భాగంగానే కంపెనీ ఇప్పుడు మార్కెట్లో ఒక సైకిల్ విడుదల చేసింది. దీని ధర, ఇతర వివరాలను క్షుణ్ణంగా ఈ కథనంలో తెలుసుకుందాం. లంబోర్ఘిని విడుదల చేసిన ఈ సైకిల్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి రేస్మ్యాక్స్ ఎక్స్ ఆటోమొబిలి లంబోర్ఘిని, స్ట్రాడా ఎక్స్ ఆటోమొబిలి లంబోర్ఘిని. వీటి ధరలు వరుసగా 9,899 డాలర్లు (రూ. 8,15,365), 8,999 డాలర్లు (రూ. 7,41,226). కంపెనీ ఈ సైకిల్స్ విడుదల చేయడానికి ప్రత్యేకంగా 3టి అనే సంస్థతో జత కట్టింది. (ఇదీ చదవండి: ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు విడుదల చేసిన రోల్స్ రాయిస్ - ధర ఎంతో తెలుసా?) ఈ లేటెస్ట్ లంబోర్ఘిని సైకిల్స్ 51, 54, 58 సెంటీమీటర్ల లిమిటెడ్ సైజుల్లో మాత్రమే లభిస్తాయి. ఈ సైకిల్స్ డెలివరీకి సుమారు 16 వారాల సమయం పట్టే అవకాశం ఉంది. రేస్మ్యాక్స్ ఎక్స్ ఆటోమొబిలి లంబోర్ఘిని అనేది ఒక లైట్‌వెయిట్ మోడల్. దీనిని 3టీ కార్బన్ పరికరాలతో తయారు చేశారు. ఈ సైకిల్ ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఎక్స్ప్లోరో రేస్మ్యాక్స్ ఎక్స్ హరికెన్ స్టెరెట్టో సైకిల్‌ను పోలి ఉంటుంది. రెండవ మోడల్ స్ట్రాడా ఎక్స్ ఆటోమొబిలిని ప్రత్యేకంగా కంఫర్ట్, ఎయిరోడైనమిక్స్ కోసం రూపొందించారు. ఇందులో ఎస్ఆర్ఏఎం ఫోర్స్ పరికరాలు ఉంటాయి. 3టీతో జతకట్టి లంబోర్ఘిని విడుదల చేసిన మూడవ సైకిల్ ఇది కావడం గమనార్హం. ఇప్పటికే సంస్థ 2018లో ఆర్5 ఆటోమొబిలి లంబోర్ఘిని ఎడిషన్ రూపొందించింది. అప్పట్లో ఇది కేవలం 63 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. -
డబ్బా చక్రాల సైకిల్.. ఈజీగానే తొక్కొచ్చు!
సైకిల్ అంటే ఎలా ఉంటుంది? రెండు పెద్ద చక్రాలు.. వాటిని అటాచ్ చేస్తూ ఫ్రేమ్, చైన్ అంతేకదా! సైకిల్ అనే కాదు.. ఏ వాహనానికైనా ఉండేది గుండ్రని టైర్లు, చక్రాలే. అలా కాకుండా సైకిల్‌కు చతురస్రాకారంలో టైర్లు ఉంటే? అలా సింపుల్‌గా తొక్కేసుకుంటూ వెళ్లిపోగలిగితే? అదెలా సాధ్యమనిపిస్తోంది కదా! రష్యాకు చెందిన ‘ది క్యూ’సంస్థ ఇంజనీర్ సెర్గీ గోర్డీవ్ మాత్రం దీనిని చేసి చూపించాడు. చతురస్రాకారంలో టైర్లను రూపొందించి.. సాధారణ సైకిల్ ఫ్రేమ్‌కు అమర్చి నడిపించాడు. దీనికి సంబంధించిన వీడియో యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది కూడా. ‘స్క్వేర్’టైర్లతో నడిచేదెలా? యుద్ధ ట్యాంకుల చక్రాల్లో వాడే టెక్నాలజీని ‘స్క్వేర్ టైర్’సైకిల్లో వినియోగించారు. సింపుల్‌గా చెప్పాలంటే.. ఇందులో చక్రాలు మొత్తానికి మొత్తంగా తిరగవు. జస్ట్ వాటి అంచున ఏర్పాటు చేసే ప్రత్యేకమైన బెల్ట్ మాత్రమే కదులుతుంది. అలాగే ‘స్క్వేర్ వీల్’సైకిల్లో చతురస్రాకారపు వీల్స్ కదలకుండా అలాగే ఉంటాయి. సెర్గీ గోర్డీవ్ ప్రత్యేకమైన బెల్ట్‌ను తయారు చేసి వాటి అంచులో అమర్చాడు. పెడల్స్ తొక్కినప్పుడు ఆ బెల్ట్ కదిలేలా.. గేర్లను, చైన్లను అమర్చి అనుసంధానించాడు. పెడల్‌ను తొక్కినప్పుడు.. బెల్ట్ కదులుతూ సైకిల్ ముందుకు వెళుతుంది. ఇదో వినూత్న ఆలోచన, చాలా బాగుందని కొందరు నెటిజన్లు ప్రశంసిస్తుంటే.. అంతా బాగానే ఉందిగానీ.. స్పీడ్ బ్రేకర్లు, గుంతలు వస్తే పరిస్థితి ఏమిటన్న కామెంట్లూ వస్తున్నాయి. -
Viral Video: అదృష్టం అంటే వీడిదే.. సైకిల్ ముక్క కూడా మిగలలేదు..!
-
23 ఏళ్లుగా సైకిల్ పైనే విధులకు.. ఆదర్శంగా నిలుస్తున్న మహిళా ఎస్సై
సాక్షి, చెన్నై: చిరు ఉద్యోగులే బైక్‌లు, కార్లు వినియోగిస్తున్న ఈ రోజుల్లో ఓ పోలీస్ అధికారిణి గత 23 ఏళ్లుగా సైకిల్ పైనే విధులకు హాజరవుతుండడం కచ్చితంగా విశేషమే. వివరాలు.. చెన్నై షావుకారుపేటలోని ఫ్లవర్ బజార్ పోలీసు స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న 45 ఏళ్ల జి.పుష్పరాణి రోజూ సైకిల్ పైనే డ్యూటీకి వెళ్తారు. అలాగేే తన ఇంటి పనులకు సైతం దాన్నే వాడుతారు. 1997లో ఈమె తమిళనాడు స్పెషల్ పోలీసు విభాగంలో గ్రేడ్– 1 కానిస్టేబుల్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత పదోన్నతి ద్వారా పుదుపేట ఆర్మ్డ్ రిజర్వుకు బదిలీ అయ్యారు. విశ్రాంత ఎస్ఐ అయిన తన తండ్రి గోవింద స్వామి సైకిల్ పైనే విధులకు వేళ్లేవారని ఆమె పేర్కొన్నారు. తండ్రి స్ఫూర్తితో దాన్ని కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం వినియోగిస్తున్న ఏడో సైకిల్ చెన్నై సిటీ పోలీసు కమిషనర్ శంకర్ జివాల్ బహుమతిగా ఇచ్చారని వెల్లడించారు. ఎవరినీ సైకిల్ తొక్కమని బలవంతం చేయనని, అలాగే తనను సైకిల్ నుంచి ఎవరూ దూరం చేయలేరని పుష్పరాణి స్పష్టం చేశారు. తన ఇద్దరు పిల్లలను మాత్రం ఆరోగ్య సంరక్షణ కోసం సైకిల్ పైనే పాఠశాలకు వేళ్లేలా ప్రేరేపిస్తున్నట్లు చెప్పారు. ధనవంతులకు సైకిల్ వ్యాయామం అయితే.. పేదలకు అది జీవనాధారం అని ఆమె తెలిపారు. ఫ్లవర్ బజార్ పోలీసు స్టేషన్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ డి. ఇంద్ర మాట్లాడుతూ సబ్ ఇన్స్పెక్టర్ పుష్పారాణి ఎందరికో ప్రేరణగా నిలుస్తున్నారని కొనియాడారు. -
Viral Video: బ్రేక్ టెస్టింగ్ చేసిన బస్సు
-
Viral Video: రైడ్ చేస్తూ చాట్ చేస్తే ఇలానే అవుతుంది
-
కోచింగ్ ఫీజు కోసం.. రాత్రిపూట టీ అమ్ముతూ...
ఎందరో స్ట్రీట్ లైట్ల కింద చదువుకుని చాలా ఉన్నత స్థాయిలో స్థిరపడిన వాళ్లను చూశాం. మరికొందరూ చదవుకుంటూ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండి అందరికీ ఆదర్శంగా ఉంటారు. ఇంకొందరూ తమ చదువుకు అయ్యే ఖర్చు తల్లిదండ్రులను అడగకుండా స్వశక్తితో సంపాదించుకోవాలనుకుంటారు. మరికొందరూ ఇంట్లో పరిస్థితులు సహకరించక తాము అనుకున్న విద్యను అభ్యసించేందకు రకరకాల మార్గాల్లో కష్టపడుతుంటారు. అచ్చం అలాంటి ఘటనే ఇక్కడే చోటు చేసుకుంది. ఇక్కడొక విద్యార్థి కోచింగ్ ఫీజు కోసం అని రాత్రిపూట టీ అమ్ముతుంటాడు. ఆ విద్యార్థి పేరు అజయ్. అతను పగటి పూట చదువుకుంటూ రాత్రిపూట సైకిల్‌పై టీ అమ్ముతూ కోచింగ్ డబ్బులు కూడబెట్టుకుంటున్నాడు. అందుకు సంబంధించిన వీడియోని గోవింద్ గుర్జార్ అనే జర్నలిస్ట్ ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. దీంతో నెటిజన్లు స్పూర్తిదాయకం, ఇలాంటి యువతకు ఆర్థిక సాయం అందిస్తే చక్కగా చదువుకుంటారంటూ సదరు విద్యార్థిని ప్రశంసిస్తూ చేస్తూ ట్వీట్ చేశారు. #साइकल_वाली_चाय इंदौर.. हमारे आदिवासी भाई अजय से मिलोगे..! अजय दिन में पढ़ाई करता है और रात को चाय बेचता है ताकि कोचिंग,रहने,खाने का खर्चा निकल से..! सच में अजय भगवान करे कभी बड़ा आदमी बन गया तो चाय बेचने वाला ये वीडियो अजय के संघर्ष का जीता जागता सबूत साबित होगा. pic.twitter.com/N2LnR6mo2T — Govind Gurjar (@Gurjarrrrr) December 23, 2022 (చదవండి: వాట్ ఏ మాస్క్..ఎంచక్కా తీయకుండానే అలానే ఆహారం తినేయొచ్చు) -
ఆన్లైన్లో హీరో సైకిల్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సైకిల్స్ తయారీలో ఉన్న హీరో సైకిల్స్ ఈ–కామర్స్ పోర్టల్‌ను ప్రారంభించింది. కస్టమర్లు నేరుగా ఈ వెబ్సైట్ ద్వారా తమకు నచ్చిన సైకిల్ కోసం ఆర్డర్ చేయవచ్చు. తద్వారా ఉచితంగా ఇంటి వద్దనే ఉత్పత్తులను అందుకోవచ్చు. దేశవ్యాప్తంగా 3,000 పైచిలుకు డీలర్ల వ్యాపారం పెరుగుదలకు ఈ వేదిక దోహదం చేయనుందని కంపెనీ చెబుతోంది. ‘సైకిళ్లు, ఈ–సైకిళ్ల వినియోగాన్ని పెంచాలని భావిస్తున్నాం. ఈ దిశగా వెబ్సైట్ సేవలు అందిస్తుంది’ అని హీరో సైకిల్స్ డైరెక్టర్ ఆదిత్య ముంజాల్ తెలిపారు. చదవండి: బీభత్సమైన ఆఫర్: జస్ట్ కామెంట్ చేస్తే చాలు.. ఉచితంగా రూ.30 వేల స్మార్ట్‌ఫోన్! -
చూపులో సైకిల్.. రేటులో బుల్లెట్
సాక్షి, ఫిఠాపురం: చూడటానికి అది సైకిలే కానీ రేటులో మాత్రం బుల్లెట్‌తో పోటీ పడుతోంది. సామాన్యుడి వాహనం సైకిల్ అసామాన్యంగా మారిపోయింది. కాకినాడకు చెందిన ఓ ఫర్నిచర్ వ్యాపారి తన కుమారుడు చైతన్య కోసం ఏకంగా విదేశాల నుంచి సైకిల్ కొనుగోలు చేశారు. ఇటలీకి చెందిన ఈ సైకిల్ రేటు అక్షరాలా రూ.1.40 లక్షలు. మోటారు సైకిల్ మాదిరిగా రిజిస్ట్రేషన్ నంబరుతో పాటు లైసెన్సు కలిపి అంత ధర అయ్యిందని చెబుతున్నారు. చూడటానికి మామూలు సైకిల్లానే ఉన్నా నిర్మాణంలో కొత్తదనం కనిపిస్తోంది. బుల్లెట్ బండి రేటుతో పోటీ పడుతున్న ఈ సైకిల్ ప్రస్తుతం పిఠాపురం రోడ్డులో ఆకర్షణగా నిలుస్తోంది. (చదవండి: రిపోర్ట్‌లో అసలు గుట్టు.. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని..) -
Viral Video: డబుల్ డెక్కర్ సైకిల్ వచ్చేసింది..
-
Viral Video: మార్కెట్లోకి సరికొత్త లాంగ్ మోటార్ సైకిల్ ..!
-
సైకిల్‌పై షాకింగ్ స్టంట్స్.. గూస్బంప్స్ తెప్పించే వీడియో
-
బిగ్ క్వశ్చన్ : షెడ్డుకు సైకిల్..
-
పీఈటీ సార్ కొడతారనే భయం.. సైకిల్‌పై 65 కిలోమీటర్లు వెళ్లి..
సాక్షి, వరంగల్, ఖమ్మం: పాఠశాలకు ఆలస్యంగా వెళ్తే పీఈటీ కొడతారనే భయంతో సైకిల్‌పై 65 కిలోమీటర్లు ప్రయాణించిన ఒక బాలుడిని పోలీసులు తిరిగి తల్లిదండ్రులకు అప్పగించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో బుధవారం రాత్రి జరిగిన ఈ సంఘటనపై ఎస్ఐ గండ్రాతి సతీష్ తెలిపిన వివరాలివి. ఖమ్మానికి చెందిన 12 ఏళ్ల కుషాల్ రాజా అదే ప్రాంతంలోని వండర్ కిడ్స్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. రోజూ సైకిల్‌పై పాఠశాలకు వెళ్లే రాజా బుధవారం ఆలస్యం అయ్యాడు. దీంతో పీఈటీ దండిస్తారని భయపడి పాఠశాలకు వెళ్లకుండా ఖమ్మం నుంచి సైకిల్ తొక్కుతూ 65 కిలోమీటర్లు ప్రయాణించి తొర్రూరు మండలం మాటేడుకు బుధవారం రాత్రి చేరుకున్నాడు. చీకట్లో ఎటు వెళ్లాలో తెలియక ఏడుస్తున్న బాలుడిని చూసి స్థానికులు డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారమిచ్చారు. కానిస్టేబుల్ రాజు బాలుడి తల్లిదండ్రుల వివరాలు తెలుసుకుని వారికి సమాచారం అందించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సతీష్ బాలుడికి కౌన్సెలింగ్ చేసి అల్పాహారం పెట్టి తల్లిదండ్రులకు అప్పగించారు. -
సైకిల్‌పై 250 కి.మీ ప్రయాణించిన 13 ఏళ్ల బాలుడు..చివరికి ఏమైందంటే?
చండీగఢ్: పంజాబ్‌కు చెందిన 13 ఏళ్ల బాలుడు సైకిల్‌పై ఏకంగా 250 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. పంజాబ్‌లోని పటియాలా ప్రాంతం నుంచి అతడి ప్రయాణం మొదలవ్వగా.. మూడు రోజులకు ఢిల్లీ చేరుకున్నాడు. తనకు ఇష్టమైన యూట్యూబ్ స్టార్‌ను కలిసేందుకు అతని ఇంతటి సాహసానికి పూనుకున్నాడు. అయితే చివరికి బాలుడి కోరిక తీరనే లేదు. ఎంతో అభిమానం, ఆశతో కలవాలనుకున్న యూట్యూబ్ స్టార్ విదేశాలకు వెళ్లాడని తెలియడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. వివరాలు.. పటియాలాకు చెందిన 13ఏళ్ల బాలుడు 8వ తరగతి చదువుతున్నాడు. నిశ్చయ్ మల్హన్ అనే వ్యక్తి నిర్వహిస్తున్న ‘ట్రిగ్గర్డ్ ఇన్సాన్’ యూట్యూబ్ ఛానల్ అంటే ఎంతో ఇష్టం. ఇతనికి యూట్యూబ్‌లో కోటిన్నరకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. బాలుడు కూడా అతన్ని అతను ఫాలో అవుతున్నాడు. అయితే ఆ ఛానల్ నిర్వాహకుడు నిష్చాయ్ మల్హాన్‌ను కలవాలని బాలుడు నిర్ణయించుకున్నాడు. మల్హాన్ ఢిల్లీలోని పితంపుర ప్రాంతంలో నివసిస్తున్నట్లు తెలుసుకున్న విద్యార్థి తన సైకిల్‌పై అక్టోబర్ 4న ఢిల్లీకి పయనమయ్యాడు. చదవండి: Bus Accident: ఘోర ప్రమాదం.. 11 మంది సజీవదహనం మూడు రోజులు 250 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించి పితంపుర అపార్ట్‌మెంట్స్‌కు చేరుకున్నాడు. అయితే మల్హాన్ అక్కడ లేడని, దుబాయ్ వెళ్లినట్లు చెప్పడంతో అతను తీవ్ర నిరాశ చెందాడు. మరోవైపు కొడుకు కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందిన అతని తల్లిదండ్రులు పటియాలా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో పలు ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటీజీలో బాలుడు ఢిల్లీ వెళ్లినట్లు కనిపించాడు. దీంతో ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించారు. అంతేగాక సోషల్ మీడియాను ఉపయోగించి బాలుడి గురించి ప్రచారం చేశారు. చివరికి యూట్యూబర్ అపార్ట్మెంట్ వద్ద ఉన్న సీసీటీవీ పరిశీలించగా పోలీసులు బాలుడి సైకిల్‌ను గుర్తించారు, అనంతరం అతని ఇంటికి దగ్గరలో ఉన్న పార్క్ వద్ద బాలుడిని కనుగొన్నారు. దీంతో పోలీసులు బాలుడి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు అతన్ని ఇంటికి తీసుకెళ్లారు. అయితే అతడు రాత్రిళ్లు ఎక్కడ బస చేశాడో ఎక్కడ విశ్రాంతి తీసుకున్నాడో స్పష్టత రాలేదు. ఇదిలా ఉండగా బాలుడు విషయం యూట్యూబ్ స్టార్ వరకు చేరింది. ముందుగా విద్యార్థి కనిపించకుండా పోయాడని తెలిసి ఆందోళన చెందిన మల్హాన్ పోలీసులు అతన్ని వెతికి పట్టుకోవాలని పోలీసులను కోరాడు. అనంతరం విద్యార్థి దొరికిన సంగతి తెలిసి..‘హమ్మయ్యా ఎట్టకేలకు బాలుడు తన ఇంటికి చేరాడు. మంచి విషయం’ అంటూ ట్వీట్ చేశాడు. This is serious, if anybody has any information, please contact the police or the undersigned. I'm not in Delhi and travelling in Dubai, without network, will keep posted about this however much I can. https://t.co/BllLoZEubM — Nischay Malhan (@TriggeredInsaan) October 7, 2022 -
Telangana: సైకిల్ సవారీకి సై
సాక్షి హైదరాబాద్: గ్రేటర్ ప్రజలకు సైకిల్ అలవాటు చేసేందుకు ప్రస్తుతం జోన్‌కు రెండు మూడు సైకిల్‌ట్రాక్‌ల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. క్రమేపీ ప్రజలకు అలవాటయ్యాక నగరవ్యాప్తంగా వీటిని ఏర్పాటు చేయాలనే యోచనలో ఉంది. సైకిల్ వినియోగంతో ఆరోగ్యానికి మంచి వ్యాయామంతో పాటు పర్యావరణ హితం, ఇంధన వినియోగం తగ్గడం, ఇతర వాహనాల వినియోగం వల్ల వెలువడే కాలుష్యం తగ్గడం వంటి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు సైకిళ్లకు అలవాటు పడేందుకు ప్రస్తుతానికి జోన్‌కు రెండుమూడు సైకిల్‌ట్రాక్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో జోన్లో ఒక్కో డిజైన్‌తో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. అన్నీ పరిశీలించాక అన్ని విధాలా యోగ్యమైన డిజైన్‌తో నగరవ్యాప్తంగా ఏర్పాటు చేయాలనే ఆలోచనలో అధికారులున్నారు. ఎంపిక చేసే డిజైన్లతో తాత్కాలిక, శాశ్వత రెండు రకాలైన సైకిల్ట్రాక్స్ను ఏర్పాటు చేసే యోచనలోనూ అధికారులున్నారు. రోడ్లు 3 లేన్లు, అంతకంటే ఎక్కువ ఉన్న మార్గాల్లో శాశ్వత సైకిల్ట్రాక్స్ ఏర్పాటు చేస్తారు. కొత్తగా మోడల్ కారిడార్లుగా అభివృద్ధి చేసే ప్రాంతాల్లోనూ శాశ్వత సైకిల్ట్రాక్స్ ఏర్పాటు చేస్తారు. అంతకంటే తక్కువ లేన్లున్న మార్గాల్లో మాత్రం తాత్కాలిక సైకిల్ట్రాక్స్ ఏర్పాటు చేస్తారు. వీటిని ఉదయం వేళల్లో దాదాపు రెండుగంటలు మాత్రం సైకిల్ ట్రాక్స్‌గా కేవలం సైకిళ్లను మాత్రమే వినియోగిస్తారు. ఆ సమయాల్లో మిగతా వాహనాలు ఆ ట్రాక్‌లోకి రాకుండా బొలార్డ్స్ వంటివి ఉంచుతారు. మిగతా సమయాల్లో వాటిని తొలగించడం వల్ల అన్ని వాహనాలు ప్రయాణిస్తాయి. ఇక తాత్కాలిక, శాశ్వత సైకిల్ట్రాక్స్ రెండింటిలోనూ విపరీతమైన వాహన రద్దీ ఉండే సమయాల్లో ఆ ట్రాక్స్‌లో మోటార్‌బైక్స్ ప్రయాణానికి అనుమతించే యోచన ఉన్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ ప్రాంతాల్లో ఏర్పాటు.. టోలిచౌకి–షేపేట, బయోడైవర్సిటీ జంక్షన్–లెదర్‌పార్క్, ఖాజాగూడ–నానక్‌రామ్‌గూడ, బయోడైవర్సిటీపార్క్– ఐకియా, గచ్చిబౌల జంక్షన్–బయోడైవర్సిటీ, మెహిదీపట్నం–గచ్చిబౌలి, నర్సాపూర్రోడ్ తదితర మార్గాల్లోని సైకిల్ ట్రాక్స్ అందుబాటులోకి వస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఐడీఎల్ లేక్–జేఎన్టీయూ–ఫోరమ్‌మాల్ సర్క్యూట్ ట్యాంక్‌బండ్–పీవీఎన్ఆఆర్ మార్గ్‌రోడ్–ఎన్టీర్ మార్గ్‌రోడ్ సర్క్యూట్గానూ సైకిల్ట్రాక్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తొలిదశలో మారి్నంగ్‌వాక్ మాదిరిగా సైకిల్ తొక్కడం అలవాటయ్యేందుకు మాత్రమే నిరీ్ణత దూరాల వరకు మాత్రమే వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రజలు బాగా అలవాటుపడ్డాక ఎక్కువ దూరాలు వెళ్లేందుకు సైకిల్ ట్రాక్స్‌తో పాటు సైకిళ్లు అద్దెలకిచ్చేందుకు షేరింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసే యోచనలో అధికారులున్నారు. (చదవండి: ప్రపంచానికే మానవ వనరుల శక్తిగా భారత్) -
ఇలా కూడా మన పార్టీ గుర్తుకి అంతర్జాతీయంగా పబ్లిసిటీ వస్తుంది సార్!
ఏదో రకంగా అంతర్జాతీయంగా కూడా మన పార్టీ గుర్తుకి పబ్లిసిటీ వస్తుంది సార్! -
ఈజీగా క్యారీ చేసి... ఎక్కడికైన తీసుకెళ్లి నడిపేయగల సరికొత్త సైకిల్
సాక్షి, హైదరాబాద్: సైకిల్ సవారీ అంటే ఎంత ఇష్టమున్నా... అన్ని చోట్లకూ తీసుకువెళ్లలేక దాన్ని వినియోగించలేకపోతున్నవారికి ఫోల్డబుల్ సైకిల్ పేరిట సృజనాత్మక పరిష్కారం అందుబాటులోకి వచ్చింది. కచ్బో డిజైన్ సంస్థకు చెందిన ఇరువురు ఐఐటీ పూర్వ విద్యార్థులు ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ సైకిల్‌ను రూపొందించారు. బంజారాహిల్స్‌లోని లెమన్ ట్రీ హోటల్లో ఆదివారం ఐటీ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఈ హార్న్ బ్యాక్ బైస్కిల్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు ఐఐటీ పూర్వ విద్యార్థులు నిషిత్ పారిఖ్, రాజ్‌కుమార్ కేవత్ మాట్లాడుతూ.. సైకిల్ని నడపడంతో పాటు దాన్ని చేతులతో క్యారీ చేయడానికి కూడా వీలుగా రూపొందిందన్నారు. ఒక్కసారి చార్జి చేస్తే 30 కి.మీ దాకా మైలేజ్ ఇస్తుందన్నారు. (చదవండి: ‘మానాల’ మళ్లీ పురుడు?) -
కళ్ల ముందే ఆ పసివాడి ప్రాణం గాల్లో కలిసేది, కానీ..
ఏమరపాటులో జరిగే ప్రమాదాల గురించి తెలియంది కాదు. నిర్లక్క్ష్యం, చిన్నతప్పిదాలతో ప్రాణాలే పొగొట్టుకుంటున్నారు కొంతమంది. అయితే ఇక్కడ మాత్రం ఓ పసివాడి ప్రాణం.. కళ్ల ముందే గాల్లో కలిసేది. కానీ, వాడి అదృష్టం బాగుంది. ఓ పసివాడు వేగంగా తొక్కుకుంటూ మెయిన్ రోడ్డు వరకు చేరుకున్నాడు. వేగంగా వచ్చి అదుపు తప్పి కంట్రోల్ చేయలేక రోడ్డు మీద వెళ్తున్న ఓ బైకును ఢీకొట్టి ఎగిరి రోడ్డ అవతల పడ్డాడు. సరిగ్గా ఆ వెనకే బస్సు వస్తోంది. అయితే సైకిల్ రోడ్డు మీద పడిపోగా.. చిన్నారి కొద్దిలో బస్సు చక్రాల కింద పడకుండా తప్పించుకోగలిగాడు. సైకిల్ పైకి బస్సు ఎక్కేసింది. చిన్న గాయం లేకుండా బయటపడగలిగాడు ఆ పసివాడు. #RoadSafety Share your thoughts... pic.twitter.com/9m4ctrrwJq — Telangana State Police (@TelanganaCOPs) March 25, 2022 తెలంగాణ పోలీసులు ఆ వీడియోను ట్వీట్ చేసి.. కామెంట్ చేయాలంటూ నెటిజన్లను అడిగారు. బైక్ అతను దేవుడిలా వచ్చాడని, ఆ బైక్ వల్ల చిన్నారి ఎగిరి అవతల పడ్డాడని లేదంటే బస్సు కింద పడేవాడేనని అంటున్నారు. కేరళ కన్నూరు జిల్లా తాలిపారంబాకు సమీపంలోని చోరుక్కల వద్ద ఆదివారం (మార్చి 24) సాయంత్రం ఈ ఘటన జరిగింది. తొమ్మిదేళ్ల ఆ పసివాడు ప్రాణాలతో బయటపడ్డట్లు తెలుస్తోంది. ఆ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటకు రావడంతో.. వీడియో వైరల్ అవుతోంది. -
సైకిల్ యాత్రలో అపశృతి.. కింద పడ్డ టీడీపీ ఎమ్మెల్యే
సాక్షి, పశ్చిమగోదావరి: పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు సైకిల్ యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. గుండుకొలను సమీపంలో ప్రమాదవశాత్తు ఎమ్మెల్యే నిమ్మల సైకిల్‌పై నుంచి జారిపడ్డారు. వెంటనే అప్రమత్తమైన కార్యకర్తలు ఆయనను పైకి లేపారు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే నిమ్మలకు స్వల్ప గాయాలయ్యాయి. చదవండి: (జేసీ అనుచరుల ఆగడాలు.. ప్రభాకర్‌రెడ్డి అన్న చెప్పాడంటూ) -
ఎమ్మెల్యే నిమ్మల సైకిల్ యాత్రలో అపశ్రుతి
-
సైకిల్ పైనే ఆఫీసుకు అనంతపురం డిప్యూటీ మేయర్
-
వృద్ధుడి సైకిల్ సందేశం.. మూడు నెలల్లో 7వేల కిలోమీటర్ల ప్రయాణం!
బరంపురం/ఒడిశా: ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ నగరానికి చెందిన 65 ఏళ్ల వృద్ధుడు సాహసయాత్రకు సిద్ధమయ్యాడు. స్థానిక కాపువీధికి చెందిన ఎ.కృష్ట్రారావు బరంపురం నుంచి రామేశ్వరం–అయోధ్య మీదు గా దేశంలోని ప్రఖ్యాత ప్రదేశాల్లో సైకిల్‌యాత్ర చేపట్టనున్నాడు. ఈ నేపథ్యంలో స్థానిక ఫ్రెండ్స్ వెల్ఫేర్ క్లబ్ ఆధ్వర్యంలో బరంపురం గ్రామదేవత మాబుడి శాంతమ్మ ఆలయాన్ని బుధవారం దర్శించుకున్న ఆయన.. స్థానిక పాతబస్టాండ్ ప్రాంగణంలో సైకిల్‌యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రపంచంలో ఆశాంతి, అహింస రోజురోజుకీ పెరిగిపోతున్నాయని విచారం వ్యక్తం చేశారు. మనుషుల మధ్య అంతరాలు ఏర్పడి, దేశాలు, ప్రాంతాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొందన్నారు. వైషమ్యాలు తొలగిపోయి, అంతా ప్రశాంతంగా మెలగాలని ఆకాంక్షిస్తూ సైకిల్‌యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. బరంపురం, రామేశ్వరం, అయోధ్య ప్రాంతాలను చుట్టి వస్తూ చివరగా పూరీ జగన్నాథుని దర్శించుకోనున్నట్లు ప్రకటించారు. సగటున రోజూ 100 కిలోమీటర్లు చొప్పున మూడు నెలల్లో 7వేల కిలోమీటర్లు సైకిల్‌పై చుట్టి వచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో కృష్ణారావు ఆకాంక్ష నెరవేరాలంటూ స్థానికులు ఆయనను ఉత్సాహ పరిచి, సాగనంపారు. చదవండి: భర్త, కుమారుడి ఎదుటే మహిళపై అత్యాచారం.. -
ఈ–సైకిల్’.. లోకల్ మేడ్
E Bicycle Homemade: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన బైక్ మెకానిక్ అబ్దుల్ జలీల్ ఈ–సైకిల్ తయారు చేశారు. కేవలం రూ.6,200 ఖర్చుతో పాత సైకిల్‌ను ఈ–సైకిల్‌గా విజయవంతంగా మార్చారు. 20 ఏళ్లుగా బైక్ మెకానిక్ అనుభవం ఉన్న జలీల్ తన ఆలోచనతో పంటలపై రసాయన మందు పిచికారీ చేసే యంత్రంలో ఉపయోగించే 8.12 వోల్టుల రెండు బ్యాటరీలు, చైనా మోడల్ కిట్ (ఎక్స్‌లేటర్, మోటార్) అమర్చి ఈ సైకిల్‌ను తయారు చేశారు. (చదవండి: జైలును ఆర్ట్ సెంటర్‌గా మార్చడం కోసం... కోట్లు సేకరిస్తున్నాడు!!) ఇది గంటన్నర చార్జింగ్‌తో గంటకు 20 కిలోమీటర్ల వేగంతో 20 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని జలీల్ తెలిపారు. ముందుగా ఈ ప్రయోగం పాత సైకిల్‌తో చేసినట్లు తెలిపారు. రూ.21 వేలతో నూతన సైకిల్‌తోపాటు 40 కిలోమీటర్లు ప్రయాణించే సైకిల్‌ను త్వరలో తయారు చేస్తానని చెప్పారు. మధ్య వయసున్న పేద, మధ్యతరగతి వారు ఈ సైకిల్‌ను ఉపయోగించుకోవచ్చని తెలిపారు. (చదవండి: అమెరికా నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం.. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ) -
డుగ్గు డుగ్గు బండి కాదండి.. కానీ భలేగా ఉందండి !
సాక్షి,జనగామ(వరంగల్): రోజురోజుకూ పెరుగుతున్న పెట్రో భారానికి తోడు ట్రాఫిక్ ఇబ్బందులను అదిగమించేందుకు యువత సైకిళ్లపై ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్లో వివిధ మోడళ్లు అందుబాటులో ఉండగా.. బ్యాటరీతో నడిచే చార్జింగ్ సైకిళ్లు ఆకట్టుకుంటున్నాయి. వీటితో పొల్యూషన్ బాధ లేకపోవగా.. నిత్యం వ్యాయామం చేసినట్లవుతుంది. పట్టణానికి చెందిన సుధీర్ కార్తీక్ చార్జింగ్ సైకిల్‌ను ఆన్లైన్లో కొనుగోలు చేసి చక్కర్లు కొడుతున్నాడు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 25 కిలోమీటర్ల వేగంతో 50 కిలోమీటర్లు వెళ్లవచ్చని చెప్పారు. రూ.81,800 ధరకు కొనుగోలు చేసిన ఈ సైకిల్‌కు మూడేళ్ల వరకు ఎలాంటి మెయింటనెన్స్ ఉండదని వివరించాడు. దీనిని ఫోల్డ్ కూడా చేయవచ్చని పేర్కొన్నాడు. చదవండి: 6 నెలల క్రితమే వివాహం.. భార్య పుట్టింటికి వెళ్లిందని.. -
Viral Video: దర్జాగా ఇంట్లోకి వెళ్లి దొంగతనం.. కొద్దిసేపటికే సీన్ రివర్స్
దొంగతనం చేయడం కూడా ఓ కళే. అది అందరికి అంత ఈజీగా అయ్యే పని కాదు. పక్కా ప్లాన్, అదృష్టం కలిసి ఉంటేనే సాధ్యం అవుతుంది. అయితే ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరించినా కొన్నిస్లార్లు దొంగతనాలు ఫెయిల్ అవుతాయి. పోయిన పని జరగకపోవమే కాకుండా అడ్డంగా బుక్కైపోతారు. తాజాగా అలాంటి అనుభవమే ఓ దొంగకు ఎదురైంది. ఇంటి తాళం వేయకపోవడంతో పట్టపగలే దర్జాగా ఇంటిలోకి నడుచుకుంటూ వెళ్లాడు. ఇంటి చుట్టూ ఎవరైనా ఉన్నారా లేరా అని చూస్తూ ఉంటాడు. ఇంతలో వరండాలో ఓ స్కూటీ, సైకిల్ పార్క్ చేసి ఉండటం దొంగ కంటపడింది. ఇంకేముంది టక్కున అక్కడికి వెళ్లి సైకిల్ తీసుకొని గేట్ నుంచి బయటకు పరుగెత్తాడు. చదవండి: మనుషులే కాదు శునకం కూడా దెయ్యం అవుతుందా? ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ అసలైన కథ ఇప్పుడే మొదలైంది. దొంగ సైకిల్ ఎత్తుకెళ్లడం యాజమాని చూశాడు. దీంతో వెంటనే దొంగ వెంట పరుగెత్తి అతన్ని రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నాడు. అనంతరం దొంగ నుంచి తన సైకిల్‌ను తిరిగి ఇంట్లోకి తీసుకొచ్చాడు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్ మీమ్స్ పేజ్ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో గాసోలినా పాట ప్లే అవుతుండటం మరింత ఫన్నీగా మార్చింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ‘అరె.. వీడెవడికో దొంగతనంలో అంత అనుభవం లేనట్టు ఉంది. అడ్డంగా బుక్కైయ్యాడు. ఇకనైనా జాగ్రత్తగా ప్లాన్ చేయి’. అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: పెళ్లిలో డ్యాన్స్‌తో దుమ్మురేపిన వదిన.. అందరి చూపు ఆమె వైపే View this post on Instagram A post shared by MEMES.BKS🤟🙂 (@memes.bks) -
సైకిల్ కమ్ బైక్.. డూడ్ల్
విజయవాడ: పెరిగిన పెట్రోల్ ధరలతో బైక్ బయటకు తీయాలంటేనే సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. పోనీ సైకిల్ వాడుకుందామా అంటే ఎక్కువ దూరం తొక్కలేమనే భయం. ఈ సమస్యకు పరిష్కారమే సైకిల్ కమ్ బైక్. ఈ చిత్రంలో కనిపిస్తున్న (సైకిల్ కమ్ బైక్) వాహనాన్ని పుణేలోని ఈ–మోటోరాడ్ కంపెనీ తయారు చేసింది. దీని పేరు.. ‘డూడ్ల్’. ఈ వాహనం విలువ ఆన్ రోడ్డు+జీఎస్టీతో కలిపి రూ. 81,000. ఈ బైక్ బ్యాటరీ సాయంతో నడుస్తుంది. దీన్ని ఒకసారి రీఛార్జ్ చేస్తే గంటకు 25 కిలోమీటర్ల వేగంతో 45 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. సైకిల్ కమ్ బైక్ బ్యాటరీ వాహనంపై ప్రయాణిస్తున్న రాజేష్‌రెడ్డి. (ఇన్సెట్లో) ఫోల్డింగ్‌లో ఉన్న సైకిల్ కమ్ బైక్ వాహనం దూర ప్రాంతాలకు కుటుంబసభ్యులతో కలిసి వెళ్లేటప్పుడు ఈ వాహనాన్ని ఫోల్డింగ్ చేసి తీసుకెళ్లొచ్చు. ఈ వాహనాన్ని విజయవాడలో ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేస్తున్న రాజేష్‌రెడ్డి కొనుగోలు చేశారు. ఆయన రోజూ దీనిపైనే విధులకు హాజరవుతుండటం విశేషం. దీనినే సైకిల్, బైక్‌లా వాడుకోవచ్చు. పైగా కాలుష్యం, ట్రాఫిక్ చలానాల జంఝాటాలు కూడా ఉండవు. సైకిల్ తొక్కేటప్పుడు ఏడు గేర్లు వేయడానికి వీలుంది. బైక్‌లా వాడాలంటే బ్యాటరీ ఆన్ చేసుకోవచ్చని రాజేష్‌రెడ్డి చెబుతున్నారు. ఫొటోలు: విజయ్, సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
ఎలక్ట్రిక్ సైకిల్, కిలోమీటర్ ఖర్చు 7 పైసలేనా
ప్రపంచ దేశాల్లో ఎలక్ట్రిక్ వాహనాల హవా జోరందుకుంది. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ఆటోమొబైల్ సంస్థలు రోజుకో కొత్త రకం ఎలక్ట్రిక్ వాహనాల్ని అందుబాటులోకి తెస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హీరో లెక్ట్రో ఎలక్ట్రిక్ సైకిళ్లను మార్కెట్లోకి విడుదల చేసింది. బ్యాటరీ, మోటార్లను అమర్చడంతో పాటు నాలుగు రకాలైన పెడల్, పెడలెక్, త్రొటిల్, క్రూయిజ్ రైడింగ్‌లను అందుబాటులోకి తెచ్చింది. దీని ధర రూ.25వేలు నిర్ణయించింది. ఈ సైకిల్ కు రెండు రకాలైన నార్మల్ మోడ్, ఎలక్ట్రిక్ మోడ్లు ఉన్నాయి. ఈ ఫీచర్స్‌తో కావాలనుకుంటే సైకిల్‌గా తొక్కొచ్చు లేదంటే ఎలక్ట్రిక్ డ్రైవింగ్ చెయ్యవచ్చు. సైకిల్ ఆఫ్, ఆన్‌ను బట్టి మీరు ఎంత వేగంతో వెళ్లాలనేది చెక్ చేసుకోవచ్చు. వాటర్ ప్రూఫ్ డెకల్స్ తో దీన్ని ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. ఈ వాటర్ ప్రూఫ్ డెకల్స్తో వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లోనైనా డ్రైవ్ చేయవచ్చు. ఇక ఛార్జింగ్ విషయానికొస్తే..,ip67 లిథియం అయాన్ బ్యాటరీతో 3,4గంటల పాటు ఛార్జింగ్ పెట్టుకోచ్చు. 2ఏళ్లు వారెంటీగా ఉన్న ఈ సైకిళ్లను ఒక్కసారి ఛార్జింగ్ పెడిగే 25 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. ఈ సైకిళ్లపై కిలోమీటర్‌కి 7పైసలే ఖర్చవుతుందని కంపెనీ తెలిపింది. ఈ సైకిళ్ల గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు. అందువల్ల వీటిని వాడేవారికి డ్రైవింగ్ లైసెన్స్, సైకిల్‌కి రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ వంటివి తప్పనిసరి కాదు. చదవండి: ఎలక్ట్రిక్ వాహనాలు, 22 నగరాల్లో 500 ఛార్జింగ్ పాయింట్లు -
సైకిల్ మీద ఉబెర్ సీఈవో ఫుడ్ డెలివరీ.. సంపాదన ఎంతంటే..
ప్రొఫెషనల్ డిగ్నిటీ, వృత్తిలో నైతిక విలువలు, పనిలో కష్టపడేతత్వం.. వీటికి తోడుగా అదృష్టం మనిషిని సక్సెస్ఫుల్ పర్సన్‌గా నిలబెడతాయి. సంపన్న కుటుంబంలో పుట్టినప్పటికీ.. ఉబెర్ సీఈవో దారా ఖోస్రోషాహికి శ్రమ అంటే చాలా ఇష్టం.అందుకే అప్పుడప్పుడు గ్రౌండ్ లెవల్లోకి దిగి.. తోటి వర్కర్ల పనితీరును పర్యవేక్షిస్తుంటాడు. సరదాగా వాళ్లతో ఔటింగ్లకూ వెళ్తుంటాడు. అలాంటి వ్యక్తి ఈ మధ్య ఆయన స్వయంగా ఫుడ్ డెలివరీలు చేశాడు. అదీ సైకిల్ మీద తిరుగుతూ. ఆదివారం ఈ విషయాన్ని ఆయన తన ట్విటర్ ద్వారా తెలియజేశాడు. శాన్ ఫ్రాన్సిస్కోలో సైకిల్ మీద ఉన్న ఫొటోను షేర్ చేసి.. టైం టు టైం అప్డేట్ పంచుకున్నాడు. పైగా డెలివరీల ద్వారా ఆరోజులో దాదాపు 100 డాలర్లు సంపాదించినట్లు వెల్లడించాడు. ఇక ఎలా సంపాదించారని కొందరు అడగ్గా.. ఒక్కో ఆర్డర్ మీద 6 నుంచి 23 డాలర్లు సంపాదించానని చెప్పుకొచ్చాడు. Spent a few hours delivering for @UberEats. 1. SF is an absolutely beautiful town. 2. Restaurant workers were incredibly nice, every time. 3. It was busy!! - 3:24 delivering out of 3:30 online. 4. I'm hungry - time to order some 🍔🍟🍺 pic.twitter.com/cXS1sVtGhS — dara khosrowshahi (@dkhos) June 27, 2021 పది ట్రిప్పులతో 98.91 డాలర్లు సంపాదించిన స్క్రీన్ షాట్ ఆయన షేర్ చేశాడు. ఇక పాజిటివ్ ఉన్నట్లే ఈ వ్యవహారంలో నెగెటివిటీ మొదలైంది. పబ్లిసిటీ స్టంట్ అదిరిందంటూ 52 ఏళ్ల దారా ఖోస్రోషాహిని కొందరు హేళన చేస్తున్నారు. ఇక ఇంకొందరు ఉబెర్ ఈట్స్ సర్వీసును పొగుడుతూనే.. ఆ వర్కర్లను మనుషుల్లా చూడడం నేర్వండంటూ దారాకి చురకలంటించారు. pic.twitter.com/MPpvzSceDC — dara khosrowshahi (@dkhos) June 27, 2021 చదవండి: భారతీయులకు ఉబెర్ సీఈవో హెచ్చరిక -
Zomato: డెలివరీ బాయ్ జీవితం మార్చేసిన ‘ఆరోజు రాత్రి’
సాక్షి, హైదరాబాద్: పేదరికంతో ఉన్న కుటుంబానికి అండగా నిలిచేందుకు ఆ యువకుడు అతికష్టమ్మీద చేతనైన పని చేస్తున్నాడు. జొమాటోలో డెలివరీ బాయ్‌గా చేరాడు. అయితే అతడు డెలివరీ చేసేది సైకిల్‌పై. నిజమే జొమాటో యాప్‌లో వచ్చిన ఆర్డర్లు తన సైకిల్‌పై డెలివరీ చేస్తుంటాడు. పేదరికంతో బైక్ లేక సైకిల్‌పై ఆర్డర్లు ఇస్తున్న విషయాన్ని ఓ కస్టమర్ చూశాడు. ఆ యువకుడి పరిస్థితి చూసి చలించిపోయాడు. వెంటనే అతడి వివరాలు కనుక్కుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా హైదరాబాద్ ప్రజలు చేదోడుగా నిలిచారు. అందరి సహాయంతో ఇప్పుడు ఆ యువకుడికి బైక్ లభించింది. ఈ స్టోరీ మన హైదరాబాద్‌లో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. జూన్ 14వ తేదీన హైదరాబాద్‌లోని కింగ్‌కోఠికి చెందిన రాబిన్ ముకేశ్ జొమాటోలో ఆర్డర్ చేశాడు. ఆ ఆర్డర్‌ను పాతబస్తీలోని తలాబ్‌కట్ట ప్రాంతానికి చెందిన మహ్మద్ ఆకీల్ (21) లక్డీకాపూల్ నుంచి పార్సిల్ తీసుకుని 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న కింగ్‌కోఠిలో ఇచ్చేందుకు వెళ్లాడు. పార్సిల్ తీసుకోవడానికి కిందకు వచ్చిన రాబిన్ ముకేశ్ ఆకీల్‌ను చూసి షాకయ్యాడు. అతడు డెలివరీ చేసేది ఒక సైకిల్‌పై అని తెలుసుకుని చలించిపోయాడు. పైగా వర్షంలో తడుచుకుంటూ సైకిల్‌పై రావడంతో అతడి పరిస్థితి తెలుసుకున్నాడు. ఆకీల్‌ది పేద కుటుంబం. తల్లిదండ్రులు, ముగ్గురు అక్కాచెల్లెళ్లు, ఒక సోదరుడు ఉన్నాడు. తండ్రి సంపాదన అంతత మాత్రమే ఉండడంతో ఆకీల్ డెలివరీ బాయ్‌గా చేరాడు. బైక్ కొనే స్థోమత లేక సైకిల్‌పైనే ఫుడ్ ఆర్డర్ డెలివరీ చేయడం మొదలుపెట్టాడు. జొమాటో వారికి తన పరిస్థితి చెప్పి సైకిల్‌పై డెలివరీ చేస్తున్నాడు. డెలివరీ చేస్తూనే ఆకీల్ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇదంతా విన్న రాబిన్ వెంటనే ఈ విషయాలన్నీ 32 వేల మంది ఉన్న ‘ది గ్రేట్ హైదరాబాద్ ఫుడ్ అండ్ ట్రావెల్’ ఫేస్బుక్ పేజీలో పోస్టు చేశాడు. అతడికి టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనం కొనేందుకు రూ.65,800 కావాలని విజ్ఞప్తి చేశాడు. ఈ పోస్టు చూసిన వారంతా వెంటనే స్పందించి తోచినంత సహాయం చేశారు. దీంతో రెండు రోజుల్లోనే రూ.73 వేలు పోగయ్యాయి. ఆ డబ్బులతో రాబిన్ టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనం కొని ఆకిల్‌కు అందించాడు. బైక్‌తో పాటు హెల్మెట్, రెయిన్ కోట్, శానిటైజర్, మాస్క్‌లు, మిగిలిన డబ్బులను ఆకీల్ బీటెక్ చదువు ఫీజుల కోసం అందించారు. బైక్ రావడంతో ఇప్పుడు మరిన్ని ఆర్డర్లు చేసి అధిక ఆదాయం పొందుతానని ఆకీల్ చెబుతున్నాడు. ఈ కథనం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫేసుబుక్ గ్రూప్ సభ్యులకు అభినందనలు తెలుపుతున్నారు. ఆకీల్ కుటుంబానికి తాము సహాయం చేస్తామని మరికొందరు ముందుకు వస్తున్నారు. ఆకీల్ పరిస్థితిపై జూన్ 17న ‘సాక్షి’లో ‘ముందుకు సాగిపో.. నీ గమ్యం చేరిపో’ అనే కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. మహ్మద్ ఆకీల్‌కు ద్విచక్ర వాహనం అందిస్తున్న ‘ది గ్రేట్ హైదరాబాద్ ఫుడ్ అండ్ ట్రావెల్’ ఫేసుబుక్ గ్రూప్ ప్రతినిధులు -
World Cycling Day: సైకిల్ తొక్కగలవా ఓ నరహరి !
వెబ్‌డెస్క్: ఇప్పుడంటే కార్లు, బైకుల జమానా నడుస్తోంది కానీ, ఆర్థిక సంస్కరణలు అమలు కాకముందు 90వ దశకం వరకు సైకిల్ అనేది మనదేశంలో ఓ ప్రీమియం వస్తువు. ఇప్పుడు దేశంలో పెద్ద బ్యూరోక్రాట్లుగా, రాజకీయ నాయకులుగా పేరు తెచ్చుకున్న ఎందరో తమ జీవితంలో తొలి అభివృద్ధి పథాన్ని సైకిల్ తొక్కడంతోనే మొదలెట్టారు. ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపిన సైకిల్ క్రమంగా సైడయి పోతోంది. మగమహరాజులకు ప్రత్యేకం 90వ దశకం వరకు పల్లె, పట్నం తేడా లేకుండా పెళ్లి సంబంధాలు మాట్లాడేప్పుడు సైకిల్ పెట్టడం అనేది ఘనతకు చిహ్నంగా ఉండేది. సైకిల్ విషయం తేలిన తర్వాతే మిగిలిన మాట ముచ్చట నడిచేవి. ఇక పిల్లలు స్కూల్‌కి వెళ్లడం దగ్గర నుంచి మొదలు పెడితే పెద్దవాళ్లు పొలం పనులకు వరకు అన్నింటా సైకిల్‌కి ప్రత్యేక స్థానం ఉండేది. పాలు, పేపర్ బాయ్‌లకు సైకిలే జీవనాధారం. అద్దెకు సైకిళ్లు ఇచ్చే సెంటర్లు ప్రతీ టౌనులో ఉండేవి. సినిమా థియేటర్లు, స్కూళ్లలో సైకిల్ స్టాండులే ఉండేవి.... ఎక్కడో ఒక చోట వెహికల్ పార్కింగ్లు ఉండేవి. ఆరోజుల్లో కుర్రకారు ప్రేమ సందేశాలు పంపేదుకు సైకిలెక్కి అమ్మాయిల చుట్టూ శాటిలైట్లలాగా చక్కర్లు కొట్టేవారు. అప్‌కమింగ్ స్టార్‌గా చిరంజీవి ‘నీ దారి పూల దారి’ అంటూ ఎనిమిది రోజుల పాటు నాన్ స్టాప్‌గా సైకిల్ తొక్కి మగ మహరాజుల వెండితెర బాక్సాఫీస్‌ని ఏలితే... అంతకంటే ముందే సైకిల్ ఎక్కిన ఎన్టీఆర్ ఏకంగా ముఖ్యమంత్రి పీఠంపై ఆశీనుడయ్యాడు. అంతటి ఘన చరిత్ర కలిగి సైకిల్‌కు ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించింది ఐక్యరాజ్య సమితి. ప్రతీ ఏడు జూన్ 3వ తేదిన అంతర్జాతీయ సైకిల్ దినోత్సవం జరుపుతోంది. ఇలా వచ్చింది ప్రతీ ఏటా జూన్ 3 ను ప్రపంచ సైకిల్ దినోత్సవంగా పాటిస్తున్నారు. పోలాండ్‌కి చెందిన లెస్జెక్ సిబిల్స్కి అనే సామాజికవేత్త చేసిన కృషి కారణంగా సైకిల్ డే ఆవిర్భవించింది. ప్రపంచ సైకిల్ దినోత్సవం ప్రకటించాలంటూ సైకిల్ వేసుకుని తిరుగుతూ 57 ఇతర దేశాల మద్దతు కూడగట్టారు. సైకిల్ పెడల్స్ అరిగేలా ఐక్యరాజ్యసమితి కార్యాలయం చుట్టూ సైకిల్‌పై తిరిగారు. చివరకు ఆయన శ్రమ ఫలించి 2018లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో జూన్ 03ను ప్రపంచ సైకిల్ దినోత్సవంగా ప్రకటించారు. కాలుష్య రహితం కొన్నేళ్లుగా ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్న ఒకే ఒక్క అంశం గ్లోబల్ వార్మింగ్, పర్యావరణ సమతుల్యత కాపాడటం. కాలుష్యం విడుదల చేయకుండా రవాణా సౌకర్యం కల్పించడం సైకిల్ ప్రత్యేకత. అంతేకాదు సైకిల్ తొక్కడం వల్ల శారీరక వ్యాయమం కూడా కలుగుతుంది. మెయింటనెన్స్ ఖర్చు అతి తక్కువ. ఇలా సైకిల్‌తో అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి సూచనలతో కాలుష్యం తగ్గించడంతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే సైక్లింగ్‌ను ప్రోత్సహించాలంటూ సభ్య దేశాలకు ఐక్యరాజ్య సమితి విజ్ఞప్తి చేస్తోంది. అనేక దేశాలు ఈ సూచనలు పాటిస్తున్నాయి. మన దగ్గర రోడ్లపై సైక్లింగ్‌కు ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయిస్తున్నారు. ఉదాహరణకు హైదరాబాద్‌లో సంజీవయ్య పార్కు, వరంగల్‌లో నిట్ దగ్గర ప్రత్యేక సైక్లింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేశారు. -
అయ్యో జ్యోతి: అప్పట్లో సంచలనం.. ఇప్పుడు విషాదం
తండ్రి ఆరోగ్యం బాగోలేదు. పైగా లాక్డౌన్ కష్టాలు. అందుకే ఆ కూతురు సాహసానికి పాల్పడింది. వారంపాటు 1200 కిలోమీటర్లపైగా సైకిల్ మీద తండ్రిని ఇంటికి చేర్చింది. సైకిల్ జ్యోతి కుమారి సాహసానికి, ధైర్యానికి అప్పట్లో సర్వత్రా ప్రశంసలు కురిసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె ఇంట విషాదం నెలకొంది. పాట్నా: సైకిల్ గర్ల్ జ్యోతి కుమారి తండ్రి మోహన్ పాశ్వాన్ సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషయాన్ని జిల్లా మెజిస్ట్రేట్ త్యాగరాజన్ ప్రకటించారు. ఏ తండ్రి కోసమైతే జ్యోతి కుమారి అంత కష్టానికి ఓర్చిందో.. ఆ తండ్రే ఇక లేరని, ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని త్యాగరాజన్ అన్నారు. అంతేకాదు ఆ కుటుంబానికి అవసరమైన సాయం అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు కూడా. కాగా, జ్యోతి కుటుంబ స్వస్థలం బిహార్‌లోని దర్బంగా. యాక్సిడెంట్ తర్వాత.. జ్యోతి తండ్రి మోహన్ పాశ్వాన్ ఆటో డ్రైవర్. బతుకు దెరువు కోసం ఢిల్లీలోని గురుగ్రామ్‌కు వెళ్లాడు. ఇక పదో తరగతి ఫెయిల్ అయిన పెద్దకూతురు జ్యోతి కూడా ఆయతో పాటే వెళ్లింది. మోహన్ భార్య మిగిలిన పిల్లలతో ఊరిలో ఉండేది. పోయినేడాది ఓ రోడ్డు ప్రమాదంలో మోహన్ గాయపడ్డాడు. దీంతో ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితులు దిగజారాయి. సరిగ్గా అదే టైంలో లాక్డౌన్ వచ్చి పడింది. ఇంటి కిరాయి కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఓనర్ ఖాళీ చేయమన్నాడు. దీంతో తండ్రి ఆరోగ్య దృష్ట్యా ఊరికి వెళ్లాలని జ్యోతి అనుకుంది. సైకిల్‌పై తండ్రిని కూర్చోబెట్టుకుని ఇంటి బాట పట్టింది. వారం కష్టం జబ్బు పడిన తండ్రి మోహన్‌ను సైకిల్ పై కూర్చోబెట్టుకుని ప్రయాణం మొదలుపెట్టింది జ్యోతి. రోజూ ముప్ఫై నుంచి నలభై కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కింది. మధ్య మధ్యలో కొందరు ట్రక్ డ్రైవర్లు లిఫ్ట్, భోజనం ఇచ్చి సాయపడ్డారు. మొత్తానికి వారం తర్వాత ఇంటికి చేరుకుంది. జ్యోతి ప్రయత్నానికి అప్పట్లో దేశమంతా సలాం కొట్టింది. అంత చిన్న వయసులో ఏమాత్రం అధైర్యపడకుండా... ఎక్కడా అలసిపోకుండా... అంత సుదీర్ఘ దూరం ఆమె సైకిల్‌పై ప్రయాణించడం అప్పట్లో అంతా మెచ్చుకున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం జ్యోతి తెగువకు హ్యాట్సాఫ్ చెబుతూ బాలపురస్కార్ ప్రకటించారు. ఇవాంక ట్రంప్ సహా పలువురు సెలబ్రిటీలు కూడా సైకిల్ జ్యోతి సాహసంపై స్పందించారు. అయితే ఆ టైంలో కొంత సాయం అందినప్పటికీ.. ఆర్థికంగా ఆ కుటుంబం నిలదొక్కుకోలేదని తెలుస్తోంది. జ్యోతి కుటుంబానికి సాయం జ్యోతి కథనాల తర్వాత అధికారులు ఆమెకు కొంత సాయం అందించారు. అప్పట్లో సైక్లింగ్ ఫెడరేషన్ కూడా జ్యోతిని సైకిల్ రైడర్‌గా తీర్చిదిద్దుతామని ప్రకటించింది. అయితే జ్యోతి తల్లి మాత్రం కూతురి చదువే మొదటి ప్రాధాన్యంగా పేర్కొంది. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయిన జ్యోతి కుటుంబం ఇప్పుడు విషాదంలో మునిగిపోయింది. దీంతో సాయం అందించేందుకు పలువురు దాతలు ముందుకొస్తున్నారు. -
అమానవీయం: సైకిల్‌పై భార్య మృతదేహం తరలింపు
లక్నో: కరోనా విజృంభణ వేళ దేశంలో అమానవీయ సంఘటనలు జరుగుతున్నాయి. కరోనాకు భయపడి ప్రజలు అందరినీ అనుమానిస్తున్నారు. కరోనా భయంతో చాలా అప్రమత్తంగా ఉన్నారు. ఈ క్రమంలోనే మరింత దిగజారి ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో మరణించిన తన భార్యను సైకిల్‌పై శ్మశానానికి తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామంలోకి అతడిని రాకుండా నిలువరించారు. ఉత్తరప్రదేశ్‌లోని జాన్పూర్ జిల్లా అంబర్‌పూర్‌కు చెందిన తిలక్ధారి సింగ్ భార్య రాజ్‌కుమారి (50) అనారోగ్యంతో ఉమానాథ్ జిల్లా ఆస్పత్రిలో చేరింది. చికిత్స పొందుతూ సోమవారం ఆమె మృతిచెందింది. గ్రామం వరకు అంబులెన్స్‌లో మృతదేహం చేరింది. అయితే అక్కడి నుంచి అంత్యక్రియలకు ఎవరూ ముందుకు రాలేదు. నా అనేవారు లేకపోవడంతో అతడు తన భార్యను అంత్యక్రియల కోసం శ్మశానానికి సైకిల్‌పై తరలిస్తున్నాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అతడిని అడ్డుకున్నారు. ఆమె కరోనాతో మృతి చెందిందనే భయాందోళనతో గ్రామస్తులు ముందుకు కదలనీవలేదు. చివరకు పోలీసుల సహాయంతో అతడు తన భార్య అంత్యక్రియలు నిర్వహించాడు. చదవండి: కరోనాతో ఒకేరోజు ముగ్గురు ప్రముఖులు కన్నుమూత చదవండి: ఆక్సిజన్ సిలిండర్ కోసం 24 గంటల్లో 1,500 కి.మీ జర్నీ जौनपुर अस्पताल में पत्नी की मौत के बाद एम्बुलेस शव अम्बरपुर गांव तक छोड़ गई लेकिन गाव वालों ने अंतिम संस्कार नही करने दिया तो बुजुर्ग साइकिल पर शव रखकर नदी किनारे अंतिम संस्कार के लिए चल पड़े हालांकि बाद में @jaunpurpolice की मदद से गांव में ही अंतिम संस्कार हुआ ।@AjayPandeyTV9 pic.twitter.com/Fza3G0Q03M — Manish kumar (@manishtv9) April 28, 2021 -
చదివింది తొమ్మిది.. పనులు చూస్తే..
సాక్షి, భైంసా: అసలే కరోనా కాలం.. బడులు మూతపడ్డాయి. పిల్లలంతా ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ కాలక్షేపం చేస్తున్నారు. కానీ నిర్మల్ జిల్లా భైంసా మండలం మహాగాం గ్రామానికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి సాయికృష్ణ మాత్రం తన ఆలోచనకు పదును పెట్టాడు. రోజూ తను చూసే సైకిల్‌కు ఎలక్ట్రికల్ పరికరాలు బిగించి.. రూ.8 వేలలోనే ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేసి ఔరా అనిపించాడు. చూసినవాళ్లు అతడిని మెచ్చుకుంటున్నారు. సాయికృష్ణ తండ్రి పోతన్న గుమాస్తా. తల్లి సురేఖ బీడీ కార్మికురాలు. బడులు మూతపడడంతో ఏదైనా కొత్త ఆవిష్కరణ చేయాలని అనుకున్నాడు. తన వద్ద ఉన్న సైకిల్‌ను ఎలక్ట్రిక్ సైకిల్‌గా మార్చే ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. వెంటనే తన సైకిల్‌కు రెండు బ్యాటరీలు, ఒక హెవీ మోటార్‌ను బిగించి వాటిని వైర్లతో అనుసంధానించాడు. ఈ రెండు బ్యాటరీలను ఒక్కసారి చార్జింగ్ చేస్తే.. మోటార్ సాయంతో 50 కిలోమీటర్ల వరకు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చని చెబుతున్నాడు. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ తయారీకి రూ.8 వేల వరకు ఖర్చయిందని, ఆ డబ్బు తన తండ్రి ఇచ్చాడని తెలిపాడు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ప్రోత్సహిస్తే మరిన్ని ఆవిష్కరణలు చేస్తానంటున్నాడీ బాలుడు. ( చదవండి: యాక్టింగ్ ఇరగదీశాడు.. అయినా పోలీసులకు దొరికిపోయాడు.. ) -
ఓటు వేసిన హీరో విజయ్.. బిల్డప్ అంటూ ట్రోల్స్
సాక్షి, చెన్నై: వినూత్నమైన పనులు చేస్తూ నటుడు విజయ్ ఎప్పుడూ తన ప్రత్యేకతను చాటుకుంటాడు. మంగళవారం జరుగుతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ సైకిల్‌పై వచ్చి ఓటు వేశారు. పోలింగ్ కేంద్రంలో అభిమానులతో సెల్ఫీలకు పోజులిచ్చారు. ప్రస్తుతం ఆయన సైకిల్‌పై వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హీరో విజయ్ వేగంగా సైకిల్ తొక్కుతూ పోలింగ్ కేంద్రానికి వస్తుండగా రోడ్డుపై అభిమానులు అయన వెంట బైక్‌లతో అనుసరించారు. సాధారణ వ్యక్తిలా పోలింగ్ కేంద్రానికి విజయ్ సైకిల్ మీద వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇప్పటికే పలువురు సినీ రాజకీయ ప్రముఖు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే హీరో విజయ్ తన ఇంటి నుంచి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయడంపై కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియా ఈ వీడియోను చూసిన నెటిజన్లు హీరో విజయ్ బిల్డప్ కోసమే సైకిల్‌పై వచ్చాడంటూ ట్రోల్స్ చేస్తున్నారు. అయితే విజయ్ సైకిల్ మీద రావడనికి కారణం ఇదే అంటూ ఆయన సోషల్ మీడియా టీం ఓ ప్రకటన విడుదల చేసింది. తలాపతి విజయ్ సైకిల్‌పై వచ్చి ఓటు వేయడానికి కారణం ఉంది. పోలింగ్ బూత్ తన ఇంటి వెనుక వీధిలో ఉంది. అది ఒక ఇరుకైన వీధి, కారును అక్కడికి తీసుకెళ్లడం కష్టం. అందుకే ఆయన సైకిల్‌పై పోలింగ్ కేంద్రానికి వెళ్లారని, దీనికి వేరే కారణం లేదని విజయ్ సోషల్ మీడియా టీం పేర్కొంది. #Vijay arrives in cycle to cast his vote #TamilNaduElections pic.twitter.com/iKY4bkIqA8 — BARaju (@baraju_SuperHit) April 6, 2021 -
బిగ్‌బాస్ కంటెస్టెంట్ ‘సైకిల్’
పునర్ణవి భూపాలం, మహత్ రాఘవేంద్ర శ్వేతావర్మ, సూర్య లీడ్‌రోల్స్‌లో ఆట్ల అర్జున్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సైకిల్'. గ్రే మీడియా బ్యానర్ పై, ఓవరసీస్ నెట్వర్క్ ఎంటర్టైన్మెంట్ విజయా ఫిలింస్, ఓంశ్రీ మణికంఠా ఫిలింస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం. సంక్రాంతి బరిలో పోటీకి దిగుతున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా జనవరి 15న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు అర్జున్‌రెడ్డి మాట్టాడుతూ... "భారతీయ సినిమాలో ఇంకా చెప్పటానికేం లేవు అన్నట్లుగా బోలెడన్ని కథలతో సినిమాలొచ్చాయి." "ఐనా కొత్త కథలు రాస్తున్నాం కొత్త సినిమాలు తీస్తున్నాం. ఆ ప్రయత్నంలోనే పుట్టిన్పప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంజన్‌కాని, ఇంధనం కానీ లేకుండా నడుస్తూ, మనతో కలిసి ప్రయాణిస్తున్న సైకిల్ పేరుని మా సినిమాకి టైటిల్‌గా పెట్టుకుని ఫస్ట్ సీన్లోనే దానికి సంబంధించిన ఇంట్రస్టింగ్ లింక్‌తో క్లీన్ కామెడీ ఎంటర్టైనర్ తీశాము. ఈ చిత్రంలో హీరో, హీరోయిన్స్‌తో పాటు సుదర్శన్, అనితా చౌదరి, క్యారెక్టర్స్ మ్యాజిక్ చేస్తాయి. వీళ్లతోపాటు, సూర్య, మధుమణి నవీన్‌నేని, ఆర్ఎక్స్ 100 లక్ష్మణ్, అన్నపూర్ణమ్మ జోగీబ్రదర్స్ కూడా చాలా ఎంటర్టైన్ చేస్తారు. కామెడీ జోనర్ సినిమాకి బ్యూటీఫుల్ లవ్‌స్టోరీ మ్యాజిక్ యాడ్ ఐతే, ఎంత కొత్తగా వుంటుందో, మా చిత్రంతో చూస్తారు" అని తెలిపారు. (చదవండి: స్వర్గంలో అడుగుపెట్టి 15 ఏళ్లు: రామ్) ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు చేరువగా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో 90 స్క్రీన్లలో విడుదల చేస్తోంది చిత్రయూనిట్. త్వరలో టీజర్‌తోపాటు, ఆడియో రిలీజ్ చేసుకుని ధియేటర్స్‌లోకి రాబోతున్న ఈ సినిమాకు నిర్మాతలు, పి.రాంప్రసాద్, డి.నవీన్‌రెడ్డి, సహనిర్మాతఃవి.బాలాజీరాజు, కెమెరాఃసిద్ధంమనోహర్, సంగీతంః జి.ఎం.సతీష్, ఎడిటింగ్ః గడుతూరిసత్య, ఆర్ట్ః రామ్‌కుమార్, పిఆర్వో శ్రీ, పబ్లిసిటీ డిజైనర్ ఓంకార్ కడియం. (చదవండి: ఈ హ్యాపీనెస్ ఏమిటి? ఎట్లా ఇట్లా అయితే?: కత్తి మహేష్) -
కనిపించే దైవం: 60 ఏళ్లుగా ఉచిత వైద్యం
సాక్షి, ముంబై : ప్రాణాంతక కరోనా వైరస్ సమయంలో తమ జీవితాలను పణంగా పెట్టి మరీ వైద్యులు, ఇతర సిబ్బంది తమ అమూల్యమైన సేవలందిస్తున్నారు. అనేకమందిని కాపాడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాకు చెందిన రాంచంద్ర దండేకర్ (87) మరింత ఆదర్శంగా నిలుస్తున్నారు. కరోనావైరస్ మహమ్మారికి భయంతో చాలామంది సీనియర్ సిటిజన్లు ఇంటినుంచి బయటికి రావాలంటే వణికిపోతున్నారు. కానీ ఈ సీనియర్ వైద్యుడు మాత్రం మారుమూల గ్రామాల్లో పర్యటిస్తూ రోగుల వద్దకే వెళ్లి ఉచితంగా తన సేవలందించడం విశేషం. వైద్యులు దేవుడితో సమానమనే మాటకు నిలువెత్తు నిదర్శనం రాంచంద్ర దండేకర్. ప్రస్తుత ఆరోగ్య సంక్షోభ సమయంలో కూడా దీన్ని అక్షరాలా నిజం చేస్తున్నారు. హోమియోపతి, ఆయుర్వేద వైద్యుడైన రాంచంద్ర కరోనా బారిన పడ్డ వారితోపాటు, ఇంటింటికి వెళ్లి నిరుపేదలకు సేవలందిస్తున్నారు. కరోనా సోకినట్టు అనుమానం వస్తే.. సంబంధిత రోగులకు మార్గనిర్దేశనం చేస్తున్నారు. ఇందుకోసం తన సైకిలుపై రోజుకి 10 కిలోమీటర్లు ప్రయాణిస్తారు. కనీసం చెప్పులుకూడా లేకుండానే గత 60 ఏళ్లుగా సైకిలు పైనే వెళ్లి మరీ చికిత్స అందిస్తున్నారట. ఎప్పటిలాగానే తన పనితాను చేస్తున్నానని దండేకర్ చెప్పుకొచ్చారు. గ్రామీణ పేదలకు నిస్వార్థంగా సేవచేయడం కొనసాగించాలనుకుంటున్నానని తెలిపారు. ప్రతి గ్రామంలో రోజుకు 20 ఇళ్లను సందర్శిస్తారని దండేకర్ కుమారుడు గర్వంగా చెబుతున్నారు. తన వెంట మొబైల్ ఫోన్, కనీసం వాచ్ కూడా తీసుకెళ్లరని వెల్లడించారు. మరీ దూర ప్రాంతాలకు వెళ్లవలసి వస్తే.. బస్సులో వెళ్లి, అక్కడ మళ్లీ సైకిల్ మీదే తన సేవలను కొనసాగిస్తారనీ, ఆలస్యమైతే గ్రామంలోనే ఎవరో ఒకరి ఇంట్లో విశ్రాంతి తీసుకుని మరునాడు ఇంటికి వస్తారని తెలిపారు. అందుకే ఆయన్ను అంతా 'డాక్టర్ సహబ్ ముల్ వాలే' అని పిలుచుకుంటారు. 1957-58లోనాగ్‌పూర్ కాలేజ్ ఆఫ్ హోమియోపతి నుంచి డిప్లొమా పూర్తి చేసిన దండేకర్ చంద్రపూర్ హోమియోపతి కళాశాలలో లెక్చరర్‌గా సంవత్సరం పనిచేశారు. ఆ తరువాత మారుమూల గ్రామాల్లో వైద్య సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. కరోనా పేరుతో కార్పొరేట్ ఆసుపత్రుల నుంచి, సామాన్య వైద్యులదాకా అందిన కాడికి దోచేస్తున్నఈ తరుణంలో రాంచంద్ర సేవలపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా దేశంలో కోవిడ్-19 అత్యంత ప్రభావిత రాష్ట్రంగా మహారాష్ట్ర కొనసాగుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం రాష్ట్రంలో ఇప్పటివరకు 42,633 మంది మరణించారు. -
వెండితెరపై ‘1200 కిలో మీటర్ల పయనం’
పాట్నా: లాక్డౌన్ కాలంలో గాయాలతో ఉన్న తన తండ్రిని ఎక్కించుకుని 1200 కి.మీ. సైకిల్ తొక్కి ఇంటికి చేరుకున్న జ్యోతి కుమారి గాధ అప్పట్లో మార్మోగిపోయింది. అయితే ఈ ప్రయాణం వెండితెరపై ఆవిష్కృతం కానుంది. దీన్ని ప్రధానంగా తీసుకుని 'ఆత్మనిర్భర్' చిత్రం తెరకెక్కనుంది. ఇందులో జ్యోతి కుమారి స్వయంగా నటించనుండటం విశేషం. దీనికి సంబంధించిన షూటింగ్ ఆగస్టులో పట్టాలెక్కనున్నట్లు విమేక్ఫిల్మ్స్ ప్రకటించింది. ఈ సినిమాలో జ్యోతి కథే కాకుండా ఆ బాలికను ఇబ్బందుల్లోకి నెట్టేసిన సమాజంలోని లోటుపాట్లను కూడా చూపించనున్నామని సినిమా దర్శకుడు షైన్ కృష్ణ అన్నారు. (ఇవాంకను ఆకట్టుకున్న జ్యోతి కథ) గుర్గావ్ నుంచి దర్భంగా వరకు ఆమె ప్రయాణించిన ప్రదేశాల్లో సినిమా చిత్రీకరణ జరుగుతుందని తెలిపారు. ఈ సినిమా హిందీ, ఇంగ్లిష్తో పాటు ఇతర భాషల్లోనూ ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా లాక్డౌన్లో హర్యానాలోని గుర్గావ్లో తండ్రితో కలిసి నివసిస్తోన్న జ్యోతిని ఇంటి యజమానులు అద్దె కట్టాలంటూ వేధించారు. దీంతో సొంతూరికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న జ్యోతి సెకండ్ హ్యాండ్ సైకిల్ కొనుగోలు చేసింది. ఆ సైకిల్‌పై తండ్రిని కూర్చోబెట్టుకొని ఏకంగా 1200 కి.మీ. తొక్కింది. అయిదు రోజుల పాటు అష్టకష్టాలు పడి బిహార్‌లోని స్వస్థలానికి చేరుకుంది. (ఆలయంలో నయన్-శివన్‌ల వివాహం!) -
‘అట్లాస్’ మళ్లీ వస్తుందా..?
న్యూఢిల్లీ: అట్లాస్ సైకిల్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. దశాబ్దాలుగా లక్షలాది భారతీయుల కుటుంబాలకు సైకిళ్లను అందించిన ఈ కంపెనీ ఇప్పుడు నిధుల్లేక అల్లాడిపోతోంది. కార్యకలాపాల నిర్వహణకు చిల్లిగవ్వకూడా లేని పరిస్థితి ఏర్పడడంతో దేశ రాజధాని సమీపంలోని సాహిదాబాద్లో ఉన్న చివరి ప్లాంట్‌ను కూడా అట్లాస్ సైకిల్స్ మూసివేసింది. ప్రపంచ సైకిల్ దినోత్సవం అయిన జూన్ 3నే కంపెనీ ప్లాంట్ మూతపడడం యాదృచ్ఛికం. అయితే, ప్లాంట్ మూసివేత తాత్కాలికమేనని కంపెనీ సీఈవో ఎన్పీ సింగ్ రాణా ప్రకటించారు. తాము అనుకున్నట్టుగా కంపెనీ వద్ద మిగులు భూమిని విక్రయించి రూ.50 కోట్లు సమీకరించగలిగితే.. కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. అట్లాస్ సైకిల్స్ సాహిదాబాద్ ప్లాంట్‌లో 431 మంది కార్మికులు పనిచేస్తుండగా.. ఇప్పుడు వారు ఉపాధి కోల్పోయారు. నష్టాల వల్లే..: అట్లాస్ సైకిల్స్‌ను నష్టాలే ముంచేశాయి. 2014 నుంచి ఈ కంపెనీ వ్యాపార కార్యకలాపాలపై నష్టాలను ఎదుర్కొంటోంది. దీంతో 2014 డిసెంబర్లో మలన్పూర్ ప్లాంట్‌కు కంపెనీ తాళాలు వేసేసింది. ముఖ్యంగా గత రెండేళ్ల కాలంలో నష్టాలు మరింత అధికమయ్యాయి. ఫలితంగా 2018 ఫిబ్రవరిలో హరియాణాలోని సోనిపట్ ప్లాంట్‌ను కూడా కంపెనీ మూసేసింది. సోనిపట్ ప్లాంట్ కంపెనీకి మొదటిది. 1951లో దీన్ని జానకిదాస్ కపూర్ ప్రారంభించారు. 1965 నాటికి అట్లాస్ సైకిల్స్ దేశంలోనే అతిపెద్ద సైకిళ్ల తయారీ కంపెనీగా అవతరించింది. విదేశాలకూ కార్యకలాపాలను విస్తరించడం ద్వారా 40 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ప్రపంచంలోనే ప్రముఖ సైకిళ్ల కంపెనీల్లో ఒకటిగా గుర్తింపు సంపాదించుకుంది. 1982లో ఏషియన్ గేమ్స్‌కు సైకిళ్లను సరఫరా చేసింది. తిరిగి వస్తాం..: కంపెనీ సీఈవో రాణా మాత్రం ప్లాంట్ మూసివేత తాత్కాలికమేనని స్పష్టం చేశారు. ‘‘ప్లాంట్‌ను మూసివేయలేదు. దీనిపై ఎంతో తప్పుడు సమాచారం నెలకొని ఉంది. ప్లాంట్‌ను తిరిగి ప్రారంభిస్తాం. ఉద్యోగులను కూడా తొలగించలేదు. తాత్కాలికంగా కార్యకలాపాలను నిలిపివేశామంతే. మిగులు భూమి విక్రయానికి అనుమతించాల్సిందిగా ఎన్సీఎల్టీకి దరఖాస్తు చేసుకున్నాం. అనుమతి వచ్చిన వెంటనే భూ విక్రయాన్ని చేపట్టి, నిధులు అందిన వెంటనే ప్లాంట్‌ను తిరిగి తెరుస్తాం. కంపెనీ ఉత్పత్తులకు డిమాండ్ సమస్య లేదు. 70 ఏళ్ల బ్రాండ్ మాది. తిరిగి నిలదొక్కుకుంటాం’’ అని రాణా వివరించారు. -
సొంతంగా రెండు చక్రాల సవారీ..
లాక్డౌన్ ఎలాంటి వాళ్లకైనా చాలా పనులు సొంతంగా చేసుకునేలా నేర్పిస్తుంది. మున్నీ బాల సుమన్ కూడా అలా ఓ కొత్తపనికి శ్రీకారం చుట్టింది. మున్నీ వయసు 50 ఏళ్లు. జార్ఖండ్‌లోని ఔరంగాబాద్ నబీనగర్ రోడ్‌లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో నర్సుగా విధులను నిర్వర్తిస్తుంది. తను నివాసం ఉండే బొకారో స్టీల్ సిటీలో నివసిస్తున్న మున్నీ తను ఉన్న చోటు నుంచి ఆరోగ్యకేంద్రానికి వెళ్లాలంటే కనీసం ఐదుకిలోమీటర్లు దూరం వెళ్లాలి. రోజూ బస్సులో వెళ్లే మున్నీ లాక్డౌన్ వల్ల ఎలాంటి రవాణా సదుపాయాలు లేకపోవడంతో 20 రోజులపాటు కాలినడకనే హాస్పిటల్‌కు వెళ్లింది. ఈ సమయంలో సొంతంగా వాహనం ఉంటే బాగుండేది అనుకున్న మున్నీకి బైక్ కొనుగోలు చేసేంత డబ్బు లేదు. దాంతో సైకిల్ కొందామనుకుంది. లాకౌడౌన్ నిబంధనలు సడలించగానే రూ.4,600 పెట్టి సైకిల్ కొనుక్కుంది. చిన్నప్పుడు సైకిల్ తొక్కడం నేర్చుకోలేదన్న మున్నీ ఆసుపత్రి ప్రాంగణంలోనే మూడు రోజులపాటు సైకిల్ తొక్కడం నేర్చుకుని నాల్గవ రోజు నుండి తను ఉంటున్న ఆరోగ్య శిబిరం నుండి ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి సైకిల్ తొక్కుకుంటూ వెళుతోంది 50 ఏళ్ల వయసులో సైకిల్ తొక్కడం నేర్చుకొని, మొదటిసారి సొంతంగా సైకిల్‌పై విధులకు వెళ్లడం చాలా ఆనందంగా ఉంద’ని చెబుతుంది మున్నీ. Meet 50yo nurse Munni Bala Suman from Bokaro Steel City, who learnt cycling in just 3 days to be able to go for her hospital duty regularly, amidst #lockdown. You're never too old to learn anything new. Salute her indomitable courage!👏@abhijitmajumder @ShefVaidya @rajeev_mp pic.twitter.com/kbq3X7VWWk — Nausheen Khan (@DrNausheenKhan) May 29, 2020 -
మేనకోడలిని చూసేందుకు100 కిలోమీటర్లు..
శ్రీకాకుళం ,కాశీబుగ్గ : తోడబుట్టిన చెల్లి ఆడబిడ్డకు జన్మన్వివగా.. మేనకోడలిని చూసేందుకు మామ ఏకంగా వంద కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించాడు. రణస్థలం గ్రామానికి చెందిన ధ ర్మవరపు సురేష్ పలాస మండలం రామకృష్ణాపురం వద్ద ఉన్న బోగేష్ ఇటుకల క్వారీలో పనిచేస్తున్నా రు. ఆయన చెల్లి దుర్గకు ప్రసవ సమయం దగ్గరపడడంతో కావాల్సిన డబ్బు, సరుకులు తీసుకుని రావాలనుకున్నాడు. దుర్గ సోమవారమే రిమ్స్‌లో ఆడపిల్లకు జన్మనిచ్చింది. బుజ్జాయి మేనమామ ఘడియల్లో పుట్టడంతో మంగళవారం నాటికి తప్పకుండా చూడాలని, లేదంటే ఐదేళ్లు చూడకూడదని పెద్దలు చెప్పారు. దీంతో సురేష్ పలాస నుంచి రణస్థలం వరకు సైకిల్ తొక్కుకుంటూ వచ్చాడు. -
భార్యతో సైకిల్‌పై 120 కిలోమీటర్లు..
సాక్షి, చెన్నై: కట్టుకున్న భార్య క్యాన్సర్‌తో విలవిలలాడుతుంటే తట్టుకోలేకపోయాడు. భార్యను రక్షించుకోవాలన్న అతని తపన ముందు దూరం, వయోభారం ఏమాత్రం అడ్డురాలేదు. 65 ఏళ్ల వయసులో 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్పత్రికి భార్యను సైకిల్‌పై తీసుకెళ్లాడు. తమిళనాడులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తంజావూరు జిల్లా కుంభకోణంకు చెందిన అరివలగన్ (65) రైతు. ఇతని భార్య మంజుల (60) క్యాన్సర్‌తో బాధ పడుతున్నారు. ఆమెకు జిప్మర్లో చికిత్స అందిస్తున్నారు. తరచూ ఆమెకు కీమో థెరపీ అందించాల్సి ఉంది. లాక్డౌన్ అమలులో ఉండటంతో బస్సులు లేవు. ప్రైవేటు అంబులెన్సుకు చెల్లించుకునే స్తోమత లేదు. దీంతో మంగళవారం వేకువ జామున ఇంటి నుంచి సైకిల్‌పై భార్యను ఎక్కించుకుని పుదుచ్చేరిలోని జిప్మర్కు బయలుదేరాడు. ఒక పగలు, ఒక రాత్రి సైకిల్ మీద పయనం సాగించి బుధవారం ఉదయానికి పుదుచ్చేరికి చేరుకున్నాడు. వైద్య నివేదికలు దగ్గర ఉంచుకోవడంతో దారిలో ఎక్కడా పోలీసులు ఇబ్బందులు పెట్టలేదు. జిప్మర్లోకి సైకిల్‌పై తన భార్యతో వచ్చిన అరివలగన్‌ను చూసిన వాళ్లంతా నివ్వెరపోయారు. జిప్మర్ వైద్యులు మంజులకు వైద్య పరీక్షలు జరిపి, కీమో థెరపీ అందించారు. అరివలగన్కు భార్యపై ఉన్న ప్రేమను చూసి చలించిన జిప్మర్ వైద్యులు గురువారం సాయంత్రం అంబులెన్స్‌లో ఆ జంటను కుంభకోణంకు పంపించారు. చదవండి: రాష్ట్రాలు దాటకుండా రైళ్లు నడిపే యోచన! -
ఫోటో సాయంతో.. 24 ఏళ్ల తర్వాత
సాయం చేసిన వారు ఎదురుపడితే.. ఎక్కడ వారికి తిరిగి సాయం చేయాల్సి వస్తుందో అని మొహం తిప్పుకుపోయే రోజులివి. అలాంటిది ఎప్పుడో పాతికేళ్ల క్రితం సాయం చేసిన వ్యక్తికి కృతజ్ఞతలు తెలపడం కోసం ఓ యువతి చేసిన ప్రయత్నం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పేరు, ఊరు లాంటి వివరాలు ఏం తెలియని వ్యక్తి కోసం కేవలం ఓ ఫోటో సాయంతో గాలించడం అంటే మాటలు కాదు. కానీ లండన్‌కు చెందిన ఒక యువతి చిన్నప్పుడు తనకు ఆడుకోడానికి సైకిల్ కొనిచ్చి ఆనందానికి గురిచేసిన వ్యక్తిని కలుసుకునే ప్రయత్నం చేసి విజయం సాధించింది. వివరాల్లోకి వెళ్తే.. మెవాన్ బబ్బకర్ (29) ప్రస్తుతం లండన్‌లో నివసిస్తోంది. కుర్దిష్‌కు చెందిన మెవాన్ కుటుంబం 1990 కాలంలో ఇరాక్ వదిలి నెదర్లాండ్‌లోని ఒక శరణార్థి శిబిరానికి చేరి అక్కడ తలదాచుకున్నారు. అప్పుడు మెవాన్ వయసు ఐదేళ్లు. ఆ సమయంలో అక్కడ శిబిరం వద్ద పని చేసే ఒక వ్యక్తి తనకు చిన్న సైకిల్ కొనిచ్చి ఎంతో ఆనందానికి గురి చేశారు. ఆ తర్వాత వారు అక్కడి నుంచి లండన్‌కు వెళ్లి పోయారు. 24ఏళ్ల తర్వాత మెవాన్ తనకు చిన్నతనంలో సైకిల్ కొనిపించిన వ్యక్తిని కలవాలని భావించింది. కానీ అతడి పేరు కూడా ఆమెకు తెలియదు. కేవలం చిన్నతనంలో ఆ వ్యక్తితో దిగిన ఫొటో మాత్రమే ఆమె దగ్గర ఉంది. ఈ క్రమంలో మేవాన్ ఆ ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేసింది. ‘నాకు ఐదేళ్ల వయసు ఉన్నపుడు మా కుటుంబం నెదర్లాండ్‌లోని శరణార్థి శిబిరంలో తలదాచుకున్నాం. ఆ సమయంలో జ్వోల్లే ప్రాంతంలో పనిచేసే ఒక వ్యక్తి నాకు సైకిల్ కొనిచ్చి ఆనందపరిచాడు. ఆ వ్యక్తి పేరు నాకు తెలియదు. నేను అతడిని కలుసుకోవాలనుకుంటున్నాను. సాయం చేయండి’ అని ట్విటర్లో పోస్ట్ చేసింది. ఇలా ట్వీట్ చేసిన కొద్ది గంటల్లోనే మేవాన్ ట్వీట్‌ను 7వేల సార్లు రీట్వీట్ చేశారు నెటిజన్లు. Hi internet, this is a longshot BUT I was a refugee for 5 yrs in the 90s and this man, who worked at a refugee camp near Zwolle in the Netherlands, out of the kindness of his own heart bought me a bike. My five year old heart exploded with joy. I just want to know his name. Help? pic.twitter.com/XzUgHzllYb — Mevan | میڤان (@MeAndVan) August 12, 2019 అతడిని కనుగొనడంలో ఆ ట్వీట్ ఆమెకు ఎంతో ఉపయోగపడింది. తాజాగా మంగళవారం మేవాన్ అతడిని కలుసుకుంది. ఈ సందర్భంగా తీసిన ఫోటోను ట్వీట్ చేసింది. ‘ఈ వ్యక్తి పేరు ఎగ్బర్ట్. 1990 నుంచి శరణార్థులకు సాయం చేస్తున్నారు. ఆయనను చూడగానే ఎంతో ఆనందం కలిగింది. నేను ఎంతో ధైర్యవంతమైన, స్వతంత్ర భావాలు గల మహిళగా ఎదిగినందుకు నన్ను చూసి ఎగ్బర్ట్ ఎంతో గర్వించారు. వారికి ఒక మంచి కుటుంబం ఉంది. ఇక నేను వారిని విడిచిపెట్టలేనని ఆ కుటుంబం భావిస్తుస్తోంది. చిన్న పనులు గొప్ప అనుభవాల్ని మిగిల్చాయి’ అంటూ మేవాన్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ స్టోరీ ఇంటర్నెట్లో తెగ వైరలవుతోంది. This is Egbert. He's been helping refugees since the 90s. He was so happy to see me. He was proud that I'd become a strong and brave woman. He said that was his wish for me when I was small. He grows orchids. He has a beautiful family. He said it felt like I'd never left. pic.twitter.com/WlDWm2seVh — Mevan | میڤان (@MeAndVan) August 13, 2019 -
కొత్త తరహా ప్రేమకథ ‘సైకిల్’
పునర్ణవి భూపాలం, మహత్ రాఘవేంద్ర, శ్వేతావర్మ, సూర్య లీడ్‌రోల్స్‌లో ఆట్ల అర్జున్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సైకిల్. గ్రే మీడియా బ్యానర్ పై, ఓవరసీస్ నెట్వర్క్ ఎంటర్టైన్మెంట్ విజయా ఫిలింస్, ఓంశ్రీ మణికంఠా ఫిలింస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా షూటింగ్‌తో పాటు డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు అర్జున్ రెడ్డి మాట్లాడుతూ... ఇండియన్ సినిమాలో ఇంకా చెప్పటానికేం లేవు అన్నన్ని కథలతో సినిమాలొచ్చాయి. ఐనా కొత్త కథలు రాస్తున్నాం కొత్త సినిమాలు తీస్తున్నాం. ఆ ప్రయత్నంలోనే పుట్టిన్పప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంజన్‌కాని, ఇంధనం కానీ లేకుండా నడుస్తూ, మనతో కలిసి ప్రయాణిస్తున్న సైకిల్ పేరుని మా సినిమాకి టైటిల్‌గా పెట్టుకుని ఫస్ట్ సీన్లోనే దానికి సంబంధించిన ఇంట్రస్టింగ్ లింక్‌తో క్లీన్ కామెడీ ఎంటర్టైనర్ తీశాము. ఈ చిత్రంలో హీరో, హీరోయిన్స్‌తో పాటు సుదర్శన్, అనితాచౌదరి క్యారెక్టర్స్ మ్యాజిక్ చేస్తాయి. వీళ్లతోపాటు సూర్య, మధుమణి నవీన్‌నేని, ఆర్ఎక్స్100 లక్ష్మణ్, అన్నపూర్ణమ్మ జోగీబ్రదర్స్ కూడా చాలా ఎంటర్టైన్ చేస్తారు. కామెడీ జోనర్ సినిమాకి బ్యూటీఫుల్ లవ్‌స్టోరీ మ్యాజిక్ యాడ్ ఐతే ఎంత కొత్తగా వుంటుందో, మా చిత్రంతో చూస్తారు’ అన్నారు. త్వరలో ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించి సినిమా రిలీజ్ డేట్‌ను ఎనౌన్స్ చేశారు. -
ఆ డాక్టర్‌కు అదేం పని..
సాక్షి, న్యూఢిల్లీ : భోపాల్‌లోని ఐష్బాగ్ ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో గత ఏడాదిగా పార్క్ చేసిన సైకిళ్లు మాయమవుతున్నాయి. సైకిళ్లు అదృశ్యం కావడంపై అపార్ట్మెంట్ వాసులు పోలీసులకూ ఫిర్యాదు చేయకపోవడంతో వీటిని ఎవరు దొంగిలిస్తున్నారనేది అంతుచిక్కకుండా ఉంది. ఇదే తరహాలో అపార్ట్మెంట్లో నివసిస్తున్న ఓ బాలుడి సైకిల్ కూడా చోరీకి గురైంది. బాలుడి తండ్రి కోరిన మీదట అపార్ట్మెంట్లో సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేశారు. సీసీటీవీ కెమెరా అమర్చిన తర్వాత మరోసారి బాలుడి సైకిల్ చోరీకి గురైంది. సీసీటీవీలో సైకిల్ చోరీ దృశ్యాలు రికార్డయ్యాయి. అయితే ఈ సైకిళ్లను దొంగిలించింది ఓ వైద్యుడని తేలడంతో అవాక్కవడం అందరి వంతైంది. పోలీసులు డాక్టర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తాను ఏడు సైకిళ్లను తస్కరించానని అంగీకరించాడు. వీటిలో రెండు సైకిళ్లను తన హెల్త్‌కేర్ సెంటర్లో ఉంచానని చెప్పిన వైద్యుడు తాను ఎందుకు సైకిళ్ల చోరీకి పాల్పడ్డాననేది మాత్రం వెల్లడించలేదు. -
భారత్‌లో గో జీరో మొబిలిటీ బైక్‌లు
న్యూఢిల్లీ: బ్రిటిష్ ఎలక్ట్రిక్ బైక్, లైఫ్‌స్టైల్ బ్రాండ్ ‘గోజీరో మొబిలిటీ’ భారత్‌లోకి ప్రవేశిస్తోంది. వచ్చే వారం రెండు ఎలక్ట్రిక్ బైక్‌లు... వన్, మైల్లను ఢిల్లీ మార్కెట్లోకి విడుదల చేయనున్నది. గోజీరో వన్ బైక్‌లో 400 వాట్అవర్(డబ్ల్యూహెచ్) లిథియమ్ బ్యాటరీని అమర్చామని, గోజీరో మొబిలిటీ సీఈఓ అంకిత్ కుమార్ తెలిపారు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే, 60 కీమీ.దూరం ప్రయాణిస్తుందని పేర్కొన్నారు. గోజీరో మైల్ బైక్‌ను 300 వాట్అవర్ లిథియమ్ బ్యాటరీతో రూపొందించామని, ఒక్కసారి చార్జింగ్ చేస్తే 45 కిమీ. దూరం ప్రయాణించవచ్చని వివరించారు. ఈ రెండు బైక్‌లతో జాకెట్లు, బెల్ట్‌లు, వాలెట్స్ వంటి లైఫ్‌స్టైల్ ఉత్పత్తులను కూడా భారత మార్కెట్లోకి విడుదల చేస్తామని పేర్కొన్నారు. కాగా తాజా ఉత్పత్తుల ధరలు తెలియాల్సి ఉంది. -
పంచడానికి సిద్ధమైన ‘‘పచ్చ’’ సైకిళ్లు
సాక్షి, కడప ఎడ్యుకేషన్: టీడీపీ ఎన్నికల కోడ్‌ను అడుగడుగునా ఉల్లంఘిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో 8,9తరగతి విద్యార్థులకు బడికొస్తా పథకంలో భాగంగా ప్రభుత్వం సైకిళ్లను అందిస్తోంది. విద్యాసంవత్సరం ప్రారంభంలో (గతేడాది జూన్, జులై నెలల్లో) అందించాల్సినవి ఇవి. ఎన్నికల ముందు విద్యార్థులపై ప్రేమ పుట్టుకొచ్చింది. సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని విద్యా సంవత్సరం ముగిసే సమయంలో హడావుడిగా చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన కొద్ది రోజులకే ఎన్నికల నగారా మోగింది. ఆదివారం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కానీ కోడ్ తమకేమి పట్టదన్నట్లు కడప జయనగర్‌కాలనీ బాలికల ఉన్నత పాఠశాలల్లో సైకిళ్లను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం సాక్షి పాఠశాలకు వెళ్లినప్పుడు సైకిళ్ల ఫిట్టింగ్‌కు సంబంధించిన పనులు జోరుగా సాగితున్నాయి. ఇంతలో విషయం తెలుసుకున్న డీఈఓ శైలజ, డిప్యూటీ డీఈఓ జిలానీబాష, ఎంఈఓ పాలెం నారాయణతోపాటు విద్యాశాఖ సిబ్బంది హుటాహుటిన జయనగర్‌కాలనీ హైస్కూల్‌కు చేరుకుని పనులను ఆపేయించారు. కిందిస్థాయి సిబ్బందిపై డీఈఓ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కోడ్ గురించి తెలిపినా ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కోపగించుకున్నట్లు తెలిసింది. తక్షణం పనులను ఆపేయించి సైకిళ్లపై చంద్రబాబు పోటో ఉన్న రేకులన్నింటిని తొలగింపజేశారు. సైకిళ్లను పంపిణీ చేయవద్దని ఆదేశించినట్లు తెలిసింది. డీఈఓ శైలజను వివరణ కోరగా సిబ్బందికి కోడ్ విషయం గురించి చెప్పామన్నారు. వారికి తెలియకుండా సిబ్బంది పనులను చేస్తున్నట్లు తెలిసి తక్షణమే స్పందించి పనులు ఆపేశామన్నారు. ఎన్నికలు ముగిసే వరకు సైకిళ్ల పంపిణీ జరగదని తెలిపారు. -
సైకిల్‌పై వెళితే పారితోషికం!
బారీ(ఇటలీ): సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరగడంతోపాటు, ఆరోగ్యానికి మంచి జరుగుతుందనే విషయం తెలిసిందే. అయితే.. ప్రస్తుతం సైకిల్ తొక్కే వారి సంఖ్య చాలా తక్కువైంది. పాఠశాల స్థాయి విద్యార్థులు సైతం స్కూటీలు, బైక్‌లపై చక్కర్లు కొడుతున్నారు. మరికొందరు బద్ధకంతో తక్కువ దూరాలకు సైతం బైక్‌లు, కార్లు లాంటి వాహనాలను ఉపయోగిస్తున్నారు. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని ఇటలీలోని ‘బారీ’ నగరంలో అధికారులు ఓ ప్రోత్సాహక పథకం ప్రవేశపెట్టారు. సైకిల్ మీద ఆఫీసుకు వెళ్లే వారికి నగదు పారితోషికం ఇవ్వాలని నిర్ణయించారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా సైకిల్‌పై ఆఫీసుకు వెళ్లేవారికి కిలోమీటరుకు 20 సెంట్ల పారితోషికం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సుమారు వెయ్యిమందికి ఇందులో చేరే అవకాశం ఉంటుంది. గరిష్ఠంగా ఒక్కొక్కరికి 25 యూరోల (సుమారు రూ.2000) వరకు చెల్లించే అవకాశముంది. అత్యధిక కిలోమీటర్లు సైకిల్ తొక్కినవారికి అదనంగా బోనస్ సైతం ఉంటుందట. దీనికోసం ఉద్యోగులు, పిల్లల కోసం తల్లిదండ్రులు సైకిళ్లు కొనేందుకు నగరపాలక సంస్థ నిధులూ కేటాయించింది. సైకిల్ తొక్కడం వల్ల ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా డబ్బులూ వస్తాయని నగర మేయర్ ఆంటోనియో డెకారో అంటున్నారు. -
మాకూ సైకిలే కావాలి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ(టీడీపీ)కి ఎన్నికల గుర్తు విషయంలో చిక్కొచ్చి పడింది. టీడీపీతోపాటు జాతీయ పార్టీ గుర్తింపు కలిగిన సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల గుర్తు కూడా సైకిలే. దీంతో ఈ ఎన్నికల్లో తమకు అదే గుర్తు కేటాయించాలని ఎస్పీ పట్టుబడుతోంది. గతంలోనూ ఎస్పీ దక్షిణాదిన పోటీ చేసింది. ఆ మధ్య జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఎస్పీ సైకిల్ గుర్తు మీదే పోటీ చేసింది. 2004లో ఉమ్మడిరాష్ట్రంలో మాజీ మంత్రి, సీనియర్‌కాంగ్రెస్ నేత డీకే అరుణ కూడా ఇదే పార్టీ టికెట్‌పై పోటీ చేసి గెలిచారు. అప్పుడు ఈసీ అరుణకు కొబ్బరికాయ గుర్తు కేటాయించింది. ఉమ్మడి ఏపీలో పోటీ చేసినప్పుడు టీడీపీ అభ్యంతరం తెలపడంతో ఎస్పీ అభ్యర్థులు వేరే గుర్తుతో పోటీచేశారు. అయితే, తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డాక సైకిల్ గుర్తు తమకే ఇవ్వాలని ఎస్పీ ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్నందున.. అక్కడ వారి గుర్తుపై తమకు అభ్యంతరం లేదని, తెలంగాణలో మాత్రం సైకిల్ గుర్తుపై పోటీ చేసే అవకాశం ఇవ్వాలని ఈసీని కోరుతోంది. ఇక్కడ టీడీపీ 14 స్థానాల్లోనే పోటీ చేస్తోందని, తమ పార్టీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తున్నారు కాబట్టి, సైకిల్ గుర్తు తమకే ఇవ్వాలని పట్టుబడుతోంది. కాగా, గత ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ తరఫున 15 మంది ఎమ్మెల్యేలు గెలిచినందున సైకిల్ గుర్తును ఎస్పీకి కేటాయించలేమని ఈసీ చెప్పింది. మరో గుర్తు ఎంచుకోవాలని సూచించింది. అయినప్పటికీ టీడీపీ పోటీ చేసే స్థానాల్లో కాకుండా మిగిలిన స్థానాల్లో సైకిల్ గుర్తుపై బరిలోకి దిగే విషయంపై ఎస్పీ న్యాయనిపుణులను సంప్రదిస్తోంది. ఈ సింబల్ వార్ ముదిరితే.. అది కూటమిపై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిబంధనల ప్రకారం వెసులుబాటు ఉంది గుర్తు విషయంలో మేం స్పష్టతతో ఉన్నాం. నిబంధనల ప్రకారం.. మాకు మా గుర్తుపై పోటీ చేసే వెసులుబాటు ఉంది. ఒకే గుర్తు ఉన్న రెండు పార్టీలు ఒకే నియోజకవర్గంలో తలపడితే.. అప్పుడు ఎవరో ఒకరు వెనకడుగు వేయాలి. అందులో మాకు అభ్యంతరం లేదు. టీడీపీ పోటీ చేసే స్థానాలు కాకుండా.. మిగిలిన వాటిలో మాకు సైకిల్ గుర్తుతో పోటీ చేసే వీలు ఉంది. ఈ విషయంపై న్యాయనిపుణుల్ని సంప్రదిస్తున్నాం. –ప్రొఫెసర్ సింహాద్రి, ఎస్పీ తెలంగాణ ప్రెసిడెంట్ -
పర్యావరణ పరిరక్షణకు కృషిచేయాలి
ఆల్కాట్‌తోట(రాజమహేంద్రవరం రూరల్): సేవ్‌ఫ్యూయల్ అండ్ బర్న్‌పాట్, పర్యావరణ పరిరక్షణ, ఫిజికల్‌ఫిట్‌నెస్‌పై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రక్షణదళం జోన్ కమాండెంట్ డీఎన్ఏ బాషా పేర్కొన్నారు. శనివారం ఏపీఎస్పీఎఫ్ డైరెక్టర్ మాదిరెడ్డి ప్రతాప్ పిలుపు మేరకు ప్రజలలో సేవ్‌ఫ్యూయల్ అండ్ బర్న్‌ఫాట్, పర్యావరణ పరిరక్షణ, ఫిజికల్ ఫిట్నెస్ అనే నినాదంతో రాజమహేంద్రవరం శ్రీనివాస గార్డెన్స్‌లోని జోనల్ కార్యాలయం నుంచి ఆయన, వందమంది సిబ్బంది రాజమహేంద్రవరం నుంచి నిడదవోలు వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సైకిల్ ర్యాలీని ప్రకాషనగర్ ఇన్స్పెక్టర్ భాస్కరరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ రోడ్డు కంరైలు బ్రిడ్జి మీద నుంచి కొవ్వూరు, చంద్రగిరి, మద్దూరు మీదుగా నిడదవోలు చేరుకున్నారు. నిడదవోలు సబ్ఇన్స్పెక్టర్ కమాండెంట్ బాషా బృందానికి స్వాగతం పలికారు. అనంతరం ఈ సైకిల్ ర్యాలీ నిడదవోలు నుంచి రాజమహేంద్రవరానికి చేరుకుంది. ఈ సందర్భంగా కమాండెంట్ డీఎన్ఏ బాషా మాట్లాడుతూ గత ఏడాది డిసెంబర్లో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ర్యాలీ నిర్వహించామన్నారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు సైకిల్ ర్యాలీలు ఇటువంటివి మరిన్ని చేస్తామన్నారు. ఈ ర్యాలీలో అసిస్టెంట్ కమాండెంట్ కె.సుధాకరరావు, ఇన్స్పెక్టర్ మల్లికార్జునరావు, సబ్ ఇన్స్పెక్టర్లు రామకృష్ణారావు, రామకృష్ణ, ధనుంజయరావు పాల్గొన్నారు. -
ట్రాక్టర్‌పై పార్లమెంట్‌కు...!
సాక్షి, న్యూఢిల్లీ : శుక్రవారం ప్రారంభమైన శీతాకాల సమావేశాల తొలిరోజన కొందరు సభ్యులు.. అనూహ్య రీతిలో సభకు వచ్చారు. సైకిల్, ట్రాక్టర్, బుల్లెట్‌పై ఇలా.. ఒక్కో వాహనం మీద లోక్‌సభకు వచ్చారు. రోడ్లపై వీరిని చూసిన జనాలు.. వీరిని ఒకింత ఆశ్చర్యంగా గమనించడం విశేషం. ఇండియన్ లోక్‌దళ్ పార్టీకి చెందిన ఎంపీ దుష్యంత్ చౌతాలా... ట్రాక్టర్‌పై పార్లమెంట్‌కు వచ్చారు. ట్రాక్టర్‌పై పార్లమెంట్‌కు వస్తున్న చౌతాలాను ఇతర సభ్యులు, ప్రజలు ఒకింత ఆశ్చర్యంతో గమనించారు. చౌతాలా ఇలా పార్లమెంట్‌కు రావడం కొత్తేమీ కాదు. గతంలో పొల్యూషన్ కారణంగా ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న సరి-బేసి విధానాన్ని వ్యతిరేకిస్తూ గుర్రంపై పార్లమెంట్‌కు వచ్చారు. కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, బీజేపీ ఎంపీలు మన్షుఖ్ ఎల్ మాండవీయ, మనోజ్ తివారీలు సైకిల్‌పై పార్లమెంట్‌కు హాజరయ్యారు. కాంగ్రెస్‌కు చెందిన మహిళా ఎంపీ రంజీత్ రంజన్ ఆరెంజ్ కలర్లోని హార్లీ డేవిడ్సన్ బైక్‌పై పార్లమెంట్‌కు వచ్చి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. మహిళల దినోత్సం కాబట్టి.. మహిళా శక్తిని చాటేందుకు హార్లీడేవిడ్సన్ బైక్ వచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. బీహార్‌లోని సుపాల్ నియోజకవర్గానికి 42 ఏళ్ల రంజిత్ రంజన్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం ప్రారంభమైన శీతాకాల సమావేశాలు.. జనవరి 5 వరకూ కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రధానంగా ట్రిపుల్ తలాక్ సహా 14 కీలక బిల్లులు చర్చకు రానున్నాయి. -
సైకిల్ కొనివ్వలేదని విద్యార్థి సూసైడ్
సాక్షి, ఖమ్మం: చిన్న చిన్న విషయాలకే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంట్లో సెల్‌ఫోన్ కొనివ్వలేదని ఒకరు, కొత్త బట్టలు కుట్టించలేదని మరొకరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేసుకుంటున్నారు. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు. తాజాగా సైకిల్ కోసం ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పాఠశాలకు వెళ్లడానికి సైకిల్ కొనివ్వమని ఎంత పోరు పెట్టినా.. తల్లిదండ్రులు నిరాకరించడంతో మనస్తాపానికి గురైన విద్యార్థి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జిల్లాలోని ఎర్రుపాలెం మండలం నారాయణపురంలో సోమవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన అరుణ్‌కుమార్(13) స్థానిక పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. గత కొంతకాలంగా బడికి వెళ్లడానికి సైకిల్ కొనివ్వమని తల్లిదండ్రులను అడుగుతున్నాడు. అయితే అరుణ్ అడిగిన విషయాన్ని వారు పట్టించుకోలేదు. దీంతో మనస్తాపానికి గురై ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఇంటి ముందు ఉన్న చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
ముంబయ్ నుంచి సైకిల్ యాత్ర
- 15 రాష్ట్రాల్లో పర్యటన - కర్నూలులోని ఇంటికి చేరిన ఇంజినీరింగ్ విద్యార్థి తేజేశ్వర్ కల్లూరు (రూరల్) : వివిధ ప్రాంతాల్లోని ప్రకృతి అందాలు, సంస్కృతీ సంప్రదాయాలకు సంబంధించి ఫొటో డాక్యుమెంటరీ రూపొందించాలనే లక్ష్యంతో ఓ బీటెక్ విద్యార్థి సైకిల్ దేశవ్యాప్త పర్యటనకు బయలుదేరాడు. ఆగస్టు 6, 2016న ముంబయి నుంచి సైకిల్‌పై బయలుదేరాడు. 10 నెలల కాలంలో 15 రాష్ట్రాలను చుట్టేశాడు. వింతలు, విశేషాలు, ఆచార వ్యవహారాలకు సంబంధించి ఫొటోలను తీస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. అతడే కర్నూలు నెహ్రూనగర్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు ఎం.శ్రీనివాసులు, ఎం.పార్వతి కుమారుడు తేజేశ్వర్. గుజరాత్, రాజస్థాన్, ధిల్లీ, జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, గోవా మీదుగా 25వేల కిలోమీటర్లు సైకిల్‌పై పర్యటించి ఆదివారం కర్నూలు చేరుకున్నాడు. జమ్మూకాశ్మీర్‌లో జరుగుతున్న అల్లర్లు, పాకిస్తాన్ ముష్కరులు జవాన్లపై చేసిన దాడులు, అక్కడ పరిస్థితులపై ఫొటోలు తీసినట్లు తెలిపాడు. మొదట ఒంటరిగా బయలుదేరాడు. జైపూర్ వెళ్లాక ఓ కుక్కపిల్లను కొన్నాడు. దాన్ని వెంటబెట్టుకుని అన్ని ప్రదేశాలను చుట్టేశాడు. ఆదివారం కర్నూలు చేరిన తేజేశ్వర్‌కు మాజీ కార్పొరేటర్ నరసింహులు, ఆర్‌ఎస్‌వైఎఫ్ నగర అధ్యక్షుడు విల్సన్, పారిశ్రామిక వేత్త రాజేష్‌పటేల్, ఎంఎస్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి పరమేశ్వర్ సత్కరించారు. రెండు రోజుల విరామం తర్వాత బెంగుళూరు బయలుదేరి కేరళ, తమిళనాడు, విశాఖపట్టణం, ఒరిస్సా మీదుగా మహారాష్ట్ర, హైదరాబాద్‌కు చేరుకుని అక్కడి నుంచి నేరుగా కర్నూలు చేరతానని తెలిపాడు. -
చార్జింగ్‌కి సైక్లింగ్
కాలంలో ఏమున్నా.. లేకపోయినా.. స్మార్ట్‌ఫోన్‌లో చార్జింగ్ మాత్రం ఫుల్లుగా ఉండాల్సిందే. బ్యాటరీ ఖర్చవుతున్న కొద్దీ చాలామందిలో టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. అలాంటి వారు ఇకపై బేఫికర్‌గా ఉండవచ్చు. ఎలాగంటే.. పక్క ఫొటో చూడండి. వీచే గాలితోనేకాదు. పారే నీటితోనూ కరెంటు పుట్టిస్తుంది ఈ బుల్లి పరికరం. పేరు ‘వాటర్లిలీ’. కెనడాకు చెందిన సీఫార్మాటిక్స్ అనే కంపెనీ అభివృద్ధి చేసిన ఈ గాడ్జెట్.. బ్యాగులో పట్టేసేంత చిన్న సైజులో ఉంటుంది. చాలా నెమ్మదిగా పారే నీటిలోనూ దాదాపు 25 వాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగలదు. బరువు కూడా 800 గ్రాములకు మించదు. బాగానే ఉందిగానీ.. గాలి, నీరు లేకపోతే ఏం చేయాలి? చాలా సింపుల్. చక్రాన్ని నేరుగా చేత్తో తిప్పినాసరే.. కరెంటు పుడుతుందని కంపెనీ చెబుతోంది. మోటర్‌బైక్ ముందో, వెనుకో తగిలించుకుంటే గంటకు 70 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నా చెక్కుచెదరదని అంటోంది. అన్నీ సవ్యంగా సాగితే మరో మూడు నాలుగు నెలల్లో అందుబాటులోకి రానున్న ఈ గాడ్జెట్ ఖరీదు ఏడు వేల వరకూ ఉండవచ్చునని అంచనా. -
9వ తరగతి విద్యార్థినులకు సైకిళ్లు
– ఈ నెల 24 తర్వాత అందజేయనున్న అధికారులు కర్నూలు సిటీ: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బాలికా విద్యను ప్రోత్సహించేందుకు సైకిళ్లను పంపిణీ చేస్తున్నట్లు డీఈఓ తాహెరా సుల్తానా తెలిపారు. శనివారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ బడికొస్తా పథకంలో భాగంగా 14,900 సైకిళ్లు మంజూరయ్యాయని.. ఇందులో 70 శాతం ఇప్పటికే జిల్లాకు చేరాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ నెల 24 తర్వాత విద్యార్థులకు పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2015 సంవత్సరంలో బాలికల విద్యపై చేపట్టిన ఓ సర్వేలో బాల్య వివాహాలకు ఉన్నత విద్యను అభ్యసించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో స్కూళ్లు అందుబాటులో లేకపోవడమే కారణంగా వెల్లడయిందన్నారు. ఈ కారణంగా చదువును మధ్యలోనే ఆపేస్తున్నట్లు సర్వే ప్రకటించిందన్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో బాలికల హాజరు శాతం ఉన్నత పాఠశాలలకు వచ్చే సరికి సగానికి పైగా తగ్గుతోందన్నారు. ఈ నేపథ్యంలో 9వ తరగతి విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేస్తే కనీసం 10వ తరగతి పూర్తి చేసేందుకైనా అవకాశం ఏర్పడుతుందనే ఉద్దేశంతోనే ఈ పథకం రూపుదిద్దుకుందన్నారు. ఆ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, మున్సిపల్ స్కూళ్లకు చెందిన విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేసేందుకు విజయవాడకు చెందిన ఓ కంపెనీని ఎంపిక చేశారన్నారు. ఈ కంపెనీ సైకిల్ విడి భాగాలను తీసుకొచ్చి స్కూళ్ల వద్ద పంపిణీకి సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. -
సోలార్ సైకిల్
–ఇంజనీరింగ్ విద్యార్థుల అవిష్కరణ గోనెగండ్ల: తొక్కకుండా నడిచే సోలార్ సైకిల్.. కర్నూలు బృందావన్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థుల ఆవిష్కరణ. శుక్రవారం గోనెగండ్లలో ప్రయోగాత్మకంగా దానిని నడిపి చూపించారు. ఎమ్మిగనూరుకు చెందిన మహమ్మద్ రఫీక్, ఉదయ్‌కుమార్, కర్నూలుకు చెందిన కిరణ్‌స్వామి, సూర్యదీప్, రాజేష్ అనే విద్యార్థులు..సైకిల్‌కు సోలార్ ప్యానెల్‌తో పాటు బ్యాటరీ, మోటర్ అమర్చారు. ఇందుకు రూ. 10వేలు ఖర్చు చేశారు. పదిరోజుల కృషి ఫలితం..సోలార్ ద్వారా 24 ఓల్ట్‌ల విద్యుత్ ఉత్పత్తి గంటకు 25 కిలో మీటర్ల వేగంతో రయ్యిమంటూ దూసుకెళ్లే సైకిల్ తయారైంది. దీనిపై 4గంటల మేర ప్రయాణం చేయవచ్చని ఇంజినీరింగ్ విద్యార్థి మహమ్మద్ రఫీక్ తెలిపారు. ఎండ లేనప్పుడు విద్యుత్‌తో బ్యాటరీని చార్జింగ్ 2 గంటల పాటు ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. సైకిల్ తయారీకి కళాశాల అధ్యాపకులు కైలాస్ కృష్ణప్రసాద్, ఒన్నూరప్పతో పాటు గోనెగండ్లకు చెందిన టెక్నిషియన్ మజీద్బాషాలు సహకారం అందించినట్లు చెప్పారు. -
బాలిక అదృశ్యం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఏపీఎస్పీ బెటాలియన్‌కు చెందిన ఎస్.సంధ్యా(13) రోజులుగా కనిపించడం లేదని తల్లిదండ్రులు నాలుగో పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నాలుగో తేదీ సాయంత్రం 6.15 గంటలకు ఇంటి నుంచి సైకిల్‌పై వెళ్లిన బాలిక ఆచూకీ ఈ రోజు నుంచి తెలియలేదని, బంధువులు, స్నేహితులు, తెలిసిన వారి దగ్గర విచారించిన సమాచారం లేకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బాలిక ఆచూకీ తెలిసిన వారు నాలుగో పట్టణపోలీసు స్టేషన్ సీఐకి (94406 27736, 08518–259462)కు సమాచారం తెలపాలని సూచించారు. -
సైకిల్ హ్యాండిల్ కాంగ్రెస్ చేతిలో..
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయడు అన్నారు. సోమవారం ఢిల్లీలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పార్టీని స్థాపించిన వ్యక్తి(ములాయం సింగ్ యాదవ్) నుంచి సైకిల్(సమాజ్‌వాది పార్టీ గుర్తు)ను తీసుకొని.. దాని హ్యాండిల్‌ను కాంగ్రెస్ చేతిలో పెట్టారన్నారు. అందువల్ల ప్రజల్లో ఆ పార్టీపై విశ్వాసం పోయిందన్నారు. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాది పార్టీ ఉత్తరప్రదేశ్‌లో అధికార దుర్వినియోగానికి పాల్పడి.. ఎన్నికలను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు. యూపీలో కొంతమంది జిల్లా మేజిస్ట్రేట్లు నాలుగేళ్లకు పైగా అదే స్థానంలో పనిచేస్తున్నారని.. ఇలాంటి వారిని ఎన్నికల సందర్భంగా విధులకు దూరంగా ఉంచాలని ఎలక్షన్ కమిషన్‌ను కోరినట్లు వెంకయ్యనాయుడు వెల్లడించారు. -
సైకిల్ ముక్కల్ చెక్కల్..!
-
వాల్మీకుల సంక్షేమాన్ని విస్మరిస్తే ఉద్యమం
– భారతీయ వాల్మీకి సేన ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర – ప్రారంభించిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య కల్లూరు: వాల్మీకుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరిస్తే ఉద్యమిస్తామని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య హెచ్చరించారు. ఆదివారం పందిపాడు గ్రామంలో భారతీయ వాల్మీకి సేన (బీవీఎస్) ఆధ్వర్యంలో పేద వాల్మీకుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని డిమాండ్ చేస్తూ సైకిల్ యాత్ర ప్రారంభించారు. కార్యక్రమానికి అతిథులుగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, బీజేపీ నాయకులు నక్కలమిట్ట శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీవై రామయ్య మాట్లాడుతూ వాల్మీకి సామాజిక వర్గంలో అధిక సంఖ్యలో పేదలు, నిరక్ష రాస్యులున్నారని తెలిపారు. ప్రతి వాల్మీకి తమ పిల్లలను బాగా చదివించాలని కోరారు. ఎన్నికల్లో రాజకీయపార్టీలకు ఓటు బ్యాంకుగా మారకుండా సంఘటితంగా ఉండి డిమాండ్లను సాధించుకుందామని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, బీజేపీ నాయకులు నక్కల మిట్ట శ్రీనివాసులు మాట్లాడుతూ వాల్మీకులందరూ ఐక్యమత్యంతో ఉండాలన్నారు. బీవీఎస్ అధ్యక్ష కార్యదర్శులు మద్దులేటినాయుడు, రమేష్ నాయుడు మాట్లాడుతూ నాలుగు రోజులపాటు సైకిల్ యాత్ర జరుగుతుందని, తుగ్గలి మండలం ఆర్ఎస్ పెండేకల్‌లో ముగింపు సభ ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో వాల్మీకి నాయకులు ఎంపీటీసీ మాజీ సభ్యుడు పూల ఆంజనేయులు, వెంకటేశ్వర్లు, శివశంకర్, శ్రీనివాసులు, శేషన్న, శంకరన్న, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
కలెక్టర్ అరుణ్‌కుమార్ వెలుగుబంద (రాజానగరం) : పర్యావరణ పరిరక్షణను అంతా బాధ్యతగా తీసుకుంటేనే సరైన ఫలితాలను అందుకోగలుగుతామని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ అన్నారు. స్థానిక గైట్ కళాశాలలో 'స్వచ్చ భారత్ – స్వచ్చ ఆంధ్రప్రదేశ్'లో భాగంగా బుధవారం నిర్వహించిన 'మై బైక్' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నేడు ప్రపంచమంతా పచ్చని వాతావరణంతో కోరుకుంటుందని, మన దేశానికి ఎంతో అవసరమన్నారు. రాజమహేంద్రవరంలో సుమారు 15 వేల ఆటోలు తిరుగుతున్నాయని, వాటితోపాటు ఇతర వాహానాల నుంచి వెలువడే కాలుష్యంతో ప్రజలు అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉందన్నారు. సైకిలు వాడకంతో వాతావరణ కాలుష్యం తగ్గి పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చన్నారు. ప్రజలు సైకిలు వినియోగంపై మరింతగా చైతన్యవంతులు కావలన్నారు. ఇందులో గైట్ కళాశాల ముందుండం అభినందనీయమన్నారు. సైకిలు తొక్కడం వలన కాలుష్య రహిత సమాజం ఏర్పడుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని ఎమ్మెల్యేలు పెందుర్తి వెంకటేష్, డాక్టర్ ఆకుల సత్యనారాయణ, గోరంట్ల బుచ్చియ్యచౌదరి, జ్యోతుల నెహ్రు, ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, కె.కిరణ్‌వర్మ అన్నారు. తమ కళాశాల ప్రాంగణాన్ని పర్యవరణ హితంగా చేసేందుకు ఏడేళ్లుగా ప్రణాళికాబద్దంగా కృషి చేస్తున్నామని చైతన్య విద్యా సంస్థల చైర్మన్ కేవీవీ సత్యనారాయణరాజు అన్నారు. ఇప్పటికే ప్రాంగణంలో బ్యాటరీ కార్లు వినియోగిస్తున్నామని, సంప్రదాయేతర ఇందన వనరులైన సౌర్యశక్తి, పవన విద్యుత్‌తో ట్రాన్సమిషన్ కష్టాలు లేకుండా ఒక మోగావాట్టు సామర్థ్యంతో రెండు యూనిట్లు విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నామన్నారు. కళాశాల విద్యార్థుల కోసం 200 సైకిళ్లను అందుబాటులో ఉంచడంలోపాటు గైట్ కళాశాల ద్వారా మూడు గ్రామాలను దత్తత తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ విజయరాజు, కళాశాల ఎండి కె. శశికిరణ్‌వర్మ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్ని కృష్ణ, చైతన్య విద్యా సంస్థల సీఈఓ డాక్టర్ డీఎల్ ఎన్ రాజు, డీవైఎం ఎ. నరేష్‌రాజు, ప్రిన్సిపాల్స్ డాక్టర్ డివి రామ్మూర్తి, డాక్టర్ ఎస్. సత్యనారాయణరాజు, డాక్టర్ ధనరాజ్, జీఎం డాక్టర్ పి. సుబ్బరాజు, డైరెక్టర్ పివి రామరాజు, తదితరులు పాల్గొన్నారు. -
సైకిల్ పోలోలో జిల్లా క్రీడాకారుల ప్రతిభ
మామిడికుదురు :రాష్ట్ర స్థాయి 62వ స్కూల్ గేమ్స్ అండర్–19 సైకిల్ పోలో గేమ్స్–2016 టోర్నమెంట్లో జిల్లా క్రీడాకారుల బృందం ప్రతిభ చూపింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో జరిగిన ఇంటర్ డిస్రిక్ట్ పోటీల్లో బాలికల విభాగంలో రజత పతకం, బాలుర విభాగంలో కాంస్య పతకం సొంతం చేసుకున్నారు. ఈ నెల 5, 6 తేదీల్లో ఈ పోటీలు జరిగాయని సైకిల్ పోలో కోచ్ జొన్నలగడ్డ గోపాలకృష్ణ సోమవారం తెలిపారు. బాలికల జట్టులో మామిడికుదురుకు చెందిన చింతపల్లి స్వర్ణరేఖ, కె.ఐశ్వర్య, ఎం.విజయకుమారి, ఉండ్రు అంబిక, బాలుర విభాగంలో పి.ఉదయ్‌కిరణ్, కె.వెంకటరమణ సభ్యులుగా ఉన్నారు. జాతీయ పోటీలకు స్వర్ణరేఖ ఎంపిక బాలికల విభాగం నుంచి పదో తరగతి విద్యార్థిని చింతపల్లి స్వర్ణరేఖ జాతీయ స్థాయి సైకిల్ పోలో పోటీలకు ఎంపికైంది. ఈ పోటీలు ఛత్తీస్‌గఢ్‌లో డిసెంబర్ నెలలో జరుగుతాయని కోచ్ గోపాలకృష్ణ తెలిపారు. సైకిల్ పోలో పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను హెచ్ఎం జేఎన్ ఎస్ గోపాలకృష్ణ, పీడీ వి.శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయులు, పీఈటీలు అభినందించారు. -
రాష్ట్ర సైకిల్ పోటీల్లో ప్రథమం ‘అల్లం’
చెరుకుపల్లి : రాష్ట్ర స్థాయి సైకిల్ పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి. గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండల పరిధిలోని రాంబోట్లవారిపాలెం గ్రామంలో శ్రీబండ్లమ్మ తల్లి యూత్ పగడం వారి పాలెం వారి ఆధ్వర్యంలో ఈ సైకిల్ వేగం పోటీలు నిర్వహించారు. ఆదివారం ఉదయం నుంచి సైకిల్ వేగం పోటీల్లో 30 మంది పాల్గొన్నారు. మొదటి బహుమతి అల్లం సుబ్బారెడ్డి (దుండిపాలెం) రూ.20,116 , రెండో బహుమతి గంజరబోయిన కుమారస్వామిరెడ్డి (దుండిపాలెం) రూ.15,116, మూడో బహుమతి వారె నాగరాజు రెడ్డి (పొన్నపల్లి) రూ.10,116, నాలుగో బహుమతి గణేష్ యూత్ (పొన్నపల్లి) రూ.6,116, ఐదో బహుమతి కుక్కల మణికంఠరెడ్డి (దుండిపాలెం) రూ.5,116, ఆరో బహుమతి నక్కా సూరిబాబు (పిట్లవానిపాలెం) రూ.3,116 అందుకున్నారు. జెడ్పీటీసీ సభ్యులు పిట్టు శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు చీరాల ప్రసాదరెడ్డి, కిరణ్‌కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంఆర్‌కె మూర్తి, కుమారస్వామి పాల్గొన్నారు. -
టీడీపీకి అవాంతరం మారిన ఈసీ నిర్ణయం
-
మిద్దెపై నుంచి కింద పడి వ్యక్తి మృతి
కర్నూలు(హాస్పిటల్): మిద్దెపై నుంచి ఓ వ్యక్తి కింద పడి మృతి చెందాడు. బనగానపల్లెకు చెందిన ఖాజాహుసేన్(50)కు భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన స్థానికంగా సైకిల్ విడిబాగాల దుకాణాన్ని నిర్వహిస్తు జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం ఉదయం మిద్దె ఆరేసిన బట్టలు తెచ్చేందుకు వెళ్లి అదుపు తప్పి కింద పడ్డాడు. దీంతో అతని తలకు తీవ్రంగా గాయం కావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు రెఫర్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటికే ఆయన మృతి చెందాడు. బనగానపల్లె పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
జెట్ సైకిల్...
సైకిల్‌పై మీరెంత వేగంగా వెళ్లగలరు? బలమంతా ఉపయోగించినా గంటకు 40 కిలోమీటర్లు దాటడం కష్టమే. కానీ ఈ ఫొటోలో కనిపిస్తోందే... ఇది గంటకు 135 కిలోమీటర్ల వేగంతో వెళ్లి రికార్డులు బద్ధలు కొట్టింది. ఏంటి... ఇది కూడా సైకిలేనా? ఆశ్చర్య పోతున్నారా!. అవును. సైకిలే. ‘ఏరోవేలో’ అనే కంపెనీ తయారు చేసింది దీన్ని. పేరు ‘ఈటా’. దీని ప్రత్యేక ఆకారం కారణంగా గాలి నిరోధం వంద రెట్లు (కారుతో పోలిస్తే) తగ్గిపోతుంది. ఫలితంగా ఒక్క తొక్కు తొక్కితే చాలు.... బోలెడంత దూరం వెళ్లిపోవచ్చు. సాధారణ సైకిళ్ల మాదిరి ఈటాలో కూర్చుని తొక్కడం వీలుపడదు. వీలైనంత వరకూ వెనక్కు వాలి అంటే దాదాపుగా పడుకున్నట్టుగా ఉంటూ పెడల్స్ తొక్కాల్సి ఉంటుంది. దీనివల్ల శరీర బరువు వాహనం మొత్తానికి విస్తరిస్తుందన్నమాట. ఇటీవల నెవడాలోని బ్లూమౌంటెయిన్ ప్రాంతంలో జరిగిన ఒక పోటీలో టాడ్ రీచెర్ట్ అనే వ్యక్తి ఈటాను 144 కిలోమీటర్ల వేగంతో నడిపించాడు. ఈ పోటీలో ఎనిమిది కిలోమీటర్ల దూరాన్ని అతితక్కువ సమయంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ట్రాక్‌లో మొదటి రెండు వందల మీటర్ల దూరం కొద్దిగా వాలుగా ఉన్నప్పటికీ ఆ తరువాత ఎక్కడా హెచ్చుతగ్గులన్నది లేకుండా బల్లపరుపుగా ఉంటుంది. పోటీ సుమారు ఐదు రోజులపాటు జరిగితే ఈటా తొలిరోజున గంటకు 141 కిలోమీటర్ల్ల వేగం మాత్రమే అందుకోగలిగింది, ఆ తరువాతి రోజు వర్షంతో పోటీలే రద్దు కాగా మూడోరోజూ ఆశించిన ఫలితం రాలేదు. నాలుగో రోజు ఈటాను ఓ కీటకం ఢీకొట్టడంతో సమస్య ఎదురైంది. చివరకు పోటీల చివరి రోజు ఈటా 144 కిలోమీటర్ల రికార్డు సృష్టించగలిగింది. -
మహిళల సైకిల్ ముందు ఫత్వా బలాదూర్
టెహరాన్: ఇరాన్లో మహిళలు సైకిలు తొక్కవద్దని, అలాచేస్తే వారి శీలం దెబ్బతింటోందని దేశమతాధిపతి అయతొల్లా అలీ ఖమేనీ ఫత్వా జారీ చేయడం పల్ల మహిళలు మండిపడుతున్నారు. సైకిల్ తొక్కడం తమకు జన్మతో వచ్చిన హక్కని వాదిస్తున్నారు. కాలుష్యం వదిలే కార్లను వదిలేసి సైకిళ్లను ఆశ్రయించే దిశగా ప్రపంచం పయనిస్తుంటే తమను సైకిళ్లను తొక్కవద్దంటూ ఫత్వా జారీ చేయడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఫత్వాకు నిరసనగా ఇరాన్ మహిళలు ఓ ఉద్యమంలా సైకిళ్లను తొక్కుతూ వాటి తాలూకు వీడియోలను ‘ఇరానియన్విమెన్ లవ్సైక్లింగ్’ హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తోటి దేశ మహిళల నుంచే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి మహిళలతోపాటు మగవాళ్ల నుంచి కూడా వారికి రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. మహిళలు సైకిల్ తొక్కడం వారికి నప్పదని, అది వారి శీలాన్ని దెబ్బతీయడమే కాకుండా సమాజాన్ని కూడా అవినీతి మయం చేస్తుందని హెచ్చరిస్తూ ఖమేని ఇటీవల ఫత్వా జారీ చేశారు. ‘మైస్టీల్తీ ఫ్రీడమ్’ పేరుతో సైకిల్ తొక్కుతున్న ఇరానీ మహిళలు ఫొటోలను, వీడియోలను, కామెంట్లను ఎప్పటికప్పుడు ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేస్తున్నారు. ఇరాన్‌లోని షిరియాజ్ వీధుల్లో సైకిల్ తొక్కుతూ దిగిన వీడియోను ఓ పాతికేళ్ల అమ్మాయి బుధవారం పోస్ట్ చేయగా ఈ రెండు రోజుల్లోనే 21వేల సార్లు వీక్షించారు. ‘ఖమేనీ ఫత్వా గురించి తెలియగానే నేను, మా అమ్మ రెండు సైకిళ్లను అద్దెకు తీసుకున్నాం. టెహరాన్ వీధుల్లో వాటిని తొక్కాం. ఇది మా హక్కు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము వదులుకోం’ అని పాతికేళ్ల కూతురు మరో వీడియోను పోస్ట్ చేశారు. ఆమెతోపాటు ఆమె తల్లి కూడా ఆ వీడియోలో సైకిల్ తొక్కడం కనిపించింది. ఈ వీడియోను మంగళవారం పోస్ట్ చేయగా ఇప్పటి వరకు 1.10 లక్షల సార్లు వీక్షించారు. ఖమేని ఫత్వాను ఉల్లంఘించిన వారిపై చర్య తీసుకుంటారా? లేదా? చర్చ కూడా జరుగుతోంది. ఫత్వా ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలనే చట్టం ఇరాన్లో లేదుగానీ, మర్యాదపూర్వక దుస్తులు మాత్రమే ధరించాలనే నిబంధన కింద అప్పడప్పుడు ఫత్వా ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటారు. మర్యాదపూర్వక దుస్తుల నిబంధనకు కూడా సరైన వివరణ లేదా భాష్యం లేనందున అరెస్ట్ చేయవచ్చు లేదా చేయకపోవచ్చు. అందే ఫిర్యాదులు, దర్యాప్తు చేసే అధికారులనుబట్టి నిర్ణయం ఉంటుంది. -
రాష్ట్రస్థాయి సైకిల్ పోలో పోటీలు ప్రారంభం
బనగానపల్లె రూరల్: స్థానిక నెహ్రూ ఇంగ్లిష్ మీడియం క్రీడామైదానంలో మూడో రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్స్, జూనియర్ బాలుర సైకిల్ పోలో పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర సైకిల్ పోలో సంఘం ప్రధాన కార్యదర్శి నాగరాజు, రాష్ట్ర ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు విజయకుమార్ మాట్లాడుతూ క్రీడాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడంలేదన్నారు. స్పోర్ట్స్ కోటాను సక్రమంగా అమలు చేసి క్రీడాకారులను ప్రోత్సాహించాలని సూచించారు. నిర్వాహక కమిటీ చైర్మన్ కోడూరు హరినాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయి సైకిల్ పోలో పోటీలు తమ పాఠశాల క్రీడామైదానంలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి పోటీల ద్వారా విద్యార్థులకు క్రీడల పట్ల అవగాహన పెంపొందించుకునే అవకాశం లభిస్తోందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రధర్శించిన సాంస్కృతిక కార్యక్రమలు అలరించాయి. మొదటి రోజు పోటీల్లో కృష్ణా జిల్లా జట్టు 2–0 గోల్స్‌తో కర్నూలు జట్టు పై విజయం సాధించి. ఈ పోటీలు ఈ నెల 19వ తేదీ వరకు జరగనున్నాయి. సైకిల్ పోలో జిల్లా సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఎ.వి.రామ సుబ్రమణ్యం, కమిటీ కార్యదర్శి రామాంజనేయులు, స్కూల్ డైరెక్టర్ రవితేజారెడ్డి, హెచ్ఎం కమల్‌తేజారెడ్డి, ఎంఈవో నాగమణి తదితరులు పాల్గొన్నారు. -
సైకిల్ కదలట్లేదు: రాహుల్ గాంధీ
జాన్పూర్: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం సమాజ్‌వాదీ పార్టీపై విమర్శలు గుప్పించారు. 'డియోరియా టు ఢిల్లీ' యాత్రలో భాగంగా యూపీలోని ఖేటసారియాలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. ప్రజలు ఓట్లేసి గెలిపించిన సైకిల్(సమాజ్‌వాదీ పార్టీ సింబల్) ముందుకు కదలట్లేదని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. అంతకు ముందు ఏనుగు(బీఎస్పీ ఎన్నికల గుర్తు)ను తొలగించి సైకిల్‌కు అధికారం ఇస్తే అది కదలటం లేదన్నారు. సైకిల్ పంచరైందో లేక విరిగిపోయిందో తెలియదుగాని అది మాత్రం కదలడం లేదంటూ ప్రజల కేరింతల మధ్య రాహుల్ ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ విదేశీ పర్యటనలపై రాహుల్ విమర్శలు గుప్పించారు. ప్రతి ఒక్కరి బ్యాంక్ ఎకౌంట్లో 15 లక్షలు, యువకులకు ఉద్యోగాలు, బుల్లెట్ రైళ్లు లాంటి భారీ హామీలను మోదీ ఇచ్చారని.. అయితే అవి ఎప్పుడు దక్కుతాయని రాహుల్ ప్రశ్నించారు.