సాక్షి, న్యూఢిల్లీ : భోపాల్‌లోని ఐష్‌బాగ్ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో గత ఏడాదిగా పార్క్ చేసిన సైకిళ్లు మాయమవుతున్నాయి. సైకిళ్లు అదృశ్యం కావడంపై అపార్ట్‌మెంట్ వాసులు పోలీసులకూ ఫిర్యాదు చేయకపోవడంతో వీటిని ఎవరు దొంగిలిస్తున్నారనేది అంతుచిక్కకుండా ఉంది. ఇదే తరహాలో అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న ఓ బాలుడి సైకిల్ కూడా చోరీకి గురైంది.
బాలుడి తండ్రి కోరిన మీదట అపార్ట్‌మెంట్‌లో సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేశారు. సీసీటీవీ కెమెరా అమర్చిన తర్వాత మరోసారి బాలుడి సైకిల్ చోరీకి గురైంది. సీసీటీవీలో సైకిల్ చోరీ దృశ్యాలు రికార్డయ్యాయి. అయితే ఈ సైకిళ్లను దొంగిలించింది ఓ వైద్యుడని తేలడంతో అవాక్కవడం అందరి వంతైంది. పోలీసులు డాక్టర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తాను ఏడు సైకిళ్లను తస్కరించానని అంగీకరించాడు. వీటిలో రెండు సైకిళ్లను తన హెల్త్‌కేర్ సెంటర్‌లో ఉంచానని చెప్పిన వైద్యుడు తాను ఎందుకు సైకిళ్ల చోరీకి పాల్పడ్డాననేది మాత్రం వెల్లడించలేదు.
Comments
Please login to add a commentAdd a comment