Doctor Arrested
-
ఆ డాక్టర్‌కు అదేం పని..
సాక్షి, న్యూఢిల్లీ : భోపాల్‌లోని ఐష్బాగ్ ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో గత ఏడాదిగా పార్క్ చేసిన సైకిళ్లు మాయమవుతున్నాయి. సైకిళ్లు అదృశ్యం కావడంపై అపార్ట్మెంట్ వాసులు పోలీసులకూ ఫిర్యాదు చేయకపోవడంతో వీటిని ఎవరు దొంగిలిస్తున్నారనేది అంతుచిక్కకుండా ఉంది. ఇదే తరహాలో అపార్ట్మెంట్లో నివసిస్తున్న ఓ బాలుడి సైకిల్ కూడా చోరీకి గురైంది. బాలుడి తండ్రి కోరిన మీదట అపార్ట్మెంట్లో సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేశారు. సీసీటీవీ కెమెరా అమర్చిన తర్వాత మరోసారి బాలుడి సైకిల్ చోరీకి గురైంది. సీసీటీవీలో సైకిల్ చోరీ దృశ్యాలు రికార్డయ్యాయి. అయితే ఈ సైకిళ్లను దొంగిలించింది ఓ వైద్యుడని తేలడంతో అవాక్కవడం అందరి వంతైంది. పోలీసులు డాక్టర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తాను ఏడు సైకిళ్లను తస్కరించానని అంగీకరించాడు. వీటిలో రెండు సైకిళ్లను తన హెల్త్‌కేర్ సెంటర్లో ఉంచానని చెప్పిన వైద్యుడు తాను ఎందుకు సైకిళ్ల చోరీకి పాల్పడ్డాననేది మాత్రం వెల్లడించలేదు. -
రేప్ చేసి వీడియో తీసి.. పైశాచిక డాక్టర్
ముజఫర్‌నగర్, యూపీ : వైద్య వృత్తికే కళకం తెచ్చాడో నీచ వైద్యుడు. మెడికల్ చెకప్‌కు వచ్చిన మహిళపై అత్యాచారం జరిపి, దాన్ని వీడియో తీశాడు. సంవత్సర కాలంగా వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెడతానని బ్లాక్ మెయిల్ చేస్తూ.. ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. దారుణమైన ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆదివారం వైద్యుడు సాజిద్ హసన్‌ను అరెస్టు చేశారు. పోలీసు తెలిపిన వివరాల ప్రకారం.. కైతోరా గ్రామానికి చెందిన మహిళ వైద్య పరీక్షలు చేయించుకునేందుకు సాజిద్ క్లినిక్‌కు వెళ్లింది. సాజిద్ హసన్ ఆమెపై అత్యాచారం జరిపి, దాన్ని వీడియో తీసి ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. అతని వేధింపులు భరించలేక బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్యాచార నేరం కింద కేసు నమోదు చేసుకుని పోలిసు నిందితుడ్ని అరెస్టు చేశారు. కాగా గతం సంవత్సరం కూడా వైద్య పరీక్షల కోసం వచ్చిన 11 ఏళ్ల బాలికపై ఒక వైద్యుడు అత్యాచారం జరిపిన ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. -
సెల్ఫోన్లో డాక్టర్ రహస్య చిత్రీకరణ
టీ.నగర్: చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చే మహిళలను రహస్యంగా సెల్ఫోన్లో చిత్రీకరించడమే కాకుండా లైంగిక దాడి జరిపిన డాక్టర్‌ను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై మైలాపూరు డాక్టర్ (64) సొంతగా క్లినిక్ నడుపుతున్నారు. జనరల్ ఫిజిషియన్‌గా ఉన్న ఇతని వద్దకు మహిళా పేషెంట్లు ఎక్కువగా వస్తుంటారు. తిరువళ్లూరుకు చెందిన ఒక మహిళ పుట్టినిల్లు మైలాపూర్‌లో ఉంది. ఈమెకు స్వల్పంగా అస్వస్థత ఏర్పడడంతో గురువారం డాక్టర్ వద్దకు చికిత్సకు వెళ్లారు. డాక్టర్ ఆమెను ప్రత్యేక గదికి తీసుకెళ్లి పరీక్షించారు. ఆ సమయంలో తన సెల్ఫోన్లో ఆమెను రహస్యంగా చిత్రీకరించారు. దీన్ని గమనించిన సదరు మహిళ మైలాపూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆస్పత్రికి వెళ్లి డాక్టర్ సెల్‌ఫోన్‌ను పరిశీలించారు. అందులో మహిళ చిత్రాలు నమోదై ఉన్నాయి. దీంతో డాక్టర్‌ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అతని సెల్‌ఫోన్ మెమరీ కార్డును స్వాధీనం చేసుకుని పరిశీలించగా ఆస్పత్రికి వచ్చిన మహిళలను అసభ్యంగా చిత్రీకరించినట్లు కనిపించాయి. ఇలాఉండగా డాక్టర్ అనేక మంది మహిళలను అసభ్యంగా సెల్ఫోల్లో చిత్రీకరించి, వారిని బెదిరించి లొంగదీసుకునేవాడని, అనంతరం వారిపై అత్యాచారం జరిపేవాడని పోలీసుల విచారణలో తేలింది. అరెస్టయిన డాక్టర్‌కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇందులో ఇద్దరు డాక్టర్లు కావడం గమనార్హం. -
మేనమామ వరుస అయిన వ్యక్తితో..
యశవంతపుర (కర్ణాటక) : పెళ్లయి మూడేళ్లయినా గర్భం దాల్చలేదని భార్యను చిత్రహింసలకు గురిచేస్తున్న నీచుడిని ఇక్కడి బెంగళూరు విద్యారణ్యపుర పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు... డాక్టర్‌గా కొలువు వెలగపెడుతున్న మంజునాథ్‌కు నగరానికి చెందిన ఓ యువతితో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. గర్భం దాల్చలేదని తరచూ ఆమెను చిత్రహింసలకు గురిచేసేవాడు. దీంతో బాధితురాలు మూడు నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి కూడా పోలీసులు ఈ ఫిర్యాదును పట్టించుకోలేదు. ఇదిలా ఉంటే మంజునాథ్ వికృత చేష్టలు పెరిగిపోయాయి. తన మేనమామ వరుస అయిన వ్యక్తితో గడపాలని భార్యపై ఒత్తిడి చేసేవాడు. బలవంతంగా అశ్లీల చిత్రాలు చూపించేవాడు. అదే సమయంలో నగరంలో ఖరీదైన ప్రాంతంలో ఉన్న భవనం అమ్మి డబ్బు తీసుకురావాలని డిమాండ్ చేసేవాడు. విషయం మీడియా దృష్టికి రావటంతో స్పందించిన పోలీసులు వైద్యుడు మంజునాథ్‌ను అరెస్ట్ చేశారు. -
పిల్లి లాలాజలంతో పిల్లల టీకాలు!
పిల్లల కోసం టీకాలు తయారుచేసే ఒక డాక్టర్.. వాటిని చేస్తున్న తీరు బయటపడటంతో.. అతడి లైసెన్సును అధికారులు సస్పెండ్ చేశారు. పిల్లుల లాలాజలం, ఓడ్కా కలిపి అతడు టీకాలు తయారుచేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. డాక్టర్ మింగ్ టె లిన్ అనే ఈ వైద్యుడు పిల్లలకు అనుమతిలేని టీకాలు ఇస్తున్నాడని ఫిర్యాదులు రావడంతో ఆరోగ్యశాఖకు చెందిన అధికారులు సోదాలు చేశారు. అక్కడ ఏమాత్రం శుభ్రత లేకుండా ఉన్న ఆఫీసులో కొన్ని ఇంజెక్షన్ సీసాలు, ట్యూబులు కనిపించాయి. వాటితోనే డాక్లర్ లిన్ టీకాలు తయారుచేస్తున్నట్లు తెలిసింది. దాదాపు పదేళ్ల నుంచి తాను పిల్లల కోసం ప్రత్యామ్నాయ టీకాలు తయారుచేస్తున్నట్లు అతడు విచారణలో తెలిపాడు. ఏడు రోజుల పసికందుతో సహా చాలామందికి అతడు ఈ టీకాలు ఇచ్చాడు. కొన్ని సందర్భాల్లో ఓడ్కా లాంటి మద్యాన్ని, మరికొన్ని సందర్భాల్లో పిల్లి నోటి నుంచి తీసిన లాలాజలాన్ని కూడా ఉపయోగించి.. ఎలర్జీతో బాధపడే పిల్లలకు టీకాగా ఇచ్చేవాడు. ఈ టీకాల నుంచి పాదరసాన్ని తీసేయడానికి 'వేవ్ ఫ్రంట్ 2000' అనే పరికరాన్ని ఉపయోగించాడు. కొన్నిసార్లు చుక్కల మందు రూపంలోను, మరికొన్నిసార్లు ముక్కులో స్ప్రే చేసుకునేవిధంగా ఈ టీకాలు ఇచ్చినట్లు ఒక పేషెంట్ కుటుంబ సభ్యులు తెలిపారు. అతడు అనుసరించే విధానాలకు గానీ, అతడి మందులకు గానీ అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ విభాగం నుంచి అనుమతి లేదు. అలాగే, ఈ మందులు వాడటం వల్ల వచ్చే దుష్ప్రభావాల గురించి కూడా అతడు రోగులకు చెప్పలేదు. ఈ వ్యవహారంపై చికాగోలో అక్టోబర్ 11న విచారణ జరగనుంది. -
లింగనిర్ధారణ కేసులో వైద్యుడి అరెస్టు
గుజరాత్లో అక్రమంగా లింగనిర్ధారణ చేసిన కేసులో ఒక వైద్యుడిని, మధ్యవర్తిని రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్‌లోని మెహసానా ప్రాంతంలో గల ఒక ప్రైవేటు ఆస్పత్రిలో పోలీసు బృందం డెకాయ్ ఆపరేషన్ నిర్వహించింది. డాక్టర్ జయంతి లాల్ పటేల్ (64), మధ్యవర్తి నీరవ్ పటేల్ (23)లను ఈ సందర్భంగా అరెస్టు చేశారు. ఇద్దరినీ స్థానిక కోర్టులో ప్రవేశపెట్టగా, మేజిస్ట్రేట్ వారిని ఒకరోజు పోలీసు కస్టడీకి పంపారు. లింగనిర్ధారణ చేసినందుకు డాక్టర్ రూ. 15వేలు తీసుకునేవారని, అయితే మధ్యవర్తి మరో రూ. 20వేలు తీసుకునేవారని పోలీసులు చెప్పారు. పిల్లలు పుట్టకముందే లింగ నిర్ధారణ పరీక్షలు చేసేవారిని పట్టుకోడానికి రాజస్థాన్ పోలీసులు తమ రాష్ట్రం వెలుపల నిర్వహించిన ఆపరేషన్లలో ఇది ఐదోది కావడం గమనార్హం. -
రోగులపై లైంగిక వేధింపులు: డాక్టర్ అరెస్టు
కృత్రిమ గర్భధారణ కోసం వచ్చిన పలువురు రోగులను లైంగికంగా వేధించి, మూడేళ్లుగా పరారీలో ఉన్న ఓ ముసలి డాక్టర్‌ను బ్రెజిల్ పోలీసులు అరెస్టు చేశారు. రోజర్ అబ్దెల్మసీ (70) అనే ఈ డాక్టర్ బ్రెజిల్ వదిలిపెట్టి పొరుగునున్న పరాగ్వే దేశంలో ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. అక్కడ అతడిని అరెస్టు చేసి బ్రెజిలియన్ అధికారులకు అప్పగించారు. వీసా కూడా లేకుండా పరాగ్వేలో ఉంటున్నందుకు అతడిని అరెస్టు చేశారు. ఇన్నాళ్లుగా ఎవరికీ చిక్కకుండా పలు యూరోపియన్ దేశాలలో తిరుగుతూ మూడు నెలల క్రితమే ఆ డాక్టర్ పరాగ్వే చేరుకున్నాడు. బ్రెజిల్‌లోని అతిపెద్ద నగరమైన సాన్ పాలోలో కృత్రిమ గర్భధారణ నిపుణుడిగా పేరొందిన రోజర్ మీద దాదాపు 35 మంది మాజీ రోగులు ఫిర్యాదు చేశారు. అతడు తమను లైంగికంగా వేధించినట్లు తెలిపారు. ఆయనపై 56 కౌంట్ల అత్యాచారం, లైంగిక వేధింపులు 2010లోనే రుజువయ్యాయి. దాంతో 278 సంవత్సరాల జైలుశిక్ష విధించారు. దాంతో శాన్ పాలో మెడికల్ కౌన్సిల్ అతడి లైసెన్సును రద్దుచేసింది. -
అతడ్ని డాక్టర్ ‘చంపేశాడు’!
సాక్షి, ముంబై: అత్యాధునిక ఆస్పత్రి డాక్టర్లు మృతి చెందినట్టు ప్రకటించినప్పటికీ, ఓ వ్యక్తి మళ్లీ లేచికూర్చొనడంతో అంతా ఆశ్చర్యపోయారు. డాక్టర్ల తప్పిదం కారణంగానే ఇలా జరిగిందని తెలిసింది. నిజానికి అతడు సజీవంగానే ఉన్నా మృతి చెందినట్టు డాక్టర్లు పొరబడ్డారు. సదరు రోగి మరణించాడంటూ బుధవారం రాత్రి ప్రకటించిన డాక్టరును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ముంబై సైన్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. ధారావిలోని మున్సిపల్ కార్పొరేషన్ నివాస సముదాయంలో ఉండే చంద్రకాంత్ గాంగుర్డే (55)ను గత గురువారం తీవ్ర అస్వస్థత కారణంగా సైన్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. మంగళవారం ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆయనను వెంటిలేటర్‌పై ఉంచారు. కాగా, బుధవారం ఉదయం చంద్రకాంత్ మరణిం చినట్టు ఆస్పత్రి డాక్టర్ ప్రకటించారు. దీంతో ఆయన కుటుంబీకుల రోదనలతో పరిసరాలు మార్మోగా యి. తదనంతరం ఆస్పత్రి వర్గాలు ఆయనకు ఏర్పాటు చేసిన వెంటిలేటర్‌ను కూడా తొల గించారు. అదే సమయంలో చంద్రకాంత్ శరీరంలో కదలికను గమనించిన అతని కుటుంబీకులు వెంటనే డాక్టర్ల దృష్టి తీసుకెళ్లా, వెంటనే అతడికి మళ్లీ వెంటిలేటర్‌ను అమర్చినట్టు తెలిసింది. అయితే ఈ విషయంపై చంద్రకాంత్ కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేసి, సైన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో డాక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు.