సెల్‌ఫోన్‌లో డాక్టర్‌ రహస్య చిత్రీకరణ | Doctor Arrested In Patients Video Recordings Case | Sakshi
Sakshi News home page

సెల్‌ఫోన్‌లో రహస్య చిత్రీకరణ

Published Sat, Apr 28 2018 7:20 AM | Last Updated on Sat, Apr 6 2019 9:01 PM

Doctor Arrested In Patients Video Recordings Case - Sakshi

టీ.నగర్‌: చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చే మహిళలను రహస్యంగా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించడమే కాకుండా లైంగిక దాడి జరిపిన డాక్టర్‌ను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై మైలాపూరు డాక్టర్‌ (64) సొంతగా క్లినిక్‌ నడుపుతున్నారు. జనరల్‌ ఫిజిషియన్‌గా ఉన్న ఇతని వద్దకు మహిళా పేషెంట్లు ఎక్కువగా వస్తుంటారు. తిరువళ్లూరుకు చెందిన ఒక మహిళ పుట్టినిల్లు మైలాపూర్‌లో ఉంది. ఈమెకు స్వల్పంగా అస్వస్థత ఏర్పడడంతో గురువారం డాక్టర్‌ వద్దకు చికిత్సకు వెళ్లారు. డాక్టర్‌ ఆమెను ప్రత్యేక గదికి తీసుకెళ్లి పరీక్షించారు.

ఆ సమయంలో తన సెల్‌ఫోన్‌లో ఆమెను రహస్యంగా చిత్రీకరించారు. దీన్ని గమనించిన సదరు మహిళ మైలాపూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆస్పత్రికి వెళ్లి డాక్టర్‌ సెల్‌ఫోన్‌ను పరిశీలించారు. అందులో మహిళ చిత్రాలు నమోదై ఉన్నాయి. దీంతో డాక్టర్‌ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అతని సెల్‌ఫోన్‌ మెమరీ కార్డును స్వాధీనం చేసుకుని పరిశీలించగా ఆస్పత్రికి వచ్చిన మహిళలను అసభ్యంగా చిత్రీకరించినట్లు కనిపించాయి. ఇలాఉండగా డాక్టర్‌ అనేక మంది మహిళలను అసభ్యంగా సెల్‌ఫోల్‌లో చిత్రీకరించి, వారిని బెదిరించి లొంగదీసుకునేవాడని, అనంతరం వారిపై అత్యాచారం జరిపేవాడని పోలీసుల విచారణలో తేలింది. అరెస్టయిన డాక్టర్‌కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇందులో ఇద్దరు డాక్టర్లు కావడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement