Video conference
-
రైతులను ఇబ్బంది పెడితే అధికారులపై కఠిన చర్యలు
సాక్షి, అమరావతి: ధాన్యం కొనుగోలులో ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదని, ఎక్కడా సమస్యలు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పౌర సరఫరాల శాఖ ద్వారా ధాన్యం కొనుగోళ్లపై గురువారం తన నివాసం నుంచి కలెక్టర్లు, అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యం వల్ల రైతులు ఇబ్బంది పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.రైతు ఏ మిల్లుకైనా ధాన్యం తీసుకెళ్లవచ్చన్నారు. అధికారులు మాట్లాడుతూ.. ఖరీఫ్ సీజన్లో 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు 1.51 లక్షల మంది రైతుల నుంచి 10.59 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని చెప్పారు. ధాన్యం సేకరించిన 48 గంటల్లో రైతులకు డబ్బులు చెల్లిస్తున్నామని, ఇప్పటివరకు రూ.2,331 కోట్లను చెల్లించామని చెప్పారు. సంచుల కొరత రానివ్వొద్దు ధాన్యం సంచుల కోసం రైతులు ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఏ మిల్లు యజమాని అయినా రైతులను ఇబ్బంది పెట్టినా.. ప్రభుత్వానికి సహకరించకపోయినా వారిపై చర్యలకు వెనుకాడొద్దని కలెక్టర్లకు సూచించారు. ఎక్కడైనా సమస్య ఉందని తెలిస్తే తానే స్వయంగా ఆ ప్రాంతానికి వెళతానని, అక్కడి నుంచే అధికారుల వివరణ కోరతానని అన్నారు. రాష్ట్రంలో రేషన్ బియ్యం రీసైక్లింగ్, స్మగ్లింగ్ అనేది పెద్ద మాఫియాగా మారిపోయిందని, ఈ సమస్య పరిష్కారం కోసం అధికార యంత్రాంగం ప్రత్యేక ప్రణాళికతో పనిచేయాలని కోరారు. వల్లూరిపాలెం రైతుల ఆందోళనపై సీఎం ఆరా ధాన్యం కొనుగోళ్ల విషయంలో కృష్ణా జిల్లా వల్లూరిపాలెం రైతుల ఆందోళనపై కలెక్టర్‌తో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. రైతుల ఆందోళనకు అధికారుల నిర్లక్ష్యం కారణమైతే విచారించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచి్చన నూతన విధానాలను పక్కాగా అమలు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, విశాఖ పర్యటనలో ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్ ప్రసాద్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అక్కడి కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి పాల్గొన్నారు. -
పొరపాట్లకు తావివ్వకండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న సామా జిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహ రించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ఈ దశలో డేటా ఎంట్రీ చాలా ముఖ్యమైనదని, ఈ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని సంబంధిత అధికారులను ఆదేశించారు.జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో ఉన్న ఆయన అక్కడి నుంచి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సర్వే స్థితిగతులను అడిగి తెలుసుకోవడంతో పాటు మిగిలిన ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు. సర్వే జరిగిన క్రమంలో పట్టణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల డోర్‌లాక్ ఉండటం, ఇంటివద్ద అందుబాటులో లేకపోవడం లాంటి సమస్యలు వచ్చాయని, వారి వివరాలను ఫోన్ ద్వారా.. లేదంటే నేరుగా కలిసి సేకరించాలని కోరారు. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు వెళ్లిన వారి వివరాలను కూడా జాగ్రత్తగా క్రమబద్ధీకరించాలని సూచించారు. -
పంట దిగుబడిలో దేశంలోనే తెలంగాణ టాప్
సాక్షి, హైదరాబాద్: పంట దిగుబడిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం రికార్డు సృష్టిస్తోందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయ న తన క్యాంపు కార్యాలయం నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సహచర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు. రాష్ట్రంలో ఈసారి 60.80 లక్షల ఎకరాల్లో వరి సాగుచేశారని, 150 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తుందన్నారు. దీంట్లో 91 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు ఆస్కారముందని చెప్పారు. ఖరీఫ్ నుంచి సన్నాలకు బోనస్‌గా క్వింటాల్‌కు రూ.500 ప్రకటించిన నేపథ్యంలో రైతులు సన్నాల వైపు మొగ్గుచూపినట్టు తెలిపారు. ఈ మొత్తం ధాన్యం సేకరణకు రూ.30 వేల కోట్లు ఖర్చు అవుతుందని, అందులో ఇప్పటికే రూ.20 వేల కోట్లు విడుదల చేసినట్టు చెప్పారు. 10 నెలల వ్యవధిలోనే పౌరసరఫరాల సంస్థకు ఉన్న రుణంలో రూ.11,537.40 కోట్ల భారాన్ని తగ్గించుకున్నట్టు ఆయన వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లో 7,572 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ బియ్యానికి బిహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలలో డిమాండ్ ఉందని, ఇతర దేశాలు కూడా తెలంగాణ బియ్యాన్ని దిగుమతి చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఎలాంటి అవాంతరాలు సంభవించినా, అధిగమించేందుకు అధికారులను సన్నద్ధం చేయాలని పౌర సరఫరాలశాఖ ముఖ్య కార్యదర్శి డీఎస్.చౌహాన్‌ను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో రైస్‌మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. నిబంధనల మేరకే బ్యాంకు గ్యారంటీలను తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు. -
అసెంబ్లీ ఓటర్ల జాబితానే ప్రామాణికం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన అసెంబ్లీ నియోజకవర్గాల ఓటరు జాబితాను యథావిధిగా పరిగణనలోకి తీసుకొని వార్డులు, గ్రామపంచాయతీల వారీగా ముసా యిదా ఓటరులిస్టు తయారు చేయాలని అధికారు లను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి ఆదే శించారు. ముసాయిదా జాబితాలను వచ్చేనెల 6న గ్రామ పంచాయతీల్లో ప్రచురించాలని సూచించా రు. త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్ని కల నిర్వహణకు వార్డులు, గ్రామపంచాయతీల వారీగా ఓటరు జాబితాల తయారీ, ప్రచురణ పురో గతిపై గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ ఈసీ) కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్థసారథి సమీక్షించారు. జిల్లా కలెక్టర్లు (హైదరాబాద్ మినహా) అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు), డీపీవో, డీఎల్పీవోలు, అసెంబ్లీ నియో జకవర్గాల ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు పాల్గొ న్నారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ ముసాయిదా ఓటర్ల జాబి తాల ప్రచురణ తర్వాత మండల, జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై వారి సలహాలు, సూచనలు తీసుకోవాల న్నారు. ఈ ముసాయిదా జాబితాలో ఏవైనా పొరపాట్లు జరిగితే వచ్చేనెల 13వ తేదీ వరకు సంబంధిత ఎంపీడీవోలు, డీపీవోలకు రాత పూర్వకంగా తెలియజేయాలని చెప్పారు. సవరించిన తుది ఓటర్ల జాబితాను వచ్చేనెల 21న ప్రచు రించాలని ఆదేశించారు. ఒకవేళ ఎవరైనా అర్హులైన ఓటర్లు తమ పేర్లు జీపీ ఓటర్ల జాబితాలో చేర్చు కోవాలన్నా, ఎవరైనా ఓటరును జీపీ ఓటరు లిస్టులో కొనసాగించడానికి ఆక్షేపణలున్నా, వారు నిర్దేశించిన ఫారాలలో సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్టోరల్ రిజి స్ట్రేషన్ అధికారికి దరఖాస్తు చేసుకో వాలన్నారు. ఓటరు జాబితా తయారీ తర్వాత, వార్డుల వారీగా పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, పోలింగ్ సిబ్బంది వివరాల సేకరణ, రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల నియామకం, పోలింగ్ సిబ్బంది శిక్షణ తదితరాలపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సహకారంతో ఎస్ఈసీ తయారు చేసిన గ్రీవెన్స్ మాడ్యూల్‌ను పార్థసారథి ఆవిష్కరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పీఆర్ శాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్, పీఆర్ ఆర్డీ కమిషనర్ అనితా రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు. -
సోషల్ మీడియా ద్వారా చెప్పాలి
సాక్షి, హైదరాబాద్: తొలి విడత రుణమాఫీ సందర్భంగా గురువారం సీఎం రేవంత్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ జిల్లాల రైతులతో మాట్లాడారు. ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టి ఆదిలాబాద్ జిల్లాకు నీళ్లు ఇస్తామని ఆ జిల్లాలోని తాంసీ మండలం బండల్ నాగాపూర్ గ్రామానికి చెందిన రైతు మహేందర్‌కు చెప్పారు. వరంగల్, ఖమ్మం తదితర జిల్లాల రైతులతో కూడా ముఖ్యమంత్రి ముఖాముఖిగా మాట్లాడారు. సీఎం, మహేందర్ మధ్య సంభాషణ ఇలా.. సీఎం: ఎంత భూమి ఉంది మహేందర్? మహేందర్: ఎకరం ఉంది సార్. సీఎం: రుణం ఎంత ఉంది..? మహేందర్: రూ.50 వేలు ఉంది. ఒకేసారి రుణం తీరిపోతున్నందుకు సంతోషంగా ఉంది. సీఎం: రైతుల కష్టాలు, ఆదివాసుల కష్టాలు తెలుసుకుంటుందనే సీతక్కను మీ జిల్లాకు ఇన్చార్జిగా మంత్రిగా వేశాం. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నావా? మహేందర్: ఉన్నాను సార్. సీఎం: రైతు రుణమాఫీ గురించి సోషల్ మీడియా ద్వారా చెబుతావా? మహేందర్: చెబుతా. సీఎం: ధన్యవాదాలు మహేందర్.. మీ జిల్లాలో ప్రాణహితపై తుమ్మడిహెట్టిప్రాజెక్టుతో నీళ్లు ఇస్తాం. వరంగల్ జిల్లా ఎల్లయ్యతో.. ఎల్లయ్య: రూ.2 లక్షల రుణమాఫీ చేస్తుండటంతో పండగ రోజులా అనిపిస్తోంది. సీఎం: రుణమాఫీ డిక్లరేషన్ వరంగల్‌లోనే చేశాం తెలుసా? ఎల్లయ్య: తెలుసు సార్. వరంగల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.. సీఎం: ఆ సభకు వచ్చావా? ఎల్లయ్య: వచ్చా... సీఎం: వరంగల్‌లో సభ పెట్టి రాహుల్‌గాందీని పిలుద్దామా? ఎల్లయ్య: పిలిచి కృతజ్ఞతలు తెలుపుదాం. సీఎం: సభకు వస్తావా..? ఎల్లయ్య: నేను తప్పకుండా వస్తా.. వరంగల్ జిల్లా అంటేనే రైతులు. సభకు నాతో పాటు రైతులను తీసుకువస్తా. ఖమ్మం జిల్లా వి.వెంకటాయపాలెం రైతు సీతారాంతో.. సీతారాం: రుణమాఫీతో సంతోషం కలిగింది. యువ రైతులకు సాగు చేయాలనే సంకల్పాన్ని మీరు కలి్పంచారు. సీఎం: సీతారాం ఎంత భూమి ఉంది? ఎంత అప్పు ఉంది? సీతారాం: నాలుగున్నర ఎకరాల భూమి, రూ.78 వేల అప్పు ఉంది. సీఎం: మొత్తం రుణమాఫీ అవుతోంది. మీకు ఎలా ఉంది..? సీతారాం: చాలా సంతోషంగా ఉంది.. మీరు చల్లగా ఉండాలి. సీఎం: పిల్లలు ఎంతమంది సీతారాం? సీతారాం: ఇద్దరు పాపలు. పెద్ద పాప ఇంటర్, చిన్న పాప పదో తరగతి చదువుతున్నారు. సీఎం:ఇద్దరిని మంచిగా చదివించు, చదువు ఆపొద్దు సీతారాం: ఆపను సార్.. మంచిగా చదివిస్తా. ఇప్పుడు నమ్మకం కలిగింది.. రేవంత్‌రెడ్డితో బోధన్ రైతు రవి రవి: గతంలో రుణమాఫీపై ఎవరు హామీ ఇచ్చినా నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. కానీ ఇప్పుడు నమ్మకం కలిగింది. సంతోషంగా ఉంది. మిమ్మలి మరో రాజశేఖరరెడ్డిలా చూస్తున్నాం. రైతులందరి తరఫున పాదాభివందనం చేస్తున్నా. సీఎం: మీ నిజామాబాద్ జిల్లాకు రూ.225 కోట్లు రుణమాఫీ కింద ఇస్తున్నాం. రవి: నాట్లు వేసుకుంటూ మిఠాయిలు పంచుకున్నాంసీఎం: అంకాపూర్ చికెన్ తినిపిస్తావా? రవి: తప్పకుండా.. అంత అదృష్టం ఎలా వదులుకుంటాం సార్? -
మీరు సస్పెండ్ చేస్తారా... నేను చేయాల్నా?
సాక్షి, హైదరాబాద్: ‘ఒక జిల్లాలో పెండింగ్ మ్యుటేషన్ దరఖాస్తులు 800 వరకు ఉన్నాయి. కానీ, గత నెల రోజుల నుంచి 30 అప్లికేషన్లు కూడా ప్రాసెస్ చేయలేదు. క్షేత్రస్థాయి అధికారులు ఏం చేస్తున్నట్టు? ధరణి పోర్టల్ కింద వ్యవసాయ భూముల సమస్యల పరిష్కారం ప్రభుత్వ ప్రాధాన్యత అని చెబుతున్నా క్షేత్రస్థాయి రెవెన్యూ అధికారులు ఎందుకు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు. సరిగా పనిచేయని అలాంటి అధికారులను మీరు సస్పెండ్ చేయండి... లేదంటే నేనే సస్పెండ్ చేస్తా’అని శనివారం జిల్లా కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్ మిత్తల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియపై తగు ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో రెవెన్యూ అధికారుల వైఖరిలో మార్పు రావాలని, 10 రోజుల్లో సరైన పద్ధతిలో ధరణి దరఖాస్తులు పరిష్కరించకపోతే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించినట్టు సమాచారం. అదేవిధంగా దరఖాస్తు పరిష్కారానికి, మాన్యువల్ రికార్డుకు లింకు పెట్టవద్దని, వీలున్నంత మేర ఆన్లైన్లోనే దరఖాస్తులు డిస్పోజ్ చేయాలని, మాన్యువల్ రికార్డు లేదంటూ ధరణి దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టిన వారిని సస్పెండ్ చేయాలని స్పష్టం చేసినట్టు తెలిసింది. జిల్లా కలెక్టర్లతో రెండు విడతల్లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌ల్లో ఎన్ఆర్ఐ పాసు పుస్తకాలు, కోర్టు కేసులు, డేటా కరెక్షన్లు, నిషేధిత జాబితాలోని భూములు, కొత్త పాసు పుస్తకాల జారీ, నాలా, ఖాతాల విలీనం తదితర అంశాలపై చర్చించారు. ఇందుకు సంబంధించిన పరిష్కార మార్గాలపై మిత్తల్ జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, రెవెన్యూ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. గత 15 రోజుల్లో... ధరణి దరఖాస్తుల పురోగతిపై ఈనెల 14న నవీన్ మిత్తల్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తగు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మళ్లీ వీడియో కాన్ఫరెన్స్ నాటికి గత 15 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 25వేల దరఖాస్తులు పరిష్కారయ్యాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 3,779 దరఖాస్తులు, నల్లగొండలో 2,120, సిద్ధిపేటలో 1,880, నాగర్‌కర్నూల్‌లో 1,800 దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. అయితే, అత్యల్పంగా భూపాలపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో 100 దరఖాస్తులు కూడా క్లియర్ కాలేదు. భూపాలపల్లిలో 65, సిరిసిల్లలో 97, కొత్తగూడెం జిల్లాలో 144 దరఖాస్తులు మాత్రమే గత 15 రోజుల వ్యవధిలో పరిష్కారమైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. 1.50 లక్షలు తహశీల్దార్ల వద్దనే.. 15 రోజుల క్రితం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ తర్వాత ధరణి దరఖాస్తుల పరిష్కార పురోగతి ప్రక్రియను పరిశీలిస్తే మొత్తం 2,59,404 దరఖాస్తులకుగాను 24,778 దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. మిగిలిన 2.34 లక్షల దరఖాస్తుల్లో మెజార్టీ దరఖాస్తులు తహశీల్దార్ల వద్దనే పెండింగ్‌లో ఉండటం గమనార్హం. మొత్తం దరఖాస్తుల్లో సుమారు 60 శాతం అంటే 1.48 లక్షల దరఖాస్తులు క్షేత్రస్థాయిలోనే పెండింగ్‌లో ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇక, ఆర్డీవోల వద్ద మరో 20 శాతం అంటే 50 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతోనే మిత్తల్ కలెక్టర్ల సమావేశంలో తహశీల్దార్లు, ఆర్డీవోలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మొత్తంమీద అదనపు కలెక్టర్ల వద్ద 20వేల పైచిలుకు, కలెక్టర్ల స్థాయిలో 12 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్ దరఖాస్తులు అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 36,463 ఉండగా, ఆ తర్వాత నల్లగొండలో 21,693 ఉన్నాయి. అత్యల్పంగా ఆదిలాబాద్‌లో 1,410, భూపాలపల్లిలో 1,826 దరఖాస్తులు మాత్రమే పెండింగ్‌లో ఉండటం గమనార్హం. పెండింగ్ దరఖాస్తులు ఏ స్థాయిలో ఎన్ని? తహశీల్దార్ల వద్ద: 1,48,182 ఆర్డీవోల వద్ద: 53,478 అదనపు కలెక్టర్ల వద్ద: 20,461 కలెక్టర్ల వద్ద: 12,505 మొత్తం పెండింగ్ దరఖాస్తులు: 2,34,626 -
‘సెలవుల్లో సరదాగా–2024’
సాక్షి, అమరావతి: వేసవి సెలవుల్లో విద్యార్థులు తమ సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా ‘సెలవుల్లో సరదాగా–2024’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేశ్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఆర్జేడీలు, డీఈవోలు, సమగ్ర శిక్షా ఏపీసీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తరగతుల వారీగా అమలు చేయాల్సిన కార్యక్రమాల మార్గదర్శకాలను విడుదల చేశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో కొత్త నైపుణ్యాలు, విజ్ఞానాన్ని పెంపొందించడంతో పాటు క్రీడలు, వృత్తి నైపుణ్యం, సృజనాత్మక కళలపై దృష్టి సారించేలా ప్రోత్సహించాలని సూచించారు. విద్యార్థుల కోసం వేసవి కోచింగ్ క్యాంపులు నిర్వహించాలని పీఈటీలను కోరారు. విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించడానికి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, డైట్ ప్రిన్సిపాళ్లతో ‘వుయ్ లవ్ రీడింగ్’ పోటీలను నిర్వహించాలన్నారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు, స్థానిక కమ్యూనిటీ సంస్థల సహకారంతో ఈ వేసవి కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. -
ప్రశాంత ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా పనిచేయండి: సీఈసీ
సాక్షి, అమరావతి: త్వరలో జరగనున్న పార్లమెంట్, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛగా శాంతి యుతంగా,హింసా రహితంగా నిర్వహించడమే లక్ష్యంగా పని చేయాలని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల యంత్రాగానికి స్పష్టం చేశారు. రానున్న ఎన్నికలకు సంబంధించి శాంతి భద్రతలు, భద్రతా బలగాల మోహరింపు, ఎన్నికల వ్యయ నిర్వహణ సెన్సిటివిటి,నోడలు అధికారుల నియామకం, నోటిఫికేషన్ ఆఫ్ డ్రై డే మరియు ఫెయిడ్ హాలిడే,అంతర్జాతీయ సరిహద్దు అంశాలపై బుధవారం ఢిల్లీ నుండి సహచర ఎన్నికల కమిషనర్లతో కలిసి సీఈసీ రాజీవ్ కుమార్ వివిధ రాష్ట్రాల సీఎస్, డీజీపీ, సీఈవోలు తదితర అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచంలోనే పురాతన, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఐదేళ్ళకు ఒకసారి ఎన్నికలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. ఈ ఎన్నికలు ఏవిధంగా జరుగుతున్నాయని ప్రపంచ దేశాలన్నీ మనవైపు చూస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. కావున రానున్నఎన్నికలను స్వేచ్ఛగా శాంతి యుతంగా హింసా రహితంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలకు పునరుద్ఘాటించారు.ఇప్పటికే మొదటి,రెండవ దశ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్లు జారీ అయ్యాయని తెలిపారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం, డ్రగ్స్ వంటివి ఓటర్లను ప్రభావితం చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సీఎస్, డీజీపీ,సీఈవోలకు స్పష్టం చేశారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు, స్టాటిక్ సర్వేలెన్సు బృందాలు ఎక్కడైనా తనిఖీల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అలాంటి బృందాలపై జిల్లా యంత్రాంగాలు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సిఇసి రాజీవ్ కుమార్ ఆదేశించారు.ముఖ్యంగా పోలింగ్‌కు 48 గంటల ముందు(సైలెంట్ ఫిరియడ్)ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బు,మద్యం వంటి తాయిలాల పంపిణీకి ప్రయత్నాలు జరుగుతాయని అలాంటి చర్యలను కట్టుదిట్టంగా నియంత్రించేందుకు మోడల్ కోడ్ బృందాలు మరింత నిఘా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికలను సజావుగా సక్రమంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని విధాలా కట్టుబడి పూర్తి సన్నద్ధమై ఉందని ఈప్రక్రియలో అన్ని రాష్ట్రాలు పూర్తి సమన్వయంతో పనిచేసి ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని సిఇసి రాజీవ్ కుమార్ సూచించారు.ఎన్నికల్లో అన్ని పార్టీలకు వివిధ అంశాల్లో సమాన అవకాశాలు కల్పించాలని అన్నారు. ఓటర్లు స్వేచ్ఛగా వచ్చి నిర్భయంగా వారి ఓటు హక్కును వినియోగించుకునే ప్రశాంతమైన వాతావరణాన్ని పోలింగ్ కేంద్రాల్లో కల్పించాల్సిన బాధ్యత మనపై ఉందని సిఇసి రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు.ఎక్కడా రీ పోలింగ్ కు అవకాశం లేని విధంగా రానున్న ఎన్నికలను సక్రమంగా నిర్వహించాలని రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ వీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుండి ఎన్నికల ప్రవర్తనా నియమావళి కట్టుదిట్ట అమలుపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ఈ ఏడాది జనవరి 1 నుండి ఇప్పటి వరకు 258 కోట్ల రూపాయలు విలువైన నగదు,మద్యం,డ్రగ్స్,ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. ఏపీతో ఐదు రాష్ట్రాలు అంతర్ రాష్ట్ర సరిహద్దులను కలిగి ఉన్నాయని, రాష్ట్ర సరిహద్దుల్లో 150 చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని తెలిపారు.ప్రశాంత మరియు స్వేచ్ఛాయుత,హింసా రహిత ఎన్నికల నిర్వహణకు అన్నిచర్యలు తీసుకుంటున్నా మని సిఎస్ జవహర్ రెడ్డి వివరించారు.శాంతి భధ్రతల అంశానికి సంబంధించి సరిహద్దు రాష్ట్రాలైన ఒడిస్సా,ఛతీష్ఘడ్ నుండి కొంత మేర మావోయిస్టుల సమస్య ఉందని ఆ సమస్యను అధిగ మించేందుకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటామని చెప్పారు.రాష్ట్రంలో 132 ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు,632 ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు నిరంతరం పని చేస్తున్నాయని సీఎస్ జవహర్ రెడ్డి సీఈసీకి వివరించారు. పోలీస్ డైరెక్టర్ జనరల్ కెవి.రాజేంద్రనాధ్ రెడ్డి మాట్లాడుతూ సరిహద్దు రాష్ట్రాలైన ఒడిస్సా,ఛతీస్‌గఢ్ రాష్ట్రాల నుండి కొంత వరకు మావోయిస్టుల ప్రాబల్యం ఉందని ఇందుకు సంబంధించి 91 పోలింగ్ కేంద్రాలను గుర్తించి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నా మని చెప్పారు.ఇటీవల మహారాష్ట్రకు 10 కంపెనీల పోలీసు బలగాలను పంపామని వాటిని తిరిగి పంపాలని కోరారు.రాష్ట్రానికి అదనపు బలగాలను పంపాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు. ఈ వీడియో సమావేశంలో సీఈవో ముకేశ్ కుమార్ మీనా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు నీరబ్ కుమార్ ప్రసాద్, రజత్ భార్గవ,హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్ కుమార్ గుప్త,అదనపు డీజీపీ ఎస్.బాగ్చి,చీఫ్ కమీషనర్ స్టేట్ టాక్స్ గిరిజా శంకర్, ఎక్సైజ్ కమిషనర్ వివేక్ యాదవ్, ఎస్ఇబి డైరెక్టర్ యం.రవి ప్రకాశ్ ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఎన్నికల సన్నద్ధతపై క్షేత్రస్థాయి పరిశీలన
సాక్షి, అమరావతి/ఏలూరు(మెట్రో): రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధత, ఏర్పాట్లపై ఇప్పటి వరకు జిల్లాల వారీగా వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా సమీక్షించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా.. ఇక క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించనున్నారు. వారానికి కనీసం మూడు జిల్లాల చొప్పున.. ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదలయ్యేలోగా 15 జిల్లాల్లో పర్యటించి ఎన్నికల ఏర్పాట్లను స్వయంగా పరిశీలించాలని ముఖేష్‌కుమార్ మీనా లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఎన్నికల నిర్వహణలో కీలకమైన జిల్లాస్థాయి ఎన్నికల కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు, ఫిర్యాదుల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు, ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను ఆయన పరిశీలించనున్నారు. ఇందులో భాగంగా ముఖేష్ కుమార్ మీనా శుక్రవారం ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో పర్యటించారు. ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా కంట్రోల్ రూమ్‌ను సందర్శించారు. ఎన్నికల ఏర్పాట్లు, ఎన్నికల కోడ్ అమలుపై వచ్చే ప్రతికూల వార్తలను నమోదు చేస్తున్న విధానం, వాటి పరిష్కారం తీరుపై ఆరా తీశారు. అలాగే స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల కోసం ఎంపిక చేసిన ఏలూరు సీఆర్ఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలను సందర్శించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరంలోని ఈవీఎం గోడౌన్లను తనిఖీ చేశారు. ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను నన్నయ్య యూనివర్సిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లకు తీసుకువచ్చి కౌంటింగ్ నిర్వహించనున్నట్లు ముఖేష్‌కుమార్‌కు అధికారులు తెలియజేశారు. ఈ పర్యటనల సందర్భంగా ముఖేష్‌కుమార్ మీనా మాట్లాడుతూ.. వేసవిని దృష్టిలో పెట్టుకొని తాగునీరు, టెంట్లు వంటి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్, ఎస్పీ డి.మేరీ ప్రశాంతి, జేసీ బి.లావణ్య, తూర్పుగోదావరి కలెక్టర్ కె.మాధవీలత, ఎస్పీ పి.జగదీశ్ తదితరులు పాల్గొన్నారు. -
కట్టుదిట్టంగా ఎన్నికల కోడ్
సాక్షి, అమరావతి: రాష్ట్ర అసెంబ్లీకి, లోక్‌సభకు సాధారణ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) అమల్లోకి వచ్చిందని, దీనిని రాష్ట్రమంతటా కట్టుదిట్టంగా అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డా. కేఎస్ జవహర్ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లను, ఎస్పీలను ఆదేశించారు. సీఎస్ శనివారం తన క్యాంపు కార్యాలయం నుంచి ఎన్నికల నియమావళిపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆస్తులపై ఉన్న అన్ని రకాల వాల్ రైటింగులు, పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగులు, బ్యానర్లు, జెండాలు వంటివన్నీ 24 గంటల్లోగా తొలగించాలని ఆదేశించారు. అలాగే బహిరంగ ప్రదేశాలు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రైల్వే, రోడ్డు వంతెనలు, ప్రభుత్వ బస్సులు, విద్యుత్ స్తంభాలు, మున్సిపల్ సమావేశ ప్రదేశాల్లోని అన్ని రకాల రాజకీయ ప్రకటనలు, వాల్ రైటింగులు, పోస్టర్లు, కటౌట్లు వంటివన్నీ తొలగించాలని చెప్పారు. ఈ సమావేశంలో సీఎస్ ఇచ్చిన ఆదేశాల్లో ప్రధానమైనవి.. ♦ ప్రింట్, ఎల్రక్టానిక్, ఇతర ప్రసార మాధ్యమాల్లో ప్రభుత్వ నిధులతో జారీ చేసే అన్ని రకాల ప్రకటనలు నిలిపివేయాలి ♦ ప్రభుత్వ వెబ్సైట్లలో మంత్రులు తదితర ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల ఫొటోలను వెంటనే తొలగించాలి ♦ మంత్రులెవరూ అధికారిక వాహనాలను, హెలికాప్టర్లను ఎన్నికల ప్రచారానికి వినియోగించకూడదు. మంత్రుల ఎన్నికల పర్యటనలకు ప్రభుత్వ అతిథి గృహాలను కేటాయించకూడదు. ♦ ఎంపీ లేదా ఎమ్మెల్యే నిధులు లేక ఇతర ప్రభుత్వ పథకాల నిధులతో నిర్వహించే వాటర్ ట్యాంకులు, అంబులెన్సులు వంటి వాటిపై ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల ఫొటోలు ఉండకూడదు ♦ ప్రభుత్వ భవనాలు, కార్యాలయాల్లో ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి సహా మంత్రుల ఫొటోలు ఉండకూడదు. ♦ మంత్రులు అధికారులతో ఎటువంటి వీడియో సమావేశాలు నిర్వహించకూడదు ♦ విద్యుత్, నీటి బిల్లులు, బోర్డింగ్ పాస్‌లు, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై ప్రజా ప్రతినిధుల ఫొటోలు, సందేశాలు వంటివి ఉండకూడదు ♦ ప్రభుత్వ అధికారులు ఎవరూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముందస్తు అనుమతి లేకుండా వారి హెడ్ క్వార్టర్ విడిచి వెళ్ళడానికి వీల్లేదు. ♦ ఎన్నికల విధులతో సంబంధం ఉన్న అధికారులు, సిబ్బందిని బదిలీ చేయడానికి వీల్లేదు ♦ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఏ రాజకీయ పార్టీకైనా అనుకూలంగా వ్యవహరించినా లేదా పార్టీల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా, గిఫ్టులు, ఇతరత్రా లబ్ధి పొందినా అలాంటి వారిపై సీసీఏ నిబంధనల ప్రకారం ఐపీసీ సెక్షన్ 171, 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 123, 129, 134, 134 ఎ నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. ♦ బడ్జెట్ ప్రొవిజన్ ఉన్నప్పటికీ నూతన ప్రాజెక్టులు, పథకాల మంజూరు, రాయితీలు, గ్రాంట్లు, హామీలు, శంకుస్థాపనలు పూర్తిగా నిషేధం ♦ వర్క్ఆర్డర్ ఉన్నప్పటికీ, కేత్రస్థాయిలో మొదలు కాని పనులు చేపట్టకూడదు. ♦ పనులు పూర్తయిన వాటికి నిధుల విడుదలలో ఎలాంటి నిషేధం లేదు. ♦ పీఎం, సీఎం సహాయ నిధి కింద గుండె, కిడ్నీ, కేన్సర్ వంటి రోగులకు చికిత్సలకు సకాలంలో నిధుల మంజూరుకు ఎలాంటి అభ్యంతరం లేదు. -
AP: ఎన్నికల నియమావళి కట్టుదిట్టంగా అమలు చేయాలి: సీఎస్
సాక్షి, విజయవాడ: లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని ప్రభుత్వ కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు శనివారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయంలో సాధారణ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన 24 గంటలలోగా ప్రభుత్వ ఆస్తులపై గల అన్ని రకాల వాల్ రైటింగులు, పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగులు, బ్యానర్లు, జెండాలు వంటివన్నీ తొలగించాలని ఆదేశించారు. అలాగే వివిధ పబ్లిక్ ఆస్తులైన బహిరంగ ప్రదేశాలు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రైల్వే,రోడ్డు వంతెనలు,ప్రభుత్వ బస్సులు, విద్యుత్ స్తంభాలు,మున్సిపల్ సమావేశ ప్రదేశాల్లోని అన్ని రకాల రాజకీయ పరమైన యాడ్లు, వాల్ రైటింగ్‌లు, పోస్టర్లు, కటౌట్లను వెంటనే తొలగించాలని సీఎస్ ఆదేశించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రసార మాధ్యమాల్లో ప్రభుత్వ నిధులతో జారీ చేసే యాడ్లను నిలిపి వేయాలని స్పష్టం చేశారు. అంతేగాక ప్రభుత్వ వెబ్సైట్లో మంత్రులు తదితర ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీలకు సంబంధించిన ఫోటోలను వెంటనే తొలగించాలని సీఎస్ జవహర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించారు. ఎన్నికల ప్రకటన వచ్చాక మంత్రులెవరూ అధికారిక వాహనాలను ఎన్నికల ప్రచారం వినియోగించరాదని సీఎస్ స్పష్టం చేశారు. మంత్రుల ఎన్ని కల పర్యటనలకు ప్రభుత్వ అతిథి గృహాలను కేటాయించరాదని కలెక్టర్లకు స్పష్టం చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే నిధులు, ఇతర ప్రభుత్వ పథకాల నిధులతో నిర్వహించే వాటర్ ట్యాంకులు, అంబులెన్సులు వంటి వాటిపై ఎంపీ, ఎమ్మెల్యేల ఫొటోలు ఉండ రాదని సీఎస్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రకటన వచ్చాక ప్రభుత్వ భవనాలు, కార్యాలయిల్లో ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి సహా మంత్రుల ఫొటోలు ఉండరాదన్నారు. అదే విధంగా మంత్రులు అధికారుల మధ్య ఎటువంటి వీడియో సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చాక విద్యుత్, నీటి బిల్లులు, బోర్డింగ్ పాస్‌లు, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై ప్రజాప్రతినిధుల ఫొటోలు, సందేశాలు వంటివి ఉండరాదని సీఎస్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చాక ప్రభుత్వ అధికారులు ఎవరూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముందస్తు అనుమతి లేకుండా వారి హెడ్ క్వార్టర్ విడిచి వెళ్లడానికి వీలు లేదని సీఎస్ స్పష్టం చేశారు. అదే విధంగా ఎన్నికల విధులతో సంబంధం ఉన్న అధికారులు, సిబ్బందిని బదిలీ చేయడానికి వీలులేదని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఏ రాజకీయ పార్టీకైనా అనుకూలంగా వ్యవహరించినా, ఆయా పార్టీలు నిర్వహించే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా, గిఫ్టులు, ఇతర లబ్దిలు పొందినా అలాంటి వారిపై సీసీఏ నిబంధనలు ప్రకారం ఐపీసీ సెక్షన్ 171, 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 123,129,134,134 ఏ నిబంధనలు ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చాక బడ్జెట్ ప్రావిజన్ ఉన్నప్పటికీ నూతన ప్రాజెక్టులు, పథకాల మంజూరు, కన్సిజన్లు, గ్రాంట్లు, హామీలు, శంకుస్థాపనలు పూర్తి నిషేధమని సీఎస్ స్పష్టం చేశారు. వర్క్ఆర్డర్ ఉన్న కేత్ర స్థాయిలో మొదలు కాని పనులు చేపట్ట కూడదని తెలిపారు. పనులు పూర్తయిన వాటికి నిధులు విడుదలలో ఎలాంటి నిషేధం లేదని స్పష్టం చేశారు. అలాగే పీఎం,సీఎం సహాయ నిధి కింద గుండె, కిడ్ని, కేన్సర్ వంటి రోగులకు చికిత్సలకై సకాలంలో నిధులు మంజూరుకు ఆయా శాఖలకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ వీడియో సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
Delhi Excise Policy Scam Case: 12 తర్వాత వర్చువల్‌గా హాజరవుతా: కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వరుసగా ఎనిమిదోసారి పంపిన సమన్లకు కూడా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించలేదు. మార్చి 4వ తేదీన తమ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నందున సోమవారం విచారణకు హాజరు కాలేకపోయినట్లు తెలిపారు. ఈడీ తనకు సమన్లు ఇవ్వడం చట్టవిరుద్ధమే అయినా ఈనెల 12వ తేదీ తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతానన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వర్చువల్‌గా హాజరయ్యేందుకు చట్టం హక్కు కలి్పంచింది. అందుకు ఈడీ అధికారులు అనుమతిస్తారని భావిస్తున్నా. ఈడీ విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలని నేను డిమాండ్ చేయలేదు. ఒకవేళ ప్రత్యక్ష ప్రసారం చేసినా అభ్యంతరం లేదు’అని కేజ్రీవాల్ అన్నారు. అయితే, కేజ్రీవాల్ పంపిన సమాధానాన్ని పరిశీలిస్తున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. అయితే, కేజ్రీవాల్‌ను వర్చువల్‌గా విచారించేందుకు సిద్ధంగా లేని ఈడీ..తొమ్మిదో విడత సమన్లు పంపే అవకాశాలున్నాయంటున్నారు. ఎన్నిసార్లు సమన్లు జారీ చేసినా కేజ్రీవాల్ విచారణకు హాజరు కాకపోవడంతో ఈడీ అధికారులు కోర్టును ఆశ్రయించడం.. కేజ్రీవాల్ వినతి మేరకు మార్చి 16న విచారణ చేపట్టనున్నట్లు కోర్టు ప్రకటించడం తెలిసిందే. బీజేపీ ‘మోదీ కా పరివార్’ ప్రచారాన్ని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. కేవలం కేంద్ర మంత్రులే మోదీ కుటుంబమన్నారు. -
నేడు లారా థర్మల్ ప్లాంట్ జాతికి అంకితం!
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో నిర్మితమైన ఎన్టీపీసీకి చెందిన 1,600 మెగావాట్ల లారా సూపర్ థర్మల్ పవర్ స్టేషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు (శనివారం) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి అంకితం చేయనున్నారు. రెండవ దశలో మరో 1,600 మెగావాట్ల ప్లాంట్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. మొదటి దశ స్టేషన్‌ను దాదాపు రూ.15,800 కోట్లతో అభివృద్ధి చేశామని, రెండో దశ ప్రాజెక్టుకు రూ.15,530 కోట్ల పెట్టుబడులు రానున్నాయని విద్యుత్ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రాజెక్ట్ కోసం బొగ్గు ఎన్టీపీసీకి చెందిన తలైపల్లి బొగ్గు బ్లాక్ నుండి మెర్రీ-గో-రౌండ్ (ఎంజీఆర్) వ్యవస్థ ద్వారా సరఫరా అవుతుందని, తద్వారా దేశంలో తక్కువ ధరలకే విద్యుత్ సరఫరా అవుతుందని ఆ ప్రకటనలో పేర్కొంది. ఇదేవిధంగా ఛత్తీస్‌గఢ్‌లో రూ.600 కోట్ల విలువైన సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎస్ఇసిఎల్) మూడు ఫస్ట్ మైల్ కనెక్టివిటీ ప్రాజెక్టులను కూడా టెలికాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. అలాగే ఆదివారం(ఫిబ్రవరి 25) గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో తొలి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సహా ఐదు ఎయిమ్స్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. వీటిలో మంగళగిరి (ఆంధ్రప్రదేశ్), భటిండా (పంజాబ్), రాయ్ బరేలీ (ఉత్తరప్రదేశ్), కళ్యాణి (పశ్చిమ బెంగాల్)లలో కొత్తగా నిర్మించిన ఎయిమ్స్‌లు ఉన్నాయి. -
పరీక్షలకు విస్తృత ఏర్పాట్లు చేయండి
సాక్షి, అమరావతి: మార్చి ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్ పరీక్షలతోపాటు పదో తరగతి, ఏపీ టెట్, డీఎస్సీ పరీక్షలను అధికారులంతా కలిసి సమర్థంగా నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. పది, ఇంటర్, ఏపీ టెట్, డీఎస్సీ పరీక్షలు నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, పోలీసు, వైద్య, రెవెన్యూ, విద్యుత్, తపాలా, ఆర్టీసీ శాఖల రాష్ట్ర అధికారులతో గురువారం విజయవాడలోని సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయం నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ మార్చి నెల మొత్తం పరీక్షల కాలమని, దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు, అభ్యర్థులు వివిధ పరీక్షలకు హాజరవుతారని చెప్పారు. అధికారులంతా పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లను ముందుగానే పరిశీలించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఒకటి నుంచి ఇంటర్, 18 నుంచి పది పరీక్షలు ఈ ఏడాది ఇంటర్మీడియెట్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1,559 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు 10,52,221 మంది విద్యార్థులు హాజరవుతారని చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 47,921 మంది అధికంగా పరీక్షలు రాయనున్నారని పేర్కొన్నారు. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి రెగ్యులర్ విద్యార్థులకు ఉదయం 9.30 గంటల నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,17,939 మంది బాలురు, 3,05,153 మంది బాలికలు, మొత్తం 6,23,092 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని, వీరికోసం 3,473 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసినట్టు వివరించారు. వీరితోపాటు పరీక్షలకు రీ ఎన్రోల్ చేసుకున్న 1,02,058 మంది విద్యార్థులు కూడా ఉన్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 682 మందితో సిట్టింగ్ స్క్వాడ్స్, 156 మందితో ఫ్లయింగ్ స్క్వాడ్స్ సిద్ధం చేసినట్టు తెలిపారు. ఓపెన్ స్కూలుకు సంబంధించి పదో తరగతి, ఇంటర్ పరీక్షలు మార్చి 18 నుంచి 26 వరకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు జరుగుతాయని వివరించారు. ఓపెన్ టెన్త్‌లో 34,635 మంది విద్యార్థులు ఉండగా, 176 కేంద్రాలు, ఓపెన్ ఇంటర్ విద్యార్థులు 76,572 మంది ఉండగా, 327 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. పరీక్షా కేంద్రంలోకి ఎవరూ సెల్ఫోన్లు తీసుకువెళ్లకూడదని స్పష్టంచేశారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు, తాగునీరు, ప్రథమ చికిత్స కిట్లను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. అదేవిధంగా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి పరీక్షా కేంద్రాలకు అవసరమైన సౌకర్యాల కల్పనపై మంత్రి ఆరా తీశారు. 27 నుంచి ఏపీ టెట్ ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు జరిగే ఏపీ టెట్‌కు 2,79,685 మంది దరఖాస్తు చేసుకున్నారు. సీబీటీ విధానంలో జరిగే ఈ పరీక్ష కోసం అధికారులు 120 కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు హైదరాబాద్, బెంగళూరు, బరంపురం, చెన్నై, ఖమ్మం, కోదాడ ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు డీఎస్సీ నిర్వహణ కోసం నిబంధనల ప్రకారం ఏర్పాట్లు చేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్, ఇంటర్మీడియెట్ విద్య కమిషనర్ సౌరభ్ గౌర్, పాఠశాల విద్య డైరెక్టర్ పార్వతి, సమగ్ర శిక్ష ఏఎస్పీడీ శ్రీనివాసులురెడ్డి, పదో తరగతి పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి, ఏపీ టెట్ జేడీ మేరీచంద్రిక, ఏపీ మోడల్ స్కూల్ డైరెక్టర్ ఎంవీ కృష్ణారెడ్డి, ఓపెన్ స్కూల్ డైరెక్టర్ కె.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
లిక్కర్ కేసు: కోర్టుకు హాజరైన కేజ్రీవాల్
ఢిల్లీ, సాక్షి: లిక్కర్ పాలసీ కుంభకోణం కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఢిల్లీ ముఖ్యమంత్రి,ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ శనివారం కోర్టు ఎదుట హాజరయ్యారు. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసిన ఫిర్యాదుపై ఇటీవల కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు ఆయన వర్చువల్‌గా రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరయ్యారు. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఉన్నందున వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరగా.. కోర్టు అందుకు అంగీకరించింది. మరోవైపు కేజ్రీవాల్ దరఖాస్తుకు ఈడీ తరఫున న్యాయవాది ఏఎస్జీ రాజు సైతం అభ్యంతరం వ్యక్తంచేయలేదు. దీంతో.. మార్చి 16వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేసింది కోర్టు. మరో లిక్కర్ కేసులో.. మనీలాండరింగ్ కేసు కింద విచారణకు హాజరు కావాల్సిందింగా కేజ్రీవాల్ కు తాజాగా ఆరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 19వ తేదీన తమ ముందు హాజరుకావాలని ఆ సమన్లలో కోరింది. అంతకు ముందు ఆయనకు ఐదుసార్లు జారీ చేసినా విచారణకు గైర్హాజరు కావడంతోనే ఈడీ కోర్టును ఆశ్రయించింది. ఈ తరుణంలో.. ఎల్లుండి విచారణకు హాజరు అవుతారా? అనే సస్పెన్స్ నెలకొంది. -
ఎన్నికలకు పటిష్టమైన ఏర్పాట్లు చేయండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను పటిష్టంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఆయన శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్పరెన్సు నిర్వహించారు. ఎన్నికల సంసిద్దత, ఓటర్ల జాబితా నవీకరణపై సమీక్షించారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు ప్రకటన, నోటిఫికేషన్ జారీకి ఎక్కువ సమయం లేదని, ఈ లోపే పోలింగ్ స్టేషన్లు, మౌలిక వసతులను పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగులు, వయో వృద్ధుల కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ నెల 5వ తేదీకల్లా ర్యాంపుల నిర్మాణం పూర్తి చేయాలని చెప్పారు. ఎన్నికల విధుల్లో ప్రభుత్వ ఉద్యోగులనే తప్పనిసరిగా నియమించాలని, సకాలంలో మాస్టర్ ట్రైనర్ల ద్వారా శిక్షణ పూర్తి చేయాలన్నారు. పోలింగ్ కేంద్రం పరిసరాల్లోనూవెబ్ టెలికాస్టింగ్ జిల్లాల వారీగా ఉన్న సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల విషయంలో ప్రత్యేక శ్రద్ద చూపాలని చెప్పారు. సున్నితమైన, సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్లలతో పాటు 1,200 మందికి పైగా ఓటర్లు ఉన్న పోలింగ్ స్టేషన్లకు తప్పనిసరిగా వెబ్ టెలీకాస్టింగ్ సౌకర్యాన్ని కల్పించాలన్నారు. వెబ్ కాస్టింగ్‌పై తాత్కాలిక నివేదికను వెంటనే పంపాలన్నారు. ప్రతి జిల్లాలో కనీసం 50 శాతం పోలింగ్ స్టేషన్లు వెబ్ టెలీకాస్టింగ్‌లో కవర్ అవ్వాలని, ఇది పోలింగ్ స్టేషన్‌కే పరిమితం కాకుండా చుట్టు ప్రక్కల ఉన్న ప్రాంతాలు కూడా కవర్ అవ్వాలని తెలిపారు. ప్రాంతాలవారీగా సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల మ్యాపింగ్ కూడా సత్వరమే పూర్తి చేయాలన్నారు. వచ్చే సోమవారానికల్లా ఎన్నికల నిర్వహణ ముసాయిదా పంపాలి ప్రతి జిల్లా ఎన్నికల నిర్వహణ ప్రణాళిక ముసాయిదా ప్రతిని వచ్చే సోమవారానికల్లా తమ కార్యాలయానికి పంపాలని సూచించారు. ఎన్ఫోర్స్మెంట్ ఏజన్సీల సమన్వయంతో అక్రమ నగదు, లిక్కరు, ఇతర నిషేధిత సామగ్రి రవాణాపై ప్రత్యేక దృష్టి ఉంచాలన్నారు. కేవలం రాష్ట్ర సరిహద్దుల్లోనే కాకుండా జిల్లాల్లోనూ అక్రమ కార్యకలాపాలపై నిఘా ఉంచాలన్నారు. ఇందుకు సంబందించిన నివేదికలను తమకు సకాలంలో పంపాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు సీఈవోలు పి. కోటేశ్వరరావు, ఎమ్.ఎన్. హరేంధిర ప్రసాద్, డిప్యూటీ సీఈవోలు ఎస్.మల్లిబాబు, కె.విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆ 982 పోస్టులను త్వరగా భర్తీ చేయండి
సాక్షి, అమరావతి: త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయం (కలెక్టరేట్లు), అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలకు మంజూరైన 982 పోస్టులను త్వరగా భర్తీచేసుకోవాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్ జవహర్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుంచి గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (ఎస్ఈసీ) ముఖేశ్‌కుమార్ మీనాతో కలిసి ఆయన ఎన్నికల సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ఎన్నికలతో సంబంధం ఉండి మూడేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న వివిధ శాఖల అధికారుల బదిలీ ప్రక్రియ దాదాపు పూర్తయిందన్నారు. ఇప్పటికే పీఆర్ అండ్ ఆర్డీ, ఎక్సైజ్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోల్లో బదిలీల ప్రక్రియ పూర్తయిందని చెప్పారు పోలీస్, రెవెన్యూ శాఖల్లో కొంతమేర బదిలీలు జరగ్గా మిగాతా బదిలీలు ఒకట్రెండు రోజుల్లో పూర్తిచేయాలని సీఎస్ ఆదేశించారు. అలాగే.. మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖలో బదిలీలు కూడా రెండు రోజుల్లోగా పూర్తిచేయాలన్నారు. చెక్‌పోస్టుతో అక్రమ రవాణాకు కళ్లెం.. ఇక ఎన్నికల్లో పటిష్ట నిఘా నిమిత్తం రాష్ట్రవ్యాప్తంగా 105 అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులను ఏర్పాటుచేయగా వాటిలో 20 ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టులని.. పోలీసు శాఖ ద్వారా 62, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ద్వారా 9, అటవీశాఖ ద్వారా 14 చెక్‌పోస్టులను ఏర్పాటుచేసినట్లు సీఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు. గత నెలరోజుల్లో అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు ద్వారా రూ.2.35 కోట్ల నగదు, 51,143 లీటర్ల మద్యం, 1,323 కిలోల వివిధ మాదకద్రవ్యాలను, ఇతర విలువైన లోహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ చెక్ పోస్టులన్నీ రానున్న రోజుల్లో మరింత సమర్థవంతంగా పనిచేసి అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. అలాగే, పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలకు సంబంధించి ముఖ్యంగా తాగునీరు, ఫర్నిచర్, విద్యుత్ సరఫరా, మరుగుదొడ్లు, దివ్యాంగులకు ర్యాంపుల ఏర్పాటు వంటి సౌకర్యాలను త్వరగా ఏర్పాటుచేసేందుకు కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎస్ చెప్పారు. లాజిస్టిక్ ఏర్పాట్లకు చర్యలు తీసుకోండి.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌కుమార్ మీనా మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివిధ లాజిస్టిక్ ఏర్పాట్లకు ఇప్పటినుంచే తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇంకా ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి తీసుకోవాల్సిన ఇతర అంశాలపై ఆయన వివరించారు. ఈ సమావేశంలో అదనపు సీఈఓ కోటేశ్వరరావు, పీఆర్ అండ్ ఆర్డీ కమిషనర్ సూర్యకుమారి, వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ జె.నివాస్ తదితరులు పాల్గొన్నారు. -
పేదల ప్రగతితో బలమైన భారత్
న్యూఢిల్లీ: పేదలు, రైతులు, మహిళలు, యువత సాధికారత సాధిస్తే దేశం శక్తివంతంగా మారుతుందని, బలమైన భారత్ ఆవిర్భవిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర కేవలం ప్రభుత్వ యాత్రగానే కాదు, దేశ యాత్రగా మారిందని చెప్పారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రలో భాగంగా ప్రధాని మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గత ప్రభుత్వాల హయాంలో రైతన్నలు నిర్లక్ష్యానికి గురయ్యారని, అప్పట్లో ప్రభుత్వ వ్యవసాయ విధానాలు కేవలం ఉత్పత్తి, అమ్మకానికే పరిమితం అయ్యాయని విమర్శించారు. తమ ప్రభుత్వం వచ్చాక అన్నదాతల సమస్యల పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని చెప్పారు. పీఎం–కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ప్రతి రైతుకు ఇప్పటిదాకా రూ.30,000 బదిలీ చేశామని తెలిపారు. వ్యవసాయ సహకార సంఘాలను, వ్యవసాయ ఉత్పత్తి సంస్థలను బలోపేతం చేశామని అన్నారు. గోదాములు నిర్మించామని, పంటల నిల్వ సామర్థ్యాలను పెంచామని, ఆహార శుద్ధి పరిశ్రమను ఎంతగానో ప్రోత్సహించామని గుర్తుచేశారు. ‘‘కంది పప్పును ఆన్లైన్ ద్వారా నేరుగా ప్రభుత్వానికి విక్రయించే సదుపాయాన్ని కలి్పంచాం. వారికి మార్కెట్ రేటు కంటే మెరుగైన ధర చెల్లిస్తున్నాం. పప్పుల కొనుగోలు కోసం విదేశాలకు చెల్లించే సొమ్ము మన రైతుల చేతికే అందాలన్నది మా ఉద్దేశం’’ అన్నారు. గిరిజన ప్రాంతాల్లో నివసించే ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ప్రతి మూలకూ ‘మోదీ గ్యారంటీ’ అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించాలన్నదే వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర లక్ష్యమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అర్హుల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరగకూడదన్నారు. అర్హులకు సక్రమంగా, సంతృప్త స్థాయిలో పథకాలు అందితేనే ‘అభివృద్ధి చెందిన భారత్’ సాధ్యమని చెప్పారు. ప్రభుత్వ పథకాల లబి్ధదారులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ యాత్ర ఇటీవలే 50 రోజులు పూర్తి చేసుకుందని, దేశమంతటా 11 కోట్ల మంది ప్రజలతో నేరుగా అనుసంధానమైందని హర్షం వ్యక్తం చేశారు. ‘మోదీ కీ గ్యారంటీవాలీ గాడీ’ దేశంలో ప్రతి మూలకూ వెళ్తోందని తెలిపారు. ప్రభుత్వ పథకాల కింద లబ్ధి కోసం సుదీర్ఘకాలం ఎదురు చూసే పేదలు ఇప్పుడు ఒక అర్థవంతమైన మార్పును చూస్తున్నారని పేర్కొన్నారు. పథకాలు అర్హుల గడప వద్దకే వెళ్తున్నాయన్నారు. ప్రస్తుత, భావి తరాల యువత గత తరాల కంటే మెరుగైన జీవితం గడపాలని ఆకాంక్షించారు. -
‘పీఎం జన్ మన్’తో గిరిజనుల అభివృద్ధికి కృషి
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఉన్న మారుమూల ప్రాంతాల్లోని గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్(పీఎం జన్మన్ యోజన) పథకం ప్రవేశపెట్టిందని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ చెప్పారు. ఈ పథకం అమలుపై వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు(సీఎస్‌లు)తో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. గిరిజన తెగల్లో కూడా బాగా వెనుకబడిన తెగలున్నాయని.. వారిని ఇప్పటివరకు ఎవరూ అంతగా పట్టించుకోలేదన్నారు. అలాంటి వారందరి అభివృద్ధి కోసమే ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు. 2023–24 నుంచి 2025–26 వరకు ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు కేంద్రం వాటాగా రూ.15,336 కోట్లు, రాష్ట్రాల వాటాగా రూ.8,768 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. కేంద్ర, రాష్ట్ర పథకాల ద్వారా పక్కా ఇళ్ల నిర్మాణం, రహదారుల అభివృద్ధి, మొబైల్ మెడికల్ యూనిట్ల ద్వారా ఆరోగ్య పరిరక్షణ, నిరంతర నీటి సౌకర్యం, ప్రతి ఇంటికీ విద్యుత్, అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటు, మలీ్టపర్పస్ కేంద్రాలు, సోలార్ వీధి దీపాలు, మొబైల్ టవర్లు, ఒకేషనల్ విద్యా కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎస్‌లకు రాజీవ్ గౌబ సూచించారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని పథకాల ద్వారా లబ్ధి కలిగించాలన్నారు. ఈ నెల 15న ప్రధాని మోదీ వర్చువల్‌గా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కొత్త బల్లుగుడ, పాత బల్లుగుడకు చెందిన ఆదివాసీలతో మాట్లాడతారని చెప్పారు. అనంతరం సీఎస్ కేఎస్ జవహర్‌రెడ్డి ఈ అంశంపై రాష్ట్ర అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలోని పీవీటీజీ ఆవాసాల్లోని వారందరికీ వివిధ పథకాలను మిషన్ మోడ్‌లో పూర్తి స్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. ఉన్నతాధికారులు కె.విజయానంద్, బి.రాజశేఖర్, ఎంటీ కృష్ణబాబు, గోపాలకృష్ణ ద్వివేది, ప్రవీణ్ ప్రకాశ్, జి.జయలక్షి్మ, కాంతిలాల్ దండే, సురేష్ కుమార్, లక్ష్మీశా, జె.వెంకట మురళి, బాలూ నాయక్, కృష్ణా రెడ్డి పాల్గొన్నారు. -
విజయ గాథలతో వీడియోలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత పథకాల ద్వారా అక్క చెల్లెమ్మలను నాలుగేళ్ల పాటు చేయి పట్టుకుని నడిపిస్తూ ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఈ పథకాల లబ్ధిదారుల విజయగాథలను వీడియోల రూపంలో వలంటీర్ల ద్వారా సేకరించి పంపాలని కలెక్టర్లకు సూచించారు. ఈ పథకాలు, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు మహిళల జీవితాలు, స్థితిగతులను ఏ రకంగా మార్చాయో వీడియోల్లో పొందుపరచాలని సూచించారు. పంపిన వాటిల్లో అత్యుత్తమమైన వాటికి బహుమతులు ఇస్తామని ప్రకటించారు. ఇవి మరి కొందరిలో స్ఫూర్తిని పెంచుతాయన్నారు. సచివాలయాల స్థాయిలో రూ.10 వేలు, మండల స్థాయిలో రూ.15 వేలు, నియోజకవర్గ స్థాయిలో రూ.20 వేలు, జిల్లా స్థాయిలో రూ.25 వేలు చొప్పున ఉత్తమ విజయ గాథలకు బహుమతులు ఇస్తామని చెప్పారు. ఉత్తమ సేవలు అందించిన వలంటీర్లకు ఫిబ్రవరి 15, 16 తేదీల్లో సేవామిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులు ఇస్తామని, వాటితో పాటే లబ్ధిదారులపై ఉత్తమ వీడియోలు పంపినవారికి అవార్డులు అందచేస్తామని తెలిపారు. సీఎం జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో మాట్లాడారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టాం వైఎస్సార్ ఆసరా, చేయూత, సున్నా వడ్డీ, అమ్మ ఒడి పథకాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టాం. 2019లో మన ప్రభుత్వం రాకముందు పొదుపు సంఘాలన్నీ పూర్తిగా కుదేలైపోయాయి. ఏ గ్రేడ్, బీ గ్రేడ్ సంఘాలు పూర్తిగా కనుమరుగైపోయి సీ గ్రేడ్, డీ గ్రేడ్‌గా మారిపోయిన దుస్థితి నెలకొంది. 18 శాతం పైచిలుకు ఖాతాలన్నీ అవుట్ స్టాండింగ్, ఎన్పీఏల స్థాయిలోకి వెళ్లిపోయాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. మనం అధికారంలోకి వచి్చన తర్వాత వారికి చేయూతనిచ్చి ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, అమ్మ ఒడి పథకాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టగలిగాం. ఆర్థిక స్వావలంబన, సాధికారత క్రమం తప్పకుండా ఏటా లబ్ధిదారులకు పలు పథకాలను అందించడం ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారితను సాధించగలిగాం. అందువల్లే ఈ రోజు పొదుపు సంఘాల్లో ఎన్పీఏలు కేవలం 0.3 శాతానికి పరిమితమయ్యాయి. అక్క చెల్లెమ్మలకు ఇంతగా తోడుగా నిలిచి నడిపించిన ప్రభుత్వం మనది. జనవరిలో వైఎస్సార్ ఆసరా చివరి విడత ఒక్క వైఎస్సార్ ఆసరా ద్వారానే రూ.25 వేల కోట్లకుపైగా మహిళలకు లబ్ధి చేకూరుస్తున్నాం. ఈ పథకం కింద మూడు విడతలుగా ఇప్పటికే రూ.19,195 కోట్లు ఇచ్చాం. నాలుగో విడతగా, చివరి ఇన్స్టాల్మెంట్ కింద సుమారు రూ.6,400 కోట్లు్ల ఇస్తున్నాం. జనవరి 23న ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇది జనవరి 23 నుంచి 31వ తారీఖు వరకూ కొనసాగుతుంది. దీని ద్వారా 78.94 లక్షల మంది మహిళలు లబ్ధి పొందారు. ఈ కార్యక్రమాలన్నీ ఉత్సవ వాతావరణంలో జరగాలి. ఇందులో మహిళా సంఘాల కార్యకలాపాలను వివరించే స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేయాలి. సుస్థిర జీవనోపాధి.. మహిళలకు సుస్థిర జీవనోపాధి కల్పించాలన్నదే ఆసరా, చేయూత పథకాల ఉద్దేశం. స్వయం ఉపాధి పథకాల ద్వారా వారి జీవితాల్లో వెలుగులు చూడగలుగుతాం. ఇందులో భాగంగానే పలు మల్టీ నేషనల్, ప్రముఖ కంపెనీలు, బ్యాంకులతో అనుసంధానించాం. ప్రీ లాంచ్, లాంచ్, పోస్ట్ లాంచ్ కార్యక్రమాల ద్వారా మహిళలు, మహిళా సంఘాలకు దీనిపై అవగాహన పెంపొందించాలి. ఆసరా, చేయూత కార్యక్రమాల లబ్ధిదారులకు ఇది చాలా అవసరం. మహిళా సంఘాలు తీర్మానాలు చేస్తే ఆసరా కింద ఇచ్చే డబ్బు గ్రూపు ఖాతాల నుంచి వారి వ్యక్తిగత ఖాతాల్లోకి వెళ్తుంది. ‘చేయూత’తో రూ.14,129 కోట్లు ఫిబ్రవరి 5 నుంచి 14 వరకూ వైఎస్సార్ చేయూత కార్యక్రమం వేడుకలా జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమం గతంలో ఎప్పుడూ జరగలేదు. పథకం కింద ఇప్పటివరకూ రూ.14,129 కోట్లు అందచేశాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలిచి వారికి జీవనోపాధి చూపించేలా కార్యక్రమం చేపట్టాం. 45 ఏళ్లకు పైబడ్డ మహిళలకు ఏడాదికి రూ.18,750 చొప్పున అందిస్తూ 26.50 లక్షల మందికి పైగా అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తున్నాం. లబ్ధిదారులు 31,23,466 మంది ఉన్నారు. ఈ పథకం వారి జీవితాల్లో ఏ రకంగా మార్పులు తెచి్చందో తెలియజెప్పాలి. జీవనోపాధి మార్గాలపై అవగాహన కలి్పస్తూ వారికున్న అవకాశాలను వివరించాలి. ఈ కార్యక్రమంలో కూడా నా తరపున లేఖను లబ్ధిదారులకు అందించాలి. నా వీడియో సందేశాన్ని కూడా వారికి చేరవేయాలి. సామాజిక న్యాయానికి చిహ్నంగా అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సామాజిక న్యాయానికి చిహ్నంగా విజయవాడలో 19 ఎకరాల్లో రూ.404 కోట్లతో రూపొందించిన 125 అడుగుల ఎత్తైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని జనవరి 19న ఆవిష్కరిస్తున్నాం. సచివాలయం నుంచి రాష్ట్ర స్థాయివరకూ ప్రతి అడుగులోనూ సామాజిక న్యాయ నినాదం వినిపించాలి. ప్రతి సచివాలయం పరిధిలో సమావేశాలు నిర్వహించాలి. ప్రతి సచివాలయం నుంచి ఐదుగురిని 19న జరిగే అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించాలి. ప్రతి మండల కేంద్రం నుంచి ప్రత్యేకంగా బస్సులు నడుపుతాం. సామాజిక న్యాయానికి ప్రతిరూపంగా అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణలో వారందరినీ భాగస్వాములను చేస్తాం. గ్రామ స్థాయిలో పరిపాలనను చేరువ చేసి సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చాం. తద్వారా గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేశాం. ఇదొక గొప్ప మార్పు. అంబేడ్కర్ విగ్రహావిష్కరణ ఈ మార్పులకు ప్రతిరూపంగా నిలుస్తుంది. -
ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంపై సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ (ఫోటోలు)
-
సహాయ, పునరుద్ధరణ చర్యలు వేగవంతం
సాక్షి, అమరావతి: మిచాంగ్ తుపానువల్ల రాష్ట్రంలో జరిగిన పంట నష్టం అంచనాలను త్వరగా చేపట్టడంతో పాటు సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కేఎస్ జవహర్‌రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. తుపాను అనంతర సహాయ, పునరుద్ధరణ చర్యలపై గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి∙ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. తుపాను అనంతరం విద్యుత్, రహదారులు, తాగునీటి సౌకర్యం పునరుద్ధరణ, పంట నష్టాల అంచనా తదితర అంశాలపై సీఎస్ సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ పంటనష్టం అంచనాకు సంబంధించి ఎన్యూమరేషన్ ప్రక్రియను చేపట్టాలని వ్యవసాయ, ఉద్యాన శాఖలతో పాటు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆమోదంతో తుపాను నష్ట పరిశీలనకు రాష్ట్రానికి కేంద్ర బృందాన్ని పంపాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామన్నారు. 1.45 లక్షల హెక్టార్లలో వరి పంటకు దెబ్బ ప్రాథమిక అంచనా ప్రకారం.. 1,45,795 హెక్టార్లలో వరి, 31,498 హెక్టార్లలో వివిధ ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని జవహర్‌రెడ్డి తెలిపారు. ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తికాగానే రైతులకు ఇన్పుట్ సబ్సిడీని అందించడంతో పాటు నూరు శాతం బీమా సౌకర్యం వర్తింపజేస్తామని ఆయన స్పష్టంచేశారు. అలాగే.. తడిసిన, రంగు మారిన ధాన్యం సేకరణకు సంబంధించిన నిబంధనల సడలింపునకు కేంద్రానికి లేఖ రాయనున్నట్లు సీఎస్ చెప్పారు. శిబిరాల్లో చేరిన వారికి సాయం.. ♦ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీసీఎల్ఏ జి. సాయిప్రసాద్ మాట్లాడుతూ.. ఇప్పటివరకూ పునరావాస కేంద్రాల్లో చేరిన వారికి మొత్తం సుమారు రూ.రెండున్నర కోట్ల వరకూ సహాయం అందించినట్లు తెలిపారు. ♦1,01,000 కుటుంబాలకుగాను ఇప్పటికే 65,256 కుటుంబాలకు 25 కిలోలో బియ్యం, కిలో కందిపప్పు, కిలో పామాయిల్, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళాదుంపలు వంటి నిత్యావసర సరకులను పంపిణీ చేశామన్నారు. మిగతా కుటుంబాలకు కూడా త్వరగా అందిస్తామన్నారు. ♦ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ వర్చువల్‌గా పాల్గొని మాట్లాడుతూ 3,292 గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగ్గా ఇప్పటికే 3,111 గ్రామాలకు విద్యుత్ పునరుద్ధరించామని చెప్పారు. 11 నుంచి పంట నష్టం అంచనా.. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది మాట్లాడుతూ ఈ నెల 11 నుంచి∙పంట నష్టం అంచనా ఎన్యూమరేషన్ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు చెప్పారు. దెబ్బతిన్న పంటలన్నిటికీ నూరు శాతం బీమా కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పశు సంపద, బోట్లు, వలలు నష్టపోయిన బాధితులకు శుక్రవారం సాయంత్రానికి ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తిచేసి నష్ట పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. 93.8 కిలోమీటర్ల పొడవున రహదారులు దెబ్బతిన్నాయని వాటిని యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ చెప్పారు. ఆర్ అండ్ బి కార్యదర్శి ప్రద్యుమ్న మాట్లాడుతూ 2,816 కిమీ మేర ఆర్ అండ్ బీ రోడ్లను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నట్టు చెప్పారు. కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని సమీప మార్కెట్ యార్డులు, గోదాములకు తరలించి కాపాడేందుకు చర్యలు తీసుకున్నామని పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. -
అధైర్య పడొద్దు అండగా ఉంటాం
సాక్షి, అమరావతి: తుపాను కారణంగా పంటలు నష్టపోయిన రైతులు అధైర్య పడొద్దని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. తుపాను బాధితుల పట్ల ఉదారంగా ఉండాలని, పరిహారం అందించే విషయంలో సానుభూతితో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్లు, అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను తీసకురావడంపై అధికార యంత్రాంగం దృష్టిపెట్టాలని చెప్పారు. బాధితులకు రేషన్ పరిహారం పంపిణీలో ఎలాంటి లోపం ఉండకూడదని స్పష్టం చేశారు. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా తుపాను సహాయ, పునరుద్ధరణ చర్యలు, రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లపై వారికి మార్గ నిర్దేశం చేశారు. ‘వర్షాలకు తెరిపి వచ్చింది. ప్రస్తుతం తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారింది. తుపాను వల్ల వర్షాలు విస్తృతంగా పడ్డాయి. కలెక్టర్లు, సీనియర్ ఐఏఎస్ అధికారులు స్పెషల్ ఆఫీసర్లుగా క్షేత్ర స్థాయిలో బాగా పని చేశారు. అధికారులంతా మీ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను తీసుకురావడంపై దృష్టి పెట్టాలి. చిన్న చిన్న విషయాలు కూడా మిస్ కాకుండా చూసుకోవాలి’ అని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. సాయంలో లోటు రాకూడదు ♦ వర్షాల వల్ల ఇళ్లు దెబ్బ తిన్న వారికి రూ.10 వేలు ఇచ్చే విషయంలో, వర్షాల కారణంగా ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాల వారిని క్యాంపులకు తీసుకొచ్చి వారిని చూసుకునే విషయంలో, క్యాంపుల నుంచి తిరిగి ఇళ్లకు వెళ్తున్న సందర్భంలో వారికి ఇవ్వాల్సిన ఆర్థిక సాయం తప్పకుండా ఇవ్వాలి. రేషన్ పరిహారం పంపిణీలో కూడా ఎలాంటి లోపం ఉండకూడదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. పంట పొలాల్లో ఉన్న వరద నీటిని పూర్తిగా తొలగించడంపై దృష్టి పెట్టాలి. అన్ని రకాల మానవ వనరులను ఉపయోగించుకోవాలి. ఇది అత్యంత ప్రాధాన్య అంశం. పంటల సంరక్షణకు ప్రతి ఆర్బీకే పరిధిలో ఇప్పటికే ఎస్ఓపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) జారీ చేశారు. ౮౦ శాతం సబ్సిడీపై విత్తనాల సరఫరాకు కార్యాచరణ రూపొందించాలి. ♦దురదృష్టవశాత్తు విధి నిర్వహణలో ఉండగా చెట్టుకూలి ఓ కానిస్టేబుల్ చనిపోయాడు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుంది. ఆ కుటుంబానికి రూ.30 లక్షలు సాయం అందిస్తాం. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగుల స్థైర్యం నిలబడేలా ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది. గ్రామాల్లో ఉన్న వలంటీర్ దగ్గర నుంచి సచివాలయ సిబ్బంది మొదలుకుని, ప్రభుత్వంలో పై స్థాయిలో ఉన్న ఉద్యోగి వరకు ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగినా.. ప్రభుత్వం అన్ని రకాలుగా తోడుగా ఉంటుంది. వారిలో ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ♦ ఈ సమీక్షలో సీఎం క్యాంపు కార్యాలయం నుంచి హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కే వీ రాజేంద్రనాథ్ రెడ్డి, రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ జి సాయి ప్రసాద్, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ కె విజయానంద్, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ ఎం టీ కృష్ణబాబు, హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా, పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఏ.సూర్యకుమారి, ఏపీ స్టేట్ సివిల్ సఫ్లైస్ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీ జి వీరపాండియన్, గృహ నిర్మాణ శాఖ స్పెషల్ సెక్రటరీ బి మహమ్మద్ దీవాన్, విపత్తు నిర్వహణ శాఖ డైరెక్టర్ డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ♦ యుద్ధ ప్రాతిపదికన అత్యధిక ప్రాధాన్యతతో విద్యుత్‌ను పునరుద్ధరించాలి. రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో రవాణా పునరుద్ధరణకు వెంటనే చర్యలు తీసుకోవాలి. దీనిని కూడా ప్రాధాన్యత కార్యక్రమంగా తీసుకోండి. వర్షాలు తగ్గు ముఖం పట్టిన ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యంపై కూడా దృష్టి పెట్టండి. అధికారులంతా బాగా పని చేస్తున్నారు. మేమందరం మీకు తోడుగా ఉన్నాం. ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉన్నాం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. -
మిచౌంగ్ తుపాను.. అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: తుపాను దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఎనిమిది మంది జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఈరోజు(సోమవారం) తుపాను ప్రభావం ఉండే పలు జిల్లాల కలెక్టర్లతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ వీడియో కాన్పరెన్స్‌లో పలు శాఖలకు చెందిన అధికారులు సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. తుపాను సందర్బంగా ప్రభుత్వ యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలి హుద్‌హుద్ లాంటి పెద్ద పెద్ద తుపాన్లను చూసిన అనుభవం మనకు ఉంది తుపాన్లను ఎదుర్కోవడంలో మన యంత్రాంగానికి మంచి అనుభవం ఉంది: తుపాన్ పట్ల అప్రమత్తంగా ఉంటూ యంత్రాంగం సీరియస్‌గా ఉండాల్సిన అవసరం ఉంది: బాపట్ల సమీపంలో రేపు సాయంత్రం తీరందాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు గంటకు 110 కి.మీ. వేగంతో గాలులు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు నిధులు విడుదలచేశాం అత్యవసర ఖర్చులకు ప్రతి జిల్లాకు రూ.2 కోట్ల చొప్పున నిధులు ఇవ్వాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం ప్రతి జిల్లాకు సీనియర్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తున్నాం: వీరంతాకూడా జిల్లాల యంత్రాంగంతో కలిసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తారు: ఎలాంటి ప్రాణనష్టం లేకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉంది: పశువులకూ ఎలాంటి ప్రాణనష్టం రాకూడదు: ఆ మేరకు వెంటనే చర్యలు తీసుకోవాలి: కోతకు వచ్చిన ఖరీఫ్ పంటను కాపాడుకోవడం అన్నది చాలా ముఖ్యమైనది నిన్న ఒక్కరోజే 97 వేల టన్నలు ధాన్యాన్ని సేకరించాం 6.5 లక్షల టన్నుల ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాం: పంటకోయని ప్రాంతాల్లో వీలైనంత మేర కోయకుండా వాయిదా వేసుకుంటే మంచిదని అధికారులు చెప్తున్నారు దీనిపై రైతులకు అవగాహన కల్పించాలి కోసిన ధాన్యాన్ని వెంటనే సేకరించడంపై అధికారులు దృష్టిపెట్టాలి యుద్ధ ప్రాతిపదికన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి: తేమ, రంగు లాంటి అంశాలను పట్టించుకోకుండా రైతులకు అండగా నిలవండి: తుపాను దృష్ట్యా రైతులకు తోడుగా నిలవాల్సిన అవసరం ఉంది: అన్నిరకాలుగా రైతులకు తోడుగా నిలవడం అన్నది అత్యంత ప్రాధాన్యతాంశం తుపాను ప్రభావం ఉన్న ప్రాంతాలనుంచి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి: 308 శిబిరాల ఏర్పాటుకు గుర్తించామని, అప్పటివరకూ 181 తెరిచామని చెప్తున్నారు: అవసరమైన చోట వెంటనే శిబిరాలను తెరిచి ప్రజలను అక్కడకు తరలించాలి: ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ 5, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ 5 కూడా ఉన్నాయి: ఇతర రాష్ట్రాలకు లేని, మనకు మాత్రమే ఉన్న మరో బలం ఏంటంటే గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ విలేజ్ క్లినిక్స్, ఆర్బీకేలు కూడా మనకు ఉన్నాయి: ఇది మనకు ఉన్న పటిష్టమైన బలం ఇతర రాష్ట్రాలకు ఇలాంటి వ్యవస్థ లేదు ఈ యంత్రాంగాన్ని బాగా వినియోగించుకోవాలి ఈ వ్యవస్థను అత్యంత సమర్థవంతంగా వినియోగించుకోవాలి ప్రజల ప్రాణాలను రక్షించడంలో, తపాను వల్ల, భారీవర్షాల వల్ల దెబ్బతినే అవకాశాలున్న ప్రాంతాల్లో వీరి సేవలను వినియోగించుకోవాలి సహాయక శిబిరాల్లో వచ్చే ప్రజలకు మంచి సౌకర్యాలను ఏర్పాటు చేయాలి మనం ఉంటే ఎలాంటి సదుపాయాలు కోరుకుంటామో, అలాంటి సదుపాయాలు ఉండాలి మందులు, తాగునీరు, మంచి ఆహారం అందించాలి: కాస్త డబ్బు ఖర్చైనా పర్వాలేదు, సదుపాయాలు విషయంలో ఎలాంటి లోటూ రాకూడదు: క్యాంపునుంచి ఇంటికి వెళ్లేటన్పుడు చిరునవ్వుతో వారు ఇంటికి వెళ్లాలి: ప్రతి ఒక్కరికీ రూ.1000 లేదా కుటుంబానికి గతంలో మాదిరిగా కాకుండా రూ.500 పెంచి రూ.2500ఇవ్వాలి: క్యాంపులకు రాకుండా, ఇళ్లలోకి నీళ్లు చేరిన వారికి 25 కేజీల బియ్యం, కందిపప్పు, పామాయిల్, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు కిలోచొప్పున అందించాలి ఈ రేషన్‌ను వారికి సకాలంలో సక్రమంగా అందించాలి గాలులు వల్ల, వర్షాల వల్ల గుడిసెల్లాంటివి దెబ్బతింటే వారికి రూ.10వేలు అందించాలి బాధితుల పట్ల దయతో, సానుభూతితో అందించాలి పరిహారాన్ని సకాలంలో అందించాలి తుపాను తగ్గు ముఖం పట్టిన 24 గంటల్లో వీటిని అందించాలి గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు వ్యవస్థను వినియోగించుకుని బాధితులను గుర్తించి వెంటనే వారికి ఇవ్వాల్సినవి ఇవ్వాలి ఎమర్జెన్సీ సర్వీసుల నిర్వహణపై దృష్టిపెట్టాలి జనరేటర్లను అందుబాటులో ఉంచుకోవాలి గర్భిణీలను ఆస్పత్రులకు తరలించాలి తుపాను వల్ల వచ్చే వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత వ్యాధులు ప్రబలకుండా ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలి పారిశుద్ధ్య కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికిన నిర్వహించాలి విద్యుత్, రవాణా సౌకర్యాలకు అంతరాయం ఏర్పడితే వెంటనే యుద్ధ ప్రాతిపదికిన వాటిని సరిచేయాలి సాధారణ పరిస్థితులను తీసుకురావడంపై ప్రత్యేకాధికారులు దృష్టిపెట్టాలి తుపాను, వర్షాలు తగ్గాక పంటలకు జరిగిన నష్టంపై వెంటనే ఎన్యుమరేషన్ పూర్తిచేయాలి నేను కూడా ప్రజల దగ్గరకు వెళ్లి.. కలెక్టర్లు బాగా చేశారా? లేదా? అడుగుతాను బాగానే చేశారని ప్రజలు సంతోషంగా నాకు చెప్పాలి తుపాను బాధిత ప్రాంతాల్లో తిరుగుతాను, ప్రభుత్వం యంత్రాంగం పనితీరుపై అడిగి తెలుసుకుంటాను సహాయం అందలేదని, బాగా చూసుకోలేదన్న మాట బాధితులనుంచి వినిపించకూడదు సంతృప్తకర స్థాయిలో బాధితులందరికీ సహాయం అందాలి ఈ సాయంత్రం నుంచి ప్రత్యేకాధికారులు జిల్లాల్లో పర్యవేక్షణ ప్రారంభిస్తారు డబ్బులు ఇంకా అవసరమైతే..వెంటనే పంపించడానికి అన్నిరకాలుగా ఏర్పాట్లు చేశాను ఒక ఫోన్ కాల్ దూరంలో మేం ఉంటాం. ఏం కావాలన్నా వెంటనే అడగండి సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికిన నడవాలి -
కృష్ణా జలాల వివాదంపై కేంద్ర జలశక్తి శాఖ వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, ఢిల్లీ: ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంచాయితీపై కేంద్ర జలశక్తి శాఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబాశ్రీ ముఖర్జీ నేతృత్వంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఏపీ, తెలంగాణ ఉన్నతాధికారులు హాజరయ్యారు. కృష్ణా జలాల విషయంలో ఏపీ, తెలంగాణ మధ్య ఉద్రిక్తతల తగ్గింపు అజెండాగా నాగార్జునసాగర్ డ్యాం, శ్రీశైలం డ్యాం నిర్వహణ బదిలీ అంశం, కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్కు సంబంధించిన అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. సుమారు గంట పాటు సమావేశం కొనసాగింది. త్వరలోనే మీటింగ్ మినిట్స్ విడుదల చేస్తామని డబ్ల్యూసీ ఛైర్మన్ వెల్లడించారు. చదవండి: ఏపీ రాజకీయాలపై తెలంగాణ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ ఎంత? -
ఎన్నికల నిర్వహణపై ఈసీ వీడియో కాన్ఫరెన్స్
-
తెలంగాణలో పోలింగ్ కు స్పీడ్ పెంచిన ఈసీ
-
పోలింగ్‌కు ముందే రాష్ట్ర సరిహద్దుల మూసివేత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల పోలింగ్ జరిగే నవంబర్ 30వ తేదీకి ముందే రాష్ట్ర సరిహద్దులను మూసివేసి బయటి రాష్ట్రాల నుంచి వ్యక్తులు రాష్ట్రంలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అధికారులను ఆదేశించారు. తెలంగాణతో సహా 5 రాష్ట్రాల్లో శాసనసభ సాధారణ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలతో పాటు వాటి సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్...ఎన్నికల కమిషనర్లు ఏసీ పాండే, అరుణ్ గోయెల్‌తో కలిసి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్ రాష్ట్ర సచివాలయం నుంచి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధంగా ఉందని, శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని శాంతికుమారి వివరించారు. సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో సంప్రదింపులు జరిపి సరిహద్దు చెక్‌పోస్టును కట్టుదిట్టం చేశామని వివరించారు. నవంబర్ 28 నుంచి పోలింగ్ జరిగే 30 వరకు రాష్ట్రంలో డ్రై డేగా ప్రకటించామన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ప్రశాంతంగా ఉన్నాయని, సాధారణ నేర కార్యకలాపాలు కూడా తగ్గుముఖం పట్టాయని డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. -
పట్టాలెక్కిన యశ్వంతపూర్ వందేభారత్
సాక్షి, హైదరాబాద్/కాచిగూడ: తెలంగాణకు మూడో వందేభారత్ రైలుగా కేటాయించిన కాచిగూడ–యశ్వంతపూర్ వందేభారత్ రైలు పట్టాలెక్కింది. ఆదివారం దేశవ్యాప్తంగా ఒకేసారి 9 వందేభారత్ రైళ్లను ప్రారంభించే కార్యక్రమంలో భాగంగా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీడియోకాన్ఫరెన్సు ద్వారా జెండా ఊపి దాన్ని ప్రారంభించారు. మధ్యాహ్నం 12.30 గంటలకు కాచిగూడ స్టేషన్ నుంచి బెంగళూరులోని యశ్వంతపూర్ స్టేషన్‌కు బయలుదేరింది. కాచిగూడ స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్, హైదరాబాద్ డీఆర్ఎం లోకేష్ విష్ణోయ్, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్రం రూ.9 లక్షల కోట్లు ఇచ్చింది.. ప్రధానిగా మోదీ బాధ్యతలు తీసుకున్నాక తొమ్మిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో రూ.9 లక్షల కోట్లు ఖర్చుచేసిందని కిషన్‌రెడ్డి అన్నారు. వందేభారత్ రైలు ప్రారంబోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రైల్వే ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతూ వచ్చిందని, మోదీ దీన్ని గుర్తించి తెలంగాణకు న్యాయం చేస్తున్నారన్నారు. సంవత్సరానికి 55 కి.మీ. చొప్పున కొత్త లైన్లు ఏర్పాటు చేస్తుండగా, ప్రస్తుతం రూ.31,221 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు రాష్ట్రంలో జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలోని రైల్వే స్టేషన్లను రూ.2,300 కోట్ల వ్యయంతో ఆధునీకరిస్తున్నామని, త్వరలో మరిన్ని ప్రాజెక్టు పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. కాజిపేటలో వ్యాగన్ తయారీ కర్మాగారం అందుబాటులోకి వస్తోందని, అక్కడ భవిష్యత్తులో రైల్వేకు అవసరమైన ఇతర పరికరాలు కూడా తయారవుతాయని వివరించారు. మంగళవారం ఉదయం నుంచి.. సాధారణ ప్రయాణికులు లేకుండా తొలిరోజు బెంగుళూరు వెళ్లిన రైలు, సోమవారం మధ్యాహ్నం 2.45 గంటలకు అక్కడి నుంచి ప్రయాణికులతో హైదరాబాద్‌కు బయల్దేరనుంది. మంగళవారం ఉదయం 5.30 గంటలకు కాచిగూడ నుంచి ప్రయాణికులతో బెంగళూరు బయల్దేరనుంది. -
వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తాను: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన ఖరారు అయ్యింది. ఆగష్టు 7, 8 తేదీల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు. వరద ప్రభావిత జిల్లాలైన అల్లూరిసీతారామరాజు, ఏలూరు, ప.గో, తూ.గో, అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారాయన. ఈ సందర్భంగా.. సహాయ, పునరావాస కార్యక్రమాలు సమర్థవంతంగా జరగాలని కలెక్టర్లను ఆదేశించారాయన. ‘‘ఎక్కడా కూడా విమర్శలకు తావులేకుండా చూడాలి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విపత్తుల సమయంలో కలెక్టర్లు సహా, అధికారులకు ముందస్తుగా నిధులు విడుదల చేస్తున్నాం. అవసరమైన వనరులను సమకూరుస్తూ మిమ్మల్ని ఎంపవర్ చేస్తున్నాం. టిఆర్-27 నిధులను సకాలంలో విడుదల చేస్తున్నాం. సహాయ, పునరావాస చర్యలు సమర్థవంతంగా చేపట్టేలా అన్నిరకాలుగా ప్రభుత్వం తోడుగా నిలిచింది. దీనితర్వాత, ఈ పనులు చేయడానికి కొంత సమయం ఇస్తున్నాం. ఆ తర్వాత నేను స్వయంగా వచ్చి ఆయా ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో మీరు సహాయ పునరావాస కార్యక్రమాలు ఏరకంగా చేపట్టారో స్వయంగా పరిశీలిస్తున్నాను. బాధితులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నాను. ఈసారికూడా నేను వస్తాను, క్షేత్రస్థాయిలో మీరు చేపట్టిన చర్యలు, అందించిన సహాయంపై సమీక్ష చేస్తాను అని ఆయన అధికారులకు తెలిపారు. ఉదారంగా వ్యవహరించండి వరద సహాయ కార్యక్రమాల్లో ఉదారంగా వ్యవహరించండి. మనం ఆ పరిస్థితుల్లో ఉంటే ఎలాంటి సహాయం కోరుతామో అలాంటి సహాయమే అందించాలి. ఇంట్లోకి వరదనీరు వచ్చినా, అలాగే వరద కారణంగా సంబంధాలు తెగిపోయిన వారికి కచ్చితంగా నిర్ణయించిన రేషన్ అందించాలి. దీంతోపాటు తాగునీరు కూడా అందించాలి. ఈ సహాయం అదని వరద బాధిత కుటుంబం ఉండకూడదు. సహాయ శిబిరాల్లో ఉండి, వారు తిరిగి ఇళ్లకు వెళ్లేటప్పుడు ప్రతి కుటుంబానికి రూ.2000, వ్యక్తులైతే రూ.1000లు ఇచ్చి పంపించాలి. కలెక్టర్లు బాగా చూసుకున్నారనే మాట వినిపించాలి అని అధికారులతో సీఎం జగన్ అన్నారు. ► వరద కారణంగా కచ్చా ఇల్లు పాక్షికంగానైనా, పూర్తిగా నైనా ధ్వంసం అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ వర్గీకరణ చేయొద్దు. వారందరికీ కూడా రూ.10 వేలు చొప్పున సహాయం అందించాలి. వరదనీరు తగ్గగానే పారిశుద్ధ్య కార్యక్రమాలు కొనసాగించండి. మిగిలిన ప్రాంతాలనుంచి వరద బాధిత ప్రాంతాలకు పారిశుద్ధ్య కార్మికులను తరలించండి. వైద్యశిబిరాలను కొనసాగించండి పీహెచ్‌సీల్లో, విలేజ్ క్లినిక్స్‌లో సరిపడా మందులు ఉండేలా చూసుకోండి. పాముకాట్లకు సంబంధించిన మందులను అందుబాటులో ఉంచేలా చూసుకోండి. పంట నష్టం, ఆస్తి నష్టంపై వెంటనే ఎన్యుమరేషన్‌చేసి గ్రామ, వార్డు సచివాలయాల్లో సోషల్ ఆడిట్‌కోసం జాబితాను ఉంచండి. అత్యంత పారదర్శకంగా పంటనష్టానికి, ఆస్తి నష్టానికి సంబంధించిన పరిహారం అందించండి. ► అవసరమైన చోట వెంటనే కొత్త ఇళ్లను మంజూరు చేయండి. ఏటిగట్లమీద ఉన్నవారికి పక్కా ఇళ్లను మంజూరు చేయండి. వరద వచ్చిన ప్రతిసారి వారు ఇబ్బందిపడకుండా… వారికోసం ఇళ్లను మంజూరుచేయాల్సిన బాధ్యత కలెక్టర్లది. అలాంటి ప్రమాదకర ప్రాంతాల్లో ఉండేవారికి రక్షిత ప్రాంతంలో ఇళ్లు ఇవ్వాలి. వారికి శాశ్వతంగా పరిష్కారం చూపాల్సిన బాధ్యత మనది. అవసరమైన స్థలాన్ని సేకరించి, వారికి ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఇళ్లను మంజూరు చేయండి. పోలవరం ఎగువన తరచుగా ముంపునకు గురయ్యే ప్రాంతాలకు ఆర్ అండ్ ఆర్ కార్యక్రమాల్లో ప్రాధాన్యత ఇవ్వండి. పశువులకు గ్రాసం కొరతలేకుండా చూడండి. దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు… తదితర నిర్మాణాల విషయంలో వెంటనే మరమ్మతులు చేపట్టాలి. వరద బాధిత ప్రాంతాల్లో రక్షిత తాగునీటి సరఫరాను కొనసాగించాలి. పరిస్థితి మెరుగుపడేంతవరకూ వారికి రక్షిత తాగునీటిని అందించాలి. ► సోమ, మంగళవారాల్లో నేను వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తాను. వరద బాధిత ప్రాంతాలకు నేను వచ్చినప్పుడు ఈ అంశాలకు సంబంధించి ఎవ్వరూ కూడా ఫిర్యాదులు చేయకూడదు. నేను ఎక్కడకు వచ్చేదీ కొన్ని ఆదివారం సాయంత్రం సీఎంవో అధికారులు మీకు వెల్లడిస్తారు. క్షేత్రస్థాయిలో వరద బాధితులకు అందిన సహాయ, పునరావాసం కార్యక్రమాలను స్వయంగా పరిశీలిస్తాను అని కలెక్టర్లతో పేర్కొన్నారాయన. -
భారీ వర్షాలపై సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: భారీ వర్షాలపై కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేపట్టారు. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రేపు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 53.81 అడుగులకు చేరుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ధవళేశ్వరం వద్ద కూడా వరద ప్రవాహం సుమారు 16 లక్షలకు చేరుకునే అవకాశాలు ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. గత ఏడాది గోదావరిలో 26 లక్షల క్యూసెక్కులకుపైగా వరద ప్రవాహం చూశాం. కలెక్టర్లు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని సీఎం ఆదేశించారు. వరద ప్రభావం ఉన్న ప్రాంతాల్లో సహాయ పునరావాసం కార్యక్రమాలు అత్యంత సమర్థవంతంగా సాగాలి. అధికారులు మానవీయ కోణంలో సహాయం అందించాలి. ఒక్క రూపాయి అదనంగా ఖర్చు చేసినా, బాధితులకు అండగా ఉండాలి. కలెక్టర్లు మాకు మంచి చేశారు అన్న మాటే వినిపించాలి. అధికారులు ఈ విషయాన్ని మనసులో పెట్టుకోవాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇప్పటికే ఖాళీలు చేశారు. అవసరం అనుకుంటే.. పరిస్థితిని అంచనా వేసుకుని మిగిలిన ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. సహాయ శిబిరాల్లో మంచి సదుపాయాలు కల్పించాలి’’ అని సీఎం అన్నారు. ‘‘శిబిరాల్లో అధికారులు ఉంటే.. ఎలాంటి సదుపాయాలు కావాలనుకుంటారో అలాంటి సదుపాయాలన్నీ కూడా కల్పించాలి. సహాయ శిబిరాల నుంచి తిరిగి ఇళ్లకు పంపించేటప్పుడు ప్రతి కుటుంబానికి రూ.2 వేల రూపాయలు ఇవ్వండి. వ్యక్తులైతే వారికి రూ.1000లు ఇవ్వండి. కచ్చా ఇళ్ల విషయంలో కలెక్టర్లు మానవీయ దృక్పథంతో ఉండాలి. ఆయా ఇళ్ల నుంచి సహాయ శిబిరాలకు వచ్చిన వారిని వారిని తిరిగి పంపించేటప్పుడు వారికి రూ.10 వేల రూపాయలు ఇవ్వాలి. తిరిగి కచ్చా ఇంటిని నిర్మించుకోవడానికి వారికి ఉపయోగపడుతుంది. కచ్చా ఇంటి విషయంలో పాక్షికంగా దెబ్బతిందా? లేక పూర్తిగా దెబ్బతిందా? అన్న వర్గీకరణ వద్దు. వాళ్లు ఉండేదే కచ్చా ఇళ్లు అయినప్పుడు వర్గీకరణ అనవసరం’’ అని సీఎం స్పష్టం చేశారు. చదవండి: మొసలికన్నీరు.. ఈనాడుకు ఆ దమ్ముందా? అలాంటి వారికి రూ.10 వేల ఆర్థిక సహాయం ఇస్తే.. తిరిగి ఆ కచ్చా ఇంటిని మరమ్మతు చేసుకోవడానికి, తిరిగి కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాంటి వారి జీవితాలపై మరింత భారం పడేలా వ్యవహరించకూడదు. అందుకే మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని కలెక్టర్లను కోరుతున్నాను. ఇలాంటి సమయాల్లో వారికి బాసటగా నిలిచామనే మాట రావాలి. అలాగే ముంపునకు గురైన ఇళ్లు, అలాగే వరదనీరు ప్రవహించిన ఇళ్లు ఉన్న ప్రాంతాల్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి. ఉదారంగా నిత్యావసరాలను పంపిణీ చేయాలి. 25 కేజీల బియ్యం, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళా దుంపలు, కేజీ పామాయిల్, కేజీ కందిపప్పు ఇవ్వాలి’’ అని సీఎం పేర్కొన్నారు. ఈ నాలుగు సంవత్సరాల్లో ప్రతి ఏడాది కూడా ఇలాంటి పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం. కంట్రోలు రూమ్స్ ఏర్పాటు చేయడం, జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకూ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలి. సచివాలయ స్థాయిలో కూడా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయండి. సచివాలయాల సిబ్బందిని, వాలంటీర్ల సేవలను పూర్తిగా వినియోగించుకోండి. ముంపు బాధిత గ్రామాల మీద, లంకల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఆయా ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు సరిపడా నిల్వ ఉండేలా చూసుకోవాలి. లంక గ్రామాలలో జనరేట్లర్లు లాంటి వాటిని సిద్ధం చేసుకోండి’’ అని సీఎం సూచించారు. చదవండి: ఇదో కార్పొరేట్ ఫ్రాడ్.. మార్గదర్శి మోసాలపై ఏపీ సీఐడీ కీలక ప్రెస్‌మీట్ తాగు నీటి కొరత లేకుండా, తాగునీటి సరఫరా వ్యవస్థలు నిలిచి పోకుండా తగిన చర్యలు తీసుకోండి. తాగునీటి ప్యాకెట్లను సిద్ధంచేసుకోండి. పారిశుద్ధ్య కార్యక్రమాలు ఆయా గ్రామాల్లో ముమ్మరంగా చేపట్టండి. అలాగే ఆరోగ్య శిబిరాలను కూడా ఏర్పాటు చేయండి. విలేజ్ క్లినిక్స్, పీహెచ్‌సీల్లో సరిపడా మందులను ఏర్పాటు చేసుకోండి. దీనిపై అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించుకోవాలి. వరదల కారణంగా పాముకాట్లు పెరుగుతాయి, వీటికి అవసరమైన మందులను అందుబాటులో చేసుకోండి. వరదనీరు తగ్గాక పంట నష్టం వివరాలను నమోదు చేసుకుని రైతులకు బాసటగా నిలిచేలా చర్యలు తీసుకోవాలి. అత్యంత పారదర్శకత పద్ధతిలో ఎన్యుమరేషన్ జరగాలి’’ అని సీఎం జగన్ ఆదేశించారు. -
భారీ వర్షాలు.. మండపానికి వెళ్లలేని పరిస్థితి.. ఆ ఐడియాతో వాళ్ల పెళ్లి జరిగిపోయింది!
పెళ్లి అంటే జీవితంలో ముఖ్యమైన రోజు. మరిచిపోలేని రోజు కూడా. అందుకే బంధువులు, స్నేహితులు, అతిథుల సమక్షంలో ఘనంగా వివాహం చేసుకుంటారు. కొందరు విమానంలో, పడవలో, చివరకు నీటి అడుగున ఇలా ఎవరికి నచ్చినట్లుగా వాళ్లు తమ వివాహాలను ప్లాన్ చేసుకుంటున్నారు. మరోవైపు.. కొందరి వివాహాలు మాత్రం తాము అనుకున్నట్లు కాకుండా పరిస్థితులు బట్టి మరోలా జరుగుతున్నాయి. తాజాగా ఓ జంట పెళ్లి మండపంలో కాకుండా ఆన్లైన్లో చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే.. ప్రస్తుతం ఉత్తర భారతంలో భారీ వర్షాలు కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడికక్కడ రోడ్లు స్తంభించిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. ఈ కారణంగా హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ జంట మండపానికి వెళ్లడం కుదరలేదు. వేదమంత్రాలు, పెద్దల ఆశీస్సులతో పెళ్లి పీటలు ఎక్కాలని భావించిన ఓ జంటకు అనూహ్యంగా ప్రకృతి అడ్డుతగిలింది. ఒకవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో రోడ్లు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. దీంతో ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఒక్కటి కావడానికి ఇవేవీ అడ్డంకి కాబోవని ఆ దంపతులు భావించారు. అందుకు ఓ ఉపాయాన్ని ఆలోచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో వారి వివాహం జరుగుతోందని అందరికీ తెలియజేసి, పెళ్లికి సంబంధించిన ఆన్లైన్ లింక్‌ను అందరికీ పంపారు. అనంతరం వారి పెళ్లిని ఆన్లైన్లో నిర్వహించారు. ఈ ఆన్లైన్ వెడ్డింగ్‌లో ఇద్దరి కుటుంబ సభ్యులతో పాటు మాజీ ఎమ్మెల్యే రాకేష్ సింగ్ కూడా పాల్గొన్నారు. అనుకున్న సమయానికి పెళ్లి చేసుకుని ఎట్టిపరిస్థితుల్లోనూ వెనకడుగు వేయని ఆ నవ దంపతులకు సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. పెద్దలు నిర్ణయించిన సరైన సమయానికి ఆన్లైన్లో పెళ్లి చేసుకుని తమ జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. చదవండి: లైకులు, కామెంట్ల కోసం చావు వార్తని సోషల్ మీడియాలో.. -
ప్రాజెక్టుల ప్రగతిపై పీఎం మోదీ సమీక్ష
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి అమలు చేస్తున్న వివిధ జాతీయ ప్రాజెక్టుల ప్రగతిపై బుధవారం ఢిల్లీ నుంచి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పలువురు కేంద్ర శాఖల కార్యదర్శులు, వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తున్న ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), ఢిల్లీ–వడోదర–ముంబై ఎక్స్‌ప్రెస్ వే, చోటాదపూర్–ధార్ రత్లాం–మాహౌ–ఖాండ్వా–అకోలా రైల్వే లైన్ కన్వర్షన్, ముంబై–నాగపూర్–ఝూర్సుగుడ పైపులైన్, బైలదిల్లా ఐరన్ ఓర్ డిపాజిట్ ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి (పీఎం స్వానిధి) అంశాలకు సంబంధించి ఆయా ప్రాజెక్టుల ప్రగతిని ప్రధానమంత్రి సమీక్షించారు. ఈ వీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్‌రెడ్డి, ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, రహదారులు–భవనాలశాఖ కార్యదర్శి ప్రద్యుమ్న, ఐటీశాఖ కార్యదర్శి కె.శశిధర్, పీసీసీఎఫ్ ఎ.కె.ఝా తదితరులు పాల్గొన్నారు. -
విడాకుల కేసు.. అమెరికా నుంచి రావాల్సిందే
సాక్షి, బెంగళూరు: ఒక విడాకుల కేసులో అమెరికాలో ఉన్న భర్తను భారతదేశానికి రప్పించేందుకు ఒక భార్య చేసిన న్యాయ పోరాటంలో అనుకూల తీర్పు వచ్చింది. వివరాలు.. అమెరికాలో ఉన్న భర్త, బెంగళూరులో ఉన్న భార్యతో విడాకుల కోసం బెంగళూరు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ విచారణకు భర్త నేరుగా హాజరు కావాలని, వీడియో కాన్ఫరెన్స్ విచారణ సరికాదని కోర్టుకు భార్య విన్నవించింది. అయితే ఆయన అమెరికా నుంచి రావడానికి అయ్యే రూ.1.60 లక్షల ఖర్చును మీరే భరించాలని కోర్టు ఆమెకు సూచించింది. ఈ తీర్పుతో కంగుతిన్న మహిళ ఆ తీర్పును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించింది. భార్య కోరినట్లు అతడు భౌతికంగా హాజరవ్వడంలో ఎలాంటి తప్పు లేదని హైకోర్టు పేర్కొంది. భర్త పేదవాడు కూడా కాకపోవడంతో ఆ ప్రయాణ ఖర్చులను అతడే భరించుకోవాలని, విచారణకు రావాలని ఆదేశించింది. -
మిల్లర్లు సహకరించకుంటే ఇంటర్మీడియట్ గోడౌన్లకు ధాన్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యాసంగి ధాన్యం సేకరణ వేగంగా జరుగుతోందని, ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ధాన్యం అన్లోడింగ్ సమస్య ఉత్పన్నం కాకుండా జిల్లా కలెక్టర్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం విక్రయాల కోసం రైతులు రోడ్లపైకి రాకుండా చూడాలని, మిల్లుల వద్ద స్టోరేజీ లేని చోట, మిల్లులు సహకరించని చోట తక్షణమే ఇంటర్మీడియట్ గోడౌన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాల వారీగా అవసరమైన చోట ఇంటర్మీడియట్ గోడౌన్లలో మిల్లర్లతో సంబంధం లేకుండా అన్లోడింగ్ చేసి రైతులకు సకాలంలో డబ్బులు అందేలా చూడాలని స్పష్టం చేశారు. రైతులు కేంద్రం నిర్దేశించిన ఎఫ్ఏక్యూ ప్రమాణాలతో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చేలా అవగాహన పెంపొందించాలని కలెక్టర్లకు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ఎఫ్ఏక్యూ ప్రకారమే ధాన్యం సేకరణ చేయాలని, తాలు, తరుగు సమస్య ఉత్పన్నం కాకూడదన్నారు. పక్క రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోళ్లు లేనందున అక్కడి ధాన్యం తెలంగాణలోకి రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాన్స్ పోర్ట్ కోసం అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలను ఎంచుకొని, అవసరమైన చోట స్థానిక ట్రాక్టర్లను సైతం వాడుకోవాలని మంత్రి కలెక్టర్లకు సూచించారు. రాష్ట్ర సరిహద్దులకు సమీపంలోని జగ్గయ్యపేట, రాయ్ చూర్, బీదర్ తదితర ప్రాంతాల్లో సైతం ఇంటర్మీడియట్ గోదాంలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, కమిషనర్ అనిల్ కుమార్, జీఎంలు రాజారెడ్డి, శ్రీనివాసరావులు కూడా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. -
మే 9 నుంచి ‘జగనన్నకు చెబుదాం’
సాక్షి, అమరావతి: వివిధ ప్రభుత్వ సేవలకు సంబంధించి ప్రజల సమస్యలను నిర్దిష్ట సమయంలోగా నాణ్యతతో పరిష్కరించడంతో పాటు నాణ్యమైన సేవలను అందించడమే లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని మే 9వతేదీ నుంచి ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. నమోదైన సమస్యల పరిష్కారంతోపాటు ప్రభుత్వ సేవలు, పథకాలపై ఆరా తీయడం, ముఖ్యమంత్రి సందేశాలను నేరుగా చేరవేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని వివరించారు. ముఖ్యమంత్రి నేరుగా ప్రజలతో కనెక్ట్ అయి ఉంటారని, సేవల్లో సమస్యలు, సలహాలను నేరుగా తెలియచేయవచ్చని వెల్లడించారు. ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కార్యాలయం ఆయా సమస్యలు నిర్దేశిత సమయంలోగా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం ఉద్దేశం, ఆశయాలు, లక్ష్యాలపై అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. హెల్ప్‌లైన్ నంబర్ 1902 మే 9న ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. అందుకోసం 1902 హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రవేశ పెడుతున్నాం. ఇప్పటికే పలుమార్లు సమీక్షలు చేశాం. జగనన్నకు చెబుదాం పేరులో ముఖ్యమంత్రి అయిన నా పేరు జోడించారంటే ఈ కార్యక్రమానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఎంత ఉందో అర్థం అవుతోంది. ఇది చాలా ప్రతిష్టాత్మక కార్యక్రమం. మనం ఇప్పటికే స్పందన నిర్వహిస్తున్నాం. స్పందనకు మరింత మెరుగైన రూపమే ‘జగనన్నకు చెబుదాం’.. నాణ్యమైన సేవలను ప్రజలకు అందించడమే ‘జగనన్నకు చెబుదాం..’! సమస్యలను అత్యంత నాణ్యంగా పరిష్కరించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి సమస్యను నమోదు చేసుకుంటే అత్యంత నాణ్యతతో పరిష్కరించాలి. సీఎంవో నుంచి మండలాల వరకూ పర్యవేక్షణ యూనిట్లు సీఎంవో, ప్రభుత్వ శాఖల అధిపతులు, జిల్లా, డివిజన్ స్థాయి, మండల స్థాయిలో మానిటరింగ్ యూనిట్లు ఉంటాయి. వీటిని కలెక్టర్లు తప్పనిసరిగా పర్యవేక్షించాలి. సమస్య పరిష్కారంలో క్వాలిటీ పెంచడం అన్నది ప్రధాన లక్ష్యం కావాలి. ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ల ద్వారా పర్యవేక్షణ చేస్తేనే అది సాధ్యం. ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ల(పీఎంయూ)ను సీఎంవో కూడా పర్యవేక్షిస్తుంది. హెల్ప్‌లైన్ ద్వారా గ్రీవెన్స్ నమోదవుతాయి. వాటిని నిర్దేశిత సమయంలోగా నాణ్యతతో పరిష్కరించాలి. ఫిర్యాదు చేసిన వ్యక్తికి సంతృప్తి కలిగించడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. సమస్యల పరిష్కారంపై ప్రజలకు అప్డేట్స్ తమ సమస్యల పరిష్కారంపై ఐవీఆర్ఎస్, ఎస్సెమ్మెస్‌ల ద్వారా ప్రజలకు క్రమం తప్పకుండా అప్డేట్స్ అందుతాయి. అంతేకాకుండా ఇదే హెల్ప్‌లైన్ ద్వారా సమస్యల పరిష్కారంపై అర్జీదారులనుంచి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుంటారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో వలంటీర్లు ప్రతి ఇంటినీ సందర్శించి 1902 హెల్ప్‌లైన్ గురించి అవగాహన కల్పిస్తారు. ఈ హెల్ప్‌లైన్‌ను వినియోగించుకునేలా ప్రోత్సహిస్తారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభమయ్యేలోగా వలంటీర్లు ప్రతి గడపకూ 1902 గురించి చెబుతారు. ప్రతేక అధికారులుగా సీనియర్ ఐఏఎస్‌లు సీనియర్ ఐఏఎస్ అధికారులు జిల్లాలకు ప్రత్యేకాధికారులుగా వ్యవహరిస్తారు. క్రమం తప్పకుండా ప్రతి 15 రోజులకోసారి సంబంధిత జిల్లాలను సందర్శించి పర్యవేక్షిస్తారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం అమలును కలెక్టర్లతో కలసి పర్యవేక్షిస్తారు. సమస్యల పరిష్కారాల తీరును ర్యాండమ్‌గా తనిఖీ చేస్తారు. ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ల పనితీరును గమనిస్తారు. ఎక్కడైనా సమస్య పరిష్కారం పట్ల సంతృప్తి చెందకుంటే తిరిగి ఓపెన్ చేస్తారు. ఎస్ఎంఎస్, ఐవీఆర్ఎస్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా దాన్ని తిరిగి తెరుస్తారు. పరిష్కారం తీరుపై పూర్తిస్థాయిలో సమీక్ష చేస్తారు. చీఫ్ సెక్రటరీ, సీఎంవో, డీజీపీతో కలిసి రెగ్యులర్‌గా మానిటర్ చేస్తారు. ప్రతి 15 రోజులకోసారి పూర్తిస్థాయిలో సమీక్ష ఉంటుంది. ప్రతి కలెక్టర్‌కు తక్షణం రూ.3 కోట్లు ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి పేరు పెట్టారంటే ఇది ఎంత ముఖ్యమైనదో అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి అధికారులపై ఆధారపడే విధులను నిర్వహిస్తారు. మీరు అత్యంత సమర్థవంతంగా విధులు నిర్వహిస్తే ప్రభుత్వం సమర్ధంగా పని చేసినట్లే. అప్పుడే ఈ కార్యక్రమం చక్కగా సాగుతున్నట్లు లెక్క. ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. ప్రజలకు నాణ్యంగా సేవలను అందించాలన్నదే దీని ఉద్దేశం. ప్రతి కలెక్టర్‌కు రూ.3 కోట్లను తక్షణ నిధులుగా ప్రభుత్వం ఇస్తుంది. అవసరమైన చోట ఈ డబ్బులను ఖర్చు చేయవచ్చు. వీటిని ఖర్చు చేసే అధికారం కలెక్టర్‌కు ఇస్తున్నాం. గ్రామ స్థాయిలో అన్ని అంశాలపై దృష్టి కలెక్టర్లు, స్పెషల్ ఆఫీసర్లు, మానిటరింగ్ యూనిట్లు గ్రీవెన్స్‌తో పాటు గ్రామస్ధాయిలో అన్ని అంశాలపైనా దృష్టి పెడతారు. దీనివల్ల వేగంగా గ్రీవెన్స్ పరిష్కారంలో డెలివరీ మెకానిజం ఉంటుంది. అంతేకాకుండా గ్రామ స్థాయిలోని సచివాలయాలు, ఆర్బీకేలు, అంగన్వాడీలు, విలేజ్ క్లినిక్స్.. అవన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయా? లేదా? అన్న అంశంపైన కూడా దృష్టిపెడతారు. గ్రామాలలో ఇళ్ల నిర్మాణంపైనా దృష్టి సారిస్తారు. ఇవి సక్రమంగా పనిచేస్తే గ్రామస్ధాయిలో చాలావరకు సమస్యలు సమసిపోతాయి. అవి సమర్థంగా పనిచేయడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. దీనికోసమే మానిటరింగ్ కమిటీలతో పాటు స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తున్నాం. సమావేశంలో విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి.సాయిప్రసాద్, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్‌జైన్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గిరిజాశంకర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్, ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్, ఏపీడీడీసీఎఫ్ ఎండీ అహ్మద్‌బాబు, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ (మౌలిక వసతులు కల్పన) కాటమనేని భాస్కర్, వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్, ఆర్ అండ్ బీ కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్న, పౌరసరఫరాలశాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ సూర్యకుమారి, సెర్ఫ్ సీఈఓ ఏ ఎండి ఇంతియాజ్, ఆరోగ్య కుటుంబసంక్షేమశాఖ కమిషనర్ నివాస్, మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు, ఏపీ జెన్కో ఎండీ చక్రధర్‌బాబు, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ లక్ష్మీషా, డీఐజీ గోపీనాథ్ జెట్టి తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయ క్రీడాస్థలిగా రైల్వే
జైపూర్: కేంద్రంలో గత ప్రభుత్వాలు రైల్వే వ్యవస్థను రాజకీయ క్రీడాప్రాంగణంగా వాడుకుని దుర్వినియోగం చేశాయని ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. బుధవారం రాజస్థాన్‌లో తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ఆయన ప్రారంభించారు. ఇది దేశంలో 15వ వందేభారత్ ఎక్స్‌ప్రెస్. అజ్మీర్, ఢిల్లీ కంటోన్మెంట్ స్టేషన్ల మధ్య ప్రయాణిస్తుంది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. ‘‘రాజకీయ లాభమనే సంకుచిత దృక్పథంలోనే గత ప్రభుత్వాల ఆలోచనలు సాగాయి. అందుకే రైల్వే ఆధునీకరణ పట్టాలెక్కలేదు. ఎవరు రైల్వే మంత్రి కావాలి, ఏ స్టేషన్ గుండా ఏ రైలు వెళ్లాలనే అంశాలూ రాజకీయ లబ్ధి కోణంలోనే నిర్ణయమయ్యేవి. 2014లో సుస్థిర ప్రభుత్వం వచ్చాక రైల్వేల పరిస్థితే మారిపోయింది. రాజకీయ జోక్యం పోయింది’’ అన్నారు. గహ్లోత్‌జీ, థ్యాంక్యూ రాజస్తాన్ కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్న వేళ కూడా సీఎం అశోక్ గహ్లోత్æ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలని మోదీ అన్నారు. ‘‘గహ్లోత్ నాకు మంచి మిత్రుడు. రైల్వే మంత్రి, రైల్వే బోర్డు చైర్మన్ రాజస్థానీలే. అలా మీ చేతిలో రెండు లడ్డూలున్నాయి’’ అన్నారు. నవ్య భారత్ కోసమే భోపాల్: ‘అధునాతన, అభివృద్ధి చెందిన భారత్’ కోసమే నూతన జాతీయ విద్యావిధానం తెచ్చినట్టు మోదీ చెప్పారు. భోపాల్‌లో నూతన ఉపాధ్యాయుల నియామక కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన వీడియో సందేశమిచ్చారు. ‘‘విజ్ఞానం, నైపుణ్యం, సంస్కృతి, భారతీయ విలువలను చిన్నారి విద్యార్థుల్లో ఇనుమడింపజేయడంలో ఎన్ఈపీ ఎంతో దోహదపడనుంది’’ అన్నారు. -
టెన్త్ పేపర్ లీక్‌పై మంత్రి సబిత సీరియస్.. ఉద్యోగాలు పోతాయ్
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడే ఉద్యోగులను ఉద్యోగాల నుండి శాశ్వతంగా తొలగించనున్నట్టు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి స్పష్టం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీక్ కాలేదని, ఈ విషయంలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థినీ విద్యార్థులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సబిత వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ దేవసేన, పోలీస్ రేంజ్ ఐ.జిలు షానవాజ్ కాసీం , చంద్రశేఖర్ రెడ్డి లు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో కట్టుదిట్టమైన చర్యలను చేపట్టిందని, ఈ పరీక్షల విషయంలో తమ స్వార్థ ప్రయోజనాలకై విద్యార్థుల భవిష్యత్ తో ఆడుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఇంకా మిగిలిన నాలుగు పరీక్షల నిర్వహణ విషయంలో మరింత కఠిన చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీలకు సూచించారు. ఈ పరీక్షల నిర్వహణలో దాదాపు 55 వేల మంది అధికారులు, సిబ్బంది ప్రత్యక్షంగా పాల్గొంటున్నారని, ఎట్టిపరిస్థితుల్లోనూ సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించవద్దని, పరీక్షల విధి నిర్వహణలో ఉన్న అధికారులు, సిబ్బందికి కూడా ఈ నిబంధన వర్తిస్తుందని సబితా స్పష్టంచేశారు. పరీక్షల నిర్వహణ అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, ఈ విషయంలో ఏవిధమైన అపోహలకు, అనుమానాలకు తావు లేదని మంత్రి పేర్కొన్నారు. పరీక్షా పేపర్ల రవాణా విషయంలో మరింత భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీ లను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ను పటిష్టంగా అమలు చేయడంతోపాటు జిరాక్స్ షాప్‌లను మూసివేయించాలని అన్నారు. ఇంటర్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించడంలో కృషిచేసిన అధికారులను మంత్రి అభినందించారు. చదవండి: పేపర్ లీక్ కాదు.. పరీక్ష మధ్యలో బయటకు వచ్చిందంతే!: వరంగల్ సీపీ -
నవజాత శిశువుల ఆరోగ్యంపై శ్రద్ధచూపాలి
సాక్షి, అమరావతి: గిరిజన ప్రాంతాల నుంచి విశాఖపట్నం కేజీహెచ్‌కు నవజాత శిశువులను చికిత్సకు తీసుకొచ్చేటప్పుడు వారి ఆరోగ్యంపై ప్రత్యేకశ్రద్ధ చూపాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని అధికారులను ఆదేశించారు. ఆమె శుక్రవారం మంగళగిరిలోని తన కార్యాలయం నుంచి అరకు, పాడేరు ఎమ్మెల్యేలు, విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లాల కలెక్టర్లు, పాడేరు ఐటీడీఏ, వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని మారుమూల గిరిజన ప్రాంతాలకు వైద్యసేవలు పూర్తిగా అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వైద్య ఆరోగ్యశాఖను నిరంతరం అప్రమత్తం చేస్తున్నారని చెప్పారు. చింతూరు వంటి మారుమూల గిరిజన ప్రాంతానికి 40 ఏళ్ల తర్వాత స్పెషలిస్ట్ డాక్టర్‌ను నియమించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కుంతల సచివాలయం పరిధిలోని కిండ్లం గ్రామంలో ఇటీవల ఆరుగురు మరణించడంపై గిరిజనులు భయాందోళనలు చెందాల్సిన పనిలేదన్నారు. ఈ సందర్భంగా వీరంతా హైబీపీ, ఖైనీ నమలడం, మూఢనమ్మకాలతో నాటువైద్యం చేయించుకోవడం వంటి కారణాలతో చనిపోయినట్లు వైద్యాధికారులు చెప్పారు. సికిల్‌సెల్ ఎనీమియా, తలసేమియా వ్యాధులకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అరకు, పాడేరు ఎమ్మెల్యేలు చెట్టి ఫల్గుణ, భాగ్యలక్ష్మి, జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర తమ ప్రాంత వైద్య అవసరాల కోసం విన్నవించగా వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషిచేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు, వైద్యవిద్య సంచాలకుడు వినోద్ తదితరులు పాల్గొన్నారు. -
టెన్షన్ లేకుండా టెన్త్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి, ఆందోళన లేకుండా పదవ తరగతి పరీక్షలు రాసేందుకు సన్నద్ధం చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను కోరారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని, వారికి అసౌకర్యం కలగకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వచ్చే నెల 3 నుంచి టెన్త్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో పాఠశాల విద్య సంచాలకురాలు దేవసేనతో కలసి మంత్రి సబిత బుధవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షలపై విద్యార్థులకు ఉన్న సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసి, వారిలో మనోధైర్యాన్ని నింపాల్సిన బాధ్యత ఆయా యాజమాన్యాలతో పాటు అధ్యాపకులకు, తల్లిదండ్రులకు ఉందన్నారు. లక్షల్లో విద్యార్థులు హాజరవుతున్న పదవ తరగతి పరీక్షలను పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అవుతున్నారని, వీరి కోసం 2,652 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని మంత్రి ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణలో జిల్లా కలెక్టర్ల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున, పరీక్ష కేంద్రాల వద్ద ప్రత్యేక జాగ్రత్తలతో పాటు విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని కోరారు. పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు వాటిని పరిశీలించే ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. పరీక్షల సమయంలో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి పరీక్ష పేపర్లను 11 నుంచి 6 కు కుదించామని, సైన్స్ పరీక్ష రోజున భౌతిక శాస్త్రం, జీవ స్త్రాస్తానికి సంబంధించి ప్రశ్న పత్రాలను విడివిడిగా అందిస్తామని తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితప్రయాణం చేసే సౌకర్యం కూడా కల్పించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ తదితరులు పాల్గొన్నారు. -
భారత్ నుంచి బంగ్లాకు పైప్‌లైన్ ద్వారా డీజిల్
న్యూఢిల్లీ: భారత్ నుంచి బంగ్లాదేశ్‌కు డీజిల్ రవాణా కోసం రూ.377 కోట్లతో నిర్మించిన పైప్‌లైన్‌ను ప్రధాని మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా శనివారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. భారత్–బంగ్లాదేశ్ సంబంధాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైందని ఈ సందర్భంగా మోదీ అన్నారు. ఈ లైన్ వల్ల రవాణా ఖర్చులతోపాటు కాలుష్యం కూడా తగ్గుతాయని చెప్పారు. ప్రస్తుతం డీజిల్ భారత్ నుంచి 512 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గంలో బంగ్లాదేశ్‌కు సరఫరా అవుతోంది. నూతనంగా అస్సాంలోని నుమాలిఘడ్ నుంచి బంగ్లాదేశ్‌కు 131.5 కిలోమీటర్ల మేర నిర్మించిన పైప్‌లైన్ ద్వారా ఏడాదికి 10 లక్షల టన్నుల డీజిల్ రవాణాకు వీలుంటుంది. ఈ 15 ఏళ్ల ఒప్పందాన్ని దశలవారీగా విస్తరించుకునే వీలుంది. -
వాతావరణ శాఖ హెచ్చరికలతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తం
సాక్షి, అమరావతి: ఈ వేసవిలో వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించినందున.. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను విపత్తుల నిర్వహణ సంస్థ ఆదేశించింది. మంగళవారం తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయం నుంచి వివిధ శాఖల అధికారులతో సంస్థ ఎండీ అంబేడ్కర్ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. 2020వ సంవత్సరం నుంచి రాష్ట్రంలో వడగాడ్పుల మరణాలు లేవని.. ఈ ఏడాది కూడా అదే విధంగా చర్యలు తీసుకోవాలని, జిల్లా, మండల స్థాయిలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. వడగాడ్పుల తీవ్రత ఆధారంగా పాఠశాలల సమయాలను మార్చాలని ఆదేశించారు. అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే విభాగాన్ని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చదవండి: ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు అలర్ట్.. -
జూమ్ ప్రెసిడెంట్‌కి షాక్ ఇచ్చిన కంపెనీ: కారణం లేకుండానే
ప్రముఖ వీడియో కాన్ఫరెన్సింగ్ సంస్థ ‘జూమ్’ కారణం లేకుండానే ప్రెసిడెంట్ Greg Tombను ఫైర్ చేసింది. సేల్స్ ఆపరేషన్స్, ఎర్నింగ్స్ కాల్స్‌లో కీరోల్ పోషించిన జార్జ్‌ను విధులు తొలగించడం చర్చాంశనీయంగా మారింది. మార్చి 03న జూమ్ తన రెగ్యులరేటరీ ఫైలింగ్‌లో జార్జ్‌కు సంస్థ తరుపు నుంచి అన్నీ ప్రయోజనాలకు కల్పిస్తూ ఎలాంటి కారణం లేకుండానే ఫైర్ చేస్తున్నట్లు పేర్కొంది. గత నెలలో జూమ్ కంపెనీ 15 శాతం వర్క్ ఫోర్స్‌తో 1,300 మందిని ఫైర్ చేసింది. వారిలో సీఈవో ఎరిక్ యువాన్ సైతం ఉన్నారు. గూగుల్ ఉద్యోగిగా విధులు నిర్వహించిన యువాన్ జూన్ 2022లో జూమ్‌లో చేరారు. వీడియో కాన్ఫరెన్స్ సర్వీసుల్లోని అవకాశాల్ని ఒడిసి పట్టుకొని సంస్థను లాభాలవైపు నడిపించారు. వందల కోట్ల స్టాక్ గ్రాంట్ అనూహ్యంగా పింక్ స్లిప్ జారీ చేసిన ప్రెసిడెంట్ జార్జ్ టాంబ్కు 45 మిలియన్ల విలువైన కంపెనీ స్టాక్స్‌తో పాటు బేస్ శాలరీ 4లక్షల బిలియన్ డాలర్లు, గతేడాది జూన్ నెలలో కంపెనీ 8శాతం బోనస్‌గా ఇస్తున్నట్లు తన ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ సందర్భంగా జూమ్ అధికార ప్రతినిధి శాన్ జోస్ మాట్లాడుతూ.. మాజీ ప్రెసిడెంట్ జార్జ్ టాంబ్ స్థానంలో మరో వ్యక్తిని నియమించుకుంటున్నట్లు తెలిపారు, కానీ జార్జ్‌ను ఎందుకు తొలగించారనేదాని మీద ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. -
ప్రగతిపై సీఎస్ లతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్
-
ఏపీఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ.. మీరేమంటారు?
సాక్షి, అమరావతి: విద్యుత్ చార్జీల (టారిఫ్) సవరణపై ఈనెల 19వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ప్రజాభిప్రాయం సేకరించనుంది. ఈ నెల 19, 20, 21 తేదీల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బహిరంగ విచారణ చేపట్టనుంది. సామాన్యులపై ఎటువంటి విద్యుత్ చార్జీల భారం వేయకుండా విద్యుత్ చార్జీలను సవరించేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) 2023–24 ఆర్థిక సంవత్సరానికి రిటైల్ సప్లై బిజినెస్ (ఆర్ఎస్బీ) అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంట్ (ఏఆర్ఆర్)ను గతేడాది నవంబర్ 30న ఏపీఈఆర్సీకి సమర్పించాయి. వీటిపై ఈసారి కూడా గతేడాది లాగానే విశాఖపట్నంలోని ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బహిరంగ విచారణ నిర్వహించనున్నారు. మండలి చైర్మన్ జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, కార్యదర్శి, సభ్యులు, రాష్ట్ర ఇంధనశాఖ, డిస్కంల అధికారులు ఈ విచారణలో పాల్గొననున్నారు. జిల్లాల్లో ప్రత్యక్ష ప్రసారం ఈ నెల 19వ తేదీ నుంచి మూడు రోజులు ఉదయం గం.10.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మధ్యాహ్నం రెండుగంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ప్రజలు అన్ని డిస్కంల టారిఫ్ ఫైలింగ్‌కు సంబంధించిన సూచనలు, అభ్యంతరాలు, అభిప్రాయాలను మండలికి తెలపవచ్చు. అన్ని జిల్లాల్లోని విద్యుత్ ఎస్ఈ, ఈఈ కార్యాలయాల్లో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాట్లు చేయనున్నారు. ప్రజలు తమ సమీపంలోని ఆయా కార్యాలయాలకు వెళ్లి తమ అభిప్రాయాలు చెప్పవచ్చు. ముందు నమోదు చేసుకున్న వారి నుంచి, తరువాత నమోదు చేసుకోని వారి నుంచి అభిప్రాయాలు తీసుకుంటారు. ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ప్రజలంతా వీక్షించేందుకు వీలుగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని డిస్కంలను ఏపీఈఆర్సీ ఆదేశించింది. -
చిరుధాన్యాలపై అవగాహన
సాక్షి, అమరావతి: ఐక్యరాజ్యసమితి 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించినందున ఏడాది పొడవునా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ చెప్పారు. అందుకు తగినట్టుగా 100 హెక్టార్లకు ఒకటి చొప్పున పంటల వారీగా క్లస్టర్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయన మంగళవారం జిల్లా వ్యవసాయశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరుధాన్యాల సాగుపై రైతులకు శిక్షణనిస్తూ, భవిష్యత్‌లో మంచి ధర లభించేలా కృషిచేయాలన్నారు. వైఎస్సార్ యంత్ర సేవాకేంద్రాల ఏర్పాటు కోసం జిల్లాల్లోని జిల్లా పర్చేజింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ (డీపీఎంసీ) ద్వారా యంత్ర పరికరాల సూచిక ధరలను ఖరారు చేయాలని చెప్పారు. పీఎం కిసాన్ 13వ విడత ఆర్థికసాయాన్ని సాధ్యమైనంత ఎక్కువమందికి అందించేందుకు వీలుగా రైతుల ఈ–కేవైసీని ఈ నెల 15వ తేదీలోగా పూర్తిచేయాలన్నారు. రబీలో సాగుచేసి కోతకు వచ్చే శనగలు, మినుములు, పెసలు, ఇతర పంటల ఈ–క్రాప్ నమోదు, ఈ–కేవైసీ త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. ఈశాన్య రుతుపవనాల ప్రభావం ఉన్న ప్రకాశం, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఈ నెల 30వ తేదీలోగా, మిగిలిన జిల్లాల్లో 15వ తేదీలోగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. -
బీజేపీ ముఖ్య నేతలతో తరుణ్ చుగ్ వీడియో కాన్ఫరెన్స్
-
తగినన్ని ఔషధ నిల్వలు సిద్ధం చేయండి
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు మరోసారి పెద్దసంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో మనదేశంలోనూ అందరూ అప్రమత్తం కావాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గురువారం చెప్పారు. కరోనా నియంత్రణకు అవసరమైన ఔషధాలతోపాటు అన్ని రకాల ఔషధ నిల్వలను సిద్ధం చేయాలని ఫార్మా కంపెనీలకు ఆయన విజ్ఞప్తి చేశారు. తగినన్ని నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రిటైల్ స్థాయి వరకు ఔషధాలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కోవిడ్–19 మేనేజ్మెంట్ డ్రగ్స్ లభ్యత, ఉత్పత్తి సామర్థ్యంపై మంత్రి గురువారం ఫార్మా కంపెనీల ప్రతినిధుతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాప్తి విషయంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. దేశంలో మహమ్మారి వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో ఫార్మా కంపెనీలు అందించిన సేవలను మన్సుఖ్ మాండవీయ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఫార్మా కంపెనీల కృషి వల్లే మన దేశానికి అవసరమైన ఔషధాలను, కరోనా టీకాలను ఉత్పత్తి చేసుకోవడంతోపాటు 150 దేశాలకు సైతం ఎగుమతి చేయగలిగామని కొనియాడారు. ధరలు పెంచకుండా, నాణ్యత తగ్గించకుండా ఈ ఘనత సాధించామని హర్షం వ్యక్తం చేశారు. -
వర్షాలపై జిల్లాల కలెక్టర్లతో జగన్ వీడియో కాన్ఫరెన్స్
-
పెండింగ్ అంశాలపై నేడు కేంద్రం సమీక్ష
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అన్ని అంశాలపై బుధవారం కేంద్ర, రాష్ట్ర సమన్వయ కమిటీ సమీక్ష చేయనుంది. సమన్వయ కమిటీ వద్ద ఉన్న పెండింగ్ అంశాలతో పాటు వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలపైన కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ (సమన్వయ) కార్యదర్శి అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ఉన్నతాధికారులతో ఈ సమావేశం జరుగుతుంది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ డైరెక్టర్ ఎం. చక్రవర్తి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమాచారం పంపించారు. ఈ–సమీక్ష పోర్టల్‌లో పొందుపరిచిన అంశాలపై సమీక్షించనున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర సమన్వయ కమిటీ వద్ద పెండింగ్‌లో ఉన్న 34 అంశాలతో పాటు వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల వద్ద పెండింగ్‌లో ఉన్న 15 అంశాలను అజెండాలో చేర్చారు. రాష్ట్ర విభజన జరిగిన ఆర్థిక ఏడాది రెవెన్యూ లోటు భర్తీ, పెండింగ్‌లో ఉన్న జాతీయ రహదారులు, రైల్వే లైన్లను అజెండాలో చేర్చారు. విశాఖలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, జాతీయ ఫార్మాస్యూటికల్ విద్యా సంస్ధ ఏర్పాటు, పారిశ్రామిక, ఆర్థిక ప్రగతికి పన్ను రాయితీలు, ఆర్ అండ్ ఆర్తో సహా పోలవరం పూర్తి వ్యయాన్ని భరించడం తదితర అంశాలు కూడా ఉన్నాయి. -
ప్రపంచం ఆశలన్నీ భారత్‌పైనే
బనశంకరి: ‘‘మిగతా ప్రపంచమంతా నానా సంక్షోభాల్లో చిక్కిన వేళ భారత్ మాత్రమే అన్ని రంగాల్లోనూ దూసుకుపోతూ అతి పెద్ద ఆశాకిరణంగా కనిపిస్తోంది. ఆర్థికవేత్తలంతా ముక్త కంఠంతో చెబుతున్న విషయమిది. ఈ నేపథ్యంలో ప్రపంచమంతా మన దేశంపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విధాన స్థాయిలో విపరీతమైన అలసత్వం, నిర్ణయాల్లో అయోమయం వంటివాటికి బీజేపీ హయాంలో పూర్తిగా తెర దించి పెట్టుబడులకు ఎర్రతివాచీ పరచడం వల్లే ఇదంతా సాధ్యమైందని చెప్పారు. బుధవారం బెంగళూరులో మొదలైన మూడు రోజుల ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు, ఇన్వెస్ట్ కర్నాటక–2022ను ఉద్దేశించి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ‘‘గతేడాది భారత్‌కు రికార్డు స్థాయిలో ఏకంగా 8,400 కోట్ల డాలర్ల మేరకు ఎఫ్‌డీఐలు వచ్చాయి. ప్రపంచాన్ని కమ్మేసిన కరోనా కల్లోలం, ఉక్రెయిన్ యుద్ధ భయాల వేళ ఇది చాలా పెద్ద ఘనత. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లన్నీ ఒడిదొడుకులమయంగా సాగుతున్నాయి. కానీ భారత్ మాత్రం ఆర్థికంగా అద్భుతాలు చేసి చూపుతోంది. మన ఆర్థిక వ్యవస్థ పునాదులు అత్యంత పటిష్టంగా ఉండటమే ఇందుకు కారణమని ప్రపంచమంతా విశ్వసిస్తోంది. ఇటీవలి కాలంలో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు మన సన్నద్ధత స్థాయిని ప్రపంచానికి చాటిచెప్పాయి’’ అన్నారు. వహ్వా కర్నాటక! పదేళ్ల క్రితం దాకా భారత్‌లో పరిస్థితి పూర్తి చాలా నిరాశాజనకంగా ఉండేదని మోదీ అన్నారు. ‘‘మేమొచ్చాక యువతకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చి ప్రోత్సహించాం. సాహసోపేతమైన సంస్కరణలు, భారీ మౌలిక వ్యవస్థలు, అత్యున్నత నైపుణ్యాల కలబోతగా నూతన భారత నిర్మాణం సాధ్యపడింది. సంప్రదాయేతర ఇంధన రంగంలో భారత విజయాలు ప్రపంచమంతటికీ ఉదాహరణగా నిలిచాయి. కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే పార్టీ ప్రభుత్వాలుండటం వల్ల కర్నాటకకూ డబుల్ ఇంజన్ సామర్థ్యం సమకూరింది. ఫలితంగా చాలా రంగాల్లో రాష్ట్రం అగ్రస్థానంలో దూసుకుపోతోంది. పరిశ్రమల నుంచి ఐటీ, బయోటెక్, స్టార్టప్‌లు, ఇంధన రంగాల దాకా రికార్డు స్థాయి ప్రగతి చరిత్రను లిఖిస్తూ తోటి రాష్ట్రాలకే గాక పలు ఇతర దేశాలకు కూడా సవాలు విసులుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిభ, టెక్నాలజీ గురించి ఎక్కడ ప్రస్తావన వచ్చినా మొట్టమొదట గుర్తొచ్చేది ‘బ్రాండ్ బెంగళూరు’’ అని కొనియాడారు. ‘బిల్డ్ ఫర్ ద వరల్డ్’ నినాదంతో సదస్సును నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ..మేమెంత ప్రచారం చేసుకోవాలి! న్యూఢిల్లీ: దేశ రాజధాని ఎలా ఉండాలన్న అంచనాలన్నింటినీ అందుకునేలా అన్ని సదుపాయాలతో ఢిల్లీని తీర్చిదిద్దుతున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆర్థికంగా వెనకబడ్డ వర్గాల కోసం నిర్మించిన 3,024 కొత్త ఫ్లాట్లను మోదీ బుధవారం ప్రారంభించారు. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ చేసిందేమీ లేకపోయినా లేని గొప్పలను చెప్పుకుంటూ ప్రచారంపై భారీగా ఖర్చు పెడుతోందంటూ ఎద్దేవా చేశారు. ఆ లెక్కన ఇన్ని పనులు చేస్తున్న తాము ఇంకెంత ప్రచారం చేసుకోవాలని లబ్ధిదారులనుద్దేశించి ప్రశ్నించారు. ‘‘మాది పేదల ప్రభుత్వం. ఢిల్లీ అభివృద్ధికి నిత్యం పాటుపడుతున్నాం. ఢిల్లీ మెట్రోను 190 కిలోమీటర్ల నుంచి 400 కిలోమీటర్లకు విస్తరించాం. చుట్టుపక్కల హైవేలను తీర్చిదిద్దాం. మరెన్నో మౌలిక సదుపాయాలు కల్పించాం’’ అని చెప్పారు. -
కలెక్టర్లు ఎస్పీలతో సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్
-
ఉపాధి హామీ పథకం కింద కనీస వేతనం రూ.240 అందేలా చూడాలి: సీఎం జగన్
-
డిసెంబర్ నాటికి ఐదు లక్షల ఇళ్లు పూర్తి చేయాలి
సాక్షి, తాడేపల్లి: ఎస్డీజీ(స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు) సాధన ఆధారంగా కలెక్టర్లకు మార్కులు ఉంటాయని, ఎస్డీజీ లక్ష్యాలే కలెక్టర్ల పనితీరుకు ప్రమాణమని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. జిల్లా కలెక్టర్లతో ఆయన గురువారం స్పందన వీడియో కాన్ఫరెన్స్ చేపట్టారు. ఈ సందర్భంగా.. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో కేటాయించిన నిధులపై సమీక్ష జరిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో గడపగడపకూ మన ప్రభుత్వం నిర్వహించిన తర్వాత నెల రోజుల్లో ప్రాధాన్యతా పనులు మొదలు కావాలని సీఎం జగన్ ఈ సందర్భంగా ఆదేశించారు. అలాగే.. అక్టోబరు 25న ఈ–క్రాపింగ్ జాబితాలు సచివాలయాల్లో ప్రదర్శించాలని, ఈ మేరకు షెడ్యూల్ వివరించారాయన. అలాగే.. ఉపాధి హామీ పథకం కింద కనీసం వేతనం రూ.240 అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. డిసెంబర్ 21వ తేదీ నాటికి ఐదు లక్షల ఇళ్లు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జగనన్న కాలనీల్లో 3.5 లక్షలు, 1.5 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తిచేయాలని ఆదేశించారు. అలాగే.. కొత్తగా అర్హులైన లబ్ధిదారులకు ఫేజ్ –3 కింద డిసెంబర్లో ఇళ్ల మంజూరు చేయాలన్నారు. ఎస్డీజీ(స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు) సాధన ఆధారంగా కలెక్టర్లకు మార్కులు ఉంటాయని, ఎస్డీజీ లక్ష్యాలే కలెక్టర్ల పనితీరుకు ప్రమాణమని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. స్పందనలో వస్తున్న ఫిర్యాదులు పరిష్కారంపై సమీక్ష నిర్వహించడంతో పాటు జాతీయ రహదారులకు కావాల్సిన భూసేకరణ, వైఎస్సార్ అర్బన్-విలేజ్ క్లినిక్స్ పై సీఎం జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. చదవండి: గుడ్ న్యూస్.. ఆ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ -
ఏపీని ఆదర్శంగా తీసుకోండి.. కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి మనోజ్ అహూజా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మూడేళ్లుగా విజయవంతంగా అమలుచేస్తున్న ఎలక్ట్రానిక్ క్రా పింగ్ (ఈ–క్రాప్)ను 2023 మార్చికల్లా అన్ని రా ష్ట్రాలు అమలుచేయాలని కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి మనోజ్ అహూజా సూచించారు. ఏపీని ఆదర్శంగా తీసుకొని ఈ–క్రాపింగ్ అమలుచేయాలని సూచించారు. అగ్రిస్టాక్ డిజిటల్ అగ్రికల్చర్ పేరిట జాతీయ స్థాయిలో ఈ–క్రాపింగ్ అమలుపై అన్ని రాష్ట్రాల వ్యవసాయ శాఖాధికారులతో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సమావేశంలో అహూజా మాట్లాడుతూ వాస్తవ సాగుదారులకు సంక్షేమ ఫలాలు అందించేందుకు ఏపీలో ఈ క్రాపింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారని వివరించారు. ప్రస్తుత ఖరీఫ్, వచ్చే రబీసీజన్‌లో అన్ని రాష్ట్రాలు పైలెట్ ప్రాజెక్టుగా ఈ–క్రాపింగ్‌ను అమలు చేయాలని సూచిం చారు. 2023 మార్చి నుంచి పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నారు. ఏపీలో ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న చోట ఆన్లైన్లో, లేని చోట ఆఫ్‌లైన్‌లో ఈ–క్రాపింగ్ నమోదు చేస్తున్నారని చెప్పారు. ఇదే హైబ్రిడ్ విధానంలో అన్ని రాష్ట్రాలూ పాటించాలన్నారు. ఇంటర్నెట్ సౌకర్యం లేని చోట ఆఫ్‌లైన్‌లో నమోదు చేసి, ఆ వివరాలను ఇంటర్నెట్ ఉన్న చోట ఆన్లైన్లో పొందుపర్చాలని సూచించారు. రైతులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ఈ–క్రాప్ అమలుపై రాష్ట్ర వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, స్పెషల్ కమిషనర్ హరికిరణ్ ఇతర రాష్ట్రాల అధికారులకు వివరించారు. వాస్తవ సాగుదారులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన మేరకు ఈ–క్రాపింగ్‌ను డిజైన్ చేసినట్లు తెలిపారు. ఈ–క్రాపింగ్ ప్రామాణికంగా సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో పాటు రైతు భరోసా కింద పెట్టుబడి సాయం, పంట రుణాలు, సున్నా వడ్డీ రాయితీ, పంట నష్ట పరిహారం, పంటల బీమా వంటి అన్ని పథకాలనూ అందిస్తున్నామన్నారు. గ్రామస్థాయిలో ఆర్బీకేల ద్వారా ధాన్యం, ఇతర పంటల కొనుగోళ్లను కూడా దీని ఆధారంగానే చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని పీఎంఎఫ్‌బీవైతో అనుసంధానించి అమలు చేయనున్నట్లు చెప్పారు. ఆర్బీకేలు, సచివాలయాల్లో ఉండే వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ సçహాయకులు సంయుక్తంగా ఈ–క్రాపింగ్ నమోదు చేసి, ప్రతి రైతుకు రశీదులు ఇస్తున్నారన్నారు. వివిధ రాష్ట్రాల అధికారుల సందేహాలను స్పెషల్ సీఎస్, కమిషనర్ నివృత్తి చేశారు. వందేళ్ల తర్వాత రాష్ట్రంలో సమగ్ర భూసర్వేకు సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారని వివరించారు. ఈ సర్వే పూర్తయితే భూముల సరిహద్దులు కచ్చితంగా నిర్ధారణ అవుతాయని, ఈ క్రాప్‌ను మరింత పక్కాగా ఇంటిగ్రేట్ చేయవచ్చని చెప్పారు. జాతీయ స్టీరింగ్ కమిటీలో తొలిసారి ప్రాతినిధ్యం కేంద్ర వ్యవసాయ పథకాలు, కార్యక్రమాల అమలుకు జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీలో ఆంధ్రప్రదేశ్‌కి ప్రాతినిధ్యం కల్పించారు. ఈ కమిటీలో ఓ రాష్ట్రానికి ప్రాతినిధ్యం కల్పించడం ఇదే తొలిసారి. ఈ కమిటీలో కేంద్ర వ్యవసాయ మంత్రి, కార్యదర్శులు, సంబంధిత కేంద్ర ప్రభుత్వ అధికారులే ఉంటారు. ఆంధ్రప్రదేశ్‌ని ఆదర్శంగా తీసుకొని ఈ–క్రాపింగ్‌ను అమలు చేస్తున్నందున ఏపీ వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్‌కు కూడా చోటు కల్పించారు. -
CM YS Jagan: ఈ కార్యక్రమాలను నేనే నేరుగా పర్యవేక్షిస్తా
వృద్ధిరేటులో ఏపీ టాప్‌లో నిలవడం సంతోషకరం.. దేశం కంటే అధికంగా నమోదైంది. పారదర్శక విధానాలే మూల కారణం.. ఈ వృద్ధి నిలకడగా కొనసాగాలి. – ‘స్పందన’పై సమీక్షలో సీఎం జగన్ సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ప్రాధాన్యత పనులకు రూ.3,000 కోట్లు కేటాయించామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ప్రాధాన్యత పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టడమే కాకుండా పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ పనులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గడప గడపకు మన ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు సూచించిన ప్రాధాన్యత పనులు, ఆర్బీకేలు, సచివాలయాలు, హెల్త్ క్లినిక్స్, ఉపాధి హామీ పనులు, స్పందన వినతుల పరిష్కారం తదితర అంశాలపై కలెక్టర్లకు మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే.. కలెక్టర్లూ పాల్గొనాలి.. గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యేలు, సచివాలయాల సిబ్బంది, వలంటీర్లు నేరుగా ప్రజల వద్దకు వెళ్తున్నారు. ఒక్కో సచివాలయం పరిధిలో కనీసం రెండు రోజులు పర్యటించి ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. ప్రజల నుంచి అందే వినతుల ఆధారంగా ప్రాధాన్యత పనులను గుర్తించి వాటిపై సంబంధిత ఎమ్మెల్యే విజ్ఞాపనలు పంపుతున్నారు. ఈ ప్రాధాన్యత పనులను పూర్తి చేసేందుకు ఒక్కో సచివాలయానికి రూ.20 లక్షలు కేటాయించాం. వీటిని చేపట్టేలా, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉంది. వేగంగా పనులు చేపట్టడమే కాకుండా వాటిని అంతే వేగంతో పూర్తి చేయాలి. నిర్ణీత కాల వ్యవధిలో పనులు పూర్తి చేయాలి. అప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. దాదాపు 15 వేల సచివాలయాల పరిధిలో ప్రాధాన్యతా పనుల కోసం రూ.3 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నాం. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో కలెక్టర్లు కూడా పాల్గొనాలి. దీనివల్ల అనుకున్న కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయడానికి, సమన్వయ పరచడానికి ఆస్కారం కలుగుతుంది. కలెక్టర్లు విధిగా ప్రతి నెలా ఆరు సచివాలయాలను సందర్శించాలి. ఈ కార్యక్రమాలను నేనే నేరుగా పర్యవేక్షిస్తా. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉపాధి పనుల్లో మంచి ప్రగతి ఉపాధి హామీ పనుల్లో మంచి ప్రగతి కనిపించింది. పనితీరు బాగుంది. ఉపాధి హామీలో మనం దేశంలో 2వ స్థానంలో ఉన్నాం. ఈ వేగం కొనసాగాలి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సగటున 117 శాతం పనిదినాల కల్పన జరుగుతోంది. రాష్ట్ర సగటు కన్నా తక్కువగా ఉన్న అన్నమయ్య, విజయనగరం, అనంతపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు ఉపాధి పనులపై దృష్టి పెట్టాలి. పనుల్లో నాణ్యత పెరగాలి. గ్రామాల రూపురేఖలను మార్చేస్తాయి.. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, హెల్త్ క్లినిక్స్ భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలి. ఇవి గ్రామాల స్వరూపాన్ని సమూలంగా మార్చేస్తాయి. ఈ పనులకు అత్యంత ప్రాధాన్యమిచ్చి వేగంగా, సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి. గ్రామ సచివాలయాల భవనాలు త్వరగా పూర్తి చేయడంపై కలెక్టర్లు శ్రద్ధ పెట్టాలి. ఆర్బీకేల భవన నిర్మాణ పనులను కూడా వేగవంతం చేయాలి. వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ పూర్తి చేయడంపైనా కలెక్టర్లు దృష్టి సారించాలి. వీటి నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఆర్బీకేలు, గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్ భవన నిర్మాణ పనులను అక్టోబరు 31 నాటి కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోవాలి. డిసెంబరు నాటికి 4,500 గ్రామాలకు ఫైబర్ ఆప్టిక్ కేబుల్ చేరుతుంది. మంజూరు చేసిన 3,966 గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీల నిర్మాణాన్ని డిసెంబర్ నెలాఖరునాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. వీటితోపాటు గ్రామాల్లో ఇంగ్లిషు మీడియం స్కూళ్లు ఉంటాయి. ఇవన్నీ గ్రామాల రూపురేఖలను సమూలంగా మారుస్తాయి. ప్రతి సచివాలయాన్నీ ఒక యూనిట్‌గా తీసుకుని పనులు పూర్తి చేయాలి. కలెక్టర్ల నుంచి మండల స్థాయి అధికారుల వరకూ కూడా వీటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. మొత్తం ఈ కార్యక్రమాలన్నింటినీ ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలి. రహదారులకు భూసేకరణపై దృష్టి రాష్ట్రంలో రహదారులకు సంబంధించి 99 ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి. 3,079 కిలోమీటర్ల మేర రూ.29,249 కోట్ల అంచనా వ్యయంతో పనులు సాగుతున్నాయి. అంతర్ రాష్ట్ర సరిహద్దుల అనుసంధానం కోసం మరో 7 ప్రాజెక్టులు కూడా చేపడుతున్నాం. డీపీఆర్ స్థాయిలో మరో 45 ప్రాజెక్టులు ఉన్నాయి. మొత్తంగా 151 ప్రాజెక్టుల కోసం దాదాపు రూ.92 వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నాం. ఈ ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో ఈ ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తాయి. స్పందన.. ఎవరెవరు ఎప్పుడంటే..? స్పందన వినతుల పరిష్కారంలో నాణ్యత చాలా ముఖ్యం. ఎలా పరిష్కరిస్తున్నారన్న దానిపై కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో రోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ స్పందన కార్యక్రమం కచ్చితంగా జరగాలి. సంబంధిత సిబ్బంది ఆ సమయంలో తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి. ప్రతి సోమవారం జిల్లా, డివిజన్, సబ్ డివిజన్, మండల స్థాయిల్లో కచ్చితంగా స్పందన నిర్వహించాలి. సంబంధిత అధికారులంతా పాల్గొనాలి. కలెక్టర్లు దీన్ని కచ్చితంగా అమలు చేసేలా చూడాలి. ప్రతి బుధవారం స్పందన వినతులపై కలెక్టర్లు సమీక్ష చేయాలి. ప్రతి గురువారం చీఫ్ సెక్రటరీ కలెక్టర్లతో స్పందనపై సమీక్షించాలి. అదే సమయంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన (ఎస్డీజీ) పైనా సమీక్ష చేపట్టాలి. లక్ష్యాలను చేరుకునేలా నిరంతరం పర్యవేక్షించాలి. స్పందన కార్యక్రమాన్ని నేనే నేరుగా పర్యవేక్షిస్తా. ఈ వృద్ధి నిలకడగా కొనసాగాలి 2021–22లో ఏపీ స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు 11.43 శాతంగా నమోదు కావడం సంతోషకరం. ఇది దేశ వృద్ధిరేటు కంటే అధికంగా ఉంది. కీలక రంగాలపై నిరంతర సమీక్ష, పర్యవేక్షణ ఉండాలి. పారదర్శక విధానాలే ఈ వృద్ధికి మూలకారణమని భావిస్తున్నా. కలెక్టర్లందరికీ అభినందనలు. మీ అందరి కృషి ఫలితమే దీనికి కారణం. కీలక రంగాలపై దృష్టి పెట్టడం వల్లే ఇది సాధ్యమైంది. ఈ వృద్ధి నిలకడగా కొనసాగాలి. ఎంఎస్ఎంఈ రంగానికి వెన్నుదన్నుగా నిలవాలి. ఆ రంగం నుంచి వచ్చిన ప్రతి విజ్ఞప్తిని సక్రమంగా పరిష్కరించాలి. ప్రతి పథకం ఎస్డీజీతో ముడిపడి ఉంటుంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాలి. వాటిని సక్రమంగా పర్యవేక్షిస్తే ఎస్డీజీ యధావిధిగా పెరుగుతుంది. ఈ స్పందన సమీక్షలో ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, గృహ నిర్మాణం, సచివాలయాలశాఖ స్పెషల్ సీఎస్ అజయ్‌జైన్, పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, రవాణా, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ప్లానింగ్ సెక్రటరీ విజయ్‌కుమార్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్
-
మూడేళ్లలో ఏడు కోట్ల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు
పనాజీ/సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జల్ జీవన్ మిషన్‌లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు ఇచ్చిన రాష్ట్రాలుగా తెలంగాణ, గోవా నిలిచాయి. గోవా గత మూడేళ్లలో 200 కోట్లకు పైగా ఖర్చుతో 2.63 లక్షల గృహాలకు కుళాయిల ద్వారా నీటి సౌకర్యం కల్పించింది. ఈ సందర్భంగా గోవా ప్రభుత్వం శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మూడేళ్లలో దేశవ్యాప్తంగా ఏడు కోట్ల కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు ఇచ్చామన్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో 10 కోట్ల గృహాలకు కుళాయి కనెక్షన్లు ఇచ్చిన మైలురాయిని చేరుకున్నట్టు వెల్లడించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను జరుపుకుంటున్న ఈ నేపథ్యంలో 52% కంటే ఎక్కువ గ్రామీణ కుటుంబాలకు సురక్షిత మంచినీరు అందుతోందని కేంద్ర జలశక్తి శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 2019 ఆగస్టు 15న ప్రధాని మోదీ జల్ జీవన్ మిషన్‌ను ప్రారంభించినప్పుడు గ్రామాల్లోని 3.23 కోట్ల (16.90%) కుటుంబాలకు మాత్రమే పైపు నీటి కనెక్షన్ అందుబాటులో ఉంది. తెలంగాణ సహా మూడు రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో 100% కవరేజీని కలిగి ఉన్నాయి. బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రాల జాబితాలో తెలంగాణ టాప్‌లో ఉంది. -
మీరు మంచి చేస్తున్నప్పుడు వెనకడుగు వేయాల్సిన అవసరంలేదు: సీఎం జగన్
-
ఎన్నడూలేని విధంగా సహాయ కార్యక్రమాలు చేస్తున్నాం : సీఎం జగన్
-
48 గంటల్లోపు ప్రతీ ఒక్కరికీ సాయం అందించాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వరదలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. సోమవారం ఉదయం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో వరద ప్రభావిత ఆరు జిల్లాల కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై సీఎం వైఎస్ జగన్ సమీక్షించారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు ఇవే.. వరద నీరు క్రమంగా తగ్గుముఖం పడుతోంది. సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేయాల్సి ఉంది. సీనియర్ అధికారులు, కలెక్టర్ల భుజాలమీద ఈ బాధ్యత ఉంది. వచ్చే 48 గంటల్లో ఏ ఇల్లుకూడా మిగిలిపోకుండా రూ.2వేల రూపాయల సహాయం అందాలి. అలాగే 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళాదుంపలు, కేజీ ఉల్లిపాయలు, కేజీ పామాయిల్.. వరద బాధిత కుటుంబాలకు వచ్చే 48 గంటల్లో అందాలి. ముంపునకు గురైన ప్రతీ గ్రామంలో పంపిణీని ముమ్మరం చేయాలి. కలెక్టర్లు, సీనియర్ అధికారులు దీన్ని సవాల్‌గా తీసుకోవాలి. గతంలో రెండు జిల్లాలకు ఇద్దరు కలెక్టర్లు, ఇద్దరు జాయింట్ కలెక్టర్లు, ఇద్దరు ఎస్పీలు మాత్రమే ఉండేవారు. కానీ ప్రస్తుతం కాకినాడతో కలుపుకుని ఆరుగురు కలెక్టర్లు, ఆరుగురు జేసీలు, ఆరుగురు ఎస్పీలు ఉన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ మీకు అందుబాటులో ఉంది. ప్రతీ సచివాలయంలో 10 మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రతీ 50 ఇళ్లకూ ఒక వాలంటీర్ ఉన్నారు. ఇలాంటి వ్యవస్థకు ఇప్పుడు మీకు అందుబాటులో ఉంది. కాబట్టి నాణ్యమైన సేవలు అందించాలి. సరుకుల పంపిణీని ముమ్మరం చేయాలి. ఇంతటి వ్యవస్థతో ఎప్పుడూ జరగని విధంగా సహాయ కార్యక్రమాలు చేస్తున్నాం. గతంలో ఎప్పుడూ కూడా రూ.2వేల ఆర్థిక సహాయం చేయలేదు. విరామం లేకుండా అవిశ్రాంతంగా పనిచేస్తున్నాం. అలాంటి వారిలో నైతిక స్థైర్యం దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు, ఈనాడు, టీవీ–5, ఆంధ్రజ్యోతి, పవన్‌కళ్యాణ్ వంటివారు బురదజల్లుతున్నారు. వీరంతా రాష్ట్రం ప్రతిష్ట, అధికారుల ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. కొందరికి రాజకీయ ప్రయోజనాలు చేకూర్చడానికి ఇలాంటి ప్రచారాలు వారు చేస్తారు. మీరు మంచి చేస్తున్నప్పుడు వెనకడుగు వేయాల్సిన అవసరంలేదు. ఇలాంటి వాటిని తిప్పికొట్టాలి. వదంతులను కూడా తిప్పికొట్టాలి. మీకు ఏం కావాలన్నా.. అన్నిరకాలుగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. నిధుల సమస్య లేనే లేదు. మీరు ప్రోయాక్టివ్‌గా ముందుకు వెళ్లండి. ఎలాంటి సమస్య ఉన్నా.. పరిష్కరించడానికి ఫోన్‌కాల్ చేస్తే చాలు. వచ్చే 48 గంటల్లో వరద బాధిత కుటుంబాలకు రేషన్, రూ.2వేల రూపాయలు అందించాలి. బాధిత కుటుంబాలతో మానవతా దృక్పథంతో వ్యవహరించండి. ఇప్పటివరకూ ఒక్కరు మాత్రమే మరణించినట్టుగా సమాచారం ఉంది. బాధిత కుటుంబానికి వెంటనే పరిహారం అందించండి. ఎక్కడ అవసరం ఉంటే.. అక్కడ శిబిరాలు కొనసాగించండి. మంచి ఆహారం.. తాగునీరు అందించండి. పారిశుద్ధ్యం ఉండేలా చూసుకోండి. వరద తగ్గగానే పంట నష్టంపై అంచనాలు వేయాలి. వరద తగ్గుముఖం పట్టిన వెంటనే 10 రోజుల్లో పంట, ఆస్తి నష్టాలపై అంచనాలు పూర్తిచేయాలి. గర్భవతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. వారిని ఆస్పత్రులకు తరలించండి. వైద్యాధికారులు,స్పెషలిస్టులు అందుబాటులో ఉండేలా చూసుకోండి. వరదల కారణంగా అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఉంటాయి. అలాంటివి లేకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఆస్పత్రుల్లో సరిపడా సిబ్బంది, మందులు ఉండేలా చూసుకోవాలి. రక్షిత తాగునీటి సరఫరాను అవసరమైన ప్రాంతాలకు కొనసాగించండి. క్లోరినేషన్ కొనసాగించాలి. అన్ని మంచినీటి పథకాలను ఒక్కసారి పరిశీలించండి. పక్కజిల్లాల నుంచి వరద బాధిత ప్రాంతాలకు పారిశుద్ధ్య సిబ్బందిని తరలించాలని ఆదేశించారు. ఇతర జిల్లాలకు తరలించేటప్పుడు సిబ్బందికి వసతి, భోజన సదుపాయాలు లోటు రాకుండా చూసుకోవాలి. పంచాయతీరాజ్, మున్సిపల్‌శాఖల విభాగాధిపతులు దీనిపై దృష్టిసారించాలి. గోదావరి కట్టలు బలహీనంగా ఉన్నచోట ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. పెట్రోలింగ్ నిరంతరం కొనసాగాలి. గట్లు, కాల్వలకు ఎక్కడ గండ్లుపడ్డా వెంటనే వాటిని పూడ్చివేయాలి. పశువులకు పశుగ్రాసం, దాణా అందేలా చూడాలి. పశు సంపదకు నష్టం వాటిల్లితే వాటి నష్టంపై అంచనావేయాలి. వరద బాధిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ, మరమ్మతు పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. వచ్చే 48 గంటల్లో ఈ మస్యను పరిష్కరించాలి. అనేక స్కూల్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో శిబిరాలు నిర్వహిస్తున్నారు. వీటిని తిరిగి అప్పగించేటప్పుడు పరిశుభ్రంగా అందించాలి అని ఆదేశించారు. ఇది కూడా చదవండి: వరద బాధితులకు అండగా నిలిచిన సర్కార్..హెలికాప్టర్ల ద్వారా ఆహార పంపిణీ -
ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పై కేంద్రం వీడియో కాన్ఫరెన్స్
-
అజాదీకా అమృత్ మహోత్సవ్: వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: స్వాతంత్ర దినోత్సవ 75 ఏళ్ల వేడుకల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన అజాదీకా అమృత్ మహోత్సవ్ వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్రం నుంచి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: సీఎం జగన్ ఆదేశాలు.. మంత్రులు ఏరియల్ సర్వే -
రాబోయే 24 గంటలు చాలా కీలకం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: గోదావరి వరదలు..సహాయ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నాం ఏరియల్సర్వే తర్వాత ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్సీలు ఇతర అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వరద ప్రభావిత జిల్లాలకు ఒక్కో సీనియర్ అధికారి నియమించారు. రాబోయే 24 గంటలు చాలా కీలకం.. హైఅలర్ట్‌గా ఉండాలని గోదావరి వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను సీఎం జగన్ ఆదేశించారు. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు సహా పలు జిల్లాల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో వరద పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలపై సమీక్షలో చర్చించారు. ముంపు గ్రామాలు, వరద బాధితులకోసం ఏర్పాటు చేసిన శిబిరాలు, అందుతున్న సౌకర్యాలు, నిత్యావసరాల సరఫరా, అత్యవసర సేవలు, వైద్య సేవలు, మందులు తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రభుత్వానికి చెందిన వివిధ విభాగాలకు చెందిన సీనియర్ అధికారులతోనూ చర్చించిన సీఎం జగన్.. వరద ప్రభావిత జిల్లాల్లో సహాయ కార్యక్రమాల పర్యవేక్షణకు ఒక్కో సీనియర్ అధికారిని నియమించాలని ఆదేశించారు. ఏ జిల్లాకు ఎవరంటే.. సీఎం జగన్ ఆదేశాల మేరకు.. అల్లూరి సీతారామరాజు జిల్లాకు కార్తికేయ మిశ్రా, తూర్పుగోదావరి జిల్లాకు అరుణ్‌కుమార్, డా. బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాకు ప్రవీణ్‌కుమార్, ఏలూరు జిల్లాకు కాటమనేని భాస్కర్లను నియమించారు. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలనుంచి ఎలాంటి సహాయంకోసం కోరినా యుద్ధ ప్రాతిపదికిన వారికి అందించేలా చూడాలని అన్ని విభాగాల సీఎస్‌లకు సహా అన్ని విభాగాల కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎంవో కార్యదర్శులు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటారని, గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. రేపుకూడా(శనివారం) గోదావరి నీటిమట్టం పెరిగే అవకాశాలు ఉండడంతో.. లంక గ్రామాలపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాలని సూచించారాయన. వరద ప్రభావం గ్రామాలపై ఫోకస్ గోదావరి గట్లకు ఆనుకుని ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. గట్లు బలహీనంగా ఉన్నచోట గండ్లు లాంటివి పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన పక్షంలో తగిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఇసుక బస్తాలు తదితర సామాగ్రిని సిద్ధం చేయాలని తెలిపారు. వీలైనన్ని ఇసుక బస్తాలను గండ్లుకు ఆస్కారం ఉన్న చోట్ల ముందస్తుగా ఉంచాలని సూచించారు. ముంపు మండలాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ‘‘వరద బాధితులకు ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలి. బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచాలి. ప్రతి కుటుంబానికీ 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళాదుంపలు, కిలో పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, పాలు అందించాలి. వచ్చే 48 గంటల్లో వరద ప్రభావిత కుటుంబాలకు వీటిని చేర్చాలి. సహాయ శిబిరాల్లో ఉంచే ప్రతి కుటుంబానికీ కూడా రూ.2వేల రూపాయలు ఇవ్వాలి. రాజమండ్రిలో 2 హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నాయి. అత్యవసర సర్వీసులకోసం, పరిస్థితిని సమీక్షించేందుకు ఆ హెలికాప్టర్లను వినియోగించుకోండి. గ్రామాల్లో పారిశుధ్య సమస్యరాకుండా, తాగునీరు కలుషితం రాకుండా తగిన చర్యలు తీసుకోవాలి. అత్యవసర మందులను అందుబాటులో ఉంచుకోవాలి. పాముకాటు కేసులు పెరిగే అవకాశం ఉన్నందున సంబంధిత ఇంజెక్షన్లను కూడా ఆయా ఆరోగ్యకేంద్రాల్లో సిద్ధంగా ఉంచాలి. వరద బాధితులకోసం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాల్లో అందించే సేవలు నాణ్యంగా ఉండాలి. కమ్యూనికేషన్ వ్యవస్థకు అంతరాయం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. సెల్‌టవర్లకు డీజీల్ సరఫరాచేసి.. నిరంతరం అవి పనిచేసేలా చూడండి’’ అని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ చదవండి: సీఎం జగన్ ఏరియల్ సర్వే.. ప్రభావిత జిల్లాలకు ఒక్కో సీనియర్ అధికారి -
వర్షాలు వరదలపై కాసేపట్లో సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
స్పందన కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం వైఎస్ జగన్
-
పొరపాట్లను స్పందనతో సరిదిద్దుకునే అవకాశం
సాక్షి, అమరావతి: విధి నిర్వహణలో దొర్లే పొరపాట్లను సరిదిద్దుకునే అవకాశాన్ని స్పందన కార్యక్రమం కల్పిస్తోందని, స్పందన అర్జీల పరిష్కారంపై అన్ని స్థాయిల్లో అధికార యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. బుధవారం ఉన్నతాధికారులతో స్పందన వీడియో కాన్ఫరెన్స్‌లో భాగంగా అర్జీల పరిష్కారం, సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధనపై సీఎం దిశా నిర్దేశం చేశారు. స్పందనను మనమే స్వచ్ఛందంగా చేపడుతున్నామని గుర్తు చేస్తూ సమస్యలను పరిష్కరించాలన్న తపన ఉండాలని సూచించారు. దేశవ్యాప్తంగా ఐఏఎస్‌లు, ఇతర ఉన్నతాధికారులంతా మన ఎస్డీజీ సూచికల వైపే చూస్తున్నారని ప్రస్తావిస్తూ మన కలెక్టర్లు దేశంలోనే అత్యుత్తమమని గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. తనిఖీల ఫొటోల అప్లోడ్ రోజూ సచివాలయాల పరిధిలో మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకూ స్పందన కార్యక్రమాన్ని చేపట్టాలి. జిల్లా, డివిజన్, మండలాల స్థాయిలో స్పందన ప్రతి సోమవారం నిర్వహించాలి. ఈ సమయంలో సంబంధిత అధికారులు కచ్చితంగా ఉండాలి. సంబంధిత అధికారులు స్పందన సమయంలో ఉంటున్నారా? లేదా? అన్నదానిపై సమీక్ష చేస్తాం. స్పందన సమయంలో అధికారులు లేకుంటే అర్జీల పరిష్కారంలో నాణ్యత ఉండదు. స్పందన పోర్టల్‌లో దీనిపై మార్పులు చేర్పులు చేస్తున్నాం. అర్జీలపై క్షేత్రస్థాయిలో జరిపే విచారణలు, తనిఖీలకు సంబంధించిన ఫొటోలను పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. ఈ సమయంలో ఫిర్యాదుదారు కచ్చితంగా ఉండాలి. అర్జీపై అధికారులు ఫిర్యాదుదారుతో కలసి ఫీల్డ్ ఎంక్వైయిరీ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. తన సమస్యను పట్టించుకున్నారన్న తృప్తి అర్జీదారుకి ఉంటుంది. పౌర సమస్యలకు సంబంధించి ఫీల్డ్ ఎంక్వైరీ ఫొటోలే కాకుండా సమస్య పరిష్కరించిన తర్వాత కూడా ఫొటోలు తీసి అప్లోడ్ చేయాలి. సమస్యల పరిష్కారంపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి గడప గడపకూ.. కార్యక్రమం కింద ప్రతి ఎమ్మెల్యే నెలలో 10 సచివాలయాలను సందర్శిస్తున్నారు. ప్రతి ఎమ్మెల్యే ఇంటింటికీ వెళ్తున్నారు. ప్రభుత్వం చేసిన కార్యక్రమాలే కాకుండా ప్రజల సమస్యలనూ తెలుసుకుంటారు. సచివాలయ సిబ్బంది, వలంటీర్లతో కలిసి సమస్యలు తెలుసుకుంటారు. ఇది పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమం. ప్రతి ఇంటికి చేకూరిన లబ్ధిని తెలియజేస్తారు. ఎమ్మెల్యేల వద్దకు వచ్చే సమస్యలను పరిష్కరించడంపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి. మీ పనితీరే.. నా పనితీరు, మనందరి పనితీరు మహిళా, శిశు సంక్షేమాన్ని తీసుకుంటే గోరుముద్ద, సంపూర్ణ పోషణ కార్యక్రమంపై పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతున్నాం. గతంలో రూ.500 – రూ.600 కోట్లు ఖర్చు పెడితే ఇప్పుడు మనం రూ.1800 – రూ.1900 కోట్లు వెచ్చిస్తున్నాం. దీన్ని సమర్ధంగా వివరించాల్సిన అవసరం ఉంది. విద్య, వైద్య రంగాల్లో చేపడుతున్న పనులను మరింత విస్తృతంగా ప్రచారం చేయాలి. మూడేళ్లలో నేరుగా నగదు బదిలీతో పారదర్శకంగా రూ.1.41 లక్షల కోట్లు లబ్ధిదారులకు అందించాం. ఈ స్థాయిలో డీబీటీ మరే రాష్ట్రంలోనూ లేదు. ఒక్క బటన్ నొక్కడం ద్వారా ఎలాంటి వివక్షకు తావులేకుండా అందించాం. జాతీయ స్థాయిలో ప్రత్యేక ముద్ర వేయగలిగాం. దేశవ్యాప్తంగా ఐఏఎస్‌లు, ఉన్నతాధికారులంతా మన ఎస్డీజీ సూచికల వైపే చూస్తున్నారు. వీటన్నింటితో మన కలెక్టర్లు దేశంలోనే ఉత్తమమని గుర్తింపు పొందాలి. మీరే నా కళ్లూ, చెవులు. మీ పనితీరే .. నా పనితీరు, మనందరి పనితీరు. మరింత సమర్థంగా.. స్పందన చాలా ప్రాధాన్యం కలిగిన కార్యక్రమం. దీన్ని మరింత సమర్థంగా, మెరుగ్గా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నాం. దీనికి సంబంధించి సీఎస్ ఇప్పటికే జీవో ద్వారా మార్గదర్శకాలు స్పష్టంగా తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ) సాధన చాలా ముఖ్యమైన అంశం. స్పందన, ఎస్డీజీల ఆధారంగా మీ పనితీరు మదింపు ఉంటుంది. -
కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ సమీక్ష
-
కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ సమీక్ష
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో బుధవారం స్పందన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్పందన ఫిర్యాదులతో పాటు ఇళ్ళ పట్టాలు, ఇళ్ళ నిర్మాణం ప్రగతిపై సీఎం సమీక్షించారు. ఖరీఫ్ సన్నద్ధతపై, గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్, అర్బీకేల నిర్మాణాలపై అధికారులను ఆయన దిశానిర్దేశం చేశారు. శాశ్వత భూ హక్కు-భూరక్షపై సమీక్ష కూడా నిర్వహించి.. స్పందన ఫిర్యాదుల పరిష్కారంపై అడిగి తెలుసుకోనున్నారు. వీటితో పాటు ఇరిగేషన్, జాతీయరహదారుల భూసేకరణపైనా సమీక్షించారు. పేదలందరికీ ఇళ్ల పథకం, ఉపాధిహామీ పనులు, విద్య, వైద్యరంగాల్లో నాడు–నేడు పనులపైన కూడా సీఎం ఉన్నతాధికారులతో చర్చించారు. -
ఉన్నతాధికారులతో సీఎం ‘స్పందన’
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందన కార్యక్రమం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో పలు అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. ప్రధానంగా ఖరీఫ్ సీజన్‌కు అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేశారు. పేదలందరికీ ఇళ్ల పథకం, ఉపాధి హామీ పనులు, విద్య, వైద్యరంగాల్లో నాడు–నేడు పనులపైన కూడా సీఎం ఉన్నతాధికారులతో చర్చించారు. -
ఐదేళ్ల తరువాత నిరవధిక విచారణ
బనశంకరి: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు పాత్రికేయురాలు గౌరీలంకేశ్ హత్య కేసులో విచారణ పునఃప్రారంభం కానుంది. సుమారు ఐదేళ్ల కిందట... సెప్టెంబరు 05, 2017 రాత్రి గౌరీలంకేశ్ ఆఫీసు నుంచి రాజరాజేశ్వరినగరలో ఇంటికి చేరుకున్న సమయంలో దుండగులు ఆమెను పిస్టల్‌తో కాల్పులు జరిపి హత్య చేశారు. ఈ కేసులో 17 మంది నిందితులు ఉన్నారు. కుట్రదారు అమోల్ కాళే, కాల్పులు జరిపిన పరశురామ్ వాగ్మోరా, బైక్ నడిపిన గణేశ్ మిస్కిన్ తో పాటు 17 మంది విచారణ ఎదుర్కొంటున్నారు. వీరి తరఫున 60 మందికి పైగా న్యాయవాదులు వాదిస్తున్నారు. పోలీసులు దర్యాప్తును పూర్తిచేసి పలు చార్జిషీట్లను దాఖలు చేశారు. మతాన్ని కించపరచడమే హత్యకు కారణంగా ప్రకటించారు. ప్రతి రెండోవారంలో ఐదు రోజులు కేసు విచారణ చేపట్టిన ప్రత్యేక కర్ణాటక నేరాల నియంత్రణ చట్టం (కేసీఓసీఏ– కోకా) కోర్టు న్యాయమూర్తి సీఎం.జోషి శనివారం మార్గదర్శకాలను నిర్ణయించారు. విచారణ కొన్ని వారాల పాటు జరుగుతుంది. నెలలో ప్రతి రెండోవారంలో ఐదురోజుల పాటు విచారిస్తారు. తొలుత జూలై 4 నుంచి జూలై 8 వరకు వాదనలు నిర్వహిస్తామని న్యాయమూర్తి జోషి తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ విధానంలో భౌతికస్థితిలోనే విచారణ జరపాలని నిందితుల తరఫు లాయర్లు కోరగా, జడ్జి ఏకీభవించలేదు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ సాగుతుందని తెలిపారు. నిందితులు కొందరు బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో, మరికొందరు ముంబైలోని ఆర్ధర్ రోడ్ జైలులో ఉన్నారు. న్యాయవాదులు నిందితులను ఫోన్ ద్వారా సంప్రదించవచ్చని జడ్జి సూచించారు. (చదవండి: ట్రాఫిక్ జామ్‌పై నెటిజన్ వింత పోస్ట్.. వైరల్‌గా మారి నెట్టింట రచ్చ) -
అమలాపురం ఘటన.. డీఐజీ, ఎస్పీలతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, విజయవాడ: కోనసీమ జిల్లాలో పరిస్థితిపై డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరా తీశారు. ఏలూరు రేంజ్ డీఐజీ, ఎస్పీలతో బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అమలాపురంలో పరిస్థితిని డీఐజీ, ఎస్సీలు సమీక్షిస్తున్నారు. అమలాపురం ఘటనలో ఏడు కేసులు నమోదు చేశామని.. ఇప్పటికే 46 మందిని అరెస్ట్ చేశామని డీజీపీ తెలిపారు. రౌడీషీటర్లను అదుపులోకి తీసుకున్నామన్నారు. 3 బస్సుల దగ్ధంపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేశామన్నారు. చదవండి: అంబేడ్కర్ పేరుపై అగ్గి రాజేసిన 'కుట్ర'! -
‘అసని’పై అప్రమత్తం
లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరినీ ఖాళీ చేయించి.. సహాయ, పునరావాస కేంద్రాలకు తరలించాలి. వారికి భోజనం, వసతితో సహా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలి. బాధితుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. వారు ఇంటికి వెళ్లేటప్పుడు ఒక్కొక్కరికి రూ.1,000, కుటుంబానికి రూ.2 వేలు చొప్పున సాయం అందించాలి. ఈ సొమ్ము వారి ఇళ్లు బాగు చేసుకోవడానికి, తక్షణ అవసరాలకు ఉపయోగపడుతుంది. తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్న ఏడు జిల్లాల్లో ఈ ఏర్పాట్లు చేయాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: అసని తుపాను నేపథ్యంలో జిల్లాల అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. బాపట్ల, కృష్ణా, పశ్చిమగోదావరి, కోనసీమ, కాకినాడ, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు కోస్తా తీర ప్రాంతాల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తుపాను నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం ఉదయం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 18 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. ఒక్క మరణం కూడా సంభవించకుండా కలెక్టర్లు, ఎస్పీలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే అవసరమైన నిధులు విడుదల చేశామని, అవసరమైన మేర ఖర్చు చేసుకోవచ్చని చెప్పారు. ఈ విషయంలో వెనుకాడవద్దని స్పష్టం చేశారు. బాధితులకు పరిహారం ఇచ్చే విషయంలో ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. తీర ప్రాంతాలపై దృష్టి సారించాలి ► నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, ఏలూరు, తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలపై తుపాను ప్రభావం ఉంటుంది. ఈ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధానంగా కోస్తా తీర ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉంటూ ముందస్తు చర్యలు తీసుకోవాలి. ► కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలి. వారికి భోజనంతో పాటు అవసరమైన సౌకర్యాల కల్పనలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. ఇప్పటికే 454 చోట్ల సహాయ, పునరావాస కేంద్రాలను గుర్తించినప్పటికీ, ఇంకా అవసరమైన చోట్ల మరిన్ని పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలి. నిత్యావసరాలను సిద్ధం చేసుకోండి ► సహాయ, పునరావాసానికి ఉపయోగపడే డీజిల్ జనరేటర్లు, జేసీబీల వంటి వాటిని సిద్ధం చేసుకోవాలి. బియ్యం, పప్పులు, వంట నూనెలు తదితర నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచుకోవాలి. ప్రభుత్వ విభాగాల వారీగా సహాయ చర్యల కోసం సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. ► ప్రభుత్వ శాఖలు పరస్పర సహకారంతో పని చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మరణాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గాలుల వేగం గంటకు 30 నుంచి 80 కిలోమీటర్లు వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా నమోదవుతాయన్న సూచనలు కూడా ఉన్నాయి. ► ఈ దృష్ట్యా కలెక్టర్లు అందరూ జాగ్రత్తగా ఉండాలి. అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. త్వరితగతిన సహాయ పునరావాస చర్యలు చేపట్టాలి. పునరావాస కేంద్రాలను సక్రమంగా నిర్వహించాలి. ప్రతి ఒక్కరూ పునరావాస కేంద్రాలను తప్పనిసరిగా సందర్శించాలి. తీరం దాటే సమయంలో జాగ్రత్తలు తప్పనిసరి ► కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కాకినాడ ప్రాంతాలకు మధ్యాహ్నానికి (బుధవారం) తుపాను తాకే అవకాశం ఉంది. సాయంత్రానికి విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలపైనా ప్రభావం చూపిస్తుంది. రాత్రికి తీరం దాటి బలహీనపడే సమయంలో అధికారులందరూ మరింత అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలి. బాధితులకు హెల్ప్ లైన్ ఏర్పాటు పక్కాగా ఉండాలి. ఉప్పాడ రోడ్డుకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేయాలి. (ఇందుకోసం చెన్నై ఐఐటీ నిపుణులతో మాట్లాడి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేస్తున్నామని అధికారులు తెలిపారు.) ► ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ) బూడి ముత్యాలనాయుడు, హోం, డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ మంత్రి తానేటి వనిత, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు(రాజా), సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ సీఎస్ జి సాయి ప్రసాద్, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, గృహ నిర్మాణ శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, రవాణా, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టర్ అంబేడ్కర్ పాల్గొన్నారు. -
హై అలర్ట్‌గా ఉండాలి.. సీఎం జగన్ అత్యవసర వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, అమరావతి: తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సహాయక చర్యలపై సమీక్ష జరిపారు. ఇప్పటికే తొమ్మిది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను జిల్లాలకు ప్రభుత్వం పంపింది. తుపాను నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం ఆదేశాలు జారీ చేశారు. తుపాను నేపథ్యంలో హై అలర్ట్‌గా ఉండాలన్నారు. ఇప్పటికే మీకు నిధులు ఇచ్చామని, తుపాను తీరం వెంబడి ప్రయాణిస్తోంది కాబట్టి తీర ప్రాంతాల్లో మరింత అప్రమత్తం అవసరమని’’ కలెక్టర్లు, అధికారులకు సీఎం సూచించారు. చదవండి: అసని తుపాను ఎఫెక్ట్.. 37 రైళ్లు రద్దు.. వివరాలు ఇవే.. ‘‘కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుపాను బలహీనపడటం ఊరటనిచ్చే అంశం. అయినా ఎక్కడా నిర్లక్ష్యానికి తావు ఉండకూడదు. ప్రజలకు ఎలాంటి ముప్పు రాకుండా చూడాలి. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి. అవసరమైన చోట సహాయపునరావాస శిబిరాలను తెరవండి. సహాయ శిబిరాలకు తరలించిన ఒక వ్యక్తికి రూ.వెయ్యి, కుటుంబానికి రూ.2వేల చొప్పున ఇవ్వండి. సహాయ శిబిరాల్లో మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయండి. జనరేటర్లు, జేసీబీలు.. ఇవన్నీకూడా సిద్ధంచేసుకోండి. కమ్యూనికేషన్ వ్యవస్థకు అంతరాయం ఏర్పడితే వెంటనే చర్యలు తీసుకోవాలని’’ సీఎం అన్నారు. ‘‘తుపాను బాధితుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించండి. వారికి ఎలాంటి కష్టం వచ్చినా వెంటనే ఆదుకోవాలి. పరిహారం ఇచ్చే విషయంలో ఎలాంటి సంకోచాలు పెట్టుకోవద్దు. సెంట్రల్ హెల్ప్ లైన్‌తో పాటు, జిల్లాల వారీగా హెల్ప్‌లైన్ నంబర్లు సమర్థవంతగా పనిచేసేలా చూడాలి. వచ్చే కాల్స్ పట్ల వెంటనే స్పందించండి. ఈ నంబర్లకు బాగా ప్రచారం కల్పించాలని’’ సీఎం పేర్కొన్నారు. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. అసని తుపాను ప్రభావంతో విశాఖ, తుర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలలో భారీ వర్షాలు పడనున్నాయి. విశాఖపై అసని తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఏపీ తీర ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మొహరించారు. తీర ప్రాంత మండలాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. మరోవైపు పలువురు మంత్రులు అసని తుపాను ప్రభారంపై ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. సహాయక చర్యల కోసం సిద్ధంగా ఉండాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. చదవండి: ‘అసని’ తుపాను తెచ్చిన ‘బంగారు’ మందిరం కంట్రోల్ రూమ్ నంబర్లు కాకినాడ కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్: 18004253077 కాకినాడ ఆర్డీవో ఆఫీస్ కంట్రోల్ రూమ్ నంబర్: 0884-2368100 శ్రీకాకుళం: 08942-240557 తూర్పు గోదావరి: 8885425365 ఏలూరు కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్: 18002331077 విజయనగరం: 08922-236947 పార్వతీపురం మన్యం: 7286881293 మచిలీపట్నం కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్: 08672 252572 మచిలీపట్నంం ఆర్డీవో ఆఫీస్ కంట్రోల్ రూమ్ నంబర్: 08672 252486 బాపట్ల కంట్రోల్ రూమ్ నంబర్: 8712655878, 8712655881 ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్: 90103 13920 విశాఖ: 0891-2590100,102 అనకాపల్లి: 7730939383 -
కరోనాపై మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎం జగన్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న తరుణంలో కేంద్రం అప్రమత్తమైంది. అందులో భాగంగానే కోవిడ్‌పై తాజా పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మోదీ మాట్లాడుతూ.. ‘‘కొద్ది రోజులుగా దేశంలో కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే దేశంలో కోవిడ్ సంక్షోభాన్ని పూర్తి స్థాయిలో ఎదుర్కొన్నప్పటికీ కేసులు పెరుగుతుండటం ఆందోళనకర అంశం. మనమంతా అప్రమత్తంగా ఉండాలి. కోవిడ్ సవాలును అధిగమించాలి. ఈ విషయంలో కేంద్రం, రాష్ట్రం మధ్య సమన్వయం చాలా ముఖ్యం.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మన దేశ వయోజన జనాభాలో 96% మంది మొదటి డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తైంది.’’ అని అన్నారు. కాగా, తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. -
మనం ప్రజా సేవకులం
సాక్షి, అమరావతి: మనం బాస్‌లం కాదు.. ప్రజా సేవకులమనే విషయాన్ని నిరంతరం దృష్టిలో ఉంచుకోవాలని అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి పట్ల మరింత బాధ్యతగా వ్యవహరించేందుకే 26 జిల్లాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజల సమస్యల పట్ల మరింత మానవీయ దృక్పథంతో ఉండాలని, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని సూచించారు. కొత్త జిల్లాల్లో బాధ్యతలు స్వీకరించిన అధికార యంత్రాగానికి తానిచ్చే సలహా ఇదేనని కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలనుద్దేశించి ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ‘స్పందన’లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మరింత మెరుగ్గా స్పందన కార్యక్రమం అమలుతోపాటు ఉపాధి హామీ, కలెక్టర్లు, ఎస్పీలు, జేసీల పనితీరు మదింపునకు సంబంధించి సీఎం జగన్ మార్గనిర్దేశం చేశారు. ఆ వివరాలివీ.. వివిధ స్థాయిల్లో పర్యవేక్షణ స్పందన అర్జీల పరిష్కారంపై వివిధ స్ధాయిల్లో పర్యవేక్షణ జరగాలి. సచివాలయం నుంచి మండల స్ధాయి, జిల్లా స్ధాయి వరకు వివిధ దశల్లో పర్యవేక్షణ ఉండాలి. ప్రస్తుతం జిల్లాల పరిణామం తగ్గింది.స్పందన అర్జీల పరిష్కారంలో నాణ్యత అత్యంత ముఖ్యం. మా కలెక్టర్ బాగా పనిచేస్తున్నారని ప్రజలు చెబుతున్నారంటే అర్జీలు నాణ్యతతో పరిష్కారమైనట్లే. ప్రధానంగా నాలుగైదు అంశాలపై కలెక్టర్లు దృష్టి సారించాలి. నిర్దేశిత కాలపరిమితిలోగా పరిష్కరించాలి. నిర్ణీత సమయానికి మించి పెండింగ్‌లో పెట్టకూడదు. ఒకే సమస్యపై తిరిగి రెండోసారి అర్జీ వస్తే కలెక్టర్ దృష్టికి రావాలి. ఈసారి అదే అధికారితో కాకుండా ఆపై అధికారితో అర్జీని పరిష్కరించాలి. నాణ్యతతో పరిష్కరించలేకపోతే మొత్తం ప్రక్రియ అంతా అర్థంలేనిది అవుతుంది. గ్రామ సచివాలయాల దగ్గర నుంచి అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి ఉండాలి. మనం సక్రమంగా చేస్తున్నామా? లేదా? అన్నది పరిశీలించుకోవాలి. అర్జీలను పరిష్కరిస్తున్న విధానాన్ని పరిశీలించేందుకు జిల్లా, డివిజన్, మండలాల స్థాయిలో ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ తప్పనిసరి. ఆయా స్ధాయిల్లో వారానికి ఒకసారి అర్జీల పరిష్కారానికి సమయం కేటాయించాలి. ఆ విధులను మరొకరికి అప్పగించరాదు. వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇతరులకు అప్పగించొద్దు.. స్పందనపై కలెక్టర్ల మార్కు కచ్చితంగా ఉండి తీరాలి. ఇది మీ కార్యక్రమం.. మీరు మాత్రమే దీనిపై దృష్టి సారించాలి. ఇతరులకు అప్పగించొద్దు. మీరే స్వయంగా పర్యవేక్షించండి. కలెక్టర్లు సక్రమంగా వ్యవహరిస్తేనే స్పందన విజయవంతం అవుతుంది. సచివాలయాల్లో రోజూ మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు స్పందన నిర్వహిస్తున్నారు. అలా ఎవరైనా నిర్వహించకుంటే సంబంధిత నివేదికలు తెప్పించుకుని పరిశీలించాలి. అర్జీలు తీసుకున్న రోజే రశీదు ఇచ్చి మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. అర్జీపై విచారణ జరుగుతున్నప్పుడు పిటిషనర్‌ను ఈ ప్రక్రియలో భాగస్వామిగా చేయాలి. క్షేత్రస్థాయి విచారణ సమయంలో తప్పనిసరిగా పిలవాలి. ఫొటో తీసి పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. తమ సమస్యను పట్టించుకుంటున్నారనే భరోసా పిటిషనర్‌కు కలుగుతుంది. అర్జీని పరిష్కరిస్తున్నామా? తిరస్కరిస్తున్నామా? అన్నది తెలియజేయాలి. దృష్టి సారిస్తే మరింత సమర్థంగా.. సచివాలయాలపై ఎంత దృష్టి పెడితే అంత సమర్థంగా పనిచేస్తాయి. కలెక్టర్లు, జేసీలు వారానికి రెండు సచివాలయాల్లో పర్యటించాలి. మిగతా అధికారులు వారానికి కనీసం నాలుగు సచివాలయాలను సందర్శించాలి. సచివాలయ సిబ్బంది పనితీరును పరిశీలించాలి. మీరు వెళ్లినప్పుడు వచ్చే నెలలో పథకాలకు సంబంధించి లబ్ధిదారుల జాబితాను సోషల్ ఆడిట్ చేశారా.. లేదా? అన్నది పరిశీలించాలి. అంతకు ముందు నెలలో అమలైన పథకానికి సంబంధించి మిగిలిపోయిన అర్హులు మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలి. మూడు నెలలు ముమ్మరంగా ‘ఉపాధి’.. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఉపాధిహామీ పనులను ముమ్మరంగా చేసేందుకు అవకాశం ఉంటుంది. నిర్దేశించుకున్న లక్ష్యంలో కనీసం 60 శాతం పనులను ఈ మూడు నెలల్లోనే పూర్తి చేసేలా కలెక్టర్లు దృష్టి సారించాలి. ఏప్రిల్‌లో 250 లక్షల పనిదినాలను లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇప్పటికే 185 లక్షల పనిదినాలు చేశాం. మిగిలినవి వేగంగా చేపట్టాలి. లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రతి జిల్లాలో రోజూ కనీసం లక్ష పని దినాలు చేయాలి. నెలలో కనీసం 25 లక్షల పని దినాలను ప్రతి జిల్లాలో చేపట్టాలి. కలెక్టర్లు విస్తృతంగా పర్యటించి సమీక్షిస్తూ లక్ష్యాలను సాధించాలి. కలెక్టర్లు, జేసీలు, పీడీలు, ఎంపీడీఓలు.. ప్రతి అధికారీ దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. బిల్లులు క్లియర్.. సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్.. భవనాల నిర్మాణాలకు సంబంధించిన బిల్లులను క్లియర్ చేశాం. ఈ నెలలో కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలను సాధించేలా ప్రయత్నాలు చేస్తున్నాం. నెలాఖరులోగా డబ్బులు వచ్చే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఉపాధి హామీ నిధులను ఈ నెలాఖరులోగా తెచ్చేలా అధికారులు ప్రయత్నిస్తున్నారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్స్, డిజిటల్ లైబ్రరీలు.. అన్నింటినీ పూర్తి చేయాలి. కంపెనీల నుంచి సిమెంట్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షణకు కలెక్టర్లు నోడల్ అధికారిని నియమించాలి. సిమెంట్, స్టీలు, ఇసుక, మెటల్ సరఫరా సవ్యంగా సాగేలా నోడల్ అధికారికి బాధ్యతలు అప్పగించాలి. దీనిపై కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి సచివాలయం పరిధిలో మరోసారి పునఃపరిశీలన చేసి భవనాల నిర్మాణం పూర్తయ్యేలా చూడాలి. డిసెంబర్ నాటికి 4,545 డిజిటల్ లైబ్రరీల నిర్మాణం పూర్తి కావాలి. అదే సమయానికి ఇంటర్నెట్ కేబుల్ కూడా సంబంధిత గ్రామాలకు సమకూరుతుంది. తద్వారా గ్రామాల్లోనే వర్క్‌ఫ్రం హోమ్ అందుబాటులోకి వస్తుంది. ప్రగతి ఆధారంగా పనితీరు మదింపు ఏడు రకాల ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రగతి ఆధారంగా కలెక్టర్లు, జేసీల పనితీరును మదింపు చేస్తాం. ఇళ్ల నిర్మాణం, ప్రభుత్వ స్కూళ్లు – ఆస్పత్రుల్లో నాడు–నేడు, సమగ్ర భూసర్వే, స్పందన అర్జీల పరిష్కారంలో నాణ్యత, ఎస్డీజీ లక్ష్యాలు, ఉపాధిహామీ పనులు, సచివాలయాల పనితీరు... ఈ అంశాల్లో ప్రగతి ఆధారంగా వారి పనితీరును మదింపు చేస్తాం. ఏసీబీ, ఎస్ఈబీ, దిశ, సోషల్ మీడియా ద్వారా వేధింపుల నివారణ అంశాల్లో ప్రగతి ఆధారంగా ఎస్పీల పనితీరును మదింపు చేస్తాం. ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తూ ముందుకు సాగాలి. కానీ సమీక్ష పేరుతో అనవసరంగా కాలహరణం వద్దు. గంట లోపలే ముగించి పనిలో ముందుకుసాగాలి. సిటిజన్ అవుట్ రీచ్తో ప్రతి ఇంటికీ.. ప్రతి నెలలో చివరి శుక్రవారం, శనివారం వలంటీర్లు, సచివాలయ సిబ్బంది సిటిజన్ అవుట్‌రీచ్ కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి ఇంటికీ వెళ్లాలి. వచ్చే నెలలో చేపట్టనున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి. ప్రతి వారం రెండు రోజులపాటు కలెక్టర్లు, జేసీలు గ్రామ సచివాలయాలను పర్యవేక్షించాలి. మే నెలలో పథకాలు ఇవీ జగనన్న విద్యా దీవెన, ఉచిత పంటల బీమా పథకం, వైఎస్సార్ రైతు భరోసా, మత్స్యకార భరోసా పథకాలను మే నెలలో అమలు చేస్తున్నాం. ఈ నాలుగు కార్యక్రమాల గురించి సిటిజన్ అవుట్రీచ్లో వలంటీర్లు, సచివాలయాల సిబ్బంది ప్రజలకు వివరించాలి. సిటిజన్ అవుట్ రీచ్‌ను కూడా కలెక్టర్లు పర్యవేక్షించాలి. మీరు మంచి చేస్తే.. నేను మంచి చేసినట్లవుతుంది. మీరే నా కళ్లు, చెవులు. రాష్ట్రంలో ఎలాంటి అవినీతి, వివక్షకు తావు లేకుండా పథకాలను అమలు చేస్తున్నాం. రూ.1.37 లక్షల కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి బటన్ నొక్కి పారదర్శకంగా జమ చేశాం. ఇదంతా మీ పర్యవేక్షణ వల్లే సాధ్యమైంది. – ఉన్నతాధికారులతో సీఎం జగన్ -
అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో తాజా పరిస్థితి, కోవిడ్ నియంత్రణ చర్యలపై చర్చించేందుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. చదవండి: (నీ ఇల్లు బంగారం గానూ.. ఇంటి గోడలో రూ. 10 కోట్లు, 19 కేజీల వెండి ఇటుకలు) -
ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో స్పందనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్పందనలో భాగంగా ఉపాధి హామీ కార్యక్రమం కింద చేపట్టిన పనులు, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్స్, డిజిటిల్ లైబ్రరీలు, ఏఎంసీలు, బీఎంసీలు, గృహనిర్మాణం, జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం, జగనన్న భూ హక్కు మరియు భూ రక్ష, ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు భూ సేకరణ, నాడు-నేడు, స్పందన కింద అర్జీల పరిషారం తదితర అంశాలపై సీఎం సమీక్ష జరిపారు. ఈ వార్త కూడా చదవండి: మంత్రి కారుమూరి ఔదార్యం ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, 26 జిల్లాలను ఎందుకు ఏర్పాటు చేశామన్న విషయం అందరికీ తెలియాలన్నారు. ‘‘పరిపాలన అనేది సులభతరంగా ఉండాలి. ప్రజలకు మరింత అందుబాటులో ఉండాలి. మరింత మానవీయ దృక్పథంతో ప్రజల పట్ల ఉండాలి. ఈ విషయాలను ఎప్పుడూ దృష్టిలో ఉంచుకోవాలి. ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ’’ సీఎం సూచించారు. ఉపాధిహామీ పనులు: ►ఏప్రిల్, మే, జూన్... నెలల్లో ముమ్మరంగా పనులు చేయడానికి అవకాశం ఉంటుంది ►కనీసం 60 శాతం పనులను ఈనెలల్లో చేయాలి ►కలెక్టర్లు ఈ మూడు నెలల్లో పనులు ముమ్మరంగా పనిచేయడంపై దృష్టిపెట్టాలి ►ప్రతిజిల్లాలో కూడా ప్రతిరోజూ కనీసం 1 లక్షల పనిదినాలు చేయాలి ►నెలలో కనీసంగా 25 లక్షల పని దినాలు చేపట్టాలి ►క్షేత్రస్థాయిలో లక్ష్యాలు పెట్టుకుని ఉపాధిహామీ పనులు చేపట్టాలి ►విస్తృతంగా పర్యటనలు చేసి, సమీక్షలు చేసి... ఈ లక్ష్యాలను సాధించాలి ►కలెక్టర్లు, జేసీలు, పీడీలు, ఎంపీడీఓలు.. ఇలా ప్రతి అధికారి ప్రత్యేక దృష్టిపెట్టాలి ►గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్కులు, ఆర్బీకేలు, డిజిటల్ లైబ్రరీలు.. అన్నింటినీకూడా పూర్తిచేయాలి ►కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఉపాధి హామీ నిధులు ఈనెలాఖరులోగా వచ్చేలా అధికారులు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారు ►కంపెనీల నుంచి సిమ్మెంటు సప్లైలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి కలెక్టర్లు ఒక నోడల్ అధికారిని నియమించుకోవాలి, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలి: ►సిమెంటు, స్టీలు, ఇసుక, మెటల్ సరఫరా సవ్యంగా సాగేలా నోడల్ అధికారికి బాధ్యతలు అప్పగించాలి ►గ్రామాల్లో ఈ భవనాల నిర్మాణ బాధ్యతలను ఒకరికన్నా ఎక్కువ మందికి అప్పగించడం వల్ల పనులు చురుగ్గా సాగుతాయి ►ప్రతి సచివాలయం పరిధిలో మరోసారి పునఃపరిశీలన చేసి.. భవనాల నిర్మాణం పూర్తయ్యేలా చూడాలి ►డిసెంబర్ నాటికి 4545 డిజిటల్ లైబ్రరీల నిర్మాణం పూర్తి కావాలి ►అదే సమయానికి ఇంటర్నెట్ కేబుల్‌కూడా సంబంధిత గ్రామాలకు చేరుకుంటుంది: ►గ్రామాల్లోనే వర్క్‌ఫ్రం హోం అందుబాటులోకి వస్తుంది ఇళ్లనిర్మాణం: ►తొలిదశలో 15.6 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నాం ►లే అవుట్లలో 11.9 లక్షలు, సొంతప్లాట్లు లేదా పొసెషన్ సర్టిఫికెట్లు పొందన వారి స్థలాల్లో 3.7 లక్షల ఇళ్ల నిర్మాణం చేయాలి ►ఇళ్ల నిర్మాణంపై దృష్టిపెట్టాలి ►కోర్టు కేసుల కారణంగా 42,639 ఇళ్ల నిర్మాణం పెండింగులో పండింది ►ఈ కేసుల పరిష్కారం కోసం ప్రయత్నాలు చేయాలి ►వీలుకాని పక్షంలో ప్రత్యామ్నాయ స్థలాలను ఎంపిక చేయాలి ►అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం అందాలి ►అర్హులకు ఇళ్లు రాకుండా కత్తిరించడం అన్నది సరైనది కాదు ►అర్హులందరికీ ఇళ్లస్థలాలు ఇవ్వాల్సిందే, దీనికి ఎంత ఖర్చైనా ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ►కలెక్టర్లు దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి ►ఆప్షన్ 3 ఎంపిక చేసుకున్న ఇళ్ల నిర్మాణంపైనా కలెక్టర్లు దృష్టిపెట్టాలి ►ప్రతి వేయి ఇళ్లకూ ప్రత్యేకంగా ఇంజినీరింగ్ అసిస్టెంట్‌ను పెట్టాలి ►ఇళ్ల నిర్మాణం పూర్తచేసే బాధ్యతను వారికి అప్పగించాలి ►రోజూ వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి ►లే అవుట్లలో కనీస మౌలిక సదుపాయాల కల్పన పనులు శరవేగంగా పూర్తిచేయాలి ►ఆప్షన్ 3 కింద ఇళ్ల నిర్మాణాన్ని ఈనెల 28న ప్రారంభిస్తున్నాం ►అదే రోజు 1.23 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం: ►అదే రోజున 1.79 లక్షల పీఎంఏబై, వైఎఎస్సార్-గామీణ్ ఇళ్ల నిర్మాణంకూడా ప్రారంభిస్తున్నాం ►తద్వారా మొత్తంగా చూస్తే మొదటి విడత ఇళ్ల నిర్మాణంలో భాగంగా 15.6 లక్షలు, టిడ్కోలో 2.62 లక్షలు, విశాఖపట్నంలో 1.23 లక్షలు, పీఎంఏవై-వైఎస్సార్ గ్రామీణ్ ద్వారా 1.79లక్షల ఇళ్లు నిర్మాణాలు జరుగుతాయి ►అంటే 21.24 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతున్నట్టు లెక్క ►అలాగే పెద్ద లే అవుట్లలో బ్రిక్ తయారీ యూనిట్లు నెలకొల్పడంపైనా దృష్టిపెట్టాలి ►ఇళ్ల నిర్మాణం జరుగుతున్న లే అవుట్లలో నీరు, కరెంటు సదుపాయాలను కల్పించాలి ►మురుగునీరు పోచే సదుపాయాలను కూడా కల్పించాలి ►ఇళ్ల నిర్మాణం కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న స్థానిక ప్రజాప్రతినిధులను సత్కరిస్తాం: ►మండలానికో సర్పంచి, మున్సిపాల్టీలో కౌన్సిలర్, జిల్లాకు ఒక ఎంపీపీ, జిల్లాకు ఒక జడ్పీటీసీ చొప్పున వారికి అవార్డులు ఇస్తాం ►ఇళ్ల నిర్మాణం, స్కూళ్లు, ఆస్పత్రుల్లో నాడు – నేడు, సమగ్ర భూసర్వే, స్పందనలో అర్జీల పరిష్కారంలో నాణ్యత, ఎస్డీజీ లక్ష్యాలు, ఉపాధిహామీ పనులు, సచివాలయాల పనితీరు... ఈ అంశాల్లో ప్రగతి ఆధారంగా కలెక్టర్లు, జేసీల పనితీరును మదింపు చేస్తాం ►ఏసీబీ, ఎస్ఈబీ, దిశ, సోషల్‌మీడియా ద్వారా వేధింపుల నివారణ అంశాల్లో ప్రగతి ఆధారంగా ఎస్పీల పనితీరును మదింపు చేస్తాం ►ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించి ముందుకు సాగాలి ►ఒక గంటలోపలే సమీక్షచేసుకుని.. పనిలో ముందుకుసాగాలి ►సమీక్ష పేరుతో అనవసరంగా కాలహననం వద్దు ►సమీక్షలు క్రమం తప్పకుండా ముందుకు సాగాలి -
వర్చువల్ న్యాయం
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘న్యాయం పొందటం ఇప్పుడు సాంకేతికతను అందిపుచ్చుకోవడంపై ఆధారపడి ఉంది’’ – 2021లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రిటైరవుతూ జస్టిస్ ఎస్ఏ బాబ్డే చేసిన వ్యాఖ్యలివి. అందుకు తగ్గట్టే కరోనా మహమ్మారి రూపంలో ఎదురైన సవాలును వర్చువల్ విధానంలో అధిగమించింది సుప్రీంకోర్టు. వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా విచారణలు కొనసాగించాలని 2020 మార్చిలో కీలక నిర్ణయం తీసుకోవడం ద్వారా అప్పటి సీజేఐ జస్టిస్ బాబ్డే ఇందుకు బాటలు వేశారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ దాన్ని వ్యవస్థీకృత రూపంలో ముందుకు తీసుకెళ్లి విచారణ ప్రక్రియను కొత్తపుంతలు తొక్కించారు. సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలిచి చూపించారు. దీన్ని హైకోర్టులు, దిగువ స్థాయి కోర్టులు కూడా అందిపుచ్చుకోవడంతో సామాన్యునికి న్యాయం అందే ప్రక్రియ కరోనా వేళ కూడా నిరాఘాటంగా కొనసాగింది. ఎప్పటికప్పుడు సూచనలు కరోనా వల్ల రెండేళ్లు వర్చువల్ విధానంలో సాగిన సుప్రీంకోర్టు ఈ నెల 4 నుంచి మళ్లీ భౌతిక రూపంలో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ప్రధాన కేసుల విచారణలు, వాదోపవాదాలను ఇంతకాలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన న్యాయమూర్తులు కరోనా తీవ్రత తగ్గి, ఆంక్షలు సడలటంతో భౌతిక విచారణలు మొదలు పెట్టారు. ఈ రెండేళ్ల కాలంలో వర్చువల్ విధానంలో న్యాయ సేవలందటంలో ఎలాంటి ఆటంకాలూ తలెత్తకుండా చూడటంలో సీజేఐ జస్టిస్ రమణ చురుకైన పాత్ర పోషించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వాడుకోవడం ద్వారా సమస్యలను ఎప్పటికప్పుడు అధిగమిస్తూ వచ్చారు. కోర్టు రోజువారీ వ్యవహారాలు, విచారణల్లో ఇబ్బందులు రాకుండా ఈ–కమిటీని అప్రమత్తం చేస్తూ, దాని సలహాలు, సూచనలు పకడ్బందీగా అమలయ్యేలా సీజేఐ చేసిన సూచనలు సత్ఫలితాలనిచ్చాయి. లఖీంపూర్‌ఖేరి ఘటన, పెగసస్ వంటి కీలక కేసుల విచారణలు వర్చువల్‌గానే సాగాయి. 2020 మార్చిలో మొదలు కరోనా నేపథ్యంలో 2020 మార్చి 23 నుంచి సుప్రీంకోర్టు వర్చువల్ విచారణలకు తెర తీసింది. నాటి సీజేఐ జస్టిస్ ఎస్ఏ బాబ్డే సూచనల మేరకు జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతత్వంలోని సుప్రీంకోర్టు ఈ–కమిటీ వర్చువల్ విచారణలకు ఆదేశాలు జారీ చేసింది. అదే బాటలో హైకోర్టులు, దిగువ స్థాయి కోర్టులు కూడా వీడియో కాన్ఫరెన్స్ విచారణ పద్ధతినే అవలంబించాయి. వర్చువల్ విచారణలు ప్రారంభమైన నెల రోజులకే సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ రమణ ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేశారు. కరోనా సమయంలో కోర్టు ప్రాంగణంలోనే డెస్క్‌టాప్‌లు ఏర్పాటు చేసి కవరేజీకి మీడియాను కూడా అనుమతించారు. కరోనా కేసులు పెరుగుతన్న నేపథ్యంలో మీడియాకు యాప్‌ను కూడా రూపొందించారు. తాను జర్నలిస్టుగా ఉన్న సమయంలోని ఇబ్బందులను ఆ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. విచారణలకు వాడుతున్న యాప్‌లోని ఇబ్బందులను గుర్తించి సిస్కో వెబ్ఎక్స్ను వాడకంలోకి తెచ్చారు. జస్టిస్ రమణ సూచనల మేరకు దానిలోని లోపాలను సరిదిద్ది మెరుగు పరిచారు. వర్చువల్ విచారణలో ఇలాంటి పలు ఇబ్బందులను ఈ–కమిటీ ఆధ్వర్యంలో సీజేఐ సూచనల మేరకు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వచ్చారు. విచారణలను పూర్తిగా ప్రత్యక్ష ప్రసారం చేయాలని కూడా సీజేఐ అభిప్రాయపడ్డారు. లాయర్లకు దిశానిర్దేశం వర్చువల్ విచారణల్లో లాయర్లు తమ మొబైల్ ఫోన్ల ద్వారా పాల్గొనడాన్ని జస్టిస్ రమణ తీవ్రంగా ఆక్షేపించారు. దీనివల్ల లాయర్లు సరిగా కనిపించపోవడమే గాక విచారణకు ఆటంకం వస్తోందన్నారు. సుప్రీంకోర్టులో ప్రాక్టీసు చేస్తూ డెస్క్‌టాప్ కొనుక్కోలేరా అని లాయర్లను ప్రశ్నించారు. వారి వస్త్రధారణ విషయంలోనూ పలు సందర్భాల్లో సూచనలు చేశారు. రెండేళ్లలో రికార్డు 2020 మార్చి 23 నుంచి 2022 మార్చి 14 వరకు రెండేళ్లలో సుప్రీంకోర్టు ఏకంగా 2,18,891 కేసులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. ప్రపంచం మొత్తంలో మన సుప్రీంకోర్టు మాత్రమే కరోనా సమయంలో ఇన్ని కేసులు విచారించిందని కేంద్ర న్యాయ మంత్రి ఇటీవల రాజ్యసభలో వెల్లడించారు. దేశంలోని 24 హైకోర్టులు కూడా కరోనా వేళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 61,02,859 కేసులను విచారించాయి. దేశవ్యాప్తంగా జిల్లా కోర్టులు కరోనా వేళ 1,23,29,917 కేసులను విచారించాయి! -
ప్రపంచ శాంతికి ఉమ్మడి సహకారం
బీజింగ్: ఉక్రెయిన్–రష్యా యుద్ధం మనం కోరుకోని సంక్షోభం అని చైనా అధినేత షీ జిన్‌పింగ్ అన్నారు. ప్రపంచమంతటా శాంతిని నెలకొల్పాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, ఇందుకోసం ఉమ్మడిగా సహకారం అందిద్దామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు సూచించారు. ఇరువురు నేతలు శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం, ప్రస్తుత పరిణామాలపై చర్చించారు. ప్రపంచ శాంతి, అభివృద్ధికి ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని జిన్‌పింగ్ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో శాంతి సామరస్యం, స్థిరత్వం కనిపించడం లేదని అన్నారు. దేశాలు ఏవైనా సరే యుద్ధ రంగంలో కలుసుకొనే పరిస్థితి రాకూడదని పేర్కొన్నారు.