ఈశాన్య రాష్ట్రాలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ | Narendra Modi Video Conference With North Eastern States About Corona | Sakshi
Sakshi News home page

ఈశాన్య రాష్ట్రాలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌

Published Tue, Jul 13 2021 10:40 AM | Last Updated on Tue, Jul 13 2021 10:44 AM

Narendra Modi Video Conference With North Eastern States About Corona - Sakshi

ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు ఉదయం 11 గంటలకు కరోనాపై ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న కరోనా పరిస్థితులపై సమీక్షించనున్నారు. కరోనా నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్ పై ప్రధాని మాట్లాడనున్నారు. ఈ సమావేశంలో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొననున్నారు. కాగా గత కొన్ని రోజులుగా ఈశాన్య రాష్ట్రాల్లో  కరోనా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే.

క్రీడాకారులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌
ఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లనున్న భారత క్రీడాకారులతో నేడు సాయంత్రం ఐదు గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. ఈ కాన్ఫరెన్స్‌ ద్వారా క్రీడాకారులకు మోదీ బెస్ట్ విషెస్ తెలపనున్నారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement