North eastern states
-
ఓట్లతో అభివృద్ధిని తూకం వేయొద్దు
న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిని గత ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. అక్కడ తక్కువ జనాభా ఉండడం, తక్కువ ఓట్లు, తక్కువ సీట్లు ఉండడమే ఇందుకు కారణమని చెప్పారు. గతంలో అధికారం చెలాయించిన ప్రభుత్వాలు ఓట్ల రాజకీయం చేశాయని ఆక్షేపించారు. ఓట్లు అధికంగా ఉన్న ప్రాంతాలపైనే దృష్టి పెట్టాయని చెప్పారు. ఓట్లతో అభివృద్ధిని తూకం వేసే విధానం సరైంది కాదన్నారు. ఈశాన్య ప్రాంతాల వేడుక అయిన ‘అష్టలక్ష్మీ మహోత్సవ్’ను ప్రధాని మోదీ శుక్రవారం ఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభించారు. మొట్టమొదటిసారిగా అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వమే ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు. ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసిందన్నారు. ప్రతి శాఖలో 20 శాతం నిధులను ఈశాన్య ప్రాంతాల ప్రగతి కోసమే ఖర్చు చేసేలా చర్యలు తీసుకుందని చెప్పారు. గత పదేళ్లగా ఈశాన్యంలో వేగంగా అభివృద్ధి జరుగుతోందని వెల్లడించారు. ఇదంతా సులభంగా జరగలేదని, దేశ అభివృద్ధి ప్రయాణంతో ఈశాన్యాన్ని అనుసంధానించడానికి అన్ని రకాల చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో తూర్పు, ఈశాన్య భారతదేశంలో అద్భుతాలు చూడబోతున్నామని వ్యాఖ్యానించారు. ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తరహాలో గౌహతి, షిల్లాంగ్, ఇంఫాల్, ఈటా నగర్, ఐజ్వాల్ వంటి నగరాలు ప్రగతి పథంలో దూసుకుపోవడం ఖాయమని ఉద్ఘాటించారు. దేశ అభివృద్ధి చరిత్రలో ఈశాన్యం పాత్ర కీలకంగా మారుతుందని అన్నారు. గత పదేళ్లలో ఈశాన్య ప్రాంతాల ప్రజలను అక్కున చేర్చుకున్నామని నరేంద్ర తెలియజేశారు. వారి మనసుల్లో ఢిల్లీతో ఉన్న దూరాన్ని తగ్గించామన్నారు. గత దశాబ్ద కాలంలో కేంద్ర మంత్రులు 700 సార్లు ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించారని గుర్తుచేశారు. అష్టలక్ష్మీ మహోత్సవం ఇదే మొదటిసారి. ఈ నెల 8వ తేదీ వరకు మూడు రోజులపాటు ఈ వేడుకలు జరుగుతాయి. ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల ఘనత, సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పడమే ఈ వేడుకల ఉద్దేశం. -
Citizenship Amendment Act: సీఏఏ ఎవరికి లాభం?
సాక్షి, న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్, కేరళ, అసోంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఫలితాలను బాగా ప్రభావితం చేసేలా కని్పస్తోంది. ఈ చట్టానికి నాలుగేళ్ల క్రితమే పార్లమెంటు ఆమోదం లభించినా దేశవ్యాప్త వ్యతిరేకత, ఆందోళనలు తదితరాల నేపథ్యంలో అమలు మాత్రం వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు సరిగ్గా ఎన్నికల ముందు దేశమంతటా సీఏఏను అమల్లోకి తెస్తూ మార్చి 11న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో మరోసారి రాజకీయ దుమారం రేగింది. ఎవరేమన్నా సీఏఏ అమలుపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని పాలక బీజేపీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోలో సీఏఏ ప్రస్తావనే లేకపోవడంపై విపక్ష ఇండియా కూటమి పక్షాలతో పాటు కేరళ సీఎం విజయన్ విమర్శలు గుప్పించారు. దాంతో, ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఈ వివాదాస్పద చట్టాన్ని పార్లమెంటు తొలి సమావేశాల్లోనే రద్దు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ పి.చిదంబరం ప్రకటించారు. దాంతో సీఏఏపై మరోసారి రాజకీయ వేడి రాజుకుంది.బెంగాల్లో మథువా ఓట్లు బీజేపీకేరాష్ట్రంలో 2019 లోక్‌సభ, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో సీఏఏ హామీతోనే బీజేపీ బాగా బలపడింది. రాష్ట్రంలో అధిక సంఖ్యాకులైన నామశూద్ర (మథువా) సామాజికవర్గంలో బీజేపీకి ఆదరణ పెరిగింది. దాంతో 2019 లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్లో బీజేపీ రికార్డు స్థాయిలో ఏకంగా 18 సీట్లు గెలిచింది. తాజాగా చట్టాన్ని అమల్లోకి తేవడం మరింతగా కలిసొస్తుందని బీజేపీ భావిస్తోంది. దళితులైన మథువాలు దేశ విభజన సమయంలో, 1971లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం సందర్భంగా అక్కడి నుంచి భారీగా బెంగాల్లోకి వలస వచ్చారు. ఉత్తర 24 పరగణాలు, నదియా, పూర్వ బర్ధమాన్, దక్షిణ 24 పరగణాలు, కూచ్ బెహార్ జిల్లాల్లో నివసిస్తున్నారు. వీరిలో అత్యధికులకు పౌరసత్వం లేదు. అందుకే సీఏఏ చట్టానికి అత్యధికంగా మద్దతిస్తున్నది వీరే. 2019 డిసెంబర్లో పార్లమెంటు ఈ చట్టాన్ని ఆమోదించినప్పటి నుంచీ దాని అమలు కోసం డిమాండ్ చేస్తున్నారు. బెంగాల్లో మతువా ఓటర్లు దాదాపు 1.75 కోట్లు ఉన్నట్టు అంచనా! బొంగావ్, బసీర్హాట్, రాణాఘాట్, కృష్ణానగర్, కూచ్ బెహార్ తదితర లోక్‌సభ స్థానాల్లో వీరి ఓట్లు నిర్ణాయకం! వీటిలో ఎస్సీ రిజర్వుడు స్థానాలైన బొంగావ్, రాణాఘాట్, కూచ్ బెహార్ 2019 ఎన్నికల్లో బీజేపీ వశమయ్యాయి. బసీర్హాట్, కృష్ణానగర్ తృణమూల్ పరమయ్యాయి. బొంగావ్ సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి శంతను ఠాకూర్‌ది మథువా సామాజికవర్గమే. ఈసారి కూడా బీజేపీ నుంచి ఆయనే బరిలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో ముస్లిం జనాభా 30 శాతమని అంచనా.అసోం: అసోం (14)తో కలిపి ఈశాన్య రాష్ట్రాల్లో 25 లోక్‌సభ స్థానాలున్నాయి. వాటిలోనూ సీఏఏ ప్రభావం బాగా ఉంటుందని అంచనా. బెంగాలీ మాట్లాడే శరణార్థులందరినీ ‘హిందూ–ముస్లింలు’గా, ‘చొరబాటుదారులు’గా స్థానికులు పరిగణిస్తారు. వారికి పౌరసత్వమిస్తే తమ గుర్తింపు, సంస్కృతి, సామాజిక సమీకరణాల వంటివన్నీ తలకిందులవుతాయని పలు ఈశాన్య రాష్ట్రాలు ఆందోళనగా ఉన్నాయి. ముఖ్యంగా అసోం రాజకీయాలు దశాబ్దాలుగా బెంగాలీ వ్యతిరేక భావజాలం చుట్టే కేంద్రీకృతమై ఉన్నాయి. అసోంలో ముస్లింలు ఏకంగా 34 శాతం ఉన్నారు. అసోం ఒప్పందం ప్రకారం 1971 మార్చి 25కు ముందు శరణార్థులుగా వచ్చిన వారిని ఎన్ఆర్సీలో చేర్చేందుకు వీలు కలి్పంచారు. అలా దరఖాస్తు చేసుకున్న 3.3 కోట్ల మందిలో 19 లక్షల మందిని తుది లెక్కింపులో అనర్హులుగా ప్రకటించారు. వారిలో అత్యధికులు హిందువులే. దీన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. నిజమైన భారతీయులను పక్కన పెట్టారంటూ ఆందోళనకు దిగింది. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మరో 5 లక్షల పై చిలుకు బెంగాలీ హిందువులకూ తుది ఎన్ఆర్సీలో చోటు దక్కలేదు. వారంతా ఇప్పుడు సీఏఏ నుంచి ప్రయోజనం పొందుతారు. అసోం అస్తిత్వ పరిరక్షణే ప్రధాన నినాదంగా 2016, 2021 అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. రెండుసార్లూ బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచింది. అసోంలో స్థిరపడిన మియా ముస్లింలపై స్థానికంగా ఉన్న ఆగ్రహం కారణంగా సీఏఏకు రాష్ట్రంలో బాగా మద్దతు కనిపిస్తోంది. కేరళ: ఈ దక్షిణాది రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. హిందువులతో పాటు ఇక్కడ అధిక సంఖ్యాకులైన క్రైస్తవ ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు బీజేపీకి సీఏఏ కొత్త ఆశాకిరణంగా కనిపిస్తోంది. సీఏఏ అమలు నేపథ్యంలో వారు తమకు మద్దతిస్తారని బీజేపీ భావిస్తోంది. తిరువనంతపురంలో క్రెస్తవుల ఓట్లు 14 శాతానికి పైగా ఉన్నాయి. పథనంతిట్ట త్రిసూర్ లోక్‌సభ స్థానాల పరిధిలోనూ హిందూ, ముస్లింల కంటే క్రైస్తవులే అధిక సంఖ్యాకులు. పలు స్థానిక క్రైస్తవ మిషనరీలు ఇప్పటికే సీఏఏకు మద్దతు పలికాయి. ఇదీ విపక్షాల వాదన!సీఏఏ ప్రకారం పౌరసత్వం పొందేందుకు అర్హుల జాబితాలో ముస్లింలను చేర్చకపోవడాన్ని విపక్షాలన్నీ తీవ్రంగా తప్పుబడుతున్నాయి. పాక్, అఫ్తాన్, బంగ్లాల్లో ముస్లింలు మైనారిటీలు కారు గనకే చేర్చలేదన్న బీజేపీ వాదన సాకు మాత్రమేనని ఆక్షేపిస్తున్నాయి. పౌరసత్వం లేకుండా భారత్‌లో నివాసముంటున్న లక్షలాది మంది ముస్లింలను వెళ్లగొట్టడమే బీజేపీ లక్ష్యమని ఘాటుగా విమర్శిస్తున్నాయి. సీఏఏను నేషనల్ రిజిస్ట్రర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్నార్సీ)తో అనుసంధానించడం వెనక ఉద్దేశం కూడా ఇదేనంటున్నాయి. ఈ చట్టాన్ని వెనక్కు తీసుకోవాలంటూ కాంగ్రెస్, టీఎంసీ, సీపీఎం తదితర పారీ్టలు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. ఏమిటీ సీఏఏ చట్టం...?► విదేశాల్లో మతపరమైన వివక్ష బాధితులై ఊచకోతకు గురైన మైనారిటీలకు భారత పౌరసత్వం కలి్పంచడం సీఏఏ–2019 చట్టం ఉద్దేశం.► పాకిస్తాన్, ఆఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌ల్లో ఇలా మత హింస బాధితులై 2014 డిసెంబర్ 31, అంతకు ముందు భారత్‌కు వచ్చిన ముస్లిమేతర శరణార్థులు ఇందుకు అర్హులు. ఈ జాబితాలో హిందూ, సిక్కు, బౌద్ధ, జైన్, పార్శీ, క్రైస్తవ మైనారిటీలున్నారు.► వారికి సీఏఏ చట్టం కింద ఫాస్ట్‌ట్రాక్ విధానంలో ఆరేళ్లలో భారత పౌరసత్వం కల్పిస్తారు. -
‘ఈశాన్యం’లో అభివృద్ధి వేగవంతం
ఈటానగర్/జోర్హాట్: ఈశాన్య రాష్ట్రాల్లో తమ ప్రభుత్వం గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధిని చేయాలంటే కాంగ్రెస్ పార్టీకి 20 సంవత్సరాలు పట్టేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆయన శనివారం అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించారు. ఈశాన్య భారతదేశానికి సంబంధించి రూ.55,600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం ఈటానగర్‌లో ‘వికసిత్ భారత్–వికసిత్ నార్త్ఈస్ట్’ బహిరంగ సభలో ప్రసంగించారు. ఇండియాకు.. దక్షిణాసియా, తూర్పు ఆసియా దేశాలకు మధ్య వాణిజ్యం, టూరిజంతోపాటు ఇతర సంబంధాల విషయంలో ఈశాన్య రాష్ట్రాలు బలమైన అనుసంధానంగా మారబోతున్నాయని తెలిపారు. గత ఐదేళ్ల కాలంలో ఈ ప్రాంతంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టామని, అభివృద్ధిని వేగవంతం చేశామని పేర్కొన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌ను సందర్శించేవారికి ‘మోదీ గ్యారంటీ’ స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. ఈశాన్య ప్రజలంతా నా కుటుంబ సభ్యులే మోదీకి కుటుంబం ఉందా అని ప్రతిపక్ష నేతలు ప్రశి్నస్తున్నారని ప్రధాని అన్నారు. ‘‘వారికి ఒక్కటే చెబుతున్నా. ఈశాన్య రాష్ట్రాల ప్రజలంతా నా కుటుంబ సభ్యులే’’ అన్నారు. దేశంలో ప్రతి ఒక్కరికీ సురక్షితతాగునీరు, సొంతిల్లు, వంట గ్యాస్ కనెక్షన్, విద్యుత్, ఇంటర్నెట్ సౌకర్యం కలి్పంచాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు. అప్పడే ‘వికసిత్ భారత్’ కల నెరవేరుతుందన్నారు. సేలా టన్నెల్ జాతికి అంకితం ప్రపంచంలో అత్యంత పొడవైన రెండు వరుసల సొరంగం ‘సేలా టన్నెల్’ను మోదీ వర్చువల్‌గా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో భారత్–చైనా సరిహద్దు ఎల్ఏసీ సమీపంలో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ రూ.825 కోట్లతో సముద్ర మట్టానికి 13 వేల అడుగుల ఎత్తున ఈ టన్నెల్ నిర్మించింది. ఈ ప్రాజెక్టులో రెండు సొరంగాలున్నాయి. ఒకటి సింగిల్ ట్యూబ్ టన్నెల్. దీని పొడవు 1,003 మీటర్లు. ఎస్కేప్ ట్యూబ్‌తో కూడిన రెండో టన్నెల్ పొడవు 1,595 మీటర్లు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో బలిపారా–చారిదువార్–తవాంగ్ మార్గం మూతపడుతోంది. సేలా టన్నెల్‌తో ఆ ఇక్కట్లు తప్పాయి. లచిత్ బోర్ఫుకన్ విగ్రహావిష్కరణ అస్సాంలోని జోర్హాట్లో 125 అడుగుల ఎత్త యిన అహోం జనరల్ లచిత్ బోర్ఫుకన్ కంచు విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా అస్సాం సంప్రదాయ దుస్తులు, తలపాగా ధరించి, అహోం ఆచార ంలో పాలుపంచుకున్నారు. అస్సాంలో 1228 నుంచి 1826 వరకు అహోం రాజవంశం పరిపాలన సాగింంచింది. 1671లో జరిగి న స రాయ్‌ఘాట్ యుద్ధంలో అహోం సైనికాధికా రి లచిత్ బోర్ఫుకన్ అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించారు. బలీయమైన మొ ఘల్ సైన్యాన్ని వెనక్కి తరిమికొట్టారు. అహోం రా జ్యాన్ని కాపాడారు. ఆయనను అస్సాం ప్రజ లు ఇప్పటికీ స్మరించుకుంటూ ఉంటారు. -
Police Commemoration Day: ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాద ఘటనల్లో పదేళ్లలో 65% తగ్గుదల
న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదం, ఈశాన్య రాష్ట్రాల్లో విద్రోహ చర్యలు గత దశాబ్ద కాలంలో 65 శాతం మేర తగ్గుముఖం పట్టాయని హోం మంత్రి అమిత్ షా చెప్పారు. దేశంలోని మూడు హాట్ స్పాట్లుగా ఉన్న వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలు, ఈశాన్య ప్రాంతం, జమ్మూకశ్మీర్‌ల్లో పరిస్థితులు ప్రశాంతంగా మారాయన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకురావడంతోపాటు ఉగ్రవాదాన్ని కఠినంగా అణచివేస్తుండడమే దీనికి కారణమన్నారు. శనివారం నేషనల్ పోలీస్ మెమోరియల్ వద్ద పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో మంత్రి అమిత్ షా మాట్లాడారు. పోలీస్ టెక్నాలజీ మిషన్ ఏర్పాటు చేసి పోలీసు బలగాలను తీవ్రవాదులను ఎదుర్కోవడంలో ప్రపంచంలోనే అత్యుత్తమంగా తయారు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. దాదాపు 150 ఏళ్లనాటి క్రిమినల్ జస్టిస్ విధానాన్ని సమూలంగా మార్చేందుకు ప్రభుత్వం పార్లమెంట్లో మూడు బిల్లులను ప్రవేశపెట్టినట్లు గుర్తు చేశారు. ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి విధి నిర్వహణలో 36,250 మంది పోలీసులు ప్రాణాలర్పించారు. 2022 సెప్టెంబర్ నుంచి 2023 ఆగస్ట్ వరకు 188 మంది పోలీసులు విధుల్లో ఉండగా అమరులయ్యారు. పోలీసు స్మారకం కేవలం చిహ్నం కాదు, దేశ నిర్మాణం కోసం పోలీసు సిబ్బంది చేసిన త్యాగం, అంకితభావానికి గుర్తింపు’అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అంతర్గత రక్షణతోపాటు దేశ సరిహద్దుల భద్రతకు సైతం సమర్థమంతమైన పోలీసు విధానం అవసరం ఎంతో ఉందని చెప్పారు. -
ఈశాన్య రాష్ట్రాలతో గోద్రెజ్ ఆగ్రోవెట్ ఎంవోయూ
న్యూఢిల్లీ: దేశీయంగా ఆయిల్ పామ్ సాగును పెంచేందుకు సంబంధించి ఈశాన్య రాష్ట్రాల ప్రభుత్వాలతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు గోద్రెజ్ ఆగ్రోవెట్ ఎండీ బలరాం సింగ్ యాదవ్ తెలిపారు. అస్సాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర రాష్ట్రాలు వీటిలో ఉన్నట్లు వివరించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విజయవంతంగా ఆయిల్ పామ్ సాగు నిర్వహిస్తున్న తాము ఈశాన్య రాష్ట్రాల్లోనూ దాన్ని పునరావృతం చేయాలని భావిస్తున్నట్లు యాదవ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన మెగా ఆయిల్ ప్లాంటేషన్ డ్రైవ్‌లో భాగంగా ఆయిల్ పామ్ సాగుపై అవగాహన పెంచేందుకు ఉద్దేశించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. ఆగస్టు 5 వరకూ ఈ డ్రైవ్ కొనసాగనుంది. ఈ సమావేశంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్, ది సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మొదలైనవి పాల్గొన్నాయి. -
వ్యూహం మార్చుకున్న టీఎంసీ.. బీజేపీ, కాంగ్రెస్‌లకు దూరమైనట్లేనా?
కోల్‌కతా: ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయిన తృణమూల్ కాంగ్రెస్ రాజకీయ వ్యూహాన్ని మార్చుకుంది. ఇకపై బీజేపీ, కాంగ్రెస్‌లకు సమదూరం పాటించనుంది. అవంటే గిట్టని ప్రాంతీయ పార్టీలతో మరో ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. ‘బీఆర్ఎస్, ఆప్ తదితర పార్టీలతో చర్చలు ప్రారంభించాం. మా వ్యూహమేంటో వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో తెలుస్తుంది’ అని టీఎంసీ నేత సుదీప్ బందోపాధ్యాయ్ తెలిపారు. ఓట్లను చీల్చడం ద్వారా బీజేపీకి టీఎంసీ సాయం చేస్తోందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సీపీఎం నేతలు విమర్శలు గుప్పించడంతో, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామంటూ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఇటీవల ప్రకటించడం తెలిసిందే. -
బీజేపీ పవర్ ప్లే..ఎలా పట్టు సాధించింది ?
భారతీయ జనతా పార్టీ దేశాన్ని చుట్టేస్తోంది. ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రధాని మోదీ ఇమేజ్‌ని పెట్టుబడిగా పెట్టి, డబుల్ ఇంజిన్ నినాదంతో రాష్ట్రాల్లో పాగా వేస్తోంది. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో గురువారం వెలువడిన ఎన్నికల ఫలితాలు కమలం దళంలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. అభివృద్ధి, శాంతి స్థాపన లక్ష్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికల్ని ఎదుర్కొని, అధికార వ్యతిరేకతను ఎదురొడ్డి త్రిపుర, నాగాలాండ్‌లో అధికారాన్ని నిలబెట్టుకుంది. మేఘాలయలో కూడా ఒకప్పటి మిత్రపక్షం కాన్రాడ్ సంగ్మాకు చెందిన నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ)కి మద్దతు ఇచ్చి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడు రాష్ట్రాల్లోనూ అధికారంలోకి రావడం ద్వారా 2024లో జరగనున్న లోక్ సభ ఎన్నికలకు బలమైన పునాదులు వేసుకుంటోంది. ఎలా పట్టు సాధించింది ? ఈశాన్య రాష్ట్రాల్లో అసోం, త్రిపురలో హిందూ జనాభా ఎక్కువ. మిగి లిన రాష్ట్రాల్లో గిరిజనులు, క్రిస్టియన్లదే పట్టు. ఆయా రాష్ట్రాల్లో అత్యధికులు బీఫ్ తింటారు. ఇంగ్లిష్ మాట్లాడతారు. దీంతో ఇతర పార్టీలు బీజేపీ హిందూత్వ, హిందీ ఎజెండాను పదే పదే ఎత్తి చూపుతూ కాషాయ దళాన్ని ఇరుకున పెట్టాలని చూశాయి. అయినప్పటికీ ఈశాన్యంలో కాషాయ జెండా రెపరెపలాడింది. త్రిపుర లో శాంతి స్థాపన, అభివృద్ధికే బీజేపీ మొదట నుంచి ప్రాధాన్యం ఇస్తూ వచ్చింది. మౌలిక సదుపాయాలు, హైవేల నిర్మాణం, సురక్షిత మంచి నీరు, ఉచిత రేషన్ , విద్యుత్ సౌకర్యం వంటివన్నీ బీజేపీ వైపు ప్రజలు మొగ్గు చూపడానికి కారణాలే. ఎన్నికలకు కాస్త ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 12% డీఏ ప్రకటించి వారిని తమ వైపు తిప్పుకుంది. కేంద్రంలో అధికారంలో ఉండడంతో నాగాలాండ్‌లో కూడా శాంతి చర్చలు చేసి వారి సమస్య పరిష్కారానికి హా మీలు ఇచ్చింది. ఎన్డీపీపీతో పొత్తుతో అధికారా న్ని మళ్లీ నిలబెట్టుకుంది. కొద్ది రోజుల క్రితం మేఘాలయ బీజేపీ చీఫ్ ఎర్నెస్ట్ మావ్రీ బీఫ్ తినడం రాష్ట్ర ప్రజల జీవనశైలిలో ఒక భాగమంటూ వ్యాఖ్యానించి ఈశాన్య రాష్ట్రాల్లో బీఫ్ తినడాన్ని బీజేపీ అడ్డుకోదన్న సందేశాన్ని ఇచ్చారు. మైనార్టీ వ్యతిరేక పార్టీ అని విపక్షాలు ప్రచారం చేసినప్పటికీ నాగాలాండ్‌లో 15% నుంచి 19 శాతానికి ఓటు షేర్‌ను పెంచుకోగలిగింది. మేఘాలయలో 9% ఓట్లను రాబట్టింది. నాగాలో శాంతి మంత్రం.. నాగాలాండ్‌లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఉద్యమం చేస్తున్న నాగాలతో శాంతి చర్చలు జరుపుతూ వారి సమస్యను పరిష్కరిస్తామని నచ్చజెప్పడంలో బీజేపీ విజయం సాధించింది. మరోవైపు కాంగ్రెస్, నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) పరిమితమైన సీట్లలో పోటీ చేశాయి. 60 అసెంబ్లీ స్థానాల్లో ఎన్పీఎఫ్ 22 స్థానాల్లో పోటీ చేస్తే, కాంగ్రెస్ 23 స్థానాల్లో పోటీకే పరిమితమైంది. నాగా సమస్యని ఎన్డీపీపీతో కలిసి సమష్టిగా పరిష్కరిస్తామని బీజేపీ ఇచ్చిన హామీలు తిరిగి ఆ కూటమి అధికారాన్ని నిలబెట్టుకునేలా చేశాయి. పక్కా వ్యూహంతో సీఎంల మార్పు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎన్నికల జరగడానికి ఏడాది ముందు ముఖ్యమంత్రుల్ని హఠాత్తుగా మార్చి పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకునే వ్యూహంలో బీజేపీ విజయం సాధిస్తోంది. త్రిపురలో కాంగ్రెస్–లెఫ్ట్ కూటమి, తిప్రా మోథాలను దీటుగా ఎదుర్కొని అధికార వ్యతిరేకతను ఎదు రొడ్డడానికి ముఖ్య కారణం నాలుగేళ్ల పాటు సీఎంగా ఉన్న విప్లవ్‌దేవ్‌ను పది నెలల క్రితం మార్చడమే. ఆయన స్థానంలో మిస్టర్ క్లీన్‌గా పేరున్న మాణిక్ సాహాను సీఎంను చేయడంతో అధికార వ్యతిరేకత తుడిచిపెట్టుకుపోయింది. గతంలో ఉత్తరాఖండ్‌లో ఇద్దరు సీఎంలను, గుజరాత్లో సీఎంను మార్చి నెగ్గింది. హిమాచల్‌లోనూ సీఎంను మార్చాలని ఎన్నో గళాలు వినిపించినా జైరామ్ ఠాకూర్‌నే కొనసాగించి ఈ ఏడాది మొదట్లో జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలైంది. చిన్న నియోజకవర్గాలున్న త్రిపురలో అభివృద్ధిని చేసి చూపించడంతో పాటు సీఎంను మార్చడం కూడా బీజేపీకి కలిసివచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మోదీ ఈశాన్య రాష్ట్రాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుండటం కూడా ఒక కారణం. అసోం నుంచి త్రిపుర వరకు ► 2016లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అసోం అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి కాంగ్రెస్ 15 ఏళ్ల పరిపాలనకు తెర దించింది. ► 2017లో మణిపూర్‌లో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ మాజీ సభ్యుడు ఎన్. బైరాన్ సింగ్ ముఖ్యమంత్రి అయ్యారు. ► 2018లో త్రిపుర ఎన్నికల్లో బీజేపీ 25ఏళ్ల లెఫ్ట్ పాలనకు తెరదించి అధికారంలోకి వచ్చింది ► అదే ఏడాది బీజేపీ మేఘాలయ, నాగాలాండ్‌లలో ప్రాంతీయ పార్టీలతో చేతులు కలిపి అధికారంలోకి వచ్చింది. ► 2019లో అరుణాచల్ ప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 41 స్థానాలను కైవశం చేసుకొని విజయ ఢంకా మోగించింది. ► 2021లో అసోంలో మళ్లీ అధికారాన్ని కాపాడుకుంది. ► 2022లో బీజేపీ మణిపూర్‌లో కూడా తిరిగి అధికారంలోకి వచ్చింది. ► 2023లో త్రిపుర, నాగాలాండ్‌లలో అధికారాన్ని నిలబెట్టుకుంది. మేఘాలయలో కూడా అధికారంలో భాగస్వామ్యం కావడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. వాజ్‌పేయి హయాంలోనే అభివృద్ధికి బీజం ► 2016లో అసోంతో మొదలైన బీజేపీ జైత్రయాత్ర 2023 వచ్చినా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం వాజ్‌పేయి హయాంలో తొలి బీజం పడింది. కేంద్రంలో మంత్రులతో కమిటీని కూడా ఏర్పాటు చేసి కొత్త ప్రాజెక్టులకు రూప కల్పన చేశారు. అప్పుడు మొదలైన అభివృద్ధి పథం 2014లో నరేంద్ర మోదీ ప్రధాని మంత్రి అయ్యాక పరుగులు తీసింది. అభివృద్ధి కంటికి కనిపించేలా సాగింది.ప్రజల్లో మంచి పట్టు ఉన్న కాంగ్రెస్ నాయకుడు హిమాంత బిశ్వ శర్మ 2015లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోకి రావడంతో ఈశాన్య రాష్ట్రాల్లో కమలదళానికి పట్టు పెరిగింది. ప్రస్తుతం అసోం ముఖ్యమంత్రి అయిన శర్మ ఆధ్వర్యంలో ఏర్పాటైన నార్త్ ఈస్ట్ డెమొక్రాటిక్ అలయెన్స్(ఎన్‌డీపీఏ)తో కాంగ్రెస్‌ను వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలన్నీ జత కట్టాయి. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నుంచే బిశ్వ శర్మ మూడు రాష్ట్రాల్లోనూ విస్తృతంగా పర్యటిస్తూ తమకు అనుకూలంగా ఉండే చిన్న పార్టీలను ఎన్‌డీపీఏ గూటికి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. డబుల్ ఇంజిన్ నినాదంతో బీజేపీ తనకు అనుకూలంగా ఉండే ప్రాంతీయ పార్టీలను కలుపుకొని పోతూ ఒక్కో రాష్ట్రంలో అధికారాన్ని కొల్లగొడుతూ వచ్చింది. ఎన్. బైరాన్ సింగ్, ప్రేమ ఖాండూ వంటి నాయకులు కాంగ్రెస్‌ను వీడడంతో ఆ పార్టీ ఉనికి కూడా కోల్పోసాగింది. ఎన్‌డీపీఏ కంటే ముందే ఆరెస్సెస్ ఈశాన్య రాష్ట్రాల్లోని గిరిజన తండాల్లో పని చేస్తూ పట్టు పెంచుకోవడం బీజేపీకి కలిసి వచ్చింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘ఈశాన్య’ ఫలితాలు నేడే
న్యూఢిల్లీ: మూడు ఈశాన్య రాష్ట్రాలు త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడనున్నాయి. ఈశాన్యాన మరింతగా విస్తరించాలన్న అధికార బీజేపీ ఆశలు ఏ మేరకు నెరవేరాయన్నది ఈ ఫలితాలతో తేలనుంది. ముఖ్యంగా ఈసారి అందరి దృష్టీ ప్రధానంగా త్రిపురపైనే నెలకొంది. అక్కడ పాతికేళ్ల వామపక్ష పాలనకు తెర దించుతూ అభివృద్ధి నినాదంతో బీజేపీ 2018లో సొంతంగా అధికారంలోకి రావడం తెలిసిందే. దాంతో ఈసారి బీజేపీని ఎలాగైనా నిలువరించేందుకు చిరకాల శత్రుత్వాన్ని పక్కన పెట్టి మరీ లెఫ్ట్, కాంగ్రెస్ జట్టు కట్టి బరిలో దిగాయి. ఇక నాగాలాండ్, మేఘాలయల్లో కూడా బీజేపీ అధికార సంకీర్ణంలో భాగస్వామిగా ఉంది. అయితే మేఘాలయలో ఎన్నికల ముందు అధికార నేషనల్ పీపుల్స్ పార్టీతో బంధం తెంచుకుని సంకీర్ణం నుంచి బయటికొచ్చింది. అంతేగాక తొలిసారిగా మొత్తం 60 స్థానాలకూ పోటీ చేసింది! నాగాలాండ్‌లో మరోసారి ఎన్డీపీపీతో కలిసి బరిలో దిగింది. అక్కడ బీజేపీ అధికారం నిలుపుకుంటుందని, త్రిపురలో ఏకైక పెద్ద పార్టీగా మెజారిటీకి చేరువగా వస్తుందని ఎగ్జిట్ పోల్స్ పేర్కొనడం తెలిసిందే. ఇక త్రిపురలో హంగ్ తప్పకపోవచ్చని అంచనా వేశాయి. కొత్తగా తెరపైకి వచ్చిన టిప్రా మోతా కనీసం 15 స్థానాలకు పైగా గెలుచుకుని కింగ్‌మేకర్‌గా మారొచ్చని జోస్యం చెప్పాయి. -
అసెంబ్లీ సమావేశాల తర్వాతే.. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ విస్తరణ!
సాక్షి, హైదరాబాద్: ఖమ్మంలో భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) తొలిసభను భారీగా నిర్వహించి దేశం దృష్టిని ఆకర్షించిన ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు జాతీయస్థాయిలో పార్టీని విస్తరించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఫిబ్రవరిలో రాష్ట్ర వార్షిక బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత పార్టీ కార్యకలాపాలను ముమ్మరం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పార్టీ విస్తరణలో భాగంగా వివిధ రాష్ట్రాల నేతలతో ప్రగతిభవన్ వేదికగా మంతనాలు జరుపుతున్నారు. పార్టీ విధివిధానాల కోసం వివిధ రంగాలకు చెందిన 150 మంది నిపుణుల బృందం కసరత్తు చేస్తుండగా, వారితో జరుగుతున్న చర్చల్లో కేసీఆర్ బిజీగా ఉంటున్నారు. మరోవైపు రాష్ట్రవార్షిక బడ్జెట్ రూపకల్పనకు సంబంధించిన కసరత్తు చివరిదశకు చేరగా, దానికి తుదిరూపు ఇవ్వడంపైనా కేసీఆర్ దృష్టి కేంద్రీకరించారు. కాగా, ఇప్పటికే పార్టీ అనుబంధ రైతువిభాగం అధ్యక్షుడిగా పంజాబ్‌కు చెందిన గుర్నామ్ సింగ్, బీఆర్ఎస్ ఏపీ శాఖ అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్‌ను నియమించారు. పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లోనూ రైతువిభాగాలను ప్రారంభిస్తామని గతేడాది డిసెంబర్లో కేసీఆర్ ప్రకటించారు. ఈ ఏడాది చివరలో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేసూ్తనే బీఆర్ఎస్ విస్తరణపై దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించారు. రాష్ట్రమంత్రులతో ఇతర రాష్ట్రాల నేతల భేటీ బీఆర్ఎస్తో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్న తమిళనాడు విడుతలై చిరుతైగల్ కచ్చి(వీసీకే) అధ్యక్షుడు, ఎంపీ తిరుమావలవన్ ఇప్పటికే పలు సందర్భాల్లో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. తాజాగా వీసీకే శాసనసభాపక్షం నేతలు మూడురోజులుగా తెలంగాణలో పర్యటిస్తూ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అధ్యయనం చేస్తున్నారు. దళితబంధు పథకం అధ్యయనం కోసం వీసీకే శాసనసభాపక్షం నేత సింతనై సెల్వన్, మరో ఎమ్మెల్యే ఎస్ఎస్ బాలాజీతోపాటు మరికొందరు నేతలు కరీంనగర్లో పర్యటిస్తున్నారు. హుజూరాబాద్ ప్రాంతంలో దళితబంధు పథకం అధ్యయనంతోపాటు శనివారం బోరబండ ఎస్సార్‌హిల్స్‌లోని దళిత్ స్టడీ సెంటర్‌ను కూడా వీసీకే బృందం సందర్శించింది. ఈ నెల మొదటి వారంలో నాగాలాండ్ ఎన్సీపీ అధ్యక్షుడు సులుమ్ తుంగ్ లోథా మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో భేటీ కాగా, కొన్ని తమిళ సంఘాలు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో సమావేశమై బీఆర్ఎస్కు సంఘీభావం ప్రకటించాయి. బిహార్‌కు చెందిన కొందరు నేతలు ఇటీవల హోంమంత్రి మహమూద్ అలీని కలిసి బీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ తన కుమారుడు శిశిర్ గమాంగ్‌తో కలిసి ఇటీవల కేసీఆర్‌తో భేటీ కాగా, ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ కార్యదర్శి కైలాశ్ ముఖి బీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న రాజకీయ పార్టీల నేతలు, వివిధ రంగాల వారితో భేటీ, సమన్వయం బాధ్యతలను కొందరు మంత్రులకు కేసీఆర్ అప్పగించారు. ఈశాన్య రాష్ట్రాల రాజకీయంపై అధ్యయనం ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, త్రిపుర, మేఘాలయ శాసనసభ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 18న షెడ్యూల్ ప్రకటించింది. 2024 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా పార్టీ విస్తరణ కోసం కార్యాచరణ సిద్ధం చేస్తున్న కేసీఆర్ మూడు ఈశాన్యరాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితిపై అధ్యయనం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఓ మాజీ ఐఆర్ఎస్ అధికారి నేతృత్వంలోని బృందానికి బాధ్యత అప్పగించినట్లు తెలిసింది. ఈ బృందం ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించి ప్రస్తుత పరిస్థితి, ఎన్నికల్లో జాతీయ, స్థానిక పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలు తదితరాలపై కేసీఆర్‌కు నివేదికలు అందజేస్తుంది. -
ఈశాన్య రాష్ట్రాల్లో మోగనున్న ఎన్నికల నగారా
-
తవాంగ్ ఘర్షణ: ఎటునుం‘చైనా’.. హెచ్చరిస్తున్న ఛాయా చిత్రాలు..
కయ్యాలమారి చైనా దుందుడుకుగా వ్యవహరిస్తూ ఈశాన్య రాష్ట్రాలపై గురి పెట్టింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో ఇటీవల ఘర్షణల అనంతరం టిబెట్‌లోని వైమానిక స్థావరాల్లో భారీ సంఖ్యలో డ్రోన్లు, యుద్ధ విమానాలను మోహరించి మనపై కయ్యానికి కాలు దువ్వే ప్రయత్నాలు చేసింది. మల్టీ నేషనల్ ఐటీ కంపెనీ మక్సర్ తీసిన హై రిజల్యూషన్ ఉప గ్రహ ఛాయాచిత్రాల ద్వారా ఈ విషయం తేటతెల్లమైంది. మన వైమానిక దళం అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ చైనా కవ్వింపు చర్యల్ని దీటుగా ఎదుర్కొంది. గగనతలంలో నిరంతరం యుద్ధ విమానాలతో గస్తీ నిర్వహిస్తూ డ్రాగన్ దేశం కార్యకలాపాలను గట్టిగా అడ్డుకుంటామని చాటి చెప్పింది. భవిష్యత్‌లో చైనా నుంచి ఎటు నుంచైనా ముప్పు పొంచి ఉందని ఈ ఛాయా చిత్రాలు హెచ్చరిస్తున్నాయి. బాంగ్డా వైమానిక కేంద్రం డబ్ల్యూజెడ్–7 ‘‘సోరింగ్ డ్రాగన్’’ డ్రోన్, ఈ డ్రోన్‌ని గత ఏడాది చైనా అధికారికంగా వైమానిక దళంలోకి ప్రవేశపెట్టింది. 10 గంటల సేపు నిరంతరాయంగా ప్రయాణించగలదు. నిఘా వ్యవస్థకు ఈ డ్రోన్ పెట్టింది పేరు. భారత్‌లో నిర్దేశిత లక్ష్యాలను ఛేదించడానికి క్రూయిజ్ క్షిపణులు పని చేసేలా డేటాను ప్రసారం చేసే సామర్థ్యం కూడా ఈ డ్రోన్ కలిగి ఉంది. ఈ తరహా డ్రోన్లు భారత్ వద్ద లేవు. ఇక డిసెంబర్ 14నాటి ఉపగ్రహ ఛాయా చిత్రాల్లో బాంగ్డాలో ఫ్లాంకర్ టైప్ యుద్ధ విమానాలు రెండు మోహరించి ఉన్నాయి. ఈ యుద్ధ విమానాలు భారత్ దగ్గర ఉన్న ఎస్‌యూ–30ఎంకేఐ మాదిరిగా పని చేస్తాయి. లాసా వైమానిక కేంద్రం అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకి 260 కి.మీ. దూరం నాలుగు జే–10 యుద్ధవిమానాలను సిద్ధంగా ఉంచింది. చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీలో ఈ యుద్ధ విమానాలు అత్యంత విశ్వసనీయమైనవిగా గుర్తింపు పొందాయి. 1988 నుంచి వీటిని వాడుతున్న చైనా ఆర్మీకి ఈ యుద్ధ విమానాలు బాక్ బోన్ అని చెప్పొచ్చు. ఇక లాసాలో మౌలిక సదుపాయాల కల్పనకి సంబంధించిన పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తోంది. రెండో రన్‌వే నిర్మాణం శరవేగంగా సాగుతోంది. షిగాట్సే వైమానిక కేంద్రం సిక్కిం సరిహద్దుకి 150కి.మీ. దూరం ఇక్కడ చైనా అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ (యూఏవీ)లను మోహరించింది. టిబెట్‌లో మొత్తం రక్షణ వ్యవస్థనే ఆధునీకరిస్తోంది. ఆధునిక యుద్ధ విమానాలైన జే–10సీ, జే–11డీ, జే–15 విమానాలు కూడా మోహరించి ఉన్నాయి. ఇవన్నీ గతంలో ఎన్నడూ లేని విధంగా భారత్ వినియోగించే జెట్స్‌ను అడ్డుకునే అవకాశాలున్నాయి. బలం పెంచుకుంటున్న ఇరుపక్షాలు 2017లో డోక్లాం సంక్షోభం తర్వాత భారత్, చైనా వాస్తవాధీన రేఖ వెంబడి ఆయుధాలపరంగా, సదుపాయాలపరంగా బలం పెంచుకుంటున్నాయి. వివాదాస్పద జోన్లలో భారత్ సైన్యం కదలికల్ని అనుక్షణం అంచనా వేయడానికి చైనా వైమానిక సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోతోంది. సరిహద్దుల్లో చైనా మోహరిస్తున్న ఆధునిక యుద్ధ విమానాలు, ఇతర కొత్త ప్రాజెక్టులు, నిర్మాణాలు డ్రాగన్ బలాన్ని విపరీతంగా పెంచేస్తున్నాయని టిబెట్ ప్రాంతంలో ఆ దేశ మిలటరీ కార్యకలాపాలను నిరంతరం ట్రాక్ చేసే మిలటరీ అనలిస్ట్ సిమ్ టాక్ అభిప్రాయపడ్డారు. టిబెట్, తూర్పు లద్దాఖ్ మీదుగా చైనా బలగాలను అనుసంధానం చేయడానికి కొత్త మార్గాలను నిర్మించే పనిలో డ్రాగన్ దేశం ఉందని చెప్పారు. అస్సాం, బెంగాల్లో మైదాన ప్రాంతాలైన తేజ్‌పూర్, మిసామరి, జోర్హాట్, హషిమారా, బాగ్డోగ్రాలో దశాబ్దాలుగా భారతీయ యుద్ధ విమానాల నిర్వహణ మన దేశానికి ఎంతో కలిసొస్తోంది. కొండ ప్రాంతాల్లోని టిబెట్ వైమానిక స్థావరాల నిర్వహణలో చైనాకు యుద్ధ విమానాల బరువుపై పరిమితులున్నాయి. మనకది లేకపోవడం కలిసొచ్చే అంశమని విశ్లేషకులు అంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈశాన్యం అభివృద్ధికి ఆకాశమే హద్దు
షిల్లాంగ్/అగర్తలా: ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిలో ఎదురవుతున్న అడ్డంకులన్నింటినీ ఎనిమిదేళ్లలో తొలగించామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఆయన ఆదివారం మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లోని నార్త్ఈస్ట్ కౌన్సిల్ (ఎన్ఈసీ) గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో ప్రసంగించారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. ‘‘ఎనిమిదేళ్లలో ఈశాన్యం నుంచి విమాన సేవలు మెరుగవడంతో ఇతర ప్రాంతాలతో అనుసంధానం పెరిగింది. విమానాశ్రయాలు 9 నుంచి 16కు, విమానాల సంఖ్య 900 నుంచి 1,900కు పెరిగాయి. రైల్వేమ్యాప్లో ఈశాన్య రాష్ట్రాలు కూడా చేరాయన్నారు. జాతీయ రహదారులు 50 శాతం పెరిగిందన్నారు. జలమార్గాలను విస్తరించే పనులు జరుగుతున్నాయి’’ అన్నారు. ఈశాన్యమే కేంద్రస్థానం ఆగ్నేయాసియాకు ఈశాన్య రాష్ట్రాలే మన ముఖద్వారమని మోదీ పేర్కొన్నారు. మొత్తం ఆగ్నేయాసియా అభివృద్ధికి ఈశాన్యం కేంద్రస్థానంగా మారగలదని చెప్పారు. ఆ దిశగా ఇండియన్–మయన్మార్, థాయ్‌లాండ్ ప్రధాన రహదారి, అగర్తలా–అఖురా రైల్వే ప్రాజెక్టు పురోగతిలో ఉన్నాయన్నారు. ఈశాన్యంలో ఎన్నో శాంతి ఒప్పందాలు, అంతర్రాష్ట్ర సరిహద్దు ఒప్పందాలు కుదిరాయని గుర్తుచేశారు. ఫలితంగా తీవ్రవాద సంఘటనలు తగ్గుముఖం పట్టాయని వెల్లడించారు. ఈశాన్య రాష్ట్రాల ఆర్థిక, సామాజిక ప్రగతి కోసం 1971లో పార్లమెంట్ చట్టం ద్వారా నార్త్ఈస్ట్ కౌన్సిల్ ఏర్పాటయ్యింది. 1972 నవంబర్ 7 నుంచి అమల్లోకి వచ్చింది. త్రిపుర బహుముఖ అభివృద్ధే లక్ష్యం ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా డబుల్ ఇంజన్ ప్రభుత్వం అవిశ్రాంతంగా కష్టపడి పని చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆయన ఆదివారం త్రిపుర రాజధాని అగర్తలాలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన 2 లక్షకుపైగా నూతన గృహాలను ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. అనంతరం స్వామి వివేకానంద మైదానంలో బహిరంగ సభలో ప్రసంగించారు. త్రిపుర బహుముఖ అభివృద్ధే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ రోజు 2 లక్షల పేద కుటుంబాలకు ఇళ్లు ఇచ్చామని, మెజారిటీ లబ్ధిదారులు మహిళలేనని చెప్పారు. గత ఐదేళ్లుగా పరిశుభ్రత అనేది ఒక ప్రజాఉద్యమంగా మారిందని, త్రిపుర అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రంగా అవతరించిందని ప్రశంసించారు. త్రిపురలో అనుసంధానం, మౌలిక ప్రాజెక్టుల కోసం రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని మోదీ పేర్కొన్నారు. ‘‘త్రిపుర గతంలో ఘర్షణలకు మారుపేరుగా ఉండేది. 2018లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధికి, అనుసంధానానికి, శుభ్రతకు పర్యాయపదంగా మారింది’’ అన్నారు. ఈశాన్య భారత్‌ను, బంగ్లాదేశ్‌ను అనుసంధానించే 15 కిలోమీటర్ల అగర్తలా–అఖౌరా రైల్వేప్రాజెక్టు వచ్చే ఏడాది పూర్తవుతుందన్నారు. ఆ రాష్ట్రాలు.. అష్టలక్ష్ములు ఈశాన్య ప్రాంతాల ప్రగతికి ప్రతిబంధకంగా మారిన అవినీతి, వివక్ష, హింస, ఓటు బ్యాంకు రాజకీయాలకు రెడ్‌కార్డ్ చూపించామని మోదీ అన్నారు. ‘‘నార్త్ఈస్ట్ను విభజించేందుకు గతంలో ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. మేమొచ్చాక అలాంటి ఆటలు సాగనివ్వడం లేదు’’ అన్నారు. ఆదివారం ఉదయం షిల్లాంగ్‌లో ఆయన కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. మరికొన్నింటిని ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. గత 50 ఏళ్లలో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిలో ఎన్ఈసీ పోషించిన పాత్రను వివరిస్తూ రచించిన ‘గోల్డెన్ ఫూట్ప్రింట్స్’ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ఈశాన్యం అభివృద్ధి విషయంలో ఎన్ఈసీ అందించిన సేవలను మరువలేమని ప్రధాని మోదీ ప్రశంసించారు. నార్త్ఈస్ట్లోని ఎనిమిది రాష్ట్రాలను అష్టలక్ష్మిలుగా అభివర్ణించారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎనిమిది పునాది స్తంభాలపై ప్రభుత్వం పనిచేయాలని ఉద్బోధించారు. అవి.. శాంతి, అధికారం, పర్యాటకం, 5జీ అనుసంధానం, సంస్కృతి, ప్రకృతి వ్యవసాయం, క్రీడలు పనిచేయగల శక్తి అని వివరించారు. -
ఆర్థిక క్రమశిక్షణతోనే అభివృద్ధి వేగవంతం
గువాహటి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగాలంటే ఈశాన్య రాష్ట్రాల ఆర్థిక క్రమశిక్షణ అత్యవసరమని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. గువాహటిలో ఈశాన్య రాష్ట్రాల మండలి(ఎన్ఈసీ) 70వ ప్లీనరీ ముగింపు సమావేశంలో అమిత్ పాల్గొని ప్రసంగించారు. అవసరమైన చోట నిధుల సద్వినియోగం, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టిపెడితే అభివృద్ధి ఫలాలు త్వరగా చేతికొస్తాయన్నారు. కేంద్రనిధులతో పాటు రాష్ట్రాల ఆదాయాల విషయంలోనూ ఇదే విధానం అవసరమన్నారు. ‘ఇతర రాష్ట్రాలతో సమానంగా ఈశాన్య రాష్ట్రాలకు అభివృద్ధి చెందేందుకు పుష్కలమైన అవకాశాలున్నాయి. ఇందుకోసం ఈశాన్య రాష్ట్రాలన్నీ సంపూర్ణ సమన్వయంతో పనిచేయాలి’ అని ఎన్ఈసీ చైర్మన్ హోదాలో అమిత్ సూచించారు. అమిత్, కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి, 8 రాష్ట్రాల సీఎంలు పాల్గొని ఈశాన్య రాష్ట్రాల భవిష్యత్ కార్యాచరణ, సమస్యల పరిష్కారం తదితర అంశాలపై చర్చించారు. ఆరోగ్యకర పోటీ అవసరం : కిషన్‌రెడ్డి కేంద్రం ఇస్తున్న 10 శాతం నిధుల సద్వినియోగం విషయంలో ఈశాన్య రాష్ట్రాల మధ్య ఆరోగ్యకర పోటీతోపాటు ప్రత్యేక దృష్టిసారిస్తే çపురోగతి సాధ్యమని కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లోని 4,700 గ్రామాల్లో టెలికమ్యూనికేషన్ అనుసంధానత కోసం 500 రోజుల్లో లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. -
NEC Meet 2022: ఈశాన్య రాష్ట్రాల్లో పెట్టుబడులు పెరగాలి
గువాహటి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటకాభివృద్ధికి ఉన్న విస్తృత అవకాశాలను ప్రోత్సహించే లక్ష్యంతో త్వరలో టూరిజం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేయనున్నట్లు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. గువాహటిలో శనివారం ప్రారంభమైన రెండు రోజుల 70వ ఈశాన్య రాష్ట్రాల మండలి(ఎన్ఈసీ) ప్లీనరీ సమావేశాల్లో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ‘ఈశాన్య రాష్ట్రాల్లో పెట్టుబడులకు అనువైన వాతావరణ కల్పనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలి. ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈశాన్య రాష్ట్రాలతో కలిపి అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు(గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్)ను నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం’ అని కిషన్ రెడ్డి అన్నారు. ‘ఈశాన్య రాష్ట్రాల్లో పెట్టుబడిదారులకు అనువైన విధానపర నిర్ణయాలు, భూ బ్యాంకు డిజిటలీకరణ( అందుబాటులో ఎక్కడ ఎంత భూమి ఉంది), పెట్టుబడుల నిబంధనల సరళీకరణ, సింగిల్ విండో నిబంధనల ద్వారా పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణాన్ని సృష్టించాలి. ప్రతి రాష్ట్రంలో ఇన్వెస్టర్స్ ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టాలి’ అని కిషన్ రెడ్డి సూచించారు. ‘ఈశాన్య రాష్ట్రాల్లో జాతీయ రహదారుల అభివృద్ధికి మరో రూ.80వేల కోట్లు ఖర్చు చేయనున్నాం. 19 కొత్త రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధికి రూ.60 వేల కోట్లు ఖర్చు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి లేకుండా దేశాభివృద్ధి సంపూర్ణం కాదు’ అని మంత్రి వ్యాఖ్యానించారు. ‘ ఈ రాష్ట్రాల్లో శాంతి స్థాపన కోసం, రాజకీయ స్థిరత్వం కోసం కేంద్రం ప్రయత్నిస్తోంది’ అని ఆయన అన్నారు. -
Covid-19: ఈశాన్య రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వర్చువల్ భేటీ
న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న కరోనా పరిస్థితులపై ప్రధాని మోదీ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. క్షేత్రస్థాయిలో తక్షణ చర్యలు తీసుకోవాలి. కరోనా వేరియంట్లపై జాగ్రత్తగా ఉండాలి. కొత్త వేరియంట్లపై నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. కరోనా నిబంధనలను పాటించేలా ప్రజలను ప్రోత్సహించాలి. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి.’’ అని అన్నారు. అంతేకాకుండా ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రులకు ప్రధాని మోదీ సూచించారు. వ్యాక్సిన్ పై ప్రజల్లో అపోహలు తొలగించాలని ఆయన అన్నారు. 23 వేల కోట్ల రూపాయలతో ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు. ఇక ఈ సమావేశంలో అసోం, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హోం మంత్రి అమిత్ షా, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈనెల 16న ప్రధాని మోదీ మరో వీడియో కాన్ఫరెన్స్ ఈనెల 16న ఉదయం 11 గంటలకు ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, కేరళ సీఎంలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో భాగంగా కోవిడ్-19 పరిస్థితులు, వ్యాక్సినేషన్ అంశాలపై ప్రధాని మోదీ సీఎంలతో సమీక్షించనున్నారు. -
ఈశాన్య రాష్ట్రాలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్
ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు ఉదయం 11 గంటలకు కరోనాపై ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న కరోనా పరిస్థితులపై సమీక్షించనున్నారు. కరోనా నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్ పై ప్రధాని మాట్లాడనున్నారు. ఈ సమావేశంలో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొననున్నారు. కాగా గత కొన్ని రోజులుగా ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. క్రీడాకారులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లనున్న భారత క్రీడాకారులతో నేడు సాయంత్రం ఐదు గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. ఈ కాన్ఫరెన్స్ ద్వారా క్రీడాకారులకు మోదీ బెస్ట్ విషెస్ తెలపనున్నారు. -
ఈశాన్య రాష్ట్రాలతో సంబంధాలు కట్
గువాహటి: భారీ వర్షాలు, వరదల కారణంగా ఈశాన్య రాష్ట్రాలకు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు వారం రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో అనేక ప్రాంతాలు జలదిగ్బంధనంలో ఉన్నాయి. దీంతో బిహార్, పశ్చిమ బెంగాల్, అసోంలను ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లే అన్ని రైళ్లు ఈ నెల 12 వ తేదీ నుంచి నిలిచిపోయాయి. 20వ తేదీ వరకు ఇదే పరిస్థితి ఉండవచ్చని ఈశాన్య రైల్వే పేర్కొంది. ఎంతో కీలకమైన, బెంగాల్‌లోని జల్పాయిగురి, బిహార్‌లోని కటిహార్ స్టేషన్లు వరదలో చిక్కుకోవటంతో ఈ పరిస్థితి ఏర్పడిందని, దీంతో అన్ని రైళ్లను రద్దు చేసినట్లు వివరించింది. "అసోం దుఃఖదాయిని" బ్రహ్మపుత్రా నది విలయతాండవానికి 100 మంది బలయ్యారు. 22 లక్షల మందికిపైగా నిరాశ్రయులు కాగా వందల వేల సంఖ్యలో జంతువులు వరదలో కొట్టుకుపోయాయి. భారీ వర్షాల కారణంగా ఉప్పొంగిన బ్రహ్మపుత్రా నది.. అతిప్రమాదకరంగా ప్రవహిస్తూ తీరం వెంబడి ఊళ్లన్నింటినీ ముంచేస్తోంది. నదిలోకి ఇంకా వరద నీరు వచ్చిచేరుతుండటంతో ఉధృతి ఇప్పుడప్పుడే తగ్గేలా కనిపించడంలేదు. -
ఈశాన్య రాష్ట్రాలపై దృష్టి పెట్టిన కేంద్రం!