కజిరంగా నేషనల్ పార్క్‌లో గజరాజుకు చెరుకు గడలు తినిపిస్తున్న ప్రధాని మోదీ
మేము ఐదేళ్లలో చేసిన అభివృద్ధి చేయాలంటే కాంగ్రెస్‌కు 20 ఏళ్లు పట్టేది
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడి
అరుణాచల్‌ప్రదేశ్‌లో రూ.55,600 కోట్ల ప్రాజెక్టులు ప్రారంభం
ఈటానగర్/జోర్హాట్: ఈశాన్య రాష్ట్రాల్లో తమ ప్రభుత్వం గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధిని చేయాలంటే కాంగ్రెస్ పార్టీకి 20 సంవత్సరాలు పట్టేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆయన శనివారం అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించారు. ఈశాన్య భారతదేశానికి సంబంధించి రూ.55,600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం ఈటానగర్‌లో ‘వికసిత్ భారత్–వికసిత్ నార్త్‌ఈస్ట్’ బహిరంగ సభలో ప్రసంగించారు.
ఇండియాకు.. దక్షిణాసియా, తూర్పు ఆసియా దేశాలకు మధ్య వాణిజ్యం, టూరిజంతోపాటు ఇతర సంబంధాల విషయంలో ఈశాన్య రాష్ట్రాలు బలమైన అనుసంధానంగా మారబోతున్నాయని తెలిపారు. గత ఐదేళ్ల కాలంలో ఈ ప్రాంతంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టామని, అభివృద్ధిని వేగవంతం చేశామని పేర్కొన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌ను సందర్శించేవారికి ‘మోదీ గ్యారంటీ’ స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు.
ఈశాన్య ప్రజలంతా నా కుటుంబ సభ్యులే
మోదీకి కుటుంబం ఉందా అని ప్రతిపక్ష నేతలు ప్రశి్నస్తున్నారని ప్రధాని అన్నారు. ‘‘వారికి ఒక్కటే చెబుతున్నా. ఈశాన్య రాష్ట్రాల ప్రజలంతా నా కుటుంబ సభ్యులే’’ అన్నారు. దేశంలో ప్రతి ఒక్కరికీ సురక్షితతాగునీరు, సొంతిల్లు, వంట గ్యాస్ కనెక్షన్, విద్యుత్, ఇంటర్నెట్ సౌకర్యం కలి్పంచాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు. అప్పడే ‘వికసిత్ భారత్’ కల నెరవేరుతుందన్నారు.
సేలా టన్నెల్ జాతికి అంకితం
ప్రపంచంలో అత్యంత పొడవైన రెండు వరుసల సొరంగం ‘సేలా టన్నెల్’ను మోదీ వర్చువల్‌గా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో భారత్–చైనా సరిహద్దు ఎల్‌ఏసీ సమీపంలో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ రూ.825 కోట్లతో సముద్ర మట్టానికి 13 వేల అడుగుల ఎత్తున ఈ టన్నెల్ నిర్మించింది. ఈ ప్రాజెక్టులో రెండు సొరంగాలున్నాయి. ఒకటి సింగిల్ ట్యూబ్ టన్నెల్. దీని పొడవు 1,003 మీటర్లు. ఎస్కేప్ ట్యూబ్‌తో కూడిన రెండో టన్నెల్ పొడవు 1,595 మీటర్లు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో బలిపారా–చారిదువార్–తవాంగ్ మార్గం మూతపడుతోంది. సేలా టన్నెల్‌తో ఆ ఇక్కట్లు తప్పాయి.
లచిత్ బోర్ఫుకన్ విగ్రహావిష్కరణ
అస్సాంలోని జోర్హాట్‌లో 125 అడుగుల ఎత్త యిన అహోం జనరల్ లచిత్ బోర్ఫుకన్ కంచు విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా అస్సాం సంప్రదాయ దుస్తులు, తలపాగా ధరించి, అహోం ఆచార ంలో పాలుపంచుకున్నారు. అస్సాంలో 1228 నుంచి 1826 వరకు అహోం రాజవంశం పరిపాలన సాగింంచింది. 1671లో జరిగి న స రాయ్‌ఘాట్ యుద్ధంలో అహోం సైనికాధికా రి లచిత్ బోర్ఫుకన్ అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించారు. బలీయమైన మొ ఘల్ సైన్యాన్ని వెనక్కి తరిమికొట్టారు. అహోం రా జ్యాన్ని కాపాడారు. ఆయనను అస్సాం ప్రజ లు ఇప్పటికీ స్మరించుకుంటూ ఉంటారు.
Comments
Please login to add a commentAdd a comment