development projects
-
బంధుప్రీతి, బుజ్జగింపు విపక్షాలపై మోదీ ధ్వజం
వారణాసి/కోల్‌కతా: బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలే ప్రతిపక్షాల విధానమని ప్రధాని మోదీ మండిపడ్డారు. తన సొంత లోక్‌సభ నియోజవర్గమైన వారణాసిలో ఆదివారం రూ.6,700 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారణాసి శివారులోని సీగ్రాలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. దేశంలో పదేళ్ల క్రితం వరకు వందల కోట్ల రూపాయల కుంభకోణాల గురించి పత్రికల్లో నిత్యం వార్తలు వస్తుండేవని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో వారణాసిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. తాము అధికారంలోకి వచి్చన తర్వాత అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టలకు బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలు తప్ప అభివృద్ధి అంటే ఏమిటో తెలియదని ఎద్దేవా చేశారు. వారణాసి అభివృద్ధిని అవి పూర్తిగా విస్మరించాయని ఆరోపించారు. ‘సబ్కా వికాస్’ సిద్ధాంతంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక గత 125 రోజులవ్యవధిలోనే దేశవ్యాప్తంగా రూ.15 లక్షల కోట్ల విలువైన పనులు ప్రారంభించామని చెప్పారు. అభివృద్ధి ప్రాజెక్టుల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కలి్పంచడం తమ లక్ష్యమని ప్రకటించారు. ఎయిర్‌పోర్టు విస్తరణ పనులకు శంకుస్థాపన పశి్చమ బెంగాల్ రాష్ట్రం సిలిగురి సమీపంలోని బాగ్డోగ్రా ఎయిర్‌పోర్టు విస్తరణ పనులకు ప్రధాని మోదీ ఆదివారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. రూ.1,550 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఈ ఏడాది ఆగస్టులో ఆమోదం తెలిపింది. శంకర కంటి ఆసుపత్రి ప్రారంభం వారణాసిలో కంచి మఠం ఆధ్వర్యంలో నిర్మించిన ఆర్జే శంకర కంటి ఆసుపత్రిని మోదీ ప్రారంభించారు. ఈ ఆస్పత్రిలో ఏటా 30 వేల కంటి శస్త్రచికిత్సలు ఉచితంగా చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు మఠం వర్గాలు తెలిపాయి. వారణాసికి రావడం ఆశీర్వచనంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా మోదీ అన్నారు. మత విశ్వాసాలకు, ఆధ్యాతి్మకతకు కేంద్రమైన వారణాసి నగరం ఆరోగ్య కేంద్రంగానూ అభివృద్ధి చెందుతుండడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. మోదీపై కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామి ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్డీఏ అంటే ‘నరేంద్ర దామోదర్ దాస్ కా అనుశాసన్’ అని అభివర్ణించారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా మోదీ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందని కితాబిచ్చారు. ఇది ప్రపంచంలోనే ఆదర్శవంతమైన ప్రభుత్వమని కొనియాడారు. -
Narendra Modi: దేశ ప్రతిష్ట దిగజార్చే యత్నం
అహ్మదాబాద్: పలు అభివృద్ధి ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల కోసం సొంత రాష్ట్రం గుజరాత్లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. విద్వేషాన్ని నింపుకున్న వాళ్లు దేశ ప్రతిష్టను మసకబార్చేందుకు దొరికే ఏ ఒక్క అవకాశాన్నీ వదలిపెట్టరని వ్యాఖ్యానించారు. అహ్మదాబాద్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో రూ.8,000 కోట్ల పలు ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. తర్వాత దేశంలోనే తొలి వందేభారత్ మెట్రో సర్వీస్ అయిన భుజ్–అహ్మదాబాద్ ‘నమో భారత్ ర్యాపిడ్ రైల్’ను ప్రారంభించారు. దీంతోపాటు ఐదు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లనూ మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ రాహుల్, కాంగ్రెస్‌పై పరోక్ష విమర్శలు చేశారు. ‘‘ కొందరు ప్రతికూలత, విద్వేషంతో భారత్‌ను విడగొట్టేందుకు దేశ ఐక్యత, సమత్రలను లక్ష్యంగా చేసుకుంటారు. ఇండియా, గుజరాత్ల పరువు తీసేందుకు దొరికే ఏ ఒక్క అవకాశాన్నీ వీళ్లు చేజార్చుకోరు. మూడోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టాక తొలి 100 రోజుల్లో పాలనపై విపక్షాలు దారుణంగా విమర్శించాయి. నేను మాత్రం అభివృద్ధి అజెండా అమలుపైనే దృష్టిపెట్టా. నేను జీవిస్తే మీ కోసమే జీవితాన్ని ధారపోస్తా. పోరాడితే మీ కోసమే పోరాడతా. చనిపోవాల్సి వస్తే మీ కోసమే ప్రాణాలప్పిస్తా’’ అని వేలాది మంది సభకులనుద్దేశించి అన్నారు.తొలి భారత్ మెట్రో పేరు మార్పుమెట్రో నగరాల మధ్య తిరిగే దేశంలో తొలి మెట్రో ‘వందే మెట్రో’ పేరును ప్రారంభోత్సవానికి కొద్దిసేపటి ముందు కేంద్రం ‘నమో భారత్ ర్యాపిడ్ రైల్’గా మార్చింది. సోమవారం సాయంత్రం ఈ రైలును మోదీ అహ్మదాబాద్ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఇది తొమ్మిది స్టేషన్లలో ఆగుతూ 359 కి.మీ. ప్రయాణించి అహ్మదాబాద్‌కు చేరుకుంటుంది. ఈ రైలు సేవలు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. భుజ్ నుంచి అహ్మదాబాద్‌కు టికెట్ ధర రూ.455గా నిర్ణయించారు.మరో మెట్రోలో ప్రధాని ప్రయాణంఅహ్మదాబాద్, గాంధీనగర్‌లను కలిపే రెండో దశ మెట్రోను మోదీ ప్రారంభించారు. అందులో గాంధీనగర్ సెక్టార్1 స్టేషన్ నుంచి గిఫ్ట్ సిటీకి వెళ్లారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, కొందరు విద్యార్థులు ప్రయాణించారు. రూ.5,384 కోట్ల వ్యయంతో ఫేజ్2 పనులు చేపట్టారు.భారత సౌర విప్లవం ఒక సువర్ణాధ్యాయంగాంధీనగర్లో నాలుగో ప్రపంచ పునరుత్పాదక ఇంధన పెట్టుబడి దారుల సదస్సు, ప్రదర్శనను మోదీ ప్రారంభించారు. ‘‘వెయ్యేళ్ల ప్రగతికి భారత్ పునాదులు వేసుకుంటోంది. అభివృద్ధిలో అగ్రస్థానానికి చేరుకోవడమే గాక, అక్కడే కొనసాగాలని లక్షిస్తోంది. మూడో దఫా పాలన తొలి 100 రోజుల్లో మా ప్రాధమ్యాలను గమనిస్తే దేశం వేగం, విస్తృతి అర్ధమవుతాయి’’ అని పెట్టుబడిదారులను ఉద్దేశించి అన్నారు. ‘‘సౌర, పవన, అణు, జల విద్యుదుత్పత్తి ద్వారా భారత్ ఇంధన అవసరాలు తీర్చుకోనుంది. దేశ 21వ శతాబ్ద చరిత్రలో సౌరవిప్లవ అధ్యాయాన్ని సువర్ణాక్షరాలతో రాస్తారు’’ అన్నారు. గాంధీనగర్‌లో వవోల్ ప్రాంతంలోని షాలిన్–2 సొసైటీలో ‘పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజనా’ పథక లబ్ధిదారులతో మోదీ మాట్లాడారు. -
కశ్మీర్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు మొదలయ్యాయని ప్రధాని మోదీ చెప్పారు. ఈ కేంద్ర పాలిత ప్రాంతానికి త్వరలోనే రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని ప్రకటించారు. గురువారం సాయంత్రం శ్రీనగర్‌లో రూ.1,500 కోట్ల విలువైన 84 అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కశ్మీర్లో ఇటీవలి ఉగ్రదాడులకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. జమ్మూకశ్మీర్ శత్రువులకు తగు రీతిలో బుద్ధి చెబుతామన్నారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్న జమ్మూకశ్మీర్ యువతను ఆయన అభినందించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అడ్డుగోడ తొలగిపోయిందని, జమ్మూకశ్మీర్‌లో నేడు భారత రాజ్యాంగం నిజంగా అమలవుతోందని చెప్పారు. జమ్మూకశ్మీర్‌లో శాశ్వతంగా శాంతిని నెలకొల్పుతామని ప్రజలకు హామీ ఇచ్చారు.శ్రీనగర్‌లో నేడు యోగా డేఅంతకుముందు, జమ్మూకశ్మీర్‌లో రెండు రోజుల పర్యటనకు గాను గురువారం సాయంత్రం శ్రీనగర్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి షేర్–ఇ–కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్(ఎస్కేఐసీసీ)వద్ద ఘన స్వాగతం లభించింది. శుక్రవారం ఉదయం 6.30 గంటలకు దాల్ సరస్సు సమీపంలోని ఎస్కేఐసీసీలో జరిగే 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో 7 వేల మందికి పైగా పాలుపంచుకుని ఆసనాలు వేస్తారు. -
‘ఈశాన్యం’లో అభివృద్ధి వేగవంతం
ఈటానగర్/జోర్హాట్: ఈశాన్య రాష్ట్రాల్లో తమ ప్రభుత్వం గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధిని చేయాలంటే కాంగ్రెస్ పార్టీకి 20 సంవత్సరాలు పట్టేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆయన శనివారం అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించారు. ఈశాన్య భారతదేశానికి సంబంధించి రూ.55,600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం ఈటానగర్‌లో ‘వికసిత్ భారత్–వికసిత్ నార్త్ఈస్ట్’ బహిరంగ సభలో ప్రసంగించారు. ఇండియాకు.. దక్షిణాసియా, తూర్పు ఆసియా దేశాలకు మధ్య వాణిజ్యం, టూరిజంతోపాటు ఇతర సంబంధాల విషయంలో ఈశాన్య రాష్ట్రాలు బలమైన అనుసంధానంగా మారబోతున్నాయని తెలిపారు. గత ఐదేళ్ల కాలంలో ఈ ప్రాంతంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టామని, అభివృద్ధిని వేగవంతం చేశామని పేర్కొన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌ను సందర్శించేవారికి ‘మోదీ గ్యారంటీ’ స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. ఈశాన్య ప్రజలంతా నా కుటుంబ సభ్యులే మోదీకి కుటుంబం ఉందా అని ప్రతిపక్ష నేతలు ప్రశి్నస్తున్నారని ప్రధాని అన్నారు. ‘‘వారికి ఒక్కటే చెబుతున్నా. ఈశాన్య రాష్ట్రాల ప్రజలంతా నా కుటుంబ సభ్యులే’’ అన్నారు. దేశంలో ప్రతి ఒక్కరికీ సురక్షితతాగునీరు, సొంతిల్లు, వంట గ్యాస్ కనెక్షన్, విద్యుత్, ఇంటర్నెట్ సౌకర్యం కలి్పంచాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు. అప్పడే ‘వికసిత్ భారత్’ కల నెరవేరుతుందన్నారు. సేలా టన్నెల్ జాతికి అంకితం ప్రపంచంలో అత్యంత పొడవైన రెండు వరుసల సొరంగం ‘సేలా టన్నెల్’ను మోదీ వర్చువల్‌గా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో భారత్–చైనా సరిహద్దు ఎల్ఏసీ సమీపంలో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ రూ.825 కోట్లతో సముద్ర మట్టానికి 13 వేల అడుగుల ఎత్తున ఈ టన్నెల్ నిర్మించింది. ఈ ప్రాజెక్టులో రెండు సొరంగాలున్నాయి. ఒకటి సింగిల్ ట్యూబ్ టన్నెల్. దీని పొడవు 1,003 మీటర్లు. ఎస్కేప్ ట్యూబ్‌తో కూడిన రెండో టన్నెల్ పొడవు 1,595 మీటర్లు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో బలిపారా–చారిదువార్–తవాంగ్ మార్గం మూతపడుతోంది. సేలా టన్నెల్‌తో ఆ ఇక్కట్లు తప్పాయి. లచిత్ బోర్ఫుకన్ విగ్రహావిష్కరణ అస్సాంలోని జోర్హాట్లో 125 అడుగుల ఎత్త యిన అహోం జనరల్ లచిత్ బోర్ఫుకన్ కంచు విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా అస్సాం సంప్రదాయ దుస్తులు, తలపాగా ధరించి, అహోం ఆచార ంలో పాలుపంచుకున్నారు. అస్సాంలో 1228 నుంచి 1826 వరకు అహోం రాజవంశం పరిపాలన సాగింంచింది. 1671లో జరిగి న స రాయ్‌ఘాట్ యుద్ధంలో అహోం సైనికాధికా రి లచిత్ బోర్ఫుకన్ అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించారు. బలీయమైన మొ ఘల్ సైన్యాన్ని వెనక్కి తరిమికొట్టారు. అహోం రా జ్యాన్ని కాపాడారు. ఆయనను అస్సాం ప్రజ లు ఇప్పటికీ స్మరించుకుంటూ ఉంటారు. -
ఆర్టికల్ 370 రద్దుతో ప్రజలకు స్వేచ్ఛ
శ్రీనగర్: ఆర్టికల్ 370 రద్దు తర్వాత అభివృద్ధిలో జమ్మూకశ్మీర్ నూతన శిఖరాలకు చేరుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. అబివృద్ధికి అడ్డుగోడగా మారిన ఈ ఆర్టికల్‌ను రద్దు చేశాక ప్రజలకు స్వేచ్ఛ లభించిందని, జమ్మూకశ్మీర్ హాయిగా ఊపిరి పీల్చుకుంటోందని చెప్పారు. గురువారం జమ్మూకశ్మీర్‌లో మోదీ పర్యటించారు. దాదాపు రూ.5,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. వాటిని జాతికి అంకితం చేశారు. జమ్మూకశ్మీర్‌లో కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన 1,000 మంది యువతకు నియామక పత్రాలు అందజేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో మాట్లాడారు. వివిధ రంగాల్లో విజయాలు సాధించిన మహిళలు, రైతులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ‘చలో ఇండియా గ్లోబల్ డయాస్పోరా క్యాంపెయిన్’, ‘దేఖో ఆప్నా దేశ్ పీపుల్స్ చాయిస్ టూరిస్టు డెస్టినేషన్ పోల్’ అనే రెండు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం శ్రీనగర్‌లోని బక్షీ స్టేడియంలో ‘వికసిత్ భారత్–వికసిత్ జమ్మూకశ్మీర్’ బహిరంగ సభలో ప్రసంగించారు. ఆర్టికల్ 370పై కాంగ్రెస్ పార్టీ జమ్మూకశ్మీర్ ప్రజలనే కాకుండా మొత్తం దేశాన్ని తప్పుదోవ పట్టించిందని ఆరోపించారు. ఈ ఆర్టికల్ రద్దయ్యాక జమ్మూకశ్మీర్ సంకెళ్లు తెగిపోయాయని అన్నారు. అద్భుతమైన శ్రీనగర్ ప్రజల్లో ఈరోజు తాను కూడా ఒకడినైనందుకు గర్వంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ రోజు తాను ప్రారంభించిన ప్రాజెక్టులు జమ్మూకశ్మీర్ ప్రగతిని మరింత వేగవంతం చేస్తాయని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన భారత్ అనే స్వప్నం సాకారం కావాలంటే జమ్మూకశ్మీర్ అభివృద్ధి చెందాలని స్పష్టం చేశారు. ఇక్కడి ప్రజలంతా తన కుటుంబ సభ్యులేనని చెప్పారు. మోదీతో కశ్మీర్ యువకుడి సెల్ఫీ జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాకు చెందిన యువకుడు నజీమ్ నజీర్ కల నెరవేరింది. సాక్షాత్తూ మోదీతో అతడు తన ఫోన్లో సెల్ఫీ తీసుకున్నాడు. అంతేకాదు నజీర్‌ను మోదీ తన స్నేహితుడిగా సంబోధించారు. గురువారం శ్రీనగర్‌లోని బక్షీ స్టేడియంలో ఈ సంఘటన జరిగింది. నజీర్ తేనెటీగల పెంపకం, తేనె వ్యాపారం చేస్తున్నాడు. మంచి లాభాలు ఆర్జిస్తున్నాడు. దీంతో ప్రధాని మోదీతో సమావేశమయ్యే అవకాశం లభించింది. నజీర్ గురించి తెలుసుకున్న మోదీ అతడిని అభినందించారు. మీతో సెల్ఫీ తీసుకోవాలని నజీర్ కోరగా మోదీ అంగీకరించారు. ఈ సెల్ఫీని మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. మిత్రుడు నజీర్‌తో సెల్ఫీ దిగడం మరిచిపోలేని జ్ఞాపకం అని పేర్కొన్నారు. తేనె వ్యాపారంతో నజీర్ తీపి విప్లవం తీసుకొచ్చాడని ప్రశంసించారు. మీ కుటుంబ సభ్యులను పంపించండి భారతదేశానికి కిరీటం లాంటి జమ్మూకశ్మీర్‌లో పర్యాటకం, వ్యవసాయ రంగాల్లో ప్రగతికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని మోదీ ఉద్ఘాటించారు. జమ్మూకశ్మీర్ కేవలం ఒక ప్రాంతం కాదని, ఇది మన దేశానికి శిరస్సు లాంటిదని చెప్పారు. తలెత్తుకొని నిలబడటం అభివృద్ధికి, గౌరవానికి గుర్తు అని పేర్కొన్నారు. ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. ‘చలో ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ప్రవాస భారతీయులు తమ కుటుంబాల నుంచి కనీసం ఐదుగురిని జమ్మూకశ్మీర్ పర్యటనకు పంపించాలని పిలుపునిచ్చారు. దేశ ప్రజలకు మోదీ మహాశివరాత్రి, రంజాన్ శుభాకాంక్షలు ముందస్తుగా తెలియజేశారు. 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేశాక ప్రధానమంత్రి కశ్మీర్లో పర్యటించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదు. -
Lok Sabha elections 2024: ‘మోదీ గ్యారంటీల’తో గెలుస్తాం
బర్వాడా/సింద్రీ: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 400కుపైగా సీట్లు సాధించడం తథ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. మోదీ గ్యారంటీలే తమను గెలిపిస్తాయని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా తాను ఎక్కడికి వెళ్లినా ‘మోదీ గ్యారంటీ’ అనే నినాదం గట్టిగా వినిపిస్తోందని చెప్పారు. ప్రజల ఆశలు అంతమైన చోటునుంచే మోదీ గ్యారంటీ ప్రారంభమవుతుందని మరోసారి స్పష్టం చేశారు. శుక్రవారం జార్ఖండ్ రాష్ట్రం ధన్‌బాద్ జిల్లాలోని సింద్రీలో రూ.35,700 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. జాతికి అంకితం ఇచ్చారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. అనంతరం ‘విజయ్ సంకల్ప్ మహార్యాలీ’లో ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. నేడు ప్రపంచంలో అత్యంత వేగంగా అబివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో ఇండియా కూడా ఒకటి అని గుర్తుచేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో 8.4 వృద్ధిరేటు నమోదైందని, ఇది చాలా ప్రోత్సాహకరంగా ఉందని వెల్లడించారు. ప్రజల కలలే మా ప్రతిజ్ఞ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. జార్ఖండ్‌లో అధికార జేఎంఎం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని మండిపడ్డారు. రూ.350 కోట్ల నగదుతో జార్ఖండ్‌లో కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహూ దొరికిపోవడాన్ని మోదీ ప్రస్తావించారు. అన్ని నోట్ల కట్టలు తన జీవితంలో ఏనాడూ చూడలేదని అన్నారు. ఆ సొమ్మంతా జార్ఖండ్ ప్రజలదేనని తేలి్చచెప్పారు. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడాల్సిన డబ్బును కాంగ్రెస్ నేతలు లూటీ చేశారని ధ్వజమెత్తారు. వారు దోచుకున్న సొమ్మును తిరిగి వసూలు చేసి, ప్రజలకు అందజేస్తామని, ఇది మోదీ గ్యారంటీ అని చెప్పారు. జార్ఖండ్ ప్రజలు కష్టపడి పనిచేస్తారని, వారి కష్టం వృథా కానివ్వబోమని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు ఎంత బురద చల్లినా కమలం(బీజేపీ గుర్తు) ప్రతిచోటా వికసిస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. ‘ప్రజల కలలే మా ప్రతిజ్ఞ, వారి సంక్షేమమే మోదీ గ్యారంటీ’ అని స్పష్టం చేశారు. తన జీవితంలో ప్రతిక్షణం ప్రజలకే అంకితం అని పేర్కొన్నారు. జనం బాగు కోసమే తాను పని చేస్తున్నానని వెల్లడించారు. దేశంలో గత పదేళ్లలో ఏకంగా 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని హర్షం వ్యక్తం చేశారు. పేదరికాన్ని పూర్తిగా అంతం చేసే దిశగా ముందడుగు వేస్తున్నామని తెలిపారు. సందేశ్‌ఖాలీపై నోరు విప్పరెందుకు? ప్రధాని మోదీ శుక్రవారం పశి్చమ బెంగాల్లో పర్యటించారు. హుగ్లీ జిల్లాలోని అరామ్‌బాగ్‌లో రూ.7,200 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. మరికొన్ని ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వ పాలనలో అరాచక శక్తులు చెలరేగిపోతున్నాయని మోదీ మండిపడ్డారు. సందేశ్‌ఖాలీలో మహిళలు ఘోరమైన అకృత్యాలు జరిగాయని, దీనిపై ప్రతిపక్ష ఇండియా కూటమి ఎందుకు నోరువిప్పడం లేదని నిలదీశారు. సందేశ్‌ఖాలీలో మన అక్కచెల్లెమ్మలను తృణమూల్ కాంగ్రెస్ నేతలు వేధించారని, అత్యాచారాలు చేశారని, ఇది నిజంగా సిగ్గుచేటు అని ధ్వజమెత్తారు. నిందితులను తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతోందని ఆరోపించారు. -
స్కాముల్లేని పదేళ్లు
ద్వారక: ప్రతిపక్ష కాంగ్రెస్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి నిప్పులు చెరిగారు. కేవలం ఒక్క కుటుంబం బాగు కోసం ఆ పార్టీ మొత్తం శక్తిని ఉపయోగించిందని అన్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని రకాల కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక కుంభకోణాలకు, అవినీతి వ్యవహారాలకు అడ్డుకట్ట వేశామని చెప్పారు. గత పదేళ్లగా దేశంలో స్కామ్‌ల మాటే లేదన్నారు. ప్రధాని మోదీ ఆదివారం తన స్వరాష్ట్రం గుజరాత్లో పర్యటించారు. దేశంలోనే అత్యంత పొడవైన తీగల వంతెన ‘సుదర్శన్ సేతు’ను ప్రారంభించారు. ఇది బెయిత్ ద్వారక ద్వీపాన్ని, ప్రధాన భూభాగంలోని ఓఖాను అనుసంధానిస్తుంది. రూ.48,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను కూడా ఈ సందర్భంగా మోదీ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ద్వారకలో బహిరంగ సభలో ప్రసంగించారు. కాంగ్రెస్ పాలనలో మన దేశం ప్రపంచంలో 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేదని చెప్పారు. తమ హయాంలో ఐదో స్థానానికి చేరిందన్నారు. ప్రజల ఆశలు అంతమైన చోటు నుంచే ‘మోదీ గ్యారంటీ’ ప్రారంభమవుతుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరితోపాటు గుజరాత్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశి్చమ బెంగాల్లో నిర్మించిన ‘ఎయిమ్స్’లను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. మత్తు వ్యసనంపై పోరాడుదాం దేశంలో మాదక ద్రవ్యాల వ్యసనం పెరిగిపోతుండడం పట్ల మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. మత్తు వ్యసనంపై పోరాడుదామని పిలుపునిచ్చారు. యువతను మత్తు బారి నుంచి కాపాడుకోవాలంటే వారి కుటుంబాల మద్దతు చాలా కీలకమని అన్నారు. కుటుంబం తోడుగా నిలిస్తే వ్యసనం నుంచి యువత సులువుగా బయటపడతారని సూచించారు. డ్రగ్స్ రహిత భారత్ మన లక్ష్యమని, ఇందుకోసం కుటుంబాలు పూనుకోవాలని, సహకారం అందించాలని కోరారు. గాయత్రీ పరివార్ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం అశ్వమేధ యజ్ఞం నిర్వహించారు. ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. కుటుంబం బలంగా ఉంటే సమాజం బలంగా ఉంటుందని తెలిపారు. కుటుంబ వ్యవస్థ బలహీనపడితే సమాజంలో విలువలు పడిపోతాయన్నారు. ఒక కుటుంబంలో సభ్యులంతా రోజుల తరబడి కలుసుకోకపోతే, మాట్లాడుకోకపోతే ముప్పు ముంచుకొచి్చనట్లేనని స్పష్టం చేశారు. మత్తు రహిత దేశ నిర్మాణం కోసం బలమైన కుటుంబ వ్యవస్థ అవసరమని పేర్కొన్నారు. దేశంలో కోట్లాది మంది యువతను మత్తు వ్యసనం నుంచి తప్పించి, దేశ నిర్మాణ కార్యకలాపాల దిశగా మళ్లించడానికి ఈ అశ్వమేధ యజ్ఞం తోడ్పడుతోందని ప్రశంసించారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, మత్తు ముప్పు నుంచి వారిని కాపాడుకోవాలని స్పష్టం చేశారు. ఇప్పటికే మత్తు వలలో చిక్కుకున్నవారిని బయటకు తీసుకొద్దామని సూచించారు. యువత సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎన్నో పథకాలు అమల్లోకి తీసుకొచి్చందని వెల్లడించారు. అమృత్ భారత్ పథకం కింద దేశవ్యాప్తంగా 553 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులకు మోదీ సోమవారం వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. మరికొన్ని ప్రాజెక్టులను జాతికి అంకితమిస్తారు. దేశం కోసం ఓటేయండి యువ ఓటర్లకు మోదీ పిలుపు ‘మన్ కీ బాత్’కు 3 నెలలు విరామం న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి మూడు నెలలు విరామం ఇస్తున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. మార్చిలో ఎలక్షన్ కోడ్ రావచ్చన్నారు. మన్ కీ బాత్ పేరిట ఆయన ప్రతి నెలా చివరి ఆదివారం ప్రజలనుద్దేశించి రేడియోలో ప్రసంగిస్తుండటం తెలిసిందే. తాజాగా 110వ మన్ కీబాత్‌లో మోదీ మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో తొలిసారిగా ఓటు వేయబోతున్న యువ ఓటర్లకు ప్రత్యేక సూచన చేశారు. దేశం కోసం తప్పనిసరిగా తొలి ఓటు ఓటేయండి’’ అన్నారు. ‘‘మన్ కీ బాత్ పూర్తిస్థాయిలో విజయవంతమైంది. మూణ్నెల్ల తర్వాత 111వ మన్ కీ బాత్‌తో మళ్లీ కలుద్దాం. చెప్పారు. 111 సంఖ్య చాలా శుభప్రదం. దేశ అభివృద్ధి ప్రయాణంలో నారీశక్తి పాత్ర పెరుగుతుండడం సంతోషకరం. వారు ప్రతి రంగంలో రాణిస్తున్నారు. గ్రామీణ మహిళలు డ్రోన్లు ఎగురవేస్తున్నారు’’ అని చెప్పారు. -
ఢిల్లీలో రైతుల నిరసన ర్యాలీలో ఉద్రిక్తత
నోయిడా: వేలాది మంది రైతుల ర్యాలీ, నిరసన హోరుతో ఢిల్లీ శివార్లు గురువారం దద్దరిల్లాయి. ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడా, గ్రేటర్ నోయిడా ప్రాంతాలకు చెందిన రైతులు ఢిల్లీలో పార్లమెంట్‌ను ముట్టడించేందుకు ప్రయతి్నంచారు. పార్లమెంట్ దిశగా దూసుకెళ్తుండగా పోలీసులు ఎక్కడికక్కడ బారీకేడ్లు ఏర్పాటు చేసి వారిని అడ్డుకున్నారు. అభివృద్ధి ప్రాజెక్టుల కోసం సేకరించిన తమ భూములకు పరిహారం పెంచాలని రైతులు చాలా ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. భూములు తీసుకొని అభివృద్ధి చేసిన ప్లాట్లలో పది శాతం రెసిడెన్షయల్ ప్లాట్లు తమకు ఇవ్వాలని లేదా వాటికి సమానమైన పరిహారం చెల్లించాలని 2019 నుంచి ఉద్యమం కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో పోరాటం ఉధృతం చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా, అఖిల భారతీయ కిసాన్ సభ ఆధ్వర్యంలో గురువారం పార్లమెంట్ వరకు ర్యాలీ తలపెట్టారు. దాదాపు 100 గ్రామాల నుంచి వేలాది మంది రైతులు తరలివచ్చారు. వీరిలో వృద్ధులు, మహిళలు సైతం ఉన్నారు. గురువారం మధ్యాహ్నం మహామాయ ఫ్లైఓవర్ నుంచి ర్యాలీగా బయలుదేరారు. చిల్లా సరిహద్దు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. స్థానికంగా 144 సెక్షన్ విధించారు. నిరసకారులను అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఉద్రిక్తత నెలకొంది. దీంతో నోయిడా–గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్ రహదారితోపాటు పలు మార్గాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. -
అభివృద్ధి నినాదమే సమర నాదం
బులంద్‌షెహర్/రేవారీ: ఉత్తరప్రదేశ్ పర్యటనలో ప్రధాని మోదీ లేదు లేదంటూనే ఎన్నికల ఊసెత్తి పరోక్షంగా ప్రచారాన్ని ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షెహర్ జిల్లాలో రూ.19,100 కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంబోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన సందర్భంగా ప్రధాని మోదీ అక్కడి ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగం యావత్తూ ప్రచారధోరణిలోనే కొనసాగింది. ‘‘ నేను ప్రత్యేకంగా ఎన్నికల సమర నినాదం ఇవ్వాల్సిన పని లేదు. ప్రజలే నా కోసం ఆ పని చేస్తారు. మోదీ గ్యారెంటీల బండి ప్రతి ఒక్క లబి్ధదారుని చెంతకొస్తుంది. ప్రభుత్వ పథకాలు చిట్టచివరి లబ్ధిదారునికి చేరిన నాడు సమాజంలో వివక్ష, అవినీతి అనేవే ఉండవు. అదే అసలైన లౌకికవాదం. అప్పుడే నిజమైన సామాజిక న్యాయం సాకారమైనట్లు లెక్క. మీరే నా కుటుంబం. మీ కలలే నాకు సంకల్పాలు. మీలాంటి సాధారణ కుటుంబాలు ఆర్థికాభివృద్దితో సాధికారత సాధించినప్పుడే నా ‘ఆస్తి’ మరింత పెరిగినట్లు సంతోషిస్తా. మా ప్రభుత్వం ఏం చెబుతోందో దానిని చేసి చూపిస్తుంది. మీరు సంతృప్తి చెందే గ్యారెంటీ నాది. 100 శాతం లబి్ధదారులకు పథకాలు చేరేలా నేను కృషిచేస్తా’’ అని మోదీ ప్రకటించారు. కాంగ్రెస్‌పై విమర్శలు ‘‘ చాన్నాళ్ల క్రితం ఒకరు గరీభీ హఠావో అని గట్టిగానే నినదించారు. కానీ సామాజిక న్యాయం కలగానే మిగిలిపోయింది. కొందరు మాత్రమే సంపన్నులై, వారి రాజకీయాలు మాత్రమే నడవడం పేదలు కళ్లారా చూశారు’’ అని కాంగ్రెస్‌ను విమర్శించారు. ‘‘ ఈ రోజు కార్యక్రమం ద్వారా ఎన్నికల ప్రచారానికి నేను శ్రీకారం చుడుతున్నానని మీడియాలో ప్రచారం జరిగింది. నేను ఆ పని అస్సలు చేయను. నాకు అవసరం లేదు కూడా. బీజేపీకి భవిష్యత్తులో కూడా ఆ అవసరం పడదు. ప్రజలే నా కోసం ఆ పని చేస్తారు. ప్రజలే నా కోసం ఎన్నికల సమర శంఖం పూరిస్తున్నపుడు నేను ప్రత్యేకంగా ప్రచారానికి సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. నా సమయమంతా ప్రజాసేవకే కేటాయిస్తాను. అభివృద్ది నినాదం మాత్రమే నేను ఇస్తా. దానినిప్రజలే ఎన్నికల సమర నినాదంగా దేశవ్యాప్తంగా మార్మోగిస్తారు’ అని సభికుల హర్షధ్వానాల మధ్య మోదీ అన్నారు. కుటుంబ పారీ్టలను ఓడించండి మరోవైపు, జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా యువ ఓటర్లతో మాట్లాడారు. ‘‘ లోక్‌సభ ఎన్నికల్లో కుటుంబ పారీ్టలను ఓడించండి. భారత దేశ దశ, దిశలను నిర్ణయించే సత్తా యువ ఓటర్లకు ఉంది. పది, పన్నెండేళ్ల క్రితం నాటి ప్రభుత్వాల పాలనలో నాటి యువత అంధకారంలో మగ్గిపోయింది. మేమొచ్చాక దేశాన్ని అంధకారం నుంచి బయటికి తెచ్చాం. ఇప్పుడు యువతరానికి అవకాశాలు మెరుగయ్యాయి. బీజేపీ మేనిఫెస్టోకు మీరూ సలహాలు, సూచనలను నమో యాప్ ద్వారా పంపండి. మీ చక్కని ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు బీజేపీ ప్రయతి్నస్తుంది’’ అని యువ ఓటర్లకు మోదీ సూచించారు. -
అయోధ్య ఎయిర్‌పోర్ట్‌కు మహర్షి వాల్మికి పేరు!
న్యూఢిల్లీ: అయోధ్యలో భవ్య రామమందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆ పట్టణంలో ఇప్పటికే పూర్తయిన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రధాని మోదీ శనివారం ప్రారంభించనున్నారు. నూతన విమానాశ్రయం సహా రూ.11,100 కోట్లకుపైగా విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు. అయోధ్య ఎయిర్‌పోర్ట్‌కు ‘మహర్షి వాల్మికీ అంతర్జాతీయ విమానాశ్రయం, అయోధ్యధామ్’గా నామకరణం చేసే వీలుంది. సంబంధిత వివరాలను ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఏటా 10 లక్షల మంది విమానప్రయాణికుల రాకపోకలకు అనువుగా రూ.1,450 కోట్లతో నిర్మించిన నూతన ఎయిర్పోర్ట్, పూర్తయిన అయోధ్య ధామ్ జంక్షన్ తొలి దఫా, అయోధ్య రైల్వేస్టేషన్, రోడ్లు, పౌర వసతుల ప్రాజెక్టులను మోదీ ప్రారంభిస్తారు. ఉత్తరప్రదేశ్‌లో రూ.2,300 కోట్ల విలువైన మూడు రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితమివ్వనున్నారు. కొత్తగా రెండు అమృత్ భారత్, ఆరు కొత్త వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభిస్తారు. సువిశాలంగా కొత్తగా నిర్మించిన అయోధ్య, రామపథ్, బక్తిపథ్, ధర్మపథ్, శ్రీరామజన్మభూమి పథ్ రోడ్లను ప్రారంభిస్తారు. అధునాతన సదుపాయాలతోపాటు తక్కువ విద్యుత్‌ను వినియోగించుకునేలా పర్యావరణహిత నిర్మాణం, వాననీటి సంరక్షణ, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, మురుగునీటి శుద్ధి ప్లాంట్, సౌరవిద్యుత్ ప్లాంట్‌వంటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్న అయోధ్య ఎయిర్‌పోర్ట్‌ను ఫై స్టార్ గ్రీన్ రేటింగ్ వచ్చేలా నిర్మించారు. -
సుస్థిర ప్రభుత్వం వల్లే దేశ ప్రగతి, ప్రపంచ కితాబు: మోదీ
మెహసానా: దేశమంతటా ప్రస్తుతం కనిపిస్తున్న శరవేగమైన ప్రగతి, ప్రపంచవ్యాప్తంగా కురుస్తున్న ప్రశంసలకు కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఉండటమే కారణమని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. సోమవారం గుజరాత్‌లోని మెహసానా జిల్లా ఖెరాలు వద్ద రూ.5,950 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. అనంతరం భారీ జన సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అంతకుముందు ఓపెన్ టాప్‌కార్‌లో రోడ్ షో చేశారు. తర్వాత మాట్లాడారు. సుదీర్ఘ కాలం పాటు ఒకే పార్టీ అధికారంలో ఉంటే ఎన్నెన్ని అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టవచ్చో, ఎంతటి ప్రగతి సాధించవచ్చో చెప్పేందుకు గుజరాతే ఉదాహరణ అన్నారు. ‘‘మీ నరేంద్ర బాయ్ ఎలాంటివారో మీకు బాగా తెలుసు. మీరు నన్ను ప్రధానిగా కాకుండా మీ సొంత నరేంద్ర బాయ్‌గా చూస్తారు. నేనేదైనా వాగ్దానం చేస్తే దాన్ని నెరవేర్చి తీరతానని కూడా మీకు తెలుసు’’ అన్నారు. -
కేరళకు తొలి వందేభారత్.. ప్రారంభించిన ప్రధాని మోదీ
ఢిల్లీ/తిరువనంతపురం: రెండు రోజుల కేరళ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్లు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత తిరువనంతపురంలో సెమీ హైస్పీడ్ రైలుగా పేరున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రధాని మోదీ ప్రారంభించారు. కేరళకు ఇదే తొలి వందేభారత్. తిరువనంతపురం నుంచి కాసరగోడ్ మధ్య ఈ రైలు పరుగులు పెట్టనుంది. పదకొండు జిల్లాలను కవర్ చేస్తూ సాగిపోనుంది ఈ వందేభారత్ రైలు. ఇక కేరళలో పలుప్రాజెక్టులను ప్రధాని మోదీ ఒక్కొక్కటిగా ప్రారంభించుకుంటూ వెళ్తున్నారు. కేరళ సంప్రదాయ పంచెకట్టులో వేషధారణతో మోదీ అలరించారు. తొలుత.. తిరువనంతపురంలో డిజిటల్ సైన్స్ పార్క్‌కు శంకుస్థాపన చేశారు. అదే వేదికగా పలు ప్రాజెక్టులను సైతం ప్రారంభించారు. కేరళ ప్రధాని మోదీ పర్యటనలో ఆకట్టుకునే అంశం.. కొచ్చి వాటర్ మెట్రో. కొచ్చి చుట్టూరా ఉన్న పది ఐల్యాండ్లను అనుసంధానించేలా.. బ్యాటరీ ఆపరేటెడ్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ బోట్లను నడిపిస్తారు. ఈ ప్రాజెక్టును మోదీ తన చేతుల మీదుగా ప్రారంభిస్తారు. Kerala | PM Narendra Modi inaugurates various development projects in Thiruvananthapuram. pic.twitter.com/5ZpCKFJcVD — ANI (@ANI) April 25, 2023 #WATCH | Kerala: PM Narendra Modi flags off the Thiruvananthapuram Central-Kasaragod Vande Bharat Express train from Thiruvananthapuram Central railway station. pic.twitter.com/zdqdmwNE3g — ANI (@ANI) April 25, 2023 -
ఆకాంక్షలను నెరవేరుస్తున్నాం
ఉనా/చంబా: దేశంలో గత ప్రభుత్వాలు ఉద్ధరించిందేమీ లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. ఇతర దేశాల్లో గత శతాబ్దంలో అందుబాటులో ఉన్న సౌకర్యాలను సైతం మన ప్రభుత్వాలు ప్రజలకు కల్పించలేకపోయాయని ఆక్షేపించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న హిమాచల్ ప్రదేశ్‌లో మోదీ గురువారం పర్యటించారు. ఉనా, చంబాలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. హరోలీలో బల్క్ డ్రగ్ ఫార్మా పార్క్ నిర్మాణానికి పునాదిరాయి వేశారు. ఉనాలో ‘ఐఐఐటీ–ఉనా’ను ప్రారంభించారు. చంబాలో రెండు హైడ్రోపవర్ ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఉనాలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు పచ్చజెండా ఊపారు. దేశంలో ఇది నాలుగో వందేభారత్ రైలు కావడం విశేషం. రాష్ట్రంలో పలుచోట్ల బహిరంగ సభల్లో ప్రధానమంత్రి ప్రసంగించారు. హిమాచల్‌లో ప్రతి ఎన్నికలో అధికార పార్టీని ఓడించే సంప్రదాయం ఈసారి ఆగిపోతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ‘డబుల్–ఇంజన్’ ప్రభుత్వాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఉద్ఘాటించారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉందని, అందుకే ఇక్కడ అభివృద్ధి యజ్ఞం జరుగుతోందని అన్నారు. 20వ శతాబ్దంతోపాటు 21వ శతాబ్దపు సౌకర్యాలను కూడా ప్రజలకు అందిస్తున్నామని వివరించారు. 21వ శతాబ్దపు భారతదేశ ఆకాంక్షలను తమ ప్రభుత్వం నెరవేరుస్తోందని, మన దేశం సవాళ్లను అధిగమిస్తూ శరవేగంగా పురోగమిస్తోందని వ్యాఖ్యానించారు. బీజేపీ స్టైలే వేరు బీజేపీ వర్కింగ్ స్టైల్ భిన్నంగా ఉంటుందని మోదీ చెప్పారు. అడ్డంకులు సృష్టించడం, ఉద్దేశపూర్వకంగా జాప్యం చేయడం, తప్పుదోవ పట్టించడం వంటి వాటికి తమ పాలనలో స్థానం లేదన్నారు. నిర్ణయాలు తీసుకుంటామని, తీర్మానాలు చేస్తామని, వాటిని అమలు పరుస్తామని, చివరకు ఫలితాలు చూపిస్తామని పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్ అభివృద్ధిని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి ఊపందుకుందన్నారు. 3,125 కిలోమీటర్ల మేర గ్రామీణ ప్రాంతాల రోడ్ల అభివృద్ధి కోసం ఉద్దేశించిన ‘ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన–3’ని చంబాలో మోదీ ప్రారంభించారు. డబుల్–ఇంజన్ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లలో రాష్ట్రంలో 12,000 కిలోమీటర్ల రోడ్లు నిర్మించిందని తెలిపారు. ప్రధాని ప్రారంభించిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఉనా నుంచి ఢిల్లీకి బుధవారం మినహా వారంలో ఆరు రోజులు ప్రయాణిస్తుంది. -
వాళ్లు అగాథం పెంచితే.. మేం అభివృద్ధి చేశాం
ఇంఫాల్/అగర్తలా: గత ప్రభుత్వాలు అభివృద్ధిపరంగా ఈశాన్య రాష్ట్రాలకు, మిగతా దేశానికి మధ్య తీవ్ర అగాధాన్ని సృష్టించగా తమ ప్రభుత్వం మాత్రం లుక్ ఈస్ట్ విధానంతో ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసిందని ప్రధాని మోదీ అన్నారు. తమ నిరంతర కృషి ఫలితంగానే మిగతా దేశానికి, ఈశాన్యప్రాంతానికి మధ్య ఉన్న అంతరం తగ్గిందన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో మంగళవారం ఆయన రూ.4,815 కోట్ల విలువైన 22 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రసంగిస్తూ.. కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాల కృషి ఫలితంగా మణిపూర్, ఈశాన్యరాష్ట్రాల్లో తీవ్రవాదం, హింస స్థానంలో శాంతి, అభివృద్ధికి బాటలు పడ్డాయన్నారు. ఒకప్పుడు దిగ్బంధానికి గురైన మణిపూర్, ఈశాన్యప్రాంతం ఇప్పుడు అభివృద్ధికి, అంతర్జాతీయ వాణిజ్యానికి ముఖద్వారాలుగా మారబోతోందని తెలిపారు. బీజేపీ హయాంలో దేశ పురోగతికి ఈశాన్య ప్రాంతం చోదకశక్తిగా మారిందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ప్రారంభించిన వాటిలో.. ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఫర్ ఇంఫాల్ స్మార్ట్ సిటీ మిషన్, అత్యాధునిక కేన్సర్ ఆస్పత్రి ఉన్నాయి. వీటితోపాటు మణిపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ భవనానికి, 5 జాతీయ రహదారుల నిర్మాణానికి, మూడు తాగునీటి ప్రాజెక్టులు తదితరాలకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆయన త్రిపుర రాజధాని అగర్తలాలో మహారాజా బీర్ బిక్రమ్(ఎంబీబీ) విమానాశ్రయంలో రెండో టెర్మినల్ భవనంతోపాటు పలు సంక్షేమ పథకాలను ప్రారంభించారు. గత ప్రభుత్వాల హయాం లో అవినీతికి, వెనుకబాటుతనానికి మారుపేరుగా ఉన్న త్రిపుర ఇప్పుడు ప్రముఖమైన వాణిజ్య కారిడార్‌గా మారిపోయిందని పేర్కొన్నారు. -
AP: అభివృద్ధి ఎక్స్‌ప్రెస్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పరిపాలన రాజధానిగా నూతన సొగసులు సంతరించుకుంటున్న విశాఖలో పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. నగర చరిత్రలో తొలిసారిగా రూ.247.32 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టులను శుక్రవారం తన పర్యటన సందర్భంగా ప్రజలకు అంకితం చేశారు. విశాఖ వాసుల ట్రాఫిక్ కష్టాలకు తెరదించుతూ రూ.150 కోట్లతో తొలిసారి రోటరీ మోడల్లో అభివృద్ధి చేసిన ఎన్ఏడీ ఫ్లైఓవర్‌తో పాటు దేశంలోనే తొలి మెకనైజ్డ్ ఆటోమేటిక్ పార్కింగ్ ప్రాజెక్టులను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. సాగర నగరిలో ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 33 ఎకరాల్లో రూ.33.50 కోట్లతో స్మార్ట్ పార్కుగా తీర్చిదిద్దిన వుడా పార్కు సీఎం చేతులమీదుగా ప్రారంభమైంది. మూడు జోన్లుగా దీన్ని సుందరీకరించారు. 12 కీలక ప్రాజెక్టులు ప్రారంభం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాయంత్రం 4.30 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, డిప్యూటీ సీఎం కృష్ణదాస్, మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాస్‌తో పాటు ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, డాక్టర్ బీవీ సత్యవతి, గొడ్డేటి మాధవి, మేయర్ హరివెంకట కుమారి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు ముఖ్యమంత్రికి సాదర స్వాగతం పలికారు. ఎన్ఏడీ కూడలి, వుడా పార్కు వద్ద జరిగిన కార్యక్రమంలో మొత్తం 12 కీలక ప్రాజెక్టులను సీఎం ప్రారంభించారు. వివాహ రిసెప్షన్ వేడుకలకు హాజరు అనంతరం ముఖ్యమంత్రి జగన్ పీఎంపాలెంలోని వైజాగ్ కన్వెన్షన్స్‌కు చేరుకొని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవరాలు నిహారిక, రవితేజ వివాహ రిసెప్షన్‌కు హాజరై వధూవరుల్ని ఆశీర్వదించారు. ఏయూ కన్వెన్షన్ హాల్లో జరిగిన విజయనగరం డీసీసీబీ చైర్మన్ నెక్కల నాయుడుబాబు కుమార్తె దివ్యనాయుడు, సుభాష్ వివాహ రిసెప్షన్‌కు కూడా హాజరై వధూవరుల్ని ముఖ్యమంత్రి ఆశీర్వదించారు. రాత్రి 7.30 గంటలకు విశాఖ విమానాశ్రయం నుంచి తిరిగి గన్నవరం బయలుదేరారు. సీఎం జగన్ ప్రారంభించిన ప్రాజెక్టులు ఇవీ... వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రులు, నేతలు, అధికారులు ఎన్ఏడీ ఫ్లైఓవర్ రూ.150 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ఫ్లైఓవర్ విశాఖ వాసుల ట్రాఫిక్ కష్టాలను తీర్చనుంది. దేశంలోనే తొలిసారిగా రోటరీ మోడల్లో ఫ్లైఓవర్‌ను అభివృద్ధి చేశారు. ఎటువంటి భూ సేకరణ లేకుండానే దీన్ని పూర్తి చేశారు. 2036 నాటికి గంటకు 23,500 వాహనాలు ఈ ఫ్లైఓవర్‌పై ప్రయాణం చేస్తాయని అంచనా. సీఎం కప్ ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తొలి మెకనైజ్డ్ పార్కింగ్ విశాఖ జగదాంబ జంక్షన్లో మల్టీ లెవల్ సెమీ–ఆటోమెటిక్ కార్ పార్కింగ్‌ను సీఎం జగన్ ప్రారంభించారు. రూ.11.45 కోట్లతో దీన్ని తీర్చిదిద్దారు. 367.89 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. ఇందులో 100 కార్లను పార్క్ చేసే అవకాశం ఉంది. పార్క్ చేసిన వాహనాన్ని గరిష్టంగా 90 సెకన్లలో తిరిగి తీసుకొచ్చే వీలుంది. ► పిఠాపురం కాలనీలో రూ.7.60 కోట్లతో నిర్మించిన వాణిజ్య సముదాయం. ► రూ.7.55 కోట్లతో ఆనందపురం జంక్షన్ నుంచి బొని గ్రామం వరకూ 9 కిలోమీటర్ల పొడవున నిర్మించిన 2 వరసల రహదారి. ► మధురవాడ లా కాలేజీ నుంచి రుషికొండ బీచ్ వరకూ రూ.7.50 కోట్లతో నిర్మించిన రెండు వరుసల రహదారి. ► ఎన్‌హెచ్–16 నుంచి విశాఖ వ్యాలీ స్కూలు మీదుగా బీచ్ రోడ్ వరకూ రూ.6.97 కోట్లతో చేపట్టిన రహదారి. ► రూ. 5.14 కోట్లతో చినముషిడివాడలో నిర్మించిన కళ్యాణ మండపం. ► తాటిచెట్లపాలెం ధర్మానగర్‌లో రూ.1.56 కోట్లతో నిర్మించిన కమ్యూనిటీ హాల్. ► దాదాపు 33 ఎకరాల్లో రూ.33.50 కోట్లతో స్మార్ట్ పార్కుగా సుందరీకరించిన వుడా పార్కును సీఎం ప్రారంభించారు. పార్కును మూడు జోన్లుగా తీర్చిదిద్దారు. ప్రత్యేకంగా స్పోర్ట్స్ ఏరియాను అభివృద్ధి చేశారు. బీఎంఎక్స్ సైకిల్ ట్రాక్ కూడా ఏర్పాటు చేశారు. హెర్బల్ ప్లాంట్స్‌తో ల్యాండ్‌స్కేప్‌ను సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేశారు. ► రూ.4.65 కోట్లతో దండుబజారులో స్మార్ట్ స్కూల్‌గా అభివృద్ధి చేసిన మహారాణి విద్యాదేవి హైస్కూల్. ► శిథిలావస్థలో ఉన్న టౌన్ హాల్ రూ.4.24 కోట్లతో ఆధునీకరణ ప్రాజెక్టుతో పాటు రూ.7.16 కోట్లతో పాత మునిసిపల్ హాల్ ఆధునీకరణ ప్రాజెక్టును కూడా సీఎం ప్రారంభించారు. ► వుడా పార్కులో జరిగిన కార్యక్రమంలో ఈ నెల 21న నిర్వహించనున్న సీఎం క్రికెట్ కప్‌ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. -
మూసీ మురిసేలా.. మాస్టర్ ప్లాన్
Musi riverfront development project: గ్రేటర్ భాగ్యరేఖ..చారిత్రక మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణ దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. సుమారు రూ.25 కోట్ల అంచనా వ్యయంతో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక (మాస్టర్ ప్లాన్)తయారీకి చర్యలు తీసుకోవాలని ఇటీవల మున్సిపల్ మంత్రి కేటీఆర్ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌పై జరిపిన సమీక్షా సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. (చదవండి: అధిక సీరో పాజిటివిటీ కాపాడుతోంది!) ప్రస్తుతం అక్కడక్కడా చేపట్టిన సుందరీకరణ పనులు మినహా..శాశ్వతంగా నిలిచిపోయేలా పనులు చేపట్టకపోవడంతో ఈ దిశగా చర్యలు చేపట్టారు. త్వరలో మాస్టర్‌ప్లాన్ తయారీకి ముందుకొచ్చే సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణకు దరఖాస్తులను ఆహ్వానించనున్నారు. మూడునెలల కాలవ్యవధిలోగా ప్రణాళిక సిద్ధం చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు. అంతర్జాతీయంగా పేరొందిన దేశీయ, అంతర్జాతీయ సంస్థలు ఈ మాస్టర్‌ప్లాన్ తయారీకి ముందుకొచ్చే అవకాశాలున్నట్లు సంస్థ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. పనులు ఇలా... ∙నూతనంగా సిద్ధం చేయనున్న మూసీ మాస్టర్‌ప్లాన్ ప్రకారం అభివృద్ధి, ప్రక్షాళన, సుందరీకరణ పనులు చేపట్టనున్నారు. ∙ప్రధానంగా నగరంలో నది ప్రవహించే బాపూఘాట్–నాగోలు(25 కి.మీ) మార్గంపైనే ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ∙మార్గమధ్యలో నదిలోకి గృహ, వాణిజ్య, పారిశ్రామిక వ్యర్థజలాలు చేరకుండా ఆయా నీటిని నూతనంగా నిర్మించే ఎస్టీపీల్లో శుద్ధిచేసిన అనంతరమే నదిలోకి చేరేలా ఏర్పాట్లు చేయనున్నారు. ∙నదికి ఇరువైపులా సుమారు 13 నూతన బ్రిడ్జిలు..14 చోట్ల సుందరమైన ఉద్యానవనాలను తీర్చిదిద్దనున్నారు. ∙ఇప్పటికే సిటీలో మూసీని మూసేస్తూ ఏర్పాటుచేసిన పదివేలకు పైగా ఉన్న ఆక్రమణలను తొలగించడం, పట్టా భూములు, స్థిర ఆస్తులు కోల్పోయే బాధితులకు పరిహారం అందజేయడం వంటి అంశాలను ఈ మాస్టర్‌ప్లాన్‌లో పొందుపర్చనున్నారు. ∙ఈ పనులన్నీ వచ్చే ఏడాది జూన్‌లో మొదలుపెట్టి..2023 జూన్ నాటికి సగం పనులు పూర్తిచేయాలని లక్ష్యం నిర్దేశించుకోవడం విశేషం. నిధుల సమీకరణకు యత్నాలు.. మాస్టర్‌ప్లాన్ అమలుకు అవసరమైన నిధుల సమీకరణకు యత్నాలు మొదలయ్యాయి. మూసీ పరివాహక ప్రాంతంలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. వీటిని దశలవారీగా అభివృద్ధి చేసేందుకు ప్రైవేటు నిర్మాణ సంస్థలకు బీఓటీ విధానంలో అప్పజెప్పడం లేదా భూములను విక్రయించడం లేదా హైబ్రీడ్ యాన్యుటీ విధానంలో సుందరీకరణ, అభివృద్ధి పనులు చేపట్టడం..రాష్ట్ర ప్రభుత్వం కొంత మొత్తాన్ని బడ్జెటరీ నిధుల ద్వారా కేటాయించడం తదితర ఆర్థిక అంశాలపై మున్సిపల్ శాఖ తాజాగా దృష్టిసారించినట్లు సమాచారం. (చదవండి: కరోనా చావులు.. కాకి లెక్కలు!) -
భారత్ ఆస్తులను ధ్వంసం చేయండి
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో భారత్ నిర్మించిన మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ప్రాజెక్టులను ధ్వంసం చేయాలని పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ అఫ్గాన్‌లోని తమ వారిని, తాలిబన్లను ఆదేశించింది. పాకిస్తాన్ నుంచి అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, తాలిబన్లకు మద్దతుగా చాలామంది అఫ్గాన్ వెళ్లారని, అక్కడి భారత ఆస్తులను లక్ష్యంగా చేసుకోవాలని వారిని ఆదేశించారని అఫ్గాన్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తాలిబన్ల ఆక్రమణలోకి వచ్చిన ప్రాంతాల్లో వారి తొలి లక్ష్యం భారత్‌కు సంబంధించిన ఆస్తులు, భవనాలేనని తెలిసిందని పేర్కొన్నాయి. ఇప్పటికే అఫ్గాన్‌లో ఉన్నవారు కాకుండా, ఇటీవలి కాలంలో కనీసం 10 వేల మంది పాకిస్తానీయులు తాలిబన్లకు మద్దతుగా వివిధ సరిహద్దు మార్గాల ద్వారా అఫ్గానిస్తాన్ వెళ్లారని సమాచారం. అఫ్గానిస్తాన్‌లో అభివృద్ధి కార్యక్రమాల కోసం భారత్ సుమారు 300 కోట్ల డాలర్లను ఖర్చు చేసింది. భారత్ నిధుల ద్వారా నిర్మితమైన వాటిలో డేలారం– జారంజ్‌ల మధ్య నిర్మించిన 218 కిమీల రహదారి, సల్మా డ్యామ్, అఫ్గాన్ పార్లమెంట్ భవనం.. ఉన్నాయి. -
బద్వేలులో అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన
సాక్షి, వైఎస్ఆర్ జిల్లా: రెండో రోజూ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బద్వేలులో పర్యటిస్తున్నారు. బద్వేలులో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం తర్వాత ఎర్రముక్కపల్లెలోని సీపీ బ్రౌన్ రీసెర్చ్ సెంటర్‌కు చేరుకుని బ్రౌన్ విగ్రహాన్ని ఆవిష్కరించి, సీపీ బ్రౌన్ రీసెర్చ్ సెంటర్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం కలెక్టరేట్ సమీపంలోని మహావీర్ సర్కిల్‌కు చేరుకుని శిలాఫలకాలను ఆవిష్కరించి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేస్తారు. అక్కడ నుంచి వైఎస్ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్ స్టేడియం చేరుకుని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి దివంగత వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర్‌రెడ్డిల విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. -
YS Jagan: రాష్ట్రాభివృద్ధి సాకారానికి.. కావాలి.. మీ సహకారం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి ప్రాజెక్టులు, అభివృద్ధి వికేంద్రీకరణ, విభజన హామీలు తదితర అంశాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పలువురు కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లి రాష్ట్రాన్ని బలోపేతం చేసేందుకు సహకరించాలని కోరారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న ఆయన రాత్రి వరకు సమావేశాలతో బిజీగా గడిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవ్‌దేకర్‌లతో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు సత్వర నిర్మాణం, అభివృద్ధి వికేంద్రీకరణ ప్రణాళిక, ప్రత్యేక హోదా సహా పలు విభజన హామీలు, వైద్య కళాశాలలకు అనుమతులు తదితర అంశాలపై మంత్రులతో వేర్వేరు సమావేశాల్లో చర్చించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో ఆయన నివాసంలో రాత్రి 9 గంటల నుంచి 10.35 వరకు సమావేశమై, రాష్ట్ర అభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించారు. సుహృద్భావ వాతావరణంలో సాగిన ఈ సమావేశంలో సీఎం జగన్.. అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లిన వినతుల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలులో హైకోర్టుకు రీ నోటిఫికేషన్ ఇవ్వండి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల మధ్య సమతుల్యంతో కూడిన అభివృద్ధికి, అభివృద్ధి వికేంద్రీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందులో భాగంగానే రాజధాని కార్యకలాపాలను వికేంద్రీకరిస్తూ కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును ప్రతిపాదిస్తూ ప్రణాళిక రూపొందించాం. ఆగస్టు 2020న దీనికి సంబంధించి చట్టాన్ని కూడా తీసుకొచ్చాం. కర్నూలులో హైకోర్టు స్థాపనకు రీ నోటిఫికేషన్ జారీ చేయాలి. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో కర్నూలులో హైకోర్టు అంశాన్ని బీజేపీ కూడా పొందు పరిచింది. ప్రత్యేక హోదాతోనే అధిక గ్రాంట్లు రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడ్డ పరిస్థితుల కారణంగా రాష్ట్రం సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ దశలో రాష్ట్రాన్ని బలోపేతం చేయాలి. అనేక రంగాల్లో స్వయం సమృద్ధి దిశగా రాష్ట్రాన్ని నడిపించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక హోదా ఇవ్వడం ద్వారా రాష్ట్రానికి కేంద్ర గ్రాంట్లు అధికంగా వస్తాయి. అప్పుడు ఆర్థిక భారం తగ్గుతుంది. భారీగా పరిశ్రమలు రావాలన్నా, ఉద్యోగాల కల్పన జరగాలన్నా ప్రత్యేక హోదా చాలా అవసరం. అందువల్ల ప్రత్యేక హోదా ఇవ్వాలని మరోమారు విన్నవిస్తున్నాం. వైద్య కళాశాలల ఏర్పాటుకు సహకరించాలి రాష్ట్రంలో ప్రజలందరికీ అందుబాటులో మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రాష్ట్ర విభజన తర్వాత, ఏపీలో మహానగరాలు లేవు. అందుకే కొత్తగా 13 వైద్య కళాశాలల నిర్మాణాన్ని మొదలు పెడుతున్నాం. దీంతోపాటు ఇప్పుడున్న వైద్య కళాశాలలను అభివృద్ధి చేస్తున్నాం. దీనివల్ల ప్రభుత్వ రంగంలో అత్యాధునిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. గ్రామీణ, సబ్ అర్బన్ ప్రాంతాల్లోని ప్రజలకు మంచి ప్రయోజనం చేకూరుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 3 కళాశాలలకు అనుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు. మిగిలిన కాలేజీలకూ అనుమతులు ఇవ్వాలని కోరాం. మెడికల్ కాలేజీలతోపాటు నర్సింగ్ కాలేజీలకు అనుమతులు ఇచ్చి, తగిన ఆర్థిక సహాయం చేయాలి. విద్యుత్ రంగం రుణాలు రీస్ట్రక్చర్ చేయాలి విద్యుత్ సంస్కరణల్లో రాష్ట్రం ముందంజలో ఉంది. అలాగే సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తిలో కూడా మెరుగైన స్థితిలో ఉంది. అయితే రాష్ట్ర విద్యుత్ రంగ ఆర్థిక పరిస్థితి బాగోలేనందున ఏపీకి తగిన సహాయం చేస్తానని కేంద్ర విద్యుత్ శాఖ చెప్పింది. కుడిగి, వల్లూరు థర్మల్ ప్లాంట్ల నుంచి అధిక ధరకు కొనుగోలు చేస్తున్న విద్యుత్‌ను సరెండర్ చేసే విషయంలో తగిన చర్యలు తీసుకోవాలి. ఈ విద్యుత్ ప్లాంట్ల నుంచి కరెంటు కొనుగోలు ధర చాలా అధికంగా ఉంది. 300 మెగావాట్ల కరెంటు కొనుగోలుపై ఏటా రూ.325 కోట్ల ఫిక్స్డ్ ఛార్జీలు చెల్లించాల్సి వస్తోంది. కేంద్ర జల్‌శక్తి మంత్రి షెకావత్, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌లకు ఢిల్లీలో జ్ఞాపికను అందజేస్తున్న సీఎం జగన్ ఇప్పటికే ఆర్థిక భారంతో నడుస్తున్న డిస్కంలకు ఇది చాలా భారం. ఏపీ డిస్కంలు ఈ రెండు ప్లాంట్ల నుంచి 40 ఏళ్ల పాటు కరెంటు కొనుగోలు ఒప్పందాలు చేసుకున్న నేపథ్యంలో సరెండర్ కోసం తగిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ డిస్కంల నుంచి రూ.5,541.78 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. ఆత్మనిర్భర్ ప్యాకేజీ ద్వారా వాటికి తగిన రుణ సదుపాయాలను కల్పించి, తద్వారా ఏపీ జెన్కోకు కేంద్ర పన్నుల వాటా నుంచి ఆ డబ్బు వచ్చేలా చూడాలి. రాష్ట్ర విద్యుత్ రంగం దాదాపు రూ.50 వేల కోట్ల అప్పుల్లో ఉంది. ఈ రుణాలను రీ స్ట్రక్చర్ చేయాలి. విశాఖ జిల్లా అప్పర్ సీలేరులో రివర్స్ పంప్ స్టోరేజీ విద్యుత్ పాజెక్టుకు ఆర్థిక సహాయం చేయాలి. 1,350 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ఈ ప్రాజెక్టుకు రూ.10,445 కోట్లు ఖర్చు అవుతుంది. కేంద్రం 30 శాతం నిధులను సమకూర్చాలి. త్వరతిగతిన పర్యావరణ అనుమతులు వచ్చేలా చూడాలి. ‘ఉపాధి’ నిధులు ఇవ్వండి ► గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.4,652.70 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. వెంటనే ఈ డబ్బును చెల్లించేలా చూడాలి. సంవత్సరంలో పనిదినాలను 100 నుంచి 150కి పెంచాలి. ► ప్రజాపంపిణీ వ్యవస్థలో భాగంగా బియ్యం సబ్సిడీ కింద రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.3,229 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ఈ మేరకు సంబంధిత శాఖకు సూచించాలి. ► స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం నిధుల కింద రూ. 529.95 కోట్ల బకాయిలు ఉన్నాయి. అలాగే 15వ ఆర్థిక సంఘానికి సంబంధించి మరో రూ.497 కోట్లు కూడా పెండింగులో ఉన్నాయి. ఇవి వెంటనే విడుదలయ్యేలా చూడాలి. ► దిశ బిల్లుకు వెంటనే ఆమోదం తెలిపేలా చూడాలి. ► ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ బిల్లు–2020కి ఆమోదం తెలిపేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూముల రీ సర్వే ప్రారంభించాం. అన్ని రికార్డులను డిజిటలైజ్ చేస్తున్నాం. వెంటనే ఈ బిల్లుకు ఆమోదం తెలిపేలా చూడాలి. ► విజయనగరం జిల్లా సాలూరు సమీపంలో 250 ఎకరాల భూమిని గిరిజన విశ్వవిద్యాలయం కోసం రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ దృష్ట్యా వెంటనే యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి. పోలవరం సత్వర నిర్మాణానికి సహకరించండి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనా వ్యయానికి ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కోరారు. గురువారం సాయంత్రం 4 గంటల నుంచి సుమారు 40 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు అంశంపై విస్తృతంగా చర్చించారు. ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాల్సిన ఆవశ్యకతను పునరుద్ఘాటించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), కేంద్ర జల మండలి సిఫార్సులతోపాటు, కేంద్ర జల శాఖకు చెందిన సాంకేతిక సలహా మండలి (టెక్నికల్ అడ్వైజరీ కమిటీ – టీఏసీ) అంగీకరించిన విధంగా 2017–18 ధరల సూచీ ప్రకారం రూ.55,656.87 కోట్ల మేర పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయానికి ఆమోదం తెలిపాలని కోరారు. 2022 జూన్ నాటికి ప్రాజెక్టు పనులతోపాటు, భూసేకరణ, పునరావాస పనులను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని, ఈ లక్ష్యం నెరవేరేలా అంచనాలకు సత్వర ఆమోదం తెలపాలని నివేదించారు. జాతీయ ప్రాజెక్టుల విషయంలో ఉన్న మార్గదర్శకాల ప్రకారం నీటి సరఫరాను కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా చూడాలని కోరారు. ఇంకా నివేదించిన అంశాలు ఇలా.. ► రాష్ట్ర ప్రభుత్వ వనరుల నుంచి పోలవరం ప్రాజెక్టు కోసం ఖర్చు చేస్తున్నాం. జాప్యం లేకుండా ఆ నిధులను రీయింబర్స్ చేయాలి. రీయింబర్స్‌మెంట్‌ను కాంపోనెంట్ వారీ అర్హతకు పరిమితం చేయరాదు. ► భూసేకరణ, పునరావాసం, పునర్నిర్మాణంలో న్యాయమైన పరిహారం, పారదర్శకత హక్కు చట్టం–2013 ప్రకారం పునరావాస పనులకు రీయింబర్స్ చేయాలి. ► పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం తరలించాలి. హైదరాబాద్‌లో ఇప్పుడు సచివాలయ కార్యకలాపాలు లేవు. ప్రాజెక్టు పర్యవేక్షణ, పరిశీలన కోసం సుదూరంలో ఉన్న హైదరాబాద్ నుంచి రావడం కష్టం అవుతోంది. అందుకే పీపీఏ కార్యాలయాన్ని రాజమహేంద్రవరానికి తరలించాలి. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్‌కుమార్‌కు ఢిల్లీలో జ్ఞాపికను అందజేస్తున్న సీఎం జగన్. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం కారులో వెళుతున్న సీఎం జగన్ మంత్రి షెకావత్ సానుకూల స్పందన అన్ని విషయాలపై సానుకూలంగా స్పందించిన మంత్రి షెకావత్.. సమావేశం అనంతరం ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి తనతో సమావేశమయ్యారని, జలశక్తి సంబంధిత ప్రాజెక్టుల అమలుపై చర్చించారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వంద శాతం ఇంటింటికీ నల్లా కనెక్షన్ల ఏర్పాటు లక్ష్య సాధనలో సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పారు. వచ్చే వారం కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేసి, సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్‌తో భేటీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్‌తో సమావేశమయ్యారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం సుమారు అరగంట పాటు సాగింది. పోలవరం ప్రాజెక్టులో స్టాకింగ్ పనులకు సంబంధించిన పర్యావరణ అనుమతుల్లో చిన్న చిన్న అంశాలు మిగిలిపోయాయని, వెంటనే పరిష్కరించాలని కోరారు. ఇళ్ల నిర్మాణంలో మౌలిక సదుపాయాల ఖర్చు భరించాలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్‌కుమార్‌తో నీతి ఆయోగ్ కార్యాలయంలో గురువారం సాయంత్రం 5.30 నుంచి సుమారు గంటపాటు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ పాల్గొన్నారు. రాష్ట్రానికి సంబంధించి పలు అభివృద్ధి అంశాలపై ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చర్చించారు. పేదలందరికీ ఇళ్లు పథకం కింద చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 30.76 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామని, ఇందుకోసం 68,381 ఎకరాలను సేకరించామని తెలిపారు. ఇళ్ల పట్టాల పంపిణీ వల్ల 17,005 కొత్త కాలనీలు ఏర్పడ్డాయన్నారు. ఈ ఏడాది కొత్తగా 15 లక్షలకుపైగా ఇళ్లు కడుతున్నామని, మొత్తంగా 28.30 లక్షల ఇళ్లు పేదల కోసం నిర్మిస్తున్నామని వివరించారు. ఇళ్ల నిర్మాణ కార్యక్రమం సజావుగా సాగడానికి ప్రతి జిల్లాకు జాయింట్ కలెక్టర్‌ను నియమించామని చెప్పారు. 17,005 కొత్త కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి రూ.34,109 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశామని చెబుతూ, ఇంత మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే మోయడం కష్టసాధ్యమని నివేదించారు. ఇళ్లు కట్టి, కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుంటే లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడతారని, ఇళ్లపట్టాల కోసం, నిర్మాణం కోసం పెట్టిన ఖర్చు ప్రయోజనం ఇవ్వదని తెలిపారు. సంబంధిత మంత్రిత్వ శాఖలతో మాట్లాడి ఈ కాలనీల్లో మౌలిక సదుపాయాలకయ్యే ఖర్చును పీఎంఏవైలో భాగంగా చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపైనా చర్చించారు. 2017–18 ధరల సూచీ ప్రకారం రూ.55,656.87 కోట్ల మేర ప్రాజెక్టు అంచనా వ్యయానికి ఆమోదం తెలిపాలని కోరారు. 2022 జూన్ నాటికి ప్రాజెక్టు పనులతోపాటు, భూసేకరణ–పునరావాస పనులను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నందున వెంటనే ఈ అంచనాలకు ఆమోదం తెలపాల్సిన అవసరం ఉందని వివరించారు. రాష్ట్ర పనితీరును ప్రశంసిస్తూ రాజీవ్ కుమార్ ట్వీట్ ఆంధ్రప్రదేశ్ బహుళ రంగాల్లో అద్భుతమైన పనితీరు కనబరుస్తూ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచీలో మూడో స్థానాన్ని సాధించిందని సమావేశం ముగిసిన అనంతరం నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ట్వీట్ చేశారు. ఇలాంటి సందర్భంలో రాష్ట్ర ప్రగతి, అభివృద్ధిని అర్థం చేసుకునేందుకు ముఖ్యమంత్రితో సమావేశం ఉపయోగపడిందని పేర్కొన్నారు. ► సీఎం వైఎస్ జగన్ వెంట రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ లోక్‌సభా పక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, అవినాశ్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బాలశౌరి, మార్గాని భరత్, గురుమూర్తి, రెడ్డెప్ప, ఎంవీవీ సత్యనారాయణ తదితరులు ఉన్నారు. కాగా, శుక్రవారం ఉదయం కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు, రైల్వే మంత్రి పీయూష్ గోయల్, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్లతో ముఖ్యమంత్రితో సమావేశమవుతారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
పట్టణాలు, నగరాల అభివృద్ధిపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో నడుస్తున్న ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. విశాఖపట్నానికి నిరంతర తాగునీటి సరఫరా ప్రతిపాదనపై సమగ్ర కార్యాచరణ తయారు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో అమృత్ పథకం కింద దాదాపు రూ. 3,762 కోట్లతో పనులు చేపట్టామని అధికారులు ఈ సందర్భంగా సీఎంకు తెలిపారు. ఆర్థికంగా బలంగా లేని మున్సిపాలిటీలకు నిధులు సమకూర్చడంలో ఉన్న ఇబ్బందులను అధికారులు ప్రస్తావించారు. రూ.800 కోట్లను బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాలని, దీనికి ప్రభుత్వం తరపున గ్యారెంటీ ఇచ్చేందుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. అలాగే విజయవాడ, గుంటూరులో చేపట్టిన డ్రైనేజీ వ్యవస్థలను సత్వరమే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. (సాయం అర్ధించిన విద్యార్థిని, చలించిన సీఎం జగన్) టిడ్కో ఇళ్ల పనులు వేగవంతం చేయాలి: విజయవాడలోని నీటి కాలువల్లోకి చెత్త వేయకుండా చూడాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. స్మార్ట్‌సిటీ కింద రూ. 4,578 కోట్ల విలువైన పనులు విశాఖపట్నం, కాకినాడ, తిరుపతిలో చేస్తున్నామని, వాటిని వేగంగా పూర్తి చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఏఐఐబీ ఆర్థిక సహాయంతో 50 పట్టణ ప్రాంతాల్లో, లక్ష జనాభా కన్నా తక్కువ ఉన్న నగరాల్లో తాగునీటి కోసం రూ. 5,212 కోట్లతో చేపట్టిన పనులపై దృష్టి పెట్టాలన్నారు. ఈ పట్టణాలకు వెళ్లే దారిలో ఉన్న 111 గ్రామాలకు తాగునీరు అందించాలని తెలిపారు. టిడ్కో ఇళ్ల పనులు వేగవంతం చేయాలని జులై 8న లబ్దిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలు ఇచ్చేందుకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. విశాఖపట్నం మెట్రో రైల్ డీపీఆర్‌ను త్వరగా సిద్ధం చేయలన్నారు. కోవిడ్ కారణంగా డీపీఆర్ తయారీలో కాస్త వెనకబడ్డామని, త్వరలోనే పూర్తి చేస్తామని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. (అది పిల్లల భవిష్యత్‌కు నా పెట్టుబడి : సీఎం జగన్) ఆధునిక వసతులు సమకూర్చాలి: లక్ష జనాభా దాటిన పట్టణాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం ఉద్దేశించిన రూ.10,666 కోట్లతో కార్యక్రమాలు సిద్ధం చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. దీంతో పాటు తాడేపల్లి, మంగళగిరి మున్సిపాల్టీలను మోడల్ మున్సిపాలిటీలుగా చేయడంపై ముఖ్యమంత్రి సమీక్షించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు, అంచనాలను అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. 30 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళిక తయారు చేశామని అధికారులు ఆయనకు తెలిపారు. వంద శాతం తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థలు, రోడ్లు తదితర మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు ప్రతిపాదనలు ఇచ్చారు. పాఠశాలల అభివృద్ది, నాడు- నేడు కార్యక్రమంలో చేపట్టిన పనుల కన్నా మరింత ఆధునిక వసతులు సమకూర్చేలా ఉండాలని సీఎం తెలిపారు. అలాగే జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకుని నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్ల నిర్మాణంపైనా అధికారులు ప్రతిపాదనలు ఇచ్చారు. తాడేపల్లి, మంగళగిరి మున్సిపాల్టీల్లోని పేదలకు ఇళ్ల నిర్మాణంపైన సమావేశంలో సీఎం జగన్ చర్చించారు. పేదలకు కట్టే ఇళ్ల నిర్మాణంలో నాణ్యత ఉండాలని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. మంగళగిరి ఆలయ అభివృద్ధి, మాడ వీధుల పునర్నిర్మాణంపైన సమావేశంలో సీఎం అధికారులతో చర్చించారు. బకింగ్‌హాం కెనాల్ డెవలప్మెంట్, కాల్వల సుందరీకరణ, జంక్షన్ల అభివృద్ది తదితర అంశాలపై సీఎం జగన్ చర్చించారు. మంగళగిరిలో చేనేతలకు కాంప్లెక్స్ నిర్మాణం, అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు సమగ్ర కాంప్లెక్స్ నిర్మాణాన్ని ఆధికారులు ప్రతిపాదించారు. వీటన్నింటికీ జూన్ నాటికి పరిపాలనా పరమైన అనుమతులు ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్య నారాయణ, ఉన్నాతాధికారులు పాల్గొన్నారు. -
అధ్యయనం... అందని దూరం
- అర్బన్ నోడ్స్, అర్బన్ సెంటర్లకు గ్రహణం - కొన‘సా...గుతున్న’ రీజనల్ రింగ్ రోడ్డు స్టడీ - గడువు దాటినా అందని నివేదికలు సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ను విశ్వనగరంగా ఆవిష్కరించేందుకు ఓ వైపు ప్రణాళికలు రూపొందిస్తున్నా... మరోవైపు అభివృద్ధి ప్రాజెక్టులపై హెచ్ఎండీఏ తలపెట్టిన అధ్యయనాలు మాత్రం అతీగతీ లేకుండాపోయాయి. నిర్ణీత గడువు ముగిసినా నివేదికలు సమర్పించే విషయంలో ఏజెన్సీలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా శివారు ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన హెచ్ఎండీఏ ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం ఆ సంస్థలకు కలిసొచ్చింది. నగరంపై ఒత్తిడిని తగ్గించేందుకు చుట్టుపక్క ఉన్న అర్బన్ నోడ్స్, అర్బన్ సెంటర్లలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాంతాల ను రాజధానితో అనుసంధానం చేస్తూ రోడ్ నెట్‌వర్క్‌ను కల్పించడం ద్వారా త్వరిత అభివృద్ధికి గల అవకాశాలపై అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలని ఆదేశించింది. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ టీఓజీసీ (ట్రాన్జిడ్ ఓరియంటెడ్ గ్రోత్ సెంటర్స్), మెట్రో రైల్ కారిడార్‌లో టీఓడీ(ట్రాన్జిడ్ ఓరియంటెడ్ డెవలప్మెంట్)లకు గల అవకాశాలపై సమగ్ర నివేదికను కోరింది. ఈ మేరకు హెచ్ఎండీఏ ఇంజనీరింగ్ అధికారులు అధ్యయన బాధ్యతలను ‘లీ అసోసియేట్స్’ సంస్థకు అప్పగించారు. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల 4 జిల్లాలను కలుపుతూ మాస్టర్ ప్లాన్‌లో ప్రతిపాదించిన రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు సంబంధించి ‘ఆర్వీ అసోసియేట్స్’ సంస్థతో అధ్యయనం ప్రారంభించింది. దీనికి సుమారు రూ.1.50 కోట్లు వెచ్చించింది. వీటితో చేసుకున్న ఒప్పందం ప్రకారం అర్బన్ నోడ్స్, అర్బన్ సెంటర్స్‌పై ఇప్పటికే ప్రాథమిక నివేదిక, రీజనల్ రింగ్ రోడ్డుపై డ్రాఫ్టు రిపోర్టు అందాల్సి ఉంది. వీటిని హెచ్ఎండీఏ అధికారులు పెద్దగా పట్టించుకోకపోవడంతో ఆ అధ్యయనాలు స్తంభించిపోయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మందగమనం... నగరం చుట్టు పక్కల 4 జిల్లాలను కలుపుతూ బృహత్ ప్రణాళికలో ప్రతిపాదించిన 290 కి.మీ. రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) ప్రాజెక్టుకు సంబంధించి మొదట్లో అధ్యయనం వేగంగా సాగినా... ఆ తర్వాత మందగించింది. నిర్దిష్ట గడువు దగ్గరపడినా ఇంతవరకు ఫీజుబులిటీ రిపోర్టును కూడా ఆ సంస్థ ఇవ్వకపోవడం గమనార్హం. ఈ ప్రాజెక్టుల అధ్యయనాన్ని త్వరగా పూర్తిచేసి నిర్దిష్ట వ్యవధిలోగా నివేదిక రూపొందిస్తే నిధులు ఏమేరకు అవసరమన్నది స్పష్టమవుతుంది. అవసరమైన చోట్ల వివిధ ప్రాంతాల్లో భూసేకరణకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఉన్న రోడ్డును వివిధ ప్రాంతాల్లోని రోడ్లతో (లింక్) కలిపి అభివృద్ధి చేస్తే ప్రధాన మార్గంతో అనుసంధానమై...మెరుగైన రవాణా వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. తొలిదశలో దీనికోసం రూ.10 కోట్లు వెచ్చిస్తే కొన్ని ప్రాంతాలకు రోడ్ నెట్వర్క్ సమకూరే అవకాశం ఉంది. అధ్యయన నివేదికలు రూపొందకపోవడంతో ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించలేని పరిస్థితి ఎదురైంది. బడ్జెట్ సమావేశాల నాటికి ఆ నివేదికలు అంది ఉంటే ఎంతో కొంత నిధుల కేటాయింపు జరిగేది.లేదంటే... పీపీపీ మోడ్‌లో ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రభుత్వం నుంచి ఓ విధాన నిర్ణయం వెలువడేది. రీజనల్ రింగ్‌రోడ్డుపై అటు హెచ్ఎండీఏ గానీ, ఇటు ప్రభుత్వం గానీ ఆరా తీయకపోవడంతో అధ్యయన సంస్థ సేదతీరుతోంది. ఇప్పటికైనా హెచ్ఎండీఏ కమిషనర్ శాలిని మిశ్రా శ్రద్ధ తీసుకొని అధికారులను పరుగెత్తిస్తే తప్ప అధ్యయనాలు కొలిక్కి వచ్చే అవకాశమే లేదన్నది సుస్పష్టం. -
నాయుడు గారూ.. మాకు భూములివ్వరూ!
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం నాడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడును కలిశారు. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన సాయం కావాలని కోరారు. ప్రధానంగా స్కూళ్లు, కాలేజీలకు తగినంత భూమి కావాలని, దాన్ని కేటాయించాలని ఆయన వెంకయ్యను కోరారు. ఆయనతో పాటు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా కూడా వెంకయ్యను కలిశారు. పాఠశాలలతో పాటు ఆరోగ్యం, రవాణాలకు సంబంధించిన ప్రాజెక్టులకు కూడా తమకు భూమి అవసరమని, దాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. నాయుడు తమకు చాలా అండగా మాట్లాడారని, వీలైనంత వరకు తప్పకుండా సాయం చేస్తానని హామీ కూడా ఇచ్చారని ఢిల్లీ ప్రభుత్వాధికారులు ఈ సందర్భంగా చెప్పారు. -
స్త్రీనిధి రుణాలతో అభివృద్ధి ప్రాజెక్టులు
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : స్త్రీనిధి పథకం ద్వారా అందజేస్తున్న రుణాలను అభివృద్ధి ప్రాజెక్టుల ఏర్పాటుకు మాత్రమే వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సౌరభ్ గౌర్ స్వయంశక్తి సంఘాలను ఆదేశించారు. వీటిని పంటల సాగుకు ఉపయోగించుకోకూడదని స్పష్టం చేశారు. అవసరమైతే మహిళా రైతులకు ప్రత్యేకంగా పంట రుణాలు అందజేయాలన్నారు. స్త్రీనిధి పథకంపై పట్టణ, గ్రామీణ స్వయంశక్తి సంఘాల సభ్యులు, సిబ్బందితో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో స్త్రీనిధి పథకం ద్వారా రూ.23.43 కోట్ల మేర రుణాలు తీసుకునేందుకు అవకాశం ఉండగా ఇప్పటివరకు కేవలం రూ.11.82 కోట్లు మాత్రమే పొందారని చెప్పారు. స్త్రీనిధి పథకంపై సభ్యులకు మరింత అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో ఉన్న 4.10 లక్షల మంది రైతుల్లో 2.80 లక్షల మంది మాత్రమే బ్యాంకుల నుంచి రుణాలు పొందారన్నారు. పై-లీన్ తుపాను వల్ల పంట నష్టపోయినట్టు 2.52 లక్షల మంది రైతులు పేర్లు నమోదు చేసుకోగా వారిలో 1.60 లక్షల మందికి మాత్రమే బ్యాంకు రుణాలు ఉన్నాయని వెల్లడించారు. బ్యాంకు రుణాలు పొందే దిశగా రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటివరకు రుణం పొందని రైతులు, ముఖ్యంగా మహిళా రైతులు రుణం తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో కొత్తగా 1.50 లక్షల మంది పంట రుణాలు పొందేలా చూడాలన్నారు. రుణాలు పొందనివారి జాబితాను ఈ నెల 31 నాటికల్లా తనకు అందజేయాలని ఆదేశించారు. ఖరీఫ్‌లో రూ.1,076 కోట్ల మేర పంట రుణాలు అందించామన్నారు. మహిళా సంఘాలకు అందజేసిన రూ.370 కోట్లలో అధిక శాతం పంటల కోసం వినియోగించారని తెలిపారు. వరి పంట సాగుకు ఎకరాకు రూ.23,500 చొప్పున రుణం అందిస్తున్నామని చెప్పారు. ఉపాధి హామీ పథకంతో స్వయంశక్తి సంఘాలను అనుసంధానం చేయాలని ఆదేశించారు. దీనివల్ల రుణ చెల్లింపులు పెరుగుతాయన్నారు. ఎ-గ్రేడ్‌కు రాకుంటే పథకాల వర్తింపు నిలుపుదల ప్రతి స్వయంశక్తి సంఘం పనితీరును మెరుగుపరచుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎ-గ్రేడ్‌కు రాకుంటే ప్రభుత్వ పథకాల వర్తింపును నిలుపుదల చేస్తామని హెచ్చరించారు. సీతంపేట మండలంలో ఉపాధి హామీ పథకం ద్వారా రూ.12 కోట్లకుపైగా నిధులతో పనులు చేపడితే సీఐఎఫ్ కింద రూ.84 లక్షలు మాత్రమే చెల్లించారని పేర్కొన్నారు. ఏజెన్సీలో 30 వేల కుటుంబాలు 150 పని దినాలను పూర్తి చేసుకున్నాయని చెప్పారు. బ్యాంకుల్లో ఉన్న పొదుపు నిల్వను తీసేందుకు బ్యాంకు అధికారులు అడ్డుచెబుతున్నారని స్వయంశక్తి సంఘాల సభ్యులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. డీఆర్డీఏ పీడీ పి.రజనీకాంతరావు, మెప్మా పీడీ సత్యనారాయ ణ, ఏపీడీ ధర్మారావు, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఆర్.గున్నమ్మ, ఎంఎం ఎస్ అధ్యక్షులు, ఏసీలు, డీపీఎంలు పాల్గొన్నారు.