నాయుడు గారూ.. మాకు భూములివ్వరూ! | Arvind Kejriwal meets Venkaiah Naidu, asks for land | Sakshi
Sakshi News home page

నాయుడు గారూ.. మాకు భూములివ్వరూ!

Published Thu, Jun 18 2015 5:53 PM | Last Updated on Sun, Sep 3 2017 3:57 AM

నాయుడు గారూ.. మాకు భూములివ్వరూ!

నాయుడు గారూ.. మాకు భూములివ్వరూ!

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం నాడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడును కలిశారు. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన సాయం కావాలని కోరారు. ప్రధానంగా స్కూళ్లు, కాలేజీలకు తగినంత భూమి కావాలని, దాన్ని కేటాయించాలని ఆయన వెంకయ్యను కోరారు. ఆయనతో పాటు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా కూడా వెంకయ్యను కలిశారు.

పాఠశాలలతో పాటు ఆరోగ్యం, రవాణాలకు సంబంధించిన ప్రాజెక్టులకు కూడా తమకు భూమి అవసరమని, దాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. నాయుడు తమకు చాలా అండగా మాట్లాడారని, వీలైనంత వరకు తప్పకుండా సాయం చేస్తానని హామీ కూడా ఇచ్చారని ఢిల్లీ ప్రభుత్వాధికారులు ఈ సందర్భంగా చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement