venkaiah naidu
-
హైదరాబాద్: అలయ్ బలయ్ సందడి
హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ‘అలయ్ బలయ్’ కార్యక్రమం జరుగుతోంది. బండారు దత్తత్రేయ కూతురు విజయలక్ష్మి ఆధ్వర్యంలో ‘అలయ్ బలయ్’ కొనసాగుతోంది. దసరా పండుగ సందర్భంగా ‘అలయ్ బలయ్’ కార్యక్రమాన్ని హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ప్రారంభించారు. ఇది 19వ సారి జరుగుతున్న ‘అలయ్ బలయ్’ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరు తెలంగాణ గవర్నర్ జిష్ణూ దేవ్ వర్మ, పలు రాష్ట్రాల గవర్నర్లు, తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ ఏడాది సినీ ప్రముఖులను కూడా నిర్వాహకులు అహ్వానించారు. తెలంగాణ సంప్రదాయ వంటలతో భోజన ఏర్పాట్లు చేశారు.రాజకీయాలకు అతీతంగా గౌరవించబడే బండారు దత్తాత్రేయ 19 ఏళ్లుగా ‘అలయ్ బలయ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘ అంతరించిపోతున్న తెలంగాణ కళలు భావితరాలకు అందిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో పొలిటికల్ జేఏసీ ఏర్పాటుకు అలయ్ బలయ్ స్ఫూర్తి. జెండాలకు అజెండలను పక్కన పెట్టి తెలంగాణ కోసం ఒక్కటయ్యేలా చేసింది. ఆఎస్ఎస్ టూ ఆర్ఈసీ, కాంగ్రెస్ టూ కమ్యూనిస్టుల వరకు ఒక్కటై తెలంగాణ కోసం గళం వినిపించారు. దసరా అంటే జమ్మి చెట్టు, పాలపిట్ట గుర్తుకు వస్తాయి. ‘అలయ్ బలయ్’ అంటే బండారు దత్తాత్రేయ గుర్తు వస్తారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల వారసత్వాన్ని దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి కొనసాగిస్తున్నారు. సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడం మనందరి బాధ్యత’’ అని అన్నారు.మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరై.. మాట్లాడారు.‘‘ స్నేహశీలి బండారు దత్తాత్రేయ. భావితరాలకు ఈ కార్యక్రమాన్ని అందించాలి. పండగలకి సామాజిక సంస్కృతి అంతే ఉంది. కలిసి మెలిసి ఉండాలన్న సంకల్పం ఈ అలయ్ బలయ్. కుటుంబ, ప్రాంత, దేశ సమైక్యత సాధించుకోవాలి. పాశ్చాత్య సంస్కృతి వదిలి పెట్టి మన అనుకునే ఐక్యత పద్దతి పాటించాలి’ అని అన్నారు.మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు మాట్లాడారు.‘‘ అలయ్ బలయ్ రాజ్యాంగ పీఠికలోని సౌభ్రాతృత్వానికి ప్రతీక . పలు రాష్ట్రాల గవర్నర్ల రాకతో దేశమంతా దిగివచ్చినట్లు ఉంది. అలయ్ బలయ్‌ను హైదరాబాద్‌తో జిల్లాలకు, ఆంధ్రపదేశ్ కు కూడా విస్తరించాలి’’ అని అన్నారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడారు.‘‘ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసిమెలిసి ఉండాలి. అభివృద్ధిలో తెలుగురాష్ట్రాలు దేశంలో నెంబర్ వన్‌గా నిలవాలి’’ అని అన్నారు.తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మాట్లాడారు. ‘‘ అలయ్ బలయ్ అంటే ఐక్యత. మన సాంప్రదాయలను ప్రతిబింబించే కార్యక్రమం. తెలంగాణ గ్రామీణ సంస్కృతి సంప్రదాయాలు ఎంతో సుందరమైనవి. అందరూ కలిసుండాలనేది మన సంస్కృతి. అన్ని మతాల వారు కలిసి విజయదశమి జరుపుకుంటున్నారు. విజయదశమి పర్వదినం చెడుపై మంచి సాధించిన విజయం. ఆ విజయం ఐక్యతతో సాధ్యం’’ అని అన్నారు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. ‘‘ అన్ని వర్గాల వారిని ఐక్యం చేసే అలయ్ బలయ్ గొప్ప కార్యక్రమం. రాజకీయంగా ఎన్ని ఉన్నా ఇలాంటి ప్రొగ్రాంలలో కలవడం గొప్ప విషయం. ఎన్నికలప్పుడు రాజకీయాలు, తర్వాత పేద ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టాలి. కానీ ప్రస్తుతం తెలంగాణలో అది లోపించింది. గత కొన్నేళ్లుగా రాజకీయ పార్టీల మధ్య మాటలతో మాట్లడలేని విధంగా విమర్శించుకుంటున్నారు. వాళ్లలో మార్పు రావాలని దసరా సందర్భంగా దేవుళ్లను కోరుకుంటున్నా. మాట్లాడే భాష అంగీకారం కాదు. మార్పు రావాలి. రానున్న రోజుల్లో ప్రజలు అసహించుకునేలా మాట్లాడం రాజకీయ నాయకులకు తగదు’’ అని అన్నారు.చదవండి: పట్నం మహేందర్ రెడ్డిది ఏ పార్టీ .. చిట్‌చాట్‌లో హరీష్ రావు -
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: ఈరోజు(జూలై 1) భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్ ఫారం ‘ఎక్స్’లో మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన జీవితంలో పాటించిన నిబద్దతను కొనియాడారు.‘వెంకయ్య నాయుడు గారు 75వ జన్మదినోత్సవం జరుపుకుంటున్న తరుణంలో ఆయనకు దీర్ఘాయువు, ఆరోగ్యం కలగాలని ప్రార్ధిస్తున్నాను’ అని మోదీ పేర్కొన్నారు. బీజేపీ నేత వెంకయ్య నాయుడు 1949, జూలై 1న జన్మించారు. విద్యార్థి నేతగా రాజకీయాల్లోకి అడుగిడారు. తన రాజకీయ జీవితంలో వెంకయ్య నాయుడు పలు పదవులు చేపట్టారు. Greetings to Shri @MVenkaiahNaidu Garu on his 75th birthday. Praying for his long and healthy life. On this special occasion, have penned a few thoughts on his life, service and commitment to nation building.https://t.co/rY3WzwQlKI— Narendra Modi (@narendramodi) July 1, 2024 -
వెంకయ్య నాయుడుపై మూడు పుస్తకాలు.. ప్రధాని మోదీ ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన జీవిత ప్రస్థానంపై మూడు పుస్తకాలను ప్రధాని మోదీ వర్చువల్‌గా విడుదల చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పుస్తక ప్రతిని డీఆర్డీవో మాజీ చైర్మన్ డాక్టర్ జి.సతీష్ రెడ్డికి వెంకయ్యనాయుడు అందించారు.ప్రధాని మోదీ మాట్లాడుతూ.. వెంకయ్య జీవితంపై పుస్తకాలు ప్రజలకు ప్రేరణగా నిలుస్తాయని మోదీ అన్నారు. ఈ పుస్తకాలు దేశ ప్రజల సేవకు మార్గనిర్దేశనం చేస్తాయని, వెంకయ్యనాయుడుతో సుదీర్ఘకాలం పనిచేసే అవకాశం తనకు దక్కిందన్నారు. గ్రామస్థాయి నుంచి వచ్చి ఉన్నత స్థానానికి ఎదిగారని కొనియాడారు. -
వెంకయ్య నాయుడు బామ్మరిది సంచలన కామెంట్స్
-
సీఎం రమేష్ ను కలవడంపై కొమ్మినేని విశ్లేషణ
-
Padma Awards 2024: ఘనంగా ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)
-
‘పద్మశ్రీ’లకు రూ.25వేల పింఛన్
సాక్షి, హైదరాబాద్: పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.25 లక్షల నగదు బహుమతి, ఖర్చుల నిమిత్తం నెలకు రూ.25 వేలు పింఛను ఇవ్వాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. తొవ్వ ఖర్చులకు కూడా కష్టంగా ఉన్నా, కనుమరుగవుతున్న కళలు, తెలుగు సంప్రదాయాలను కాపాడేందుకు కష్టపడుతున్న కళాకారులకు ఆర్థిక సహకారం అందించాలని ప్రభుత్వం భావించిందని తెలిపారు. పద్మవిభూషణ్ పురస్కారాలకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, సినీనటుడు చిరంజీవితోపాటు పద్మశ్రీకి ఎంపికైన ఆనందాచార్య, దాసరి కొండప్ప, ఉమామహేశ్వరి, గడ్డం సమ్మయ్య, కేతావత్ సోంలాల్, కూరెళ్ల విఠలాచార్యలను ఆదివారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తెలుగు సంప్రదాయాలను కాపాడేందుకు రాజకీయాలకతీతంగా అందరూ ఏకం కావాలని..లేదంటే తెలుగుభాష కాలగర్భంలో కలిసిపోతుందన్నారు. మారుమూల ప్రాంతాల్లో తెలుగు సంప్రదాయ కళలను కాపాడుతున్న కళాకారులను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాలతో గౌరవించడం సముచితమని, ఈ పరిస్థితుల్లో పురస్కారాలకు ఎంపికైన వారిని సత్కరించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతగా భావించినట్టు తెలిపారు. రాజ కీయాలకతీతంగా రాష్ట్రంలో కొత్త సంప్రదాయం నెలకొల్పేందుకు అవార్డుకు ఎంపికైన వారిని సన్మానించే కార్యక్రమం చేపట్టామన్నారు. విద్యార్థి దశ నుంచి తనకు వెంకయ్యనాయుడు ప్రసంగాలు అంటే తనకు ఇష్టమని రేవంత్‌రెడ్డి చెప్పారు. 1978లో విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి ఎమ్మెల్యేగా జైపాల్‌రెడ్డితో కలిసి ప్రజాసమస్యలపై పోరాడిన నేత వెంకయ్యనాయుడని కొనియాడారు. రాజకీయాల్లో భాష ప్రాధాన్యతపై వెంకయ్య చేసిన సూచనలను తాను పాటిస్తానని ఈ సందర్భంగా చెప్పారు. వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కావాల్సిన నాయకుడన్నారు. కళాకారుడిగా కమిట్మెంట్ ఉన్న వ్యక్తి చిరంజీవి అని..పున్నమినాగు సినిమా నుంచి సైరా నరసింహారెడ్డి వరకు ఒకే కమిట్మెంట్తో ఆయన ఉన్నారని కొనియాడారు. కొత్త సంప్రదాయానికి నాంది పలికిన రేవంత్‌రెడ్డి : వెంకయ్య మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ పద్మ అవార్డులకు ఎంపికైన వారిని సన్మానించడం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొత్త సంప్రదాయానికి నాంది పలికారన్నారు. రాజకీయాల్లో ప్రమా ణాలు తగ్గిపోతున్నాయని, బూతులు మాట్లాడటం రాజకీయాల్లో మంచిది కాదని అభిప్రాయపడ్డారు. బూతులు మాట్లాడేవారికి పోలింగ్ బూతుల్లోనే సమాధానం చెప్పాలన్నారు. తెలుగు కళామతల్లికి రెండు కళ్లు ఎనీ్టఆర్, అక్కినేని అయితే, మూడోకన్ను చిరంజీవి అని కొనియాడారు. కళాకారులు ఎక్కడ గౌరవం పొందుతారో ఆ రాజ్యం సుభిక్షం : చిరంజీవి ప్రముఖ సినీనటుడు చిరంజీవి మాట్లాడుతూ ఎక్కడ కళాకా రులు గౌరవం పొందుతారో.. ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పద్మ అవార్డులకు ఎంపికైన వారిని సన్మానించడం ముదావహమని పేర్కొన్నారు. ప్రజాగాయకు డు గద్దర్ పేరున అవార్డులు ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించడం ఆహ్వానించదగిన పరిణామమని చెప్పారు. రాజకీయాల్లో దుర్భాషలు ఎక్కువయ్యాయని, వ్యక్తిగతంగా దుర్భాష లాడటం మంచిది కాదని, అలాంటి వారికి ప్రజలే గుణపాఠం చెప్పాలన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ వెంకయ్య, చిరంజీవిల ఔన్నత్యాన్ని కొనియాడారు. మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వెంకయ్యను సత్కరించిన చిరంజీవి
-
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిసిన FNCC సభ్యులు
భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు గారికి పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా ఫిల్మ్ నగర్ కల్చర్ సెంటర్ (FNCC) ప్రెసిడెంట్ జి. ఆదిశేషగిరిరావు, వైస్ ప్రెసిడెంట్ టి. రంగారావు, సెక్రటరీ ముళ్ళపూడి మోహన్, జాయింట్ సెక్రెటరీ వి. వి. ఎస్. ఎస్. పెద్దిరాజు, ట్రెజరర్ బి. రాజశేఖర్ రెడ్డి, కమిటీ మెంబర్స్ కాజా సూర్యనారాయణ, జే. బాలరాజు, ఏ. గోపాలరావు గార్లు వెంకయ్య నాయుడు గారిని కలిసి అభినందించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా FNCC ప్రెసిడెంట్ జి. ఆదిశేషగిరిరావు గారు మాట్లాడుతూ.. గతంలో వెంకయ్య నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే గా, ఎంపీగా ఉండటమే కాకుండా వివిధ శాఖల మంత్రిగా అలాగే మాజీ ఉపరాష్ట్రపతిగా ఎన్నో సేవలు అందించారు. వెంకయ్య నాయుడు గారు చెప్పే విషయాలు చాలా విలువైనవిగా ఉంటాయి. ఆయన మాటల్ని అందరూ స్ఫూర్తిగా తీసుకుంటారు. అలాంటి ఉన్నత వ్యక్తికి పద్మ విభూషణం రావడం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. అలాగే సినిమా ఇండస్ట్రీకి కూడా ఎంతో సన్నిహితంగా ఉంటారని ఆయన తెలియ చేశారు. FNCC సెక్రటరీ మోహన్ ముళ్ళపూడి గారు మాట్లాడుతూ.. ఈ రోజున వెంకయ్య నాయుడు గారి లాంటి ఉన్నత వ్యక్తికి పద్మ విభూషన్ రావడం అనేది చాలా ఆనందకరమైన విషయం. తెలుగువారిగా ఉపరాష్ట్రపతి స్థానానికి ఎదిగిన వ్యక్తి. తెలుగు సంప్రదాయ కార్యక్రమాలాకు హాజరవుతూ ప్రోత్సహించడంలో ముందుంటారు. అలాంటి వ్యక్తికి భారతరత్న రావాలని నా అభిప్రాయం అని తెలియజేశారు. మాకు సమయాన్ని కేటాయించినందుకు వెంకయ్య నాయుడు గారికి ధన్యవాదాలు అన్నారు -
నేను ఊహించని అవార్డ్ రావడం సంతోషంగా ఉంది: మెగాస్టార్
75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి జాతీయ జెండాను ఎగురవేశారు. హైదరాబాద్‌లోని తన బ్లడ్ బ్యాంక్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేను ఊహించని.. నేను ఎదురు చూడని పద్మవిభూషణ్ అవార్డ్ రావడం సంతోషంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్, వరుణ్ తేజ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా నా సేవలను గుర్తించి ఈ అవార్డు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి.. ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. అంతే కాకుండా పద్మశ్రీ, పద్మభూషణ్ పొందిన తెలుగు రాష్ట్రాలవారికి.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మెగాస్టార్ తన ట్వీట్లో రాస్తూ.. 'వెంకయ్యనాయుడు గారి నా హృదయపూర్వక అభినందనలు. ప్రతిష్టాత్మకమైన 'పద్మవిభూషణ్' రావడం ఆనందంగా ఉంది. మీ సుదీర్ఘమైన ప్రజాసేవ, మీ జ్ఞానం, రాజకీయాల్లో గౌరవప్రదమైన మీ ప్రసంగం..మీ స్థాయిని పెంచుతుంది. మీతో పాటు అవార్డ్ దక్కడం నాకు దక్కిన గొప్ప గౌరవం. ప్రతిభావంతులైన వైజయంతిమాల బాలి, పద్మా సుబ్రమణ్యం, అలాగే పద్మ అవార్డు గ్రహీతలందరికీ హృదయపూర్వక అభినందనలు. ముఖ్యంగా నా సోదర వర్గానికి, తెలుగు రాష్ట్రాల వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నా ప్రియమైన మిథున్ దా (చక్రవర్తి), ఉషా ఉతుప్ జీ, దాసరి కొండప్ప, ఉమా మహేశ్వరి , గడ్డం సమ్మయ్య , కూరెళ్ల విట్టలాచార్య,ఎ వేలు ఆనంద చారి, కేతావత్ సోమ్లాల్, విజయకాంత్ (మరణానంతరం)గారితో పాటు ప్రతి ఒక్కరికీ అభినందనలు' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. Heartiest congratulations to Shri @MVenkaiahNaidu garu on the coveted ‘Padma Vibhushan’! Your long, relentless public service, your wisdom and dignified presence in politics enhances the stature and quality of political discourse. It is an even greater honour for me to be in… — Chiranjeevi Konidela (@KChiruTweets) January 26, 2024 -
చిరంజీవి, వెంకయ్య నాయుడులకు పద్మ విభూషణ్ పురస్కారాలు
-
వెంకయ్యనాయుడు, చిరంజీవి ‘విభూషణులు’.. సీఎం జగన్, సీఎం రేవంత్ హర్షం
సాక్షి, న్యూఢిల్లీ/ సాక్షి నెట్వర్క్: తెలుగు ప్రముఖులను దేశ అత్యున్నత పౌర పురస్కారాలు వరించాయి. ప్రముఖ సినీ నటుడు కొణిదెల చిరంజీవి, మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుకు దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్‌కు ఎంపిక చేసినట్టు కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2024 సంవత్సరానికిగాను మొత్తం 132 పద్మ పురస్కారాలను ప్రకటించారు. వీటిలో ఐదు పద్మ విభూషణ్, 17 పద్మభూషణ్, మిగతా 110 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి పద్మా సుబ్రమణ్యం, సామాజికవేత్త, సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్, అలనాటి బాలీవుడ్ నటి వైజయంతిమాల బాలిని కూడా పద్మ విభూషణ్ వరించింది. పద్మభూషణ్ ప్రకటించిన వారిలో సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి ఫాతిమా బీవీ, సినీనటుడు విజయ్‌కాంత్, ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి, నేపథ్య గాయని ఉషా ఉతుప్, ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు ప్యారేలాల్ శర్మ తదితరులున్నారు. వీరిలో ఫాతిమా, పాఠక్, విజయ్‌కాంత్ సహా 9 మందికి మరణానంతరం పురస్కారాలు దక్కాయి. తెలంగాణ, ఏపీల నుంచి ఆరుగురికి.. తెలంగాణ నుంచి ఐదుగురికి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. వీరిలో తెలంగాణ నుంచి బుర్రవీణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప, చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, కూరెళ్ల విఠలాచార్య, కెతావత్ సోమ్లాల్, ఎ.వేలు ఆనందచారి, ఏపీ నుంచి హరికథా కళాకారిణి డి.ఉమా మహేశ్వరి ఉన్నారు. పద్మశ్రీ గ్రహీతల్లో 34 మందికి ‘అన్సంగ్ హీరోస్’ పేరిట పురస్కారం దక్కింది. క్రీడారంగం నుంచి టెన్నిస్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న, స్క్వాష్ ప్లేయర్ జోష్నా చినప్ప, హాకీ క్రీడాకారుడు హర్బిందర్ సింగ్ సహా ఏడుగురికి పద్మశ్రీ లభించింది. పురస్కార గ్రహీతల్లో మొత్తం 30 మంది మహిళలున్నారు. దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను నాలుగేళ్ల విరామం అనంతరం బిహార్ దివంగత ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్‌కు మంగళవారం ప్రకటించడం తెలిసిందే. పద్మ అవార్డుల వివరాలివీ.. పద్మ విభూషణ్ (ఐదుగురికి): వైజయంతిమాల బాలి (కళారంగం–తమిళనాడు), కొణిదెల చిరంజీవి (కళారంగం–ఆంధ్రప్రదేశ్), ఎం.వెంకయ్యనాయుడు (ప్రజావ్యవహారాలు–ఆంధ్రప్రదేశ్), బిందేశ్వర్ పాఠక్ (సామాజిక సేవ–బిహార్), పద్మా సుబ్రమణ్యం (కళారంగం–తమిళనాడు). పద్మభూషణ్ (17 మందికి): ఫాతిమా బీవీ (మరణానంతరం–ప్రజా వ్యవహారాలు–కేరళ), హోర్మూస్ జీ ఎన్.కామా (సాహిత్యం, విద్య, జర్నలిజం–మహారాష్ట్ర), మిథున్ చక్రవర్తి (కళారంగం–పశ్చిమబెంగాల్), సీతారాం జిందాల్ (వర్తకం–పరిశ్రమలు–కర్నాటక), యంగ్ లియు (వర్తకం–పరిశ్రమలు–తైవాన్), అశ్విన్ బాలచంద్ మెహతా (వైద్యం–మహారాష్ట్ర), సత్యబ్రత ముఖర్జీ (మరణానంతరం–ప్రజా వ్యవహారాలు–పశి్చమ బెంగాల్), రాంనాయక్ (ప్రజా వ్యవహారాలు–మహారాష్ట్ర), తేజస్ మధుసూదన్ పటేల్ (వైద్యం–గుజరాత్), ఓలంచెరి రాజగోపాల్ (ప్రజా వ్యవహారాలు–కేరళ), దత్తాత్రేయ్ అంబాదాస్ మయలూ అలియాస్ రాజ్ దత్ (కళారంగం–మహారాష్ట్ర), తోగ్డన్ రింపోచే (ఆధ్యాత్మికత–లద్దాఖ్), ప్యారేలాల్ శర్మ (కళారంగం–మహారాష్ట్ర), చంద్రేశ్వర్ ప్రసాద్ ఠాకూర్ (వైద్యం–బిహార్), ఉషా ఉతుప్ (కళారంగం–మహారాష్ట్ర), విజయ్‌కాంత్ (మరణానంతరం–కళారంగం–తమిళనాడు), కుందన్ వ్యాస్ (సాహిత్యం, విద్య, జర్నలిజం–మహారాష్ట్ర) – పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన 110 మందిలో గోండా చిత్రకార దంపతులు శాంతిదేవీ పాశ్వాన్, శివన్ పాశ్వాన్ తదితరులున్నారు. బాధ్యతను పెంచింది ‘‘దేశం అమృత కాలం దిశగా అభివృద్ధి పథంలో సాగుతున్న తరుణంలో ప్రకటించిన పద్మ విభూషణ్ పురస్కారాన్ని వినమ్రంగా స్వీకరిస్తున్నా. ఇది నా బాధ్యతను మరింతగా పెంచింది. రైతులు, యువత, మహిళలు సహా నవభారత నిర్మాణంలో భాగస్వాములవుతున్న ప్రతి ఒక్కరికీ పురస్కారాన్ని అంకితం చేస్తున్నా’’ – ఎం.వెంకయ్యనాయుడు, మాజీ ఉప రాష్ట్రపతి సంస్కృతిని, కళలను చాటి చెప్పారు: రేవంత్‌రెడ్డి తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన వారికి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. వివిధ రంగాల్లో నైపుణ్యం, కృషితో వారు ఉన్నత అవార్డులకు ఎంపికయ్యారని.. సంస్కృతిని, కళలను దేశమంతటికీ చాటిచెప్పారని ప్రశంసించారు. తెలుగువారికి పద్మాలు గర్వకారణం: ఏపీ సీఎం జగన్ తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు ఎంపికైనవారిని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సినీ నటుడు చిరంజీవిలకు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారాలను ప్రకటించడంపట్ల హర్షం వ్యక్తం చేశారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ‘పద్మ’ అవార్డులను దక్కించుకున్న వారిని అభినందించారు, వారు మనకు గర్వకారణంగా నిలిచారని ప్రశంసించారు. తెలుగు వెలుగులకు శనార్తులు: బండి సంజయ్ పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వెలుగులకు తెలంగాణ శనార్తులు చెబుతోందని పేర్కొన్నారు. -
సాటిలేని మేటి నటి జమున
బంజారాహిల్స్: అందం, అభిమానం అభినయం, అభిజాత్యం కలిగిన సాటిలేని గొప్ప నటి జమున అని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. మంగళవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ప్రముఖ రంగస్థల, సినీ నటుడు డా.అక్కిరాజు సుందర రామకృష్ణ రచించిన కంద పద్య సంపుటి ‘జమునా రమణ’ను వెంకయ్యనాయుడు ఆవిష్కరించి ప్రసంగించారు. ‘ఆకృతి’ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..కంద పద్యం తెలుగు వారికి చాలా ఇష్టమైన పద్య ప్రక్రియ అన్నారు. ఓ సినీ నటి మీద పద్య శృతి రావడం ప్రశంసనీయం అన్నారు. జమున అందంతో పాటు నటనతో ఇతర నటులతో పోటీపడేవారన్నారు. సభకు అధ్యక్షత వహించిన సినీ పాత్రకేయుడు ఇమంది రామారావు మాట్లాడుతూ జమున అందంతో పాటు అభినయంలో కూడా దిట్ట అన్నారు. ప్రముఖ నటులు అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావులతో కలిసి పలు చిత్రాల్లో పోటీ పడి నటించారన్నారు. అంతే కాదు ఎందరో పేద కళాకారులకు ఆమె జీవన భృతి కల్పించారని ప్రశంసించారు. నిర్మాత అనూరాధా దేవి మాట్లాడుతూ.. సినీ రంగంలో మేటి అయినా రంగస్థలం మీద నటించడం ఎంతో విశేషమన్నారు. జమున కుమార్తె స్రవంతి తన తల్లి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. ఫిక్కీ సీఎండీ అచ్యుత జగదీశ్ చంద్ర, ఆకృతి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
‘శాంతల’చూసి కన్నీళ్లు పెట్టుకున్నాను: వెంకయ్య నాయుడు
నాట్య కళ, మహిళా సాధికారికత ఇతివృత్తంగా చారిత్రక నేపథ్యంలో తెరకెక్కించిన ‘శాంతల’చిత్రం చూసి భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాను. ఇదొక గొప్ప కళాత్మక చిత్రం. కచ్చితంగా ఈ చిత్రానికి జాతీయ అవార్డు రావాలి’ అని అన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ‘ఫ్యామిలీ మాన్’ ఫేమ్ అశ్లేష ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘శాంతల’. ఇండో అమెరికన్ ఆర్ట్స్ పతాకంపై ఇర్రింకి సురేశ్ నిర్మించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శేషు దర్శకత్వం వహించారు. నిహాల్ హీరోగా నటించారు. నవంబర్ 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో ఈ చిత్రం ప్రివ్యూని హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో వేశారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమా అద్భుతంగా ఉందని కొనియాడు. కొత్త నటీనటులైనప్పటికీ చక్కగా నటించారు.నిర్మాణపరంగా, సాంకేతికంగా ఎంతో ఉన్నతంగా ఉంది. కెమెరా పనితనం,నేపథ్య సంగీతం, నృత్యాలు, కూర్పు అద్భుతంగా ఉన్నాయి. ఇంతటి మంచి అభిరుచితో సినిమా నిర్మించిన ప్రముఖ నిర్మాత కె ఎస్ రామారావు, దర్శకుడు శేషును అభినందిస్తున్నాను. ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను’అని వెంకయ్య నాయుడు అన్నారు. నవంబర్ 24 న తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, మరాఠీ మరియు మలయాళం భాషల్లో ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. -
గాంధీ శాంతి పురస్కార గ్రహీత ఎంపిక కమిటీ సభ్యుడిగా వెంకయ్య
సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక గాంధీ శాంతి పురస్కార గ్రహీత ఎంపిక కమిటీ సభ్యుడిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తన నియామకం పట్ల ప్రధాని మోదీకి వెంకయ్య కృతజ్ఞతలు తెలిపారు. 1995లో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభ సభాపతి, లోక్‌సభలో విపక్షనేత, ఇద్దరు ప్రముఖ వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. అహింసాయుత పద్ధతుల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తన తీసుకురావడంలో కీలక పాత్ర పోషించే వ్యక్తులు, సంస్థలకు ఏటా గాంధీ శాంతి పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. గ్రహీతలకు రూ. కోటి నగదు, ప్రశంసాపత్రం అందజేస్తారు. -
తెలుగు సినీ దిగ్గజం.. అక్కినేనికిదే శతజయంతి నివాళి!
తెలుగు సినిమా దిగ్గజం, అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. కృష్ణాజిల్లాలో పుట్టి సినీ ప్రపంచంలోనే తనకంటూ ఓ సామ్రాజ్యం ఏర్పరచుకున్న ఏకైక నటుడు మన అక్కినేని. కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా నందివాడ మండలం రామాపురంలో 1924 సెప్టెంబరు 20 న అక్కినేని వెంకటరత్నం, పున్నమ్మ దంపతులకు జన్మించారు. దాదాపు 250కి పైగా చిత్రాల్లో కళామతల్లి ఒడిలో ఒదిగిపోయారు. ఆయన శత జయంతి సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏఎన్నార్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. (ఇది చదవండి: భారతీయ సినీ చరిత్రలోనే ఓ దిగ్గజం: మెగాస్టార్) అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో టాలీవుడ్ సినీ తారలు, ప్రముఖులు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈ వేడుకల్లో పాల్గొన్న అక్కినేని నాగార్జున కుటుంబసభ్యులు, సుమంత్, నాగచైతన్య, అమల, అఖిల్ ఆయనకు నివాళులర్పించారు. టాలీవుడ్ సినీ ప్రముఖులు అల్లు అరవింద్, బ్రహ్మానందం, మురళీమోహన్, శ్రీకాంత్, జగపతిబాబు, రానా, మంచు విష్ణు, నాని, దిల్ రాజు, మోహన్ బాబు, రామ్ చరణ్, మహేశ్ బాబు, సుమ కనకాల, టాలీవుడ్ సినీ పెద్దలు పాల్గొన్నారు. A moment of joy and pride for the fans of #AkkineniNageswaraRao Garu ✨💫 Former Vice President of India Shri. @MVenkaiahNaidu Garu unveils the statue of #ANR garu at @AnnapurnaStdios marking the centenary birthday ❤️ Watch ANR 100 Birthday Celebrations live now! -… pic.twitter.com/5ajMSNFiM1 — Annapurna Studios (@AnnapurnaStdios) September 20, 2023 -
జమిలి ఎన్నికలు.. కేంద్ర నిర్ణయాన్ని సమర్థించిన మాజీ ఉప రాష్ట్రపతి
హైదరాబాద్: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించాలన్న కేంద్ర నిర్ణయాన్ని సమర్ధించారు భారత్ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. అలా కాకుండా తరచుగా ఎన్నికలు జరుగుతూ ఉంటే దానివలన దేశప్రగతికి నష్టం వాటిల్లుతుందని అన్నారు. ఈ సందర్బంగా ఇండియా పేరును భారత్ అని మార్చడంలో కూడా తప్పులేదని అన్నారు. ప్రయోజనకరమే.. భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. తరచుగా ఎన్నికలు జరగడం వలన ప్రభుత్వానికి ఖర్చు పెరుగుతుందని, ఏకకాలంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు నిర్వహిస్తే ఖజానాపై ఖర్చు భారం తగ్గుతుందని అన్నారు. ఎన్నికల కమిషన్, లా కమిషన్, పార్లమెంట్ ష్టాండింగ్ కమిటీ అభిప్రాయాలు సిఫారసుల ప్రకారం ఒకే దేశం ఒకే ఎన్నికల సిద్ధాంతానికి కట్టుబడి ఉండటం మంచిదని అన్నారు. 1971 వరకు దేశంలో ఒకే ఎన్నికలు ఉండేవని తర్వాతి కాలంలో వివిధ కారణాల వలన ఈ ప్రక్రియకు తెరపడిందన్నారు. ఫిరాయింపుల చట్టాన్ని సవరించాలి.. ప్రజాస్వామ్యంలో అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో అభిప్రాయభేదాలు ఏర్పడవచ్చు. కానీ చర్చల ద్వారా ఏకాభిప్రాయం సాధించుకుని ముందుకు సాగాలని అన్నారు. చట్టసభ్యులు పార్టీలను ఫిరాయించడంపై ఆయన మాట్లాడుతూ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సవరించాలని అన్నారు. తరచూ ఎన్నికలు జరగడం వలన ప్రజాప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వాలు నిరనలు తీసుకోలేవని తెలిపారు. ఇక ఇండియా పేరును భారత్‌గా మార్చడంపై అందులో తప్పేమీ లేదని ఆ పేరు ఎప్పటినుంచో వాడకంలోనే ఉందని అన్నారు. ఇది కూడా చదవండి: మీరు వద్దనుకుంటే పాకిస్తాన్‌కు ఇండియా పేరు పెట్టుకుంటాం -
వసతులు, సౌకర్యాలపై బిల్డర్లు దృష్టి సారించాలి
సాక్షి, హైదరాబాద్: ‘దేశంలో భూమి లభ్యత పరిమితంగా ఉండటంతో డెవలపర్లు ఎత్తయిన నిర్మాణాల వైపు మొగ్గు చూపిస్తున్నారు. భవనాల ఎత్తు పెరిగే కొద్దీ సమస్యలు ఉంటాయి. అందుకే ఎత్తు మాత్రమే కొలమానం కాకుండా సౌకర్యాలు, వసతులు కూడా దృష్టిలో పెట్టుకొని నిర్మాణాలు చేపట్టాలి’అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు డెవలపర్లకు సూచించారు. హైదరాబాద్‌లో శనివారం నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) రజతోత్సవాలు జరిగాయి. ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ప్రణాళికాబద్ధమైన రియల్ ఎస్టేట్ అభివృద్ధి కోసం కేంద్రం రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) తీసుకొచ్చి ఏళ్లు గడుస్తున్నా...ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలు రెరా ప్రతినిధులను నియమించకపోవటం శోచనీయమన్నారు. ఔటర్ రింగ్ రోడ్, ఎయిర్వేస్, హైవేస్, రైల్వేస్‌తో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ రంగం.. వెరసి హైదరాబాద్ హ్యాపెనింగ్ సిటీ అని వెంకయ్య కొనియాడారు. చంద్రుడిపై ఇళ్లు కట్టే స్థాయికి నరెడ్కో ఎదుగుతుందని ఛలోక్తి విసిరారు. సమర్థ నాయకుడితోనే అభివృద్ధి: వేముల స్థిర, సమర్థవంతమైన నాయకుడితోనే అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మెరుగైన మౌలిక వసతులు, శాంతి భద్రతలు బాగున్న చోట పెట్టుబడులు వాటంతటవే వస్తాయని ఈ విషయంలో హైదరాబాద్ ముందున్నదని చెప్పారు. కార్యక్రమంలో నరెడ్కో జాతీయ అధ్యక్షుడు రజన్ బండేల్కర్ తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా ద్విసహస్ర గళ పద్యార్చన
వన్‌టౌన్(విజయవాడ పశ్చిమ): ప్రతి వ్యక్తి జీవితంలో మాతృభాష భాగమైనప్పుడే ఆ సమాజ భాషా సంస్కృతులు కలకాలం శోభిల్లుతాయని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఆంధ్ర మహాభారత సహస్రాబ్ది మహోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ వన్‌టౌన్‌లోని కేబీఎన్ కళాశాలలో మంగళవారం ద్విసహస్ర గళ పద్యార్చన వైభవంగా నిర్వహించారు. రెండు వేల మంది విద్యార్థులు సామూహికంగా 108 పద్యాలను ఆలపించి నన్నయకు నీరాజనాలు పలికారు. ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రపంచంలో ఏ భాషకు లేని మనదైన గొప్ప సంపద తెలుగు పద్యం అని అన్నారు. ఇటీవల తెలుగు అధికార భాషా సంఘం ఆధ్వర్యాన పరవస్తు చిన్నయసూరి విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు. ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు మాట్లాడుతూ ఆదికవి నన్నయ కామధేనువు వంటివారని, ఆయన అందించిన కావ్యం అనేక గ్రంథాలకు స్ఫూర్తిని చ్చిందని తెలిపారు. తొలుత సాహితీవేత్త వాడ్రేవు సుందరరావు నన్నయ్య ఏకపాత్రాభినయంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, కృష్ణా విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య జ్ఞానమణి, సబ్ కలెక్టర్ అదితిసింగ్ ప్రసంగించారు. కేబీఎన్ కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు టి.శేషయ్య, టి.శ్రీనివాసు, కోశాధికారి ఎ.రామకృష్ణారావు, ప్రిన్సిపాల్ డాక్టర్ వి.నారాయణరావు, డాక్టర్ కె.రామకృష్ణ, డాక్టర్ నాగరాజు, డాక్టర్ జేవీ చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. -
సింగిల్ ‘టేక్’ శిల్పం
కంటోన్మెంట్ (హైదరాబాద్): ప్రపంచంలోనే అతిపెద్ద అనంత శేష శయన శ్రీ మహా విష్ణుమూర్తి ఏకాండీ బర్మా టేకు శిల్పాన్ని శనివారం మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. దీనికి బోయిన్‌పల్లిలోని అనూరాధ టింబర్ ఎస్టేట్స్ వేదికైంది. 21 అడుగుల పొడవు, ఎనిమిదిన్నర అడుగుల ఎత్తు, 20 అడుగుల కైవారం కలిగిన బర్మా టేకు దుంగతో చేసిన ‘అనంత శేషశయన శ్రీ మహా విష్ణుమూర్తి’ కళా ఖండానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అప్పటి బర్మా (మయన్మార్) దేశ అడవుల్లో సుమారు 1,500 ఏళ్ల క్రితం బర్మా టేకు దుంగను ఆ దేశ ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం వేలం వేసింది. అనూరాధ టింబర్స్ భారీ మొత్తం చెల్లించి ఈ దుంగను దక్కించుకుంది. చిత్రకారుడు గిరిధర్ గౌడ్‌తో పలు రేఖా చిత్రాలను రూపొందించి.. మయన్మార్ దేశ ప్రభుత్వం అనుమతితో అక్కడి శిల్పులతో కళాఖండాన్ని చెక్కించింది. అనంతరం కళాఖండాన్ని భారత్‌కు రప్పించి తుది మెరుగులు దిద్దించింది. భగవద్గీతలోని 11వ అధ్యాయం 6వ శ్లోకం ఆధారంగా అనంత శేషశయన శ్రీ మహావిష్ణువుతో పాటు, శ్రీదేవి, భూదేవి చిత్రాలతో పాటు 84 చిన్న కళాఖండాల కలయికతో ఈ భారీ శిల్పాన్ని రూపొందించారు. కళాఖండాన్ని ఆవిష్కరించిన మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు మాట్లాడుతూ అనురాధ టింబర్స్ నిర్వాహకులు చదలవాడ సోదరులు బర్మా టేకుతో అద్భుత కళాఖండాన్ని రూపొందించడం అభినందనీయమన్నారు. -
సుపరిపాలనకు సమష్టిగా కృషిచేయండి
ముంబై: సుపరిపాలనకు శాసనసభ్యులు సమష్టిగా కృషిచేయాలని ప్రధాని మోదీ ఉద్భోదించారు. ముంబైలో మూడ్రోజులుగా జరుగుతున్న జాతీయ శాసనసభ్యుల సదస్సుకు ప్రధాని మోదీ శనివారం ఒక సందేశం పంపించారు. అందులో మోదీ ఏమన్నారంటే.. ‘ సుపరిపాలన, విజయవంతమైన శాసనాల పరిశీలన, అభివృద్ధి నమూనాలు వంటి ప్రజాస్వామ్య విధానాల రూపకల్పన, వాటి పటిష్టత కోసం భిన్న పార్టీల ప్రతినిధులైన శాసనసభ్యులు ఇలా ఒక్క చోటుకు చేరడం నిజంగా విశేషమైన పరిణామం. దేశం అమృతకాలంలో పయనిస్తున్న ఈ తరుణంలో విధాననిర్ణేతలంతా సమష్టిగా చేసే కృషి.. దేశం అభివృద్ధి పథంలో సమున్నత శిఖరాలకు చేరుస్తుందన్న దృఢ విశ్వాసం నాలో ఇనుమడిస్తోంది. క్షేత్ర స్థాయి నుంచే నిరంతరాయంగా అభివృద్ధిని కాంక్షిస్తూ చేసే కృషి చివరకు ‘వైభవోపేత, అభివృద్ధి చెందిన భారత్’ అనే స్వప్నాన్ని నిజం చేస్తుంది’ అని అన్నారు. ‘ ప్రజలతో మమేకమవడంలో, వారి సమస్యలను పరిష్కరించడంలో ప్రజా ప్రతినిధుల పాత్ర అత్యంత కీలకం. దేశం నలుమూలల నుంచి విచ్చేసిన శాసనసభ్యులు ఒకరినొకరు తెల్సుకుని ఆయా నియోజకవర్గాల్లో వారి సమర్థ పనితీరును అర్థం చేసుకునేందుకు జాతీయ శాసనసభ్యుల సదస్సు చక్కని వేదిక. పనితీరును బేరేజువేసుకుని మెరుగైన అభివృద్ధి నమూనాలతో శాసనసభ్యులు మరింతగా దూసుకుపోగలరనే నమ్మకం నాలో ఎక్కువైంది’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఐఎంఐ–స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ ఈ సదస్సును ఏర్పాటుచేసింది. శనివారంతో ముగిసిన ఈ మూడ్రోజుల సదస్సులో దేశవ్యాప్తంగా మొత్తంగా 1,500 మందికిపైగా శాసనసభ్యులు పాల్గొన్నారు. న్యాయవ్యవస్థ చట్టాలు చేయలేదు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య చట్టాల రూపకల్పనలో అత్యున్నతమైన, తుది నిర్ణయాధికారం శాసనవ్యవస్థదేనని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. శనివారం ముంబైలో జాతీయ శాసనసభ్యుల సదస్సులో ఆయన ప్రసంగించారు.‘ చట్టాలు చేయడంలో శాసనవ్యవస్థ పాత్ర సర్వోన్నతం. ఈ ప్రక్రియలో న్యాయవ్యవస్థకు ఎలాంటి పాత్ర లేదు. కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థల పాత్రలను రాజ్యాంగం సుస్పష్టంగా నిర్వచించింది. ఏదైనా అంశంలో తామే సర్వోన్నతులమని భావించి పరిధులను దాటడానికి ఈ వ్యవస్థలు ప్రయత్నించకూడదు. శాసనాలను చేసే బాధ్యత రాజ్యాంగం కేవలం శాసనవ్యవస్థలకే అప్పజెప్పింది. రాజ్యాంగానికి బద్దమై ఆయా చట్టాలు ఉన్నాయో లేదో అని తేల్చే సమీక్షాధికారం మాత్రం న్యాయవ్యవస్థకే ఉంది. కోర్టులు చట్టాన్ని రూపొందించలేవు. ఈ విషయాన్ని అవి మననం చేసుకుంటే చాలు’ అని వెంకయ్య వ్యాఖ్యానించారు. -
ఆ అధికారం వారికి లేదు: వెంకయ్య నాయుడు
న్యూఢిల్లీ: భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జాతీయ శాసనసభ్యుల సదస్సులో మాట్లాడుతూ న్యాయస్థానాలకు చట్టాల రూపకల్పనలో జోక్యం చేసుకునే హక్కు లేదన్నారు. రాజ్యాంగం న్యాయస్థానాల విధులను, చట్టసభల విధులను స్పష్టంగా వివరించిందని, మేము గొప్పంటే మేము గొప్పని ఎవ్వరూ ఆధిపత్యం ప్రదర్శించాల్సిన అవసరం లేదని అన్నారు. ఇటీవల సుప్రీం కోర్టు పార్లమెంటు చట్టం చేసే లోపు ప్రధాన ఎన్నికల కమీషనరును, ఎన్నికల కమీషనర్లను ఎన్నుకునేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో వెంకయ్య నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. శనివారం జరిగిన జాతీయ శాసనసభ్యుల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. శాసనాలను చేసే అధికారం రాజ్యాంగం శాసనసభలకు మాత్రమే ఇచ్చింది. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు చట్టాలు చేసేటప్పుడు బిల్లు ప్రయోజనాలపై కూలంకషంగా చర్చించి, వాదోపవాదాలు చేస్తారు. అనంతరం అవి ప్రజలకు ఉపయోగపడే అంశమై అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని ఆమోదయోగ్యమైతే తప్ప వాటిని ఆమోదించరు. ప్రజాస్వామ్యంలో అదొక భాగమని తెలిపారు. చట్టసభల్లో ఆమోదించిన బిల్లులు చట్టబద్ధంగానూ, రాజ్యాంగబద్ధంగానూ ఉన్నాయా? లేదా? అని మాత్రమే న్యాయవ్యవస్థ చూడాలి తప్ప చట్టాలు చేసి అధికారం రాజ్యాంగం వారికి ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఈ చట్టాలన్నిటినీ శాసనసభ నిర్ణయిస్తుంది, ఎగ్జిక్యూటివ్ అమలు చేస్తుంది. ఈ క్రమంలో ఎక్కడైనా నిబంధనలను ఉలంఘించినట్లు అనిపిస్తే ఎవ్వరైనా కోర్టును ఆశ్రయించవచ్చని, అలాంటి సందర్భాల్లో మాత్రం వారు సత్వర న్యాయం చేయాలని ఆయన అన్నారు. ఇది కూడా చదవండి: ప్లాట్ఫారం నాయకుడిలా మాట్లాడకండి.. నోరు జాగ్రత్త! -
ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన సినిమా: వెంకయ్యనాయుడు
నీరోజ్ పుచ్చా, సోనమ్ టెండప్, సుభా రంజన్, మహేందర్ బర్గాస్ హీరోలుగా, సమైరా సందు, రాజేశ్వరి చక్రవర్తి, పెడెన్ నాంగ్యాల్ హీరోయిన్లుగా నటించిన సినిమా 'భారతీయన్స్'. భారత్ అమెరికన్ క్రియేషన్స్ పతాకంపై డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి నిర్మించారు. ప్రేమ కథా చిత్రాల స్పెషలిస్ట్ దీన్ రాజ్ (ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా ఫేమ్) చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని భారత మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఆదివారం ప్రసాద్ లాబ్స్‌లో ప్రత్యేకంగా వీక్షించారు. మంచి సినిమా తీశారని చిత్ర బృందాన్ని ఆయన అభినందించారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. 'దేశ సమైక్యత, భారతీయ సైనికుల వీరగాథ గురించి దేశభక్తి సినిమా తీయడం అభినందనీయం. దర్శక నిర్మాతలు యువతకు చక్కటి సినిమా అందించారు. దీనికి చాలా సంతోషం. దేశభక్తి చిత్రాలను యువత, ప్రేక్షకులు చూడాలని కోరుకుంటున్నా' అని అన్నారు. నటుడు కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ..'నేను ఇంతకు ముందే సినిమా చూశా. వెంకయ్య నాయుడు చూస్తున్నారని తెలిసి మళ్లీ వచ్చా. సమాజానికి, మన దేశానికి ఉపయోగపడే కంటెంట్ ఉంటేనే సినిమాలను ప్రోత్సహించడానికి వస్తారు. దర్శక, నిర్మాతల్లో ఎంతో దేశభక్తి ఉంటేనే ఇటువంటి సినిమాలు వస్తాయి. తప్పకుండా ప్రేక్షకులు అందరూ సినిమా చూడాలి' అని అన్నారు. దర్శకుడు దీనరాజ్ మాట్లాడుతూ.. ' వెంకయ్య నాయుడు సినిమా చూసి మమ్మల్ని అభినందించడం ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చింది. దర్శకుడిగా నాకు మొదటి సినిమా ఇది. 'కలిసుందాం రా', 'లాహిరి లాహిరి లాహిరిలో', 'ప్రేమించుకుందాం రా' తదితర హిట్ సినిమాలకు వర్క్ చేశా. దేశభక్తి సినిమాతో దర్శకుడిగా పరిచయం కావాలని ఈ కథ రాశా. దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడండి. ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన సినిమా' అని అన్నారు. -
సినీ గ్లామరే కాదు.. గ్రామర్ ఉండాలి: వెంకయ్య నాయుడు
‘శక్తిమంతమైన ప్రచార, ప్రసార మాధ్యమం సినిమా. అలాగే, నేటికీ ప్రజలకు అత్యంత చౌకగా వినోదం అందించే సాధనమూ సినిమా. కానీ, నేటి సినిమాల్లో ఎక్కువగా గ్లామర్, అక్కడక్కడా హ్యూమర్ నిండి, అసలైన గ్రామర్ (చెప్పుకోదగ్గ విషయం) తక్కువగా ఉంటోంది. ఒకప్పటి సినిమాల్లా వినోదంతో పాటు, విజ్ఞానం, ఎంతో కొంత సందేశం ఉండేలా చూసుకోవడం సినీరంగం బాధ్యత’’ అని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ప్రముఖ సినీ పరిశోధకుడు సంజయ్ కిశోర్ రూపొందించిన ‘స్వాతంత్య్రోద్యమం–తెలుగు సినిమా–ప్రముఖులు’ పుస్తకాన్ని శనివారం హైదరాబాద్‌లో ఆయన ఆవిష్కరించారు. సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన ‘స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న పాత తరం సినీ ప్రముఖులపై ఇలాంటి మంచి పుస్తకాలు మరిన్ని రావాలని ఆకాంక్షించారు. ‘వరకట్నం, సతీసహగమనం లాంటి దురాచారాలకు వ్యతిరేకంగా మంచి ఇతివృత్తాలతో, సంభాషణలతో వచ్చిన సినిమాలు గతంలో విజయవంతమయ్యాయయని గుర్తు చేశారు.. అలాంటి మంచి సినిమాలు తీస్తే ఆడవనే మాట తప్పని ఆయన విశ్లేషించారు. ‘నేటి తరం గురువును మర్చిపోయి, గూగుల్‌ను చూస్తోందని.. గూగుల్ పాడైతే, దాన్ని బాగుచేయడానికి సాంకేతిక నిపుణుడనే గురువునే పిలవాలి. అది మర్చిపోకండని వెంకయ్య చమత్కరించారు. భాష, సంస్కృతి, రాజకీయ రంగాలపై మాజీ ఉపరాష్ట్రపతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘దేశమంటే మట్టి కాదు మనుషులే. పెద్దల్ని గౌరవించడం, దేశాన్ని ప్రేమించడం, సర్వప్రాణులతో కలసి జీవించడం, ఉన్నది పదుగురితో పంచుకోవడం, తోటివారి పట్ల అక్కరచూపడం (షేర్ అండ్ కేర్) మన భారతీయ సంస్కృతికి మూలం. ఎవరు ఏ మతాన్ని అనుసరించినా ఇదే మన సంస్కృతి. అంటే మన జీవనవిధానం. ఇవాళ రాజకీయాల్లోనూ విలువలు దిగజారిపోయాయి. ఇవాళ సభ అంటే బస్, బిర్యానీ, బాటిల్ అనే 3 బీ ఫార్ములా అనుసరించి జనాన్ని తరలిస్తున్న దౌర్భాగ్య పరిస్థితి. సిద్ధాంతాలు పోయి రాద్ధాంతాలు పెరిగాయి. అసెంబ్లీ, పార్లమెంట్ల స్థాయి తగ్గిపోయి, ప్రజాప్రతినిధుల భాష పతనమవుతున్న ధోరణిని ఆపాలి, అడ్డుకట్ట వేయాలి. నేను ఇంగ్లీషుకు వ్యతిరేకం కాదు. ఇంగ్లీషువాడికి వ్యతిరేకం. మాతృభాషను పక్కనపెట్టేసి, పరాయిభాషను నెత్తినపెట్టుకొనే భావదారిద్య్రానికి వ్యతిరేకం. స్వాతంత్య్రానికి పూర్వం మన స్థూలజాతీయోత్పత్తి ప్రపంచంలో మూడోవంతు ఉండేది. కానీ, మనల్ని దోచుకువెళ్ళి, ఆనాడే అగ్గిపెట్టెలో పట్టేలా చీరను నేసి ఎగుమతి చేసిన మనల్ని పనికిమాలిన, తెలివితక్కువవారనే అభిప్రాయంలో ఇవాళ్టికీ ఉంచేలా చేసిన పాశ్చాత్య ప్రభావానికి వ్యతిరేకం. సభకు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి. రమణాచారి అధ్యక్షత వహించగా, ఏపీ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, దర్శక – నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, కిమ్స్ వ్యవస్థాపకులు బొల్లినేని కృష్ణయ్య, పారిశ్రామికవేత్తలు వి. రాజశేఖర్, రాజు, జేవీ కృష్ణప్రసాద్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ‘ఎందరో సినీప్రముఖుల గురించి రాసిన ఈ పుస్తకావిష్కరణను సినీపరిశ్రమ చేసి ఉండాల్సింది’ అని రమణాచారి అభిప్రాయపడ్డారు. బుద్ధప్రసాద్ మాట్లాడుతూ, ‘గతంలో దాదాపు ప్రతి సినిమాలో ప్రబోధాత్మక గీతం ఉండేది. ఒకప్పుడు దేశం కోసం ఆస్తులు, ప్రాణాలు త్యాగం చేసిన గొప్పవారున్నారు. ఇవాళ దేశాన్నే త్యాగం చేస్తున్న ప్రబుద్ధులు తయారయ్యారు. అల్లూరి సీతారామరాజు, ఆంధ్రకేసరి లాంటి ఒకరిద్దరి గురించే తెలుగులో సినిమాలొచ్చాయి. స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న తెలుగువారైన మరెందరో త్యాగధనుల గురించి సినిమాలు రావాలి’ అని అభిలషించారు. తమ్మారెడ్డి మాట్లాడుతూ, ‘వాస్తవాలను వక్రీకరించకుండా, చరిత్రను చెప్పే సినిమాలు రావాల్సి ఉంది’ అని పేర్కొన్నారు. భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా రమణాచారి ఇచ్చిన సలహా మేరకు ఎంతో శ్రమించి, ఈ పుస్తకం రాసినట్టు సంజయ్ కిశోర్ తెలిపారు. సురేఖామూర్తి, శ్రీమతి భూదేవి తదితర ప్రముఖ గాయనులు స్వాతంత్య్ర గీతాలాపన, అంబటిపూడి మురళీకృష్ణ వ్యాఖ్యానం సభను రక్తి కట్టించాయి. పలువురు సినీ, సాంస్కృతిక, రాజకీయ ప్రముఖులు ఈ సభలో పాల్గొన్నారు. -
‘అరి’ ట్రైలర్‌పై వెంకయ్య నాయుడు ప్రశంసలు
పేపర్ బాయ్ ఫేం జయశంకర్ దర్శకత్వం వహించిన రెండో చిత్రం అరి. మై నేమ్ ఈజ్ నో బడీ అనేది ట్యాగ్‌లైన్. అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, శుభలేక సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆర్వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి టాక్ని సంపాదించుకుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌పై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విటర్ వేదికగా ప్రశంసలు కురిపించారు. ‘అరి’ సినిమా ప్రచార చిత్రాన్ని వీక్షించడం ఆనందదాయకం. ఆరు రకాల అంతఃశత్రువులను ప్రతి మనిషి జయించాలన్న సందేశంతో చక్కని కథ,కథనాలతో ఈ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు జయశంకర్, నిర్మాత అభిషేక్ అగర్వాల్ సహా చిత్ర బృందాన్ని అభినందిస్తూ, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను’అని వెంకయ్య నాయుడు ట్వీట్ చేశాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వచ్చే నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. "అరి" సినిమా ప్రచార చిత్రాన్ని వీక్షించడం ఆనందదాయకం. ఆరు రకాల అంతఃశత్రువులను ప్రతి మనిషి జయించాలన్న సందేశంతో చక్కని కథ,కథనాలతో ఈ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు శ్రీ జయశంకర్, నిర్మాత శ్రీ అభిషేక్ అగర్వాల్ సహా చిత్ర బృందాన్ని అభినందిస్తూ,సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను pic.twitter.com/HLeeE5scoF — M Venkaiah Naidu (@MVenkaiahNaidu) March 29, 2023