
కుటుంబ సభ్యులను పరామర్శించిన వెంకయ్యనాయుడు
చిన్నతనం నుంచి కొణిజేటి రోశయ్యను బాగా అభిమానించేవాడినని, ఆయన కూడా తనను అభిమానంతో ఆప్యాయంగా పలకరించేవారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.
అమీర్‌పేట: చిన్నతనం నుంచి కొణిజేటి రోశయ్యను బాగా అభిమానించేవాడినని, ఆయన కూడా తనను అభిమానంతో ఆప్యాయంగా పలకరించేవారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆ రోజుల్లో రాజకీయ విభేదాలున్నప్పటికీ అనేక విషయాలపై తాము తరచూ మాట్లాడుకునేవారమని గుర్తు చేసుకున్నారు. బుధవారం అమీర్‌పేటలోని రోశయ్య నివాసానికి వచ్చిన ఉపరాష్ట్రపతి.. ముందుగా రోశయ్య చిత్ర పట్టం వద్ద నివాళులర్పించి కుటుంబీకులను పరామర్శించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున ఆ రోజు తాను ఇక్కడ లేనని, వారి కుటుంబీకులను కలిసి సంతాపాన్ని తెలియజేయాలని వచ్చానని చెప్పారు. ఉపరాష్ట్రపతి వెంట రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, మాజీ ఎంపీ కేవీపీ రాంచంద్రారావు, ఎమ్మెల్సీ బుగ్గారపు దయానంద్ గుప్త తదితరులు ఉన్నారు.