Konijeti Rosaiah
-
రోశయ్య వల్లే తెలంగాణ మిగులు బడ్జెట్‌గా మారింది: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: దివంగత మాజీ సీఎం కొణిజేటి రోశయ్య నిబద్ధత, సమర్థత వల్లే తెలంగాణ మిగులు బడ్జెట్‌గా ఆవిష్కృతమైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన ఆర్థిక క్రమశిక్షణ పాటించారు కాబట్టే రూ.16వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో రాష్ట్రం ఏర్పడిందన్నారు. మాజీ సీఎం రోశయ్య మూడో వర్ధంతి సందర్భంగా హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన సంస్మరణ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు.. రోశయ్య చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ఏ రోజు కూడా తనకు ఈ పదవి కావాలని రోశయ్య అడగలేదని.. పార్టీ పట్ల నిబద్దత, క్రమశిక్షణ వల్లనే పదవులు వచ్చాయని తెలిపారురోశయ్య ఉన్నప్పుడు నెంబర్-2 ఆయనే.. నెంబర్ 1 మాత్రమే మారేవారని సీఎం పేర్కొన్నారు. నెంబర్ 2లో ఉన్నా.. ఆయన ఎప్పుడూ తన పైన ఉన్నవారిని దాటిపోవాలని అనుకోలేదని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించాలి.. పాలక పక్షంలో ఉన్నప్పుడు పరిష్కరించాలి అని రోశయ్య చెప్పారని గుర్తు చేశారు. ‘చుక్క రామయ్య,ప్రొఫెసర్ నాగేశ్వర్, రోశయ్య లాంటి వారి మధ్య శాసనమండలిలో ఎమ్మెల్సీగా మాట్లాడేందుకు నేను భయపడ్డాను. నీటి పారుదల శాఖ పైన మండలిలో నేను మాట్లాడినప్పుడు నన్ను తన ఛాంబర్‌కు పిలిపించుకొని ప్రోత్సహించారు. ప్రతిపక్ష సభ్యుడినైనప్పటికి మండలి గౌరవం పెంచాలన్న ఉద్దేశంతో రోశయ్య నన్ను ఆనాడు ప్రోత్సహించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించాలి. పాలక పక్షంలో ఉన్నప్పుడు పరిష్కరించాలని రోశయ్య నాకు సూచించారు. చట్టసభల్లో అనాటి స్పూర్తి కొరవడింది.ప్రతిపక్షాలకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వొద్దన్నట్లుగా పరిస్థితులు తయారయ్యాయి. రోశయ్య కుటుంబం రాజకీయాల్లో లేదు. సీఎంగా, గవర్నర్ గా,వివిధ హోదా ల్లో 50 యేళ్ల పైగా రాజకీయాల్లో గొప్పగా రాణించారు. తమిళనాడు గవర్నర్‌గా ఎవరు వెళ్లినా వివాదాల్లో కూరుకుపోతుంటారు. కాని రోశయ్య అక్కడ వివాదాలు లేకుండా రాణించారు. అ నాటి ముఖ్యమంత్రులకు రోశయ్య కుడి భుజంలా వ్యవహారించడం వల్లనే వారు సమర్థంగా పనిచేశారు. రోశయ్య లాంటి సహచరులు ఇప్పుడు లేకపోవడం పెద్ద లోటు.ప్రతిపక్షాల నుంచి వచ్చే ప్రశ్నల నుంచి ప్రభుత్వాన్ని రోశయ్య కంచె వేసి కాపాడేవారు. నెంబర్ 2 స్థానంలో రోశయ్య ఉండాలని ఆ నాటి ముఖ్యమంత్రులు కోరుకున్నారు. ముఖ్యమంత్రి స్థానం కోసం ఏ నాడు రోశయ్య తాపత్రయపడలేదు. పార్టీ పట్ల ఆయన నిబద్ధత కారణంగానే క్లిష్ట సమయంలో రోశయ్యను ముఖ్యమంత్రి చేయాలని సోనియా గాంధీ నిర్ణయించారు. రోశయ్య నిబద్దత కారణంగానే అన్ని హోదాలు ఆయన ఇంటికి వచ్చాయి. సభలో సమస్యలను వ్యూహాత్మకంగా ఎదుర్కొవాలంటే రోశయ్య ఉండాలనే ముద్ర ఆయన బలంగా వేశారు. రాష్ట్ర ఆర్థిక ఎదుగుదల ఆర్యవైశ్యుల చేతిలో ఉంది.. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లు కావాలి. ఆర్య వైశ్యుల వ్యాపారాలకు ఎలాంటి అనుమతులైనా ప్రభుత్వం సకాలంలో ఇస్తుంది.రాజకీయాల్లో ఆర్య వైశ్యులకు సముచిత స్థానం ఇస్తాం. నేను హైదరాబాద్ వ్యక్తినని గతంలో రోశయ్య స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రోశయ్య విగ్రహం ఏర్పాటు చేస్తాం. రోశయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా సమాజానికి మంచి స్పూర్తి ఇచ్చినట్లైవుతుంది.’ అని తెలిపారు. -
తస్సాదియ్యా... మన రోశయ్య!
విషయ పరిజ్ఞానం, లెక్కలు, తేదీలు, చమత్కారం, సమయ స్ఫూర్తి, ముక్కుసూటిగా ప్రవాహ వేగంతో మాట్లాడే లక్షణం, స్పష్టమైన ఉచ్చా రణ, గంభీరమైన కంఠస్వరం వంటి లక్షణాలు మాజీ ముఖ్యమంత్రి, గవర్నర్ కొణిజేటి రోశయ్యకు ఓ ప్రత్యేకతను సంతరించిపెట్టాయి. శాసన సభలోనూ, బయటా ఆయన మాట్లాడిన ప్రతిమాటా ఒక చెణుకే.ఓసారి రోశయ్య అల్లుడు ఒక విందులో తన మిత్రులతో ఎంజాయ్ చేస్తూ టీవీ ఛానెళ్లకు చిక్కారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండడంతో టీడీపీ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు. సభలో ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ మూకుమ్మడిగా ఉత్సాహంతో రెచ్చిపోయారు. చివరగా రోశయ్య తాపీగా నిలబడ్డారు. ‘అధ్యక్షా... ఎన్టీ రామారావు గారికీ, నాకూ దేవుడు మంచి అల్లుళ్ళనివ్వలేదు. ఏంచేస్తాం అధ్యక్షా’ అనేసి ఠక్కున కూర్చున్నారు. పాపం... తెలుగు తమ్ముళ్లు నవ్వలేరు, నవ్వకుండా ఉండలేరు. ఇక చంద్రబాబు పరిస్థితి సరే సరి! మిగతా సభ్యుల నవ్వులతో ఆనాటి సభ వెల్లివిరిసింది.మరోసారి సభలో చంద్రబాబు ఆరోపణలపై ప్రతిస్పందిస్తూ ... ‘అధ్యక్షా... స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని నేను డ్రామా కంపెనీవాడు అనలేదు. ముందు ఆయన డ్రామాలు వేశాడు. తరవాత సినిమాల్లోకి వెళ్లి ప్రముఖ నటుడయ్యాడు అన్నానంతే. మీరు (చంద్రబాబును ఉద్దేశించి) ఒకప్పుడు ఆయన్ను గౌరవించారు. మధ్యలో పోయింది. తర్వాత మళ్ళీ వచ్చింది... సరే, నన్ను తెలివితేటలు గలవాణ్ణని అన్నారు. నేను తెలివితేటలు గలవాణ్ణయితే ఇలా ఉంటానా? ఒంటరిగా ఉన్నప్పుడెప్పుడో అదనుచూసి రాజశేఖర రెడ్డిని ఒక్కపోటు పొడిచి ఆ సీట్లో కూర్చునేవాడిని...’ అన్నారు. అంతే... చంద్రబాబు, ఆ పార్టీ సభ్యులు కిక్కురుమంటే ఒట్టు.వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఇష్టమైన ఓ చెణుకు గురించి ఉండవల్లి అరుణ్ కుమార్ ఇలా చెప్పారు: ‘‘రోశయ్య ఓసారి రాజమండ్రిలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఓవర్ డ్రాఫ్టులకు వెళ్లడంపై మాట్లాడుతూ, ఇది రాష్ట్రానికి మంచిది కాదు–అప్పుల ఊబిలోకి పోతాం అన్నారు... సరే విలేకర్లు తర్వాత ఆయన మాటల్ని మరో ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఫైనాన్స్ మినిస్టర్ (యనమల రామృష్ణుడు)తో అని, దీనికేమంటారు? అని అడిగారు. అందుకాయన మేమేమైనా తప్పు చేస్తున్నామా, ఫెసిలిటీ ఉంది, వాడుకుంటున్నాం. దాని కెందుకింత గొడవ? అన్నారు. ఈ సంగతి ఇంకో ప్రెస్ కాన్ఫరెన్సులో రోశయ్యతో చెప్పి, దీనిపై మీరేమంటారు? అని అడిగారు. దీనికి రోశయ్య ‘చూడు నాయనా... ప్రతి ఊరికీ శ్మశానం ఫెసిలిటీ ఉంటుంది. ఉంది కదాని వాడుకోం కదా, జీవుడు పోయిన తర్వాతే అక్కడికి పట్టుకెళ్ళేది’ అని జవాబిచ్చారు.చెణుకులు విసరడమే కాదు అణకువలోనూ, అందరితో కలివిడిగా ఉండడంలోనూ ఆయన పెట్టింది పేరు. ముఖ్యమంత్రి పదవినుంచి వైదొలగుతూ తన పేషీలో సెక్రెటరీ, పీ.ఏ, ఇతర ఉద్యోగులందరి సీట్ల దగ్గరకూ వెళ్లి ‘నా టెర్మ్ అయిపోయింది. కృతజ్ఞతలు. నా వల్ల ఏమైనా ఇబ్బందిపడి ఉంటే ఏమీ అనుకోకండి’ అని వినమ్రంగా చెప్పారు రోశయ్య.శాసన మండలి సభ్యునిగా ఎన్టీఆర్‌ను ఉక్కిరిబిక్కిరి చేసి, మండలి రద్దు చెయ్యాలని నిర్ణయం తీసుకునేలా చేశాడని నాటి విశ్లేషకులు అంటుంటారు. రోశయ్య ఏ పదవి చేపట్టినా ఉద్యోగంలా భావించారు. అసంతృప్తిగా పని చేయడం ఆయనకు ఇష్టం ఉండేది కాదు. అవినీతి మచ్చలేని నిలువెత్తు నిజాయితీ ఆయన. ప్రత్యర్థులు సైతం ఒప్పుకునే సత్యమిది. రాజకీయాల్లో ఆయన స్థానం ఎప్పటికీ భర్తీ చేయలేనిది.– తిరుమలగిరి సురేందర్,ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ -
నరసరావుపేటలో స్థానికేతరులకే పట్టం
సాక్షి, నరసరావుపేట: ఎన్నికల్లో అభ్యర్థి స్థానికత అంశం ఎంతో కీలకం. కొన్నిసార్లు దాని ఆధారంగా గెలుపోటములు ప్రభావితమవుతుంటాయి. నరసరావుపేట ఓటర్లు 1998 పార్లమెంట్ ఎన్నికల నుంచి ఇప్పటివరకు పల్నాడు వెలుపలి వారినే పట్టం కడుతున్నారు. ప్రధాన పారీ్టలు కూడా నాన్‌లోకల్ అభ్యర్థులనే బరిలోకి దింపుతున్నాయి. 1998 ఎన్నికలలో ప్రస్తుత బాపట్ల జిల్లాలోని వేమూరులో జన్మించిన మాజీ సీఎం కొణిజేటి రోశయ్యను నరసరావుపేట పార్లమెంట్ ఓటర్లు గెలిపించారు. ఆ తరువాత 1999 ఎన్నికల్లో మరో మాజీ సీఎం నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి టీడీపీ అభ్యర్థి లాల్‌జాన్‌బాషాపై గెలుపొందారు. ఇదే లోకసభ నియోజకవర్గం నుంచి కాసు బ్రహ్మానందరెడ్డి ఎంపీగా గెలవడంతో ముగ్గురు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంలను ఢిల్లీకి పంపిన ఘనత నరసరావుపేటకి దక్కింది. నేదురుమల్లి తర్వాత 2004 సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు జిల్లాకు చెందిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఎంపీగా గెలుపొందారు. వీరు ముగ్గురు కాంగ్రెస్–ఐ పార్టీ తరపున గెలుపొందారు. 2009లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసిన మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి గెలుపొందారు. మోదుగుల స్వస్థలం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెదపరిమి. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో రాయపాటి సాంబశివరావు మాత్రం అమరావతి మండలం ఉంగుటూరు గ్రామానికి చెందినవారు.2019లో జరిగిన చివరి సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు జిల్లా పెదనందిపాడుకు చెందిన లావు శ్రీకృష్ణదేవరాయులు వైఎస్సార్ సీపీ తరపున పోటీ చేసి గెలిచారు. ఇలా గత ఆరు ఎన్నికల్లో ఐదుమంది పల్నాడు ప్రాంతానికి చెందని వారు ఎంపీగా గెలుస్తున్నారు. నెల్లూరు సెంటిమెంట్ రాజకీయంగా నరసరావుపేటకి నెల్లూరుకి అవినాభావసంబంధం ఉన్నట్టు ఉందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 1999 ఎన్నికల్లో నెల్లూరు జిల్లా నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డిని పల్నాడు ప్రాంత వాసులు గెలిపించారు. తరువాత ఎన్నికల్లో అదే నెల్లూరు నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో నిలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డిని నరసరావుపేట పార్లమెంట్ ఓటర్లు 86,255 ఓట్ల భారీ మెజారీ్టతో గెలిపించారు. ఇలా ఇప్పటివరకు నెల్లూరు నుంచి వచ్చి పోటీ చేసిన నేతలకు నరసరావుపేట ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. త్వరలో జరగనున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ నెల్లూరు జిల్లా వాసి మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ వైఎస్సార్సీపీ తరపున పోటీలో ఉంటున్నారు. దీంతో మరోసారి నెల్లూరు సెంటిమెంట్ పనిచేసి అనిల్‌కుమార్ యాదవ్ గెలుపు పక్కా అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అనిల్‌కుమార్ యాదవ్‌కు బ్రహ్మరథం బీసీల అడ్డా అయిన నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో ఇంతవరకు ఒక్క బీసీ అభ్యర్థి కూడా ఎంపీగా గెలుపొందలేదు. బీసీలను రాజకీయంగా ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ వర్గానికి చెందిన పి.అనిల్‌కుమార్ యాదవ్‌ను పోటీలో ఉంచిన విషయం తెలిసిందే. ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో ఆయన గెలుపు పక్కా అనే టాక్ వినిపిస్తోంది. -
నాన్న పోలీస్.. కుమార్తె షూటర్
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): తండ్రి పోలీస్‌శాఖలో అత్యుత్తమ పనితీరుతో ప్రతిష్టాత్మక పతకాలు అందుకున్న అధికారి.. ఆ కుమార్తె తండ్రికి తగ్గ తనయ. షూటింగ్లో దిట్ట.. నాన్న స్ఫూర్తి, ప్రోత్సాహంతో ముందుకు సాగుతూ జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది. తన తండ్రితోపాటు గుంటూరు కీర్తిని చాటేందుకు సిద్ధమైంది. ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఈ తండ్రీకూతుళ్ల విజయగాధ.. అత్యున్నత గ్యాలంటరీ అవార్డు కై వసం సీఐ డి.నరేష్.. ప్రస్తుతం గుంటూరు దిశ పోలీసుస్టేషన్ సీఐగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 1998లో ఎస్ఐగా ఉద్యోగజీవితం ప్రారంభించిన ఆయన గుంటూరు రేంజ్ పరిధిలోనే వివిధ విభాగాల్లో పనిచేశారు. అనంతరం సీఐగా ఉద్యోగోన్నతి పొందారు. సుమారు ఆరున్నరేళ్లపాటు నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసి 2010 సంవత్సరంలో పోలీసు శాఖలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి ఎంపిక చేసే గ్యాలంటరీ అవార్డును అప్పటి ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య చేతుల మీదుగా అందుకున్నారు. 2006లో రాష్ట్ర ప్రభుత్వ సేవా పతకం, 2018లో ఉత్కృష్ట సేవా పతకం, 2022లో ఉత్తమ సేవా పతకం అందుకున్నారు. విశ్రాంత డీజీపీలు పేర్వారం రాములు, స్వర్ణజిత్‌సేన్, అప్పా డైరెక్టర్ గోపినాథ్రెడ్డితోపాటు అనేక మంది ఉన్నతాధికారుల చేతుల మీదుగా అనేక అవార్డులను పొందారు. విధుల్లో చేరిన నాటి నుంచి ఇప్పటి వరకు కనీసం ఒక్క పనిష్మెంట్ కూడా లేదంటే.. ఆయన విధుల్లో ఎంత బాధ్యతగా ఉంటారో అర్థమవుతోంది. పుత్రికోత్సాహంతో ఉప్పొంగే.. సీఐ నరేష్ కుమార్తె సన్వితాషారోన్. ఇంటర్మీయెట్ పూర్తి చేశారు. ప్రస్తుతం లా చదవించేందుకు సిద్ధమవుతున్నారు. ఈమె షూటింగ్‌లోనూ దిట్ట. ఇప్పటికే అనేక పతకాలు కైవసం చేసుకున్నారు. ఇటీవల నేషనల్స్‌కు ఎంపికయ్యారు. చిన్ననాటి నుంచి కూతురు షూటింగ్‌పై ఆసక్తి కనబరచడంతో సీఐ నరేష్ ప్రోత్సహించారు. శిక్షణ ఇప్పించి మెళకువలు నేర్పించారు. రాష్ట్ర స్థాయిలో ఎయిర్ పిస్టల్ రేంజ్–10 జూనియర్, ఉమెన్ విభాగాల్లో సన్విత స్వర్ణ, వెండి పతకాలను సాధించారు. ఫైర్ఆమ్–25 రేంజ్ విభాగంలో భూపాల్, కేరళ, ఢిల్లీలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన కర్మీసింగ్ షూటింగ్ రేంజ్, అహ్మదాబాద్, గుజరాత్ పోటీల్లో పాల్గొని రెండు గోల్డ్ మెడల్స్, నాలుగు సిల్వర్ మెడల్స్ సాధించారు. గత ఆగస్టులో త్రివేండ్రంలో జరిగిన సౌత్‌జోన్ షూటింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన సన్వితా.. త్వరలో జరగబోయే ఆలిండియా షూటింగ్ కాంపిటేషన్‌కు ఎంపికయ్యారు. సంతోషంగా ఉంది నాకు క్రీడలపై ఆసక్తి ఉంది. నేను 1998లో స్పోర్ట్స్ కోటాలో పోలీసుశాఖలో ఉద్యోగం సంపాదించా. నా కుమార్తె సన్వితషారోన్కు షూటింగ్ అంటే మక్కువ. తన కోరిక కాదనకుండా.. శిక్షణ ఇప్పించా. రాష్ట్ర, జోన్ స్థాయిలో ఎన్నో పతకాలు సాధించింది. ఇటీవల త్రివేండ్రంలో జరిగిన షూటింగ్ కాంపిటేషన్‌లో పాల్గొని నేషనల్స్‌కు ఎంపికై ంది. ఎంతో సంతోషంగా ఉంది. – డి.నరేష్ (దిశ పీఎస్ సీఐ) అంతర్జాతీయ స్థాయికి వెళ్లడమే లక్ష్యం షూటింగ్ అంటే నాకు ఇష్టం. ఇప్పటి వరకు చాలా కష్టపడ్డాను. నేషనల్స్‌కు ఎంపికయ్యాను. నా తల్లిదండ్రులు, విద్య నేర్పిన గురువుల రుణం తీర్చుకోలేనిది. వారి ప్రోత్సాహం మరువలేనిది. ఎప్పటికై నా దేశం తరఫున అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడాలనేది నా కల. అది సాధించి తీరతాను. – డి.సన్వితాషారోన్ -
Konijeti Rosaiah: మాటల తూటాల అజాత శత్రువు
అరుదైన రాజకీయ నాయకుడు కొణిజేటి రోశయ్య. ఆయన వాగ్ధాటికి అసెంబ్లీ సమావేశాలు దద్దరిల్లేవి. గొప్ప హాస్య చతురతతో పాటూ ముక్కుసూటిగా మాట్లాడటం ఆయన శైలి. ప్రభుత్వ శాఖలన్నింటిపైనా అపారమైన పట్టు, అవగాహన ఆయనకున్నాయి. వివాదాలకు దూరంగా ఉంటూ, మంచి సలహాదారుగా కూడా వ్యవహరించేవారు. రాజనీతిలో అపర చాణక్యుడు. విలువలతో కూడిన రాజకీయాలకు ఆయన చిరునామా. మాటల మాంత్రికుడిగా వినుతికెక్కారు. తన ప్రసంగంతో ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధుల్ని చేయడమే కాదు, మాటల తూటాలు కూడా పేల్చేవారు. చట్టసభ లోపల, బయట కూడా ఒంటిచేత్తో ప్రతిపక్షాల్ని మాట తూలకుండా ఆటలాడుకునేవారు. కొణిజేటి రోశయ్య 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామములో ఆదెమ్మ, సుబ్బయ్య దంపతులకు జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్ అభ్యసించారు. రోశయ్య ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు, కర్షక నాయకుడు ఎన్జీ రంగా శిష్యులు. నిడుబ్రోలులోని రామానీడు రైతాంగ విద్యాలయంలో సహచరుడు తిమ్మారెడ్డితో బాటు రాజకీయ పాఠాలు నేర్చారు. ఆయన భారత జాతీయ కాంగ్రెసు పార్టీ తరఫున 1968, 1974, 1980లలో శాసన మండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. 1979లో టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో రవాణ, గృహనిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖలు, 1982లో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో హోం శాఖ, 1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, రవాణ, విద్యుత్తు శాఖలు; 1991లో నేదురుమల్లి జనార్దనరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలు; 1992లో కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలకు మంత్రిగా పనిచేశారు. 2004, 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ (ఆర్థిక ప్రణాళిక)ను ఇప్పటికి 15 సార్లు శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇందులో చివరి 7 సార్లు వరుసగా ప్రవేశపెట్టడం విశేషం. బడ్జెట్ కూర్పులో రోశయ్య ఘనాపాటిగా పేరు పొందారు. రాజకీయాల్లో అజాత శత్రువుగా పేరు పొందారు. గ్రూపు రాజకీయాలకు దూరంగా, చాలా కాంగ్రెస్ కేబినెట్లలో కీలక మంత్రిగా పని చేయడం సామాన్య విషయం కాదు. తనకు అప్పగించిన ఏ బాధ్యతనైనా సమర్థవంతంగా నిర్వహించారు. 1995–97 మధ్యకాలంలో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లో నరసరావుపేట నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 12వ శాసనసభకు చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 2007లో ఆంధ్ర విశ్వవిద్యాలయం రోశయ్యకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలిలో సుదీర్ఘ కాలం పనిచేసిన అనుభవమున్న రోశయ్య 2009, సెప్టెంబర్ 3 నుండి 2010 నవంబరు 24 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2011 ఆగస్టు 31న రోశయ్య తమిళనాడు రాష్ట్ర గవర్నరుగా ప్రమాణస్వీకారం చేశారు. 2016 ఆగస్టు 30 వరకూ తమిళనాడు గవర్నరుగా తన సేవలు అందించారు. ప్రతిపక్షంలో ఉంటే నెగటివ్ పాలిటిక్స్ చెయ్యచ్చు. అదే ప్రభుత్వంలో ఉంటే, నిర్మాణాత్మకమైన పాత్రతో పాజిటివ్ పాలిటిక్స్ నడపచ్చు అనేవారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందడంతో 2009, సెప్టెంబర్ 3న రోశయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. పధ్నాలుగు నెలలు అధికారంలో కొనసాగిన అనంతరం 2010 నవంబరు 24వ తేదీన తన పదవికి రాజీనామా చేశారు. రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకున్న తరువాత ఆరోగ్యం సహకరించినప్పుడల్లా సాహితీ, సాంస్కృతిక కార్యాక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరై అలరింపజేసేవారు. 2018 ఫిబ్రవరి 11న ఆదివారం నాడు టి. సుబ్బిరామిరెడ్డి లలిత కళా పరిషత్ ఆధ్వర్యంలో కొణిజేటి రోశయ్యను గజ మాలతో సత్కరించి జీవన సాఫల్య పురస్కారం అందించారు. ఆంధ్ర ఉద్యమంతో తన రాజకీయ జీవితం ప్రారంభమైందని రోశయ్య అనేవారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలు అందించిన సహకారంతోనే చట్టసభల్లో తగిన గుర్తింపు లభించిందని విన మ్రంగా చెప్పేవారు. తనకు దక్కిన అవకాశాలను సద్వినియోగం చేసు కుంటూ.. తనకు అప్పగించిన విధిని సక్రమంగా నిర్వహించానని తాను పాల్గొనే కార్యక్రమాలలో ఆత్మ సంతృప్తితో చెప్పేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సుదీర్ఘ కాలంపాటు ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఘనత రోశయ్యదే. కొణిజేటి రోశయ్య అనారోగ్యంతో బాధపడుతూ 2021 డిసెంబర్ 4న హైదరాబాదులో కన్నుమూశారు. ప్రజాజీవితంలో ఆయన ఒక మహోన్నత నేత. రాజకీయ విలువలు, అత్యున్నత సంప్రదాయాలు కాపాడడంలో ఓ రుషి మాదిరి సేవలందించారు. (క్లిక్ చేయండి: వివక్ష ఉందంటే ఉలుకెందుకు?) - తిరుమలగిరి సురేందర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ (డిసెంబర్ 4న కె. రోశయ్య ప్రథమ వర్ధంతి) -
రోశయ్య అందరికీ ఆదర్శం
సాక్షి, అమరావతి: విద్యార్థి నాయకుడు స్థాయి నుంచి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ, సీఎం, గవర్నర్ వరకూ సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో కొనసాగిన మాజీ గవర్నర్, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య అందరికీ ఆదర్శమని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రోశయ్య మృతికి నివాళిగా గురువారం ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన సంతాప తీర్మానంపై సీఎం జగన్ మాట్లాడుతూ.. రోశయ్య ఏ బాధ్యత నిర్వర్తించినా అందరికీ ఆదర్శంగా, అందరూ మెచ్చుకునే మనిషిగానే మెలిగారన్నారు. ఉమ్మడి ఏపీలో ఐదుగురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేశారని గుర్తుచేశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోను ఆర్థికశాఖ మంత్రిగా పనిచేశారని, వారిద్దరి మధ్య మంచి సంబంధాలుండేవని.. ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉండేవారన్నారు. అలాంటి రోశయ్య ఇవాళ మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనసారా కోరుకుంటున్నానని సీఎం అన్నారు. రోశయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు ఆయన తెలిపారు. అదే విధంగా ఇటీవల మృతిచెందిన శాసనసభ మాజీ సభ్యులు వల్లూరి నారాయణమూర్తి, వీవీఎస్ఎస్ చౌదరి, కడప ప్రభాకర్‌రెడ్డి, మంగమూరి శ్రీధర్ కృష్ణారెడ్డి, గారపాటి సాంబశివరావు, టీఎన్ అనసూయమ్మ, పి. వేణుగోపాలరెడ్డి, ఎల్లసిరి శ్రీనివాసులరెడ్డి, యడ్లపాటి వెంకట్రావుల ఆత్మకు శాంతి చేకూరాల ని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు సీఎం తెలిపారు. సభ్యు లు రెండు నిమిషాలు మౌనం పాటించారు. మేటి రాజకీయ నాయకుడు డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మాట్లాడుతూ.. రోశయ్య తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో మచ్చలేని మహా మనిషిలా ఎదిగారన్నారు. ఆర్థిక మంత్రి హోదాలో వరుసగా ఏడుసార్లు.. మొత్తంమీద 16సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత ఆయనదేనన్నారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. మంత్రిగా, సీఎంగా రోశయ్య రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించారన్నారు. ఆయన సేవలకు గుర్తుగా ఒంగోలులో రోశయ్య కాంస్య విగ్రహం ఏర్పాటుచేయాలని సీఎం ఆదేశించారన్నారు. మాజీ సీఎం రోశయ్య మరణం అత్యంత బాధాకరమని.. ఆయన తెలుగు ప్రజలందరికీ మంచి జరిగేలా అనేక కార్యక్రమాలు చేశారని మంత్రి వెలంపల్లి కొనియాడారు. ఇక ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి స్పందిస్తూ.. రోశయ్య ప్రసంగాలు సభ్యులందరికీ మార్గదర్శకమని చెప్పారు. అంతటి మహనీయుడు మరణిస్తే, సభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టడంపై రాజకీయం చేయడం సబబు కాదన్నారు. నిబంధనలు, ఆనవాయితీలకు అనుగుణంగా సభ నడుస్తుందన్నారు. ‘మండలి’లోనూ నివాళి రాజకీయాల్లో తనదైన రీతిలో రాణించిన కొణిజేటి రోశయ్య ఆదర్శప్రాయుడని సభ్యు లు కొనియాడారు. ఆయన మృతికి సంతాప తీర్మానాన్ని గురువారం శాసనమండలిలో మంత్రి కె. కన్నబాబు ప్రవేశపెట్టారు. అజాత శత్రువుగా అందరి మన్ననలు ఆయన అందుకున్నారన్నారు. విఠపు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ రోశయ్య వంటి మహనీయుల ఉపన్యాసాలు నేటి తరానికి దిక్సూచిగా ఉపయోగపడతాయన్నారు. ఈ సందర్భంగా టీడీపీ, వైఎస్సార్సీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు జోక్యం చేసుకుని సభ్యులు సంతాపం వరకే పరిమితమై మాట్లాడాలని, అభ్యంతరకర వ్యాఖ్యలు ఉంటే రికార్డు నుంచి తొలగిస్తామని రూలింగ్ ఇచ్చారు. అనంతరం, మంత్రి ముత్తంశెట్టి, ఉమ్మారెడ్డి, యనమల, కల్పలతారెడ్డి, పోతుల సునీత, మాధవ్, చిక్కాల, అంగర రామ్మెహనరావు, వాకాటి నారాయణరెడ్డి, కేఎస్ లక్ష్మణరావు తదితరులు మాట్లాడి రోశయ్య కుటుంబానికి సానుభూతి తెలిపారు. -
‘ఐదుగురు సీఎంల వద్ద పనిచేసిన ఘనత ఆయనది’
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మాజీ సభ్యుడు కొణిజేటి రోశయ్య మృతిపై సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. విద్యార్ధి నాయకుడు స్ధాయి నుంచి శాసన మండలి సభ్యుడుగానూ, శాసస నభ్యుడుగానూ, మంత్రిగానూ, ఎంపీగానూ, ముఖ్యమంత్రి, చివరకు గవర్నర్‌గానూ కొనసాగిన ఘనత రోశయ్యదన్నారు. ఆయన ఏ బాధ్యత నిర్వర్తించినా అందరికీ ఆదర్శంగా, అందరూ కొనియాడే మనిషిగానే నిలిచారన్నారు. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐదుగురు ముఖ్యమంత్రుల వద్ద ఆయన పనిచేశారన్నారు. నాన్న వైఎస్సార్ హయాంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారని, వారిద్దరి మధ్య మంచి సంబంధాలు ఉండేవన్నారు. ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉండేవారని, అలాంటి రోశయ్య గారు ఇవాళ మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు సీఎం జగన్. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ సభ్యులు వల్లూరి నారాయణమూర్తి, వీవీఎస్ఎస్ చౌదరి, కడప ప్రభాకర్ రెడ్డి, మంగమూరి శ్రీధర్ కృష్ణారెడ్డి, గారపాటి సాంబశివరావు , శ్రీమతి టీఎన్ అనసూయమ్మ, పి వేణుగోపాలరెడ్డి, ఎల్లసిరి శ్రీనివాసులరెడ్డి, యడ్లపాటి వెంకటరావు వీరందరి మృతికి కూడా ఈ సభ ద్వారా సీఎం జగన్ సంతాపం తెలియజేశారు. అనంతరం మృతి చెందిన మాజీ సభ్యులకు సంతాప సూచకంగా శాసనసభలో రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం గవర్నర్ ప్రసంగంపై చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ మేరకు గవర్నర్ ప్రసంగం సందర్భంగా టీడీపీ ప్రవర్తించిన తీరును శ్రీకాంత్‌రెడ్డి ఖండించారు. -
రోశయ్య మృతికి సంతాపం తెలిపిన సీఎం జగన్
-
గోదావరి, కృష్ణా నదుల్లో రోశయ్య అస్థికల నిమజ్జనం
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం)/వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): మాజీ సీఎం కొణిజేటి రోశయ్య అస్థికలను బుధవారం గోదావరి, కృష్ణా నదుల్లో నిమజ్జనం చేశారు. రాజమహేంద్రవరం పుష్కరాల రేవు వద్ద గోదావరి నదిలో, అలాగే విజయవాడ మోడల్ గెస్ట్‌హౌస్ వద్ద ఉన్న వీఐపీ ఘాట్‌లో కృష్ణా నదిలో నిమజ్జనం చేశారు. ఆయన కుమారులు కేఎస్ శివసుబ్బారావు, కేఎస్ఎన్ మూర్తి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పాల్గొన్న రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్‌గా రోశయ్య విశేష సేవలందించారని కొనియాడారు. ఆయన వ్యక్తిత్వం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా రోశయ్య వద్దకు వెళ్తే పరిష్కారమవుతుందనే బలమైన నమ్మకం ఉండేదన్నారు. సుదీర్ఘ కాలం ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఘనత ఆయనకే దక్కుతుందని చెప్పారు. రాజమహేంద్రవరంలో జరిగిన కార్యక్రమంలో రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం, వైఎస్సార్సీపీ రాజమహేంద్రవరం రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్, విజయవాడలో జరిగిన కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు, ఏపీ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ ఆసిఫ్, ఏపీ ఇండస్ట్రీస్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ పుణ్యశీల, తూర్పు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి దేవినేని అవినాష్, విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కొనకళ్ల విద్యాధరరావు, ఏపీ ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు పెనుగొండ సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. -
Venkaiah Naidu: రోశయ్యకు అభిమానిని
అమీర్‌పేట: చిన్నతనం నుంచి కొణిజేటి రోశయ్యను బాగా అభిమానించేవాడినని, ఆయన కూడా తనను అభిమానంతో ఆప్యాయంగా పలకరించేవారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆ రోజుల్లో రాజకీయ విభేదాలున్నప్పటికీ అనేక విషయాలపై తాము తరచూ మాట్లాడుకునేవారమని గుర్తు చేసుకున్నారు. బుధవారం అమీర్‌పేటలోని రోశయ్య నివాసానికి వచ్చిన ఉపరాష్ట్రపతి.. ముందుగా రోశయ్య చిత్ర పట్టం వద్ద నివాళులర్పించి కుటుంబీకులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున ఆ రోజు తాను ఇక్కడ లేనని, వారి కుటుంబీకులను కలిసి సంతాపాన్ని తెలియజేయాలని వచ్చానని చెప్పారు. ఉపరాష్ట్రపతి వెంట రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, మాజీ ఎంపీ కేవీపీ రాంచంద్రారావు, ఎమ్మెల్సీ బుగ్గారపు దయానంద్ గుప్త తదితరులు ఉన్నారు. -
అధికార భాషకు పట్టంకట్టిన మూర్తులు
దశాబ్దాలుగా ఉమ్మడి రాష్ట్రంలో అధికార భాషా సంఘం ఉనికిలో ఉన్నప్పటికీ ఆ సంఘానికీ, దాని కార్యకలాపాలకూ, అన్ని స్థాయిల్లోనూ తెలుగుభాష వాడకాన్ని స్థానిక అధికారులు పెంచడానికీ అవసరమైన బడ్జెట్ లేదు. ఆ పరిస్థితుల్లో అధికార భాషగా తెలుగు వాడకాన్ని పెంచడానికి అవసరమైన తొలి బడ్జెట్‌ను నాటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం కేటాయించింది. ప్రత్యేక బడ్జెట్ ఎంత కావాలని వైఎస్సార్ అడగగా, సంవత్సరానికి కనీసం రూ. 2 కోట్లు అవసరమని చెప్పాము. ఆయన దానికి సమ్మతించారు. కాబట్టే ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లాలలోనూ సాధికారికంగా భాషా సంఘం ఆధ్వర్యంలో, ఉధృతంగా అవగాహన సదస్సులు నిర్వహించి చైతన్యం కలిగించాము. నాటి ఉన్నతాధికారుల సహకారం ఫలితంగా అనేక జిల్లాలలో అధికారుల స్థాయిలో తెలుగు వాడకం పెరిగింది. సమీప జిల్లాలను ఒకచోట కలిపి ప్రాంతీయ సదస్సులు జరిపి తెలుగు భాష వాడకాన్ని పెంచడానికి అవగాహన కల్పించాం. ఇంత కృషికీ, ఆచరణకూ దోహదపడింది... వైఎస్సార్–రోశయ్య చేసిన ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులే! ‘దేశభాషలందు తెలుగులెస్స’ అనీ, అది కండగల భాష అనీ, దేశంలోని పాలకులంతా దానిని కొలవడానికి పోటాపోటీలు పడింది అందుకేననీ శ్రీకృష్ణదేవరాయలు వందల సంవత్సరాల క్రితమే ఎంతో గర్వంతో చాటి చెప్పారు. కానీ ఆచరణలో క్రమంగా పాలకుల అనాదరణవల్ల తెలుగు భాష సౌరు, సొగసూ తరిగిపోతూ వచ్చింది. చివరికి ఏ స్థాయికి మన పాలకులు దిగజారవలసి వచ్చిందంటే... అధికార భాషా సంఘం ఉనికిలో ఉన్నప్పటికీ ఆ సంఘానికీ, దాని కార్యకలాపాలకూ, అన్ని స్థాయిల్లోనూ తెలుగుభాష వాడకాన్ని స్థానిక అధికారులు పెంచడానికీ అవసరమైన బడ్జెట్ అంటూ లేదు. తెలుగు భాష వాఢకానికి వారే స్ఫూర్తి ఆ పరిస్థితుల్లో అధికార భాషా సంఘం ఉద్యమ స్ఫూర్తితో భాష వాడకాన్ని పెంచడానికి అవసరమైన తొలి బడ్జెట్‌ను అధికారికంగా ప్రకటించింది. కీర్తిశేషులైన వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, రోశయ్య నాటి ఆర్థికమంత్రిగా ఉండేవారు. అప్పటి దాకా పేరుకు అధికార భాషా సంఘం ఉన్నా ప్రయోజనం లేక పోయింది. ఈ దశలో ఆ సంఘానికి అధ్యక్షునిగా వైఎస్సార్ నన్ను నియమించినప్పుడు–నా పని (వ్యాసకర్త) అప్పటికి ‘చీకట్లో చిందు లాట’గా మారింది. ఎందుకంటే అంతవరకూ అధికార భాషా సంఘా నికి లేని ఒక ప్రత్యేక బడ్జెట్ కోసం నేను ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయవలసి వచ్చింది, అప్పుడు వైఎస్సార్, నన్ను రోశయ్యతో మాట్లాడుకుని ఏర్పాటు చేసుకోమని చెప్పారు. కానీ, రాష్ట్ర ముఖ్య మంత్రి ఒకమాట చెబితే తప్ప ఎలా కేటాయించగలనని రోశయ్య పటుపట్టారు. ఆర్థిక మంత్రి రోశయ్య ‘చిక్కడు–దొరకడ’న్న సామెత అప్పుడే నాకు గుర్తుకొచ్చింది. ఈలోగా అధికార భాషా సంఘం అభ్యర్థనను సుకరం చేస్తూ తెలుగు భాషా ప్రేమికులైన నాటి ఉన్నతాధికారులు డాక్టర్ రమా కాంతరెడ్డి, సెక్రటరీ కృష్ణారావు భాషా సంఘం చేస్తున్న కృషికి మన సారా దోహదం చేశారు. ప్రత్యేక బడ్జెట్ ఎంత కావాలని వైఎస్ అడ గగా, సంవత్సరానికి కనీసం రూ. 2 కోట్లు అవసరమని చెప్పాము. అందుకు ఆయన మరోమాట లేకుండానే సమ్మతించారు. కాబట్టే ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లాలలోనూ సాధికారికంగా భాషా సంఘం ఆధ్వర్యంలో, ఉధృతంగా అవగాహన సదస్సులు నిర్వహించి చైతన్యం కలిగించాము. దీని ఫలితంగా అనేక జిల్లాలలో అధికారుల స్థాయిలో తెలుగు వాడకం పెరిగింది. మాండలికాలకు పట్టం కట్టిన భాషా సంఘం ఈ సదస్సులు క్రమంగా రాష్ట్రేతర ఆంధ్రులను, అక్కడి తెలుగు భాషా భిమానుల్ని సహితం కదిలించివేశాయి. మన భక్త రామదాసు బరంపురం వాసి కావడంతో తెలుగు–ఒడిశా సంబంధాలు కూడా మరింతగా సన్నిహితం కావడానికి దోహదకారి అయింది. అందుకే మనం మనం బరంపురం అన్న రావిశాస్త్రి వ్యాఖ్య విశేష ప్రచారంలోకి వచ్చింది. భాషా సంఘం ప్రత్యేక బడ్జెట్ కేటా యింపులతో ప్రారంభించిన ప్రత్యేక సదస్సుల సందర్భంగా, పలు ప్రోత్సాహకాల స్వేచ్ఛా వాడకం కూడా నమోదు కావడం మరో విశేషం. ఈ నేపథ్యంలోనే అన్ని జిల్లాల్లోనూ ఒకసారి కాదు, రెండేసి సార్లు భాషా సంఘం తిరిగింది. సమీప జిల్లాలను ఒకచోట కలిపి ప్రాంతీయ సదస్సులు జరిపి తెలుగు భాష వాడకాన్ని పెంచడానికి అవగాహన కల్పించాం. ఒక్కమాటలో చెప్పాలంటే – ఇంత కృషికీ ఆచరణ దోహదపడింది... వైఎస్ రాజశేఖరరెడ్డి– రోశయ్య చేసిన ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులేనని మరచిపోరాదు! ప్రముఖ భాషా సాహిత్యకారుడు వేటూరి ప్రభాకర శాస్త్రిగారు ఏనాడో (1917) అన్నట్టుగా ఆయా మండలాల్లో వాడే భాషలు ఇతరులకు తెలియనంత మాత్రాన ఆ భాష చెడ్డదనడం, స్థాయి తక్కు వదనడం తప్పు. ‘మారడం, మార్పు చెందడం భాషకు అత్యంత సహజం’! అందుకే మన కాళోజి నారాయణరావు మాతృ భాషను, మాండలిక భాషనే సమర్థించాల్సి వచ్చింది... ‘‘తెలుగు బాస ఎన్ని తీర్లు తెలుగు యాస ఎన్ని తీర్లు వాడుకలున్నన్ని తీర్లు వాడుక ఏ తీరుగున్నా తెలుగు బాస వాడుకయే అన్ని తీర్ల వాడుకకు పరపతి – పెత్తనమొకటే’ ... అన్నారు కాళోజీ! ఇలా కింది స్థాయి వరకు తెలుగు అధికారులంతా, అధికార భాషగా భాష వాడకాన్ని పెంచడానికి అవసరమైన ప్రత్యేక బడ్జెట్‌ను తొలిసారిగా ఆమోదించిన ఘనత వైఎస్ – రోశయ్యల హయాంకే దక్కింది! చివరికి న్యాయస్థానాల్లో తీర్పులు సహితం తెలుగులోనే వచ్చేలా చేయడం ఈ ప్రత్యేక బడ్జెట్ వల్లనే సాధ్యమైంది. ఎందుకంటే బౌద్ధం నాగరీక ధర్మం కాబట్టే అది కాలు పెట్టిన దేశాలన్నిటా అక్కడి సంస్కృతులను నాగరీకరించి మరీ సుసంపన్నం చేయడంతోపాటు, అది వాటితో ఏకమై, తనతో ఇముడ్చుకోగలిగింది. అంతవరకూ అర్ధ నాగరిక, బర్బర, యక్షనాగుల జాతిని మహాభారతం సహితం ‘అంధక జాతి’ అని పిలవగా ఆ మాటను సవరించి ‘ఆంధ్ర జాతి’గా పరిగణించిన ఖ్యాతి ఒక్క బౌద్ధానికే దక్కిందని మరచిపోరాదు. కనుకనే బౌద్ధం పునర్వికాసానికి, భారత రాజ్యాంగ నిర్మాతలలో అగ్రగణ్యుడైన డాక్టర్ అంబేడ్కర్ చరమదశలో పూనుకున్నారు. దేశ వ్యాప్తంగా కోట్లాదిమంది దళితుల్ని బౌద్ధులుగా ఆయన పరివర్తింప జేశారు. ఇలా దక్షిణ భారతదేశంలో బౌద్ధ పునర్వికాసానికి తోడ్పడిన వారెందరో ఉన్నారు. అందుకే అన్నాడు మహాకవి గురజాడ.. ‘బౌద్ధాన్ని భారతదేశ సరిహద్దులు దాటించి దేశం ఆత్మహత్య చేసు కుంది’ అని! ఇప్పుడీ ఆత్మహత్యా ప్రయత్నంలో భాగమే భారతీయ భాషల సంరక్షణలో ఎదురవుతున్న సంకటం! వర్తక వ్యాపారానికి లాభాల వేటలో ప్రపంచీకరణ పేరిట ఇంగ్లిష్ భాషా పెత్తనాన్ని స్థిరపరచడం కోసం తీవ్ర ప్రయత్నాలు జరుగు తున్నాయి. ఈ నేపథ్యంలోనే అసంఖ్యాకమైన దేశీయ భాషల సహజ పురోభివృద్ధికి కృత్రిమ ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ సందర్భం గానే ఐక్యరాజ్యసమితి విద్యా సాంస్కృతిక శాఖ నిద్ర మేల్కొని దేశీయ మాతృ భాషల సంరక్షణకు పదే పదే హెచ్చరికలు జారీ చేయవలసి వచ్చింది. ప్రపంచ భాషా పటంలో ప్రతి పదమూ ఒక ఆణిముత్య మనీ, దాని సొగసును, సోయగాన్నీ రక్షించుకోవడం మాతృభాషా ప్రేమికుల కర్తవ్యమనీ ఐరాస విద్యా సాంస్కృతిక శాఖ ఆదేశించిం దన్న సంగతిని మనం ఎన్నటికీ మరవరాదు! అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగావకాశాల కల్పన కోసం ఇంగ్లిష్ భాషకు ప్రాధాన్యం కల్పించడం ఎంత అవసరమో.. ప్రాంతీయ భాషగా తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చేయడం అంతే అవసరం. ఈ ముందు చూపు ఏపీ ప్రభుత్వానికి ఉన్నందునే ఆంధ్ర, ఆంగ్ల భాషల మేలు కలయికగా పాఠశాల, కళాశాల స్థాయిలో భాషా మాధ్య మాన్ని పరివర్తింపచేశారని మర్చిపోరాదు. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
Rosaiah Last Rites : మాజీ సీఎం రోశయ్య అంత్యక్రియలు
-
‘మంచి అల్లుళ్లను ఇవ్వలేదు ఏం చేస్తాం..?’: రోశయ్య చెణుకు
Konijeti Rosaiah Timeliness Dialogues In Assembly: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (88) శనివారం ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా, సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న రోశయ్య వాక్చాతుర్యం, సమయస్ఫూర్తికి నిలువుటద్దంగా పేరు గడించారు. అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడూ కూడా ఆయన తన గళాన్ని బలంగా వినిపించేవారు. తన సహజశైలితో, ఎలాంటి మొహమాటం లేకుండా అసెంబ్లీలో ప్రతిపక్షాలకు మొట్టికాయలు వేయడంలో ఆయనది అందె వేసిన చేయి. ఎన్టీఆర్, చంద్రబాబుల ప్రస్తావన వచ్చిందంటే చాలు.. రోశయ్య మాటలు తూటాల్లా పేలేవి. – సాక్షి, హైదరాబాద్ ఒక సందర్భంలో ఎన్టీఆర్‌ను రోశయ్య కించపర్చారంటూ నాటి ప్రతిపక్షనేత చంద్రబాబు విమర్శలు చేశారు. రోశయ్యకు కోపం ఎక్కువైందని, ఎన్టీఆర్‌ను కించపర్చారని తప్పుపట్టారు. దానిపై స్పందించిన రోశయ్య.. ‘‘నాకు కోపం వచ్చిన మాట వాస్తవమే. అసెంబ్లీలో పరిస్థితి, టీడీపీ వాళ్ల తీరు చూసి ఈ సభకు ఏం ఖర్మ పట్టిందన్న ఆవేదనతో కోపం వచ్చింది. అయినా ఎన్టీఆర్‌ను చంద్రబాబు, టీడీపీ ఎంతగా గౌరవించారో అందరికీ తెలుసు’’ అని తనదైన శైలిలో సమాధానమిచ్చారు. మంచి అల్లుళ్లను ఇవ్వలేదు ఏం చేస్తాం..? 2004–09 మధ్య రోశయ్య ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అల్లుడు ఏదో విషయంలో పోలీసులకు దొరికిపోయాడంటూ చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు అరగంట పాటు అసెంబ్లీలో నానాయాగీ చేశారు. అంతసేపూ నిశ్శబ్దంగా ఉన్న రోశయ్య నెమ్మదిగా లేచి..‘‘అధ్యక్షా.. ఏం చేస్తాం.. ఆ భగవంతుడు నాకు, ఎన్టీ రామారావుకు మంచి అల్లుళ్లను ఇవ్వలేదు’’ అని చురక వేశారు. ఆ దెబ్బకు తెలుగుదేశం శిబిరం ముక్కున వేలేసుకోవాల్సి వచ్చింది. ఆయన వైఎస్ కాదు.. ఓ యస్ వైఎస్ కేబినెట్లో ఆర్థికమంత్రిగా పనిచేస్తున్న సమయంలోనే ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు రోశయ్య దగ్గరికి వచ్చారు. తమ డిమాండ్లను పరిష్కరిస్తామని సీఎం వైఎస్సార్ హామీ ఇచ్చారని వారు రోశయ్యకు చెప్పగా.. ‘‘ఆయన ఇస్తారండి.. ఆయన వైఎస్ కాదు.. ఓయస్.. ఎవరైనా ఏదైనా కావాలని వెళితే ఆయన కాదనరు. ఆయన ఇచ్చే హామీలను అమలు చేసేందుకు నా తలప్రాణం తోకకు వస్తోంది..’’ అంటూ చిరుకోపం ప్రదర్శించారు. ఆ తర్వాత ఉద్యోగుల డిమాండ్లన్నీ నెరవేర్చేందుకు చర్యలు చేపట్టారు. వెన్నుపోటు పొడిచేవాడ్ని మరి.. మరోసారి రోశయ్య తెలివితేటలు సరిగా లేవంటూ చంద్రబాబు విమర్శలు చేశారు. దానిపై రోశయ్య స్పందిస్తూ.. ‘‘నాకు తెలివితేటలుంటే ఇలా ఉంటానా? నన్ను నమ్మిన రాజశేఖరరెడ్డిని ఎప్పుడో ఒంటరిగా కూర్చున్నప్పుడు వెన్నుపోటు పొడిచి కుర్చీ ఎక్కేవాడిని.. అంతకుముందు చెన్నారెడ్డిని, విజయభాస్కర్‌రెడ్డిని కూడా వెన్నుపోటు పొడిచేవాడిని..’’ అంటూ ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు ఘటనను గుర్తుచేశారు. దీంతో చంద్రబాబు అవాక్కై కిమ్మనకుండా కూర్చుండిపోయారు. (నింగికేగిన నిగర్వి) -
Punch Dialogues: రోశయ్య చెణుకు విసిరితే..
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న రోశయ్య వాక్చాతుర్యం, సమయస్ఫూర్తికి నిలువుటద్దంగా పేరు గడించారు. అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడూ కూడా ఆయన తన గళాన్ని బలంగా వినిపించేవారు. తన సహజశైలితో, ఎలాంటి మొహమాటం లేకుండా అసెంబ్లీలో ప్రతిపక్షాలకు మొట్టికాయలు వేయడంలో ఆయనది అందె వేసిన చేయి. ఎన్టీఆర్, చంద్రబాబుల ప్రస్తావన వచ్చిదంటే చాలు.. రోశయ్య మాటలు తూటాల్లా పేలేవి. చదవండి: నింగికేగిన నిగర్వి ఒక సందర్భంలో ఎన్టీఆర్‌ను రోశయ్య కించపర్చారంటూ నాటి ప్రతిపక్షనేత చంద్రబాబు విమర్శలు చేశారు. రోశయ్యకు కోపం ఎక్కువైందని, ఎన్టీఆర్‌ను కించపర్చారని తప్పుపట్టారు. దానిపై స్పందించిన రోశయ్య.. ‘‘నాకు కోపం వచ్చిన మాట వాస్తవమే. అసెంబ్లీలో పరిస్థితి, టీడీపీ వాళ్ల తీరు చూసి ఈ సభకు ఏం ఖర్మ పట్టిందన్న ఆవేదనతో కోపం వచ్చింది. అయినా ఎన్టీఆర్‌ను చంద్రబాబు, టీడీపీ ఎంతగా గౌరవించారో అందరికీ తెలుసు’’ అని తనదైన శైలిలో సమాధానమిచ్చారు. మంచి అల్లుళ్లను ఇవ్వలేదు ఏం చేస్తాం..? 2004–09 మధ్య రోశయ్య ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అల్లుడు ఏదో విషయంలో పోలీసులకు దొరికిపోయాడంటూ చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు అరగంట పాటు అసెంబ్లీలో నానాయాగీ చేశారు. అంతసేపూ నిశ్శబ్దంగా ఉన్న రోశయ్య నెమ్మదిగా లేచి..‘‘అధ్యక్షా.. ఏం చేస్తాం.. ఆ భగవంతుడు నాకు, ఎన్టీ రామారావుకు మంచి అల్లుళ్లను ఇవ్వలేదు’’ అని చురక వేశారు. ఆ దెబ్బకు తెలుగుదేశం శిబిరం ముక్కున వేలేసుకోవాల్సి వచ్చింది. ఆయన వైఎస్ కాదు.. ఓ యస్ వైఎస్ కేబినెట్లో ఆర్థికమంత్రిగా పనిచేస్తున్న సమయంలోనే ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు రోశయ్య దగ్గరికి వచ్చారు. తమ డిమాండ్లను పరిష్కరిస్తామని సీఎం వైఎస్సార్ హామీ ఇచ్చారని వారు రోశయ్యకు చెప్పగా.. ‘‘ఆయన ఇస్తారండి.. ఆయన వైఎస్ కాదు.. ఓయస్.. ఎవరైనా ఏదైనా కావాలని వెళితే ఆయన కాదనరు. ఆయన ఇచ్చే హామీలను అమలు చేసేందుకు నా తలప్రాణం తోకకు వస్తోంది..’’ అంటూ చిరుకోపం ప్రదర్శించారు. ఆ తర్వాత ఉద్యోగుల డిమాండ్లన్నీ నెరవేర్చేందుకు చర్యలు చేపట్టారు. వెన్నుపోటు పొడిచేవాడ్ని మరి.. మరోసారి రోశయ్య తెలివితేటలు సరిగా లేవంటూ చంద్రబాబు విమర్శలు చేశారు. దానిపై రోశయ్య స్పందిస్తూ.. ‘‘నాకు తెలివితేటలుంటే ఇలా ఉంటానా? నన్ను నమ్మిన రాజశేఖరరెడ్డిని ఎప్పుడో ఒంటరిగా కూర్చున్నప్పుడు వెన్నుపోటు పొడిచి కుర్చీ ఎక్కేవాడిని.. అంతకుముందు చెన్నారెడ్డిని, విజయభాస్కర్‌రెడ్డిని కూడా వెన్నుపోటు పొడిచేవాడిని..’’ అంటూ ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు ఘటనను గుర్తుచేశారు. దీంతో చంద్రబాబు అవాక్కై కిమ్మనకుండా కూర్చుండిపోయారు. -
రోశయ్య కుమారుడిని ఫోన్లో పరామర్శించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: మాజీ సీఎం రోశయ్య కుమారుడిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. రోశయ్యది ఆదర్శప్రాయమైన జీవితమన్నారు. రోశయ్య మృతికి సంతాప సూచకంగా ఏపీ ప్రభుత్వం డిసెంబర్ 4 నుంచి 6 వరకు సంతాప దినాలను ప్రకటించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ(ప్రొటోకాల్) శనివారం ఉత్తర్వులిచ్చింది. చదవండి: రోశయ్యకు నివాళులర్పించిన ఏపీ మంత్రులు ‘‘పెద్దలు రోశయ్య గారి మరణవార్త నన్నెంతగానో బాధించింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా, శాసనసభ్యుడిగా.. సుదీర్ఘ రాజకీయ జీవితంలో పలు పదవులను అలంకరించిన రోశయ్య గారి మృతి రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని’’ సీఎం వైఎస్ జగన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. -
ముగిసిన మాజీ సీఎం రోశయ్య అంత్యక్రియలు
Live Updates ► మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అంత్యక్రియలు ముగిశాయి. కొంపల్లి రోశయ్య ఫాంహౌస్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. గౌరవ సూచకంగా పోలీసులు మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపి రోశయ్య పార్థివదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం రోశయ్య చితికి పెద్ద కుమారుడు శివ సుబ్బారావు నిప్పంటించారు. ►ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో చితి వద్దకు మాజీ సీఎం రోశయ్య పార్థివదేహాన్ని తీసుకువచ్చారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు కొనసాగుతున్నాయి. కడసారి చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ►అధికారిక లాంఛనాలతో రోశయ్య అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కడసారి చూసేందుకు నేతలు భారీగా తరలివచ్చారు. ఏపీ ప్రభుత్వం నుంచి మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. ►గాంధీభవన్ నుంచి ప్రారంభమైన రోశయ్య అంతిమయాత్ర కొనసాగుతోంది. కాసేపట్లో హైదరాబాద్ శివార్లోని దేవరయాంజాల్‌లోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ►రోశయ్య పార్థివదేహం గాంధీభవన్‌కు చేరుకుంది. కాసేపట్లో దేవరయాంజాల్ ఫాంహౌస్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రోశయ్య పార్థివదేహానికి పలువురు నేతలు నివాళులర్పించారు. రోశయ్యతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సాక్షి, హైదరాబాద్: మాజీ సీఎం రోశయ్య పార్థివదేహానికి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్,పేర్ని నాని, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే మేరుగు నాగార్జున, మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు, సినీనటుడు చిరంజీవి నివాళులర్పించారు. రోశయ్య అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్ మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరుకానున్నారు. మాజీ సీఎం రోశయ్య అంత్యక్రియలను మధ్యాహ్నం ఒంటిగంటకు అధికార లాంఛనాలతో నిర్వహించనున్నారు. రోశయ్య పార్థవదేహాన్ని ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలమైన గాంధీభవన్‌కు తీసుకెళ్లనున్నారు. సందర్శన తర్వాత హైదరాబాద్ శివార్లోని దేవరయాంజాల్‌లోని వ్యవసాయ క్షేత్రానికి తరలించనున్నారు. మధ్యాహం అక్కడ రోశయ్య అంత్యక్రియలు నిర్వహించనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నింగికేగిన నిగర్వి
సాక్షి, హైదరాబాద్/అమరావతి/తెనాలి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (88) శనివారం ఉదయం కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న ఆయన.. శనివారం ఉదయం అచేతనంగా కనిపించడంతో కుటుంబ సభ్యులు బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ, అప్పటికే రోశయ్య తుదిశ్వాస విడిచారని వైద్యులు నిర్ధారించారు. రోశయ్యను శనివారం ఉ.8:20 గంటల సమయంలో అచేతన స్థితిలో ఆస్పత్రికి తీసుకువచ్చారని.. అప్పటికే ఆయన మరణించారని స్టార్ ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ ప్రకటించారు. రోశయ్య మరణవార్త తెలియడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విషాదం నెలకొంది. ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, ఏపీ సీఎం వైఎస్ జగన్, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ఇతర నేతలు సంతాపం ప్రకటించారు. రోశయ్య పార్థివదేహాన్ని సందర్శించిన ప్రముఖులు రోశయ్య పార్థివదేహాన్ని శనివారం మధ్యాహ్నం అమీర్‌పేటలోని ధరమ్‌కరమ్ రోడ్డులో ఉన్న ఆయన స్వగృహానికి తీసుకెళ్లారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, దేవదాయ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు, కేవీపీ రామచంద్రరావు, తెలంగాణ మంత్రులు హరీశ్‌రావు, మహమూద్ అలీ, తలసాని, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తదితరులు అక్కడికి చేరుకుని పార్థివదేహం వద్ద నివాళులు అర్పించారు. ఇక రోశయ్యను కడసారి చూసేందుకు అభిమానులు, రాజకీయ నాయకులు, సినీ, వివిధ రంగాల ప్రముఖులు తరలివచ్చారు. నేటి ఉదయం గాంధీభవన్‌కు.. రోశయ్య పార్థివదేహాన్ని ఆదివారం ఉదయం కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయమైన గాంధీభవన్‌కు తీసుకెళ్లనున్నారు. కొంతసేపు ప్రజలు, అభిమానుల సందర్శనార్థం ఉంచి.. తర్వాత హైదరాబాద్ శివార్లలోని దేవరయాంజాల్‌లో ఉన్న వ్యవసాయ క్షేత్రానికి తరలించనున్నారు. మధ్యాహ్నం అక్కడ రోశయ్య అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ‘బడ్జెట్ల’ రోశయ్య దేశ చరిత్రలోనే అత్యధికంగా పదిహేనుసార్లు రాష్ట్ర బడ్జెట్లు ప్రవేశపెట్టిన రికార్డు రోశయ్యదే. అంతేకాదు.. ఇందులో వరుసగా ఏడుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం గమనార్హం. విషయ పరిజ్ఞానం గల వ్యక్తిగా రోశయ్య ఎన్నోసార్లు ప్రశంసలు అందుకున్నారు. ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లడమంటే పక్కింటికి వెళ్లి పంచదార అరువు తెచ్చుకోవడమేనని చెప్పే ఆయన.. ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో కీలకపాత్ర పోషించారు. ఆయన హయాంలో ఉమ్మడి ఏపీ ఏనాడూ ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లలేదు. వైఎస్ మరణానంతరం సీఎంగా.. నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూయడంతో.. కాంగ్రెస్ అధిష్టానం రోశయ్యకు ఉమ్మడి ఏపీ సీఎంగా బాధ్యతలు అప్పగించింది. 2009 సెప్టెంబర్ 3వ తేదీ నుంచి 2010 నవంబర్ 24 వరకు రోశయ్య ఈ బాధ్యతలను నిర్వర్తించారు. తర్వాత పలు పరిణామాల కారణంగా పదవిని వదిలిపెట్టారు. ఆయన సేవలకు గుర్తింపుగా యూపీఏ ప్రభుత్వం గవర్నర్ గిరీ అప్పగించింది. 2011 ఆగస్టు 31న తమిళనాడు గవర్నర్‌గా రోశయ్య బాధ్యతలు స్వీకరించారు. అదే సమయంలో కొన్నాళ్లు కర్ణాటక ఇన్చార్జి గవర్నర్‌గా పనిచేశారు. 2016 ఆగస్టు 30 వరకు గవర్నర్ హోదాలో సేవలు అందించారు. తర్వాత హైదరాబాద్‌లోని తన స్వగృహంలో విశ్రాంత జీవితాన్ని గడిపారు. ఆయనంటే అందరికీ గౌరవం ఎవరినైనా కలుపుకొనిపోయే స్వభావం, అపార అనుభవం, విషయాలపై స్పష్టమైన అవగాహన, చక్కని భాష, దీనికితోడు సమయస్ఫూర్తి వంటివన్నీ రోశయ్యను ఉన్నత శ్రేణిలో నిలబెట్టాయి. ఆయనకు 2007లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. 2018 ఫిబ్రవరిలో లలిత కళాపరిషత్ ఆయనకు జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేసింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా స్వర్ణ కంకణాన్ని బహూకరించింది. కుటుంబానికీ ప్రాధాన్యమిస్తూ.. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా కుటుంబం బాగోగులను చూసుకోవడంలోనూ, కుటుంబ సభ్యులకు ఆప్యాయత పంచడంలోనూ రోశయ్య ముందుండేవారు. రోశయ్యకు 17 ఏళ్ల వయసులోనే వివాహం జరిగింది. ఆయనకు భార్య శివలక్ష్మి, కుమారులు శివసుబ్బారావు, త్రివిక్రమ్, శ్రీమన్నారాయణమూర్తి, కుమార్తె రమాదేవి ఉన్నారు. వనభోజనాలంటే ఇష్టం 1992లో రోశయ్య ఆరు ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసి వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందులో తులసి, రుద్రాక్ష, నేరేడు, వేపతోపాటు అనేక రకాల మొక్కలను రోశయ్య స్వయంగా నాటారని అక్కడి పనివారు తెలిపారు. రోశయ్యకు వనభోజనాలంటే ఇష్టమని, అక్కడికి ఎప్పుడొచ్చినా చెట్ల కిందే కూర్చుని భోజనం చేసేవారని సైట్ ఇన్చార్జి రమేశ్ వెల్లడించారు. వ్యవసాయ క్షేత్రంలో పందిరిని రోశయ్య ప్రత్యేకంగా కట్టించుకున్నారని.. ఎక్కువ సమయం అక్కడే గడిపేవారని తెలిపారు. ఎన్జీ రంగా స్ఫూర్తితో.. గుంటూరు జిల్లా వేమూరులో 1933 జూలై 4న ఆదెమ్మ, సుబ్బయ్య దంపతులకు రోశయ్య జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్ డిగ్రీ చేశారు. ప్రముఖ స్వాతంత్య్రయోధుడు, రైతు నాయకుడు ఎన్జీ రంగా స్ఫూర్తితో రాజకీయాల్లోకి ప్రవేశించారు. తొలిసారిగా 1968లో ఉమ్మడి ఏపీ శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1974, 1980లోనూ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 1979లో మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో ఆర్ అండ్ బీ, రవాణా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, నేదురుమల్లి జనార్దనరెడ్డి, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గాల్లో వివిధ శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. 1995–97 మధ్య ఏపీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లో నరసరావుపేట నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2004లో చీరాల నుంచి అసెంబ్లీకి ఎన్నికై ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 2009లో రోశయ్య ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోయినా.. వైఎస్సార్ ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశమిచ్చి ఆర్థికశాఖను అప్పగించారు. 3 రోజులు సంతాప దినాలు మాజీ సీఎం రోశయ్య మృతికి సంతాప సూచకంగా ఏపీ ప్రభుత్వం డిసెంబర్ 4 నుంచి 6 వరకు సంతాప దినాలను ప్రకటించింది. ఈమేరకు సాధారణ పరిపాలన శాఖ(ప్రొటోకాల్) శనివారం ఉత్తర్వులిచ్చింది. తెలంగాణ సర్కారు కూడా మూడ్రోజులు సంతాపదినాలు ప్రకటించింది. అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించింది. ఆయన కృషి గుర్తుండిపోతుంది రోశయ్య మరణం బాధాకరం. మేం ఇద్దరం సీఎంలుగా పనిచేసినప్పుడు, తర్వాత రోశయ్య గవర్నర్‌గా ఉన్నప్పుడు ఆయనతో నేను చేసిన సంప్రదింపులు గుర్తుకువచ్చాయి. ప్రజాసేవ కోసం రోశయ్య చేసిన కృషి గుర్తుండిపోతుంది. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నా..’’ – ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు ప్రజలకు తీరని వేదన ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ పాలనాదక్షుడిగా పేరు పొందిన రోశయ్య మృతి తెలుగు వారికి తీరనిలోటు. రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా కలిసి మెలసి ఉండాలని, తెలుగు ప్రజలు సుఖసంతోషాలతో విలసిల్లాలని రోశయ్య కోరుకునేవారు. – సుప్రీం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అంకిత భావం ఉన్న నేత రోశయ్య నాకు చిరకాల మిత్రుడు. రాష్ట్రంతోపాటు జాతీయ రాజకీయాల్లో అంకితభావం, నిబద్ధతతో పనిచేశారు. ఆయన ఇకలేరనే వార్త బాధాకరం. రోశయ్య ఆత్మకు శాంతి కలగాలి. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నా – ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయనది రాజీలేని పోరాటం రోశయ్య ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేశారు. అధికారం ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకున్నారు. ఆర్ధికం అంటే అర్ధంకాని పరిస్ధితుల్లో ఆర్థిక వ్యవస్థకు నూతన మార్గనిర్దేశం చేశారు. ఆయనను తెలుగు జాతి మరువబోదు. – టీడీపీ అధినేత చంద్రబాబు పదవులకే వన్నె తెచ్చారు మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్‌గా రోశయ్య పదవులకే వన్నె తెచ్చారు. సౌమ్యుడిగా, సహనశీలిగా నిలిచారు. రాజకీయాల్లో తనదైన ప్రత్యేక శైలితో హూందాగా వ్యవహరించారు. ఆయన మృతి తీరని లోటు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నా.. – తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు నాన్న నిరాడంబరుడు దొండపర్తి (విశాఖ దక్షిణ): ‘నాన్న నిరాడంబరుడు. రాజకీయాల్లో ఎన్ని కీలక పదవులు అధిరోహించినా ఆ హోదాను ఎప్పుడు ప్రదర్శించేవారు కాదు. సింపుల్ లైఫ్ స్టైల్‌నే ఇష్టపడేవారు. అమ్మా, నాన్నలకు నేను ఏకైక కుమార్తెను కావడంతో అల్లారుముద్దుగా చూసుకునేవారు. నేను నాన్న కూతురినే. నన్ను విలువలతో పెంచారు. నా వంట అంటే నాన్నకు చాలా ఇష్టం. ఆయన లేరన్న నిజాన్ని తట్టుకోలేకపోతున్నాను’ అంటూ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కుమార్తె రమాదేవి కన్నీరుమున్నీరుగా విలపించారు. రోశయ్య మృతితో విశాఖ బాలాజీ నగర్లో నివాసముంటున్న అతని ఏకైక కుమార్తె రమాదేవి నివాసం వద్ద విషాద ఛాయలు అలముకున్నాయి. రమాదేవి మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అంటే ఎనలేని అభిమానమని చెప్పారు. ఆయన తన జీవితంలో అనేక ఉన్నత పదవులు నిర్వర్తించినా ఏరోజూ రాజకీయాలను ఇంట్లో ప్రస్తావించే వారు కాదని చెప్పారు. తనను రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడూ ప్రోత్సహించలేదన్నారు. రాజకీయ జీవితంలో కొన్నిసార్లు మంచిచేసినా నిందలు భరించాల్సి వస్తుందని, తన తండ్రికి చెడ్డపేరు రాకూడదన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి రాలేదని తెలిపారు. తన తండ్రి లేని లోటు తీరనిదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తండ్రిని కడసారి చూసేందుకు రమాదేవి, అల్లుడు పైడా కృష్ణప్రసాద్ విశాఖ నుంచి హైదరాబాద్‌కు పయనమయ్యారు. అంత్యక్రియలకు ముగ్గురు మంత్రులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశం సాక్షి, అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం రోశయ్య అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ముగ్గురు మంత్రుల బృందాన్ని పంపిస్తోంది. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ శనివారం ఆదేశించగా సాధారణ పరిపాలన శాఖ (ప్రొటోకాల్) ఉత్తర్వులు జారీచేసింది. దీంతో హైదరాబాద్‌లో ఆదివారం మధ్యాహ్నం జరిగే ఆయన అంత్యక్రియల కార్యక్రమానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, వెలంపల్లి శ్రీనివాసరావు హాజరుకానున్నారు. అజాత శత్రువు రోశయ్య రోశయ్య గారితో నాకు 40 ఏళ్లకు పైగా అనుబంధముంది. ఆయన, నేను పలుమార్లు కేబినెట్లో బాధ్యతలు నిర్వర్తించాం. ఆయన సీఎంగా ఉన్నప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా కూడా చేశాను. ఆయనకు ట్రబుల్షూటర్ అనే పేరు. చక్కని చమత్కారాలతో, వాక్చాతుర్యంతో అందరితో కలివిడిగా ఉంటూ అజాత శత్రువుగా ఉన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాను. – ధర్మపురి శ్రీనివాస్, సీనియర్ నేత, మాజీమంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు మంచి స్నేహితుడ్ని కోల్పోయా ఆరు శాఖలను నేను రోశయ్య గారు ఒకేసారి నిర్వహించాం. అసెంబ్లీలో కూడా ఆయన చాలా సమర్థంగా సమయస్ఫూర్తితో ప్రభుత్వానికి ఎలాంటి సమస్య ఎదురుకాకుండా చూసేవారు. విపక్షాలను ధీటుగా ఎదుర్కొనేవారు. రాజ్యసభ పదవి తప్ప ఇంచుమించు అన్ని పదవులు ఆయన సమర్ధంగా నిర్వహించారు. ప్రభుత్వానికి, పార్టీకి అనేక సేవలందించారు. మంచి స్నేహితుడిని కోల్పోయాను. – డీకే సమరసింహారెడ్డి, సీనియర్ నేత, మాజీమంత్రి 56 ఏళ్ల స్నేహం మాది రోశయ్యగారు, నేను ఇంచుమించు ఒకేసారి రాజకీయ ప్రస్థానం ప్రారంభించాం. విజయభాస్కరరెడ్డి, రాజశేఖరరెడ్డి కేబినెట్లలో ఇద్దరం పనిచేశాం. 56 ఏళ్ల స్నేహం మాది. కాంగ్రెస్‌లో దాదాపు అందరు సీఎంల కేబినెట్లో ఉండడమే కాకుండా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 15సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. నాపట్ల చాలా అభిమానంతో ఉండేవారు. ఆయన మరణం వ్యక్తిగతంగా మాకు తీరని లోటే. – గాదె వెంకటరెడ్డి, సీనియర్ నేత, మాజీమంత్రి చీరాల నుంచే రాజకీయ అరంగేట్రం చీరాల: మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు ప్రకాశం జిల్లా చీరాలతో విడదీయరాని అనుబంధం ఉంది. ఆయన అకాల మరణంతో చీరాలలో విషాదఛాయలు నెలకొన్నాయి. రోశయ్య సొంత ఊరు గుంటూరు జిల్లా వేమూరు అయినా.. ఆయన రాజకీయ స్వస్థలం చీరాల అని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. 1967లో అక్కడ నుంచి రాజకీయ అరంగేట్రం చేశారు. అప్పటి నుంచి 2004 వరకు నాలుగు పర్యాయాలు పోటీచేసి రెండుసార్లు గెలుపొంది అనేక మంత్రి పదవుల్లో పనిచేశారు. 1967లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసిన ప్రగడ కోట య్య స్వతంత్ర అభ్యర్థి రోశయ్యపై గెలుపొందారు. 1989లో కాంగ్రెస్ అభ్యర్థిగా రోశయ్య టీడీపీ అభ్యర్థి చిమటా సాంబుపై గెలుపొందారు. ఆ దఫా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఐదేళ్లపాటు ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 1994లో టీడీపీ అభ్యర్థి పాలేటి రామారావుపై పోటీచేశారు. 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా కొణిజేటి రోశయ్య.. టీడీపీ అభ్యర్థి పాలేటి రామారావుపై విజయం సాధించి ఆర్థిక మంత్రిగా పనిచేశారు. విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతీక మాజీ సీఎం రోశయ్య మృతికి గవర్నర్ హరిచందన్ సంతాపం సాక్షి, అమరావతి/నెట్వర్క్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. ఈ మేరకు రాజ్‌భవన్ నుంచి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నాటి తరం నాయకునిగా విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతీకగా రోశయ్య నిలిచారని కొనియాడారు. ఉదయం అస్వస్థతకు గురైన రోశయ్య ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందడం విచారకరమన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు గవర్నర్ పేర్కొన్నారు. అలాగే, పలువురు మంత్రులు, ఇతర ప్రముఖులు కూడా రోశయ్య మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తంచేసి ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ► పీసీసీ అధ్యక్షుడిగా, ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా, గవర్నర్‌గా అనేక ఉన్నత పదవులను రోశయ్య సమర్థంగా నిర్వహించారు. ఆయన మృతికి నా ప్రగాఢ సానుభూతి. – తమ్మినేని సీతారాం, స్పీకర్ ► రోశయ్య మృతితో రాష్ట్రం సుదీర్ఘ రాజకీయ అనుభవజ్ఞుడ్ని కోల్పోయింది. ఆయన ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఆర్థిక నిపుణుడిగా రాష్ట్రానికి విశిష్ట సేవలందించారు. ఒక మంచి మనిషి మనమధ్య లేకపోవడం నిజంగా బాధాకరం. – మంత్రి బొత్స సత్యనారాయణ ► వైఎస్సార్‌తో కలిసి ఆయన పనిచేసిన రోజులు మర్చిపోలేనివి. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. – డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ► రోశయ్య మరణం రెండు తెలుగు రాష్ట్రాలకూ తీరనిలోటు. రాజకీయంగా ఎంతోమందికి ఆయన ఆదర్శనీయుడు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ఎంతో ప్రీతిపాత్రుడు. – మంత్రి మేకతోటి సుచరిత ► ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు, రాజకీయ చతురత కలిగిన నాయకుడు రోశయ్య మరణం అత్యంత బాధాకరం. – మంత్రి ఆళ్ల నాని ► రోశయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన మృతి రాష్ట్రానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. – మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ► రోశయ్య మరణం నన్ను ఎంతో కలచివేసింది. ఆయనకు శ్రీ శారదా పీఠంతో ఎంతో అనుబంధం ఉంది. ఆరోగ్యకరమైన రాజకీయాల కోసం ఆయన తపించేవారు. రోశయ్య రాజకీయ ప్రస్థానం రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. – విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ► పెద్దలు, మచ్చలేని సీనియర్ నాయకులు రోశయ్య మరణం తెలుగు రాష్ట్రాలకు తీరనిలోటు. ఆయన మృతికి నా ప్రగాఢ సంతాపం. – మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ► సుదీర్ఘకాలం పాటు రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవం రోశయ్య సొంతం. సీఎంలు ఆయన నిర్ణయాలకు విలువ ఇచ్చేవారు. – మంత్రి సీదిరి అప్పలరాజు ► రాజకీయాల్లో అజాత శత్రువు రోశయ్య మృతి జీర్ణించుకోలేనిది. విద్యార్థి సంఘ నాయకుడి నుంచి గవర్నర్ వరకు అంచలంచెలుగా ఎదిగారు. ఆయన ఆత్మకు సద్గతులు కలగాలి. – ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, అధికార భాషా సంఘం అధ్యక్షుడు ► రోశయ్య మరణం ఆంధ్ర రాష్ట్రానికి తీరని లోటు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆయన ప్రజలకు ఎనలేని సేవలు అందించారు. – మల్లికార్జునరెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ ► ఏ సీఎం దగ్గరైనా రోశయ్య తనకంటూ ఒక గుర్తింపును పొందారు. రాష్ట్ర రాజకీయాల్లో ఆయన నిర్వర్తించిన పాత్ర కీలకం. రోశయ్య మరణం సమకాలిక రాజకీయాలకు తీవ్రమైన నష్టం – సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ► ఆపత్కాలంలో రోశయ్య 14 నెలలపాటు సీఎంగా సేవలు అందించారు. ఆయన నిష్కళంక రాజకీయ యోధుడు. ఆయన విజ్ఞతను ఎవరూ మరచిపోలేరు. – పవన్‌కల్యాణ్, జనసేన పార్టీ అధ్యక్షుడు ► ఉమ్మడి రాష్ట్రానికి నాలుగుసార్లు ఆర్థిక మంత్రిగా.. సీఎంగా, తమిళనాడు గవర్నర్‌గా పనిచేశారు. వారి ఆకస్మిక మృతి దిగ్భ్రాంతి కలిగించింది. – మధు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ► ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీడీపీ గ్రాంటును పునరుద్ధరించి ఆయా నియోజకవర్గాల అభివృద్ధికి రోశయ్య ఎంతో సహకరించారు. – జల్లి విల్సన్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు -
అస్వతంత్ర స్వతంత్రుడు
తొలిసారి చంద్రబాబు నాయుడు ముఖ్య మంత్రి అయినప్పుడు, మళ్ళీ తరువాత రోశయ్య ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించి నప్పుడు, వారికి ముందున్న ముఖ్య మంత్రులు– అంటే నందమూరి తారక రామా రావు, రాజశేఖరరెడ్డి ఇరువురు కూడా ప్రజల మనస్సులను ముందు గెలుచుకుని తరువాత ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చినవారే. ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన పథకాలే కాకుండా, అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అనేక ప్రజాకర్షక పథకాలను ప్రకటించి, అమలు చేసిన ఘనత వారిది. తాము మాత్రమే వాటిని అమలు చేయగలరన్న విశ్వాసాన్ని ప్రజల్లో కలిగించి, పార్టీ శ్రేణుల్లో ఆత్మ విశ్వాసాన్ని రగిలించి అధికార పీఠం అధిరోహించిన చరిత్ర కూడా వారిదే. పోతే, ఇక ప్రస్తుతానికి వస్తే, ఒక విపత్కర, అనూహ్య దారుణ సంఘటన కారణంగా రాష్ట్రం యావత్తూ చేష్టలుడిగివున్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం, హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించిన రాజ శేఖరరెడ్డి స్థానంలో, వయస్సు పైబడుతున్న కారణంగా క్రమేపీ రాజకీయాల నుంచి తప్పుకోవాలన్న నిర్ణయానికి ఏనాడో వచ్చి, ఆ దృష్టి తోనే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా శాసన మండలికి పరిమితమై మంత్రిమండలిలో సీనియర్ సభ్యుడిగా కొనసాగుతున్న రోశయ్యను ముఖ్యమంత్రిగా నామినేట్ చేసింది. ఈ విషయంలో ఆయన ఎంతో అదృష్టవంతుడైన కాంగ్రెస్ నాయకుడనే చెప్పాలి. ఎందుకంటే, రాజకీయాల్లో ఈనాడు ఎంతో ప్రధానంగా పరిగణిస్తున్న కులం, ధనం, వర్గం వీటిల్లో ఏ కోణం నుంచి చూసినా, ఏ రకమయిన ప్రాథమిక అర్హతా లేకుండా, రోజు రోజుకూ మీదపడుతున్న వయస్సు ఒక అడ్డంకి కాకుండా, అధిష్ఠాన దేవతలను ప్రసన్నం చేసుకునేందుకు ఛోటా మోటా కాంగ్రెస్ నాయకులందరూ హస్తిన చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన సంప్రదాయం బలంగా వేళ్ళూనుకునివున్న పార్టీలో ఉంటూ కూడా, ఢిల్లీలో ఒక్క మారు కూడా కాలుపెట్టకుండా ముఖ్య మంత్రి పీఠం ఎక్కగలిగారంటే ఆయనకు వున్న సీనియారిటీకి తోడు అదృష్టం కూడా కలిసివచ్చిందనే అనుకోవాలి. ఈ వాస్తవాన్ని బయట వారు కాకుండా ఆయనే స్వయంగా పలుమార్లు ప్రస్తావించడం గమనార్హం. ఇటు ప్రభుత్వాన్నీ, అటు పార్టీ అధిష్ఠానాన్నీ తన కనుసన్నల్లో ఉంచుకోగల శక్తియుక్తులు, ప్రతిభా సామర్థ్యాలు కలిగిన రాజశేఖర రెడ్డి వారసుడిగా పాలన సాగించడం అంటే కత్తి మీద సాము అన్న వాస్తవం తెలిసిన మనిషి కనుక, పార్టీలో ఎవరు ఏమిటీ? అన్న విష యాలు పుక్కిట పట్టిన దక్షుడు కనుక, అధిష్ఠానం మనసెరిగి మసలుకునే తత్వం ఒంటబట్టించుకున్న వ్యవహారశీలి కనుక, బలం గురించి బలహీనతల గురించి స్పష్టమయిన అంచనాలు వేసుకోగలి గిన సమర్థుడు కనుక, అన్నింటికీ మించి రాజకీయాలలో ‘కురు వృద్ధుడు’, ‘పెద్దమనిషి’ అన్న ముద్ర ఉన్నవాడు కనుక పరిశీలకులు తొలినాళ్ళలో ఊహించిన స్థాయిలో ఆయన పట్ల వ్యతిరేకత పెద్దగా వెల్లువెత్తలేదు. కాకలు తీరిన నాయకులకు ఏ మాత్రం కొదవలేని కాంగ్రెస్ పార్టీలోని సహజసిద్ధ వర్గ రాజకీయాలు సైతం, రోశయ్య ముఖ్య మంత్రిత్వానికి ఎవరూ ఎసరు పెట్టకుండా కాపాడుకుంటూ వచ్చాయి. మూన్నాళ్ళ ముఖ్యమంత్రి అనీ, మూన్నెళ్ల ముఖ్యమంత్రి అనీ ఎవరెన్ని రాగాలు తీసినా, మంత్రులను మార్చకుండా, వైఎస్సార్ పథకాలను ఏమార్చకుండా గుంభనగా నెట్టుకొస్తూనే వచ్చారు. కనీవినీ ఎరుగని ప్రకృతి వైపరీత్యాలు, ప్రాంతీయ ఉద్యమాలు రాష్ట్రాన్ని చుట్టు ముట్టినా, ఆయన తనదైన శైలిలో నిబ్బరంగా పాలనపై క్రమంగా పట్టుబిగించే ప్రయత్నం చేశారు. వై.ఎస్. మరణం తర్వాత ముఖ్యమంత్రిగా రోశయ్య చేసిన నియామకాలు వేళ్ళమీద లెక్కపెట్టదగినవే. కానీ వాటి విషయంలో ఆయన ఎవరినీ సంప్రదించి చేసిన దాఖలాలు లేవు. ఉదాహరణకు ప్రెస్ అకాడమి చైర్మన్‌గా తిరుమలగిరి సురేంద్రను, సాంస్కృతిక మండలి అధ్యక్షునిగా రమణమూర్తిని, ఏపీఐఐడీసీ అధినేతగా శివ సుబ్రమణ్యంను నియమిస్తూ జారీ చేసిన ఆదేశాలు ఈ కోవలోకే వస్తాయి. అలాగే, జర్నలిస్టు సంఘాలన్నీ ముక్తకంఠంతో వద్దన్నప్పటికీ విజయవాడ పోలీసు కమిషనరుగా పీఎస్సార్ ఆంజనేయులును బదిలీ చేసిన తీరును కూడా ఈ సందర్భంలో గుర్తుచేసుకోవచ్చు. ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగాలని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా రోశయ్య పల్లెత్తు మాట అనకుండా సుశిక్షితుడైన పార్టీ కార్యకర్తగా ఆ ఆదేశాన్ని ఔదల దాల్చారు. బహుశా ఆయనలోని ఈ సుగుణాన్ని గుర్తించే కాబోలు తమిళనాడు వంటి ప్రధానమైన రాష్ట్రానికి గవర్నర్‌గా నియమించారు. కేంద్రం మీద కాలు దువ్వే తత్వం కలిగిన నాటి ముఖ్యమంత్రి జయలలితతో ఎలాంటి పొరపొచ్చాలకూ తావు రాకుండా చూసు కుంటూ, పదవికి మాట రాకుండా పదవీ కాలాన్ని జయప్రదంగా పూర్తి చేయడం ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవానికి అద్దం పడుతుంది. దాదాపు నలభై ఏళ్ళపాటు సన్నిహిత పరిచయం వున్న రోశయ్య మరణం నాకు తీరని బాధ కలిగిస్తోంది. భండారు శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
Konijeti Rosaiah: మాజీ సీఎం రోశయ్యకి ప్రముఖుల నివాళి
-
రోశయ్య మృతి: 3 రోజులు సంతాప దినాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
సాక్షి, విజయవాడ: ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (88) శనివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో మూడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటిస్తూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రోశయ్య అంత్యక్రియలుకు ప్రభుత్వం తరఫున ముగ్గురు మంత్రులు హాజరు కానున్నారు. వారు బొత్స సత్యనారాయణ, బాలినేని, వెల్లంపల్లి శ్రీనివాస్‌లు రోశయ్య అంత్యక్రియలకు హాజరుకానున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల జారీ చేసింది. (చదవండి: రోశయ్య మృతి పట్ల సీఎం జగన్ సంతాపం) రోశయ్య గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం బీపీ డౌన్ కావడంతో కుటుంబీకులు బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రికి తరలించే లోపే మార్గం మధ్యంలోనే ఆయన చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కొంపల్లిలోని ఆయన ఫామ్‌హౌస్‌లో ఆదివారం రోశయ్య అంత్యక్రియలు జరగనున్నాయి. చదవండి: Konijeti Rosaiah: రాజకీయాల్లో రోశయ్య ప్రస్థానమిలా.. -
రోశయ్య పార్థివదేహానికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: మాజీ సీఎం రోశయ్య పార్థివదేహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. రోశయ్య కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. రేపు(ఆదివారం) మధ్యాహ్నం కొంపల్లి ఫాంహౌస్‌లో రోశయ్య అంత్యక్రియలు జరగనున్నాయి. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు అధికారిక లాంఛనాలతో రోశయ్య అంత్యక్రియలు నిర్వహిస్తారు. రేపు ఉదయం వరకు అమీర్‌పేట్‌లోని నివాసంలోనే రోశయ్య భౌతికకాయం ఉండనుంది. రేపు ఉదయం గాంధీభవన్‌కు రోశయ్య భౌతికకాయం తరలిస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.30 వరకు గాంధీభవన్‌లో భౌతికకాయం సందర్శనకు ఉంచనున్నారు. అనంతరం గాంధీభవన్ నుంచి అంతిమయాత్ర సాగనుంది. తెలంగాణ ప్రభుత్వం మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. చదవండి: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం రోశయ్య కన్నుమూత -
ఒక శకం ముగిసింది.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు
Megastar Chiranjeevi Condolence On Konijeti Rosaiah Death: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రోశయ్య (88) కన్నుమూశారు. శనివారం (డిసెంబర్ 4) ఉదయం లోబీపీ రావడంతో ఆయనను కుటుంబసభ్యులు వెంటనే బంజారాహిల్స్‌లోని స్టార్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఆయన అప్పటికే మార్గం మధ్యలోనే మరణించినట్లు వైద్యులు తెలిపారు. వృద్ధాప్యం కారణంగా రోశయ్య చాలా కాలంగా ఇంటికే పరిమితమయ్యారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన మృతిపట్ల ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ పెద్దలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం రోశయ్య కన్నుమూత కొణిజేటి రోశయ్య మృతిపై మెగాస్టార్ చిరంజీవి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ప్రజా జీవితంలో రోశయ్య ఒక మహోన్నత నేతగా చిరంజీవి అభివర్ణించారు. రాజకీయ విలువలు, అత్యున్నత సాంప్రదాయాలు కాపాడడంలో ఒక యోగిలా సేవ చేశారన్నారు. 'రోశయ్య మరణంతో రాజకీయాలలో ఒక శకం ముగిసింది. రోశయ్య కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. నన్ను రాజకీయాల్లోకి రావాలని ఆయన మనస్ఫూర్తిగా ఆహ్వానించారు. వివాదరహితులుగా, నిష్కళంకితులుగా ప్రజా మన్ననలు పొందిన వ్యక్తి రోశయ్య' అని చిరంజీవి పేర్కొన్నారు. Shri #KonijetiRosaiah Garu #RestInPeace pic.twitter.com/jp8KPuWCuJ — Chiranjeevi Konidela (@KChiruTweets) December 4, 2021 ఇదీ చదవండి: రాజకీయాల్లో రోశయ్య ప్రస్థానమిలా.. -
రోశయ్య మృతి పట్ల ప్రముఖుల సంతాపం
సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి,కేవీపీ రామచంద్రారావు, షబ్బీర్ అలీ, మల్లు భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంతాపం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, మంత్రిగా, తమిళనాడు గవర్నర్‌గా, ప్రజా ప్రతినిధిగా అర్ధశతాబ్ధానికి పైగా ప్రజలకు సేవలందించిన కొణిజేటి రోశయ్య మృతి పట్ల భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజల సమస్యలను తక్షణం పరిష్కరిస్తూ, పరిపాలనా దక్షుడిగా పేరు పొందిన రోశయ్య మృతి తెలుగు వారికి తీరనిలోటన్నారు. ప్రధాని మోదీ సంతాపం: మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మృతిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విటర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. తాను, రోశయ్య ముఖ్యమంత్రులుగా ఒకే సమయంలో పనిచేశామని తెలిపారు. అదేవిధంగా రోశయ్య తమిళనాడు గవర్నర్‌గా పనిచేసిన సమయంలో ఆయనతో మంచి అనుబంధం ఉందని గుర్తుచేశారు. ఆయన సేవలు మరువలేమని తెలిపారు. రోశయ్య కుటుంబ సభ్యులకు పీఎం మోదీ సానుభూతి తెలియజేశారు. Saddened by the passing away of Shri K. Rosaiah Garu. I recall my interactions with him when we both served as Chief Ministers and later when he was Tamil Nadu Governor. His contributions to public service will be remembered. Condolences to his family and supporters. Om Shanti. pic.twitter.com/zTWyh3C8u1 — Narendra Modi (@narendramodi) December 4, 2021 సోనియాగాంధీ సంతాపం ►మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతిపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. రోశయ్య కుమారుడితో ఫోన్లో మాట్లాడి సంతాపం వ్యక్తం చేశారు. రోశయ్య మరణం తీరని లోటు: వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతిపై వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయ సాయిరెడ్డి సంతాపం తెలిపారు. ‘మాజీ ముఖ్యమంత్రి రోశయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న రోశయ్యగారి మరణం తీరని లోటు’ అని ట్విటర్లో సంతాపం తెలిపారు. ►రాజకీయాల్లో ఉన్నత విలువలు కలిగిన వ్యక్తిని తెలుగు రాష్ట్రాలు కోల్పోయామని ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆయనతో అసెంబ్లీలో కలిసి పనిచేసి చాలా విషయాలు నేర్చుకున్నానని కృష్ణదాస్ అన్నారు. ►కొణిజేటి రోశయ్య పట్ల ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తీవ్ర దిగ్బ్రాంతి సంతాపం వ్యక్తం చేశారు. రోశయ్య మరణం అత్యంత బాధాకరమన్నారు. దివంగత నేత వైస్ రాజశేఖరరెడ్డికి రోశయ్య అత్యంత సన్నిహితులన్నారు. ఆయనకు భగవంతుడు ఆత్మశాంతి ప్రసాదించాలని ప్రార్ధిస్తున్నాన్నారు. ►మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంతాపం వ్యక్తం చేశారు.ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. Saddened by the demise of Former Chief Minister of Andhra Pradesh Sri K Rosaiah Garu. My heartfelt condolences to the family and loved ones. His demise has truly left a deep void in the lives of many who he inspired. pic.twitter.com/WjcQ94UeYJ— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 4, 2021 ►మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణం పట్ల ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి శ్రీ కొణిజేటి రోశయ్య గారు పరమపదించారని తెలిసి విచారించాను. వారు నాకు చిరకాల మిత్రులు. విషయ పరిజ్ఞానంతో కూడిన వారి అనుభవం కీలక సమయాల్లో రాష్ట్రానికి దిశానిర్దేశం చేసిందని’’ ఆయన ట్వీట్ చేశారు. ఓర్పు, నేర్పు కలిగిన మంచి వక్తగా రోశయ్య అందరి అభిమానాన్ని చూరగొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నానని’’ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి శ్రీ కొణిజేటి రోశయ్య గారు పరమపదించారని తెలిసి విచారించాను. వారు నాకు చిరకాల మిత్రులు. విషయపరిజ్ఞానంతో కూడిన వారి అనుభవం కీలక సమయాల్లో రాష్ట్రానికి దిశానిర్దేశం చేసింది. pic.twitter.com/du3n90Jv59— Vice President of India (@VPSecretariat) December 4, 2021 విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతీక రోశయ్య : ఏపీ గవర్నర్ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మృతి పట్ల ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నాటి తరం నాయకునిగా విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతీకగా రోశయ్య నిలిచారన్నారు. ఉదయం అస్వస్థతకు గురైన ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందడం విచారకరమన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ఫ్రగాడ సానుభూతి తెలియజేస్తున్నానని గవర్నర్ హరి చందన్ పేర్కొన్నారు. ఈ మేరకు రాజ్‌భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. -
పలువురు ప్రముఖులతో రోశయ్య..
-
రోశయ్య మృతి పట్ల సీఎం జగన్ సంతాపం
సాక్షి, అమరావతి: మాజీ సీఎం రోశయ్య మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. రోశయ్య కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘‘పెద్దలు రోశయ్య గారి మరణవార్త నన్నెంతగానో బాధించింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా, శాసనసభ్యుడిగా... సుదీర్ఘ రాజకీయ జీవితంలో పలు పదవులను అలంకరించిన రోశయ్య గారి మృతి రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని’’ సీఎం జగన్ ట్వీట్ చేశారు. అటు తర్వాత రోశయ్య కుమారుడిని ఫోన్లో సీఎం జగన్ పరామర్శించారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కొణిజేటి రోశయ్య శనివారం ఉదయం (88) కన్నుమూశారు. బీపీ డౌన్ కావడంతో కుటుంబీకులు బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రికి తరలించే లోపే మార్గం మధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చదవండి: Konijeti Rosaiah: రాజకీయాల్లో రోశయ్య ప్రస్థానమిలా.. పెద్దలు రోశయ్య గారి మరణవార్త నన్నెంతగానో బాధించింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా, శాసనసభ్యుడిగా... సుదీర్ఘ రాజకీయ జీవితంలో పలు పదవులను అలంకరించిన రోశయ్య గారి మృతి రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. — YS Jagan Mohan Reddy (@ysjagan) December 4, 2021 -
Konijeti Rosaiah: రాజకీయాల్లో రోశయ్య ప్రస్థానమిలా..
Rosaiah Life Story And Political History: ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (88) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శనివారం ఉదయం బీపీ డౌన్ కావడంతో కుటుంబీకులు బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రికి తరలించే లోపే మార్గం మధ్యంలోనే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. రోశయ్య ప్రస్థానాన్ని పరిశీలిస్తే... కొణిజేటి రోశయ్య 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామములో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్ అభ్యసించారు. కాంగ్రెస్ పార్టీ తరపున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వములో రోడ్డు రహదార్లు శాఖ, రవాణ శాఖల మంత్రిగా పనిచేసారు. ఆ తరువాత అనేక ముఖ్యమంత్రుల హయాంలో పలు కీలకమైన శాఖలు నిర్వహించారు. 2004లో చీరాల ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక 2009 ఎన్నికల ముందు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీచేయకుండా శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైనారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలిలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవమున్న రోశయ్య..... 2009, సెప్టెంబర్ 3 నుండి 2010 నవంబరు 24 వరకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2011 ఆగస్టు 31న రోశయ్య తమిళనాడు రాష్ట్ర గవర్నరుగా ప్రమాణస్వీకారం చేశారు. 2016 ఆగస్టు 30 వరకూ తమిళనాడు గవర్నరుగా తన సేవలు అందించారు. చదవండి: (Konijeti Rosaiah: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం రోశయ్య కన్నుమూత) రోశయ్య 1979లో టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో రవాణా, గృహనిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖలు నిర్వహించారు. 1982లో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో హోంశాఖ, 1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, రవాణ, విద్యుత్తు శాఖలు నిర్వహించారు. 1991లో నేదురుమల్లి జనార్ధనరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్ శాఖలు, 1992లో కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్ శాఖలకు మంత్రిగా పనిచేశారు. 2004, 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వములో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను రోశయ్య 15 సార్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 1995-97 మధ్యకాలంలో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపిసిసి) అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లో నరసరావుపేట నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సుదీర్ఘకాలం పాటు ఆర్థికమంత్రిగా పనిచేసిన రోశయ్య 2009-10 బడ్జెటుతో కలిపి మొత్తం 15 సార్లు రాష్ట్ర బడ్జెటును ప్రవేశపెట్టారు. ఇందులో చివరి 7 సార్లు వరుసగా ప్రవేశపెట్టడం విశేషం. బడ్జెట్ కూర్పులో రోశయ్య ఘనాపాటిగా పేరుపొందినారు. వైఎస్సార్ మరణానంతరం.. 2009, సెప్టెంబర్ 3 న రోశయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. పద్నాలుగు నెలలు పదవిలో కొనసాగిన అనంతరం 2010 నవంబరు 24వ తేదీన తన పదవికి రాజీనామా చేసారు. ►1968-85: శాసనమండలి సభ్యుడు ►1978-79: శాసనమండలిలో ప్రతిపక్ష నేత ►1979-83: రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిపదవి ►1985-89: తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యుడు ►1989-94: రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిపదవి ►2004-09: చీరాల అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యుడు ►2004: రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిపదవి ►2009: రాష్ట్ర శాసనమండలి సభ్యుడు ►2009: సెప్టెంబరు - 2010 నవంబరు 24:ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ►2011: ఆగస్టు 31: తమిళనాడు గవర్నర్ -
ఉమ్మడి ఏపీ మాజీ సీఎం రోశయ్య కన్నుమూత
AP Former CM Rosaiah Died In Hyderabad: ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (88) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శనివారం ఉదయం బీపీ డౌన్ కావడంతో కుటుంబీకులు బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రికి తరలించే లోపే మార్గమధ్యలోనే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఎంగా పనిచేసిన రోశయ్య, తమిళనాడు గవర్నర్‌గానూ పనిచేశారు. గుంటూరు జిల్లా వేమూరులో రోశయ్య జన్మించారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా పనిచేశారు. కాంగ్రెస్‌లో కీలక నేతగా ఎదిగిన రోశయ్య, దాదాపు ఆరు దశాబ్దాల పాటు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఇదీ చదవండి: రోశయ్య మృతి పట్ల సీఎం జగన్ సంతాపం ►అమీర్‌పేట్‌లోని నివాసానికి రోశయ్య భౌతికకాయం తరలించారు. ►సందర్శకుల కోసం రేపు ఉదయం 11 గంటలకు గాంధీభవన్‌కు రోశయ్య భౌతికకాయం ►ఆదివారం మధ్యాహ్నం 12.30కి మహాప్రస్థానంలో రోశయ్య అంత్యక్రియలు ప్రముఖుల సంతాపం: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతి పట్ల ప్రముఖలులు సంతాపం తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోశయ్య పార్థివదేహానికి సీఎం కేసీఆర్ నివాళర్పించారు. ఇదీ చదవండి: ఒక శకం ముగిసింది.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు -
ప్రభుదేవా తమ్ముడి డాన్స్ రాజా
నటుడు–దర్శకుడు ప్రభుదేవా సోదరుడు నాగేంద్ర ప్రసాద్, రాజ్ కుమార్, శ్రీజిత్ ఘోష్, రాంకీ, మనోబాల, ఊర్వశి, జూనియర్ బాలయ్య ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘డాన్స్ రాజా డాన్స్’. ఏ.ఎల్ విజయ్ దర్శకత్వం వహించారు. తమిళంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో అనువదించి భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని తమిళనాడు మాజీ గవర్నర్ – ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ కొణిజేటి రోశయ్య ఆవిష్కరించి, ‘డాన్స్ ప్రధానంగా రూపొందిన ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘రోశయ్యగారి చేతుల మీదుగా మా చిత్రం ఫస్ట్ లుక్ విడుదలవడం గర్వకారణం మాత్రమే కాకుండా విజయసూచకం. ఎం.ఎం. శ్రీలేఖ ఆలపించిన నాలుగు పాటలూ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. తమిళంలో విజయం సాధించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మక ఉంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రవి కనగాల పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ సీఎం అయితే మంచిదే..
హైదరాబాద్: ప్రజల ఆశీర్వాదం, దేవుని దయతో ఏప్రిల్ 11న జరిగే సార్వత్రికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే మంచిదేనని తమిళనాడు మాజీ గవర్నర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం కొణిజేటి రోశయ్య అభిప్రాయపడ్డారు. ప్రజల హృదయాలను దోచుకొన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో తనకు విడదీయలేని అనుబంధం ఉందని రోశయ్య గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్ మాదిరిగానే ఆయన కుమారుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ఎంతో కష్టపడుతున్నారని అభిప్రాయపడ్డారు. గుంటూరుకు చెందిన సిమ్స్ విద్యా సంస్థల అధినేత భీమనాదం భరత్ రెడ్డి రూపొందించిన ‘వస్తున్నాడు.. జగనన్న వస్తున్నాడు’ ఆడియో అండ్ వీడియో సాంగ్ సీడీని కొణిజేటి రోశయ్య మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల కోసం ఆనాడు వైఎస్సార్ ఎంతో కష్టపడి పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. ఆయన మాదిరిగానే ప్రజల్లో ఒకడిగా వైఎస్ జగన్ తిరగటంతో ఆయనపై ఒక నమ్మకం, విశ్వాసం ఏర్పడ్డాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మారెడ్డి నరసారెడ్డి, ఇర్రి సిద్దార్థ, నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ సీఎం అయితే మంచిదే..
హైదరాబాద్: ప్రజల ఆశీర్వాదం, దేవుని దయతో ఏప్రిల్ 11న జరిగే సార్వత్రికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే మంచిదేనని తమిళనాడు మాజీ గవర్నర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం కొణిజేటి రోశయ్య అభిప్రాయపడ్డారు. ప్రజల హృదయాలను దోచుకొన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో తనకు విడదీయలేని అనుబంధం ఉందని రోశయ్య గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్ మాదిరిగానే ఆయన కుమారుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ఎంతో కష్టపడుతున్నారని అభిప్రాయపడ్డారు. గుంటూరుకు చెందిన సిమ్స్ విద్యా సంస్థల అధినేత భీమనాదం భరత్ రెడ్డి రూపొందించిన ‘వస్తున్నాడు.. జగనన్న వస్తున్నాడు’ ఆడియో అండ్ వీడియో సాంగ్ సీడీని కొణిజేటి రోశయ్య మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల కోసం ఆనాడు వైఎస్సార్ ఎంతో కష్టపడి పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. ఆయన మాదిరిగానే ప్రజల్లో ఒకడిగా వైఎస్ జగన్ తిరగటంతో ఆయనపై ఒక నమ్మకం, విశ్వాసం ఏర్పడ్డాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మారెడ్డి నరసారెడ్డి, ఇర్రి సిద్దార్థ, నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
హార్రర్ యాక్షన్ ఎంటర్టైనర్గా ‘రహస్యం’
శైలేష్ , శ్రీ రితిక జంటగా సాగర్ శైలేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రహస్యం. ఈ సినిమాను భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్నారు. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య హాజరు కాగా సి.కల్యాణ్, శివశక్తి దత్తా, రాజ్ కందుకూరి, యంగ్ హీరో మానస్, శివ శంకర్ మాస్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడుతూ.. నిర్మాత రామసత్యనారాయణ వంద చిత్రాలకు చేరువయ్యారు. తను నాకు ఆత్మీయుడు. మంచి సినిమాను తీయటంతో పాటు దాన్ని వైవిధ్యంగా ప్రమోట్ చేస్తారు. ఈ చిత్ర ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. టీమ్ అందరికీ మంచి పేరు తీసుకువవస్తుందని భావిస్తున్నాను. చిన్న చిత్రాల ద్వారా కూడా డబ్బు ఎలా సంపాదించాలన్నది రామ సత్యనారాయణ గారిని చూసి నేర్చికోవాలన్నారు. ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ.. రామసత్యనారాయణ సినిమాను ప్రేమించే వ్యక్తి, వంద చిత్రాలను తీసిన తెలుగు నిర్మాతగా రామానాయుడు గారు, రామ సత్యనారాయణ నిలిచిపోతారు. తన సినిమా ఫంక్షన్ అంటే అది నా సినిమా ఫంక్షన్ లానే ఉంటుంది. రహస్యంతో తాను లాభాలను సాందిచాలని ఆసిస్తున్నానన్నారు. రామసత్యనారాయణ మాట్లాడుతూ..కంటెంట్ బాగుంటేనే ఈ రోజు ఎంతటి స్టార్ హీరో సినిమా అయినా ఆడుతుంది. లేదంటే ప్రేక్షకులు ఎలాంటి మోహమాటం లేకుండా తిరస్కరిస్తున్నారు. రహస్యం కంటెంట్ ఉన్న చిత్రం. ఈ సినిమాను ముందు నుంచి ప్రమోట్ చేస్తొన్న వివి.వినాయక్, పూరీ జగన్నాథ్,రామ్ గోపాల్ వర్మ, రాజ్ కందుకూరి, శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు. రోశయ్య గారి ఆశీస్సులు ఎప్పుడు నాకు ఇలానే ఉండాలి. ఈ సినిమాను విడుదలకు రెండు రోజుల ముందే ప్రెస్ షో వేసి చూపిస్తామన్నారు. -
మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యతో మనసులో మాట
-
మహాచార్య
అన్నీ తెలిసిన మనిషి.. ఆవేశపడని మనిషి.. ఆలోచించే మనిషి.. జాగ్రత్త చెప్పే మనిషి... పక్కన ఉంటే భరోసాగా ఉంటుంది. రోశయ్య అలాంటి భరోసా ఇచ్చిన మనిషి. అదుపు తప్పబోయిన పరిస్థితుల్ని బ్యాలెన్స్ చేసిన మనిషి. ఈ రాజనీతిజ్ఞత మహా మహా ఆచార్యులకు మాత్రమే ఉంటుంది. అందుకే ఆయన మహాచార్య. మహాభారతంలో కురువృద్ధుడు భీష్మపితామహుడు. ఆంధ్ర భారతంలో ఆ పాత్ర కొణిజేటి రోశయ్యగారిది. 85 ఏళ్ల రోశయ్య జీవితంలో 65 ఏళ్లు రాజకీయరంగంతోనే మమేకమై ఉంది. ఆయన హయాంలో రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించారూ అంటే కీలకమైన మంత్రి పదవులకు గుర్తుకొచ్చే నాలుగైదు పేర్లలో రోశయ్య పేరు తప్పకుండా ఉండేది. ‘రోశయ్యకు మంత్రి పదవి వస్తుందా, రాదా’ అనేది కాదు ప్రశ్న, ఈయనకు ఈ దఫా ఏ శాఖ ఇస్తారనే చర్చలు రాజధాని నుంచి గ్రామాల్లో అరుగుల వరకు జరిగేవి. అసెంబ్లీలో ఆయన ఉంటే చెణుకులతో సభ ఘొల్లుమనేది. సందర్భానుసారం పిట్ట కథలతో వాతావరణాన్ని సర్దుబాటు చేసేవారు. ఆ కథలో ఎత్తిపొడుపు తగలాల్సిన వాళ్లకు సూటిగానే తగిలేది, మళ్లీ నోరెత్తడానికి సందేహించేటంతగా. ఇలాంటి అస్త్రం మన దగ్గర ఉండబట్టే మన అమ్ములపొది ఇంత పటిష్టంగా ఉందనే భరోసా సొంతపార్టీ వాళ్లకు మళ్లీ మళ్లీ కలిగేది. టీవీలో చూసేవాళ్లకు అది ఓ ఇన్ఫోటైన్మెంట్. రాష్ట్ర పాలన.. రాజ్యాంగ పరిరక్షణ రోశయ్య దక్షిణాదిలో కేరళ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల రాజకీయ ముఖచిత్రంలోనూ కనిపిస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మర్రి చెన్నారెడ్డి, టి. అంజయ్య, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, నేదురుమల్లి జనార్దన రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి.. మొత్తం ఐదుగురు ముఖ్యమంత్రులతో కలిసి పనిచేశారు. క్లిష్టమైన పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు గవర్నర్‌గా రాజ్యాంగ పరిరక్షణ బాధ్యతలను నిర్వర్తించారు. ప్రస్తుతం హైదరాబాద్, బల్కంపేటలోని స్వగృహంలో విశ్రాంత జీవనాన్ని గడుపుతున్నారు. ఆ ఆం్ర«ధ భీష్మపితామహుడిని సాక్షి పలకరించింది. దైవం.. గురువు.. మిత్రుడు సామాన్య, మధ్యతరగతి వారు నివసించే ప్రదేశంలో ఒక విశాలమైన ప్రాంగణం, అందులో అందమైన భవంతి. పోలీస్ సెక్యూరిటీ దాటి లోపలికి అడుగుపెడితే వేణుగోపాలుడి విగ్రహం. ముందు గదిలో అడుగుపెట్టగానే ఎదురుగా ఉన్న గోడకు కుడివైపు తొండంతో ఉన్న వినాయకుడి తంజావూర్ చిత్రపటం కనిపిస్తుంది. కొంచెం ఎడమ వైపు ఆయన రాజకీయ గురువు ఆచార్య ఎన్జీ రంగా ఫొటో, కుడివైపు గోడకు రాజకీయ మిత్రులు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న ఫొటో ఉన్నాయి. గురువుకి, మిత్రుడికి ఆయన మనసులో ఉన్న మహోన్నతమైన స్థానానికి ప్రతీకల్లా ఉన్నాయవి. అప్పుడిన్ని కుదుపుల్లేవు అప్పుడు సమయం సాయంత్రం ఐదుగంటలు. అప్పుడే విచ్చుకుంటున్న మల్లెల్లా ఉన్న స్వచ్ఛమైన తెల్లని దుస్తుల్లో లోపలి నుంచి వచ్చారాయన. ‘‘ఎలా ఉన్నారు?’’ అని పలకరించగానే ‘‘ఇదిగో ఇలా. ఆరోగ్యం బాగుంది, జీర్ణం కావడం లేదు’’ అంటూ నవ్వారు. ఉదయం లేచిన తర్వాత ఏడు గంటలకు ఇంటి ఆవరణలోనే ఓ గంట సేపు వాకింగ్ చేయడం. పేపర్లు చదవడం, టీవీలో వార్తలు చూడటం, వేళకు ఆహారం, విశ్రాంతి... ఇదీ ఇప్పుడాయన దినచర్య. ఇప్పుడేమీ పట్టించుకోవడం లేదంటూనే తన అనుభవంలోని విషయాలను బయటపెట్టారు. తన హయాంలో ఒక నాయకుడు ఉంటే.. అతడి ఆదేశాన్ని పాటించే అనుచరులు ఎక్కువ మంది ఉండేవారని చెప్పారు. ఇప్పటి రాజకీయ రంగం.. నాయకులు ఎక్కువైపోయి ఇబ్బంది పడుతోంది. దాంతో తరచూ కుదుపులకు లోనవుతోందని అన్నారు. ఆచార్య రంగా, గౌతు లచ్చన్నల ప్రభావంతో రాజకీయ రంగంలోకి వచ్చానని, రంగా శిష్యుడినని చెప్పుకోవడంలో సంతోషం ఉంటుందని చెప్పారు. కలం పట్టిన చెయ్యి రోశయ్య గుంటూరు హిందూ కాలేజ్‌లో బీకామ్ చదువుతున్న రోజులవి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సొంత పరిపాలనలో తొలి అడుగులు వేస్తోంది దేశం. ఆ అడుగులు సమసమాజ స్థాపన దిశగా పడటం లేదని గళమెత్తిన పథనిర్దేశకులలో ఆచార్య రంగా కూడా ఉన్నారు. ఆయన తన ప్రసంగాలతో యువతలో ఆలోచన రేకెత్తించేవారు. అలా ప్రభావితమైన వారిలో రోశయ్య ఒకరు. సమాజానికి కొత్త పథాన్ని నిర్మించాలంటే ఉన్న దారి ఎటు వెళ్తోందో తెలుసుకోవాలి. ప్రతిరోజూ ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రికలు చదవడం అలా అలవాటైంది ఆయనకు. అలాగే తాను తెలుసుకున్న సమాచారాన్ని పదిమందికి తెలియచేయాలనే తపన కూడా అప్పుడే మొదలైంది. వార్తలు రాసి గుంటూరులో ఉన్న ఆంధ్రపత్రిక ఆఫీస్‌కి వెళ్లి ఇచ్చేవారు రోశయ్య. ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటూ ‘‘విలేఖరి తాను స్వయంగా చూసిన విషయాన్ని రాస్తే, ఆ కథనంలో సమగ్రత ఉంటుంది. ఆ వార్తకు విశ్వసనీయత వస్తుంది. అప్పట్లో పత్రికలు మేము (విలేఖరులు) రాసుకెళ్లిన విషయాన్ని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే ప్రచురించేవి. ఇప్పుడు వార్తాప్రసారం వేగవంతమైంది. ఒక సంఘటన జరిగితే, సంఘటన స్థలానికి విలేఖరి వెళ్లి రిపోర్ట్ చేసే టైమ్ ఇవ్వడం లేనట్లుంది. దాంతో వాళ్లు తాము విన్న మాటల ఆధారంగా వార్తా కథనాన్ని రాసేస్తున్నారు. దాంతో సమగ్రత లోపించి వార్తలో డొల్లతనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ పద్ధతిని మార్చుకోవాలి’’ అని కొత్తతరం విలేఖరులకు సూచించారు. అప్పట్నుంచి తెల్లదుస్తులే! రోశయ్య కాలేజ్ వదిలిన ఏడాది వరకు మాత్రమే ప్యాంటు, షర్టు వేసుకున్నారు. క్రియాశీలక రాజకీయాల్లోకి రావడమే తడవుగా తెల్ల ధోవతి, తెల్లలాల్చీకి మారిపోయారు. ‘‘రోజూ తెల్లదుస్తులు ధరించడం అలవాటైపోయింది. రోజూ అన్నం తింటాం. బోరు కొడుతుందా’’ అని చమత్కరించారు. చిన్నప్పటి నుంచి తనది అత్యంత నిరాడంబరమైన జీవితం అని చెబుతూ.. తల్లి వండినది తినడమే తప్ప.. అదిష్టం, ఇదిష్టం లేదనడం తెలియదన్నారాయన. బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ..‘‘మా నాన్నకు వ్యవసాయంతోపాటు వ్యాపారం కూడా ఉండేది. ఒకసారి సేల్స్ ట్యాక్స్ అధికారి వచ్చి లెక్కలు, పన్నులు అంటూ అధికారం ప్రదర్శించాడు. అప్పుడు ‘దుకాణం పెట్టడానికి పెట్టుబడి మీరివ్వలేదు, వ్యాపార లావాదేవీల్లో సహాయం చేయలేదు. మీకు లెక్కలు చూపిస్తూ, మీ ఆదేశాలు పాటిస్తూ వ్యాపారం చేయాలా’ అని వ్యాపారం మానేసి వ్యవసాయానికే పరిమితమయ్యారు. బ్రిటిష్ పెత్తనాన్ని అంతగా నిరసించేవారాయన’’ అని తండ్రి ముక్కుసూటి తనం గురించి చెప్పారు. అంత కచ్చితమైన భావాలు కలిగిన మనిషి పెంపకంలో జాగ్రత్తగా మెలగడం ఎలాగో నేర్చుకున్నానంటారు రోశయ్య. ‘‘ఒకసారి జారిన తర్వాత ఆ మాట ఎప్పటికీ ఉండిపోతుంది. అందుకే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నేను పాటిస్తాను, నా పిల్లలకూ అదే చెప్పాను’’ అని జీవిత సూత్రాన్ని బయటపెట్టారు. ఇంకా.. ‘‘మంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రులకు ఏదైనా చెప్పాల్సి వస్తే.. ఆ విషయాన్ని అందరిలో చెప్పేవాడిని కాదు, పర్సనల్‌గా చెప్పేవాడిని. అలాగే నా మీద వచ్చిన విమర్శలను ఎప్పుడూ వ్యక్తిగతంగా తీసుకోలేదు. అవి అభిప్రాయభేదాలంతే, ఎవరికి వారు తమ తమ పార్టీలను పరిరక్షించుకునే ప్రయత్నాలు తప్ప మరేమీ కాదు. విమర్శలను హుందాగా స్వీకరించగలిగితే వ్యక్తిగతంగా శత్రువులు ఏర్పడరు’’ అంటూ తాను అజాత శత్రువుగా ఉండిపోయిన వైనాన్ని చెప్పారాయన. తొలి ప్రయత్నం విఫలం రోశయ్య క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తొలిసారి స్వతంత్ర పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ఆ ప్రయత్నంలో విజయం ఆయనకు దూరంగానే ఉండిపోయింది. అంత చిన్న వయసులో శాసనసభకు పోటీ చేయడం గురించి చెబుతూ.. ‘‘అప్పట్లో యువకుల్నీ, ఉత్సాహవంతుల్నీ.. చురుగ్గా పని చేస్తున్నారు.. అనే అభిప్రాయం కలిగితే ఎన్నికల్లో పోటీ చేయమని పార్టీ నాయకులు ప్రోత్సహించేవారు. ఇప్పటి సమీకరణలుండేవి కాదు. అంతటి ఆరోగ్యకరమైన పరిస్థితులుండబట్టే నాలాంటి సామాన్యుడు ధైర్యంగా రాజకీయాల్లోకి రాగలిగాడు’’ అన్నారు. వారసుల్లేరు ఎన్టీఆర్, ఏఎన్నార్, భానుమతి నటనను ఇష్టపడే రోశయ్య.. సంగీతాన్ని కూడా అంతే ఇష్టపడతారు. తమిళనాడులో గవర్నర్‌గా ఉన్నప్పుడు కూడా డైరీలో ఖాళీ దొరికితే త్యాగరాజ కీర్తనల వంటి సాంస్కృతిక కార్యక్రమాలకు వెళ్లేవారాయన. తన జీవితంలో పుస్తకాలు చదవడం సాధ్యమే కాలేదంటారు. బిజీగా ఉన్న రోజుల్లో మాత్రం పేపర్లలో ఉదయం చదవగా మిగిలిపోయిన పేజీలను రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత పూర్తి చేసేవారట. ఎప్పుడైనా ఒక ప్రోగ్రామ్‌కి ఫలానా టైమ్‌కి వస్తానంటే కచ్చితంగా ఆ సమయానికి అక్కడ ఉండాలనేది ఆయన సిద్ధాంతం. అలా మాట నిలబెట్టుకున్నప్పుడే మనిషికి విశ్వసనీయత అంటారు. ‘తనకు రాజకీయ వారసులు లేరంటూ.. వారసుల్ని తయారు చేస్తే తయారు కారు.. వారిలో ఆ ఆకాంక్ష ఉంటే ఎదుగుతారు అని అన్నారు. తన కూతురు వైజాగ్‌లో, ఇద్దరబ్బాయిలు హైదరాబాద్‌లో, ఒకబ్బాయి తెనాలిలో వ్యాపారాలలో స్థిరపడ్డారని చెప్పారు. వాళ్ల వ్యాపార వ్యవహారాల్లో తాను జోక్యం చేసుకోనని, నా రాజకీయ వ్యవహారాల్లో కుటుంబ సభ్యులను తలదూర్చనివ్వలేదనీ అన్నారాయన. బంధువులమ్మాయే! రోశయ్యగారి భార్య శివలక్ష్మి. ఆమెను తొలిసారిగా చూసిందెప్పుడో గుర్తు లేదంటారాయన. ‘‘వాళ్లది తెనాలి, మాది తెనాలి దగ్గర వేమూరు. మొదటిసారి ఎప్పుడు చూశానో తెలియదు. బాగా చిన్నప్పుడే చూసి ఉంటాను. పెళ్లి నాటికి కూడా ఆమెకి పద్నాలుగేళ్లే. నాకంటే ఆరేళ్లు చిన్నది. ఆమెకి ఇల్లు తప్ప మరేమీ పట్టవు. ఆమె అలా ఇంటిని దిద్దుకోవడం వల్లనే నేను పూర్తి సమయం ప్రజాజీవితంలో గడపగలిగాను. ఇంటికి వచ్చిపోయే బంధువులకు జరగాల్సిన గౌరవాలను జాగ్రత్తగా చూసుకోవడం నుంచి నాకు ఎప్పుడు ఏం కావాలో చక్కగా అమర్చడం వరకు ప్రతిదీ స్వయంగా చూసుకున్నదామె. పిల్లల్ని పెద్ద చదువులకు కాలేజీల్లో చేర్చడానికి మా తమ్ముడి సహాయం తీసుకునేది. ఇంట్లో ఏ పనీ నా కోసం ఎదురు చూసేది కాదు. ఇంటి వాతావరణాన్ని అంత సౌకర్యంగా ఉంచుతుంది. అలాగని ఎప్పుడూ నా మీద కోపం రాలేదని కాదు. ‘అప్పుడప్పుడూ ఇంటిని కూడా పట్టించుకోండి’ అని కోప్పడేది. కానీ ఆ కోపం, అలక ఎంతో సేపు ఉండవు. ఆమె కోప్పడినా నాకు ఆమె మీద నిష్ఠూరం కలగలేదెప్పుడూ. ఆమెకు కోపం రావడంలో అర్థం ఉందిగా మరి. నా మట్టుకు నేను బయటి చిరాకుల్ని ఆమె మీద ప్రదర్శించకుండా జాగ్రత్తపడేవాడిని. ఆమెకు నా రాజకీయ వ్యవహారాలేవీ తెలియదు. నేను మంత్రిగా ఉన్న రోజుల్లో ‘ఆయన ఏ శాఖకు మంత్రి’ అని ఎవరైనా అడిగితే’ సమాధానం కోసం తడుముకునేటంత దూరంగా ఉంటుంది’’ అని నవ్వుతూ చెప్పారు. – వాకా మంజులారెడ్డి -
కళాతపస్వికి జీవిత సాఫల్య పురస్కారం
వీబీ ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో ఆ సంస్థ అధినేత విష్ణు బొప్పన మూడేళ్లుగా బుల్లితెర అవార్డులు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంస్థ ఆధ్వర్యంలో తొలిసారి వెండితెర అవార్డులు అందించారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఘనంగా ఈ వేడుక జరిగింది. సీనియర్ దర్శకులు ‘కళాతపస్వి’ కె.విశ్వనాథ్‌కు జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేశారు. ఈ అవార్డు తనకెంతో సంతృప్తి ఇచ్చిందని విశ్వనాథ్ అన్నారు. సీనియర్ నటులు కోట శ్రీనివాసరావుకు లెజెండ్రీ అవార్డును, మరో సీనియర్ నటుడు గిరిబాబుకు ఆల్‌రౌండర్ పురస్కారం అందించారు. వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన వారికి అవార్డులు ఇచ్చారు. బాల తారల్లో అవార్డు అందుకున్నవారిలో ‘మహానటి’లో చిన్నప్పటి సావిత్రిగా నటించిన రాజేంద్రప్రసాద్ మనవరాలు సాయి తేజస్విని, ‘అప్పూ’ ఫేమ్ డి. సాయి శ్రీవంత్ తదితరులు ఉన్నారు. ఈ వేదికపై పేద కళాకారులకు ఆర్థికసాయం చేశారు. ‘‘ఈ వేడుక విజయవంతం కావడానికి స్పాన్లర్లే కీలకం.. వారందరికీ థ్యాంక్స్’’ అన్నారు విష్ణు బొప్పన. తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య, ఐజీ మాగంటి కాంతారావు, ఐఏఎస్ మాగంటి ఉషారాణి ముఖ్య అతిథులుగా హాజరవగా, నటి జయప్రద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా, నటీనటులు సుమన్, భానుచందర్, సత్యప్రకాష్, ఏడిద శ్రీరామ్, కవిత, ప్రియదర్శి తదితరులు పాల్గొన్నారు. -
డాక్టర్ హరికృష్ణకు వైద్యరత్న అవార్డు
నిజామాబాద్‌అర్బన్ : ప్రముఖ చిన్నపిల్లల వైద్యుడు హరికృష్ణకు వైద్యరత్న, సేవ రత్న అవార్డు లభించింది. తెలుగుభాష సాంస్కృతికశాఖ ఆదర్శపౌండేషన్ ఆధ్వర్యంలో ఈ అవార్డును ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో తమిళనాడు మాజీ గవర్నర్, ఉమ్మడి మాజీ ముఖ్యమంత్రి రోశయ్య చేతుల మీదుగా హరికృష్ణ ఈ అవార్డును అందుకున్నారు. కొన్నేళ్లుగా నిజామాబాద్ జిల్లాలో నవజాత శిశువులకు అత్యవసర వైద్యచికిత్సలు అందించడం, అత్యాధునిక వైద్యసేవలు తీసుకరావడం, సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కార్యక్రమాలు, ఇఫ్తార్ విందులు, సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించడంతో డా.హరికృష్ణను ఈ అవార్డుకు ఎంపికచేశారు. శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే తల్లిపాల వారోత్సవాలను నిర్వహించడం వంటి కార్యక్రమాలను అవార్డు కారణమైనట్లు నిర్వహకులు తెలిపారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ అవార్డు రావడం సంతోషంగా ఉందని, మరింత బాధ్యతయుతంగా వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తానన్నారు. ఉచిత ఆరోగ్యశిబిరాలు, వ్యాధుల నియంత్రణకు పాటుపడుతానన్నారు. తెలంగాణ సాహితీ అకాడమి చైర్మన్ నందనిసిద్దారెడ్డి, ఆదర్శ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కనుమ బోగరాజు, యువ కళావాహిణి అధ్యక్షులు వై.కె.నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
దేశం గర్వించదగ్గ నటుడు ఎన్టీఆర్
సాక్షి, హైదరాబాద్: నందమూరి తారక రామారావు దేశం గర్వించదగ్గ నటుడని తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. ఎన్టీఆర్ గొప్ప గొప్ప పాత్రల్లో నటించి, జీవించి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. సోమవారం ఇక్కడి రవీంద్రభారతిలో ద్రవిడ విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ డాక్టర్ రవ్వా శ్రీహరికి ఎన్టీఆర్ జాతీయ సాహితీ పురస్కారం ప్రదానం చేశారు. ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. రోశయ్య మాట్లాడుతూ అంతమంచి నటనాకౌశలం ఉన్న నటుడిని ఇక చూడబోమన్నారు. సినీ వినీలాకాశంలో అంతటి గొప్ప వ్యక్తి పేరుతో ఇచ్చే పురస్కారాన్ని భాషాసాహిత్యంలో శిఖరసమానుడు, మహామహోపాధ్యాయడు ఆచార్య రవ్వా శ్రీహరికి ఇవ్వటం సముచితంగా ఉందని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఎన్టీఆర్ ధోరణి, తన ధోరణి వేర్వేరైనా ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు వస్తే ఎన్టీఆర్ గురించి గొప్పగా చెప్పేవాడినన్నారు. విశిష్ట అతిథి ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు మాట్లాడుతూ మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్య ప్రభావాలు చాలా విశిష్టమైనవని, వాటిని మనం గుర్తించలేకపోతున్నామని అన్నారు. వ్యక్తిత్వంలో ఎన్టీఆర్ భగవంతుడి స్వరూపమన్నారు. గౌరవ అతిథి, ప్రముఖ నటి డాక్టర్ జమున మాట్లాడుతూ ఎన్టీఆర్‌ను మించిన నటుడు మరొకరు లేరని, ఆయనతో కలసి నటించటం తన అదృష్టమని అన్నారు. ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి మాట్లాడుతూ ఎన్టీఆర్ ఎంతోమందికి రాజకీయ జీవితాలు కల్పించిన మహావ్యక్తి అని కొనియాడారు. ట్రస్టు చైర్పర్సన్ ఎన్.లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ఎన్టీఆర్‌కు తాను భార్య కావటం ఎన్నో జన్మల అదృష్టమన్నారు. శ్రీహరి మాట్లాడుతూ ఎన్టీఆర్ సాహితీ పురస్కారాన్ని అందుకోవడం సంతోషంగా ఉందని, ఇది తనకు ప్రత్యేకమైనదని అన్నారు. కార్యక్రమంలో ఏపీ సమాచార హక్కు చట్టం పూర్వ కమీషనర్ పి.విజయబాబు, అవార్డు కమిటీ సభ్యులు డాక్టర్ అనుమాండ్ల భూమయ్య, డాక్టర్ ముక్తేవి భారతి, డాక్టర్ సూర్య ధనంజయ్, వైకే నాగేశ్వరరావు, నటి దివ్యవాణి తదితరులు పాల్గొన్నారు. -
సాక్షి ఎడిటర్‌కు ‘మాదల’ పురస్కారం
-
ఆర్యవైశ్య కార్పొరేషన్‌కు వెయ్యి కోట్లు కేటాయించండి
రోశయ్య డిమాండ్ కల్వకుర్తి: ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పా టు చేసి రూ.1000 కోట్లు కేటాయిం చాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో నిర్వహించిన ఆర్యవైశ్యుల చైతన్య సదస్సులో ఆయన మాట్లాడారు. ఆర్యవైశ్యులు ఎదుర్కొం టున్న సమస్యలపై కేంద్రానికి లేఖ రాస్తానని పేర్కొన్నారు. ఆర్యవైశ్యులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్‌ను స్వయంగా కలసి వివరిస్తానని చెప్పారు. ప్రధానంగా ఈబీసీ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్, కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
వైశ్యులకు ప్రభుత్వ పథకాలు అందాలి
యాదగిరిగుట్ట : ఆర్యవైశ్యులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని మైలార్‌గూడెంలో ఆదివారం జరిగిన ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ యాదాద్రిభువనగిరి జిల్లా నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. దేశంలో వైశ్య సంఘాలు ఎన్నో పుట్టుకొస్తున్నాయని, అవన్నీ నిరుపేదలకు సహాయం చేసేందుకు పోటీపడాలన్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ భగవంతుడిచ్చిన వరం వైశ్యులని పేర్కొన్నారు. ఘర్షణలు జరగకుండా ప్ర«శాంత జీవి తం గడపడంలో వైశ్యులు ముందుంటారని తెలిపారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునితామహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఆర్యవైశ్యుల అభివృద్ధికి ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. యా దాద్రి పుణ్యక్షేత్రంలో వైశ్యులు లోటస్‌టెంపుల్ ఏర్పా టుచేసి ఇక్కడికి వచ్చే భక్తులకు నిత్యన్నదానం చేయ డం సంతోషకరమని పేర్కొన్నారు. ఐవీఎఫ్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గంజి రాజమౌళిగుప్త, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, దక్షిణాది రాష్ట్రాల ఇన్చార్జి ఉప్పల శ్రీనివాస్‌గుప్త మాట్లాడుతూ కార్పొరేషన్ ఏర్పాటు చేసి పేద వైశ్యులకు సహకారం చేయాలని కోరారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో త్వరలో నియమించే ట్రస్ట్ బోర్డులో వైశ్యులకు చోటు కల్పించాలని కోరారు. అనంతరం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన తాళ్లపల్లి విశ్వనాథం, ప్రధాన కార్యదర్శి వంగపల్లి అంజయ్యగుప్త, కోశాధికారి తడ్క వెంకటేష్, మహిళ అధ్యక్షురాలు సముద్రాల కల్పన, యువజన సంఘం అధ్యక్షుడు సముద్రాల శ్రీనివాస్ గుప్తతో పాటు కార్యవర్గ సభ్యులను ఉప్పల శ్రీనివాస్‌గుప్త ప్ర మాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ మహిళ అధ్యక్షురాలు మలిపెద్ది మేఘమాల, చకిలం రమణయ్య, శింగిరికొండ నర్సిం హులు, ఉడుతా పురుషోత్తం, గౌరిశెట్టి ప్రభాకర్, పబ్బా చంద్రశేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్ కాలె సుమలత, నర్సింహమూర్తి, ఎంపీపీ గడ్డమీది స్వప్న, జెడ్పీటీసీ కర్రె కమలమ్మ పాల్గొన్నారు. -
విద్యాసాగర్‌రావుకే ఇక పూర్తి బాధ్యత?
చెన్నై : తమిళనాడు ఇన్చార్జ్ గవర్నర్ విద్యాసాగర్‌రావుకు ఇక, పూర్తి బాధ్యతలు అప్పగించేనా అన్న ప్రశ్న మొదలైంది. ఇందుకు తగ్గ కసరత్తులు ఢిల్లీలో సాగుతున్నట్టుగా సంకేతాలు వస్తున్న నేపథ్యంలో ఇక, హిజ్ ఎక్సలెన్సీ అన్న పదాన్ని వాడొద్దు అని, గౌరవనీయులైన గవర్నర్ గారు అని సంబోధిస్తే చాలు అంటూ విద్యాసాగర్‌రావు ఆదేశాలతో రాజ్‌భవన్ ప్రకటన జారీ చేయడం గమనార్హం. రాష్ట్ర గవర్నర్‌గా కొణిజేటి రోశయ్య పదవీ కాలం ముగిసినానంతరం ఇన్చార్జ్ గవర్నర్‌గా బాధ్యతల్ని విద్యాసాగర్‌రావు స్వీకరించిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర గవర్నర్‌గా పూర్తి బాధ్యతల్ని నిర్వర్తిస్తూ, ఇన్చార్జ్గా తమిళనాడు గవర్నర్‌గా అదనపు భారాన్ని తన భుజాన విద్యాసాగర్‌రావు మోస్తూ వచ్చారు. అయితే, ఇక్కడ పూర్తి స్థాయి గవర్నర్‌ను నియమించాల్సిన అవసరం ఉండడంతో, పలువురి పేర్లు ప్రచారంలోకి వచ్చినా, ఆచరణలో సాధ్యమేనా అన్న ప్రశ్న బయలు దేరింది. గుజరాత్ మాజీ సీఎం ఆనందిబెన్ పటేల్ పేరు ఖరారైనట్టుగా ప్రచారం కూడా సాగింది. అయితే, ఇతరులకు కొత్తగా పూర్తి బాధ్యతల్ని అప్పగించడం కన్నా, ఇన్చార్జ్ గవర్నర్ విద్యాసాగర్‌రావుకు పూర్తి బాధ్యతల్ని అప్పగించే దిశలో ఢిల్లీ స్థాయిలో కసరత్తులు సాగుతున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇక, పూర్తి స్థాయిలో గవర్నర్ పగ్గాలు విద్యాసాగర్‌రావుకు అప్పగించినట్టే అన్నట్టుగా తమిళ మీడియా వార్తలు, కథనాలను వెలువరించే పనిలో పడ్డాయి. ఈ పరిస్థితుల్లో ఆ వార్తలు, కథనాలకు బలం చేకూరే రీతిలో రాజ్‌భవన్ నుంచి ఓ ప్రకటన వెలువడడం గమనార్హం. సాధారణంగా గవర్నర్ పేరుకు ముందుగా హిజ్ ఎక్సలెన్సీ అన్న పదాన్ని ఉపయోగించడం జరుగుతూ వస్తున్నది. అయితే, ఇక ఆ పదాన్ని ఉపయోగించ వద్దు అని, గౌరవనీయులైన గవర్నర్ గారు అని సంబోధిస్తే చాలు అన్నట్టుగా ఆ ప్రకటన వెలువడడం విశేషం. ప్రభుత్వ వ్యవహారాలు, కార్యక్రమాలు సంబంధించిన లేఖలు తదితర అంశాల్లో గౌరవనీయులు అని వాడితే చాలు అని సూచించడం గమనార్హం. -
నేడు అనంతకు కొణిజేటి రోశయ్య
అనంతపురం కల్చరల్ : తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య గురువారం జిల్లాకు రానున్నట్లు జిల్లా పౌరసంబంధాల అధికారి ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటలకు అనంతకు చేరుకోనున్న ఆయన, రోడ్లు, భవనాల అతిథి గహంలో బస చేస్తారు. ఉదయం 10 గంటలకు శ్రీ వాసవీ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలను ప్రారంభిస్తారు. సాయంత్రం 5.30 గంటల నుంచి స్థానిక నేషనల్ సాయిబాబా కళాశాలలోని ఇండోర్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. 6.30 గంటలకు టవర్‌క్లాక్ వద్ద ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించి, కొత్తూరు అమ్మవారి శాలలో జరిగే ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. -
'నేరుగా పరామర్శించలేకపోయా'
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత త్వరగా కోలుకోవాలని మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య ఆకాంక్షించారు. శుక్రవారం ఆయన అపోలో ఆస్పత్రి సందర్శించారు. జయలలిత ఆరోగ్యంపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జయలలితను ప్రత్యక్షంగా పరామర్శించలేకపోయానని, ఆమెను చూసేందుకు ఎవరినీ లోపలకు అనుమతించడం లేదని రోశయ్య చెప్పారు. జయలలితకు అందిస్తున్న చికిత్స వివరాలు తనకు వైద్యులు చెప్పారని తెలిపారు. 68 ఏళ్ల జయలలిత అనారోగ్యంతో సెప్టెంబర్ 22న ఆస్పత్రిలో చేరారు. అప్పటినుంచి ఆమెకు ప్రత్యేక వైద్య నిపుణుల బృందం చికిత్స అందిస్తోంది. ఆమెను చూసేందుకు ఎవరినీ అనుమతించడం లేదు. కాగా, ఆమె కోలుకోవాలని తమిళనాడులో అన్నాడీఎంకే కార్యకర్తలు, అభిమానులు ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు. -
ఒదిగి బతకటం తెలిసినవాణ్ణి..!
మనసులో మాట కొమ్మినేని శ్రీనివాసరావుతో మాజీ సీఎం, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య సమైక్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ మరణానంతరం ఏర్పడిన వెలితిని పూరించడానికే తనను ఉన్నపళాన ముఖ్యమంత్రిని చేశారని మాజీ సీఎం, మాజీ గవర్నరు కొణిజేటి రోశయ్య పేర్కొన్నారు. తెలంగాణను కేసీఆర్ తెచ్చాడనేకంటే కాంగ్రెస్ గ్రాంటుగా ఇచ్చిందనడమే వాస్తవమన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అరెస్టు, తదనం తర పరిణామాలు పూర్తిగా కాంగ్రెస్ వ్యవహార శైలిలో భాగంగానే జరిగాయన్నారు. రాష్ట్ర విభజన, ఏపీ రాజధాని, ప్రత్యేక హోదా, పోలవరం వంటి సీరియస్ అంశాల్లోనూ ఆచితూచి మాట్లాడటమే కాదు.. రేపటి పరిణామాలపై జోస్యం చెప్పలేనంటున్న కొణి జేటి రోశయ్య ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... మీ రాజకీయ ప్రస్థానం ఏమేరకు సంతృప్తినిచ్చింది? ఒక డిజైన్ పెట్టుకుని, దానిప్రకారం పనిచేసి నేను సాధించుకున్నదేమీ లేదు. పరిస్థితుల ప్రభావంతో రాజకీయాల్లో అడుగుపెట్టాను. కాబట్టే అసంతృప్తి అనేది నాకె ప్పుడూ లేదు. అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగే మనస్తత్వం కానీ, అధికారం కోల్పోయినపుడు విచారవదనంతో కూర్చుని దిగాలుపడటం కానీ లేవు. మీ రాజకీయ కెరీర్లో మీకు బాగా సంతృప్తి ఇచ్చినది ఏది? ఆర్థిక నిర్వహణ నాకు బాగా ఇష్టమైన విషయం. రాష్ట్రం అప్పులపాలైపోయి లోటు బడ్జెట్లో పడిపోయి ఇబ్బందులకు గురికావడం నాకు ఇష్టం ఉండేది కాదు. సాధారణ కుటుంబం నుంచి వచ్చినవాడిని. ఆ నేపథ్యమే నాకు అలవాటైపోయింది. మనవద్ద ఏముంది? ఏ మేరకు ఖర్చుపెట్టవచ్చు? అప్పు అవసరమైతే ఏ మేరకు తీసుకు రావచ్చు? శ్రుతి మించకుండా అప్పు చేయాలి అని ఆలోచించేవాడిని. మీ రాజకీయ జీవితంలో మీకు బాగా సహకరించిందెవరు? విద్యార్థిగా ఉన్నప్పుడు ఎన్జీ రంగా మా నాయకుడు. అప్పట్లో గౌతు లచ్చన్న రైతు నాయకుడు. తర్వాత చెన్నారెడ్డి, ఎన్ జనార్దనరెడ్డి, విజయభాస్కర రెడ్డి అందరూ బాగా సహకరించేవారు. పరిస్థితులకు తగినట్లు నడచుకోవటం రంగాగారివద్ద నేర్చుకున్నా. జగన్‌కి అత్యధిక ఎమ్మెల్యేల మద్దతున్నా, సీఎంగా మీ పేరే ఎందుకు ప్రతిపాదించారు? వైఎస్ అనూహ్యంగా గతించడంతో ఒక వెలితి ఏర్పడింది. అధిష్టానం నుంచి ప్రణబ్ ముఖర్జీ తదితరులు వచ్చి, ఇక్కడి వారి అభిప్రాయం తెలుసుకుని ముఖ్య మంత్రిగా నన్ను బాధ్యత తీసుకోమన్నారు. నాకు షాక్ కలిగింది. ఎన్నడూ నేను సీఎంని అవుతానని కాని, కావాలని కాని కలగన్నవాడిని కాదు. గెస్ట్ హౌస్‌కి వచ్చిన తర్వాత దీనిపై మళ్లీ ఆలోచించండి అని ప్రణబ్‌ను అడిగాను. ‘అధిష్టానంతో మాట్లాడే ఈ నిర్ణయం తీసుకున్నాము. ఆ నిర్ణయాన్ని అమలు చేయాలి’ అన్నారాయన. ఓదార్పు యాత్రలో పాల్గొనవద్దని మీరు చెప్పారట? అలా నేను చెప్పలేదు. జగన్ నాకు శత్రువూ కాదు. మిత్రుడూ కాదు. రాజశేఖరరెడ్డి కుమారుడిగా గౌరవించేవాడిని. ఆ గౌరవం అతడి పట్ల ఆ రోజూ ఉంది. ఈ రోజూ ఉంది. ఎప్పుడూ ఉంటుంది. తర్వాత కాంగ్రెస్‌ని వదిలి సొంత పార్టీ పెట్టుకున్నాడు. సొంత పార్టీతో ఈ రాష్ట్రంలో అధికారానికి రావచ్చనుకున్నాడు. గట్టి గానే ప్రయత్నం చేశాడు. వైఎస్సార్, జగన్ మధ్య తేడా ఏమిటి? రాజశేఖరరెడ్డికి సొంత ఆలోచన ఉన్నా, నలుగు రితో మాట్లాడే తన నిర్ణయం తీసుకునేవాడు. జగన్‌తో నేను కలిసి పనిచేయలేదు కాబట్టి ఎలా చెప్పగలను? ప్రత్యేక తెలంగాణ సమస్య మీ హయాంలోనే బలపడింది కదా? రాష్ట్ర విభజనను ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ నేనెప్పుడూ ప్రోత్సహించలేదు. ఆ రోజుల్లోని పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సమైక్యవాదిగా ఎలా వ్యవహరించాలో అలాగే వ్యవహరించాను. సడెన్‌గా ఈ నిర్ణయం తీసుకోవడం సరికాదని హైకమాండ్‌కు చెప్పాం. అధిష్టానం నిర్ణయానికి యస్ అని తలూపలేకపోయాం. తెలంగాణను తెచ్చిన క్రెడిటా, లేక ఇచ్చిన క్రెడిటా.. ఏది కరెక్ట్? డిమాండ్ చేసింది కేసీఆర్. గ్రాంట్ చేసింది హైకమాండ్. ప్రయోజనం లేకపోయి ఉండవచ్చు కానీ, తెలంగాణను ఇచ్చింది మాత్రం అధిష్టానమే. వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని అంటున్నారు? పరిణామాలను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుని అధిష్టానం వ్యవహరించింది. జగన్ కాంగ్రెస్‌వాదిగా ఉండి, కాంగ్రెస్‌లోనే కొనసాగితే మంచిదనే భావన నాలో ఆనాడూ, ఈనాడూ ఉంది. కానీ ఆయన వేరే పార్టీ పెట్టుకుని నడుపుకుంటున్నాడు, కాంగ్రెస్‌లోనే కొనసాగితే మంచి భవిష్యత్తు ఉండేదని చెప్పగలను. ఓటుకు కోట్లు కేసుపై మీరేమనుకుంటున్నారు? నిన్నటివరకు గవర్నరుగా ఉంటూ.. రాజకీయాలకు దూరంగా, అన్ని పార్టీలకూ సమానమైన రీతిలో ఉన్నాను. అప్పుడే నేను లైన్ గీసుకుని మాట్లాడటం భావ్యం కాదు. చంద్రబాబు పాలనపై చాలా విమర్శలు వస్తున్నాయి.. మీ అభిప్రాయం? నాకు కొంచెం సమయం ఇవ్వండి. చూద్దాం ఏమవుతుందో.. సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్‌లు.. తమ పాత్ర సజావుగా పోషిస్తున్నారా? ఎవరి పాత్ర వారు నిర్వహిస్తున్నారు. కానీ నేను తీర్పు చెప్పలేను. ప్రత్యేక హోదా అవసరమని మీరు నమ్ముతున్నారా? దాంట్లోని చిక్కులు ఏమిటో కూడా నాకు పూర్తిగా అర్థం కాలేదు. ప్రత్యేక హోదా వద్దని నేను అనడంలే దు. దీనిపై లోతుగా అధ్యయనం చేయవలసి ఉంది. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుపట్ల మీ అంచనా ఏమిటి? సానుకూల పరిస్థితి వస్తే ప్రజలు మళ్లీ ఆదరించవచ్చు. లేకపోతే ప్రతిపక్షంగా ఉండాలి. దానిని కాలమే నిర్ణరుుంచాలి. కాంగ్రెస్ పార్టీ ఆత్మహత్య చేసుకుందా, లేదా ఎవరైనా దాన్ని హత్య చేశారా? పరిస్థితుల ప్రభావంతో గెలుపు, ఓటమి వస్తుంటాయి. అయితే కాంగ్రెస్ పార్టీ మొదటిసారి ఓటమి చెంది ప్రజలకు దూరం కాలేదు. గతంలో ఓడిపోయినా మళ్లీ దూసుకొచ్చింది కూడా. ఏపీలో ప్రజలకు ఆగ్రహం కలిగింది. దూరంగా పెట్టారు. కొంతకాలం తర్వాత వాళ్ల మనసుల్లో ఎలాంటి విశ్లేషణ వస్తుందో వేచి చూడాలి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జగన్ భవిష్యత్తు ఎలా ఉంటుందని అనుకుంటున్నారు? నేను జ్యోతిష్యం చెప్పే శక్తి ఉన్నవాడిని కాదు. కష్టపడుతున్నారు. తిరుగుతున్నారు. పని చేస్తున్నారు. ప్రజలను సమీకరించుకోవడానికి చేతనైనంత మేరకు కృషి చేస్తున్నారు. వారి కృషి ఎంతవరకు ఫలిస్తుంది అనేది రాబోయే రోజుల్లో చూడాలి. దాని కోసం అందరితో పాటు నేను కూడా వేచి చూస్తుంటాను. -
రోశయ్యతో మనసులో మాట
-
వెళ్లొస్తా
తమిళనాడు గవర్నర్‌గా కొణిజేటి రోశయ్య ఐదేళ్ల పదవీ కాలం బుధవారంతో ముగిసింది. ఆ బాధ్యతల్ని అందుకునేందుకు మరో తెలుగు గవర్నర్ సిద్ధమయ్యారు. మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న విద్యాసాగర్ రావుకు తమిళనాడు గవర్నర్ బాధ్యతలు అదనంగా అప్పగిస్తూ రాష్ర్టపతి భవనం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. సాక్షి, చెన్నై : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నేతగా అందరి మన్ననల్ని అందుకున్న కొణిజేటి రోశయ్య, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం అనూహ్యంగా సీఎం పదవిని అధిరోహించారు. అక్కడి కాంగ్రెస్ రాజకీయ పరిస్థితులతో ఉక్కిరిబిక్కిరైన ఆయన 2011 జూన్‌లో పదవికి అధిష్టానం ఆదేశాలతో రాజీనామా చేశారు. తలపండిన నేతను గౌరవించుకునే విధంగా అప్పటి యూపీఏ ప్రభుత్వం రోశయ్యను తమిళనాడు గవర్నర్‌గా ఆగస్టు 26న నియమించింది. ఆయన నియామకంతో ఇక్కడి తెలుగు వారిలో ఆనందం వికసించింది. అదే ఏడాది ఆగస్టు 31న ఆయన బాధ్యతలు స్వీకరించినానంతరం తమిళనాట ఉన్న తెలుగు వారికి రాజ్‌భవన్ ప్రవేశం ఎంతో సులభతరం అయిందని చెప్పవచ్చు. తమిళులకు గౌరవాన్ని ఇస్తూనే, తెలుగువారు పిలిస్తే పలికే గవర్నర్‌గా పేరు గడించారు. తెలుగు వారి కార్యక్రమాలు తన సొంత కార్యక్రమంగా భావించి ముఖ్యఅతిథిగా హాజరవుతూ, తనకు ఉన్న అధికారాల మేరకు ఐదేళ్లుగవర్నర్ పదవికి న్యాయం చేశారు. 2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రోశయ్య పదవికి మాత్రం ఎలాంటి ఢోకా రాలేదు. ఇందుకు కారణం, తమిళనాడు ప్రభుత్వంతో ఆయన సన్నిహితంగా మెలగడమేనని చెప్పవచ్చు. ఈ సన్నిహితమే మళ్లీ ఆయన పదవీ కాలాన్ని పొడిగించే అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం సాగింది. ఇందుకు అద్దం పట్టే పరిణామాలు చోటు చేసుకున్నా, ఆయన పదవీ కాలంలో చివరి రోజైన బుధవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు రాష్ర్టపతి భవన్ నుంచి ఇక సేవలకు సెలవు అన్నట్టుగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇక సెలవు ఐదేళ్ల పాటు రాష్ట్ర గవర్నర్‌గా పనిచేసిన కొణిజేటి రోశయ్య పదవీ కాలం బుధవారంతో ముగిసింది. అయితే, ఆయన స్థానంలో పూర్తిస్థాయి గవర్నర్ నియామకం జరగలేదు. కర్ణాటకకు చెందిన శంకరయ్య, గుజరాత్‌కు చెందిన ఆనందిబెన్ పటేల్ పేర్లు వినిపించినా, చివరకు ఇన్చార్జ్ గవర్నర్ నియమించబడ్డారు. ఇందుకు తగ్గ ఉత్తర్వులు రాష్ట్రపతి భవన్ నుంచి వెలువడ్డాయి. ఇన్చార్జ్గా రాబోతున్న గవర్నర్ కూడా తెలుగు వారు కావడం విశేషం. ఆయనే మహారాష్ట్ర గవర్నర్‌గా వ్యవహరిస్తున్న సీహెచ్ విద్యాసాగర్ రావు. కరీంనగర్లో జన్మించిన ఆయన ఆది నుంచి బీజేపీలో తన సేవల్ని అందిస్తూ వచ్చారు. 1985 నుంచి 1998 వరకు ఎమ్మెల్యేగా, 1999లో ఎంపీగా గెలిచిన విద్యాసాగర్ రావు, కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విద్యాసాగర్ రావు చెన్నైకు వచ్చి ఇన్చార్జ్ గవర్నర్ బాధ్యతల్ని ఒకటి రెండు రోజుల్లో స్వీకరించే అవకాశం ఉంది. ఆయనకు తన బాధ్యతల్ని అప్పగించి రోశయ్య ఆ పదవి నుంచి తప్పుకుంటారు. -
రోశయ్యకు కలిసొచ్చేనా !
సీఎం జయ సిఫార్సుగా ప్రచారం చెన్నై: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందనేది సామెత. ఇందుకు భిన్నంగా కొత్త గవర్నర్‌గా శంకరమూర్తి నియామకం విషయంలో కావేరీ చిక్కులు ప్రస్తుత గవర్నర్ కె.రోశయ్యకు కలిసొచ్చేనా? ప్రస్తుతం రాష్ట్రంలో సాగుతున్న చర్చ ఇదే. ఏమో రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని విశ్లేషకుల వాదన. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కె.రోశయ్య తమిళనాడు గవర్నర్‌గా 2011 ఆగస్టు 31వ తేదీన బాధ్యతలు చేపట్టారు. ఆయన ఐదేళ్ల పదవీకాలం ముగిసేందుకు మరో రెండువారాలు మాత్రమే ఉంది. కేంద్రంలో ప్రభుత్వం మారినపుడు సహజంగా గత ప్రభుత్వం నియమించిన గవర్నర్లను బదిలీ చేయడమో లేక ఇంటికి పంపడమే సహజంగా జరుగుతుంది. రెండేళ్ల క్రితం కేంద్రంలో అధికారం చేపట్టిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా అదేబాటలో పయనించి అనేక రాష్ట్రాల గవర్నర్లను ఎడాపెడా మార్చివేసింది. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం హయాంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆశీస్సులతో నియమితులైన కాంగ్రెస్ కురువృద్ధుడు కె.రోశయ్య పేరు కూడా తెరపైకి వచ్చింది. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో వివాదాలకు అతీతమైన వ్యక్తిగా, ప్రతిపక్ష పార్టీలు సైతం గౌరవించే నేతగా పేరొందిన రోశయ్య తమిళనాడులో సైతం అదే కీర్తిని నిలబెట్టుకున్నారు. ముఖ్యమంత్రి జయలలిత, గవర్నర్ రోశయ్య మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం కొనసాగింది. దీనికి తోడు ప్రధాని మోదీకి, సీఎం జయలలితకు మధ్య పార్టీలకు అతీతంగా నెలకొని ఉన్న సత్ససంబంధాలు రోశయ్యను మరో మూడేళ్లపాటూ కొనసాగేలా చేశాయి. ఈ నెలాఖరుతో పరోక్షంగా సాగిన పొడిగింపు కాలం ముగియబోతోంది. శంకరమూర్తితో సంకటం రాజకీయ పునరావాసం వంటి రాష్ట్ర గవర్నర్ల పోస్టుల కోసం బీజేపీలోని ఎందరో పెద్దలు ఢిల్లీలో క్యూ కట్టుకుని ఉన్నారు. అధికారంలోకి వచ్చి మూడో ఏడు గడుస్తున్న తరుణంలో వారిలో కొందరినైనా సంతృప్తిపరచాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వం పై ఉంది. ఈ తరుణంలో ఖాళీ కాబోతున్న తమిళనాడు గవర్నర్ స్థానంపై బీజేపీ కన్నుపడింది. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకకు చెందిన సీనియర్ ఆర్ఎస్ఎస్ నేత, శాసనమండలి అధ్యక్షుడు శంకరమూర్తి పేరు రాబోయే తమిళనాడు గవర్నర్‌గా ప్రచారంలోకి వచ్చింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆయన పేరును ఖరారు చేసినట్లు అనధికారికంగా వెల్లడైంది. అయితే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య కావేరీ నదీ జలాల సమస్య పచ్చగడ్డి వేయకున్నా భగ్గుమనేలా నెలకొని ఉంది. దశాబ్దాల తరబడి నలుగుతున్న కావేరీ వాటా జలాల సమస్య రానురానూ జఠిలంగా మారుతోంది. ఈ తరుణంలో కర్ణాటకకు చెందిన శంకరమూర్తిని తమిళనాడు గవర్నర్‌గా నియమిస్తే రాష్ట్రం మూడు పోరాటాలు, ఆరు ఆందోళనలుగా మారుతుందోననే భయం కేంద్రంలో నెలకొని ఉన్నట్లు సమాచారం. ఇదే అంశంపై సీఎం జయలలిత సైతం శంకరమూర్తి నియామకాన్ని విబేధిస్తున్నట్లు తెలుస్తోంది. కొరివితో తలగోక్కున్నట్లుగా మారే శంకరమూర్తిని తెచ్చుకునేకంటే ఐదేళ్లుగా అలవాటుపడిన రోశయ్యను కొనసాగించాల్సిందిగా సీఎం జయ కేంద్రాన్ని కోరినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే రోశయ్య పదవీకాలం పొడిగింపు అవకాశమే లేదని రాష్ట్ర బీజేపీ వర్గాలు ఖండిస్తున్నాయి. అలాగే కావేరీ జలాల వివాదం నేపథ్యంలో శంకరమూర్తి నియామకంపై కేంద్రం వెనక్కు తగ్గినట్లు స్పష్టం చేశాయి. ఏదేమైనా పొడిగింపా, కొత్త నియామకమా అనే స్పష్టత కోసం మరో రెండువారాలు ఆగాల్సిందే. -
రాజ్‌భవన్‌లో స్వాతంత్య్ర వేడుకలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: భారతదేశ 70 స్వాతంత్య్ర దినోత్సవ వేడుక లు రాజ్‌భవన్‌లో సోమవారం ఘనంగా సాగాయి. ఈ సందర్భంగా గవర్నర్ కొణిజేటి రోశయ్య వివిధ రంగాల ప్రముఖులను కలుసుకున్నారు. త్రివిధ దళాధిపతులు, అధికార, అనధికార ప్రముఖులు హాజరయ్యారు. అలాగే నగరంలోని తెలుగు ప్రముఖులు సైతం రోశయ్యను కలిసి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. న్యాయమూర్తులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ యూనివర్సిటీల వైస్ చాన్సలర్లు, ఇతర ప్రముఖులు తమకు కేటాయించిన స్థలాల్లో ఆశీనులై ఉండగా ఉదయం 11 గంటల సమయంలో గవర్నర్ రోశయ్య ప్రముఖుల ముందుకు వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామమోహన్‌రావు సైతం గవర్నర్ సరసన ఆశీనులుకాగా ప్రముఖులంతా వరుసగా వచ్చి గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా పలకరించారు. గవర్నర్ సైతం అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ చిరునవ్వుతో పలకరించారు. అనంతరం రాజ్‌భవన్ ప్రాగంణంలోని వేదికపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించిన గవర్నర్ రోశయ్య ప్రదర్శనలు చేసిన కళాకారులను సత్కరించారు. వేడుకలకు హాజరైన ప్రముఖులకు గవర్నర్ విందునిచ్చారు. రాజ్‌భవన్ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి జయలలిత హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. తెలుగు ప్రముఖులు : రాజ్‌భవన్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నగరంలోని తెలుగు ప్రముఖులు హాజరై గవర్నర్ కే రోశయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. ఆస్కా సంయుక్త కార్యదర్శి, ప్రముఖ ఆడిటర్ జేకే రెడ్డి, అస్కా మేనేజింగ్ ట్రస్టీ ‘అజంతా’ శంకరరావు, ట్రస్టీ కార్యదర్శి స్వర్ణలతారెడ్డి, ఆస్కా సీనియర్ సభ్యులు ఎరుకలయ్య, మదనగోపాల్, ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్‌కుమార్ రెడ్డి, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు తంగుటూరి రామకృష్ణ, దక్షిణ భారత వైశ్య సంఘం అధ్యక్షులు ఎంవీ నారాయణ గుప్తా, ద్రవిడ దేశం అధ్యక్షులు కృష్ణారావు, చెన్నైపురి ట్రస్ట్ అధికార ప్రతినిధి పొన్నూరు రంగనాయకులు, ఏఐటీఎఫ్ అధ్యక్షులు డాక్టర్ సీఎంకే రెడ్డి, న్యూటెక్ కనస్ట్రక్షన్స్ అధినేత నాగిరెడ్డి, టామ్స్ వ్యవస్థాపకులు గొల్లపల్లి ఇజ్రాయల్, వైశ్య ప్రముఖులు త్రినాధ్ తదితరులు హాజరైనవారిలో ఉన్నారు. అమ్మ చేతుల మీదుగా అవార్డుల ప్రదానం : వివిధ రంగాల్లో విశేష ప్రజ్ఞ కనబరిచిన, సేవలు అందించిన వారికి ముఖ్యమంత్రి జయలలిత వివిధ ప్రముఖుల పేర్లతో అవార్డులను ప్రదానం చేశారు.స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు వీరందరినీ ఆహ్వానించి అవార్డులను అందజేశారు. చెన్నైలోని కేంద్ర చర్మపరిశోధక సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ షణ్ముగంకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ అవార్డు కింద రూ.5 లక్షల చెక్కు, 8 గ్రాముల బంగారుపతకం, ప్రశంసాపత్రం అందజేశారు. నామక్కల్‌కు చెందిన జయంతికి వ్యోమగామి దివంగత కల్పనాచావ్లా అవార్డు కింద రూ.5 లక్షల చెక్కు, రూ.5వేల విలువైన బంగారు పతకం, ప్రశంసాపత్రం బహూకరించారు. మహామహం ఉత్సవాల ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించినందుకు ప్రశంసగా తంజావూరు జిల్లా అప్పటి కలెక్టర్ సుబ్బయ్యన్, పోలీస్ సూపరింటెండెంట్ మయిల్‌వాహనన్ రూ.2లక్షల చెక్కును అందుకున్నారు. గ్రామీణ పారిశుధ్య బహుమతిగా రూ.2 లక్షల చెక్కును మంత్రి ఎస్పీ వేలుమణి, ఆ శాఖ కార్యదర్శి, డెరైక్టర్ అందుకున్నారు. ఆన్లైన్లో సేవలపై రెవెన్యూ మంత్రి ఉదయకుమార్ అవార్డు అందుకున్నారు. దైవాంగుల సంక్షేమానికి విశేషంగా పాటుపడిన డాక్టర్ రాజా కన్నన్ రూ.10 గ్రాముల బంగారుపతకం, ప్రశంసాపత్రం పొందారు. ఉత్తమ సామాజిక కార్యకర్తగా ఎంపీ మహమ్మద్ రబీక్ అవార్డును పొందారు. ఉత్తమ స్థానిక సంస్థలు : రాష్ట్రంలో పలు స్థానిక సంస్థలు ముఖ్యమంత్రి అ వార్డును అందుకున్నాయి. రూ.25 లక్షల చెక్కు, ప్రశంసాపత్రంతో దిండుగల్లు కార్పొరేషన్ ఉత్తమ అవార్డును అందుకుంది. మునిసిపాలిటీల్లో ప్రథమ బహుమతి పట్టుకోట్టై (రూ.15లక్షలు) రెండో బహుమతి పెరంబలూరుకు (రూ.10లక్షలు), మూడో బహుమతి రామనాధపురంకు (రూ.5లక్షలు) దక్కింది. ఉత్తమ పంచాయితీగా పరమత్తివేలూరు (రూ.10లక్షలు), ద్వితీయ బహుమతి చిన్నసేలం (రూ.5లక్షలు), మూడవ బహుమతి పెరియనాయకన్నపాళయం (రూ.3లక్షలు) అందుకున్నాయి. ఉత్తమ సహకార బ్యాంకు అవార్డును సేలం కేంద్ర స హకార బ్యాంకు సాధించుకుంది. స్వా తంత్య్ర దినోత్సవం సందర్భంగా దైవాగులైన చిన్నారులకు సీఎం జయలలిత మిఠాయిలు పంచిపెట్టారు. అసెంబ్లీ స్పీకర్ ధనపాల్, ఆర్థిక మంత్రి పన్నీర్‌సెల్వం సహపంక్తి భోజనం చేశారు. -
ఈసీకి రోశయ్య కితాబు
సాక్షి, చెన్నై : ప్రజా స్వామ్య వ్యవస్థను పటిష్టం చేయడం లక్ష్యంగా నిబద్దతతో భారత ఎన్నికల కమిషన్ తీసుకుంటున్న చర్యలు అభిన ందనీయమని రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య ప్రశంసించారు. ఆదివారం రాజ్ భవన్లో ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డుల పంపిణీకి రోశయ్య శ్రీకారం చుట్టారు. ఉత్తమ సేవల్ని అందించిన అధికారుల్ని సత్కరించారు. జనవరి నాటికి 18 ఏళ్లు నిండిన వారు తమ పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేసుకునే విధంగా రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ఇందుకు విశేష స్పందన వచ్చింది. కొత్త ఓటర్ల చేరికతో రాష్ట్రంలో గత ఏడాది కంటే, తాజాగా ఓటర్ల సంఖ్య 17 లక్షలు పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 5.62 కోట్ల మంది, చెన్నైలో 38 లక్షల మంది ఓటర్లు ఉన్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. కొత్తగా చేరిన 17 లక్షల ఓటర్లకు గుర్తింపు కార్డుల్ని సిద్ధం చేసిన అధికారులు ఆదివారం నుంచి పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఘనంగా ఓటర్ల దినోత్సవం ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని గుర్తింపు కార్డుల పంపిణీకి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సందీప్ సక్సేనా చర్యలు తీసుకున్నారు. ఆ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం అన్ని జిల్లా కేంద్రాల్లోని ఎన్నికల అధికారుల కార్యాలయాల్లో ఓటర్ల దినోత్సవాలు నిర్వహించారు. ఓటు హక్కు వినియోగం, ఓటుకు నోటు స్వీకరించ వద్దన్న నినాదాలతో అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించారు. చెన్నైలోని రాజ్ భవన్లో జరిగిన వేడుకలో గవర్నర్ రోశయ్య చేతుల మీదుగా కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. అనంతరం అన్ని జిల్లా కేంద్రాల్లో కొత్త ఓటర్లకు గుర్తింపుకార్డుల పంపిణీ ప్రక్రియను చేపట్టారు. ఎన్నికల నిర్వహణలో, అవగాహన కార్యక్రమాలు విస్తృత పరచడంలో విశిష్ట సేవల్ని అందించిన అధికారుల్ని రోశయ్య సత్కరించారు. ఈ వేడుకలో గవర్నర్ రోశయ్య ప్రసంగిస్తూ, గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాలు, గాంధీ జయంతిలను జరుపుకునే రీతిలో ప్రతి ఏటా జనవరి 25న ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకోవడం హర్షణీయమన్నారు. భారత ఎన్నికల కమిషన్ తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు అభినందనీయమని కితాబు ఇచ్చారు. ఓటర్లకు వారి హక్కును తెలియజేయడంతో పాటుగా, ప్రజా స్వామ్య వ్యవస్థను పటిష్టం చేయడమే లక్ష్యంగా తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని కొనియూడారు. పపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్‌లో స్వతంత్రంగా ఎన్నికల కమిషన్ తన నిర్ణయాల్ని అమలు చేస్తూ, పకడ్బందీగా ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేస్తూ, ముందుకు దూసుకెళ్తోందని గుర్తు చేశారు. తాజాగా 17 లక్షల మంది కొత్త ఓటర్లు చేరారని, ఇందులో ఆరు లక్షల మంది యువ ఓటర్లు ఉండడం అభినందనీయమన్నారు. ఓటర్లలో చైతన్యం వస్తోందంటే, అందుకు ఎన్నికల కమిషన్ తీసుకుంటున్న చర్యలే కారణమంటూ కితాబు ఇచ్చారు. ఈ వేడుకలో రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జ్ఞాన దేశికన్, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సందీప్ సక్సేనా, రాష్ట్ర ఎన్నికల అధికారి అయ్యర్, సీనియర్ ఐఏఎస్‌లు రమేష్ చంద్ మీనా, సుందర వల్లి, టీజీ వినయ్ పాల్గొన్నారు. -
రోశయ్యను క్షమాపణ కోరిన హోంమంత్రి
హైదరాబాద్: తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్యను తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి క్షమాపణలు కోరారు. రోశయ్య అల్లుడి విషయంలో చేసిన ఆరోపణలపై ఆయన క్షమాపణ చెప్పారు. మల్లెపల్లి పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)కు చెందిన భూమిని అక్రమంగా రోశయ్య అల్లుడికి కేటాయించారని తాను ఆరోపణలు చేసిన మాట వాస్తవమేనని అంగీకరించారు. ఈ విషయంలో రోశయ్య తనకు ఫోన్ చేశారని చెప్పారు. ఈ అంశంలో రోశయ్య అల్లుడికి సంబంధం లేదని విచారణలో తేలిందని చెప్పారు. గత ప్రభుత్వం కేటాయించిన భూమి వెనక్కు తీసుకుంటామని చెప్పారు. కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన తన అల్లుడికి చెందిన నియోనాటల్ ఇన్టెన్సివ్ కేర్ అండ్ ఎమర్జెన్సీస్(నైస్) ఆస్పత్రికి అప్పనంగా ఎకరా స్థలాన్ని కట్టబెట్టారని నాయిని అంతకుముందు ఆరోపించారు. -
సమానత్వంతోనే సమసమాజం
తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య తిరుపతిలో ‘అంటరానితనానికి అంతిమయాత్ర’ సదస్సు తిరుపతి: అంటరానితనం, అసమానతలు సమూలంగా రూపుమాపి, సమానత్వంతో ముందుకు సాగితేనే సమ సమాజ స్థాపన సాధ్యమవుతుందని, తద్వారా సమాజం అభివృద్ధి చెందుతుందని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య తెలిపారు. ట్రాన్స్ఫామ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తిరుపతి మహతి కళాక్షేత్రంలో ఆదివారం అంటరానితనానికి అంతిమయాత్ర అనే అంశంపై సదస్సు నిర్వహించారు. రోశయ్య గౌరవ అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. గతంలో అంటరానితనం అధికంగా ఉండేదన్నారు. ఎందరో మహనీయులు, సంఘసంస్కర్తలు ఎనలేని కృషి చేయడంతో కొంత తగ్గుముఖం పట్టిందన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సుప్రీం కోర్టు న్యాయమూర్తి జె. చలమేశ్వర్ మాట్లాడుతూ ఐక్యతే అభివృద్ధికి మార్గదర్శకమన్నారు. కలసి భోజనం చేయలేని వారు కలిసి యుద్ధం చేయలేరని నాడు భారతీయుల గురించి అలెగ్జాండర్ అన్న మాట లను ఆయన గుర్తు చేశారు. గౌరవ అతిథిగా హాజరైన ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. చంద్రభాను మాట్లాడుతూ అంటరానితనం ప్రకటనలకే పరిమితం కాకుండా ఆచరణలోకి వచ్చినప్పుడు దీన్ని నిర్మూలించవచ్చన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానంతో భారతదేశానికి పటిష్టమైన రాజ్యాంగాన్ని అందించారన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లో ఆయన చేర్చిన ఆిస్తి పదాన్ని అందరూ వ్యతిరేకించారని తెలిపారు. ఫలితంగా నేడు కౌలు రైతు లు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. మాజీ స్పీకర్ అగరాల ఈశ్వర్‌రెడ్డి, ఆలిండియా బ్రాహ్మణ ఫెడరేషన్ అధ్యక్షుడు పండిట్ భావన్ ఖలాల్ శర్మ, కోట శంకర శర్మ, డాక్టర్ ప్రదీప్ జ్యోతి, తమిళనాడు బ్రాహ్మణ అసోసియేషన్ అధ్యక్షుడు నారాయణన్, మాజీ ఎమ్మెల్సీ, ట్రాన్స్ఫామ్ ఇండి యా ఫౌండేషన్ అధ్యక్షుడు కె.జయచంద్ర నాయుడు అంటరానితనంపై ప్రత్యేకంగా రూపొందించిన సీడీని ప్రొజెక్టర్ ద్వారా ప్రెజెంట్ చేశారు. -
తమిళనాడు గవర్నర్‌గా జశ్వంత్‌సింగ్!
జైపూర్: సీనియర్ నేత జశ్వంత్సింగ్కు గవర్నర్ పదవి కట్టబెట్టే అవకాశాలున్నాయనే వార్తల నేపథ్యంలో.. ఆయన తిరిగి బీజేపీ గూటికి చేరనున్నారనే ఊహాగానాలు మరోమారు పతాక శీర్షికలకెక్కా యి. బీజేపీ బహిష్కృత నేత జశ్వంత్‌ను తమిళనాడు గవర్నర్‌గా నియమించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల సమాచారం. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొణిజేటి రోశయ్య ప్రస్తుతం తమిళనాడు గవర్నర్‌గా ఉన్నారు. దీనిపై వ్యాఖ్యానించేందుకు సింగ్ అందుబాటులో లేనప్పటికీ.. ఆయన సన్నిహితులు మాత్రం తమ నేత బీజేపీలోకి తిరిగివెళ్లేందుకు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఆయనకు బర్మేర్ టికెట్‌ను బీజేపీ నిరాకరించింది. దీంతో అక్క డి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడంతో పార్టీ ఆయనపై బహిష్కరణ వేటు వేసింది. -
పెద్దాయనకు తుది వీడ్కోలు
నాలుగు దశాబ్దాల పాటు కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన రాజ్యసభ సభ్యుడు, మాజీ ముఖ్యమంత్రి, నెల్లూరు పెద్దాయనగా అందరూ పిలుచుకునే నేదురుమల్లి జనార్దన్‌రెడ్డికి శనివారం జిల్లావాసులు అశ్రునయనాలతో వీడ్కోలు పలికారు. పెద్దాయన మృతి జిల్లాకు తీరనిలోటుగా నేతలు పేర్కొన్నారు. జనార్దన్‌రెడ్డి భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి వాకాడుకు తీసుకొచ్చారని తెలియడంతో కడసారి చూసేందుకు జిల్లా నలుమూలల నుంచి అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చి నివాళులర్పించారు. అన్ని పార్టీల నేతలు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో వాకాడుకు చేరుకుని పెద్దాయన అంతిమయాత్రలో పాల్గొన్నారు. అంత్యక్రియలు నిర్వహించిన స్వర్ణముఖితీరం జనసంద్రంగా మారింది. వాకాడు, న్యూస్‌లైన్ : నేదురుమల్లి నివాసానికి శనివారం ఉదయం ఆరు గంటలకు భౌతికకాయాన్ని తీసుకొచ్చారు. అప్పటి నుంచి ప్రజల సందర్శనార్థం ఉంచారు. కడసారి నేదురుమల్లి భౌతికకాయాన్ని చూసేందుకు బారులుదీరారు. అశ్రునయనాలతో నివాళులర్పించారు. సాయంత్రం మూడు గంటల వరకు సందర్శన కోసం ఉంచారు. అనంతరం స్వర్ణముఖి తీరంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన శ్మశాన స్థలానికి వేదపండితుల మంత్రోచ్ఛణల మధ్య భౌతికకాయాన్ని తరలించారు. దారి పొడవునా ఎన్‌జేఆర్ అమర్హ్రే నినాదాలు మా ర్మోగాయి. భౌతికకాయానికి ఉంచిన చితికి నేదురుమల్లి పెద్ద కుమారుడు రాంకుమార్‌రెడ్డి నిప్పు పెట్టారు. ప్రముఖుల నివాళి రాజకీయ రంగంలో ఉద్ధండుడిగా పేరు గాంచిన నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి మరణ వార్త తెలిసిన వెంటనే ప్రముఖులు వాకాడుకు చేరుకుని ఆయనకు కడసారి నివాళులర్పించారు. నేదురుమల్లి కేబినెట్లో ఆర్థికమంత్రిగా పనిచేసి ప్రస్తుతం తమిళనాడు గవర్నర్‌గా ఉన్న కొణిజేటి రోశయ్య, వైఎస్సార్సీపీ నాయకులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మేకపాటి గౌతమ్‌కుమార్‌రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, మేరిగ మురళీధర్, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, వెలగపల్లి వరప్రసాద్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనీల్‌కుమార్‌యాదవ్, పాశం సునీల్‌కుమార్, కిలివేటి సంజీవయ్య, కొమ్మి లక్ష్మయ్యనాయుడు, పసల పెంచలయ్య, అజీజ్, డాక్టర్ చెంతాటి బాలచెన్నయ్య, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, నాయకులు కరణం బలరాం, జెడీ శీలం, బొత్స సత్యనారాయణ, కన్నా లక్ష్మీనారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, చింతా మో హన్, మాగుంట శ్రీనివాసులురెడ్డి, వాకాటి నారాయణరెడ్డి, రెడ్డివారి చెంగారెడ్డి, ఆనం జయకుమార్‌రెడ్డి, చేవూరు దేవకుమార్‌రెడ్డి, చెంచల బాబుయాదవ్, కొడవలూరు ధనుంజ యరెడ్డి, సీవీ శేషారెడ్డి, పనబాక కృష్ణయ్య, సినీనటుడు మోహన్‌బాబు, టీడీపీ నాయకులు బల్లి దుర్గాప్రసాద్‌రావు, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, నెలవల సుబ్రమణ్యం, నన్నపనేని రాజకుమారి, సింహపురి యూనివర్శిటీ వైస్ చాన్సలర్ రాజారామిరెడ్డి తదితరులు కడసారి వీడ్కోలు పలికారు. శోకసంద్రంలో స్వర్ణముఖి తీరం వాకాడు సమీపంలోని స్వర్ణముఖి తీరం శోకసంద్రంలో మునిగింది. నేదురుమల్లి భౌతికకాయాన్ని స్వర్ణముఖిలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన శ్మశాన స్థలికి తీసుకు రావడంతో ఒక్కసారిగా అక్కడకు చేరుకున్నవారంతా కన్నీటి పర్యంతం అయ్యారు. కడసారిగా పెద్దాయనకు వీడ్కోలు పలికారు. -
మాతృభాషను మరువొద్దు
చెన్నై, సాక్షిప్రతినిధి: ఉమ్మడి తమిళనాడు రాష్ట్రంలో తెలుగు వారి సేవలు అనంతమని గవర్నర్ కె.రోశయ్య పేర్కొన్నారు. ఆల్ ఇండియా తెలుగు ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం జరిగిన తెలుగు నాట తెలుగువారి త్రిసంగ మహోత్సవంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన ప్రసంగిస్తూ తిరుమల నాయకర్, వీరపాండ్య కట్ట బ్రహ్మన్ వంటి మహామహులు తెలుగువారా, తమిళులా అనే విచక్షణను పక్కనపెట్టి వారు ఉమ్మడి తమిళనాడు రాష్ట్రానికి అందించిన సేవలు గుర్తు చేసుకోవాలని అన్నారు. తమిళనాడులోని తెలుగువారు మాతృభాషపై అభిమానం పెంచుకోవాలని, ఇతర భాషల పట్ల ద్వేషభావం కూడదని హితవుపలికారు. తెలుగువాడిగా అనేక భాషల్లో ప్రావీణ్యం సంపాదించుకోవడం సమర్థనీయమని, అలాగే మాతృభాషను మాత్రం మరువరాదని అన్నారు. విదేశాల్లో తెలుగు వారి ఐక్యత మెండుగా ఉంటుందని, అటువంటి ఐక్యతను తమిళనాడులో కూడా చూడాలని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. తెలుగువారికి స్థలంపై జయ హామీ: తమిళనాడులో స్థిరబడిన తెలుగువారు ఆంధ్రా భవన్ వంటి నిర్మాణాలకు స్థలం కావాలంటూ తనను కలిశారని తాను సీఎం జయతో మాట్లాడి కేటాయించిన స్థలం అనుకూలంగా లేకపోవడంతో పెండింగ్ పడిందని గవర్నర్ అన్నారు. స్థలం కోసం తెలుగు సంఘాల వారు అప్పుడప్పుడు అడిగి వదిలేస్తున్నారని చురకవేశారు. తప్పనిసరిగా స్థల కేటాయింపులో చొరవచూపుతానని జయ హామీ ఇచ్చినట్లు గవర్నర్ తెలిపారు. త్రిసంగ మహోత్సవం పేరిట జరిగిన ఈ కార్యక్రమం నిజంగా ఒక పర్వదినం వంటిదన్నారు. ప్రతిభతోనే గౌరవం సుప్రీంకోర్టు జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మాట్లాడుతూ మనిషికి గౌరవం ప్రతిభ, సామర్థ్యం వల్లనే వస్తుందని అన్నారు. ఐకమత్యం వల్లనే గుర్తింపు కూడా లభిస్తుందని తెలుగువారికి సూచించారు. తమిళనాడులో నాలుగేళ్లపాటు తాను చదువుకున్నందున తమిళ భాషపై గౌరవం, తెలుగు భాషపై ప్రేమ ఉందని చెప్పారు. తెలుగు వారు అనేక కారణాలతో విడిపోవడం నేర్చుకున్నారే గానీ, కలిసి ఉండడం తెలుసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు తమిళుల మధ్య ఆరోగ్యకరమైన సంబంధం ఉన్నదని, అయితే రాజకీయ విన్యాసాల వల్ల కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తాయని వ్యాఖ్యానించారు. సినీ నేపథ్య గాయకులు ఎస్.పి.బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ తమిళనాడులో ఉంటున్న తెలుగువారు తెలుగు మాట్లాడేందుకు సిగ్గుపడరాదని కోరారు. ఇళ్లలో తెలుగు మాట్లాడండి, తెలుగు వాడని చెప్పుకునేందుకు గర్వించండని అన్నారు. జనాభా సేకరణకు వచ్చే ప్రభుత్వ సిబ్బందికి తాము తెలుగు వారమని స్పష్టంగా నమోదు చేసుకోవాలని కోరారు. మహోత్సవం చైర్మన్ డాక్టర్ సి.ఎం.కె.రెడ్డి మాట్లాడుతూ దేశం మొత్తం మీద లింగ్విస్టిక్ మైనారిటీలు తమిళనాడులోనే ఎక్కువని, అందులోనూ తెలుగు వారు 25 శాతంగా ప్రథమ స్థానంలో నిలిచారని పేర్కొన్నారు. అనాదిగా తమిళనాడులో స్థిరపడిన వారిని మైనారిటీలు అని సంబోధించరాదని గతంలో జస్టిస్ పటాస్కర్ చెప్పారని, అయితే ఇది కార్యాచరణకు నోచుకోలేదన్నారు. తమిళనాడులోని వ్యవసాయ వర్శిటీకి తెలుగువాడైన జీడీ నాయుడు పేరును పెట్టి తొలగించారని, ఇందుకు తెలుగువారి అనైక్యతే కారణమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధులు, సీనియర్ సిటిజన్లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి, నటి శారద, నల్లి కుప్పుస్వామి శెట్టి, జయ గ్రూప్ ఛైర్మన్ ఎ.కనకరాజ్, మహోత్సవం ప్రధాన కార్యదర్శి ఎం.ఎన్.మనోహరన్, కోశాధికారి రంగరాజన్, సంయుక్త కోశాధికారి ఆర్.నందగోపాల్, టామ్స్ అధినేత గొల్లపల్లి ఇజ్రాయిల్, సినీ నటి కుట్టి పద్మిని తదితరులు పాల్గొన్నారు. సభకు ముందు సినీ నేపథ్యగాయకులు, సంగీత దర్శకులు జి.ఆనంద్ వారి స్వరమాధురి లైట్ మ్యూజిక్ కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది. ఇందులో డాక్టర్ ఎస్.పి.బాలసుబ్రమణ్యం, మనో, బి.వసంత, సిలోన్ మనోహర్, ఎస్.పి.శైలజ తదితరులు పాటలను ఆలపించి ప్రేక్షకులను అలరించారు. సభ విజయవంతం తెలుగువారి ఖ్యాతిని ఎలుగెత్తి చాటే రీతిలో సాగిన మహోత్సవం విజయవంతమైంది. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా తెలుగువారు తరలివచ్చారు. వాహనాలు, రైళ్లలోను తరలివచ్చిన తెలుగు కెరటాల నడుమ నెహ్రూ స్టేడియం కిక్కిరిసింది. ఆ పరిసర మార్గాలు తెలుగు వెలుగుతో వికసించాయి. -
సమరానికి సై
సాక్షి, చెన్నై:సెయింట్ జార్ట్ కోటలోని అసెంబ్లీ ఆవరణలో గురువారం మధ్యాహ్నం 12 గంటలకు సమావేశం ప్రారంభం కానున్నది. స్పీకర్ ధనపాల్ నేతృత్వంలో జరగనున్న తొలిరోజు సమావేశంలో రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య ప్రసంగించనున్నారు. ఇందులో ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ సరికొత్త పథకాల్ని ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న సమావేశం కావడంతో రాష్ర్ట గవర్నర్ ద్వారా సరికొత్త అంశాల్ని, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రభుత్వం ప్రకటించబోతున్నది. ఈ సమావేశం అనంతరం స్పీకర్ నేతృత్వంలో అసెంబ్లీ వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది. చర్చించాల్సిన అంశాలతో పాటుగా ఎన్ని రోజులు సభ నిర్వహిం చాలో ఇందులో నిర్ణయం తీసుకోనున్నారు. తొలుత గవర్నర్ ప్రసంగానికి కృతజ్ఞతలు, అందులోని అంశాలపై చర్చ జరగనున్నది. వారం రోజుల పాటుగా సభ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. అసెంబ్లీ ఆవరణను సుందరంగా తీర్చిదిద్దడంతోపాటుగా పరిసరాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఢీకి రెడీ: కొత్త సంవత్సరంలో జరగనున్న తొలి సమరంలో ప్రభుత్వంతో ఢీ కొట్టేందుకు ప్రతి పక్షాలూ సిద్ధం అయ్యాయి. వీరి చర్యల్ని తిప్పి కొట్టేందుకు అధికార పక్షం సైతం సన్నద్ధంగా ఉంది. ఇప్పటికే అన్ని విభాగాల అధికారులు, మంత్రులతో సీఎం సమీక్షలు ముగించారు. తమ తమ విభాగాలపై మంత్రులూ పూర్తి అవగాహనతో ఉన్నారు. శాంతి భద్రతల్ని, జాలర్ల చర్చల్లో తీసుకున్న నిర్ణయాలతో పాటుగా మరికొన్ని ప్రజా సమస్యల్ని, ఎంజీయార్ విగ్రహ తొలగింపు వ్యవహారాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకుని అధికార పక్షంతో ప్రతి పక్షాలు ఢీ కొట్టే అవకాశాలు ఉన్నాయి. -
ఘనతంత్రం
వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. రాష్ర్ట వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన గణతంత్ర వేడుకలు అంబరాన్ని తాకాయి. మెరీనా తీరంలో రాష్ట్ర ప్రథమ పౌరుడు కొణిజేటి రోశయ్య జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. ప్రతిభావంతులకు ముఖ్యమంత్రి జయలలిత పతకాలను అందజేశారు. సాక్షి, చెన్నై:65వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో వాడవాడలా ఆదివారం ఉదయం జాతీయ పతాకాలు నింగికెగిశాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, కోర్టులు, విద్యాసంస్థల్లో జెండా పండుగను ఘనంగా జరుపుకున్నారు. జాతీయ పతాకాలు ఆవిష్కరించి పిల్లలకు మిఠాయిలు పంచి పెట్టారు. ఉత్తమ సేవలకు సత్కరించుకున్నారు. ఆయా విద్యాసంస్థల్లో జరి గిన వేడుకల్లో విద్యార్థుల సాంస్కృతికోత్సవాలు అలరించాయి. చెన్నై మెరీనా తీరంలో రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో వేడుకలు కోలాహలంగా జరిగాయి. మహా త్ముడి విగ్రహం వద్ద జరిగిన వేడుకల్ని తిలకించేందుకు ఉదయాన్నే జన సందోహం తరలి వచ్చింది. మువ్వన్నెల పతాకాన్ని చేత బట్టి బారులు తీరిన జన సందోహంతో మెరీనా తీరంలో దేశభక్తి ఉప్పొంగింది. ఆ పరిసరాల్లో వివిధ రంగుల పుష్పాలతో చేసిన అలంకరణలు చూపరులను ఆకర్షించాయి. రెపరెపలు: ఉదయం పోయేస్ గార్డెన్ నుంచి గాంధీజీ విగ్రహం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి జయలలితకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షీలా బాలకృష్ణన్, డీజీపీ రామానుజం ఆహ్వానం పలికారు. అక్కడి నుంచి లైట్ హౌస్ వరకు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన జనసందోహానికి గణతంత్ర శుభాకాంక్షలు తెలుపుతూ జయలలిత అభివాదం చేశారు. అనంతరం అక్కడికి చేరుకున్న రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్యను ఆహ్వానించిన జయలలిత త్రి దళాల అధిపతులను పరిచయం చేశారు. రాష్ట్ర డీజీపీ రామానుజం, శాంతి భద్రతల విభాగం ఏడీజీపీ రాజేంద్రన్, చెన్నై పోలీసు కమిషనర్ జార్జ్ రోశయ్యను జెండా స్థూపం వద్దకు ఆహ్వానించారు. జాతీయ పతాకాన్ని రోశయ్య ఎగుర వే యగా, భారత కోస్ట్‌గార్డ్ హెలికాఫ్టర్‌లో ఆకాశం నుంచి పూల వర్షం కురిపించింది. జాతీయ పతాకానికి రోశయ్య, జయలలితతో పాటుగా మెరీనా తీరంలో గుమికూడిన ప్రతి ఒక్కరూ గౌరవ వందనం సమర్పించారు. ఆ తర్వాత త్రివర్ణ దళాల కవాతు, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, మహిళా కమాండో బలగాలు విన్యాసాలు, అశ్వదళాల మార్చ్ ఫాస్ట్ అలరించాయి.సాంస్కృతిక వేడుక: తమిళనాడు చరిత్రను, సంప్రదాయాన్ని, గ్రామీణ కళల్ని చాటి చెప్పే రీతిలో విద్యార్థినులు ప్రదర్శించిన నృత్య రూపకం ఆకట్టుకుంది. ప్రత్యేకంగా ఈ ఏడాది గుజరాత్, ఒడిశా, పంజాబ్ సంప్రదాయ నృత్య రూపకాలను ప్రదర్శించి అలరించారు. ప్రభుత్వ ప్రగతిని చాటే రీతిలో ఆయా విభాగాల శకటాల ప్రదర్శన ప్రతి ఒక్కరినీ ఆలోచింప చేశాయి. గత ఏడాది కొత్తగా ప్రవేశ పెట్టిన అమ్మ క్యాంటీన్, తోట, పచ్చదనం కూరగాయల దుకాణాల పథకాల ప్రగతిని చాటుతూ ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన, అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతూ రాష్ర్ట పోలీసు యంత్రాంగం తీసుకున్న చర్యలు, ప్రగతి రథ శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పతకాల ప్రదానం: గణతంత్ర వేడుకల్లో సాహస వీరులకు పతకాలను ముఖ్యమంత్రి జయలలిత ప్రదానం చేశారు. ప్రమాదాలు సంభవించినప్పుడు వీరోచితంగా శ్రమించిన వారికి అన్నా పతకాల్ని అందజేశారు. వీరిలో వీ కరుప్పయ్య(దిండుగల్), దిగ్వీశ్వరన్(కోయంబత్తూరు), ఎస్ గోపినాథ్ శివకుమార్ (కన్యాకుమారి), అటవీ శాఖ అధికారులు రహ్మద్ షా, గుణేంద్రన్, బాల్య వివాహాల అడ్డుకట్టలో రాణిస్తున్న కె పెచ్చియమ్మాల్ ఉన్నారు. ఈ పతకం గ్రహీతలకు రూ.లక్ష అందజేశారు. ఇక మత సామరస్య అవార్డును, రూ.25వేలు నగదును కోయంబత్తూరుకు చెందిన ఏఆర్ బషీర్‌కు ఇచ్చారు. సారాను, నకిలీ మద్యాన్ని అరికట్టడంలో విశేష కృషి చేసిన ఎక్సైజ్ శాఖ అధికారులు దేవరాజ్, సురేష్‌కుమార్(ఈరోడ్), మది(చెన్నై), పెరియస్వామి(సేలం)కు గాంధీ అడిగలార్ బిరుదు, రూ.20 వేలు చొప్పున అందజేశారు. గత ఏడాది తొలిసారిగా వరి సాగులో ఆధునికతను ప్రదర్శించిన వారికి వ్యవసాయ శాఖ ప్రత్యేక అవార్డు, రూ.ఐదు లక్షల నగదును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాదికి గాను ఈ అవార్డును ఈరోడ్‌కు చెందిన రైతు పరమేశ్వరన్ దక్కించుకున్నారు. బహుమతులు: రాజ్ భవన్లో తేనీటి విందు జరిగింది. రాష్ట్ర గవర్నర్ రోశయ్య, సీఎం జయలలిత,మంత్రులు, అధికారులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఉత్తమ శకటాలను, సాంస్కృతిక వేడుకలతో ప్రతిభను చాటిన పాఠశాలలు, స్కూళ్లను ప్రకటించారు. రాష్ట్ర పోలీసు శాఖ శకటం తొలి బహుమతిని, సమాచార శాఖ శకటం రెండో బహుమతిని, ఉద్యానవన శాఖ మూడో బహుమతిని సాధించారుు. సాంస్కృతిక ప్రదర్శనలకు గాను పాఠశాల స్థాయిలో తొలి బహుమతి శాంతోమ్‌లోని సెయింట్ రఫెల్స్ బాలికల మహోన్నత పాఠశాల, రెండో బహుమతిని అశోక్ నగర్ ప్రభుత్వ బాలికల మహోన్నత పాఠశాల, మూడోబహుమతిని జీఆర్టీ మహాలక్ష్మి విద్యాలయ మెట్రిక్యులేషన్ స్కూల్ దక్కించుకున్నారుు. కళాశాల స్థాయిలో క్విన్ మెరీస్ కళాశాల తొలి బహుమతి, గురుజీ శాంతి విజయ జైన్ మహిళా కళాశాల రెండో బహుమతిని, ఎతిరాజ్ కళాశాల మూడో బహుమతిని కైవశం చేసుకున్నాయి. బన్రూటికి బిరుదు ప్రదానం : రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో ప్రతి ఏటా తిరువళ్లువర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తమిళ మేధావులు, సమాజ హితాన్ని కాంక్షిస్తూ సేవలు అందిస్తున్న వారికి బిరుదుల్ని ప్రకటిస్తున్నారు. ఈ ఏడాదికి గాను దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి అన్నా బిరుదుకు బన్రూటి రామచంద్రన్ ఎంపికయ్యారు. తిరువళ్లువర్ బిరుదును యూసీ(తైవాన్), ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్ బిరుదును అన్నాడీఎంకే నాయకురాలు సులోచనా సంపత్, అంబేద్కర్ బిరుదును ప్రొఫెసర్ ఎం ప్రకాష్, విద్యా ప్రదాత, మాజీ ముఖ్యమంత్రి కామరాజర్ బిరుదును అయ్యారు వాండయార్, భారతీయార్ బిరుదును ప్రొఫెసర్ కె జ్ఞాన సంబంధన్, భారతీ దాసన్ బిరుదును రాధాచల్లప్పన్, తిరువికా బిరుదును అశోక్ మిత్రన్, ముత్తమిళ్ కావలర్ విశ్వనాథన్ బిరుదును ప్రొఫెసర్ జయ దేవన్‌కు ప్రకటించారు. తిరువళ్లువర్ దినోత్సవం రోజున యూసీకి తిరువళ్లువర్ బిరుదు ప్రదానం చేయడం జరిగింది. మిగిలిన వారికి ఉదయం సచివాలయంలో జరిగిన వేడుకలో సీఎం జయలలిత చేతుల మీదుగా బిరుదులతో పాటుగా సర్టిఫికెట్లు, తలా రూ. లక్ష నగదు, ఒక సవరం బంగారు పతకం అందజేశారు. -
డబ్బు మూటలు కల్గిన వారికే ప్రస్తుత రాజకీయాలు:రోశయ్య
గుంటూరు: డబ్బు తెచ్చేవారే ప్రస్తుత రాజకీయాల్లో ఇమడగలుతారని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య అభిప్రాయపడ్డారు. ప్రస్తుత రాజకీయాలలో మహాత్మాగాంధీ లాంటి వారు కూడా ఇమడలేరని ఆయన తెలిపారు. ఆచార్య ఎన్జీరంగా 114 వ జయంతి సందర్భంగా పొన్నూరు సభకు హాజరైన రోశయ్య నేటి రాజకీయాలను ఉద్దేశించి ప్రసంగించారు. రాజకీయాలు డబ్బు మూటలకే పరిమితం అయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కర్ర, కండబలంతో వచ్చేవారికి రాజకీయ పరిస్థితి లేదన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ లాంటి వారు కూడా నేటి రాజకీయాల్లో మనుగడ సాగించడం కష్టతరమన్నారు. -
రైతు సమస్యలు పరిష్కరించాలి: రోశయ్య
సాక్షి, హైదరాబాద్: రైతుల సమస్యల పరిష్కారానికి ప్రస్తుతం జరుగుతున్న కృషి చాలదని, రాజకీయ నేతలు సహా అందరూ మరింత నిబద్ధతతో కృషి చేయాలని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. ‘రైతునేస్తం’ మాసపత్రిక తొమ్మిదో వార్షికోత్సవం సందర్భంగా గురువారం జూబ్లిహాల్లో ఏర్పాటు చేసిన అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రైతాంగ సమస్యల గురించి తాను చిన్నప్పటి నుంచి వింటున్నానని రోశయ్య అన్నారు. నాబార్ద్ విశ్రాంత అధ్యక్షుడు కోటయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అధికార భాషా సంఘం అధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ఇప్పటికీ మనకు సమగ్రమైన జలవిధానం లేకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి డి.కె.అరుణ మాట్లాడుతూ వచ్చే ఏడాది నుంచి ఉత్తమ వ్యవసాయ విలేకరులకు ప్రభుత్వం తరఫున అవార్డులు అందజేయనున్నట్లు ప్రకటించారు. శాసన మండలి చైర్మన్ చక్రపాణి, కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులు కోదండ రెడ్డి తదితరులు ప్రసంగించారు. ‘రైతునేస్తం’ ఎడిటర్ వై.వెంకటేశ్వరరావు వందన సమర్పణ చేశారు. పలువురు రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, పాత్రికేయులను ఈ సందర్భంగా రోశయ్య సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఎన్జీరంగా వ్యవసాయ యూనివర్సిటీ వీసీ డాక్టర్ అల్లూరి పద్మరాజును ‘జీవిత సాఫల్య’ పురస్కారంతో సత్కరించారు. ‘సాక్షి’ కడప వ్యవసాయ విలేకరి ఎం.ప్రభాకరరెడ్డిని సత్కరించారు. -
చెన్నైలో ముగిసిన వందేళ్ల ఇండియన్ సినిమా వేడుకలు
-
సామాజిక బాధ్యతను సినిమా విస్మరించరాదు
సినిమాలు సామాజిక బాధ్యతను విస్మరించరాదని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉద్బోధించారు. నేడు సంఘంలో ప్రబలుతున్న దురాచారాలను నిర్మూలించే విధంగా సినిమాలు నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో మంగళవారం జరిగిన శతవసంతాల భారతీయ సినిమా ముగింపు వేడుకలకు ప్రణబ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఉద్వేగపూరితమైన ప్రసంగం చేశారు. సినిమా ఒక బలమైన సాధనమని, ఇటువంటి బలమైన ఆయుధాన్ని సమాజ ఉద్ధరణకు వాడాలని ఆయన పిలుపునిచ్చారు. మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలను, కుల ఘర్షణలను తూర్పారబట్టే అంశాలతో ఎందుకు సినిమాలు తీయలేకపోతున్నారని ప్రణబ్ ప్రశ్నించారు. నేటి చలన చిత్రాల్లో అశ్లీల, అసభ్య, హింసాత్మక సన్నివేశాల తీవ్రత ఎక్కువగా ఉంటోందని, వీటికి ప్రాధాన్యత ఇవ్వవద్దని సినీ రంగ ప్రముఖులను అభ్యర్దిస్తున్నానని అన్నారు. 1913లో దాదాసాహేబ్ ఫాల్కే తన తొలి చిత్రం ‘రాజా హరిశ్చంద్ర ’ నిర్మాణంతో భారతీయ సినిమా కోసం కన్న కలల ఫలితమే నేటి వందేళ్ల సినిమా వేడుకని ప్రణబ్ గుర్తు చేశారు. గత వందేళ్ళ కాలవ్యవధిలో భారత చలన చిత్ర రంగం పలు మలుపులు తిరుగుతూ వస్తోందన్నారు. సాంకేతిక పరిజ్ఞానం వల్ల భారతీయ సినిమా బాగా వృద్ధి చెంది దేశంలోనే అత్యంత భారీ పరిశ్రమగా చెలామణి అవుతోందన్నారు. దేశంలో ఎక్కువమంది పనిచేసే పరిశ్రమ కూడా ఇదేనన్నారు. భారత చిత్రాలకు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో స్థానంతో పాటుగా పురస్కార, గౌరవాలు దక్కుతున్నాయన్నారు. మూకీల నుంచి టాకీలకూ.. టాకీల నుంచి డిజిటల్ మాద్యమాల స్థాయికి మన సినిమా ఎదిగిందన్నారు. భారత చలన చిత్ర చరిత్రలో దక్షిణాది సినిమా... భార్య వంటి ప్రముఖ పాత్రను పోషించిందన్నారు. సినిమా రంగానికి జాతీయ అవార్డులు అనేవి టానిక్ వంటివని, మన భావితరాలకు మన సినిమాల ఘనత గుర్తుండాలంటే 1940 -1970 మధ్య వచ్చినటువంటి చిత్ర రాజాలు మళ్ళీ రావాలన్నారు. ఈ దిశగా సినీ రంగం కృషి చేయాలన్నారు. ప్రసంగాల నడుమ గవర్నర్ రోశయ్య శతవసంతాల భారతీయ చలన చిత్ర విశేషాలను తెలిపే సావనీర్ కాపీని ఆవిష్కరించి, తొలి ప్రతిని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అందజేశారు. తమిళనాడు గవర్నర్ రోశయ్య ప్రసంగిస్తూ, ప్రస్తుతం వస్తున్న సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అవుతున్నాయన్నారు. సారంలేని చిత్రాలకన్నా రసజ్ఞులు మెచ్చే సినిమాలు తీయడంలో సినిమారంగం శ్రద్ధ వహించాలన్నారు. సినిమా రంగం ఎందరో రాజకీయ నాయకులను తయారు చేసిందని చెబుతూ ముఖ్యమంత్రి జయ వంక చూశారు. దానికి ఆమె చిరునవ్వు నవ్వారు. తమిళ సినీరంగం ఎందరో ఇతర భాషా వ్యక్తులను అక్కరకు చేర్చుకుని వారిని గొప్ప హీరో - హీరోయిన్లుగా తీర్చిదిద్దిందన్నారు. శతవసంతాల ఈ భారతీయ సినీ పండుగ మరపురాని, మరువలేని పండగ అని రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత వ్యాఖ్యానించారు. భారత సినీరంగం ముఖ్యంగా దక్షిణాది సినీ రంగం బహుముఖ వృద్ధిలో సాగుతోందన్నారు. సినిమా రంగం దేశ ఆర్థిక ప్రగతికి ఒక ప్రధాన ఆదాయ వనరుగా ఉంటోందన్నారు. సినిమాకు అద్యులైన లూమియర్ సోదరులు తాము ఆవిష్కరించిన ఈ విభాగం భవిష్యత్తులో ఇంత ఎత్తుకు ఎదుగుతుందని ఊహించి ఉండరన్నారు. దేశ సమకాలీన సమస్యలకు - ప్రగతికి సినిమా ఒక నిలువుటద్దమన్నారు. దక్షిణాది సినీరంగం ప్రతి పదేళ్ళకు ఒక కొత్త మలుపు తిరుగుతోందన్నారు. మన చిత్రాలు సంస్కృతికి నిధులు వంటివన్నారు. కర్నాటక సమాచార మంత్రి సంతోష్నాగ్, కేరళ ముఖ్యమంత్రి ఒమన్ చాండీ ప్రాంతీయభాషా చిత్రా లను చేస్తున్న సేవలను, ప్రాముఖ్యతను వివరించారు. ఫిలింఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు విజయ్ కెంకా కూడా పాల్గొన్నారు. - తొలి అవార్డు జయలలితకు... ప్రథమంగా జీవిత సాఫల్య పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా నటి హోదాలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అందుకున్నారు. అనంతరం వివిధ బాషలకు చెందిన 43 మంది సినీ ప్రముఖులకు మండలి తరపున ప్రణబ్ మెమెంటోలు బహుకరించారు. అంజలిదేవి, కె.బాలచందర్, కె.విశ్వనాథ్, ఎం.ఎస్ విశ్వనాథన్, వైజయంతిమాల, ఎవిఎం శరవణన్, బాపు, కె.రాఘవేంద్రరావు, పార్వతమ్మ రాజ్‌కుమార్, అమితాబ్ బచ్చన్, మమ్ముట్టి, మోహన్‌లాల్, శ్రీదేవి, రేఖ, భారతి విష్ణువర్ధన్, అంబరీష్, రాజేంద్రసింగ్, బిఎస్ ద్వారకేష్, రవిచంద్రన్, వీరన్న, మాదవన్ నాయర్ (మధు), ఆదూర్ గోపాలకృష్ణన్, చంద్రన్, కుంచరో గోపన్న, కిరణ్, రణధీర్ రాజ్‌కపూర్, రమేష్ సిప్పీ, కమల బందాజ్వ, వినయ్‌కుమార్ చుంబే, జావేద్ అక్తర్, రమేష్ దియా, సీమా దియో, అపర్ణాసేన్, గౌతమ్ ఘోష్, ప్రజందిద్, నరేష్ కనోదియ, ప్రీతి సప్రూ, ఉత్తన్ మహోంచి, మనోజ్ తివారి, జరిసా మాగ్య మొదలగు తమిళం, తెలుగు, కేరళ, కర్నాటక, మరాఠి, బోజ్పూర్, బెంగాలీ భాషలకు చెందిన కళాకారులు ఈ అవార్డులను అందుకున్నారు. - తెలుగుతనం కోల్పోయిన వేదిక సినీ శతవసంతాల ముగింపు రోజు కార్యక్రమంలో అటు ప్రముఖుల లాంజ్లోను, వేదికపైన తెలుగుతనం కొరత కొట్టొచ్చినట్టు కనిపించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి హాజరుకాలేదు. కనీసం ఆయన తరపున ప్రభుత్వ ప్రతినిధిగా కూడా ఎవ్వరూ రాలేదు. నటుడు మాధవన్ ఇచ్చిన ఆడియో విజువల్ దృశ్య రూపకంలో ఎన్టీఆర్ పేరును ప్రస్తావించి ‘దేవదాసు’లో ఏఎన్నార్ నటించిన పాటను వేశారు. - సాక్షి, చెన్నై