అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మాజీ సభ్యుడు కొణిజేటి రోశయ్య మృతిపై సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. విద్యార్ధి నాయకుడు స్ధాయి నుంచి శాసన మండలి సభ్యుడుగానూ, శాసస నభ్యుడుగానూ, మంత్రిగానూ, ఎంపీగానూ, ముఖ్యమంత్రి, చివరకు గవర్నర్‌గానూ కొనసాగిన ఘనత రోశయ్యదన్నారు.
ఆయన ఏ బాధ్యత నిర్వర్తించినా అందరికీ ఆదర్శంగా, అందరూ కొనియాడే మనిషిగానే నిలిచారన్నారు. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐదుగురు ముఖ్యమంత్రుల వద్ద ఆయన పనిచేశారన్నారు. నాన్న వైఎస్సార్ హయాంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారని, వారిద్దరి మధ్య మంచి సంబంధాలు ఉండేవన్నారు. ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉండేవారని, అలాంటి రోశయ్య గారు ఇవాళ మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు సీఎం జగన్.
అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ సభ్యులు వల్లూరి నారాయణమూర్తి, వీవీఎస్‌ఎస్ చౌదరి, కడప ప్రభాకర్ రెడ్డి, మంగమూరి శ్రీధర్ కృష్ణారెడ్డి, గారపాటి సాంబశివరావు , శ్రీమతి టీఎన్ అనసూయమ్మ, పి వేణుగోపాలరెడ్డి, ఎల్లసిరి శ్రీనివాసులరెడ్డి, యడ్లపాటి వెంకటరావు వీరందరి మృతికి కూడా ఈ సభ ద్వారా సీఎం జగన్ సంతాపం తెలియజేశారు. అనంతరం మృతి చెందిన మాజీ సభ్యులకు సంతాప సూచకంగా శాసనసభలో రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం
గవర్నర్ ప్రసంగంపై చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ మేరకు గవర్నర్ ప్రసంగం సందర్భంగా టీడీపీ ప్రవర్తించిన తీరును శ్రీకాంత్‌రెడ్డి ఖండించారు.
Comments
Please login to add a commentAdd a comment