AP Assembly Budget Session 2022
-
సిద్ధం సభ.. ప్రసంగాన్ని ట్వీట్ చేసిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: ‘‘ఈ దుష్టచతుష్టయం పద్మవ్యూహంలో చిక్కుకుపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు.. అర్జునుడు.. పెత్తందారులపై ఈ కురుక్షేత్ర యుద్ధానికి నేను సిద్ధం.. మీరంతా సిద్ధమా...?’’ అంటూ భీమిలి వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2024 ఎన్నికల శంఖం పూరించారు. సిద్ధం సభలో ప్రసంగాన్ని ఆయన ట్వీట్ చేశారు. అబద్ధానికి, నిజానికి.. మోసానికి, విశ్వసనీయతకు మధ్య జరుగుతున్న ఈ కురుక్షేత్ర సంగ్రామంలో ఇక్కడున్నది అభిమన్యుడు కాదు.. అర్జునుడని సీఎం జగన్ స్పష్టం చేశారు. పొత్తులు, జిత్తుల పద్మవ్యూహాలతో చంద్రబాబు నేతృత్వంలోని కౌరవ సైన్యాన్ని ఎదుర్కొనేందుకు ప్రజల ఆశీస్సులు, దేవుడి దయ వంటి కృష్ణుడి ఆశీస్సులతో మీ బిడ్డ జగన్ సిద్ధంగా ఉన్నాడని ప్రకటించారు. 2024 జైత్ర యాత్రకు భీమిలి నుంచే శంఖం పూరిస్తున్నామని చెప్పారు. భీమిలి నియోజకవర్గం తగరపువలస జంక్షన్ వద్ద శనివారం ‘సిద్ధం’ పేరుతో ఏర్పాటు చేసిన ఉత్తరాంధ్ర వైఎస్సార్ కుటుంబ సమావేశానికి సీఎం హాజరయ్యారు. సీఎం జగన్ పూర్తి ప్రసంగం సభలో అభిమాన జనం మధ్య ఏర్పాటు చేసిన ర్యాంపుపై అడుగులు ముందుకు వేస్తూ అభివాదం చేశారు. శంఖం పూరించి.. నగారా మోగించి 2024 ఎన్నికల కురుక్షేత్రానికి సిద్ధమని లక్షలాది మంది శ్రేణుల ఈలలు, కేకలు, నినాదాల మధ్య ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలకు 175 సాధించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. గత 56 నెలలో కాలంలో కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామాన్ని చూసినా మనం చేసిన మంచి కనపడుతుందని తెలిపారు. సచివాలయం, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్ విధానం, నాడు–నేడుతో మారిన పాఠశాలలతో రాష్ట్రమంతటా వైఎస్సార్సీపీ మార్క్, జగన్ మార్క్ కనిపిస్తోందన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు హయాంలో ఆయన మార్క్ పని ఒక్కటీ లేదని దుయ్యబట్టారు. ఈ దుష్టచతుష్టయం పద్మవ్యూహంలో చిక్కుకుపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు.. అర్జునుడు… పెత్తందారులపై ఈ కురుక్షేత్ర యుద్ధానికి నేను సిద్ధం… మీరంతా సిద్ధమా…? #Siddham pic.twitter.com/2TvxPMOO4d — YS Jagan Mohan Reddy (@ysjagan) January 27, 2024 -
AP Budget: రూ.41,436 కోట్లతో వ్యవసాయ, అనుబంధ రంగాల బడ్జెట్
సాక్షి, అమరావతి: రూ.41,436 కోట్ల రూపాయలతో ఏపీ వ్యవసాయ, అనుబంధ రంగాల బడ్జెట్‌ను వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రైతు భరోసా కేంద్రాల వద్ద బ్యాంకింగ్ సదుపాయాలు కల్పిస్తున్నామని కాకాణి అన్నారు. ‘‘రైతుల ఆదాయం పెంచే విధంగా ఆర్భీకే సేవలు అందిస్తున్నాయి. రైతులకు కావాల్సిన అన్ని సేవలను గ్రామస్థాయిలోనే అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. 8,837 ఆర్బీకే భవనాలు వివిధ స్థాయిలో ఉన్నాయి. ఆర్మీకేలను మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తున్నాం యూట్యూబ్ ఛానళ్లు, మాస పత్రికను ప్రారంభించాం’’ అని మంత్రి కాకాణి అన్నారు. ►155 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగింది ►రైతు భరోసా కింద ఇప్పటి వరకు రూ.6940 కోట్లు అందించాం. ►రైతు భరోసా, కిసాన్ యోజన కింద రూ. 7,220 కోట్లు ►రైతులకు యూనివర్శల్ బీమా పథకం కల్పించిన ఏకైక రాష్ట్రం ఏపీ ►ఏపీ సీడ్స్‌కు జాతీయ స్థాయిలో అవార్డులు ►విత్తనాల రాయితీకి రూ.200 కోట్లు ►ఆర్బీకేల ద్వారా రూ.450 కోట్ల విలువైన ఎరువులు సరఫరా ►ఆర్భీకేల్లో 50వేల టన్నుల ఎరువులను నిల్వ చేస్తున్నాం ►వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు చేశాం ►పంటల ప్రణాళిక, వ్యవసాయ అనుబంధ కార్యక్రమాల పర్యవేక్షణ ►మా ప్రభుత్వంలో రైతులు ఎక్కడా కరవు, కాటకాలను ఎదుర్కోలేదు ►వాటర్ గన్స్ అవసరమే రాలేదు. వర్షాలు సమృద్ధిగా కురిశాయి ►రూ.6.01 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు మంజూరు చేశాం ►9 లక్షల మంది కౌలు రైతులకు లబ్ధి చేకూరింది ►వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు చేశాం ►3.50 లక్షల మంది సన్నకారు రైతులకు సబ్సిడీపై స్ప్రేయర్లు ►డ్రోన్ల ద్వారా పురుగుల మందు పిచికారి చేసేలా చర్యలు ►ఆర్భీకేల ద్వారా 10 వేల డ్రోన్లను రైతులకు అందిస్తాం ►చిరుధాన్యాల సమగ్ర సాగు విధానం తీసుకొచ్చాం ►చిరుధాన్యాల సాగు హెక్టార్‌కు రూ.6వేల ప్రోత్సాహకం ►రాష్ట్రంలో పట్టు పరిశ్రమ ప్రగతి పథంలో ఉంది ►ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతులను ఆదుకుంటున్నాం ►రైతు భరోసా కింద ఇప్పటివరకు రూ.6940 కోట్లు ►ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా 1.61 లక్షల మంది రైతులకు లబ్ధి ►మార్కెటింగ్ శాఖ అభివృద్ధికి రూ. 513.74 కోట్లు ►సహకారశాఖకు సంబంధించి రూ. 233.71 కోట్లు ►సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల అభివృద్ధికి రూ.100 కోట్లు ►ఆహార పరిశ్రమల ప్రోత్సహకాలకు రూ.146.41 కోట్లు ►ఫుడ్ ప్రాసెసింగ్ కోసం రూ.286.41 కోట్లు ►ఆచార్య ఎన్జీరంగా వర్శిటీకి రూ.472.57 కోట్లు ►వైఎస్సార్ ఉద్యాన విశ్వ విద్యాలయానికి రూ.102.04 కోట్లు ►ఆంధ్రప్రదేశ్ మత్స్య వర్శిటీకి రూ.27.45 కోట్లు ►వెంకటేశ్వర పశువైద్య వర్శిటీకి రూ.138.50 కోట్లు ►వైఎస్సార్ పశునష్టం పరిహారం కోసం రూ.150 కోట్లు ►పశువుల వ్యాధి నిరోధక టీకాలకు రూ.42.28 కోట్లు -
ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెన్షన్‌కు గురయ్యారు. స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి ఒకరోజు సస్పెండ్ చేశారు. అంతకుముందు స్పీకర్ పోడియం వద్ద టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. సీట్లలో కూర్చోవాలని స్పీకర్ ఆదేశించినా ఆందోళన కొనసాగించారు. దీంతో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్‌ను టీడీపీ సభ్యులు ఏకవచనంతో సంబోధించగా.. టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని శ్రీకాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. టీడీపీ సభ్యులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చదవండి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు: వికేంద్రీకరణపై స్పల్ప కాలిక చర్చ -
విషం చిమ్మబోయి.. వెల్లకిలా పడిపోయి..
అసెంబ్లీ సమావేశాలకు ముందు వరకు సారా, లిక్కర్, లిక్కర్ బ్రాండ్లు, డిస్టిలరీలపై ప్రతిపక్ష నేత చంద్రబాబు, టీడీపీ నేతలు, ఎల్లో మీడియా చేసిన తప్పుడు ప్రచారం అంతా ఇంతా కాదు. పోలవరం ప్రాజెక్టు, సంక్షేమాభివృద్ధి పథకాలపైనా విషం చిమ్మారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఆయా అంశాలపై జరిగే చర్చలో పాల్గొంటే తమ బండారం బట్టబయలవుతుందని ప్రతిపక్ష టీడీపీ భయపడింది. రోజూ ఏదో ఒక రీతిలో గందరగోళం సృష్టించి, తమపై సస్పెన్షన్ వేటు పడేలా వ్యూహం రచించుకుని అమలు చేసింది. మొత్తంగా టీడీపీ పలాయనవాదాన్ని, అధికార పక్షం చిత్తశుద్ధిని రాష్ట్ర ప్రజలు నిశితంగా గమనించారు. సాక్షి, అమరావతి: లేనిది ఉన్నట్లు.. ఉన్నది లేనట్లు చిత్రీకరించి, వక్రీకరించి ప్రభుత్వంపై బురదజల్లుతూ ప్రతిపక్ష టీడీపీ, ఎల్లో మీడియా సాగిస్తున్న దుష్ప్రచారాలను శాసనసభ వేదికగా సాక్ష్యాధారాలతో తిప్పికొట్టడంలో అధికార పక్షం విజయం సాధించింది. మద్యం బ్రాండ్ల నుంచి పోలవరం ప్రాజెక్టు ఎత్తు వరకూ ప్రతిపక్ష నేత చంద్రబాబు చేస్తున్న అసత్య ఆరోపణలే నిజమని ప్రజలను నమ్మించేలా ఎల్లో మీడియా కథనాలను వండివార్చుతుండటాన్ని ఆధారాలతో ఎండగట్టింది. కరోనా మహమ్మారి విరుచుకుపడటంతో 2020, 2021లో బడ్జెట్ సమావేశాలను పూర్తి స్థాయిలో నిర్వహించలేకపోయిన ప్రభుత్వం.. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో 12 రోజులపాటు పూర్తి స్థాయిలో సమావేశాలను నిర్వహించింది. ఈ సమావేశంలో నిర్మాణాత్మకంగా వ్యవహరించడంలో ప్రతిపక్షం విఫలమైంది. జంగారెడ్డిగూడెంలో సాధారణ మరణాలను నాటు సారా మరణాలుగా చిత్రీకరిస్తూ.. వాటిపై చర్చకు పట్టుబడుతూ.. మద్యం బ్రాండ్లపై అవాస్తవాలు వల్లిస్తూ.. ఈలలు వేస్తూ.. తాళాలతో భజన చేస్తూ.. తాళిబొట్లను ప్రదర్శిస్తూ సభా సంప్రదాయాలకు విరుద్ధంగా దిగజారి వ్యవహరించి ఉభయ సభల్లోనూ ఘోరంగా పరువు పోగొట్టుకుంది. ప్రతిపక్షం అజెండాపై చర్చకు సిద్ధమన్నా.. బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించడం ఆనవాయితి. ప్రసంగ ప్రతుల్లో ఏముందో కూడా తెలుసుకోక ముందే... వాటిని చింపి, గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్పై విసిరేస్తూ ప్రతిపక్ష సభ్యులు దాడికి పాల్పడ్డ తీరును రాజకీయ పరిశీలకులు తప్పు పడుతున్నారు. వ్యవస్థలపై ప్రతిపక్ష టీడీపీకి ఏమాత్రం గౌరవం లేదన్నది మరోసారి బహిర్గతమైందని వారు ఎత్తిచూపుతున్నారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత జరిగిన బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సమావేశంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్షం వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబట్టారు. గవర్నర్ వ్యవస్థను కించపరిచేలా వ్యవహరించడం సరి కాదని హితవు పలికారు. అధికారపక్షం ప్రతిపాదించిన అజెండా కాకుండా, 25 అంశాలతో ప్రతిపక్షం ప్రతిపాదించిన అజెండాపై చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. సమావేశాలు హుందాగా, సజావుగా జరిగేందుకు సహకరించాలని సూచించారు. కానీ ప్రతిపక్షం తన వంకర బుద్ధిని మార్చుకోలేదు. చంద్రబాబు సైంధవ పాత్ర గత సమావేశాల్లో తన కుటుంబ సభ్యులను ఎవరూ ఏమీ అనకున్నా, దుర్భాషలాడినట్లు చిత్రీకరించి.. సీఎంగానే సభలో అడుగుపెడతానంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రతిజ్ఞ చేశారు. ఇందులో భాగంగా ఆ పార్టీ సభ్యులను మాత్రమే ఉభయ సభలకు పంపారు. జంగారెడ్డిగూడెంలో సాధారణ మరణాలను నాటుసారా మరణాలుగా చిత్రీకరించి.. వక్రీకరించి.. సభల్లో గందరగోళం సృష్టించి.. సస్పెండై బయటకు రావాలని ప్రతిపక్ష సభ్యులకు దిశానిర్దేశం చేసి మరీ సభకు పంపారు. దాన్నే ఎల్లో మీడియా ప్రాధాన్యతతో ప్రచురించేలా చేసి.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలపై చర్చను ప్రజల్లోకి వెళ్లకుండా చేయాలన్నది చంద్రబాబు ఉద్దేశం. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించిన బడ్జెట్ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేయడం ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వం నవశకానికి నాంది పలికింది. సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో దేశంలోనే రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. 2020, 2021లో దేశంలో సుపరి పాలనలో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ అని స్కోచ్ సంస్థ ప్రకటించడం ఇందుకు తార్కాణం. కరోనా ప్రభావం వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గినా, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసిన ప్రభుత్వం, నగదు బదిలీ ద్వారా నేరుగా రూ.1.32 లక్షల కోట్లు పేదల ఖాతాల్లో జమ చేయడంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడటానికి సంక్షేమ పథకాలు దోహదం చేస్తున్నాయని సామాజిక వేత్తలు ప్రశంసిస్తుండటాన్ని సభలో అధికారపక్షం ప్రస్తావించింది. ఎన్నికల మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాలకు ప్రాధాన్యత ఇస్తూ.. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ రూ.2.56 లక్షల కోట్లతో ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్‌పై చర్చించి.. ప్రజాభ్యుదయానికి దోహద పడాలన్న చిత్తశుద్ధి ప్రతిపక్షానికి వీసమెత్తు కూడా లేదని స్పష్టమైందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చట్టాలు చేసే అధికారం చట్టసభలదే రాజధాని వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు చట్టసభల అస్థిత్వాన్ని దెబ్బతీసేదిగా ఉందని, ఏ వ్యవస్థ అధికారాలు ఏమిటో సభలో చర్చించాలని సీనియర్ శాసనసభ్యుడు ధర్మాన ప్రసాదరావు సీఎం జగన్‌కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో పరిపాలన వికేంద్రీకరణపై సభలో చర్చ చేపట్టారు. చట్టాలు చేసే అధికారం, బాధ్యత చట్ట సభలకే ఉందని అధికార పక్షం స్పష్టం చేసింది. హైకోర్టుపై తమకు అపార గౌరవం ఉందని, అదే సమయంలో చట్టసభల గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతా తమపై ఉందని తేల్చి చెప్పింది. పరిపాలన వికేంద్రీకరణతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని సీఎం జగన్ పునరుద్ఘాటించడం ద్వారా ప్రభుత్వ విధానంపై అన్ని వర్గాలకూ స్పష్టత ఇచ్చారు. అవన్నీ చంద్రబాబు బ్రాండ్లే.. ► రాష్ట్రంలో లభిస్తున్న మద్యం బ్రాండ్లన్నీ జె బ్రాండ్ అంటూ కొద్ది రోజులుగా చంద్రబాబు, టీడీపీ నేతలతో పాటు ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. జంగారెడ్డిగూడెంలో విచిత్రమైన పేర్లున్న బ్రాండ్ల లిక్కర్ తాగి ప్రజలు మరణిస్తున్నారని పేర్కొంటోంది. ► వాస్తవానికి ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్స్ రిజర్వ్ వంటి విచిత్రమైన పేర్లతో ఉన్న బ్రాండ్లకు, డిస్టిలరీలకు 2014 నుంచి 2019 మధ్య అనుమతి ఇచ్చింది అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కారేనని సాక్ష్యాధారాలతో సహా వివరిస్తూ శాసనసభలో సీఎం జగన్.. ప్రతిపక్షం చేస్తున్న దు్రçష్పచారాన్ని తిప్పికొట్టారు. ► అత్యధికంగా ఆ బ్రాండ్లన్నీ తయారవుతున్నది టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుడు, ఆదికేశవులు నాయుడు, యనమల రామకృష్ణుడు వియ్యంకుడు, ఎస్పీవై రెడ్డిలకు అనుమతి ఇచ్చిన డిస్టిలరీల్లోనేనని తేల్చి చెప్పారు. అవన్నీ చంద్రబాబు బ్రాండ్లేనని అభివర్ణించారు. ► రాష్ట్రంలో నాటుసారా ఈనాటిది కాదని, చంద్రబాబు హయాంలో లేనట్లుగా మాట్లాడుతున్నారని.. కేసులు సహా వివరించారు. ఇప్పుడు దాన్ని నిర్మూలించడానికి ప్రత్యేకంగా ఎస్ఈబీ (స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో) ఏర్పాటు చేశామని చెప్పారు. అందువల్లే పెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యాయన్నారు. ► చంద్రబాబు, ఎల్లో మీడియా.. నాటు సారా మరణాలుగా చిత్రీకరించినవన్నీ సహజ మరణాలేనని సాక్ష్యాధారాలు, వీడియోల ద్వారా స్పష్టం చేశారు. ఎత్తు తగ్గేది పోలవరం కాదు.. చంద్రబాబే పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించే ఆలోచనే లేదని గతంలోనే సీఎం వైఎస్ జగన్, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌లు శాసనసభ, పార్లమెంట్ వేదికగా స్పష్టం చేశారు. అయినా ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఎల్లో మీడియా పోలవరం ఎత్తును తగ్గిస్తున్నారని.. దాంతో ఆ ప్రాజెక్టు ఉత్త బ్యారేజీగానే మిగిలిపోతుందని దుష్ప్రచారం చేస్తున్నారు. దీన్ని సాక్ష్యాధారాలతో సహా సీఎం జగన్ తిప్పికొట్టారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో కమీషన్ల కక్కుర్తితో పోలవరాన్ని అస్తవ్యస్తంగా మార్చితే.. 2019 మే 30న ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఈ మూడేళ్లలో ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తున్న తీరును సభలో ఫొటోలు, వీడియోలు ప్రదర్శిస్తూ వివరించారు. పోలవరం ఎత్తు అంగుళం కూడా తగ్గదని.. ఎత్తు తగ్గేది చంద్రబాబేనని.. 2024 ఎన్నికల్లో కుప్పంలో కూడా ఓడిపోయి మరుగుజ్జు అవుతారని సీఎం వైఎస్ జగన్ తేల్చి చెప్పారు. 2023 ఖరీప్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి.. ఫలాలను రైతులకు అందిస్తామని స్పష్టం చేశారు. ఈ చర్చలో పాల్గొంటే తాము చేస్తున్నది దుష్ప్రచారమేనన్నది తేలిపోతుందని భావించిన ప్రతిపక్ష సభ్యులు చంద్రబాబు స్క్రిప్ట్ మేరకు సభలో గందరగోళం సృష్టించి, సస్పెన్షన్ వేటు పడేలా చేసుకున్నారు. పెగసస్‌పై సభా సంఘంతో విచారణ టీడీపీ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష సభ్యులు, సినీ ప్రముఖులు, వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసేందుకు, డేటా చోరీ చేసేందుకు ఇజ్రాయెల్ నుంచి పెగసస్ స్పైవేర్‌ను చంద్రబాబు కొనుగోలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. వైఎస్సార్సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే ఆరోపణలు చేసింది. న్యాయస్థానంలో కేసులు కూడా వేసింది. అధికారంలోకి వచ్చాక ఈ వ్యవహారంపై విచారణ చేసి.. ప్రాథమిక ఆధారాలు లభ్యమవడంతో సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసింది. పెగసస్ స్పైవేర్‌ను చంద్రబాబు సర్కార్ కొనుగోలు చేసిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఆ రాష్ట్ర అసెంబ్లీలో అధికారికంగా చెప్పడంతో తీవ్ర దుమారం రేగింది. ఈ వ్యవహారంలో ఏబీ వెంకటేశ్వరరావును అడ్డుపెట్టుకుని చంద్రబాబు.. 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, పార్టీ మారేలా చేసిన దమనకాండను సభ వేదికగా ప్రజలకు అధికారపక్షం వివరించింది. ఈ వ్యవహారంపై నిజాలను నిగ్గు తేల్చేందుకు ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అధ్యక్షతన సభా సంఘాన్ని నియమించింది. -
ఈలపాట... సీసపద్యం!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఇంకో రెండు మూడు రోజులు కొనసాగివుంటే బాగుండేది. ముఖ్యమైన బిల్లులేవో మిగిలిపోయాయని కాదు... తెలుగుదేశం పార్టీ క్రియేటివ్స్ను ఇంకొన్ని చూసి ఉండేవాళ్లం కదా అని! కాగితాలు చించి, స్పీకర్ తల మీద అక్షతల్లా చల్లే కళారూపాన్ని ఒకరోజు ప్రదర్శించారు. ఒకరోజు ఈలలు వేశారు. అందుకోసం కొందరు సభ్యులు విజిల్స్ కొనుక్కుని సభకు వచ్చారు. ఒకరోజు చిడతలు వాయిం చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ‘చిడతల బాబాయణాన్ని’ ప్రదర్శించడానికి ఒక ప్రత్యేక బృందం ఉండేది. ‘జయము జయము చంద్రన్న... జయము నీకు చంద్రన్న’ అనే మకుటంతో ఈ బాబాయణ భజన సాగేది. పోల వరంపై ప్రకటన చేసినప్పుడు ముఖ్యమంత్రి ఈ పాత విజు వల్‌ను సభకు చూపెట్టారు కూడా! సభ్యుల దగ్గర చిడతలు ఎటూ ఉన్నాయి కనుక ఇంకో రోజు ఆగివుంటే సభలో లైవ్‌గానే చిడతల బాబాయణాన్ని చూసే అవకాశం దక్కేదేమో! స్పీకర్ చెప్పిన లెక్క ప్రకారం 12 రోజులు సమావేశాలు జరిగాయి. 2 లక్షల 56 వేల కోట్ల రూపాయలతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రభుత్వ ప్రాధాన్యాల మీద తొలిరోజు గవర్నర్ ప్రసంగించారు. ఈ రెండింటి మీద చర్చ జరిగింది. 11 బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించారు. గత ప్రభుత్వం పౌరుల గోప్యతను ప్రమాదంలోకి నెట్టి, పెగసస్ అనే స్పైవేర్‌ను వాడిందనే ఆరోపణలపై చర్చ జరిగింది. ఒక సభా సంఘాన్ని వేశారు. ద్రవ్య వినిమయ బిల్లుపై మాట్లాడే సందర్భంగా ముఖ్య మంత్రి వచ్చే ఏడాదికి సంబంధించిన వెల్ఫేర్ క్యాలెండర్‌ను విడుదల చేశారు. ఇది ప్రజలకు వెల్ఫేర్, ప్రతిపక్షానికి ఫేర్వెల్ అని కూడా ముఖ్యమంత్రి కామెంట్ చేశారు. ‘వెల్ఫేర్’ అనే మాటను తిరగేస్తే ‘ఫేర్వెల్’ అనే మాట వస్తుంది. ప్రభుత్వ వెల్ఫేర్ ఎజెండాను వ్యతిరేకిస్తే, ప్రతిపక్షానికి ఫేర్వెల్ తప్పదనే అర్థంలో ముఖ్యమంత్రి కామెంట్ చేసి ఉంటారు. మొత్తం పన్నెండు రోజుల్లో 103 మంది సభ్యులు చర్చల్లో పాల్గొన్నారు. కానీ, తెలుగుదేశం సభ్యులెవరూ కూడా ఈ చర్చల్లో పాల్గొనలేదు. ‘సీసా’ పద్యమే ఏకైక ఎజెండాగా సభలో టీడీపీ వ్యవహారాల్ని నడిపింది. నాటుసారా తాగడం వల్ల జంగారెడ్డి గూడెంలో కొంతమంది చనిపోయారని ఎల్లో మీడియా – తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా చేసిన ప్రచారాన్నే టీడీపీ ఎమ్మెల్యేలు సభలోకి మోసుకొని వచ్చారు. దానిపై న్యాయ విచారణ జరగాలని డిమాండ్ చేస్తూ ప్రతిరోజూ వాయిదా తీర్మానాన్ని ఇవ్వడం, సభను స్తంభింపజేయడం... ఏకసూత్ర కార్యక్రమంగా పెట్టుకున్నారు. సహజ మరణాలను సారా మరణాలుగా చిత్రీకరిస్తున్నారనీ, అసలు చంద్రబాబు హయాం లోనే మద్యం ఏరులై పారిందనీ అధికార పక్షం ఎదురుదాడి చేసింది. ఈ ఎపిసోడ్‌ను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మద్యం పాలసీకి సంబంధించి వైఎస్ జగన్ ప్రభుత్వ వైఖరిని ముందుగా అవగాహన చేసుకోవాలి. మద్యపాన రహిత సమాజమే తమ పార్టీ విధానమని గతంలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అయితే ఒకే ఉదుటున మద్యనిషేధం అసాధ్యం కనుక, గతంలో జరిగిన అటువంటి ప్రయత్నాలు విఫలమైన అనుభవాలున్న నేప థ్యంలో పార్టీ అధికారంలోకి రాగానే మధ్యేమార్గాన్ని ఎంచు కొన్నది. మద్యపాన ఆసక్తిని నిరుత్సాహపరచడం, అలవాటును క్రమంగా మాన్పించడం అనే కార్యక్రమాన్ని చేపట్టింది. అంతకుముందు వీధివీధినా, వాడవాడనా వెలసిన 44 వేల బెల్టు షాపులను ఎత్తివేసింది. షాపులకు అనుబంధంగా ఓపెన్ బార్లుగా నడుస్తున్న పర్మిట్ రూమ్‌లను రద్దు చేసింది. షాక్ కొట్టే విధంగా ధరలుండాలనీ, దానివల్ల తాగాలన్న కోరికను అదుపులో పెట్టుకుంటారన్న ఉద్దేశంతో రేట్లు పెంచారు. షాపు లను ప్రైవేట్ వ్యక్తులకు కేటాయిస్తే లాభాపేక్ష వలన మళ్లీ బెల్టు షాపులకు తెరతీస్తారన్న ఆలోచనతో ప్రభుత్వం ఆ వ్యాపారాన్ని స్వయంగా చేపట్టింది. షాపుల సంఖ్యను కూడా తగ్గించి, అమ్మే వేళల్ని కూడా కుదించింది. కొంతకాలం తర్వాత ధరలు కొంత తగ్గించాలన్న డిమాండ్ ముందుకు వచ్చింది. అలవాటుకు బానిసలైన వారు తొందరగా మానలేకపోతున్నారనీ, పెరిగిన ధరలను భరించలేక నాటు సరుకుకు అలవాటయ్యే అవకాశ ముందనీ కనుక కొంతమేరకు ధరలు తగ్గించాలనీ ప్రభుత్వానికి అభ్యర్థనలు అందాయి. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా అవుతున్నదని కూడా వార్తలు వచ్చాయి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ధరలకు తగ్గించింది. మద్యం అక్రమ రవాణానూ, నాటుసారా తయారీనీ, గంజాయి అక్రమ రవాణా వగైరాలనూ పూర్తిగా అరికట్టే ఉద్దేశ్యంతో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ)ను ఏర్పాటు చేసింది. ఈ ఏర్పాటు ఇప్పటికే సత్ఫలితాలనిచ్చింది. ఈ మొత్తం వ్యవహారాల్లో దండలో దారంలాగా అంతర్లీనంగా ఒక సంకల్పం మనకు కనబడుతున్నది. సంకల్పాన్ని వాస్తవికతనూ బ్యాలెన్స్ చేసుకుంటున్న ఒక లాజిక్ కనబడుతున్నది. ఇక జంగారెడ్డిగూడెం ఘటన విషయానికి వద్దాము. అక్కడ నాటుసారా తాగి నాలుగైదు రోజుల్లో పదహారు మంది చనిపోయారని ముందుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాతనే ఎల్లో మీడియా హడావిడి చేసింది. ఆ వెంటనే చంద్రబాబు నాయుడు అక్కడ పర్యటించి వచ్చారు. కల్తీ మద్యంతో జనం చనిపోతున్నారని మీడియా సమావేశం పెట్టి ఆరోపించారు. నిజ నిర్ధారణ కోసం వెళ్లిన ఆర్డీవో విచారణ జరిపి, చనిపోయిన వారిలో ముగ్గురికి మాత్రమే మద్యం సేవించే అలవాటున్నదని ప్రకటించారు. మిగిలిన వారు వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతో చని పోయారని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతానికి ముఖద్వారంగా ఉండే ఒక చిన్న పట్టణం జంగారెడ్డి గూడెం. 2011 లెక్కల ప్రకారం ఈ పట్టణం జనాభా 48,494. ఏజెన్సీ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వలసలు పెరగడం వలన ప్రస్తుతం పట్టణ జనాభా 70 వేలు దాటిందని చెబుతున్నారు. ఐక్యరాజ్య సమితి పాపులేషన్ లెక్కల ప్రకారం భారతదేశంలో సగటు మరణాల రేటు ప్రతి వెయ్యి జనాభాకు 7.3. గడచిన ఐదేళ్లుగా దాదాపు ఇదే నిష్పత్తి కొనసాగుతున్నది. ఈ లెక్కను జంగారెడ్డి గూడెం పట్టణానికి వర్తింపజేస్తే సగటున ఏడాదికి సుమారు 500 మరణాలు సంభవించే అవకాశం ఉన్నది. అంటే నెలకు నలభైకి పైగా! గడచిన రెండు మూడు మాసాల లెక్కలు చూస్తే ఎన్నడూ ఈ సంఖ్య దాటలేదు. మరి ఈ ‘సారా మరణాలు’ సాధారణ సంఖ్యను ఎందుకు దాటలేదు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేపట్టిన సారా ఉద్యమాన్ని వెన్నంటే... ఇంకో ప్రచారం సోషల్ మీడియాలో మొదలైంది. మద్యం దుకాణాలు ప్రైవేట్ వ్యాపారుల చేతిలో ఉన్నప్పుడు వారి వ్యాపారం కోసం నాటు సారా సమాచారాన్ని ఎక్సైజ్ వారికి చేరవేసేవారు. ఇప్పుడు ప్రభుత్వ దుకాణాల్లో పనిచేసే వారికి అటువంటి చొరవ లేనందువల్లనే నాటు సారా తయారీ పెరుగు తున్నదని ఈ ప్రచారం సారాంశం. ఇప్పుడు సినిమా అర్థమవు తున్నట్టే కదా? మద్య నియంత్రణ లక్ష్యం నుంచి ప్రభుత్వాన్ని తప్పించేందుకు ప్రతిపక్షం తయారు చేసిన గేమ్ ప్లాన్. కొత్త విధానం వల్ల నష్టపోయిన తమ పార్టీ అనుయాయులైన మద్యం వ్యాపారులను రంగంలోకి దించి నడిపిస్తున్న నాటకం. ఈ ప్రచారం వలన ఒత్తిడి పెరిగి ప్రభుత్వం మద్యం దుకాణాలను మళ్లీ ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలి. వారు పర్మిట్ రూమ్‌లు, బెల్ట్‌షాపులు ఓపెన్ చేయాలి. మద్య నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని చెప్పాలి. తన అనుయాయులు కాసులు దండుకోవాలి. సమావేశాల ముగింపు రోజున వచ్చే ఏడాది కాలానికి గానూ సంక్షేమ కార్యక్రమాల క్యాలెండర్‌ను ముఖ్యమంత్రి విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా మరోసారి ద్రవ్యోల్బణం ఛాయలు ముసురుకుంటున్నట్టు కనిపిస్తున్న పరిస్థితుల్లో ఈ సంక్షేమ క్యాలెండర్‌కు ప్రాధాన్యం ఉన్నది. గడచిన రెండేళ్లపాటు కోవిడ్ విసిరిన సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించిన ఉపాయం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన నగదు బదిలీ (డిబిటీ) కార్యక్రమం. దాదాపు లక్షా ముప్ఫయ్‌వేల కోట్ల రూపా యల నగదును వివిధ స్కీముల కింద వైఎస్ జగన్ ప్రభుత్వం జనం చేతిలో పెట్టింది. చిల్లర శ్రీ మహాలక్ష్మి అంటారు పెద్దలు. కోటి కుటుంబాల తలుపుతట్టిన శ్రీమహాలక్ష్మి గ్రామీణ సంతల దగ్గర్నుంచి పట్టణ మార్కెట్ల వరకు గతిశీలతతో నిలబడేలా దీవించింది. సంక్షోభంలో కూరుకుపోకుండా కాపాడింది. అంతటి ప్రాధాన్యం కలిగిన సంక్షేమ క్యాలెండర్‌కు ఎల్లో మీడియాలో తగినంత చోటు దొరక్కపోవడం పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే ‘కాగ్’ నివేదిక పేరుతో ఆ మీడియాకు ఓ కొబ్బరికాయ దొరికింది. ఏటా బడ్జెట్ సమా వేశాలప్పుడు ఈ కొబ్బరికాయ పగలాల్సిందే! ఇది రాజ్యాంగ ధర్మం. కాకపోతే పూజనంతా వదిలేసి, కొబ్బరి చిప్పలపైనే ఎల్లో మీడియా మోజు పడటం విశేషం. ప్రభుత్వాల జమాఖర్చుల్ని ఆడిట్ చేయడం ‘కాగ్’ బాధ్యత. అందుకోసం కొన్ని నిర్దిష్ట ప్రమాణాలను అది ఏర్పాటు చేసుకున్నది. వాటి ఆధారంగా అది తన నివేదికను విడుదల చేస్తుంది. ప్రభుత్వాలకు అవసర మయ్యే వెసులుబాటు దారులను అది గుర్తించదు. ప్రభుత్వ వ్యయాల మీద ‘కాగ్’ సాంకేతిక విమర్శలు సర్వసాధారణం. ఒక లక్షా తొమ్మిదివేల కోట్ల రూపాయల ఖర్చుకు సంబంధించి శాసనసభ అనుమతి పొందలేదన్నది ‘కాగ్’ ప్రధాన విమర్శ. ఈ విషయాల్ని ఎల్లో మీడియా ప్రధాన వార్తగా ఫోకస్ చేసింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం దాదాపు రెండు లక్షల కోట్ల రూపా యలను బడ్జెట్ కేటాయింపు లేకుండా ఖర్చు చేసిందనీ, శాసన సభ అనుమతి తీసుకోవాలనీ పదేపదే సూచించినా కూడా పెడచెవిన పెట్టిందనీ అప్పట్లో ‘కాగ్’ విమర్శించింది. కానీ అప్పుడది ఎల్లో మీడియాలో ప్రాధాన్యతకు నోచుకోలేదు. గత ఆర్థిక సంవత్సరంలో 41 వేల కోట్ల రూపాయలకు సంబంధించిన బిల్లులను నిబంధనల మేరకు ట్రెజరీ కోడ్ ప్రకారం కాకుండా సీఎఫ్ఎమ్ఎస్ ద్వారా చెల్లించారనీ, ఇటువంటి సాంకేతిక లోపాలను సరిదిద్దుకోవాలనీ ‘కాగ్’ సలహా ఇచ్చింది. ఈ పాయింట్‌ను ఆసరాగా తీసుకొని 41 వేలకోట్ల రూపాయలు గల్లంతయ్యాయనీ, ఆ డబ్బును ఎవరు మింగేశారో తేల్చాలనీ గగ్గోలు చేయడం ఒక రకమైన వింత ప్రవర్తనగానే పరిగణించాలి. తెలుగుదేశం అధికారంలో ఉన్న చివరి సంవత్సరంలో కూడా వివిధ పద్దుల కింద కేటాయింపులు చేసిన రూ. 47 వేల కోట్లను ఖర్చు చేయలేదని ‘కాగ్’ అప్పుడు చెప్పింది. మరి ఆ సొమ్మును ఎవరు మింగేసినట్టు! జగన్ ప్రభుత్వం ఎంచుకున్న అభివృద్ధి వికేంద్రీకరణ పథాన్ని తెలుగుదేశం – ఎల్లో మీడియా కూటమి, ఆ కూటమి తాబేదార్లు తప్పుపడుతున్నారు. అమరావతిని ఏకైక రాజ ధానిగా ప్రకటించడమొక్కటే అభివృద్ధికి కొండగుర్తు అన్నట్టుగా వీరి ప్రచారం కొనసాగుతున్నది. చంద్రబాబు పరిపాలన సామాజిక విధ్వంసానికి ప్రతిరూపంగా రుజువయినప్పటికీ, ఆయనను అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రచారం చేయ డాన్ని ఈ కూటమి మానలేదు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక నిపుణులు చెబుతున్న అభివృద్ధి నిర్వచనాలకూ, చంద్రబాబు విధానాలకూ ఏమాత్రం సాపత్యం ఉండటం లేదు. భారత రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్, షికాగో యూనివర్సిటీ ప్రొఫెసర్ రఘురామరాజన్ మరో ప్రొఫెసర్ రోహిత్ లాంబాతో కలిసి భారత ఆర్థిక రంగానికి సంబంధించి కొన్ని వరస వ్యాసాలను ఇటీవల రాశారు. రెండు రోజుల కిందటే ఒక జాతీయ దినపత్రికలో ‘మైండ్, బాడీ అండ్ గ్రోత్’ పేరుతో ఒక వ్యాసం వచ్చింది. ఇందులో వారు చెప్పిందే మిటంటే – నాణ్యమైన విద్య, నైపుణ్యం (మైండ్), శారీరక ఆరోగ్యం (బాడీ) కలిసి ఆర్థిక వృద్ధికి (గ్రోత్)కు బాటలు వేస్తాయని! అంటే సమస్త ప్రజానీకానికి సమాన స్థాయిలో నాణ్యమైన విద్యాబుద్ధులు నేర్పి, నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందుబాటులో ఉంచినట్లయితే నైపుణ్యం గల మానవ వనరులు తయారవుతాయనీ, అవే దేశాభివృద్ధిని నిర్దేశిస్తాయనీ వారు స్పష్టంగా చెప్పారు. భారత ఆర్థికాభివృద్ధికి ఏ మార్గాన్ని ఎంచుకున్నా సరే, లక్ష్యాన్ని సాధించాలంటే మానవ వనరులే కీలకమని వారు ఘంటాపథంగా చెప్పుకొచ్చారు. తెలుగు రాష్టాల్లో ప్రభుత్వ విద్య, వైద్య రంగాలను విధ్వంసం చేసిన వారిలో మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు. ఇది దాచేస్తే దాగని సత్యం. నూటికి తొంభైమందికి నాణ్యమైన విద్య దొరక్కపోవడానికీ, వైద్యం అంగడి సరుకుగా మారడానికీ ఆయనే ప్రధాన కారకుడు. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చారిత్రక దుర న్యాయాన్ని సరిదిద్దే పనిచేస్తున్నది. కుల మత ప్రాంత, ధనిక – పేద తేడా లేకుండా అందరికీ ఒకే విధమైన నాణ్యమైన విద్య, నైపుణ్యాలు అలవడే విద్యా వ్యవస్థకూ, ఆరోగ్య వ్యవస్థకూ బాటలు వేస్తున్నది. ఈ విషయాలన్నీ జనం అనుభవంలోకి ప్రత్యక్షంగా వస్తున్నాయి. అభివృద్ధికి అర్థమేమిటో వారికి అవగతమవుతున్నది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పులను తెలిసో, తెలియకో సహించిన ప్రజలు ఇప్పుడు సహించేందుకు ఎంతమాత్రమూ సిద్ధంగా లేరు. ఎల్లో మీడియా ఎన్ని కథలు చెప్పినా సరే, వారి ఎమ్మెల్యేలు ఎన్ని ఈల పాటలు పాడినా సరే! ‘ఈలపాట’కు కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకునే రఘురామయ్య గారు కృష్ణుని వేషంలో చెప్పే పద్యాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. ‘చెల్లియో చెల్లకో తమకు చేసిన యెగ్గులు సైచి రందరున్, తొల్లి గతించె...’! అంటే... ఇప్పుడిక పప్పులు ఉడకవని అర్థం. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఈ బడ్జెట్ నాది అనేలా ఉంది..
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూపర్ పాలన అందిస్తున్నారంటూ రాష్ట్ర ప్రజలు కొనియాడుతున్నారని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. శాసనసభలో శుక్రవారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో రోజా మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలు ఈ బడ్జెట్ నాది అనుకునేట్లుగా 2022–23 బడ్జెట్ ఉందన్నారు. రాష్ట్రంలో డైరెక్ట్ బెన్ఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) ద్వారా ఇప్పటివరకూ రూ.1.32 లక్షల కోట్లను ప్రజలకు నేరుగా ప్రభుత్వం అందించిందన్నారు. ప్రస్తుత బడ్జెట్లో డీబీటీ పథకాల కోసం రూ.48,802 కోట్లు కేటాయించిందన్నారు. పేదలకు మేలుచేయాలని వైఎస్ జగన్ కట్టుబడి ఉన్నారనడానికి ఇది నిదర్శనమన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ పాలనలో విద్యా, వైద్య, వ్యవసాయ రంగాల్లో వినూత్న మార్పులు వచ్చాయన్నారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌రావు మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా నేడు సీఎం వైఎస్ జగన్ చేస్తున్న అభివృద్ధికి మద్దతుగా నిలుస్తున్నామన్నారు. -
ప్రజల ఆకాంక్షలకు తగ్గట్లుగా బడ్జెట్ : స్పీకర్ తమ్మినేని
సాక్షి,అమరావతి: ప్రజల ఆకాంక్షలకు, ఆశయాలకు అనుగుణంగా అత్యంత జనరంజకమైన సామాన్యుడి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ఆమోదించుకున్నామని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ అన్నారు. ముఖ్యమంత్రి ముందుగానే చెప్పినట్లు రాష్ట్ర ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేశారంటూ ప్రభుత్వానికి ప్రత్యేకమైన అభినందనలు తెలిపారు. మంచి క్వాలిటీ పాలన అందిస్తానని ముఖ్యమంత్రి చెప్పినట్లుగానే ఆయన అనేక సంక్షేమ పథకాలు, బడ్జెట్ అమలుచేయడం గొప్ప విషయమన్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా శుక్రవారం ఆయన సభనుద్దేశించి ప్రసంగించారు. ఈసారి సభ్యులు ఎన్నో ప్రజా సమస్యలను లేవనెత్తారని, ప్రభుత్వం కూడా ఎంతో బాధ్యతాయుతంగా సమాధానం ఇచ్చినట్లు చెప్పారు. కానీ, టీడీపీ సభ్యుల తీరు బాధించిందని, ప్రజా సమస్యలు లేవనెత్తాల్సిన వారు బాధ్యత మరిచి ప్రవర్తించారని ఆవేదన వ్యక్తంచేశారు. శాసనసభ @ 61.45 గంటలు రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చి 7వ తేదీ నుంచి 25 వరకు మొత్తం 12 రోజులపాటు జరిగినట్లు స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రకటించారు. శుక్రవారం సభ ముగింపు సందర్భంగా మొత్తం సభా సమయం వివరాలను సభ ముందు ఉంచారు. ఈ బడ్జెట్ సమావేశాలు పన్నెండు రోజుల్లో 61.45 గంటల పాటు సభ నడిచిందని వెల్లడించారు. ఇందులో 96 స్టార్ ప్రశ్నలకు మౌఖికంగా సమాధానం చెప్పగా, మరో 30 స్టార్, మూడు అన్ స్టార్ ప్రశ్నలకు సమాధానాలను సభ ముందు ఉంచినట్లు తెలిపారు. షార్ట్ నోట్ ప్రశ్నలు ఏమీ లేవని, 11 బిల్లులను సభలో ప్రవేశపెట్టి ఆమోదించినట్టు వివరించారు. ఈసారి సభలో 103 మంది సభ్యులు ప్రసంగించారని, ఐదు స్వల్పకాలిక చర్చలు జరిగాయని వివరించారు. కాగ్ నివేదిక ఒకటి సభ ముందు ఉంచామని, ప్రభుత్వ తీర్మానాలు ఏమీ లేవని తెలిపారు. -
డేటా చోరీపై సభా సంఘం
సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వం 2016–2019 మధ్య కాలంలో పౌర హక్కుల ఉల్లంఘన జరిగే విధంగా చట్టవిరుద్ధంగా కమ్యూనికేషన్ పరికరాల కొనుగోలు, వివిధ మార్గాల్లో డేటా చోరీకి పాల్పడినట్టు వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు శాసనసభా సంఘం ఏర్పాటైంది. శుక్రవారం శాసనసభ సమావేశంలో స్పీకర్ తమ్మినేని సీతారామ్ సభా కమిటీ వివరాలను ప్రకటించారు. కమిటీ చైర్మన్‌గా భూమన కరుణాకరరెడ్డి, సభ్యులుగా ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, డాక్టర్ మేరుగ నాగార్జున, కొట్టగుళ్లి భాగ్యలక్షి, గుడివాడ అమర్నాథ్, కొఠారి అబ్బయ్యచౌదరి, మద్దాల గిరిధరరావు నియమితులయ్యారు. ఇటీవల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అక్కడి శాసన సభలో పెగసస్ అంశంపై ప్రసంగిస్తూ.. ఇజ్రాయెల్ కంపెనీ ఈ సాఫ్ట్వేర్ కొనుగోలు చేయాలని తన వద్దకు వచ్చిందని చెబుతూ అది చట్టవిరుద్ధమని తాను అంగీకరించలేదని తెలిపారు. అయితే, అప్పట్లో అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు పెగసస్ సాఫ్ట్వేర్ తీసుకున్నారని వెల్లడించారు. ఇదే అంశంపై ఈ నెల 22న జరిగిన ఏపీ శాసనసభ సమావేశంలో దుమారం చెలరేగింది. గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకులు, సినీ, రాజకీయ పెద్దల డేటాను రహస్యంగా సేకరించేందుకు ఇజ్రాయెల్ నుంచి పరికరాలు, సాఫ్ట్వేర్ కొనుగోలు చేసినట్లు కొన్ని ఆధారాలు ఉన్నాయని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. దీనిపై పూర్తి దర్యాప్తు చేసేందుకు సభా సంఘం ఏర్పాటు చేయాలని పలువురు ఎమ్మెల్యేలు అభ్యర్థించటంతో స్పీకర్ అందుకు అంగీకరించారు. ఇందులో భాగంగా భూమన చైర్మన్‌గా ఆరుగురు ఎమ్మెల్యేలతో కూడిన సభా సంఘాన్ని నియమించినట్లు శుక్రవారం ప్రకటించారు. -
AP: ఏడాదంతా ‘సంక్షేమం’
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే వివిధ పథకాలతో కూడిన సంక్షేమ క్యాలెండర్‌ను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం శాసనసభలో ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి 2023 మార్చి వరకు ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల వివరాలతో ఈ సంక్షేమ క్యాలెండర్‌ను రూపొందించారు. సమాజంలో అన్ని వర్గాలకు ఇది సంక్షేమ క్యాలెండర్ కాగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు మాత్రం ఫేర్వెల్ క్యాలెండర్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు ఢంకా భజాయించే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5కు ఏమాత్రం రుచించని, గుబులు పుట్టించే క్యాలెండర్‌గా అభివర్ణించారు. శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడారు. ఆ వివరాలివీ.. విపత్తులోనూ చెదరని సంకల్పం ఈ బడ్జెట్ మన మేనిఫెస్టోను ప్రతిబింబిస్తోంది. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావిస్తూ అమలు చేస్తున్నాం. రూ.2.56 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టాం. ఇది పూర్తిగా ప్రజల బడ్జెట్. గతంలో బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టినా అంకెల గారడీ అని ప్రతిపక్షాలు విమర్శించడం చూస్తూ వచ్చాం. మరో 2 నెలల్లో ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు పూర్తవుతుంది. మూడేళ్లలో 95 శాతం వాగ్ధానాల అమలుతో పాటు నవరత్నాల అమలుకు తిరుగులేని ప్రాధాన్యం ఇస్తూ పాలన సాగింది. కరోనా కారణంగా ఆదాయం తగ్గినా మన సంకల్పం ఎక్కడా చెక్కు చెదరలేదు. దీక్ష మారలేదు. ప్రజలకు చేస్తున్న మంచి ఎక్కడా తగ్గనూ లేదు. ఉనికి కోసం విపక్షం డ్రామాలు ప్రజలంతా రాష్ట్రంలో జరుగుతున్న మంచిని గమనించారు కాబట్టే ప్రతి ఎన్నికల్లోనూ ప్రభుత్వాన్ని అక్కున చేర్చుకున్నారు. మన ప్రభుత్వాన్ని మరింత బలపరిచారు. గత ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసిన వారు చాలామంది ప్రస్తుతం మన వెంటే ఉన్నారని సగర్వంగా తెలియజేస్తున్నా. విమర్శించే అవకాశం ప్రతిపక్షానికి లభించడం లేదు. అందుకనే ఉనికి కోసం లేని సమస్యలు ఉన్నట్లుగా చిత్రీకరించి, వక్రీకరించి రోజూ డ్రామాలాడుతోంది. వారికి ఢంకా బజాయించే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 ప్రతి సందర్భంలోనూ తమ కడుపు మంట చూపిస్తున్నాయి. 14 ఏళ్లు సీఎంగా పనిచేసి, 44 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు తన హయాంలో ఫలానాది చేశానని చెప్పుకోవడానికి ఏ కోశానా ధైర్యం లేదు. అందరూ నావాళ్లే ఈ సంవత్సరం దాదాపు రూ.55 వేల కోట్లు నేరుగా (డీబీటీ) లబ్ధిదారులకు అందించబోతున్నాం. పరోక్షంగా మరో రూ.17,305 కోట్ల మేర ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. దేశ చరిత్రలోనే ఈ స్థాయిలో డీబీటీ, పారదర్శక పాలన ఎక్కడా అందడం లేదు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఎప్పుడు, ఏ నెలలో ఇస్తున్నామో సందేహాలకు తావు లేకుండా ముందే ప్రకటించి సంక్షేమ క్యాలెండర్ అమలు చేస్తున్నాం. లబ్ధిదారులు వారి కుటుంబ అవసరాలకు అనుగుణంగా ప్లాన్ చేసుకునే వీలు కల్పిస్తున్నాం. పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపికలో కులం, మతం, ప్రాంతం, చివరికి ఏ పార్టీ అనేది కూడా చూడటం లేదు. అందరూ మనవాళ్లే.. అంతా నావాళ్లేనని గట్టిగా నమ్మి ఈ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పారదర్శకంగా ప్రతి ఒక్కరికీ మేలు జరిగేలా సామాజిక తనిఖీ(సోషల్ ఆడిట్) చేపడుతున్నాం. రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెబుతారు.. నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు, రేపటి కంటే భవిష్యత్తు బాగుండాలనే తపనతో నవరత్నాలను అమలు చేస్తున్నాం. ఈ పథకాలు ఎలా అమలవుతున్నాయో రాష్ట్రంలో ఏ రైతన్నను అడిగినా చెబుతాడు. పిల్లలు, అక్కచెల్లెమ్మలు, ప్రతి అవ్వాతాతను అడిగినా చెబుతారు. సంతోషం వారి కళ్లల్లో కనిపిస్తుంది. సంక్షేమ క్యాలెండర్ హైలెట్స్ ► జూన్‌లో ఒక్క అమ్మఒడి పథకం ద్వారా తల్లుల ఖాతాలకు రూ.6,500 కోట్లు ► సెప్టెంబర్‌లో వైఎస్సార్ చేయూత ద్వారా 25 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.4,500 కోట్లు ► జనవరిలో వైఎస్సార్ ఆసరాతో దాదాపు 79 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.6,700 కోట్లు ► జనవరిలోనే వైఎస్సార్ పెన్షన్ కానుక రూ.2,500 నుంచి రూ.2,750కి పెంచే కార్యక్రమానికి శ్రీకారం -
నారా లోకేష్.. నీకు ఆ స్థాయి లేదు: కొడాలి నాని
సాక్షి, అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలు చేసేంత స్థాయి నారా లోకేశ్‌కు లేదన్నారు మంత్రి కొడాలి నాని. సీఎం జగన్‌ను ఎదుర్కొనే దమ్ము ఎవరికీ లేదని, అలాంటి దమ్మే ఉంటే తనపై పోటీ చేసి గెలవమని కొడాలి నాని, లోకేశ్‌కు సవాల్ విసిరారు. శుక్రవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రజల్లో ఆదరణ లేని దద్దమ్మలు ఇవాళ విమర్శలు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజలది. ప్రజాదరణ ఉన్న వైఎస్ జగన్ ను విమర్శించే స్థాయి లోకేశ్ కు లేదు. ఎమ్మెల్యేగా కూడా గెలవలేని అసమర్థుడు నారా లోకేష్’’ అని ప్రస్తావించారు మంత్రి కొడాలి నాని. న్యాయస్థానాలపై తనకు ఎనలేని గౌరవం ఉందని సీఎం జగన్ పేర్కొన్నారని, కానీ, ఈ అంశంపైనా ప్రతిపక్షం తప్పుడు ఆరోపణలు చేస్తోందని అన్నారు. ఈసారి టీడీపీ కి ప్రతిపక్ష హోదా కూడా రాదన్నారు. సమగ్ర అభివృద్ది...వికేంద్రీకరణపై ప్రభుత్వ వైఖరిని సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీ సాక్షిగా వివరిస్తే.. ఎల్లో మీడియాతో తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని మండిపడ్డారు మంత్రి కొడాలి నాని. -
చర్చకు రమ్మంటే.. టీడీపీ అలా చేసింది
సాక్షి, అమరావతి: సభలో సభ్యులు అందరూ మాట్లాడతారని అనుకున్నామని, కానీ, టీడీపీ తీరుతో అంతా తలకిందులైందని అన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. సమావేశాల ప్రారంభంలోనే గవర్నర్‌ని అవమానిస్తూ టీడీపీ సభ్యులు ఘోరాలకు పాల్పడ్డారని, అది చూసి ముఖ్యమంత్రి సహా అంతా ఆశ్చర్యపోయారని శ్రీకాంత్ రెడ్డి ఆక్షేపించారు. బడ్జెట్ సమావేశాలు ముగిసిన అనంతరం.. చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. వ్యవస్థలను నాశనం చేసింది చంద్రబాబే అని, టీడీపీ సభ్యులు పబ్లిసిటీ కోసం అసెంబ్లీలో గవర్నర్ ని సైతం అవమానపరిచారని గుర్తు చేశారు. ఆపై సభలోనూ టీడీపీ సభ్యులు సరిగా వ్యవహరించలేదు. ఏదైనా అనుమానం ఉంటే అడగాల్సింది. కానీ, వాళ్ల ప్రవర్తన చూశాక.. టీడీపీ అంటేనే ప్రజలు అసహ్యించుకుంటున్నారు. కేవలం సభలో అలజడి సృష్టించడానికే వాళ్లు వచ్చారు. సభలోకి వచ్చి గొడవ చేసి బయటకు వెళ్లిపోవడమే పనిగా పెట్టుకున్నారు. సభ జరిగినంత కాలం చిడతలు కొట్టడం, కాగితాలు చించటం చేశారు. పోనీ.. వారు వేసిన ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పనీయకుండా చేశారు. ఇళ్ల పట్టాల మీద స్వల్ప కాలిక చర్చ పెడితే దానిలో కూడా మాట్లాడలేదు. తమ ఎల్లో మీడియా ద్వారా పోలవరం ఎత్తు తగ్గించారంటూ రచ్చ చేశారు. సరేనని దానిపై చర్చ పెడితే టీడీపీ సభ్యులు మాట్లాడలేదు. మద్యం పాలసీపై స్వల్ప కాలిక చర్చ పెడితే.. అందులోనూ పాల్గొనలేదు. ఆఖరికి.. అసెంబ్లీ హక్కుల గురించి చర్చ పెట్టినా వారు రాలేదు. ప్రతీ అంశంపై సీఎం జగన్ చాలా స్పష్టంగా వివరణ ఇచ్చారు. అసలు చర్చలపై పట్టుబట్టిందే వాళ్లు. కానీ, చర్చకు రాకుండా గొడవలు చేశారు అంటూ టీడీపీ తీరుపై అసహనం వ్యక్తం వ్యక్తం చేశారు ప్రభుత్వ చీఫ్ విప్. -
టీడీపీ సభ్యుల తీరు అప్రజాస్వామికంగా ఉంది: ఎమ్మెల్యే అంబటి
-
ఆయన బయట ఉండి ఎమ్మెల్యేలను రెచ్చగొట్టారు: అంబటి రాంబాబు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్టాడారు. ఈ సందర్బంగా ఆయన.. ‘‘బడ్జెట్ సమావేశాలు సుదీర్ఘంగా జరిగాయి. గతంలో కరోనా వలన అనుకున్నట్లుగా జరగలేదు. ఈసారి 12 రోజులు అనేక అంశాలపై చర్చ చేసి, నిర్ణయాలు తీసుకున్నాం. అయితే, ప్రధాన ప్రతిపక్షం రెండు సభల్లోనూ దారుణంగా ప్రవర్తించింది. వారి తీరు రాజకీయ నాయకులు, ప్రజలు సిగ్గు పడేలా ఉంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి సభకి రానని భీష్మ ప్రతిజ్ఞ చేశారు. మరి వాళ్ల అబ్బాయి ఎందుకు వస్తున్నాడు? ఆ పార్టీ సభ్యులు ఎందుకు వస్తున్నట్టు? ఏంటి ఈ ద్వంద్వ వైఖరి? తొలురోజే గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఆరోజు నుంచి చివరి వరకు వారి డైలాగు ఒక్కటే.. అదే జంగారెడ్డిగూడెం మరణాల వ్యవహారం. మద్యం పాలసీ మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతుంటే అడ్డుకోవాలని చూశారు. వాస్తవానికి జంగారెడ్డిగూడెంలో సహజ మరణాలే తప్ప మరేమీ లేదు. సహజ మరణాలను సారా మరణాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు బయట ఉండి వారి పార్టీ ఎమ్మెల్యేలను రెచ్చగొట్టారు. అందుకే వారు విజిల్స్ తెచ్చి సభని ఎగతాళి చేశారు. ఆ మరోసటి రోజు చిడతలు తెచ్చి వాయించారు. ఈరోజు మంగళ సూత్రాలు తెచ్చారు. మంగళగిరిలో ఓడిపోయాక లోకేశ్‌కి బుర్ర పోయింది. జనం అతన్ని దగ్గరకు రానీయొద్దు. సభలో అనేక అంశాలపై చర్చ జరిగింది. పెగాసెస్, పోలవరం సహా అనేక అంశాలపై చర్చ జరిగింది. కానీ, ప్రతిపక్ష నేతలు సభలో కాకుండా వాళ్ల పచ్చ మీడియాలో మాట్లాడుతారు. అసహనంతో ఉన్న చంద్రబాబు.. వ్యవస్థలను అగౌరపరిచేలా చేశారు’’ అని వ్యాఖ్యలు చేశారు. -
కరోనా వచ్చినా.. ఆదాయం తగ్గినా.. సంకల్పం చెదరలేదు
-
సీఎం జగన్ పేదవాడి సొంతింటి కలను సాకారం చేశారు: ధర్మాన
-
ఏపీ అసెంబ్లీలో మారని టీడీపీ తీరు
-
మూడేళ్లలో 95 శాతం హామీలు నెరవేర్చాం: సీఎం జగన్
-
శాసనసభ తల వంచదు
సాక్షి, అమరావతి: చట్ట సభలకు రాజ్యాంగం ప్రసాదించిన సర్వ స్వాతంత్య్ర, సర్వసత్తాక సార్వభౌమాధికారాన్ని కచ్చితంగా కాపాడి తీరతామని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. ‘చట్టాలు చేసే విషయంలో శాసనసభ రాజీపడదు.. తన తలను ఎవరికీ తాకట్టు పెట్టదు.. ఎవరికీ తల వంచదు’ అని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ అంశంపై హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై శాసనసభలో గురువారం నిర్వహించిన చర్చ ముగింపు సందర్భంగా స్పీకర్ తన అభిప్రాయాన్ని విస్పష్టంగా ప్రకటించారు. రాజ్యాంగ వ్యవస్థలోని శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు తమతమ అధికార పరిధికి లోబడే పని చేయాలన్నారు. ఈ మూడు వ్యవస్థలు తమ అధికార పరిధుల మధ్య ఉన్న సన్నని విభజన రేఖను అతిక్రమించకుండా, ఒకదాని అధికారాల్లో మరొకటి జోక్యం చేసుకోకుండా రాజ్యాంగం తమకు నిర్దేశించిన బాధ్యతలను నిర్వర్తించాలని చెప్పారు. చట్టాలు చేసే అధికారం.. ప్రజా ప్రయోజనకర అంశాల్లో తీర్మానాలు చేసే అధికారం చట్ట సభలకు లేదంటే ఎలా? అని ప్రశ్నించారు. శాసన వ్యవస్థకు చట్టాలు, తీర్మానాలు చేసే అధికారాన్ని రాజ్యాంగమే ప్రసాదించిందని, ఆ హక్కును ఎవరూ కాలరాయలేరన్నారు. న్యాయ వ్యవస్థపై తమకు గౌరవం ఉందని, అంతమాత్రాన చట్ట సభల ఆత్మగౌరవం, రాజ్యాంగ బద్ధమైన హక్కులకు భంగం కలిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మతించే ప్రశ్నే లేదన్నారు. చట్ట సభ రాజ్యాంగ బద్ధమైన హక్కును, స్వాతంత్రతను కచ్చితంగా కాపాడి, భావి తరాలకు సరైన దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత సభలో సభ్యులందరిపైనా ఉందన్నారు. పరిపాలన వికేంద్రీకరణ, మూడు రాజధానుల అంశంపై చట్ట సభ ద్వారా సంక్రమించిన రాజ్యాంగబద్ధ అధికారాన్ని ఉపయోగించుకుని ప్రభుత్వం ముందుకు వెళ్లాలని ఆయన అభిప్రాయపడ్డారు. -
చట్టసభలకు ఆ హక్కు ఉంది
సాక్షి, అమరావతి: విస్తృత ప్రజాప్రయోజనాల దృష్ట్యా పరిస్థితులకు అనుగుణంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకునే హక్కును రాజ్యాంగం చట్టసభలకు కల్పించిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. అసెంబ్లీలో గురువారం ఆయన మాట్లాడుతూ.. ప్రాంతాల మధ్య అసమానతలను రూపుమాపేలా రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకెళ్తున్నామన్నారు. 1910 నుంచి ఎన్నో మహాసభలు, పెద్ద మనుషుల ఒప్పందాలు, శివరామకృష్ణన్, శ్రీకృష్ణ, కేటీ రవీంద్రన్ కమిటీ సిఫార్సుల ఔన్నత్యానికి అనుగుణంగానే పరిపాలన వికేంద్రీకరణ చేపట్టామన్నారు. ఒకసారి చేసిన చట్టాన్ని మార్పు చేయకూడదంటే చట్టసభల అధికారాలు ప్రశ్నార్థకంలో పడతాయన్నారు. చట్టాల విషయంలో శాసన వ్యవస్థకు సర్వాధికారాలు ఉంటాయన్నారు. ప్రతి వ్యవస్థకు స్వీయ నియంత్రణ అవసరమని.. చట్టసభల నిర్ణయాధికారాలపై న్యాయ వ్యవస్థలు సమీక్షించడం, సూచనలు ఇవ్వడం వరకే పరిమితమైతే వ్యవస్థలు చక్కగా నడుస్తాయన్నారు. అసమానతల్లేని సమాజం నిర్మించాలని.. తెలంగాణ కంటే రాయలసీమ, ఉత్తరాంధ్ర ఆర్థిక, సామాజిక, విద్య, వైద్యం, నీటి వసతిలో వెనుకబడిన ప్రాంతాలుగా శ్రీకృష్ణ కమిటీ ఆనాడే చెప్పింది. చిన్నపిల్లల మరణాలు తెలంగాణ కంటే ఇక్కడే ఎక్కువగా ఉన్నాయని, ప్రగతికి సూచిగా చెప్పే విద్యుత్ వినియోగం కూడా తక్కువగా ఉందని ఆ నివేదికలో పేర్కొన్నారు. అసమానతలు లేని సమాజాన్ని నిర్మించాలన్న రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవిస్తూ వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నాం. సీమలో కరువు.. ఉత్తరాంధ్రలో తుపాన్లు రాయలసీమలో శాశ్వత కరువులు, ఉత్తరాంధ్ర శాశ్వత తుపానులతో ఏళ్లుగా కొట్టుమిట్టాడాయి. 1972లో కేంద్రం కూడా సీమ జిల్లాలను పూర్తి కరువు పీడిత ప్రాంతాలుగా గుర్తించింది. ఉత్తరాంధ్ర నుంచి 20–30 లక్షల మంది వలసలు పోతున్నారు. కుప్పంలో కూడా 70–80 వేల మంది ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఈ తరుణంలో సమానత్వం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. చంద్రబాబు కేవలం పరిపాలన, విద్య, వైద్యం, పారిశ్రామికీకరణను కేవలం మూడు మండలాలకే పరిమితం చేశారు. కనీసం పక్కనున్న పల్నాడు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలనూ పట్టించుకోలేదు. ఏపీ పునర్వ్యవస్థీకరణ తర్వాత శివరామకృష్ణన్ కమిటీ ఎక్కడా పర్యావరణానికి హాని కలిగించకుండా, ఒకచోట నుంచి మరోచోటుకు తరలించకుండా రాజధాని ఏర్పాటుకావాలని సిఫారసు చేసింది. దీనికి రాజధాని వికేంద్రీకరణ ఒక్కటే మార్గమని చెప్పింది. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా ప్రాంతంలోని వ్యవసాయాన్ని కదిలిస్తే భవిష్యత్తులో సమస్యలొస్తాయని హెచ్చరించింది. కానీ, చంద్రబాబు వాటిని తుంగలో తొక్కి అప్పటి మంత్రి నారాయణ అధ్యక్షతన కమిటీని వేసి ఆయన నివేదిక ఆధారంగా రాజధానిని ప్రకటించారు. -
చట్ట సభలదే చట్టాలు చేసే అధికారం, బాధ్యత
హైకోర్టును, దాని అధికారాలను అగౌరవ పరచడానికి ఈ సభ నిర్వహించడం లేదు. మాకు హైకోర్టు మీద గొప్ప గౌరవం ఉంది. అదే సమయంలో అసెంబ్లీకి ఉన్న గౌరవాన్ని, అధికారాలను కాపాడుకోవాల్సిన బాధ్యతా మాపై ఉంది. ఎవరో ఫేవర్ చేస్తే ఇక్కడకు రాలేదు. ప్రజలందరూ ఓటు ద్వారా ఎన్నుకుంటే ఇక్కడికి వచ్చాము. ఈ గౌరవాన్ని, ఈ అధికారాన్ని మనం కాపాడుకోలేకపోతే శాసన వ్యవస్థ అన్నదానికి అర్థమే లేకుండా పోతుంది. ఈ రోజు చర్చించకపోతే ఆ తర్వాత చట్టాలు ఎవరు చేస్తారనేది పెద్ద ప్రశ్నగా చరిత్రలో మిగిలిపోతుంది. అందుకే ఏ వ్యవస్థ అయినా తన పరిధి దాటకుండా ఇతర వ్యవస్థలను గౌరవిస్తూ పని చేయాలని రాజ్యాంగం స్పష్టంగా పేర్కొందని గుర్తు చేస్తున్నాను. – శాసనసభలో సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘వికేంద్రీకరణే మా విధానం. రాజధాని అంశంలో నిర్ణయాధికారం, బాధ్యత శాసన వ్యవస్థదే. ఈ విషయంలో సర్వాధికారాలతోపాటు రాబోయే తరాల గురించి ఆలోచించాల్సిన బాధ్యత కూడా ఈ చట్టసభకు ఉంది’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విస్పష్టంగా ప్రకటించారు. ‘న్యాయ వ్యవస్థ పట్ల తిరుగులేని విశ్వాసం ఉంది. అయితే వికేంద్రీకరణ బాటలో సాగడం మినహా మరో మార్గం లేద’ని సవినయంగా తెలిపారు. వికేంద్రీకరణ విషయంలో ముందుకు వెళ్లడం ద్వారానే అన్ని ప్రాంతాల అభివృద్ధి, ఆత్మగౌరవం ఉందని చెప్పారు. వికేంద్రీకరణ, రాజధాని అంశంపై హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై శాసనసభలో గురువారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ ఆమోదించిన భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిందని, ఎవరెవరి పరిధి ఏమిటనే విషయాన్ని అందులో చాలా స్పష్టంగా చెప్పారన్నారు. రాజ్యాంగానికి మూడు స్తంభాలైన న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు ఒకదాని పరిధిలోకి మరొకటి చొరబడకూడదని, అప్పుడే వ్యవస్థలన్నవి నడుస్తాయని.. అలా కాకపోతే వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతాయని పేర్కొన్నారు. శాసనసభ ఫలానా విధానాన్ని, ఫలానా చట్టాన్ని చేస్తుందని ముందస్తుగానే ఊహించుకుని కోర్టులు ఆదేశాలు ఇవ్వజాలవన్నారు. రాబోయే రోజుల్లో ఒక చట్టం రాబోతుందని, దానివల్ల ఫలానా రాజధాని ఫలానా చోట పెడతారు.. అని వాళ్లంతట వాళ్లే ఊహించుకుంటే ఎలా? అని ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈ రోజు అలాంటి చట్టం ఏదీ లేదని, దాన్ని మనం వెనక్కి తీసుకున్నామని చెప్పారు. ‘ఈ పరిస్థితిలో ఇలాంటి తీర్పు ఎందుకు ఇచ్చినట్టు? మూడు రాజధానులను చేస్తూ ఒక చట్టమే లేనప్పుడు ఈ తీర్పు ఎందుకు వచ్చినట్టు? భవిష్యత్తులో మళ్లీ మెరుగైన చట్టం తీసుకువస్తాం. మూడు రాజధానులకు సంబంధించి ఆలోచన ఇంకా మెరుగ్గా ముందుకు వస్తుంది. అలా రాకూడదని చెప్పి ముందుగానే దాన్ని ప్రివెంట్ చేస్తూ కోర్టులు నిర్దేశించలేవు. శాసన వ్యవస్థ నిర్ధిష్టమైన విధానం, చట్టం చేయకూడదని కోర్టులు ఆదేశించ లేవు’ అని వివరించారు. ఈ సందర్భంగా సీఎం ఇంకా ఏమన్నారంటే.. శాసన వ్యవస్థ పరిధిలోనే ఆ అధికారం ► చట్టాలు చేసే అధికారం శాసన వ్యవస్థ పరిధిలో ఉంటుంది. కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థ పరిధిలో ఉండదు. మంచి చట్టాలు చేస్తే ప్రజలు మళ్లీ అదే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ప్రజలు ఐదేళ్లకోసారి ప్రతి ఒక్కరి పనితీరును మధిస్తారు. పార్లమెంటు, శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారు. ప్రభుత్వ పాలన, చట్టాలు నచ్చకపోతే ఇంటికి పంపించేస్తారు. ► ఇంతకు ముందు ధర్మాన ప్రసాదరావు చెప్పినట్లు.. ప్రజలకు గత ప్రభుత్వ విధానాలు, చట్టాలు నచ్చలేదు కాబట్టే ఈ రోజు 175 అసెంబ్లీ స్థానాలకు 151 స్థానాలు అంటే 86 శాతం అసెంబ్లీ సీట్లు మనకిచ్చారు. గత ప్రభుత్వ చట్టాలు, విధానాలను వ్యతిరేకించారు అని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఇదే ప్రజాస్వామ్యం గొప్పదనం. ► ప్రతి ఐదేళ్లకు పార్లమెంటు సభ్యులు, అసెంబ్లీ సభ్యులు పరీక్షకు నిలబడతారు. ప్రజల వద్దకు వెళ్లాల్సిందే. ప్రజలు మళ్లీ వాళ్లను తూచి, వాళ్లు పాస్ అయ్యారా? ఫెయిల్ అయ్యారా? అని మార్కులు వేస్తారు. కోర్టులు ఈ వ్యవస్థలో జోక్యం చేసుకోకూడదని చెప్పడానికి ఇదే నిదర్శనం. ► కోర్టులు అసాధ్యమైన కాల పరిమితిలు విధించకూడదు. నెల రోజుల్లోపు రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి రోడ్లు, డ్రైనేజీలు, నగరాలను నిర్మించాలి. ఆరు నెలల్లో ఇంకో ఐదారు లక్షల కోట్లతో రాజధాని నిర్మించాలి. ఇలా అసాధ్యమైన పనులు చేయమని శాసన వ్యవస్థను కోర్టులు శాసించ లేవు. దీనిపై చాలా మంది వక్తలు చాలా బాగా మాట్లాడారు. వాళ్లందరినీ అభినందిస్తున్నా. నాడు అభివృద్ధి కేంద్రీకరణతోనే రాష్ట్ర విభజన ► మొదట్లో అభివృద్ధి లేకపోవడంతో తెలంగాణ ఉద్యమం వచ్చింది. రెండోసారి తెలంగాణా ఉద్యమం రాష్ట్ర విభజనకు దారితీసింది. అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకృతం కావడం వల్లే రెండోసారి తెలంగాణ ఉద్యమం వచ్చిందని 2010లో జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ చెప్పింది. ► రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 ప్రకారం ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ.. వికేంద్రీకరణతోనే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని చెప్పింది. పరిపాలన వికేంద్రీకరణ బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు గతంలో ఇదే సభలో అన్ని విషయాలు చెప్పి ప్రస్తావించిన మాటలకు మన ప్రభుత్వం నేటికీ కట్టుబడి ఉంది. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం కూడా.. ► రాజధాని ఎక్కడ ఉండాలనే నిర్ణయంతో పాటు పరిపాలన వికేంద్రీకరణపై రాష్ట్ర శాసనసభకు ఎలాంటి అధికారం లేదని కూడా హైకోర్టు తీర్పు ఇచ్చింది. 2014 రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఆ నిర్ణయాధికారాలన్నీ కేంద్రం పరిధిలోనే ఉంటాయి తప్ప.. ఈ విషయంలో రాష్ట్ర శాసనసభకు ఏ అధికారం లేదని హైకోర్టు పేర్కొంది. ► రాష్ట్ర రాజధానితో పాటు పరిపాలనా వికేంద్రీకరణపై కేంద్రం నుంచి అనుమతి తీసుకోవడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగిందేమీ లేదని కూడా చెప్పింది. (‘వుయ్ ఆల్సో హోల్డ్ దట్ ద లెజిస్లేచర్ హేజ్ నో లెజిస్లేటివ్ కాంపిటెన్స్ టు పాస్ ఎనీ రిజల్యూషన్/లా ఫర్ చేంజ్ ఆఫ్ కేపిటల్ ఆర్ బైఫర్కేటింగ్ ఆర్ ట్రైఫర్కేటింగ్ ద కేపిటల్ సిటీ’ అని హైకోర్టు పేర్కొన్న వాక్యాలను సీఎం చదివి వినిపించారు.) హైకోర్టు తీర్పు దేశ సమాఖ్య స్ఫూర్తికి, శాసనసభ అధికారాలకు పూర్తి విరుద్ధంగా ఉంది. రాష్ట్ర శాసనసభ అధికారాలను పూర్తిగా హరించేలా ఉంది. పార్లమెంట్ సాక్షిగా కేంద్రం చెప్పింది ► రాజ్యాంగం ప్రకారం చూసినా రాష్ట్ర రాజధాని నిర్ణయంలో కేంద్ర ప్రభుత్వం పాత్ర లేదు. తన పాత్ర ఉంటుందని, అది తన అధికారమని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదు. ఇది సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారమేనంటూ.. ఆర్టికల్ 3ని కూడా కోట్ చేస్తూ ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే హైకోర్టుకు నివేదించింది. అఫిడవిట్ కూడా ఇచ్చింది. (అఫిడవిట్‌ను సీఎం చూపించారు) ► ఒక రాష్ట్రానికి రాజధానిని ఎంపిక చేసేందుకు నిర్ధిష్టమైన విధానం ఏమైనా ఉందా.. అని టీడీపీ ఎంపీ కేశినేని నాని పార్లమెంటులో అడిగితే.. కేంద్రం సమాధానమిస్తూ ‘ఒక రాష్ట్రం రాజధానిని ఆ రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. అందులో కేంద్ర ప్రభుత్వ పాత్ర లేదు’ అని స్పష్టతనిచ్చింది. ► కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో అదనపు అఫిడవిట్‌ను కూడా దాఖలు చేసింది. ‘భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 కొత్త రాష్ట్రాల ఏర్పాటు, మిగిలిన అంశాలకు సంబంధించి మాత్రమే నిర్దేశించింది. రాష్ట్రాల రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన ఏ నిబంధన కూడా ఇందులో లేదు’ అని స్పష్టంగా పేర్కొంది. ► హైకోర్టు ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని ఉంటుందన్న వాదనను కూడా కొట్టి పారేసింది. ► ఒకవైపు హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదని చెబుతుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర ప్రభుత్వ అధికారమే అని పార్లమెంట్లో చెప్పడంతో పాటు కోర్టులో అఫిడవిట్ వేసింది. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అధికారం లేదని చెప్పడం ఎంతవరకు సమంజసం? న్యాయస్థానం పరిధి దాటడం అవాంఛనీయ సంఘర్షణే ► రాజధాని వికేంద్రీకరణ విషయంలో చట్ట సభకు తీర్మానం చేసే అధికారం కూడా లేదని హైకోర్టు తీర్పు చెప్పింది. గౌరవ న్యాయస్థానం తన పరిధి దాటి శాసన వ్యవస్థ వ్యవహారాల్లోకి ప్రవేశించటం అవాంఛనీయమైన సంఘర్షణే. ► రాజధానితో పాటు నిర్మాణాలు అన్నింటినీ అంటే రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్తు కనెక్షన్లు మొదలైనవి నెలలోనే పూర్తి చేయాలి.. ఆరు నెలల్లో మిగిలిన నిర్మాణాలు పూర్తి చేయాలని తీర్పు ఇచ్చింది. ఇది సాధ్యమౌతుందా అన్నది గమనించాలి. ► ఆచరణ సాధ్యం కాని ఆదేశాలు జారీ చేయకూడదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలకు హైకోర్టు తీర్పు పూర్తి భిన్నంగా ఉంది. ఇలాంటి తీర్పులు ఉండకూడదని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించినా ఇలా జరిగింది. హైకోర్టు తన పరిధిని అతిక్రమించిందని అందరికీ అనిపించింది ► రాష్ట్ర రాజధాని, సీఆర్డీయే చట్టానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పు గమనించినట్లైతే.. అటు రాజ్యాంగ పరంగానే కాకుండా, ఇటు రాష్ట్ర శాసనసభకు ఉన్న అధికారాలను కూడా ప్రశ్నించే విధంగా ఉందనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నా. ► ప్రజాస్వామ్యంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలనే మూల స్తంభాలు తమ పరిధిలోనే అధికారాలకు లోబడే పని చేయాలి. ఒక వ్యవస్థ మరో వ్యవస్థలో జోక్యం చేసుకోకూడదని, మరో వ్యవస్థ మీద పెత్తనం చేయకూడదని రాజ్యాంగంలో స్పష్టంగా నిర్దేశించారు. కానీ ఇటీవల రాష్ట్ర హైకోర్టు తమ పరిధిని దాటినట్టుగా మనందరికీ అనిపించింది. అందుకే ఇవాళ ఈ చట్టసభల్లో చర్చించాల్సిన పరిస్థితి వచ్చింది. 29 గ్రామాలే కాదు.. మిగిలిన రాష్ట్రం బాధ్యతా మాదే ► రాజధాని నగరంతో పాటు ఈ ప్రాంతంలో చూపిన మాస్టర్ ప్లాన్ కేవలం కాగితాలపై గ్రాఫిక్స్ రూపంలో ఉంది. మాస్టర్ ప్లాన్‌ను అప్పటి ప్రభుత్వం 2016 ఫిబ్రవరిలో నోటిఫై చేసింది. సీఆర్డీయే చట్టం ప్రకారం ఆ మాస్టర్ ప్లాన్ కాల పరిమితి 40 ఏళ్లు. ప్రతి ఐదేళ్లకోసారి దాన్ని సమీక్షించాలని కూడా పేర్కొన్నారు. అంటే 40 ఏళ్లకు కూడా సాధ్యం కాదన్నది అందరికీ తెల్సిన విషయం. ► ఇప్పటికి ఆరేళ్లయింది. గ్రాఫిక్స్‌కే పరిమితమైన ఈ మాస్టర్ ప్లాన్ పూర్తిగా పేపర్ పైన మాత్రమే ఉంది. ఏ 29 గ్రామాల గురించైతే మాట్లాడుతున్నారో.. రోడ్లు, డ్రైనేజీలు, నీళ్లు, విద్యుత్ వంటి మౌలిక వసతులు లేని ప్రాంతంలో వాటిని కల్పించడం కోసమే ఆనాడు టీడీపీ ప్రభుత్వం వేసిన అంచనా ప్రకారం ఎకరాకు రూ.2 కోట్లు చొప్పన 54 వేల ఎకరాలకు దాదాపు రూ.1.09 లక్షల కోట్లు అవుతుంది. ► అంటే రాబోయే 40 ఏళ్లలో కనీసం 15 లక్షల కోట్లో 20 లక్షల కోట్ల రూపాయలకో వ్యయం పెరుగుతుంది. 54 వేల ఎకరాలు అన్నది రాష్ట్రం మొత్తం మీద 0.0001 శాతం ఉంటుంది. మిగిలిన రాష్ట్రం 99.9999 శాతం ఉంది. ఆ ప్రాంతమంతా కూడా అభివృద్ధి, సంక్షేమం కోసం ఎదురు చూస్తోంది. వాటికి కూడా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నది మరచిపోకూడదు. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఎజెండా. ► అలా కాకుండా రాజధాని అని నామకరణం చేసి, ఇక్కడ మాత్రమే డబ్బులు పెట్టడం కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల పట్ల బాధ్యత ఉంది. ఆ బాధ్యతను నెరవేర్చాలనే విషయాన్ని మరచిపోకూడదు. సాధ్యం కానివి సాధ్యం చేయాలని ఏ వ్యవస్థలు గానీ, న్యాయస్థానాలుగానీ నిర్దేశించలేవు. అందుకే వీటన్నింటిపై న్యాయ సలహా తీసుకుంటున్నాం. ► రాజ్యాంగం ప్రకారం ప్రత్యామ్నాయ మార్గాల గురించి కూడా ఆలోచిస్తున్నాం. చివరిగా రాష్ట్ర ప్రజలందరికీ ఒక్కటే హామీ ఇస్తున్నా. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా, పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ ప్రక్రియను కొలిక్కి తీసుకు రావడంతో పాటు రాజధాని ప్రాంతంలో భూములిచ్చిన రైతుల ప్రయోజనాలను కాపాడతాం. వారికి కూడా అండగా నిలుస్తాం. -
వికేంద్రీకరణ విషయంలో వెనకడుగు వేయబోం: సీఎం జగన్
-
రాజధానిపై రాష్ట్రానిదే నిర్ణయమని కేంద్రమే చెప్పింది: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాజ్యాంగం ప్రకారం చట్టం చేసే అధికారం శాసన వ్యవస్థకే ఉందని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీలో ఇవాళ వికేంద్రీకరణపై చర్చ సందర్భంగా.. ఆయన ప్రసంగించారు. పరిపాలన వికేంద్రీకరణపై శాసన వ్యవస్థకు ఎలాంటి అధికారం లేదని హైకోర్టు చెప్పింది. రాజధానిపై కేంద్రం నుంచి అనుమతులు తీసుకోవడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఏదీ లేదని చెప్పింది కోర్టు. కానీ, కేంద్రం ఏమో రాజధానిపై నిర్ణయం తమదే అని ఎక్కడా చెప్పలేదు. పైగా రాష్ట్రానిదే తుది నిర్ణయమని అఫిడవిట్ కూడా ఫైల్ చేసింది. టీడీపీ ఎంపీ కేశినేని నాని అడిగిన ఓ ప్రశ్నకు పార్లమెంట్లో సమాధానం ఇచ్చింది కేంద్రం. పైగా హైకోర్టు ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అనే వాదనను కూడా కేంద్రం కొట్టిపారేసింది. అందుకే మాకు అధికారం ఇచ్చారు అయినా నెలరోజుల్లో లక్ష కోట్ల రూపాయలతో రాజధాని కట్టేయాలని కోర్టులు ఎలా డిక్టేట్ చేస్తాయి? అన్ని వ్యవస్థలు వాటి పరిధిలో ఉండాలి. లేకుంటే సిస్టమ్ మొత్తం కుప్పకూలి పోతుంది. రాజధానిపై వాళ్లంతకు వాళ్లే ఊహించుకుని పెట్టుకున్నారు. అటు గుంటూరు కాదు.. ఇటు విజయవాడ కాదు.. తమకు బినామీలకు భూములున్న చోట రాజధాని పెట్టారు. గత ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకించారు కాబట్టే వైసీపీకి ప్రజలు ఘన విజయం కట్టబెట్టారు. వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని శివరామకృష్ణ కమిటీ కూడా తేల్చి చెప్పింది. శాసన వ్యవస్థ ఓ చట్టాన్ని చేయాలా? వద్దా? అని కోర్టులు నిర్ణయించలేవు. రాజ్యాంగం ప్రకారం.. చట్టం చేసే అధికారం ఒక్క శాసన వ్యవస్థకే ఉంది. సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నా.. ఆచరణా సాధ్యం కానీ తీర్పు ఇచ్చింది హైకోర్టు. అభివృద్ధి వికేంద్రీకరణకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో మాటలన్నింటికి కట్టుబడి ఉన్నాం అని సీఎం జగన్ మరోమారు స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థపై గౌరవం ఉంది, అలాగే.. మాస్టర్ ప్లాన్ కాలపరిమితి 20 ఏళ్లు అని అప్పటి ప్రభుత్వం చెప్పింది. ప్రతీ ఐదేళ్లకొకసారి సమీక్షించాలని కూడా రాశారు. ఇది ఆచరణ సాధ్యం కాదని అందరికీ తెలుసు. లక్ష కోట్లు అనేది ఇరవై ఏళ్లకు 15 నుంచి 20 లక్షల కోట్ల రూపాయలు అవుతుంది. ఈ ప్రాంతం మీద నాకు ప్రేమ ఉంది కాబట్టే ఇక్కడే ఇల్లు కట్టుకున్నా. ఇక్కడి నుంచి మాట్లాడుతున్నా. మాకు హైకోర్టుపై గౌరవం ఉంది. అలాగే రాష్ట్ర అసెంబ్లీ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకు ఉంది. ఇవాళ చర్చ జరగకపోతే చట్టాలు చేయాల్సింది శాసన సభా? లేదా కోర్టులా? అనేది క్వశ్చన్ మార్క్ అవుతుంది. రాజధానే కాదు.. రాష్ట్ర సంక్షేమం కూడా మాకు ముఖ్యం. వికేంద్రీకరణకు అర్థం అన్ని ప్రాంతాల అభివృద్ధి. అడ్డంకులు ఎదురైనా.. వికేంద్రీకరణ ఒక్కటే సరైన మార్గం. న్యాయవ్యవస్థ మీద అచంచల గౌరవం, విశ్వాసం ఉంది. అలాగే.. అందరికి మంచి చేయడమే ప్రభుత్వం ముందున్న మార్గం. న్యాయ సలహాలు తీసుకుని ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చలు జరుపుతున్నాం. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా పరిపాలన వికేంద్రీకరణను ఓ కొలిక్కి తెస్తాం. రాబోయే తరాలకు మంచి చేయడమే ప్రభుత్వ లక్ష్యం. అందరికీ మంచి చేయడానికే మా ప్రభుత్వం ఉంది. రాజధానికి భూములు ఇచ్చిన వారికి న్యాయం చేస్తూ.. వికేంద్రీకరణ విషయంలో వెనకడుగు వేసేది లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు. -
ఒకరి విధి నిర్వహణలో మరొకరు జోక్యం చేసుకోవద్దు: ధర్మాన
-
శాసన వ్యవస్థ అధికారాలను అడ్డుకుంటే ప్రజలకే నష్టం: ధర్మాన
సాక్షి, అమరావతి: న్యాయవ్యవస్థలో స్వీయ నియంత్రణ ఉండాలని, కానీ, ఇతర వ్యవస్థల్లో అందునా శాసన వ్యవస్థలో జోక్యం చేసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం మధ్యాహ్నాం పరిపాలన వికేంద్రీకరణ.. మూడు రాజధానులపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఏపీ హైకోర్టు వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద రావు ప్రసంగించారు. ‘‘ఏపీ అసెంబ్లీకి కొన్ని పరిమితులు పెడుతూ హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. మూడు రాజధానులపై అసెంబ్లీ చట్టం చేయొద్దంటూ హైకోర్టు తెలిపింది. తీర్పు తర్వాత న్యాయ నిపుణులతో చర్చించాను. ఆపైనే సభానాయకుడికి ఓ లేఖ రాశాను. దీనిపై సభలో చర్చించాల్సిన అవకశ్యత ఉందని భావిస్తున్నా. చర్చించే అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, స్పీకర్ సీతారాంలకు ధన్యవాదాలు తెలిపారు ధర్మాన. న్యాయవ్యవస్థల ప్రాధాన్యతను తగ్గించాలన్న అభిప్రాయం తనకు ఏమాత్రం లేదని, కానీ, బాధ్యతల్ని కట్టడి చేసే విధంగా ఉన్నాయన్న అభిప్రాయం మాత్రమే తాను వ్యక్తం చేస్తున్నానని ప్రసంగం సందర్భంగా చెప్పుకొచ్చారాయన. ఇలాంటి సమయంలో కోర్టు వ్యాఖ్యలపై చర్చాసమీక్షలకు శాసన సభకు హక్కు ఉంటుందా? అనే విషయంపై సుప్రీం కోర్టు ఇచ్చిన ఓ తీర్పును ప్రస్తావిస్తూ ప్రసంగం మొదలుపెట్టారు. ►రాజరిక వ్యవస్థలో రాజే శాసనం. ఒకరి చేతుల్లో ఉండడం వల్ల ప్రజా వ్యతిరేకత పుట్టుకొచ్చింది. ఆ తర్వాతే ప్రజాస్వామ్యం పుట్టుకొచ్చింది. రాజ్యాంగం రావడం వెనుక ఎంతో మంది కృషి ఉంది. వ్యవస్థల పరిధి, విధులు ఎంటన్న దానిపై స్పష్టత ఉండాలి. లేకుంటే వ్యవస్థల్లో నెలకొనే అవకాశం ఉంది. సమాజం పట్ల తమకు పూర్తి బాధ్యత ఉందని గతంలో సుప్రీం కోర్టు ప్రకటించింది. అంతేకానీ జ్యుడీషియిల్ యాక్టివిజం పేరుతో కోర్టులు విధులు నిర్వహించకూడదని స్పష్టం చేసింది. ఒకవేళ శాసన వ్యవస్థ సరిగా పనిచేయకుంటే.. ఆ విషయాన్ని ఎన్నుకున్న ప్రజలే చూసుకుంటారు. అంతేకానీ, కోర్టులు జోక్యం చేసుకోకూడదని అత్యున్నత న్యాయస్థానమే చెప్పింది. అంతేకాదు.. ఎంత నిగ్రహంగా కోర్టులు వ్యవహరించాలో కూడా సుప్రీం కోర్టు వివరించింది. ► శాసన, న్యాయ, కార్యనిర్వాహక వర్గం.. వేటికవే వ్యవహరించాలి. ఈ వ్యవస్థలన్నీ ప్రజల కోసమే ఉన్నాయి. న్యాయవ్యవస్థ, కోర్టులంటే గౌరవం ఉంది. విధి నిర్వహణలో ఒకదానిని మరొకటి పల్చన చేస్తే.. పరువు తీసుకోవడం తప్పించి ఏం ఉండదని చెప్పారాయన. అందుకే ఒకరి విధి నిర్వహణలో మరొకరు జోక్యం చేసుకోవద్దని, రాజ్యాంగ బాధ్యతలను నెరవేర్చుకుండా అడ్డుపడొద్దని ధర్మాన సభాముఖంగా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గతంలో సుప్రీం కోర్టు, ఇతర న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పు కాపీలను చదివి వినిపించారు ఆయన. న్యాయ వ్యవస్థకు ముప్పు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కోర్టులదేనని సుప్రీం కోర్టు చెప్పిందని గుర్తు చేశారు. ► రాజ్యాంగ బద్దమైన విషయాల్లో జోక్యం చేసుకునే హక్కు మాత్రమే న్యాయ వ్యవస్థకు ఉందని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేకానీ, శాసనం చేసే సమయంలో జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేసింది. ఆ హక్కు కేవలం రాజ్యాంగం కేవలం చట్ట సభలకు మాత్రమే కల్పించిందని గుర్తు చేశారాయన. ‘కోర్టులు న్యాయం మాత్రమే చెప్పాలి. శాసనకర్త పాత్రలను కోర్టులు పోషించకూడదని సుప్రీం చెప్పింది. లేని అధికారాలను పోషించకూడదని, ప్రభుత్వాన్ని నడపొద్దు, నడపలేవు’ అని అత్యున్నత న్యాయస్థానమే పేర్కొంది అని గుర్తు చేశారు ధర్మాన. ► ఒక పార్టీ సభలో మెజార్టీతో అధికారంలో ఉందంటే.. అంతకు ముందు ఉన్న ప్రభుత్వ విధానాలను మార్చమని ప్రజలు అధికారం ఇవ్వడమే అవుతుంది కదా.. అని ధర్మాన గుర్తు చేశారు. ఆ అధికారమే లేదని న్యాయస్థానాలు చెప్పడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. వివిధ ప్రభుత్వాలు తీసుకున్న ఎన్నో నిర్ణయాలను ప్రభుత్వాలు మార్చిన సంగతి గుర్తు చేశారాయన. బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దును తర్వాతి ప్రభుత్వాలు చేయలేదా? అని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ పాలసీతో నాటి సీఎం వైఎస్ఆర్ ఎంతమంది ప్రాణాలు కాపాడలేదు, విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయంలో ఎన్ని అభ్యంతరాలున్నా..ఇది మా విధానం అని కేంద్రం చెప్పలేదా? శాసన సభ అధికారాల విషయంలో కోర్టు అభ్యంతరాలు ఉంటే ఎన్నికలు ఎందుకు?. శాసన వ్యవస్థ అధికారాలను అడ్డుకుంటే ప్రజలకే నష్టం అని అన్నారాయన. ప్రభుత్వాలు ఎన్ని మారినా.. వ్యవస్థల్ని రక్షించే పనిని అందరూ కొనసాగించాలని కోరుకుంటున్నట్లు పేర్కొంటూ ప్రసంగం ముగించారు ఎమ్మెల్యే ధర్మాన. -
టీడీపీ చిడతల బ్యాచ్ పై ఫైర్ అయిన మంత్రులు
-
నారా లోకేష్, చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని ఫైర్
సాక్షి, అమరావతి: కమీషన్లకు కక్కుర్తి పడి అడ్డమైన మద్యం బ్రాండ్లను చంద్రబాబు తీసుకువచ్చారని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కొడాలి నాని గురువారం మాట్లాడుతూ..‘‘మద్యం అమ్మకాలను ప్రొత్సహించింది చంద్రబాబే. మద్యం అమ్మకాల ద్వారా కమీషన్ తీసుకుని ఆస్తులు పెంచుకున్నది చంద్రబాబు. కమీషన్లకు కక్కుర్తిపడి బార్లకు ఐదేళ్లు లైసెన్లు ఇచ్చారు. బార్లకి గతంలో కేవలం రెండేళ్లే అనుమతులు ఉండేవి.. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇంట్లో కూర్చుని మాట్లాడుతున్నారు. అడ్డమైన బ్రాండ్లకు చంద్రబాబే అనుమతిచ్చారు. మనం ఏం చెప్తే అది నమ్మే ప్రజలు ఉన్నారనుకునే 420 బ్యాచ్ అది. వాళ్లు తమ మీడియా ద్వారా అబద్దాలు చెప్తున్నారు. సీ బ్రాండ్, ఎల్ బ్రాండ్ లకు చంద్రబాబు ఎలా అనుమతి ఇచ్చారో రాష్ట్రం అంతా చూసింది. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుది. దేనికీ పనికిరాని చంద్రబాబుని అల్లుడుని చేసుకుంటే ఔరంగజేబులాగా మారాడని ఎన్టీఆర్ ఆనాడే చెప్పారు. వెన్నుపోటు, కుట్రలు, కుతంత్రాలకు పేటెంట్ చంద్రబాబు. 175 నియోజకవర్గాలను 175 జిల్లాలను చేయమని లోకేష్ అడుగుతున్నాడు. అప్పట్లో కుప్పంని డివిజన్ చేయాలని చంద్రబాబుకు ఎందుకు అనిపించలేదు?.. ఇప్పుడు సీఎం జగన్‌కు ఎలా ఉత్తరాలు రాస్తాడు?.. కాస్తయినా చంద్రబాబుకి సిగ్గులేదా?.. అభివృద్ధి పనులను అడ్డుకుంటే టీడీపీ రాజకీయ భవిష్యత్తుకు జనం సమాధి కడతారు. ఎన్నికల వరకు ఈ 420 బ్యాచ్ భరించక తప్పదు’’ అంటూ ఆయన ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుగానే మద్యం నియంత్రణ గురించి చెప్పారు. అధికారంలోకి రాగానే 45 వేల బెల్టుషాపులు తొలగించారు. పర్మిట్ రూమ్‌లను పూర్తిగా ఎత్తివేయించారు. బార్లను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే టీడీపీ నేతలు కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకుని నడుపుతున్నారని కొడాలి విమర్శించారు. -
నారా లోకేష్ ఎవరి మాట వినడు..
-
టీడీపీ చిడతల బ్యాచ్ పై మోషేన్‌రాజు సీరియస్
-
టీడీపీ సభ్యుల ఓవరాక్షన్.. మండలి చైర్మన్‌పై ప్లకార్డులు విసిరి..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో టీడీపీ సభ్యుల తీరు మారడం లేదు. 12వ రోజు సమావేశాల్లో భాగంగా శాసన మండలిలోనూ టీడీపీ సభ్యులు ఓవరాక్షన్ చేశారు. మండలిలో సభా కార్యకలాపాలను ఆటంకపరిచారు. విజిల్స్ వేస్తూ, చిడతలు వాయిస్తూ టీడీపీ మండలి సభ్యులు దిగజారి ప్రవర్థించారు. ఈ సందర్భంగా వారి తీరుపై చైర్మన్ మోషెన్ రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సభలో ఇలాంటివి చేయడం మంచిది కాదు. సభకు చిడతలు, విజిల్స్ ఎందుకు తెచ్చారు. సభలో చిడతలు వాయించడం ఏంటి..?. సభా గౌరవాన్ని కాపాడే బాధ్యత మీ మీద లేదా?. భజన చేయడం మంచి పద్ధతి కాదు. వెల్‌లోకి వచ్చి మాట్లాడే హక్కు మీకు లేదు. మీ సీట్లలో మీరు కూర్చొని మాట్లాడండి. టీడీపీ సభ్యులు కావాలనే గొడవ చేస్తున్నారు.. సభా సమయాన్ని వృద్దా చేయొద్దని మొదటి రోజు నుంచి చెబుతున్నా’ అని అన్నారు. వారు ఎంతకూ తీరు మార్చుకోకపోవడంతో టీడీపీ సభ్యులను ఈ ఒక్కరోజు చైర్మన్ సస్పెండ్ చేశారు. దీంతో టీడీపీ సభ్యుడు దీపక్ రెడ్డి పోడియం పైకి ఎక్కడానికి దూసుకెళ్లారు. దీంతో ఆయనను మార్షల్స్ అడ్డుకున్నారు. సస్పెండ్ చేస్తే ఈ దౌర్జన్యం ఏంటి అని చైర్మన్ మోషెన్ రాజు టీడీపీ సభ్యులను ప్రశ్నించారు. ఈ క్రమంలో మోషెన్ రాజుపై ప్లకార్డులు విసిరి టీడీపీ సభ్యులు బయటకు వెళ్లారు. సస్పెండైన వారిలో అర్జునుడు, అశోక్ బాబు, దీపక్ రెడ్డి, ప్రభాకర్, రామ్మోహన్, రామారావు, రవీంద్రనాథ్ ఉన్నారు. ఇది చదవండి: ఆర్ఆర్ఆర్ సినిమా భయం.. థియేటర్లో ఇనుప కంచెలు -
టీడీపీ చిడతల బ్యాచ్ పై అప్పలరాజు ఫైర్
-
వికేంద్రీకరణ విషయంలో వెనకడుగు వేయబోం: సీఎం జగన్
-
సభలో చిడతలు
సాక్షి, అమరావతి: శాసనసభ కార్యకలాపాలకు పదేపదే ఆటంకం కలిగిస్తూ సభలో చిడతలు వాయించి స్పీకర్ స్థానం పట్ల అమర్యాదగా ప్రవర్తించిన టీడీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెన్షన్ వేటు వేశారు. ఎమ్మెల్యేలు చినరాజప్ప, గొట్టిపాటి రవి, జోగేశ్వరరావు, పి.జి.వి.ఆర్. నాయుడు, ఆదిరెడ్డి భవానీలను రెండు రోజులు (బుధ, గురువారం) సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. వాటర్ బాటిళ్లతో బల్లలపై బాదుతూ.. శాసన సభ బుధవారం ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యురాలు ఆదిరెడ్డి భవాని మద్య నిషేధంపై ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంతో విపక్షం ఆందోళనకు దిగింది. స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని టీడీపీ సభ్యులు నినాదాలకు దిగారు. పోడియంపై చరుస్తూ అమర్యాదకరంగా ప్రవర్తించారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు, మంత్రులు మాట్లాడుతున్న సమయంలో ఆదిరెడ్డి భవాని, గొట్టిపాటి రవి, జోగేశ్వరరావు చిడతలు వాయించి సభను అడ్డుకోవడంతో స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్షల్స్ ద్వారా టీడీపీ ఎమ్మెల్యేలను వారి స్థానాల వద్దకు పంపించారు. స్పీకర్ పోడియం వైపు వెళ్లకుండా మార్షల్స్ నిరోధించడంతో వాటర్ బాటిళ్లతో బల్లలపై చరుస్తూ గందరగోళం సృష్టించారు. ఒకదశలో వారి ప్రవర్తన శృతి మించడంతో స్పీకర్ సస్పెండ్ చేశారు. విపక్ష సభ్యుల ప్రవర్తనపై విచారించి తగిన చర్యలను సూచించాలని నైతిక విలువల కమిటీని ఆదేశించారు. సస్పెన్షన్ ప్రకటన వెలువడిన వెంటనే చిరునవ్వులు చిందిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు సభ నుంచి నిష్క్రమించారు. బాధ్యతారాహిత్యం.. శాసనసభ గౌరవ, మర్యాదలను టీడీపీ సభ్యులు దిగజారుస్తూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆవేదన వ్యక్తం చేశారు. సభ నిర్వహణకు నిమిషానికి రూ.88,802 చొప్పున ప్రజాధనం ఖర్చవుతోందన్నారు. రోజుకు రూ.53 లక్షలకు పైగా వెచ్చిస్తుంటే సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించడం సరి కాదన్నారు. విపక్షం అజెండా ప్రకారం సభ నడవదన్నారు. సభ్యులను సస్పెండ్ చేసిన రోజు తాను ఎంతో వేదనకు గురవుతానని, రాత్రి నిద్ర కూడా పట్టదని చెప్పారు. దేవాలయం లాంటి సభలో చిడతలా? దేవాలయం లాంటి శాసనసభలోకి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాదరక్షలు కూడా బయటే విడిచి వస్తారని, అలాంటి చోట చిడతలు వాయించడం ఏమిటని అంబటి రాంబాబు ప్రశ్నించారు. విపక్షం ఇక శాశ్వతంగా అదేపనికి పరిమితం కానుందని వ్యాఖ్యానించారు. -
మనది సంక్షేమ బ్రాండ్.. నారా వారిది సారా బ్రాండ్
జగనన్న అమ్మఒడి, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ జగనన్న ఇళ్లు, దిశ.. ఇవన్నీ మన బ్రాండ్స్ అయితే.. ఇప్పుడు టీడీపీ నాయకులు ప్రచారం చేస్తున్న ప్రతి బ్రాండ్ చంద్రబాబుదే. బూమ్ బూమ్ బీర్, ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్స్ ఛాయిస్, హెవెన్స్ డోర్, క్రేజీ డాళ్, క్లిఫ్ హేంగర్, రష్యన్ రోమనోవా, ఏసీబీ ఇలాంటివి దాదాపు 254 బ్రాండ్లు చంద్రబాబు తెచ్చినవే. సొంత మామకు వెన్నుపోటు పొడిచి, ఆయన చావుకు కారణమైన ఇదే చంద్రబాబు.. ఎన్నికలు వచ్చినప్పుడు అదే ఎన్టీఆర్ విగ్రహానికి దండ వేస్తాడు. ఇది చంద్రబాబు ట్రేడ్ మార్క్. అలాగే తన హయాంలో ఇప్పుడున్న మద్యం బ్రాండ్లకు, డిస్టిలరీలకు అనుమతులు ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ తానే ప్రెస్‌మీట్ పెట్టి ఇవెక్కడి బ్రాండ్స్? అని ప్రశ్నిస్తాడు. మనిషిగా చంద్రబాబు, పార్టీపరంగా టీడీపీ, మీడియా పరంగా ఎల్లో మీడియా.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ప్రవర్తన ఏపీలో చీప్‌గా ఉంది. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధికారం చేపట్టిన రెండున్నరేళ్లల్లో ఒక్క మద్యం డిస్టిలరీకిగాని, బ్రూవరీకి గాని అనుమతివ్వలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో మద్యం ఉత్పత్తి చేస్తున్న కంపెనీలు బాబు హయాంలో అనుమతులు పొందినవేనని, పైగా టీడీపీ నాయకులు, వారి బంధువులవే ఎక్కువగా ఉన్నాయన్నారు. మనది సంక్షేమ బ్రాండ్ అని.. నారా వారిది సారా బ్రాండ్ అని అభివర్ణించారు. రాష్ట్రంలో అమలవుతున్న మద్యం విధానం, చంద్రబాబు తీరుపై బుధవారం ఆయన అసెంబ్లీలో జరిగిన చర్చలో మాట్లాడారు. టీడీపీ చేస్తున్న దుష్ప్రచారం గురించి రాష్ట్ర ప్రజలకు నిజాలు తెలియాలన్నారు. తమ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే పరమావధిగా పని చేస్తోందని, ముఖ్యంగా అక్క చెల్లెమ్మల ప్రగతికి పలు అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. వారికి మరింత రక్షణ చేకూర్చడంలో భాగంగా ఇవాళ 163 దిశ వాహనాలను, 18 రెస్ట్ రూమ్స్, వాష్‌రూమ్స్‌తో కూడిన క్యారవేన్స్ను ప్రారంభించామన్నారు. దిశ యాప్ ద్వారా రాష్ట్రంలో 900కు పైగా ఘటనల్లో అక్కచెల్లెమ్మలను పోలీసులు ఆదుకున్నారన్నారు. ఈ 34 నెలల కాలంలో మహిళా పక్షపాత ప్రభుత్వంగా నిరూపించుకున్నామని చెప్పారు. కానీ టీడీపీ నాయకులకు, చంద్రబాబుకు, అతనికి వంత పాడే మీడియాకు మాత్రం ఇవన్నీ కనిపించడం లేదన్నారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఇవన్నీ మన పథకాలు.. ► అమ్మ ఒడి పథకం ద్వారా రాష్ట్రంలో 43 లక్షల మంది తల్లుల కళ్లల్లో ఆనందం కనిపిస్తుంది. 84 లక్షల మంది పిల్లల మంచి కోసం రూ.13,023 కోట్లు ఇచ్చాం. ► వైఎస్సార్ ఆసరా ద్వారా 79 లక్షల మంది పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు రూ.12,758 కోట్లు ఇచ్చి అండగా నిలిచాం. చేయూత పథకం ద్వారా 25 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.9,180 కోట్లు, కాపునేస్తం ద్వారా మరో రూ.980 కోట్లు, ఈబీసీ నేస్తం ద్వారా మరో రూ.589 కోట్లు అక్కచెల్లెమ్మలకు అందించాం. ► ఈ కార్యక్రమాల పేర్లు విన్నప్పుడు సాధికారిత గుర్తుకొస్తుంది. రాష్ట్రంలో ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా ఆ స్థలాల్లో మొదటి దశ కింద 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభమైంది. తద్వారా అక్కచెల్లెమ్మలకు చేకూరే లబ్ధి దాదాపు రూ.2 – 3 లక్షల కోట్లు ఉంటుంది. ► జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన ఇలా ఏ డబ్బయినా నేరుగా అక్కచెల్లెమ్మల అకౌంట్లలో వివక్ష లేకుండా జమ చేస్తున్నాం. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అక్కచెల్లెమ్మలకు రాజకీయ పదవులిచ్చి మంచి చేశాం. ఇవన్నీ మన కార్యక్రమాలని, పథకాలని గర్వంగా చెప్పుకుంటాం. మంచిని చూసి ఓర్వలేని బాబు ► చంద్రబాబు హయాంలో ఇవేవీ లేవు. మనం మంచి చేసినందుకు అక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఆ బాధ చంద్రబాబు తట్టుకోలేడు. అందుకే రకరకాల రూపాల్లో వికృతంగా బయట పెడుతున్నాడు. జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా మరణాలంటూ, రాష్ట్రంలో చీప్ లిక్కర్ అమ్ముతున్నారంటూ, ఎప్పుడూ వినని పేర్లుతో బ్రాండ్లు వచ్చాయని విషం చిమ్ముతున్నారు. ► చంద్రబాబుకు ఢంకా బజాయించే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లో రోజూ అదే పనిగా క«థనాలు రాస్తున్నారు.. చూపిస్తున్నారు. అక్కచెల్లెమ్మలకు మంచి చేసే ఒక్క పథకం ఆయన చరిత్రలో లేదు. మద్య మహాన్ చక్రవర్తి చంద్రబాబు ► చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 2018 ఫిబ్రవరి 6న ప్రెసిడెంట్ మెడల్‌కు అనుమతిచ్చారు. కాబట్టి దాన్ని టీడీపీ ప్రెసిడెంట్ మెడల్ అనాలి. దానికి మనం అనుమతి ఇచ్చినట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. ► ఇక గవర్నర్స్ రిజర్వ్.. దీనికి 2018 నవంబర్ 5న బాబు అనుమతిచ్చారు. కానీ, మేం రాష్ట్రపతిని, గవర్నర్‌ను అవమానించామని బురద చల్లుతున్నారు. ఇవేగాకుండా నెపోలియన్, ఆక్టన్, సెవెన్త్ హెవెన్ అన్న బ్రాండ్స్ కూడా ఆయనే తీసుకొచ్చారు. వాటన్నింటికి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ 2018 అక్టోబరు 26న అనుమతి లభించింది. వాటన్నింటిపై దృష్టి పెట్టాం ► నాటు సారా తయారీ, అమ్మకాలపై గట్టి నిఘా పెట్టాం. ఎస్ఈబీ ఏర్పాటు చేశాం. మద్యం అలవాటును మానిపించాలని ధరలు పెంచాం. ఆ పని చేస్తే ఎందుకు ధరలు పెంచారని వారే విమర్శించారు. తర్వాత వేరే రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణా పెరుగుతోందని ఎస్ఈబీతో పాటు, ఆ శాఖ నుంచి ఫీడ్‌బ్యాక్ రావడంతో ఆ ధరలను తగ్గించాం. ► మరోవైపు 43 వేలకు పైగా బెల్టుషాపులను, మద్యం షాపులకు అనుబంధంగా ఉన్న 4,380 పర్మిట్ రూమ్‌లను రద్దు చేశాం. మద్యం షాపులను 4,380 నుంచి 2,934కు తగ్గించాం. నిర్ణీత వేళల్లో ఉదయం 11 నుంచి రాత్రి 9 వరకు ప్రభుత్వమే స్వయంగా మద్యం అమ్మకాలు చేపట్టింది. ► కఠినంగా వ్యవహరిస్తున్నాం కాబట్టే ఈ రెండేళ్లలో 14.32 లక్షల లీటర్ల సారా నిల్వలను ధ్వంసం చేశాం. ఈ ప్రభుత్వ హయాంలోనే సారా తయారు చేస్తున్నట్లు చంద్రబాబు, ఎల్లో మీడియా ప్రచారం చేస్తుండటం దారుణం. టీడీపీ హయాంలో సారా లేదా? టీడీపీ హయాంలో సారా కట్టడి కోసం ఐదేళ్లల్లో 1,42,228 కేసులు పెడితే, మన ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో 1,09,983 కేసులు నమోదు చేశాం. సమస్య నాటు సారాది కాదు. నాటు నారాది. కల్తీ అయినా, విషమైనా వారి మనసులోనే ఉంది. అధికారం లేదన్న కడుపు మంట. బాబు చెప్పినట్టు మద్యం హెల్త్ డ్రింక్ కాదు ► బీరు, లిక్కర్ ఏదైనా ఒక ప్రొసీజర్ ప్రకారం అనుమతి ఇచ్చిన ఆల్కహాల్ శాతంతో, లైసెన్స్డ్ డిస్టిలరీలు మాత్రమే తయారు చేస్తాయి. అందుకే ఇక్కడ బ్రాండ్ ముఖ్యం కాదు. ప్రాసెస్ విధానమే ప్రధానం. ఏ ప్రాసెస్ లేకుండా తయారు చేసే మద్యం చాలా ప్రమాదకరం. ► డిస్టిలరీలు, బ్రూవరీల్లో తయారయ్యే మద్యం తక్కువ ప్రమాదకరం. బాబు హయాంలో చెప్పినట్లు ఇవేవీ హెల్త్ డ్రింక్స్ కాదు. అవి తాగితే మంచిది అని ఆయన ఉద్బోధించారు. నాటుసారా తాగితే ఎక్కువ ప్రమాదం. లిక్కర్ తాగితే తక్కువ ప్రమాదం. అందుకే ఏదైనా కూడా తక్కువ ప్రమాదకరమా? ఎక్కువ ప్రమాదకరమా? అన్నది చూడాలి. ప్రభుత్వం ఎవరిదున్నా.. బ్రాండ్ల మద్యం తయారీ ఒక్కలాగే ఉంటుంది. ప్రాసెస్‌లో మార్పులు ఉండవు. రాష్ట్రంలో చీప్ లిక్కర్ లేదు జంగారెడ్డిగూడెంలో సహజ మరణాలను కల్తీ మద్యం మరణాలని చిత్రీకరించడానికి చంద్రబాబు, ఆయనకు బాకా ఊదే పచ్చ మీడియా చేయని ప్రయత్నం లేదు. అక్కడ కల్తీ సారా తాగి చనిపోయారంటూ కొన్ని పేర్లతో ఈనాడులో కథనం రాశారు. జరగనిది జరిగినట్లు చూపించాలని విషపూరితమైన కుట్ర మనస్తత్వంతో చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 రాష్ట్రంలో రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని చెప్పడానికి వేరే నిదర్శనం అవసరం లేదు. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా ప్రాసెస్ చేసిన, లైసెన్స్డ్ డిస్టలరీస్ నుంచి వచ్చే లిక్కర్ తప్ప చీప్ లిక్కర్ అనేది లేదు. తమ వాళ్లవి సాధారణ మరణాలే అని సంబంధిత కుటుంబాల వారే చెబుతుండగా (వీడియో ప్రదర్శించారు), కాదు కాదంటూ టీడీపీ, ఎల్లో మీడియా శవ రాజకీయం చేస్తోంది. దుర్బుద్ధితో దుష్ప్రచారం ► లిక్కర్ తయారీ విధానంలో 2019 తర్వాత మనందరి ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదు. తయారీ సంస్థలన్నీ పెద్ద లైసెన్స్డ్ డిస్టిలరీలే. ఇవి జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లిక్కర్‌ను తయారు చేస్తాయి. ప్రతి దశలోనూ క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది. ► కంపెనీల నుంచి బాటిల్స్‌ను బయటకు ఇచ్చేటప్పుడు కూడా పరీక్షిస్తారు. మన అధికారులు చాలా టెస్టులు చేస్తారు. అలాగే ప్రభుత్వం ఫలానా బ్రాండ్‌కు అనుకూలం అనో, మరో బ్రాండ్‌కు వ్యతిరేకం అనో ఉండదు. ఇక్కడ బ్రాండ్ పేరు ప్రధానం కాదు. మద్యం నిర్ధారించిన ప్రమాణాలతో, లైసెన్స్డ్ డిస్టిలరీల నుంచి వస్తుందా.. లేదా అనేదే ముఖ్యం. ఆ ప్రోడక్టుకు పవర్ స్టార్ 99 పేరు పెడతారా? లెజెండ్ 999 అని పెడతారా? బూమ్‌బూమ్ అని పెడతారా.. అన్నది మాకు సంబంధించిన అంశం కాదు. ► ఈ విషయాలన్నీ తెలిసీ కూడా బాబు దుర్బుద్ధితో కొత్త తతంగానికి తెర లేపారు. లిక్కర్లో ప్రమాదకర పదార్థాలు ఉన్నాయని, ఎస్జీఎస్ ల్యాబ్స్ ఈ విషయాలు చెప్పిందని తప్పుడు ప్రచారం మొదలుపెట్టాడు. ఐఎంఎఫ్ఎల్ బ్రాండ్లను చీప్ లిక్కర్ అని, నాటు సారా అనే ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. ► రాష్ట్రానికి లిక్కర్ ద్వారా ఆదాయం రాకూడదని.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవాలనే దుర్బిద్ధితో, దురాలోచనతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి, ఆ ల్యాబ్‌ను సంప్రదిస్తే, వారు లిఖిత పూర్వకంగా అలాంటివేవీ లేవని సమాధానమిచ్చారు. ► బీఐఎస్ స్టాండర్డ్స్లోని ఐఎస్ 4449 విస్కీ, ఐఎస్ 4450 బ్రాందీ ప్రమాణాల ప్రకారం పరీక్షించలేదని, శాంపిల్స్ ఇచ్చిన వ్యక్తులు ఈ స్టాండర్డ్స్ ప్రకారం పరీక్షలు చేయమని అడగలేదని ఎస్జీఎస్ చెప్పింది. పైగా వారిచ్చిన శాంపిల్స్‌లో ఉన్న పదార్థాలు హానికరమని తాము నిర్ధారించలేదని స్పష్టం చేశారు. ► వారిచ్చిన శాంపిల్స్ ఎక్కడి నుంచి తెచ్చారో తెలియదు. వాటిని ట్యాంపర్ చేయడానికీ అవకాశాలున్నాయి. బాబుగారి పాలనలో అవే లైసెన్స్డ్ డిస్టిలరీల నుంచి బయటకు వచ్చిన లిక్కర్ తాగితే హెల్త్ డ్రింక్.. మన హయాంలో అయితే అదే లిక్కర్ విషం అట. ఆపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడూ వదల్లేదు ► హైదరాబాద్ బ్రాండ్ విస్కీలకు 2017 నవంబరు 22న అనుమతిచ్చారు. వీరా, బ్లామ్‌డే వంటి బ్రాండ్లతో పాటు, బూమ్ బూమ్ బీర్ అట.. ఇవన్నీ శ్రీమాన్ మద్య మహాన్ చక్రవర్తి చంద్రబాబుగారి హయాంలోనే వచ్చాయి. ► చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019 ఏప్రిల్, మే నెలలో క్రేజీ డాల్, రాయల్ స్వీట్ డీలక్స్, 999 లెజెండ్ విస్కీ, న్యూకింగ్ లోయెస్ట్ 14, ప్రెసిడెంట్ మెడల్ ఫైన్ విస్కీ, ఏడీ 79 ట్రిపుల్ ఎక్స్ రమ్, బీరా 91, బ్లాండ్ సమ్మర్ లేజర్ బీర్, క్లిఫ్ హ్యాంగర్ బ్రాండ్లకు అనుమతిచ్చారు. ► 2019 మే 14న కూడా బూమ్ బూమ్ బీర్‌కు అనుమతి ఇచ్చాడు. హైవోల్టేజ్ గోల్డ్ బీర్, ఎస్ఎన్జె బీర్, బ్రిటిష్ ఎంపైర్ బీర్ ఇవన్నీ బాబుగారి హయాంలోనే రంగ ప్రవేశం చేశాయి. ► 2018 నవంబర్‌లో రాయల్ ప్యాలెస్ బ్రాండ్లు, సైనౌట్లు వచ్చాయి. నిజానికి స్పెషల్ స్టేటస్, త్రీ క్యాపిటల్స్ అనే బ్రాండ్లు లేవు. మన ప్రభుత్వం మీద బురద చల్లడానికి సోషల్ మీడియాలో స్టిక్కర్స్ తగిలించి ఫేక్ ట్రోల్స్ చేశారు. ఇంత దుర్మార్గమైన మనుషులు ప్రపంచంలో ఎక్కడా ఉండరు. ► 2016లో చంద్రబాబు ఉషోదయం పేరుతో సారాకు వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేశారు. విచిత్రంగా ఇదే పెద్దమనిషి ఐదేళ్లల్లో 254 బ్రాండ్లు, ఏడు డిస్టిల్లరీలకు అనుమతిచ్చి లిక్కర్ విక్రయాలను ప్రమోట్ చేశారు. ఆ కంపెనీలన్నీ టీడీపీ వారివే ► ఈ డిస్టిలరీలు, బేవరేజెస్లు అన్నీ టీడీపీకి చెందిన వారివే. ఎస్పీవై బ్రాండ్ ఎవరిది? ఎస్పీవై రెడ్డి టీడీపీ నాయకుడు కాదా! విశాఖ డిస్టిలరీకి 2019 ఫిబ్రవరి 25న అనుమతిచ్చారు. అది టీడీపీకి చెందిన అయ్యన్నపాత్రుడి కంపెనీ. దాన్ని గత ఏడాది అమ్మేశానని చెప్పారు. అంటే ఏడాది క్రితం వరకు ఆయనదే కదా! ఎన్నికల ముందు అనుమతి ఇచ్చారా? లేదా? పీఎంకే డిస్టిలరీ యనమల రామకృష్ణుడి వియ్యంకుడిది కాదా? శ్రీకృష్ణా డిస్టిలరీ ఆదికేశవులునాయుడిది కాదా? ఆయన టీడీపీ నాయకుడే కదా! ► దత్తపుత్రుడు పేరు మీద, బావమరిది పేరుతో లెజెండ్, ట్రిపుల్ 9 పవర్ స్టార్ బ్రాండ్లు తీసుకొచ్చారు. కాకపోతే రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5 గుర్తుకు రాలేదేమో.. వారికి కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోయారు. ఇవన్నీ చంద్రబాబు స్వయంగా అనుమతి ఇచ్చినవే. అలాంటప్పుడు వాటిని చీప్ లిక్కర్ అంటూ మనపై ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు? ఆ బ్రాండ్లు బాబు తెచ్చినవే ► బాబు హయాంలో 254 బ్రాండ్స్ వచ్చాయి. ఇవేకాకుండా ఆయన దత్తపుత్రుడు పేరుతో పవర్‌స్టార్ 999, బావమరిది పేరుతో లెజెండ్ కూడా తెచ్చారు. ఇప్పుడు చంద్రబాబు చెబుతున్న జె బ్రాండ్స్‌ను నిజానికి బాబు బ్రాండ్స్ అనో ఆయన కుమారుడు లోకేశ్ పేరుతో ‘ఎల్’ బ్రాండ్స్ అనో ఎందుకు పిలవకూడదు? ఎందుకంటే వాటికి మనం అనుమతివ్వలేదు. కానీ మన హయాంలో వచ్చాయంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. ► రాష్ట్రంలో 20 డిస్టిలరీలు ఉంటే వాటికి అనుమతులన్నీ మన ప్రభుత్వం రాక ముందే ఇచ్చారు. 1982కు ముందు ఐదు మాత్రమే ఉంటే.. మిగతావన్నీ ఆ తర్వాత వచ్చాయి. యాజమాన్యం మారిన రెండు కంపెనీలతో కలిపి చంద్రబాబు హయాంలో 14 డిస్టిలరీలకు అనుమతిలిచ్చారు. ► ఇందులో 2014– 2019 మధ్య సీఎంగా చంద్రబాబు ఏకంగా ఏడు డిస్టిలరీలకు అనుమతులిచ్చారు. మనం 16 కొత్త మెడికల్ కాలేజీలు, కొత్త జిల్లాలకు అనుమతులు ఇస్తుంటే.. బాబు మాత్రం 14 డిస్టలరీలకు అనుమతి ఇచ్చారు. అందుకే ఆయన ఇంటి పేరు నారా బదులు సారా అని మార్చుకోవాలి. -
చంద్రబాబుకు రామోజీరావు, రాధాకృష్ణ ఎందుకు గుర్తురాలేదో?: సీఎం జగన్
-
టీడీపీ సభ్యులు అసెంబ్లీకి తాగి వస్తున్నారేమో..?
-
ఒక్కరోజు సభా నిర్వహణకు ఎంత ఖర్చవుతుందో తెలుసా?.. స్పీకర్ ఫైర్
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు మరోసారి సస్పెన్షన్ గురయ్యారు. రెండు రోజుల పాటు టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. అసెంబ్లీలో టీడీపీ సభ్యులు చిడతలు వాయిస్తూ సభా కార్యకలాపాలకు పదేపదే ఆటంకం కలిగించడంతో స్పీకర్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేల తీరును స్పీకర్ తప్పుపట్టారు. ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారంటూ టీడీపీ సభ్యులపై స్పీకర్ తమ్మినేని సీరియస్ అయ్యారు. ఒక రోజు శాసనసభ నిర్వహణకు రూ.53.28లక్షలు ఖర్చవుతుంది. ఒక నిమిషం సభ నిర్వహణకు రూ. 88,802 ప్రజాధనం ఖర్చవుతుంది. ప్రభుత్వం ప్రజా సమస్యల్ని చర్చిండానికి ఇంత ఖర్చుపెడుతుంటే టీడీపీ సభ్యులు సభా సమయాన్ని ఇలా నిరుపయోగం చేయడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కొడాలి నాని వార్నింగ్ దెబ్బకు సైలెంట్ అయిన టీడీపీ సభ్యులు
-
టీడీపీ సభ్యులపై ఆర్థర్ ఫైర్
-
ఎన్నిసార్లు చెప్పాలి.. టీడీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఆగ్రహం
-
సభలో చిడతలు వాయించిన టీడీపీ సభ్యులు
-
మహిళలకు మంచి చేసే మనసు చంద్రబాబుకు లేదు: సీఎం జగన్
-
వాగ్వాదం..అదే గందరగోళం
సాక్షి, అమరావతి: ఒక అబద్ధాన్ని ఎలాగైనా సరే నిజమని నమ్మించడానికి టీడీపీ పడరాని పాట్లు పడుతోంది. శాసనసభలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, బయట ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తూ దిగజారి వ్యవహరిస్తున్నారు. తమ ప్రయత్నంతో కొంత మంది ప్రజలనైనా నమ్మించాలనే వ్యూహంతో సాధారణ మరణాలను కల్తీ మద్యం మరణాలుగా చిత్రీకరించడానికి విఫలయత్నం చేస్తున్నారు. శాసనసభలో 9వ రోజు మంగళవారం ఆ పార్టీ ఎమ్మెల్యేలు రభస సృష్టించారు. సినిమా హాల్‌ను తలపించేలా విజిల్ ఊదుతూ.. బల్లలపై పుస్తకాలతో గట్టిగా చరుస్తూ గందరగోళం సృష్టించారు. సభను అడ్డుకోవద్దని సూచించిన స్పీకర్‌తో వాగ్వాదానికి దిగారు. ఆయన్ను అవమాన పరిచేలా వ్యవహరించారు. సభను అడ్డుకోవడమే లక్ష్యంగా అధికార పార్టీ సభ్యులను కవ్వించేందుకు ప్రయత్నించారు. సభలో ప్రశ్నోత్తరాలు ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యులు ఫ్ల కార్డులు పట్టుకుని, నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం మెట్లపైకి ఎక్కి కల్తీ సారాపై విచారణ చేయాలంటూ అరవడం ప్రారంభించారు. అయినా అధికార పార్టీ సభ్యులు, మంత్రులు ప్రశ్నోత్తరాలను కొనసాగించడంతో ఇంకా రెచ్చిపోయి నినాదాలు చేశారు. స్పీకర్ డౌన్ డౌన్ అంటూ సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. స్పీకర్ పదే పదే వారిని తమ స్థానాల్లో కూర్చోవాలని సూచించారు. ఎంత చెప్పినా వినకపోవడంతో గంట సేపటి తర్వాత స్పీకర్ మార్షల్స్‌ను పిలిచి వారిని బయటకు పంపించాలని చెప్పారు. దీంతో టీడీపీ సభ్యులు పోడియం మెట్ల నుంచి దిగి, వారి స్థానాల వద్ద నిలబడ్డారు. అక్కడ కూడా నినాదాలు చేస్తూ సభ జరక్కుండా అడ్డుకోవాలని చూశారు. ఎంత వారించినా వినకపోవడంతో కొద్దిసేపటి తర్వాత.. అనగాని సత్యప్రసాద్, బెందాళం అశోక్, వెలగపూడి రామకృష్ణబాబు, మంతెన రామరాజులను ఈ సమావేశాల వరకు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. దీంతో ఆ నలుగురితోపాటు మిగిలిన టీడీపీ సభ్యులు కూడా సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. బరితెగించి మరీ అల్లరి.. సస్పెండ్ కాని టీడీపీ సభ్యులు అరగంట తర్వాత మళ్లీ సభలోకి వచ్చారు. చర్చ జరుగుతున్న సమయంలో విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తాను వెంట తెచ్చుకున్న విజిల్‌తో ఊదుతూ అంతరాయం కలిగించారు. దీంతో స్పీకర్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేయగా, అదే పనిగా విజిల్ ఊదారు. ఎంత అల్లరి చేసినా ఇంత వరకు భరించానని, దేనికైనా ఒక హద్దు ఉంటుందని స్పీకర్ మండిపడ్డారు. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు స్పీకర్‌కు వేలు చూపిస్తూ వాగ్వాదానికి దిగారు. స్పీకరే సరిగా వ్యవహరించడం లేదని, తాము గౌరవంగానే ఉంటున్నామని వాదించారు. ఈ సమయంలో సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ.. సభను అడ్డుకోవడానికి విజిల్స్ తెచ్చారని, ఆయుధాలు కూడా ఏమైనా తెచ్చారేమో చూడాలన్నారు. శాసనసభలో విజిల్ వేయడం ఏమిటని, 23 మంది ఎమ్మెల్యేలుంటే 9 మంది సభకు వచ్చి అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్‌ను ‘నువ్వు’ అని సంబోధించడం ఏమిటని కొరుముట్ల శ్రీనివాసులు ప్రశ్నించారు. సినిమా హాలులో వ్యవహరించినట్లు టీడీపీ సభ్యులు చిల్లర వేషాలు వేస్తున్నారని జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు గొడవ మానకపోవడంతో స్పీకర్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు చాలా సంయమనంగా వ్యవహరించానని, దాన్ని అలుసుగా తీసుకుని ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సభలో విజిల్ వేసిన గద్దె రామ్మోహన్, గొడవ చేస్తున్న ఏలూరి సాంబశివరావును ఈ సమావేశాల వరకు, మిగిలిన సభ్యుల్ని ఒకరోజు సస్పెండ్ చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం టీడీపీ సభ్యులు బయటకు వెళ్లిపోయారు. -
టెరాసాఫ్ట్ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడు
సాక్షి, అమరావతి: టెరాసాఫ్ట్ కంపెనీ అధినేత వేమూరి హరిప్రసాద్ చంద్రబాబుకు సన్నిహితుడని అందుకే నిబంధనలు పక్కనపెట్టి ఫైబర్‌నెట్ ప్రాజెక్టు టెండర్లను దానికి కట్టబెట్టారని ఇంధనశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో మంగళవారం ఫైబర్‌నెట్ టెండర్ల గోల్‌మాల్‌పై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఈ టెండర్లలో చాలా అవకతవకలు జరిగాయని, ఇతర కంపెనీల కంటే ఎక్కువకు కోట్ చేసినా ఆ సంస్థకే పనులు అప్పగించారని తెలిపారు. అప్పటి సీఎం చంద్రబాబు కనుసన్నల్లోనే రూ.307 కోట్ల ఈ టెండర్ల ప్రక్రియ జరిగిందన్నారు. ప్రాజెక్టు దక్కించుకున్న కంపెనీ ఎండీ హరికృష్ణప్రసాద్‌నే టెండర్ పత్రాల మదింపు కమిటీ సభ్యుడిగా నియమించారని తెలిపారు. టెండర్లు వేయడానికి ఒకరోజు ముందు ఈ కంపెనీని బ్లాక్‌లిస్ట్ నుంచి తొలగించారని, అది కూడా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన అధికారి కాకుండా కిందిస్థాయి అధికారులు నిబంధనలకు విరుద్ధంగా చేశారని చెప్పారు. ఈ కంపెనీ సరఫరా చేసిన సెట్‌టాప్ బాక్సులు వంటి పరికరాల్లో 20% మాత్రమే ప్రస్తుతం పనిచేస్తున్నాయని, 80 % పనిచేయడంలేదని తెలిపారు. ఈ వ్యవహారాన్ని సీఐడీకి అప్పగించామని, దర్యాప్తు వేగవంతంగా చేపట్టి దోషులను శిక్షిస్తామన్నారు. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ దీనిపై మాట్లాడుతూ ఫైబర్‌గ్రిడ్ టెండర్లలో భారీ అవకతవకలు జరిగాయన్నారు. కంపెనీ ఏర్పాటు చేసి మూడేళ్లు నిండాలి, కనీసం రూ.350 కోట్ల టర్నోవర్ ఉండాలనే నిబంధనలు పాటించకుండా ఈ కాంట్రాక్టును టెరాసాఫ్ట్‌కు అప్పగించారని తెలిపారు. ఇది అవినీతి గ్రిడ్ దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి మాట్లాడుతూ ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టును అవినీతి గ్రిడ్‌గా మార్చారని విమర్శించారు. మార్కెట్లో రూ.2,200కు దొరికే సెట్‌టాప్ బాక్సుని రూ.4,400కి కొనుగోలు చేశారని తెలిపారు. ఫైబర్‌నెట్ ప్రాజెక్టు ఉన్న శాఖ చంద్రబాబు చేతిలో ఉంటే చినబాబు సంతకం పెట్టారని చెప్పారు. ఇలా ఎలా, ఎందుకు చేశారో బయటపెట్టాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం, అమ్మఒడి పథకానికి సంబంధించిన ప్రశ్నలపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ ఇంగ్లిష్ మీడియం బోధన కోసం టీచర్లకు మూడుదశల శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం కీ రీసోర్స్ పర్సన్స్‌కి మూడు వర్సిటీలకు చెందిన నిష్ణాతులైన ప్రొఫెసర్లతో శిక్షణ ఇప్పించామన్నారు. వారిద్వారా జిల్లా, మండల స్థాయిలో శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. సచివాలయ ఉద్యోగులకు జూన్‌లో ప్రొబేషన్ ఖరారు జూన్‌లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్‌ను ఖరారు చేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. సచివాలయ ఉద్యోగులు బాగా పనిచేస్తున్నారని తెలిపారు. ఇటీవల కొంతమంది సచివాలయ ఉద్యోగులు, కార్యదర్శులను తెలుగుదేశం పార్టీ రెచ్చగొట్టి రాజకీయం చేస్తోందని విమర్శించారు. సచివాలయ ఉద్యోగాలను తమ హయాంలో ఇచ్చినట్లు టీడీపీ మాట్లాడుతోందని, ఆ ఉద్యోగాలను సీఎం జగన్ ఇచ్చారని చెప్పారు. వారి పట్ల ప్రభుత్వం బాధ్యతగా ఉందని తెలిపారు. -
సభా సంప్రదాయాలకు టీడీపీ పాతర
సాక్షి, అమరావతి: ‘కోడిపందాల వద్ద, సినిమా హాళ్లలో విజిల్స్ వేసినట్టుగా శాసనసభలో విజిల్స్ వేస్తూ.. గేలి చేస్తూ టీడీపీ సభ్యులు సభా సంప్రదాయాలను దిగజార్చేలా ప్రవర్తిస్తున్నారు. ఇంత బరి తెగింపు ముందెన్నడూ చూడ లేదు. ఎంతో అనుభవం ఉందని చెప్పుకునే టీడీపీ సభ్యులు హేయమైన రీతిలో గాలితనంగా వ్యవహరిస్తున్నారు. వీళ్లు శాసనసభ సభ్యులో.. ఆకతాయిలో అర్థం కావడం లేదు’ అని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. మంగళవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ‘ఈ రోజు ఇంకా దిగజారి విజిల్స్ కూడా వేస్తూ దారుణంగా ప్రవర్తించారు. ప్రజలు అవకాశం ఇచ్చి ఇక్కడికి పంపినప్పుడు ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి సభలో హుందాగా వ్యవహరించాలే తప్ప మరీ ఇంతగా బరి తెగించకూడదు. గత్యంతరం లేక టీడీపీ సభ్యులను సభ నుంచి పంపుతున్నాం. టీవీలో చూస్తోన్న చంద్రబాబును సంతృప్తి పర్చడమే ధ్యేయంగా సభలో దిగజారి ప్రవర్తిస్తున్నారు. అసెంబ్లీ అంటే కోడి పందేల దిబ్బగా దిగజార్చుతున్నామనే స్పృహ కూడా లేదు. ఇలాంటి వాళ్లకు మా గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు’ అని ధ్వజమెత్తారు. కాగా, కొత్తపల్లి సుబ్బారాయుడు నరసాపురం ఎమ్మెల్యేను గెలిపించి తప్పు చేశామని మాట్లాడటం, చెప్పుతో కొట్టుకోవడం వంటి చర్యలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని నాని పేర్కొన్నారు. ఏబీవీ.. పోలీస్ అధికారిగా వ్యవహరించండి ఏబీ వెంకటేశ్వరరావు ఐపీఎస్ అధికారిగా కాదు.. కనీసం హోంగార్డుగా కూడా పనికిరాని వ్యక్తి అని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఇప్పటికైనా టీడీపీ నేతగా కాకుండా ఓ పోలీసు ఆఫీసర్‌గా వ్యవహరిస్తే మంచిదని హితవు పలికారు. ‘ఏబీ వెంకటేశ్వరరావు మా మీద పరువు నష్టం కేసు వేస్తామంటున్నారు. మీతో పాటు టీడీపీ మీద ఐదు కోట్ల ఆంధ్రులు పరువునష్టం దావా వేస్తారు. సీఎంవో ఉద్యోగి శ్రీహరి తన జీవితంతో ఆడుకున్నాడని ఏబీవీ అంటున్నారు. ఐపీఎస్‌గా 30 ఏళ్ల సర్వీసులో ఉండి మిమ్మల్ని మీరే కాపాడుకోకపోతే పోలీస్ అధికారిగా మీరు అన్‌ఫిట్ కదా! పెగసస్ స్పై వేర్‌ను చంద్రబాబు కొనుగోలు చేసినట్టుగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చెప్పారు. ఆమె ఎక్కడా మాట్లాడ లేదని లోకేష్ చెబుతున్నారు. ఆమె ఆ విషయం చెప్పకపోతే నువ్వెందుకు ట్వీట్ చేశావ్ లోకేష్? మీ గెజిట్ ఈనాడులో కూడా వార్తలు వచ్చాయిగా.. కన్పించ లేదా? ఓ సీఎం చెప్పిన విషయంపై చర్చించకుండా ఎలా ఉండగలం? సభలో ఈ అంశంపై చంద్రబాబు, టీడీపీ నేతలు మాట్లాడి ఉంటే బాగుండేది. ఎందుకో పారిపోయారు. వాళ్లే కొనుగోలు చేస్తారు. మళ్లీ దాన్ని కప్పిపుచ్చుకునేందుకు వాళ్లే ఒకరికొకరు వత్తాసు పలుకుతుంటారు’ అని అన్నారు. -
చంద్రబాబు పాపాల వల్లే జాప్యం
సాక్షి, అమరావతి: ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు కమీషన్ల కక్కుర్తితో పాల్పడిన పాపాలే పోలవరం పనుల్లో జాప్యానికి కారణమని జల వనరుల శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. లేదంటే 2021 నాటికే ప్రాజెక్టును పూర్తి చేసేవాళ్లమన్నారు. శాసనసభలో మంగళవారం పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. 1941 నుంచి కాగితాలకే పరిమితమైన పోలవరం ప్రాజెక్టుకు 2004లో దివంగత సీఎం వైఎస్సార్ కార్యరూపం ఇచ్చేందుకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. అయితే కమీషన్ల కోసం పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకునే క్రమంలో రూ.16 వేల కోట్ల అంచనా వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని.. నిధులు ఇస్తామని కేంద్రం షరతు పెడితే దానికి 2016 సెప్టెంబర్ 30న చంద్రబాబు అంగీకరించడం దారుణమన్నారు. నిర్వాసితులకు న్యాయం ‘చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సమస్యలు పరిష్కరించాలని నిర్వాసితులు ఎవరైనా వస్తే పోలీసులతో గెంటేయించేవారు. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ నిర్వాసితులకు మెరుగైన పునరావాసం కల్పిస్తున్నారు. కేంద్రం నిర్వాసిత కుటుంబాలకు రూ.6.50 లక్షల పరిహారం ఇస్తుంటే.. దానికి అదనంగా రూ.3.50 లక్షలు చేర్చి మొత్తం రూ.పది లక్షలు అందిస్తున్నారు. చంద్రబాబుకు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హతే లేదు.’ – బాలరాజు, ఎమ్మెల్యే, పోలవరం -
పోలవరం ఎత్తు ఇంచు కూడా తగ్గదు
పోలవరం ప్రాజెక్టు ఎత్తు ఒక్క ఇంచు కూడా తగ్గదు. చంద్రబాబే ఎత్తు తగ్గుతున్నారు. త్వరలోనే మరుగుజ్జు అవుతారు. దారుణాలు, మోసాలు చేసిన చంద్రబాబును 2019 ఎన్నికల్లో ప్రజలు 23 సీట్లకే పరిమితం చేసి, ఎత్తు తగ్గించారు. పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, పురపాలక ఎన్నికల్లో ఘోరంగా ఓడించి.. మరింత ఎత్తు తగ్గించారు. 2024 ఎన్నికల్లో కుప్పంలోనూ ఓడిపోయి చంద్రబాబు మరుగుజ్జు అవుతారు. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ఎత్తు ఒక్క ఇంచు కూడా తగ్గదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల ఈనాడు, ఆంధ్రజ్యోతిలో పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నట్లు తరచుగా కథనాలను వండివార్చుతున్నారని, వీళ్లకు పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నట్లు ఎవరు చెప్పారని నిలదీశారు. రామోజీరావ్, రాధాకృష్ణలు తన దగ్గరకు ఎలాగూ రారని.. అలాంటప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ బెడ్రూమ్లోకి వెళ్లి అడిగారా? అని ప్రశ్నించారు. అబద్ధాలకైనా, వక్రీకరణ కైనా హద్దు పద్దూ ఉండాలన్నారు. శాసనసభలో మంగళవారం పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై జరిగిన చర్చలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన, ప్రస్తుతం జరుగుతున్న పనులను ఆయన వివరించారు. సీఎం ఏమన్నారంటే... ప్రణాళికాయుతంగా పనులు ► మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎగువ కాఫర్ డ్యామ్ పనులను అతి తక్కువ కాలంలోనే పూర్తి చేశాం. గత ఏడాది జూన్ 11న గోదావరిని దిగ్విజయంగా స్పిల్‌వే మీదుగా మళ్లించాం. మెయిన్ డ్యామ్ పనులు చాలా వేగంగా పూర్తి చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. డిజైన్స్‌కు అనుమతి రావడమే పెద్ద సమస్య. సీడబ్ల్యూసీ, కేంద్ర ప్రభుత్వంతో డిజైన్స్‌కు అనుమతి కోసం చర్చలు జరుపుతున్నాం. ► దిగువ కాఫర్ డ్యామ్ పనులకు సంబంధించిన డిజైన్లకు ఇటీవలే అనుమతి వచ్చింది. ఆ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. వరద కారణంగా మెయిన్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో పడ్డ భారీ గుంతలను ఎలా పూడ్చాలన్న దానిపై నెలాఖరులోగా డిజైన్లు ఖరారు అవుతాయని కేంద్ర మంత్రి షెకావత్ అందరికీ ఊరటనిచ్చే మాటలు చెప్పారు. పునరావాసం పనులు చకచకా ► ఐదేళ్లలో నిర్వాసితులకు పునరావాసం కల్పించడంపై చంద్రబాబు పట్టించుకున్న పాపాన పోలేదు. పునరావాసం కల్పించకుండానే కాఫర్ డ్యామ్ పనులు మొదలు పెట్టేశారు. ఆ పనులు పూర్తయ్యుంటే.. ప్రాజెక్టు కోసం భూములిచ్చిన త్యాగమూర్తుల పరిస్థితి ఏంటి? సహాయం చేయలేదు. పునరావాసం కల్పించలేదు. ఇళ్లు కట్టించలేదు. ► మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాధాన్యతా క్రమంలో నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తున్నాం. ప్రాజెక్టులో మొత్తం 373 జనావాస ప్రాంతాలు ముంపునకు గురవుతుంటే.. ఇప్పటికే 27 జనావాస ప్రాంతాలను పునరావాస కాలనీలకు తరలించాం. ► ప్రస్తుతం ఎగువ కాఫర్ డ్యామ్ పూర్తయిన నేపథ్యంలో నీటిమట్టం పెరిగే అవకాశం ఉంది. అందుకే తొలుత 20,496 కుటుంబాలను తరలించాలని లెక్క వేశాం. ఇప్పటికే 7,962 కుటుంబాలను తరలించాం. వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద 3,228 కుటుంబాలకు పునరావాసం కల్పించాం. వాళ్లను తీసేస్తే..17,268 కుటుంబాలకు పునరావాసం కల్పించేందుకు ఇళ్లను వేగంగా కట్టిస్తున్నాం. ఇందులో 11,984 ఇళ్లు పూర్తయ్యాయి. మిగతా 5,284 ఇళ్ల పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆగస్టులోగా 20,496 కుటుంబాలకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పిస్తాం. పనుల్లో ప్రగతి ఇదీ ► స్పిల్‌వే.. 55 మీటర్లు పియర్స్ (కాంక్రీట్ దిమ్మెలు) ఎత్తున నిర్మించాలి. చంద్రబాబు హయాంలో 2 పియర్లను మాత్రమే 32–33 మీటర్లకు లేపి.. ఒక ఇనుపరేకును పెట్టి.. జాతికి అంకితం చేసి.. ప్రాజెక్టు అయిపోయినట్లు ప్రజల్లో భ్రమ కల్పించేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. ► చంద్రబాబు కాంక్రీట్ పనుల ప్రారంభానికి 2016 డిసెంబర్ 30న శంకుస్థాపన చేశారు. ఐకానిక్ బ్రిడ్జి, కాఫర్ డ్యామ్ పనులు ప్రారంభానికి 2017 జూన్ 8న మరో శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ప్రధాన డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్ పూర్తయిందని చెబుతూ 2018 జూన్ 11న మరో శంకుస్థాపన, రేడియల్ గేట్ల తయారీని ప్రారంభిస్తూ 2018 డిసెంబర్ 14న మరో శంకుస్థాపన చేశారు. ► వీటి కన్నా మూడు నెలలు ముందే 2018 సెప్టెంబర్‌లో స్పిల్‌వేలో గేలరీ వాక్ అని పెట్టాడు. ఆయన, ఆయన కుటుంబ సభ్యులు పోలవరం ప్రాజెక్టు అయిపోయిందని భ్రమ కల్పిస్తూ ఫ్యామిలీ టూర్‌కు వెళ్లారు. వారిది భజన.. మాది చిత్తశుద్ధి ► ఎన్నికలు సమీపించడంతో ప్రజలను మోసం చేయడానికి రూ.100 కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టు వద్దకు బస్సులు పెట్టారు. అక్కడికి తీసుకెళ్లిన వారితో ఒక పాట (జయము జయము చంద్రన్నా.. పాట ప్రదర్శన) పెట్టించారు. ప్రజలను ఇంత దారుణంగా మోసం చేశారు కాబట్టే బుద్ధి చెప్పారు. ► మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్పిల్‌వేను, స్పిల్ చానల్‌ను ఏ రకంగా పూర్తి చేశామో స్పష్టంగా కన్పిస్తోంది. అప్రోచ్ చానల్‌ను సేఫ్ లెవల్‌కు పూర్తి చేశాం. స్పిల్ చానల్లో ఫిల్లర్లు కూడా పూర్తి చేయకుండా రెండు ఐరన్ రేకులు పెట్టి, గేట్లు పెట్టామని వాళ్లు ప్రచారం చేసుకుంటే, ఇప్పుడు 48 గేట్లు అమర్చాం. ► ప్రధాన డ్యామ్‌లో గ్యాప్–3ని పూర్తి చేశాం. అన్నిటికీ మించి కీలకమైన ఎగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేశాం. నదిని స్పిల్‌వే మీదుగా మళ్లించడం పూర్తయింది. దిగువ కాఫర్ డ్యామ్ పనులు ముమ్మరంగా చేస్తున్నాం. ఇది పూర్తి కాగానే మెయిన్ డ్యామ్ పనులకు శ్రీకారం చుడతాం. ► హైడల్ పవర్ (జల విద్యుత్) ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయి. కీలక టన్నెల్ నిర్మాణాలన్నీ పూర్తయ్యాయి. ఎడమ, కుడి కాలువకు కనెక్టివిటీ పనులు కొనసాగుతున్నాయి. (పనులు జరుగుతున్న తీరుపై వీడియో ప్రదర్శించారు). ఇంత జరుగుతున్నా మేము చంద్రబాబులా బస్సులు పెట్టలేదు.. జనంతో భజన చేయించుకోలేదు. చిత్తశుద్ధితో చేస్తున్నాం. -
2023 ఖరీఫ్‌కు పోలవరం
నదీ ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వేను కట్టాక.. ప్రధాన డ్యామ్‌ను నిర్మించడానికి వీలుగా ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను నిర్మించాలి. కానీ విజనరీ చంద్రబాబు మాత్రం కట్టీకట్టకుండా స్పిల్ వేను.. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను మధ్యలోనే వదిలేశారు. ఫలితంగా రెండు కిలోమీటర్ల వెడల్పున ప్రవహించాల్సిన గోదావరి నది కుంచించుకుపోయింది. దీంతో ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో, దిగువ కాఫర్ డ్యామ్‌లోను కోతకు గురై గొయ్యిలు ఏర్పడ్డాయి. నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా కాఫర్ డ్యామ్‌ల నిర్మాణం చేపట్టడం వల్ల వరద ఎగదన్ని ముంపు గ్రామాలను చుట్టుముట్టింది. ఇది మనిషి సృష్టించిన విపత్తు (మ్యాన్ మేడ్ డిజాస్టర్). ఈ ఘనత విజనరీ చంద్రబాబుదే. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ఎన్ని అడ్డంకులు ఎదురైనా, వాటిని అధిగమించి 2023 ఖరీఫ్‌కు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తేల్చి చెప్పారు. ప్రధాన డ్యామ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్) డిజైన్లను నెలాఖరులోగా ఆమోదిస్తామని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ హామీ ఇచ్చారని, ఆ మేరకు డిజైన్లను ఆమోదించిన 18 నెలల్లోనే కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఉక్కు సంకల్పంతో పని చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రజల దశాబ్దాల స్వప్నం పోలవరంను సాకారం చేయడానికి దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుడితే.. ఆయన కొడుకుగా ఆ ప్రాజెక్టును తానే పూర్తి చేస్తానని స్పష్టం చేశారు. శాసనసభ్యుల కోరిక మేరకు పోలవరం ప్రాజెక్టు వద్ద వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసి.. ఆ మహానేతకు ప్రాజెక్టును అంకితం చేస్తామన్నారు. దేవుడి దయ.. ప్రజల ఆశీర్వాదంతో ఒక్క పోలవరం ప్రాజెక్టునే కాకుండా రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లోని అన్ని ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో వేగంగా పూర్తి చేసి.. వాటి ఫలాలను రైతులకు అందించే దిశగా చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నామని చెప్పారు. శాసనసభలో మంగళవారం పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై జరిగిన చర్చలో బాబు ప్రభుత్వ హయాంలో జరిగిన, ప్రస్తుతం జరుగుతున్న పనులను ఫొటోలు, వీడియోలు, ఆధారాలతో సహా వివరించారు. ఈ సందర్భంగా సీఎం ఇంకా ఏమన్నారంటే... ఇంకొకరు చేస్తున్నారనే కడుపుమంట ► పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు రోజుకో తప్పుడు ప్రచారం చేయడం.. ఆయనకు బాజా మోగించే ఎల్లో మీడియా దాన్ని ఎత్తుకుని కథనాలను వండి వార్చడం ఈ మధ్య కాలంలో సాధారణమైపోయింది. తాము చేయలేని పనిని ఇంకొకరు చేస్తున్నారనే బాధ, ఆవేదన, అన్నింటికంటే ముఖ్యంగా కడుపు మంట.. ఇవన్నీ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 బ్యానర్ కథనాల్లో మనకు కనిపిస్తున్నాయి. ► 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, 44 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్కటంటే ఒక్కటి కూడా మంచి పని లేదు. తన సొంత జిల్లాలో నీటి సదుపాయం కల్పించడానికి ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేదు. ఈ పరిస్థితిలో పోలవరం ప్రాజెక్టు మన హయాంలో పూర్తవుతుంటే చంద్రబాబుకు కడుపు మంటగా ఉంది. ► విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు అయ్యే ప్రతి పైసాను కేంద్రమే భరిస్తుంది. 2014లో చంద్రబాబు సీఎం అయ్యారు. 2017 వరకు ప్రాజెక్టు పనులను పట్టించుకోలేదు. కమీషన్ల కోసం కక్కుర్తి పడి.. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను తన చేతుల్లోకి తీసుకున్నాడు. ► 2013–14 ధరల ప్రకారమే పోలవరాన్ని కడతానని ఒప్పుకుంటూ కేంద్రానికి సమ్మతి కూడా తెలిపాడు. ఈ విషయాలన్నింటిపై అప్పట్లో ఇదే సభలో నేను ఎంతగానో ప్రస్తావించాను. ఏం ప్యాకేజీ తీసుకుంటున్నావ్ చంద్రబాబూ.. మీకు జ్ఞానం ఉందా ? నువ్వేం అడుగుతున్నావు? వాళ్లేం ఇస్తున్నారు? (వీడియో ప్రదర్శించారు) అని అడిగితే.. మా గొంతు నొక్కేశారు. ► దీనివల్ల కేంద్రం రూ.29,027 కోట్లు మాత్రమే ఇస్తానంటుంది. మేం మాత్రం పట్టు విడవకుండా 2017–18కి సంబంధించిన రేట్ల ప్రకారం రూ.55,656 కోట్లు ఇవ్వాలని అడుగుతున్నాం. మేం అడిగిన ప్రతిసారీ చంద్రబాబు ఒప్పుకున్నాడు కదా అని వాళ్లంటారు. అసలు ఈ ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన బాధ్యత మీదేనని చెబుతున్నాం. ఇలా వాళ్లకు, మాకు మధ్య గొడవ జరుగుతూనే ఉంది. దీనికి తోడు వరదలు, కోవిడ్. ఇన్ని ఇబ్బందుల మధ్య కూడా ఉక్కు సంకల్పంతో అడుగులు ముందుకు వేస్తున్నాం. ఇదీ విజనరీ మేధావితనం ► ప్రపంచంలోనే తానొక పెద్ద మే«థోసంపన్నుడిగా తనకు తాను ఒక ముద్ర వేసుకుని, ఎల్లో మీడియా సహాయంతో దాన్ని ప్రచారం చేసుకునే పెద్దమనిషి చంద్రబాబు. ఈ విజనరీ చేసిన పనులు పోలవరానికి ఎంత శాపంగా మారాయన్నది (పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతం ఫొటోను చూపిస్తూ) అందరికీ తెలియాలి. ► ప్రాజెక్టు డిజైన్ ప్రకారం నదిని కుడివైపు మళ్లించాల్సి ఉంటుంది. నదిని మళ్లించడానికి స్పిల్ వేను ముందు పూర్తి చేయాలి. ఆ తర్వాత నదీ ప్రవాహాన్ని మళ్లించడానికి వీలుగా, ఎగువ కాపర్ డ్యాం, దిగువ కాఫర్ డ్యాంను కట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత కాఫర్ డ్యాంల మధ్యలో ప్రధాన డ్యాం కట్టాలి. ► ఈ పెద్దమనిషి ఏం చేశారంటే.. ఒకవైపు స్పిల్‌వే పని పూర్తి చేయకుండానే, మరోవైపున కాఫర్ డ్యాంలను కట్టడం ప్రారంభించాడు. తద్వారా వరద నీళ్లు దిగువకు పోవడానికి అవకాశమే లేదు. మధ్యలోకొచ్చేసరికి ముంపు గ్రామాలు మునిగిపోతాయని చంద్రబాబుకు జ్ఞానోదయమైంది. దాంతో పనులను మధ్యలో ఆపేశారు. 2 కిలోమీటర్ల పొడవున కట్టాల్సిన కాఫర్ డ్యాంలు కాస్తా అసంపూర్తిగా వదిలేశారు. స్పిల్‌వే పనులు కాలేదు. బాబు పాపాల వల్ల ప్రతిసారీ ఆటంకం ► చంద్రబాబు చేసిన పని వల్ల వర్షాలు, వరదలు వచ్చిన ప్రతిసారీ పనులుకు ఆటంకం కలుగుతోంది. ఒకవైపు వదిలిపెట్టిన కాఫర్ డ్యాం ఖాళీల ద్వారా వరద నీరు రెట్టించిన వేగంతో పోతుంది. మరోవైపు కట్టీకట్టని స్పిల్ వే ద్వారా వరద నీరు పోయే పరిస్థితి. ► అలాంటి పరిస్థితుల్లో అటు స్పిల్‌వే దగ్గర, ఇటు కాఫర్ డ్యాం దగ్గర పనులు చేయడం ఎంత కష్టంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. వరద వచ్చిన ప్రతిసారీ ఈస్పిల్వే ముందున్న అప్రోచ్ ఛానెల్, స్పిల్ వే, కింద ఉన్న స్పిల్ ఛానెళ్లు నీళ్లతో నిండిపోయి ఉంటాయి. ► వరద తగ్గిన తర్వాత కూడా స్పిల్ ఛానెల్లో దాదాపు 2 టీఎంసీలకు పైగా నీటిని మోటార్లు పెట్టి తోడాల్సిన పరిస్థితి. మూడేళ్లుగా ప్రతి వర్షాకాలంలోనూ ఇవే కష్టాలు. దారుణమైన ప్లానింగ్ ► చంద్రబాబు తాను పోతూపోతూ రాష్ట్ర ఖజానాకు ఎంత పెద్ద చిల్లు పెట్టాడో.. పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యాముల్లో అలాంటివే మూడు పెద్ద, పెద్ద ఖాళీలు వదిలిపెట్టాడు. ఎగువ కాఫర్ డ్యామ్‌ను 2,340 మీటర్ల వెడల్పుతో కట్టాలి. కానీ ఒకచోట 480 మీటర్లు, రెండో చోట 400 మీటర్ల గ్యాప్ మేర కట్టకుండా వదిలేశారు. ► దిగువ కాఫర్ డ్యాంలో కూడా 480 మీటర్లు పొడవున కట్టకుండా వదిలేశారు. దీనివల్ల ఆర్థికంగా నష్టంతో పాటు ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగింది. ► కనిష్టంగా 10 లక్షల క్యూసెక్కుల నుంచి గరిష్టంగా 25 లక్షల క్యూసెక్కుల వరకు గోదావరిలో వరదలు వచ్చాయి. స్పిల్‌వే పూర్తి కాలేదు కాబట్టి కాఫర్ డ్యాంల మధ్య ఉన్న ఖాళీల గుండా నీళ్లు పోవాల్సిన పరిస్థితి. – 2.3 కిలోమీటర్ల వెడల్పుతో ప్రవాహించాల్సిన గోదావరి ఎగువ కాఫర్ డ్యామ్‌లో వదిలిన 480 మీటర్లు, 400 మీటర్ల మేర ఖాళీల ద్వారా కుంచించుకుపోయి ప్రవాహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 25 లక్షల క్యూసెక్కుల వరద కాఫర్ డ్యాంల మధ్య నున్న ఖాళీల ద్వారా దిగువకు పోవాల్సిన పరిస్థితి. దీని వల్ల నీటి ప్రవాహ వేగం సెకనకు 2–3 మీటర్ల నుంచి 13.5 మీటర్లకు పెరిగింది. గుంతలు పూడ్చడానికి నిపుణులు మల్లగుల్లాలు ► అధిక వేగంతో వరద ప్రవాహించడం వల్ల ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో బెడ్ లెవల్లో 23 మీటర్లు, పునాది కంటే దిగువన మరో 12 మీటర్లు.. 35 మీటర్ల లోతున కోతకు గురై.. పెద్ద గుంత ఏర్పడింది. ప్రధాన డ్యామ్ గ్యాప్–2 నిర్మాణ ప్రాంతంలో వరద వేగం ఉధృతికి బెడ్ లెవల్లో 8 మీటర్లు.. పునాది లోపల మరో 12 మీటర్లు మొత్తం 20 అడుగుల లోతున కోతకు గురై గుంత ఏర్పడింది. ► దిగువ కాఫర్ డ్యాంలోనూ బెడ్ లెవల్లో 14 మీటర్లు, పునాదిలో మరో 22.5 మీటర్లు మొత్తం 36.5 మీటర్ల లోతున కోతకు గురై గుంత ఏర్పడింది. మెయిన్ డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్ కూడా రెండు వైపులా దెబ్బతింది. ఇదీ చంద్రబాబు విజన్. దీన్ని సరిదిద్దడానికి దేశంలో ఉన్న సాంకేతిక నిపుణులు, కేంద్ర ప్రభుత్వం, సీడబ్ల్యూసీ, ఇంజనీర్లు దగ్గర నుంచి ఐఐటీ నిపుణుల వరకు డిజైన్లును పరిశీలిస్తూ పరిష్కారం కోసం మల్లగుల్లాలు పడుతున్నారు. ► పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు చేసిన దారుణాలు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5కు కన్పించ లేదా? కనీసం వీటి గురించి ఎప్పుడైనా ప్రస్తావన చేశారా? ఇలాంటి ఈ పేపర్లు, టీవీ ఛానెళ్లు ప్రజాస్వామ్యాన్ని కాపాడగలుగుతాయా? ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. -
2018లో చంద్రబాబు రాసిన లేఖను చదివి వినిపించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ యాదవ్
-
దీనిపై ప్రశ్నిస్తే అప్పట్లో అసెంబ్లీలో మా గొంతు నొక్కారు: సీఎం జగన్
-
జయము జయము చంద్రన్న.. వంద కోట్లు దుబారా: సీఎం జగన్
పోలవరం ఎత్తుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న రాద్ధాంతంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, శాసన సభ సమావేశాల్లో ఎండగట్టారు. మంగళవారం సభలో పోలవరంపై స్వల్ఫకాలిక చర్చ సందర్భంగా.. ప్రాజెక్టుకు సంబంధించిన పనుల గురించి వివరిస్తూనే, ప్రతిపక్ష నేత చేస్తున్న తప్పుడు ప్రచారాలను సూటిగా ప్రశ్నించారు సీఎం వైఎస్ జగన్. చంద్రబాబు పాలనలో స్పిల్‌వే కాంక్రీట్ శంకుస్థాపన, ఐకానిక్ బ్రిడ్జ్ అండ్ కాపర్ డ్యామ్ పనుల పేరిట మరో శంకుస్థాపన, పునాది అయిపోయిందని ఇంకో శంకుస్థాపన, స్పిల్‌వేలో గేట్లకు సంబంధించిన పనులకు సంబంధించిన ఓ శంకుస్థాపన..ఇలా అవసరం లేని శంకుస్థాపనలతో కోట్ల ప్రజాధనం వృధా అయ్యిందని గుర్తు చేశారు సీఎం జగన్. గేట్లకు సంబంధించిన.. స్పిల్‌వేలో గ్యాలరీ వాక్ అంటూ కుటుంబ సభ్యులతో ఫ్యామిలీటూర్ చేశారని, తద్వారా పొలవరం పనులు పూర్తయ్యాయనే భ్రమను జనాల్లో కలిగించే ప్రయత్నం చేశారన్నారు సీఎం జగన్. ఇవి మాత్రమే కాదు.. ఎన్నికలకు ముందు ప్రజలను మభ్యపెట్టాలనే ఉద్దేశంతో.. రూ.100 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి బస్సుల్లో జనాలను పొలవరం తరలించారని, ‘జయము జయము చంద్రన్న’ పాటతో ప్రత్యేకంగా భజన సైతం చేయించుకున్నారని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. ఆ సమయంలో జయము జయము చంద్రన్న పాట ప్లే కాగా.. సభ మొత్తం నవ్వులు పూశాయి. కమీషన్ల కోసం కక్కుర్తి పడే ప్రాజెక్టును చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్నారని, పైగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన గొంతు నొక్కారని సీఎం జగన్ గుర్తు చేసుకున్నారు. తమ పాలనలో పొలవరం ప్రాజెక్టుకు సంబంధించిన మెజార్టీ పనులు పూర్తి చేసినట్లు.. పూర్తి వివరాలను సభకు వెల్లడించారు సీఎం జగన్. 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలకు గట్టిగా బుద్ధి చెప్పారని, ఇప్పుడు చేస్తున్న కుట్రలకు వచ్చే ఎన్నికల్లో కుప్పంలోనూ బాబుకు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. వక్రీకరణ, అబద్దాలపై ఆధారపడి రాజకీయాలు చేస్తున్నారని సీఎం వైఎస్ జగన్ అన్నారు. తాను విజనరి అని చెప్పుకునే చంద్రబాబు వల్లే ప్రాజెక్టుకు కష్టాలు వచ్చాయన్నారు సీఎం జగన్. ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నామని చంద్రబాబుకు ఎవరు చెప్పారు? అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేసిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు ఒక్క ఇంచు కూడా తగ్గించమని సీఎం జగన్ సభాముఖంగా స్పష్టం చేశారు. -
అసెంబ్లీలో మరోసారి 'చంద్రన్న భజన' పాట.. నవ్వులే నవ్వులు
-
చంద్రబాబే ఎత్తు తగ్గుతున్నారు: సీఎం జగన్
CM Jagan Speech On Polavaram Project Works: పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే పూర్తి చేయకుండానే కాఫర్ డ్యామ్ కట్టారని, మధ్యలో మూడు పెద్ద ఖాళీలు వదిలి పెట్టారని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రగతిపై స్వల్ప కాలిక చర్చలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆర్థిక నష్టంతో పాటు నిర్మాణంలో విపరీతమైన జాప్యం జరిగిందని తెలిపారు. దిగువ కాపర్‌డ్యామ్‌కు కూడా భారీ నష్టం వాటిల్లిందని, పునాదిపైన, లోపల కలిపి 35.6 మీటర్ల మేర గుంట ఏర్పడిందని తెలిపారు. చంద్రబాబు తప్పిదాలతోనే పోలవరానికి ఈ పరిస్థితి వచ్చిందని సీఎం జగన్ అన్నారు. వక్రీకరణ, అబద్దాలపై ఆధారపడి రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. తాను విజనరి అని చెప్పుకునే చంద్రబాబు వల్లే ప్రాజెక్టుకు కష్టాలు వచ్చాయని తెలిపారు. కమీషన్ల కక్కుర్తితో ప్రాజెక్టును తన చేతుల్లోకి తీసుకున్నారు. 2013-2014 అంచనాల ప్రకారమే ప్రాజెక్టు కడతామని చెప్పారని అన్నారు. దీనిపై ప్రశ్నిస్తే అప్పట్లో అసెంబ్లీలో తమ గొంతు నొక్కారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు కాదు.. చంద్రబాబే ఎత్తు తగ్గుతున్నారని తెలిపారు. చంద్రబాబుకు 2019 ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో కూడా చంద్రబాబుకు ఓటమి తప్పదని అన్నారు. ప్రత్యేక హోదాను తాకుట్టుపెట్టి పోలవరం ప్రాజెక్టును తీసుకున్నారని చెప్పారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నామని చంద్రబాబుకు ఎవరు చెప్పారు? అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేసిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు ఒక్క ఇంచు కూడా తగ్గించమని సీఎం జగన్ తెలిపారు. పోలవరం టూర్ పేరుతో రూ.100 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని సీఎం జగన్ తెలిపారు. పోలవరం వద్ద తన అనుచరులతో చంద్రబాబు భజన చేయించుకున్నారని చెప్పారు. 2023 ఖరీఫ్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని తెలిపారు. ఉక్కు సంకల్పంతో పోలవరం నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. కేంద్రం సమకారంతో ఆర్అండ్ఆర్ పనులు వేగంగా పూర్తి చేస్తామని తెలిపారు. పోలవరం వద్ద వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును వైఎస్సార్‌కు అంకితం చేస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును తన తండ్రి వైఎస్సార్ ప్రారంభించారని ఆయన వారసుడిగా కచ్చితంగా ప్రాజెక్టును తాను పూర్తి చేస్తానని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. -
గద్దె రామ్మోహన్ పై జోగి రమేష్ ఫైర్
-
అసెంబ్లీలోకి కత్తులు ఆయుధాలు తెస్తారా..?
-
టీడీపీ సభ్యులకు కన్నబాబు అదిరిపోయే సమాధానం..
-
టీడీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఫైర్
-
టెరాసాఫ్ట్ కంపెనీ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడు: బాలినేని
-
దోషులను వదలకూడదు అద్యక్ష..
-
వీళ్లా దుర్మార్గానికి ఇప్పటికి అక్కడ నెట్ కనెక్షన్ లేదు
-
పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి తీరుతాం: సీఎం జగన్
-
పెగసస్ వ్యవహారంలో దొరికిపోవడం ఖాయం
సాక్షి, అమరావతి: పెగసస్ వ్యవహారంలో ఉత్తరకుమార ప్రగల్భాలు మాని కేసును ఎదుర్కొనేందుకు లోకేశ్ సిద్ధంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ.. హౌస్ కమిటీ విచారణలో పెగసస్ వినియోగంపై పూర్తి వాస్తవాలు బయటకొస్తాయన్నారు. కోర్టులో స్టే కూడా రాదని.. పూర్తి ఆధారాలతో దొరికిపోవడం ఖాయమన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఎన్నికల్లో గెలవాలనే కుట్రతో వైఎస్సార్సీపీ నాయకులు, ఐఏఎస్ అధికారులు, సామాన్య ప్రజలు, సినిమా యాక్టర్ల ఫోన్లను ట్యాపింగ్ చేసి వ్యక్తిగత సమాచారాన్ని చౌర్యం చేస్తూ దుర్మార్గమైన పాలన సాగించారని విమర్శించారు. దీనిపై అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై కూడా చాలా ఆరోపణలు వచ్చాయని గుర్తు చేశారు. చంద్రబాబు రోడ్లపైన, కొడుకు లోకేశ్ శాసనమండలిలో సవాళ్లను విసరడం అలవాటుగా పెట్టుకున్నారని కన్నబాబు ఎద్దేవా చేశారు. ఏ కేసులోనైనా స్టే తెచ్చుకోవచ్చనే ధైర్యంతో బతుకుతున్నారు తప్ప.. తప్పు చేయలేదనే ధైర్యం వారిలో లేదని ప్రజలందరికీ అర్థమైందన్నారు. జాతీయ భద్రత, ప్రజల ప్రాథమిక హక్కులకు సంబంధించిన అంశంలో చిన్నపిల్లాడిలా సవాళ్లు విసరడం సరికాదని లోకేశ్‌కు హితవుపలికారు. -
సంక్షేమ, అభివృద్ధి పథకాలను అడ్డుకునేందుకే బాబు కుట్ర
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ఆదాయాన్ని తగ్గించేలా చేసి.. సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుకు ఇబ్బందులు సృష్టించి.. పేదలను దెబ్బతీయాలనే లక్ష్యంతోనే మద్యం బ్రాండ్లపై ప్రతిపక్ష నేత చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని డిప్యూటీ సీఎం (ఎక్సైజ్) కె.నారాయణస్వామి మండిపడ్డారు. శాసనసభలో సోమవారం ఆంధ్రప్రదేశ్ రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (సవరణ) బిల్లు–2022ని ఆయన ప్రవేశపెట్టారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో విక్రయిస్తున్న మద్యం బ్రాండ్లన్నిటికీ చంద్రబాబు సర్కారే అనుమతిచ్చిందని గుర్తు చేశారు. ఆ బ్రాండ్లన్నీ టీడీపీ నేతలకు అనుమతిచ్చిన డిస్టిలరీలు, బ్రూవరీల్లోనే తయారవుతున్నాయని ఎత్తిచూపారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఒక్క డిస్టిలరీకిగానీ.. బ్రూవరీకి గానీ అనుమతివ్వలేదని స్పష్టం చేశారు. మద్యం తయారీ విధానం ఏ సర్కార్ హయాంలోనైనా ఒకేవిధంగా ఉంటుందని, అందులో మార్పులు ఉండవని స్పష్టం చేశారు. ఎన్టీఆర్‌కు 1995లో వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే సంపూర్ణ మద్యపాన నిషేధానికి, రూ.2కే కిలో బియ్యం పథకానికి చంద్రబాబు మంగళం పాడారని గుర్తు చేశారు. పేదల కడుపుకొట్టేలా బాబు తీసుకున్న ఈ నిర్ణయాన్ని అప్పట్లో ఎల్లో మీడియా ఖండించలేదన్నారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే.. బాబు మెడలో ఆ బాటిళ్లతో దండలేయండి 2014 నుంచి 2019 దాకా ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు రాష్ట్రపతిని, గవర్నర్‌ను కించపరిచేలా లిక్కర్ బ్రాండ్లకు ప్రెసిడెంట్స్ మెడల్, గవర్నర్స్ రిజర్వ్ వంటి పేర్లతో అనుమతి ఇచ్చారు. గవర్నర్‌ను అవమానపరిచిన చంద్రబాబును రాజ్‌భవన్ ముందు నిలబెట్టి ఆయన మెడలో గవర్నర్స్ రిజర్వ్ బాటిళ్ల దండలు వేయండి. టీడీపీ నేతలైన అయ్యన్నపాత్రుడు, ఆదికేశవులునాయుడు, ఎస్పీవై రెడ్డి, యనమల వియ్యంకుడికి డిస్టిలరీలు, బ్రూవరీల ఏర్పాటుకు చంద్రబాబు అనుమతి ఇచ్చారు. వాటిలోనే ఈ లిక్కర్, బీరు బ్రాండ్లు తయారవుతున్నాయి. వీటినే చీప్ లిక్కర్, నాటు సారా అంటూ చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మద్యాన్ని ఆదాయ వనరుగా చూసి 4,380 మద్యం షాపులు, వాటికి అనుబంధంగా పర్మిట్ రూమ్‌లు, 43 వేల బెల్ట్ షాపులను తన మనుషులు, కార్యకర్తలకు అప్పగించి ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు 24 గంటలూ విక్రయించి దోపిడీ చేశారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక 43 వేల బెల్ట్ షాపులు, 4,380 పర్మిట్ రూమ్‌లను తొలగించి మద్యం దుకాణాలను 2,934కు తగ్గించాం. బిల్లులకు ఆమోదం చర్చ అనంతరం ఏపీ రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్(సవరణ) బిల్లు–2022ను ఆమోదించినట్లు స్పీకర్ తమ్మినేని ప్రకటించారు. ఏపీ చారిటబుల్ అండ్ హిందూ రిలిజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్(సవరణ)–2022 బిల్లును దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ప్రవేశపెట్టగా.. చర్చ అనంతరం బిల్లును ఆమోదించినట్లు స్పీకర్ ప్రకటించారు. -
ఐదు కోట్ల ఆంధ్రుల సమాచారం చోరీ? సభా సంఘానికి సై
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెగసస్ స్పైవేర్ బాగోతంపై సోమవారం అసెంబ్లీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై హౌస్ కమిటీ ఏర్పాటుచేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. గత కొద్దిరోజులుగా ఈ స్పైవేర్ ఉదంతం రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతోంది. టీడీపీ హయాంలో దీనిని కొనుగోలు చేశారన్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆ రాష్ట్ర అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాల్లో దీనిపై పెద్దఎత్తున చర్చ మొదలైంది. రాష్ట్ర శాసనసభలోనూ సోమవారం తీవ్ర దుమారం రేపింది. అప్పటి ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నేతల ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారం కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు, పలువురు సభ్యులు దీనిమీద స్వల్పకాలిక చర్చకు అనుమతించాలని స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరారు. అందుకు స్పీకర్ జోక్యం చేసుకుని నోటీసు ఇచ్చారా ప్రశ్నించారు. దీంతో.. నోటీసు ఇచ్చినట్లు చీఫ్‌విప్ గడికోట శ్రీకాంతరెడ్డి తెలిపారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమం అనంతరం ఈ అంశంపై చర్చ చేపడతామంటూ స్పీకర్ ప్రకటించారు. అనంతరం జరిగిన చర్చలో.. ఈ వ్యవహారం మీద సభా సంఘం ఏర్పాటుచేయాలని సభ్యులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. దీంతో సభా సంఘం ఏర్పాటుచేయడానికి అసెంబ్లీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. అడ్డగోలుగా ఓట్లను తొలగించారు ఇక చర్చలో పాల్గొన్న ఆర్థికమంత్రి బుగ్గన ప్రధానంగా మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వంలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా జరిగిందని, తమకు అనుకూలంగా లేనివారి ఓట్లను అడ్డగోలుగా తొలగించారని, అందుకోసం ప్రభుత్వ వ్యవస్థలను వాడుకున్నారని వివరించారు. తమ రాజకీయ లబ్ధికోసం అప్పటికప్పుడు కొత్త కంపెనీలను సృష్టించి ఇజ్రాయిల్ నుంచి పెగసస్ స్పైవేర్ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసినట్లు వస్తున్న ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేయించాలని కోరారు. ఐటీ గ్రిడ్, సేవామిత్ర ద్వారా ప్రజల స్వేచ్ఛకు చంద్రబాబు భంగం కలిగించారని, ఆ సమయంలో ప్రతిపక్ష వైఎస్సార్సీపీ వేగంగా స్పందించడంతో టీడీపీ కుట్ర భగ్నమైందన్నారు. నిజానికి.. చంద్రబాబు, మమతా బెనర్జీలు కలిసి బీజేపీని ఓడించేందుకు ఒకప్పుడు పనిచేశారని, అలాంటి బెంగాల్ సీఎం ఎలాంటి ఆధారం లేకుండా మాట్లాడరని ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. అలాగే, పెగసస్ స్పైవేర్ వినియోగించారనడానికి.. ప్రతిపక్ష నాయకులు, పారిశ్రామికవేత్తలపై కూడా నిఘా పెట్టారనడానికి కొన్ని సంఘటనలు ఊతం ఇస్తున్నాయని బుగ్గన తెలిపారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే.. గత కొన్ని నెలలుగా దేశంలో ‘పెగసస్’ గురించి వివాదం రగులుతోంది. దీంతో సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఆర్వీ రవీంద్రన్ చైర్మన్‌గా కమిటీని వేసింది. ఇందులో అనుభవజ్ఞులైన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అలోఖ్ జోషి, డాక్టర్ సందీప్ ఓబెరాయ్, మరో ముగ్గురితో కూడిన టెక్నికల్ కమిటీని నియమించింది. అలాగే, దేశంలోని ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ డీన్ అయిన డాక్టర్ నవీన్‌కుమార్ చౌదరి, అమృతా విద్యాపీఠం స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రభాకరన్, ఐఐటీ బాంబే కంప్యూటర్ సైన్స్ విభాగం హెడ్ డాక్టర్ అశ్విని అనిల్‌తో కూడిన కమిటీనీ వేసింది. ఈ నేపథ్యంలో.. ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో అక్కడి సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ‘నాలుగైదేళ్ల క్రితం స్పైవేర్ అమ్మేందుకు ఇజ్రాయిల్ కంపెనీ బెంగాల్ ప్రభుత్వాన్ని సంప్రదించింది. అప్పట్లో రూ.25 కోట్ల మేర అడిగారు.. మేం తీసుకోలేదు. కానీ, అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు స్పైవేర్ తీసుకున్నట్లు నాకు సమాచారం ఉంది’ అని ఆమె చెప్పారు. ఈ విషయాన్ని ఈనాడు పత్రికలో కూడా వచ్చింది. మానవ హక్కులను చోరీ చేసినట్లే ఇక అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న పోలీసు ఉన్నతాధికారి ఇజ్రాయిల్ వెళ్లడం, ఆ తర్వాత ఆయన తనయుడు అప్పటికప్పుడే ఓ కంపెనీని నెలకొల్పడం పలు అనుమానాలను బలపరుస్తున్నాయి. వేరేవారి వ్యక్తిగత విషయాల్లోకి తొంగిచూడటం ఎంతో తప్పని తెలిసినా పెగసస్ స్పైవేర్ కొనుగోలు చేయడమంటే మానవ హక్కులను చోరీ చేసినట్లే. ఈ సాఫ్ట్వేర్ సాయంతో ఏదైనా ఫోన్‌కు మిస్డ్‌కాల్ ఇస్తే ఆ ఫోన్లోకి సాఫ్ట్వేర్ వచ్చేస్తుంది. దీనిద్వారా మనం ఎవరికి ఫోన్ చేస్తున్నామో, మెసేజ్‌లు, వాట్సాప్, కాంటాక్టులు అవతలి వారికి తెలిసిపోతుంది. చివరకు ఫోన్ కెమెరాలోకి కూడా ఆ సాఫ్ట్వేర్ ప్రవేశిస్తుంది. మనం ఎక్కడున్నాం.. ఎవరితో మాట్లాడుతున్నాం.. తదితర వివరాలతో పాటు సమస్త సమాచారం తెలుసుకునేంత అత్యంత ప్రమాదకరమైన సాఫ్ట్వేర్ ఈ పెగసస్. ఎంత భద్రతా ప్రమాణాలున్న ఫోన్ అయినా ఈ సాఫ్ట్‌వేర్‌తో ట్రాక్‌చేసే ప్రమాదముంది. ఇలా పెగసస్‌తో మొత్తం 5 కోట్ల ఆంధ్రులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం మొత్తం 2017, 18, 19లో చోరీకి గురైనట్లు నిర్ధారణ అవుతోంది. దీనిని కొనుగోలు చేశారా? చేసి ఉంటే దీనితో ఏమేం చేశారో చూడాల్సిన అవసరం ఉంది. ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టులు జూలై 2020, 21లో చేసిన దర్యాప్తులో అజర్బైజాన్, హంగేరి, కజకిస్థాన్, మెక్సికో, మొరాకో, రువాండా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో పాటు భారత్‌లో కూడా ఈ పెగసస్ సాఫ్ట్‌వేర్‌ను కొని వినియోగించారని తేల్చారు. పెగాసస్‌పై 2019లో వాట్సప్, ఐఫోన్ కంపెనీలు సైతం ఫిర్యాదులు చేశాయి. ఆఘమేఘాలపై ప్రతిపాదనలు.. కంపెనీ ఏర్పాటు.. ఒప్పందం.. భద్రతా అవసరాల కోసం డ్రోన్లు కొనుగోలు చేయాలని అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు 2017 జూన్ 14న నాటి డీజీపీకి ప్రతిపాదించారు. అలాగే, ఆగస్టు 30న ప్రిన్సిపల్ సెక్రటరీకి అప్పటి డీజీపీ లేఖ రాశారు. అందులో భద్రతా అవసరాల కోసం డ్రోన్లు కొనుగోలు చేయాలని.. ఇంటెలిజెన్స్ చీఫ్ అడుగుతున్నందున వాటిని స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేయాలని కోరారు. దీంతో టెండర్లు ఆహ్వానించారు. నాలుగు కంపెనీలు.. మెస్సర్స్ రేడియల్ట్ కోరల్ డిజిటల్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు, మెస్సర్స్ ఆల్సాఫ్ హెలికైడ్స్ లిమిటెడ్ ఇంగ్లండ్, మెస్సర్స్ ఆర్టీ ఇన్ప్లైటబుల్ ఆబ్జెక్టŠస్ లిమిటెడ్ ఇజ్రాయిల్, మెస్సర్స్ ఎన్‌వీఎం స్కైటెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ గురుగ్రామ్ సంస్థలు ముందుకొచ్చాయి. వీటిలో ఆర్టీ ఇన్ప్లైటబుల్ ఆబ్జెక్టŠస్ లిమిటెడ్ తప్ప మిగతావి వెనక్కి వెళ్లిపోయాయి. మరోవైపు.. ఇజ్రాయిల్‌కు చెందిన ఆర్టీ ఇన్ప్లైటబుల్ ఆబ్జెక్టŠస్ లిమిటెడ్ కంపెనీకి ఇండియాలో డీలర్.. ఏబీ వెంకటేశ్వరరావు కొడుకు చేతన్ సాయికృష్ణకు చెందిన ఆకాశం అడ్వాన్డ్స్ సిస్టమ్స్ కంపెనీ. దీన్ని 2017 జూలై 11న స్థాపించారు. అదే ఏడాది జూన్ 14న ఏబీ వెంకటేశ్వరరావు డ్రోన్లు కొనాలని ప్రతిపాదించారు. అంతేకాదు.. ఏబీ అదే ఏడాది ఏప్రిల్ 2న, నవంబర్ 19న ఇజ్రాయిల్‌కు వెళ్లారు. పరికరాల కొనుగోలుకు రూ.16 కోట్లు మంజూరైన తరువాత.. అది చాలదని చెప్పారు. రూ.3.37 కోట్ల లెఫ్ట్‌ఓవర్ బడ్జెట్ ఉందని.. అర్జెంట్‌గా రూ.16కోట్లతో వాటిని కలిపి అప్పటికే మంజూరైన ప్రాజెక్టులను రద్దుచేసి వాటికి చెందిన రూ.4.80 కోట్లు ఇవ్వాలని లేఖ రాశారు. అలాగే, అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికిల్ డ్రోన్లకు రూ.22.19 కోట్లు, ఎయిరోస్టాట్స్ డ్రోన్లకు రూ.3.31 కోట్లు.. రెండూ కలిపి రూ.25.5 కోట్లు ఇచ్చారు. ఆ తర్వాత పలువురు పోలీస్ ఉన్నతాధికారులు సమావేశమై ఈ డ్రోన్ల ప్రాజెక్టును రద్దుచేశారు. కానీ, ఏబీ వెంకటేశ్వరరావు వాటిని పునరుద్ధరించాలని పదేపదే కోరిన విషయం కూడా కనిపిస్తోంది. ఇజ్రాయిల్ నుంచి పెగసస్ స్పైవేర్, నిఘాకు డ్రోన్లు కొనుగోలు చేసి, వాటితో నాటి ప్రతిపక్ష పార్టీ నేతలపైనా.. సినీ పెద్దలు, పారిశ్రామిక రంగ ప్రముఖులపైనా ప్రయోగించినట్లు ఆధారాలు ఉన్నాయి. వైఎస్సార్సీపీ నేత సజ్జలతో పాటు పార్టీకి చెందిన పలువురి ఫోన్ నంబర్లు అన్నీ కలిపి 2018 డిసెంబర్ 24న అధికారికంగా ట్యాపింగ్‌లో పెట్టారు. ఉగ్రవాదులు, అంతర్జాతీయ నేరస్తులకు సంబంధించిన జాబితాలో వీరి నెంబర్లు కూడా చేర్చారు. దీంతో సజ్జల రామకృష్ణారెడ్డి అప్పట్లో అఫిడవిట్ సమర్పించారు. వ్యతిరేకులపై పెగసస్ ప్రయోగం అంతేకాదు.. చంద్రబాబు హైదరాబాద్‌లో ఐటీ గ్రిడ్ పేరుతో ప్రత్యేక విభాగాన్నే ఏర్పాటుచేసి ప్రజలపై ప్రయోగించారు. రాజకీయ నేతలతో పాటు ప్రతి ఓటరుపై నిఘా పెట్టేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఐటీ గ్రిడ్ కంపెనీ మీద 2019 మార్చి 2న మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. సేవా మిత్ర యాప్ ద్వారా ప్రతీ ఓటరు మీద నిఘా పెట్టి తద్వారా వారు ఏ పార్టీకి ఓటు వేసేందుకు అవకాశం ఉందో తెలుసుకున్న తరువాత వారి పేర్లను జాబితా నుంచి తొలగించేందుకు ప్రయత్నించినట్లు ఆధారాలు కనిపిస్తున్నాయి. అంతకుముందు.. 2016లో టీడీపీ ప్రజా సాధికార సర్వేను మొదలుపెట్టి పథకాల లబ్ధిదారుల వివరాలు తీసుకుంది. తరువాత ఆర్టీజీఎస్ అనే వ్యవస్థ పెట్టి డేటా అంతా ఇంటిగ్రేట్ చేసుకున్నారు. ‘1100’ నెంబర్ ద్వారా పథకాలన్నీ అందుతున్నాయా అని ఫోన్లు చేసేవారు. ఎవరైనా టీడీపీ పాలన బాగోలేదని చెబితే.. వారిని ఓటరు జాబితా నుంచి తొలగించే వారు. నిజానికి.. లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడు అశోక్ దాకవరం రాష్ట్ర ప్రజల ఆధార్ డేటాను అనైతికంగా, చట్టవిరుద్ధంగా చోరీచేసి ఐటీ గ్రిడ్‌కు ఇచ్చారు. సేవామిత్ర ట్యాబ్‌ల్లో ఆ డేటా అంతా ఉంది. వీటన్నింటి ఆధారాలను సభ ముందుంచుతున్నా. వ్యక్తిగత సమాచారం చోరీ చేయడం, ఓట్లను తొలగించడం, ఫోన్లు ట్యాంపరింగ్ చేయడం వంటి తీవ్ర ఆరోపణలపై లోతుగా విచారణ జరిపి ఈ మొత్తం అంశంపై సభా సంఘం ఏర్పాటుచేసి గత టీడీపీ ప్రభుత్వ నేరాలపై విచారణ చేయాలి.. అని బుగ్గన కోరారు. ‘మండలి’లోనూ పట్టు మరోవైపు.. పెగాసెస్ అంశంపై హౌస్ కమిటీ ద్వారా లేదా మరో రూపంలో విచారణ జరిపించాలని శాసన మండలిలోనూ పలువురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, మహ్మద్ ఇక్బాల్, మొండితోక అరుణ్‌కుమార్, కృష్ణరాఘవ జయేంద్ర భరత్‌లు సభలో దీనిపై మాట్లాడారు. ఈ సమయంలో బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ.. ఏ నిబంధన ప్రకారం ఈ అంశంపై చర్చకు అనుమతించారని చైర్మన్ మోషేన్‌రాజును ప్రశ్నించారు. దీనికి ఆయన బదులిస్తూ.. ఇది చర్చకాదని, సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారని చెప్పారు. -
ఇది రాష్ట్రానికే కాదు దేశ భద్రతకు సంబంధించినది: మంత్రి బుగ్గన
-
దమ్ము ధైర్యం ఉంటే సింగల్ గా పోటీ చేయండి..
-
హిందూ ద్రోహులు గా నిలిచిపోతారు: మంత్రి వెల్లంపల్లి
-
ప్యాలస్‌లో ఉన్నావా.. కరకట్ట కొంపలో ఉన్నావా? నీ ముఖారవిందాన్ని చూడాలి..!
-
ఈ తండ్రి కొడుకులు తక్కువోళ్ళు కాదు: అంబటి రాంబాబు
-
ఆర్టీసీ కారుణ్య నియామకాలుపై పేర్నినాని క్లారిటీ..
-
ప్రతిపక్షం అంటే ఇదా..!
-
ఆ రోజు చంద్రబాబు చాలా బాధపడ్డాడు
-
ఇది గౌరవ సభ.. రౌడీల్లా ప్రవర్తించొద్దు
సాక్షి, అమరావతి: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో టీడీపీ సభ్యుల తీరు మారలేదు. జంగారెడ్డిగూడెంలో మద్యం మరణాలంటూ అసత్య ఆరోపణలతో సోమవారమూ గందరగోళం సృష్టించారు. వారి నిరసనలు శృతి మించడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఉన్న టీడీపీ సభ్యులను ఒకరోజు సస్పెండ్ చేశారు. సభ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు పోడియం చుట్టిముట్టి నినాదాలు చేశారు. వారి నిరసనల మధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని కొనసాగించారు. పది నిమిషాల తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ, అనగాని సత్యప్రసాద్ స్పీకర్‌కు రక్షణగా ఉన్న సిబ్బందిని తోసేశారు. ఇది సరైన పద్థతి కాదని, వారి స్థానాల్లో కూర్చోవాలని స్పీకర్ హితవు చెప్పారు. అయినా వినకపోవడంతో మార్షల్స్ వచ్చి టీడీపీ సభ్యులను వారి స్థానాల వద్దకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి వారు వీరంగం సృష్టించారు. ఖాళీ వాటర్ బాటిళ్లు, పుస్తకాలతో బల్లలను చరుస్తూ, స్పీకర్‌ను నిందిస్తూ నినాదాలు చేశారు. దీనిపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇది గౌరవ శాసన సభ. బజారు కాదు. మీరు వీధి రౌడీలు కారు. ఇలా ప్రవర్తించడం సరికాదు. సభకు, స్పీకర్ స్థానానికి గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి. సంస్కారం, మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నారు. మత్స్యకారుల సమస్యలు, మహిళా సంక్షేమం వంటి ముఖ్యమైన అంశాలపై చర్చ జరుగుతుంటే ఈ విధంగా ప్రవర్తించడం సరికాదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఉన్న తెలుగుదేశం పార్టీ సభ్యులందరినీ ఒక రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. టీడీపీ సభ్యులు సభ నుంచి వెళ్లిన అనంతరం స్పీకర్ మాట్లాడుతూ.. ‘ప్రతి రోజూ సభను అడ్డుకోవడమే లక్ష్యంగా వస్తున్నారు. గత వారం రోజులుగా మంచి అంశాలపై చర్చలో పాల్గొనలేకపోయారు. కనీసం గౌరవ సభకైనా గౌరవం ఇవ్వాలిగా. గవర్నర్‌కు, స్పీకర్‌కు, ప్రజలు ఎన్నుకున్న సీఎంకు కూడా గౌరవం ఇవ్వడంలేదు. ఇలాంటి ప్రవర్తనకు అడ్డుకట్ట వేయాల్సిందే. స్పీకర్‌కు ఉన్న విచక్షణాధికారాలు ఉపయోగించడం చాలా చిన్న పని. కానీ సభను గౌరవంగా నడపాలని చూస్తుంటే అల్లరి మూకలు మాదిరిగా బాటిళ్లు, పుస్తకాలు చించుతూ ఇష్టం వచ్చినట్లు కేకలు వేయడం సహించలేనిది. ఎన్ని రూలింగ్స్ ఇచ్చినా ఉపయోగం లేకుండా పోతోంది. ఇటువంటి ప్రవర్తన పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవడానికి సభ్యులు ఎథిక్స్ కమిటీకి సూచనలు ఇవ్వాలి’ అని కోరారు. చదవండి: ఏపీ ప్రభుత్వ చొరవ.. అమూల్ రాకతో పాలకు మంచి ధర కఠిన చర్యలు తీసుకోండి టీడీపీ సభ్యులు సభలో గందరగోళం సృష్టిస్తున్నారని, సభ ఔన్నత్యాన్ని కాపాడాలని మంత్రి కన్నబాబు కోరారు. ‘చంద్రబాబు సభను అకారణంగా బాయ్‌కాట్ చేసి ఎక్కడో కూర్చొని సభలో రాజకీయాలు చేస్తున్నారు. బాబులాంటి దిగజారుడు రాజకీయాలు చేసే నాయకుడు ఎవరూ ఉండరు. దుర్మార్గంగా సభా సమయాన్ని అడ్డుకుంటున్నారు. ఎథిక్స్ కమిటీలో కీలక నిర్ణయాలు తీసుకోవాలి. టీడీపీ సభ్యులను కంట్రోల్ చేయకపోతే సభ ఔన్నత్యం దెబ్బతింటుంది’ అని కన్నబాబు అన్నారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ భక్తులు అయ్యప్పమాల వేసుకుంటే ప్రభుత్వం ఆదాయం పడిపోతుందంటూ బహిరంగంగా భాదపడిన వ్యక్తికి లిక్కర్ అమ్మకాలపై మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. గత ప్రభుత్వం విచ్చలవిడిగా కొత్త బ్రాండ్లు, డిస్టలరీలకు అనుమతినిచ్చి రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారించిందని, ఇప్పుడు కొత్త నాటకాలకు తెరతీస్తున్నారని విమర్శించారు. -
పెగాసస్ స్పైవేర్ వ్యవహారం.. విచారణకు హౌస్ కమిటీ
-
వివిధ శాఖల పద్దులపై ఎమ్మెల్యేలు ఏమన్నారంటే..
సాక్షి, అమరావతి: శాసనసభలో గురువారం రోడ్ల నిర్మాణం, నీటి పారుదల, వ్యవసాయం, పశుసంవర్థక, పౌరసరఫరాలు తదితర శాఖల పద్దులపై పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడారు. బాబు ఒక్క ఫ్లైఓవర్నూ కట్టలేకపోయారు చంద్రబాబు ఐదేళ్లు అధికారంలో ఉండి కనకదుర్గ ఫ్లైఓవర్‌ను కూడా పూర్తి చేయలేకపోయారు. అలాంటి వ్యక్తి అమరావతి నిర్మిస్తానని ప్రగల్భాలు పలకడం విడ్డూరం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూడేళ్లలో 1,943 కిలోమీటర్లను అభివృద్ధి చేసింది. మరో 365 కిలోమీటర్లకు సంబంధించి కేంద్రాన్ని ఒప్పించి రూ.2,305 కోట్లు మంజూరు చేయించాం. గతంలో టీడీపీ నుంచి కేంద్ర మంత్రులున్నా కూడా.. వారు చేయలేని పనిని మూడేళ్లలో సీఎం వైఎస్ జగన్ చేసి చూపించారు. – కొఠారు అబ్బయ్య చౌదరి సీమలో సమృద్ధిగా నీళ్లు.. రాయలసీమలో నీళ్లు పారించిన ఘనత దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కే దక్కుతుంది. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్న సమయంలో సీమ నుంచి వేల కుటుంబాలు వలసపోయాయి. చంద్రబాబు ఇకనైనా కోర్టుల ద్వారా దొంగ యుద్ధం చేయడం మానుకోవాలి. – శ్రీధర్‌రెడ్డి రైతులకు ఉత్తమ సేవలు.. ప్రభుత్వం నుంచి రైతులు కోరుకునేది జాలి కాదు.. ఉత్తమ సేవలు. సీఎం జగన్ మొక్కవోని దీక్షతో రైతులకు అత్యుత్తమ సేవలందిస్తున్నారు. వ్యవసాయంలో ఏపీ దేశంలోనే టాప్‌లో నిలిచింది. ఈ విషయాన్ని కేంద్రమే వెల్లడించింది. రైతులకు పగటిపూట ఉచిత విద్యుత్ అందించే ఫీడర్లు, లైన్ల ఆధునీకరణకు ప్రభుత్వం రూ.1,700 కోట్లు ఖర్చు చేసింది. – సామినేని ఉదయభాను ఆర్థిక ఇబ్బందుల్లోనూ రైతులపై ప్రేమ తగ్గలేదు.. కరోనా వల్ల రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టినా సీఎం జగన్‌కు రైతులపై ఉన్న ప్రేమ తగ్గలేదు. వారికి మేలు చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. 2014లో రైతు రుణ మాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. వారిని వంచించారు. నీరు–చెట్టు, రెయిన్ గన్లు.. ఇలా ప్రతి దాంట్లో దోపిడీ చేశారు. సాగునీటి ప్రాజెక్టులపైనా బాబుకు చిత్తశుద్ధి లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు మేలు చేసేందుకు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ప్రాజెక్టులనూ పూర్తి చేస్తున్నారు. – తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వేగంగా భైరవానితిప్ప ప్రాజెక్టు.. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని భైరవానితిప్ప ప్రాజెక్టుకు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత అసలు పట్టించుకోలేదు. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఈ ప్రాజెక్టుపై దృష్టి పెట్టారు. 1,406 ఎకరాల భూసేకరణ పూర్తయ్యింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల్లో చాలా గ్రామాలకు సాగునీటి అవసరాలు తీరుతాయి. – ఉషశ్రీ చరణ్ శంకుస్థాపన చేసి.. ప్రాజెక్టు పూర్తయినంత ప్రచారం భైరవానితిప్ప ప్రాజెక్టుకు కేవలం శంకుస్థాపన చేసి.. నీళ్లు తెచ్చేశామంటూ గతంలో టీడీపీ నాయకులు ప్రచారం చేసుకున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి సీఎం జగన్ అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. – కాపు రామచంద్రారెడ్డి వైఎస్ జగన్‌ది గొప్ప సంకల్పం ప్రజలకు మేలు చేయాలన్న గొప్ప సంకల్పం సీఎం వైఎస్ జగన్‌ది. వైఎస్సార్ తర్వాత రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక్కరే. – కాటసాని రాంభూపాల్‌రెడ్డి -
ఇంత చీప్ ట్రిక్స్ ఎందుకు బాబూ?
సాక్షి, అమరావతి: అసెంబ్లీలో టీడీపీ తీరును వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాకర్‌బాబు, జోగి రమేష్ తీవ్రంగా తప్పుబట్టారు. ఒక అబద్ధాన్ని అదే పనిగా చెబుతూ... దాన్ని నిజం చేయడానికి ఆ పార్టీ ఎంతకైనా దిగజారుతోందని మండిపడ్డారు. గురువారం వారు ‘సాక్షి’తో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడికి సూటిగా కొన్ని ప్రశ్నలు సంధించారు. ఆ ప్రశ్నలిలా ఉన్నాయి. ► జంగారెడ్డి గూడెమేమీ పల్లెటూరు కాదు. 55 వేలకు పైగా జనాభా ఉన్న మున్సిపాలిటీ. డీఎస్పీ స్థాయి అధికారితో పాటు పోలీసులు, సచివాలయం.. అందులో మహిళా పోలీసులు.. ఇలా పెద్ద వ్యవస్థే ఉంది. అలాంటి చోట ఎవరికీ తెలియకుండా సారా కాయటం సాధ్యమా? ► ఈ ప్రభుత్వం వచ్చాక మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయని ఆరోపిస్తున్నది మీరే. సారా పెరిగిపోయిందంటున్నదీ మీరే! మద్యం అమ్మకాలు అంతలా పెరిగినప్పుడు సారా కూడా పెరిగిందని చెప్పటం పరస్పర విరుద్ధం కాదా? ఎందుకీ దివాలాకోరుతనం? ► మద్యం వినియోగం తగ్గించడానికి మేం ఆరంభం నుంచీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది నిజం కాదా? షాక్ కొట్టేలా రేట్లు పెట్టాం. ప్రైవేటుకిస్తే బెల్టు షాపుల నియంత్రణ కష్టమని భావించి మద్యం దుకాణాలను ప్రభుత్వమే తీసుకుంది. షాపులకు అనుబంధంగా ఉండే పర్మిట్ రూమ్‌లనూ రద్దు చేశాం. మద్యం రేట్లు పెంచారు కనక అక్రమ మద్యం, నాటుసారా పెరుగుతోందని విమర్శలకు దిగిందీ మీరే. ఇçప్పుడు రేట్లు తగ్గించినా కూడా నాటు సారాను ప్రోత్సహిస్తున్నామని ఆరోపిస్తున్నదీ మీరే! బుద్ధుండాలి బాబూ? ► స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను (ఎస్ఈబీ) ఏర్పాటు చేసింది అక్రమ మద్యాన్ని, నాటు సారాను అడ్డుకోవటానికే కదా? ఉక్కుపాదం మోపుతూ ఎస్ఈబీ 13 వేలకు పైగా కేసులు పెట్టింది. ఇది మా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం కాదా? ఏం.. సారా గతంలో లేదా? ఎప్పట్నుంచో ఉందన్నది అందరికీ తెలుసు. కట్టడి చేయటానికి మేం చిత్తశుద్ధితో శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో సహజ మరణాలను సారా మరణాలుగా చిత్రీకరించడానికి మీరు ఇంత కుట్రలకు దిగటమే దారుణం. ► ఈ మరణాలేమైనా ఒక్కరోజులో జరిగాయా? 3–4 వారాల వ్యవధిలో జరుగుతూ వస్తున్నాయి. శవాలు ఎప్పుడో పూడ్చేశారు. అయినా కానీ నిజానిజాలు తేల్చాలన్న చిత్తశుద్ధితో ప్రభుత్వం కొన్ని శవాలను వెలికి తీయించి పరీక్షలకు పంపించింది. సంఘటన జరిగిన వెంటనే ఆరోగ్య శాఖ మంత్రి అక్కడకు వెళ్లారు. మీరేమో 26 మంది చనిపోయారంటారు. మీ అచ్చెన్నాయుడేమో 15 మంది అంటూ ఓ జాబితా విడుదల చేశాడు. రేపు మరో నాయకుడొచ్చి మరో సంఖ్య చెబుతాడు. అంటే మీకు నిజాలతో పని లేదన్నట్టేగా? ప్రభుత్వంపై, సీఎంపై నోటికొచ్చిన విమర్శలు చేయటమే మీ ఉద్దేశమని తెలియటం లేదా? ఛీ.. ఇంత దిగజారిపోతారా బాబూ..!! -
అబద్ధాలపై టీడీపీ అదే యాగీ
సాక్షి, అమరావతి: ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి టీడీపీ నాలుగు రోజులుగా పడరాని పాట్లు పడుతూ దిగజారి వ్యవహరిస్తోంది. వాస్తవాలకు పాతరేసి, శవ రాజకీయం చేస్తోంది. బయట చంద్రబాబు, సభలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు నానా యాగీ చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యేలు అరుపులు, కేకలతో మితిమీరి ప్రవర్తించారు. శాసనసభాపతిని, ముఖ్యమంత్రిని కించపరుస్తూ నినాదాలు చేశారు. కాగితాలు చింపి స్పీకర్‌పైకి విసురుతూ సభా కార్యాక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరుగుతున్నంత సేపు సభాపతి వారిస్తున్నా వినిపించుకోకుండా చప్పట్లు కొడుతూ, వాటర్ బాటిళ్లతో బల్లలపై కొడుతూ గోల గోల చేశారు. ఉదయం సభ ప్రారంభం కాగానే తెలుగుదేశం సభ్యులు యథావిధిగా స్పీకర్ వెల్‌ను చుట్టుముట్టి అరుపులు, నినాదాలతో సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. గీత దాటితే వేటే అని రెండు రోజుల క్రితం స్పీకర్ ఇచ్చిన రూలింగ్‌ను ఉల్లంఘిస్తూ పోడియం పైకి ఎక్కి సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. చినరాజప్ప, ఆదిరెడ్డి భవాని, వేగుళ్ల జోగేశ్వరరావు తదితరులు మెట్లపై కూర్చొని నిరసన కొనసాగించారు. టీడీపీ సభ్యులకు ప్రతి రోజూ ఇది ఆనవాయితీగా మారిపోయిందని, దయచేసి ఎవరి స్థానాల్లో వారు కూర్చోవాలని స్పీకర్ కోరారు. అనగాని సత్యప్రసాద్, మరికొందరు సభ్యుల ప్రవర్తనపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం అంశంపై ప్రభుత్వం ప్రకటన చేసినందున, మరోసారి చర్చించే అవకాశంలేదని స్పష్టం చేశారు. అయినప్ప టికీ వారు దూసుకొస్తుండటంతో స్పీకర్ ఆదేశాల మేరకు మార్షల్స్ అడ్డుకున్నారు. స్పీకర్, సీఎంను కించపరుస్తూ నినాదాలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లకుండా మార్ష ల్స్ అడ్డుగా నిలబడటంతో తెలుగుదేశం సభ్యులు వారి సీట్ల వద్ద నిలబడి సభాపతిని, సీఎంని కించపరుస్తూ గట్టిగా నినాదాలు చే శారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరగకుండా గట్టిగా శబ్దం చేస్తూ అడ్డుకోజూశారు. కొంత మంది కాగితాలు ఉండలుగా చుట్టి స్పీకర్ పోడియంపైకి విసిరారు. మరికొందరు నిబంధనలకు వ్యతిరేకంగా సభలో దృశ్యాలను సెల్ఫోన్లలో చిత్రీకరించి, వాట్సాప్ ద్వారా ఎప్పటికప్పుడు బయటకు పంపారు. ఈ విషయం స్పీకర్ దృష్టికి వెళ్లడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఒక్క సభ్యుడు కూడా సెల్ఫోన్లను సభలోకి తీసుకు రాకూడదని అప్పటికప్పు డు రూలింగ్ ఇచ్చారు. మార్షల్స్ వారి విధి నిర్వహణలో భాగంగానే టీడీపీ సభ్యులను పోడియం నుంచి వారి స్థానాలకు పంపించారన్నారు. ఎవరి స్థానాల్లో వారు కూర్చోవాలని పలుమార్లు సూచించినప్పటికీ, వారు వినిపించుకోక పోవడంతో ఒక రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో వారు ఈలలు వేస్తూ బయటకు వెళ్లడం చూసి మిగతా సభ్యులు విస్మయానికి గురయ్యారు. బాబు డైరెక్షన్లో శవ రాజకీయాలు అంతకుముందు టీడీపీ సభ్యుల ప్రవర్తనపై అధికార పార్టీ సభ్యులు పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సభ్యులు చంద్రబాబు డైరక్షన్లో ప్రతి రోజూ ఎదో ఒక రీతిలో గిల్లి కజ్జాలు పెట్టుకొని సభను అడ్డుకుంటున్నారని విమర్శించారు. వారు సస్పెండ్ అయిన తర్వాతే సభ జరిగే విధంగా ఒక స్పష్టమైన కార్యాచరణతో వస్తున్నారని చెప్పారు. సభాకాలాన్ని హరిస్తున్న వీరిని తక్షణం సస్పెండ్ చేయాలని కోరారు. ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వివరణను తెలుగుదేశం పార్టీ సభ్యులు తప్పుదోవ పట్టిస్తున్నారని, సభను ఎంత ప్రశాంతంగా నడపాలని చూస్తున్నా వారు గొడవ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని విమర్శిస్తే ఊరుకునేది లేదని, నిరసన తెలపడానికి కూడా ఒక పద్ధతి ఉంటుందని, ఇది సరైన విధానం కాదన్నారు. శ్మశానాల వద్ద మనుషులను పెట్టి కొత్త శవాల కోసం తెలుగుదేశం పార్టీ సభ్యులు వెతుకుతున్నారంటూ ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి విమర్శించారు. దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ శ్మశాన వాటికకు కేరాఫ్ అడ్రస్‌గా టీడీపీ ఆఫీసు మారిందన్నారు. -
‘కూన’పై స్పీకర్‌కు నివేదిక ఇస్తాం
సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ను ప్రివిలేజ్ (సభాహక్కుల) కమిటీ విచారించింది. ఈ అంశంపై శాసనసభ ప్రస్తుత సమావేశాలు ముగిసేలోపుగానీ, తర్వాతగానీ స్పీకర్‌కు నివేదిక ఇస్తామని ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. స్పీకర్ తమ్మినేని సీతారాంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలంటూ గతంలో ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీచేసింది. వ్యక్తిగత కారణాల వల్ల విచారణకు హాజరుకాలేకపోతున్నానని అప్పట్లో కూన రవికుమార్ కమిటీకి తెలిపారు. శాసనసభ వాయిదాపడ్డాక గురువారం చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి అధ్యక్షతన ప్రివిలేజ్ కమిటీ సమాశమైంది. కమిటీ సూచన మేరకు వ్యక్తిగతంగా విచారణకు హాజరైన కూన రవికుమార్ తాను స్పీకర్ తమ్మినేనిపై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఈ వివరణ ఆధారంగా కూన రవికుమార్‌ను ప్రివిలేజ్ కమిటీ విచారించింది. అనంతరం గోవర్ధన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ స్పీకర్‌పై కూన రవికుమార్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు. ప్రివిలేజ్ కమిటీకి వచ్చిన ఇతర పిటిషన్లపైన కూడా విచారించి స్పీకర్‌కు నివేదిక ఇస్తామని తెలిపారు. -
సచివాలయాల్లో అవినీతి రహిత సేవలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామస్థాయిలోనే అవినీతి రహిత, సత్వర సేవలను అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలో భాగంగానే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ రూపుదిద్దుకుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 15,004 సచివాలయాల ద్వారా 34 శాఖలకు చెందిన 543 సేవలను ప్రజల ముంగిటకు తీసుకొచ్చినట్లు చెప్పారు. వైఎస్సార్సీపీ సభ్యులు కైలే అనిల్‌కుమార్, అంబటి రాంబాబు, రాజన్నదొర, బియ్యపు మధుసూధన్‌రెడ్డి, కేవీ ఉషశ్రీ చరణ్‌లు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటివరకు 3.54 కోట్ల సేవల కోసం ప్రజల నుంచి సచివాలయాలకు వినతులు అందగా, వాటిల్లో 3.52 కోట్ల వరకు పరిష్కారమయ్యాయన్నారు. అన్ని సంక్షేమ పథకాలు, సర్టిఫికెట్లు, కేంద్రం ఇచ్చే ఆధార్, పాసుపోర్టు సేవలతో పాటు రిజిస్ట్రేషన్లు కూడా గ్రామాల్లోనే సచివాలయాల ద్వారా కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల ముందు బాబు వస్తే జాబు వస్తుందని చంద్రబాబు గోడల మీద రాయించారని, కానీ సీఎం జగన్ 1.35 లక్షల మందికి సచివాలయ ఉద్యోగులుగా.. 2.65 లక్షల మందికి వలంటీర్లుగా మొత్తం దాదాపు 4 లక్షల మందికి ఏకకాలంలో ఉద్యోగావకాశాలు కల్పించి చరిత్ర సృష్టించారన్నారు. ఉత్తమ వలంటీర్లకు పురస్కారాలు వలంటీర్లకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామని, సేవామిత్ర కింద రూ.10,000, సేవారత్న కింద రూ.20,000, సేవావజ్ర కింద రూ.30,000 చొప్పున నగదు ప్రోత్సాహం, ఒక సర్టిఫికెట్, బ్యాడ్జి, శాలువతో సన్మానిస్తున్నామని.. ఇందుకోసం ఈసారి బడ్జెట్లో రూ.258.37 కోట్లు కేటాయించినట్లు పెద్దిరెడ్డి తెలిపారు. కోవిడ్ కష్టకాలంలో వారి సేవలు వెలకట్టలేనివన్నారు. మరో ప్రశ్నకు మంత్రి బదులిస్తూ.. తూర్పు గోదావరి జిల్లాలోని సముద్రతీర ప్రాంతంలో మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం వాటర్ గ్రిడ్ పథకం కింద రూ.1,650 కోట్లకు పరిపాలనా అనుమతి జారీచేసినట్లు తెలిపారు. దీని ద్వారా 1,603 ప్రాంతాలకు రక్షిత మంచినీటి సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ సందర్భంగా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సీఎం వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఒక్క పాఠశాల మూతపడదు రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, రాష్ట్రంలో ఏ ఒక్క పాఠశాల మూతపడదని ఆ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సభలో వెల్లడించారు. టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ప్రతీ సబ్జెక్టుకు నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉండాలనే లక్ష్యంతో సబ్జెక్టు టీచర్లను బట్టి తరగతులను విలీనం చేస్తున్నాం కానీ పాఠశాలలు మూయడంలేదని స్పష్టంచేశారు. ఆక్వా రైతుల విద్యుత్ సబ్సిడీకి రూ.970.90 కోట్లు రాష్ట్రంలో ఆక్వా రైతులకు ప్రభుత్వం యూనిట్ రూ.1.50లకే సబ్సిడీపై విద్యుత్‌ను అందిస్తోందని, దీనికి ఏటా రూ.970.90 కోట్లు వ్యయం అవుతున్నట్లు ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. గతంలో యూనిట్ విద్యుత్ రేటు రూ.3.86గా ఉండేదన్నారు. తమ ప్రభుత్వం ఇప్పటివరకు సబ్సిడీ రూపంలో వారికి రూ.2,113 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చిందన్నారు. గిరిజనులకు రూ.4,968.25 కోట్లు.. ఇక గిరిజనులకు ‘నవరత్నాల’ ద్వారా రూ.4,968.25 కోట్ల లబ్ధిచేకూర్చినట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్పశ్రీవాణి ప్రకటించారు. ఈ పథకాల ద్వారా మొత్తం 13,22,266 మందికి ప్రయోజనం లభించిందన్నారు. సెల్ఫోన్లు, రికార్డర్లకు అనుమతిలేదు ప్రశ్నోత్తరాల కార్యక్రమం ముగిసిన తర్వాత సభాపతి తమ్మినేని సీతారాం పలు అంశాలపై రూలింగ్‌లు ఇచ్చారు. సభలోకి సభ్యులు సెల్ఫోన్లు, రికార్డర్లు తీసుకురావడం, కాగితాలు చింపి విసరడం, సభ్యులు మాట్లాడుతున్నప్పుడు ఇతర సభ్యులు అంతరాయం కలిగించడాన్ని అనుమతించబోమన్నారు. టీడీపీ సభ్యులు మార్చి 16న ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసు నిబంధనలకు లోబడి లేకపోవడంతో తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. నాటుసారా, నాణ్యతలేని మద్యం అంశాలపై అదే పార్టీ ఎమ్మెల్యే మంతెన రామరాజు ఇచ్చిన వాయిదా తీర్మానాన్నీ తిరస్కరిస్తున్నట్లు చెప్పారు. -
పేదల గుండెల్లో వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘స్వాతంత్య్రానంతరం ఇందిరమ్మ, ఎన్టీఆర్, డాక్టర్ వైఎస్సార్ హయాంలోనే పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం జరిగింది. వైఎస్సార్ హయాంలో 23 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఇళ్ల పట్టాల కోసం సెంటు భూమి సేకరించలేదు. పార్టీలకతీతంగా ప్రతి నిరుపేదకు సొంత ఇల్లు నిర్మించాలన్న తపనతో సీఎం జగన్ 30.76 లక్షల మంది ఆడపడుచులకు ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాల ద్వారా రూ.4 లక్షల కోట్ల విలువైన సంపదను సృష్టిస్తున్నారు. పేదల గుండెల్లో నిలిచిపోతారు’ అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణంపై శాసనసభలో గురువారం జరిగిన చర్చలో ఆయన సమాధానమిస్తూ మాట్లాడారు. తొలి దశలో రూ.28 వేల కోట్లతో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. ఇప్పటికే 11.65 లక్షల ఇళ్లు గ్రౌండింగ్ కాగా, 3 లక్షల ఇళ్లు బేస్మెంట్ స్థాయిలో ఉన్నాయని చెప్పారు. గృహ నిర్మాణంలో రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందని తెలిపారు. 40 పార్టీలు కలిసొచ్చినా భయం లేదు నాలుగు పార్టీలు కాదు.. 40 పార్టీలు కలిసొచ్చి పోటీ చేసినా.. 20 ఏళ్ల పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉంటారు. 80 శాతం మంది ప్రజలు, దేవుడి ఆశీర్వాదం మా నాయకుడికే ఉంది. ఆయన్ను ఎదుర్కొనే సత్తా ఏ ఒక్కరికీ లేదు. తెలంగాణాలో 5.72 లక్షల ఇళ్లు, తమిళనాడులో 5 లక్షల ఇళ్లు, కేరళలో 5.19 లక్షల ఇళ్లు, కర్ణాటకలో లక్ష ఇళ్లు నిర్మిస్తే ఏపీలో ఏకంగా 30.76 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ఈ విషయంలో సీఎం జగన్ దేశానికే రోల్ మోడల్‌గా నిలిచారు. మా చిన్నప్పుడెప్పుడో ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తే నేటికీ చెప్పుకుంటున్నాం. ఇకపై మరో వెయ్యేళ్లు వైఎస్ జగన్ గురించి చెబుతారు. నేడు జగనన్న ఇంటిని చూపించి ఆడ పిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. – బియ్యపు మధుసూదనరెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే -
నిద్రపోనివ్వలా...లాస్ట్ కి ఏమైంది