సాక్షి, అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్ష తెలుగు దేశం తీరు తీరు మారడం లేదు. పదేపదే సభను అడ్డుకోవడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఇవాళ పదకొండు మంది టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశారు.
అంతకు ముందు.. అసెంబ్లీలో టీడీపీ సభ్యులు హుందాగా ప్రవర్తించాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హితవు పలికారు. అయినా వాళ్ల తీరు మారలేదు. స్పీకర్ పోడియం చుట్టు ముట్టి నిరసన తెలియజేశారు. హుందాగా వ్యవహరించాలని.. ఇటు సీఎం జగన్, అటు స్పీకర్ సైతం కోరినా టీడీపీ సభ్యులు వెనక్కు తగ్గలేదు. దీంతో ఏపీ శాసన సభ నుంచి 11 మంది టీడీపీ సభ్యులను ఒక్కరోజు సస్పెండ్ చేశారు స్పీకర్ సీతారాం.
టీడీపీ సభ్యులు అశోక్ బెందాళం, ఆదిరెడ్డి భవాని, చినరాజప్ప, గణబాబు, భోగేశ్వరరావు, రామకృష్ణబాబు, రామరాజు, గొట్టిపాటి రవి, ఏలూరు, సాంబశివరావు, సత్యప్రసాద్‌లను సస్పెండ్ అయినవాళ్లలో ఉన్నారు. అంతకుముందు సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. సభలో టీడీపీ సభ్యులు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment