Tammineni Sitaram
-
ఆముదాలవలసలో థర్మల్ పవర్ ప్లాంట్ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలి
-
థర్మల్ పవర్ ప్లాంట్ ఎలా పెడతారో చూస్తా.. తమ్మినేని వార్నింగ్
-
హోం మంత్రి కాదు మైకుల మంత్రి: సీదిరి అప్పలరాజు
సాక్షి,శ్రీకాకుళం: వైఎస్ జగన్ హయాంలో అన్ని వర్గాలకు రక్షణ కల్పించారని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. మహిళల భద్రత కోసం దిశ చట్టం తీసుకొచ్చారన్నారు. సోమవారం(అక్టోబర్ 28)శ్రీకాకుళంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి సీదిరి మీడియాతో మాట్లాడారు.‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో టీడీపీ నాయకులు అరాచకం సృష్టిస్తున్నారు. పలాసలో మైనర్ బాలికలపై టీడీపీ నేతలు అత్యాచారం చేశారు. నిందితులను టీడీపీ నాయకులు వెనకేసుకొచ్చారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై పోలీస్‌స్టేషన్‌లోనే దాడి చేశారు. టీడీపీ నాయకులు దాడి చేస్తుంటే పోలీసులు నిలువరించలేకపోయారు. లాఅండ్ఆర్డర్ కంట్రోల్లో పెట్టడంలో హోం మంత్రి విఫలమయ్యారు. హోం మంత్రి అనిత మైక్‌ల మంత్రిగా మారారు.చంద్రబాబు అసమర్థత వల్ల పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైంది. కాశీబుగ్గలో దాడికి పాల్పడిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలి. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకపోతే పోలీస్‌స్టేషన్‌కు పసుపు రంగు వేస్తాం’అని సీదిరి హెచ్చరించారు.ఇదీ చదవండి: విద్యుత్ చార్జీలు పెంచితే ఉద్యమిస్తాం: రాచమల్లు -
బాబు పై తమ్మినేని పంచులే పంచులు
-
తల్లికి వందనం పోయి నాన్నకు ఇంధనం తెచ్చిన ఘనత చంద్రబాబుదే : తమ్మినేని
శ్రీకాకుళం : తల్లికి వందనం పోయి నాన్నకు ఇంధనం తెచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందని అన్నారు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం. శుక్రవారం ఆమదాల వలస పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలోని వైఎస్సార్సీపీ కార్యకర్తల సమావేశంలో తమ్మినేని సీతారాం పాల్గొన్నారు.ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారు...మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే చూస్తూ ఊరుకోం. స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ మంత్రి పదవి రాలేదని ఫస్ట్ రేషన్ తో బెదిరింపులకు పాల్పడుతున్నారు. టీడీపీ నేతల మీ ఉడత ఊపులకు ఎవరూ భయపడరు. సూపర్ సిక్స్ పథకం ఏమో తెలియదు కానీ సూపర్ సిక్స్ బీరు ప్రవేశపెట్టడం చూశాం. తల్లికి వందనం పోయి నాన్నకు ఇంధనం తెచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కింది. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో పేదలు భయబ్రాంతులకు గురవుతున్నారు’ అని సీఎం చంద్రబాబు ప్రభుత్వంపై తమ్మినేని సీతారాం మండిపడ్డారు. -
‘గుడ్ బుక్ రాస్తాం.. అండగా ఉంటాం’
శ్రీకాకుళం, సాక్షి: శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడుగా ధర్మాన కృష్ణదాస్, పార్లమెంట్ కో ఆర్డినేటర్‌గా తమ్మినేని సీతారాం, రాష్ట్ర వైఎస్సార్సీపీ డాక్టర్స్ సెల్ అధ్యక్షుడుగా సీదిరి అప్పల రాజు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడారు. ‘‘భవిష్యత్తు అంతా వైఎస్సార్సీపీ పార్టీదే. కూటమి పాలనలో పధకాలన్నీ కొట్టుకుపోయాయి. పార్టీ కష్టకాలంలో కార్యకర్తలకు అండగా ఉంటాం’’ అని అన్నారు.మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడారు. ‘‘పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు ఎవరైనా పనిచేస్తారు. పార్టీ అధికారంలో లేనప్పుడు బరువు మోయడమే అసలైన పని. శ్రీకాకుళం పార్లమెంటరీ పార్టీ పరిశీలకులుగా జగన్ పనిచేయమన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటాం. 4 నెలలో ప్రభుత్వం పూర్తి విఫలమైంది. ప్రజలను పూర్తిగా మోసం చేశారు. నేను ఆముదాలవలసలోనే ఉంటా.. ప్రజల కోసమే పనిచేస్తా. అమ్మఒడి, రైతు భరోసా, పెన్షన్ అన్ని ఆగిపోయాయి. నిత్యవసరాలు ఆకాశానంటుతున్నాయి. ధరల కంట్రోల్‌కి బడ్జెట్లోనే మేం నిధులు ఇచ్చేవాళ్లం. నాలుగు నెలలో రూ. 30 వేల కోట్లు అప్పుచేశారు. మెడికల్ సీట్లు ఇవ్వొద్దని కేంద్రానికి లేఖ రాయడం ఎంత దారుణం?. పేదల విద్యార్దులకు సీట్లు రాకుండా చేయడానికే కదా. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తున్నారు. వరద సహాయం పేరుతో అక్రమాలు చేశారు’’ అని అన్నారు.అనంతరం మాజీ మంత్రి సీదిరి అప్పల రాజు మాట్లాడుతూ, ‘‘ కార్యకర్తలు కసితో పనిచేస్తున్నారు. సీఎం చంద్రబాబు మాయమాటలు చేబుతూనే వస్తున్నారు. బిర్యాని వస్తుందని పలావు పెట్టే వారిని ఓడించారు. ఇప్పుడు పలావు, బిర్యానీ రెండూ లేవు. వంద రోజుల్లో ప్రజలు వాస్తవాలు గ్రహిస్తున్నారు. గుడ్ బుక్ రాస్తాం.. ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటాం. ప్రజా సమస్యలపై పోరాడటం మొదలు పెడతాం’’ అని పేర్కొన్నారు. -
ఎంపీకే రక్షణ లేకపోతే.. సామాన్యుల పరిస్థితేంటి?: తమ్మినేని
సాక్షి,అమరావతి : టీడీపీ ప్రభుత్వంపై వైఎస్సాఆర్సీపీ సీనియర్ నేత,మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే హత్యలు, దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ”రాష్ట్రంలో టీడీపీ దాడులు దౌర్జన్యాలు పాల్పడుతోంది... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆస్తులతో పాటు ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేస్తున్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది... రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎక్కడా పుల్ స్టాప్ పెట్టాలని లేదా చంద్రబాబు ?. చంద్రబాబు అనుకూల మీడియాతో ప్రజలను మభ్యపెడుతున్నాడు. ఎన్నికల టైం నుంచి చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా అసత్య ప్రచారం చేస్తుంది. 55 రోజుల్లో చంద్రబాబు రోజుల్లో టీడీపీ పాలన రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది.ఎంపీకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి? ఐదేళ్లలో 2 లక్షల 71 వేల కోట్ల నగదు నేరుగా పేదలకు మా ప్రభుత్వం డీబీటీ ద్వారా అందించింది.7.8 వేల కోట్ల రూపాయలు చంద్రబాబు అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ట్ర ఖజానాలో ఉంది. కానీ చంద్రబాబు ప్రజలను తప్పుడు లెక్కలు చెపుతూ ప్రజలను మభ్య పెడుతున్నారు. అందుకు ఎల్లోమీడియా వంతపాడడం విడ్డూరంగా ఉందని” మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం దుయ్యబట్టారు. -
అధికారంలోకి రాగానే నరకం చూపిస్తున్నారు
-
ఎన్నికల ఫలితాలపై తమ్మినేని రియాక్షన్
-
బస్సు యాత్ర జనసంద్రాన్ని చూసి చంద్రబాబు తట్టుకోలేకపోయాడు
-
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చట్ట ప్రకారమే చర్యలు: స్పీకర్ తమ్మినేని
-
AP: 8 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
సాక్షి, అమరావతి: పార్టీ ఫిరాయించిన 8 మంది శాసన సభ్యులపై స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేశారు. వీరిలో వైఎస్సార్సీపీ నుంచి నలుగురు, టీడీపీ నుంచి నలుగురు ఉన్నారు. వైఎస్సార్సీపీ నుంచి శాసనసభకు ఎన్నికై పార్టీ ఫిరాయించిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (నెల్లూరు రూరల్ నియోజకవర్గం), ఆనం రామనారాయణరెడ్డి (వెంకటగిరి), మేకపాటి చంద్రశేఖరరెడ్డి (ఉదయగిరి), ఉండవల్లి శ్రీదేవి (తాడికొండ)పై ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ చీఫ్ విప్ ముదునూరు ప్రసాదరాజు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. టీడీపీ నుంచి శాసన సభకు ఎన్నికై పార్టీకి దూరంగా ఉంటున్న వాసుపల్లి గణేష్‌కుమార్ (విశాఖ దక్షిణ), కరణం బలరాం (చీరాల), మద్దాల గిరి (గుంటూరు వెస్ట్), వల్లభనేని వంశి (గన్నవరం)పై అనర్హత వేటు వేయాలని టీడీపీ విప్ డోలా బాల వీరాంజనేయస్వామి స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ రెండు పార్టీల ఫిర్యాదులపై స్పీకర్ తమ్మినేని సీతారాం పలుమార్లు ఎమ్మెల్యేలను విచారించారు. ఎమ్మెల్యేల నుంచి వివరణలు తీసుకున్నారు. పార్టీల విప్‌లు చేసిన ఫిర్యాదులు, ఎమ్మెల్యేలు ఇచి్చన వివరణలను క్షుణ్ణంగా పరిశీలించిన స్పీకర్.. ఆ 8 మంది సభ్యులు పార్టీ ఫిరాయించినట్టు తేల్చారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. స్పీకర్ ఆదేశాల మేరకు ఏపీ లెజిస్లేచర్ సెక్రటరీ జనరల్ పీపీకే రామాచార్యులు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. -
ఎమ్మెల్యేల వ్యవహారశైలిపై స్పీకర్ తమ్మినేని సీతారాం సీరియస్
-
ఏపీ ఎమ్మెల్యేల ‘అనర్హత’పై ఉత్కంఠ
-
AP: ఫిరాయింపులపై ఇక స్పీకర్‌దే నిర్ణయం!
ఎమ్మెల్యేల వ్యవహారశైలిపై స్పీకర్ తమ్మినేని సీతారాం సీరియస్ విచారణకు మళ్ళీ డుమ్మా కొట్టిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 4 గంటల వరకు సమయం ఇచ్చిన స్పీకర్ తమ్మినేని సీతారాం, మండలి ఛైర్మన్ మోషేన్ రాజు మరికొంత సమయం కావాలంటూ స్పీకర్‌కు లెటర్ రాసిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు న్యాయపరమైన అంశాలపై చర్చించేందుకు సిద్దమైన స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం అనర్హత పిటిషన్లపై ఏ క్షణమైనా నిర్ణయం తీసుకునే అవకాశం సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన పార్టీలకు సంబంధించిన రెబల్ ఎమ్మెల్యే-ఎమ్మెల్సీల ‘అనర్హత’పై ఉత్కంఠ కొనసాగుతోంది. అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్లు ‘తుది’ నోటీసులు అందుకున్న ఆయా సభ్యులు ఇవాళ విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే తాము విచారణకు హాజరు కాలేమని వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలు బదులు పంపినట్లు తెలుస్తోంది. నోటీసుల ప్రకారం.. ఇవాళ మధ్యాహ్నాం తొలుత టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల విచారణ జరగాల్సి ఉంది. ఆ తర్వాత వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయింపుల విచారణ ఉంది. అయితే.. విచారణకు హాజరుకాలేమంటూ ఆనం రామనారాయణరెడ్డి బదులు పంపినట్లు తెలుస్తోంది. తమ అనర్హత పిటిషన్‌కు సంబంధించి.. పిటిషనర్ సమర్పించిన వీడియో ఆధారాలు ఒరిజినల్ అని నిరూపించాల్సిన అవసరం ఉందంటూ పాత పాటే పాడారు వాళ్లు. తాము మాట్లాడిన వీడియోలకు సంబంధించి ఆయా సంస్థల సర్టిఫైడ్ కాపీలు కావాలని స్పీకర్‌ను ఆనం కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాము విచారణకు రాలేమని ఆయన బదులు పంపారు. అలాగే.. మేకపాటి, శ్రీదేవి కూడా మరింత సమయం కావాలని కోరినట్లు సమాచారం. వైఎస్సార్సీపీ నుంచి నెగ్గి.. టీడీపీలోకి పార్టీ ఫిరాయించారు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవీలు. అలాగే మండలిలోనూ ఎమ్మెల్సీలు సి రామచంద్రయ్య, వంశీకృష్ణలు పార్టీ ఫిరాయించారు. వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించిన వీళ్లపై అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీలో చీఫ్‌విప్ మదునూరి ప్రసాదరాజు, మండలిలో చీఫ్‌విప్ మేరిగ మురళీధర్.. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌లకు ఫిర్యాదులు చేశారు. వీళ్లతో పాటు టీడీపీ తరఫు నుంచి కూడా అనర్హత ఫిర్యాదు నమోదు అయ్యింది. .. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి వివరణ తీసుకున్న తర్వాతే.. వాళ్లపై నమోదు అయిన అనర్హత పిటిషన్‌పై ఎలాంటి నిర్ణయం అయినా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ.. స్పీకర్, మండలి చైర్మన్లు ఆయా సభ్యుల్ని ప్రశ్నిస్తూ నోటీసులు పంపిస్తూ వచ్చారు. అయితే వీళ్లలో కొందరు అరకోరగా విచారణకు హాజరయ్యారు. మూడుసార్లు నోటీసులు ఇస్తే.. రకరకాల కారణాలతో వాళ్లు విచారణకు గైర్హాజరు అవుతూ వస్తున్నారు. సాంకేతిక-వ్యక్తిగత కారణాల్ని సాకుగా చూపిస్తూ.. పూర్తిస్థాయి విచారణలో పాల్గొనకుండా సాగదీస్తూ వస్తున్నారు ఈ నలుగురు. దీంతో.. ఇవాళ (19వ తేదీన) విచారణకు హాజరుకావాల్సిందేనని స్పీకర్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. స్పీకర్ కార్యాలయంలో వీళ్ల విచారణ జరగాల్సి ఉంది. అలాగే.. అనర్హత పిటిషన్లు వేసిన ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజు, మేరిగ మురళీధర్(మండలి) సమక్షంలోనే విచారణ జరగాలి గనుక ఆయనకు కూడా నోటీసులు జారీ చేసింది స్పీకర్ కార్యాలయం.ఒకవేళ.. హాజరు కాకపోతే ఇప్పటిదాకా జరిగిన విచారణ ఆధారంగా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందంటూ ఇదివరకే నోటీసుల్లో స్పీకర్, చైర్మన్లు స్పష్టం చేశారు. దీంతో రాలేమంటూ లేఖ పంపిన నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం ఉండనుందా? అనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఇంకోవైపు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల విషయంలోనూ విచారణాంతరం నిర్ణయం ప్రకటించాల్సి ఉంటుంది. వీళ్లను కూడా ఇవాళే విచారణకు రావాల్సిందిగా స్పీకర్, మండలి చైర్మన్లు నోటీసులు పంపించారు. -
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు లాస్ట్ ఛాన్స్ ! హాజరు కాకుంటే..
-
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మరోసారి నోటీసులు
-
AP: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మరోసారి నోటీసులు
అమరావతి: అనర్హత పిటిషన్ల వ్యవహారంలో.. వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 12 న విచారణకు హాజరు కావాలని మరోసారి నోటీసులు జారీ చేశారు అసెంబ్లీ స్పీకర్ స్పీకర్ తమ్మినేని సీతారాం. ఈసారి వాళ్ల నుంచి పూర్తిస్థాయి వివరణ తీసుకున్నాకే నిర్ణయం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవీలు ఫిరాయించిన సంగతి తెలిసిందే. వీరికి తాజాగా నోటీసులు జారీ చేసిన స్పీకర్.. ఈనెల 12వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. -
ప్రతిపక్షాల ప్రవర్తన బాధించింది
సాక్షి, అమరావతి: శాసనసభలో ప్రతిపక్షాల ప్రవర్తన తనను బాధించిందని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆవేదనను వ్యక్తంచేశారు. ప్రస్తుతం జరుగుతున్న 15వ అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా ప్రతిపక్షాల ప్రవర్తనపై స్పీకర్ తమ్మినేని మాట్లాడారు. గురువారం సభను నిరవధికంగా వాయిదా వేసే ముందు సభ్యులతో తన ఆవేదనను పంచుకున్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో మంత్రి పదవులను నిర్వహించానని, కానీ రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిని ఐదేళ్లపాటు నిర్వర్తించడం ఆనందంగా ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా తన విధులను కర్తవ్యదీక్షతో నిర్వర్తించానని, అన్ని పార్టీల సభ్యులకు మాట్లాడటానికి అవకాశం కల్పించినట్లు తెలిపారు. ముఖ్యంగా తొలిసారి సభకు వచ్చిన ఎమ్మెల్యేలు, మహిళా సభ్యులను మాట్లాడించడానికి ప్రోత్సహించినట్లు తమ్మినేని చెప్పారు. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ద్వారా సభ్యుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడానికి కృషి చేశానన్నారు. తాను స్పీకర్‌గా ఉన్న సమయంలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధికరణ బిల్లు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు బిల్లు, మహిళా రక్షణకు ఉద్దేశించిన దిశ బిల్లు వంటి అనేక కీలక బిల్లులు ఆమోదం పొందడం ఆనందంగా ఉందని తెలిపారు. కానీ, అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు తమ పరిధిని దాటి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా, ప్రతిష్టాత్మక వ్యవస్థకు మచ్చతెచ్చే విధంగా ప్రవర్తించారన్నారు. సభలో భిన్న వాదనలు ముఖ్యమని, అయితే పరిధి దాటి స్పీకర్ పోడియం మీదకు వచ్చి కాగితాలు, ఫైళ్లు విసిరారని, ఇది తనకు జరిగిన అవమానం కాదని, గౌరవ ప్రదమైన స్పీకర్ స్థాయిని, శాసనసభ స్థాయిని తగ్గించడమేనని తమ్మినేని అన్నారు. సభను హుందాతనంగా నడపడానికి కొన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. డిప్యూటీ స్పీకర్లుగా వ్యవహరించిన కోన రఘుపతి, కోలగట్ల వీరభద్రస్వామి, స్పీకర్ కార్యాలయ సిబ్బందికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. 15వ అసెంబ్లీ సమావేశాలు మూడు రోజులపాటు 10 గంటల రెండు నిమిషాలు జరిగాయని, ఇందులో 9 బిల్లులను ఆమోదించగా, 20మంది సభ్యులు మాట్లాడినట్లు తెలిపారు. ఫిబ్రవరి 8 నాటికి సభలో వైఎస్సార్సీపీకి 151 మంది, టీడీపీకి 22 మంది, జనసేనకు ఒకరు చొప్పున సభ్యులు ఉన్నారని, ఒక స్థానం ఖాళీగా ఉందని స్పీకర్ వెల్లడిస్తూ సభను నిరవధికంగా వాయిదా వేశారు. -
ఇలా వచ్చి.. అలా వెళ్లిపోయారు..
సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో చివరి రోజు కూడా టీడీపీ ఎమ్మెల్యేల తీరులో ఎటువంటి మార్పులేదు. సభ మొదలైన మరుక్షణం నుంచే కార్యకలాపాలను స్తంభింపజేసేందుకు ప్రయత్నించారు. సభ ప్రారంభమైన వెంటనే పథకం ప్రకారం గొడవ చేసి వెళ్లిపోయారు. కేవలం సభలో 15 నిమిషాలు మాత్రమే టీడీపీ సభ్యులు సభలో ఉన్నారు. సంప్రదాయం ప్రకారం బుధవారం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై గురువారం సభలో చర్చ నిర్వహించాల్సి ఉంది. ఇందుకు విరుద్ధంగా సభ ప్రారంభమైన వెంటనే జాబ్ క్యాలెండర్, మద్యపాన నిషేధంపై టీడీపీ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దానిని తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. దీంతో టీడీపీ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియంలోకి వెళ్లారు. ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు, డోలా బాలవీరాంజనేయస్వామి, అశోక్, రామకృష్ణలు స్పీకర్ చైర్‌ను చుట్టుముట్టారు. మరోవైపు ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవి, చినరాజప్ప తదితరులు స్పీకర్ పోడియం ముందు నిలుచుని, పోడియాన్ని తడుతూ ఆందోళనకు దిగారు. వారి ఆందోళన మధ్యే సభా కార్యకలాపాలను కొనసాగిస్తూ స్పీకర్ మాట్లాడుతుండగా... ఆయన ప్రసంగానికి అడ్డుతగులుతూ స్పీకర్ మైక్‌లో వినిపించేలా టీడీపీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్రంలో గంజాయి సాగు, వాడకం మితిమీరిపోయిందంటూ ప్రభుత్వంపై అచ్చెన్నాయుడు, ఇతర టీడీపీ సభ్యులు ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేల తీరును శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తప్పుబట్టారు. సభలో జరుగుతున్న బిజినెస్‌కు విరుద్ధంగా వాయిదా తీర్మానాలకు డిమాండ్ చేసి ఆందోళనకు దిగడమేమిటని ప్రశి్నంచారు. రాష్ట్రంలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణపై సీఎం జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర ప్రభుత్వం మెచ్చుకుందని గుర్తుచేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఒకసారి పోలీస్ రికార్డులను పరిశీలించి వాస్తవాలను తెలుసుకోవాలని సూచించారు. అయినా టీడీపీ సభ్యులు ఆందోళన విరమించకపోవడంతో స్పీకర్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమైన తర్వాత టీడీపీ సభ్యులు రాలేదు. రెండు బిల్లులకు ఆమోదం ఏపీ విద్యుత్ సుంకం (సవరణ) బిల్లు–2024, ఏపీ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల (సవరణ) బిల్లు–2024ను శాసనసభ ఆమోదించింది. విద్యుత్ సుంకం బిల్లును ఆ ర్థి క మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లును రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు సభలో ప్రవేశపెట్టారు. -
బడ్జెట్ ఆమోదం తెలిపిన ఏపీ అసెంబ్లీ
-
AP Assembly: ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా
Updates.. ► ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా ►9 బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం అసెంబ్లీలో మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారు. మేం మేనిఫెస్టోలో చెప్పిన ప్రతీ హామీని నెరవేర్చాం. హామీలు నెరవేర్చని చంద్రబాబును వామపక్షాలు ఎందుకు ప్రశ్నించలేదు. నిరుద్యోగ భృతిపై చేతులెత్తేసిన చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదు?. మేం చేసిన అప్పులతో సంక్షేమ పథకాలు అందించాం. గత ప్రభుత్వం చేసిన అప్పులు ఎక్కడికి పోయాయి. గత ప్రభుత్వం చేసిన అప్పులతో ప్రజలకు ఏ మంచిపనైనా జరిగిందా?. అప్పులపై టీడీపీ గోబెల్స్ ప్రచారం చేస్తోంది. గత ప్రభుత్వం చేసిన అప్పులతో పోలిస్తే మేం చేసింది తక్కువే. మాది సంక్షేమ ప్రభుత్వం: ఎమ్మెల్సీ రవీంద్రబాబు ప్రతీ సంక్షేమ పథకం ప్రజల మేలు కోసమే అమలు చేశాం మా ప్రభుత్వానికి పబ్లిసిటీ ముఖ్యం కాదు.. ప్రజలకి మేలు జరగడం ముఖ్యం రాష్ట్రానికి కోవిడ్ సమయంలో రావాల్సిన ఆదాయం రాలేదు రెండేళ్ల కోవిడ్ సమయంలో రెండు లక్షల కోట్ల రూపాయిల ఆదాయం తగ్గిపోయింది గడిచిన నాలుగన్నరేళ్ల పాలనలో 4.60 లక్షల కోట్లు ప్రజలకి నేరుగా అందించాం అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజల ఖాతాలలోకి నిధులు జమ చేశాం మా ప్రభుత్వం వైద్యం, విద్య, వ్యవసాయ రంగాలకి అధిక ప్రాధాన్యతనిచ్చింది ప్రతీజిల్లాకి ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నాం మన రాష్ట్రంలో మెడికల్ కళాశాలలు లేకే ఉక్రెయిన్ లాంటి సుదూర దేశాలకి వెళ్లాల్సిన పరిస్ధితి ఏర్పడింది ఆర్ధిక ఇబ్బందులు ఉన్న్పటికీ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎక్కడా ఆగలేదు ►శాసనమండలి చైర్మన్ మోసేన్ రాజు ముందు వ్యక్తిగతంగా హాజరైన వంశీకృష్ణ యాదవ్. న్యాయవాదులతో కలిసి చైర్మన్ ముందు హాజరు మూడు బిల్లులకి శాసనమండలి ఆమోదం ఆర్జేయూకేటీ విశ్వ విద్యాలయ సవరణ బిల్లు, ఏపీ అసైన్ భూముల సవరణ బిల్లు, ప్రభుత్వ సేవలలో నియామకాల క్రమబద్దీకరణ, సిబ్బంది తీరు, వేతనవ్యవస్ధ హేతుబద్దీకరణ సవరణ బిల్లులకి శాసన మండలి ఆమోదం శాసన మండలి పదినిమిషాలు వాయిదా పెద్దల సభలోనూ మారని టీడీపీ సభ్యుల తీరు చైర్మన్ పోడియం వద్ద ప్లకార్డులతో నిరసన, నినాదాలు చైర్మన్ వారించినా వినిపించుకోని టీడీపీ ఎమ్మెల్సీలు సభకు అంతరాయం కలిగించవద్దని చైర్మన్ విజ్ణప్తి పట్టించుకోకుండా టీడీపీ ఎమ్మెల్సీల నినాదాలు దీంతో, శాసన మండలి వాయిదా అంతకముందు జాబ్ క్యాలెండర్, దిశ, మద్యపాన నిషేదంపై ఎమ్మెల్సీల వాయిదా తీర్మానం టీడీపీ సభ్యుల వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన శాసన మండలి చైర్మన్ ►సభలో టీడీపీ సభ్యుల నినాదాలు, సభా కార్యక్రమాలకు అడ్డుకునే యత్నం ►కాసేపు శాసనసభ వాయిదా ►అసెంబ్లీ సమావేశాలకు బయలుదేరిన సీఎం జగన్ ►ప్రైవేటు యూనివర్సిటీ సవరణ బిల్లుకి ఆమోదం తెలిపిన అసెంబ్లీ ►ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నాలుగో రోజు ప్రారంభం ►అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ఓవరాక్షన్ ►ఈరోజు కూడా స్పీకర్ ఛాంబర్ వద్దకు దూసుకెళ్లిన టీడీపీ సభ్యులు ►స్పీకర్ తమ్మినేని వద్దకు వెళ్లి నినాదాలు చేసిన టీడీపీ నేతలు ►టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సీరియస్ ►టీడీపీ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్ తమ్మినేని. ►నేడు ఏపీ అసెంబ్లీలో చివరి రోజు(నాలుగో రోజు) బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. ఓట్ ఆన్ అకౌంట బడ్జెట్‌ను అసెంబ్లీ ఆమోదించనుంది. ►ఎన్నికల నేపథ్యంలో 2024–25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నుంచి ఏప్రిల్ – జూలై వరకు నాలుగు నెలలు పాటు వ్యయానికి రూ.88,215 కోట్ల పద్దును అసెంబ్లీ ఆమోదానికి ప్రతిపాదించారు. దీనికి అసెంబ్లీ ఆమోదం తెలుపునుంది. ►అలాగే, నేడు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని విచారణ చేపట్టనున్నారు. ఇప్పటికే వారికి వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామ నారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలపై విచారణ జరుగనుంది. ►పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలపై విచారణ. వ్యక్తిగతంగా విచారించనున్న శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు. ఎమ్మెల్సీలు సి.రామచంద్రయ్య, వంశీ కృష్ణ యాదవ్‌లకు నోటీసులు ఇచ్చారు. -
అసెంబ్లీలో టీడీపీ రగడ
సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసన సభలో మంగళవారం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అవమానకరంగా ప్రవర్తించారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద చర్చను అడ్డుకుని రాద్ధాంతం చేశారు. ఇతర సభ్యులు ఎవరూ ప్రసంగించకుండా స్పీకర్‌ను చుట్టుముట్టి నినాదాలు చేశారు. ఎంతకీ వారి తీరులో మార్పు రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వారిని సభ నుంచి సస్పెండ్ చేశారు. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కాగానే విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాకు శాసనసభ ఆమోదం తెలిపినట్లు స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రకటించారు. అనంతరం ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలు వల్లూరి రామకృష్ణ చౌదరి (అనపర్తి), అలికిరి జగదీష్ (గుత్తి), పరకాల కాళికాంబ (నరసాపురం) అకాల మృతికి శాసన సభ సంతాపం ప్రకటించింది. తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ ప్రారంభమైంది. ఇంతలో టీడీపీ సభ్యులు నిత్యావసర ధరలపై వాయిదా తీర్మానం ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. చర్చ పూర్తయ్యాక మాట్లాడదామని స్పీకర్ చెప్పారు. ఇందుకు టీడీపీ సభ్యులు అంగీకరించలేదు. ఆ పార్టీ సభ్యులు అచ్చెన్నాయుడు, నందమూరి బాలకృష్ణ, వెలగపూడి రామకృష్ణ, గద్దె రామ్మోహన్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, ఏలూరి సాంబశివరావు, ఆదిరెడ్డి భవాని సహా 15 మంది స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. అచ్చెన్న వెల్‌లో ఉండగా, మిగతా సభ్యులు పోడియం పైకి ఎక్కి స్పీకర్ కురీ్చని చుట్టుముట్టారు. ప్రభుత్వానికి, సీఎం జగన్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అక్కడితో ఆగకుండా బిల్లు పత్రాలను చింపి స్పీకర్‌పై చల్లి రగడ సృష్టించారు. స్పీకర్ వారిని ఎంతగా వారించినా పద్ధతి మార్చుకోకపోవడంతో 48 నిమిషాల్లోనే సభను వాయిదా వేశారు. తిరిగి ఉదయం 10.34 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యులు ఈసారి విజిల్స్ తీసుకొచ్చి స్పీకర్ చెవుల్లో ఊదడం ప్రారంభించారు. ఇది సరికాదని, స్పీకర్ పట్ల అవమానకరంగా ప్రవర్తించడం సభ్యత అనిపించుకోదని మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు సుధాకర్‌బాబు, అబ్బయ్య చౌదరి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి వారించినా పట్టించుకోలేదు. వెలగపూడి రామకృష్ణ అత్యుత్సాహం ప్రదర్శించి స్పీకర్ వద్దనున్న బెల్‌ను అదే పనిగా మోగించడం ప్రారంభించారు. సభలో ఇతర సభ్యులు మాట్లాడేది ఏదీ వినబడకుండా, స్పీకర్ చెప్పేది సభ్యులకు వినిపించకుండా టీడీపీ సభ్యులు నానా రగడా సృష్టించారు. దీంతో మార్షల్స్ స్పీకర్ తమ్మినేనికి రక్షణగా నిలబడ్డారు. ఎంత వారించినా వినకపోవడంతో టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారు. వెంటనే వారు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. బ్రేక్ తర్వాత టీడీపీ సభ్యలు 11 నిమిషాలు మాత్రమే సభలో ఉన్నారు. -
గంటా రాజీనామాకు స్పీకర్ ఆమోదం
-
AP Assembly: టీడీపీ సభ్యుల రచ్చ.. సభ నుంచి సస్పెండ్
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీలో రెండో రోజు బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. సమావేశాల సందర్భంగా టీడీపీ సభ్యులు మళ్లీ ఓవరాక్షన్ చేశారు. దీంతో, టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం ఒక్కరోజు సస్పెండ్ చేశారు. కాగా, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా టీడీపీ సభ్యులు తమ తీరును మార్చుకోలేదు. ప్రతీసారి చేసిన విధంగానే ఈసారి కూడా అసెంబ్లీలో రచ్చరచ్చ చేశారు. రెడ్‌లైన్ దాడి స్పీకర్ తమ్మినేని పోడియంను టీడీపీ సభ్యులు చుట్టుముట్టారు. సభా నిబంధనలకు విరుద్దంగా టీడీపీ సభ్యులు ప్రవర్తించారు. సభ జరుగుతుండా విజిల్స్ వేస్తూ అరాచకం సృష్టించారు. అంతటితో ఆగకుండా ప్రజాప్రతినిధులనే స్పృహ మరిచిపోయి టీడీపీ సభ్యులు పేపర్లు చింపి స్పీకర్‌పై విసిరారు. స్పీకర్ తమ్మినేని పట్ల అవమానకరంగా ప్రవర్తించారు. స్పీకర్‌ను అవమానపరిచేలా నినాదాలు చేశారు. దీంతో, టీడీపీ సభ్యుల తీరుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
AP: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మళ్లీ నోటీసులు
గుంటూరు, సాక్షి: అనర్హత పిటిషన్ల వ్యవహారంలో.. వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు ఫిబ్రవరి 8వ తేదీన స్వయంగా విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారాయన. ఈసారి వాళ్ల నుంచి పూర్తిస్థాయి వివరణ తీసుకున్నాకే నిర్ణయం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఏపీ స్పీకర్ కార్యాలయం నుంచి ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు వెళ్లాయి. ఫిబ్రవరి 5వ తేదీలోగా ఈ నోటీసులకు స్పందించాలని స్పీకర్ కార్యాలయం కోరింది. వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలతో పాటు పిటిషనర్ అయిన ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద రాజులకు నోటీసులు పంపించారు. ఈ ఐదుగురిని ఒకేసారి కలిపి విచారణ చేయనున్నారు స్పీకర్ తమ్మినేని. మరోసారి ఎమ్మెల్యేల వివరణ తీసుకోనున్న తర్వాతే ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ విషయంలో ఓ స్పష్టమైన నిర్ణయం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీలో చీఫ్‌విప్ మదునూరి ప్రసాదరాజు, మండలిలో చీఫ్‌విప్ మేరిగ మురళీధర్ ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్ వారిని కోరిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ, టీడీపీ నుంచి పార్టీ ఫిరాయించిన మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అనర్హత పిటిషన్‌పై సోమవారం స్పీకర్ తమ్మినేని విచారణ జరిపారు. అయితే ఇందులో స్పీకర్ ఎదుట వ్యక్తిగత విచారణకు ఐదుగురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ క్రమంలో వివరణ ఇవ్వడానికి తమకు నాలుగు వారాల సమయం ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే మూడుసార్లు టైం ఇచ్చిన సంగతి గుర్తు చేశారు కూడా. మరోవైపు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవీలతో పాటు ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యలకు హైకోర్టులో చుక్కెదురైంది. విచారణకు సంబంధించిన తదుపరి చర్యలన్నీ నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. నోటీసులకు వివరణ ఇచ్చేందుకు తమకు నాలుగు వారాల గడువునిచ్చేలా ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలన్న వారు చేసిన అభ్యర్థనను సైతం హైకోర్టు తోసిపుచ్చింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యంకాదని తేల్చిచెప్పింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 26కి వాయిదా వేసింది. -
గంటా రాజీనామా ఆమోదం.. టీడీపీలో కొత్త టెన్షన్!
టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదం తర్వాత తొలిసారి స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. ఈ క్రమంలో ఆయన రాజీనామాను స్పీకర్‌గా ఆమోదించడంలో రాజకీయ కుట్ర ఏముందని తమ్మినేని ప్రశ్నించారు. గడువు తర్వాతే నిర్ణయం.. గంటా శ్రీనివాసరావు రాజీనామా లేఖను నాకు ఎప్పుడో ఇచ్చారు. పైగా స్పీకర్ ఫార్మాట్లోనే ఆయనే ఇచ్చారు. ఎమ్మెల్యేగా తప్పుకుంటానని తెలిపారు. లేఖ ఇవ్వగానే ఆమోదించడం సరికాదని వేచిచూశాం. మనసు మార్చుకుంటాడన్న మానవతా దృక్పథంతో ఇప్పటివరకు ఆగాను. ఇప్పుడు స్పీకర్‌గా నా పదవీకాలం ముగుస్తుండటంతో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కదా. ఇన్నాళ్లు అవకాశం ఇచ్చినా నిర్ణయాన్ని మార్చుకోలేని ఇప్పుడెలా మార్చుకుంటాడని భావించాను. పదవీ కాలం సమీపిస్తుండడంతో రాజీనామాను ఆమోదించాను. ఇది కూడా చదవండి: చంద్రబాబుకు అమ్ముడుబోయి.. చరిత్రహీనులుగా మిగిలి.. ఈ విషయంలో గంటా శ్రీనివాసరావు ఏదైనా భిన్నంగా ఆలోచిస్తే.. కోర్టుల ద్వారా ముందుకు వెళ్లొచ్చు. రాజీనామా ఇవ్వడం, వెనక్కి తీసుకోవడం అనేది సరికాదు. చట్టసభల విషయంలో నియమ నిబంధనలను పాటించాలి. ఒక వేళ గంటా శ్రీనివాసరావు ఓటుతోనే అధికార పార్టీ రాజ్యసభ సీట్లు ఆధారపడిలేవు కదా. వైఎస్సార్సీపీ రాజ్యసభ సీటు కోల్పోతుంది అని ప్రచారం చేస్తున్న విషయమే కరెక్టయితే అందరికీ నోటీసులు ఎందుకు ఇస్తాం? ఇప్పటివరకు పార్టీ మారిన ఎమ్మెల్యేలందరికీ నోటీసులు ఇచ్చాను. వారంలోపు అన్ని పిటిషన్లు క్లియర్ చేస్తాం. స్పీకర్ లేఖలు.. ఒక పార్టీ నుంచి గెలిచి.. పదవికి రాజీనామా చేయకుండా పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడ్డ నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఇరుకునపడ్డారు. ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు ఇప్పటికే అనర్హతా వేటు ఎదుర్కొంటున్నారు. వీరిపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేయడంతో స్పీకర్ వీరికి నోటీసులిచ్చారు. ఈ నెల 25లోగా సమాధానం చెప్పాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ఈ నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు నాలుగు వారాలు గడువు కావాలంటూ రెబల్ ఎమ్మెల్యేలు కోరినట్టు తెలిసింది. వారంలో ఏం జరగనుంది? స్పీకర్‌గా తన పదవీ కాలం సమీపిస్తుండడంతో పెండింగ్‌లో ఉన్న అన్ని పిటిషన్లపై వారంలోగా నిర్ణయం తీసుకుంటానని తమ్మినేని ప్రకటించడం తెలుగుదేశంలో గుబులు రేపుతోంది. వైఎస్సార్సీపీ నుంచి వచ్చిన నలుగురిని వెంటనే లాగేసుకున్న చంద్రబాబు.. తాజాగా జరుగుతున్న పరిణామాలపై గుంభనంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నలుగురికి తెలుగుదేశం టికెట్ ఇచ్చి పోటీ చేయించాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నాడు. పక్కపార్టీ నుంచి ఎమ్మెల్యేలను తీసుకోవడం చంద్రబాబుకు కొత్తేం కాదు. 2014-19 మధ్య ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలను ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా బోలెడు డబ్బు గుమ్మరించి లాగేసుకున్న చంద్రబాబుకు ఎన్నికల్లో 23 సీట్లతో సరిపెట్టారు ఓటర్లు. ఇక ఇప్పటి విషయానికి వస్తే.. అనర్హతా పిటిషన్‌పై స్పీకర్ నిర్ణయం తీసుకుని వేటు వేస్తే.. ఈ నలుగురు కూడా పోటీ చేసేందుకు అర్హతా కోల్పేయే అవకాశం ఉంది. అది స్పీకర్ విశిష్టాధికారం అనర్హత వేటు అన్నది పూర్తిగా స్పీకర్ నిర్ణయం. స్పీకర్ వ్యవస్థ పూర్తి స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థ. గంటా రాజీనామాను ఆమోదించాలన్నది స్పీకర్ నిర్ణయం. ఎప్పుడు ఆమోదించాలో అన్నది కూడా ఆయన నిర్ణయమే. త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో మూడు స్థానాలు YSRCP గెలుస్తుంది. 19 మంది ఎమ్మెల్యేలతో టీడీపీ ఎలా గెలుస్తుందనుకుంటారు? అసలు టీడీపీకి తగినంత సంఖ్యాబలమే లేదన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. -
పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ బిగ్ షాక్
-
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదం
సాక్షి, విజయవాడ: టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మంగళవారం ఆమోదించారు. గతంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ స్పీకర్‌కు గంటా శ్రీనివాస్ లేఖ రాసిన విషయం తెలిసిందే. గంటా శ్రీనివాస్ స్పీకర్ ఫార్మాట్లో తన రాజీనామాను సమర్పించారు. స్పీకర్‌ను కలిసి రాజీనామా ఆమోదించాలని కూడా గంటా శ్రీనివాస్ గతంలో కోరిన సంగతి తెలిసిందే. స్పీకర్ తమ్మినేని సీతారాం గంటా శ్రీనివాసరావు కోరిక మేరకు తన రాజీనామాను ఆమోదించారు. చదవండి: భీమిలి సీటుపై గంటా కర్చీఫ్.. టికెట్ ఇస్తే ఓటమి ఖాయం! -
సాధికారతను చాటిన ఎచ్చెర్ల
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎచ్చెర్ల ప్రజలు సామాజిక సాధికారతను ఎలుగెత్తి చాటారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అండదండలతో సాధించిన అభివృద్ధిని వివరిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు నియోజకవర్గమంతా కలియదిరిగారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో జరిగిన వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర ఆద్యంతం పండుగ వాతావరణంలో జరిగింది. రణస్థలం నుంచి చిలకపాలెం – పొందూరు రోడ్డు వరకు 15 కిలోమీటర్లు సాగిన బస్సు యాత్రకు జనం బ్రహ్మరథం పట్టారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జై జగన్ అంటూ యువత నినాదాలతో హోరెత్తించారు. నియోజకవర్గంలోని రణస్థలం, లావేరు, జి.సిగడాం, ఎచ్చెర్ల మండలాల నుంచి బడుగు, బలహీన వర్గాల ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. అనంతరం చిలకపాలెంలో జరిగిన బహిరంగ సభకు ఇసకేస్తే రాలనంతగా ప్రజలు హాజరయ్యారు. అన్ని కులాలకు సమాన హక్కులు కల్పింస్తున్న సీఎం జగన్: స్పీకర్ తమ్మినేని సీతారాం వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే రాష్ట్రంలో అన్ని కులాలకు సమాన హక్కులు కల్పిస్తున్నారని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వంటి కులాలకు జరుగుతున్న అన్యాయాలను గుర్తించి, వారికి రాజ్యాధికారాన్ని, సంపదను అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 139 కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి చైర్మన్లను, 700 మంది డైరెక్టర్లను నియమించారన్నారు. అనేక పథకాలు, అంతర్జాతీయ స్థాయి విద్య, అధునాతన వైద్యాన్ని అందిస్తున్నారని వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అక్కున చేర్చుకున్న ఏకైక సీఎం వైఎస్ జగన్ అని మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. కరోనా సమయంలో గుజరాత్‌కు వలస వెళ్లిన 4,500 మంది మత్స్యకారులను ప్రత్యేక బస్సుల్లో సురక్షితంగా జిల్లాకు తెచ్చామని, 24 మంది మత్స్యకారులను పాకిస్థాన్ నుంచి విడిపించామని చెప్పారు. బీసీలు జడ్జీలుగా ఉండకూడదని కేంద్ర న్యాయ శాఖకు లేఖ రాసిన ఘనత చంద్రబాబుదన్నారు. ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలను అవహేళన చేసిన చంద్రబాబుకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న పవన్ అప్పట్లో చంద్రబాబు పాలనను ఎందుకు విమర్శించలేదని ప్రశ్నించారు. జగనన్న బలం చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా సుపరిపాలన సాధ్యమవుతుందన్నారు. దేశానికి సచివాల య, వలంటీర్ వ్యవస్థలు ఆదర్శంగా నిలిచాయన్నారు.తన పని తీరు నచ్చితేనే ఓటు వేయమని అడగగలిగే ఏకైక సీఎం వైఎస్ జగన్ అని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. సీఎం జగన్ అన్ని కులాలకు న్యాయం జరిగేలా ఉప ముఖ్యమంత్రులు, మంత్రి పదవులు, నామినేటెడ్ పదవులను ఇచ్చారని తెలిపారు. సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు దేశ చరిత్రలో ఎన్నడూ లేవని ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ తెలిపారు. కులం, మతం, ప్రాంతం, లంచం, వివక్షకు తావు లేకుండా ప్రతి ఒక్కరికీ సంక్షేమ ప్రయోజనాలు అందాయన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు మాత్రమే అసంతృప్తిగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యేలు కంబాల జోగులు, రెడ్డి శాంతి, బడ్డుకొండ అప్పలనాయుడు, బొత్స అప్పలనరసయ్య, ఎమ్మెల్సీలు దువ్వాడ శ్రీనివాస్, వరుదు కల్యాణి, నర్తు రామారావు, పెనుమత్స సురేష్‌బాబు, జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, మాజీ ఎమ్మెల్యే మీసాల నీలకంఠం నాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచారు: మంత్రి ధర్మాన సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచారని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. సీఎం జగన్ విశాఖను రాజధాని చేయాలనుకుంటుంటే టీడీపీ మాత్రం అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తోందని విమర్శించారు. విశాఖను రాజధాని చేస్తే ఇక్కడ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. -
యాత్రకు అడుగడుగునా నీరాజనం పలుకుతున్న ప్రజలు
-
Fact Check: ‘ఈనాడు’ వక్ర బుద్ధి..
సాక్షి, అమరావతి: పెత్తందార్ల పెద్ద రామోజీరావు మరోసారి చిన్న బుద్ధిని చూపించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ చంద్రబాబు, ఈనాడు రామోజీరావుకు కలవరం కలిగిస్తోంది. అందుకే పెల్లుబుకుతున్న జనాదరణను తక్కువగా చూపించేందుకు రామోజీరావు తనకు అలవాటైన రీతిలో దిగజారుడు పాత్రికేయానికి పాల్పడుతున్నారు. అదీ.. బడుగు, బలహీన వర్గాలు నిర్వహించుకుంటున్న కార్యక్రమాలపైన బురద జల్లుతున్నారు. వైఎస్సార్సీపీ దిగ్విజయంగా నిర్వహిస్తున్న ‘సామాజిక సాధికార బస్సు యాత్ర’కు వెల్లువెత్తుతున్న ప్రజాస్పందన వాస్తవ చిత్రాన్ని చూపించేందుకు జంకుతున్నారు. బహిరంగ సభలు ప్రారంభానికి ముందు (జనం రాక ముందు), సభ ముగిసిన తర్వాత (వక్తల ప్రసంగాలు పూర్తయి జనం వెళ్లిపోయిన తరువాత) ఖాళీ అయిన కుర్చీల ఫొటోలు తీసి ఈనాడు పత్రికలో ప్రముఖంగా ప్రచురిస్తున్నారు. బహిరంగ సభలకు జనం రావడం లేదని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికార సభకు సంబంధించి కూడా ఇలాంటి వక్ర బుద్ధే ప్రదర్శించారు. అదీ.. అసెంబ్లీ స్పీకర్‌గా ఎదిగిన ఓ బీసీ నేత ప్రసంగిస్తుండగా ప్రజలు లేరంటూ కొన్ని ఖాళీ కుర్చీల ఫొటో వేశారు. ఈ సభలో పాల్గొన్న అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రసంగిస్తుండగానే జనం వెళ్లిపోయారని పాఠకులను నమ్మించేందుకు పాట్లు పడ్డారు. కానీ వాస్తవం ఏమిటంటే.. ఆ సభ ముగిసి, జనం వెళ్లిపోయిన తరువాత తీసిన చిత్రాన్ని ఈనాడు ప్రచురించింది. అది కూడా సభా వేదికకు దూరంగా ఉన్న ఖాళీ కుర్చీల ఫొటోలను ప్రచురించింది. వాస్తవంగా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్ర విజయవంతమైంది. వేలాదిగా జనం తరలిరావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఎల్లో మీడియా తప్ప ఇతర ప్రధాన పత్రికలు ఆ ఫొటోలను ప్రముఖంగా ప్రచురించాయి. ఇతర టీవీ చానళ్లు కూడా ఆ బహిరంగ సభ విజయవంతమైన వీడియోలను ప్రసారం చేశాయి. దాంతో ఈనాడు రామోజీ పన్నాగం బెడిసికొట్టింది. -
సీఎం జగన్‌తోనే జనం: స్పీకర్ తమ్మినేని
సాక్షి, విశాఖ: ఏపీలో వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర బుధవారం విశాఖపట్నం జిల్లా విశాఖ సౌత్, నంద్యాల జిల్లా బనగానపల్లి, ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగింది. బస్సుయాత్రకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలో మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. చంద్రబాబు మోసాలు నుంచి ఉత్తరాంధ్ర ప్రజల మేలుకోవాలి. విశాఖను రాజధానిగా చేస్తే చంద్రబాబు అడ్డుకుంటున్నారు. వైజాగ్ రాజధాని అయితే యువతకు ఇక్కడే ఉపాధి లభిస్తుంది. ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆగుతాయి. విశాఖ రాజధాని అయితే ఇక్కడ భూములకు రేట్లు పెరుగుతాయి. ఒక కులం కోసం అమరావతి నీ రాజధాని చేశారు. వైజాగ్‌లో రాజధాని వద్దని చంద్రబాబుకు ఎవరైనా చెప్పారా?. వైజాగ్ రాజధాని అయితే మాఫియా పెరుగుతుందని అబద్ధాలు చెబుతున్నారు. సిగ్గు లేకుండా రామోజీ రావు అబద్ధాలు రాస్తున్నారు. వెనుక బడిన కులాలు అంటే చంద్రబాబుకు ఒక ద్వేషం. తోలు తీస్తానని చంద్రబాబు మత్స్యకారులను బెదిరించారు. చంద్రబాబును ఓడించిదే ఒక మత్స్య కారుడే. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అవమనిచింది చంద్ర బాబు. కానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం వారిని గౌరవించారు. విశాఖలో స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. ‘అలీబాబా 40 దొంగల్లా చంద్రబాబు ముఠా దోచుకుంది. పదేళ్ళ ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ను వదిలి వచ్చేశారు. రాష్ట్రంలో పెత్తందార్లకు, పేదలకు మధ్య య ఉద్ధం జరుగుతోంది. పేదల పక్షాన సీఎం జగన్ నిలబడ్డారు. మార్పు అనేది సీఎం జగన్‌తోనే సాధ్యం. సామాజిక సాధికార యాత్ర అనుకున్న దానికంటే ఎక్కువగా విజయవంతం అవుతున్నాయి. ఎంతమంది కలిసిన జగన్‌తోనే జనం అంటున్నారు. సింహం ఎన్నడూ సింగిల్‌గానే వస్తుంది. బడుగు బలహీనర్గాల గౌరవాన్ని ముఖ్యమంత్రి జగన్ పెంచారు. పిల్లల భవిష్యత్‌కు బాటలు వేశారు. మళ్ళీ జగన్ సీఎం అయితేనే బడుగుల జీవితాల్లో వెలుగులు ఉంటాయి. ముఖ్యమంత్రి జగన్‌ను మరోసారి సీఎంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. పేదల దైవం సీఎం జగన్’ అంటూ కామెంట్స్ చేశారు. -
రాజాంలో సామాజిక జైత్రయాత్ర
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందిస్తున్న సుపరిపాలనలో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధిని ప్రతిబింబిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర విజయనగరం జిల్లా రాజాంలో ఆ వర్గాల జైత్రయాత్రలా ఘనంగా సాగింది. ఈ యాత్రకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. యువత, మహిళలు యాత్రలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజాం మండలం బొద్దాం గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను యాత్రలో పాల్గొన్న మంత్రులు, ఇతర నేతలు ప్రారంభించారు. అక్కడి నుంచి ప్రధాన రహదారి మీదుగా ప్రారంభమైన యాత్ర రాజాం పట్టణ సమీపంలో కంచరాం తృప్తి రిసార్ట్ వరకూ సాగింది. మధ్యాహ్నం 3.30 గంటలకు రాజాం పట్టణంలోకి ప్రవేశించింది. దాదాపు మూడు వేల మంది బైక్‌ర్యాలీగా బస్సు యాత్ర ముందు సాగారు. అంబేడ్కర్ కూడలిలో సాయంత్రం 4 గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు రాజాం, వంగర, సంతకవిటి, రేగిడి మండలాలకు చెందిన వేలాది మంది తరలివచ్చారు. వెనుకబడిన వర్గాలకు సీఎం వైఎస్ జగన్ చేసిన మేలును నేతలు వివరిస్తుంటే చప్పట్లతో స్వాగతించారు. జై జగన్.. జై జై జగన్ అంటూ నినదించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆత్మ బంధువు సీఎం జగన్: స్పీకర్ తమ్మినేని సీతారాం రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆత్మ బంధువు అని శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. దేశంలో మరే సీఎంచేయని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్ని పదవుల్లో పెద్దపీట వేసి, అనేక పథకాలతో అభివృద్ధి పథంవైపు నడిపిస్తున్నారని చెప్పారు. అందుకే ఈరోజు సామాజిక సాధికార యాత్రను ఓ జైత్రయాత్ర నిర్వహించుకోగలుగుతున్నామన్నారు. 139 బీసీ సామాజికవర్గాలను గుర్తించి 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేశారని, వాటికి చైర్మన్లతో పాటు 700 డైరెక్టర్ల పదవులను ఇచ్చి ఆత్మగౌరవాన్ని కాపాడారని వివరించారు. కులగణన జరగాలని దేశంలోనే మొట్టమొదటగా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నదీ సీఎం జగనే అని చెప్పారు. విద్య, వైద్యాన్ని బడుగు, బలహీనవర్గాలకు చేరువ చేస్తూ జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నారని, ఇదే అసలైన అభివృద్ధి అని వివరించారు. తాండ్ర పాపారాయుడు పుట్టిన గడ్డపై ఓట్ల కోసం అబద్ధాలు చెప్పే టీడీపీ నాయకులను తిప్పికొడతామని హెచ్చరించారు. సంతృప్తకర స్థాయిలో సంక్షేమం: ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలంటూ నాలుగున్నరేళ్లుగా సీఎం వైఎస్ జగన్ ఈ వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నారని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు చెప్పారు. సంక్షేమ పథకాలను సంతృప్తికర స్థాయిలో అమలు చేస్తున్నారని, అన్ని రంగాలనూ అభివృద్ధి చేస్తూ సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు. గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి: ఎమ్మెల్యే జోగులు రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడుతూ రాజాం నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి జరిగిందన్నారు. నామినేటెడ్ పదవుల్లో ఈ ప్రాంతానికి చెందిన సామాజిక వర్గానికి 70 శాతం మేర పదవులు వచ్చాయని వెల్లడించారు. నాగావళి నదిపై రుషింగి, కిమ్మి గ్రామాల మధ్య వంతెన నిర్మాణానికి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ. 25 కోట్లు మంజూరుచేస్తే, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ పనులు పూర్తిచేయించారని చెప్పారు. తోటపల్లి రెగ్యులేటర్ కుడికాలువ ఆధునికీకరణకు రూ.40 కోట్లు మంజూరుచేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, విశ్వాసరాయి కళావతి, పాముల పుష్పశ్రీవాణి, అలజంగి జోగారావు, బొత్స అప్పలనర్సయ్య, శంబంగి వెంకటచిన్న అప్పలనాయుడు, విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
సీఎం జగన్ సంక్షేమ పాలన దేశానికే ఆదర్శం: స్పీకర్ తమ్మినేని
సాక్షి, విజయనగరం జిల్లా: వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం పరిధిలోని బొద్దాం గ్రామంలో అశేష జనవాహిని విశేష స్వాగతం మధ్య జైత్రయాత్రగా సాగింది. అడుగడుగునా జనం బస్సు యాత్రలో వచ్చిన నేతలకు అపూర్వంగా స్వాగతించారు. అనంతరం నియోజకవర్గ పరిధిలోని నాలుగున్నరేళ్లలో సాగించిన అభివృద్ధి పనులను నేతలు పరిశీలించారు. అనంతరం రాజాం జంక్షన్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, స్పీకర్ తమ్మినేని సీతారామ్, ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ కోఆర్డినేటర్ వై వీ సుబ్బారెడ్డి, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జిల్లాపరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు కంబాల జోగులు, శంబంగి చిన అప్పలనాయుడు, బొత్స అప్పల నర్సయ్య,ధర్మాన కృష్ణదాస్, కళావతిలు హాజరయ్యారు. జగన్ పాలనలోనే సామాజిక సాధికారత సాధ్యమైంది- డిప్యూటీ సీఎం బూడి ఈసందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ, దేశ చరిత్రలో ముఖ్యమంత్రిగా జగన్ పాలనలోనే సామాజిక సాధికారత సాధ్యమైందని, వెనుకబడిన అనేక వర్గాలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ప్రాధాన్యతను ఇచ్చారన్నారు. ఒకటో తరగతి నుంచి పీజీ వరకు బాలల చదవుల బాధ్యతను జగన్ తీసుకుని తన భుజస్కందాల మీద వేసుకున్నారని, రైతాంగానికి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి అండగా నిలిస్తున్నారన్నారు. వచ్చే జనవరి నుంచి అవ్వా తాతాలకు పెన్షన్ రూ. 3 వేలు అందనున్నాయని, రెండు వేళ్ళు చూపిస్తున్న టీడీపీ నేతలకు మూడు వేలు అందనున్న నేపథ్యంలో మూడు వేళ్లు చూపించాలని పిలుపునిచ్చారు. ప్రతీ కుటుంబంలో అనేక మార్పులుచోటు చేసుకున్నాయని, ఈ సామాజిక సాధికారత ఎవరి వల్ల సాధ్యమైందో, జగన్ ఏ విధంగా సాధికారత సాధించారో ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు. సీఎం జగన్ నిర్ణయంతో వెనుకబడిన వర్గాలకు మంరిత మేలు: స్పీకర్ తమ్మినేని స్పీకర్ తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ వైయస్సార్ సీపీ పాలనపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకు సామాజిక సాధికార జైత్రయాత్ర ద్వారా ప్రజలు సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. జనప్రవాహంలా బస్సు యాత్ర సభకు ప్రజలు తరలిరావడం సీఎం జగన్ పిలుపునకు ప్రజలు చూపుతున్న ఆదరాభిమానాలు నిదర్శనమన్నారు. తాండ్ర పాపా రాయుడు పుట్టిన గడ్డ కాబట్టి ఈ ప్రాంతాల్లో అన్యాయాలు చేసిన వారిపై తిరగబడి ప్రజలు వైయస్సార్ సీపీని గెలిపించారన్నారు. కుల గణన జరగాలని కేబినెట్ లో సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవడంతో బీసీలకు మరింత మేలు జరగుతుందని ప్రకటించారు. టీడీపీ హయాంలో విద్య,వైద్యం వంటి అనేక ప్రాధాన్య రంగాలను నిర్వీర్యం చేసారని, జగన్ ముఖ్యమంత్రి కాగానే అన్ని రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు చేపడుతూ సామాజిక విప్లవం తీసుకువచ్చారన్నారు. అవినీతి లేకుండా లంచగొండులకు చోటు ఇవ్వకుండా అనేక సంక్షేమ పథకాలను జగన్ బటన్ నొక్కి అర్హులైన లబ్ధిదారులకు నేరుగా అందచేస్తూ, జీవన ప్రమాణాలు పెంచుతుండటం అభివృద్ధి కాదా అని తమ్మినేని ప్రశ్నించారు. పేదలకు ఆర్థిక సాధికారత జగన్ పాలనలో కలగడంతో కొనుగోలు శక్తి పెరిగి దేశంలోని జీడీపీలో గణనీయ వృద్ధి సాధించడమే కాకుండా, అనేక రంగాల కేంద్ర సూచీల్లో కూడా మెరుగైన స్థానాల్లో రాష్ట్రం ఉందని వివరించారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిని గుర్తించి కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నాయని, అయినా సరే ఆ పార్టీ శ్రేణులు కడిగిన ముత్యం అంటూ చంద్రబాబును చెప్పుకోవడం సిగ్గు చేటని ఆగ్రహం వ్యక్తం చేసారు. జనం కోసం జగన్.. జగన్ కోసం జనం: ఎమ్మెల్యే కంబాల జోగులు రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడుతూ, పార్టీకతీతంగా కుల మతాలకు అతీతంగా అర్హులైన పేదలకు 1970 కోట్లు రాజాం నియోజకవర్గ అభివృద్ధికి సీఎం జగన్ కేటాయింపులు చేసారని అన్నారు. చంద్రబాబు పాలనలో నియోజకవర్గంలో పేదలకు అన్యాయం చేయడమే కాకుండా ఎక్కడా ఎటువంటి అభివృద్ధి కూడా చేయలేదని మండిపడ్డారు. జగన్ పాదయాత్రలో ప్రజా సమస్యలను గుర్తించి పార్టీ మ్యానిఫెస్టో రూపొందించి దానిని పవిత్ర గ్రంధంగా గుర్తించి అమలు చేస్తున్నారని వివరించారు. ఆత్మహత్యలు, ఆకలి చావులు, శాంతిభద్రతలకు విఘాతం వంటి అంశాలకు చోటు లేకుండా జగన్ పాలన చేస్తున్నారని, సామాజిక సాధికారితను ప్రజలు గుర్తించి అన్ని ప్రాంతాల్లో విశేషంగా ఆదరిస్తున్నారన్నారు. ప్రజల కోసం జగన్ ఉన్నారు.. జగన్ కోసం జనం అండగా ఉండాలని పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ జగన్ ను మరోసారి ముఖ్యమంత్రిని చేసి బడుగుల ఆత్మాభిమానాన్ని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ బస్సు యాత్రను గాలి యాత్ర అని లోకేశ్ అంటున్నారని, ఇది బీసీల ఆత్మగౌరవ యాత్ర, టీడీపీ పై చేసే దండయాత్ర, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు చేసే జైత్రయాత్ర అని తెలుసుకోవాలని మండిపడ్డారు. విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ, పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సామాజిక అభివృద్ధి చేస్తున్న జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జైలుకు వెళ్లిన తర్వాత ఆ పార్టీ కనుమరుగైందని విమర్శించారు. చదవండి: చంద్రబాబు మెడికల్ రిపోర్ట్ ఇచ్చింది వైద్యులా? రాజకీయ నేతలా?: సజ్జల -
పవన్ కళ్యాణ్ పై స్పీకర్ తమ్మినేని కామెంట్స్...
-
ఇది బడుగుల ప్రభుత్వం..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: గతంలోని టీడీపీ ప్రభుత్వం నిమ్న వర్గాలను పట్టించుకోలేదని, అందుకే వారంతా తిరగబడి వైఎస్ జగన్‌ను తమ నాయకుడిగా ఎన్నుకున్నారని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. అధికారంలోకి వచ్చాక బడుగు, బలహీన వర్గాలను సీఎం వైఎస్ జగన్ అక్కున చేర్చుకున్నారని.. అందుకే ఇది బడుగుల ప్రభుత్వమని ఆయన తెలిపారు. సామాన్యుల సంక్షేమమే ఈ ప్రభుత్వ ధ్యేయమని తమ్మినేని సీతారాంతో పాటు మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకరరావు తదితరులు పునరుద్ఘాటించారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో మంగళవారం సామాజిక సాధికార యాత్ర జరిగింది. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2.40 లక్షల కోట్ల నగదును సంక్షేమ పథకాల రూపంలో ముఖ్యమంత్రి జగన్ పేద ప్రజల ఖాతాల్లో జమచేశారని, ఈ లబ్ధిదారుల్లో టీడీపీ బూత్ ఏజెంట్లు కూడా ఉన్నారన్నారు. అందుకే తనవల్ల మంచి జరిగితేనే ఓటు వేయాలని సీఎం ధైర్యంగా అడుగుతున్నారని ఆయన తెలిపారు. పెత్తందారీ వ్యవస్థలో బడుగులకు విముక్తి కలిగించేందుకే ఆయన శ్రమిస్తున్నారని స్పష్టంచేశారు. ఒక్కసారి ఫ్యాన్ గుర్తుకు ఓటువేస్తేనే జగన్ ఇంతలా సంక్షేమ పథకాలు అమలుచేస్తుంటే మరోసారి ఎన్నుకుంటే ఇంకెంత మంచి చేస్తారో జనం ఆలోచించాలన్నారు. విపక్షాలు విమర్శించడానికి వీల్లేకుండా సంక్షేమం.. మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. దేశంలో 75 ఏళ్ల తర్వాత కూడా సామాజిక అంతరాలు, ప్రజల జీవన స్థితిగతులు నిర్లిప్తంగా పడిఉంటే జగన్ మాత్రమే వాటిని రూపమాపడానికి కృషిచేశారన్నారు. ప్రతిపక్షాలు సైతం విమర్శలు చేయడానికి ఆస్కారం లేకుండా రాష్ట్రంలో సంక్షేమ పాలన అందించగలుగుతున్నామన్నారు. ఉద్యోగాల కోసం మాట్లాడుతున్న విపక్షాలు రాష్ట్రంలో వైఎస్సార్సీపీ 2 లక్షల సచివాలయ ఉద్యోగాలు ఇచ్చిన సంగతిని గుర్తుతెచ్చుకోవాలన్నారు. విశాఖను రాజధాని చేస్తానంటే టీడీపీ నేతలు ఎందుకు వద్దంటున్నారో చెప్పాలని ధర్మాన అన్నారు. సామాన్యుల స్థితిగతుల్లో సమూల మార్పులు.. ఇక జగన్ సీఎం కాక మునుపు రాష్ట్రంలో సామాన్యుల జీవన పరిస్థితులు అధ్వానంగా ఉండేవని, ఇప్పుడు ఆయన వాటిని సమూలంగా మార్చివేశారని మంత్రి సీదిరి అప్పలరాజు కొనియాడారు. వెనుకబడిన కులాలకు జగన్మోహన్రెడ్డి ఒక అంబేడ్కర్ అని అభివర్ణించారు. బీసీల ఆత్మగౌరవాన్ని అవమానించిన చంద్రబాబు ఎక్కడ, రాజ్యాధికారం ఇచ్చి అన్ని అవకాశాలు కల్పించి, ఆత్మగౌరవాన్ని నిలిపిన సీఎం జగన్ ఎక్కడో ప్రజలు ఆలోచించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలే అధికంగా చదువుతున్నారని, నాడు–నేడుతో ఆ బడులను సీఎం బాగుచేశారని మంత్రి అప్పలరాజు గుర్తుచేశారు. బడులు, ఆస్పత్రులను చంద్రబాబు నిర్లక్ష్యంచేస్తే జగన్ వాటిని ఆధునీకరించారన్నారు. ఆమదాలవలస గడ్డ వైఎస్సార్సీపీ అడ్డా అంటూ అప్పలరాజు ప్రజలతో కలిసి నినదించారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో జరిగిన సామాజిక సాధికార యాత్ర సభకు భారీగా హాజరైన జనసందోహంలో ఓ భాగం సామాజిక న్యాయం చేసింది ముఖ్యమంత్రి జగనే.. ప్రభుత్వ సలహాదారులు జూపూడి ప్రభాకరరావు ప్రసంగిస్తూ.. చంద్రబాబు దొంగ దీక్షలను ప్రజలు నమ్మబోరన్నారు. ఆయన తన 40ఏళ్ల రాజకీయ జీవితంలో రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను బాబు కనీసం పట్టించుకోలేదని, వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాతే సామాజిక న్యాయం జరిగిందన్నారు. సామాజిక న్యాయం వైఎస్ జగన్‌తోనే సాధ్యం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ.. ప్రజలకు సామాజిక న్యాయం జరగాలంటే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమని స్పష్టంచేశారు. మంత్రివర్గ కూర్పు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్లు, ట్రస్టు ఛైర్మన్లు, మార్కెట్ యార్డులు.. ఇలా అన్నింటా సామాజిక న్యాయం పాటిస్తూ సీఎం జగన్ పదవులు అందించారని గుర్తుచేశారు. ఎన్ని పార్టీలు ఏకమైనా జగనన్న ఒక్కరే పోటీకి వస్తారని, మంచిచేసే పార్టీకి ప్రజలు న్యాయం చేస్తారని కృష్ణదాస్ ధీమా వ్యక్తంచేశారు. ఈ యాత్రలో వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, గొర్లె కిరణ్‌కుమార్, విశ్వసరాయి కళావతి, కంబాల జోగులు, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, పాలవలస విక్రాంత్, జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, కేంద్ర మాజీమంత్రి కిల్లి కృపారాణి, సామాజిక వర్గాల కార్పొరేషన్ చైర్మన్లు అంధవరపు సూరిబాబు, పేరాడ తిలక్, మామిడి శ్రీకాంత్ పాల్గొన్నారు. అడుగడుగునా జననీరాజనం.. ఇక ఈ సామాజిక సాధికార యాత్రకు ప్రజలు తండోపతండాలుగా జనం తరలివచ్చారు. బస్సు యాత్రకు అడుగడుగునా నీరాజనాలు పలికారు. ఆమదాలవలస కోర్టు జంక్షన్ సమీపంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభకైతే కనీవినీ ఎరుగని రీతిలో బడుగు బలహీన వర్గాల వారు హాజరయ్యారు. అంతకుముందు.. వాకలవలసలో ప్రెస్‌మీట్‌తో ప్రారంభమైన యాత్ర మోటార్ బైక్‌ల ర్యాలీతో ముందుకు సాగింది. దారిపొడవునా జనం బారులు తీరి నిల్చున్నారు. -
ఇది మన స్వాభిమాన ఆత్మగౌరవ యాత్ర
కాశీబుగ్గ/వజ్రపుకొత్తూరు/సాక్షి, అమరావతి : రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాకే సామాజిక సాధికారత సాధ్యమైందని స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు చెప్పారు. రాష్ట్రంలో పేదల జీవన ప్రమాణాల పెంపే లక్ష్యంగా వైఎస్ జగన్ పాలిస్తున్నారని.. అందుకే తమ పథకాలను చంద్రబాబు కూడా కాపీ కొట్టడానికి తయారైపోయారని వారు ఎద్దేవా చేశారు. పేదల పక్షాన నిల్చుని పోరాడే దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎం చేసుకోవడం చారిత్రక అవసరమన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సామాజిక సాధికార యాత్రలో భాగంగా ఆదివారం శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలోని కాశీబుగ్గ బస్టాండ్ సమీపంలో జరిగిన బహిరంగ సభలో అశేష జనవాహినిని ఉద్దేశించి వీరు ప్రసంగించారు. సభలో మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. చంద్రబాబు బడుగు బలహీన వర్గాల వారిని హీనంగా చూశారని.. కష్టం చెప్పుకోవడానికి వచ్చిన మత్స్యకారులతో అనుచితంగా మాట్లాడారని, అలాగే.. నాయీ బ్రాహ్మణులతో కూడా నీచంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని అవహేళన చేశారని ఆయన గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చట్టసభలు, కార్పొరేషన్ పదవుల్లో సీఎం జగన్ పెద్దపీట వేశారని సీదిరి అప్పలరాజు చెప్పారు. గతంలో మన పిల్లల బతుకులు మార్చాలన్న ఆలోచన ఏ నాయకుడికీ రాలేదని, కానీ.. జగన్ మాత్రం అమ్మఒడి అందించి పేదల చదువులు ఆగకుండా వారి బతుకుల్లో దీపాలు వెలిగించారని కొనియాడారు. అవినీతి మరక లేకుండా ‘సంక్షేమం’ : ధర్మాన అనంతరం.. మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. గత నాలుగున్నరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన మంచిని గుర్తుచేసేందుకే ఈ సామాజిక సాధికార యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. ఒకప్పుడు ఏదైనా కార్యక్రమం తలపెడితే మూడు నాలుగు ప్రభుత్వాలు మారితే గానీ అది కార్యరూపం దాల్చేది కాదని.. కానీ, వైఎస్ జగన్ సీఎం అయ్యాక పనుల్లో వేగం కనిపిస్తోందని.. పాలనలో ఆయన కొత్త ఒరవడి సృష్టించారని తెలిపారు. ఉద్యమాలు జరిగితేగానీ జరగని పనులు ప్రస్తుత ప్రభుత్వం సులభంగా చేస్తూ పాలనలో సమూల మార్పులు తీసుకొచ్చిందన్నారు. సంక్షేమ పథకాల కింద రూ.రెండు లక్షల ముప్పై వేల కోట్లను ప్రజల ఖాతాల్లో ఒక్క రూపాయి అవినీతి మరక లేకుండా జమచేశారని.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ పనితీరుకు ఇది మచ్చుతునక అని ధర్మాన అన్నారు. చంద్రబాబు కూడా ఈ సంక్షేమ పథకాలపై ఎలాంటి అవినీతి ఆరోపణ చేయలేకపోయారన్నారు. బాబు పాలనకు, జగన్ పాలనకు మధ్యనున్న తేడాను ప్రజలే బేరీజు వేసుకోవాలని ఆయన కోరారు. బాబు జీవితమంతా తన వారికి దోచి పెట్టడానికి, దోచుకున్నది దాచుకోవడానికే సరిపోయిందని ధర్మాన ఎద్దేవా చేశారు. పేదలు తలెత్తుకుని బతికేలా.. ఇక మేనిఫెస్టోలో ఇచి్చన హామీలను నెరవేర్చడానికి ప్రభుత్వం అహర్నిశలు కృషిచేస్తోందని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర చరిత్రలో పేదలు తలెత్తుకుని బతికేలా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. చంద్రబాబు తన మనవళ్లను ఇంగ్లిష్ మీడియంలో చదివిస్తూ పేదలకు మాత్రం ఆంగ్ల మాధ్యమం వద్దంటూ కోర్టుకు వెళ్లడం విడ్డూరంగా ఉందన్నారు. విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడి వంటివి పేద విద్యార్థులకు వరమని ఆయన తెలిపారు. తన దృష్టిలో ఇద్దరే ఇద్దరు మామలని.. ఒకరు చందమామ అయితే మరొకరు జగన్ మామ అని కొనియాడారు. మరోవైపు.. జగనన్న సురక్ష, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాలు నిర్వహించడం సీఎం వైఎస్ జగన్‌కు మాత్రమే సాధ్యమన్నారు. ఇది మన స్వాభిమాన ఆత్మగౌరవ యాత్ర అని తమ్మినేని అభివరి్ణంచారు. జగన్ బటన్ నొక్కితే నేరుగా లబ్ధిదారులకే వెళ్తుందని, మధ్యవర్తిత్వం లేని పాలన అందిస్తున్నారని తెలిపారు. నాలుగున్నరేళ్లలో సీఎం వైఎస్ జగన్ ఎన్ని బటన్లు నొక్కారో అందుకున్న వారికే తెలుసునన్నారు. కార్యక్రమంలో పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి బొత్స సత్యనారాయణ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, పాలవలస శ్రీకాంత్, ఎమ్మెల్యేలు కంభాల జోగులు, రెడ్డి శాంతి, విశ్వాసరాయి కళావతి, పలాస మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఇసుకేస్తే రాలనంతగా జనం.. ఇక ఆదివారం నిర్వహించిన ఈ యాత్రకు జనం బ్రహ్మరథం పట్టారు. పల్లె ప్రాంతాల నుంచి వెల్లువలా బహిరంగ సభకు తరలివచ్చారు. సభ నిర్వహించిన ప్రాంగణం ఇసుకేస్తే రాలనంతగా జనంతో కిక్కిరిసిపోయింది. నియోజకవర్గంలోని రామకృష్ణాపురం నుంచి కాశీబుగ్గ కేటీ రోడ్డు వరకు బస్సు యాత్ర సాగింది. నేడు విశాఖ, కాకినాడ, ప్రకాశం జిల్లాల్లో యాత్ర.. ఈ సామాజిక సాధికార బస్సు యాత్ర సోమవారం విశాఖపట్నం జిల్లా గాజువాక, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్, ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గాల్లో జరుగుతుంది. -
200 కోట్లతో సరికొత్త ఆలోచనతో సీఎం జగన్
-
ఆర్థిక నేరగాళ్లను ప్రజలు సపోర్ట్ చేయరు..!
-
అదొక పార్టీ..వాడొక నాయకుడు: స్పీకర్ తమ్మినేని సీతారాం
-
అసెంబ్లీ నిరవధిక వాయిదా..!
-
సీఎం వైఎస్ జగన్ గురించి స్పీకర్ తమ్మినేని అద్భుతమైన మాటలు
-
టీడీపీ నేతల సస్పెన్షన్.. స్పీకర్ తమ్మినేని కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఏలూరు: ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. సభ్యులు శాసనసభ నియమావళి సాంప్రదాయాలు పాటించాలి. సభ్యులపై సస్పెన్షన్ ఒక్కటే కాదు.. అనుచిత ప్రవర్తన మీద కఠినమైన నిర్ణయాలు తీసుకోవచ్చు అని హెచ్చరించారు. ప్రతీ సభ్యులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సూచించారు. కాగా, స్పీకర్ తమ్మినేని శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్ర రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్నాయి. శాసనసభ్యులు సభా సంప్రదాయాలను ఉల్లఘించి సమాజానికి ఏమని సంకేతాలు ఇస్తున్నారు. స్పీకర్ పోడియంపైకి రావడం.. గేలి చేయడం ప్రజలు గమనిస్తున్నారు. టీడీపీ సభ్యుల చేష్టలపై మాట్లాడాలంటే నాకు చాలా బాధగా ఉంది. నేను శాసనసభలో ఉన్నాను అని, బాధ్యతగా వ్యవహరించాలనే స్పృహ సభ్యులకు ఉండాలి. సభ్యులపై సస్పెన్షన్ ఒక్కటే కాదు.. అనుచిత ప్రవర్తన మీద కఠినమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ విషయంలో సభలో చర్చించేందుకు సమయం ఇచ్చాం. కానీ, టీడీపీ సభ్యులు ఆ సమయాన్ని ఉపయోగించుకోలేదు. ప్లకార్డులు ప్రదర్శించడం, విజిల్స్ వేయడం, సభలో ఉన్న వస్తువులను ధ్వంసం చేయడం మంచి పద్ధతి కాదు. ప్రభుత్వం అన్యాయం చేస్తుందనే భావన ఉంటే.. శాసనసభలో ఉండి పోరాడాలి. చంద్రబాబును, టీడీపీ సభ్యులను సభ నుంచి ఎవరూ పొమ్మనలేదు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే ఆయనపై కేసు నమోదు అయ్యింది. స్కిల్ స్కాంపై సరైన ఆధారాలు ఉన్నాయి కాబట్టే చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. రాష్ట్రంలో పొత్తులు అనేవి రాజకీయ పార్టీలకు సంబంధించినవి’ అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: జడ్జి హిమబిందుపై టీడీపీ నేతలు పోస్టులు.. చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి భవన్ నుంచి లేఖ -
పలాయనవాదమే లక్ష్యం
సాక్షి, అమరావతి : అసెంబ్లీలో ఏం మాట్లాడాలో దిక్కుతోచక, ఏం మాట్లాడితే ఏమవుతుందోననే భయంతో టీడీపీ పలాయనవాదాన్ని నమ్ముకుని, ఆచరిస్తోంది. ఇందులో భాగంగానే చట్టసభల ఖ్యాతిని దిగజారుస్తూ చిల్లర వ్యాఖ్యలతో స్పీకర్, అధికార పక్ష సభ్యులను చిరాకుపరుస్తోంది. తద్వారా సస్పెన్షన్ వేటు వేయించుకుని బయటకు జారుకోవచ్చనే వ్యూహంతో ముందుకు వెళుతోంది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు అడ్డంగా బుక్కై రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉండటంతో టీడీపీ సభ్యుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. దీంతో సభలో ‘స్కిల్’ స్కామ్‌పై మాట్లాడే అవకాశం ఇచ్చినప్పటికీ, జైల్లో సౌకర్యాల గురించి అడ్డగోలుగా తప్పులు పట్టడం మినహా.. ఆయన నేరం చేయలేదని చెప్పేందుకు అవకాశం, ఆధారం లేక సభలో గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకుంది. గురు, శుక్రవారాల్లో శాసనసభ సమావేశాల్లో టీడీపీ సభ్యుల ప్రవర్తనే ఇందుకు సాక్షంగా నిలుస్తోంది. రెండవ రోజు శుక్రవారం కూడా టీడీపీ ఎమ్మెల్యేలు తమ స్థాయిని మరిచి వ్యవహరించారు. ఆకతాయిల మాదిరిగా స్పీకర్‌ను చుట్టుముట్టి ఆయనపై కాగితాలు చింపి విసిరేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. నినాదాలు చేస్తూ, బయటి నుంచి తెచ్చుకున్న విజిల్స్ ఊదుతూ అధికార పార్టీ సభ్యులను రెచ్చగొట్టేలా ప్రవర్తించారు. కుర్చీలు, బల్లలపై ఎక్కి తీవ్ర గందరగోళాన్ని సృష్టించారు. చంద్రబాబు అరెస్ట్ అంశంపై సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దమ్ముంటే చర్చలో పాల్గొనాలని మంత్రులు సవాల్ విసిరినా పట్టించుకోలేదు. çసభా సమయాన్ని వృధా చేయడమే లక్ష్యంగా గొడవ సృష్టించేందుకు యత్నించారు. నిబంధనలకు విరుద్ధంగా సెల్ఫోన్లలో చిత్రీకరిస్తున్న ఇద్దరు సభ్యులను స్పీకర్ సెషన్ మొత్తం సస్పెన్షన్ వేటు వేయగా, మరో ముగ్గురిని ఒకరోజు సస్పెన్షన్ చేశారు. దీంతో మిగిలిన టీడీపీ సభ్యులు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్–చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై చేపట్టిన స్వల్ప కాలిక చర్చలో పాల్గొనకుండా పలాయనం చిత్తగించారు. సభ ప్రారంభమైంది మొదలు.. రెండో రోజు శాసనసభ ప్రారంభం కాగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు మొదలు పెట్టారు. సభ్యులడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు మంత్రి గుడివాడ అమర్నాథ్ సిద్ధమయ్యారు. టీడీపీ సభ్యులు ప్లకార్డులతో నినాదాలు చేస్తూ సభలోకి వస్తూనే స్పీకర్ పోడియం వైపునకు దూసుకెళ్లారు. స్పీకర్ చైర్‌ను చుట్టుముట్టి నినాదాలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై టీడీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. ఈ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, చర్చలో పాల్గొని మీ వాదన వినిపించుకోవచ్చన్నారు. అయినా తక్షణమే చర్చకు పట్టుబడుతూ స్పీకర్‌పై కాగితాలు విరుసుతూ నినాదాలు చేయడంతో సభను స్పీకర్ వాయిదా వేశారు. రెండోసారి సభ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యుల చుట్టూ మార్షల్స్‌తో మూడంచెల భద్రత వలయాన్ని ఏర్పాటు చేశారు. టీడీపీ తీరుపై మండిపాటు టీడీపీ సభ్యుల తీరుపై మంత్రులతో సహా పలువురు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేల తీరు చూసి.. ఇలాంటి వారినా మనం ఎన్నుకున్నదని ప్రజలు సిగ్గు పడుతున్నారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌పై చర్చలో పాల్గొనే దమ్ము లేకే టీడీపీ ఎమ్మెల్యేలు ఇలా దిగజారి వ్యవహరిస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. అసెంబ్లీలో టీడీపీ రౌడీయిజానికి ఎవరూ భయపడరని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సైకో చంద్రబాబు పాలన ఎప్పుడో పోయిందని మంత్రి జోగి రమేష్ అన్నారు. ఎన్టీఆర్‌ను పొట్టనపెట్టుకున్న చంద్రబాబే అసలైన సైకో అని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలు అధ్వాన్నంగా ప్రవర్తిస్తున్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి ధ్వజమెత్తారు. ప్రజాధనాన్ని దోచుకుని దొరకిపోయిన దొంగ చంద్రబాబు అని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ మానసిక రోగి అని,ఆయనకు మెంటల్ సర్టిఫికెట్ ఉందని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఆయన్ను ఆస్పత్రికి తరలించకపోతే గన్ను తెచ్చి సభలో ఎవరో ఒకరిని కాల్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. నిషేధం ఉన్నా సెల్ఫోన్లతో చిత్రీకరణ మూడంచెల భద్రతను ఏర్పాటుచేయడంతో టీడీపీ సభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్‌లు తమ సెల్ఫోన్ల ద్వారా సభలో దృశ్యాలను రికార్డింగ్ చేయడం మొదలుపెట్టారు. నిబంధనను తుంగలో తొక్కి వీడియో రికార్డు చేసిన టీడీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు స్పీకర్‌ను కోరారు. వీడియో రికార్డింగ్ చేసిన ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, అశోక్‌లను సెషన్ మొత్తానికి సస్పెండ్ చేస్తూ స్పీకర్ రూల్ పాస్ చేశారు. దీంతో వీరిని మార్షల్స్ బయటకు పంపారు. ఈ దశలో ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వెలగపూడి రామకృష్ణబాబు, నిమ్మల రామానాయుడుతో సహా సభ్యులందరూ తమ వెంట తీసుకొచ్చిన విజిల్స్ ఊదుతూ సభలో గందరగోళం సృష్టించే యత్నం చేశారు. ఎమ్మెల్యే బాలకృష్ణ, గద్దె రామ్మోహన్ సహా టీడీపీ సభ్యులు కుర్చిలలో నిల్చొని విజిల్స్ ఊదుతూ హంగామా చేశారు. సభా సంప్రదాయాలను తుంగలోకి తొక్కి విలువలను దిగజారుస్తున్న సభ్యులపై చర్యలు తీసుకోవాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కోరగా, ఎమ్మెల్యేలు గోరంట్ల, వెలగపూడి, నిమ్మలపై ఒకరోజు సస్పెన్షన్ వేటు వేస్తూ స్పీకర్ ఆదేశాలు జారీచేశారు. వారిని మార్షల్స్ బయటకు పంపగా, వారి వెంట మిగిలిన సభ్యులు కూడా వెళ్లిపోయారు. కనీసం మిగిలిన వాళ్లయినా చర్చలో పాల్గొనాలని మంత్రులు సహా పలువురు సభ్యులు కోరినా పట్టించుకోకుండా సభ నుంచి వెళ్లిపోయారు. -
ఇద్దరు టీడీపీ సభ్యుల సస్పెన్షన్..
-
సభలో బాలకృష్ణ రచ్చ రచ్చ.. సినిమా రేంజ్లో రెచ్చిపోయి..
సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈరోజు కూడా టీడీపీ సభ్యులు రెచ్చిపోయారు. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ బాధ్యతారాహిత్యంతో సభలో విజిల్స్ వేశారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి కాగితాలు విసిరారు. అంతటితో ఆగకుండా ఆందోళనలకు దిగారు. ఈ క్రమంలో ఇద్దరు టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సస్పెండ్ చేశారు. విజిల్స్ వేస్తూ బాలకృష్ణ హంగామా.. వివరాల ప్రకారం.. రెండోరోజు సమావేశాల సందర్బంగా టీడీపీ సభ్యులు రెచ్చిపోయారు. నిన్న సభలో అనుచితంగా ప్రవర్తించిన బాలకృష్ణ.. ఈరోజు కూడా రెచ్చిపోయారు. అసెంబ్లీలో చంద్రబాబు కూర్చిలో నిలుచుని బాలకృష్ణ.. విజిల్ పట్టుకుని విజిల్స్ వేశారు. సభలో సభ్యులను చూస్తూ విజిల్స్ వేస్తూ హంగామా క్రియేట్ చేశారు. ప్రజాప్రతినిధి అనే స్పృహ కూడా లేకుండా రచ్చ చేశారు. బాలకృష్ణకు మద్దతిస్తూ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా ఆయనతో కలిసి విజిల్స్ వేశారు. విజిల్స్ ఆపాలని స్పీకర్ చెప్పినా టీడీపీ సభ్యులు పట్టించుకోలేదు. విజిల్స్ తీసుకోవాలన్న స్పీకర్ ఆదేశాలతో టీడీపీ సభ్యుల వద్దకు వెళ్లిన మార్షల్స్ వెళ్లడంతో వారితో బాలకృష్ణ దురుసుగా ప్రవర్తించారు. ఇలా సభా సంప్రదాయాలకు బాలకృష్ణ తిలోదకాలు పలికారు. కాగా, నిన్న కూడా సభలో బాలకృష్ణ స్పీకర్ పోడియం వద్ద మీసం మెలేశారు. ఈ క్రమంలో బాలకృష్ణ చేసిన పనిని మొదటి తప్పుగా పరిగణిస్తూ స్పీకర్ ఆయనకు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇద్దరు సభ్యులు సస్పెండ్.. ఇదిలా ఉండగా.. సభలో మిగతా టీడీపీ సభ్యులు కూడా సభా ఉల్లంఘనలకు పాల్పడ్డారు. సభలో ఫొటోలు, వీడియోలు తీశారు. ఈ నేపథ్యంలో ఇద్దరు సభ్యులపై స్పీకర్ తమ్మినేని సస్పెన్షన్ విధించారు. అచ్చెన్నాయుడు, బి.అశోక్‌లను సస్పెండ్ చేశారు. వీరిద్దరిని పూర్తిగా అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ వెల్లడించారు. టీడీపీ సభ్యులు తీరుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం.. ► రచ్చచేసే ఉద్దేశమే తప్ప చర్చించాలనే ఆలోచనే వారికి లేదు. బజారులో ఊదాల్సిన ఈలను ఇక్కడ ఊదుతున్నారు. సభ్యులను రెచ్చగొట్టే విధంగా టీడీపీ మాట్లాడుతోంది. టీడీపీ సభ్యులు సీట్లపైకి ఎక్కి నిల్చున్నారు. చర్చలో పాల్గొనే దమ్ము వారికి లేదు. బాబు మోసగాడని టీడీపీకి బాగా తెలుసు: అంబటి రాంబాబు. ► దేవాలయంలాంటి అసెంబ్లీని కించపరిచారు. చిల్లర కోసమే విజిల్స్ వేస్తున్నారు. బజారు కూతలు కూస్తే ఊరుకునేది లేదు. దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రావాలి, టీడీపీ రౌడీయిజానికి ఎవరూ భయపడరు: కాకాణి ► టీడీపీ సభ్యుడు ప్రతీ ఒక్కరూ సైకోనే: నారాయణ స్వామి -
బాలకృష్ణ మీసం తిప్పడంపై స్పీకర్ తమ్మినేని స్ట్రాంగ్ వార్నింగ్
-
బాలకృష్ణకు స్పీకర్ తమ్మినేని వార్నింగ్.. ముగ్గురు ఎమ్మెల్యేలు సస్పెండ్
సాక్షి, అమరావతి: ఏపీలో మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టించారు. చంద్రబాబు అరెస్ట్‌పై చర్చించాలని నినాదాలు చేస్తూ శాసనసభ, మండలిలో ఓవరాక్షన్ చేశారు. దీంతో, రెండు సభలు కాసేపు వాయిదా పడ్డాయి. ► కొంత విరామం తర్వాత అసెంబ్లీ ప్రారంభమైంది. అనంతరం, కూడా టీడీపీ సభ్యులు తమ తీరు మార్చుకోలేదు. దీంతో, టీడీపీ సభ్యులతో స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడే ప్రయత్నం చేశారు. అయినా కూడా వారు వినకపోవడంతో టీడీపీ సభ్యులను ఈరోజుకు సభ నుంచి సస్పెండ్ చేశారు. అలాగే, సభలో అనుచితంగా ప్రవర్తించిన టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణను స్పీకర్ హెచ్చరించారు. ► సభలో బాలకృష్ణ మీసం మెలేసిన ఘటనపై స్పీకర్ హెచ్చరించారు. స్పీకర్ స్థానాన్ని టీడీపీ సభ్యులు అగౌరవపరిచారు. దీన్ని మొదటి తప్పుగా క్షమిస్తున్నాం. స్పీకర్ పోడియం దగ్గర నిలుచుని మీసం మెలేసి సభా సంప్రదాయాలను బాలకృష్ణ ఉల్లఘించారు. ఇలాంటి వికృత చేష్టలు చేయడం తప్పు. ఇలాంటి చర్యలు మళ్లీ పునారవృతం కాకూడదు. ► ఇక, సభలో ఓవరాక్షన్ చేస్తూ స్పీకర్‌తో అనుచితంగా ప్రవర్తించిన సభ్యులను స్పీకర్ తమ్మినేని సస్పెండ్ చేశారు. ఈ సమావేశాలు ముగిసే వరకు ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. సస్పెన్షన్‌కు గురైన వారిలో ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్ ఉన్నారు. ఇక, టీడీపీ సభ్యులతో పాటు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇది కూడా చదవండి: బాలకృష్ణ ఓవరాక్షన్.. మంత్రి అంబటి స్ట్రాంగ్ కౌంటర్ -
అసెంబ్లీలో బాలకృష్ణ ఓవరాక్షన్.. అంబటి స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన కాసేపటికే సభలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. చంద్రబాబు అరెస్ట్‌పై చర్చించాలని నినాదాలు చేస్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం వద్దకు దూసుకెళ్లారు. ఈ క్రమంలో స్పీకర్‌ను చుట్టుముట్టి ఆయనపై పేపర్లు విసిరారు. బాటిళ్లు విసురుతూ అనుచితంగా ప్రవర్తించారు. ► ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు స్పందించారు. ఈ సందర్బంగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్ట్‌పై చర్చకు సిద్ధమన్నారు. బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అసెంబ్లీలో ఏం అంశంపైనైనా చర్చుకు సిద్ధమన్నారు. చంద్రబాబు అరెస్ట్‌పై చర్చకు ఎంత సమయమైనా ఇస్తాం అని స్పష్టం చేశారు. ► బుగ్గన చెప్పినా టీడీపీ సభ్యులు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు.. టీడీపీ నేతలకు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. చంద్రబాబు అరెస్ట్‌పై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కాసేపు ఓపికా పడితే చర్చకు సిద్దమని వెల్లడించారు. ► దీంతో, మరింత రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ.. అంబటి వైపు చూస్తూ తొడగొట్టి.. మీసాలు మెలేశారు. ఈ క్రమంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ.. టీడీపీ సభ్యులు కావాలనే రెచ్చగొడుతున్నారు. టీడీపీ సభ్యులు అవాంఛనీయ ఘటనలను ఆహ్వనిస్తున్నారు. స్పీకర్‌పై దౌర్జన్యానికి దిగడం సరికాదన్నారు. టీడీపీ సభ్యులు బల్లలు కొడుతూ ఏం సందేశమిస్తున్నారు. అసెంబ్లీలో మీసాలు తిప్పితే చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఇలాంటివన్నీ సినిమాల్లో చేసుకోవాలని కౌంటరిచ్చారు. అయితే, స్పీకర్ ఎంత వారించినా టీడీపీ సభ్యులు వినిపించుకోకపోవడంతో సభను కాసేపు వాయిదా వేశారు తమ్మినేని. ► ఇదిలా ఉండగా.. శాససమండలి ప్రారంభమైన కాసేపటికే అటు మండలిలోనూ టీడీపీ సభ్యులు ఓవరాక్షన్ చేశారు. మండలిలో కూడా టీడీపీ సభ్యులు ప్రశ్నోత్తరాలను అడ్డుకున్నారు. చంద్రబాబు అరెస్ట్‌పై చర్చించాలని నినాదాలు చేశారు. మండలి ఛైర్మన్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. ► ఈ క్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. టీడీపీ సభ్యుల తీరు సరికాదు. ఏ అంశం పైన అయినా చర్చకు సిద్ధం. సభ సజావుగా జరిగేందుకు టీడీపీ సభ్యులు సహరికరించాలని కోరారు. అయినప్పటికీ వారు వినకపోవడంతో టీడీపీ సభ్యుల తీరుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
Andhra Pradesh: నేటి నుంచి ‘అసెంబ్లీ’
సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసన సభ, శాసన మండలి సమావేశాలు గురువారం ప్రారంభం కానున్నాయి. శాసనసభ సమావేశాలు ఉదయం 9 గంటలకు, మండలి సమావేశాలు 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి. అనంతరం శాసన సభా వ్యవహారాల సలహా కమిటీ సమావేశం కానుంది. సభ ఎన్ని రోజులు నిర్వహించాలి.. ఏ అంశాలపై చర్చించాలనే దానిపై ఈ సమావేశంలో అజెండా ఖరారు కానుంది. రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక బిల్లులను ఈ సమావేశాల్లో ఆమోదించనుంది. సమావేశాలు సజావుగా సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసింది. అసెంబ్లీ, మండలి సమావేశాల నేపథ్యంలో బుధవారం శాసనసభ కమిటీ హాల్లో శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు, శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఉన్నతాధికారులతో సమావేశమై బందోబస్తు, ఇతర ఏర్పాట్లుపై సమీక్ష నిర్వహించారు. పటిష్టమైన పోలీస్, మార్షల్ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు, శాసన సభా స్పీకర్ తమ్మినేని సీతారామ్ అధికారులను ఆదేశించారు. మార్షల్స్ అప్రమత్తంగా ఉండాలి మండలి చైర్మన్, శాసనసభ స్పీకర్.. పోలీస్ అధికారులతో శాంతి భద్రతల అంశాన్ని సమీక్షిస్తూ.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పోలీస్, మార్షల్స్ ఎంతో అప్రమత్తంగా ఉండాలని, పాస్ లేకుండా ఏ ఒక్కరినీ అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించ వద్దని రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి వారు సూచించారు. ఈ సారి పాస్‌ల జారీని కూడా సాధ్యమైనంత నియంత్రించాలని.. ప్రముఖులు, అధికారులు, సిబ్బంది మినహా ఇతరులకు ఎటువంటి విజిటింగ్ పాస్‌లు జారీ చేయవద్దని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యులను ఆదేశించారు. సభ్యులు సమావేశాలకు సకాలంలో హాజరయ్యేలా వారి రాకపోకలకు ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, వారు బసచేసే ప్రాంతాల్లో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని కోరారు. సచివాలయం నాలుగు వైపులా పటిష్టమైన పోలీస్ బందోబస్తుతో పాటు అధునాతన సమాచార, సాంకేతిక వ్యవస్థతో పటిష్టమైన నిఘా ఏర్పాట్లు చేయాలన్నారు. ఎటువంటి ఏమరపాటు లేకుండా ఎంతో అప్రమత్తంగా పోలీస్ అధికారులు, సిబ్బంది బందోబస్తు విధులను నిర్వహించాలని సూచించారు. సభ్యులకు సంతృప్తికర సమాధానాలు అంతకు ముందు పలు శాఖల కార్యదర్శులతో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు, శాసన సభా స్పీకర్ తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు సమావేశాలను సజావుగా నిర్వహించడంలో పలు శాఖల కార్యదర్శులు, అధికారులు ఎంతగానో సహకరించారని, అదే సహకారాన్ని ఇకపైనా కొనసాగించాలని కోరారు. ఎన్నికలు జరిగే సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో గౌరవ సభ్యులు పలు ప్రజా సమస్యలపై ప్రశ్నలు అడుగుతుంటారని, వాటన్నింటికీ సమావేశాల నిర్వహణ సమయంలోనే సంతృప్తికర స్థాయిలో సమాధానాలు ఇవ్వాలని సూచించారు. గౌరవ సభ్యులు వారి నియోజకవర్గాల సమస్యలను సభలో చెప్పుకునేందుకు జీరో అవర్ ఎంతో ప్రాముఖ్యమైనదని, ఆ సమయంలో సభ్యులు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలను అధికారులు వెంటనే అందజేయాలన్నారు. పలు శాఖల వారీగా పెండింగ్‌లో ఉన్న స్టార్డు, అన్ స్టార్డు, షార్టు నోట్ ప్రశ్నలను వివరిస్తూ వాటన్నింటికీ వెంటనే సరైన సమాధానాలను అందజేసి జీరో స్థాయికి తీసుకురావాలన్నారు. ప్రశ్నలకు సకాలంలో సమాధానాలు ఇచ్చేందుకు, వారి పిటిషన్లను సత్వరమే పరిష్కరించేందుకు ఆన్లైన్ ప్లాట్‌ఫాంను సత్వరమే రూపొందించాలని ఐటీ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, ఉన్నతాధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, అసెంబ్లీ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలను సచివాలయం నాలుగవ బ్లాకు పబ్లిసిటీ సెల్ నుండి మీడియాకు అందజేసేలా సమాచార శాఖ ఏర్పాట్లు చేసింది. -
పురంధేశ్వరి బంధుత్వానికి నిబద్ధతతో ఉన్నారా?: తానేటి వనిత
సాక్షి, తూర్పుగోదావరి: చంద్రబాబు నాయుడు అరెస్టులో ఎలాంటి రాజకీయ దుర్ధేశం, కుట్రలు లేవని హోంమంత్రి తానేటి వనిత తెలిపారు. సీఐడీ అధికారులు నిబంధనల ప్రకారం నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా అరెస్ట్ చేసిన తర్వాత నంద్యాల నుంచి విజయవాడకు హెలికాప్టర్లో తరలిస్తామని సీఐడీ అధికారులు చెప్పినా బాబు మాట వినలేదని అన్నారు. ఆయన ఎందుకు నిరాకరించారో అందరకీ ఇప్పుడు అర్థం అవుతుందన్నారు. ‘స్కిల్ డెవలప్మెంట్ సంస్థలో జరిగిన స్కామ్‌ను మొదట గుర్తించింది 2017లో అంటే గత ప్రభుత్వంలోనే. ప్రతిపక్షాలుఅనవసర రాద్దాతం చేయాలని చూస్తున్నాయి. చంద్రబాబు అరెస్ట్ ఆయన చేసిన తప్పిదాల వల్ల జరిగింది. రాజకీయ కుట్రలు చేసేది టీడీపీనే అందరూ గమనించాలి. చంద్రబాబు నాయుడు తప్పు చేశారని ఆయనకు తెaiసు కాబట్టే గత మూడు రోజులుగా సానుభూతి కోసం పాకులాడారు. పురందేశ్వరి అరెస్ట్‌లను ఏ విధంగా ఖండిస్తారో సమాధానం చెప్పాలి. పురందేశ్వరి ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారు..? అమిత్ షా పై రాళ్లు వేయించిన.. మోదీని తిట్టించిన వారిని ఆమె సమర్థిస్తుందా..? పురందేశ్వరి పార్టీకి నిబద్దతతో ఉన్నారా..? లేక బంధుత్వానికి నిబద్ధతతో ఉన్నారా..? ఈడీ, జీఎస్టీ వంటి కేంద్ర సంస్థలు తప్పు చేశాయని బీజేపీ చెప్పదల్చుకుందా..? సమాధానం చెప్పాలి. ఇన్నాళ్లు మాట్లాడని పవన్ .. ఈ రోజు ముందుకొచ్చారు.. అంటే ఈ స్కాంలో పవన్‌కు అందుతున్న ప్యాకేజీ ఎంత?’ అని మంత్రి తానేటి వనిత ప్రశ్నించారు. చదవండి: చంద్రబాబు అరెస్ట్ అక్రమం కాదు.. అనివార్యం: మంత్రి అంబటి అధికారం చేపట్టిన రెండు నెలలకే ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధి ఈ విధంగా ఆర్థిక నేరం చేయడం ఏంటని స్పీకర్ తమ్మినేని సీతారం విస్మయం వ్యక్తం చేశారు. చట్టానికి ఎవరూ చుట్టం కాదని, మొత్తం కేబినెట్‌ను తప్పుదోవ పెట్టి 3 వందల కోట్లు కాజేశారని అభియోగాలు రుజువు కావడంతో అరెస్టు జరిగిందన్నారు. అధికారం చేపట్టిన రెండు నెలలకే ఈ స్కిల్ డెవలప్ మెంట్ పేరుతో కేబినెట్‌ను పక్కదోవ పట్టించారని తెలిపారు. పాలన అంటే పారదర్శకంగా ఉండాలని.. అన్ని అధికారాలను ఓవరూల్డ్ చేసి ఈ సెల్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నారని స్పీకర్ తెలిపారు. సీమెన్స్ నుంచి ఒక్క పైసా కూడా రాకుండా 371 కోట్లు ఎలా విడుదల చేశారని ప్రశ్నించారు. ఆర్థిక అధికారులు కొర్రి పెడితే చంద్రబాబు స్వయంగా వెంటనే విడుదల చేయాలని అప్పట్లో ఆదేశించారని గుర్తు చేశారు. చదవండి: ‘చంద్రబాబు అరెస్ట్ కక్ష సాధింపు చర్యగా కనిపించడం దౌర్భాగ్యం’ లూటీ చేయటంలో నైపుణ్యం: ఆదిమూలపు సురేష్ చంద్రబాబు ఆర్ధిక నేరస్తుడని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. నిరుద్యోగ యువతకు నైపుణ్యం అందిస్తానని ఆశ చూపి వారి డబ్బును లూటి చేయటంలో నైపుణ్యం చూపించాడని విమర్శించారు. అమరావతి నిర్మాణం, పేదలకు ఇళ్లనిర్మాణం, నిరుద్యోగ యువతకు నైపుణ్యం ముసుగులో ప్రజాధనాన్ని లూటీ చేయటంలో నైపుణ్యం చూపించాడని దుయ్యబట్టారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, జీఎస్టీ, ఇంటెలిజెన్స్ అధికారులు ఇప్పటికే అన్ని ఆధారాలు బయటపెట్టి ఇందులో ప్రమేయం ఉన్న కొందరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. 18 కేసుల్లో స్టే చంద్రబాబు తప్పుడు దారిలో ప్రభుత్వ ధనాన్ని దోచుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో కోట్లు దోచుకున్నారు. తప్పు చేశారు కనుకే తలదించుకుని సీఐడీ వెంట వెళ్ళారు. ఇప్పటి కే చంద్రబాబు 18కేసులకు స్టే తెచ్చుకున్నారు. రాష్ట్రాని కాపాడుకుంటానని యాత్రలు చేసే చంద్రబాబు రాష్ట్రాని దోచ్చుకున్నారు. ఇప్పుటికే చేలా కేసులు చంద్రబాబు పై సిద్దంగా ఉన్నాయి. ఆయన అనేక సార్లు అరెస్టు చేయాల్సి ఉంటుంది. యువగళంలో టీడీపీ హింసను ప్రేరేపిస్తుంది. రాజధాని భూముల కేసులో కూడ చంద్రబాబు అరెస్టు అవుతారు. -ఎమ్మెల్యే ఎలిజా కామెంట్స్ ఆలస్యంగా అరెస్ట్ చేసినందుకు విచారిస్తున్నాం చంద్రబాబు నాయుడు 2014 అధికారం చేపట్టిన వెంటనే అక్రమాలకు, అవినీతికి శ్రీకారం చుట్టారు. అన్ని రకాలుగా అవినీతి అక్రమాలలో దొరికిపోయాడు. సిల్క్ డెవలప్మెంట్ సంబందించి 371 కోట్ల రూపాయలకు స్కామ్ జరిగింది. చంద్రబాబు ప్రభుత్వంలో విచారణ జరుగుతుండగా అడ్డుకోవడం జరిగింది. చంద్రబాబు ఎటువంటి తప్పుచేసినా పవన్ ప్రశ్నించడు. ఆధారాలు చూపించకుండా అరెస్ట్ చేస్తారా అని వింత ప్రశ్న వేస్తున్నాడు. అవినీతి, అక్రమాలలో పవన్‌కు భాగస్వామ్యం ఉంది. చంద్రబాబు నాయుడుని ఇంత ఆలస్యంగా అరెస్ట్ చేసినందుకు విచారిస్తున్నాం. -ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ స్కాం చేయలేదని బాబు చెప్పడం లేదు చంద్రబాబు అరెస్టులో ఎలాంటి కక్షసాధింపు లేదు. చంద్రబాబు అరెస్టుతో వైసీపికి ఎలాంటి సంబంధం లేదు. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని యువతకు నమ్మబలికి స్కాం చేశారు. ఒక కంపెనీతో ఒప్పందం, మరో కంపెనీకి నిధులు నిచ్చారు. రూ.371 కోట్లను కొల్లగొట్టారు. ఈ కేసులో ఈడీ కూడా నలుగురిని అరెస్టు చేసింది. ఆ నలుగురూ తామువతీసుకున్న డబ్బంతా చంద్రబాబుకు పంపామని చెప్పారు. అంటే స్కాంలో అసలు సూత్రధారి చంద్రబాబే. తాను స్కాం చేయలేదని చంద్రబాబు కూడా చెప్పటంలేదు. అంటే భారీగా కుంభకోణం జరిగినట్టు ఆయన కూడా నిర్ధారించారు. ఈ స్కాంలో డబ్బంతా చంద్రబాబుకు వచ్చేసింది. నిజంగా చంద్రబాబు నిప్పు ఐతే ఇన్ని స్కాంలు ఎలా చేశారు? ఎల్లోమీడియాని అడ్డం పెట్టుకుని నిజాలను అబద్దాలుగా మార్చలేరు. కక్షసాధింపు ఐతే ఎన్నికలకు ముందు ఎందుకు అరెస్టు చేస్తాం?. ఇప్పుడు అరెస్టు చేయగానే టీడీపీ తెగ హడావుడి చేస్తోంది. కోర్టులో బెయిల్ వస్తే ఒకరకంగా, రాకపోతే ఇంకోరకంగా డ్రామాలు చేయటానికి చంద్రబాబు ప్లాన్ వేశారు. అమరావతి కేసులు, టిట్కో ఇళ్లు, రింగురోడ్డు కేసు, ఫైబర్ నెట్ కేసులు కూడా విచారణ జరుగుతాయి. చట్టం తన పని తాను చేసుకు పోతుంది. వ్యవస్థలను మేనేజ్ చేసి ఇంతకాలం చంద్రబాబు కథ నడిపించారు. ఇకమీదట అలా నడవదు. తప్పు చేసినవారికి శిక్ష తప్పదు - ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ -
చంద్రబాబుపై స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు
-
AP: అసెంబ్లీలో చివరి రోజూ అదే తీరు
సాక్షి, అమరావతి: శాసనసభ బడ్జెట్ సమావేశాల చివరిరోజూ తెలుగుదేశం పార్టీ తన అరాచక బుద్ధిని ప్రదర్శించింది. స్పీకర్ తమ్మినేని సీతారామ్ లక్ష్యంగా ఆ పార్టీ సభ్యులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ప్రశ్నోత్తరాలు మొదలవగానే వాయిదా తీర్మానానికి టీడీపీ పట్టుపట్టింది. నిబంధనల ప్రకారం నడుచుకోవాలని స్పీకర్ వారించడంతో టీడీపీ సభ్యులు రెచ్చిపోయారు. తమను దగ్గరుండి కొట్టించడంతో పాటు.. ఎమ్మెల్యేపైనే స్పీకర్ దాడి చేశారంటూ ఆరోపించారు. చివరకు రెడ్‌లైన్ దాటి, సస్పెండై సభ నుంచి వెళ్లిపోయారు. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ప్రారంభమవగా, ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. ‘ఆయుష్మాన్ భారత్’పై టీడీపీ సభ్యులే అడిగిన ప్రశ్నలకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని బదులిస్తుండగా వినకుండా తమ స్థానాల నుంచే రన్నింగ్ కామెంట్రీ మొదలుపెట్టారు. జీవో నంబర్1ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను వినిపించేందుకు టీడీపీ సభ్యులకు స్పీకర్ మైక్ ఇచ్చినప్పటికీ పట్టించుకోకుండా తమ వాయిదా తీర్మానం తీసుకోవాలంటూ భీషి్మంచారు. 9.09గంటలకు వెల్‌లోని రెడ్‌లైన్ వరకు వచ్చి స్పీకర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమను సంప్రదించకుండా రెడ్‌లైన్ ఎలా పెడతారని శాసనసభ కార్యదర్శిని టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. రెడ్‌లైన్ దాటి సభాపతి పోడియంపైకి దూసుకెళ్లారు. సభా సంప్రదాయాలకు విఘాతం కలిగిస్తున్నారంటూ టీడీపీ సభ్యులపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సభలో ఇచ్చిన రూలింగ్ ప్రకారం రెడ్ లైన్ దాటినందుకు టీడీపీ సభ్యులు కె.అచ్చెన్నాయుడు, డోలా బాలవీరాంజనేయస్వామి, గద్దె రామ్మోహన్రావు, గొట్టిపాటి రవి, ఏలూరు సాంబశివరావు, వెలగపూడి రామకృష్ణబాబు, పీజీవీఆర్ నాయుడు (గణబాబు), గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మంతెన రామరాజు, నిమ్మకాయల చినరాజప్ప ఒక రోజు సభ నుంచి ఆటోమేటిక్‌గా సస్పెండ్ అయినట్టు ప్రకటించారు. బయటకు వెళ్లేందుకు టీడీపీ సభ్యులు నిరాకరించడంతో మార్షల్స్‌ను రప్పించారు. అయితే 9.22 గంటలకు నవ్వుకుంటూ.. బయటకు వెళ్లిపోయారు. బయటకు వెళ్తూ అచ్చెన్నాయుడు శాసనసభను సంతాప సభతో పోల్చారు. -
టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి: మంత్రి రోజా
సాక్షి, తిరుపతి: టీడీపీ నేతలపై మంత్రి ఆర్కే రోజా సీరియస్ అయ్యారు. టీడీపీ నాయకులు చేసిన తప్పును సమర్ధించుకోవడానికి మా పార్టీ నేతలపై నిందలు వేయడం సిగ్గుచేటు. వాళ్లకు ఎమ్మెల్సీ వస్తే ఏమీ జరిగిపోదు అంటూ కామెంట్స్ చేశారు. కాగా, మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ.. 2019 నుండి ఎక్కడా గెలవకపోవడంతో టీడీపీ నాయకులు పిచ్చెక్కిపోయారు. టీడీపీకి అనుకోకుండా మూడు ఎమ్మెల్సీలు వచ్చాయి. ఆ ఎమ్మెల్సీలు సొంత ఓట్లు, సింబల్‌తో గెలవలేదు. అయినా ఏదో పెద్ద ఘనకార్యం సాధించినట్టు సంబరాలు చేసుకుంటున్నారు. వారి సంబరాలు చేసుకుంటే మాకేమీ అభ్యంతరం లేదు. కానీ, అహంకారంతో అసెంబ్లీలో స్పీకర్‌ను అవమానించి దాడి చేయడం దురదృష్టకరం. బీసీ అయిన స్పీకర్‌ను అవమానించి దాడికి యత్నించడం ఎంత వరకు కరెక్ట్?. వారు చేసిన తప్పులను సమర్థించుకోవడానికి మా నాయకులపై నిందలు వేయడం సిగ్గుచేటు. జీవో నంబర్-1 కోసం తీర్మానం ఇచ్చిన టీడీపీ ఎప్పుడైనా ప్రజా సమస్యల కోసం వాయిదా తీర్మానం ఇచ్చారా?. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితో 11 మందిని చంపేస్తే ప్రజా రక్షణ బాధ్యతతో జీవో నంబర్-1 తీసుకొచ్చాం. జీవో నంబర్-1 ప్రజలకు రక్షణ కల్పించడానికే అని అన్నారు. 2024లో సీఎం జగనన్న వన్స్ మోర్ అని ప్రజలే అంటున్నారు. టీడీపీ అధికారంలోకి రావడం పగటి కలే. టీడీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది అని చురకలు అంటించారు. ఇది కూడా చదవండి: స్కిల్ స్కాంలో చంద్రబాబు ఏ1 ముద్దాయి: మంత్రి మేరుగ -
టీడీపీ ‘సామాజిక’ చిచ్చు
సాక్షి, అమరావతి: సామాజికవర్గాల మధ్య చిచ్చుపెట్టేలా టీడీపీ సభ్యులు సభలో ప్రవర్తిస్తున్నారని శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాం విమర్శించారు. వాయిదా తీర్మానానికి ఆర్డర్లో రావాలని చెప్పినా వినిపించుకోవట్లేదని ఆవేదన వ్యక్తంచేశారు. గౌరవం ఇవ్వలేని ప్రతిపక్షం ఉన్న సభలో సభాపతిగా ఉండటం బాధగా ఉందన్నారు. తన విధులను త్రికరణశుద్ధిగా నిర్వర్తించాలనే ఆలోచనతో సభను నడిపిస్తున్నట్లు చెప్పారు. తనకు పార్టీలపైనా, ఏ ఒక్క సభ్యుడిపైనా ప్రత్యేక అభిమానం లేదన్నారు. కానీ, టీడీపీ సభ్యుల అనుచిత ప్రవర్తనను ఇన్నాళ్లూ మౌనంగా సహించానన్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం అసెంబ్లీలో చోటుచేసుకున్న ఘటనలపై స్పీకర్ స్పందిస్తూ.. ‘సభాపతి స్థానానికి కొన్ని పద్ధతులుంటాయి. వాటిని పట్టించుకోకుండా టీడీపీ సభ్యులు పోడియంపైకి వచ్చి నినాదాలు చేస్తారు. చైర్‌ను చుట్టుముట్టి గుద్దుతారు. నా ముఖంపై వేళ్లు చూపిస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. డోలా బాలవీరాంజనేయస్వామి ప్రవర్తించిన తీరు హేయంగా ఉంది. అచ్చెన్నాయుడు అయితే ఎత్తుగా ఉండటంతో కింద నుంచే సభ కనిపించకుండా నా ముఖానికి ఎదురుగా ప్లకార్డు అడ్డుపెడతారు. రామకృష్ణబాబు స్టీరియో కామెంట్లు చేస్తారు. అయినా మౌనంగానే భరించాను.. సహించాను. ఎమ్మెల్యే ఏలిజా (వైఎస్సార్సీపీ) వచ్చి మా హక్కులు రక్షించాలని కోరుతుంటే.. టీడీపీ సభ్యుడు నా ముఖానికి అడ్డుగా పెట్టిన ప్లకార్డును పక్కకు జరిపాను. అది కింద పడిపోయింది. అంతే.. వెంటనే స్పీకర్ కొట్టేశారంటూ గోలచేశారు. ఇలా చేయమని మీకు ఎవరు చెప్పి పంపిస్తున్నారు? ఇది మంచి సంస్కారం కాదు’.. అని టీడీపీ సభ్యులకు తమ్మినేని హితవు పలికారు. విలువైన సభా సమయం వృథా.. ఇక సభలో సభ్యులందరికీ సమాన హక్కులు ఉంటాయని స్పీకర్ స్పష్టంచేశారు. ఇది తెలుసుకోకుండా టీడీపీ సభ్యులు సభా సమయాన్ని, ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు మైక్ ఇస్తుంటే సభను తప్పుదారి పట్టిస్తున్నారని.. సభ జరుగుతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని.. కచ్చితంగా సమయం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటారన్నారు. ఆర్డర్ ప్రకారమే సభను నడిపిస్తాం నిజానికి.. సభలో వాయిదా తీర్మానం అనేది ప్రశ్నోత్తరాల తర్వాత వస్తుందని స్పీకర్ చెప్పారు. గత ప్రభుత్వంలో 5–3–2016న అప్పటి సభలోనూ ఇదే చెప్పారన్నారు. ‘టీడీపీ వాళ్లు చెప్పింది వాళ్లకే గుర్తులేకపోవడం దురదృష్టకరం. ప్రొసీడింగ్ చదవకుండా సభలో గందరగోళం సృష్టించి, అగౌరవపరచడం దారుణం. ప్రశ్నోత్తరాలు జరుగుతుంటే.. అచ్చెన్నాయుడు వాయిదా తీర్మానమిచ్చి ‘మీరు ఇప్పుడే చదవాలి’ అంటారు. ఇదా సీనియారిటీ? సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసి తొలిసారిగా గవర్నరుగా వచ్చిన వ్యక్తి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రోజు నుంచి ఇప్పటివరకు విపక్ష సభ్యుల ప్రవర్తన, అసభ్య పదజాలాన్ని అందరూ చూస్తున్నారు. జాతీయ మీడియా సైతం అటెన్షన్ చేసేలా గవర్నర్ రాకను కూడా తప్పుపట్టారు. గవర్నర్ రావడం కూడా టెబుల్ అజెండానా? దీనిని బీఏసీలో పెట్టాలనడం ఏమిటి? ఇది గవర్నర్ ఆఫీసు, అసెంబ్లీ సెక్రటేరియట్ మధ్య ఉండాల్సింది. కనీసం అది తెలుసుకోకుండా టీడీపీ సభ్యులు మాట్లాడటం శోచనీయం. ఏ శాసనసభలోనూ ఎవరూ టీడీపీ సభ్యుల్లా ప్రవర్తించి ఉండరు’.. అని స్పీకర్ అన్నారు. అది బీసీలకు ఇచ్చిన గౌరవం ‘సీఎం జగన్ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ.. నా మైనార్టీలు అని ధైర్యంగా చెప్పుకోగలిగిన గొప్ప నాయకుడు. నన్ను సభాపతిగా చేశారంటే.. సీఎం బలహీనవర్గాలకు ఇచ్చిన గౌరవం అది. ఇప్పుడు టీడీపీ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవడానికి పెద్ద సమయం పట్టదు. కానీ, వాళ్లు కూడా సభకు రావాలి. ప్రజా సమస్యలపై చర్చించాలి. ఇదే నా అభిమతం’.. అని స్పీకర్ అన్నారు. ఎర్రగీత దాటితే ఆటోమేటిగ్గా సస్పెన్షన్ ‘అసెంబ్లీ గౌరవాన్ని పెంచేలా ఎందరో మహానుభావులు స్పీకర్‌గా సేవలందించారు. వ్యక్తి ఎవరన్నది ముఖ్యం కాదు. సభాపతి స్థానంలో ఎవరున్నా గౌరవించాలి. సభ్యులు నిరసన వ్యక్తంచేయడంలో అభ్యంతరంలేదు. కానీ, టీడీపీ సభ్యులకు సభాపతి స్థానం, సభావిలువలపై గౌరం లేదు. టీడీపీ సభ్యుల తీరు గర్హనీయం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. అందుకే సభ్యులు కారణం లేకుండా సభలో నినాదాలు చేయడం, చైర్ వద్దకు రావడం, వెల్‌లో బైఠాయించడం చేస్తే ఆటోమేటిగ్గా సస్పెండ్ అయ్యేలా రూలింగ్ ఇస్తున్నాం’ అని స్పీకర్ ప్రకటించారు. -
స్పీకర్‌పై వికృత చేష్టలు.. దాడి 'అసెంబ్లీకి బ్లాక్ డే'
సాక్షి, అమరావతి: ఈసారి అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నుంచి సభను అడ్డుకోవడమే లక్ష్యంగా నిత్యం రచ్చరచ్చ చేస్తున్న టీడీపీ సభ్యుల దుశ్చర్య సోమవారం పరాకాష్టకు చేరుకుంది. ఏకంగా సభాపతి తమ్మినేని సీతారాంపై దాడికి తెగబడ్డారు. సభా సంప్రదాయాలను తుంగలో తొక్కుతూ చరిత్రలో ఎన్నడూలేని విధంగా టీడీపీ ఎమ్మెల్యేలు తమ వికృత చేష్టలను బయటపెట్టారు. సభాపతిపై దాడిని అడ్డుకునేందుకు వచ్చిన మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలపైనా దాడిచేశారు. చివరకు మార్షల్స్‌ను కూడా పిడిగుద్దులు గుద్దుతూ భౌతిక దాడులకు పాల్పడ్డారు. శాసనసభ చరిత్రలో మాయని మచ్చగా మిగిలిన ఈ ఘటనపై స్పీకర్ తమ్మినేని తీవ్ర మనస్తాపంతో సభ నుంచి తన చాంబర్లోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత కూడా వారు నినాదాలు చేస్తూ నానా రచ్చచేశారు. సభ ప్రారంభం కాగానే గలాటా.. సభ సోమవారం ఉదయం ప్రారంభం కాగానే జీఓ–1 రద్దు మీద తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. ముందుగా వాయిదా తీర్మానం చదివి వినిపించాలని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు డిమాండ్ చేయగా.. ‘వాయిదా తీర్మానం ఎప్పుడు చర్చకు అనుమతించాలో నాకు తెలుసు.. ముందు మీరు కూర్చోండి’ అంటూ స్పీకర్ కోరారు. ప్రశ్నోత్తరాల తర్వాత వాయిదా తీర్మానంపై నిర్ణయం తీసుకుంటానని చెబుతూ స్పీకర్ క్వశ్చన్ అవర్‌ను ప్రాంభించారు. ఈ సమయంలో మంత్రి కారుమూరు నాగేశ్వరరావు ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోలుకు సంబంధించిన ప్రశ్నకు సమాధానం చెబుతుండగానే అచ్చెన్నాయుడు స్పీకర్ వైపు వేలు చూపిస్తూ ముందు తామిచ్చిన వాయిదా తీర్మానాన్ని సభలో చదివి వినిపించాలంటూ బిగ్గరగా కేకలు వేశారు. దీనిపై స్పీకర్ అసహనం వ్యక్తంచేస్తూ ‘చైర్‌ను మీరు డిక్టేట్ చేస్తున్నారా?’ అనడంతో టీడీపీ సభ్యులంతా ప్లకార్డులతో వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేయడం మొదలుపెట్టారు. స్పీకర్ పోడియం ఎదుట వైఎస్సార్సీపీ సభ్యులను నెట్టివేస్తున్న టీడీపీ సభ్యులు చర్చలో పాల్గొనాలని ఎంత చెప్పినా... ‘సభ ప్రారంభమై పట్టుమని పది నిమిషాలు కూడా కాకుండానే మీరు ఇలా ప్రవర్తించడం సరికాదు.. దయచేసి పద్ధతి మార్చుకోండి..’ అని స్పీకర్‌తో సహా మంత్రులు హితవు పలికినా టీడీపీ సభ్యులు వినిపించుకోకుండా వెల్ నుంచి పోడియంపైకి ఎక్కి స్పీకర్ చైర్‌కు ఇరువైపులా చేరి పెద్దఎత్తున నినాదాలు చేయడం మొదలుపెట్టారు. మరోవైపు.. స్పీకర్ టేబుల్‌పై ఉన్న పుస్తకాలు, పత్రాలు చించివేస్తూ ఆయన ముఖంపైకి విసరడం ప్రారంభించారు. కిందనున్న ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ శాసనసభ సిబ్బంది వద్ద ఉన్న ప్రొసీడింగ్స్ కాపీలను పోడియంపైనున్న ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకు అందించగానే అతను వాటిని చించి స్పీకర్‌పై విసరడం మొదలుపెట్టారు. ఓ వైపు కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే మరోవైపు స్పీకర్ చైర్‌ను చేతులతో కొడుతూ కాగితాలు చించి విసిరారు. ఈ సమయంలో స్పీకర్ ఏమాత్రం సంయమనం కోల్పోకుండా ‘దయచేసి పోడియం దిగి మీ మీ స్థానాల్లో వెళ్లి కూర్చోండి. ప్రశ్నోత్తరాల్లో పాల్గొనండి’.. అంటూ పదేపదే విజ్ఞప్తి చేసినా టీడీపీ సభ్యులు ఆయన్ను పట్టించుకోకుండా గొడవ చేస్తూనే ఉన్నారు. ఎస్సీ ఎమ్మెల్యేలపై దాడి.. అదే సమయంలో.. తమ హక్కులు కాపాడాలంటూ వెల్ బయటి నుంచి విన్నవిస్తున్న చింతలపూడి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వీఆర్ ఎలీజా సభాపతిపై జరుగుతున్న దాడిని గమనించి పోడియం పైకెళ్లి టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామిని అడ్డుకోవడంతో ఆయనను టీడీపీ సభ్యులు తోసేసారు. స్పీకర్‌తోపాటు సహచర ఎమ్మెల్యే ఎలీజాపై టీడీపీ సభ్యులు భౌతిక దాడి చేస్తుండడంతో సంతనూతలపాడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు పోడియంపైకి వచ్చి వారిని అడ్డుకోబోయారు. ఆయనపైనా దాడికి పాల్పడుతూ పక్కకు తోసేయడంతో సుధాకర్‌బాబు పోడియం హ్యాండ్ రెయిలింగ్‌పై పడిపోయారు. దీంతో సుధాకర్‌బాబు ఎడమ మోచేతికి గాయమైంది. పట్టుతప్పితే ఆయనకు పెద్ద ప్రమాదమే జరిగేది. టీడీపీ సభ్యుల దాడిలో గాయపడిన దళిత ఎమ్మెల్యే సుధాకర్‌బాబు అయినా, టీడీపీ సభ్యుల అరాచకం ఆగలేదు. సుధాకర్‌బాబుతో పాటు ఎలీజాపై దాడిచేస్తూనే ఉన్నారు. వారి నుంచి తమ సభ్యులను కాపాడుకునేందుకు సభలో ఉన్న మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు వెల్ నుంచి పైకి వెళ్లబోతుండగా వారిని తోసుకుంటూ టీడీపీ సభ్యులు కిందకు వచ్చేశారు. ఈ దశలో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సస్పెన్షన్ అయ్యాక.. మార్షల్స్‌పై పిడిగుద్దులు అర్ధగంట అనంతరం సభ తిరిగి ప్రారంభమైన తర్వాత టీడీపీ సభ్యులను ఒకరోజు సస్పెన్షన్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. సస్పెండ్ చేసినందున దయచేసి సభ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించినా, వారు అక్కడే బైఠాయించబోయారు. బయటకు పంపేందుకు ప్రయత్నిస్తున్న మార్షల్స్‌పైనా పిడిగుద్దులతో దాడికి దిగారు. చివరికి డోలాను బలవంతంగా ఎత్తుకుని బయటకు తీసుకెళ్లగా, ఆయన వెంట మిగిలిన టీడీపీ సభ్యులు కవ్విస్తూ బయటకెళ్లారు. డిప్యూటీ సీఎంపై ‘డోలా’ అనుచిత వ్యాఖ్యలు తనపై జరిగిన దాడితో పాటు సభలో టీడీపీ సభ్యుల దుశ్చర్యకు మనస్తాపం చెందిన స్పీకర్ సీతారాం సభ నుంచి తన చాంబర్లోకి వెళ్లిపోయారు. ఇంతలో మార్షల్స్ టీడీపీ సభ్యులను బలవంతంగా వారి స్థానాల దగ్గరకు తీసుకెళ్లారు. రోజూ రచ్చచేయడం టీడీపీ సభ్యులకు అలవాటుగా మారిందని, ఈరోజు ఏకంగా సభాపతిపైనే దాడులకు తెగబడ్డారంటూ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అనడంతో.. ‘నువ్వొక డిప్యూటీ సీఎం అంట్రా.. పనికిమాలిన నా కొడకా’.. అంటూ డోలా బాలవీరాంజనేయ స్వామి పరుష పదజాలంతో నానా దుర్భాషలాడడంతో మిగిలిన సభ్యులు ఆయన్ని వారించారు.అక్కడ నుంచి స్పీకర్, సీఎం, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను టీడీపీ సభ్యులు రెచ్చగొట్టేలా నినాదాలు చేస్తూనే ఉన్నారు. అటెండర్‌ను తోసేసి స్పీకర్‌పైకి దూసుకొచ్చి.. ఈ సమయంలో టీడీపీ సభ్యుల తీరుకు నిరసనగా మంత్రులు, ఎమ్మెల్యేలు సభలో మాట్లాడుతుండగా, స్పీకర్ అటెండర్‌ను పక్కకు తోసేసిన టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి స్పీకర్‌కు అడ్డంగా నిలబడి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఓ వైపు వీరాంజనేయస్వామి, మరోవైపు వెలగపూడి రామకృష్ణబాబు తదితరులు చైర్‌పై స్పీకర్ చేతులు కూడా పెట్టుకోనీయకుండా ఇబ్బంది కల్గిస్తూ స్పీకర్ ముఖానికి ప్లకార్డులు అడ్డంపెట్టారు. అచ్చెన్నాయుడు, బుచ్చయ్యచౌదరి, చినరాజప్ప కూడా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఇంతలో టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి స్పీకర్ ముఖంపై ప్లకార్డును అడ్డంగా పెట్టడంతో పాటు ఆయనపై చేయిచేసుకున్నారు. ప్ల్లకార్డు స్పీకర్ కంటికి తగలడంతో ఆయన దాన్ని పక్కకు తోసివేయడంతో అది కిందపడింది. దీంతో డోలా బాలవీరాంజనేయస్వామితో పాటు టీడీపీ సభ్యులు స్పీకర్ చైర్ చుట్టూ మూగి ఆయనపై దాడికి తెగబడ్డారు. -
టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ ఆగ్రహం.. పోడియం వద్దకొస్తే ఆటోమెటిక్ సస్పెన్షన్!
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీలో తనపై టీడీపీ సభ్యులు అనుచితంగా ప్రవర్తించడం పట్ల స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో టీడీపీ నేతలు చేసిన దౌర్జన్యాన్ని ఆయన ఖండించారు. తాను గౌతమ బుద్దుడు కాదన్న తమ్మినేని..లైన్ దాటకుండా నిరసన తెలిపే హక్కు సభ్యులకు ఉందన్నారు. ఇకపై పోడియం దగ్గరకు వస్తే ఆటోమెటిక్ సస్పెన్షన్ చేస్తానని స్పీకర్ కీలక రూలింగ్ ఇచ్చారు. టీడీపీ సభ్యులు సభను అగౌరవ పరిచారని విమర్శించారు. సభలో టీడీపీ సభ్యుల ప్రవర్తన హేయమైన చర్యగా అభివర్ణించారు. టీడీపీ సీనియర్ సభ్యులే తనపై దాడులు చేయడం దురదృష్టకరమన్నారు. నాపై దురుసుగా ప్రవర్తించడం సీనియారిటీనా?.. బడగు, బలహీన వర్గాలంటే ఇంత చిన్న చూపా? అంటూ స్పీకర్ మండిపడ్డారు. తన చైర్ వద్దకు వచ్చే హక్కు సభ్యులకు లేదని స్పష్టం చేశారు. తనకు సభ్యులంతా సమానమేనన్న తమ్మినేని.. సభలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు చూడలేదని తెలిపారు. స్పీకర్ చైర్‌ను టచ్ చేసి ముఖంపై ప్లకార్డులు ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంత జరిగినా టీడీపీ సభ్యుల వైఖరిని మౌనంగానే భరించానని తెలిపారు. ‘సభలో దాడులు చేయమని టీడీపీ సభ్యులకు ఎవరు చెప్పారు?. సభను సజావుగా నడిపించడమే నా కర్తవ్యం. సభ్యుల హక్కులు పరిరక్షించడం నా బాధ్యత. టీడీపీ నేతలు పేపర్లు చించి నాపై వేస్తుంటే.. పూలు చల్లుతున్నారనే భావించా. ఎమ్మెల్యే ఎలీజాను టీడీపీ సభ్యులు నెట్టేశారు. సభా సమయం, ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు. గత ప్రభుత్వంలో రోజాను ఏడాది సస్పెండ్ చేశారు. సభలో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తారు. టీడీపీ నేతల తీరు మారాలి’ అని స్పీకర్ వ్యాఖ్యానించారు. కాగా సోమవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయం నుంచే టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టించి దౌర్జన్యానికి దిగారు.స్పీకర్ తమ్మినేని సీతారామ్‌పై టీడీపీ సభ్యులు దాడికి పాల్పడ్డారు.స్పీకర్ చైర్ ఎక్కి ఆయన ముఖంపై ఫ్లకార్డులు అడ్డుగా పెట్టారు. పేపర్లు చింపి ఆయనపై విసిరేశారు. తమ్మినేని ఎంత విజ్ఞప్తి చేసినా పట్టించుకోకుండా ఆయన పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఈ క్రమంలోనే స్పీకర్‌కు రక్షణగా పోడియం వద్దకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చేరుకున్నారు. వారిపై కూడా టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. చదవండి: టీడీపీ నేతల దాడి: ‘ఇది బ్లాక్ డే.. ఇదంతా చంద్రబాబు డైరెక్షన్లోనే’ -
అసెంబ్లీలో టీడీపీ రచ్చ
-
ఏపీ అసెంబ్లీ.. స్పీకర్‌పై టీడీపీ సభ్యుల దాడి!
సాక్షి, అమరావతి:టీడీపీ సభ్యుల తీరు రోజురోజుకూ శ్రుతిమించుతోంది. సభా కార్యకలాపాలను అడ్డుకోవడమే కాక.. ఏకంగా సహచర సభ్యులు, స్పీకర్ పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఏడో రోజు సభ కొలువైంది. అయితే, ప్రశ్నోత్తరాల సమయం నుంచే టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టించి దౌర్జన్యానికి దిగారు.స్పీకర్ తమ్మినేని సీతారామ్‌పై టీడీపీ సభ్యులు దాడికి పాల్పడ్డారు. స్పీకర్ చైర్ ఎక్కి ఆయన ముఖంపై ఫ్లకార్డులు అడ్డుగా పెట్టారు. పేపర్లు చింపి ఆయనపై విసిరేశారు. తమ్మినేని ఎంత విజ్ఞప్తి చేసినా పట్టించుకోకుండా ఆయన పట్ల దురుసుగా ప్రవర్తించారు. సభలో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే స్పీకర్‌కు రక్షణగా పోడియం వద్దకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చేరుకున్నారు. వారిపై కూడా టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే సుధాకర్ బాబుపై దూషణలకు దిగారు. వారించిన వెల్లంపల్లి శ్రీనివాస్‌ను గోరంట్ల బుచ్చయ్య చౌదరి నెట్టేశారు. దీంతో వెల్లంపల్లి కిందపడబోయారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామిని టీడీపీ ఎమ్మెల్యే డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి దూషించారు. పచ్చపార్టీ నేతల తీరును వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. ఇది బ్లాక్ డే గా అభిప్రాయపడ్డారు. చదవండి: ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్ -
AP Assembly: టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ సీరియస్
సాక్షి, అమరావతి: సభలో టీడీపీ సభ్యుల తీరు అభ్యంతరకరంగా ఉందని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షానికి బాధ్యతారాహిత్యం, తనది బాధ్యత అని పేర్కొన్నారు. సభా నాయకుడు తనకు గొప్ప బాధ్యత అప్పగించారని, ఆ బాధ్యతల మేరకే సహనంగా ఉంటున్నట్లు చెప్పారు. చరిత్రలో కళంకితుడిగా ఉండాలనుకోవట్లేదని తెలిపారు. కాగా, సభా కార్యకలాపాలను టీడీపీ సభ్యులు పదేపదే అడ్డుకోవడంతో అసెంబ్లీలో గందగోళం నెలకొంది. దీంతో టీడీపీ సభ్యులను ఒకరోజు పాటు స్పీకర్ సస్పెండ్ చేశారు. పోలవరంపై టీడీపీని ఏకిపారేసిన బుగ్గన.. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ఏపీ ప్రయోజనాలపై చర్చించారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో తెలిపారు. విభజన వల్ల పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారంతో పాటు పోలవరం ప్రాజెక్టుకు నిధులపై ప్రధాని మోదీతో సీఎం చర్చించారని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో పోలవరంలో జరిగిన తప్పులపై చర్చిద్దామా? గతంలో టీడీపీ పెట్టిన బకాయిలపై చర్చిద్దామా? అని సవాల్ విసిరారు. టీడీపీ హయాంలో చంద్రబాబు 30 సార్లు ఢిల్లీకి వెళ్లారని బుగ్గన గుర్తు చేశారు. చంద్రబాబు గత ఢిల్లీ పర్యటనపై చర్చిద్దామా? అని అడిగారు. సభను పక్కదారి పట్టించేందుకే టీడీపీ ప్రయత్నిస్తోందని బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: నాగ్‌పూర్ టూ విజయవాడ: ఎకనమిక్ కారిడార్‌కు లైన్‌క్లియర్ -
చర్చలో రభస
సాక్షి, అమరావతి: బడ్జెట్ సమావేశాల సందర్భంగా నాలుగో రోజూ సభలో రభసను విపక్షం కొనసాగించింది. శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారామ్ బడ్జెట్‌పై చర్చ చేపట్టారు. పార్టీ ల సంఖ్యాబలాన్ని అనుసరించి సభ్యులకు సమయం కేటాయిస్తానని సభ ప్రారంభంలోనే ప్రకటించారు. దీని ప్రకారం టీడీపీ సభ్యులకు 17 నిమిషాలు ఇస్తున్నట్లు పేర్కొంటూ చర్చలో తొలుత మాట్లాడే అవకాశం ఇచ్చారు. టీడీపీ నుంచి ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ బడ్జెట్ గణాంకాలు అంకెల గారడీ అని, ప్రభుత్వం హామీలను విస్మరించిందని చెప్పారు. ఫ్యాన్సీ నెంబర్‌పై 2,79,279పై ఉన్న దృష్టి ప్రజా సమస్యలపై లేదంటూ బడ్జెట్‌ను విమర్శించారు. ఈ సమయంలో సీఎం ఆస్తులంటూ ఆరోపణలు చేస్తుండడంతో అధికార పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. అప్పటికే నిర్ణీత సమయం మించిపోవడం, వ్యక్తిగత విమర్శలు కొనసాగించడంతో ప్రసంగాన్ని త్వరగా ముగించాలని స్పీకర్ సూచించారు. బడ్జెట్‌పై చర్చించకుండా తప్పుదోవ పట్టించే యత్నాలు సరికాదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సూచించారు. అప్పటికే టీడీపీకి ఇచ్చిన నిర్ణీత సమయం దాటిపోయి 25 నిమిషాలు మాట్లాడడంతో అధికార పార్టీ నుంచి చర్చలో పాల్గొనేందుకు కోన రఘుపతికి స్పీకర్ అవకాశమిచ్చారు. ఈ సమయంలో టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని తమకు సమయం సరిపోలేదంటూ నినాదాలు చేస్తూ చర్చకు ఆటంకం కల్పించారు. డోల బాలవీరాంజనేయులు, వెలగపూడి రామకృష్ణ, ఆదిరెడ్డి భవానీ తదితరులు సభాపతి కుర్చీ వద్దకు చేరుకుని స్పీకర్ డౌన్‌డౌన్... అంటూ నినాదాలు చేశారు. విపక్ష సభ్యులు తమ సీట్ల వద్దకు వెళ్లాలని స్పీకర్ పదేపదే కోరినా మైక్ ఇవ్వాలని పట్టుబట్టారు. భోజనం సమయం కావడంతో టీడీపీ సభ్యులు సభ నుంచి సస్పెండై బయటకు వెళ్లిపోవాలన్న ఉద్దేశంతో ఉన్నారని ఆర్థిక మంత్రి బుగ్గన వ్యాఖ్యానించారు. అనంతరం సభ ఆమోదంతో టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించడంతో నినాదాలు చేస్తూ నిష్క్రమించారు. -
సభలో సరదాగా..
-
అసెంబ్లీ నుంచి 14 మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్..
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ఓవరాక్షన్ చేశారు. బడ్జెట్ ప్రవేశపెడుతుండగా ఆందోళన చేపట్టారు. స్పీకర్ పోడియంపై పేపర్లు విసిరారు. దీంతో టీడీపీ సభ్యుల తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని స్పీకర్‌కు సీఎం సిఫార్సు చేశారు. బడ్జెట్ ప్రసంగానికి అడ్డు తగలడంతో టీడీపీ నేతలపై స్పీకర్ తమ్మినేని సీతారాం చర్యలు తీసుకున్నారు. 14 మంది టీడీపీ సభ్యులను ఒక్కరోజు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా అసెంబ్లీలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. రూ. 2,79,279 కోట్తో 2023,24 వార్షిక బడ్జెట్ రూపొందించారు. రెవెన్యూ వ్యయం రూ. 2,28,540 కోట్లు.. మూలధన వ్యయం రూ. 31,061 కోట్లుగా పేర్కొన్నారు. చదవండి: రూ.2 లక్షల 79వేల 279 కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్ -
గవర్నర్‌ను కించపరిస్తే సహించాలా?: స్పీకర్ తమ్మినేని సీరియస్
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం సీరియస్ అయ్యారు. గవర్నర్‌ను కించపరిస్తే సహించాలా?.. దీన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటామని అన్నారు. సభకు తలవంపులు రాకూడదు. ప్రివిలేజ్ కమిటీ ముందు వీడియో ప్రదర్శిస్తామన్నారు. తప్పుడు ప్రచారాలపై కఠిన చర్యలు ఉంటాయని స్పీకర్ స్పష్టం చేశారు. అసెంబ్లీ నుంచి 12 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. శాసనసభ సమావేశాలు ముగిసేంత వరకు ఈ సస్పెన్షన్ అమలులో ఉంటుందని తెలిపారు.సెషన్స్ మొత్తం సస్పెండ్ అయిన వారిలో పయ్యావుల, రామానాయుడు, కోటంరెడ్డి ఉండగా.. మిగతా టీడీపీ సభ్యులు ఒకరోజు సస్పెన్షన్‌లో ఉన్నారు. గవర్నర్‌పై అసత్య ప్రచారం చేసినందుకు చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. -
24 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 16న బడ్జెట్.. బీఏసీలో నిర్ణయం
సాక్షి, అమరావతి: స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. 24 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఎసీ నిర్ణయించింది. 9 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 16న బడ్జెట్ ప్రవేశపెట్టాలని బీఏసీలో నిర్ణయించారు. సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, జోగి రమేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చీఫ్ విప్ ప్రసాద్ రాజు, శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. సమావేశం అనంతరం చీఫ్ విప్ ప్రసాదరాజు మీడియాతో మాట్లాడుతూ, రేపు(బుధవారం) గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుందని తెలిపారు. బడ్జెట్ సెషన్ కావడంతో శని, ఆదివారాల్లోనూ(18,19) సమావేశాలు కొనసాగుతాయన్నారు. 21, 22 అసెంబ్లీ సమావేశాలకు సెలవు ప్రకటించామన్నారు. సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ప్రవేశపెడతామన్నారు. ప్రతిపక్ష నేతను కూడా సభకు ఆహ్వానిస్తున్నామన్నారు. ప్రతిపక్షం లేవనెత్తే అంశాలపై చర్చకు సిద్ధమని ప్రసాదరాజు అన్నారు. కాగా, ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ఉదయం ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్ధేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ఆర్థికాభివృద్ధిలో ఏపీ ముందడుగు వేసిందని, వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల్లో అనూహ్య ప్రగతి సాధిస్తున్నామని గవర్నర్ అన్నారు. తొలిసారి ఆయన అసెంబ్లీలో ప్రసంగిస్తూ.. ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తోందన్నారు. నవరత్నాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అవినీతికి తావులేకుండా అర్హులందరికీ నేరుగా లబ్ధి చేకూరుతోందని చెప్పారు. నాలుగేళ్లుగా సుపరిపాలన అందిస్తున్నామన్నారు. వినూత్నంగా వాలంటీర్ వ్యవస్థ అమలు చేస్తున్నామని గవర్నర్ అన్నారు. చదవండి: ఏపీలో నాలుగేళ్లుగా సుపరిపాలన: గవర్నర్ అబ్దుల్ నజీర్ -
టీడీపీకి సమాధి కట్టేది బీసీలే
సాక్షి, అమరావతి/పటమట (విజయవాడ తూర్పు): వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో డిసెంబర్ 7న బుధవారం నిర్వహించనున్న జయహో బీసీ సభతో టీడీపీ అధినేత చంద్రబాబుకి వణుకు మొదలైందని వైఎస్సార్సీపీ నేతలు ఎద్దేవా చేశారు. అందుకే అయ్యన్న, అచ్చెన్నలాంటి టీడీపీ జాగిలాలను తమపైకి వదులుతున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీకి సమాధి కట్టేది బీసీలేనని స్పష్టం చేశారు. టీడీపీలో బీసీలను జెండా మోసేవారిగానే చూశారన్నారు. సీఎం వైఎస్ జగన్ పాలనలోనే బీసీలు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా మూడున్నరేళ్ల పాలనలోనే సీఎం జగన్ బడుగు, బలహీనవర్గాలకు రూ.90,415 కోట్లు డీబీటీ, నాన్ డీబీటీ విధానంలో అందించారని కొనియాడారు. ఈ సందర్భంగా ఎవరేమన్నారంటే.. పెద్ద బీసీ.. సీఎం జగన్ శతాబ్దాల నుంచి బీసీలు వివక్ష అనుభవిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ బీసీలకు ఆత్మగౌరవంతోపాటు పాలనలో భాగస్వామ్యం కూడా కల్పించారు. పెద్ద బీసీ.. సీఎం జగన్ మాత్రమే. శతాబ్దాలుగా ఇనుప గజ్జెలతో మోతుబరి వ్యవస్థ మాపై నాట్యం చేస్తున్న తరుణంలో బీసీలంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు.. దేశానికే బ్యాక్ బోన్ అని సీఎం జగన్ నిరూపించారు. పార్టీ, ప్రభుత్వ పదవుల్లో బీసీలకు పెద్దపీట వేశారు. గత ప్రభుత్వంలో బీసీలకు చంద్రబాబు కేవలం రూ.965 కోట్లు బడ్జెట్ మాత్రమే కేటాయించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా మూడేళ్లలోనే రూ.90,415 కోట్లు ఖర్చు చేశారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీపీలు, సహకార సంఘాల డైరెక్టర్లు, చైర్మన్లు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, మేయర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, లోక్‌సభ, రాజ్యసభల్లో ఎంపీలుగా బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. గతంలో ఇంత పెద్ద మొత్తంలో పదవులు ఇచ్చిన దాఖలాలు లేవు. బీసీలు అధికంగా ఉండే విశాఖలో రాజధానిని ఏర్పాటు చేయడం బీసీల అభ్యున్నతికి చిహ్నం. – తమ్మినేని సీతారాం, శాసనసభ స్పీకర్ టీడీపీలో వణుకు మొదలైంది.. ఈ మూడున్నరేళ్లలోనే బీసీల్లో ఎంతో పేరు సంపాదించిన సీఎం వైఎస్ జగన్‌ను చూసి టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారు. వైఎస్సార్సీపీ జయహో బీసీ సభ అనగానే టీడీపీలో వణుకు మొదలైంది. బీసీలే టీడీపీకి సమాధి కడతారు. బీసీలకు ఏం చేశామో.. ధైర్యంగా మేం చెప్పుకోగలం. చంద్రబాబుకు ఆ ధైర్యం ఉందా? బీసీలకు బాబు వెన్నుపోటు పొడిచారు. బీసీల గురించి మాట్లాడే అర్హత టీడీపీ నేతలకు లేదు. అయ్యన్నపాత్రుడు ఒక రోగ్. బీసీలను చంద్రబాబు ఓటింగ్ యంత్రాలుగానే చూశారు. ఒక్క బీసీకి కూడా రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇవ్వలేదు. సీఎం జగన్ ఏకంగా నలుగురు బీసీలను రాజ్యసభకు పంపించారు. బీసీల గుండెల్లో జగన్ ఉన్నారు. బాబు పునాదులు కదులుతున్నాయి. ఇదేం ఖర్మరా బాబూ అంటూ ప్రజలు విసుక్కుంటున్నారు. –కారుమూరి వెంకట నాగేశ్వరరావు, పౌర సరఫరాల శాఖ మంత్రి బీసీల సంక్షేమంపై టీడీపీ నేతలవి పచ్చి అబద్ధాలు.. బీసీల సంక్షేమంపై టీడీపీ నేతల పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. 1995లో చంద్రబాబు టీడీపీని ఆక్రమించుకున్నాక ప్రతి సాధారణ ఎన్నికల్లో బీసీలకు 100 టికెట్లు ఇస్తామని చెప్పి ఆ మాట ఎందుకు నిలబెట్టుకోలేదు? దీన్ని ఎందుకు టీడీపీలోని బీసీ నాయకులు ప్రశ్నించలేకపోతున్నారు? బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు కాకుండా అడ్డుకున్నది టీడీపీకి చెందిన వ్యక్తి. ఇది వాస్తవం కాదా? కోర్టు ఆదేశాలు ఎలా ఉన్నా బీసీలకు మేలు చేయడానికి సీఎం జగన్ పార్టీ తరఫున రిజర్వేషన్లు అమలు చేశారు. బీసీలకు ఏటా రూ.10 వేల కోట్ల చొప్పున రూ. 50 వేల కోట్లు ఇస్తామని చెప్పి, కేవలం రూ.14,246 కోట్లు మాత్రమే బాబు ఖర్చు చేశారు. సీఎం జగన్ తొలి ఏడాదిలోనే రూ.15 వేల కోట్లు ఖర్చు చేశారు. 5 చట్టాలు, 56 కార్పొరేషన్లు, 9 నవరత్నాలు, 18 ప్రత్యేక పథకాలు, 14 శాఖల పథకాలు ప్రవేశపెట్టారు. అలాగే బీసీ జనగణన చేయాలని శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి లేఖ సైతం పంపారు. – యనమల నాగార్జున యాదవ్, అధికార ప్రతినిధి, వైఎస్సార్సీపీ బీసీలే ఎజెండా రూపకర్తలు జయహో బీసీ సభకు వచ్చే బీసీ సోదరుల సునామీలో చంద్రబాబు కొట్టుకుపోతారు. దీంతో టీడీపీకి చెందిన బీసీ జాగిలాలను మా మీద దాడికి వదిలారు. అయ్యన్నపాత్రుడు ఒక గంజాయి డాన్, స్మగ్లర్. ఈఎస్ఐలో మందులు మెక్కిన అచ్చెన్నాయుడు, కాల్‌మనీ సెక్స్ రాకెట్ల ద్వారా మహిళా జాతిని సర్వనాశనం చేసిన బుద్ధా వెంకన్న ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. బీసీలను చంద్రబాబు బానిసలుగా చూస్తే, అదే బీసీలకు రక్షగా సీఎం జగనన్న ఉన్నారు. టీడీపీలో బీసీలను జెండా మోసేవారిగానే చూశారు. అదే వైఎస్సార్సీపీలో బీసీలే ఎజెండా రూపకర్తలు. బీసీలు జడ్జీలుగా పనికిరారని చంద్రబాబు లేఖ రాసింది నిజమా? కాదా? కాదని లోకేష్ మీద ప్రమాణం చేయగలరా? – కొండా రాజీవ్‌గాంధీ, అధికార ప్రతినిధి వైఎస్సార్సీపీ -
బీసీలంటే బ్యాక్ బోన్ క్యాస్ట్ గా నమ్మిన వ్యక్తి సీఎం జగన్ : స్పీకర్ తమ్మినేని
-
అధికారం దాహంతో చంద్రబాబుకు నిద్ర పట్టడంలేదు : స్పీకర్ తమ్మినేని
-
అమరావతి రాజధానికి అనువైన ప్రాంతం కాదు : స్పీకర్ తమ్మినేని
-
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో " స్ట్రెయిట్ టాక్ "
-
మూడు రాజధానులపై ఎందుకంత ఆక్రోశం : స్పీకర్ తమ్మినేని
-
‘డ్రామాలు చేసున్న వారంతా పట్టుబడ్డారు’
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: రైతుల పేరుతో బినామీ యాత్ర చేస్తున్నారని స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వెరిఫికేషన్‌లో 70 మంది మాత్రమే అసలు రైతులని తేలిందని, డ్రామాలు చేస్తున్న వారంతా పట్టుబడ్డారన్నారు. చదవండి: అంతా పక్కా స్క్రిప్ట్.. అసలు కారణం ఇదన్న మాట.. ‘‘అమరావతి ఉద్యమం కలుషితమైన ఉద్యమం. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ కచ్చితంగా జరిగింది. విశాఖ ప్రపంచ నగరం. అమరావతిలా గ్రాఫిక్స్ కాదు. వెనుకబాటుతనాన్ని పారద్రోలడం కోసమే ఉత్తరాంధ్రకు రాజధాని. విశాఖ రాజధాని ఏర్పాటుకు తోడ్పడాలని, న్యాయస్థానాలు, న్యాయమూర్తులను కోరుతున్నా’’ అని తమ్మినేని అన్నారు. రాజకీయ నేతకు ఉండాల్సిన లక్షణాలు పవన్ కల్యాణ్‌కు లేవు. ఓ నాయకుడు చెప్పు పట్టుకుని స్టేజ్ మీద చూపడమేంటి?’’ అని స్పీకర్ ప్రశ్నించారు. -
జన సైకోలు.. ప్లాన్ ప్రకారమే మంత్రులపై దాడి
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద జనసేన కార్యకర్తలు వీరంగంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యే, నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎయిర్‌పోర్టు దగ్గర మంత్రుల కార్లపై జనసేన కార్యకర్తల దాడిని ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పవన్ కల్యాణ్ తక్షణమే స్పందించి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అసలేం జరిగిందంటే.. విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద గర్జన సభ నుంచి ఒకే కారులో ఎయిర్‌పోర్టు వెళ్తున్న వైవీ సుబ్బారెడ్డి, జోగి రమేష్‌పై జనసేన కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. కర్రలు, రాళ్లతో దాడి చేశారు. మంత్రి రోజా సహాయకుడికి, జోగిరమేష్ అనుచరులకు గాయాలయ్యాయి. జనసేన కార్యకర్తల విధ్వంసంతో ఎయిర్‌పోర్టులోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. జనసేన చిల్లర రాజకీయాలు చేస్తోంది. గర్జనకు వచ్చిన స్పందనను చూసి ఓర్వలేకపోతున్నారు. పిల్ల సేనలు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు. పవన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మేం కన్నెర్ర చేస్తే.. మీరు రోడ్లపై తిరగలేరు. -మంత్రి ఆర్కే రోజా జనసేన కార్యకర్తలు అల్లరి మూకల్లా ప్రవర్తించారు. జనసేనకు విధి విధానమంటూ లేదు. -వైవీ సుబ్బారెడ్డి ఎయిర్‌పోర్టు వద్ద జరిగిన దాడి ఉన్మాద చర్య.. ఇది రాజకీయ పార్టీనా.. రౌడీ మూకనా?. విశాఖ గర్జన ప్రశాంతంగా జరిగింది. గర్జనకు భారీగా ప్రజలు తరలివచ్చారు. భారీ వర్షాన్ని కూడా జనం లెక్కచేయలేదు. గర్జనకు వచ్చిన స్పందన చూసి ఓర్వలేకపోతున్నారు. మంత్రులపై దాడి కాదు.. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలపై దాడి. దాడిని పవన్ సమర్థిస్తున్నారా?. జనసేనకు లక్ష్యం, సిద్దాంతమంటూ ఏమీ లేదు. జనసేన కార్యకర్తలది సైకో చర్య. -స్పీకర్ తమ్మినేని సీతారాం. చదవండి: ‘జనసేన’ సైకో చర్య.. దాడి ఘటనపై మంత్రి జోగి రమేష్ హెచ్చరిక జన సైనికులుకాదు.. జన సైకోలు.. ఎయిర్‌పోర్టు వద్ద దాడి ఘటనకు పవన్ బాధ్యత వహించాలి. మంత్రులపై కావాలనే దాడి చేశారు. పథకం ప్రకారమే మంత్రులపై దాడులు జరిగాయి. దాడి ఘటనకు బాధ్యత వహించి పవన్ క్షమాపణ చెప్పాలి. గర్జనను పక్కదారి పట్టించేందుకే కుట్రలు. దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.. -మంత్రి గుడివాడ అమర్నాథ్ వీధి రౌడీల్లా దాడికి పాల్పడ్డారు. జనసేన కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. విశాఖ గర్జన విజయవంతం కావడం తట్టుకోలేకపోతున్నారు. ప్రజల నుంచి మద్దతు లేకపోవడంతో మంత్రులపై దాడి చేశారు. ఏదో రకంగా ప్రభుత్వంపై బురదజల్లాలనేది వారి లక్ష్యం. మీడియా ముందు హల్చల్ చేయాలని చూస్తున్నారు. మంత్రులపై దాడి ఘటనకు పవన్ బాధ్యత వహించాలి. జనసేన కార్యకర్తల దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నాం. -హోంమంత్రి తానేటి వనిత జన సైనికులా.. సైకోలా? అసూయా ద్వేషాలకు ప్రతిరూపాలుగా ప్రవర్తిస్తున్న వపన్ కళ్యాణ్ అభిమనులని చెప్పుకునే ఉన్మాదుల దుశ్చర్యలు రోజురోజుకూ హద్దుమీరి పోతున్నాయి. విశాఖలో వైఎస్సార్ సీపీ నాయకుల మీద దాడి హేయమైనది. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలి. -మంత్రి వేణు గోపాల కృష్ణ చెల్లుబోయిన జనసైనికులా? సైకో లా?? అసూయా ద్వేషాలకు ప్రతిరూపాలుగా ప్రవర్తిస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులని చెప్పుకునే ఉన్మాదుల దుశ్చర్యలు రోజురోజుకూ హద్దుమీరి పోతున్నాయి. విశాఖ లో వైఎస్సార్సీపీ నాయకుల మీద దాడి హేయమైనది. దీనిని నేను తీవ్రం గా ఖండిస్తున్నాను. పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. — VenuGopalaKrishna Chelluboina (@chelluboinavenu) October 15, 2022 ఆవు చెన్లో మేస్తే దూడ గట్టున మేస్తుందా?. ఈ పవన్ కల్యాణ్ కనీసం ఒక చోటైనా గెలిచి ఉంటే క్రమశిక్షణ, విలువలు తెలిసుండేది. ఇతనికే క్రమశిక్షణ లేనప్పుడు ఇక ఇతని అభిమానులకు ఉంటుందా? ఎయిర్ పోర్టు దగ్గర జరిగిన ఘటనకు బాధ్యత వహించి పవన్ తక్షణమే సమాధానం చెప్పాలి. -మంత్రి నారాయణ స్వామి ఆవు చెన్లో మేస్తే దూడ గట్టున మేస్తుందా? ఈ @PawanKalyan కనీసం ఒక చోటైనా గెలిచి ఉంటే క్రమశిక్షణ, విలువలు తెలిసుండేది. ఇతనికే క్రమశిక్షణ లేనప్పుడు ఇక ఇతని అభిమానులకు ఉంటుందా? ఎయిర్ పోర్టు దగ్గర ఘటనకు బాధ్యత వహించి పవన్ తక్షణమే క్షమాపణ చెప్పాలి#JanaSenaGoons pic.twitter.com/qp0pVCpJFQ — Narayanaswamy Kalathuru (@NSwamy_Official) October 15, 2022 మొన్న కోనసీమ జిల్లాలో మంత్రి ఇంటిపై దాడికి తెగబడ్డారు. నేడు విశాఖలో అల్లర్లు సృష్టిస్తున్నారు. తమ ఓపికకు ఒక హద్దు ఉంటుంది. అయినా బాధ్యతాయుతమైన అధికార పార్టీగా సంయమనంతో, ఓపికతో ముందుకుపోతున్నాం. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఏమాత్రం చోటులేదు. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి.2/2 — Malladi Vishnu (@malladiysrcp) October 15, 2022 I strongly condemn the attack by @JanaSenaParty goons on @yvsubbareddymp garu, @JogiRameshYSRCP garu & @RojaSelvamaniRK garu in Vizag. This incident clearly Shows the true character of Janasena party today. Such misdemeanour acts are against to democratic values in the country. pic.twitter.com/okztqTdx23 — Maddila Gurumoorthy (@GuruMYSRCP) October 15, 2022 -
జనసేన రాజకీయ పార్టీనా .. రౌడీ మూకనా : స్పీకర్ తమ్మినేని సీతారాం
-
శాసన సభలో టీడీపీ ఎమ్మెల్యేల వీరంగం
సాక్షి, అమరావతి: శాసన సభ సమావేశాల్లో చివరిరోజైన బుధవారం టీడీపీ ఎమ్మెల్యేలు వీరంగం సృష్టించారు. చట్ట సభ ఖ్యాతిని దిగజార్చేలా వ్యవహరించారు. స్పీకర్ పట్ల అమర్యాదగా వ్యవహరించారు. మార్షల్స్‌పైనా దాడికి పాల్పడ్డారు. బుధవారం ఉదయం ప్రశ్నోత్తరాలతో సభ ప్రారంభమైంది. సభ ప్రారంభలోనే ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం చట్ట సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోందని, దానిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. బిల్లు ఇంకా ప్రవేశపెట్టలేదని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. దానిని ప్రవేశపెట్టినప్పుడు అభిప్రాయాలు తెలిపి, చర్చించండని స్పీకర్ సూచించినా పట్టు వీడలేదు. ఓ వైపు సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇస్తుంటే.. టీడీపీ ఎమ్మెల్యేలు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం వద్దకు చేరారు. పోడియం పైకి ఎక్కి స్పీకర్ చైర్‌ను ఆనుకుని నినాదాలు చేశారు. వారి స్థానాల్లోకి వెళ్లాలని స్పీకర్ సూచించినా పట్టించుకోలేదు. తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన స్పీకర్ టీడీపీ ఎమ్మెల్యేలు రామకృష్ణబాబు, డోలా బాలవీరాంజనేయ స్వామి, అశోక్, ఇతరులు కాగితాలు చించి స్పీకర్ పైకి విసిరారు. అయినా స్పీకర్ సంయమనం పాటించారు. స్పీకర్‌పై కాగితాలు విసరడాన్ని తప్పుబడుతూ అధికారపక్ష సభ్యులు పోడియం వద్దకు వస్తుండగా స్పీకర్ రావద్దని సూచించారు. దీంతో వారు ఆగిపోయారు. టీడీపీ సభ్యుల తీరు శ్రుతి మించడంతో స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. శాసనసభ గౌరవాన్ని దిగజార్చేలా వ్యవహరిస్తున్నారని వారిపై మండిపడ్డారు. ఈ క్రమంలో స్పీకర్‌కు, టీడీపీ ఎమ్మెల్యేలకు మధ్య మాటల యుద్ధం నడిచింది. దీంతో సభను స్పీకర్ వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశం అయ్యాక కూడా టీడీపీ ఎమ్మెల్యేల తీరు మారలేదు. ప్లకార్డులతో నేరుగా స్పీకర్ పోడియం పైకి వెళ్లారు. స్పీకర్ చైర్‌ను చుట్టుముట్టి నినాదాలు చేశారు. కాగితాలు చించి స్పీకర్‌పై వేశారు. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేయాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రతిపాదించారు. ఈ మేరకు స్పీకర్ తమ్మినేని టీడీపీ సభ్యులను ఒక రోజు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయినా టీడీపీ సభ్యులు బయటకు వెళ్లకుండా స్పీకర్ పోడియం వద్దే నినాదాలు చేశారు. వారిని బయటకు తరలించాలని మార్షల్స్‌ను స్పీకర్ ఆదేశించారు. వారిని తరలించడానికి మార్షల్స్ ప్రయత్నించగా.. పయ్యావుల, బాలవీరాంజనేయ స్వామి, ఏలూరు సాంబశివరావు సహా పలువురు ఎమ్మెల్యేలు మార్షల్స్‌పైనే దాడికి పాల్పడ్డారు. స్పీకర్, అధికారుల టేబుళ్లపై ఉన్న బిల్లు ప్రతులను చించి గందరగోళం సృష్టించారు. చవరికి వారిని మార్షల్స్ ఎత్తుకుని బయటకు తీసుకువెళ్లారు. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై చర్చించని టీడీపీ హెల్త్ యూనివర్సిటీకి డాక్టర్ వైఎస్సార్ పేరు పెడుతూ ప్రభుత్వం శాసన మండలిలో ప్రవేశపెట్టిన బిల్లుపై టీడీపీ సభ్యులు చర్చ కంటే రచ్చకే ప్రాధాన్యం ఇచ్చారు. సభా సమయాన్ని వృథా చేయ డం తగదని, బిల్లుపై చర్చలో పాల్గొని అభిప్రాయం చెప్పాలని చైర్మన్ మోషేన్‌రాజు సూచించారు. బిల్లును పెట్టవద్దని అడ్డు చెప్పే అధికారం లేదని చైర్మన్ చెప్పినా టీడీపీ సభ్యులు వినలేదు. పెద్దపెట్టున నినాదాలు చేస్తూ కాగితాలు చించి, వాటర్ బాటిల్స్‌తో బల్లలపై కొడుతూ గందరగోళం సృష్టించారు. సభను పలుమార్లు వాయిదా వేశారు. అయినా∙టీడీపీ సభ్యుల తీరు మారలేదు. దీంతో బిల్లులను ఆమోదించి సభను నిరవధిక వాయిదా వేశారు. -
టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీరియస్
-
అలాంటివాళ్లు సభకు రావడం దురదృష్టకరం: ఏపీ స్పీకర్
సాక్షి, అమరావతి: పోడియంపైకి వచ్చి విపక్ష ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం బాధాకరమని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. అలాంటివాళ్లు సభకు రావడం దురదృష్టకరమన్నారు. అరాచకం సృష్టించేవాళ్లను చూస్తే బాధగా ఉందన్నారు. ఇలాంటి ఆగడాలను ఎక్కడో ఒక చోట అరికట్టాలని స్పీకర్ అన్నారు. సభ సమష్టి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. టీడీపీ సభ్యుల తీరుపై చర్యలకు ప్రివిలేజ్ కమిటీకి సిఫారసు చేస్తున్నా. అరాచకం చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని స్పీకర్ అన్నారు. చదవండి: కరవు, బాబు ఇద్దరూ కవలలు: సీఎం జగన్ దౌర్జన్యం సరికాదు: అంబటి రాంబాబు ప్రతిపక్షాలు ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన తెలపాలని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. టీడీపీ సభ్యులు దౌర్జన్యంగా ప్రవర్తించారన్నారు. నచ్చని అంశాలపై నిరసన తెలుపొచ్చు కానీ దౌర్జన్యం చేయడం సరికాదన్నారు. ఏ ఒక్కరోజూ సభ సజావుగా జరిగేందుకు టీడీపీ సభ్యులు సహకరించలేదని అంబటి రాంబాబు మండిపడ్డారు. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల రభస.. కాగా, అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు నానా రభస సృష్టించారు. పేపర్లు చించి స్పీకర్‌పైకి విసిరి కొట్టిన అనుచితంగా ప్రవర్తించారు. స్పీకర్ చైర్ వద్దకు వచ్చి దురుసుగా ప్రవర్తించారు. అసెంబ్లీ వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా టీడీపీ సభ్యుల తీరు మారలేదు. సభకు పదే పదే ఆటంకం కలిగించడంతో టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. -
శృతిమించిన టీడీపీ ప్రవర్తన
సాక్షి, అమరావతి: గొడవ చేయడం ద్వారా త్వరగా సస్పెండ్ అయి బయటకు వెళ్లిపోయేందుకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభలో మంగళవారం కూడా హంగామా చేశారు. రాష్ట్రంలో సంక్షేమం సంక్షోభంలో ఉందనే అంశంపై వాయిదా తీర్మానం ఇచ్చిన టీడీపీ.. దానిపై చర్చకు అనుమతించాలని ఆ పార్టీ సభ్యులు స్పీకర్ తమ్మినేని సీతారాంతో వాగ్వాదానికి దిగారు. ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు ఎక్కువసేపు మాట్లాడినా స్పీకర్ అనుమతించారు. అధికార పార్టీ సభ్యులు కూడా ఇందుకు అభ్యంతరం వ్యక్తంచేయలేదు. విద్య, వైద్యం–నాడు నేడుపై స్వల్పకాలిక చర్చ ప్రారంభమైన వెంటనే తమ వాయిదా తీర్మానాన్ని అనుమతించాలని టీడీపీ ఎమ్మెల్యేలు గొడవకు దిగారు. సంక్షేమం సంక్షోభంలో పడిందని, సంక్షేమ పథకాలన్నింటినీ ఎత్తివేశారని నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లారు. కొందరు సభ్యులు పోడియంపైకి ఎక్కి స్పీకర్ దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అచ్చెన్నాయుడు తదితరులు పోడియంను గుద్దుతూ స్పీకర్‌తో వాగ్వాదానికి దిగారు. సభలో అధికార పార్టీ సభ్యుల ప్రసంగాలు వినపడకుండా ఉండేందుకు పెద్దఎత్తున నినాదాలు చేశారు. వాయిదా తీర్మానాన్ని తిరస్కరించానని, ఎవరి స్థానాల్లో వాళ్లు కూర్చుని స్వల్పకాలిక చర్చలో పాల్గొనాలని స్పీకర్ ఎంత కోరినా వారు పట్టించుకోలేదు. కొందరు ప్లకార్డులను స్పీకర్ మొహానికి అడ్డుగాపెట్టి అతిగా ప్రవర్తించారు. వారి ప్రవర్తన శృతిమించడంతో టీడీపీ ఎమ్మెల్యేలు బెందాళం అశోక్, అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవానీ, నిమ్మకాయల చినరాజప్ప, గణబాబు, వేగుళ్ల జోగేశ్వరరావు, పయ్యావుల కేశవ్, మంతెన రామరాజు, నిమ్మల రామానాయుడు, వెలగపూడి రామకృష్ణబాబు, గొట్టిపాటి రవికుమార్, ఏలూరు సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్, డీబీవీ స్వామిలను ఒకరోజు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని ప్రకటించారు. ఆ తర్వాత కూడా వారు సభ నుంచి బయటకు వెళ్లకుండా నినాదాలు చేస్తుండడంతో సభాపతి మార్షల్స్‌ను పిలిచారు. ఆ తర్వాత టీడీపీ సభ్యులు తాము ప్రదర్శించిన ప్లకార్డులను ముక్కలుగా చించి మార్షల్స్‌పై విసిరారు. చివరికి అధికార పార్టీ సభ్యులపై కామెంట్లు చేస్తూ బయటకెళ్లారు. -
టీడీపీ సభ్యుల తిట్లపురాణం.. తాము చెప్పినట్లే సభ జరగాలని హంగామా!
సాక్షి, అమరావతి: శాసనసభలో రెండో రోజు శుక్రవారం కూడా టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టించారు. స్పీకర్ పోడియంపైకి ఎక్కి నినాదాలు చేస్తూ సభ జరగకుండా అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారు. స్పీకర్ తమ్మినేని సీతారాంను ఏకవచనంతో సంబోధిస్తూ అవమానకరంగా మాట్లాడారు. సభలో ప్రభుత్వం ప్రారంభించిన చర్చ జరగకుండా అడ్డుకోవడం, గొడవ చేయడం ద్వారా సస్పెన్షన్ వేటు వేయించుకుని సభ నుంచి బయటకు వెళ్లిపోవడమే లక్ష్యంగా టీడీపీ ఎమ్మెల్యేలు హంగామా చేశారు. ప్రశ్నోత్తరాల తర్వాత తాము వాయిదా తీర్మానం ఇచ్చిన ధరల పెరుగుదలపై చర్చ జరగాలని టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. దాన్ని తిరస్కరించినట్లు చెప్పిన స్పీకర్ బిల్లులు ప్రవేశపెట్టేందుకు అనుమతించారు. ఈ సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలంతా ఒక్కసారిగా ప్ల కార్డులు పట్టుకుని బాదుడే బాదుడు అంటూ నినాదాలు చేసుకుంటూ స్పీకర్ పోడియంపైకి ఎక్కారు. ఒకవైపు మంత్రులు బిల్లులు ప్రవేశపెడుతున్నా పట్టించుకోకుండా వారు మాట్లాడే విషయాలు వినపడకుండా పోడియంను కొడుతూ పెద్దగా నినాదాలు చేశారు. స్పీకర్‌ను తిడుతూ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలో శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ జోక్యంచేసుకుని ఉద్దేశపూర్వకంగా సభలో గందరగోళం సృష్టిస్తున్నారని సభను ఆర్డర్లో పెట్టాలని స్పీకర్‌ను కోరారు. స్పీకర్ ఎంతచెప్పినా వినకుండా టీడీపీ ఎమ్మెల్యేలు గొడవచేస్తూనే ఉన్నారు. దీంతో శాసనసభా వ్యవహారాల సమన్వయకర్త గడికోట శ్రీకాంత్‌రెడ్డి జోక్యం చేసుకుని కరోనా మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం ఉన్న విషయం తెలిసి కూడా ధరల గురించి టీడీపీ సభ్యులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని తెలిపారు. బిల్లులు ప్రవేశపెట్టకుండా అడ్డుకునేలా టీడీపీ సభ్యులు మరింత రెచ్చిపోవడంతో సభ సజావుగా జరిగేందుకు వారిని సస్పెండ్ చేయాలని బుగ్గన రాజేంద్రనాథ్ ప్రతిపాదించారు. ఈ సమయంలోనూ టీడీపీ సభ్యులు స్పీకర్‌పైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. వీరిని ఆపుతున్న మార్షల్స్‌ని నెట్టేస్తూ వారితో వాగ్వాదానికి దిగి దుర్భాషలాడారు. మార్షల్స్ ఐడీ కార్డులు అడుగుతూ వారిని తోసేయడంతో గందరగోళం నెలకొంది. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు బెందాళం అశోక్, కింజరాపు అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవానీ, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, గణబాబు, వేగుళ్ల జోగేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణబాబు, నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, బాల వీరాంజనేయస్వామిలను సభ నుంచి ఒకరోజు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఆ తర్వాత కూడా వారు బయటకెళ్లకుండా మార్షల్స్‌తో తోపులాటకు దిగారు. తన అనుమతితోనే మార్షల్స్ సభలోకి వచ్చారని వారిని ఐడీ కార్డులు అడగడం ఏమిటని గట్టిగా హెచ్చరించడంతో టీడీపీ సభ్యులు గట్టిగా అరుపులు, కేకలు వేసుకుంటూ బయటకెళ్లిపోయారు. టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ ఆవేదన స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. ముఖ్యమైన బిల్లులు ప్రవేశపెడుతుంటే అవేంటో కూడా తెలియకుండా సభను అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇది చాలా బాధాకరమని ప్రతిరోజు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి గొడవ చేస్తున్నారని వాపోయారు. వాళ్లవల్ల మిగిలిన సభ్యులంతా ఇబ్బంది పడుతున్నారన్నారు. వారిపట్ల ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని శాసనసభా వ్యవహారాల మంత్రికి సూచించారు. సంస్కారం లేకుండా వ్యవహరిస్తున్నారని, ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న తనకు చాలా బాధగా ఉందన్నారు.