సాక్షి, అమరావతి: ఏపీలో మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టించారు. చంద్రబాబు అరెస్ట్‌పై చర్చించాలని నినాదాలు చేస్తూ శాసనసభ, మండలిలో ఓవరాక్షన్ చేశారు. దీంతో, రెండు సభలు కాసేపు వాయిదా పడ్డాయి.
► కొంత విరామం తర్వాత అసెంబ్లీ ప్రారంభమైంది. అనంతరం, కూడా టీడీపీ సభ్యులు తమ తీరు మార్చుకోలేదు. దీంతో, టీడీపీ సభ్యులతో స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడే ప్రయత్నం చేశారు. అయినా కూడా వారు వినకపోవడంతో టీడీపీ సభ్యులను ఈరోజుకు సభ నుంచి సస్పెండ్ చేశారు. అలాగే, సభలో అనుచితంగా ప్రవర్తించిన టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణను స్పీకర్ హెచ్చరించారు.
► సభలో బాలకృష్ణ మీసం మెలేసిన ఘటనపై స్పీకర్ హెచ్చరించారు. స్పీకర్ స్థానాన్ని టీడీపీ సభ్యులు అగౌరవపరిచారు. దీన్ని మొదటి తప్పుగా క్షమిస్తున్నాం. స్పీకర్ పోడియం దగ్గర నిలుచుని మీసం మెలేసి సభా సంప్రదాయాలను బాలకృష్ణ ఉల్లఘించారు. ఇలాంటి వికృత చేష్టలు చేయడం తప్పు. ఇలాంటి చర్యలు మళ్లీ పునారవృతం కాకూడదు.
► ఇక, సభలో ఓవరాక్షన్ చేస్తూ స్పీకర్‌తో అనుచితంగా ప్రవర్తించిన సభ్యులను స్పీకర్ తమ్మినేని సస్పెండ్ చేశారు. ఈ సమావేశాలు ముగిసే వరకు ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. సస్పెన్షన్‌కు గురైన వారిలో ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్ ఉన్నారు. ఇక, టీడీపీ సభ్యులతో పాటు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా సస్పెన్షన్‌కు గురయ్యారు.
ఇది కూడా చదవండి: బాలకృష్ణ ఓవరాక్షన్.. మంత్రి అంబటి స్ట్రాంగ్ కౌంటర్
Comments
Please login to add a commentAdd a comment