సాక్షి, హైదరాబాద్: ‘వ్యూహం చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) కమిటీ జారీ చేసిన యు సర్టిఫికెట్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై సింగిల్ జడ్జి విచారణ జరిపి తీర్పు ఇచ్చారు. ఇక్కడకు అప్పీల్ వచ్చింది.. సమాచారం ఇవ్వడానికి ఇంకా సమయం కావాలని కోరడం ఆమోదయోగ్యం కాదు..’ అంటూ టీడీపీ న్యాయవాదులపై తెలంగాణ హైకోర్టు సీజే ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
పార్టీ అధ్యక్షుడి(అచ్నెన్నాయుడు, ఏపీ) అనుమతి లేకుండా పిటిషన్ వేయడానికి రిట్ పిటిషనర్(లోకేశ్)కు ఏం అధికారం ఉందని ప్రశ్నించింది. ‘విచారణకు సిద్ధమై రావాలి కదా.. సబ్జెక్ట్‌పై వాస్తవాలు వెల్లడించండి. పార్టీ నిబంధనల ప్రకారం ఏపీ అధ్యక్షుడి అనుమతి ఎందుకు తీసుకోలేదు?’ అని మండిపడింది. శుక్రవారం వరకు సమయం కావాలని టీడీపీ న్యాయవాదులు అడగడాన్ని తప్పుబట్టింది.
వ్యూహం చిత్రానికి సీబీఎఫ్‌సీ ఇచ్చిన సర్టిఫికెట్ రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ నిర్మాత దాసరి కిరణ్‌కుమార్, దర్శకుడు రాంగోపాల్ వర్మ తెలంగాణ హైకోర్టులో వేర్వేరుగా అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. నిర్మాత తరఫున సీనియర్ న్యాయవాది వెంకటేశ్ వాదనలు వినిపిస్తూ.. సింగిల్ జడ్జి తీర్పును కొట్టివేసి, చిత్ర విడుదలకు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు పూర్తి కావడంతో ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment