సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈరోజు కూడా టీడీపీ సభ్యులు రెచ్చిపోయారు. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ బాధ్యతారాహిత్యంతో సభలో విజిల్స్ వేశారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి కాగితాలు విసిరారు. అంతటితో ఆగకుండా ఆందోళనలకు దిగారు. ఈ క్రమంలో ఇద్దరు టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సస్పెండ్ చేశారు.
విజిల్స్ వేస్తూ బాలకృష్ణ హంగామా..
వివరాల ప్రకారం.. రెండోరోజు సమావేశాల సందర్బంగా టీడీపీ సభ్యులు రెచ్చిపోయారు. నిన్న సభలో అనుచితంగా ప్రవర్తించిన బాలకృష్ణ.. ఈరోజు కూడా రెచ్చిపోయారు. అసెంబ్లీలో చంద్రబాబు కూర్చిలో నిలుచుని బాలకృష్ణ.. విజిల్ పట్టుకుని విజిల్స్ వేశారు. సభలో సభ్యులను చూస్తూ విజిల్స్ వేస్తూ హంగామా క్రియేట్ చేశారు. ప్రజాప్రతినిధి అనే స్పృహ కూడా లేకుండా రచ్చ చేశారు. బాలకృష్ణకు మద్దతిస్తూ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా ఆయనతో కలిసి విజిల్స్ వేశారు. విజిల్స్ ఆపాలని స్పీకర్ చెప్పినా టీడీపీ సభ్యులు పట్టించుకోలేదు. విజిల్స్ తీసుకోవాలన్న స్పీకర్ ఆదేశాలతో టీడీపీ సభ్యుల వద్దకు వెళ్లిన మార్షల్స్ వెళ్లడంతో వారితో బాలకృష్ణ దురుసుగా ప్రవర్తించారు. ఇలా సభా సంప్రదాయాలకు బాలకృష్ణ తిలోదకాలు పలికారు. కాగా, నిన్న కూడా సభలో బాలకృష్ణ స్పీకర్ పోడియం వద్ద మీసం మెలేశారు. ఈ క్రమంలో బాలకృష్ణ చేసిన పనిని మొదటి తప్పుగా పరిగణిస్తూ స్పీకర్ ఆయనకు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇద్దరు సభ్యులు సస్పెండ్..
ఇదిలా ఉండగా.. సభలో మిగతా టీడీపీ సభ్యులు కూడా సభా ఉల్లంఘనలకు పాల్పడ్డారు. సభలో ఫొటోలు, వీడియోలు తీశారు. ఈ నేపథ్యంలో ఇద్దరు సభ్యులపై స్పీకర్ తమ్మినేని సస్పెన్షన్ విధించారు. అచ్చెన్నాయుడు, బి.అశోక్‌లను సస్పెండ్ చేశారు. వీరిద్దరిని పూర్తిగా అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ వెల్లడించారు.
టీడీపీ సభ్యులు తీరుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం..
► రచ్చచేసే ఉద్దేశమే తప్ప చర్చించాలనే ఆలోచనే వారికి లేదు. బజారులో ఊదాల్సిన ఈలను ఇక్కడ ఊదుతున్నారు. సభ్యులను రెచ్చగొట్టే విధంగా టీడీపీ మాట్లాడుతోంది. టీడీపీ సభ్యులు సీట్లపైకి ఎక్కి నిల్చున్నారు. చర్చలో పాల్గొనే దమ్ము వారికి లేదు. బాబు మోసగాడని టీడీపీకి బాగా తెలుసు: అంబటి రాంబాబు.
► దేవాలయంలాంటి అసెంబ్లీని కించపరిచారు. చిల్లర కోసమే విజిల్స్ వేస్తున్నారు. బజారు కూతలు కూస్తే ఊరుకునేది లేదు. దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రావాలి, టీడీపీ రౌడీయిజానికి ఎవరూ భయపడరు: కాకాణి
► టీడీపీ సభ్యుడు ప్రతీ ఒక్కరూ సైకోనే: నారాయణ స్వామి
Comments
Please login to add a commentAdd a comment