whistle
-
సభలో బాలకృష్ణ రచ్చ రచ్చ.. సినిమా రేంజ్లో రెచ్చిపోయి..
సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈరోజు కూడా టీడీపీ సభ్యులు రెచ్చిపోయారు. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ బాధ్యతారాహిత్యంతో సభలో విజిల్స్ వేశారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి కాగితాలు విసిరారు. అంతటితో ఆగకుండా ఆందోళనలకు దిగారు. ఈ క్రమంలో ఇద్దరు టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సస్పెండ్ చేశారు. విజిల్స్ వేస్తూ బాలకృష్ణ హంగామా.. వివరాల ప్రకారం.. రెండోరోజు సమావేశాల సందర్బంగా టీడీపీ సభ్యులు రెచ్చిపోయారు. నిన్న సభలో అనుచితంగా ప్రవర్తించిన బాలకృష్ణ.. ఈరోజు కూడా రెచ్చిపోయారు. అసెంబ్లీలో చంద్రబాబు కూర్చిలో నిలుచుని బాలకృష్ణ.. విజిల్ పట్టుకుని విజిల్స్ వేశారు. సభలో సభ్యులను చూస్తూ విజిల్స్ వేస్తూ హంగామా క్రియేట్ చేశారు. ప్రజాప్రతినిధి అనే స్పృహ కూడా లేకుండా రచ్చ చేశారు. బాలకృష్ణకు మద్దతిస్తూ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా ఆయనతో కలిసి విజిల్స్ వేశారు. విజిల్స్ ఆపాలని స్పీకర్ చెప్పినా టీడీపీ సభ్యులు పట్టించుకోలేదు. విజిల్స్ తీసుకోవాలన్న స్పీకర్ ఆదేశాలతో టీడీపీ సభ్యుల వద్దకు వెళ్లిన మార్షల్స్ వెళ్లడంతో వారితో బాలకృష్ణ దురుసుగా ప్రవర్తించారు. ఇలా సభా సంప్రదాయాలకు బాలకృష్ణ తిలోదకాలు పలికారు. కాగా, నిన్న కూడా సభలో బాలకృష్ణ స్పీకర్ పోడియం వద్ద మీసం మెలేశారు. ఈ క్రమంలో బాలకృష్ణ చేసిన పనిని మొదటి తప్పుగా పరిగణిస్తూ స్పీకర్ ఆయనకు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇద్దరు సభ్యులు సస్పెండ్.. ఇదిలా ఉండగా.. సభలో మిగతా టీడీపీ సభ్యులు కూడా సభా ఉల్లంఘనలకు పాల్పడ్డారు. సభలో ఫొటోలు, వీడియోలు తీశారు. ఈ నేపథ్యంలో ఇద్దరు సభ్యులపై స్పీకర్ తమ్మినేని సస్పెన్షన్ విధించారు. అచ్చెన్నాయుడు, బి.అశోక్‌లను సస్పెండ్ చేశారు. వీరిద్దరిని పూర్తిగా అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ వెల్లడించారు. టీడీపీ సభ్యులు తీరుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం.. ► రచ్చచేసే ఉద్దేశమే తప్ప చర్చించాలనే ఆలోచనే వారికి లేదు. బజారులో ఊదాల్సిన ఈలను ఇక్కడ ఊదుతున్నారు. సభ్యులను రెచ్చగొట్టే విధంగా టీడీపీ మాట్లాడుతోంది. టీడీపీ సభ్యులు సీట్లపైకి ఎక్కి నిల్చున్నారు. చర్చలో పాల్గొనే దమ్ము వారికి లేదు. బాబు మోసగాడని టీడీపీకి బాగా తెలుసు: అంబటి రాంబాబు. ► దేవాలయంలాంటి అసెంబ్లీని కించపరిచారు. చిల్లర కోసమే విజిల్స్ వేస్తున్నారు. బజారు కూతలు కూస్తే ఊరుకునేది లేదు. దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రావాలి, టీడీపీ రౌడీయిజానికి ఎవరూ భయపడరు: కాకాణి ► టీడీపీ సభ్యుడు ప్రతీ ఒక్కరూ సైకోనే: నారాయణ స్వామి -
కాపాడే టీ–షర్ట్లు
ఫ్రెంచ్ కంపెనీ ‘ఫ్లోటీ’ పద్దెనిమిది నెలల నుంచి ఆరు సంవత్సరాల మధ్య ఉన్న పిల్లల కోసం యాంటీ–డ్రౌనింగ్ టీ–షర్ట్‌లను రూపొందించింది. పిల్లలు ప్రమాదవశాత్తు నీటిలో పడితే మునిగిపోకుండా ఈ టీ–షర్ట్లు కాపాడుతాయి. టీ–షర్ట్‌లో అమర్చిన విజిల్ పెద్దగా సౌండ్ చేస్తూ చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేస్తుంది. స్టైలీష్‌గా, సౌకర్యవంతంగా ఉండే ఈ టీ–షర్ట్ ఎలా పనిచేస్తుంది...అనేదానిపై రూపొందించిన డెమో వీడియోను పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ‘ఇది నోబెల్ బహుమతి పొందిన ఆవిష్కరణ కంటే గొప్పది. ఒక తాతగా పిల్లల భద్రత అనేది నాకు అత్యంత ముఖ్యమైనది’ అని ట్విట్ చేశాడు. -
ది వారియర్: 'విజిల్' ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది..
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, ఉప్పెన బ్యూటీ కృతీ శెట్టి జంటగా నటించిన మూవీ 'ది వారియర్'. కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జూలై 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో విజయం అందుకోలేకపోయింది. తాజాగా ఈ సినిమా నుంచి సూపర్ హిట్టైన 'విజిల్' ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, ఆంథోనీ దాసన్, శ్రీనిషా ఈ పాటను పాడారు. ఈ సినిమాలో రామ్ సత్య అనే పోలీసు ఆఫీసర్‌గా కనిపించగా, ఆది పినిశెట్టి విలన్‌గా నటించాడు. -
యాపిల్ పరువు తీసి పడేశాడు.. కొత్తేం కాదుగా!
అమెరికా కంపెనీలన్నా.. వాటి ఉత్పత్తులన్నా టెస్లా సీఈవో ఎలన్ మస్క్‌కి ఎనలేని మంట. ఛాన్స్ దొరికినప్పుడల్లా వాటి మీద తన శైలిలో సెటైర్లు వేస్తుంటాడు కూడా. ఈ తరుణంలో టెక్ దిగ్గజ కంపెనీ ‘యాపిల్’ మీద తాజాగా ట్విటర్లో వెటకారం ప్రదర్శించాడు. టెస్లా కంపెనీ తెచ్చిన ‘సైబర్‌విజిల్’ను ఎలన్ మస్క్ తాజాగా ప్రమోట్ చేయడం మొదలుపెట్టాడు. 50 డాలర్ల (రూ.3,747) విలువ చేసే ఈ విజిల్‌ను కొనుగోలు చేసి ‘విజిల్ వేయండి’ అంటూ ట్విటర్లో సరదాగా ఓ పోస్ట్ పెట్టాడు. ఇప్పటిదాకా బాగానే ఉన్నా.. తన తర్వాతి పోస్టులో ఆరున్నర కోట్ల మంది ఫాలోవర్స్‌ను ఉద్దేశిస్తూ ఓ విజ్ఞప్తి చేశాడు మస్క్. Don’t waste your money on that silly Apple Cloth, buy our whistle instead! — Elon Musk (@elonmusk) December 1, 2021 యాపిల్ కంపెనీ అక్టోబర్ నెలలో 19 డాలర్లతో ఓ క్లాత్‌ను తీసుకొచ్చింది. ఈ క్లాత్‌ను సిల్లీగా కొనేసి డబ్బులు వృధా చేసుకోవద్దంటూ జనాలకు సూచనలు కూడా చేశాడు మస్క్. ఇక టెస్లా తీసుకొచ్చిన సైబర్ విజిల్ అచ్చం టెస్లా తీసుకురాబోయే ‘సైబర్‌ట్రక్’ ఆకారాన్ని పోలి ఉంది. ఇది సీరియస్ ప్రొడక్టేనా? లేదంటే యాపిల్‌కు కౌంటరా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఇక యాపిల్ తన గ్యాడ్జెట్స్‌ను క్లీన్ చేసుకోవడానికి వీలుగా యాపిల్ క్లాత్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఏ విషయాన్ని అయినా తనకు అనుకూలంగా మార్చేసుకుని ప్రమోట్ చేసుకునే ఎలన్ మస్క్.. యాపిల్ క్లాత్ విషయంలో గతంలోనూ ఇలాగే స్పందించాడు. యాపిల్ కంపెనీ సీఈవో టిమ్ కుక్ ఇస్తాంబుల్‌లో కొత్త స్టోర్ గురించి ఓ ట్వీట్ చేయగా.. ఆ స్టోర్‌ను యాపిల్ క్లాత్ కోసమే సందర్శించాలంటూ వెటకారం ప్రదర్శించాడు ఎలన్ మస్క్. Come see the Apple Cloth ™️ — Elon Musk (@elonmusk) October 22, 2021 క్లిక్ చేయండి: ఎలన్ మస్క్ స్టార్‌లింక్‌పై క్రిమినల్ కేసు పెట్టండి ఇది చదవండి: యాపిల్ సీఈవోగా మస్క్!!.. బూతులు తిట్టేసిన టిమ్ కుక్ -
నోరు తెరిస్తే వింత శబ్దం.. ఛాతిలో నొప్పి.. 11 నెలల తర్వాత వీడిన మిస్టరీ
కోల్‌కతా: దాదాపు 11 నెలల క్రితం ఓ కుర్రాడు అనుకోకుండా ప్లాస్టిక్ విజిల్ మింగాడు. తల్లిదండ్రులకు చెప్తే కొడతారనే భయంతో జరిగిన దాని గురించి వారికి చెప్పలేదు. ఈ క్రమంలో కొన్ని నెలలుగా కుర్రాడు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడసాగాడు. స్థానిక వైద్యులు ఎవరు బాలుడి అసలు సమస్యను గుర్తించలేకపోయారు. చివరకు ఓ డాక్టర్ సలహాతో జిల్లా ఆస్ప్రతికి వెళ్లారు. అక్కడ వైద్యులు ఎక్స్‌రే తీయగా ఊపిరితిత్తుల మధ్య ఇరుక్కున్న విజిల్‌ని గమనించారు. అనంతరం అతడికి ఆపరేషన్ చేసి.. విజిల్‌ని తొలగించారు. ఆ వివరాలు.. పశ్చిమబెంగాల్ దక్షిణ 24 పరగణాల జిల్లా బరుయిపూర్ ప్రాంతానికి చెందిన రైహాన్ లస్కర్(12) అనే కుర్రాడు 2021, జనవరిలో విజిల్‌తో ఆడుతూ.. చిప్స్ తింటున్నాడు. ఈ క్రమంలో అనుకోకుండా చేతిలో ఉన్న విజిల్‌ని మింగేశాడు. బయటకు ఉద్దామని ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు. ఇక దీని గురించి తల్లిదండ్రులకు చెప్తే.. కొడతారనే భయంతో సైలెంట్‌గా ఉన్నాడు. ఈ సంఘటన తర్వాత రైహాన్ జీవితంలో విచిత్ర సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఏదైనా మాట్లాడదామని నోరు తెరిస్తే.. విజిల్ ఊదినప్పుడు ఎలాంటి శబ్దం వస్తుందో అలాంటి సౌండ్ వచ్చేది. ఇక ఈత కొడదామని వెళ్తే ఎక్కువ సమయం నీటిలో ఉండలేకపోతుండేవాడు. ఛాతిలో నొప్పితో బాధపడడేవాడు. ప్రారంభంలో రైహాన్ తల్లిదండ్రులు దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు. (చదవండి: పేర్లు లేని గ్రామం.. మరి ఎలా పిలుచుకుంటారో తెలుసా!) ఆ తర్వాత రైహాన్ తరచుగా అనారోగ్యానికి గురవుతుండేవాడు. స్థానికంగా ఉన్న ఆస్పత్రుల్లో చూపిస్తే.. వైద్యులు ఏవో మందులు రాసే వారు కానీ అసలు సమస్య ఏంటో చెప్పలేకపోయారు. ఇలా ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ఫలితం లేకపోగా.. రోజురోజుకి రైహాన్ ఆరోగ్యం మరింత క్షీణించసాగింది. ఈ క్రమంలో ఓ వైద్యుడి సూచన మేరకు కుమారుడిని ఎస్ఎస్కేఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు. (చదవండి: Viral: కుక్కలకు గొడుగు పట్టి.. మనుషులను దారిలో పెట్టి..) అక్కడ రైహాన్ పరిస్థితిని గమనించిన సీనియర్ వైద్యుడు ప్రొఫెసర్ అరుణాభా సేన్‌గుప్తా అతడికి ఎక్స్‌రే తీసి.. ఊపిరితిత్తుల మధ్య ఇరుక్కున్న విజిల్‌ని గుర్తించారు. అనంతరం అరుణాభా ఆధ్వర్యంలో వైద్యులు గురువారం రైహాన్‌కు ఆపరేషన్ చేసి విజిల్‌ని తొలగించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. చదవండి: Video: మరికొన్ని గంటల్లో పెళ్లి.. వధువు చేసిన పనికి అంతా షాక్! -
పేర్లు లేని గ్రామం.. మరి ఎలా పిలుచుకుంటారో తెలుసా!
సాధారణంగా ఎవరినైనా పిలవాలంటే వారి పేర్లతో పిలుస్తాం. అది వాళ్ల సొంత పేరు కావచ్చు లేదా ముద్దు పేరు కావచ్చు. ఇక సెలబ్రిటీల విషయానికొస్తే అభిమానులు పిలుచుకునే పేర్లు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటిది పేరు లేకుండా ఓ మనిషిని పిలవగలమా అంటే కుదురుతుంది అంటున్నారు మేఘాలయలోని ఓ గ్రామ నివాసితులు. అదెలా అనుకుంటున్నారా.. ఎందుకుంటే వాళ్లు ఆ ప్రాంతంలో పేర్లు లేకుండానే కేవలం విజిల్స్‌తోనే కమ్యూనికేట్ చేసుకుంటారట! అసలా కథేంటంటే.. ఆ ఊరి పేరు కాంగ్థాన్. ఆ ఊరిలో సుమారు 700 వందలకు పైగా ప్రజలు నివసిస్తుంటారు. మేఘాలయాలోని ఈస్ట్ ఖాసి జిల్లాలో ఉంది. ఆ ప్రాంత ప్రజలకు ఈల వేయడం ఆచారం. అది గత నెలనో లేదా గత సంవత్సరం నుంచి పాటిస్తోంది కాదు వారి పూర్వీకులనుంచి సంప్రదాయంగా వస్తోందట. అసలు కొత్తవాళ్లు ఆ ఊరికి వెళ్తే వాళ్ల ఆచారాలు చూసి ఆశ్చర్యపోక మానరు. ఎందుకంటే సీటీ (విజిల్), పక్షుల అరుపులు, సినిమా పాటల్లోని ట్యూన్ల ఆధారంగా పిల్లలకు పేర్లు పెడుతుంటరు ఇక్కడ. అందుకే ఆ గ్రామాన్ని విజిల్ గ్రామం అని పిలుస్తారు. ఇక్కడి గ్రామస్తులు ఒకరినొకరు ప్రత్యేకమైన రాగంతో పిలుచుకుంటారు. ఒకరినొకరు పిలుచుకోవడానికి ఒక్కొక్కరికి ఒక్కో రాగంఉంటుందట. గ్రామస్తులు ఈ ట్యూన్‌ని ‘జింగ్‌ర్‌వై లాబీ’ అని పిలుస్తారు, అంటే తల్లి ప్రేమ పాట అని అర్థం. -
వినపడట్లేదు.. ఇంకా గట్టిగా: కోహ్లి
చెన్నై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఆనందం వచ్చినా.. బాధ కలిగినా అస్సలు తట్టుకోలేడు. ఎప్పటి ఆనందాన్ని అప్పుడే వ్యక్తం చేయాలనేది బహుశా కోహ్లి పాలసీ అనుకుంటా. తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా బౌలర్లు వికెట్లతో చెలరేగుతుండడంతో కోహ్లి చాలా జోష్‌లో కనిపించాడు. రెండో రోజు ఆటలో కోహ్లి ఆద్యంతం అదే ధోరణిలో కనిపించాడు. ఒకవైపు ఆటగాళ్లను ఉత్తేజపరుస్తూనే.. మరోవైపు తన చేష్టలతో ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాడు. కరోనా విరామం అనంతరం బీసీసీఐ మైదానంలోకి 50 శాతం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఆదివారం స్టేడియం ప్రేక్షకులతో నిండిపోయింది. లంచ్ విరామం అనంతరం ఇంగ్లండ్ మరో రెండు వికెట్లు కోల్పోయిన ఆనందంలో విరాట్ కోహ్లి అభిమానుల వైపు చూస్తూ విజిల్ వేసి ఉత్సాహపరిచాడు. అనంతరం వారిని చూస్తూ మీరు కూడా ఇదే విధంగా మీరు8 విజిల్ వేయండంటూ తెలిపాడు. ఫ్యాన్స్ వేస్తున్న విజిల్స్‌ను వింటున్నట్లుగా అటువైపు చెవులు పెట్టి..'వినబడట్లేదు.. ఇంకా గట్టిగా'అంటూ వారిని ఎంకరేజ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోనూ బీసీసీఐ ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. కాగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు ఆలౌట్ కాగా.. ప్రస్తుతం ఇంగ్లండ్ 8 వికెట్లకు 124 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఫాలోఆన్ గండం తప్పించుకోవాలంటే ఇంకా 10 పరుగులు చేయాల్సి ఉంది. When in Chennai, you #WhistlePodu! 👌👌#TeamIndia skipper @imVkohli egging the Chepauk crowd on & they do not disappoint. 👏👏 @Paytm #INDvENG Follow the match 👉 https://t.co/Hr7Zk2kjNC pic.twitter.com/JR6BfvRqtZ — BCCI (@BCCI) February 14, 2021 -
‘విజిల్’ ప్రీ రిలీజ్ వేడుక
-
కంపెనీల రవాణా సేవలకు ‘విజిల్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఉద్యోగుల ట్రాన్స్‌పోర్టేషన్ కంపెనీలకు పెద్ద సవాలే. వ్యాపార కార్యకలాపాల కంటే ఎక్కువగా ఉద్యోగుల రవాణా సేవల నిర్వహణ కష్టం. ఎంప్లాయిస్ ట్రాన్స్‌పోర్టేషన్ థర్డ్ పార్టీకి ఇద్దామంటే? వాహనాలు మాత్రమే ఉంటే సరిపోదు. టెక్నాలజీ, నిర్వహణ కూడా అవసరమే. సొంత వాహనాలు, డ్రైవర్లు, ఏఐ ఆధారిత ట్రాన్స్పోర్ట్ టెక్నాలజీ మూడు విభాగాలను నిర్వహణ చేసే స్టార్టపే విజిల్ డ్రైవ్! మరిన్ని వివరాలు కంపెనీ ఫౌండర్ అండ్ సీఈఓ రాకేశ్ మున్ననూరు ‘స్టార్టప్ డైరీ’కి వివరించారు. ‘‘మాది కరీంనగర్ జిల్లా. నోయిడాలో బీటెక్ పూర్తయ్యాక.. టాప్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది. జాబ్‌లో చేరితే లాక్ అయిపోతానని వచ్చిన ఆఫర్‌ను వదిలేసి.. ఇంటికొచ్చేశా. బీటెక్ చేస్తూనే చాలా స్టార్టప్స్‌కు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, నిర్వహణ, ఇన్వెస్ట్మెంట్స్ అప్రూవల్స్ తదితర విభాగాల్లో పనిచేశా. ఈ అనుభవంతో సొంతంగా స్టార్టప్ పెట్టాలని నిర్ణయించుకొని 2016 ఏప్రిల్‌లో హైదరాబాద్ కేంద్రంగా విజిల్ డ్రైవ్.కామ్‌ను ప్రారంభించాం. డ్రైవర్లను అద్దెకిచ్చే సేవలతో ప్రారంభమైన విజిల్ డ్రైవ్.. ప్రస్తుతం కార్పొరేట్ కంపెనీలకు క్యాబ్స్, టెక్నాలజీ సేవలందించే కంపెనీగా ఎదిగింది. 28 కంపెనీలు; 12 వేల మంది.. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో సేవలందిస్తున్నాం. ఏడీపీ, ఇన్వెస్కో, ఐటీసీ హోటల్స్, రెయిన్బో ఆసుపత్రి, ఎల్ అండ్ టీ వంటి 28 కంపెనీలు, 12 వేల మంది ఉద్యోగులు కస్టమర్లుగా ఉన్నారు. ప్రస్తుతం 700 క్యాబ్స్ ఉన్నాయి. ఇందులో 20 శాతం సొంతానివి. విజిల్ ఫ్లీట్‌లో 4–7 సీట్ల వాహనాలు, విజిల్ షటిల్లో వింగర్స్, మినీ బస్‌లు, విజిల్ 360 డిగ్రీస్‌లో వాహనాలతో పాటూ టెక్నాలజీ సేవలు కూడా ఉంటాయి. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్సీ (ఏఐ), బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారిత సాఫ్ట్వేర్ ఉంటుంది. వచ్చే ఏడాది కాలంలో 1,500 క్యాబ్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తాం. ప్రస్తుతం రోజుకు క్యాబ్స్ 2,500 ట్రిప్పులు, లక్ష కి.మీ. వరకు తిరుగుతున్నాయి. రూ.15 కోట్ల ఆదాయం లక్ష్యం.. నెల ప్యాకేజ్, ట్రిప్ వారీగా ఆదాయం ఉంటుంది. ధరలు నెల ప్యాకేజీ రూ.30 వేల నుంచి రూ.50 వేలు, ట్రిప్‌కు అయితే రూ.350 నుంచి రూ.1,000కు చార్జీలుంటాయి. డ్రైవర్ కం ఓనర్ క్యాబ్ ఆదాయంలో విజిల్ డ్రైవ్‌కు 20 శాతం కమీషన్ ఉంటుంది. గతేడాది రూ.8 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాం. 2019–20లో రూ.15 కోట్ల రెవెన్యూను లకి‡్ష్యంచాం. ఈ ఏడాది ముగింపు నాటికి పుణేలో సేవలను ప్రారంభించనున్నాం. 2020 నాటికి విశాఖపట్నం, ముంబై, ఢిల్లీలోకి ఎంట్రీ ఇస్తాం. రూ.70 కోట్ల నిధుల సమీకరణ.. ప్రస్తుతం విజిల్ డ్రైవ్‌లో 62 మంది ఉద్యోగులున్నారు. ఏడాదిలో ఈ సంఖ్యను 150కి చేర్చుతాం. ప్రస్తుతం ఉద్యోగుల ట్రాన్స్‌పోర్టేషన్ కోసం ఫోర్డ్స్ కంపెనీతో చర్చలు జరుగుతున్నాయి. నెల రోజుల్లో ఎంవోయూ పూర్తవుతుంది. దీంతో ముంబై, కోల్‌కతా వంటి ఇతర నగరాల్లోకి ఎంట్రీ ఇచ్చినట్టే. ఏడాది కాలంలో క్లయింట్ల సంఖ్యను 50కి చేర్చుతాం. ‘‘ఇప్పటికే మా కంపెనీలో కొలీజియం గ్రూప్ రూ.5 కోట్ల పెట్టుబడులు పెట్టింది. త్వరలోనే రూ.70 కోట్ల నిధులు సమీకరించనున్నాం. అమెరికాకు చెందిన పలు ఇన్వెస్ట్మెంట్ నెట్వర్క్స్తో చర్చలు జరుగుతున్నాయి’’ అని రాకేశ్ వివరించారు. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
గుక్క తిప్పుకోకుండా..
శిశుర్వేత్తి.. పశుర్వేత్తి.. వేత్తిగాన రసం ఫణి.. అనే నానుడికి ఆయన ఈల పాట సరిగ్గా అతుకుతుంది. చిన్నారులనే కాకుండా మూగజీవాలను, చివరికి పాములను సైతం అలరింపజేసే గుణం గానానికి ఉంది. సాధారణంగా ఎప్పుడో ఒకప్పుడు బాత్రూంలోనో మరేదైన ఆనంద సమయంలోనో నోటితో పాటలు పాడటం అందరూ చేస్తుంటారు. కానీ ఈల పాట అంత సులువుగా రాదు. నగరానికి చెందిన కర్రా శేషశాయి మాత్రం విజిల్ సాంగ్‌లో తనదైన ప్రత్యేకత చాటుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. హిమాయత్‌నగర్: విద్యానగర్‌కు చెందిన సుబ్రహ్మణ్య కుమార్, పద్మ దంపతుల కుమారుడు శేషశాయి. ప్రస్తుతం డీసీబీ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్. చిన్నప్పుడు తండ్రి విజిల్‌తో పాటలు పాడుతూ ఇంట్లో వారిని అలరించేవారు. ఆయనను అనుసరిస్తూ శేషశాయి కూడా విజిల్‌తో పాడటం మొదలుపెట్టారు. కొన్ని ఫంక్షన్లలో సరదాగా విజిల్ పాటలు పాడుతూండేవారు. చాలా బాగా పాడుతున్నావు. కొనసాగించు అని పలువురు ప్రోత్సహించడంతో తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు శేషశాయి. గురువు అడుగుజాడల్లో.. ప్రముఖ సంగీత విద్వాంసులు, విజిల్‌తో పాడుతూ ప్రేక్షకులను అలరిస్తున్న కొమరవోలు శివప్రసాద్ సమక్షంలో శేషశాయి ఓనమాలు దిద్దుకుంటున్నారు. ఆయన తర్ఫీదులో సరిగమలు, కృతులు, అన్నమయ్య కీర్తనలు నేర్చుకున్నారు. గురువు శివప్రసాద్‌తో కలిసి శేషశాయి ఇప్పటి వరకు 50కిపైగా స్టేజీషోల్లో పాల్గొన్నారు. గుక్క తిప్పుకోకుండా.. మహా అయితే మనం ఒక్క నిమిషం పాటు గుక్కతిప్పుకోకుండా పెదాలతో విజిల్ వేస్తూ పాడతాం. అంతకంటే ఎక్కువ సేపు పాడలేం.. ఆయాసం వస్తుంటుంది. కానీ.. శేషశాయి తన టాలెంట్‌తో 15 నిమిషాల పాటు గుక్కతిప్పుకోకుండా విజిల్‌తో పాటలు పాడతారు. 2014లో సింగర్ రోహిత్‌తో కలిసి విజిల్‌తో పాటలు పాడి అలరించారుఆయన. ప్రముఖులెందరో నచ్చారు.. రంగస్థలం సినిమాలోని ‘రంగా రంగా రంగస్థలాన’ అనే పాటను విజిల్‌తో పాడి ట్విట్టర్లో పోస్ట్ చేశారు శేషశాయి. ఈ పాటను చూసిన మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ లైక్ కొట్టారు. దీంతో ఒక్కరోజులోనే ఆ పాటకు 15వేల లైకులు వచ్చాయి. రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ ఎదుట ఆయనకు నచ్చిన పాట ‘కురే ఉండ్రు మిళై’ తమిళ పాటను పాడి ఆశ్చర్యానికి గురిచేశారు. ఇప్పటి వరకు వంద పాటలను ప్రత్యేకంగా పాడి వాటిని ఫేస్బుక్, ఇన్‌స్ట్ర్రాగామ్, ట్విట్టర్లలో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియోలకు వేలల్లో లైకులు వచ్చాయి. రెహమాన్ ఎదుట పాడాలి.. స్టేజీషోల్లో అవకాశమిస్తే నా సత్తా నిరూపిస్తాను. విజిల్‌తో పాట పాడటం నేర్చుకున్నప్పటి నుంచి నాకు ఓ కోరిక ఉండేది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఎదుట కొన్ని పాటలను విజిల్‌తో పాడాలని, ఆయన కాంప్లిమెంట్స్ అందుకోవాలని. ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. – కర్రా శేషశాయి, ఈల పాట గాయకుడు -
విజిల్ మింగిన బాలుడు
- బయటకు తీసి ప్రాణాలు కాపాడిన గాంధీ ఆస్పత్రి వైద్యులు హైదరాబాద్: ఓ బాలుడి గొంతులోకి జారిన విజిల్‌ను శస్త్రచికిత్స లేకుండా అత్యాధునిక పద్ధతుల ద్వారా బయటికి తీసి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ఈఎన్టీ వైద్యులు చిన్నారి ప్రాణాలు కాపాడారు. హైదరాబాద్ బాలాపూర్‌కు చెందిన ప్రశాంతి, వెంకటేశ్వర్లు భార్యాభర్తలు. కొద్దిరోజుల క్రితం వీరు విడిపోయారు. తల్లి వద్ద ఉంటున్న కుమారుడు అభిరాం(10) స్థానిక పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు. ఈ నెల 24వ తేదీ సాయంత్రం అభిరాం ఆరుబయట విజిల్ ఊదుతూ తోటి చిన్నారులతో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో విజిల్ ప్రమాదవశాత్తు గొంతులోకి జారిపోయింది. తోటి పిల్లలు ఆరా తీయగా విజిల్ మింగేశానని చెప్పి ఇంటికి వెళ్లాడు. విజిల్ శబ్దం తప్ప మాట్లాడలేని స్థితిలో ఉన్న కుమారుడిని తల్లి పలు ఆస్పత్రులకు తీసుకువెళ్లింది. అక్కడి వైద్యులు చేతులెత్తేయడంతో ఈ నెల 25న గాంధీ ఆస్పత్రికి తీసుకువెళ్లింది. ఈఎన్టీ వైద్యులు పలు రకాలు ఎక్స్‌రేలు తీశారు. విజిల్ వంటి సాధనం ఎక్కడా కనిపించలేదు. నోటి వెంట విజిల్ సౌండ్ వస్తున్నా ఎక్స్‌రేల్లో కనిపించకపోవడంతో ఈఎన్టీ వైద్యులు కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్నారు. అత్యవసర కేసుగా పరిగణించి చిన్నారిని ఇన్‌పేషెంట్‌గా చేర్చుకుని గ్య్రాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో ఎండోస్కోపి చేయించారు. కుడి ఊపిరితిత్తిలో ఇరుక్కున్న విజిల్ వంటి ప్లాస్టిక్ సాధనాన్ని గుర్తించారు. శస్త్రచికిత్స చేస్తే బాలుడి ప్రాణాలకు ప్రమాదమని వైద్యులు భావించారు. బ్రాంకోస్కోపీ విధానం ద్వారా సన్నని తీగ వంటి సాధనాన్ని ఊపిరితిత్తుల్లోకి పంపి విజిల్‌ను విజయవంతంగా బయటకు తీశారు. మరోమారు వైద్యపరీక్షలు నిర్వహించి బాలుడిని డిశ్చార్జ్ చేస్తామని ఈఎన్టీ హెచ్‌వోడీ ప్రొఫెసర్ హన్మంతరావు తెలిపారు. అరుదైన వైద్యాన్ని అందించిన ప్రొఫెసర్ హన్మంతరావు, వైద్యులు శ్రీకాంత్, వెంకటరామిరెడ్డి, రాథోడ్, శ్యాంసన్ తదితరులను వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, డీఎంఈ రమణి, గాంధీ సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్‌లు అభినందించారు. -
ఇదేనా.. ‘ఫ్రెండ్లీ పోలీసు’
ఆర్మూర్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు పోలీసులను చూసి భయపడకుండా పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి ధైర్యంగా వెళ్లే స్నేహపూరిత వాతావరణం కల్పిస్తామంటూ సీఎం కేసీఆర్ ప్రకటిస్తుంటే క్షేత్ర స్థాయిలో మాత్రం పోలీసుల తీరు అందుకు విరుద్ధంగా ఉంది. దీనికి ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు రూపాయలు తక్కువ చేయలేదంటూ వ్యాపారితో శనివారం ఓ హెడ్ కానిస్టేబుల్ ప్రవర్తించిన తీరే నిదర్శనం. ప్రత్యక్ష సాక్షులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న నర్సయ్య స్థానిక బస్టాండ్ సమీపంలోని ఒక దుకాణంలో రూ. 15 విలువైన విజిల్ కొనుగోలు చేశాడు. హెడ్ కానిస్టేబుల్ ఐదు రూపాయలు తక్కువ చేయమని అడగగా, తమకు వచ్చిన ధరకే ఇచ్చాం సార్ అంటూ దుకాణం యజమాని రూ. 15 తీసుకున్నాడు. ఇదే రోజు సాయంత్రం బస్టాండ్ సమీపంలో సదరు దుకాణం ఎదురుగానే ఆర్మూర్ ఎస్సై బోసు కిరణ్ ఆధ్వర్యంలో ద్విచక్రవాహనాల తనిఖీ నిర్వహించారు. హెడ్ కానిస్టేబుల్ విజిల్ కొనుగోలు చేసిన దుకాణానికి చెందిన కార్మికుడు మోటార్ బైక్‌పై వెళ్లడాన్ని గమనించి పట్టుకున్నాడు. మోటార్ సైకిల్లో భద్రంగా ఉంచిన రిజిస్ట్రేషన్ కార్డు, ఇన్సూరెన్స్ పేపర్లను చూపించి, ఎదురుగానే దుకాణంలో ఉన్న డ్రైవింగ్ లెసైన్సును తీసుకువచ్చి హెడ్ కానిస్టేబుల్‌కు చూపించాడు. మీ దుకాణానికి పోలీసులు వస్తే డబ్బులు తక్కువగా తీసుకుంటలేరు ఇప్పుడు ఫైన్ కట్టాల్సిందేనంటూ హెడ్ కానిస్టేబుల్ నర్సయ్య ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఆ కార్మికుడు తమ యజమానిని తీసుకొని పోలీసుల వద్దకు వచ్చాడు. మోటార్ సైకిల్‌కు అవసరం ఉన్న పేపర్లు అన్ని ఉన్నాయంటూ చూపించే ప్రయత్నం చేసినా మోటార్ సైకిల్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.ఈ విషయం అక్కడే ఉన్న సీఐ, ఎస్సైలకు దృష్టికి తీసుకువెళ్లినా, వారి స్టేషన్‌కు వెళ్లి తెచ్చుకోవాలని సెలవిచ్చారు. దీంతో చేసేది లేక బాధితులు పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఎస్‌హెచ్‌వో రవి కుమార్‌కు మోటార్ సైకిల్ పేపర్లు చూపించి హెడ్ కానిస్టేబుల్ వ్యవహరించిన తీరును తెలిపారు. దీంతో ఆయన స్పందించి దుకాణం యజమానికి మోటార్ సైకిల్ ఇప్పించి హెడ్ కానిస్టేబుల్‌ను పిలిచి మాట్లాడతానని చెప్పుకొచ్చారు. జరిగిన సంఘటన చిన్నదే అయినా ఐదు రూ. తక్కువ చేయలేదన్న కారణంగా హెడ్ కానిస్టేబుల్ ప్రవర్తించిన తీరు పోలీసులపై మరింత చెడు అభిప్రాయాన్ని కలిగించేదిగా ఉందని సంఘటన స్థలంలో ఉన్న వారు అభిప్రాయపడ్డారు.