ప్రతీకాత్మక చిత్రం
కోల్‌కతా: దాదాపు 11 నెలల క్రితం ఓ కుర్రాడు అనుకోకుండా ప్లాస్టిక్ విజిల్ మింగాడు. తల్లిదండ్రులకు చెప్తే కొడతారనే భయంతో జరిగిన దాని గురించి వారికి చెప్పలేదు. ఈ క్రమంలో కొన్ని నెలలుగా కుర్రాడు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడసాగాడు. స్థానిక వైద్యులు ఎవరు బాలుడి అసలు సమస్యను గుర్తించలేకపోయారు. చివరకు ఓ డాక్టర్ సలహాతో జిల్లా ఆస్ప్రతికి వెళ్లారు. అక్కడ వైద్యులు ఎక్స్‌రే తీయగా ఊపిరితిత్తుల మధ్య ఇరుక్కున్న విజిల్‌ని గమనించారు. అనంతరం అతడికి ఆపరేషన్ చేసి.. విజిల్‌ని తొలగించారు. ఆ వివరాలు..
పశ్చిమబెంగాల్ దక్షిణ 24 పరగణాల జిల్లా బరుయిపూర్ ప్రాంతానికి చెందిన రైహాన్ లస్కర్(12) అనే కుర్రాడు 2021, జనవరిలో విజిల్‌తో ఆడుతూ.. చిప్స్ తింటున్నాడు. ఈ క్రమంలో అనుకోకుండా చేతిలో ఉన్న విజిల్‌ని మింగేశాడు. బయటకు ఉద్దామని ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు. ఇక దీని గురించి తల్లిదండ్రులకు చెప్తే.. కొడతారనే భయంతో సైలెంట్‌గా ఉన్నాడు.
ఈ సంఘటన తర్వాత రైహాన్ జీవితంలో విచిత్ర సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఏదైనా మాట్లాడదామని నోరు తెరిస్తే.. విజిల్ ఊదినప్పుడు ఎలాంటి శబ్దం వస్తుందో అలాంటి సౌండ్ వచ్చేది. ఇక ఈత కొడదామని వెళ్తే ఎక్కువ సమయం నీటిలో ఉండలేకపోతుండేవాడు. ఛాతిలో నొప్పితో బాధపడడేవాడు. ప్రారంభంలో రైహాన్ తల్లిదండ్రులు దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు.
(చదవండి: పేర్లు లేని గ్రామం.. మరి ఎలా పిలుచుకుంటారో తెలుసా!)
ఆ తర్వాత రైహాన్ తరచుగా అనారోగ్యానికి గురవుతుండేవాడు. స్థానికంగా ఉన్న ఆస్పత్రుల్లో చూపిస్తే.. వైద్యులు ఏవో మందులు రాసే వారు కానీ అసలు సమస్య ఏంటో చెప్పలేకపోయారు. ఇలా ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ఫలితం లేకపోగా.. రోజురోజుకి రైహాన్ ఆరోగ్యం మరింత క్షీణించసాగింది. ఈ క్రమంలో ఓ వైద్యుడి సూచన మేరకు కుమారుడిని ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు.
(చదవండి: Viral: కుక్కలకు గొడుగు పట్టి.. మనుషులను దారిలో పెట్టి..)
అక్కడ రైహాన్ పరిస్థితిని గమనించిన సీనియర్ వైద్యుడు ప్రొఫెసర్ అరుణాభా సేన్‌గుప్తా అతడికి ఎక్స్‌రే తీసి.. ఊపిరితిత్తుల మధ్య ఇరుక్కున్న విజిల్‌ని గుర్తించారు. అనంతరం అరుణాభా ఆధ్వర్యంలో వైద్యులు గురువారం రైహాన్‌కు ఆపరేషన్ చేసి విజిల్‌ని తొలగించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
చదవండి: Video: మరికొన్ని గంటల్లో పెళ్లి.. వధువు చేసిన పనికి అంతా షాక్!
Comments
Please login to add a commentAdd a comment