swallow
-
ముప్ఫై ఏళ్ల మహిళను మింగిన కొండ చిలువ
జకార్తా: ఇండోనేసియాలో మంగళవారం(జులై2) భయానక ఘటన జరిగింది. 30 అడుగుల పొడవున్న భారీ కొండచిలువ ఏకంగా ఒక మహిళను చంపి మింగేయడానికి ప్రయత్నించింది. అసలు ఏం జరిగిందంటే.. ఇండోనేసియాలోని సౌత్ సులవేసిలో ఉన్న లువు ఏజెన్సీ ప్రాంతంలో నివసించే సిరియతి అనే మహిళకు ఐదుగురు సంతానం. మహిళ తన పిల్లల్లో ఒకరికి ఆరోగ్యం బాగోలేదని మందుల కోసం ఆమె ఇంటి నుంచి బయటికి వచ్చింది. చెట్ల మధ్యలో నుంచి నడుచుకుంటూ మందుల షాపుకు వెళుతోంది. అక్కడే చెట్లపై ఉన్న భారీ కొండచిలువ మహిళపై దాడి చేసి చుట్టచుట్టి నలిపేసింది. తర్వాత మహిళను ఆమె కాళ్లదాకా మింగేసింది.ఇంతలో అదే దారిలో మహిళ కోసం వెతుకుతూ వస్తున్న భర్తకు భయానక దృశ్యం కనిపించింది. తన భార్యను కొండచిలువ కాళ్లదాకా మింగేయడం కనిపించింది. కోపంతో వెంటనే కొండచిలువను చంపి మహిళను బయటికి తీశాడు. కానీ అప్పటికే ఆమె చనిపోయింది. -
వింత ఘటన: ఓ మహిళ టూత్‌బ్రెష్‌ని అనుకోకుండా మింగేసింది! అంతే..
ఏదైనా వస్తువు నోట్లో సరదాగా పెట్టుకుని అనుకోకుండా మింగడం జరగుతుంది. ఇది అత్యంత సాధారణ విషయం. ప్రమాదకరమైన వస్తువు కాకపోతే వైద్యులు లేద పెద్దవాళ్ల సాయంతో బయటకు తెచ్చేస్తారు. అసలు దంతాలను క్లీన్ చేసుకునే టూత్ బ్రెష్‌ని మింగడం గురించి విన్నారా?. అస్సలు అదే ఎలా జరుగుతుంది అనిపిస్తుంది కదా!కానీ ఇక్కడొక మహిళ ఏం చేసిందో గానీ అమాంతం టూత్‌బ్రెష్‌ని అయితే మింగేసింది. ఇక ఆ తర్వాత ఆమె పరిస్థితి..మాటలకందనిది. స్పానిష్‌కి చెందిన 21 ఏళ్ల హీజియా అనే మహిళ టర్కీ మాంస ఫుల్‌గా లాంగించింది. ఆ తర్వాత దంతాల్లో ఇరుక్కుపోయిన పదార్థాలను టూత్ బ్రెష్‌తో క్లీన్ చేసుకుంటుండగా పొరపాటున \మింగేసింది. అది గొంతులో అడ్డుపడి నరకయాతన అనుభవించింది. ఒకరకంగా చెప్పాలంటే ఊపిరాడక చావు అంచెలదాక వెళ్లిందనే చెప్పాలి. ఏం చేయాలో తోచక తండ్రిని సాయం కోరగా..ఏదైనా బలవంతంగా ప్రయత్నిస్తే..ఎక్కడ? ఆమె గొంతుకు సమస్య వస్తుందన్న భయంతో హుటాహుటినా ఆస్పత్రికి తరలించాడు. అక్కడ ఈ ఇబ్బందికర పరిస్థితిని వివరించగా..వైద్యులు సైతం ఒక్కసారిగా కంగుతిన్నారు. ఇదంతా నిజమేనా? అన్న సందేహం వచ్చింది. చివరికి ఎక్స్‌రే తీయగా నిజంగానే ఇరుక్కుపోయిందని గుర్తించారు. దీంతో సర్జన్లు సుమారు రెండు నుంచి మూడు నిమిషాలు స్టడీ చేసి అన్నవాహికలో ఇరుక్కుపోయిన ఆ టూత్‌బ్రెష్‌ని సర్జరీ అవసరం లేకుండానే ఓ వైద్య పరికరంతో బయటకు తీశారు. జస్ట్ 40 నిమిషాల్లో విజయవంతంగా ఈ ప్రక్రియనంతా పూర్తి చేశారు వైద్యులు. ఏదీ ఏమైనా ఇది అత్యంత విచిత్రమైన ఘటన కదూ.! (చదవండి: ముక్కు క్యాన్సర్ అంటే..? దీని కారణంగా ఓ మహిళ మొత్తం ముక్కునే..) -
మంగళసూత్రం మింగిన గేదె.. ఐదోతనం కాపాడిన వైద్యుడు!
మహారాష్ట్రలోని వాశిం జిల్లాలో ఒక వింత ఉదంతం చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక గేదె రూ. 15 లక్షల విలువైన మంగళసూత్రం మింగేసింది. పశువైద్యులు ఆ గేదె కడుపులోని మంగళ సూత్రం తీసేందుకు దాని కడుపును కోశారు. మంగళసూత్రం బయటకు తీశాక ఆ గేదెకు 65 కుట్లు వేశారు. జిల్లాలోని సార్సీ గ్రామంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. రామ్‌హరీ అనే రైతు భార్య స్నానం చేసే ముందు తన మంగళ సూత్రాన్ని తీసి, సోయాబీన్ తొక్కలు ఉన్న ఒక పాత్రలో పెట్టింది. స్నానం పూర్తయ్యాక, ఆ ప్లేట్‌ను తమ పశువులశాల లోని గేదె ముందు ఉంచి, ఇంటిపనులలో మునిగిపోయింది. రెండు గంటల తరువాత తన మెడలో మంగళ సూత్రం లేని విషయాన్ని ఆమె గమనించింది. కొద్దిసేపు ఇటునటు వెదికాక తాను ఆ మంగళ సూత్రాన్ని సోయా తొక్కలున్న ప్లేట్లో పెట్టినట్లు గుర్తుకు తెచ్చుకుంది. వెంటనే ఆమె పరిగెత్తుకుంటూ పశువులశాలలోకి వెళ్లి చూసింది. గేదె తన మంగళసూత్రం మింగేసిందని గ్రహించింది. వెంటనే ఈ విషయాన్ని ఆమె భర్తకు తెలియజేసింది. రైతు రామ్‌హరీ ఈ విషయాన్ని ఫోనులో పశువైద్యాధికారి బాలాసాహెబ్‌కు తెలియజేశాడు. అతని సూచన మేరకు ఆ రైతు తన గేదెను వాశింలోని పశువైద్యశాలకు తీసుకు వెళ్లాడు. అక్కడ పశువైద్యాధికారి మెటల్ డిటెక్టర్‌తో ఆ గెదె కడుపులో మంగళసూత్రం ఉన్నదని నిర్ధారించారు. తరువాత దానికి ఆపరేషన్ చేసి, మంగళ సూత్రాన్ని బయటకు తీశారు. ఈ ఆపరేషన్ 2 గంటలపాటు సాగింది. తరువాత వైద్యుదు ఆ గేదెకు 65 కుట్లు వేశారు. కాగా తన మంగళసూత్రాన్ని గేదె కడుపు నుంచి వెలికి తీసి, తన ఐదోతనం కాపాడారంటూ ఆ రైతు భార్య వైద్యునికి కృతజ్ఞతలు తెలియజేసింది. ఇది కూడా చూడండి: పాక్ ప్రధాని జీతం ఎంత? అదనపు సౌకర్యాలు ఏముంటాయి? -
విటమిన్ టాబ్లెట్ అనుకుని ఎయిర్‌పాడ్ మింగేసింది.. తరువాత?
టాబ్లెట్లు, మాత్రలు వేసుకునేవారు పొరపాటున ఉదయం వేసుకోవాల్సిన మందులను రాత్రి, రాత్రి వేసుకోవాల్సిన మందులను ఉదయం వేసుకుంటుంటారు. అయితే ఒక మహిళ విషయంలో దీనికి భిన్నంగా జరిగింది. అమెరికాకు చెందిన 52 ఏళ్ల టిక్‌టాకర్ ఆన్లైన్లో ఈ విషయాన్ని వెల్లడించింది. తాను విటమిన్ ట్యాబ్లెట్గా భావించి తన భర్తకు చెందిన ఏపిల్ ఎయిర్‌పాడ్ ప్రోలోని ఒక దానిని మింగేశానని తెలిపింది. న్యూయార్క్ పోస్టులో పేర్కొన్న వివరాల ప్రకారం రియాల్టర్ తన్నా బార్కర్ తన స్నేహితురాలితో పాటు ఉదయం వాకింగ్‌కు బయలుదేరింది. ఈ సందర్భంగా స్నేహితురాలితో మాట్లాడుతూ విటమిన్ టాబ్లెట్ వేసుకోవాలనుకుంది. అయితే తన భర్తకు చెందిన ఒక ఎయిర్‌పాడ్ ప్రోను మింగేసి నీళ్లు తాగింది.. ఈ సందర్భంగా బార్కర్ మాట్లాడుతూ..‘వాకింగ్ సమయంలో కొంతదూరం వెళ్లాక విటమిన్ టాబ్లెట్ వేసుకున్నాను. అయితే గొంతులో ఏదో ఆడ్డుపడినట్టు అనిపిస్తే నీళ్లు తాగాను. తరువాత తన స్నేహితురాలికి బైబై చెప్పాను. తిరిగి ఎయిర్‌పాడ్ చెవిలో పెడదామనుకుని, జేబులో చెయ్యిపెట్టేసరికి విటమిట్ ట్యాబ్లెట్ తగిలింది. దీంతో తాను పొరపాటున విటమిన్ ట్యాబ్లెట్ మింగేశానని గ్రహించాను. భగవంతుడా ఎంత పొరపాటు జరిగిపోయిందని మనసులోనే అనుకున్నాను. ఇంటికివెళ్లి భర్తకు ఈ విషయం చెప్పాను. ఆయన వెంటనే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకు. వాళ్లంతా నవ్వుతారు అని అన్నారని తెలియజేస్తూ, ఇప్పుడు ఏమి చేయాలని’ టిక్‌టాక్ యూజర్స్‌ను అడిగింది. ఈ వీడియో అమాంతం వైరల్‌గా మారింది. దీనిని చూసిన యూజర్స్ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్ ‘ఎయిర్‌పాడ్ నోట్లోకి వెళ్లాక ‘ఎయర్ఫుడ్’ అవుతుందన్నాడు. మరో యూజర్ ‘వెంటనే వైద్యుని దగ్గరకు వెళ్లాలని’ సలహా ఇచ్చాడు. ఇంకొక యూజర్ అది ‘మలంలో బయటకు వచ్చేస్తుందని’ రాశాడు. ఇది కూడా చదవండి: ఇనుపరేకు బాక్సులో యువతి మృతదేహం.. సీసీటీవీ ఫుటేజీలో నిందితుడు! -
లంచంతో పట్టుబడి.. అధికారుల్ని చూసి కంగారులో..
జబల్పూర్: అవినీతికి పాల్పడడంలో ఏమాత్రం జంకని అధికారులు.. పైఅధికారుల చర్యలకు ఎందుకనో వణికిపోతుంటారు. అయితే ఇక్కడో అధికారి భయపడలేదు.. ఏకంగా బెదిరిపోయాడు. ఆ కంగారులో కరెన్సీ నోట్లను మింగేశాడు. మధ్యప్రదేశ్ కత్నికి చెందిన రెవెన్యూ అధికారి(పట్వారి) గజేంద్ర సింగ్ బర్ఖేడా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేశాడట. దీంతో బాధితుడు లోకాయుక్తకు చెందిన స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్(SPE) అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో ప్లాన్ ప్రకారం గజేంద్ర కోరిన ఐదు వేల లంచంతో బాధితుడు కార్యాలయానికి చేరుకున్నాడు. గజేంద్ర లంచం తీసుకుంటున్న టైంలో ఎస్పీఈ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. వాళ్లను చూసి ఆందోళన చెందిన ఆ అధికారి తప్పించుకోవాలనే ఆలోచనతో ఆ నోట్లను కసాబిసా నమిలి మింగేశాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు అతన్ని పరిశీలించి క్షేమంగానే ఉన్నట్లు తేల్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. A patwari in Katni in Madhya Pradesh was caught in a bribe-taking act by a team of the Lokayukta's Special Police Establishment. In a desperate attempt to escape, he allegedly swallowed the money he had accepted as a bribe. #AntiCorruption #BriberyCase #Lokayukta #Katni #MP pic.twitter.com/zgYXpbdYGv — The BothSide News (@TheBothSideNews) July 24, 2023 -
జైలు భయంతో బల్లిని మింగేశాడు..!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో ఓ వ్యక్తి బల్లిని మింగేశాడు. కాన్పూర్ జిల్లాలోని మల్లవాన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అత్యాచార కేసులో అదుపులోకి తీసుకున్న మహేశ్ అనే నిందితున్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చారు. నిందితున్ని రాత్రి సమయంలో ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ సమయంలోనే మహేశ్ నోట్లో బల్లి ఉండటం చూసి కంగుతిన్నారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్రమత్తమైన వైద్యులు మహేశ్ కడుపులో నుంచి బల్లిని బయటకు తీశారు. ప్రాణాపాయం ఏం లేదని తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వెల్లడించారు. అయితే.. ఈ అత్యాచార కేసులో మహేశ్‌పై చేసిన ఫిర్యాదును బాధితురాలు వెనక్కి తీసుకున్నారు. బల్లిని ఎందుకు మింగావని మహేశ్‌ను పోలీసులు అడగగా.. జైలంటే చాలా భయమని తెలిపాడు. అందుకే బల్లని మింగి.. ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు పోలీసులకు వెల్లడించాడు. ఇదీ చదవండి: హరిద్వార్‌లో రాకాసి మేఘం.. చూస్తే..! -
బంగారం గొలుసు కొట్టేసి.. కాపాడమని పోలీసులను వేడుకున్న దొంగ!
రాంచీ: జార్ఖండ్‌లోని రాంచీలో పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఓ చైన్ స్నాచర్ బంగారు గొలుసును మింగేశాడు. డోరండా పోలీస్ స్టేషన్ పరిధిలోని దుబాది వంతెన సమీపంలో సల్మాన్, జాఫర్ అనే ఇద్దరు స్నాచర్లు ఓ మహిళ మెడలోంచి బంగారు గొలుసు లాక్కెళ్లారు. గొలుసు లాక్కొని ఆ ఇద్దరు ద్విచక్రవాహనంపై పరారయ్యారు. అయితే, నేరం జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలోనే పోలీసులు ఉండడంతో.. ఇదంతా గమనించిన వారిని వెంబడించడం ప్రారంభించారు. సల్మాన్, జాఫర్లను పోలీసులు ఒక కిలోమీటరు మేర వెంబడించి పట్టుకున్నారు. పోలీసుల బారి నుంచి తప్పించుకునేందుకు సల్మాన్ తీవ్రంగా ప్రయత్నాలు చేశాడు. చివరికి పోలీసుకు దొరికిపోయే పరిస్థితి ఏర్పడడంతో.. తన దొంగతనానికి ఆధారం లేకుండా చేసే క్రమంలో చోరీకి గురైన బంగారు గొలుసును మింగేశాడు. అయితే సల్మాన్ చైన్ మింగుతుండగా పోలీసు అధికారులు చూశారు. చివరికి సల్మాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పొత్తికడుపు, ఛాతీకి ఎక్స్ రే పరీక్షలు నిర్వహించారు. ఎక్స్-రేలో సల్మాన్ ఛాతీలో బంగారు గొలుసు ఇరుక్కుని ఉన్నట్లు స్పష్టమైంది. దురదృష్టవశాత్తు, గొలుసు మింగిన కారణంగా, సల్మాన్ ఛాతీలో నొప్పిని మొదలై అది కాస్త తీవ్రతరం అయ్యింది. దీంతో తనని కాపాడాలని ఆ దొంగ పోలీసులను వేడుకోవడంతో ప్రస్తుతం అతని చికిత్స నిమిత్తం రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో చేర్పించారు. గ్యాస్ట్రోస్కోపీ, ఎండోస్కోపీ లేదా శస్త్రచికిత్స ద్వారా ఆ గొలుసును బయటకు తీసేందుకు వైద్యులు చికిత్స చేయనున్నారు. ప్రస్తుతం నిందితుడు రిమ్స్‌లో పోలీసుల నిఘాలో ఉన్నాడు. చదవండి: నువ్వు ఊరిలో లేనప్పుడు నీ పెళ్లాం, పిల్లల పీకలు కోస్తా.. -
మొసలిని అమాంతం మింగేసింది కొండచిలువ..పాపం ఆ తర్వాత..
ఓ కొండచిలువ అమాంతం ఓ మొసలిని మింగేసింది. ఆ తర్వాత అదిపడ్డ బాధ అంతా ఇంతా కాదు. చివరికి కక్కలేక మింగలేక నానాపాట్లు పడి.. విగతజీవిగా మారింది. అదే సమయంలో కొండచిలువ పొట్టలో ఉన్న మొసలి సైతం ఊపిరాడక చనిపోయింది. ఈ షాకింగ్ ఘటన బర్మాలో చోటు చేసుకుంది. కానీ వైద్యులు ఆ రెండు జీవుల్లో ఒక్కదాన్నైనా రక్షించాలనుకున్నారు. అందులో భాగంగానే వైద్యులు కొండచిలువ పొట్టకోసి మొసలిని తీసే యత్నం చేశారు. ఐతే అది అప్పటికే చనిపోయింది. ఆ కొండచిలువ సుమారు ఐదడుగుల మొసలిని మింగేసినట్లు వైద్యులు పేర్కొన్నారు. దాన్ని అరగించుకోలేక ప్రాణాలు విడిచినట్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన నెటిజన్లు తనకు మించి భారీగా ఉన్నవాటిని మింగితే వాటిని కొండచిలువలు ఉమ్మేస్తాయని కొందరూ చెబుతున్నారు. మరికొందరూ కొండచిలువ అలా చేయగలిగే అవకాశం ఉన్న చేయలేక చనిపోయిందని ట్వీట్ చేశారు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి: (చదవండి: ఏం స్వారీ చేశాడు భయ్యా! అర్థరాత్రి తాగిన మైకంలో ఎద్దుపైకి ఎక్కి..) -
రెండేళ్ల బాలుడ్ని అమాంతం మింగేసిన నీటిగుర్రం.. చివరకు ఏమైందంటే?
ఉగాండాలో మిరాకిల్ జరిగింది. సరస్సు సమీపంలోని ఓ ఇంటి బయట ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడ్ని నీటిగుర్రం(హిపోపాటమస్) అమాంతం మింగేసింది. అక్కడున్న ఓ వ్యక్తి గట్టిగా అరుస్తూ రాళ్లు విసిరేయడంతో వెంటనే బాలుడ్ని బయటకు ఉమ్మేసింది. దీంతో చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా అతను క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ బాలుడి పేరు పాల్. సరస్సుకు అతి సమీపంలో వీళ్ల ఇల్లు ఉంది. డిసెంబర్ 4న సరదాగా బయటకు వెళ్లి ఆడుకుంటున్నాడు. తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నారు. సరస్సు నుంచి వచ్చిన నీటిగుర్రం బాలుడ్ని తలపై నుంచి అమాంతం మింగేసింది. సగానికిపైగా శరీరాన్ని నోట్లోకి తీసుకుంది. ఇంతలో అటువైపు నుంచి వెళ్తున్న క్రిస్పస్ బగోంజా అనే వ్యక్తి ఇది గమనించి నీటిగుర్రంపైకి రాళ్లు విసిరాడు. దీంతో అది బాలుడ్ని వదిలేసింది. అయితే హిపోపాటమస్ పళ్లు గుచ్చుకొని చిన్నారి చేతికి గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా వైద్యులు ముందు జాగ్రత్తగా రేబిస్ ఇంజెక్షన్ ఇచ్చారు. అనంతరం చికిత్స అందించారు. నీటిగుర్రాలు శాఖహారులు అయినప్పటికీ.. బాగా భయపడినప్పుడు వేగంగా దాడులు చేస్తాయి. కొన్నిసార్లు పడవలను కూడా ఎత్తిపడేస్తాయి. నీటిగుర్రాల దాడుల వల్ల ఆఫ్రికాలో ఏటా 500 మంది చనిపోతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచంలోని ఏ ఇతర జంతువు కారణంగా ఇన్ని మరణాలు నమోదు కావడం లేదు. అత్యంత ప్రమాదకర జంతువుల్లో హిపోపాటమస్ కూడా ఒకటి. దీని దంతాలు సింహం కంటే మూడు రెట్లు ఎక్కువ బలంగా ఉంటాయి. చదవండి: 2,00,000 బలగాలతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడేందుకు రష్యా ప్లాన్! -
షాకింగ్.. బతికున్న మహిళను మింగిన 22 అడుగుల భారీ కొండచిలువ
బల్లులు, కప్పలు, ఎలుకలు, చేపలు, కీటకాలు వంటి చిన్న చిన్న జంతువులను పాములు ఆహారంగా తినడం సహజం. పెద్ద జంతువుల జోలికి అవి పోవు. అదే కొండచిలువ విషయానికొస్తే మొత్తం భిన్నంగా ఉంటుంది. ఏది దొరికితే అది ఇట్టే పట్టేసుకుంటుంది. పట్టు వదలకుండా బలంగా చుట్టుకొని ఆహారంగా చేసుకుంటుంది. ఇటీవల మొసలి, కోతి, మేకలు కొండచిలువ మింగేసిన ఘటనలు చూస్తూ ఉన్నాం. వీటిని తిన్న తర్వాత అవస్థ పడి పాము మరణించిన ఘటనలూ లేకపోలేదు. తాజాగా ఓ కొండచిలువ ఏకంగా మనిషినే మింగేసింది. 22 అడుగుల భారీ కొండచిలువ సంజీవంగా ఉన్న 54 ఏళ్ల మహిళను మింగింది. ఈ షాకింగ్ ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. ఆగ్నేమ సులవేసి ప్రావిన్స్‌లోని మునా ద్వీపంలో తన గ్రామ సమీపంలో ఉన్న కురగాయల తోటలో పని నిమిత్తం వెళ్లిన మహిళ కనిపించకుండా పోయింది. మరుసటి రోజు ఉదయం వరకు కూడా ఆమె తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. తోట వద్దకు వెళ్లి వెతగ్గా మహిళకు చెందిన చెప్పులు, ఫ్లాష్‌లైట్‌తోపాటు కొన్ని వస్తువులు దొరికాయి. దీంతో మరోసారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మహిళ కోసం గాలించగా ఆమె వస్తువులు దొరికిన ప్రాంతానికి కొంత దూరంలో ఓ భారీ కొండచిలువ కనిపించింది. అది చూడటానికి ఉబ్బిన కడుపుతో ఉండటంతో గ్రామస్తులకు అనుమానం వచ్చింది. వెంటనే కొండచిలువను చంపి దాన్ని కోయడంతో కడుపులో నుంచి మహిళ మృతదేహం బయటపడింది. కొండచిలువ పొట్టలో మహిళ దుస్తులతో సహా చెక్కుచెదరకుండా అలాగే ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. ముందుగా మహిళ తల మింగి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్‌గా మారాయి. కాగా ఈ ఘటన ఇప్పటిది కాదని, పాతదని పలువురు నెటిజన్లు చెబుతున్నారు. మరికొంత మంది ఇది ఎప్పుడు జరిగిన కొండచిలువ మనుషులను మింగడం సాధారణ విషయం కాదని, ఫోటోలు చూస్తుంటే ఒళ్లు జలదరిస్తుందని కామెంట్ చేస్తున్నారు. చదవండి: రోగికి ప్లాస్మా బదులు బత్తాయి జ్యూస్ ఘటన.. ఆసుపత్రికి షాకిచ్చిన అధికారులు -
మింగుడుపడని సమస్యా..? కారణాలు, పరిష్కారాలు ఇవిగో..!
మింగే సమయంలో నొప్పి రావడం, మింగడం ఇబ్బందిగా మారడం అనే సమస్యను ఈ ప్రపంచంలోని ఎదుర్కోని వారంటూ ఉండరు. కనీసం జలుబు వల్లనైనా గొంతునొప్పి వంటి సమస్య వచ్చి... ఏదో ఒక సమయంలో మింగడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇలాంటి ఒకటీ అరా సందర్భాల్లో, సంఘటనల్లో తప్ప... మింగలేకపోవడం అనేది ఎప్పుడూ ఓ సమస్యగా దాదాపుగా ఎవరికీ ఉండబోదు. కానీ చాలామందిలో అనేక కారణాలతో మింగడం ఓ కష్టసాధ్యమైన పని అవుతుంది. అలాంటి ఇబ్బందులు ఎవరెవరిలో, ఏయే కారణాలతో వస్తాయి, పరిష్కారాలేమిటి వంటి అంశాలను తెలుసుకుందాం. మింగడానికి వచ్చే అవరోధాలకు కారణాలు అనేకం. ఉదాహరణకు కొన్ని సమస్యలను చూద్దాం. వైరల్ సమస్యల వల్ల : ∙వైరల్ సమస్య కారణంగా వచ్చే జలుబు లేదా ఫ్లూ ∙ఇన్ఫెక్షియస్ మోనోన్యూక్లియోసిస్ (దీన్నే గ్లాండులార్ ఫీవర్ అంటారు. ఈ సమస్య కొందరిలో దాదాపు పదిరోజుల పాటు బాధిస్తుంటుంది) ∙మీజిల్స్ ∙చికెన్‌పాక్స్. ఉపశమనం కోసం ఏం చేయాలి? ∙మసాలాలు చాలా ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. సమస్య తగ్గేవరకు చప్పిడి భోజనం (బ్లాండ్డైట్) తీసుకోవాలి. ∙బాగా విశ్రాంతి తీసుకోవాలి, కంటినిండా నిద్రపోవడం అన్నది త్వరగా తగ్గడానికి చాలా బాగా తోడ్పడుతుంది. ∙గొంతుకు పూర్తి విశ్రాంతినివ్వాలి. గొంతుతో పనిచేసేవారు అంటే ఉదాహరణకు టీచర్లు, లెక్చరర్లు, గాయకులు, ఉపన్యాసకులు వంటి వారు సమస్య తగ్గేవరకు గొంతును వీలైనంతగా ఉపయోగించకపోవడమే మంచిది. ∙తగినన్ని నీళ్లు/ద్రవాహారం తీసుకుంటూ ఉండాలి. ∙వీలైనంతవరకు గోరువెచ్చటి లేదా వేడి చేసి, చల్లార్చిన ద్రవాలు తాగాలి. ∙రోజుకు కనీసం మూడు సార్లు ఉప్పు వేసిన గోరువెచ్చని నీటితో పుక్కిలించాలి. ∙పొగతాగడం, ఆల్కహాల్ వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. పై సూచనలు పాటించినప్పటికీ సమస్య తగ్గకపోతే ఓసారి ఈఎన్టీ డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. అదెప్పుడంటే... ∙గొంతునొప్పి (సోర్ థ్రోట్)తో బాధపడుతూ వారం రోజులకు పైగా గడిచాక కూడా సమస్య తగ్గకపోతే ∙బొంగురుగొంతు సమస్య రెండు వారాలు గడిచాక కూడా తగ్గకపోతే ∙101 డిగ్రీల ఫారెన్‌హీట్‌కు తగ్గకుండా అదేపనిగా జ్వరం వస్తుంటే... జ్వరం తగ్గకుండా ఉంటే. ∙మింగడంతో పాటు శ్వాస తీసుకోవడమూ కష్టమవుతుంటే. ∙నోరు తెరవడానికే ఇబ్బందిగా ఉంటే, గొంతు పెగలడమూ కష్టమవుతుంటే ∙గొంతునొప్పితో పాటు కీళ్లనొప్పులు, చెవినొప్పి కూడా ఉంటే ∙వికారం, వాంతులు ఉంటే, తీవ్రమైన అలసట, నీరసం, నిస్సత్తువ ఉంటే ∙గొంతసమస్యతో పాటు చర్మంపై ర్యాష్ వస్తుంటే ∙మెడ దగ్గర లింఫ్‌గ్రంథులు వాచి, చేతికి/స్పర్శకు తెలుస్తుంటే ∙టాన్సిల్స్‌ను పరిశీలనగా చూసినప్పుడు వాటిపై తెల్లటి మచ్చలు (వైట్ ప్యాచెస్) కనిపిస్తే డాక్టర్‌ను సంప్రదించాలి. గొంతునొప్పిగా ఉండి మింగలేకపోవడం అన్నది తాత్కాలిక సమస్యే. కానీ పైన పేర్కొన్న కండిషన్లు చాలాకాలం కొనసాగుతుంటే మాత్రం ఈఎన్టీ వైద్యుని తప్పక సంప్రదించాల్సిందే. బ్యాక్టీరియల్‌తో పాటు ఇతర సమస్యల వల్ల ∙బ్యాక్టీరియా కారణంగా గొంతుభాగంలో ఇన్ఫెక్షన్లు ∙కోరింత దగ్గు ∙అలర్జీలు ∙వాతావరణం పూర్తిగా పొడిబారి ఉన్నప్పుడు కొందరిలో మింగడం సమస్య అవుతుంది ∙చాలాకాలంగా పొగతాగడం లేదా పొగాకు నమిలేవారిలో ∙కాలుష్యం ∙గొంతులోని కండరాలపై భారం పడటం ∙గొంతు/నోటిలో గడ్డలు ∙టాన్సిల్స్‌లో ఆహారాలు ఇరుక్కుపోయినప్పుడు ∙గొంతుపైన ఏదైనా దెబ్బతగిలినప్పుడు (ఎక్స్టర్నల్ నెక్ ట్రామా) ∙విటమిన్ లోపాలు ∙సర్వైకల్ స్పాండిలోసిస్ ∙హెర్పిస్ ఇవేగాక... గొంతులోని ఫ్యారింగ్స్ అనే భాగంలో వచ్చే ఇన్ఫెక్షన్ ‘ఫ్యారంజైటిస్’ సైతం దాదాపు మూడు నుంచి ఏడు రోజుల వరకు తీవ్రంగానే బాధించి, మింగడానికి అడ్డంకిగా మారుతుంది. -డాక్టర్ ఇ.సి. వినయ కుమార్, సీనియర్ ఈఎన్టి సర్జన్ -
నోరు తెరిస్తే వింత శబ్దం.. ఛాతిలో నొప్పి.. 11 నెలల తర్వాత వీడిన మిస్టరీ
కోల్‌కతా: దాదాపు 11 నెలల క్రితం ఓ కుర్రాడు అనుకోకుండా ప్లాస్టిక్ విజిల్ మింగాడు. తల్లిదండ్రులకు చెప్తే కొడతారనే భయంతో జరిగిన దాని గురించి వారికి చెప్పలేదు. ఈ క్రమంలో కొన్ని నెలలుగా కుర్రాడు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడసాగాడు. స్థానిక వైద్యులు ఎవరు బాలుడి అసలు సమస్యను గుర్తించలేకపోయారు. చివరకు ఓ డాక్టర్ సలహాతో జిల్లా ఆస్ప్రతికి వెళ్లారు. అక్కడ వైద్యులు ఎక్స్‌రే తీయగా ఊపిరితిత్తుల మధ్య ఇరుక్కున్న విజిల్‌ని గమనించారు. అనంతరం అతడికి ఆపరేషన్ చేసి.. విజిల్‌ని తొలగించారు. ఆ వివరాలు.. పశ్చిమబెంగాల్ దక్షిణ 24 పరగణాల జిల్లా బరుయిపూర్ ప్రాంతానికి చెందిన రైహాన్ లస్కర్(12) అనే కుర్రాడు 2021, జనవరిలో విజిల్‌తో ఆడుతూ.. చిప్స్ తింటున్నాడు. ఈ క్రమంలో అనుకోకుండా చేతిలో ఉన్న విజిల్‌ని మింగేశాడు. బయటకు ఉద్దామని ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు. ఇక దీని గురించి తల్లిదండ్రులకు చెప్తే.. కొడతారనే భయంతో సైలెంట్‌గా ఉన్నాడు. ఈ సంఘటన తర్వాత రైహాన్ జీవితంలో విచిత్ర సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఏదైనా మాట్లాడదామని నోరు తెరిస్తే.. విజిల్ ఊదినప్పుడు ఎలాంటి శబ్దం వస్తుందో అలాంటి సౌండ్ వచ్చేది. ఇక ఈత కొడదామని వెళ్తే ఎక్కువ సమయం నీటిలో ఉండలేకపోతుండేవాడు. ఛాతిలో నొప్పితో బాధపడడేవాడు. ప్రారంభంలో రైహాన్ తల్లిదండ్రులు దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు. (చదవండి: పేర్లు లేని గ్రామం.. మరి ఎలా పిలుచుకుంటారో తెలుసా!) ఆ తర్వాత రైహాన్ తరచుగా అనారోగ్యానికి గురవుతుండేవాడు. స్థానికంగా ఉన్న ఆస్పత్రుల్లో చూపిస్తే.. వైద్యులు ఏవో మందులు రాసే వారు కానీ అసలు సమస్య ఏంటో చెప్పలేకపోయారు. ఇలా ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ఫలితం లేకపోగా.. రోజురోజుకి రైహాన్ ఆరోగ్యం మరింత క్షీణించసాగింది. ఈ క్రమంలో ఓ వైద్యుడి సూచన మేరకు కుమారుడిని ఎస్ఎస్కేఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు. (చదవండి: Viral: కుక్కలకు గొడుగు పట్టి.. మనుషులను దారిలో పెట్టి..) అక్కడ రైహాన్ పరిస్థితిని గమనించిన సీనియర్ వైద్యుడు ప్రొఫెసర్ అరుణాభా సేన్‌గుప్తా అతడికి ఎక్స్‌రే తీసి.. ఊపిరితిత్తుల మధ్య ఇరుక్కున్న విజిల్‌ని గుర్తించారు. అనంతరం అరుణాభా ఆధ్వర్యంలో వైద్యులు గురువారం రైహాన్‌కు ఆపరేషన్ చేసి విజిల్‌ని తొలగించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. చదవండి: Video: మరికొన్ని గంటల్లో పెళ్లి.. వధువు చేసిన పనికి అంతా షాక్! -
భారీ కొండ చిలువ రెండు కోళ్లను అమాంతం మింగి.. ఆతర్వాత..
ఖమ్మం: ఒక కొండ చిలువ దారితప్పి జనావాసాల్లోకి ప్రవేశించింది. అంతటితో ఆగకుండా అక్కడి కోళ్లను మింగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎక్కడినుంచి వచ్చిందో కానీ.. ఒక కొండ చిలువ కొత్తగూడెంలో ఉంటున్న జావీద్ అనే వ్యక్తి ఇంట్లో ప్రవేశించింది. ఆ తర్వాత అక్కడే ఉన్న రెండు కోళ్లను లటుక్కున మింగింది. ఆ తర్వాత ఎటూ కదల్లేక అక్కడే పడుకుంది. దీన్ని గమనించిన ఆ ఇంటివారు.. పాములను పట్టుకునే వారికి సమాచారం అందించారు. వారు వెంటనే జావీద్ ఇంటికి చేరుకుని కొండచిలువను బంధించారు. ఆ తర్వాత దాన్ని పైకెత్తగానే.. కొండ చిలువ మింగిన కోళ్లను బయటకు కక్కింది. ఆ తర్వాత దాన్ని ఫారెస్టు అధికారులకు అప్పగించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చదవండి: వామ్మో.. 14 అడుగుల కొండ చిలువ, 6 అడుగుల మొసలి.. -
Shocking: వ్యక్తి కడుపులో కేజీకీ పైగా నట్టులు, బోల్టులు
విల్నియస్: కొందరు వ్యక్తులు.. వెంట్రుకలను, బోల్ట్లను తినడం వంటి వార్తలను మనం అప్పుడప్పుడూ చదువుతూ ఉంటాం. గతంలో ఇలాంటి సంఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. తాజాగా, ఇలాంటి సంఘటన ఒకటి లిత్వేనియాలో జరిగింది. ఒక వ్యక్తి కడుపులో దాదాపు కిలోగ్రాము స్క్రూలు, నట్టులు, బోల్టులను వైద్యులు శస్త్రచికిత్స చేసి వెలికితీశారు. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది. లిత్వేనియాకు చెందిన వ్యక్తి మొదట మద్యానికి బానిసయ్యాడు. ఆ తర్వాత దాన్ని మానుకునే క్రమంలో.. అనుకోకుండా నట్టులు, బోల్టులు, గోర్లు వంటివి తినడం అలవాటు అయింది. దీంతో కొన్ని రోజులుగా అతడు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో కడుపునొప్పి ఎక్కువ కావడంతో కుటుంబ సభ్యులు.. అతడిని అంబులెన్స్‌లో బాల్టిక్ సముద్ర తీరంలో ఉన్న క్లైపెడా యూనివర్సిటీ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత వ్యక్తికి డాక్టర్లు స్కానింగ్ చేశారు. అతని కడుపులో కొన్ని వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో శస్త్ర చికిత్స ప్రారంభించారు. దాదాపు మూడు గంటలపాటు శ్రమించిన సరునాస్ డైలీడేనాస్ వైద్యుల బృందం అతని కడుపులో నుంచి దాదాపు కిలోగ్రాము బరువున్న స్క్రూలు, నట్టులు, గోర్లను బయటకు తీశారు. ఆ తర్వాత వ్యక్తి కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. చదవండి: వామ్మో.. 14 అడుగుల కొండ చిలువ, 6 అడుగుల మొసలి.. -
‘యాక్.. ఇలాంటి చెత్త సీన్లు ఎలా తీస్తారు మీరు?’
మన దగ్గర వచ్చే కొన్ని సినిమాలు, సీరియల్స్‌లోని సన్నివేశాలు చూస్తే ఓవరాక్షన్కే.. ఓవరాక్షన్ నేర్పించే సత్తా ఉన్నట్లు అర్థం అవుతుంది. ఏ సీరియల్, ఏ సినిమా అనే టాపిక్ వద్దు. తాజాగా సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఓ హిందీ సిరీయల్‌కు సంబంధించిన సీన్ చూస్తే.. మీకు కడుపులో తిప్పుతుంది. యాక్ థూ ఇదేం దరిద్రం అని తిట్టుకోకమానరు. ఆ ఓవర్‌యాక్షన్ సీన్ వివరాలు.. (చదవండి: ప్రియుడిని తలుచుకుని వెక్కి వెక్కి ఏడ్చిన బిగ్‌బాస్ కంటెస్టెంట్) కొన్నేళ్ల క్రితం హిందీలో టెలికాస్ట్ అయిన ‘దిల్ సే ది దువా సౌభాగ్యవతి భవా’ సీరియల్లోని సీన్‌కు సంబంధించిన వీడియో క్లిప్ తాజాగా నెట్టింట్లో తెగ వైరలవుతోంది. దీనిలో హీరో-హీరోయిన్ల ఫస్ట్ నైట్ సన్నివేశం వస్తుంది. హీరో ప్రేమగా హీరోయిన్ను దగ్గరకు తీసుకునే సమయంలో ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో తెలియదు కానీ ఆమె ఒంటి మీదకు బొద్దింక ఎక్కుతుంది. దాన్ని చూసి హీరోయిన్ తన మీద పాము పడ్డట్లు ఫీలై భయంతో అల్లంత దూరం పారిపోతుంది. (చదవండి: ఆ హీరో తల్లి నన్ను చెప్పుతో కొట్టడానికి ప్రయత్నించింది: రేఖ) ఇక మన హీరో గారు ఆ బొద్దింకను దొరకబుచ్చుకుని.. తన భార్యను భయపెట్టినందకు ప్రతీకారంగా.. దాన్ని చంపాలనుకుంటాడు. కానీ హీరోయిన్ వారించడంతో ఆగిపోతాడు. ఆ సమయంలో అతడికి ఓ తింగరి ఆలోచన వస్తుంది. బొద్దింక మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం భార్య తన కోసం తెచ్చిన పాలల్లో దాన్ని వేసి.. శుభ్రంగా తాగి.. తృప్తిగా బ్రేవ్మంటాడు. (చదవండి: భారీ రెమ్యునరేషన్‌పై నెటిజన్ల ట్రోలింగ్.. రిప్లై ఇచ్చిన కరీనా) ఈ సన్నివేశం చూసి అటు హీరోయిన్‌కి ఇటు వీడియో చూస్తున్న మనకు ఒకేసారి కళ్లు తిరగడంతో పాటు వాంతులు కూడా అవుతాయి. ఇక ఈ వీడియో చూసిన నెటిజనులు సీరియల్ దర్శకుడిపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాంటి దరిద్రమైన ఆలోచనలు మీకు ఎలా వస్తాయి.. ఇలాంటి సన్నివేశాలు ఇంకో రెండు మూడు చూస్తే మా జీవితం మీద మాకే విరక్తి కలుగుతుంది.. యాక్ థూ అంటూ ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు నెటిజనులు. -
కోతిని మింగేసిన కొండచిలువ..తరువాత ఏమైందంటే!
వడోదర: భారీ కొండచిలువ ఏకంగా ఓ కోతిని మింగేసింది. తరువాత కదల్లేక నదిలో ఉండిపోవడాన్ని అటవీ సిబ్బంది గమనించారు. పదడుగుల పొడవైన ఈ కొండచిలువను గుజరాత్ అటవీశాఖ అధికారులు మంగళవారం రక్షించారు. వడోదరలోని చిన్న నదిలో దీన్ని గుర్తించారు. ముగ్గురు రక్షకులు నది నుండి దీనిని బయటకు తీసారని, అనంతరం మింగేసిన కోతిని వాంతి చేసుకుందని గుజరాత్ అటవీ శాఖ అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం పైథాన్ ఆరోగ్యం బాగానే ఉందని అటవీ అధికారి శైలేష్ రావల్ తెలిపారు. ఈ కొండచిలువను బోనులో సురక్షితంగా ఉంచినట్టు వెల్లడించారు. అటవీశాఖ అనుమతి పొందిన తర్వాత జంబుగోడా వన్యప్రాణుల అభయారణ్యంలో ఈ కొండచిలువను విడుదల చేస్తామన్నారు. Gujarat Forest Department officials rescued a 10-foot long python from a small river in Vadodara. "It had swallowed a monkey and later unswallowed it. Python is in a good situation. We will release it in jungle once permission is obtained," said Shailesh Rawal, rescuer (09.08) pic.twitter.com/6DUUP00Ux9 — ANI (@ANI) August 10, 2021 -
చిన్నారి గొంతులో ఇరుక్కున్న ఉంగరం
చెన్నై: చిన్నారి గొంతులో చిక్కుకున్న ఉంగరాన్ని శివగంగై వైద్యులు తొలగించి రికార్డు సాధించారు. శివగంగై ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రి డీన్ రేవతి బుధవారం విలేకరులతో మాట్లాడుతూ మదురై మూకు ప్రాంతానికి చెందిన కళాశాల ప్రొఫెసర్ రామ్‌ప్రసాద్, నిరంజన దంపతుల కుమార్తె మదిమాల (02), ఇటీవల నిరంజన్ ధరించిన నాలుగు గ్రాముల బంగారు ఉంగరం జారి పడిపోవడంతో దాన్ని మింగేసిందని, తర్వాత కొద్దిసేపట్లో ఊపిరాడక వాంతి చేసిందన్నారు. దీంతో బిడ్డను శివగంగై పభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తీసుకెళ్లడంతో వెంటనే ఎక్స్‌రే తీశారని, దీంతో ఆహార నాలిక పైభాగంలో ఉంగరం ఉన్నట్లు తెలిసిందన్నారు. చిన్నారి ఉంగరాన్ని మింగడానికి ముందు ఆహారం తీసుకోవడంతో వెలికి తీయడానికి ఆటంకం ఏర్పడింది. మరుసటిరోజు ఉదయం మత్తు మందు ఇచ్చి వీడియో ఆప్టికల్ ఫోర్సెప్స్, రిజిడ్ ఎండోస్కోపీ ద్వారా ఉంగరాన్ని వెలికి తీసినట్లు తెలిపారు. ప్రస్తుతం బిడ్డ బాగుండడంతో గురువారం డిశ్చార్జ్ చేశారు. సమావేశంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ బాలమురుగన్, ఈఎన్టీ విభాగం హెడ్ నాగసుబ్రహ్మణ్యన్, ఆర్ఎంఓ రఫీ, వైద్యులు ఆనంద్, వైరవరాజన్, సుందరపాండియన్ వెంట ఉన్నారు. -
ఫైర్ లేడీ.. నిప్పు రవ్వలను మిఠాయిల్లా మింగేస్తోంది
సాధారణంగా నిప్పుతో ఎవరైనా చలి కాచుకుంటారు కానీ ఈ మహిళ నిప్పురవ్వలను మిఠాయిలు మింగినట్లు మింగేస్తుంది. అసలు ఇది సాహసమో లేక ఆకలేసి ఇలా తింటోందా అని చూసినవారంతా వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. కరోనాను ఎలా తగ్గించుకోవాలి అనే అంశంపై ఇటీవల సోషల్ మీడియాలో చాలా మంది చాలా రకాలుగా చెబుతున్నారు. ఈ మహిళ అవన్నీ చేసి చివరకు ఇలా వేడి వేడి నిప్పు రవ్వలను నోట్లో వేసుకొని లాగించేస్తోందని క్యాప్షెన్ పెట్టి ఈ వీడియోను ఓ ఐపీఎస్ అధికారి తన ట్విటర్లో పోస్ట్ చేశాడు. వివరాల్లోకి వెళితే.. కుర్చీలో తాపీగా కూర్చున్న ఓ మహిళ.. తన ఎదురుగా ఉన్న టేబుల్‌పైన ప్లేటులోని వెలుగుతున్న నిప్పురవ్వలు ఉంచుకుంది. మొదట చూసిన వారంతా ఆ మహిళ ఏదైనా వంట చేస్తుందేమో అనుకున్నారు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తు వాటిలోని నిప్పు రవ్వలను ఒక్కొక్కటీ నోట్లో వేసుకోవడం మొదలుపెట్టింది. ఈ వీడియోని ఐపీఎస్ ఆఫీసర్ రూపిన్ శర్మ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆమె ఫైర్ బాల్స్ మింగుతున్నప్పుడు సినిమాల్లో లాగా ఓ మ్యూజిక్‌ను కూడా జోడించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. మీరు మాత్రం ఇలాంటివి ట్రై చేయకండి అని నిపుణులు అంటున్నారు. ( చదవండి: ప్లీజ్..!అలా కొరక్కే అందరు మనవైపే చూస్తున్నారు ) After taking Steam..! After doing Gargling with SaltWater..! After drinking Milk with Turmeric..! After Drinking Hot Water Everyday..! This is the Last Option Available..! कोरोना जिंदा भस्म हो जाएगा...#DONT_TRY_THIS AT ALL.#VACCINE LAGAO BAS.@hvgoenka pic.twitter.com/2UFxZLbFAk — Rupin Sharma IPS (@rupin1992) May 8, 2021 -
పిల్లల గొంతుల్లో ఏదైనా ఇరుక్కుంటే...
చిన్నపిల్లలు ఏదైనా తినేటప్పుడు ఒక్కోసారి అకస్మాత్తుగా ఆహారపదార్థాలు గొంతులో ఇరుక్కునే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఈ కింది సూచనలు పాటించండి. పిల్లల్ల గొంతులో ఏదైనా ఆహార పదార్థం ఇరుక్కుంటే మనం కుర్చీలో కూర్చుని పిల్లలను కాళ్లపై బోర్లా పడుకోబెట్టాలి. ఇలా పడుకోబెట్టినప్పుడు తల కిందికి ఉండేలా చూడాలి. వీపుపై అకస్మాత్తుగా ఒత్తిడి తేవాలి. మన కాళ్ల ఒత్తిడి పిల్లల పొట్ట మీద పడి... అది పైకి ఎగబాకి, అడ్డుపడ్డ పదార్థం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇలా పడుకోబెట్టి అకస్మాత్తుగా ఒత్తిడి కలిగించేప్పుడు ఆ కదలికలను పై వైపునకు... అంటే నడుము నుంచి రెండు భుజాల మధ్యగా పై వైపునకు కదిలిస్తే, గొంతులో ఇరుకున్న పదార్థం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ సూచనలు ఫలించకపోతే చిన్నారులను వెంటనే ఆసుపత్రికి తరలించాలి. అక్కడ కొన్ని లారింగోస్కోపీ అనే పరికరం ద్వారా గొంతును పరీక్ష చేసి, అక్కడ ఇరుక్కున్న పదార్థాన్ని తొలగిస్తారు. -
టూత్‌బ్రష్ మింగేశాడు..
న్యూఢిల్లీ: గొంతును శుభ్రం చేసుకుంటున్న ఓ వ్యక్తి అనుకోకుండా టూత్‌బ్రష్‌ను మింగేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇది జరిగిన రెండు రోజలు తరువాత ఆ వ్యక్తికి ఎండోస్కోపీ నిర్వహించిన ఏయిమ్స్ వైద్యులు 12 సెం.మీల పొడువున్న బ్రష్‌ను అతని పొత్తికడుపు పై భాగం నుంచి బయటకు తీశారు. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీ సీమాపూరిలో నివాసం ఉంటున్న అవిద్ గతేడాది డిసెంబర్ 8వ తేదీన టూత్‌బ్రష్‌తో గొంతును బాగా శుభ్రం చేయాలని ప్రయత్నిస్తుండగా బ్రష్ గొంతు లోనికి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన అవిద్ తనకు కడుపులో నొప్పిగా ఉందంటూ ఓ ఆస్పత్రికి వెళ్లారు. అవిద్ అసలు విషయం చెప్పకపోవడంతో వైద్యులకు అతని కడుపు నొప్పికి గల కారణాలు తెలియలేదు. దీంతో వైద్యులు అతనికి సీటీ స్కాన్ నిర్వహించారు. అందులో అవిద్ కడుపులో ఏదో వస్తువు ఉన్నట్టు తెలింది. అప్పుడు అవిద్ వైద్యులకు అసలు విషయం చెప్పారు. బ్రష్‌ను బయటకు తీయడానికి ఆ ఆస్పత్రిలో సౌకర్యాలు లేకపోవడంతో అక్కడి వైద్యులు అవిద్ సమస్యను ఏయిమ్స్‌కు రిఫర్ చేశారు. అవిద్కు వైద్య పరీక్షలు నిర్వహించిన ఏయిమ్స్ వైద్యులు అతని ఉదరభాగంలో టూత్‌బ్రష్ చిక్కుకుని ఉందని.. అది గొంతు లోపలి ఇతర భాగాలకు ఎటువంటి హాని చేయలేదని తేల్చారు. డిసెంబర్ 10వ తేదీన అతని పొత్తికడుపు పైభాగంలో చిక్కుకున్న టూత్‌బ్రష్‌ను ఎండోస్కోపి చికిత్స ద్వారా బయటకు తీశారు. ఈ ఘటనపై ఎయిమ్స్ వైద్యులు ప్రవీణ్ అగర్వాల్ మాట్లాడుతూ.. చాలా మంది గొంతును శుభ్రం చేసుకోవడానికి టూత్‌బ్రష్ వాడతారని.. కానీ అలా చేయడానికి టంగ్ క్లీనర్ వాడటం మంచిదని తెలిపారు. -
గుండె దిటవు చేసుకుని ఇది చూడండి!
ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో.. కొన్ని సందర్భాల్లో అంతే క్రూరంగా మారుతుందనడానికి ఈ వీడియో ఓ ఉదాహరణ. తనలో సగం ఉన్న బతికున్న పామును మింగేసిన మరో పాము దాన్ని మళ్లీ విడిచిపెట్టింది. ఈ వీడియో సోషల్‌మీడియాలో షేర్ అవుతోంది. ఈ వీడియోను చూస్తుందటే ఒళ్లు జలదరిస్తుంది. నలుపు రంగులో ఉన్న ఓ భారీ పాము, గోధుమ రంగున్న ఓ పామును మింగేసింది. ఏమైందో ఏమో మళ్లీ దాన్ని వాంతి చేసుకుంది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గోధుమ రంగు పాము ఇంకా బతికే ఉంది. ఈ వీడియోను షేర్ చేసిన క్రిస్టోఫర్ రెనాల్డ్స్ అనే వ్యక్తి తన కుటుంబంతో ఔటింగ్‌కు వెళ్లిన సమయంలో దీన్ని చిత్రించినట్లు పోస్టు చేశాడు. ఈ వీడియోను చూసిన తన కుటుంబం షాక్‌కు గురైనట్లు పేర్కొన్నాడు. -
గుండె దిటవు చేసుకుని ఇది చూడండి!
-
చిన్నారి గొంతులో సీసా మూత..
వనపర్తి: ఎనిమిది నెలల బాలుడు సీసా మూతను మింగటంతో వైద్యులు చాకచక్యంగా వ్యవహరించి మూతను బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. ఈ ఘనత వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులకు దక్కింది. పెళ్లయిన పదేళ్లకు పుట్టిన బాబుకి ప్రమాదం తప్పడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. వనపర్తి జిల్లా కేంద్రం రాంనగర్ కాలనీకి చెందిన యాదగిరి, లత దంపతులకు ఎనిమిది నెలల దేవేంద్ర ఉన్నాడు. గురువారం ఇంట్లో ఆడుకుంటూ మెంతో ప్లస్ బామ్ మూత మింగడంతో అది గొంతులో ఇరుక్కుపోయింది. ఆహార వాహికకు అడ్డంగా ఉండిపోవడంతో తల్లిదండ్రులు స్థానిక ప్రభుత్వ, ప్రైవేట్‌ఆస్పత్రులకు వెళ్లినా ఎవరూ ధైర్యం చేయలేకపోయారు. గొంతులో మూత వాయునాళానికి అడ్డం పడితే ప్రాణాలకు ప్రమాదమని వైద్యులు హెచ్చరించారు. చివరి ప్రయత్నంగా వారు వనపర్తి ప్రజా వైద్యశాల ఆస్పత్రికి తీసుకెళ్లారు. తల్లిదండ్రులు ధైర్యంగా ఉంటామని హామీ ఇవ్వడంతో వైద్యులు ఎక్స్-రే తీసి మూత గొంతు కింది భాగంలో ఉందని గుర్తించారు. తర్వాత బాలుడికి మత్తు ఇచ్చి.. ఎలాంటి సర్జరీ లేకుండా ‘క్రొకడైల్ ఫిరెక్స్’ అనే పరికరం సహాయంతో డాక్టర్లు మురళీధర్, హరికిషన్ చాకచక్యంగా తొలగించారు. ఆ సందర్భంగా ప్రజావైద్యశాల నిర్వాహకుడు డాక్టర్ మురళీధర్ మాట్లాడుతూ మొదట్లో కర్నూల్‌కు రెఫర్ చేద్దామనుకున్నామన్నారు. అక్కడికి వెళ్లేలోపు ప్రమాదం జరగవచ్చని భావించి.. తల్లిదండ్రులు పూర్తిస్థాయిలో నమ్మకం ఉంచడంతోనే మూతను తొలగించామని చెప్పారు. -
ప్రతిఒక్కరూ డీఈసీ మాత్రలు మింగాలి
సూర్యాపేట : పట్టణంలోని 27, 28, 29, 30, 31వ వార్డుల్లో డీఈసీ మాత్రలు ప్రజలు వేసుకున్నారా లేదా అని కేంద్ర ప్రభుత్వ పైలేరియా ప్రతినిధి ఎం.లక్ష్మణ్ గురువారం అడిగి తెలుసుకున్నారు. కార్యాక్రమం నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా మలేరియా నియంత్రణ అధికారి ఓం ప్రకాష్ మాట్లాడుతూ ఎవరైనా డీఈసీ మాత్రలను మింగని వారు ఉంటే వారు తప్పకుండా మాత్రలు మింగాలని కోరారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి శుక్రవారం రోజు నిల్వ ఉన్న నీటిని తొలగించాలని, పరిశుభ్రతను పాటించాలని సూచించారు. ఆయన వెంట సీనియర్ ల్యాబ్ టెక్నిషియన్ శ్రీనాథ్, సబ్ యూనిట్‌అధికారి సముద్రాల సూరి, కస్తూరి నర్సింహ, స్వరూప, పుష్ప, స్రవంతి, సరిత, నాగలక్ష్మి తదితరులు ఉన్నారు. -
మింగేసిన ఆ మహా ప్రళయానికి పదేళ్లు
బాలీ: సొంత నివాసం ఎవరికైనా ఇష్టమే.. అది అందమైన అద్దాల భవంతి కావొచ్చు లేదా.. పండుగల వేళ చేత్తో అలుక్కుని ముగ్గులు పెట్టుకునే పూరిల్లు అయ్యుండొచ్చు. స్థాయికి తగినట్లుగా ఎవరికి వారు నిర్మించుకున్న నివాసం తమ ఊపిరిలో భాగంగా నిలుస్తుంది. అలాంటి నివాసం అనూహ్యంగా కళ్లముందే కనుమరుగై పోతే.. ఓ భూకంపం దాని అనంతరం వచ్చే సునామీ.. దాని వెంటే వచ్చిన ఓ బురద విళయం ఆ నివాసాన్ని నామ రూపాల్లేకుండా చేస్తే ఎలా ఉంటుంది. ప్రస్తుతం ఇండోనేషియాలోని పలు సముద్ర తీర ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. తాము తరతరాలుగా నివసిస్తున్న నివాసాలను అమాంతం 2006లో వచ్చిన ఓ భయంకరమైన భూవిలయం దాని కారణంగా పోటెత్తిన బురద ప్రవాహం ముంచెత్తింది. దాదాపు 40 వేల మంది నివాసాలను ప్రపంచపటంలో లేకుండా తుడిచిపెట్టేసింది. ఈ విలయంలో వేలమంది ప్రాణాలు కోల్పోయారు. వారి మృతదేహాలను కూడా తీసుకోలేని పరిస్థితిలో పదుల అడుగుల బురద వరద పోటెత్తి అయినవాళ్లందరిని మింగేసింది. ఇప్పుడు ఆ సంఘటన జరిగి నేటికి పదేళ్లు పూర్తవుతుంది. ఒక సంస్కృతి, సంప్రదాయలతో పచ్చగా కళకళలాడుతున్న ఆ నివాస ప్రాంతాలను తుడిచి పెట్టేసిన బురద ప్రళయం ఇప్పుడక్కడ మిగిల్చేందేమిటంటే.. వారి నివాస అవశేషాలు.. ఇళ్లు నిర్మించుకోలేని విధంగా మారిన భూస్వరూపాలు. ఇప్పుడక్కడికి సమీపంలోనే అక్కడక్కడ కొన్ని నివాసాల్లో ఉన్న మనుషుల పరిస్థితి మరీ దయనీయం. చనిపోయిన తమవారికి గుర్తుగా ఆ బురద పొర్లిన ప్రాంతంలో విగ్రహాల్లాంటి బొమ్మలు పెట్టారు. దయనీయంగా కనిపించే ఆ బొమ్మల దృశ్యాలే ప్రస్తుతం వారి కడుపు నింపుతున్నాయి. అవునూ.. ఆ ప్రాంతం ఇప్పుడు టూరిజం క్షేత్రంగా మారింది. వేలమందిని మింగేసిన ఆ ప్రాంతాన్ని చూసేందుకు పర్యాటకులు వస్తున్నారు. అలా వచ్చిన వారికి గతంలో ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితిని వివరించడంతోపాటు విళయానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తూ పోగోట్టుకున్న తమ వారి గురించి చెప్పుకుంటూ స్థానికులే టూరిస్టు గైడులుగా పనిచేసుకుంటూ జీవనం వెళ్లదీస్తున్నారు.