రాంచీ: జార్ఖండ్‌లోని రాంచీలో పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఓ చైన్ స్నాచర్ బంగారు గొలుసును మింగేశాడు. డోరండా పోలీస్ స్టేషన్ పరిధిలోని దుబాది వంతెన సమీపంలో సల్మాన్, జాఫర్ అనే ఇద్దరు స్నాచర్లు ఓ మహిళ మెడలోంచి బంగారు గొలుసు లాక్కెళ్లారు. గొలుసు లాక్కొని ఆ ఇద్దరు ద్విచక్రవాహనంపై పరారయ్యారు. అయితే, నేరం జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలోనే పోలీసులు ఉండడంతో.. ఇదంతా గమనించిన వారిని వెంబడించడం ప్రారంభించారు. సల్మాన్, జాఫర్‌లను పోలీసులు ఒక కిలోమీటరు మేర వెంబడించి పట్టుకున్నారు.
పోలీసుల బారి నుంచి తప్పించుకునేందుకు సల్మాన్ తీవ్రంగా ప్రయత్నాలు చేశాడు. చివరికి పోలీసుకు దొరికిపోయే పరిస్థితి ఏర్పడడంతో.. తన దొంగతనానికి ఆధారం లేకుండా చేసే క్రమంలో చోరీకి గురైన బంగారు గొలుసును మింగేశాడు. అయితే సల్మాన్ చైన్ మింగుతుండగా పోలీసు అధికారులు చూశారు. చివరికి సల్మాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పొత్తికడుపు, ఛాతీకి ఎక్స్ రే పరీక్షలు నిర్వహించారు. ఎక్స్-రేలో సల్మాన్ ఛాతీలో బంగారు గొలుసు ఇరుక్కుని ఉన్నట్లు స్పష్టమైంది.
దురదృష్టవశాత్తు, గొలుసు మింగిన కారణంగా, సల్మాన్ ఛాతీలో నొప్పిని మొదలై అది కాస్త తీవ్రతరం అయ్యింది. దీంతో తనని కాపాడాలని ఆ దొంగ పోలీసులను వేడుకోవడంతో ప్రస్తుతం అతని చికిత్స నిమిత్తం రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో చేర్పించారు. గ్యాస్ట్రోస్కోపీ, ఎండోస్కోపీ లేదా శస్త్రచికిత్స ద్వారా ఆ గొలుసును బయటకు తీసేందుకు వైద్యులు చికిత్స చేయనున్నారు. ప్రస్తుతం నిందితుడు రిమ్స్‌లో పోలీసుల నిఘాలో ఉన్నాడు.
చదవండి: నువ్వు ఊరిలో లేనప్పుడు నీ పెళ్లాం, పిల్లల పీకలు కోస్తా..
Comments
Please login to add a commentAdd a comment