gold chain
-
భార్యకోసం బంగారు గొలుసుకొన్నాడు.. దెబ్బకి కోటీశ్వరుడయ్యాడు!
భారతీయ సంతతికి చెందిన వ్యక్తి భార్య కోసం బంగారు గొలుసు కొనుగోలు చేసి జాక్‌పాట్ దక్కించు కున్నాడు. ఒకటీ రెండూ కాదు ఏకంగా రూ. 8 కోట్ల లాటరీ గెల్చుకున్నాడు. ప్రస్తుతం ఈ స్టోరీ నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఎక్కడ? ఎలా? అని ఆసక్తిగా ఉంది కదూ? అయితే క్షణం ఆలస్యం చేయకుండా వివరాలు తెలుసుకుందాం పదండి! సింగపూర్‌లో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి రాత్రికి రాత్రికే కోటీశ్వరుడయ్యాడు. మూడు నెలల క్రితం భార్య సంతోషం కోసం సుమారు రూ. 3 లక్షల రూపాయలతో ఒక గోల్డ్ చైన్ కొన్నాడు. ప్రతీ ఏడాది నిర్వహించే లాటరీలో భాగంగా గత ఆదివారం (నవంబర్ 24) జ్యువెలరీ కంపెనీ నిర్వహించిన లక్కీ డ్రాలో 8 కోట్ల రూపాయలకు పైగా బహుమతిని గెలుచుకున్నాడు. దీంతో కుటుంబం అంతా సంతోషంతో పొంగిపోయింది. “ఈ రోజు మా నాన్నగారి నాలుగో వర్ధంతి.. ఇది ఆయన ఆశీర్వాదం’’ అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు చిదంబరం. సింగపూర్‌లో ఉన్న ఇన్నాళ్లకు అదృష్టం వరించిందనీ, తన తల్లితో ఈ శుభవార్త పంచుకోవాలంటూ సంతోషం వ్యక్తం చేశాడు. తనకు వచ్చిన ఈ డబ్బులో కొంత సమాజానికి విరాళంగా ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలిపాడు.ముస్తఫా జ్యువెలరీ షాపులో 250 సింగపూర్ డాలర్ల కన్నా ఎక్కువ విలువైన ఆభరణాలు కొనుగోలు చేసిన వారు లక్కీ డ్రాకి అర్హులు. ఈ లక్కీ డ్రాలో సింగపూర్‌లో 21 ఏళ్లుగా ప్రాజెక్ట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న బాలసుబ్రమణ్యం చిదంబరం టాప్ ప్రైజ్‌ని కైవసం చేసుకున్నట్లు ఆసియా వన్ తెలిపింది. ఈయనతోపాటు మరి కొంతమందికి కూడా భారీ బహుమతులను అందించినట్టు కంపెనీ తెలిపింది. View this post on Instagram A post shared by Mustafa Jewellery Singapore (@mustafajewellerysg) -
బర్రె కోసం 10 కిలోల బంగారు చైన్
-
అద్దెకివ్వడమే శాపమయ్యింది! ఏకంగా ప్రియుడితో కలిసి..
యశవంతపుర: కోనసంద్రలో ఈ నెల 10న జరిగిన దివ్య అనే మహిళ హత్య కేసును కెంగేరి పోలీసులు ఛేదించారు. ఇంటిలో అద్దెకు ఉన్న యువతి దివ్యను గొంతు పిసికి చంపేసినట్లు నిర్ధారించారు నిందితురాలిని అరెస్ట్ చేశారు. వివరాలు.. గురుమూర్తి, దివ్య దంపతులకు చెందిన ఇంటిలోని ఒక పోర్షన్లో కోలారు జిల్లాకు చెందిన మోనిక (24) అనే యువతి అద్దెకు ఉండేది. ప్రియుడినే భర్తగా చూపి ఇల్లు అద్దెకు తీసుకుంది. ప్రైవేట్ సంస్థలో డేటా ఎంట్రీ అపరేటర్‌గా పని చేస్తుంది. ప్రియుడు అప్పుడప్పుడు వచ్చి వెళ్లేవాడు. విలాసాలకు అలవాటు పడిన మోనిక తన ప్రియుడికి క్యాంటర్ వాహనం కొనివ్వాలని డబ్బు కోసం ప్రయత్నించింది. ఇంటి యజమాని దివ్య మెడలో ఉన్న బంగారంపై మోనికాకు కన్నుపడింది.దివ్య భర్త గురుమూర్తి కెంగేరి శివనపాళ్యంలో సెలూన్ నడుపుతుండగా, అత్తమామలు ఉదయం పనులకెళ్లి రాత్రికి వచ్చేవారు. దివ్య తన రెండేళ్ల చిన్నారితో ఇంటిలో ఉండేది. గమనించిన మోనిక.. ఈ నెల 10న ప్రియునితో కలసి దివ్యను గొంతుపిసికి హత్య చేసి ఆమె మెడలోని 36 గ్రాముల బంగారం చైన్ తీసుకొని ఉడాయించారు. పోలీసులు అనుమానంతో మోనికను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా అసలు విషయం బయట పడింది. ప్రియుడు పరారీలో ఉన్నట్లు తెలిసింది. -
తునికి నల్లపోచమ్మ అమ్మవారి గొలుసు.. అసలు ఏమైంది..??
మెదక్: తవ్వినకొద్దీ అక్రమాలే.. అన్నట్లుగా మారింది ఏడుపాయల ఆలయ ఈఓ వ్యవహార శైలి. వనదుర్గామాత ఆభరణాల వ్యవహారం ఇంకా సమసిపోకముందే తునికి నల్లపోచమ్మ అమ్మవారి గొలుసు విషయం తెరమీదకు వచ్చింది. మొక్కులో భాగంగా 2018లో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అమ్మవారికి బంగారు గొలుసును సమర్పించారు. దీనిని అప్పటి ఈఓ శ్రీనివాస్‌కు అప్పగించారు. కాగా ప్రస్తుతం ఆ గొలుసు రికార్డుల్లో లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. బయటకొచ్చింది ఇలా.. 2016 నుంచి 2019 వరకు కౌడిపల్లి మండలం తునికినల్ల పోచమ్మ ఆలయంలో శ్రీనివాస్ ఈఓగా విధులు నిర్వర్తించారు. అప్పట్లో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అమ్మవారికి 5 తులాల బంగారు గొలుసును బహూకరించారు. 2019 జూన్‌లో ఈఓ శ్రీనివాస్ ఏడుపాయల ఆలయానికి బదిలీ కాగా, ఆయన స్థానంలో మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ఎమ్మెల్యే దంపతులు నల్లపోచమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయానికి వస్తున్నారని, ఆయన అందించిన బంగారు గొలుసును అమ్మవారికి అలంకరించాలని ఆలయ చైర్మన్ గోపాల్‌రెడ్డి ప్రస్తుత ఈఓ మోహన్‌రెడ్డికి సూచించారు. కాగా.. శ్రీనివాస్ బదిలీ అయిన సమయంలో తనకు చెక్‌బుక్, క్యాష్‌బుక్‌లు మాత్రమే ఇచ్చారని, అమ్మవారి ఆభరణాలు ఏమీ ఇవ్వలేదంటూ మోహన్ రెడ్డి చెప్పడంతో అసలు విషయం బయటకువచ్చింది. ఆలయానికి సంబంధించిన లావాదేవీల వివరాలను ఎందుకు రికార్డు చేయలేదనే ప్రశ్న తలెత్తుతుంది. ఎమ్మెల్యే బహూకరించిన గొలుసునే రికార్డులో లేదంటే మామూలు భక్తులు అందించిన కానుకల మాటేమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నల్లపోచమ్మ అమ్మవారి గొలుసు విషయంపై ఈఓ సార శ్రీనివాస్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. ఎమ్మెల్యే మదన్‌రెడ్డి బంగారు చైన్ బహూకరించిన మాట వాస్తవమేనని అంగీకరించారు. కాగా అది తన సంరక్షణలోనే ఉందని చెప్పడం కొసమెరుపు. -
పట్టపగలే కారంపొడి చల్లి..
చెళ్లకెర రూరల్ : నగరంలోని పావగడ రోడ్డులో ఉన్న దవనం టెక్స్టైల్స్ దుకాణంలో పట్టపగలే దుండగులు యజమానిపై కారంపొడి చల్లి బంగారు చైన్‌ను లాక్కెళిన ఘటన ఆదివారం జరిగింది. ఉదయం యజమాని గోవిందరాజు దుకాణంలో ఉండగా ముగ్గురు దుండగులు దుకాణంలోకి వచ్చారు. వచ్చి రాగానే గోవిందరాజు కళ్లల్లో కారంపొడి చల్లి అతని మెడలో ఉన్న 45 గ్రాముల బంగారు చైన్ లాక్కొని ఉడాయించారు. సమాచారం అందుకున్న డీఎస్పీ పీటీబీ రాజన్న, సీఐ ఆర్ఎఫ్ దేశాయి, ఎస్ఐ సతీశ్ నాయక్ తదితరులు పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
షిర్డీ రైలులో చైన్ లాగి బ్యాగులతో పరుగు.. అప్రమత్తమైన ప్రయాణికులు
ఖలీల్‌వాడి: నిజామాబాద్ మీదుగా తిరుపతి నుంచి షిర్డీ వెళ్తున్న సాయినగర్ షిర్డీ రైలులో దొంగతనానికి పాల్పడిన తొమ్మిది మంది యువతులను ప్రయాణికులు పట్టుకుని రైల్వే పోలీసులకు అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల నుంచి 3 గంటల మధ్య ఈ ఘటన జరిగింది. రైలు నిజామాబాద్ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరిన తర్వాత నవీపేట్ స్టేషన్ వద్ద క్రాసింగ్ ఉండటంతో అక్కడ అగిపోయింది. దీంతో మహారాష్ట్రలోని బిడ్ జిల్లాకు చెందిన తొమ్మిది మంది యువతులు రైలులో ఎక్కారు. యువతులు ఎస్1 నుంచి ఎస్10 బోగీలలో అటుఇటూ తిరిగినట్లు ప్రయాణికులు తెలిపారు. మొదట ఓ బోగీలో ప్రయాణికుడి బ్యాగ్ కనబడకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. అప్రమత్తమైన ఆ కోచ్‌లోని మిగతా వారు తమ బ్యాగ్‌లను చెక్ చేసుకోగా మరో ఆరుగురికి చెందిన బ్యాగులు కూడా కనిపించలేదు. దీంతో బోగీలో కలకలం రేగింది. కొందరు ప్రయాణికులు బాసర వద్ద ట్రైన్ చైన్ లాగడంతో ఆగిపోయింది. ఈ క్రమంలో కొందరు యువతులు బ్యాగులతో పరుగెత్తడంతో ప్రయాణికులు పట్టుకున్నారు. బాసర పోలీసులకు సమాచారం అందించి, మొత్తం తొమ్మిది మందిని అప్పగించారు. ఆర్ఎస్ఎఫ్, బాసర పోలీసులు అక్కడి నుంచి యువతులను నిజామాబాద్ రైల్వే పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విచారిస్తున్న రైల్వే పోలీసులు రంగస్వామి అనే ప్రయాణికుడికి చెందిన బ్యాగ్‌తో పాటు ల్యాప్‌టాప్, కొంత నగ దు, ఓ మహిళ మెడలోని బంగారు చైన్ పోయినట్లు తెలిసింది. పావని, ధనుంజయ్, షేక్ నజీర్‌బాషా, లీలావతి, సుబ్బారాయుడు, శ్రీనివాస్ అనే ప్రయాణికుల బ్యాగ్‌లు పోయాయి. మూడు బ్యాగ్‌ల ను పోలీసులు రైల్వేపట్టాల పక్కన గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కొన్ని బ్యా గులను యువతులు బాత్రూంలలో పె ట్టినట్లు తెలిసింది. అదుపులోకి తీసుకు న్న తొమ్మిది మందిని రైల్వే పోలీసులు విచారిస్తున్నారు. యువతులు నాందేడ్‌లోని గురుద్వార్‌కు వెళ్లి అక్కడ నుంచి నిజామాబాద్ వచ్చినట్లు తెలిసింది. -
బంగారం గొలుసు కొట్టేసి.. కాపాడమని పోలీసులను వేడుకున్న దొంగ!
రాంచీ: జార్ఖండ్‌లోని రాంచీలో పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఓ చైన్ స్నాచర్ బంగారు గొలుసును మింగేశాడు. డోరండా పోలీస్ స్టేషన్ పరిధిలోని దుబాది వంతెన సమీపంలో సల్మాన్, జాఫర్ అనే ఇద్దరు స్నాచర్లు ఓ మహిళ మెడలోంచి బంగారు గొలుసు లాక్కెళ్లారు. గొలుసు లాక్కొని ఆ ఇద్దరు ద్విచక్రవాహనంపై పరారయ్యారు. అయితే, నేరం జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలోనే పోలీసులు ఉండడంతో.. ఇదంతా గమనించిన వారిని వెంబడించడం ప్రారంభించారు. సల్మాన్, జాఫర్లను పోలీసులు ఒక కిలోమీటరు మేర వెంబడించి పట్టుకున్నారు. పోలీసుల బారి నుంచి తప్పించుకునేందుకు సల్మాన్ తీవ్రంగా ప్రయత్నాలు చేశాడు. చివరికి పోలీసుకు దొరికిపోయే పరిస్థితి ఏర్పడడంతో.. తన దొంగతనానికి ఆధారం లేకుండా చేసే క్రమంలో చోరీకి గురైన బంగారు గొలుసును మింగేశాడు. అయితే సల్మాన్ చైన్ మింగుతుండగా పోలీసు అధికారులు చూశారు. చివరికి సల్మాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పొత్తికడుపు, ఛాతీకి ఎక్స్ రే పరీక్షలు నిర్వహించారు. ఎక్స్-రేలో సల్మాన్ ఛాతీలో బంగారు గొలుసు ఇరుక్కుని ఉన్నట్లు స్పష్టమైంది. దురదృష్టవశాత్తు, గొలుసు మింగిన కారణంగా, సల్మాన్ ఛాతీలో నొప్పిని మొదలై అది కాస్త తీవ్రతరం అయ్యింది. దీంతో తనని కాపాడాలని ఆ దొంగ పోలీసులను వేడుకోవడంతో ప్రస్తుతం అతని చికిత్స నిమిత్తం రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో చేర్పించారు. గ్యాస్ట్రోస్కోపీ, ఎండోస్కోపీ లేదా శస్త్రచికిత్స ద్వారా ఆ గొలుసును బయటకు తీసేందుకు వైద్యులు చికిత్స చేయనున్నారు. ప్రస్తుతం నిందితుడు రిమ్స్‌లో పోలీసుల నిఘాలో ఉన్నాడు. చదవండి: నువ్వు ఊరిలో లేనప్పుడు నీ పెళ్లాం, పిల్లల పీకలు కోస్తా.. -
అమ్మకి చిరు కానుక.. ఆమె రియాక్షన్ ఇది
వైరల్: సృష్టిలో వెల కట్టలేనిది అమ్మ ప్రేమ. ప్రపంచంతో సంబంధం లేనట్లు కేవలం ఇంటికే పరిమితమై కుటుంబాల కోసం కష్టపడే తల్లులకు సలాం. అయితే.. వాళ్లపై ప్రేమను ప్రదర్శించేందుకు బిడ్డలు చిరు కానుకలు ఇవ్వడంలో ఏమాత్రం తప్పులేదు. అలాంటి కానుకనే ఇచ్చి.. అమ్మను సర్ప్రైజ్ చేశాడు ఓ తనయుడు. ఆ వీడియోనే ఇప్పుడు ట్విటర్ ద్వారా వైరల్ అవుతోంది. కుటుంబం కోసం ఇంట్లోనే అహర్నిశలు కష్టపడే ఓ అమ్మ.. వంటను సిద్ధం చేస్తూ ఉంటుంది. వెనుక నుంచి బంగారు గొలుసుతో వెళ్లి ఆమె మెడలో సర్ప్రైజ్ చేశాడు ఆ తనయుడు. ఊహించని ఆ పరిణామాన్ని నవ్వుతో సరిపెట్టుకున్న ఆ తల్లి.. ఆ గొలుసును చూసుకుంటూ మురిసిపోతుంటుంది. छोटा सा गिफ्ट मम्मी के लिए 👩❤️💋👨🎁💐 pic.twitter.com/WPUc7fTvRj — ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) November 14, 2022 -
పిడుగుపాటుకు ఒంటికి అతుక్కున్న స్వర్ణం
ఆదిలాబాద్ రూరల్: పిడుగుపాటుకు మృతి చెందడం.. గాయపడటం సాధారణం. కానీ పిడుగుపాటు వేడికి ఒక మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసు కరిగి పోయి ఆమె శరీరానికి అతుక్కుపోయి ఆమెను ఆస్పత్రిపాల్జేసింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ రూరల్ మండలంలో జరిగింది. మండలంలోని పొచ్చర గ్రామ సమీపంలోని దిమ్మ గ్రామ శివారులో శుక్రవారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో భారీ పిడుగు పడింది. సమీపంలోనే వ్యవ సాయ పనుల్లో శ్వేత నిమగ్నమై ఉండగా.. పిడుగు పడింది. దీంతో వెలువడిన వేడిమికి ఆమె మెడలోని బంగారు గొలుసు కరిగిపోయి శరీరానికి అతుక్కు పోయింది. వెంటనే స్థానికులు ఆమెను 108లో రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
కూల్ డ్రింక్‌లో నిద్ర మాత్రలు కలిపి.. ఆమె పడుకోగానే..
సాక్షి,మాచారెడ్డి(నిజామాబాద్): ఓ వృద్ధురాలికి కూల్ డ్రింక్‌లో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చేశారు. ఈ ఘటన శనివారం రాత్రి చుక్కాపూర్లో చోటు చేసుకుంది. ఎస్సై సంతోష్‌కుమార్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చిలుక లక్ష్మి కుటుంబ సభ్యులు ఊరు వెళ్లడంతో ఆమె ఒంటరిగా ఉంది. ఇది గమనించిన ఆమె ఇంటి పక్కన ఉండే రాములు ఆమెకు నిద్రమాత్రలు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి తాగించాడు. ఆమె నిద్రపోగానే మెడలో ఉన్న బంగారు గొలుసును అపహరించాడు. ఉదయం లేచిన లక్ష్మి మెడలో గొలుసు లేకపోవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. చదవండి: కుక్క కరిచిందా.. అయితే రూ.10వేలు తీసుకోవడం మరచిపోకండి! -
పటాన్చెరులో ఘరానా మోసం... మూడు తులాల బంగారం తీసుకొని
సాక్షి, పటాన్చెరు(మెదక్): బంగారం, వెండి ఆభరణాలను శుభ్రం చేస్తామని వచ్చి మోసం చేసేందుకు యత్నించిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన పటాన్చెరు పట్టణంలోని లక్కదొడ్డి కాలనీలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌కు చెందిన ఆనంద్‌కుమార్ సాహా, రాజ్‌కుమార్ సాహాలు లక్కదొడ్డి కాలనీకి వచ్చారు. సుకన్య అనే మహిళకు మాయమాటలు చెప్పి నల్లగా ఉన్న పుస్తెలతాడును శుభ్రం చేస్తామని చెప్పి తీసుకున్నారు. వారి వెంట తెచ్చుకున్న కొన్ని రసాయనాలల్లో పుస్తెలతాడును ముంచి తీశారు. అంతే మూడు తులాలు ఉన్న పుస్తెలతాడు రెండు తులాలు కరిగిపోయి తెగిపోయింది. దీంతో అనుమానం వచ్చిన సుకన్య నిలదీసేలోపే ఒక నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించారు. గట్టిగా అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చి వారిద్దరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వారిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు క్రైం సీఐ శ్రీనివాసులు పేర్కొన్నారు. పట్టుబడిన ఇద్దరు బీహార్‌కు చెందిన వారని, మహారాష్ట్ర సోలాపూర్‌కు రాత్రి వచ్చి ఉదయం పటాన్చెరు వచ్చినట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొత్త వ్యక్తులు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. -
‘పెద్దన్న’ మూవీ డైరెక్టర్‌కు రజనీ సర్ప్రైజింగ్ గిఫ్ట్
Rajinikanth Surprising Gift To Annatha Director Siruthai Siva: సూపర్ స్టార్ రజనీకాంత్ దర్శకుడు పెద్దన్న మూవీ డైరెక్టర్ శివకు సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయం కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. డైరెక్టర్ శివ ఇంటికి వెళ్లి మరి రజనీ ఆయనకు బహుమతి ఇవ్వడమే కాకుండా ఆయన కుటుంబ సభ్యులతో మూడు గంటల పాటు ముచ్చటించాడట. కాగా రజనీకాంత్ ఇటీవల నటించిన అన్నాత్తై(తెలుగులో ‘పెద్దన్న’ గా విడుదల చేశారు)సూపర్ హిట్ అయిన నేపథ్యంలో రజనీ స్పెషల్‌గా డైరెక్టర్ ఇంటికి వెళ్లాడు. అంతేగాక తనతో ఓ బంగారు చెయిన్‌ను తీసుకెళ్లి డైరెక్టర్ శివకు గిఫ్ట్‌గా ఇచ్చాడట. చదవండి: Pushpa Movie: సమంత స్పెషల్ సాంగ్‌పై ట్రోల్స్ కాగా రజనీ సడెన్‌గా తన ఇంటికి వెళ్లడమే కాకుండా బాహుమతి ఇవ్వడంతో డైరెక్టర్ శివ, అతడి కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగితేలుతున్నారు. రజనీకాంత్, మాస్ డైరెక్టర్ శివ కాంబినేషన్లో వచ్చిన ‘అన్నాత్తై’ చిత్రం తెలుగులో ‘పెద్దన్న’ గా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రజనీ సరసన నయనతార హీరోయిన్గా నటించగా కీర్తి సురేశ్ సోదరి పాత్రలో కనిపించింది. ఖుష్బూ, మీనా, జగపతి బాబు, ప్రకాశ్‌రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. చదవండి: బయటకొచ్చిన కత్రినా-విక్కీల హల్ది ఫంక్షన్ ఫొటోలు దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ తెలుగులో పెద్ద హిట్ కాకపోయిన తమిళంలో మంచి వసూళ్లు రాబట్టింది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన అన్నాత్తై ఓటీటీలో కూడా ట్రెండ్ అవుతోంది. ఈ క్రమంలో హ్యాపీగా ఫీలైన రజనీ.. శివ ఇంటికి వెళ్లి మరి ఆయనను, అతడి కుటుంబ సభ్యులను పలకరించాడు. అంతేగాక మూడు గంటలపాటు వారితో ముచ్చటించాక గోల్డ్ చెయిన్‌ను బహుమతిగా అందజేశాడు. -
మాయలేడి: ఇంట్లోకి వచ్చి ఎంత పని చేసిందంటే..!
కర్నూలు (టౌన్): కోవిడ్ వ్యాక్సిన్ పేరుతో ఓ మాయలేడి ఇంట్లోకి వచ్చి ఓ మహిళను క్షణాల్లో బురిడీ కొట్టించి బంగారు గొలుసుతో ఉడాయించింది. శుక్రవారం నగరంలోని స్టాంటన్‌పురంలో కళావతమ్మ అనే మహిళ ఇంటికి ఓ గుర్తు తెలియని మహిళ వచ్చి కోవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు వచ్చానని నమ్మించింది. చదవండి: Anantapur: ఆగని టీడీపీ అరాచకం వ్యాక్సిన్ వేసే ముందుగా కళ్లలో రెండు చుక్కలు మందు వేసుకోవాలని చెప్పి బాధితురాలి కళ్లలో చుక్కలు వేయడంతో కళ్లు మూసుకుంది. ఇదే అదునుగా భావించి కళావతమ్మ మెడలోని 25 గ్రాముల బరువున్న బంగారు గొలుసును మాయలేడి తెంపుకుని ఉడాయించింది. బాధితురాలు గట్టిగా కేకలు వేసుకుంటూ బయటకు వచ్చి చూసినా గుర్తు తెలియని మహిళ కనిపించలేదు. దీంతో అర్బన్ తాలూకా పోలీసు స్టేషన్ చేరుకుని ఫిర్యాదు చేయడంతో, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
గర్ల్ ఫ్రెండ్‌కు బంగారు గొలుసు గిఫ్ట్‌గా ఇచ్చి కట్టు కథ అల్లారు! చివరికి..
రాజ్‌కోట్: కొన్ని నేరాలు చూస్తుంటే నిజంగా కామెడిగా ఉంటాయి. అసలు వాళ్లు తెలియక చేస్తున్నారో లేక తెలిసి చేస్తున్నారో కూడా అర్థం కాదు. అచ్చం అలానే ఇక్కడొక తల్లికొడుకులు నేరాన్ని కప్పి ఉంచే ప్రయత్నం చేసి పోలీసులకు దొరికిపోయారు. (చదవండి: అమెరికా పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ అధ్యక్షురాలిగా భారత సంతతి మహిళ) అసలు విషయంలోకెళ్లితే...జామ్‌నగర్‌లోని నవగం ఘేడ్ ప్రాంతంలో నివాసిస్తున్న ఒక మహిళ తన ఇంట్లో ముగ్గురు దొంగలు చొరబడి 11 తులాల బంగారపు గొలుసు, రూ.30 వేల నగదు ఎత్తుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు ఆ దొంగను తన కొడుకు కొంత దూరం వెంబడించాడని పోలీసులకు చెబుతుంది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేయడం ప్రారంభిస్తారు. ఈ మేరకు పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన కూడా ఎలాంటి అనుమానస్పద దృశ్యం కనిపించలేదు. దీంతో సదరు మహిళ కొడుకు బాబుని విచారించగా ఆ గొలుసు తాను విడాకులు తీసుకున్న మాజీ భార్య తల్లిదండ్రులు పెట్టిన గొలుసు అని, తన గర్లఫ్రెండ్‌కి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చే నిమిత్తం అమ్మేసినట్లు చెబుతాడు. అంతేకాదు రెండు రోజుల క్రితం అతని అన్న బాబుని బంగారు గొలుసు గురించి ఆరా తీయడంతో కొడుకు చేసిన పనిని కప్పి ఉంచే ప్రయత్నంలో తల్లి కొడుకులిద్దరూ కలిసి ఈ కథ అల్లినట్లు పోలీసులు నిర్థారించారు. (చదవండి: సాయం" అనే పదానికి అంతరాలు ఉండవంటే ఇదేనేమో...!!) -
ఒంటరిగా వున్న ఇద్దరు వృద్ధ మహిళల గొంతు కోసి..
సాక్షి, చిక్కడపల్లి( హైదరాబాద్): ఇంట్లో ఒంటరిగా ఉన్న ఇద్దరు వృద్ధ మహిళలపై మిట్ట మధ్యాహ్నం చాకుతో దాడి చేసి గాయపరిచి దోపిడీకి యత్నించి పరారవుతున్న ఓ ఆగంతకుడిని అపార్ట్మెంట్ వాచ్మెన్, స్థానికులు పట్టుకుని చిక్కడపల్లి పోలీసులకు అప్పగించారు. దాడిలో గాయపడిన ఇద్దరు మహిళలు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారు కోలుకుంటున్నారని పోలీసులు తెలిపారు. సీఐ పాలడుగు శివశంకర్‌రావు, ఎస్ఐ.ప్రేమ్ వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం కొర్రపట్టి వారిపాలెం గ్రామానికి చెందిన బీటెక్ చదవి నిరుద్యోగిగా ఉన్న కోట నరేంద్ర (27) హైదరాబాద్‌లోని యుసుఫ్‌గూడలోని రహమత్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. జనసమ్మర్థం తక్కువగా ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా ఎంచుకుని దోపిడీలకు పాల్పడుతున్నాడు. ఇందులో భాగంగా దోమలగూడ ప్రాంతాన్ని తమకు అనువైన ప్రాంతంగా ఎంచుకున్నారు. ఈనెల 18న దోమలగూడలోని సుభాగ్య అపార్ట్మెంట్ నాలుగో అంతస్తులో హైకోర్టులో పనిచేసి రిటైర్ అయిన సీతా భాగ్యలక్ష్మి (61) ఉంటున్నది. వద్దకు కేన్సర్‌తో బాధపడుతున్న ఆమె చెల్లెలు జోత్స్నరాణి (66) ఇంటికి ఇటీవల వచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఒక వ్యక్తి సీతాభాగ్యలక్ష్మి ఉంటున్న అపార్ట్మెంట్లోకి కత్తితో ప్రవేంశించాడు. వారిపై కత్తితో దాడి చేశాడు. దీంతో వారు అరవడంతో ఇంటి లోపలి నుంచి వచ్చిన చెల్లెలు సీతపై కూడా కత్తితో గొంతుపై ఇతర భాగాలపై దాడి చేశాడు. వెంటనే తేరుకున్న వారు పెద్దగా అరవడంతో దాడి చేసిన వ్యక్తి అపార్ట్మెంట్ మెట్ల మార్గం నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అపార్ట్మెంట్ వాచ్మెన్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. విషయాన్ని 100 సిబ్బంది ద్వారా చిక్కడపల్లి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చిక్కడపల్లి పోలీసులు నిందితుడిపై 313, 393, 452, సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
యాచకుల మధ్య వివాదం.. నాలుగు తులాల గొలుసు దొరికింది..
సాక్షి, చాంద్రాయణగుట్ట(హైదరాబాద్): రోడ్డుపై దొరికిన బంగారాన్ని పంచుకునే క్రమంలో యాచకుల మధ్య తలెత్తిన వివాదం చివరకు పోలీసుల వరకు వెళ్లి గొలుసు పోగొట్టుకున్న మహిళకు ఊరట కలిగించింది. వివరాల్లోకి వెళితే....ఈ నెల 25న ఉప్పుగూడ తానాజీనగర్‌కు చెందిన స్వాతి అనే మహిళ చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంతో పాటు మరికొన్ని ఆలయాల్లో దర్శనానికి వెళ్లిన క్రమంలో నాలుగు తులాల బంగారు గొలుసును పోగొట్టుకుంది. ఈ విషయమై ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉండగా ఈ గొలుసు చార్మినార్ వద్ద యాచకులకు దొరికింది. దీనిని పంచుకునే క్రమంలో వారి మధ్య వివాదం తలెత్తింది. దీంతో వీరిలో ఒకరు చివరకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు గొలుసును స్వాధీనం చేసుకొని ఛత్రినాక పోలీసులకు అప్పగించారు. ఈ గొలుసు స్వాతికి చెందిందని నిర్ధారించిన పోలీసులు....ఆమెకు అప్పగించనున్నట్లు వెల్లడించారు. -
ఇంటి తవ్వకాల్లో బయటపట్ట బంగారం
న్యూశాయంపేట/వరంగల్ : వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి ప్రాంతంలో ఇంటి నిర్మాణానికి కందకాలు తీస్తుండగా బంగారు గొలుసు బయటపడింది. దీని పంపకం విషయమై కూలీల గొడవతో విషయం బయటపడగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు... బొమ్మలగుడి ప్రాంతానికి చెందిన గొలికారి రమేష్ పాత ఇంటి స్థానంలో నూతన నిర్మాణ పనులను బిల్డర్‌కు అప్పగించాడు. ఆయన కాట్రపల్లికి చెందిన కూలీలతో బుధవారం కందకాలు తవ్విస్తుండగా మూడున్నర తులాల బంగారు గొలుసు బయటపడింది. అయితే, గొలుసు పంపకంపై కూలీలు గొడవ పడుతుండగా ఆనోట ఈనోట విషయం బయటపడింది. దీంతో ఎస్ఐ సతీష్ చేరుకుని కూలీలు విచారించి గొలుసు స్వాధీనం చేసుకున్నారు. అయితే, పాత ఇళ్లు 30 నుంచి 40 ఏళ్ల క్రితం నిర్మించిన నేపథ్యంలో తమ పూర్వీకులు ఇంకా ఏమైన ఆభరణాలు దాచిపెట్టారా అనే అనుమానాల్ని యజమాని వ్యక్తం చేశారు. -
పిల్లి కోసం కిందకు వంగడంతో..
సాక్షి, గన్నవరం: పాత సామాను కొంటానని నమ్మించిన ఓ దుండగుడు మహిళ మెడలోంచి బంగారు గొలుసు లాక్కొని ఉడాయించాడు. గన్నవరం మండలం కేసరపల్లిలో ఈ ఘటన జరిగింది. బాధితురాలి వివరాల మేరకు.. కేసరపల్లిలోని పంచాయతీ కార్యాలయం సమీపంలో మూల్పూరు పద్మావతి అనే వివాహిత నివాసముంటోంది. శుక్రవారం మధ్యాహ్నం బైక్‌పై వచ్చిన ఓ యువకుడు.. మీ ఇంట్లో పాత టీవీలు, లేదా సామానులు ఉంటే కొనుగోలు చేస్తాను ఉన్నాయా అని అడిగాడు. అలాంటివేమీ లేవని పద్మావతి సమాధానం ఇచ్చింది. అదే సమయంలో ఇంట్లో ఉన్న పిల్లి పిల్లలను చూసిన అతను ఒక పిల్లను ఇస్తే పెంచుకుంటానని కోరాడు. దీనికి అంగీకరించిన పద్మావతి పిల్లి పిల్లను యువకుడికి అందించేందుకు కిందకు వంగింది. అదే సమయంలో యువకుడు ఆమె మెడలో ఉన్న 6 కాసుల బంగారు గొలుసు లాక్కొని, అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న బైక్‌పై పరారయ్యాడని బాధితురాలు తెలిపింది. రెప్పపాటులో మెడలో గొలుసు లాక్కొని దుండగుడు జారుకున్నాడని వాపోయింది. ఈమేరకు గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పంచాయతీ కార్యాలయంలో ఉన్న సీసీ టీవీ పుటేజ్ పరిశీలించిన పోలీసులు నిందితుడు కోసం గాలిస్తున్నారు. (చదవండి: కరోనా బాధితురాలిపై డ్రైవర్ లైంగిక దాడి) -
జీడిపప్పుకు ఆశపడి..
టీనగర్ : జీడి పప్పు బస్తాలు ఇస్తానని చెప్పి రూ. 50 వేల నగదు, బంగారు చైన్‌ను అపహరించిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. చెన్నై రాయపేట అవ్వై శన్బుగం రోడ్డులో ఈరోడ్డుకు చెందిన వెంకటేష్(42) జీడీ పప్పు దుకాణం నడుపుతున్నాడు. ఈ నెల 15న ఉదయం 10 గంటల సమయంలో అతనికి ఒక ఫోన్‌కాల్ వచ్చింది. అందులో మాట్లాడిన వ్యక్తి తన పేరు ఆనంద్ అని పరిచయం చేసుకున్నాడు. జీడి పప్పు హోల్‌సేల్ వ్యాపారం చేస్తున్నట్లు, రూ. 35 వేలు అడ్వాన్స్‌గా అందజేస్తే 300 కిలోల జీడి పప్పు ఇస్తానని, మిగతా నగదు తర్వాత ఇస్తానని తెలిపాడు. దీన్ని నమ్మిన వెంకటేష్, అతని స్నేహితుడు బాలాజీని దీని గురించి అడిగాడు. ఈ నెల 15వ తేది అర్ధరాత్రి 12 గంటల సమయంలో బాలాజీ దుకాణానికి వెంకటేశ్ వెళ్లాడు. అక్కడ బాలాజీ, ఆనందన్ తనకు తెలిసిన వ్యక్తేనని, నగదు ఇచ్చి వెళ్లమని తెలిపాడు. అందుకు వెంకటేష్ తన వద్ద నగదు లేదని చెప్తుండగానే హఠాత్తుగా అతను వెంకటేష్‌ను బెదిరించి, అతని వద్దనున్న ఏటీఎం కార్డు, పిన్ నెంబర్‌ను తీసుకున్నాడు. తర్వాత బెదిరించిన వ్యక్తి అక్కడున్న ఏటీఎం నుంచి రూ. 50 వేలు తీసుకున్నాడు. వెంకటేష్ ధరించిన బంగారు చైన్‌ను లాక్కుని పరారయ్యాడు. జరిగిన విషయం గురించి కొత్వాల్‌చావడి పోలీసు స్టేషన్లో వెంకటేష్ ఫిర్యాదు చేశాడు. -
మాటలు కలిపి.. మాయ చేసి..
ఏడాది క్రితం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ముదాంగల్లీలో ఓ ఇంటిముందు కూర్చున్న దంపతుల వద్దకు వచ్చిన ఓ అపరిచిత వ్యక్తి ఆమెతో మాటలు కలిపాడు. మీరు సెల్‌ఫోన్ రీచార్జీ చేసుకుంటే మీ పేరిట లాటరీ తగిలింది, మా ఆఫీసుకు వస్తే సంతకాలు చేసి లాటరీ లో గెలుచుకున్న స్కూటీ తీసుకెళ్లవచ్చని నమ్మించాడు. పేదవారికే బహుమతులు వర్తిస్తాయని, మెడలోని బంగారం ఇంట్లో పెటి రమ్మన్నాడు. ఇంట్లోనే కదా పెట్టేది అ నుకున్నారు. చెప్పినట్టే చేశారు. భార్యాభర్తలిద్దరూ ఆ వ్యక్తితో కలిసి బైక్‌పై బయలుదేరారు. ఇప్పుడే వస్తానంటూ దారి మధ్యలో వారిని దింపిన దుండగుడు నేరుగా వా రి ఇంటికే వెళ్లాడు. దాచిన బంగారు గొలుసును తెమ్మంటున్నారని వారి కూతురితో చెప్పి బంగారం తీసుకుని ఉడాయించాడు. బాధితులు లబోదిబోమన్నారు. అంతకు వారం రోజుల ముందే దేవునిపల్లిలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. భారతి అనే మహిళకు లక్కీడ్రాలో బహుమతి గెల్చుకున్నావని మాయమాటలు చెప్పిన ఓ దుండగుడు బైక్‌పై తీసుకెళ్లాడు. మత్తుమందు చల్లి మెడలోని బంగారం గొలుసు లాక్కున్నాడు. కామారెడ్డి క్రైం:పైన పేర్కొన్న సంఘటనలు ఉమ్మడి జిల్లాలోని నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ తదితర ప్రాంతాల్లో గతంలో చాలానే వెలుగుచూశాయి. సరిగ్గా ఏడాది గడిచింది. మళ్లీ జిల్లాలో ఇదే తరహాలో మోసాలు మొదలయ్యాయి. ఐదురోజుల క్రితం బాన్సువాడ డివిజన్ పరిధిలో ఒకేరోజు రెండుచోట్ల ఇలాంటి మోసాలు వెలుగుచూసిన విషయం తెలిసిందే. మాటమాట కలిపి నట్టేట ముంచుతారు. అపరిచితులతో మాట్లాడకపోవడమే మంచిదని కొందరు అంటున్నారు. నిఘా పెరగాల్సిందే.. ఇలాంటి మోసాలపై ప్రజల్లో అవగాహన లేదు. అంతేకాకుండా పోలీసుల నిఘా సైతం తగ్గినట్లు తెలుస్తోం ది. జిల్లాలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ఇంకా చాలా చోట్ల కెమెరాల ఏర్పాటు అవసరం ఉంది. ఏడాది క్రితం కామారెడ్డిలో దేవునిపల్లి భారతి మెడలోంచి గొలుసును చోరీ చేసిన దుండగులు మాయమాటలతో ఆమెను తన బైక్‌పై ఎక్కించుకుని బస్టాండ్ ప్రాంతంలో తిరిగాడు. అప్పట్లో బస్టాండ్ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలు ఏ ఒక్కటి పనిచేయక కేసు పరిశోధనలో అడ్డంకులు తలెత్తాయి. సీసీ కెమెరా ల ఏర్పాటు ఎంత ముఖ్యమో వాటి నిర్వహణ కూడా అంతే ముఖ్యమని అధికారులు గుర్తించారు. అయినా చాలాచోట్ల సీసీ కెమెరాల నిర్వహణ అధ్వానంగానే ఉం ది. అపరిచిత వ్యక్తులపై పోలీసుల నిఘా సైతం అం తంతమాత్రంగానే ఉందనే విమర్శలు ఉన్నాయి. నేరా ల నియంత్రణకు పోలీసు నిఘా పెంచాల్సిన అవసరం ఉందని పలువురు భావిస్తున్నారు. ప్రధానంగా మహిళలే లక్ష్యం తరుచూ చోటు చేసుకుంటున్న ఇలాంటి సంఘటనలను చూస్తే దుండగులు అమాయకులనే టార్గెట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఐదు రోజుల క్రితం బాన్సువాడ వచ్చిన దండుగులు ఓ మహిళతో మాట లు కలిపాడు. మీ భర్త బహుమతి గెల్చుకున్నాడని షోరూంకు తనతో రమ్మన్నాడని నమ్మించాడు. బం గారం ఇంట్లో పెట్టించాడు. వెంట తీసుకెళ్లి మధ్యలో వదిలేసి వారి ఇంటికే వచ్చి బంగారం ఎత్తుకెళ్లాడు. వర్ని మండలం ఆపందిఫారంలోనూ ఇలాగే మోసగించారు. సుభద్ర దేవి–దేవిదాస్ దంపతుల ఇంటికి వచ్చిన ఓ అపరిచిత వ్యక్తి మీరు మూడు తులాల బంగారం, ఓ స్కూటీని లాటరీలో గెల్చుకున్నారని నమ్మించాడు. తనతో వస్తే ఇప్పిస్తానని తీసుకువెళ్లి మధ్యలో వదిలేశాడు. తిరిగి వారింటికే వచ్చి వారి కోడలు సుమలతతో మీ అత్త బంగారు గొలుసు తెమ్మని పంపిందని మాయమాటలు చెప్పాడు. ఆమె మెడలోని రెండున్నర తులాల గొలుసు తీసుకుని పరారయ్యాడు. పోలీసులు విచారణ జరుపుతున్నా రు. అయినా గ్రామీ, పట్టణ ప్రాంతాల్లోని ఎంతో మంది ప్రజకుల ఇలాంటి నేరాలపై ఇప్పటికే సరైన అవగాహన లేదు. ప్రతి ఏటా వేసవికాలంలోనే ఇలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. లక్కిడ్రా, స్కీంల పేరిట జరుగుతున్న మోసాలపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మాయమాటలు చెప్పి మోసాలకు పాల్పడే వ్యక్తులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అపరిచితుల మాటలు నమ్మొద్దు. లాటరీ తగిలిందని చెప్పి చోరీలకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టాం. కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. నేరాలను కట్టడి చేసేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నాం. –శ్రీధర్‌కుమార్, ఎస్‌హెచ్‌వో, కామారెడ్డి -
మిత్రులు మోసం చేశారని విద్యార్థి ఆత్మహత్య
-
మిత్రులు మోసం చేశారని విద్యార్థి ఆత్మహత్య
చిలకలగూడ: కష్ట సమయ ంలో ఉన్న మిత్రులను ఆదుకునేందుకు తన వద్ద ఉన్న బంగారు చైన్ ఇస్తే తిరిగి ఇవ్వకుండా వేధిస్తున్నారని మనస్తాపానికి గురైన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం చిలకలగూడ ఠాణా పరిధిలో ఈ సంఘటన జరిగింది. తన చావుకు ఇద్దరు మిత్రులే కారణమని సూసైడ్‌నోట్ రాయడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చిలకలగూడ సీఐ రుద్రభాస్కర్, ఎస్ఐ వరుణ్‌కాంత్‌రెడ్డి తెలిపిన మేరకు.. బౌద్ధనగర్ వారాసిగూడకు చెందిన ఎం.సాయిచరణ్ (21) నగరంలోని అవంతి డిగ్రీ కాలేజీలో బీకాం ఫైనలియర్ చదువుతున్నాడు. ఓయు సిటీ అంగడిబజారుకు చెందిన గూడపు నాగరాజు (26), మాణికేశ్వరినగర్‌కు చెందిన జీ. రాజేష్(27)తో పరిచయం కలగడంతో మిత్రులుగా మారారు. నాగరాజు, రాజేష్ గత దీపావళికి క్రాకర్స్ బిజినెస్ చేసి నష్ట పోయి అప్పుల పాలయ్యారు. స్నేహితులు కోరిక మేరకు సాయిచరణ్ తన వద్ద ఉన్న 20 గ్రాముల బంగారు గొలుసును వారికి ఇచ్చాడు. నెలలు గడుస్తున్నా బంగారు గొలుసు తిరిగి ఇవ్వకపోవడంతో మిత్రుల మధ్య తరుచు వాగ్వాదం జరిగేది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం మిత్రుల మధ్య మరోమారు గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన సాయిచరణ్ ఈనెల 9వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత ఫ్యాను హుక్కు తాడులో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.సోదరుడు భానుసాయిప్రసాద్ రాత్రి 2 గంటల సమయంలో గమనించగా వేలాడుతూ కనిపించాడు. కుటుంబసభ్యులు కిందికి దించి గాంధీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మిత్రులు నాగరాజు, రాజేష్‌ల వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడినట్లు సూసైడ్‌నోట్‌లో స్పష్టం చేశాడు. దీంతో ఆత్మహత్యకు కారణమైన నాగరాజు, రాజేష్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని, గాంధీ మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించామని సీఐ రుద్రభాస్కర్, ఎస్ఐ వరుణ్‌కాంత్‌రెడ్డిలు తెలిపారు. -
పట్టపగలే చైన్ స్నాచింగ్
జోగిపేట(అందోల్): జోగిపేట పట్టణంలో పట్ట పగలు మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం జరిగింది. వివరాలు ఇలాఉన్నాయి. వాసవీనగర్‌లో నివాసం ఉంటున్న కొన్యాల అనూష జాతీయ రహదారి పక్కన ఉన్న దుకాణానికి వెళ్లి తన భర్తకు టిఫిన్ ఇచ్చి తిరిగి వస్తోంది. ఇంటికి దగ్గరలోనే ఇద్దరు యువకులు బైక్‌పై ఆమెను వెంబడించారు. ముందుకు వెళ్లిన వారు వాహనాన్ని మలుపుకొని ఎదురుగా వచ్చి అనూష మెడలో నుంచి బంగారు చైన్‌ను తెంపే ప్రయత్న చేశారు. ఆమె ప్రతిఘటించడంతో దొంగల చేతికి కొంత భాగం మాత్రమే దక్కింది. అనూష మాట్లాడుతూ తన మెడలో మూడు తులాల బంగారు చైన్ ఉందని, ఎదురుగా వచ్చి దుండగులు లాగుతున్న క్రమంలో తాను చైన్‌ను గట్టిగా పట్టుకున్నాని చెప్పింది. దీంతో కొంత భాగం సుమారుగా అర్ధ తులం చైన్‌ను లాక్కెళ్లినట్లు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. -
బంగారం గొలుసు ఇవ్వకపోవడం వల్లే..
భామిని: గౌతమి హత్య కేసులో భర్తే హంతకుడిగా మృతురాలి తల్లి ఆరోపిస్తుంది. బంగారం గొలుసు ఇవ్వకపోవడం వల్లే తన కుమార్తెను కోల్పోయానని ఆవేదన చెందుతుంది. తన పేదరికమే గర్భశోకం మిగిల్చిందని లబోదిబోమంటుంది. భామిని మండలం వడ్డంగిగూడ గ్రామంలో గిరిజన వివాహిత తాడంగి గౌతమి గురువారం మధ్యాహ్నం హత్యకు గురైన విషయం తెలిసిందే. సంఘటనా స్థలాన్ని పాలకొండ డీఎస్పీ జి.స్వరూపారాణి శుక్రవారం ఉదయం పరిశీలించారు. ఆమె వద్ద మృతురాలి తల్లి పార్వతి, పిన్ని దివ్య తమ కుమార్తెను అల్లుడు మనోహరే పొట్టనపెట్టుకున్నాడని విలపించారు. తన కుమార్తె గౌతమి, అల్లుడు మనోహర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారని మృతురాలి తల్లి తెలిపారు. పెళ్లి సమయంలో కట్నం, బంగారం గొలుసు ఇవ్వమని అల్లుడు కోరాడని వివరించారు. అయితే తమ పేదరికం వల్ల ఆ సమయంలో ఇవ్వలేకపోయామని, తర్వాత వీలు చూసుకొని కొని ఇస్తామని చెప్పామన్నారు. ఏళ్లు గడుస్తున్నా కట్నం, బంగారం గొలుసు ఇవ్వకపోవడంతో తన కుమార్తెకు వేధింపులు ప్రారంభమయ్యాయన్నారు. పిల్లలు లేకపోవడం, కన్నవారి నుంచి ఆర్థిక సహాయం లేకపోవడంతో రెండేళ్లుగా తన(కన్నవారి) ఇంటికి కూడా గౌతమిని పంపలేదని ఆవేదన చెందారు. ఈ నేపథ్యంలో తన కుమార్తెపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి హత్యకు పాల్పడ్డాడని డీఎస్పీ వద్ద ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ముందుగా డీఎస్పీ స్వరూపారాణి, పాతపట్నం సీఐ ప్రకాశరావు, భామిని తహసీల్దార్ బంకిపల్లి సత్యం, బత్తిలి ఎస్సై ఎం.ముకుందరావు సంఘటనా స్థలాన్ని నిశితంగా పరిశీలించారు. క్లూస్ టీం వచ్చి వివరాలు సేకరించింది. అలాగే గురువారం రాత్రి నుంచి సంఘటనా స్థలం వద్ద సాయుధ పోలీస్ బలగాలు కాపలాకాసాయి. మృతురాలి భర్త మనోహర్‌ను గురువారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకొని బత్తిలి స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. గౌతమి మృతికి ప్రధాన కారకుడు మనోహరేనని పోలీస్‌లు భావిస్తున్నారు. ఇదిలావుండగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం సాయంత్రం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. -
ప్రేమ బంగారంగానూ..!
సాక్షి ప్రతినిధి, చెన్నై : వృత్తిరీత్యా అతనో దొంగ.. అయితేనేం తనలోనూ ఓ ప్రేమికుడున్నాడని చూపించాడు. ప్రేమికురాలు వేరొకరిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయినా ఆమె జ్ఞాపకాలను ఫొటో ఫ్రేంలో ‘బంగారం’లా పదిలం చేసుకున్నాడు. అయితే, ఇంతలోనే పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. అతని ప్రేమగాథను విన్న పోలీసులు అవాక్కయ్యారు. చెన్నై సైదాపేట ఉత్తర జోన్స్ రోడ్డులోని ఒక అపార్టుమెంటులో సెల్వ గణేష్, గుణసుందరి ఉంటున్నారు. ఈనెల 21న గుణసుందరి ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో ఒక అగంతకుడు ఆమె తలపై కొట్టి మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లిపోయాడు. ఆఫీసు నుంచి వచ్చిన భర్త రక్తపుమడుగులో పడి ఉన్న భార్యను చూసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సీసీ కెమెరాల ద్వారా నిందితుడ్ని పాత నేరస్తుడు జాన్సన్‌గా గుర్తించి అదుపులోకి తీసుకుని గొలుసు గురించి విచారించారు. నిందితుడు పోలీసులను తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ చైనును ఒక పెద్ద ఫొటో ఫ్రేంలో పెట్టి గోడకు తగలించి ఉండడాన్ని చూసి బిత్తరపోయారు. ఇలా తగిలించుకున్నావేమిటని పోలీసులు ప్రశ్నిస్తే తన ప్రేమగాథను చెప్పుకొచ్చాడు. ‘నేను గతంలో ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆమె కూడా ప్రేమించింది. అయితే, మరొకరిని పెళ్లి చేసుకోవడంతో ఆ బాధను భరించలేక మరో ప్రాంతానికి వెళ్లిపోయా. అయినా, ఆమెను మర్చిపోలేకపోతున్నా. ఈ మధ్యే ఒక ఇంట్లో ఆమెను చూసి కోపంతో కొట్టి బంగారు చైనును తెచ్చేశా. అందుకే దానిని అమ్మకుండా ఆమె గుర్తుగా ఫొటో ఫ్రేంలో పెట్టుకున్నా’నని వివరించాడు. దొంగ ప్రేమకథతో విస్తుపోయిన పోలీసులు ఆమె నీ ప్రేయసి కాదని చెప్పడంతో, చీకట్లో పొరపడ్డానని వివరణ ఇచ్చుకున్నాడు. దీంతో పోలీసులు అతన్ని శుక్రవారం కటకటాల వెనక్కు నెట్టారు. -
మహిళ మెడలో గొలుసు చోరీ
నెల్లూరు (క్రైమ్) : ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును గుర్తుతెలియని దుండగులు లాక్కెళ్లారు. ఈ సంఘటన కరెంట్ ఆఫీస్ సెంటర్ రైల్వే గేటు సమీపంలో గురువారం పట్టపగలు జరిగింది. పోలీసుల సమాచారం మేరకు... అనగుంటకు చెందిన ఎం. శైలజ ఇళ్లలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆమె గురువారం ఉదయం కరెంట్ ఆఫీస్సెంటర్లోని బంధువుల ఇంట్లో పనులు చేసేందుకు వెళ్లింది. తిరిగి ఇంటికి నడుచుకొంటూ వెళ్తుండగా, కరెంట్ఆఫీస్ రైల్వేగేటు సమీపంలోని రైల్వే అండర్ (పాస్) బ్రిడ్జి కింద నుంచి వెళుతుండగా గుర్తుతెలియని ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చారు. ఆమె మెడలోని మూడు సవర్ల బంగారు గొలుసును తెంపుకెళ్లారు. ఈక్రమంలో ఆమె మెడకు స్వల్ప గాయాలైంది. దీంతో బాధితురాలు పెద్దగా కేకలు వేసే సరికే దుండగులు బైక్ వేగం పెంచి పరారయ్యారు. స్థానికులు ఆమె వద్దకు చేరుకుని చోరీ ఘటనపై ఐదోనగర పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ విజయకుమార్ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితురాలి నుంచి నిందితుల వివరాలను సేకరించి సెట్లో నగర పోలీసులను అలెర్ట్ చేశారు. దీంతో పోలీసులు నగరంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. గతంలోనూ ఇదే ప్రాంతంలో పలు సంఘటనలు చోటు చేసుకొన్నాయి. -
భ్రామరికి బంగారు హారం
శ్రీశైలం : శ్రీ భ్రమరాంబాదేవికి సంక్రాంతి పర్వదినాన శనివారం.. నిజమాబాద్‌కు చెందిన ఆర్ శోభారాణి 58 గ్రాములతో తయారు చేయించిన బంగారు హారాన్ని సమర్పించారు. శ్రీస్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలను నిర్వహించుకున్న అనంతరం హారానికి సంప్రోక్షణ పూజలను నిర్వహించి..ఆలయ ఏఈఓ కృష్ణారెడ్డికి అందజేశారు. -
నీళ్లకోసమని వెళ్లి బంగారు గొలుసు లాక్కెళ్లాడు
హైదరాబాద్: ముఖాలు కనిపించకుండా మాస్కులు వేసుకుని.. మహిళల బంగారు చైన్లు లాగేసే చైన్ స్నాచర్స్ ఓ అడుగు ముందుకేసినట్లున్నారు. రోడ్లపై వెళ్లే మహిళలను టార్గెట్ చేసే స్నాచర్స్... ఇప్పుడు ఇళ్లల్లో ఒంటరిగా ఉన్న ఆడవాళ్లను వదిలిపెట్టడంలేదు. నగరంలోని కుషాయిగూడలోని శ్రీరాంనగర్‌లో మంగళవారం మధ్యాహ్నం అలాంటి ఘటననే చోటు చేసుకుంది. రత్నదేవి అనే మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఓ దుండగుడు మంచినీళ్ల కోసమని వెళ్లాడు. ఆమె నీళ్లు తీసుకుని రాగా.. దుండగుడు ఆమె మెడలోని ఏడు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లిపోయాడు. దీంతో ఆమె లబోదిబోమంటూ కేకలు వేసింది. ఆ సమయంలో చుట్టు పక్కల ఎవరూ లేకపోవడంతో స్నాచర్ పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
‘చిలకలగూడ స్నాచర్లు’ చిక్కారు
జిమ్‌లో జత కట్టిన స్నాచర్ల ద్వయం విలాసాల కోసం చోరీల బాట అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్ టీమ్ సిటీబ్యూరో: నార్త్‌జోన్‌లోని చిలకలగూడ ఠాణా పరిధిలో గత గురువారం ఓ వృద్ధురాలి మెడ నుంచి బంగారం గొలుసు లాక్కుపోయిన స్నాచర్లను ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. సీసీ కెమెరాల్లో చిక్కిన ఆనవాళ్ళ ఆధారంగా వీరిని పట్టుకున్నామని, నిందితులపై గతంలో ఎలాంటి కేసు లేవని డీసీపీ బి.లింబారెడ్డి గురువారం తెలిపారు. ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన మహ్మద్ రహమత్ పదో తరగతి వరకు చదివి వేనుభానగర్లో చికెన్ దుకాణం నిర్వహిస్తున్నాడు. ముషీరాబాద్ హరినగర్‌కు చెందిన మహ్మద్ జఫార్ మేధి బాకారంలోని ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో బుక్ బైండింగ్ పని చేస్తున్నాడు. జిమ్‌కు వెళ్ళే వీరిద్దరికీ అక్కడే పరిచయమైంది. ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించడంతో పాటు విలాసాలకు డబ్బు సంపాదించడం కోసం ఇద్దరూ కలిసి స్నాచింగ్స్ చేయాలని పథకం వేశారు. ఈ నేపథ్యంలో చిలకలగూడ పరిసరాల్లో బైక్‌పై తిరుగుతూ కొన్ని రోజులుగా టార్గెట్ల కోసం వెతికారు. గత గురువారం నామాలగుండ ప్రాంతంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధురాలు నాగలక్ష్మమ్మ మెడలో ఉన్న 3 తులాల బంగారం గొలుసు లాక్కుపోయారు. ఆ సమయంలో జఫార్ బైక్ నడపగా... రహమత్ వెనుక కూర్చుని వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు లాగేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఘటనాస్థలికి సమీపంలో ఉన్న ఓ సీసీ కెమెరాల పుటేజీ ఆ«ధారంగా నిందితుల్ని గుర్తించారు. గురువారం ఇన్స్పెక్టర్ పి.బల్వంతయ్య నేతృత్వంలో ఎస్సైలు కేఎస్ రవి, పి.చంద్రశేఖర్‌రెడ్డి, బి.శ్రవణ్‌కుమార్, కె.శ్రీకాంత్ తమ బృందాలతో వలపన్ని చోరీ సొత్తును విక్రయించడానికి వచ్చిన నిందితుల్ని పట్టుకున్నారు. వీరి నుంచి బంగారు గొలుసు, వాహనంతో పాటు రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసును చిలకలగూడ పోలీసులకు అప్పగించారు. -
మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు అపహరణ
మాచారెడ్డి : మహిళ మెడలో నుంచి రెండు తులాల పుస్తెల తాడును దుండగులు అపహరించారు. ఈ సంఘటన బుధవారం సాయంత్రం సోమారంపేట పంచాయతీ పరిధిలోని రోడ్డుబండ తండాలో జరిగింది. మాచారెడ్డి ఎస్సై నరేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమారంపేట్కు చెందిన గుగ్గిల రేణ రోడ్డుబండ తండా సమీపంలో ఉన్న వాగులో దుస్తులు ఉతకడానికి వెళ్లింది. దుస్తులను ఉతికి ఆరేసిన అనంతరం వాటిని తీసే ప్రయత్నంలో ఉండగా వెనుక నుంచి బైక్‌పై వచ్చిన దుండగులు ఇద్దరు నోరుమూయగా మరో వ్యక్తి బంగారు గొలుసును లాక్కెళ్లారు. దుండగులు ఎల్లంపేట నుంచి ఇసాయిపేట వైపు వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గ్రామానికి చెందిన పలువురు యువకులు వెంబడించినా ఫలితం లేకుండా పోయింది. నిందితులు బైక్‌పై పరారవుతుండగా ఎల్లంపేటలోని సీసీ టీవీ ఫుటేజీలో నమోదయ్యింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ముగ్గురు మహిళలను బెదిరించి .. మాక్లూర్ : మండలంలోని కల్లెడి శివారులో ముగ్గురు మహిళలను బెదిరించి మూడు తులాల బంగారాన్ని దుండగులు ఎత్తుకెళ్లినట్లు ఎస్సై రామునాయుడు బుధవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. కల్లెడి తండాకు చెందిన దీపిక, శాంతి, పంచు అనే ముగ్గురు మహిళలు కట్టెల కోసం కల్లెడి శివారులోని అటవీ ప్రాంతానికి వెళ్లారు. ఇద్దరు దుండగులు కత్తులతో వారిని బెదిరించి వారి వద్ద ఉన్న మూడు తులాల బంగారం ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
మహిళ మెడలో గొలుసు చోరీ
నెల్లూరు సిటీ: పోస్టల్ కాలనీలోని నాలుగవ వీధిలో చైన్ స్నాచింగ్ జరిగింది. ఉదయం వాకింగ్‌కు వెళ్తున్న సావిత్రమ్మ అనే మహిళ మెడలోని 5 సవర్ల బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తి తస్కరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఐదవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
చెన్నూరులో చైన్ స్నాచింగ్
చెన్నూరు : చెన్నూరులో ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును గుర్తు తెలియని దుండగుడు సోమవారం లాక్కెళ్లాడు. పోలీసులు లె లిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు–చిత్తూరు జాతీయ రహదారిలోని చెన్నూరు కొత్తరోడ్డులో వడ్లవీటి లక్షుమయ్య భార్య ఈశ్వరమ్మ టీ దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం గుర్తు తెలియని యువకుడు వచ్చాడు. బీమా చేయాలని, మృతి చెందితే కుటుంబ సభ్యులకు రూ. 1.50 లక్షలు ఇస్తామంటూ వచ్చి ఈశ్వరమ్మతో చెప్పాడు. ఆమె భర్తను పిలిచి విషయాన్ని చెప్పింది. చెక్కర ఫ్యాక్టరీ వద్ద అధికారులు ఉన్నారని, అక్కడికి రావాలని చెప్పగా ఈశ్వరమ్మ వెళ్లేందుకు ప్రయత్నించింది. మెడలోని బంగారు గొలుసు లోపల పెట్టి వెళ్లాలని భర్త సూచించాడు. వెంటనే ఆమె ఇంటిలో పెట్టి అతని బైకుపై వెళ్లగా కొంత దూరం పోయాక మగవాళ్లు రావాలంటూ చెప్పి ఆమెను వెనక్కు తీసుకొచ్చాడు. లక్షుమయ్యను చెక్కర ఫ్యాక్టరీ సమీపం వద్దకు తీసుకెళ్లాడు. మరో వ్యక్తి వస్తాడు. ఇక్కడే ఉండండి అని చెప్పి, టీ హోటల్ వద్దకు వచ్చి బ్యాంకు పుస్తకాలివ్వాలంటూ ఈశ్వరమ్మను అడిగాడు. ఆమె అప్పటికే తిరిగి మెడలో గొలుసు వేసుకోవడంతో బ్యాంకు పుస్తకం ఇస్తుండగా.. గొలుసును లాక్కుని బైకులో పరారయ్యాడు. బాధితులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. -
దుర్గమ్మకు బంగారు తాడు, మంగళసూత్రాలు
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : ఇంద్రకీలాద్రిపై కొలువైఉన్న దుర్గమ్మకు నగరానికి చెందిన ఓ భక్తుడు రూ.4.50 లక్షల విలువైన బంగారు తాడు, మంగళసూత్రాలను సమర్పించారు. భవానీపురానికి చెందిన రాహుల్ మార్కెటింగ్ అసోసియేట్స్ యజమాని తవ్వ వెంకట లక్ష్మీప్రసన్నకుమార్ బుధవారం ఆలయ అధికారులను కలుసుకుని ఈ వస్తువులను అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించి ప్రసాదాలను అందించారు. -
రెచ్చిపోయిన దొంగలు
మహిళల మెడల్లో బంగారు గొలుసుల అపహరణ అనంతపురం సెంట్రల్/ రాప్తాడు : నగర శివారు, రాప్తాడు మండల పరిధిలో ఇద్దరు దొంగలు మంగళవారం రెచ్చిపోయారు. తమకు అడ్డొచ్చేవారు ఎవరున్నారనుకున్నారో ఏమో వరుసగా ఇద్దరు మహిళల మెడలోని బంగారు గొలుసులను లాక్కెళ్ళారు. ఈ ఘటనలు రాప్తాడు– జేఎన్టీయూ కళాశాల మధ్యన జరిగాయి. జేఎన్టీయూ కళాశాల ఎదురుగా హోటల్నిర్వహిస్తున్న వెంకటలక్ష్మి మెడలోని 5 తులాల బంగారు చైన్‌ను లాక్కెళ్లారు. ద్విచక్రవాహనంపై వచ్చిన దొంగలు చాకచక్యంగా గొలుసుతో ఉడాయించారు. బాధితురాలు వన్టౌన్ఎస్ఐ వెంకటరమణకు ఫిర్యాదు చేశారు. రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లిలో మంగళవారం ఉదయం ట్యూషన్నుంచి పిల్లలను పిలుచుకొచ్చేందుకు ఇంటి నుంచి బయల్దేరిన మమత మెడలో బంగారు గొలుసును పల్సర్‌బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు లాక్కెళ్లారు. బాధితురాలు రాప్తాడు ఎస్ఐ ధరణిబాబుకు ఫిర్యాదు చేశారు. -
కళ్లల్లో కారం నీళ్లు కొట్టి.. సరుడు దోపిడీ
గూడూరు : ట్యాంక్ శుభ్రం చేస్తానని చెప్పి వచ్చి ఓ మహిళ కళ్లల్లో కారం కలిపిన నీళ్లు కొట్టి 4 సవర్ల సరుడును పట్టపగలు దోచుకెళ్లిన సంఘటన స్థానిక సన్నత్‌నగర్‌లో సోమవారం చోటుచేసుకుంది. బాధితుల వివరాల మేరకు.. పట్టణంలోని సన్న™Œ నగర్ ప్రాంతంలో టీచర్ వెంకటేశ్వర్లు కుటుంబం నివాసం ఉంటుంది. సోమవారం ఆయన పాఠశాలకు వెళ్లాడు. ఇంటో ఆయన సతీమణి సుమతి ఒక్కటే ఉంది. మధ్యాహ్నం సమయంలో గుర్తుతెలియని వ్యక్తి వచ్చి ఇంటి తలుపు తట్టడంతో సుమతి తలుపు తీసింది. ఆ వ్యక్తి ట్యాంక్ క్లీన్ చేస్తానని చెప్పి మాట్లాడుతూ కారం కలిపిన నీటిని సుమతి కళ్లల్లో కొట్టి, ఆమె మెడలో ఉన్న నాలుగు సవర్ల సరుడును లాక్కెళ్లాడు. బాధితులు 1వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి కేసు నమోదు చేశారు. -
మహిళ మెడలో బంగారు గొలుసు అపహరణ
నరసరావుపేటటౌన్ : ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు మహిళ మెడలో బంగారు గొలుసు లాక్కొని పరారైన సంఘటన బుధవారం రాత్రి పట్టణంలో చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం ఐలా బజార్లో నివాసముంటున్న చింతా మల్లేశ్వరి గురువారం ఇంటి బయట తన పిల్లల్ని ఆడిస్తుండగా వెనుకగా ద్విచక్రవాహనంపై వచ్చిన ఆగంతకుల్లో ఒకరు ఆమె మెడలో గొలుసును తెంచుకొని ఉడాయించారు. బాధితురాలు కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు దుండగులను వెంబడించినా ఫలితం దక్కలేదు. జరిగిన సంఘటనపై టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితురాలు తెలిపింది. -
చెలరేగిన చైన్ స్నాచర్లు
బెంగళూరు(బనశంకరి) : నగరంలో మళ్లీ చైన్‌స్నాచర్లు పెట్రేగిపోయారు. శనివారం రాత్రి రెండు వేర్వేరు ప్రాంతాల్లో చైన్‌స్నాచింగ్‌కు తెగబడ్డారు. జేపీ.నగర ఏడవపేజ్లోని చుంచుఘట్ట మెయిన్‌రోడ్డు శివశక్తినగరలో శాలిని అనే మహిళ రాత్రి 8.15 సమయంలో ఆస్పత్రిలో విధులు ముగించుకుని కాలినడకన ఇంటికి బయల్దేరింది. బన్నేరుఘట్టరోడ్డు- అరికెరె సిగ్నిల్ వద్ద బైక్‌లో వచ్చిన దుండగుడు ఆమె మెడలోని 10 గ్రాముల బంగారుచైన్ లాక్కొని ఉడాయించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు జేపీ.నగర పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. అదేవిధంగా జయనగర హౌసింగ్‌బోర్డులోని వజ్రమునినగరలో చైన్ స్నాచింగ్ జరిగింది. స్థానికంగా ఉంటున్న సుజాతా అనే మహిళ శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో ఇంటి ముందు చిన్నారిని ఆడించుకుంటూ భోజనం తినిపిస్తుండగా ఇద్దరు చైన్స్నాచరు అడ్రస్ అడుగుతూ ఆమె మెడలో ఉన్న 45 గ్రాముల బంగారుచైన్ లాక్కుని బైకులో ఉడాయించారు. ఘటనపై తలఘట్టపుర పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
మహిళ మెడలో చైన్ స్నాచింగ్
హైదరాబాద్‌సిటీ: చైన్ స్నాచర్ల ఆగడాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. చైన్ స్నాచర్ల ఘటనలతో మహిళలు ఒంటరిగా బయటకు రావలంటేనే భయపడుతున్నారు. తాజాగా మేడిపల్లి పరిధిలోని పిర్జాదిగూడలో ఆదివారం మహిళ మెడలో చైన్ స్నాచింగ్ జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వరలక్ష్మి అనే మహిళ మెడలోని 4 తులాల బంగారు గొలుసును గుర్తుతెలియని దుండగులు బైక్‌పై వచ్చి లాక్కెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
టెలికాం కాలనీలో చైన్‌స్నాచింగ్
రాయదుర్గం పరిధిలోని టెలికాం నగర్లో చైన్‌స్నాచింగ్ జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి 4 తులాల బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తులు లాక్కెళ్లారు. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వాళ్లు లాక్కెళ్లింది బంగారు గొలుసు కాదట!
చాంద్రాయణగుట్ట: చైన్ స్నాచింగ్ జరిగిన 24 గంటల్లోనే దక్షిణ మండలం పోలీసులు సీసీ టీవీ కెమెరాల సాయంతో నిందితులను కటకటాల్లోకి పంపారు. కాగా నిందితులు లాక్కెళ్లింది రోల్డ్ గోల్డ్ అని తేలింది. దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ తెలిపిన వివరాలివీ.. డబీర్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలోని బోదేఅలీషా కిడికీ ప్రాంతంలో ఈ నెల 7వ తేదీన ఒంటరిగా నడిచి వెళుతున్న కొప్పెర్ల రాణి (26) మెడలోని మంగళ సూత్రాన్ని బైక్‌పై వచ్చిన యువకులు తెంచుకు పోయారు. దీనిపై డబీర్‌పురా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, స్థానికంగా ఉన్న మసీదు వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో నిందితులు పారిపోతున్నట్లు వీడియో ఫుటేజి లభించింది. దీని ఆధారంగా నిందితులను పహాడీషరీఫ్ షాయిన్‌నగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ తల్హా అలియాస్ అహ్మద్ (23), తలాబ్‌కట్టా అమన్‌నగర్ బి ప్రాంతానికి చెందిన ఉమర్ బిన్ ఆబేద్ అలియాస్ ఉమర్ ఖాన్(21)గా గుర్తించారు. ఇటీవలే సౌదీ నుంచి వచ్చిన వీరు తాగుడు డబ్బుల కోసం చైన్ స్నాచింగ్ చేశారు. అయితే, ఆ చైన్ బంగారంది కాదని తెలుసుకున్న నిందితులు కంగు తిన్నారు. నిందితుల నుంచి లాక్కెళ్లిన గొలుసుతో పాటు బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
దమ్మాయిగూడలో చైన్ స్నాచింగ్
జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న అన్నపూర్ణ అనే మహిళ మెడలోని 5 గ్రాముల బంగారు గొలుసును గుర్తుతెలియని దుండగులు లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఒంటరి మహిళలే లక్ష్యం
చైన్‌స్నాచర్ అరెస్ట్ రూ.4 లక్షల 50 వేల విలువైన చోరీసొత్తు స్వాధీనం బెంగళూరు(బనశంకరి) : ఒంటరి మహిళలే లక్ష్యంగా చైన్‌స్నాచింగ్‌లు, ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న గంగొండనహళ్లి కి చెందిన సయ్యవ్నాసీర్ను కళాసీపాళ్య పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.4 లక్షల 50 వేల విలువైన చోరీసొత్తును స్వాధీనం చేసుకున్నారు. సయ్యవ్నాసీర్ గత నెల 26 తేదీ కలాసీపాళ్యలోని ఎల్బీఎప్ రోడ్డులో స్నేహితుడు సాజిద్‌తో కలిసి బైక్ విక్రయిస్తుండగా గస్తీ పోలీసులు దాడులు నిర్వహించారు. దీంతో ఆ ఇద్దరూ ఉడాయించారు. ఎట్టకేలకు పోలీసులు గాలింపు చేపట్టి సయ్యవ్నాసీర్ను అరెస్ట్ చేసి 155 గ్రాముల 7 బంగారుచైన్లు, చెవికమ్మలు, జుమీకీలు కలిపి రూ.4లక్షల 50 వేల విలువ చేసే చోరీసొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి అరెస్ట్‌తో 7 చైన్‌స్నాచింగ్ కేసులు, ఓ ఇంటి చోరీ తో పాటు 8 కేసులు వెలుగుచూశాయి. సయ్యద్నాజీర్ తన స్నేహితుడు సాజిద్ తో కలిసి బసవేశ్వరనగర, విజయనగర, కామాక్షీపాళ్య, హుళిమావు తదితర ప్రాంతాల్లో ఒంటరిగా వెళుతున్న మహిళలను గుర్తించి చైన్‌స్నాచింగ్‌కు పాల్పడుతున్నారని డీసీపీ.లాబూరామ్ తెలిపారు. పరారీలో ఉన్న సాజిద్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. -
మరోసారి రెచ్చిపోయిన చైన్‌స్నాచర్లు
కుషాయిగూడ : నగరంలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మరోసారి చైన్ స్నాచర్లు చెలరేగిపోయారు. చక్రిపురం క్రాస్‌రోడ్డులో బాలమణి అనే మహిళ మంగళవారం ఉదయం ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా బైక్‌పై వచ్చిన దుండగులు ఆమె మెడలోని బంగారు గొలుసును తెంపుకుపోయారు. ఆమె తేరుకుని చుట్టు ప్రక్కల వారికి సమాచారం ఇచ్చే లోపల దుండుగులు పరారయ్యారు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
కరీంనగర్ జిల్లాలో చైన్ స్నాచింగ్ కలకలం
కమలాపూర్: కరీంనగర్ జిల్లాలో బుధవారం మధ్యాహ్నం చైన్ స్నాచింగ్ కలకలం సృష్టించింది. కమలాపూర్ మండలం సిరికొండ శివారులో ఆటోలో వెళుతున్న ఓ మహిళ మెడలోని పుస్తెలతాడును చైన్ స్నాచర్స్ తెంపుకుపోయారు. నల్లటి ముసుగులు ధరించిన ఇద్దరు యువకులు పల్సర్ బైక్‌పై ఆటోను అనుసరించారు. అందులో ప్రయాణిస్తున్న ఓ మహిళ మెడలోంచి సుమారు 2 తులాల బంగారు గొలుసును లాక్కుని పరారయ్యారు. బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆటోలో మహిళ నుంచి బంగారు హారం చోరీ
ఒంగోలు (ప్రకాశం జిల్లా) : ఓ మహిళ అప్పుడే నగల షాపు నుంచి కొనుక్కుని వెళ్తున్న బంగారు హారాన్ని తోటి మహిళా ప్రయాణికులు మాయం చేసేశారు. ఈ ఘటన ఒంగోలు పట్టణంలో చోటుచేసుకుంది. పెళ్లూరు గ్రామానికి చెందిన సునీత అనే మహిళ తన సోదరునితో కలసి సోమవారం మధ్యాహ్నం ఒంగోలులోని ఖజానా జ్యుయెలర్స్‌కు వెళ్లారు. అక్కడ ఆమె రూ.96 వేల విలువ చేసే హారం కొనుగోలు చేశారు. తిరిగి గ్రామానికి వెళ్లేందుకు సమీపంలోనే ఓ ఆటో ఎక్కారు. ఆమెతోపాటు మరో ముగ్గురు గుర్తుతెలియని మహిళలు కూడా ఆటో ఎక్కారు. కొంతదూరంలో ఉన్న నెల్లూరు బస్టాండ్ వద్ద ఆ మహిళలు దిగిపోగా కొద్దిసేపటి తర్వాత సునీత తన బ్యాగు చూసుకున్నారు. బ్యాగు జిప్ తీసి ఉండడంతోపాటు అందులో హారం ఉన్న పర్సు కనిపించలేదు. దీంతో ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. వారు కేసు నమోదు చేసుకుని చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. -
చైన్‌స్నాచింగ్‌కు దొంగ విఫలయత్నం
-
రెచ్చిపోయిన చైన్ స్నాచర్స్
చంపాపేట: హైదరాబాద్‌లో చైన్ స్నాచర్లు మరోసారి చెలరేగిపోయారు. సోమవారం ఉదయం చంపాపేట సామ గంగారెడ్డి కాలనీలో మహిళ మెడలో బంగారు గొలుసును తెంపుకుపోయారు. మణెమ్మ అనే గృహిణి గుడికి వెళుతున్న సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆమె మెడలోని సుమారు రెండు తులాల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యారు. బాధిత మహిళ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరో ఘటన ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. బెల్లంపల్లి పట్టణంలో ఓ దుండగుడు మహిళ మెడలోని బంగారు గొలుసును అపహరించుకుపోయాడు. రామిడి కనకలక్ష్మి అనే మహిళ కిరాణ షాపును తెరిచి శుభ్రం చేసుకుంటుంది. అదే సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి సిగరెట్ కావాలని అడిగాడు. అతడికి సిగరెట్ ఇచ్చిన అనంతరం ఆమె ఇంట్లోకి వెళ్లుతున్న సమయంలో దుండగుడు ఆమె వెనుక నుంచి పుస్తెలతాడును తెంపుకుపోయాడు. -
బెజవాడలో చైన్‌స్నాచింగ్ కలకలం
విజయవాడ: బెజవాడలో చైన్‌స్నాచింగ్ కలకలం రేపింది. భవానీపురం బ్యాంక్ సెంటర్లో ఓ మహిళ మెడలో నుంచి దుండగుడు బంగారు గొలుసును తెంపుకుపోయాడు. దీంతో బాధిత మహిళ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు పట్టించుకోవడంలేదని సదరు మహిళ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చి చోరీ
సికింద్రాబాద్ : ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చి మహిళ దృష్టి మరల్చి ఆమె మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఈ సంఘటన సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌద్ధ నగర్ అపార్ట్మెంట్లో మంగళవారం చోటుచేసుకుంది. మధ్యాహ్నం సమయంలో అపార్ట్మెంట్లో అద్దె ఇల్లు దొరుకుతుందా అని స్థానిక మహిళను అడిగిన ఇద్దరు దుండగులు ఆమె దృష్టి మరల్చి ఆమె మెడలోని రెండు తులాల మంగళ సూత్రాన్ని లాక్కెళ్లారు. కాసేపటికి ఇది గుర్తించిన మహిళ లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
మహిళా ఏఎస్ఐ గొలుసునే తెంపేశారు
కోల్‌కతా: గొలుసు దొంగల ఆగడాలకు హద్దూ అదుపు లేకుండా పోతోంది. ఈ చైన్ స్నాచర్లు మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. మమతా బెనర్జీ లాంటి ఫైర్ బ్రాండ్ ముఖ్యమంత్రులున్న కోల్‌కతాలో కూడా రెచ్చిపోతున్నారు. సామాన్య మహిళలతో పాటూ, మహిళా పోలీసులను టార్గెట్ చేశారు. ఏకంగా ఓ మహిళా ఏఎస్ఐ గొలుసునే తెంపుకెళ్లిపోయారు. కోల్‌కతాలోని తిల్జాలా పోలీస్ స్టేషన్ కు చెందిన మహిళా ఏఎస్ఐ నిర్మలారాయ్ విధులు నిర్వర్తించుకుని ఇంటికి తిరిగెళ్తున్న సమయంలో బైకుపై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కెళ్లారు. పిక్నిక్ గార్డెన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కచ్చితంగా ఎవరో స్థానికులే చేసి ఉంటారని నిర్మల తెలిపారు. వారిని త్వరలో పట్టుకుంటామని వెల్లడించారు. లాల్ బజార్ నేర పరిశోధక విభాగం దీనిపై దృష్టి పెట్టింది. పాత నేరస్తుల వివరాలను సేకరిస్తున్నామని, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసును ఛేదిస్తామని తెలిపారు. బైక్ వివరాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. -
పాపం సాకేత్!
బరి తెగింపు.. ఎవరేమి చేస్తారులే అనే బలుపు.. వెంటాడి లాగేద్దాం వస్తే గొలుసులు.. పోతే ప్రాణాలు అన్నట్లు.. చైన్ స్నాచర్లు చెలరేగిపోతున్నారు. గురువారం ఒక్క రాత్రే ఒక్క రాజేంద్రనగర్ పరిసరాల్లో కేవలం గంటన్నరలో మూడు ఉదంతాలు చోటు చేసుకున్నాయి. పాపం ఓ చిన్నారి తీవ్రంగా గాయపడడం విచారకరం. రాజేంద్రనగర్: రోజురోజుకీ బరితెగిస్తున్న స్నాచర్లు పోలీసులకే సవాల్ విసురుతున్నారు. మెడలో ఉన్న గొలుసుల్ని లాగే క్రమంలో తీవ్రంగా గాయపడుతున్న బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఉస్మానియా వర్శిటీ పరిధిలో ఏకంగా ఓ మహిళ మృత్యువాత పడింది. గురువారం రాత్రి రాజేంద్రనగర్ ఠాణా పరిధిలో జరిగిన వరుస స్నాచింగ్స్లో ఏడాదిన్నర వయస్సున్న సాకేత్ తీవ్రంగా గాయపడ్డాడు. స్నాచర్లు పంజా విసిరే సమయంలో వాహనంపై ప్రయాణిస్తున్న తల్లిఒడిలో నిద్రిస్తున్న ఈ పసివాడు తల్లితో సహా కిందపడ్డాడు. రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి 8.30 నుంచి 10 గంటల మధ్య మూడు ఉదంతాలు చోటు చేసుకున్నాయి. ఇవన్నీ ఒకే ముఠా పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. హైదర్‌గూడకు చెందిన చంద్రశేఖర్ తన భార్య లావణ్య, కుమారుడు సాకేత్‌లతో కలిసి పల్లెచెర్వులో జరిగిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత తన ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఆరామ్‌ఘర్ సమీపంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు లావణ్య మెడలోని మూడు తులాలు బంగారు గొలుసు లాగేశారు. ఆకస్మికంగా జరిగిన ఈ ఉదంతంతో అదుపు తప్పిన లావణ్య ఒడిలోని బిడ్డతో సహా రోడ్డుపై పడిపోయారు. దీంతో లావణ్యకు స్వల్ప గాయాలు కాగా.. సాకేత్ ఎడమ కాలు విరగడంతో పాటు ముఖానికీ తీవ్ర గాయాలయ్యాయి. వీరిద్దరూ స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందారు. స్నాచింగ్ విషయం చెప్తున్న పోలీసులు బాలుడికి గాయాలైన విషయాన్ని మాత్రం అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. మరో రెండు ఘటనల్లో... శివరామ్పల్లికి చెందిన విజయ్ తన భార్య లలితతో కలిసి పల్లెచెర్వులో బతుకమ్మ సంబరాలకు హాజరై తిరిగి వస్తున్నారు. పల్లెచెర్వు దాటిని కొద్దిసేపటికే వెనుక నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు లలిత మెడలోని 2.5 తులాల పుస్తెలతాడు తాక్కుని ఉడాయించారు. హైదర్‌గూడకు చెందిన వెంకటయ్య తన భార్య సంతోషితో కలిసి స్థానికంగా ఉన్న సాయిబాబ దేవాలయానికి వెళ్ళారు తిరిగి వస్తున్న సమయంలో వెనుక నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు సంతోషి మెడలోని 3.5 తులాల బంగారు గొలుసు స్నాచింగ్ చేశారు. మహిళ మెడలో గొలుసు మాయం కుత్బుల్లాపూర్: ఆటోలో మాయ లేడీలు ఓ మహిళ మెడ నుంచి బంగారు పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన ఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. కుత్బుల్లాపూర్ రాఘవేంద్ర కాలనీలో నివాసముండే శశికళ ఐడీపీఎల్ ఎస్‌బిహెచ్ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె బుధవారం షాపూర్‌నగర్ నుంచి ఆటోలో బ్యాంక్‌కు బయలుదేరారు. ఆ సమయంలో ముఖాలకు స్కార్ఫ్‌లు కట్టుకున్న ముగ్గురు మహిళలు చుట్టూ పోగై పథకం ప్రకారం మెడలో ఉన్న సుమారు రూ.1.20 లక్షల విలువ చేసే ఐదు తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లారు. బ్యాంక్‌కు వెళ్లిన శశికళ మెడలో పుస్తెలతాడు లేకపోవడంతో తోటి ఉద్యోగులు అడగ్గా ఆమె గొలుసు పోయిన విషయం గుర్తించి షాకయ్యారు. ఈ విషయంపై బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆటో నడిపిన వ్యక్తి ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చైన్ స్నాచింగ్ బంజారా హిల్స్: ఇంటి ముందు నిలబడిన మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు తస్కరించిన ఘటన శుక్రవారం రాత్రి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పొలీసులు తెలిపిన వివరాలు.. శ్రీనగర్ కాలనీ సమీపంలోని ఎల్లారెడ్డిగూడ ఆర్ బీఐ క్వార్టర్స్ ఎదురుగా నివసించే విజయలక్ష్మి (44) అనే మహిళ శుక్రవారం రాత్రి 9 సమయంలో భోజనం చేసి వచ్చి ఇంటి ముందు నిలబడింది. అమె నిలబడ్డ రెండు మూడు నిమిషాలకే నంబర్ ప్లేట్ లేని పల్సర్ బైక్‌పై ముసుగులు ధరించి వచ్చిన ఇద్దరు ఆగంతకులు ఆమె మెడలోని రెండు తులాల మంగళ సూత్రాన్ని లాక్కొని క్షణాల్లో పరారయ్యారు. ఒక్క ఉదుటన గొలుసు లాగడంతో ఆమె కింద పడి పోయింది. ఆమె కేకలు విని కుటుంబం సభ్యులు బయటకు వచ్చి ప్రథమ చికిత్స చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్‌లో మహిళా దొంగల ముఠా హల్చల్
-
దేవాలయంలో గొలుసు చోరీ
అత్తాపూర్ (హైదరాబాద్) : బల్కంపేట ఎల్లమ్మ దేవాలయానికి వెళ్లిన ఓ భక్తురాలి నుంచి దొంగలు గొలుసు చోరీ చేశారు. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకునేందుకు నర్సమ్మ (65) అనే మహిళ శుక్రవారం ఆలయానికి వెళ్లారు. అయితే ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసు మాయం కావడంతో బాధితురాలు ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
మహిళపై కత్తితో దాడి: చైన్ స్నాచింగ్
(గూడూరు అర్బన్) నెల్లూరు : గూడూరు పట్టణ నడిబొడ్డున ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి సుబ్బమ్మ(40) అనే మహిళపై కత్తితో దాడి చేశాడు. దాడి అనంతరం మహిళ మెడలో ఉన్న 3 సవర్ల బంగారు గొలుసుతో పరారయ్యాడు. తీవ్రగాయాలపాలైన సుబ్బమ్మను చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళ మెడలో గొలుసు చోరీ
నల్లగొండ (తిరుమలగిరి) : నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలానికి చెందిన బొబ్బలి పిచ్చమ్మ అనే మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ జరిగింది. శనివారం మండల కేంద్రానికి సమీపాన ఉన్న ఓ వ్యవసాయ బావి వద్ద గేదెలు మేపుతుండగా బైకుపై వచ్చిన ఇద్దరు దుండగులు మహిళను బెదిరించి మెడలో ఉన్న బంగారు గొలుసును ఎత్తుకెళ్లారు. మహిళ అరిచినా దగ్గరలో ఎవరూ లేకపోవడంతో లాభం లేకుండా పోయింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
మహిళ మెడలో పుస్తెలతాడు అపహరణ
కీసర : రంగారెడ్డి జిల్లా కీసర మండలం కరీంగూడలో సోమవారం మధ్యాహ్నం ఓ మహిళ మెడలోని పుస్తెల తాడును దుండగుడు అపహరించుకుపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. మంజుల(30) అనే వివాహిత ఇంట్లో టీవీ చూస్తుండగా మధ్యాహ్నం 1 గంట సమయంలో ఓ దుండగుడు తలుపు తట్టాడు. మంజుల తలుపు తీయడం ఆలస్యం ఆమె ముఖంపై మత్తుమందు చల్లి, మెడలోని నాలుగు తులాల బంగారు పుస్తెల తాడును తెంపుకుని పరారయ్యాడు. అయితే అదే సమయంలో ఇంట్లో ఉన్న మంజుల భర్త భాస్కర్‌రెడ్డి, మామ రాజారెడ్డి అప్రమత్తమై దుండగుడిని పట్టుకునే ప్రయత్నం చేసినా అతడు చిక్కలేదు. దీనిపై బాధితులు కీసర పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఆసుపత్రిలో బంగారు గొలుసు చోరీ
ఘట్కేసర్ (రంగారెడ్డి) : గుర్తుతెలియని దుండగులు మహిళ నుంచి నాలుగు తులాల బంగారు గొలుసును చోరీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా బీబీనగర్ మండలం పిలాయిపల్లి గ్రామానికి చెందిన రాజమణి(65) కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది రెండు రోజుల క్రితం గుర్తుతెలియని విషం తాగింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను ఘటకేసర్లోని కమ్యూనిటీ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటుంది. కాగా మండలంలోని ఘణాపూర్కు చెందిన ఆమె కూతురు మాధవీ ఆదివారం రాత్రి అటెండర్‌గా తల్లి మంచం పక్కన పడుకుంది. మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు గొలుసును పర్సులో దాచింది. అయితే ఉదయం లేచి చూసి సరికే పర్సు కనిపించలేదు. దీంతో పాటు పక్కన మంచం మీద చికిత్స పొందుతున్న యువకుడు కనిపించకుండాపోయాడు. ఆ యువకుడే చోరీ చేసి ఉండివచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఒంగోలులో చైన్‌స్నాచింగ్
ఒంగోలు క్రైం : నగరంలోని నిర్మల్‌నగర్‌లో ఆదివారం ఉదయం చైన్‌స్నాచింగ్ జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళను అడ్డగించి బలవంతంగా ఆమె మెడలోని 10 సవర్ల బంగారు గొలుసును లాక్కెళ్లారు. నిర్మల్‌నగర్ 3వ లైనులో నివాసం ఉంటున్న ధనుంజయ రజనీకుమారి ఇంటి నుంచి సమీపంలో ఉన్న అపార్టుమెంట్ వద్దకు నడుచుకుంటూ వె ళ్తోంది. ఈలోగా ఇద్దరు యువకులు అత్యంత ఖరీదైన ద్విచక్ర వాహనంపై ఆమె వద్దకు వచ్చారు. ద్విచక్ర వాహనాన్ని ఒక యువకుడు పక్కన ఆపి ఇంజిన్‌ను రన్నింగ్‌లోనే ఉంచాడు. మరో యువకుడు దగ్గరకు నడుచుకుంటూ వచ్చి ఆమె మెడలోని బంగారు గొలుసును లాగే ప్రయత్నం చేశాడు. అప్పటికీ ఆమె అతనితో పెనుగులాడింది. అయినా లాభం లేకపోయింది. ఆమె మెడలోని 10 సవర్ల బంగారు గొలుసు తెంపుకెళ్లాడు. పక్కనే ఆపి ఉన్న ద్విచక్రవాహనంపై ఇద్దరూ వేగంగా వెళ్లిపోయారు. ఉదయం 6 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. పరిసరాల్లో ఎవరూ లేకపోవడంతో చైన్‌స్నాచర్లు దర్జాగా పారిపోయారు. -
ఫుట్‌బోర్డుపై గొలుసు కొట్టేసిన ఘనులు
హైదరాబాద్: ఆర్టీసీ బస్సులో ఫుట్‌బోర్డుపై అడ్డంగా నిలబడి... ఓ ప్రయాణికుడి మెడలోని రెండు తులాల బంగారు గొలుసుతో ఉడాయించారు కొందరు కేటుగాళ్లు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... శుక్రవారం సాయంత్రం 6గంటల ప్రాంతంలో అంబర్‌పేటకు చెందిన దాసరి శ్రీధర్ సాయంత్రం వేళ బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్ వద్ద బస్సు ఎక్కి పెన్షన్ ఆఫీసు వద్ద బస్సు దిగేందుకు ప్రయత్నించగా ఆరుగురు యువకులు ఫుడ్‌బోర్డుపై అడ్డుకున్నారు. అందులో ఒక వ్యక్తి ఫిట్స్ వచ్చినట్లు నటించాడు. దాసరి శ్రీధర్ ఆ వ్యక్తిని పైకి లేపేందుకు ప్రయత్నించాడు. బస్సు ఆపడంతో ఇంతలోనే ఆ ఆరుగురు యువకులు పరారయ్యారు. అది గమనించిన శ్రీధర్ తన మెడలో చూసుకోగా రెండు తులాల బంగారు గొలుసు కనిపించలేదు. దీంతో వెంటనే సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
మత్తుమందు ఇచ్చి గోల్డ్ వర్క్ షాపును దోచేశాడు...
సిద్దిపేట రూరల్(మెదక్): నగల దుకాణానికి వచ్చిన ఓ వ్యక్తి ఆ దుకాణం యాజమానికి మత్తుమందు దిచ్చి దోచుకుపోయాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా సిద్దిపేటలోని పటేల్పురాలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు...సిద్దిపేట మండలంలోని పొన్నాల గ్రామానికి చెందిన ఉప్పల వీర బ్రహ్మాచారి పట్టణంలోని పటేల్ పురాలో గోల్డ్ వర్క్‌షాప్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం గ్రామం నుంచి షాపుకు వచ్చాడు. బ్రహ్మాచారి షాపులో ఉండగా గుర్తు తెలియని ఓ వ్యక్తి వచ్చి ఉంగరం చేయాలంటూ మాటలు కలిపాడు. నమ్మకంగా దగ్గరికి వచ్చి అతని ముక్కు వద్ద కర్చీఫ్ వాసన చూపాడు. మత్తు ఆవరించటంతో వీరబ్రహ్మాచారి స్పృహ కోల్పోయాడు. ఈ క్రమంలో ఆగంతకుడు అక్కడున్న ఐదు తులాల బంగారు నగలు తీసుకెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత పక్క దుకాణం యజమానులు వచ్చి బ్రహ్మాచారిని నిద్ర లేపారు. జరిగిన విషయంపై బాధితుడు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ ఎస్ఐ వరప్రసాద్ తెలిపారు. -
మణుగూరు ఎక్స్ ప్రెస్ లో బంగారు గొలుసు చోరీ
వరంగల్: సికింద్రాబాద్ నుంచి భద్రాచలం వెళ్తున్న మణుగూరు ఎక్స్‌ప్రెస్‌లో శనివారం రాత్రి చోరీ జరిగింది. వివరాలు...వరంగల్ రైల్వే స్టేషన్ దాటిన తర్వాత కేస సముద్రం రైల్వేస్టేషన్లో రైలు ఆగింది. సికింద్రాబాద్ న్యూబోయిన్‌పల్లికి చెందిన తాళ్ల విజయలక్ష్మి ఈ రైలులో కుటుంబంతో కలిసి భద్రాచలం బయలుదేరింది. కిటికీ పక్కన కూర్చున్న విజయలక్ష్మి మెడలో నుంచి 3 తులాల బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తి లాక్కెళ్లాడు. చేసేదేమీ లేక తిరిగి వరంగల్ చేరుకుని రైల్వే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వరంగల్ జీఆర్పీ సీఐ రవికుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళ మెడలోని గొలుసు చోరీ
హైదరాబాద్ సిటీ: రోజురోజుకూ హైదరాబాద్ లో దొంగలు పేట్రేగిపోతున్నారు. దీంతో మహిళలు ఆభరణాలు ధరించి బయటికి వెళ్లటానికే భయపడుతున్నారు. తాజాగా శనివారం ఉదయం 11 గంటలకు..కూకట్పల్లి పరిధిలోని నిజాంపేట విజ్ఞాన్ కాలేజి సమీపంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు గుడికి వెళ్లి వస్తున్న సరస్వతి(50) అనే మహిళ మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసును లాక్కొని బైక్ పై ఉడాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. -
పిస్టల్‌తో బెదిరించి తాళితో పరారీ
శ్రీకాకుళం: టెక్కలి మండల కేంద్రంలోని వెంకటేశ్వరకాలనీలో ఓ దుండగుడు బీభత్సం సృష్టించాడు. తంగుడు స్వప్న అనే మహిళ మెడలో నుంచి తాళిని లాక్కుని వెళ్తుండగా.. ఆమె ప్రతిఘటించడంతో అతడు కాల్పులు జరిపాడు. ఈ ప్రమాదంలో ఆమె కాలుకి గాయమైంది. దుండుగుడు ఆమెను పిస్టల్‌తో బెదిరించి పుస్తెలతాడు తీసుకుని పరారయ్యాడు. సమాచారం అందుకున్న శ్రీకాకుళం జిల్లా ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. (టెక్కలి) -
నేను గానీ.. ఫోన్ గానీ చేశానంటే..
గుర్ల: పట్టపగలు..నలుగురూ నడయాడే మండల కేంద్రం...సినీ ఫక్కీలో ఓ ఘరానా మోసగాడు.. మహిళ మెడలోని రెండు తులాల బంగారు తాళిని తీసుకుని పరారయ్యాడు. గుర్ల పోలీసులు, స్థానికులు, బాధితురాలు అందించిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని గూడెం గ్రామానికి చెందిన రుంకాన పైడితల్లి అలియాస్ తట్టు (52)అనే మహిళ తన మనుమరాలి పేరును రేషన్‌కార్డులో చేర్పించాలనే.. ఉద్దేశంతో మండలం కేంద్రం గుర్లలో ఉన్న మీసేవ వద్దకు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డులను పట్టుకుని వెళ్లింది...జనన ధ్రువీకరణ పత్రం లేకపోతే రేషన్‌కార్డులో పేరు నమోదు చేయడం జరగదని ధ్రువీకరణ పత్రం పట్టుకుని సోమవారం రమ్మని మీసేవ ఆపరేటర్ చెప్పాడు. దీంతో ఆమె సోమవారం వద్దామనుకుని ఆమె అక్కడ నుంచి గూడెం వెళ్లి పోవాలని నిర్ణయించుకుని ఆటోలో ప్రయాణించి విజయనగరం , పాలకొండ రహదారిపై ఉన్న గూడె జంక్షన్ వద్ద దిగింది. అక్కడ నుంచి గ్రామానికి కాలినడకన వస్తుండగా అదే రోడ్డుపై ఎదురుగా గుర్తుతెలియని ఓ అపరిచిత వ్యక్తి మోటారు సైకిల్‌పై వచ్చి.. ఆమె ముందు ఆపి ... పెద్దమ్మా ఏం వచ్చావని పరిచయం ఉన్న వ్యక్తిలా పలకరించాడు.. ఏమీ లేదు నాయనా రేషన్‌కార్డులో నా మనుమరాలి పేరు చేర్పిద్దామని వచ్చాను.. పని అవ్వక తిరుగుముఖమయ్యానని చెప్పింది. నేను ఒక్క ఫోన్‌కాల్ చేస్తే తహశీల్దారు రేషన్‌కార్డులో పేరు చేర్పిస్తాడు... నా బండి ఎక్కు అన్నాడు. నిరక్ష్యరాస్యత, పల్లెటూరి అమాయకత్వం కలిగిన ఆమె ఘరానా మోసగాడి మాటలు నమ్మి బండి ఎక్కింది. అపరిచిత వ్యక్తి ఆమెను నేరుగా తహశీల్దారు కార్యాలయం వద్దకు తీసుకు వెళ్లి రేషన్‌కార్డుకు జిరాక్స్‌లు తీయించాడు...అనంతరం ఫొటోలు కూడా తీయించాలని ఆమెతో చెప్పి తీసుకు తీసుకెళ్లాడు. తహశీల్దారు కార్యాలయం నుంచి గుర్ల జంక్షన్‌కు తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలో కెల్ల జంక్షన్ వద్ద బండి ఆపి పెద్దమ్మా... రేషన్ కార్డులు పేదవారికి ఇస్తారు.. బంగారు తాళి మెడలో ఉంటే.. ధనవంతులు అనుకుని ఉన్న రేషన్‌కార్డు కట్ చేస్తారని చెప్పి ఫొటో తీసే ముందు మెడలోని తాడు తీసి పట్టుకో అని చెప్పాడు. అపరిచిత వ్యక్తి చెప్పిన ప్రకారం ఆమె మెడలోని తాడు తీసి చేత్తో పట్టుకుంది. ఈ లోగా అపరిచిత వ్యక్తి బండిని స్టార్ట్‌చేసి గేరు వేశాడు... పెద్దమ్మా బండెక్కు అన్నాడు.. ఆమె బండి ఎక్కడంలో ఇబ్బంది పడుతుండగా... చేతిలో తాళి పట్టుకుని ఎక్కలేకపోతున్నావు.. ఆ తాడుని నేను పట్టుకుంటాను ఇవ్వు.. అని ఆ వ్యక్తి అన్నాడు. అలాగే నాయనా నువ్వు పట్టుకో అని చెప్పి ఆమె అతని చేతికి బంగారు తాళి ఇచ్చింది. దీంతో ఆ వ్యక్తి బంగారుతాడు అందుకుని క్షణంలో అక్కడ నుంచి పరారయ్యాడు. ఆ వెంటనే ఆమె పెద్దగా గోల చేయడంతో స్థానికులు చుట్టుముట్టారు. ఈలోగా అపరిచిత వ్యక్తి మోటారు సైకిల్‌పై పరారయ్యాడు. అనంతరం బాధితురాలు స్థానిక పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయడంతో ఎస్సై నీలకంఠం కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఒంటరిగా వెళ్తే గొలుసు గోవిందా !
తాళి బొట్టుకు రక్షణ కరువైంది. మెడలో బంగారం వేసుకుంటే చాలు దొంగలు ఎగబడుతున్నారు. పట్టపగలే బంగారు గొలుసులను లాక్కుని బైకులపై దర్జాగా పారిపోతున్నారు. వారానికో చైన్‌స్నాచింగ్ జరుగుతుండడంతో మహిళలు నగలు ధరించి గడపదాటాలంటేనే వణుకుతున్నారు. కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలో మూడు నెలల కాలంలో పదికి పైగా చైన్‌స్నాచింగ్‌లు జరిగాయి. ఇళ్ల ముందు నిల్చున్నా, రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్నా దొంగలు మహిళల మెడలోని గొలుసులపై కన్నేస్తున్నారు. కామారెడ్డి పట్టణంలో గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇంటి గేటుదాటి బయటకు వచ్చిన గజవాడ సుగుణ అనే మహిళ మెడలో నుంచి ఆరు తులాల బంగారు గొలుసులను దొంగలు లాక్కు ని పరారయ్యారు. దొంగలు ఒక్కసారి గా ఆమె మెడలో నుంచి చైన్ లాగడంతో కిందపడిపోయి అరిచినా లాభం లేకుం డా పోయింది. మూడు రోజుల క్రితం కామారెడ్డి పట్టణానికి సమీపంలోని నర్సన్నపల్లి చౌరస్తా వద్ద ఆటోలో వస్తు న్న మహిళ మెడలో నుంచి గొలుసును లాక్కున్నారు. అంతకన్నా వారం రోజు ల ముందు పట్టణంలోని విద్యానగర్ కా లనీలో లక్ష్మి అనే మహిళ మెడలో నుంచి చైన్‌ను లాక్కుని పరారయ్యారు. ఇలా వరుసగా కామారెడ్డి పట్టణంలో గొలు సు దొంగతనాలు జరుగుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.... గొలుసు దొంగతనాలను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటు న్నా ఫలితం కనిపించడం లేదు. పోలీ సులు తనిఖీలు నిర్వహిస్తున్నా దొంగలు మాత్రం ఎక్కడో ఒక చోట తమ పని కానిచేస్తున్నారు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న కాలనీలు, వీధుల్లోనే ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయి. రోడ్లపై జనసంచారం లేని ప్రాంతాలను ఎంచుకుని దొంగలు మహిళల మెడలో నుంచి చైన్లు లాక్కెళుతున్నారు. చైన్ స్నాచర్లు, దొంగలను పోలీసులు అరెస్టు చేసినట్టు చూపుతున్నా చోరీలు మాత్రం ఆగడం లేదు. పెళ్లిళ్ల సీజన్లో పెరిగిన చోరీలు... మహిళలు సాధారణంగా తాళిబొట్టుతో ఉన్న బంగారు గొలుసును రెగ్యులర్‌గా ధరిస్తారు. అదే శుభ ముహూర్తాల సమయంలో పెళ్లిళ్లు, ఫంక్షన్లకు వెళ్లే సమయంలో తమకు ఉన్న ఆభరణాలన్నిటినీ ధరించడానికి ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో మహిళలు నగలు ధరించి వెళ్లే సందర్భంలో చైన్ స్నాచింగులు జరుగుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. తమ వెంట మగవారు లేకుండా బయటకు వెళ్లడానికి జంకుతున్నారు. మరింత నిఘా అవసరం పట్టణంలో పెరిగిన దొంగతనాల నివారణకు పోలీసులు మరింత నిఘా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మూ డు జిల్లాల కూడలి కావడం వల్ల ఇక్కడి కి నిత్యం వేలాది మంది ప్రజలు వచ్చిపోతుంటారు. అయితే అనుమానితులపై నిఘా ఉంచి వారిని ప్రశ్నించడం ద్వారా కొంత వరకు దొంగతనాలను అరికట్టవచ్చని అంటున్నారు. పాత నేరస్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆరు తులాలు.. కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలోని వివేకానంద కాలనీలో గురువారం ఉదయం ఓ మహిళ మెడలో నుంచి బైకుపై వచ్చిన ఇద్దరు దుండగులు ఆరు తులాల గొలుసులను లాక్కెళ్లారు. ఇంటి గేటు నుంచి బయటకు వచ్చిన గజవాడ సుగుణ వద్దకు వచ్చిన యువకుడు మెడలో నుంచి బంగారు గొలుసులను లాక్కున్నాడు. బలంగా లాగడంతో సుగుణ కిందపడిపోయింది.చైన్ లాక్కున్న దొంగలు బైకుపై పరారయ్యారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
పుట్టిన 28 రోజులకే రూ. 24 లక్షలు
దుబాయ్: ‘కలిసొచ్చే కాలమొస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడన్న’ చందాన పుట్టిన 28 రోజులకే ఓ పాప తన కుటుంబానికి లక్షల రూపాయల విలువైన బహుమతులను సాధించి పెట్టింది. నవజాత శిశువు నితేరా బారసాల కోసం ఆమె తండ్రి అనిల్ జనార్దనన్ (కేరళవాసి) 2 దిర్హమ్ల (సుమారు 34 వేల) విలువైన బంగారు చైన్, గాజుల్ని దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్లో తీసుకున్నారు. ఈ సందర్భంగా మూడు కూపన్లు ఆ పాప పేరు మీద నింపారు. అదే వారికి కనకవర్షం కురిపించింది. నితేరా షాపింగ్ ఫెస్టివల్లో విజేతగా నిలిచింది. లక్షా 40 వేల దిర్హమ్ల (రూ. 24 లక్షలు) విలువైన బంగారు, వజ్రాల నగలను సాధించింది. -
తెగబడిన దొంగలు
* కత్తితో మహిళను బెదిరించి 7 తులాల బంగారు గొలుసు, రూ. 1.5 లక్షలు దోపిడీ * ఇబ్రహీంపట్నం నగర పంచాయతీ కౌన్సిలర్ ఇంట్లో ఘటన ఇబ్రహీంపట్నం: దొంగలు బరితెగించారు. ఓ ఇంట్లోకి చొరబడి ఒంటరిగా ఉన్న మహిళను కత్తితో బెదిరించి 7 తులాల బంగారు గొలుసుతో పాటు రూ. 1.5 లక్షల నగదు అపహరించుకుపోయారు. ఈ సంఘటన ఇబ్రహీంపట్నంలోని ఎంబీఆర్‌నగర్‌లో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. ఎంబీఆర్‌నగర్‌లో నగర పంచాయతీ కౌన్సిలర్ ఆకుల యాదగిరి నివాసముంటున్నారు. ఆయన రియల్ వ్యాపారం చేస్తుంటారు. ఉదయం బయటకు వెళ్లిన ఆయన సాయంత్రం ఇంటికి వచ్చారు. రూ. 1.5 లక్షలు హాల్లోని టేబుల్ డ్రాలో ఉంచి తిరిగి బయటకు వెళ్లారు. 6:30 గంటలకు ముగ్గురు యువకులు ఇంటికి వచ్చారు. ఒంటరిగా ఉన్న యాదగిరి భార్య వసంత ఏం కావాలి..? అని వారిని ప్రశ్నించింది. టూలెట్ బోర్డు ఉందని ఇంటి అద్దె కోసం వచ్చామని తెలిపారు. గదులు అద్దెకు లేవని ఆమె వారికి చెప్పింది. ఇంతలో యువకులు సోఫాసెట్లో కూర్చున్నారు. దాహంగా ఉంది, నీళ్లు కావాలని తెలిపారు. యువకుల తీరును అనుమానించి వసంత కొంతసేపు అక్కడే నిలబడింది. ఇంతలోనే యువకులు సోఫాలోంచి లేచి వసంత వద్దకు వచ్చారు. ఆమెను కత్తితో బెదిరించి మెడలో ఉన్న ఏడు తులాల బంగారు గొలుసును తెంచుకున్నారు. ఈక్రమంలో వసంత ప్రతిఘటించడంతో ఆమెచేతికి కత్తి తగిలి గాయమైంది. ఒక్కసారిగా షాక్‌కు గురైన వసంత కుప్పకూలిపోయింది. క్షణాల వ్యవధిలో మిగతా ఇద్దరు దుండగులు బీరువాలను తెరచి సోదా చేశారు. హాల్లోని టేబుల్ డ్రాలో ఉన్న రూ, 1.5 తీసుకున్నారు. వసంత తేరుకునేలోపు బైక్‌పై పరారయ్యారు. కొద్దిసేపటి తర్వాత తేరుకున్న వసంత విషయం స్థానికులకు చెప్పింది. సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం ఏసీపీ నారాయణ, సీఐ మహమ్మద్‌గౌస్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూంస్టీం, జాగిలాలతో ఆధారాలు సేకరించారు. దుండగులు తెలుగు, హిందీ భాషల్లో మాట్లాడారని బాధితురాలు పోలీసులకు చెప్పింది. వసంత ప్రస్తుతం స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి భర్త ఆకుల యాదగిరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చోరీకి యత్నం, పీఎస్‌లో ఆత్మహత్యాయత్నం
-
చోరీకి యత్నం, పీఎస్‌లో ఆత్మహత్యాయత్నం
గుంటూరు : చోరీకి పాల్పడిన ఓ మహిళ పోలీస్ స్టేషన్లో శనివారం ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా వినుకొండ బస్టాండ్‌లో బస్సు కోసం వేచి ఉన్న ప్రయాణికురాలి మెడలోని బంగారు గొలుసు చోరీకి యత్నించిందో ఓ మహిళ. ఇంతలో బాధిత మహిళ గట్టిగా అరవటంతో అప్రమత్తమైన స్థానికులు ...చోరికి యత్నించిన మహిళను పట్టుకుని దేహశుద్ది చేశారు. అనంతరం ఆమెను పోలీసులకు అప్పగించారు. నిందితురాలు పోలీస్ స్టేషన్లో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
హడలెత్తిస్తున్న ‘బైకు’ దొంగలు
కామారెడ్డి: పట్టణంలో బైకులను ఎత్తుకెళ్లడంతో బాటు ఒంటరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్ చేస్తున్నారు. తాళం వేసిన ఇళ్లను వదలడం లేదు. దొంగతనాల విషయంలో పట్టణ పోలీసులు పెద్దగా పట్టించుకోకపోవడంతో దొంగలకు అడ్డూ లేకుండాపోతోంది. సోమ, మంగళవారాల్లో పట్టణంలో మూడు బైకుల ను దొంగలు ఎత్తుకెళ్లారు. అలాగే పట్టణంలోని విద్యానగర్‌కాలనీలో ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును తెంపి ఎత్తుకెళ్లే ప్రయత్నం చేయగా మహిళ గొలుసును గట్టిగా పట్టుకుని అరవడంతో దొంగలు పరారయ్యారు. హైదరాబాద్ రోడ్డు లో ఉన్న రుద్ర ఆస్పత్రిలో పనిచేసే కే.రాము అనే యువకుడు మంగళవారం ఉదయం తన ఏపీ 28 ఏహెచ్ 5782 నంబరు గల స్ప్లెండర్ బైకును ఆస్పత్రి వద్ద పార్కు చేసి లోనికి వెళ్లాడు. అయితే ఉద యం 11.30 గంటల ప్రాంతంలో బైకును గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. దొంగతనం దృశ్యాలు ఆస్పత్రి నిఘా కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. సోమవారం రెండు బైకులను దొంగలు ఎత్తుకెళ్లడం, మహి ళ మెడలో నుంచి బంగారు గొలుసు చోరీకి యత్నిం చిన సంఘటనలతో అప్రమత్తంగా ఉండాల్సిన పట్టణ పోలీసులు పెద్దగా పట్టించుకున్న పాపానపోలేదని పలువురు ఆరోపిస్తున్నారు. తనిఖీల పేరుతో అమాయకులను ఇబ్బందులు పెట్టడమే తప్ప నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నించ డం లేదని పలువురు పేర్కొన్నారు. అలాగే పట్టణంలో తాళాలు వేసి ఉన్న ఇళ్లను కూడా దొంగలు వదలడం లేదు. కాకతీయనగర్ కాలనీలో తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారు. పట్టణంలో మహిళలు ఆభరణాలు ధరించి ఒంటరిగా తిరిగే పరిస్థితులు లేకుండాపోయాయి. రెండు మూడు రోజుల్లో శుభ ముహూర్తాలు ఉన్న నేపథ్యంలో పెళ్లిళ్లు జోరుగా సాగనున్నాయి. పెళ్లిళ్లు, ఫంక్షన్ల కోసం ఆభరణాలు ధరించి వెళ్లే మహిళలు దొంగతనాల నేపథ్యంలో ఆందోళన చెందుతున్నారు. -
నటి శ్రీలక్ష్మి కేసులో సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలన
హైదరాబాద్ : సినీనటి శ్రీలక్ష్మి నగలను స్నాచింగ్ చేసిన నిందితులను పట్టుకునేందుకు ఎస్ఆర్ నగర్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం శ్రీలక్ష్మి యూసఫ్‌గూడలోని అయ్యంగార్ బేకరీకి వచ్చి వెళ్తుండగా దుండగలు ఆమె మెడలోని 8 తులాల బంగారు నగలను తెంచుకెళ్లిన విషయం తెలిసిందే. కారు వద్దకు ఆమె ఒంటరిగా వస్తున్నట్లు గమనించి దుండగులు స్నాచింగ్‌కు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే శ్రీలక్ష్మిని ఎక్కడి నుంచి వెంబడించారన్న దానిపై విచారణ జరుపుతున్నారు. శ్రీనగర్ కాలనీలోని శ్రీలక్ష్మి నివాసం నుంచి యూసుఫ్‌గూడలోని బేకరీ వరకు ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. గురువారం సాయంత్రం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన శ్రీలక్ష్మికి ...ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని అందచేశామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శంకర్ తెలిపారు. -
సినీనటి మెడలో గొలుసు లాక్కెళ్లారు!
హైదరాబాద్: సినీ హాస్యనటి శ్రీలక్ష్మి మెడలోని బంగారు గొలుసును ఇద్దరు దుండగులు లాక్కొని పారిపోయారు. యూసఫ్‌గూడలో నివాసం ఉంటున్న శ్రీలక్ష్మి సమీపంలోని షాపుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ చోరీ జరిగింది. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు ఆమె మెడలోని గొలుసు లాక్కొని వెళ్లిపోయారు. శ్రీలక్ష్మి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ** -
స్త్రీ కన్నీళ్లు వర్సెస్ ఇస్త్రీ పెట్టె!
ఉత్త(మ)పురుష ‘‘సరే నువ్వు కోరినట్టే గోల్డ్ చైన్ ఇప్పిస్తా గానీ ఇక ఆ నల్లా కట్టేయ్. ఎప్పుడూ రెడీగా ఉంటుంది నెత్తి మీద కుళాయి. ఈ కుళాయి ఉందని మీకు మహా బడాయి. అందుకే చిన్న మాట అన్నా సరే... ట్యాప్ విప్పేస్తుంటారు. టాప్ లేపేస్తుంటారు’’ కాస్త చీవాట్లు పెడుతున్న ధోరణిలో అన్నారాయన. ‘‘మీరు బంగారం ఇప్పించకపోయినా పర్లేదు. కానీ వెటకారంగా మాత్రం మాట్లాడకండి. ఇప్పుడు నా కన్నీళ్ల కుళాయి మీ ఎగతాళికే’’ అన్నాను వెక్కుతూ. ఆత్మాభిమానం మగాళ్ల కంటే ఆడవాళ్లలోనే ఎక్కువగా ఉంటుందని నాకు మా ఆయన మాటల్లో చాలాసార్లు అర్థమైంది. మనం ఏదో గోముగా అడుగుతామా? వెంటనే వాళ్లు ఖండించేస్తారు. మనం కన్నీళ్లు పెట్టుకుంటాం. అడిగింది ఇవ్వనందుకు మనం ఏడుస్తున్నామని వాళ్లనుకుంటారు. కానీ మన కన్నీళ్లు అది దక్కనందుకు కాదు. అనగానే మాట కాదన్నందుకు. కాదనేలా మాట పడినందుకు. ఈ విషయం ఈ మగాళ్లకు ఎందుకు అర్థం కాదు? అసలు జరిగిన విషయం ఏమిటంటే... ఆ మధ్య బంగారం తులం ముఫ్ఫై రెండు వేల నుంచి అకస్మాత్తుగా ఇరవై ఐదువేలకు పడిపోయింది. ఇదే టైమ్‌లో ఓ యాభై వేలు అప్పు చేసైనా రెండు తులాల గోల్డ్ చైన్ తీసుకుంటే దాదాపు పదిహేను వేలు ఆదా అవుతుంది. భవిష్యత్తులో రేటు పెరిగితే అప్పుడు బంగారం కొనలేకపోయామే అన్న బాధా తప్పుతుంది. ఇది నా ఆలోచన. ఇదే విషయం చెప్పీ చెప్పగానే ఆయన డెలివరీ చేసిన డైలాగ్లన్నమాట అవి! మాటకు మాట జవాబిచ్చాను కానీ నాకు తెలియకుండానే దొర్లిపోయాయి కన్నీళ్లు. ఇలా ఏడుపుకు దిగినప్పుడల్లా ఆయన అనే మాట ఒక్కటే. ‘‘దేన్నెనా మీ ఆడాళ్లు ఏడ్చి సాధించగలరోయ్’’ అని. మా ఏడుపు ఎవరినో సాధించి, ఏదో సాధించుకుందామని కాదనీ, ఆత్మాభిమాన సాధన కోసమేనని ఈ మగాళ్లకు ఎప్పుడర్థమవుతుందో ఏమో?! ఎక్కడ అప్పు చేశారో, ఎలా సంపాదించారోగానీ... ఓ రెండు తులాల చైన్ చేయించి తెచ్చి, ‘‘నువ్వు కోరినట్టే చైన్ తెచ్చా... నవ్వు లేదు! గోల్డు తెచ్చినా బోల్డు ఆనందమేమీ కనిపించడం లేదేమిటోయ్’’ అన్నారు. ‘‘చెప్పాగా మహానుభావా... నా కోరిక గొలుసుల కోసం కాదు. తళుకుల కోసం కాదు. అయినా... మీరు వేడి బండలా మండిపోతుంటారు. మా కన్నీళ్లు దానిపై పడితే సుయ్‌మంటూ ఆవిరే. మీరేదో కోపంతో కాలిపోతూ కూడా మాకు ఉపకారం చేస్తున్న ఇస్త్రీ పెట్టెలా పోజెడతారు. ముక్కు మీది నుంచి జారే చెమటైనా, కళ్ల నుంచి కారే కన్నీరైనా ఇస్త్రీ మీద పడ్డా సుయ్‌మంటూ ఇగిరిపోవాల్సిందే కదా. లోహపురుషుల దగ్గర ఇక నవ్వెక్కడా, ఆనందమెక్కడా’’ అంటూ దెప్పిపొడిచా. మొన్న ఒకరోజు ఆయనకు ఛాతీనొప్పి వచ్చింది. ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. ఆయనకు బాధతో చెమటలు పడితే, నాకు ఆందోళనతో చెమటలు పట్టాయి. ఆయన ఆయాసపడితే నేను ప్రయాసపడ్డా. అదేదో కార్పొరేట్ ఆసుపత్రి. ఇన్‌పేషెంట్‌గా చేర్చాలంటే ముందుగానే అడ్వాన్సుగా డబ్బు కట్టాలట. ఫస్టొచ్చాక కాసు కళ్లపడేది మళ్లీ ఫస్టుకే. నెల చివర్లో అంత డబ్బంటే ఎలా? అందుకే ఆపదలో ఆయన తెచ్చిన గోల్డు చైనే అక్కరకొచ్చింది. ‘‘నీ గోల్డు చైను ఇన్సూరెన్సు కంపెనీ బాగా పనికొచ్చిందోయ్’’ అంటూ ఓ కాంప్లిమెంటు పడేశారు మా సారూ, శ్రీవారూ. నిజం చెబుతున్నా... ఆయాసం వచ్చినప్పుడు లేదూ... ఆసుపత్రిలో చేర్చినప్పుడు లేదూ... డిశ్చార్జి అయి ఇంటికొచ్చాక నిశ్చింత ధ్వనిస్తూ అన్న ఆ మాటతో అప్పుడొచ్చాయి కన్నీళ్లు. -
పోలీసుల అదుపులో మహిళా దొంగలు
నిజామాబాద్క్రైం, న్యూస్‌లైన్ : ఆస్పత్రికి వెళ్తున్న ఓ మహిళపై తోటి మహిళలే మీదపడి బంగారం చైన్ తస్కరించారు. మెడలో నుంచి చైన్ దొంగలించినట్లు గమనించిన ఆ మహిళ అప్రమత్తమై కేకలు వేసింది. దీంతో ఓ కానిస్టేబుల్ వెంటపడి దొంగను పట్టుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని చంద్రనగర్‌కు చెందిన అంబట్ల సునీతతోపాటు మరొకరు సోమవారం ఉదయం ఖలీల్వాడిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి ఆటోలో వచ్చారు. అదే ఆటోలో తమిళనాడుకు చెందిన నలుగురు మహిళలు ఎక్కారు. ఆటో ఖలీల్‌వాడికి వచ్చేంతలోపు ఈ ముఠా మూడుసార్లు సునీతపై పడినట్లు నటించి ఆమె మెడలో ఉన్న బంగారు చైన్ కత్తిరించారు. చైన్ ఆటోలోనే కిందపడిపోయింది. దాన్ని ముఠాలోని ఓ మహిళ తీసుకుంది. సునీత మెడలో చైన్ లేక పోవటాన్ని గమనించిన సహచర మహిళ ఆమెకు చెప్పింది. దీంతో సునీత ఆటోలో ఉన్న మహిళలతో మీరే నా చైన్ దొంగలించారంటూ కేకలు పెట్టింది. కంగారు పడిన ముఠా సభ్యులు చైన్‌ను కింద పారేసి తలోదిక్కుకు పారిపోతుండగా అక్కడి కళాశాల వద్ద పరీక్ష బందోబస్తు నిర్వహిస్తున కానిస్టేబుల్ హైమద్ వారి వెంటపడి ఒకరిని పట్టుకున్నాడు. మిగతా ముగ్గురుని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ నలుగురి ముఠా సభ్యులను ఒకటోటౌన్ కు తరలించారు. వీరి గురించి ఆరా తీస్తున్నట్లు సమాచారం. -
ఒక్క గొలుసు - ఎనభై మంది 'దొంగలు'
పోయింది ఒక్క బంగారు గొలుసు. కానీ పోలీసులు నాలుగు గంటల్లో ఏకంగా ఎనభై మందిని అరెస్టు చేశారు. వీరిలో కొందరు పాపం ఇంకా పాలుగారే పసికూనలు! ఇంకా తమాషా ఏమిటంటే అరెస్టయిన వాళ్లంతా ఒక వర్గానికి చెందినవాళ్లే. విడ్డూరంగా ఉందా? నమ్మలేకపోతున్నారా? కానీ ఇది పచ్చినిజం. ముంబైకి 30 కి.మీ దూరంలో ఉన్న ముంబ్రా పట్టణంలో ఈ సంఘటన జరిగింది. ఈ మధ్య అక్కడ ఒక చెయిన్ స్నాచింగ్ సంఘటన జరిగింది. ఒక మహిళనుంచి మెడలో చెయిన్ ఎవడో ఒకడు కొట్టేశాడు. అంతే హైపర్ యాక్టివ్ పోలీసులు ఓవర్ యాక్షన్ చేసేశారు. ఇళ్లలోకి వెళ్లి, ఈడ్చుకొచ్చి మరీ అరెస్టులు చేసేశారు. ఒక మహిళ ఇంట్లో తలుపులు వేసుకుని నిద్రపోతుంటే, బోల్ట్ కట్టర్లతో తలుపుల్ని బద్దలుగొట్టి మరీ వచ్చి ఆమె భర్తను అరెస్టు చేశారు. పాపం ఆయన టైఫాయిడ్ తో బాధపడుతున్నాడు. అయినా ఖాకీలు కనికరించలేదు. 'దొంగతనం చేసింది ఒకరో లేక ఇద్దరో. కానీ పోలీసులు ఏకంగా ఏడు వ్యాన్లను తీసుకొచ్చి మా వాళ్లందరినీ కుదేసి తీసుకెళ్లారు,' అని ఓ యువకుడు చెప్పాడు. అయితే పోలీసులు మాత్రం బలూచిస్తాన్ నుంచి వచ్చిన యువకులు ఎక్కువగా ముంబ్రా ప్రాంతంలో ఉంటారని, వారందరిదీ నేరమయ చరిత్రేనని, దొంగతనాలు, చెయిన్ స్నాచింగ్ లు వారికి అలవాటని దబాయిస్తున్నారు. దొంగలు అక్కడే దాగున్నారు కాబట్టే తాము అరెస్టులు చేశామని వారు వాదిస్తున్నారు. ఇంతా చేసి ఎనభై మందిని అరెస్టు చేసినా, చెయిన్ మాత్రం దొరకలేదు. ఇప్పుడు ముంబ్రా వాసులు ఫిర్యాదు చేయడంతో ఈ అరెస్టులపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
పర్సాయపల్లి స్టేజీ వద్ద చైన్ స్నాచింగ్
అర్వపల్లి, న్యూస్‌లైన్: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసును బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి అపహరించుకెళ్లాడు. సూర్యాపేట - జనగాం ప్రధాన రహదారిపై పర్సాయపల్లి స్టేజీ సమీపంలో ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. బాధితురాలు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మండలంలోని పర్సాయపల్లికి చెందిన బైరబోయిన సైదులు కుటుంబ సభ్యులతో కలిసి గ్రామ శివారులోని బస్ స్టేజీ వద్ద నివాసం ఉంటున్నారు. సంక్రాంతి పండగకు ఇల్లు అలుక్కోవడానికి ఎర్రమట్టి కోసమని సైదులు భార్య సంధ్య కొత్తపల్లి సమీపంలోని ఎస్సారెస్పీ కాలువ వద్దకు వెళ్తోంది. మార్గమధ్యంలో వెనుక నుంచి బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలోని మూడున్నర తులాల బంగారు పుస్తలతాడును కత్తిరించుకొని పరారయ్యా డు. వెంటనే ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు పరిగెత్తుకొచ్చి దొంగను తిరుమలగిరి వరకు వెంబడించినా ఫలితం లేకపోయింది. గొలుసును కత్తిరించే సమయంలో వారి మధ్య పెనుగులాట జరగడంతో సంధ్యకు స్వల్ప గాయాలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్ఐ చంద్రశేఖర్‌రెడ్డి, ఏఎస్ఐ లక్ష్మీనారాయణ సిబ్బందితో కలిసి సంఘట న స్థలానికి వెళ్లి విచారణ జరిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. -
గొలుసు లాక్కునేయత్నం: మహిళకు గాయాలు
నరసరావుపేట రూరల్, న్యూస్‌లైన్: ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు భర్తతో పాటు ద్విచక్రవాహనంపై కోటప్పకొండకు వస్తున్న మహిళ మెడలో బంగారు గొలుసు లాక్కునేందుకు విఫలయత్నం చేశారు. బాధితురాలు ద్విచక్రవాహనంపై నుంచి ప్రమాదవశాత్తు కిందపడడంతో గాయపడిన సంఘటన ఆదివారం కోటప్పకొండ ఆర్యవైశ్య సత్రం ఎదుట చోటుచేసుకుంది. రూరల్ సీఐ కోటేశ్వరరావు తెలిపిన వివరాలప్రకారం.. కోటప్పకొండ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జాలయ్య తన భార్య రాజ్యలక్ష్మి, కుమారులతో ద్విచక్రవాహనంపై కోటప్పకొండకు బయలుదేరారు. ఆర్యవైశ్య సత్రం వద్దకు రాగానే ఎదురు నుంచి ద్విచక్రవాహనంపై నుంచి వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు రాజ్యలక్ష్మి మెడలోని గొలుసు లాక్కునేందుకు యత్నించారు. వారిని అడ్డుకునే క్రమంలో ఆమె ద్విచక్రవాహనంపై నుంచి కిందపడడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. రూరల్ సీఐ ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రురాలిని కోటప్పకొండ పీహెచ్‌సీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దంపతులపై కత్తులతో దుండగుల దాడి.. భర్త దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్: దైవదర్శనం చేసుకుని తిరిగి వస్తున్న భార్యాభర్తలపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడిచేసి భర్తను దారుణంగా గొంతుకోసి చంపారు. ఈ దాడిలో భార్య తీవ్రంగా గాయుపడింది. ఆమె మెడలోని మూడు తులాల బంగారు గొలుసును దుండగులు అపహరించుకుపోయారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి ఈ దారుణం జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఆర్టీసీ జేబీఎస్ డిపోలో మెకానిక్‌గా ఉంటున్న మల్కాజిగిరి దుర్గానగర్‌కు చెందిన గాజుల వెంకటేశ్వరరావు (27)కు, బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన సౌజన్యతో ఈ ఏడాది మే 29న వివాహం జరిగింది. దంపతులు శనివారం మోటర్ సైకిల్‌పై సంఘీ దేవాలయానికి వెళ్లి తిరిగి వస్తూ, రాత్రి ఏడున్నర గంటలకు ఉమర్‌ఖాన్‌గూడ దాటిన తర్వాత రోడ్డు పక్కన ఆగారు. అక్కడే పొంచిఉన్న ముగ్గురు దుండగులు వారిపై కత్తులతో దాడిచేసి, వెంకటేశ్వరరావును గొంతుకోసి అతి దారుణంగా చంపారు. దాడిలో సౌజన్య తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితిని గవునించిన స్థానికులు పోలీసులకు సవూచారం ఇచ్చారు. సౌజన్య మెడలో బంగారు గొలుసు లాక్కుంటున్న దుండగులు.. తవును ప్రతిఘటించిన వెంకటేశ్వరరావుపై దాడి చేసినట్లు తెలుస్తోంది. గాయుపడిన సౌజన్యను హయత్‌నగర్‌లోని టైటన్ ఆసుపత్రికి తరలించారు. దుండగులు బంగారంకోసమే దాడి చేశారా?. మరేదైనా కారణం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కి'లేడీ' దొంగలు!
ఆడదానికి ఆడదే శత్రువు అన్న నానుడి నిజం చేస్తున్నారు 'గొలుసు' దొంగలు. లేడీ చైన్ స్నాచర్ల అవతారమెత్తి తోటి మహిళల మెళ్లో నుంచి బంగారపు గొలుసులు తెంపుకుపోతున్నారు. స్నాచింగ్‌లో మగాళ్లకు తామేమీ తీసిపోమని చోరశిఖామణులుగా మారిన మహిళలు నిరూపిస్తున్నారు. సాక్షాత్తూ రాష్ట్ర రాజధానిలోనే చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతూ సాటి వాళ్లను హడలెత్తున్నారు కి'లేడీ'లు. పోలీసులకు సవాల్ విసురుతున్నారు. సాధారణంగా స్త్రీలకు సువర్ణాభరణాలతో చెప్పలేంత ప్రీతి. కనక వస్తువులు ఒంటి నిండా అలంకరించుకోవాలని ఉవ్విళ్లూరని వనితలు తెలుగుగడ్డపై అరుదు. శుభకార్యాలు, వేడుకల్లో మహిళలు చూపే బంగారపు ధగధగల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. గాజులు, జుకాలు, వడ్డాణాలు, పాపిడి బిందెలు, అరవంకీలు, కాసులపేర్లతో కళకళలాడి పోతుంటారు. ఎంత బంగారం అలంకరించుకున్నా అతివలకు తనివి తీరదు. ఈ మోజే వారి కొంప ముంచుతోంది. మహిళల మెడల్లోంచి బంగారపు గొలుసులు తెంపుకుపోవడాలు ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయాయి. ఒంటరిగా బయటకు వచ్చిన వనితల మెడల్లోంచి బలవంతంగా చైన్లు లాక్కుపోవడం సర్వసాధారణమైపోయింది. ఇప్పుడీ చోరీల్లో మహిళలు పాలుపంచుకోవడం విస్తుగొల్పుతుంది. తాజాగా తిరుమలగిరి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన రెండు చైన్ స్నాచింగ్‌లో ఆడ దొంగలు స్వయంగా పాల్గొనడంతో పోలీసులకు పాలుపోవడం లేదు. జీడిమెట్లకి చెందిన ఉషారాణి ఆదివారం రాత్రి(ఆగస్టు 4) ఆమె తిరుమలగిరి టీచర్స్ కాలనీలో ఉన్న తన తల్లి ఇంటికి హోండా యాక్టివాపై బయల్దేరారు. కాలనీ వద్ద ఎదురుగా ఓ బైక్ వచ్చింది. యువకుడు బైక్ నడుపుతుండగా దాని వెనుక కూర్చున్న యువతి ఎదురుగా మరో వాహనంపై వస్తున్న ఉషారాణి మెడలోని 3 తులాల బంగారం గొలుసును రెప్పపాటులో లాఘవంగా తెంచి పరారైంది. పట్టుకోవటానికి ప్రయత్నించినా.. ఫలితం లేకపోయింది. స్నాచింగ్‌కు పాల్పడిన యువతి పంజాబీ డ్రెస్సు.. దానిపై జాకెట్ వేసుకుందని, బైక్‌ను యువకుడు నడిపిస్తున్నాడని బాధితురాలు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటిదే మరో ఘటన తిరుమలగిరి పోలీసుస్టేషన్ పరిధిలోని కార్ఖానా ప్రాంతంలో కొద్దివారాల క్రితం చోటుచేసుకుంది. అయితే ఈ రెండు చోరీలకు పాల్పడింది ఒకరేనా, కాదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొసమెరుపు ఏంటంటే మగ చైన్ స్నాచర్ల ఆట కట్టించేందుకు లేడీ కానిస్టేబుళ్లను సాధారణ మహిళల మాదిరిగా ముస్తాబు చేసి ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్న ప్రాంతాలకు వీరిని పంపి కొంతమంది మగ గొలుసు దొంగలను పట్టుకున్నారు. మరీ లేడీ చైన్ స్నాచర్లకు ముకుతాడు వేసేందుకు పోలీసులు ఎలాంటి ఎర వేస్తారో?