హైదరాబాద్ సిటీ: రోజురోజుకూ హైదరాబాద్ లో దొంగలు పేట్రేగిపోతున్నారు. దీంతో మహిళలు ఆభరణాలు ధరించి బయటికి వెళ్లటానికే భయపడుతున్నారు. తాజాగా శనివారం ఉదయం 11 గంటలకు..కూకట్‌పల్లి పరిధిలోని నిజాంపేట విజ్ఞాన్ కాలేజి సమీపంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు గుడికి వెళ్లి వస్తున్న సరస్వతి(50) అనే మహిళ మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసును లాక్కొని బైక్ పై ఉడాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.