Vignana Jyothi Institute of Engineering and Technology
-
విజ్ఞాన్ యూనివర్సిటీ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల
గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ విశ్వ విద్యాలయంలో 2019–20 విద్యాసంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశం కోసం అడ్మిషన్ నోటిఫికేషన్‌ను వర్సిటీ వీసీ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ గురువారం విడుదల చేశారు. గుంటూరులో గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీటెక్, బీబీఏ, బీసీఏ, బీఎస్సీ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 15 నుంచి 25 వరకూ ఆన్లైన్లో (వీశాట్– 2019, వీజెట్–2019) ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఆన్లైన్ ద్వారా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని దీనికి ఏప్రిల్ 5 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వీశాట్ దరఖాస్తులు గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, ఏలూరు, రాజమండ్రిలోని అన్ని విజ్ఞాన్ సంస్థలు, కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయని చెప్పారు. విద్యార్థులు యూనివర్సిటీ వెబ్సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వీశాట్‌లో తొలి 50 లోపు ర్యాంకులు సాధించిన వారికి 75 శాతం, 51–100 లోపు ర్యాంకుల వారికి 50 శాతం, వంద నుంచి 200 లోపు ర్యాంకులు సాధించిన వారికి 25 శాతం, 201 నుంచి 2 వేల లోపు ర్యాంకు సాధించిన వారికి 10 శాతం ఫీజు రాయితీ ఇస్తున్నట్లు చెప్పారు. ఇంటర్ మార్కులు, జేఈఈ ప్రిలిమ్స్, మెయిన్స్, ఎంసెట్ ర్యాంకుల ఆధారంగాను ఫీజు రాయితీ ఉంటుందన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులు ఎంటెక్, ఎంబీఏ కోర్సులకు సైతం ఫీజుల్లో రాయితీ పొందొచ్చని చెప్పారు. అన్ని విభాగాల్లో 25 శాతం సీట్లను ఫీజు రాయితీ కింద కేటాయించామని వివరించారు. వీటిని పూర్తిగా ప్రతిభ ఆధారంగా భర్తీ చేస్తామని తెలిపారు. వీశాట్ పరీక్ష రాసిన వారికి బీటెక్ సీట్ల కేటాయింపులో తొలి ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీన్ అడ్మిషన్స్ డాక్టర్ వి.రవికుమార్, ఇన్చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ పీఎంవీ రావు, డాక్టర్ కేవీ కృష్ణకిషోర్ పాల్గొన్నారు. -
తెలుగోడు.. మెదడు నాడిని పట్టేశాడు!
నరసాపురం: పశ్చిమగోదావరి జిల్లా, నరసాపురం కుర్రోడు మేడిది జాన్ విలియమ్ కేరీ అద్భుత పరిశోధన చేశాడు. మెదడులోని నాడుల్లో అసంబద్ధంగా కలిగే చలనాలను గుర్తించే ఎలక్ట్రానిక్ పరికరాన్ని తయారు చేశాడు. ఇతను చేసిన పరిశోధనలకుగాను గుంటూరు విజ్ఞాన్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ లభించింది. పలువురు ప్రముఖులు నుంచి ప్రశంసలు అందుకున్న విలియమ్.. తాను రూపొందించిన పరికరానికి పేటెంట్ కోసం దరఖాస్తు కూడా చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. ఎంటెక్ చదివిన విలియమ్ పీహెచ్డీ పరిశోధనలో అరుదైన అంశాన్ని ఎంచుకున్నాడు. మూర్చ, పక్షవాతం, తలనొప్పి, కోమాలోకి వెళ్లడం లాంటి సందర్భాల్లో రోగికి సహజంగా ఎంఆర్ఐ, ఎలక్ట్రోయన్సీ ఫెలోగ్రామ్(ఈఈజీ) లాంటి స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ సమయంలో మెదడులోని నాడుల్లో అసంబద్ధంగా చలనాలను గుర్తిస్తారు. అయితే ఈ చలనాలను కొన్ని సందర్భాల్లో వైద్యులు వేరే విధంగా అర్థం చేసుకోవడం, ఈ కదలికలు ఎందుకు వస్తున్నాయో అర్థంకాక, అవికూడా రోగానికి సంబంధించిన లక్షణాలుగా పొరపాటుపడే ప్రమాదముందని విలియమ్ చెప్పాడు. పరీక్ష సమయంలో నాడుల కదలికలు సహజంగానే ఉంటాయని, వాటిని అంతగా పట్టించుకోనవసరం లేదని విలియమ్ ప్రయోగాత్మకంగా నిరూపించాడు. ఈ కదలికలను గుర్తించడానికి ఓ పరికరాన్ని తయారు చేశాడు. పరికరం పని చేస్తుందిలా...: కేవలం రూ. 3 వేలు మాత్రమే ఖర్చయ్యే ఈ పరికరాన్ని ఈఈజీ మిషన్‌కు అనుసంధానం చేయ డం ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని విలియమ్ చెబుతున్నాడు. పరికరం రూపొందించిన విధానం, పనిచేసే పద్ధతి గురిం చి విలియమ్ వివరిస్తూ... ‘సాధారణంగా మెదడు పనితీరును తెలుసుకునేందుకు ఈఈజీ పరీక్ష నిర్వహిస్తారు. ఈ సందర్భంలో రోగి కనురెప్పలు మూసి తెరిచినా, కనుగుడ్లు పక్కకు కదిపినా కూడా మెదడులోని నాడుల్లో చలనాలు కలుగుతాయి. అవి రోగం తాలూకా చలనాలా? లేక సాధారణ చలనాలా? అనేది తెలుసుకోవడం కోసం డాక్టర్లు మళ్లీ పరీక్షలు నిర్వహిస్తారు. ఇది వైద్యులకు, రోగులకూ కూడా ఇబ్బందే. కొన్ని సందర్బాల్లో వైద్యులు పొరపాటుపడి ట్రీట్మెంట్ కూడా చేస్తారు. మెదడులో కలిగే ఈ చలనాలను గుర్తించడానికే ఈ ఆటోమేటిక్ ఐబ్లింక్ డిటెక్టర్ యూజింగ్ మైరియో పరికరాన్ని రూపొందించాను. ఈ పరికరాన్ని ఈఈజీ మిషన్‌కు జతచేస్తే, రోగానికి సంబంధం లేకుండా మెదడులో కలిగే చలనాలను పరీక్ష సమయంలోనే గుర్తించి తెలియజేస్తుంది. దీంతో వైద్యుడికి పదేపదే పరీక్ష చేసే అవసరం ఉండదు. లాబ్ వ్యూసాప్ట్వేర్ కోడ్‌ను డెవలప్‌చేసి, మైరియో ప్రాసెసర్ ద్వారా ఈ పరికరం తయారు చేశాను. బయో పొటెన్షియల్ యాంప్లిఫైర్లు, ఎలక్ట్రోడ్స్ను ఉపయోగించి సింపుల్‌గా పరికరం తయారు చేశాను. పరికరం తయారీకి రూ.3 వేలు మించి ఖర్చు అవ్వదని, కానీ ఉపయోగం మాత్రం ఎక్కువగా ఉంటుంద’న్నాడు. -
‘విజ్ఞాన్’ వీశాట్ ఫలితాలు విడుదల
మే 10 నుంచి కౌన్సెలింగ్ గుంటూరు ఎడ్యుకేషన్: బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం గుంటూరు జిల్లా వడ్ల మూడిలోని విజ్ఞాన్ విశ్వవిద్యాలయం నిర్వహించిన వీశాట్–2017(విజ్ఞాన్ స్కోలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్) ఫలితాలను ఆ విద్యాసంస్థల ఉపాధ్యక్షుడు లావు శ్రీకృష్ణదేవరాయలు గురువారం విడుదల చేశారు. గుంటూరులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన 42 వేల మందికి పైగా విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షకు హాజరయ్యారని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వర్సిటీల కంటే ముందుగా ప్రవేశ పరీక్ష నిర్వహించడంతో పాటు వారం రోజుల్లోనే ఫలితాలు విడుదల చేశామ న్నారు. మే 10 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టి, జూన్ మొదటివారంలో తరగతులు ప్రారంభిస్తామని తెలిపారు. తొలి పది ర్యాంకర్లు వీరే... విజ్ఞాన్ వర్సిటీ వీసీ బి.రామ్మూర్తి మాట్లాడుతూ.. వీశాట్‌లో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన బట్టు శ్రీచరణ్ మొదటి ర్యాంకు సాధించినట్లు చెప్పారు. కొవ్వూరుకు చెందిన పెదవేగి శశినందన్ రెండో ర్యాంకు, తణుకు చెందిన గరిమెళ్ల మోహన్రఘు మూడో ర్యాంకు, తూర్పు గోదావరి జిల్లా గంటికి చెందిన కంచర్ల బాలాజీ శ్రీ హర్ష నాలుగో ర్యాంక్, మేడపాడుకు చెందిన ఎలుబండి వీరేంద్ర సాయి ఐదో ర్యాంకు, గుంటూరు జిల్లాకు చెందిన గోరంట్ల జయంత్ హర్ష ఆరో ర్యాంకు, పెనుమంత్రకు చెందిన కొక్కిరాల జ్వాలాఈశ్వర్ప్రసాద్ 7వ ర్యాంకు, నల్లజెర్లకు చెందిన గండ్రకోటి గంగాధర రామకృష్ణ 8వ ర్యాంకు, భీమవరానికి చెందిన ఎ.హర్షిత్ 9వ ర్యాంకు, వేలివెన్నుకు చెందిన జి.శ్రీనివాస్ 10వ ర్యాంకు సాధించారని తెలిపారు. ప్రతిభకు ప్రోత్సాహం... డీన్ రవికుమార్ మాట్లాడుతూ.. వీశాట్తో పాటు ఇంటర్ మార్కులు, ఐఐటీ జేఈఈ, ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా కూడా విజ్ఞాన్స్ వర్సిటీలోని బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఐటీ సర్వీసెస్ డీన్ ప్రొఫెసర్ కె.వి.కృష్ణకిషోర్ మాట్లాడుతూ.. ప్రతిభావంతులకు ఫీజు రాయితీ ఇస్తున్నట్లు చెప్పారు. వీశాట్ ఫలితాల కోసం vifna nuniverrity.org వెబ్‌సైట్‌తో పాటు టోల్‌ఫ్రీ నం.1800 425 2529ను సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో విజ్ఞాన్ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్, ఇంజినీరింగ్ అండ్ మేనేజిమెంట్ డీన్ డాక్టర్ వి.మధుసూదన రావు తదితరులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి వీశాట్
చేబ్రోలు (పొన్నూరు): ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు విజ్ఞాన్ యూనివర్సిటీ బీటెక్ ప్రవేశ పరీక్ష వీశాట్–2017 జరుగుతుందని అడ్మిషన్స్ డీన్ వి.రవికుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ వర్సిటీలో ప్రవే శాలకు ఏపీ, తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా 42 సెంటర్లలో ఈ పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. ఆయా రాష్ట్రాల నుంచి మొత్తం 42 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. ప్రవేశ పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులు తమ వర్సిటీలో ఆయా కోర్సుల్లో చేరవచ్చన్నారు. ఇంటర్, ఎంసెట్, జేఈఈ, వీశాట్ తదితర పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు వంద శాతం నుంచి, 25 శాతం వరకు ఫీజు రాయితీ ఉంటుందని రవికుమార్ వివరించారు. -
విజ్ఞాన్ కాలేజ్‌లో ర్యాగింగ్ కలకలం
హైదరాబాద్: నగరంలో మరోసారి ర్యాగింగ్ భూతం కలకలం రేపింది. హైదర్‌గూడలోని విజ్ఞాన్ కళాశాలలో శుక్రవారం ర్యాగింగ్ కలకలం రేగింది. కళాశాలలో ర్యాగింగ్ జరుగుతోందనే సమాచారంతో రంగంలోకి దిగిన రాజేంద్రనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ర్యాగింగ్ అంశంతో సంబంధం ఉన్న పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి మరింత సమాచారం రాబడుతున్నారు. -
సైన్స్ కాంగ్రెస్‌కు తిరుపతి ముస్తాబు
- రేపు ఉదయం ప్రధాని మోదీ ప్రారంభోపన్యాసం - 4న ప్రముఖులతో ముఖాముఖి సాక్షి, అమరావతి: ఐదు రోజుల పాటు జరిగే 104వ భారత సైన్స్ కాంగ్రెస్ (ఐఎస్సీ) సమ్మేళ నానికి పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి ముస్తాబైంది. మంగళవారం నుంచి 7వ తేదీ వరకు జరిగే ఈ సమ్మేళనాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ లాంఛ నంగా ప్రారంభించనున్నారు. ఇందుకు శ్రీవేంక టేశ్వర విశ్వవిద్యాలయం ఆవరణ వేదిక కానుం ది. సైన్స్ కాంగ్రెస్ ఉద్దేశాన్ని వివరించే పోస్టర్లు వాడవాడలా వెలిశాయి. యూనివర్సిటీ దారు లన్నీ ఆకర్షణీయ బ్యానర్లు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వాగతం పలికే ఫ్లెక్సీలతో నిండిపో యాయి. శాస్త్రీయ పరిజ్ఞానాన్ని జనానికి చేరువ చేసే దిశగా పలు ప్రదర్శనలు, సదస్సులు, సమావేశాలకు వర్సిటీలోని వివిధ ప్రాంగణాలు సిద్ధమయ్యాయి. ప్రపంచ లబ్ధ ప్రతిష్టులైన తొమ్మిది మంది నోబెల్ బహుమతి గ్రహీతలు, శాస్త్ర, సాంకేతిక రంగాలలో నిష్ణాతులైన 200 మంది శాస్త్రవేత్తలు, జాతీయ ప్రయోగశాలల శాస్త్రవే త్తలు, ప్రముఖ విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఐఐఎస్‌ఇఆర్‌ఎస్ తదితర సంస్థలకు చెందిన 18 వేల మంది ప్రతినిధులు సైన్స్ కాంగ్రెస్‌కు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా బాలల సైన్స్ కాంగ్రెస్, శాస్త్రీయ కార్యక్రమం, మహిళా సైన్స్ కాంగ్రెస్, సైన్స్ పరివాహకుల సదస్సు, సైన్స్ ఎగ్జి బిషన్, ప్లీనరీ సమావేశాలు కూడా నిర్వహించ నున్నారు. ఈసారి ఎక్స్పో విశిష్టత ఇదీ... సైన్స్ కాంగ్రెస్‌తో పాటు నిర్వహించనున్న ది ప్రైడ్ ఆఫ్ ఇండియా ఎక్స్పో (పీఒఐ)లో కొత్త ఆలో చనలు, కొంగొత్త ఆవిష్కరణలు, సంబంధిత ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. దేశంలోని ప్రముఖ ప్రైవేట్, ప్రభుత్వ రంగ సంస్థలు ఇందులో పాల్గొంటాయి. సామాన్యులు సైతం ఈ ప్రదర్శనను సందర్శించవచ్చు. వీటితో పాటు ప్రముఖ శాస్త్రవేత్తలు, పరిశోధకుల జీవనయానంలోని మజిలీలను తెలియజేసేలా మరో ప్రదర్శనను హాల్ ఆఫ్ ప్రైడ్ పేరిట నిర్వహిస్తారు. తిరుపతికి రానున్న విజ్ఞాన జ్యోతి... శాస్త్ర విజ్ఞానాన్ని ప్రాచుర్యంలోకి తీసుకువచ్చేలా ఢిల్లీలో బయలుదేరిన విజ్ఞాన జ్యోతి సైన్స్ కాంగ్రెస్ మహాసభ ప్రారంభం నాటికి తిరుపతి చేరుకుంటుంది. దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆశయం మేరకు విజన్ 2010 పేరిట ఈ విజ్ఞాన జ్యోతి ప్రారంభమైంది. 4న జెనిసిస్...: సైన్స్ కాంగ్రెస్‌లో రెండోరోజు (4వ తేదీ) వివిధ రంగాలకు చెందిన అతిరథ మహారథులతో జెనిసిస్ పేరిటి ముఖాముఖి నిర్వహిస్తారు. దేశాన్ని ప్రగతిపథంలో నడిపించడం కోసం పారిశ్రామిక రంగం చేపట్టాల్సిన, చేపట్టిన పథకాలు, కార్యక్రమాలపై సభికుల ప్రశ్నలకు ప్రముఖులు జవాబులిస్తారు. -
నేడు గుంటూరుకు వైఎస్ జగన్
విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య కుమార్తె వివాహ వేడుకలకు హాజరు గుంటూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, శాసనసభ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి శనివారం గుంటూరుకు రానున్నారు. ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గాన గుంటూరు నగరంలోని విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య నివాసానికి చేరుకుంటారు. రత్తయ్య కుమార్తె లావు ఇందిర ప్రియదర్శిని వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించి అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవుతారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్, రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. -
కఠోర శ్రమతోనే విజయతీరాలు
చేబ్రోలు: కఠోర శ్రమతోనే విజయతీరాలు చేరువవుతాయని సినీ నటి, మాజీ పార్లమెంట్ సభ్యురాలు జయప్రద పేర్కొన్నారు. చేబ్రోలు మండలంలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో శనివారం స్నాతకోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఫ్రాన్స్‌కు చెందిన ఇకోల్ సెంట్రల్ డి నాన్‌టెస్ సంస్థ డైరెక్టర్ ఫర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆచార్య ఫౌడ్ బెన్నిస్, పంచ సహస్ర అవధాని మేడసాని మోహన్, మాజీ పార్లమెంట్ సభ్యురాలు, సినీ నటి జయప్రదకు విజ్ఞాన్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేసింది. ఈ కార్యక్రమంలో సినీనటి జయప్రద మాట్లాడుతూ రాజకీయ రంగమైనా, సినీ రంగమైనా క్రమశిక్షణ, నిజాయతీతో కూడిన శ్రమతోనే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఫ్రొఫెసర్ ఫౌడ్ బెన్నిస్ మాట్లాడుతూ యువతకు లక్ష్యముండాలన్నారు. మేడసాని మోహన్ మాట్లాడుతూ నైతిక విలువలతో కూడిన విద్య జీవితాన్ని ఉన్నత స్థానంలో నిలబెడుతుందని చెప్పారు. దేశ, విదేశాల్లో ఎన్నో అవార్డులు తీసుకున్నానని, సొంత గడ్డపై తీసుకున్న డాక్టరేట్ గొప్పదని ఆనందం వ్యక్తం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమాజ ఉన్నతికి మాత్రమే వినియోగించాలని సంస్కృతి విచ్ఛిన్నతికి కాదని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ఘనిస్తాన్ భారత రాయబారి, కార్యక్రమ ముఖ్యఅతిథి డాక్టర్ షహీద్ మహమ్మద్ అబ్దాలి అన్నారు. 1,279 మందికి డిగ్రీలు.. వర్సిటీ కులపతి డాక్టర్ కే రామ్మూర్తినాయుడు, ఉప కులపతి డాక్టర్ సీ తంగరాజ్ మాట్లాడుతూ స్నాతకోత్సవం సందర్భంగా మొత్తం 1279 మందికి డిగ్రీలు అందజేసినట్లు తెలిపారు. -
15న విజ్ఞాన్ 4వ స్నాతకోత్సవం
-
ఫుడ్ ప్రాసెసింగ్‌లో ఉజ్వల భవిష్యత్తు
సీఎస్ఐఆర్ శాస్త్రవేత్త రాఘవరావు ఉద్ఘాటన విజ్ఞాన్‌లో ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభం చేబ్రోలు: ఫుడ్ ప్రాసెసింగ్, ఫుడ్ మేకింగ్‌లకు రానున్న రోజుల్లో మంచి డిమాండ్ ఉంటుందని బెంగళూరుకు చెందిన సీఎస్ఐఆర్ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చి) ఫుడ్ ఇంజినీరింగ్ విభాగ శాస్త్రవేత్త, ఆచార్యుడు డాక్టర్ కేఎంఎస్ రాఘవరావు అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో ఫుడ్ ఫెస్టినో పేరుతో రెండు రోజుల నేషనల్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. 11 రాష్ట్రాల నుంచి 250 మందికిపైగా ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో విభాగ శాస్త్రవేత్త రాఘవరావు మాట్లాడుతూ సంప్రదాయ వంటల విలువను యువత ప్రపంచానికి చాటాలన్నారు. జొన్న అన్నం, రాగి సంగటి, సజ్జలతో అన్నం తింటే అనారోగ్యం దరిచేరదని చెప్పారు. ఆహార ఉత్పత్తులను ఎక్కువ కాలం నిల్వ ఉండేలా యువ ఇంజినీర్లు కృషి చేయాలన్నారు. సీఎస్ఐఆర్ ప్లాటినం జూబ్లి మెంటార్ ప్రసాద్ ఆహార నిల్వ, నాణ్యతపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. వీసీ సి.తంగరాజ్, రెక్టార్ బి.రామ్మూర్తి, డీఈఎం వి.మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు. పలు అంశాల్లో పోటీలు.. పోస్టర్ ప్రజెంటేషన్, క్విజ్, పేపర్ ప్రజెంటేషన్, వంటల తయారీ, ఫుడ్ కార్వింగ్, ట్విస్ట్ ఇన్ టేస్ట్, ఫూఫై జోడీ, ఫామ్, ఫుడ్ స్పార్క్స్, ట్రెజర్ హంట్... ఇలా పలు విభాగాల్లో పోటీలు జరిగాయి. ఆయా రాష్ట్రాల నుంచి తరలివచ్చిన విద్యార్థులు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. వారి వారి వంటకాలను యూనివర్సిటీ విద్యార్థులు, సిబ్బందికి రుచి చూపించారు. -
విజ్ఞాన్‌లో 28న వీసీల సమావేశం
గుంటూరు : దక్షిణ భారతదేశంలోని విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్లర్ల ఉన్నత స్థాయి సమావేశం సెప్టెంబర్ 28, 29వ తేదీన విజ్ఞాన్ యూనివర్సిటీలో జరగనుంది. ఈ మేరకు ఆ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ సి తంగరాజ్ వెల్లడించారు. సోమవారం గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తంగరాజ్ మాట్లాడారు. ఈ సమావేశాలకు విజ్ఞాన్ యూనివర్సిటీని ‘ద అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్’ (ఏఐయూ) ఎంపిక చేసిందని డాక్టర్ సి.తంగరాజ్ తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు దక్షిణాదిలోని యూనివర్సిటీలకు చెందిన దాదాపు 150 మంది వైస్ చాన్స్లర్లు పాల్గొంటారన్నారు. అలాగే దక్షిణాదిలోని రాష్ట్రాల నైపుణ్యాభివృద్ధి శాఖ కార్యదర్శులు కూడా పాల్గొంటారని చెప్పారు. మన దేశ యువతలో నైపుణ్యం, వ్యాపార ధోరణి పెంచడమే ధ్యేయంగా ఈ సమావేశం జరుగుతుందన్నారు. ఉన్నత విద్యా విధానంలో తీసుకురావాల్సిన మార్పులు, పాఠ్యపుస్తకాల్లో చేపట్టాల్సిన సవరణల గురించి కూడా చర్చిస్తారని తంగరాజ్ తెలిపారు. -
వినూత్న రేస్ కారు ఆవిష్కరణ
చేబ్రోలు: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విజ్ఞాన్ వర్శిటీ మెకానికల్ విభాగం ఆధ్వర్యంలో వినూత్న రేస్ కారును ఆవిష్కరించారు. మెకానికల్ విభాగాధిపతి రామకృష్ణ మాట్లాడుతూ తమ విద్యార్థులు రూ. 94 వేల ఖర్చుతో వినూత్న రేస్ కారును తయారు చేశారన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కారును రూపొందించినట్లు తెలిపారు. సిబ్బంది అల్లంనేని శారద, ఆయా విభాగాల అధిపతులు, డీన్లు, విద్యార్థులు పాల్గొన్నారు. -
14న వైజ్ఞానిక ప్రయోగ సామర్థ్య పరీక్ష
విద్యారణ్యపురి : ‘విజ్ఞాన భారతి అన్వేషిక’ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైజ్ఞానిక ప్రయోగ సామర్థ్య ప్రిలిమినరీ టెస్ట్‌ను ఆగస్టు 14న హన్మకొండలో నిర్వహించనున్నట్లు ఆ సంస్థ జిల్లా కన్వీనర్ సత్తు రామనాథం తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆదివారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ హెచ్.సి.వర్మ పర్యవేక్షణలో ఈ పరీక్ష జరుగుతుందన్నారు. శాస్త్ర, సాంకేతిక ప్రయోగాలు చేయడంలో విద్యార్థులకు మెలకువలను నేర్పడమే దీని లక్ష్యమన్నారు. జిల్లాలో 9వతరగతి నుంచి డిగ్రీ ఫైనలీయర్ వరకు చదువుతున్న విద్యార్థులు పరీక్షకు అర్హులన్నారు. ప్రతి పాఠశాల, కళాశాల నుంచి ఐదుగురు విద్యార్థుల చొప్పున ఆగస్టు 10లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ఇందుకు 9866856373, 9948099462, 9177571379 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు. ఎంపికయ్యే వారు రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధిస్తారన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ శాస్త్రవేత్త జితేందర్‌సింగ్, విజ్ఞాన భారతి రాష్ట్ర కార్యదర్శి నర్సింహమూర్తి, జిల్లా కార్యవర్గ సభ్యులు జ్ఞానేశ్వర్, ఆనందం, సదానందం, రామయ్య, శశికళాధర్, సంతోష్, కుమారస్వామి, దామోదర్ పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణకు కృషి
యూజీసీ విశ్రాంత వైస్ చైర్మన్ ప్రొఫెసర్ హెచ్.దేవరాజ్ పిలుపు విజ్ఞాన్‌లో ప్రారంభమైన అంతర్జాతీయ స్థాయి సదస్సు చేబ్రోలు: పర్యావరణ పరిరక్షణ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని యూజీసీ విశ్రాంత వైస్ చైర్మన్ ప్రొఫెసర్ హెచ్ దేవరాజ్ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో ‘లీడర్షిప్ ఫర్ ససై్టనబుల్ ఫ్యూచర్స్ ఇన్ సోషియో ఎకొలాజికల్ సిస్టమ్స్’ (సామాజిక పర్యావరణ వ్యవస్థల్లో నాయకత్వ పెంపుదల) అనే అంశంపై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు శనివారం ప్రారంభమైంది. అమెరికాకు చెందిన ప్రఖ్యాత యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో సహకారంతో విజ్ఞాన్ విశ్వవిద్యాలయ బయో టెక్నాలజీ, ఐటీ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. 17 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. దేవరాజ్ మాట్లాడుతూ గూగుల్ సెర్చి ఇంజిన్‌లో అన్నీ దొరుకుతాయిగానీ, విద్యార్థికి సరైన నడవడికను నేర్పలేదని చెప్పారు. భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగ సీనియర్ సలహాదారు టీఎస్ రావు మాట్లాడుతూ పర్యావరణ చక్రాల స్థిరీకరణపై విద్యార్థులు పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాకు చెందిన ప్రొఫెసర్ ఒకాయ్ బోష్, టీసీఎస్ సంస్థ ఉపాధ్యక్షుడు ఎంజీపీఎల్ నారాయణ, టీసీఎస్ సంస్థ ప్రధాన శాస్త్రవేత్త జోస్కుమార్రెడ్డి, టీసీఎస్ లాంగ్వేజ్ మేటర్స్ ప్రతినిధి, శ్రీలంకు చెందిన డాక్టర్ లియోనీ సోలోమన్, పాండిచ్చేరికి చెందిన మదర్స్ సర్వీస్ సొసైటీ ప్రతినిధి ఆచార్య గ్యారీ జాకోబ్స్, కొలంబియాకు చెందిన డాక్టర్ క్లెమెన్సియా మొరాలెస్, అమెరికాకు చెందిన హమీద్ ఖాన్, స్విట్జర్లాండ్‌కు చెందిన డాక్టర్ నామ్, అమెరికాకు చెందిన పుజెట్ సౌండ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆండ్రియాస్ ఉడ్బే తదితరులు పాల్గొని గ్రీన్ టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్, ఎకో ఇన్ఫర్మాటిక్స్ దాని అనుబంధ అంశాల్లో సెన్సార్ల వినియోగం, ఫైలోజియోగ్రఫీ, వ్యవసాయం, పశుపోషణ తదితర అంశాలు, వాటి అభివృద్ధికి వినియోగించాల్సిన సాంకేతిక పరిజ్ఞానం గురించి చర్చించారు. పేపర్ ప్రజెంటేషన్, పోస్టర్ ప్రదర్శన లాంటి సాంకేతిక విధానం ద్వారా విద్యార్థులకు ఆయా అంశాలపై అవగాహన కల్పించారు. ప్రపంచ వ్యాప్తంగా 500 మంది విద్యార్థులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాన్ఫరెన్స్ సీడీని ఆవిష్కరించారు. చాన్సలర్ రామ్మూర్తినాయుడు, వీసీ సీ తంగరాజ్ పాల్గొన్నారు. -
విజ్ఞాన్ వర్సిటీకి కేంద్ర ప్రాజెక్టు
చేబ్రోలు : ఎర్లీ కెరీర్ రీసెర్చి అవార్డు కింద కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగం రూ. 27.5 లక్షల విలువైన ప్రాజెక్టును విజ్ఞాన్ యూనివర్సిటీకి మంజూరుచేసిందని వైస్ చాన్స్‌లర్ సి.తంగరాజ్ తెలిపారు. వడ్లమూడిలోని వర్సిటీలో గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. వీసీ తంగరాజ్ మాట్లాడుతూ తమ యూనివర్సిటీకి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు దక్కిందని తెలిపారు. బయోటెక్నాలజీ విభాగానికి చెందిన సహ ఆచార్యుడు డాక్టర్ దిరిశాల విజయ రాము కేంద్ర ప్రభుత్వం నుంచి కీలక ప్రాజెక్టును దక్కించుకున్నారని పేర్కొన్నారు. దీని ద్వారా ఆయన∙పరిశోధనలను ముమ్మరం చేయనున్నారని వివరించారు. జెనిటిక్ ఇంజినీరింగ్ పద్ధతి ద్వారా... ప్రాజెక్టు దక్కించుకున్న విజయరాము మాట్లాడుతూ క్షయ లాంటి ప్రాణాంతక రోగాల నివారణకు సమర్థవంతమైన వ్యాక్సిన్ కనుగొనే ప్రక్రియలో భాగంగా తాను సమర్పించిన పరిశోధనాత్మక నివేదికకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. క్షయ లాంటి పలు ప్రాణాంతక రోగాలకు ఇప్పటికీ సరైన టీకాలు అందుబాటులో లేవని తెలిపారు. పసి పాపలకు ఇప్పుడు వాడుతున్న క్షయ నివారణ టీకా 0 నుంచి 80 శాతం మాత్రమే పనిచేస్తోందని చెప్పారు. పలు పరిశోధనల ప్రకారం చాలామందిలో క్షయ వ్యాధి నివారణ వ్యాక్సిన్ 0 శాతం పనిచేస్తున్నట్లు నిర్థారణ అయిందని తెలిపారు. వ్యాక్సిన్ కనుగొనేందుకు గునియా పంది వినియోగం.... సమర్ధవంతమైన వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు తాను గునియా పందిని వినియోగించుకోబోతున్నట్లు చెప్పారు. పందిలో సంబంధిత అణుల అభివృద్ధి కోసం తాను ప్రొటీన్స్ మాలిక్యులర్ బయాలజీ జెనిటిక్ ఇంజినీరింగ్ పద్ధతిని అనుసరించబోతున్నట్లు తెలిపారు. గతంలో అమెరికాలో తాను ఈ ప్రాజెక్టు కోసం శ్రమించానని, ఇప్పుడు మళ్లీ మంచి అవకాశం దక్కిందని, తప్పక విజయం సాధించగలననే నమ్మకం తనకుందని అశాభావం వ్యక్తంచేశారు. ప్రతిభ చూపి కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు దక్కించుకున్న విజయరామును చైర్మన్ లావు రత్తయ్య గురువారం తన చాంబర్లో ఘనంగా సత్కరించారు. విజయరామును వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు, రెక్టార్ బి.రామ్మూర్తి, రిజిస్ట్రార్ ఎంఎస్ రఘునాథన్ తదితరులు అభినందించారు. -
ప్రపంచ బిజినెస్ స్కూళ్లకు దీటుగా సిలబస్
చేబ్రోలు: ప్రపంచంలోని ప్రఖ్యాత బిజినెస్ స్కూళ్లకు దీటుగా బీబీఏ కోర్సు కోసం సిలబస్ రూపొందించి అమలు చేస్తున్నామని విజ్ఞాన్ యూనివర్శిటీ రిజిస్ట్రార్ ఎంఎస్.రఘునాధన్ తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్శిటీలో శుక్రవారం బీబీఏ మొదటి సంవత్సరం తరగతుల ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించారు. రఘునాధన్ మాట్లాడుతూ మేనేజ్మెంట్ విభాగంలో ఉత్తమ అధ్యాపకులు ఉన్నారని తెలిపారు. ఇక్కడ ర్యాగింగ్ అనే మాటే ఉండదన్నారు. తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. డీన్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ వి.మధుసూధనరావు మాట్లాడుతూ విద్యార్థులకు మార్కులు, డిగ్రీలు ముఖ్యం కాదని, నైతిక విలువలు ఎంతో అవసరం అన్నారు. ఎంబీఏ మేనేజ్మెంట్ విభాగాధిపతి విజయకృష్ణ, ఆయా విభాగాల అధిపతులు పాల్గొన్నారు. -
ప్రజాసమస్యల పై వెబ్ అస్త్రం
విజ్ఞాన్ విద్యార్థుల ఘనత చేబ్రోలు : లంచం అడిగినవారు ఇక వెబ్ బజారులో నిలబడాల్సి రావచ్చు. ఏ సమస్య అయినా క్షణాల్లో అందరి ఫోన్లకు మెసేజ్ రూపంలో రావచ్చు. వీధుల్లో సమస్యల నుంచి వ్యక్తిగత కష్టాల వరకు అన్నింటికీ ఇక వెంటనే పరిష్కారం కోసం విజ్ఞాన్ యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించిన ఓ వెబ్సైట్ శక్తివంతంగా పనిచేస్తోంది. ఈ నెల 11న దీన్ని సీఎం చంద్రబాబు హైదరాబాదులో ప్రారంభించారు. దీన్ని రూపొందిం చిన విద్యార్థులను ఆయన అభినందించారు. ఆ నలుగురికి వచ్చిన ఐడియా.. మంగళగిరి రూరల్ మండలం నూతక్కికి చెందిన జి.మనోహర్, తాడేపల్లి మండలం సీతానగరానికి చెందిన ఆర్.మనోహర్‌రెడ్డి, తెనాలికి చెందిన కృష్ణలావణ్యకుమార్, హైదరాబాద్‌కు చెందిన పి.విద్వాన్‌రెడ్డి విజ్ఞాన్ విశ్వవిద్యాలయంలో ఈసీఈ బ్రాంచ్ చివరి సంవత్సరం విద్యార్థులు. ప్రభుత్వ విభాగాల్లో పేరుకుపోతున్న అవినీతి, ప్రజాసమస్యల పరిష్కారం కోసం వెబ్ అస్త్రాన్ని ప్రయోగించాలని ఈ వెబ్‌సైట్‌ను రూపొందించారు. వీరి ప్రాజెక్టుకు మనోహర్ కీలకం. వెబ్ అడ్మినిస్ట్రేటర్ కూడా అతనే. రోజు 18 గంటలపాటు కష్టపడి, రూ.60వేల వరకు పెట్టుబడి పెట్టి ఎట్టకేలకు ఓ వైబ్‌సైట్‌ను ప్రజల ముందుకు తీసుకొచ్చాడు. మిగిలిన ముగ్గురు మనోహర్‌కు సాంకేతిక సాయం అందించారు. -
ముడి బియ్యం ఇక ముంగిట్లోనే!
ఆరోగ్య స్పృహ పెరుగుతున్న కొద్దీ ముడి బియ్యం తినే వారి సంఖ్య పెరుగుతోంది. ముడిబియ్యానికి త్వరగా పురుగు పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి, అవసరం మేరకు బస్తా, రెండు బస్తాల ధాన్యం ముడిబియ్యం మర పట్టించుకొని ఇంట్లోకి వాడుకునే ప్రకృతి వ్యవసాయదారులకు.. లేదా వినియోగదారులకు నేరుగా ముడిబియ్యం అమ్ముకునే రైతులకు, స్వయం సహాయక బృందాలకు తరచూ రైస్ మిల్లుకు వెళ్లాల్సి రావటం చాలా వ్యయప్రయాసలతో కూడిన పని. ఇంటి దగ్గరే పెట్టుకొని బియ్యం మరపట్టుకునేందుకు వీలయ్యే చిన్న రైస్ మిల్లును కొనితెచ్చుకోవటమే దీనికి సరైన పరిష్కారం. వీరికి ఉపయోగపడే చిన్న రైస్ మిల్లు (రైస్ డీ-హస్కింగ్ మెషిన్)ను మహారాష్ట్రలోని విజ్ఞానాశ్రమం అనే లాభాపేక్ష లేని సంస్థ రూపొందించింది. పుణేకు 70 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. ఇంటిపట్టునే పెట్టుకొని అవసరమైనప్పుడల్లా ముడి బియ్యం ఆడించుకోవటానికి ఇదెంతో అనువుగా ఉంటుందని లాబ్ టెస్ట్‌లో నిర్థారణైందని విజ్ఞానాశ్రమం తెలిపింది. 3 చదరపు అడుగుల పొడవు, 4 చదరపు అడుగుల వెడల్పు స్థలం దీనికి సరిపోతుంది. గంటకు 10 కిలోల ధాన్యాన్ని మిల్లింగ్ చేయగలదు. దీని బరువు సుమారు 125 కిలోలు. 1 హెచ్‌పీ మోటర్తో, 230 వోల్టుల ఏసీ కరెంట్‌తో నడుస్తుంది. దీన్ని ఉపయోగించటం సులభం. నిర్వహణ ఖర్చులూ తక్కువే. ధర రూ.20 వేలకు పైగా ఉండొచ్చని అంచనా. లావు లేదా సన్న రకాల ధాన్యాలేవైనా పిచుకలు వొలిచినట్లు వొలిచి ముడి బియ్యాన్నిస్తుంది. స్టీల్ ప్లేట్లకు బదులు రబ్బరును ఉపయోగించడం వల్ల నూక తక్కువగా వస్తున్నది. 10, 40 హెచ్‌పీ మోటర్లతో నడిచే పెద్ద రైస్ మిల్లులతో పోల్చినప్పుడు.. ఇది అనేక విధాలుగా మెరుగైనదని తేలినట్లు విజ్ఞానాశ్రమం తెలిపింది. బాగుంది కదండీ.. చిన్న రైస్ మిల్లు! - దండేల కృష్ణ, సాగుబడి డెస్క్ -
రేపటి నుంచి వి-శాట్ ప్రవేశ పరీక్ష
చేబ్రోలు: బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీ నిర్వహించే వి-శాట్ ప్రవేశ పరీక్ష ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు జరుగుతుందని వర్సిటీ అడ్మిషన్స్ డెరైక్టర్ ఆర్.వెంకటనాథ్ మంగళవారం తెలిపారు. 21 పట్టణాల్లోని 23 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తున్నామని 31,210 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. ఆన్లైన్లో జరిగే పరీక్ష కోసం 31 వేల మంది విద్యార్థులకు హాల్ టికెట్లు పంపించామని పేర్కొన్నారు. వి-శాట్ ఫలితాలను మే నెల మొదటివారంలో ప్రకటించనున్నట్టు ఆయన తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి బీటెక్ బయోమెడికల్ ఇంజనీరింగ్, పెట్రోలియం ఇంజనీరింగ్ కోర్సులు ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ఈ కోర్సుల్లో ప్రవేశానికి ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు అర్హులని ఆయన తెలిపారు. -
మహిళ మెడలోని గొలుసు చోరీ
హైదరాబాద్ సిటీ: రోజురోజుకూ హైదరాబాద్ లో దొంగలు పేట్రేగిపోతున్నారు. దీంతో మహిళలు ఆభరణాలు ధరించి బయటికి వెళ్లటానికే భయపడుతున్నారు. తాజాగా శనివారం ఉదయం 11 గంటలకు..కూకట్పల్లి పరిధిలోని నిజాంపేట విజ్ఞాన్ కాలేజి సమీపంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు గుడికి వెళ్లి వస్తున్న సరస్వతి(50) అనే మహిళ మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసును లాక్కొని బైక్ పై ఉడాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. -
రిషితకు అశ్రునివాళి
జగద్గిరిగుట్ట: ‘కాలేజీ నుంచి రావడంలో ఐదు నిమిషాలు ఆలస్యమైతేనే ఆందోళన చెందే మేము ఇప్పుడు నువ్వు మా నుంచి శాశ్వతంగా దూరం అయ్యావన్న చేదు నిజాన్ని ఎలా తట్టుకోవాలి’.. అంటూ రిషితారెడ్డి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. హిమచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లం తై మృతి చెందిన విజ్ఞానజ్యోతి కాలేజీ విద్యార్థిని రిషితారెడ్డి మృతదేహం 42 రోజుల తర్వాత లభించింది. మృతదేహం లభించినట్టు అధికారులు తల్లిదండ్రులకు ఆదివారం సమాచారం ఇచ్చారు. ఈ దుర్వార్త విన్నప్పటి నుంచి తల్లిదండ్రులు దేవుడా! ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న మా ఒక్కగానొక్క కూతుర్ని తీసుకుపోయావా..? అంటూ గుండెలవిసేలా రోదిస్తూనే ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం 1.35కి రిషితారెడ్డి మృతదేహాన్ని తహసీల్దార్ కృష్ణ శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బాచుపల్లిలోని ఆమె నివాసానికి తీసుకొచ్చారు. మృతదేహాన్ని చూడగానే తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. అప్పటికే పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న బంధువులు, విజ్ఞానజ్యోతి కాలేజీ విద్యార్థులు, సిబ్బంది రిషిత మృతదేహానికి కన్నీటి నివాళులర్పించారు. అనంతరం అశ్రునయనాల మధ్య బాచుపల్లిలోని శ్మాశనవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. బియాస్ ఘటనలో మృతి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, బియాస్ నది ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థులు 24 మంది, అంతకు ముందు పులిచింతల వద్ద చనిపోయిన ఇద్దరు విద్యార్థుల ఫొటోలతో బ్యానర్ ఏర్పాటు చేసి విద్యార్థులు నివాళులర్పించారు. -
విజ్ఞాన్ అధ్యాపకునికి విశిష్ట గౌరవం
అంతర్జాతీయ జర్నల్‌లో పరిశోధనా పత్రం చేబ్రోలు: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో సైన్స్ అండ్ హ్యుమానిటీస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న కోయ ప్రభాకరరావు జపాన్‌లోని టోక్యో యూనివర్సిటీ సాయంతో చేసిన పరిశోధనలకు విశిష్ట గౌరవం లభించింది. ఆయన సమర్పించిన పరిశోధనా పత్రం అంతర్జాతీయంగా ఎంతో పేరు ఉన్న 13.7 చాప్టర్ జర్నల్ ‘అన్గెవాండిటెకెమీ’ లో ప్రచురితమైంది. ఈ విషయం గురువారం ఆయన విలేకరులకు తెలిపారు. తామరాకుపై నీరు నిలవని అంశం ఆధారంగా పెయింట్స్, రూఫ్టైల్స్ వంటి వాటి తయారీలో నీటిని వేరుచేసే విధానాన్ని తన పత్రాల్లో వెల్లడించారు. ఈ పద్ధతి ద్వారా సముద్రంలో ఆయిల్స్ లీక్ అయినపుడు ఆ నీటి నుంచి ప్రమాదకర రసాయనాలను వేరు చేయవచ్చునని తెలిపారు. ప్రభాకరరావును విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ రత్తయ్య తదితరులు అభినందించారు. -
అఖిల్ మృతదేహం లభ్యం
చౌటుప్పల్ :బియాస్ నదిలో 12రోజుల క్రితం గల్లంతైన మాచర్ల అఖిల్(20) మృతదేహం గురువారం లభ్యమైంది. చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రా మానికి చెందిన మాచర్ల అఖిల్ విజ్ఞానజ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. స్టడీ టూ ర్లో భాగంగా ఈ నెల 3న హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. బియాస్ నదిలో గల్లంతైన అఖిల్ మృతదేహం కో సం 12రోజులుగా రెస్క్యూ టీం, గజ ఈతగాళ్లు గాలిస్తూనే ఉన్నా రు. గాలింపు చర్యల్లో భాగంగా గురువారం అఖిల్ మృతదేహం లభ్యమైంది. అఖిల్ గల్లంతైన విషయం తెలియగానే, తల్లిదండ్రులు మాచర్ల సుదర్శన్, సబిత దంపతులు హిమాచల్‌ప్రదేశ్ కు తరలివెళ్లారు. ఇప్పటి వరకు అక్కడే నిరీక్షిస్తున్నారు. కొడుకు కడసారి చూపు దక్కుతుందా, లేదా అన్న ఆందోళనతో కొట్టుమిట్టాడుతున్నారు. గాలిం పు చర్యల్లో భాగంగా మృతదేహం లభ్యం కావడం తో, కడసారి కొడుకును చూసుకొని గుండెలవిసేలా రోదించారు. శుక్రవారం మధ్యాహ్నం కల్లా ప్రత్యేక విమానంలో మృతదేహం హైదరాబాద్‌కు చేరనుం ది. అక్కడి నుంచి స్వగ్రామానికి తరలించనున్నారు. అఖిల్ గల్లంతవడంతో కొయ్యలగూడెంలో విషాదం నెలకొంది. -
రేపు హైదరాబాద్‌కు తరుణ్ మృతదేహం
మండి: హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో గల్లంతు అయిన విద్యార్థులలో ఈరోజు ఒక విద్యార్థి మృతదేహం లభించింది. ఆ మృతదేహం వెంకట దుర్గా తరుణ్దిగా గుర్తించారు. పండో రిజర్వాయర్ వద్ద రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. అయితే వాటిలో ఒకటి ఇంజనీరింగ్ విద్యార్థి తరుణ్దిగా కాగా, మరొకటి స్థానికుడిదిగా గుర్తించారు. తరుణ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయింది. రోడ్డు మార్గంలో మృతదేహాన్ని ఢిల్లీకి తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రేపు ఉదయం ఢిల్లీ నుంచి విమానంలో హైదరాబాద్ తరలిస్తారు. తరుణ్ మృతదేహం రేపు ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుందని తెలంగాణ రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో ఈ నెల 8వ తేది ఆదివారం 24 మంది విద్యార్థులు గల్లంతయిన విషయం తెలిసిందే. వారిలో ఆరుగురు విద్యార్థినులు, 18 మంది విద్యార్థులు ఉన్నారు. హైదరాబాద్‌లోని విజ్ఞానజ్యోతి కళాశాల విద్యార్థులు లార్జి డ్యామ్‌లో దిగిన సమయంలో గేట్లు ఎత్తివేయడంతో ఒక్కసారిగా పెరిగిన ప్రవాహ ఉధృతికి విద్యార్థులు కొట్టుకుపోయారు. ఇంతకు ముందు 8 మృతదేహాలు దొరికాయి. ఈ రోజు దొరికి మృతదేహంతో మొత్తం 9 దొరికాయి. ఇంకా 15 మృతదేహాలు లభ్యం కావలసి ఉంది. మిగిలిన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు కొనసాగిస్తునే ఉన్నారు. గల్లంతయినవారు: 1.దాసరి శ్రీనిధి 2.కాసర్ల రిషిత రెడ్డి 3. గంపల ఐశ్యర్య 4. లక్ష్మీగాయత్రి 5.ఆకుల విజేత 6. రిథిమ పాపాని 7.కల్లూరి శ్రీహర్ష 8. దేవాశిష్ బోస్ 9. బైరినేని రిత్విక్ 10. ఆషిష్ మంత 11.సందీప్ బస్వరాజ్ 12.అరవింద్ 13.పరమేష్ 14. జగదీష్ ముదిరాజ్ 15. అఖిల్-మిట్టపల్లి 16. ఉపేందర్ 17.అఖిల్-మాచర్ల 18.భానోతు రాంబాబు 19. శివప్రకాష్ వర్మ 20. ఎం.విష్ణువర్ధన్ 21.సాయిరాజ్ 22.సాబేర్ హుస్సేన్ 23. కిరణ్ కుమార్ 24. పి.వెంకట దుర్గ తరుణ్ దొరికిన మృతదేహాలు : 1. గంపల ఐశ్యర్య 2. ఆకుల విజేత 3 భానోతు రాంబాబు 4.లక్ష్మీగాయత్రి 5. దేవాశిష్ బోస్ 6. షాబేర్ హుస్సేన్ 7. టి.ఉపేందర్ 8.అరవింద్ కుమార్ 9.పి.వెంకట దుర్గ తరుణ్ -
‘విజ్ఞానజ్యోతి’ పై చర్య తీసుకోండి
కేసు నమోదుకు సైబరాబాద్ పోలీసుల కసరత్తు! సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ బాచుపల్లిలోని విజ్ఞానజ్యోతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఇటీవల స్టడీటూర్‌కు వెళ్లి హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో మృత్యువాత పడినట్లే.. రెండేళ్ల క్రితం (2012లో) స్టడీటూర్ సందర్భంలోనూ అదే కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు పులిచింతల ప్రాజెక్టులో నీటమునిగి ప్రాణాలు కోల్పోయారు. అప్పుడే యాజమాన్య నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేసుంటే ఇప్పుడీ 24 మంది విద్యార్థుల తల్లిదండ్రులకు కడుపుకోత ఉండేదికాదని భావించిన ‘పులిచింతల’ ఘటన బాధిత కుటుంబాలు పోలీసులను ఆశ్రయించాయి. 2012లో 53 మంది విద్యార్థులను కళాశాల యాజమాన్యం స్టడీ టూర్‌కు తీసుకెళ్లింది. వారిలో అజయ్, మోహన్‌కుమార్ విద్యార్థులు నీటమునిగి ప్రాణాలు కోల్పోయారు. దీంతో తగిన సహాయం అందిస్తామని అప్పట్లో కళాశాల యాజమాన్యం హామీ ఇవ్వడంతో బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి ఫిర్యాదూ చేయలేదు. అయితే తర్వాత వారు తరబడి తిరిగినా చిల్లిగవ్వ కాదు కదా కనీసం మృతుడి సోదరికి కళాశాలలో సీటు కూడా యాజమాన్యం ఇవ్వలేదు. ఇదిలాఉండగా, ఈ నెల 3న అదే కళాశాలకు చెందిన 52 మంది విద్యార్థులు స్టడీ టూర్ కోసం హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లారు. వారిలో 24 మంది బియాస్ నదీ ప్రవాహంలో గల్లంతైన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో అజయ్, మోహన్‌కుమార్‌ల తండ్రులు కె.ప్రహ్లాదరావు, ఈశ్వరరావు స్పందించారు. మంగళవారం సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పులిచింతల ఘటనలో విజ్ఞానజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలపై కేసు నమోదు చేసేందుకు సైబరాబాద్ పోలీసులు కసరత్తు చేస్తున్నారు. -
'గుణపాఠం నేర్చుకున్నాం'
హైదరాబాద్: గల్లంతైన విద్యార్ధుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల బీమా పరిహారం మూడు నెలల్లో తల్లిదండ్రులకు అందిస్తామని విఎన్ఆర్ విజ్ఞాన్‌జ్యోతి కాలేజీ సెక్రటరి డిఎన్ రావు చెప్పారు. విద్యార్ధులు చెల్లించిన ఫీజును తిరిగి ఇస్తామన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో ఈ కాలేజీకి చెందిన 24 మంది విద్యార్థులు గల్లంతైన విషయం తెలిసిందే. ఈ ఘటన నుంచి తాము గుణపాఠం నేర్చుకున్నట్లు తెలిపారు. టూర్లో ఉన్న మరో 600 మంది విద్యార్థులను వెనక్కి రప్పించినట్లు రావు చెప్పారు. ఇదిలా ఉండగా, బియాస్ నదిలో అత్యాధునిక పరికరాలతో వెతికినా మృతదేహాలు ఇంకా దొరకలేదు. మొత్తం 24మంది గల్లంతు కాగా, కేవలం ఎనిమిది మృతదేహాలు మాత్రమే దొరికాయి. మిగతావారి జాడ తెలియలేదు. గల్లంతైన వారిలో 16 మంది విద్యార్థుల జాడ తెలియక పోవడంతో చివరి చూపుకూడా దక్కలేదని వారి తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లార్జీ డ్యాంకు దిగున 7 కిలోమీటర్ల వరకూ గాలింపు పూర్తయింది. మరో 9 కిలోమీటర్లమేర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కన్న బిడ్డల కడచూపు కోసం తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. -
హిమాచల్ దుర్ఘటన: శవాల వెలికితీతలో జాప్యమెందుకు?
"ఇది హైటెక్ యుగం. ఇక్కడ ఎన్నో టెక్నాలజీలున్నాయి. ఇన్ని రోజులైనా మనం శవాలను ఎందుకు వెలికి తీయలేకపోతున్నాం? ఆధునిక టెక్నాలజీ సాయాన్ని ఎందుకు తీసుకోవడం లేదు?' ఇది బివి సుబ్బారావు వేస్తున్న ప్రశ్న. సుబ్బారావు ఆవేదనకు అర్ధం ఉంది. ఆయన కొడుకు హిమాచల్ దుర్ఘటనలో జలసమాధి అయిపోయాడు. కానీ ఇప్పటివరకూ భౌతికకాయం మాత్రం దక్కలేదు. సుబ్బారావు హిమాచల్ కొండల్లో, కులు లోయల్లో ఏమీ తెలియని ప్రదేశంలో తనకు బాగా తెలిసిన వాడి శవం కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన మామూలు వ్యక్తి కారు. ఆయన డ్యామ్ ఇంజనీర్ కూడా. 24 మంది ఇంజనీరింగ్ విద్యార్థులను పొట్టనబెట్టుకున్న బియాస్ నది నుంచి శవాల వెలికితీత నత్తనడకన సాగుతోంది. అక్కడ పాత పద్ధతులనే ఉపయోగించడం జరుగుతోంది. కొక్కాలతో, వెదురు బొంగులతో వెతుకులాట కొనసాగుతోంది. చిన్న చిన్న పడవల్లో ఒకరిద్దరు మాత్రమే వెళ్లి వెతుకుతున్నారు. నీటి అడుగున చిత్రీకరించగలిగే కెమెరాలు అక్కడికి తీసుకొచ్చినా ఇప్పటి వరకూ వాటికి పని కల్పించలేదు. నేవీని పిలిపించాలని భావించినా ఇప్పటి వరకూ ప్రతిపాదనలు ముందుకు సాగలేదు. అసొం వంటి ప్రదేశాల్లో కొండనదులు ఉంటాయి. అక్కడ కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. అక్కడి నుంచి గజీతగాళ్లను రప్పిస్తే అన్వేషణ సులువవుతుంది. కానీ ఇప్పటి వరకూ దాని విషయంలోనూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పోనీ లార్జి డ్యామ్ నుంచి నీటి విడుదలను ఆపుచేద్దామంటే అదీ సాధ్యం కాదు. ఎందుకంటే ఆలా చేస్తే ప్రాజెక్టు ఎగువనున్న గ్రామాలు మునిగిపోతాయి. కొండరాళ్లతో నిండిన ఈ నదిలో పెద్ద పడవలు పనికిరావు. ఇవన్నీచాలవన్నట్టు ప్రాజెక్టు దిగువన భారీ పూడిక ఉంది. కొన్ని ప్రాంతాల్లో చాలా బురద ఉంది. ఇవన్నీ చాలవన్నట్టు కొన్ని చోట్ల సుడిగుండాలున్నాయి. వీటన్నిటి వల్లా శవాల వెలికితీత చాలా ఆలస్యం అవుతుంది. అయితే తమ కన్న బిడ్డలను పోగొట్టుకున్న తల్లిదండ్రులకు మాత్రం ఈ ఎదురుచూపులు నరకాన్ని చూపిస్తున్నాయి. వారి పరిస్థితి దయనీయంగా ఉంది. -
ఇంతకీ నీళ్లెందుకు వదిలినట్టు?
* కారణం చెప్పని హిమాచల్ విద్యుత్ బోర్డు * గతంలోనూ ఇలాంటి ప్రమాదాలు * లార్జి విషయంలో తొలినుంచీ పెద్ద అనుమానాలు హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ సదిపై ఉన్న లార్జి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ నుంచి హఠాత్తుగా నీళ్లు ఎందుకు వదిలినట్టు? ఉన్నట్టుండి వదిలిన నీళ్లు హిమాచల్ లో పర్యటనకు వెళ్లిన మన విద్యార్థులు 24 మందిని పొట్టనబెట్టుకుంది. విచిత్రమైన విషయం ఏమిటంటే కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి, హిమాచల్ ముఖ్యమంత్రి, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల మంత్రులు ప్రమాదం జరిగిన థాలోట్ గ్రామానికి వచ్చి వెళ్లినా, హిమాచల్ విద్యుత్ బోర్డు మాత్రం ఇప్పటి వరకూ నీటి విడుదలపై ఒక్క ప్రకటన కూడా జారీ చేయలేదు. కాబట్టి అసలు నీళ్లెందుకు వదిలారన్నది ఇప్పటికీ తెలియదు. ఆదివారం సాయంత్రం 6 - 7 గంటల మధ్య ప్రాజెక్టు సిబ్బంది నీళ్లను వదిలారు. 6.15 కి 50 క్యుసెక్కులు, 6.30 కి 150 క్యుసెక్కులు, 6.45 కి 200 క్యుసెక్యులు విడుదల చేశారు. కానీ ఆ సమయంలో నీరెందుకు వదిలారన్న దానిపై ఎలాంటి వివరణా లేదు. నిజానికి విద్యుత్ ప్రాజెక్టులు సాయంత్ర సమయంలో పూర్తి జోరుతో పనిచేస్తాయి. ఎందుకంటే చీకటి పడుతూండగానే విద్యుత్ వాడకం పెరుగుతుంది. కాబట్టి ఆ సమయంలో నీరు వదిలితే విద్యుదుత్పాదన తగ్గుతుంది. అప్పటికే బొకారో, లక్నో, గోరఖ్ పూర్ వంటి ప్రాంతాల్లో విద్యుత్ కోతలకు వ్యతిరేకంగా ప్రజలు హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. కాబట్టి ఆ సమయంలో నీరు వదలకూడదు. అయితే ఏదైనా విద్యుత్ లైన్ ఉన్నట్టుండి ట్రిప్ అయితే, ఫుల్ లోడ్ లో పనిచేస్తున్న మెషీన్ల వల్ల నీరు బయటకు వెళ్తే అవకాశాలున్నాయి. చాలా ప్రాజెక్టుల నీటి మట్టం, నీటి విడుదల సమయం వంటి అంశాల్లో దక్షిణాదిలో ఉన్నంత పారదర్శకత ఉత్తరాదిలో లేకపోవడం వల్ల నీటి విడుదల ఎప్పుడు జరుగుతుంది, ఎంత నీరు విడుదల చేస్తారు, ఎందుకు విడుదల చేస్తారు వంటి అంశాల గురించి ప్రజలకు ఏమీ తెలియదు. పైగా నీటి విడుదలలో స్థానికుల భాగస్వామ్యం ఏ మాత్రం ఉండదు. ఇలాంటి నీటి విడుదలలు ప్రాణాలు హరించడం ఇదే తొలిసారి కాదు. * ఏప్రిల్ 7, 2005 నాడు మధ్యప్రదేశ్ లోని నర్మదా సాగర్ లో ఇలాగే నీరు వదిలేశారు. దిగువన భూతాది అమావాస్య పండుగ సందర్భంగా వేలాది మంది స్నానాలు చేస్తున్నారు. ఉన్నట్టుంది నీరు వచ్చి వారందరినీ ముంచేసింది. ఈ సంఘటనలో 150 మంది చనిపోయారు. * జూన్ 30, 2007 నాడు మధ్యప్రదేశ్ లోని ఓంకారేశ్వర్ డ్యామ్ నుంచి నీరు చెప్పా పెట్టకుండా వదిలేయడంతో రెండు వేల మోటారు పంపు సెట్టు కొట్టుకుపోయాయి. ప్రాణనష్టం జరగకపోయినా, ఆస్తి నష్టం విస్తృతంగా జరిగింది. * ఉత్తరాఖండ్, కర్నాటక, సిక్కిం, తమిళనాడుల్లోనూ ఇలాంటి సంఘటనలు జరిగాయి. * 2011 లో హీరాకుడ్ డ్యామ్ నుంచి నీరు ఉన్నట్టుండి వదిలేయడంతో దిగువ ప్రాంతాల్లో భారీ వరదలు వచ్చాయి. లార్జి ప్రాజెక్టు విషయంలో మొదటి నుంచీ ప్రశ్నలున్నాయి. ప్రాజెక్టు దిగువన రెండు స్కూళ్లు అనునిత్యం ప్రమాదం ఒడిలో ఉన్నట్టు ఉంటాయి. దీనిపై స్థానికులు ఎన్నో సార్లు ఫిర్యాదులు చేసినా స్కూళ్లను తరలించలేదు. కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఈ స్కూళ్ల విషయాన్ని హిమాచల్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు కూడా. కనీసం 24 మంది పిన్నవయసు ప్రాణాలు పోయిన తరువాతైనా అధికారులు, ప్రభుత్వాలు కళ్లు తెరుస్తాయా? -
'నేవీని రంగంలోకి దింపాలి'
హైదరాబాద్ : బియాస్ నదిలో గల్లంతు అయిన విద్యార్థుల ఆచూకీ కోసం కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రిని కోరినట్లు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. నేవీ సిబ్బందిని రంగంలోకి దింపాలని ఆయన బుధవారమిక్కడ డిమాండ్ చేశారు. శాటిలైట్ ద్వారా ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేయాలని కిషన్ రెడ్డి సూచించారు. మరోవైపు బియాస్ నదిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకూ ఆరు మృతదేహాలు లభించిన విషయం తెలిసిందే. -
దేవాశిష్ బోస్ అంత్యక్రియలు పూర్తి
హైదరాబాద్ : హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థి దేవాశిష్ బోస్ అంత్యక్రియలు బుధవారం జరిగాయి. కుటుంబ సభ్యుల అశ్రు నయనాల మధ్య అంబర్ పేటలో అంత్యక్రియలు నిర్వహించారు. ప్రమాదం జరిగిన పండో డ్యామ్ ఎగువ ప్రాంతంలో 100మీటర్ల దూరంలో మంగళవారం ఉదయం దేవాశిష్ బోస్ మృతదేహం లభ్యమైంది. కాగా హిమాచల్ ప్రదేశ్‌కు విహారయాత్రకు వెళ్లిన విజ్ఞన్ జ్యోతి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులలో 20 మంది బీయాన్ నదిలో కొట్టుకుని పోయిన విషయం తెలిసిందే. బియాస్-నదిలో గల్లంతైన 24మంది విద్యార్ధుల్లో ఇప్పటి వరకు 6 మృతదేహాలను మాత్రమే రక్షణ సిబ్బంది వెలికి తీశారు. సోమవారం నలుగురు, మంగళవారం ఇద్దరి మృతదేహాలను బయటకు తీయగా.. ఇంకా 18మంది విద్యార్ధుల ఆచూకీ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. -
క్షణాల్లో ఉత్సాహాన్ని ముంచెత్తిన విషాదం
-
క్షణాల్లో వినోదం నుంచి విషాదం దాకా
హిమాచల్ ప్రదేశ్ లో లార్జీ డ్యామ్ వద్ద ఉల్లాసంగా ఉత్సాహంగా కేరింతలు కొడుతూ ఫోటోలు దిగుతున్న విజ్ఞాన్ జ్యోతి కాలేజీ విద్యార్ధులు క్షణాల్లో ఎలా జలసమాధి అయిపోయారో చూపించే విడియోను ఉత్తరప్రదేశ్ లోని ప్రముఖ దినపత్రిక అమర్ ఉజాలా వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయడం జరిగింది. ఆనందం క్షణాల్లో ఎలా విషాదంగా మారిపోయిందో ఆ విడియోను చూస్తే అర్థమవుతుంది. స్థానికులు ఈలలు వేసి, హెచ్చరిస్తున్న దృశ్యాలను, శబ్దాలను కూడా చూడొచ్చు. -
ఫొటోల కోసం పెద్దరాళ్లు ఎక్కారు..
సనత్‌నగర్: ‘అందరం అక్కడి నదీపరివాహక అందాలను చూసి మురిసిపోయాం. అక్కడి అందాల నడుమ ఫొ టోలు దిగి జీవితాంతం జ్ఞాపకంగా ఉంచుకోవాలని బియాస్ నది వద్దకెళ్లాం..అక్కడ తారసపడిన పలువురిని నదిలోతును, ప్రవాహతీరు గురించి వాకబు చేస్తే ఫర్వాలేదని చెప్పారు. అందరం గ్రూపులుగ్రూపులుగా ఫొటోలు దిగుతున్నాం. ఎక్కువమంది ఎతైనరాళ్లపై నుంచి ఫొటోలు దిగితే బాగా వస్తాయని భావించి చిన్నరాళ్లను ఆసరా చేసుకొని అక్కడికి వెళ్లారు. ఇంకొందరు చిన్నరాళ్లపైనుంచే ఫొటోలు దిగారు. ఇంత లో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడంతో పెద్దపెద్ద రాళ్లపై ఉన్నవారంతా కొట్టుకపోయారు. కిరణ్ అనే సహ విద్యార్థి తనను పట్టుకొని ఉన్న ప్రత్యూష, రిషికలను ఒడ్డుకు చేర్చాడు. అక్కడి స్థానికులు సైతం తమ ను గమనించి కాపాడేయత్నంలో భాగంగా తాడు వేసి మరో ముగ్గురిని కాపాడారు. కళ్లముందే తమ స్నేహితులు గల్లంతైపోవ డం షాక్ గురి చేసిందని’ విజ్ఞానజ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిని పర్వతనేని నవ్య కన్నీటిపర్యంతంతో జరిగిన ఘటనను వివరించింది. -
'ఎలాగైనా నా కొడుకు మృతదేహాన్ని అప్పగించండి'
మండి: 'నా కొడుకును అప్పగించండి' అంటూ ఐసా హుస్సేన్ అనే మహిళ హిమాచల్ ప్రదేశ్ అధికారులతో మొరపెట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తన కుమారుడి శవాన్ని వెతికి తీసుకురావాలని.. నా కుమారుడి మృతదేహాన్ని అప్పగించాలని మీడియా ఏజెన్సీతో ఆవేదన వ్యక్తం చేశారు. హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లాలోని బియాస్ నదిలో కొట్టుకుపోయిన విద్యార్ధుల తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా కుమారుడు మంచి ఈతగాడు.. నదిలో ఎలా కొట్టుకుపోయాడో అర్ధం కావడం లేదని మరో విద్యార్ధి తండ్రి బీవీ సుబ్బారావు కన్నీటిపర్యంతమయ్యారు. ఈ దుర్ఘటనలో మరణించిన విద్యార్ధులందరూ తెలివైన వారేనని సుబ్బారావు అన్నారు. టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈ సమయంలో కూడా మృత దేహాల వెలికితీతకు గజ ఈతగాళ్లపై ఆధారపడి ఉండటం చాలా దారుణమన్నారు. నీటిలోపల ఉండే వాటిని తేలికగా గుర్తు పట్టేందుకు ఎన్నో సాధనాలున్నాయన్నారు. -
కన్నా ఎక్కడున్నావురా?
బియాస్ నదిలో జరగిన ప్రమాదంలో రహమత్‌నగర్‌కు చెందిన జగదీశ్ ఉన్నాడు. తమ కొడుకును తలుచుకుంటు తల్లిదండ్రుల కన్నీరు మున్నీరుగా విలపించడం స్థానికంగా ప్రతి ఒక్కరినీ కలచివేసింది. ‘కన్నా.. ఎక్కడున్నావురా.. ఏమైపోయావురా..కనిపించరా..’ అంటు జగదీష్ తల్లి విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. తల్లిదండ్రులను ఒప్పించి వెళ్లాడు మియాపూర్ హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీలోని బ్లోసమ్ అపార్ట్మెంట్లో ఉంటున్న రవివర్మ ఎస్బీహెచ్, జూబ్లీహిల్స్ శాఖ బ్రాంచ్‌మేనేజర్. భార్య సుమతి, ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శివప్రకాశ్ వర్మ విజ్ఞాన్జ్యోతిలో ఈఐఈ ఇంజనీరింగ్ కోర్సు ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. తల్లిదండ్రులను ఒప్పించి పట్టుబట్టి మరీ 3వ తేదీన విహారయాత్రకు బయలుదేరాడు. ప్రతిరోజు తల్లితో ఫోన్లో మాట్లాడుతుండేవాడు. చివరిసారిగా ఆదివారం ఉదయం తల్లికి ఫోన్ చేశాడు. టూర్ విశేషాలు చెప్పాడు. ఆ తరువాత మళ్లీ ఫోన్ రాలేదు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సోమవారం ఉదయం 6 గంటలకు ఇంటికి తాళంవేసి హిమాచల్‌కు బయలుదేరారు. తల్లడిల్లుతున్న తల్లి హృదయం హిమాచల్‌ప్రదేశ్ ఘటనలో చిలకలగూడ శ్రీనివాసనగర్‌కు చెందిన అశీష్ ముంతా(20) గల్లంతు కావడంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. తల్లి సత్యవాణి కన్నీటిపర్యంతమైంది. ఏడాది కిందట భర్తను కోల్పోయి విచారంలో ఉన్న ఆమెకు ఈ వార్త అశనిపాతమైంది. కాగా గల్లంతైన ఆశీష్ ప్రమాద సమయంలో ఇద్దరు విద్యార్థినులకు ఒడ్డుకు చేర్చి, తాను ప్రమాదంలో చిక్కుకున్నాడని అతని స్నేహితులు చెబుతున్నారు. ఆచూకీ లేని సాబేర్.. శేరిలింగంపల్లి గుల్మెహర్పార్క్ కాలనీకి చెందిన షేక్ సాబేర్ హుస్సేన్ విషయమై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కాలేజీ యాజమాన్యాన్ని సంప్రదించగా సాబేర్ సురక్షితంగానే ఉన్నట్లు చెప్పారు. అయినా కాలేజీ వాళ్ల మాటలతో సంతృప్తి చెందక సాబేర్ తల్లిదండ్రులు ఆసియా, షేక్ రజాలు సోమవారం హిమాచల్‌కు బయలుదేరి వెళ్లారు. కానీ బియాస్నది వద్ద జరిగిన విషాదం వివరాలు తమకు ఏమీ తెలియడం లేదని సాబేర్ తల్లిదండ్రులు హిమాచల్‌లోని మండి నుంచి ‘సాక్షి’కి ఫోన్ చేసి చెప్పారు. ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించితేకాని ఆచూకీ దొరకదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ రాకపోవడంతో ఆందోళన చందానగర్‌కు జవహర్ కాలనీ టెల్కర్ట్స్ అపార్ట్‌మెంట్స్‌లో నివాసముండే వెంకట దుర్గ తరుణ్‌ను ఈ నెల 3వ తేదీ సాయంత్రం 8 గంటలకు స్వయంగా తండ్రి సుబ్బారావు రెలైక్కించారు. రెగ్యులర్‌గా ఫోన్లో మాట్లాడే తరుణ్ చివరిసారిగా ఆదివారం సాయంత్రం 4 గంటలకు తండ్రికి ఫోన్ చేసి కులూకు వెళుతున్నట్లు చెప్పాడు. అంతే.. ఆ తరువాత ఫోన్ రాలేదు. దాంతో తండ్రి సుబ్బారావు ఆందోళనకు గురై హిమాచల్‌ప్రదేశ్‌కు బయలుదేరి వెళ్లాడు. ఫోన్ స్విచాఫ్.. కడప జిల్లా తెలుగు గంగ ప్రాజెక్టులో ఎస్ఈగా పనిచేస్తున్న సుబ్బారావు, ఆశల కుటుంబం కూడా కూకట్‌పల్లిలోనే ఉంటుంది. వారి కుమారుడు సాయిరాజ్ కూడా ఈ ప్రమాదంలో గల్లంతయ్యాడు. చివరి సారిగా సాయిరాజ్ ఆదివారం మధ్యాహ్నం ఫోన్ చేసి కులుమనాలి సమీపంలోని పర్యాటక స్థలంలో ఉన్నామని చెప్పాడు. టీవిలో వస్తున్న వార్తలు విన్న తల్లిదండ్రులు సాయికి ఫోన్ చేశారు. అప్పటికే అది స్విచాఫ్ అయింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన వారు హుటాహుటిన హిమాచల్ ప్రదేశ్‌కి బయలుదేరారు. కోలుకోలేని విషాదంలో తల్లి వనస్థలిపురంకు చెందిన గోనూరు అరవింద్ గల్లంతయ్యాడన్న విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. అరవింద్ తల్లి శశిలత దుఃఖం వర్ణనాతీతం. శంషాబాద్‌లో ఉండే భర్త వినోద్‌కుమార్‌తో వచ్చిన మనస్పర్ధల కారణంగా కొంతకాలంగా ఆమె తన ముగ్గురు పిల్లలతో వనస్థలిపురం హిల్‌కాలనీలోని తండ్రి సంగప్ప ఇంటికి వచ్చి ఇక్కడే ఉంటోంది. అనుకోకుండా జరిగిన ప్రమాదంలో అరవింద్ గల్లంతు కావడం ఆ తల్లిని కోలుకోలేని విషాదంలో ముంచింది. -
విద్యార్థిని రిషిక క్షేమం
కాచిగూడ: హిమాచల్‌ప్రదేశ్‌కు స్టడీటూర్ కోసం వెళ్లిన వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కళాశాల విద్యార్థుల్లో బర్కత్‌పుర బసంత్ కాలనీలోని బసంత్ ఆపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న రామకృష్ణ, మంజుల దంపతుల కుమార్తె రిషిక కూడా ఉంది. ప్రమాదం విషయం తెలినప్పటి నుంచి తల్లిదండ్రులు తీవ్ర అందోళన చెందారు. అయితే, తాను క్షేమంగానే ఉన్నట్టు రిషిక నుంచి ఫోన్ రావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం రిషిక కుటుంబ సభ్యులను జీహెచ్ఎంసీ కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్, బర్కత్‌పుర కార్పొరేటర్ దిడ్డి రాంబాబు కలిసి విద్యార్థిని యోగక్షేమాలు తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. రిషిక త్వరగా హైదరాబాద్ చేరుకునేలా అధికారులతో మాట్లాడతామన్నారు. ఫోన్ వచ్చిన కొద్దిసేపటికే... ముషీరాబాద్: వీఎన్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న నల్లకుంటకు చెందిన బైరినేని రిత్విక్ రావ్ ఆదివారం మధ్యాహ్నం తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. మరో గంటలో హిమాచల్‌ప్రదేశ్‌కు చేరుకుంటున్నామని చెప్పాడు. కానీ అంతలోనే గల్లంతైనవార్తలు విని తల్లిదండ్రులు కుప్పకూలారు. గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఆదివారం రాత్రి 8.45 గంటలకు టీవీలో వార్తలు చూసి కొడుకు రిత్విక్‌కు తండ్రి రామ్మోహన్రావు ఫోన్ చేశాడు. అయితే ఫోన్ స్నేహితుడి దగ్గర ఉండటంతో రిత్విక్‌కు ఫోన్ ఇవ్వమంటే స్నేహితుడు తడబడుతూ దూరంగా ఉన్నాడని, మళ్లీ ఫోన్ చేయిస్తానని చెబుతూ విషయం దాటవేశాడు. గట్టిగా నిలదీయగా నదిలో కొట్టుకుపోయాడని సమాధానం చెప్పడంతో తండ్రి రామ్మోహన్ రావు కుప్పకూలిపోయాడు. -
షాక్‌కు గురయ్యాం
అచ్యుత్‌కుమార్ తల్లిదండ్రులు తల్లాడ శ్రీనివాస్-శ్రీదేవి భానుపురి : విద్యార్థులు నదిలో కొట్టుకుపోయిన వార్త వినగానే ఒక్కసారిగా షాక్‌కు గురయ్యామని బియాస్నది ప్రమాదంనుంచి బయటపడిన సూర్యాపేటకు చెందిన అచ్యుత్‌కుమార్ తల్లిదండ్రులు తల్లాడ శ్రీనివాస్-శ్రీదేవిలు తెలిపారు. ‘సాక్షి’తో వెల్లడించిన విషయాలు వారి మాటల్లోనే.. వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇంజినీరింగ్ కాలేజీలో ఇంజినీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ మూడో సంవత్సరం చదువుతున్న మా కుమారుడు అచ్యుత్‌కుమార్ విహారయాత్రకు వెళ్తాననగానే పంపించాం. ఆదివారం రాత్రి 7గంటల సమయంలో అచ్యుత్‌కుమార్ ఫోన్ చేసి కులుమనాలి వద్ద నదిలో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా వరద పెరిగిందని.. దానిలో తనతో పాటు విహారయాత్రకు వెళ్లిన విద్యార్థులు కొంతమంది కొట్టుకుపోయారని తెలిపారు. నదిలో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగిందని, దానిని గమనించి మా కుమారుడు నీటిలో నుండి ఒడ్డుకు వెళ్లాడని తెలిపారు. ఆ సమయంలో తన స్నేహితులను నది నుండి బయటకు రావాలని కోరగా నీవు వెళ్లు మేం వస్తాం అని మిగతా వారన్నారని.. అంతలోనే నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో నీటిలో ఉన్న వారంతా కొట్టుకుపోయినట్లు తెలిపారు. వారిని రక్షించేందుకు కొంతమంది ఒడ్డున వారు ప్రయత్నించగా వారుకూడా నదిలో కొట్టుకుపోయారని తెలిపారు. స్నేహితులు కళ్ల ముందు నీటిలో కొట్టుకుపోతున్న సంఘటనను చూసిన మా కుమారుడు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాడని చెప్పారు. అదే సమయంలో తన సెల్ఫోన్లో చార్జింగ్ తక్కువగా ఉందని అంతా చీకటిగా ఉందని తనకు భయమేస్తుందని కుమారుడు తెలపడంతో మాకు వణుకు పుట్టిందని తెలిపారు. మరుసటి రోజు కొంతదూరం వెళ్లి సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టిన అనంతరం తిరిగి తమకు ఫోన్ చేశాడని అప్పటి వరకు భయాందోళన మధ్య రాత్రి మొత్తం నిద్రలేకుండా గడిపామని చెప్పారు. -
ఆ రెండు నిమిషాలు..
ఆలస్యంగా వెళ్లాం.. ప్రాణాలతో బయటపడ్డాం : కేతన్‌కుమార్ నకి రేకల్ : ‘బియాస్ నది వద్దకు మేం రెండు బస్సుల్లో బయలుదేరాం. మాకంటే ముందు ఒక బస్సు వెళ్లింది. వారికంటే రెండు నిమిషాలు ఆలస్యంగా మా బస్సు వెళ్లింది. దీంతో మేం ప్రాణాలతో బయటపడ్డాం. మాకంటే ముందు బస్సు దిగి నదిలో ఫొటోలు దిగుతున్న మా స్నేహితులు వరద తాకిడికి కళ్లముందే ఆర్తనాదాలు చేస్తూ కొట్టుకుపోయారు. మా బస్సు ఆలస్యంగా వెళ్లకుంటే మేం కూడా వారితో పాటే నదిలో దిగేవాళ్లం. కళ్లముందే స్నేహితులు కొట్టుకుపోయిన ఘటన నన్ను ఎంతో కలిచి వేసింది. తెల్లవార్లూ కన్నీటితోనే ఉన్నాను. రాత్రి 7.30 గంటల తర్వాత నా తలిదండ్రులకు ఫోన్‌ద్వారా సమాచారం అందించా. ఆగ్రా, ఢిల్లీ, సిమ్లా ప్రాంతాలను చూశాం. ఇంకా కులూ మనాలి చూడాల్సి ఉంది. ఈ నెల 3న వెళ్లిన మేము 14వ తేదీన తిరిగి హైదరాబాద్‌కు చేరుకోవాల్సి ఉంది. కులు మనాలి దారిలోనే నదిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన రాత్రి ఎవరూ పట్టించుకోలేదు. రాత్రి 9.45గంటల ప్రాంతంలో పోలీసులు చేరుకున్నారు. చీకటిగా ఉన్నందున వారుకూడా ఏమీ చేయలేక తెల్లవారుజామున గాలింపు చర్యలు చేపట్టారు’. మా కుమారుడు ప్రాణాలతో బయటపడడం అదృష్టం హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్నది ప్రమాదం నుంచి తమ కుమారుడు కేతన్‌కుమార్ ప్రాణాలతో బయటపడడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని అతని తల్లిదండ్రులు గజ్జల అశోక్‌కుమార్, అనితలు తెలిపారు. మాకు ఇద్దరుకుమారులు, పెద్ద కుమారుడు కేతన్‌కుమార్ హైద్రాబాద్‌లోని వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. పరీక్షలు ముగించుకున్న కేతన్‌కుమార్ స్నేహితులతో విహారయాత్రకు వెళ్లాడు. తమ కుమారుడు రాత్రి ఫోన్‌చేసి నా స్నేహితులంతా నదిలో కొట్టుకుపోయారని ఏడ్చుకుంటూ తెలపడంతో తాము ఒక్కసారిగా భయానికి గురయ్యామని చెప్పారు. గంట వరకు తాము కోలుకోలేదని.. రెండవ సారి ఫోన్ చేసి నాకేమీ కాలేదు.. మీరు టెన్షన్ పడవద్దని తెలపడంతో ఊపిరిపీల్చుకున్నామన్నారు. అయినా ఇంకా భయంగానే ఉందని చెప్పారు. -
గంగమ్మ మింగేసింది
యలమంచిలి/మొగల్తూరు : హిమాచల్‌ప్రదేశ్‌లోని కులుమనాలి సమీపంలోని నదివద్ద గల హైడ్రోపవర్ ప్రాజెక్ట్ గేట్లను అకస్మాత్తుగా ఎత్తివేయడంతో మరణించిన విద్యార్థినుల్లో ఒకరైన ఆకుల విజేత స్వగ్రామం యలమంచిలి మండలం కంచుస్తం భంపాలెం. ఈ గ్రామానికి చెందిన ఆకుల సూర్యకుమార్, పద్మ కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. వీరికి ఇరువురు కుమార్తెలు. పెద్ద కుమార్తె హైదరాబాద్‌లోనే ఆర్కిటెక్చర్ ఇంజినీరింగ్ చేస్తోంది. రెండో కుమార్తె విజేత హైదరాబాద్‌లోని బాచుపల్లిలో వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజి నీరింగ్ కళాశాలలో స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ సెకండియర్ చదువుతోంది. కంచుస్తంభంపాలెంకు చెందిన ఆమె తాత రంగారావు బీఈ ఎలక్ట్రికల్ చదివారు. విజయవాడలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ఆయన ఆ తరువాత మిలటరీలో మేజర్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. అనంతరం కంచుస్తంభంపాలెంలో సత్యసాయి ఆసుపత్రిని నెలకొల్పి ప్రజలకు ఉచితంగా వైద్య సేవలందిస్తున్నారు. రంగారావుకు ఇద్దరు కుమార్తెలు కాగా, పెద్ద కుమార్తె నందిత ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నారు. ఈమె భర్త కూడా మిలటరీలో పని చేస్తున్నారు. రెండో కుమార్తె ఉష. ఆమె అమెరికాలో స్థిరపడ్డారు. ఆయన కుమారుడు సూర్యకుమార్. హైదరాబాద్‌లో ట్రాక్టర్ ఇంజినీరింగ్ వ్యాపారం చేస్తున్నారు. రంగారావు కంచుస్తంభంపాలెంలోనే ఉండటంతో వేసవి సెలవులు, బంధువుల ఇళ్లలో శుభకార్యాలు జరిగే సందర్భాల్లో సూర్యకుమార్ కుటుంబ సభ్యులంతా ఇక్కడకు వస్తుంటారని సూర్యకుమార్ చిన్నాన్న కొడుకు ఆకుల సూర్యనారాయణ తెలిపారు. విజేత మరణించిందన్న సమాచారం తెలియడంతో ఆమె తాత రంగారావు సోమవారం హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. విజేత మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఇలా అవుతుందనుకోలేదు చదువు పూర్తి చేసుకుని ఉన్నత స్థాయికి ఎదుగుతుందనుకున్న తన అక్క మనుమరాలు ఆకుల విజేత నదిలో కొట్టుకుపోరుు మరణించడం తమ దురదృష్టమని ఆరేటి రాజా వాపోయూరు. విజేత బతికే ఉంటుందనుకున్నానని అన్నారు. ఇలా అవుతుందని కలలో కూడా ఊహించలేదన్నారు. తన అక్క మనుమరాలు మరణించిందన్న విషయం తెలుసుకున్న ఆయన సోమవారం హైదరాబాద్ బయలుదేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్టడీ టూర్లో భాగంగా హిమాచల్‌ప్రదేశ్‌లోని కులుమనాలి ప్రాంతానికి వెళ్లిన విజేత నదిలో గల్లంత్యయిదని తెలిసి రాత్రంతా టీవీ చూస్తూ జాగారం చేశానని తెలిపారు. సూర్యకుమార్, పద్మ దంపతులకు కుమారులు లేరని, కుమార్తెలనే కొడుకులుగా చూసుకుంటున్నారని అన్నారు. వారికి ఉన్నత చదువులు చదివిస్తున్న ఆ తల్లిదండ్రులకు భగవంతుడు తీరని అన్యాయం చేశాడని కన్నీటి పర్యంతమయ్యారు. -
8 బ్యాచ్‌లుగా టూర్‌కు వెళ్లాం
భీమవరం క్రైం : హైదరాబాద్ నగర శివార్లలోని బాచుపల్లి విజ్ఞాన జ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న తన సహ విద్యార్థులు హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతవడం జీర్ణించుకోలేకపోతున్నానని ఆ కళాశాలలో బీటెక్ (మెకానికల్) సెకండియర్ చదువుతున్న ఆరేటి మధుదాన వెంకట చైతన్య (19) పేర్కొన్నాడు. భీమవరానికి చెందిన ఆరేటి మాణిక్యాలరావు (చిట్టిబాబు) కుమారుడైన చైతన్య సహవిద్యార్థులతో కలసి స్టడీ టూర్ నిమిత్తం అక్కడకు వెళ్లాడు. ఫోన్లో అతడితో మాట్లాడగా... ‘మా కళాశాల నుంచి మొత్తం 8 బ్యాచ్‌లుగా టూర్‌కు వెళ్లాం. మెకానికల్ బ్రాంచికి చెందిన మేమంతా మనాలి నుంచి బస్సులో వెళుతున్నాం. ఇన్స్ట్రుమెంటేషన్ బ్రాంచికి చెందిన విద్యార్థులంతా మరో బస్సులో మనాలికి వెళుతూ లార్జి డ్యామ్ వద్ద ఫొటోలు దిగేందుకు ఆగారు. ఒక్కసారిగా డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన 15 నిముషాలకు మేమంతా డ్యామ్ వద్దకు చేరుకున్నాం. అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఏం జరిగిందని అక్కడి వారిని అడగ్గా మా కాలేజీ విద్యార్ధులు గల్లంతయ్యారని చెప్పారు. మాకు కాళ్లు, చేతులు ఆడలేదు. ఈ బాధను తట్టుకోలేకపోతున్నాం. ప్రస్తుతం మేమంతా ఢిల్లీ చేరుకున్నాం. మంగళవారం ఉదయానికి హైదరాబాద్ చేరుకుంటాం’ అని చెప్పాడు. క్షేమమని తెలిసినా.. భయమేసింది ప్రమాదం జరిగిన విషయాన్ని టీవీలో చూశానని.. దీంతో తనకు చాలా భయమేసిందని చైతన్య తండ్రి మాణిక్యాలరావు తెలిపారు. ఒకపక్క కంగారు పడుతూనే తన కుమారుడు చైతన్యకు ఫోన్ చేశానని, క్షేమంగా ఉన్నాడని తెలుసుకుని ఊపిరిపీల్చుకున్నానని చెప్పారు. అయినా అంతమంది విద్యార్థులు గల్లంతవడం చాలా బాధ కలిగిస్తోందన్నారు. చేతికి అందివచ్చిన పిల్లలు చనిపోతే వారి తల్లితండ్రులు పడే నరకయాతన అంతాఇంతా కాదన్నారు. ఇటువంటి ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేకపోతే తల్లిదండ్రులకు చాలా బాధను అనుభవించాల్సి వస్తుందని కన్నీరుమున్నీరయ్యారు. -
నేను క్షేమం
- విహారయాత్రకు వెళ్లిన వినయ్‌రెడ్డి ఫోన్.. - ఊపిరి పీల్చుకున్న తల్లిదండ్రులు మెదక్ రూరల్: హిమాచల్‌ప్రదేశ్‌లో విహారయాత్రకు వెళ్లిన జిల్లాకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి వినయ్‌రెడ్డి సేఫ్‌గా ఉన్నారు. నేను క్షేమంగా ఉన్నానని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రంగారెడ్డి జిల్లా విజ్ఞాన జ్యోతి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ఈ నెల 3న హిమాచల్‌ప్రదేశ్‌లోని బీయాస్ నదిలో ప్రమాదానికి గురైన విషయం విదితమే. కాగా మెదక్ మండలం తొగిట గ్రామానికి చెందిన బారాజు భూపాల్‌రెడ్డి, పద్మ దంపతుల రెండో కుమారుడు వినయ్‌రెడ్డి సైతం అదే కళాశాలలో మెకానికల్ బ్రాంచిలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఈ బ్రాంచ్‌కు చెందిన విద్యార్థులు హిమాచల్‌ప్రదేశ్ వెళ్లారు. అందులో వినయ్‌రెడ్డి కూడా ఉన్నారు. విహారయాత్రకు వెళ్లిన 48 మంది విద్యార్థుల్లో 24 మంది నదిలో గల్లంతయ్యారు. ఇదిలా ఉండగా ఈ విషయాన్ని టీ వీల ద్వారా వీక్షించిన వినయ్‌రెడ్డి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యరు. ఫోన్‌ద్వారా కొడుకు క్షేమంగా ఉన్నవిషయం తెలుసుకుని వారు ఊపిరిపీల్చుకున్నారు. కాగా.. నది ప్రమాద ఘటనలో పటాన్‌చెరుకు చెందిన విద్యార్థిని ఉన్నారని స్థానికంగా ప్రచారం జరగడంతో కలవరం చోటుచేసుకుంది. ఎస్ఆర్ ట్రస్ట్ అధినేత సి. అంజిరెడ్డి కుమార్తె కూడా ఇదే కళాశాలలో చదువుతోంది. హిమాచల్‌ప్రదేశ్ టూర్లో ఉన్నారనే వార్తలు వచ్చాయి. అయితే ఆయన కుమార్తె కూడా కాలేజి నుంచి టూర్‌కు వెళ్లిన మాట వాస్తవమే కానీ ఆమె బ్యాచ్ విద్యార్థులంతా వేరే టూర్‌కు వెళ్లారని తెలియడంతో కలవరం సద్దుమణిగింది. -
విజ్ఞాన్ జ్యోతి కళాశాలపై హెచ్ఆర్సీకి ఫిర్యాదు
హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్ విహార యాత్రకు వెళ్లిన విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు మరణించిన సంఘటనపై బాలల హక్కుల సంఘం స్పందించింది. విజ్ఞాన జ్యోతి కళాశాల యాజమాన్యంపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసింది. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే విద్యార్థులు చనిపోయారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ సంఘటనపై ఆగస్టులో 4లోగా నివేదిక ఇవ్వాలంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శులకు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు మానవ హక్కుల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఆదివారం సాయంత్రం హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి జిల్లాలో బియాస్ నదిపై డ్యామ్ గేట్లను అకస్మాత్తుగా ఎత్తివేయడంతో విజ్ఞాన జ్యోతి కళాశాలకు చెందిన 24 మంది విద్యార్థులు గల్లంతయ్యారు. -
కాంగ్రెస్, బీజేపీలకు ఓటుతోనే గుణపాఠం
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: తెలుగుజాతికి పార్లమెంటు సాక్షిగా కాంగ్రెస్, బీజేపీ చేసిన ద్రోహాన్ని ప్రజలు ఎన్నటికీ మరచిపోరని విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత, సమైక్యాంధ్ర జేఏసీ చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య చెప్పారు. బ్రాడీపేటలోని ఓ హోటల్లో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు ఓటు ఆయుధంతో ప్రజలు మర్చిపోలేని గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రాష్ట్ర విభజన ఆపి తీరుతామని ప్రగల్భాలు పలికిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు లోక్‌సభలో స్పీకర్ వెల్‌లోకి వెళ్లి ఆందోళన చేశారే తప్ప బిల్లు ప్రతులను చించి వేసి, అక్కడికక్కడే రాజీనామాలు చేయలేదేమని ప్రశ్నించారు. విభజనతో నష్టపోయే ప్రాంత ఎంపీలను లోక్‌సభ నుంచి బహిష్కరించి దొడ్డిదారిలో బిల్లును ఆమోదింపజేసుకోవడం రాజ్యంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. గాంధీ మార్గంలో 200 రోజులకు పైబడి చేసిన ఉద్యమంలో ఎక్కడా విధ్వంసానికి పాల్పడలేదని, గాంధీ వారసులమని చెప్పుకునే నియంతలే రాష్ట్రాన్ని రెండుగా విభజించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌పార్టీని 20 ఏళ్ళ పాటు అధికారానికి దూరం చేయాలన్నారు. ఇప్పటి వరకూ సమైక్యాంధ్ర కోసం చేసిన కృషి, పోరాట స్ఫూర్తి, పట్టుదలను ఇకపై ఈ ప్రాంత అభివృద్ధిలో చూపి యుద్ధ ప్రాతిపదికన జాతీయస్థాయి పరిశోధన సంస్థలు, విద్య, వైద్య పరిశోధన సంస్థలు నెలకొల్పేలా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో వెళ్ళే ఆలోచన ఉందా అని విలేకరులు ప్రశ్నించగా, కాంగ్రెస్ పార్టీలోకి మాత్రం వెళ్ళే ప్రసక్తి లేదన్నారు. సీఎం పార్టీ పెడితే దానిలో చేరే విషయమై ఆలోచించి, నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ ఆచార్య ఎన్.శామ్యూల్ మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ కలిసి పార్లమెంటులో రాష్ట్ర విభజన నాటకాన్ని రక్తి కట్టించాయని, వీరి నాటకం వీధి బాగోతాన్ని తలపించిందన్నారు. స్వార్థ కాంగ్రెస్, బీజేపీ నాయకులను సీమాంధ్ర నుంచి బహిష్కరించి మన ప్రాంతాన్ని మనమే అభివృద్ధి పరుచుకుందామన్నారు. మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ రాజ్యాంగం, సంప్రదాయాలను పక్కన పెట్టి రాష్ట్రాన్ని విభజించడం దారుణమన్నారు. విలేకరుల సమావేశంలో సమైక్యాంధ్ర జేఏసీ గౌరవాధ్యక్షుడు ఆచార్య పి.నరసింహారావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు, విద్యాసంస్థల జేఈసీ ప్రతినిధులు కేవీ శేషగిరిరావు, ఆర్. రాము తదితరులు పాల్గొన్నారు. -
టీటీ విజేత ప్రశాంతి నికేతన్
సాక్షి, హైదరాబాద్: విజ్ఞాన్ స్పోర్ట్స్ మీట్లో భాగంగా జరిగిన టేబుల్ టెన్నిస్‌లో విజ్ఞాన్ ప్రబోధానంద ప్రశాంతి నికేతన్ స్కూల్ విజేతగా నిలిచింది. దాదాపు 20 జట్లు పాల్గొన్న ఈ మీట్లో 1,500 మంది ప్లేయర్లు వివిధ విభాగాల్లో పోటీ పడ్డారు. కబడ్డీలో చేరియాల సెరినిటి మోడల్ హైస్కూల్‌కు టైటిల్ దక్కగా, జీసెస్ వే ఇంటర్నేషనల్ హైస్కూల్ రన్నరప్‌గా నిలిచింది. చెస్‌లో విజ్ఞాన్ స్కూల్ (ఈసీఐఎల్), జీ హైస్కూల్ తొలి రెండు స్థానాలను గెలుచుకున్నాయి. బాలికల వాలీబాల్‌లో విజ్ఞాన్ స్కూల్ (సరూర్‌నగర్) చాంపియన్‌గా, సెయింట్ జోసెఫ్ స్కూల్ (రామంతాపురం) రన్నర్‌గా నిలిచాయి. జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు, ఆర్టీసీ సీనియర్ పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్ జి.కిరణ్‌రెడ్డి బహుమతులు అందజేశారు. -
ఘనంగా విజ్ఞాన్ మహోత్సవ్-2014
సాక్షి, గుంటూరు: వడ్లమూడిలోని విజ్ఞాన్ క్యాంపస్‌లో రెండ్రోజుల పాటు సాగే నేషనల్ యూత్ ఫెస్ట్ శుక్రవారం మొదలైంది. పలు ఇంజనీరింగ్ కళాశాలలు, యూనివర్శిటీల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. విజ్ఞాన్ మహోత్సవ్ పేరిట గత పద్నాలుగేళ్ళుగా దీన్ని నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో 2010 నుంచి 2013 వరకు వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 200 మంది విద్యార్ధులకు రూ. కోటి చెక్కుల్ని అకడమిక్ స్కాలర్‌షిప్పుల కింద పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధిగా హాజరైన ఒరాకిల్ గ్లోబల్ కస్టమర్ సర్వీసెస్ డెరైక్టర్ సునీల్ కుంటేట మాట్లాడుతూ విద్యార్ధులు ఒక రంగంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని జీవితంలో అత్యున్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. విజ్ఞాన్ సంస్థల ఛైర్మన్ లావు రత్తయ్య మాట్లాడుతూ క్లాసు రూం పాఠాలతో 20 శాతమే విజ్ఞానం లభిస్తుందని, దీనితో పాటు భావోద్వేగం, భౌతికం, మానసికం, సామాజికంగా జ్ఞానాన్ని పొందితేనే అది సంపూర్ణమవుతుందన్నారు. యువజనోత్సవాల ద్వారా టీం స్పిరిట్, నాయకత్వ లక్షణాలు అలవడతాయన్నారు. క్యాంపస్‌లో ‘స్ఫూర్తి’ పేరుతో టెక్నికల్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు. కార్యక్రమంలో విజ్ఞాన్ మహోత్సవ్ కన్వీనర్ ఎ. రఘునాధ్, విజ్ఞాన్ వర్శిటీ ఛాన్సలర్ కె. రామ్మూర్తి నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
విజ్ఞాన్ వర్సిటీలో అంతర్జాతీయ సదస్సు
హైదరాబాద్: విజ్ఞాన్ వర్సిటీ, వడ్లమూడిలో 23, 24 తేదీల్లో ‘అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యర్థపదార్థాల మేనేజ్మెంట్లో ఉపయోగించాల్సిన సాంకేతిక పరిజ్ఞానం’ అనే అంశంపై అంతర్జాతీయ సదస్సు జరగనుంది. దీనిని విజ్ఞాన్ వర్సిటీతోపాటు హాంకాంగ్‌కు చెందిన కాలగరీ యూనివర్సిటీ, హాంకాంగ్ బాప్టిస్ట్స్ వర్సిటీ, వేస్ట్ టు ఎనర్జీ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్-ఇండియా, జాతీయ పర్యావరణ ఇంజనీరింగ్ పరిశోధన కేంద్రం (ఎన్ఈఈఆర్ఈ) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయని విజ్ఞాన్ వర్సిటీ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ డెరైక్టర్ వి.మధుసూదనరావు తెలిపారు. సదస్సుకు వివిధ దేశాల నుంచి శాస్త్రవేత్తలు, టెక్నాలజిస్టులు, విద్యావేత్తలు హాజరవుతున్నట్టు పేర్కొన్నారు. సదస్సులో.. వ్యర్థపదార్థాల మేనేజ్మెంట్, వాతావరణంలో మార్పులు, వ్యర్థపదార్థాల నిర్వహణలో జీఐఎస్.. ఇతర టెక్నాలజీలు వంటి అంశాలపై చర్చించనున్నట్టు తెలి పారు. సదస్సుకు ముఖ్యఅతిథిగా కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సలహాదారు ఎస్ఆర్ రావుతోపాటు నాగ్‌పూర్‌కు చెందిన సీని యర్ శాస్త్రవేత్త సుశీల్‌కుమార్ హాజరవుతున్నారన్నారు. -
రావూరికి డాక్టరేట్ ప్రదానం