విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు మరణించిన సంఘటనపై బాలల హక్కుల సంఘం స్పందించింది.
హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్ విహార యాత్రకు వెళ్లిన విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు మరణించిన సంఘటనపై బాలల హక్కుల సంఘం స్పందించింది. విజ్ఞాన జ్యోతి కళాశాల యాజమాన్యంపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసింది.
కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే విద్యార్థులు చనిపోయారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ సంఘటనపై ఆగస్టులో 4లోగా నివేదిక ఇవ్వాలంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శులకు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్కు మానవ హక్కుల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఆదివారం సాయంత్రం హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి జిల్లాలో బియాస్ నదిపై డ్యామ్ గేట్లను అకస్మాత్తుగా ఎత్తివేయడంతో విజ్ఞాన జ్యోతి కళాశాలకు చెందిన 24 మంది విద్యార్థులు గల్లంతయ్యారు.