![Parent Complaint HRC Against Woman Who Trapped Her Son - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/14/Trapped.jpg.webp?itok=KVL_-I5a)
ప్రతీకాత్మక చిత్రం
గచ్చిబౌలి(హైదరాబాద్): తన కొడుకు అలెక్స్‌ను ఓ యువతి ట్రాప్ చేసి తమ వద్దకు రాకుండా చేస్తుందని సుదర్శన్‌నగర్‌కు చెందిన బాబురావు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. బట్టల షాపులో పనిచేసే సదరు యువతి బంధువుల సాయంతో ట్రాప్ చేసి కిడ్నాప్ చేసిందన్నారు. గచ్చిబౌలి పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినా అలెక్స్ స్టేట్‌మెంట్ రికార్డు చేసి పంపారని తెలిపారు. అతను మేజర్ అని ఎక్కడైనా ఉండవచ్చని పోలీసులు తెలిపారని, కానీ బాల్య వివాహ చట్టంలో 19 ఏళ్లకు పెళ్లి చేసుకోవడం నేరమని ఆయన పేర్కొన్నారు. కొడుకు చదువు, భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని జాతీయ, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లలో ఫిర్యాదు చేశానని ఆయన పేర్కొన్నారు.
చదవండి: ఏమైందో ఏమో.. అన్నయ్య విదేశాలకు వెళ్లిపోవడంతో..
జూన్‌లో పీఎస్‌లో ఫిర్యాదు
తన కొడుకు అలెక్స్‌ను ఓ యువతి కిడ్నాప్ చేసిందని గత జూన్ 26న గచ్చిబౌలి ఠాణాలో బాబురావు ఫిర్యాదు చేశారు. జూన్ 28న ఇద్దరినీ పీఎస్‌కు రప్పించి విచారించగా తాము జూన్ 27న బీహెచ్‌ఈఎల్‌లోని దేవాలయంలో పెళ్లి చేసుకున్నామని ఫొటోలు చూపించారు. నేను మా తల్లిదండ్రుల వద్దకు వెళ్లనని, నా బతుకు నే బతుకుతానని అలెక్స్ తెగేసి చెప్పాడు. అలెక్స్, జ్యోతిలు పెద్దలకు దూరంగా బతుకుతామని, ఎవరు కిడ్నాప్ చేయలేదని లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చారు. దీంతో బాబురావు హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించాడు.
Comments
Please login to add a commentAdd a comment