HRC
-
‘కర్నూలు నుంచి లోకాయుక్త, హెచ్ఆర్సీ తరలిస్తే ప్రజా ఉద్యమమే..’
సాక్షి, కర్నూలు: కర్నూలు నుండి అమరావతికి లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్‌ను తరలించరాదని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు కర్నూలు కలెక్టర్ రంజిత్ భాషకు వినతి పత్రం అందజేశారు వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, మేయర్ బీవై రామయ్య, న్యాయవాదులు.అనంతరం వైఎస్సార్సీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే కర్నూలు జిల్లా చాలా నష్టపోయింది. కర్నూలుకు వైఎస్ జగన్ తీసుకువచ్చిన సంస్థలను చంద్రబాబు తరలిస్తున్నారు. కేంద్రాన్ని ఒప్పించి వైఎస్ జగన్ కర్నూలుకు లా వర్సిటీని తెచ్చారు. సీమకు చంద్రబాబు చేస్తున్న అన్యాయంపై ఆందోళన చేస్తాం. అధికారంలోకి వచ్చిన ప్రతీసారి చంద్రబాబు.. కర్నూలుకు నష్టం చేస్తున్నారు. ప్రజా ఉద్యమాల ద్వారా కర్నూలు జిల్లాను కాపాడుకుంటాం. చంద్రబాబు లా యూనివర్సిటీని తరలించుకుపోతుంటే కూటమి ప్రభుత్వంలోని జిల్లా నేతలు ఎందుకు మాట్లాడటం లేదు? అని ప్రశ్నించారు. -
ఇది ‘న్యాయ’మేనా!
ప్రతిష్టాత్మక న్యాయ సంస్థలు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ), లోకాయుక్తలకు సారథులు లేక అనాధలుగా మారాయి. హెచ్ఆర్సీ చైర్మన్, సభ్యుల పదవీ కాలం ముగిసి ఏడునెలలు గడిచింది. అలాగే, లోకాయుక్త చైర్మన్ పదవి కాలం కూడా సెప్టెంబరు 14తో ముగిసింది. దీంతో రెండు సంస్థలకు సారథులు లేకపోవడంతో పెండింగ్ కేసులు పెరిగిపోతున్నాయి. నిజానికి.. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం వీరి నియామకాలు 90 రోజుల్లో జరపాలి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో పేదలకు ఉచిత న్యాయ సేవలు అందడంలేదు. –కర్నూలు (సెంట్రల్)ఏడు నెలలు గడిచినా చలనంలేదు..రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా మాంథాత సీతారామమూర్తి, జ్యూడిషియల్ సభ్యుడిగా దండే సుబ్రమణ్యం, నాన్ జ్యూడిషియల్ æసభ్యుడు జి. శ్రీనివాసరావుల మూడేళ్ల పదవి కాలం 2024 మార్చి 23తో ముగిసింది. దీంతో అప్పట్లోనే రాష్ట్ర ప్రభుత్వం మార్చి 15 నుంచి 30 వరకు కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానించింది. అయితే, ఎన్నికలు రావడంతో అప్పట్లో ఈ ప్రక్రియ ఆగిపోయింది. చైర్మన్‌గా సుప్రీంకోర్టు, హైకోర్టులలో ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తిగా పనిచేసిన వారిని.. జ్యూడిషియల్ సభ్యుడిగా న్యాయ సంబంధ అంశాల్లో పట్టున్న వారు, నాన్ జ్యూడిషియల్ సభ్యుడు ఎన్జీఓల్లో పనిచేసిన అనుభవం ఉన్న వారిని ఎంపిక చేస్తారు.ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, స్పీకర్, కేబినెట్లో సీనియర్ మంత్రి, శాసనమండలి చైర్మన్, విపక్ష నేత సభ్యులుగా ఉండే ప్యానల్ చైర్మన్, సభ్యులను ఎంపిక చేసి గవర్నర్‌కు పంపితే ఆయన ఆమోదం తరువాత కమిషన్ మూడేళ్లపాటు అమల్లోకి వస్తుంది. కాగా, హెచ్ఆర్సీ చైర్మన్, సభ్యుల నియామకం కోసం స్వీకరించిన అర్జీలు న్యాయశాఖ దగ్గర పెండింగ్‌లో ఉన్నాయి.లోకాయుక్తలో స్తంభించిన కార్యకలాపాలు..ఇక లోకాయుక్త చైర్మన్‌గా జస్టిస్ పి. లక్ష్మణ్‌రెడ్డి పనిచేశారు. 2024 సెప్టెంబర్ 14న ఆయన పదవీకాలం ముగిసింది. దీంతో అప్పటి నుంచి ఆ పోస్టు కూడా ఖాళీగా ఉంది. ఈ క్రమంలో లోకాయుక్తలో కార్యకలాపాలు స్తంభించాయి. లోకాయుక్త చైర్మన్‌ను కూడా సీఎం, ప్రతిపక్ష నేత, స్పీకర్, సీనియర్ మంత్రి, శాసన మండలి చైర్మన్, విపక్ష నేతలతో కూడిన కమిటీ సిఫారసుల మేరకు గవర్నర్ ఎంపిక చేస్తారు. లోకాయుక్త చైర్మన్‌గా సుప్రీంకోర్టు, హైకోర్టులలో ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులుగా పనిచేసిన వారిని నియమిస్తారు. మూడేళ్ల నుంచి కర్నూలు కేంద్రంగా..రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, లోకాయుక్త సంస్థల ద్వారా ఏటా ఒక్కోదానిలో దాదాపు వెయ్యికి పైగా కేసులు పరిష్కారమవుతాయి. పైగా ఆయా సంస్థల్లో పైసా ఖర్చులేకుండా న్యాయ ఫిర్యాదులు చేసుకునే వీలుండడంతో రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు తమ ఫిర్యాదులను పంపుతారు. లెటర్ రాసి పంపినా కేసు నమోదు చేస్తారు. లేదంటే.. ఆయా సంస్థల ఈ–మెయిళ్లు, వెబ్సైట్లోనూ ఫిర్యాదు చేసినా వాది, ప్రతివాదులకు నోటీసులిచ్చి విచారణలు జరుపుతుండడంతో పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు వీటిని ఆశ్రయిస్తున్నారు.పేదలకు ఉచిత న్యాయ సేవలు..హెచ్ఆర్సీ, లోకాయుక్తల ద్వారా పేదలకు ఉచిత న్యాయ సేవలు అందుతాయి. న్యాయం కోసం పేదలు, మధ్య తరగతి వర్గాల ప్రజలు ఎక్కువగా హెచ్ఆర్సీ, లోకాయుక్తలను ఆశ్రయించి న్యాయం పొందుతారు. కానీ, ఇప్పుడివి లేకపోవడంతో ఆయా సంస్థల్లో కార్యకలాపాలు స్తంభించిపోయాయి. – కృష్ణమూర్తి, బార్ అసిసోయేషన్ అధ్యక్షుడు, కర్నూలు -
ఆ మూడింటి సంగతేంటి?
సాక్షి, అమరావతి: కర్నూలులో ఏర్పాటైన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ), లోకాయుక్త, వక్ఫ్ ట్రిబ్యునల్లను అక్కడే కొనసాగించడమా? లేక విజయవాడకు తరలించడమా? అన్న విషయంపై ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నిర్ణయమైతే తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనని స్పష్టంచేసింది. ఆ నిర్ణయాన్ని తమకు తెలియజేయాలని తేల్చిచెప్పింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.కర్నూలులో లోకాయుక్త, హెచ్ఆర్సీ ఏర్పాటుపై పిల్..ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట నిబంధనలకు విరుద్ధంగా కర్నూలులో లోకాయుక్త, హెచ్ఆర్సీ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, దీనిని చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ గుంటూరుకు చెందిన డాక్టర్ మద్దిపాటి శైలజ 2021లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. అలాగే, విజయవాడలోనే వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటుచేయాలన్న జీఓకు విరుద్ధంగా కర్నూలులో వక్ఫ్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటుచేయడాన్ని సవాలుచేస్తూ సామాజిక కార్యకర్త మహ్మద్ ఫరూఖ్ షుబ్లీ 2021లో పిల్ వేశారు. అంతేకాక.. హెచ్ఆర్సీ ఏర్పాటుచేసినా కూడా ఫిర్యాదులు తీసుకునేలా యంత్రాంగాన్ని ఇవ్వలేదంటూ ఏపీ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్ 2021లో పిల్ దాఖలు చేసింది. ఈ మూడు వ్యాజ్యాలపై సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది.విజయవాడలోనే ఉండాలని జీఓ ఇచ్చారు..వక్ఫ్ ట్రిబ్యునల్ రాజధాని ప్రాంతంలోనే ఉండాలంటూ గతంలో రాష్ట్ర ప్రభుత్వం జీఓ ఇచ్చిందని పిటిషర్ తరఫు న్యాయవాది సలీం పాషా తెలిపారు. ఆ జీఓ అమలులో ఉండగానే కర్నూలులో వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం 2021లో మరో జీఓ జారీచేసిందన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. లోకాయుక్త, హెచ్ఆర్సీ, వక్ఫ్‌బోర్డుల సంగతి ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతి స్పందిస్తూ.. ఆ మూడు సంస్థలు కర్నూలులో ఏర్పాటయ్యాయని, అక్కడే అవి పనిచేస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో వాటిని అక్కడే కొనసాగిస్తారా? లేక విజయవాడకు తరలిస్తారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రణతి చెప్పగా, ఏదో ఒక నిర్ణయం అయితే తప్పక తీసుకోవాల్సిందేనని ధర్మాసనం స్పష్టంచేసి ఆ నిర్ణయాన్ని తమకు తెలియజేయాలంటూ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. -
నా డబ్బుతో తెలంగాణ అభివృద్ధి చేస్తా: కేఏ పాల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీఆర్ఎస్ సర్కార్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ KA Paul మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి ద్వారా తమ ఛారిటీ భూములు లాక్కున్నారని, అవినీతిని నిలదీస్తున్నందునే తనను కలవడానికి సీఎం కేసీఆర్ భయపడుతున్నారని అంటున్నారాయన. సదాశివపేట పోలీసులపై మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలో గురువారం ఆయన ఫిర్యాదు చేసి.. అక్కడి సీఐ, ఎస్సైలపై చర్యలు తీసుకోవాలని కోరారాయన. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని ఎవరూ ప్రశ్నించకుండా ఉండడానికే.. కేసీఆర్, కేటీఆర్‌లు మానవ హక్కులు కమిషన్ ఏర్పాటు చేయడం లేదు. ధరణి తీసుకువచ్చి మా ఛారిటీ భూములను లాక్కున్నాడు. కేసీఆర్‌ను కలవడానికి వెళితే నన్ను అడ్డుకున్నారు. అవినీతి మీద నేను ప్రశ్నిస్తున్న అని భయపడి నన్ను కేసీఆర్ కలవలేదు అని అన్నారాయన. ఇక బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఒకటేనన్న ఆయన.. కేసీఆర్ మిత్రుడు కిషన్ రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడమే అందుకు నిదర్శమని చెప్పారు. అధికార బీఆర్ఎస్ తనను ప్రధాన ప్రతిపక్షంగా భావిస్తోందని.. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని చెప్పారాయన. ‘‘నేను అధికారంలోకి రాగానే అందరికీ డబుల్ బెడ్ రూమ్ లు ఇస్తాను. నా డబ్బు అంతా అమెరికాలో ఉండిపోయింది. ఆ డబ్బు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తా’ అని చెప్పారాయన. గత 6 నెలలుగా మానవ హక్కుల కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఖాళీగా ఉందన్న కేఏపాల్.. వారం రోజుల్లో వాటికి చైర్మన్‌ను నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో.. రిటైర్డ్ జస్టిస్ చంద్ర కుమార్‌ను మానవ హక్కుల కమిషన్ గా తాను రికమండ్ చేస్తానని చెబుతూ.. లైవ్‌లోనే ఆయనకు ఫోన్ చేసి మరీ ‘మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా ఉంటారా?’ అని అడిగారు. ప్రపంచ శాంతి మహాసభలకు ఆహ్వానించేందుకు ప్రగతి భవన్‌కు వెళ్లిన కేఏ పాల్‌ను.. అపాయింట్మెంట్ లేదని చెబుతూ సెక్యూరిటీ గేట్ బయటే అడ్డుకుని వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. ఆ టైంలోనూ ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇదీ చదవండి: బీజేపీ బలం సెన్సెక్స్ కాదు -
హెచ్ఆర్సీని ఆశ్రయించిన రైతులు
కామారెడ్డి టౌన్: కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌ను వ్యతిరేకిస్తున్న విలీన గ్రామాల రైతులు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. తాజాగా శుక్రవారం మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు హైదరాబాద్ వెళ్లి తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. రైతులకు అన్యాయం చేసిన కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్, తమపై విచక్షణా రహితంగా లాఠీలతో కొట్టిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్‌ను వేడుకున్నారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా తాము నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులు అమర్యాదగా ప్రవర్తించారని ఫిర్యాదు చేశారు. ఎలాంటి సమాచారం లేకుండానే మాస్టర్ ప్లాన్‌లో భాగంగా తమ భూములను లాక్కోవడం సరైన పద్ధతా? అని రైతులు ప్రశ్నించారు. కలెక్టరేట్ ఎదుట తాము శాంతియుతంగా ధర్నా చేస్తున్న నేపథ్యంలో కలెక్టర్ తన చాంబర్లో ఉండి కూడా, రాత్రి 8 గంటలైనా తమ గోడును పట్టించుకోలేదని, అలాగే ఏఎస్పీ అనోన్య, డీఎస్పీ సోమనాథం, సీఐలు, ఎస్ఐలు లాఠీచార్జి చేసి రైతులను విచక్షణా రహితంగా కొట్టారని, బూట్లతో తన్ని హింసించారన్నాని పేర్కొన్నారు. -
విపత్తు నిర్వహణ శాఖ నిర్లక్ష్యంపై ఫిర్యాదు
నాంపల్లి: రాష్ట్రంలో పిడుగుపాటుతో మరణించిన బాధిత కుటుంబాలను ఆదుకుని, వారికి నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేయాలని కోరుతూ న్యాయవాది సాయికృష్ణ ఆజాద్ శనివారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(హెచ్చార్సీ)లో ఫిర్యాదు చేశారు. పిడుగుపాటు నివారణ చర్యలు చేపట్టడంతోపాటుగా రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దేశంలో పిడుగుపాటు ప్రమాదాల్లో తెలంగాణ 14వ స్థానంలో ఉందని, గడచిన ఆరేళ్లలో ఇక్కడ 398 మంది మృత్యువాతపడ్డారని, ఇందుకు సంబంధించి ‘సాక్షి’లో పూర్తి వివరాలు ప్రచురితమయ్యాయని వివరించారు. ప్రమాదాలకు గురైనవారిలో అధికంగా గ్రామీణ ప్రాంతాల్లో జీవించే రైతులు, రైతుకూలీలు ఉన్నట్లు తెలియజేశారు. పిడుగుపాటుకు బలైన నిరుపేద కుటుంబాల జీవితాలు అగమ్యగోచరంగా మారాయని, వీరిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రోడ్డునపడ్డ కుటుంబాలను ఆదుకోవడం, పిడుగుపాటు నివారణ చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అధునాతన పరికరాలు అందుబాటులోకి వచ్చాయని, పుణే ఐఐటీ దామిని అనే యాప్‌ను అందుబాటులోకి తెచ్చిందని, ఇది 20 కిలో మీటర్ల నుంచి 40 కిలోమీటర్ల పరిధిలో పిడుగుపాటు ప్రమాదంపై ముందే హెచ్చరికలను జారీ చేస్తుందని తెలిపారు. అధునాతన పరికరాల సహాయంతో అనేక రాష్ట్రాల్లో, మండలాల్లో, గ్రామాల్లో వీటి సందేశాలతో ఎప్పటికప్పుడు స్థానికులను అప్రమత్తం చేస్తున్నాయని తెలిపారు. ఇక్కడ మాత్రం విపత్తుల నిర్వహణ శాఖ నిర్లక్ష్యం వల్ల భారీ నష్టం జరుగుతోందని తెలిపారు. రాష్ట్రంలో పిడుగుపాటు ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టేలా చూడాలని, పిడుగుపాటుకు గురై మరణించిన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని న్యాయవాది తన ఫిర్యాదులో కోరారు. -
అజారుద్దీన్ పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు
-
19 ఏళ్ల యువకుడిని ట్రాప్ చేసిన మహిళ.. హెచ్ఆర్సీని ఆశ్రయించిన తండ్రి
గచ్చిబౌలి(హైదరాబాద్): తన కొడుకు అలెక్స్‌ను ఓ యువతి ట్రాప్ చేసి తమ వద్దకు రాకుండా చేస్తుందని సుదర్శన్నగర్కు చెందిన బాబురావు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. బట్టల షాపులో పనిచేసే సదరు యువతి బంధువుల సాయంతో ట్రాప్ చేసి కిడ్నాప్ చేసిందన్నారు. గచ్చిబౌలి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినా అలెక్స్ స్టేట్మెంట్ రికార్డు చేసి పంపారని తెలిపారు. అతను మేజర్ అని ఎక్కడైనా ఉండవచ్చని పోలీసులు తెలిపారని, కానీ బాల్య వివాహ చట్టంలో 19 ఏళ్లకు పెళ్లి చేసుకోవడం నేరమని ఆయన పేర్కొన్నారు. కొడుకు చదువు, భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని జాతీయ, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లలో ఫిర్యాదు చేశానని ఆయన పేర్కొన్నారు. చదవండి: ఏమైందో ఏమో.. అన్నయ్య విదేశాలకు వెళ్లిపోవడంతో.. జూన్‌లో పీఎస్‌లో ఫిర్యాదు తన కొడుకు అలెక్స్‌ను ఓ యువతి కిడ్నాప్ చేసిందని గత జూన్ 26న గచ్చిబౌలి ఠాణాలో బాబురావు ఫిర్యాదు చేశారు. జూన్ 28న ఇద్దరినీ పీఎస్‌కు రప్పించి విచారించగా తాము జూన్ 27న బీహెచ్ఈఎల్లోని దేవాలయంలో పెళ్లి చేసుకున్నామని ఫొటోలు చూపించారు. నేను మా తల్లిదండ్రుల వద్దకు వెళ్లనని, నా బతుకు నే బతుకుతానని అలెక్స్ తెగేసి చెప్పాడు. అలెక్స్, జ్యోతిలు పెద్దలకు దూరంగా బతుకుతామని, ఎవరు కిడ్నాప్ చేయలేదని లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చారు. దీంతో బాబురావు హెచ్ఆర్సీని ఆశ్రయించాడు. -
ఫలించిన అంధుడి పదేళ్ల పోరాటం..
సాక్షి, కర్నూలు(సెంట్రల్): రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ) చొరవతో మధ్యలో నిలిచిపోయిన డైట్ విద్యను కొనసాగించేందుకు ఓ అంధుడికి అవకాశం లభించింది. సీటును పునరుద్ధరిస్తూ విద్యాశాఖ శుక్రవారం నివేదికను సమర్పించడంతో పదేళ్ల పోరాట నిరీక్షణకు తెరపడింది. కడపలోని అల్మాస్ పేటకు చెందిన బి.రామాంజనేయులు కుమారుడు బి.కిరణ్‌కుమార్ అంధుడు. 2012లో డైట్ ప్రవేశ పరీక్ష రాసి ఉత్తమ ర్యాంకు సాధించడంతో నెల్లూరు ప్రభుత్వ డైట్ కళాశాలలో సీటు వచ్చింది. తెలుగు మీడియంలో సోషల్ స్టడీస్ మెథడాలజీ డీఈడీ కోర్సులో చేరాడు. కొద్దిరోజులకే నెల్లూరు రైల్వే స్టేషన్లో ప్రమాదానికి గురై కాళ్లు, చేతులు విరిగిపోవడంతో ఐదారు నెలలు ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. కాస్త కోలుకున్న తరువాత కాలేజీకి వెళ్లగా తమకు ఎలాంటి సమాచారం లేకుండా గైర్హాజరు కావడంతో సీటు నిలిపివేసినట్లు ప్రిన్సిపాల్, ఇతర అధికారులు చెప్పారు. ఒకపక్క ఆరోగ్యం బాగోలేకపోవడం, మరో పక్క సీటు రద్దు కావడంతో ఆందోళన చెందాడు. పూర్తిగా కోలుకున్నాక ఎలాగైనా డీఈడీ పూర్తి చేయాలని తలచి న్యాయం కోసం 2019లో ఉమ్మడి హెచ్ఆర్సీని ఆశ్రయించాడు. ఆ సమయంలో ఏపీ కేసులను విచారణకు తీసుకోకపోవడంతో నిరాశతో వెనుదిరిగాడు. ఈఏడాది ఫిబ్రవరిలో హెచ్ఆర్సీ కర్నూలు తరలివచ్చిన తరువాత మరోసారి ఫిర్యాదు చేశాడు. అయితే పోస్టులో పంపడంతో విచారణకు రాలేదు. చదవండి: (సంచలనం రేపిన ఎస్సై గోపాలకృష్ణ ఆత్మహత్య.. అదే కారణమా..?) చివరగా అదే ఏడాది ఏప్రిల్ 8న నేరుగా కమిషన్‌ను ఆశ్రయించడంతో ప్రత్యేక కేసుగా పరిగణించి చైర్మన్ మంధాత సీతారామమూర్తి నేతృత్వంలోని బెంచ్ కిరణ్‌కుమార్ చదువుకోవడానికి ఉన్న అవకాశాలపై నివేదిక సమర్పించాలని నెల్లూరు డైట్ కళాశాల ప్రిన్సిపాల్, కరస్పాండెంట్, కలెక్టర్, కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీలకు నోటీçులు జారీ చేసింది. అందుకు విద్యాశాఖ అధికారులు స్పందించి మొదటి ఏడాది డీఈడీ కాలేజీలో కొనసాగిస్తామని శుక్రవారం కమిషన్ చైర్మన్‌కు నివేదిక సమర్పించారు. దీంతో కిరణ్‌కుమార్ చదువుకోవాలన్న ఆశ, జిజ్ఞాస, పట్టుదలను చైర్మన్ అభినందించారు. విద్యాశాఖాధికారులు కూడా బాగా స్పందించి విద్యార్థి చదువుకోవడానికి అవకాశం కల్పించడంతో అభినందనలు తెలిపి కేసును మూసి వేసినట్లు కమిషన్ సెక్షన్ ఆఫీసర్ బొగ్గారం తారక నరసింహకుమార్ తెలిపారు. -
హీరో విశ్వక్ సేన్‌పై హెచ్ఆర్సీలో ఫిర్యాదు
Complaint Of Hero Vishwak Sen: ప్రమోషన్స్ పేరుతో న్యూసెన్స్ చేస్తున్నారంటూ హీరో విశ్వక్ సేన్‌పై అడ్వకేట్ అరుణ్ కుమార్ హ్యుమర్ రైట్ కౌన్సిల్(హెచ్ఆర్సీ)కి ఫిర్యాదు చేశారు. తన తాజా చిత్రం ‘ఆశోకవనంలో అర్జుణ కల్యాణం’ త్వరలో విడుదల కాబోతోంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్లో భాగంగా ఓ అభిమాని చేత పెట్రోల్‌తో సూసైడ్ ప్రయత్నం చేసుకునే విధంగా ప్రాంక్ వీడియో చేయించింది చిత్ర బృందం. చదవండి: ప్రమోషన్స్ కోసం ఇంత దిగజారాలా? విశ్వక్సేన్పై ఫైర్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అడ్వకేట్ అరుణ్ కుమార్ హీరో విశ్వక్ సేన్, మూవీ టీంపై చర్యలు తీసుకోవాలని హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. సినిమా ప్రమోషన్స్ పేరుతో రోడ్లపై న్యూసెన్స్ చేస్తూ పబ్లిక్కు అంతరాయం కలిగిస్తున్నారని ఆయన ఆరోపించారు. పబ్లిక్ ప్లేస్‌లో సినిమా ప్రమోషన్స్ చేయకుండా చూసేలా పోలీసులకు ఆదేశాలివ్వాలని ఆయన కోరారు. అడ్వకేట్ అరుణ్ కుమార్ ఫిర్యాదును హెచ్ఆర్సీ స్వీకరించింది. చదవండి: ‘హిట్ 2’ రిలీజ్ డేట్ వచ్చేసింది, ఆ రోజే థియేటర్లో సందడి విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించిన ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమా మే 6న విడుదల కానుంది. మూవీ ప్రమోషన్లో భాగంగా ఓ అభిమానితో అల్లం అర్జున్ కుమార్ (అశోక వనంలో అర్జున కళ్యాణంలో విశ్వక్ సేన్ పేరు)కి 33 ఏళ్లు వచ్చినా పెళ్లి కాలేదు కదా సార్. నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకే పెట్రోల్ పోసుకొని సూసైడ్ చేసుకుంటా అంటూ డ్రామాలాడాడు. విశ్వక్సేన్ కూడా ఇదంతా తనకేం తెలియనట్లు ఆ డ్రామాను రక్తి కట్టించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడతుంది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు సైతం సటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. -
తల్లిదండ్రుల రక్షణ బాధ్యత బిడ్డలదే
కర్నూలు (సెంట్రల్)/ఆళ్లగడ్డ: సంతానం ఉండి కూడా తల్లిని అనాథగా వదిలేయడం సరైన విధానం కాదని, తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత బిడ్డలదే అని హ్యూమన్ రైట్స్ కమిషన్ (హెచ్ఆర్సీ) వ్యాఖ్యానించింది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని దేవరాయపురం కాలనీకి చెందిన పి.ఓలమ్మ (75) ను కుమార్తెలు, కుమారులు అనాథగా వదిలేయడంపై ‘సాక్షి’లో బుధవారం ప్రచురితమైన కథనంపై హెచ్ఆర్సీ స్పందించింది. ఈ కేసును సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఓలమ్మకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఓలమ్మ భర్త 25 ఏళ్ల క్రితమే చనిపోయినా పిల్లలను పెద్ద చేసి పెళ్లిళ్లు చేసింది. ఇటీవల ఆమె పక్షవాతానికి గురి కావడంతో కుమారులు, కోడళ్లు, కుమార్తెలు పట్టించుకోవడం లేదు. దీంతో తన బిడ్డలకు ఇచ్చిన మూడెకరాలను తిరిగి ఇప్పించాలని పెద్దలను కోరినా..వారెవరూ వినిపించుకోలేదు. దీంతో రోడ్డున పడిన ఆమె భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. సాక్షి వార్తపై హెచ్ఆర్సీ చైర్మన్ ఎం.సీతారామమూర్తి, జ్యూడిషియల్, నాన్ జ్యూడిషియల్ సభ్యులు దండే సుబ్రమణ్యం, డాక్టర్ జి.శ్రీనివాసరావులు స్పందించారు. తల్లిదండ్రుల సంరక్షణ చట్టం ప్రకారం ఓలమ్మకు న్యాయం చేయాలని నంద్యాల సబ్ కలెక్టర్, ఆళ్లగడ్డ తహసీల్దార్, ఓలమ్మ సంతానానికి నోటీసులిస్తూ కేసు డిసెంబర్ 13కి వాయిదా వేశారు. కాగా, హెచ్ఆర్సీ ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీస్ అధికారులు స్పందించారు. ఓలమ్మ ఉంటున్న ప్రదేశానికి చేరుకుని విచారించారు. తక్షణం ఆశ్రయం కల్పించేందుకు ఆమెను ఆళ్లగడ్డలోని పట్టణ నిరాశ్రయుల వసతి కేంద్రానికి తరలించారు. -
న్యాయ రాజధానిలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్
కర్నూలు (సెంట్రల్): రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ) కార్యాలయం బుధవారం కర్నూలులో ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ ఎం.సీతారామమూర్తి ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో వేదపండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జస్టిస్ ఎం.సీతారామమూర్తి తన చాంబరులో ఆశీనులవ్వగా.. జ్యుడిషియల్ సభ్యుడు దండే సుబ్రమణ్యం, నాన్ జ్యుడిషియల్ సభ్యుడు జి.శ్రీనివాసరావు, జిల్లా జడ్జి వి.రాధాకృష్ణ కృపాసాగర్, కలెక్టర్ పి.కోటేశ్వరరావు, జేసీలు ఎస్.రామ్సుందర్రెడ్డి, ఎంకేవీ శ్రీనివాసులు, ఎన్.మౌర్య, ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత జ్యుడిషియల్ సభ్యుడు దండే సుబ్రమణ్యం, నాన్ జ్యుడిషియల్ సభ్యుడు జి.శ్రీనివాసరావుల చాంబర్లను కూడా ప్రారంభించారు. త్వరలోనే కర్నూలుకు హైకోర్టు.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ ముందుకెళ్తున్నారని జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుబ్బయ్య, ప్రధాన కార్యదర్శి కరీం అన్నారు. మూడు రాజధానులకు ఉన్న అన్ని ఆటంకాలను ఆయన అధిగమిస్తారని పేర్కొన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకున్న అడ్డంకులు కూడా త్వరలోనే తొలగిపోతాయన్నారు. దాదాపు 50కి పైగా జ్యూడీషియరీ కమిషన్లు న్యాయ రాజధానికి తరలివస్తాయని చెప్పారు. ఆన్లైన్ ద్వారా ఫిర్యాదులు.. కార్యక్రమం అనంతరం జస్టిస్ ఎం.సీతారామమూర్తి మీడియాతో మాట్లాడారు. మానవ హక్కుల కమిషన్ కార్యాలయం ఇప్పటి నుంచి కర్నూలులో పనిచేస్తుందని ప్రకటించారు. మౌలిక సదుపాయాల కల్పన బాగుందన్నారు. ఈ కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయడానికి కృషి చేసిన సీఎం వైఎస్ జగన్‌తో పాటు మంత్రులను ఆయన అభినందించారు. మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లయితే.. ప్రతి ఒక్కరూ కమిషన్‌ను ఆశ్రయించి న్యాయం పొందాలని సూచించారు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఆన్లైన్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. వారంలో ఒకరోజు నేరుగా ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో బి.పుల్లయ్య, జెడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య, కర్నూలు ఆర్డీఓ హరిప్రసాద్, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆదిశేషునాయుడు తదితరులు పాల్గొన్నారు. -
కర్నూలులో హెచ్ఆర్సీ కార్యాలయం ప్రారంభం
-
కర్నూలులో హెచ్ఆర్సీ కార్యాలయం ప్రారంభం
సాక్షి, కర్నూలు: కర్నూలులో రాష్ట్ర మానవహక్కుల కమిషన్ (హ్యూమన్ రైట్స్ కమిషన్ – హెచ్ఆర్సీ) కార్యాలయాన్ని ఆ సంస్థ ఛైర్మన్ జస్టిస్ ఎం.సీతారామమూర్తి బుధవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులకు సీతారామ్మూర్తి ధన్యవాదాలు తెలిపారు. సమయం తక్కువగా వుండటం వల్ల కర్నూలు స్టేట్ గెస్ట్ హౌస్‌లో తాత్కాలికంగా కార్యాలయం ఏర్పాటు చేశామన్నారు. కోవిడ్ థర్డ్ వేవ్ నేపథ్యంలో ఆన్లైన్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తామని ఆయన తెలిపారు. ఇవీ చదవండి: కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కదిలించిన ‘సాక్షి’ కథనాలు కామారెడ్డి వివాహిత కేసులో ట్విస్ట్.. ఏం జరిగిందో తెలిస్తే షాక్.. -
హెచ్ఆర్సీ ఏర్పాటుపై స్టేకు హైకోర్టు నిరాకరణ
సాక్షి, అమరావతి: కర్నూలులో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) కార్యాలయాన్ని ఏర్పాటు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. అయితే, కర్నూలులో హెచ్ఆర్సీ, లోకాయుక్త ఏర్పాటు తమ ముందున్న వ్యాజ్యాల్లో ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్య కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, సీఆర్డీఏ కమిషనర్, లోకాయుక్త చైర్మన్, హెచ్ఆర్సీ చైర్మన్లకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వీరిని ఆదేశించింది. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ముఖ్యమంత్రి, మంత్రులకు నోటీసులు ఇచ్చేందుకు నిరాకరించింది. తదుపరి విచారణను అక్టోబర్ 5కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలులో హెచ్ఆర్సీ, లోకాయుక్త కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. అమరావతి జేఏసీ నాయకురాలు మద్దిపాటి శైలజ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేయగా.. సీజే ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. కర్నూలులో లోకాయుక్త ఏర్పాటైంది ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. కర్నూలులో లోకాయుక్త ఏర్పాటైందన్నారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ అయిందని చెప్పారు. హెచ్ఆర్సీ సైతం బుధవారం నుంచి కార్యకలాపాలను ప్రారంభించనుందని తెలిపారు. రాష్ట్ర విభజన తరువాత ఈ సంస్థల విభజన పూర్తి కాలేదని, 2017లో హెచ్ఆర్సీని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్టు నోటిఫికేషన్ ఇచ్చారని వివరించారు. అయితే అది ఇప్పటివరకు హైదరాబాద్‌లోనే కొనసాగిందని, అప్పుడు పిటిషనర్ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని పేర్కొన్నారు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి మన రాష్ట్ర భూభాగంపై హెచ్ఆర్సీ, లోకాయుక్త ఏర్పాటు చేస్తుంటే అభ్యంతరం చెబుతున్నారని తెలిపారు. సీఎం, మంత్రులను ఎలా ప్రతివాదులుగా చేరుస్తారు..? ఈ వ్యాజ్యంలో ముఖ్యమంత్రి, మంత్రులందరినీ ప్రతివాదులగా చేర్చడంపై ఏజీ అభ్యంతరం తెలిపారు. 2020 నుంచి ఇదో ట్రెండ్‌గా మారిపోయిందని, ఏ పిటిషన్ వేసినా అందులో ముఖ్యమంత్రినో, మంత్రులనో ప్రతివాదులుగా చేరుస్తున్నారని, ఇలాంటి వాటికి ఫుల్‌స్టాఫ్ పెట్టాలన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ముఖ్యమంత్రి, మంత్రులను ఎందుకు ప్రతివాదులుగా చేర్చారని పిటిషనర్ తరఫు న్యాయవాది డీఎస్ఎన్వీ ప్రసాదబాబును ప్రశ్నించింది. మంత్రి మండలి నిర్ణయం కాబట్టి, అందరినీ చేర్చారని చెప్పగా.. పాలన వికేంద్రీకరణ చట్టాన్ని శాసన సభ చేసింది కాబట్టి మొత్తం సభ్యులందరినీ ప్రతివాదులుగా చేరుస్తూ పిటిషన్ వేశారా? అని ప్రశ్నించింది. కేసుకు ఏది అవసరమో అదే చేయాలంది. ఏజీ తన వాదనలను కొనసాగిస్తూ.. లోకాయుక్త, హెచ్‌ఆర్‌సీలను కర్నూలులో ఏర్పాటు చేయడానికి ప్రత్యేక కారణాలున్నాయన్నారు. పాలన వికేంద్రీకరణ చట్టానికీ కర్నూలులో ఏర్పాటు చేయడానికి సంబంధం లేదన్నారు. కర్నూలు ప్రధాన కేంద్రంగా ఉంటుందని, ఈ రెండు సంస్థలు రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లయినా కూడా ఫిర్యాదులు స్వీకరించవచ్చని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కర్నూలులో లోకాయుక్త, హెచ్ఆర్సీ కార్యాలయాల ఏర్పాటు అంశం తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేస్తూ స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. -
నేడు హెచ్ఆర్సీ కార్యాలయం ప్రారంభం
కర్నూలు (సెంట్రల్): న్యాయ రాజధాని కర్నూలులో మరో న్యాయసంస్థ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే లోకాయుక్త ప్రారంభం కాగా బుధవారం రాష్ట్ర మానవహక్కుల కమిషన్ (హ్యూమన్ రైట్స్ కమిషన్ – హెచ్ఆర్సీ) ప్రారంభం కానున్నది. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఇటీవల మానవహక్కుల కమిషన్‌ను కర్నూలులో ఏర్పాటు చేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా శుక్రవారం గెజిట్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 1వ తేదీన మానవహక్కుల కమిషన్ కార్యాలయాన్ని తాత్కాలికంగా రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేస్తున్నారు. బుధవారం ఉదయం 10–11 గంటల మధ్య ఆ సంస్థ చైర్మన్ జస్టిస్ ఎం.సీతారామమూర్తి, జ్యుడిషియల్ సభ్యుడు దండే సుబ్రమణ్యం, నాన్ జ్యుడిషియల్ సభ్యుడు జి.శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరై కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. -
కర్నూలులో ఏపీ మానవహక్కుల కమిషన్
సాక్షి, విజయవాడ: కర్నూల్లో ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్(ఏపీ హెచ్ఆర్సీ) ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. హెచ్ఆర్సీ ప్రధాన కార్యాలయం కర్నూలులో ఏర్పాటు చేస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూల్‌ని మానవ హక్కుల కమిషన్‌కి హెడ్ క్వార్టర్‌గా స్పెసిఫై చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయంతో ఇక మీదట కర్నూల్ కేంద్రంగా ఏపీ మానవ హక్కుల కమిషన్ పని చేయనుంది. చదవండి: (ఇంటి ముందే సమాధులు.. ‘ఆత్మల ఆశీస్సులే మాకు శ్రీరామరక్ష’) -
హెచ్ఆర్సీని ఎక్కడైనా ఏర్పాటు చేయవచ్చు: ఏపీ హైకోర్టు
సాక్షి, అమరావతి: రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ను (హెచ్ఆర్సీని) రాష్ట్రంలో ఎక్కడైనా ఏర్పాటు చేసే విశేషాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఫలానా చోటునే హెచ్ఆర్సీని ఏర్పాటు చేయాలని చెప్పలేమంది. తెలంగాణలో కాకుండా మన రాష్ట్ర భూభాగంలో హక్కుల కమిషన్‌ను ఏర్పాటు చేయాలని స్పష్టంగా చెప్పామని హైకోర్టు గుర్తుచేసింది. కర్నూలులో హెచ్ఆర్సీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. అమరావతిలో హెచ్ఆర్సీని ఏర్పాటు చేస్తూ 2017లో ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవరించి కర్నూలులో ఏర్పాటుకు తాజా నోటిఫికేషన్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వివరించారు. హెచ్ఆర్సీ ఏర్పాటుకు వీలుగా కర్నూలులో రెండు ప్రాంగణాలను హెచ్ఆర్సీ చైర్మన్, సభ్యులు పరిశీలించారని, అవి అనువుగా లేకపోవడంతో కొత్త ప్రాంగణాన్ని చూస్తున్నారని తెలిపారు. హెచ్ఆర్సీ ఏర్పాటు విషయంలో పురోగతిని తెలిపేందుకు విచారణను ఓ నెలపాటు వాయిదా వేయాలని ఆయన కోర్టును కోరారు. ఇందుకు హైకోర్టు అంగీకరిస్తూ విచారణను సెప్టెంబర్ 27కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్‌గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఏపీ హెచ్ఆర్సీ కార్యాలయం తెలంగాణలో ఉండటం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ ఏపీ పౌరహక్కుల సంఘం సంయుక్త కార్యదర్శి మల్లేశ్వరరావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన ధర్మాసనం తాజాగా గురువారం మరోసారి విచారణ జరిపింది. కర్నూలులో హెచ్ఆర్సీ ఏర్పాటు చేయడం దూరాభారం అవుతుందని పిటిషనర్ న్యాయవాది పొత్తూరి సురేష్ కుమార్ తెలిపారు. అయితే ఈ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. -
పోలీసులు కబ్జాదారులతో కలిసి బెదిరిస్తున్నారని HRC లో ఫిర్యాదు
-
ఉన్నతాధికారులకు మరో అవకాశం
సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార కేసులో ఇద్దరు ఉన్నతాధికారులకు న్యాయస్థానం మరో అవకాశం ఇచ్చింది. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్, ఐఎఫ్ఎస్ అధికారి, అప్పటి ఉద్యానవన శాఖ కమిషనర్ చిరంజీవి చౌదరికి నెల రోజుల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించిన హైకోర్టు.. న్యాయస్థానం ఆదేశాల అమలుకు మరో అవకాశం ఇవ్వాలని ఇద్దరు అధికారులు అభ్యర్థించడంతో సానుకూలంగా స్పందించి జైలు శిక్ష, జరిమానా ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. కోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు రెండు వారాలు గడువు ఇస్తూ న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏం జరిగిందంటే.. విలేజ్ హార్టీకల్చర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఉద్యానవన శాఖ 2020 జనవరి 10న నోటిఫికేషన్ జారీ చేసింది. అనంతరం అదే నెలలో సవరణ నోటిఫికేషన్ జారీ చేసి గతంలో నిర్దేశించిన పలు అర్హతలను తొలగించింది. దీన్ని సవాలు చేస్తూ ఎస్.కృష్ణ, మరో 35 మంది అభ్యర్థులు గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. సవరణ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. పోస్టుల భర్తీలో పిటిషనర్లకు అవకాశం కల్పించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మ«ధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలంటూ ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేయకపోవడంతో అభ్యర్థులు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఉద్దేశపూర్వకంగానే అధికారులు కోర్టు ఆదేశాలను అమలు చేయలేదని తేల్చారు. కోర్టు ఆదేశాల మేరకు గిరిజా శంకర్, చిరంజీవి చౌదరి మంగళవారం న్యాయస్థానం ఎదుట హాజరు కాగా నెల రోజులు జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్ ఇద్దరు అధికారుల తరఫున హాజరై కోర్టు ఆదేశాలను అమలు చేస్తామని నివేదించారు. ఇందుకు రెండు వారాల గడువు కావాలని కోరారు. సుమన్ అభ్యర్థన పట్ల సానుకూలంగా స్పందించిన న్యాయమూర్తి అధికారులకు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటూ విచారణను వాయిదా వేశారు. హెచ్ఆర్సీలో సదుపాయాలపై వివరాలివ్వండి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ)కి కార్యాలయం, సిబ్బంది, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ హెచ్ఆర్సీ కార్యాలయం హైదరాబాద్‌లో ఎందుకు ఉంది? అది ఏపీ భూ భాగం నుంచి ఎందుకు పనిచేయడం లేదో కూడా చెప్పాలంది. తదుపరి విచారణను జూలై 5కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. హెచ్ఆర్సీ చైర్మన్, సభ్యులను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఆర్సీ పనిచేసేందుకు వీలుగా కార్యాలయం, సిబ్బంది, సౌకర్యాలను ఏర్పాటు చేయలేదని, దీంతో ఫిర్యాదు తీసుకుని విచారించడం సాధ్యం కావడంలేదంటూ ఏపీ పౌర హక్కుల సంఘం సంయుక్త కార్యదర్శి మల్లేశ్వరరావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. -
భూపాలపల్లి ఎమ్మెల్యేపై హెచ్చార్సిలో ఫిర్యాదు
నాంపల్లి: భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వల్ల తమ ప్రాణాలకు హాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని రేగొండ మండలం రూపిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ బండారి కవిత, భర్త దేవేందర్‌తో కలిసి సోమవారం రాష్ట్ర మానవ హక్కుల కమషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గ్రామాభివృద్ధి విషయమై ఎమ్మెల్యేతో పలుమార్లు మాట్లాడే ప్రయత్నం చేయగా ఆయన పట్టించుకోకుండా తమను టార్గెట్ చేసినట్లు తెలిపారు. ఈ నెల 2న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండల అభివృద్ధి గురించి పలువురు సర్పంచ్‌లు, ఇతర నాయకులు కలవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా తన భర్త దేవేందర్ గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరినట్లు వెల్లడించారు. దీనికి ప్రతిగా ఎమ్మెల్యే నువ్వు బీసీ సంఘంలో పని చేసినంత కాలం మీ గ్రామానికి నిధులు ఇవ్వనని హెచ్చరించినట్లు తెలిపారు. అనంతరం అతని అనుచరులతో బెదిరిస్తున్నారని, ఎమ్మెల్యేతో తమకు ప్రాణహాని ఉందని కవిత వాపోయారు. ఈ విషయంలో విచారణ నిర్వహించి తమకు రక్షణ కల్పించాలని ఆమె హక్కుల కమిషన్‌ను కోరారు. -
రోడ్డుపై గుంత: చందానగర్ ఇన్స్పెక్టర్కు నోటీసులు
చందానగర్: రోడ్డుపై ఏర్పడిన గుంత కారణంగా తన వెన్నెముకకు గాయమైందని ఓ వ్యక్తి చందానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారు స్పందించకపోవవడంతో బాధితుడు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ)ని ఆశ్రయించారు. దీనిపై వివరణ ఇవ్వాలని చందానగర్ ఇన్స్పెక్టర్కు హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం..మియాపూర్‌కు చెందిన వంగల వినయ్ గత ఏడాది డిసెంబర్ 3న జాతీయ రహదారిపై తన ద్విచక్ర వాహనంపై మియాపూర్ నుంచి బీహెచ్ఈఎల్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో జాతీయ రహదారిపై గంగారం వద్ద రోడ్డుకు అడ్డంగా తవ్వి వదిలేసిన గుంతలో బైక్ పడటంతో వినయ్ వెన్నెముకకు గాయమైంది. ఆస్పత్రిలో చికిత్స అనంతరం..రహదారి పర్యవేక్షణ లేకపోవడంతో తనకు గాయమైందని దీనికి కారణమైన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని మియాపూర్ పోలీస్ స్టేషన్లో డిసెంబర్ 6న ఫిర్యాదు చేశారు. మియాపూర్ పోలీసులు పరిశీలించి ఘటన జరిగిన ప్రాంతం చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందన్నారు. ఫిర్యాదును చందానగర్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. చందానగర్ పోలీస్ స్టేషన్లో కూడా వినయ్ మళ్లీ ఫిర్యాదు చేశారు. 15 రోజులైనా ఫిర్యాదుపై ఎలాంటి స్పందన రాకపోవడంతో జనవరి 2న హెచ్ఆర్సీని ఆశ్రయించారు. దీంతో శనివారం చందానగర్ ఇన్స్పెక్టర్కు నోటీసులు జారీ చేసింది. జూన్ 21న హెచ్ఆర్సీ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ( చదవండి: నగరంలో ముగ్గురు బాలికల అదృశ్యం ) -
సాక్షి కథనాన్ని సుమోటోగా స్వీకరించిన హెచ్చార్సీ
నాంపల్లి: ‘అధికారుల నిర్లక్ష్యం... ప్రజలకు ప్రాణ సంకటం’ గా మారిందంటూ సాక్షి దినపత్రిక కూకట్‌పల్లిలో ఈ నెల 10న వెలువడిన కథనంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. శిథిలావస్థకు చేరుకున్న విద్యుత్ స్తంభాలను మార్చాలంటూ స్థానిక ప్రజలు, కాలనీ వాసులు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం పట్ల విద్యుత్ శాఖపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కూకట్పల్లి సర్కిల్ పరిధిలోని వివేకానందనగర్ అపార్ట్మెంట్స్, అల్విన్ కాలనీ, ఎల్లమ్మబండ, సుమిత్రానగర్, పాపిరెడ్డి నగర్ ప్రాంతాల్లో ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్తంభాలను వెంటనే మార్చాలని టీఎస్ఎస్పీడీసీఎల్ ఎండీకి నోటీసులు జారీ చేసింది. ఈ కేసును మార్చి 18కి వాయిదా వేసింది. చదవండి: యూటర్న్ తీసుకుని వచ్చి మరీ మంత్రి పరామర్శ -
చంద్రబాబు, రేవంత్ నుంచి ప్రాణహాని
సాక్షి, నాంపల్లి (హైదరాబాద్): ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి వర్గం నుంచి ప్రాణహాని ఉందంటూ ఓటుకు కోట్లుకేసులో ఏ4 నిందితుడు జెరూసలేం మత్తయ్య తెలిపారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ)ను ఆశ్రయించారు. ఈ కేసులో అప్రూవర్‌గా మారినందున తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తన కు ఈడీ నుంచి నోటీసులు వచ్చినట్లు వివరించారు. ఈ కేసులో ముఖ్య సూత్రధారులు చంద్రబాబు నాయుడు, రేవంత్‌రెడ్డిలేనని చెప్పారు. కేసు పూర్తయ్యే వరకు తనకు రక్షణ కల్పించాలని ఫిర్యాదులో కోరారు. అదేవిధంగా ఎంపీ రేవంత్‌రెడ్డి పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చదవండి: (అక్క చెల్లెమ్మలు బాగుంటేనే రాష్ట్రం బాగు) -
శివ బాలాజీ ఫిర్యాదుపై హెచ్ఆర్సీ స్పందన
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంపై సినీ నటుడు శివ బాలాజీ చేసిన ఫిర్యాదుపై మానవ హక్కుల సంఘం(హెచ్ఆర్సీ) బుధవారం స్పందించింది. మౌంట్ లిటేరా జీ స్కూల్‌పై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. సమగ్ర విచారణ చేసి రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా డీఈఓకి నోటీసులు జారీ చేసింది. కాగా, మణికొండలోని మౌంట్ లిటేరా జీ స్కూల్ యాజమాన్యం ఫీజుల పేరుతో తల్లిదండ్రులను వేధింపులకు గురి చేస్తోందని శివ బాలాజీ హెచ్ఆర్సీని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. స్కూల్ ఫీజులు తగ్గించుకోమన్నందుకు ఆన్లైన్ తరగతుల నుంచి తమ పిల్లలను తొలగించారని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు.