కురవి పోలీసులపై మానవ హక్కుల సంఘం(హెచ్‌ఆర్‌సీ)లో ఈ నెల 30న ఫిర్యాదు చేసినట్లు బాధితుడు, మహబూబాబాద్ మండలం బేతోలువాసి ఎడబోయిన భుజంగరావు ఆదివారం రాత్రి తెలిపారు. తాను ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నట్లు పేర్కొన్నారు.
పోలీసులు వేధించారంటూ హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు
Aug 1 2016 12:53 AM | Updated on Sep 4 2017 7:13 AM
మహబూబాబాద్ రూరల్ : కురవి పోలీసులపై మానవ హక్కుల సంఘం(హెచ్‌ఆర్‌సీ)లో ఈ నెల 30న ఫిర్యాదు చేసినట్లు బాధితుడు, మహబూబాబాద్ మండలం బేతోలువాసి ఎడబోయిన భుజంగరావు ఆదివారం రాత్రి తెలిపారు. తాను ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో జూలై 27న ఖమ్మం జిల్లాలోని అత్తగారి ఇంటికి వెళ్లి, బేతోలుకు తిరిగి వస్తుండగా.. తన ఆటోను కురవి హైవేపై ఆపి పోలీ సులు పరిశీలించారన్నారు. అందులో ఖాళీ సంచులే ఉన్నా.. డబ్బులు ఇవ్వమని పలువురు అడిగారని భుజంగరావు ఆరోపించారు. అందుకు నిరాకరించడంతో కొట్టారని వాపోయాడు. ఆ రోజు రాత్రి వరకు పోలీస్ స్టేషన్‌లోనే ఉంచారని పేర్కొన్నాడు. గాయాలతో తాను మానుకోట ఏరియా ఆస్పత్రిలో చికిత్సపొందాల్సి వచ్చిందన్నాడు. దీనిపై హైదరాబాద్‌కు వెళ్లి, హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించినట్లు వివరించారు. సంబంధిత పోలీసు అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement