యాంకర్ తో సహజీవనం, భర్తపై ఫిర్యాదు
హైదరాబాద్: వేరే మహిళతో.. సహజీవనం చేస్తూ తనను మానసికంగా వేధిస్తున్నారని ఓ టీవీ సీరియల్ డైరెక్టర్ భార్య మంగళవారం హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు చేశారు. ప్రముఖ టీవీ సీరియల్ డైరెక్టర్ మధుకర్ పై ఆయన భార్య ఆరోపణలు చేశారు. టీవీ యాంకర్ గీతా భగవత్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుని తమ ఇంట్లోనే సహజీవనం చేస్తున్నారని వాపోయారు.
వివాహేతర సంబంధం వల్లే మధుకర్ తనను ఇంట్లో నుంచి గెంటివేశాడని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. మధుకర్, గీతా భగవత్ తనను మానసికంగా వేధిస్తున్నారని వివరించారు. తనకు న్యాయం చేయాలని ఆమె మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు.