Madhukar
-
తెలుగు బీజేపీ నేతలకు మధుకర్ చివాట్లు
-
చంద్రబాబును ఎందుకు విమర్శించరు?.. బీజేపీ నేతలకు క్లాస్
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో టీడీపీ, చంద్రబాబుపై ఎందుకు విమర్శలు చేయడంలేదని బీజేపీ(తెలుగుదేశం నుంచి వెళ్లినవారు) నేతలకు పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణాధికారి మధుకర్ జీ క్లాస్ ఇచ్చారు. కేవలం ఒక వైఎస్సార్‌సీపీపైనే ఎందుకు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాగా, విశాఖ వేదికగా బీజేపీ మీడియా ఫ్యానలిస్టులతో, మీడియా కమిటీ ప్రతినిధులతో మధుకర్ జీ శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్బంగా మీడియాలో పార్టీ తరపున ఎలా స్పందించాలో దిశా నిర్దేశం చేశారు. ఇదే సమయంలో పార్టీ నేతల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం సందర్బంగా మధుకర్ మాట్లాడుతూ..‘గతంలో రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉంది. మీరు(టీడీపీ నేతలు ఇన్ బీజేపీ) చంద్రబాబు, టీడీపీపై ఎందుకు విమర్శలు చేయడం లేదు. వైఎస్సార్సీపీ, టీడీపీలకు సమాన దూరం పాటించాలి. ఒక్క వైఎస్సార్‌సీపీపైనే ఎందుకు విమర్శలు చేస్తున్నారు. 70:30 శాతంలో కూడా మీరు విమర్శలు చేయడం లేదు. కుటుంబ పాలనకు వ్యతిరేకం అనేది బీజేపీ విధానం. పొత్తుల గురించి మీకు అప్పుడే తొందర ఎందుకు?. ఎప్పుడైనా పొత్తుపై నిర్ణయం తీసుకోవచ్చు. ఈ లోపల మీరు చేసే పని మీరు చేయండి’ అని హితవు పలికారు. -
కంటోన్మెంట్లో స్కైవేలకు కేంద్రం ఓకే
హైదరాబాద్: ఎట్టకేలకు కంటోన్మెంట్లో ప్రతిపాదిత స్కైవేలు కేంద్రం గ్రీన్ సిగ్నల్ తెలిపింది. స్కైవేల నిర్మాణానికి అవసరమైన రక్షణ భూముల కేటాయింపునకు ఇటీవలే అంగీకారం తెలిపిన కేంద్రం, తాజాగా స్కైవేల నిర్మాణానికి పూర్తిస్థాయి అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ బోర్డు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. స్ట్రాటజిక్ రోడ్స్ డెవలప్మెంట్ ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ) పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ పరిధిలో స్కైవేల నిర్మాణం చేపట్టనుంది. రాజీవ్ రహదారిపై ప్యాట్నీ చౌరస్తా నుంచి హకీంపేట వరకు సుమారు 14 కిలోమీటర్లు, నాగ్‌పూర్ హైవే మార్గంలో ప్యారడైజ్ నుంచి బోయిన్పల్లి చెక్‌పోస్టు వరకు సుమారు 6.5 కిలోమీటర్లు రెండు ఎలివేటెడ్ కారిడార్లుగా స్కైవేలు నిరి్మంచనున్నట్లు గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తొలి ప్రతిపాదనలో ప్యారడైజ్ నుంచి సుచిత్ర సర్కిల్ వరకు స్కైవే నిరి్మంచాలని భావించినప్పటికీ, ఈ మార్గంలో సుచిత్ర నుంచి బోయిన్పల్లి చెక్‌పోస్టు వరకు ఫ్లైఓవర్ నిర్మాణం కొనసాగుతోంది. దీంతో ప్రతిపాదిత స్కైవేను బోయిన్పల్లి చెక్‌పోస్టు వరకు కుదించినట్లు తెలుస్తోంది. బీఓఓ కమిటీ ఏర్పాటు ►రక్షణ భూముల బదలాయింపునకు సంబంధించిన ప్రక్రియలో భాగంగా కేంద్రం భాగస్వామ్య పక్షాలతో బోర్డ్ ఆఫ్ ఆఫీసర్స్ (బీఓఓ) కమిటీ ఏర్పాటు చేసింది. హెచ్ఎండీఏ, డిఫెన్స్ ఎస్టేట్స్ కార్యాలయం, లోకల్ మిలటరీ అథారిటీ, కంటోన్మెంట్ బోర్డుల నుంచి ఒక్కో ప్రతినిధి చొప్పున నలుగురు సభ్యులు ఈ కమిటీలో ఉంటారు. ►ప్రతిపాదిత ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం మొత్తం 150 ఎకరాల రక్షణ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించనున్నారు. ఇందులో 90 ఎకరాలు ఆర్మీకి సంబంధించిన స్థలాలు కాగా, కంటోన్మెంట్ బోర్డు స్థలాలు 30 ఎకరాలు, సివిల్ ఏవియేషన్ ఇతరత్రా మరో 30 ఎకరాలు ఉన్నాయి. ప్రైవేటు స్థలాలు వీటికి అదనం. ►ఈ మార్గాల్లో ప్రస్తుతం ఉన్న రోడ్లను 60 మీటర్లకు విస్తరించనున్నారు. ఈ మేరకు రాజీవ్ రహదారి, నాగ్‌పూర్ హైవేలో పెద్ద సంఖ్యలో ప్రైవేటు భవనాలు కనుమరుగు కానున్నాయి. ►బేగంపేట ఎయిర్‌పోర్టు, హకీంపేట ఎయిర్‌పోర్టు వంటి ప్రాంతాలకు సమీపంలో ఫ్లైఓవర్లకు బదులుగా టన్నెల్ రూపంలో రోడ్ల నిర్మాణం చేపట్టే అవకాశముంది. దీనిపై త్వరలోనే హెచ్ఎండీఏ పూర్తిస్థాయి స్పష్టత ఇవ్వనుంది. ►ఫ్లైఓవర్ నిర్మాణం కోసం కంటోన్మెంట్ బోర్డు 30 ఎకరాలకు పైగా స్థలాన్ని కోల్పోతున్నందున, అందుకు గానూ సుమారు రూ.300 కోట్ల పరిహారం ఇవ్వాలని బోర్డు అధికారులు కోరారు. అయితే కంటోన్మెంట్, ఆర్మీ, డిఫెన్స్ ఎస్టేట్స్, ఎయిర్‌ఫోర్స్ వంటి విభాగాలన్నీ కేంద్ర ప్రభుత్వ పరిధిలోనివే కాబట్టి, పరిహారం పూర్తిగా కేంద్రానికి చెందేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో బోర్డుకు ఎలాంటి పరిహారం దక్కే అవకాశం లేకుండా పోయింది. ►తాజా భూకేటాయింపుల్లో భాగంగా కంటోన్మెంట్ బోర్డు బాలంరాయి పంప్ హౌజ్, బేగంపేట ఎయిర్‌పోర్టు, హకీంపేటలో ఎయిర్‌లైన్స్ స్థలాలు, కొన్ని ఓల్డ్ గ్రాంట్ బంగళాలు తమ స్థలాలను కోల్పోనున్నాయి. ముఖ్యంగా ఎన్సీసీ, ప్రతిష్టాత్మక సికింద్రాబాద్ క్లబ్ భారీ మొత్తంలో స్థలాలను కోల్పోనున్నాయి. -
గడ్డం మధుకర్‌ను పోలీసులే హత్య చేశారు: సమత
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీ దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి గడ్డం మధుకర్ అలియాస్ శోభారాయ్‌ని పోలీసులు హత్య చేశారని మంగళవారం ఆ పార్టీ దక్షిణ జోనల్ బ్యూరో అధికార ప్రతినిధి సమత ఆరోపించారు. అనారోగ్యం కారణంగా చికిత్స కోసం వెళ్లిన శోభారాయ్‌ని జూన్ 1న స్పెషల్ బ్రాంచి పోలీసులు అరెస్టు చేశారని, ఈ విషయాన్ని పోలీసులే ప్రకటించారని పేర్కొన్నారు. ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందిస్తామని చెప్పి, ఆఖరికి 6వ తేదీన మరణించారని మీడియాకు ప్రకటన ఇచ్చారని ఆరోపించారు. వాస్తవానికి మధుకర్‌ను జూన్ 1 నుంచి 5వ తేదీ వరకు చికిత్స అందించకుండా తీవ్రంగా హింసించారని ఆరోపించారు. 15 రోజుల కింద పీఎల్జీఏ ప్లటూన్ కమాండర్ గంగాల్‌ను కూడా ఇదే తరహాలో హత్య చేశారని తెలిపారు. పోలీసు అధికారులు తమ చేతికి చిక్కినవారిని హత్య చేస్తూనే కరోనాను సాకుగా చూపుతూ సరెండర్ కావాలని, సరెండర్ అయిన వారికి మెరుగైన వైద్య సౌకర్యం అందిస్తామని ప్రలోభపెడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వాల అబద్ధపు ప్రచారాన్ని ఏ మాత్రం నమ్మవద్దని సూచించారు. హాని తలపెట్టం, చికిత్స అందిస్తాం ప్రస్తుతం మావోయిస్టు దళాల్లో వైరస్ తీవ్రత అధికంగా ఉంది. వారి కోసం తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లో మందులను సేకరిస్తున్నట్లు మాకు సమాచారం ఉంది. ఇప్పుడు లాక్డౌన్ వల్ల ఆ ప్రయత్నాలకు బ్రేక్ పడింది. కరోనా పాజిటివ్ ఉన్న సభ్యులెవరైనా లొంగిపోవాలని కోరుతున్నాం. వారికి ఎలాంటి హానీ తలపెట్టం. కావాల్సిన చికిత్స అందజేస్తాం. – అభిషేక్, దంతెవాడ ఎస్పీ చదవండి: కరోనా చికిత్స కోసం వచ్చి.. పోలీసులకు చిక్కాడు! -
బుల్లితెర ‘గుండన్న’ మనోడే
‘దేవమ్మా..దేవమ్మా...అంబిక ఇంటివద్ద ఇద్దరమ్మాయిలను చూశాను. ఒకవేళ వారు మీ పిల్లలై ఉంటారేమోనమ్మా...ఆవు చేన్లో మేస్తే దూడ గట్టులో మేస్తుందా... మీ అత్తమ్మలా నీవు అబద్దాలు చెబుతున్నావ్... నా కళ్లు నన్ను మోసం చేయలేవు శ్రీవల్లీ.. ఆడపిల్లల్ని చూశాక నాకనిపించింది. వాళ్లు దేవమ్మ పిల్లలేనని.. అంటూ ఈ టీవీలో ప్రసారమైన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సీరియల్లో దేవమ్మ అనుచరుడి పాత్ర పోషించిన గుండన్న మనోడే. సాక్షి, ఆదిలాబాద్ : ‘కలలు కనాలి.. వాటిని సాకారం చెయ్యాలి’ అని అన్నపెద్దల మాటలు నిజమని నిరూపించాడు.. సంకల్పానికి, ప్రతిభకు పేదరికం అడ్డురాదని తెలియజేశాడు ఈ యువకుడు. కెరమెరి మండలంలోని బారేమోడి గ్రామానికి చెందిన నికోడే సానాజి, కమలాబాయి దంపతులకు ముగ్గురు కూతుర్లు, ఇద్దరు కుమారులు. వారిలో చిన్నవాడు మధూకర్ అలియాస్ మధు. ప్రాథమిక విద్యాభ్యాసం బారేమోడిలో, 6వ తరగతి కెరమెరిలోని నవో దయ, 8వ సిర్పూర్(టీ)లో, 9,10వ కెరమెరి ఉన్నత పాటశాలలో, ఇంటర్ ప్రభుత్వ జూని యర్ కళాశాలలో పూర్తి చేశాడు. పదోతరగతి చదువుతుండగా పేపర్లో వచ్చిన యాడ్ చూసి సినిమా రంగంలో నటించేందుకు పాస్‌ఫొటో పంపించాడు. కానీ మూడేళ్ల వరకు ఎలాంటి సమాధానం రాలేదు.. 2010 వరంగల్ లో డిగ్రీ చదువుతుండగా తరచూ హైదరాబాద్‌లోని ఆయా స్టూడియోల్లోకి వెళ్లి వస్తుండేవాడు. (తెలంగాణ : అడ్డదారిలో ఎక్స్టెన్షన్లు) దిల్ రాజు కార్యాలయం చుట్టూ 50కి పైగా చక్కర్లు సినిమా, సీరియల్ పై ఉన్న మోజుతో హైదరాబాద్‌లోని ప్రముఖ దర్శక, నిర్మాత దిల్ రాజు కార్యాలయానికి 50కి పైగా చక్కర్లు కొట్టాడు. కానీ ఎవ్వరూ దరి చేరనివ్వలేదు. ఇలా కాదని 2011 లో సినిమా కార్యాలయంలో శిక్షణ కోసం రూ.5000 చెల్లించాడు. కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. అనంతరం ఇతనిలో ఉన్న పట్టుదల చూసి “సాయిబాబా’ సినిమాలో ఓపాత్ర కోసం రూ.లక్ష కట్టామన్నారు. అంత స్థోమత లేకపోవడంతో ఆ అవకాశం కూడా చేజారి పోయింది. (పరిశ్రమలకు అన్ని విధాలా ప్రోత్సాహం) నాటకరంగంలో అడుగు 2017లో తెలంగాణ ప్రభుత్వం భాషా సంఘం ఆధ్వర్యంలో రంగస్థల నటుడిగా 40రోజులు శిక్షణ పొందాడు. అనంతరం ‘నక్షత్రం’ ‘ఫిదా’ సినిమాలో క్యారెక్టర్ పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన తెలంగాణం నాటకం రజాకార్ల పాత్రలో పోషించి ఆహూతుల నుంచి మన్ననలు పొందాడు. ఆదిలాబాద్, బాసర, నిర్మల్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో నిర్వహించిన కుమురం భీం, పోలీస్ తదితర నాటకాల్లో ప్రతిభ కనబర్చాడు. హైదరాబాద్‌లోని క్రిష్ణానగర్లో ఉంటూ టెక్నీషియన్‌గా పనిచేశాడు. ఈ తరుణంలోనే సొంతంగా 80 వీడియోలు తయారు చేశాడు. వాటిని డైరెక్టర్, ప్రొడ్యూసర్లకు చూపించాడు. దీంతో ఆయనలో ఉన్న ప్రతిభను గుర్తించి 2019లో ‘నిన్నే పెళ్లాడతా’ సీరియల్లో రౌడీ క్యారెక్టర్ ఇప్పించారు. అక్కడి నుంచి అతని ప్రయాణం ప్రారంభమైంది. (15 రోజుల్లోగా పంపేయండి ) మధు నటించిన సీరియల్లు ప్రస్తుతం జీటీవీలో వస్తున్న ‘నిన్నే పెళ్లాడతా’ లో రౌడీ పాత్ర, స్టార్‌మాలో వస్తున్న ‘కథలో రాజకుమారి’ లో తండ్రి పాత్ర, జీ తెలుగులో వస్తున్న ‘అత్తారింట్లో అక్కా చెల్లెల్లు’ లో రౌడీ క్యారెక్టర్, ఈ టీవీలో వస్తున్న మిష్టర్ అండ్ మి సెస్ భాను’లో పోలీస్ పాత్రలో, మ్యాంగో వెబ్ సిరీస్‌లో మాంత్రికుడి పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. తపన, దృఢసంకల్పం కావాలి ప్రతి మనిషిలో ఏదో ఒక గుణం ఉంటుంది. అదేమిటో మనకు తెలుసు. దాన్ని సాధించాలంటే తపన, కృషి, దృఢసంకల్పం తప్పనిసరి. పదోతరగతిలో ఉన్నప్పుడు శ్రీ మంజూనాథ సినిమా చూసి ఇంప్రెస్ అయ్యా. నేనెందుకు తెరపై కనిపించకూడదని అనుకున్నా. అప్పుడే నా ప్రయాణం మొదలైంది. అప్పుడే స్క్రీన్ పై కనిపించాలనే తపన నన్ను మీ ముందుకు తెచ్చింది. – నికోడే మధూకర్(మధు), ఆర్టిస్ట్ -
నిజం సమాధి కాకూడదు
నిజం భూస్థాపితం కాకూడదు. అబద్ధం శిలాఫలకం అవకూడదు. నిజమూ అబద్ధమూ... రెండూ ఒకే రూపంలో కనిపిస్తున్నప్పుడు... నిజమేదో, అబద్ధమేదో తేల్చడానికి భూమిని తవ్వి తవ్వి తియ్యాలి. ప్రతి శిలనూ కదిలించి చూడాలి. అనుమాన భూతాన్ని పట్టెయ్యాలి. అలా పట్టేసేదే... రీపోస్ట్ మార్టమ్. రేపటికి నెల.. మధుకర్ చనిపోయి! మార్చి 13న ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. మళ్లీ తిరిగి రాలేదు. మధుకర్‌ది హత్యా... ఆత్మహత్యా అన్నది ఇంకా తేలలేదు. ఇప్పటికి రెండు పోస్ట్‌మార్టమ్‌లు అయ్యాయి. మొదటి పోస్ట్ మార్టమ్‌లో ఆత్మహత్య అని సూచించేలా వివరాలు ఉన్నాయి. అయితే తల్లిదండ్రులు, బంధువులు పట్టుపట్టి, రీ పోస్ట్‌మార్టమ్ కోసం కోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నారు. అది కచ్చితంగా హత్యేనని వారి ఆరోపణ. రెండో పోస్ట్ మార్టమ్ ఏప్రిల్ 10న జరిగింది. రిపోర్ట్ రావలసి ఉంది. మధుకర్‌ది తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్. అదే మండలంలోని వెంకటాపూర్ యువతి, మధుకర్ ప్రేమికులు. రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. విషయం తెలిసి యువతి తల్లిదండ్రులు మధుకర్‌ని హెచ్చరించారనీ, ఆ తర్వాత కొద్ది రోజులకే అతడిని హత్యచేశారని మధుకర్ కుటుంబం, దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి.రీ పోస్ట్మార్టమ్నంతా వీడియోలో చిత్రీకరించారు. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న కుమారుడి మృతదేహాన్ని చూసి ఆ తల్లి సొమ్మసిల్లిపోయింది. ఫోరెన్సిక్ నిపుణులు నమూనాలు తీసుకెళ్లారు. వారం రోజుల్లో నివేదిక హైకోర్టుకు అందుతుంది. మధుకర్‌ది హత్యా, ఆత్మహత్యా అన్నది అధికారికంగా అప్పుడు మాత్రమే వెల్లడవుతుంది. ఇంతకీ మధుకర్ మృతదేహానికి రీ పోస్ట్‌మార్టమ్ ఎందుకు అవసరమైంది? ఇంటి నుంచి బయటికి వెళ్లిన మధుకర్ మర్నాడు ఖానాపూర్ శివార్లలో శవమై కనిపించాడు. అక్కడి దృశ్యం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా కనిపించినా.. ముళ్లకంపలో మృతదేహం పడి ఉండడంతో ఇక్కడికి వచ్చి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోస్ట్‌మార్టం చేయించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే, ప్రేమ వ్యవహారం కారణంగానే మధుకర్‌ను దారుణంగా హత్య చేశారనీ, కళ్లు పీకి, మర్మాంగాలు కోసి చంపేశారని సామాజిక మాధ్యమాలలో ప్రచారం జరగడంతో మధుకర్ తల్లిదండ్రులతో పాటు, దళిత సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నేతలు ఆందోళనకు దిగి, రీపోస్ట్‌మార్టమ్ చేయించారు. ఈ నేపథ్యంలో.. అసలు పోస్ట్‌మార్టమ్ అంటే ఏమిటో, ఎప్పుడు చేస్తారో తెలుసుకుందాం. నాలుగు రకాలు అనుమానాస్పద కేసుల్లో... ఆ వ్యక్తి మృతి చెందడానికి అసలు కారణం ఏమిటో తెలుసుకోవడానికి చేసే శవ పరీక్షే పోస్ట్‌మార్టమ్. దీన్ని అటాప్సీ అని కూడా అంటారు. దీనిని నాలుగు సందర్భాలలో చేస్తారు. మెడికో–లీగల్: ఒక వ్యక్తి మరణానికి దారి తీసిన అసలు కారణాన్ని తెలుసుకోవడం కోసం చేసే సాధారణ శవపరీక్షను మెడికో లీగల్ అటాప్సీ అంటారు. ఇది ఆయా దేశాల్లో అమలులో ఉన్న చట్టాల ప్రకారం ఏదైనా అనుమానాస్పద మృతి కేసుల్లో నిర్వహిస్తారు. ఇందులో శవపరీక్ష కోసం శస్త్రాలను ఉపయోగిస్తారు. ఆకస్మిక మృతి సంభవించినప్పుడు, ప్రమాదాల వంటి సందర్భాల్లో, హింస చెలరేగి మృతి సంభవించినప్పుడు ఏ కారణంగా ప్రాణం పోయిందో ఈ పరీక్ష ద్వారా తెలుసుకుంటారు. క్లినికల్ లేదా పాథలాజికల్: రోగి ఏదైనా జబ్బుతో మృతి చెందితే... అతడు / ఆమె మృతి చెందడానికి కారణమైన జబ్బు ఏదో తెలుసుకోడానికి చేసే పరీక్ష క్లినికల్ లేదా పాథలాజికల్ అటాప్సీ. అనటామికల్ లేదా అకడమిక్ : ఇది విద్యాభ్యాసంలో భాగంగానో లేదా వైద్య విజ్ఞాన సముపార్జనలో భాగంగానో చేసే శవపరీక్ష. వర్చువల్ లేదా మెడికల్ ఇమేజింగ్ : ఇందులో కేవలం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి శవపరీక్ష నిర్వహిస్తారు. అంటే ఎమ్మారై, సీటీ స్కాన్ వంటి అధునాతన వైద్య పరీక్షలతో చేస్తారు. నేరాలు జరిగినప్పుడు మృతి స్వభావాన్ని తెలుసుకోవడం కోసం పైన పేర్కొన్న అటాప్సీలలో ప్రధానంగా మొదట పేర్కొన్న తరహా శవపరీక్షను నిర్వహిస్తారు. ఒక కేసులో మృతి చెందడానికి వివరించిన కారణం సహేతుకంగా అనిపించనప్పుడు, దానిపై అనుమానాలు చెలరేగినప్పుడు మళ్లీ తిరిగి శవపరీక్ష (రీ పోస్ట్‌మార్టమ్) నిర్వహిస్తారు. రీ పోస్ట్ మార్టమ్ ఎలా చేస్తారు? అయితే మృతి చెందిన వెంటనే శరీర భాగాలు శిథిలం కావడం, కుళ్లడం మొదలవుతాయి. ఇది మృతి చెందిన తర్వాత కాల వ్యవధిని బట్టి దశలవారీగా జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మృతి సంభవించిన సమయం మొదలుకొని... అప్పటికి ఎంతమేరకు శవం శిథిలమై ఉంటుందన్న అంచనా వేసుకుని, దానిని బట్టి మిగతా శవపరీక్షలు నిర్వహిస్తారు. కొన్ని సందర్భాల్లో శరీరం చాలావరకు శిథిలమైనా ఏదైనా ఒక లోపలి అవయవం (ఇంటర్నల్ ఆర్గాన్) దొరికినా దానికి రీ–పోస్ట్‌మార్టమ్ నిర్వహించి, తగిన వైద్యపరీక్షలతో మృతుడు ఏ కారణం వల్ల మరణించాడో తెలుసుకోడానికి తగినంత పరిజ్ఞానం అందుబాటులో ఉంది. ఫోరెన్సిక్ నిపుణులు ఈ పరీక్షలు నిర్వహిస్తారు. అయితే శవదహనం జరిగాక భౌతికకాయం ఉండదు కాబట్టి మొదట నిర్వహించిన పోస్ట్‌మార్టమ్ (అర్లియర్ పోస్ట్‌మార్టమ్ ఫైండింగ్స్) ఆధారంగా, ఆ సమయంలో తీసిన ఫొటోల ఆధారంగా నిపుణులు తమ అభిప్రాయాలను ఇస్తారు. రీ పోస్ట్‌మార్టమ్ – కొన్ని కేసులు ఎయిర్ హోస్టెస్ రీతూ 2015 ఏప్రిల్‌లో హైదరాబాద్ రామాంతపూర్‌లో నివాసం ఉండే మాజీ ఎయిర్ హోస్టెస్ రీతు (28) అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆమె భర్త సచిన్ రీతు తల్లిదండ్రులకు ఫోన్ చేసి రీతు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పగా వారొచ్చి ఇంట్లో చూసేసరికే ఆమె మృతి చెంది ఉంది. ఈ మృతి అప్పట్లో పెద్ద సంచలనం రేపింది. విచారణలో టివి రిమోట్ కోసం చిన్నపాటి జగడం అయ్యిందని, తాను ఆమెను చెంప దెబ్బ కొట్టడం తప్ప వేరే ఏమీ చేయలేదని, బయటికి వెళ్లి సిగరెట్ తాగి వచ్చేలోగా ఆమె అపస్మారకంగా పడి ఉందని భర్త సచిన్ తెలిపాడు. రీతు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ చేయగా అందులో ‘కాజ్ ఆఫ్ డెత్’ (మృతికి కారణం) ఏమిటన్నది తేలలేదు. దీనిని రీతు బంధువులు అనుమానించారు. ‘కాజ్ ఆఫ్ డెత్’ తేలడానికి రీ పోస్ట్‌మార్టమ్ నిర్వహించాల్సిందేనని వారు పట్టుబట్టారు. వారి విన్నపం ప్రకారం పన్నెండు మంది వైద్యుల సమక్షంలో రీతు మృతదేహానికి రీపోస్ట్‌మార్టం జరిగింది. మరోవైపు ‘లోతైన విచారణ’ జరుపగా భర్త సచిన్ అసలు విషయాన్ని బయటపెట్టాడు. ఆ రోజు రాత్రి మద్యం తాగి స్నేహితునితో ఇంటికి రాగా అతడి ముందు భార్య తనని అవమానించిందని దానివల్ల చేయి చేసుకున్నానని, దాంతో స్నేహితుడిని బయటకు పంపి ఆమె ముక్కుపై దిండు అదిమి చంపేశానని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. పెళ్లయ్యి రెండేళ్లు కాకమునుపే జరిగిన ఈ హత్య రీ పోస్ట్‌మార్టమ్ నివేదిక వల్లే నిందితుడిని పట్టుకోగలిగింది. ఆశ్రమ భక్తురాలు సంగీత యేడాదిన్నర కిందటి సంఘటన ఇది! సంగీత అనే 24 ఏళ్ల అమ్మాయి విషయం. 2015లో చనిపోయింది. ఆమె మరణం కలకలమే రేపింది. తమిళనాడులోని తిరుచ్చి సంగీత స్వస్థలం. అయితే సంగీత కర్ణాటకలోని బెంగుళూరు దగ్గరున్న బిదాడిలో ఉండేది. అక్కడి నిత్యానంద ధ్యానపీఠంలో. తన 20వ యేటనే ఆ ఆశ్రమానికి వెళ్లింది. నాలుగేళ్లుగా ఆశ్రమంలోనే జీవనం సాగిస్తున్న సంగీత 2015, జనవరిలో హఠాత్తుగా చనిపోయింది. ‘మీ అమ్మాయి చనిపోయింది’ అని ఆశ్రమం వాళ్లు సంగీత తల్లిదండ్రులకు కబురు పంపారు. ఆ వార్త విని హతాశులయ్యారు వాళ్లు. హుటాహుటిన బిదాడికి చేరుకున్నారు. కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోయిందని ఆశ్రమం అధికారులు చెప్పారు. పోస్ట్‌మార్టమ్‌లో కూడా అనుమానాస్పద అనవాళ్లు ఏమీ తేలలేదు. విషాదంతోనే కూతురి భౌతికకాయాన్ని తీసుకొని సొంతూరు తిరుచ్చి దగ్గర్లోని నవలూరు కుట్టపాట్టుకి బయలుదేరారు. శవాన్ని ఖననం చేశారు. అయినా వాళ్ల మనసుల్లో ఎక్కడో అనుమానం.. తమ బిడ్డది సహజ మరణం కాదని. అందుకే రీపోస్ట్‌మార్టమ్ కోసం కర్ణాటకలోని రామనగరం జిల్లా సూపరింటిండెంట్‌కు పిటిషన్ పెట్టుకున్నారు. సమ్మతించి రీపోస్ట్‌మార్టమ్ కోసం ఆదేశాలు జారీ చేశారు. దాంతో కర్ణాటకలోని పోలీస్ టీమ్ తిరుచ్చి చేరుకుంది. సంగీత తండ్రి, స్థానిక రెవెన్యూ ఆఫీసర్, స్థానిక పోలీసుల సమక్షంలో సంగీత డెడ్ బాడీని బయటకు తీశారు. అక్కడి మహాత్మాగాంధీ మెమోరియల్ గవర్నమెంట్ హాస్పిటల్‌కు చెందిన ఇద్దరు డాక్టర్లు రీపోస్ట్‌మార్టమ్ నిర్వహించారు. టీనేజ్ అమ్మాయి ఫెమి రెండున్నరేళ్ల క్రితం కేరళ రాష్ట్రం కోజికోడ్ జిల్లాలోని రైల్వేట్రాక్ మీదకు ఓ శవం కొట్టుకొచ్చినట్టు పోలీసులకు సమాచారం అందింది. అది ఓ అమ్మాయి మృతదేహం. ఆనవాళ్లు పట్టలేనంతగా శరీరం ఉబ్బిపోయింది. పోస్టుమార్టమ్‌లో ఆ అమ్మాయి వయసు 14 ఏళ్లు అని, విషం సేవించడం వల్ల మరణించిందని తెలుసుకున్నారు. ఆ తర్వాత ఖనన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. రెండు నెలల తర్వాత ఆ మృతదేహాన్ని వెలికి తీసి, రీ పోస్టుమార్టమ్ నిర్వహించారు. ఆమె మృతదేహం నుంచి కొన్ని శాంపిల్స్ సేకరించడంతో పాటు డిఎన్ఎ టెస్ట్ కూడా చేశారు. నిజానిజాలు రాబట్టిన పోలీసులు వాస్తవాలను బయటపెట్టారు. మొదట ఇరింజలకుడ పోలీస్ స్టేషన్లో 14 ఏళ్ల అమ్మాయి తప్పిపోయిందని కేసు ఫైల్ అయినట్టు గుర్తించారు. ఆ అమ్మాయి పేరు ఫెమి. ఆమె తండ్రి పేరు బెన్నీ. మరణించిన అమ్మాయే బెన్నీ కూతురు ఫెమి అని డిఎన్ఎ నివేదికలో నిర్ధారించారు. బెన్నీ మొదటి భార్య కూతురు ఫెమి. భార్యాభర్తలు రెండేళ్ల క్రితం విడిపోయారు. చట్టబద్ధంగా ఫెమి తండ్రి దగ్గరే ఉంటోంది. తమకు అడ్డుగా ఉందని భావించి ప్రియురాలు వినీతతో కలిసి పళ్లరసంలో స్లీపింగ్ పిల్స్ కలిపి తాగించి కన్నతండ్రే ఈ హత్య చేశాడని, ఆ తర్వాత తెల్లవారుజామున సముద్రంలో విసిరేశారని, ఫెమీ శరీరం థియేటర్ వెనకాల గల రైల్వే ట్రాక్ మీదకు కొట్టుకొచ్చిందనే నిజాన్ని తేల్చి, చిక్కుముడిని విప్పారు. దోషులకు జైలు శిక్ష విధించారు. బీటెక్ విద్యార్థిని శ్రీయా ప్రసాద్ హైదరాబాద్‌లోని నేరెడ్మెట్ వాయుపురి కాలనీకి చెందిన టి.శ్రీయాప్రసాద్ విశాఖపట్టణం గీతం వర్శిటీలో బీటెక్ రెండో సంవత్సరం చదివేది. కిందటేడాది ఫిబ్రవరి 12న ఆమె అక్కడే చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణమేంటో తెలియరాలేదని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టమ్ నివేదికలో శ్రీయా శుక్రవారం సాయంత్రం 5 గంటలకు మరణించినట్లు తెలిపారు. అయితే అదే రోజు సాయంత్రం 5:30 గంటల సమయంలో స్నేహితురాలితో ఆమె ఫేస్బుక్ చాటింగ్ చేసినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. దీంతో వారికి కూతురి మరణం పట్ల అనుమానాలు తలెత్తాయి. తమ కూతురు ఆత్మహత్య చేసుకునేటంత పిరికిది కాదని, ఆమె మృతిపట్ల అనుమానాలు ఉన్నాయని, వాస్తవాలు వెలికితీయాలంటూ శ్రీయా తల్లి యావన్ ప్రసాద్ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు మార్చి 4న మృతదేహాన్ని వెలికి తీసి పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే, రీ పోస్ట్‌మార్టమ్ చేయాలన్న స్పష్టత కోర్టు ఆదేశాల్లో లేదని, మృతదేహం వెలికితీతను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించి అక్కణ్ణుంచి వెళ్లిపోయారు. తర్వాత మార్చ్ 12న కోర్టు ఉత్తర్వులతో శ్రీయా ప్రసాద్ మృతదేహం వెలికి తీసి రీ–పోస్ట్ మార్టమ్ నిర్వహించారు. 12 మంది నిపుణులు, అధికారుల సమక్షంలో ఈ వెలికితీత కార్యక్రమాన్ని నిర్వహించారు. మృతదేహం అంతర అవయవాల నమూనాలను ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపారు. -
మధుకర్ మృతదేహానికి రీపోస్ట్ మార్టమ్ పూర్తి
హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కుశ పర్యవేక్షణలో మధు తల్లిదండ్రుల సమక్షంలో కేఎంసీ, ఉస్మానియాకు చెందిన నలుగురు వైద్యులు సోమవారం రీపోస్ట్ మార్టమ్ నిర్వహించారు. పోలీసు బందోబస్తు మధ్య నాలుగున్నర గంటల పాటు పోస్టు మార్టం కొనసాగింది. రీపోస్ట్ మార్టమ్‌ను వీడియో చిత్రీకరణ చేసి సీల్డ్ కవరులో జిల్లా జడ్జీకి అందజేశారు. 27 రోజులుగా మధుకర్ మరణంపై వస్తున్న విమర్శలు, ఆరోపణలకు రీపోస్ట్ మార్టమ్ రిపోర్ట్ తో తెరపడనుంది. మధుకర్‌ది హత్యా? ఆత్మహత్యా? అని తేలిపోనున్న నేపధ్యంలో రీపోస్ట్ మార్టమ్ నిర్వహించిన వైద్యులు మాత్రం ఎముకలకు, తలకు ఎలాంటి గాయాలు లేవని తేల్చారు. వారం రోజుల్లో రిపోస్ట్ మార్టమ్ రిపోర్ట్, నెల రోజుల వరకు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చే అవకాశం ఉందన్నారు డాక్టర్ కృపాల్ సింగ్. హైకోర్టు ఆదేశం మేరకు జరిగిన రీపోస్ట్ మార్టమ్ తో న్యాయం జరుగుతుందని చెప్పిన మధు తల్లిదండ్రులు ముమ్మాటికి హత్యేనని చెప్పారు. మర్మాంగం ఉందని, కనుగుడ్డు ఒకటి కనిపించలేదని, మర్మాంగం వాపెక్కి ఉండడంతో కొట్టినట్లు భావిస్తున్నామని మధు తండ్రి ఎల్లయ్య తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు 60 మందిని విచారించారు. ఆరుగురిని అదుపులోకి తీసుకుని వారి సెల్ ఫోన్ డాటా సేకరించారు. కేసులో కీలకమైన ఆధారం మధు ప్రియురాలు శిరీషను సైతం పోలీసులు విచారించి కీలకమైన ఆధారాలు సేకరించారు. కేసు విచారణలో ఉన్నందున వివరాలు వెల్లడించలేక పోతున్నామని పెద్దపల్లి డీసీపీ విజేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఏదేమైనా పోలీసుల విచారణలో లభించిన ఆధారాలు, రీపోస్ట్ మార్టమ్‌లో తేలిన అంశాలను పరిశీలిస్తే మధుకర్‌ది ఆత్మహత్యగా తేలిపోనున్నదని స్పష్టమవుతుంది. కానీ, అధికారికంగా వెలువడడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. -
శిరీష పలు విషయాలు వెల్లడించింది: సింధుశర్మ
పెద్దపల్లి: హైకోర్టు ఆదేశాల మేరకు మంథని మధుకర్ మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు విచారణ అధికారి ఏసీపీ సింధుశర్మ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 60మందిని విచారణ జరిపినట్లు ఆమె సోమవారమిక్కడ పేర్కొన్నారు. మధుకర్ కేసులో కీలకమైన శిరీషను విచారణ చేశామని, ఈ సందర్భంగా ఆమె పలు విషయాలు వెల్లడించినట్లు సింధుశర్మ తెలిపారు. విచారణ కొనసాగుతున్న దృష్ట్యా అన్ని వివరాలు వెల్లడించలేమని ఆమె అన్నారు. ఇప్పటికే ఆరుగురిని అదుపులోకి తీసుకుని వారి ఫోన్‌కాల్ డేటా వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు భారీ పోలీసు బందోబస్తు మధ్య మధుకర్ మృతదేహానికి సోమవారం రీ పోస్టుమార్టం జరుపుతున్నారు. కరీంనగర్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ పర్యవేక్షణలో కుటుంబసభ్యుల సమక్షంలో కేఎంసీ, ఉస్మానియా వైద్య బృందం పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియను వీడియో తీస్తున్నారు. పోలీసులు దీనిపై నివేదికను సీల్డ్ కవర్లో హైకోర్టుకు అందించనున్నారు. కాగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్‌కు చెందిన మధుకర్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అతడి మృతదేహానికి మరోసారి శవ పరీక్ష (రీపోస్టుమార్టం) నిర్వహించాలని ఉమ్మడి హైకోర్టు పోలీసులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఉస్మానియా, కాకతీయ మెడికల్ కాలేజీలకు చెందిన ఫోరెన్సిక్ నిపుణుల నేతృత్వంలో రీ పోస్టుమార్టం జరపాలని స్పష్టం చేసింది. మార్చి 13న ఇంటి నుంచి వెళ్లిన మధుకర్ 14వ తేదీన శవమై కనిపించగా, దీన్ని పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే కుటుంబీకులు మాత్రం అది ముమ్మాటీకి హత్యేనని ఆరోపించారు. అగ్ర కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించినందుకు సదరు యువతి బంధువులు మధుకర్‌ను హత్య చేశారని తెలిపారు. మధుకర్, శిరీష ప్రేమపెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు నిరాకరించారని, ఈ నేపథ్యంలో మధుకర్ హత్య జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో తన కుమారుడి మృతి కేసును హత్య కేసుగా పరిగణించి ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణకు ఆదేశించాలని కోరుతూ మధుకర్ తల్లి లక్ష్మి హైకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. -
మధుకర్ మృతదేహానికి నేడు రీపోస్టుమార్టం
సాక్షి,పెద్దపల్లి: మంథని మండలం ఖానాపూర్‌కు చెందిన దళిత యువకుడు మంథని మధుకర్ మృతదేహానికి సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు రీపోస్టుమార్టం నిర్వహించనున్నారు. అనేక మలుపుల తర్వాత జరగనున్న ఈ రీపోస్టుమార్టంపై అందరిలో ఆసక్తి నెలకొంది. సోషల్ మీడియాలో ప్రచారం జరిగినట్టు మర్మంగాలు కోసేశారా?, కళ్లు పీకేశారా?, పోలీసులు చెప్పినట్టు అవేమీ తొలగించబడలేదా? అవి మార్ఫింగ్ ఫొటోలేనా? అనే ఉత్కఠకు తెరపడనుంది. హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసుశాఖ కరీంనగర్ జిల్లా జడ్జి సమక్షంలో ఉస్మానియా, కాకతీయ మెడికల్ కళాశాలలకు చెందిన ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో రీపోస్టుమార్టం జరగనుంది. ఈమేరకు ఖానాపూర్‌లో ఏర్పాట్లు చేశారు. రీపోస్టుమార్టం నివేదికను కరీంనగర్ జిల్లా జడ్జి సీల్డ్ కవర్లో హైకోర్టుకు పంపనున్నారు. -
మధుకర్ మృతదేహానికి రేపు రీపోస్టుమార్టం
సాక్షి, పెద్దపల్లి: మంథని మధుకర్ మృతదేహానికి హైకోర్టు ఆదేశాల మేరకు సోమవారం రీపోస్టుమార్టం జరగనుంది. రెవెన్యూ, పోలీసుశాఖ అధికారులు ఖననం చేసిన చోట అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా కోర్టు జడ్జి సమక్షంలో ఉస్మానియా, కాకతీయ మెడికల్ కళాశాలలకు చెందిన ఫోరెన్సిక్ నిపుణులు ఈ పోస్టుమార్టం జరపనున్నారు. ఈ కేసులో సోషల్ మీడియాలో జరిగిన.. జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టేందుకు.. మధుకర్ కుటుంబసభ్యుల డిమాండ్ మేరకు మంథని మధుకర్ మృతదేహానికి రీపోస్టుమార్టం చేయాలని నిర్ణయించారు. కాకతీయ మెడికల్ కళాశాల చెందిన నిపుణుల సమక్షంలో ఈ నెల 7న రీపోస్టుమార్టం జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులను నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధి ప్రభావితం చేస్తారని, వీరు చేయించే రీపోస్టుమార్టంపై నమ్మకం లేదని మధుకర్ తల్లి లక్ష్మి ఈ నెల 6న హైకోర్టును ఆశ్రయించింది. జడ్జి, ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో రీ పోస్టుమార్టం జరపాలనే ఆమె అభ్యర్థనకు కోర్టు సమ్మతిస్తూ రీపోస్టుమార్టం జరపాలని ఆదేశించింది. దీంతో 10వ తేదీ ఉదయం 8 గంటలకు రీపోస్టుమార్టం చేయనున్నారు. కరీంనగర్ జిల్లా జడ్జి సమక్షంలో ఉస్మానియా, కాకతీయ మెడికల్ కళాశాలలకు చెందిన ఫోరెన్సిక్ నిపుణులు ప్రక్రియ పూర్తి చేయనున్నారు. అక్కడికి మధుకర్ తల్లిదండ్రులు లక్ష్మి, ఎల్లయ్యను అనుమతించనున్నారు. -
అమానుషం.. అమానవీయం!
పెద్ద కులం అమ్మాయిని ప్రేమించాడని మంథనికి చెందిన మధుకర్‌ని చిత్ర హింసలు పెట్టి, మర్మాంగాలు కోసి, కళ్ళు పీకి, అవయవాలు తీసేసి అతి దారుణంగా చంపి కాలువ దగ్గర పారేసిన ఘటన ఈ మధ్యకాలంలో జరిగిన ఘోరాతి ఘోరమైన అమానుష దాడుల్లో అతి కిరాతకమైనది. ఆ హత్య చేసిన వారిపై పోలీస్ శాఖ ఇప్పటివరకు చర్య తీసుకోకపోవడం లేదంటే ఈ హత్య వెనక పెద్దల హస్తాలు ఉన్నట్టే. నయీమ్ లాంటివాడినే అంతం చేసిన పోలీసులు ఈ విషయంలో తమ సామర్థ్యాన్ని ఎందుకు చూపలేకపోతున్నారు?. లభ్యమైన చిత్రాల ఆధారంగా ముమ్మాటికీ అది హత్యేనని తెలుస్తున్నప్పటికీ పోలీసులు ఆత్మహత్యగా చిత్రీకరించి కేసును మూసివేసే ప్రయత్నం చేస్తు న్నారని మృతుడి కుటుంబ సభ్యులే కాకుండా మొత్తం సోషల్ మీడియా ముక్త కంఠంతో వాదిస్తున్నది. ఈ ఫ్రెండ్లీ పోలీస్ ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నది! ప్రజలతోనా? నేరస్తులతోనా? అంటూ సామాన్యులు సైతం సోషల్ మీడి యాలో నిలదీస్తున్నారు. ఇంత జరిగినా ప్రభుత్వం నోరువిప్పకపోవడం వెనక మతలబు ఏంటో అని పలు అనుమా నాలు తలెత్తుతున్నాయి. తెలంగాణ నగరాలలో గంగజా మున తహజీబ్, కులమతాలకు అతీ తంగా గ్రామాలలో వరసలు పెట్టుకొని పలకరించుకునే సంస్కృతి ఎటు మాయ మైపోతున్నది? ఇరువురిS మధ్య ప్రేమ కలగడం మనుషుల్లోనే కాదు ప్రతి ప్రాణికీ సహజ గుణం. కుల మత సామాజిక ఆర్థిక అసమానతల వల్లే ఇలాంటి హత్యలు జరుగుతున్నాయి. శిరీషను ప్రేమించినందుకే మధుకర్‌ని ఇంత ఘోరంగా హత మార్చడం అంటే ఎంత క్రూర మనస్తత్వాలున్న మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాం? అన్నిం టికీ తెగించి శిరీష తాను మధుకర్‌ని ప్రేమించిన విషయం తన తల్లిదండ్రు లకు చెప్పగలిగింది. చివరికి మధుకర్ పార్థివ దేహం ఎక్కడున్నదో ఆసుపత్రి పడకపై ఉండి కూడా చెప్పి తన ప్రేమను కొనసాగించే ప్రయత్నం చేసింది. స్వతంత్రం వచ్చిన సమయంలో కుల నిర్మూలన కోసం సదస్సులు జరి గేవి. సమానత్వానికి, ఐకమత్యానికి ప్రతి మేధావి పాటుపడేవాడు. కులాంతర వివాహాలను ప్రోత్సహించేవారు. వాటి వల్ల సమాజంలో ఒక పెద్ద మార్పు వచ్చింది. అంటరానితనం ఎన్నోచోట్ల అంతమైంది, ఇన్నేళ్ల తర్వాత పాత ఫ్యూడల్ వ్యవస్థను పునరావృతం చేసే ఘటనలు పదే పదే జరగటం సమా జానికి ఏమాత్రం మంచిది కాదు. ప్రభుత్వం నేరస్తులను శిక్షించే చర్యలు చేపట్టడం ఒక ఎల్తైతే, కులాతీత చైత న్యాన్ని కుటుంబాల్లో పెంచే ప్రయత్నం చేయడం మరొక ఎత్తు. ఇప్పుడు జరగాల్సిన సాంస్కృతిక విప్లవం ఇదే. -సయ్యద్ రఫీ, చిత్ర దర్శకుడు -
‘హైకోర్టు ఆదేశాల మేరకే నడుచుకుంటాం’
సాక్షి, పెద్దపల్లి/మంథని: అనుమానాస్పదరీతిలో మృతిచెందిన పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్‌కు చెందిన దళిత యువకుడు మంథని మధుకర్ రీ–పోస్టుమార్టమ్‌పై హైకోర్టు ఆదేశాల మేరకే నడుచుకుంటామని రామగుండం పోలీస్ కమిషనర్ విక్రంజిత్ దుగ్గల్ తెలిపారు. పెద్దపల్లిలో గురువారం విలేకరులతో మాట్లాడారు. సిట్టింగ్ జడ్జి, ఫోరె న్సిక్ నిపుణుల సమక్షంలో రీ–పోస్టుమార్టమ్ జరపాలని మధుకర్ తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారని, వారికి ఎక్కడా అడ్డు చెప్పలేదని తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఉస్మానియా మెడికల్ కళాశాలకు లేఖ రాసి రీ–పోస్టుమార్టమ్‌కు ప్రాసెస్‌ను మళ్లీ మొదలు పెడతామని చెప్పారు. మధుకర్ మృతి కేసును నిష్పాక్షికంగా ఐపీఎస్ అధికారి సింధూశర్మ దర్యాప్తు చేస్తున్నారని వివరించారు. పోలీసులపై ప్రజలు, ప్రజాసంఘాలు, రాజకీయపార్టీలు విశ్వాసం ఉంచి సహకరిం చాలని కోరారు. మధుకర్ కేసులో పెద్దపల్లి ఏసీపీ సింధూశర్మ గ్రామస్తులు, కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో అభిప్రా యాలను వీడియో కవరేజ్ మధ్య వివరాలు రాబట్టారు. సుమారు రెండు గంటల పాటు గ్రామంలోనే విచారణ కొనసాగింది. -
మధుకర్ మృతదేహానికి రీ పోస్టుమార్టం
- అంగీకరించిన ప్రభుత్వం హైదరాబాద్: భూపాలపల్లి జిల్లా మంథనిలో తీవ్ర కలకలం రేపిన మధుకర్ హత్య కేసుకు సంబంధించి మృతదేహానికి మళ్లీ పోస్టుమార్టం నిర్వహించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. గాంధీ లేదా ఉస్మానియా ఫారెనిసిక్ నిపుణుల తో రీపోస్టుమార్టం నిర్వహించాలని మధుకర్ తల్లి లక్ష్మి న్యాయస్థానాన్ని ఆశ్రయించగా స్పెషల్ జీపీ ఈ మేరకు తెలిపారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో రీ పోస్టుమార్టం చేయిస్తామని తెలిపింది. అయితే, జిల్లా జడ్జి ఆధ్వర్యంలో పోస్ట్ మార్టం చేయాలని లక్ష్మి విజ్ఞప్తి చేయగా ప్రభుత్వ అనుమతి కోసం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరారు. దీంతో తదుపరి విచారణను సాయంత్రానికి న్యాయస్థానం వాయిదా వేసింది. -
'మధుకర్ మృతిపై హోంమంత్రి స్పందించాలి'
ప్రభుత్వాన్ని కోరిన మల్లు రవి సాక్షి, హైదరాబాద్: మంథనిలో దళిత యువకుడు మధుకర్ అనుమానాస్పద మృతిపై హోంమంత్రి స్పందించాలని, సమగ్ర విచారణ జరపాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి డిమాండ్ చేశారు. మధుకర్ మృతిపై కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, వారికి న్యాయం చేయాలని సోమవారం ఒక ప్రకటనలో ఆయన ప్రభుత్వాన్ని కోరారు. మధుకర్ మృతి విషయంలో రాజకీయ నాయకులపై అనుమానాలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయన్నారు. ఈ సంఘటనలో బాధితులకు న్యాయం చేయాలని, అసలైన దోషులకు శిక్ష పడేవిధంగా సమగ్ర విచారణ జరిపించాలని మల్లు రవి అన్నారు. మధుకర్ శవంపైన దెబ్బలున్నాయని, మర్మావయాలపై గాయాలున్నాయని, అది హత్య అనే అనుమానాలున్నాయని కుటుంబసభ్యులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. వెంటనే హోం శాఖ మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి సమగ్ర విచారణకు ఆదేశించాలని రవి కోరారు. -
నా భర్త నాకు కావాలి
వనస్థలిపురం: తనను ఇక్కడే వదిలేసి అమెరికా చెక్కేసిన ఎన్ఆర్ఐ భర్త ఇంటి ఎదుట ఓ మహిళ ఆందోళనకు దిగింది. కోడలు వస్తున్న విషయం ముందే గ్రహించిన అత్తా, మామలు ఇంటికి తాళం వేసుకుని ఉడారుుంచారు. వివరాల్లోకి వెళితే..నల్లగొండ జిల్లా తంగడవల్లికి చెందిన ఆర్టీసీ ఉద్యోగి దేశగోని వెంకటేష్ కుమార్తె శ్రీలతను వనస్థలిపురం వైదేహినగర్కు చెందిన గంగపురం సత్యనారాయణ కుమారుడు మధుకర్‌కు ఇచ్చి 2014లో వివాహం జరిపిం చారు. మధుకర్ యూఎస్ఏలో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. పెళ్లరుున తర్వాత భార్య శ్రీలతను కూడా తనతోపాటు తీసుకెళ్లాడు. తొమ్మిది నెలల క్రితం భార్యా, బిడ్డలతో కలిసి ఇండియాకు వచ్చిన మధుకర్ వారిని పుట్టింటిలో వదిలి ఏడు నెలల క్రితం యూఎస్ తిరిగి వెళ్లిపోయాడు. అప్పటినుంచి కాంటాక్టులో లేడని, ఫోన్ చేసినా ఎత్తడం లేదని శ్రీలత తెలిపింది. అత్తా, మామలను సంప్రదించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో చేసేది లేక శుక్రవారం పెద్దమనుషులను తీసుకుని అత్తారింటికి రాగా, అప్పటికే అత్తా, మామ తాళం వేసుకుని పరారు కావడంతో వారి ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు.. పెళ్లి సమయంలో ఇచ్చిన ఎకరం భూమిని తన పేరున మార్పించాలని మధుకర్ కొంతకాలంగా వేధిస్తున్నాడని శ్రీలత, ఆమె తండ్రి వెంకటేష్ తెలిపారు. ఇప్పటికే మధుకర్ తన పేరున ఉన్న ఆస్తి మొత్తం ఆయన అక్క పేరున మార్పించినట్లు తెలిపారు. భూమిని తన కూతురు, మనవరాలి పేరిట చేరుుంచడానికి సిద్ధంగా ఉన్నానని, తన కూతురికి న్యాయం చేయాలని కోరారు. హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ మద్ధతు... విషయం తెలుసుకున్న సిటిజెన్స ఫస్ట్ హ్యూమన్‌రైట్స్ అసోసియేషన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి జగదీశ్వరి, హైదరాబాద్ అధ్యక్షురాలు చీల రోజా రమణి, నాగోలు అధ్యక్షురాలు రంగేశ్వరి శ్రీనివాస్ అక్కడికి చేరుకుని శ్రీలతకు మద్ధతుగా నిలిచారు. పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేసి శ్రీలతకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. -
యాంకర్ తో సహజీవనం, భర్తపై ఫిర్యాదు
హైదరాబాద్: వేరే మహిళతో.. సహజీవనం చేస్తూ తనను మానసికంగా వేధిస్తున్నారని ఓ టీవీ సీరియల్ డైరెక్టర్ భార్య మంగళవారం హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. ప్రముఖ టీవీ సీరియల్ డైరెక్టర్ మధుకర్ పై ఆయన భార్య ఆరోపణలు చేశారు. టీవీ యాంకర్ గీతా భగవత్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుని తమ ఇంట్లోనే సహజీవనం చేస్తున్నారని వాపోయారు. వివాహేతర సంబంధం వల్లే మధుకర్ తనను ఇంట్లో నుంచి గెంటివేశాడని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. మధుకర్, గీతా భగవత్ తనను మానసికంగా వేధిస్తున్నారని వివరించారు. తనకు న్యాయం చేయాలని ఆమె మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. -
తండ్రి కాఠిన్యం.. కూతురు అభిమానం
కూతురు చదువు విషయంలో ఓ తండ్రి కాఠిన్యం ప్రదర్శిస్తే... ఆ చిన్నారి మాత్రం తండ్రి పట్ల నిండు ప్రేమను ప్రదర్శించింది. చూసేవారిని కదిలించే ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గచ్చిబౌలి సీఐ రమేష్ తెలిపిన వివరాల మేరకు.. వరంగల్ జిల్లాకు చెందిన వి.మధుకర్(29) మసీద్‌బండలో నివాసముంటూ సెంట్రింగ్ పనులతో జీవనం సాగిస్తున్నాడు. అతని కుమార్తె స్పందన (8) స్థానిక మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో 3వ తరగతి చదువుతోంది. సోమవారం సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత సరిగా చదవడం లేదని తండ్రి మధుకర్ కుమార్తెను మందలించాడు. అంతటితో ఆగకుండా చాకు కాల్చి కుడి చేయి, ఎడమ పాదంపై వాతలు పెట్టాడు. దీంతో బొబ్బలు వచ్చాయి. మంగళవారం పాఠశాలకు వచ్చిన స్పందన వంటిపై గాయాలను చూసిన ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి ప్రధానోపాధ్యాయులు అనంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లింది. ఆయన గచ్చిబౌలి పోలీసులకు, ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి తండ్రి మధుకర్‌ను అరెస్టు చేశారు. ఐసీడీఎస్ శేరిలింగంపల్లి సీడీపీఓ లక్ష్మీబాయి పరిస్థితిని సమిక్షించి బాలికను హైదర్షాకోట్లోని సదర్‌హోంకు తరలించారు. కాగా, ఐసీడీఎస్ అధికారుల వెంట వెళ్లేందుకు స్పందన నిరాకరించింది. తనకు నాన్నే కావాలని, ఇంటికి వెళ్తానని మారాం చేసింది. తన తండ్రిని ఏమి అనవద్దని పోలీసులను, అధికారులను వేడుకుంది. అయితే, అధికారులు పాపకు నచ్చచెప్పి సదర్‌హోంకు తరలించారు. -
మహేంద్రన్ హీరోగా పక్కం నంబర్ 143
మాస్టర్ మహేంద్రన్‌గా తమిళం, తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో నటించి మహుళ ప్రాచుర్యం పొందిన నటుడు మహేంద్రన్ ఇప్పుడు కథానాయకుడి స్థాయికి ఎదిగిన విషయం తెలిసిందే.కాగా తాజాగా మహేంద్రన్ పక్కమ్ నంబర్ 143 అనే చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు.శ్రీలక్ష్మి నరసింహా సినీ స్టూడియోస్ పతాకంపై క్రిష్ణబాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం,మాటలు,దర్శకత్వం బాధ్యతల్ని ఏ.జగన్ నిర్వహిస్తున్నారు. చిత్ర వివరాలను ఆయన వెల్లడిస్తూ కాలం మారుతున్నా కొందరు మనుషులు మాత్రం మారరన్నారు. వారి గుణగణాల్లోనూ మార్పు రాదన్నారు. అలాంటి ఒక క్రూర మనస్తత్వం గల యువకుడి ఒక యువతి ఎలా మంచి వాడిగా మార్చిందన్న విభిన్న కథాంశంతో తెరకెక్కించనున్న చిత్రం పక్కమ్ నంబర్ 143 అని తెలిపారు. చిత్రాన్ని కుటుంబ సమేతంగా చూసి ఆనందించే విధంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. చిత్రానికి సంగీతాన్ని మధుకర్, చాయాగ్రహణం కర్ణ అందిస్తున్నట్టు దర్శకుడు తెలిపారు. -
నకిలీ మావోయిస్ట్ అరెస్ట్
అదిలాబాద్: జల్సాలకు అలవాటు పడి కష్టపడకుండా డబ్బు సంపాదించడానికి మావోయిస్టు అవతారం ఎత్తాడో వ్యక్తి. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో గురువారం చోటుచేసుకుంది. చెన్నూరు మండలం కొమతంకు చెందిన ముధుకర్ అనే వ్యక్తి స్థానిక కాళాశాలలో డిగ్రి చదువుతున్నాడు. జల్సాలకు అలవాటుపడిన మధుకర్ సులభంగా డబ్బు సంపాదించడానికి నకిలీ మావోయిస్ట్ గా మారాలనుకున్నాడు. అంతే కొందరు ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్ల ఫోన్ నెంబర్లను సేకరించాడు. దీంతో వారిని ఫోన్లలో బెదింరించడం ప్రారంభించాడు. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాకు చెందిన దళ కమాండర్‌గా పరిచయం చేసుకుని అడిగినంత డబ్బు ఇవ్వకపోతే చంపుతానని బెదిరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు చాకచక్యంగా వల పన్ని మధుకర్ ను అరెస్ట్ చేశారు. ఈ మేరకు మంచిర్యాల ఏఎస్పీ విజయ్‌కుమార్ గురువారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. (మంచిర్యాల) -
చెల్లనిచెక్కు కేసుల్లో నిందితులకు జైలు
రంగారెడ్డి జిల్లా కోర్టులు: చెల్లని చెక్కు ఇచ్చి మోసం చేసిన కేసులో నిందితునికి ఏడాది జైలుశిక్ష విధించడంతో పాటు రూ.5.90 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ 8వ స్పెషల్ మేజిస్ట్రేట్ మంగళవారం తీర్పు చెప్పారు. వివరాలు.. కుత్బుల్లాపూర్‌కు చెందిన మధుకర్, సరూర్‌నగర్ క్రాంతినగర్‌కు చెందిన భీంరెడ్డి పరిచయస్తులు. తన వ్యాపార అవసరాల నిమిత్తం భీంరెడ్డి 2013 మార్చి, 15న మధుకర్ నుంచి రూ.5 లక్షలు అప్పుగా తీసుకుని ఆరు నెలల్లోగా తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చాడు. గడువు పూర్తయ్యాక డబ్బులు చెల్లించాలని భీంరెడ్డిని కోరగా అతను హెచ్డీఎఫ్సీ చైతన్యపురి బ్రాంచికి చెందిన రూ.5 లక్షల చెక్కును మధుకర్ పేరిట జారీ చేశాడు. ఆ చెక్కును ఐసీఐసీఐ బ్యాంక్ బాలానగర్ బ్రాంచిలో జమచేయగా ఖాతాలో సరిపడా డబ్బులు లేకపోవడంతో బౌన్స్ అయింది. నోటీసు పంపినా భీంరెడ్డి డబ్బులు స్పందించకపోవడంతో మధుకర్ కోర్టును ఆశ్రయించాడు. కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన 8వ స్పెషల్ మేజిస్ట్రేట్ పైవిధంగా తీర్పు చెప్పారు. మరో కేసులో... మరో చెక్ బౌన్స్ కేసులో నిందితునికి ఆరు నెలల జైలుశిక్ష, రూ.8.25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. వివరాలు... హస్తినాపురంకు చెందిన విజయేందర్‌రెడ్డి, చింతల్‌కుంట వివేకానందనగర్కాలనీకి చెందిన నర్సింగరావులు పరిచయస్తులు. నర్సింగరావు 2012 ఫిబ్రవరిలో విజయేందర్‌రెడ్డి నుంచి రూ.6.30 లక్షలను అప్పుగా తీసుకొని, మూడు నెలల్లోగా తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చాడు. గడువు ముగిశాక డబ్బులు చెల్లించమని నర్సింగరావును కోరగా హెచ్డీఎఫ్సీ గడ్డిఅన్నారం బ్రాంచికి చెందిన రూ.6.30 లక్షల చెక్కును విజయేందర్‌రెడ్డి పేరిట జారీ చేశాడు. సదరు చెక్కును తన ఖాతాలో జమచేయగా చెల్లలేదు. నోటీసు పంపినా నర్సింగరావు డబ్బులు చెల్లించకపోవడంతో విజయేందర్‌రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన 8వ స్పెషల్ మేజిస్ట్రేట్ పైవిధంగా తీర్పు చెప్పారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
నెల్లుట్ల(లింగాలఘణపురం), న్యూస్‌లైన్ : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలైన సంఘటన మండలంలోని జనగామ- సూర్యాపేట రో డ్డులోని ఆర్టీసీకాలనీ సమీపంలోని కల్వర్టు వద్ద బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై మధూకర్ కథ నం ప్రకారం.. మద్దూ రు మండలంలోని ధూల్మిట్టకు చెందిన కొలిపాక మల్లయ్య (42) రాజీవ్ విద్యామిషన్ పథకంలో కాంట్రాక్టు ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. కాగా, జన గామ మండలంలోని శామీర్‌పేటకు చెందిన బనిక సత్తయ్య (40) ఇదే ఆర్వీఎంలో సీఆర్పీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే బుధవారం రాత్రి వీరిద్దరు బైక్‌పై నెల్లుట్ల వైపు నుంచి జనగామకు వస్తుండగా ఆర్టీసీకాలనీ సమీపంలోని కల్వర్టు వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ సం ఘటనలో మల్లయ్య, సత్తయ్యలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కాగా, మృతుడు మల్లయ్యకు భార్య పద్మ, కొడుకు చక్రధర్, కూతురు చందన, సత్తయ్యకు భార్య కళావతి, కూతురు శ్వేత, కుమారుడు సాయికిరణ్ ఉన్నారు. కాగా, సంఘటన స్థలాన్ని జనగామరూరల్ సీఐ ప్రవీణ్‌రెడ్డి, లింగాలఘణపురం ఎస్సై మధూకర్, జనగామ అర్బన్ సీఐ నరేందర్ సందర్శించి, మృతదేహాలను జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు.