మహేంద్రన్ హీరోగా పక్కం నంబర్ 143
మాస్టర్ మహేంద్రన్‌గా తమిళం, తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో నటించి మహుళ ప్రాచుర్యం పొందిన నటుడు మహేంద్రన్ ఇప్పుడు కథానాయకుడి స్థాయికి ఎదిగిన విషయం తెలిసిందే.కాగా తాజాగా మహేంద్రన్ పక్కమ్ నంబర్ 143 అనే చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు.శ్రీలక్ష్మి నరసింహా సినీ స్టూడియోస్ పతాకంపై క్రిష్ణబాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం,మాటలు,దర్శకత్వం బాధ్యతల్ని ఏ.జగన్ నిర్వహిస్తున్నారు. చిత్ర వివరాలను ఆయన వెల్లడిస్తూ కాలం మారుతున్నా కొందరు మనుషులు మాత్రం మారరన్నారు. వారి గుణగణాల్లోనూ మార్పు రాదన్నారు.
అలాంటి ఒక క్రూర మనస్తత్వం గల యువకుడి ఒక యువతి ఎలా మంచి వాడిగా మార్చిందన్న విభిన్న కథాంశంతో తెరకెక్కించనున్న చిత్రం పక్కమ్ నంబర్ 143 అని తెలిపారు. చిత్రాన్ని కుటుంబ సమేతంగా చూసి ఆనందించే విధంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. చిత్రానికి సంగీతాన్ని మధుకర్, చాయాగ్రహణం కర్ణ అందిస్తున్నట్టు దర్శకుడు తెలిపారు.