సాక్షి, విశాఖపట్నం: ఏపీలో టీడీపీ, చంద్రబాబుపై ఎందుకు విమర్శలు చేయడంలేదని బీజేపీ(తెలుగుదేశం నుంచి వెళ్లినవారు) నేతలకు పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణాధికారి మధుకర్ జీ క్లాస్ ఇచ్చారు. కేవలం ఒక వైఎస్సార్‌సీపీపైనే ఎందుకు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాగా, విశాఖ వేదికగా బీజేపీ మీడియా ఫ్యానలిస్టులతో, మీడియా కమిటీ ప్రతినిధులతో మధుకర్ జీ శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్బంగా మీడియాలో పార్టీ తరపున ఎలా స్పందించాలో దిశా నిర్దేశం చేశారు. ఇదే సమయంలో పార్టీ నేతల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం సందర్బంగా మధుకర్ మాట్లాడుతూ..‘గతంలో రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉంది. మీరు(టీడీపీ నేతలు ఇన్ బీజేపీ) చంద్రబాబు, టీడీపీపై ఎందుకు విమర్శలు చేయడం లేదు.
వైఎస్సార్‌సీపీ, టీడీపీలకు సమాన దూరం పాటించాలి. ఒక్క వైఎస్సార్‌సీపీపైనే ఎందుకు విమర్శలు చేస్తున్నారు. 70:30 శాతంలో కూడా మీరు విమర్శలు చేయడం లేదు. కుటుంబ పాలనకు వ్యతిరేకం అనేది బీజేపీ విధానం. పొత్తుల గురించి మీకు అప్పుడే తొందర ఎందుకు?. ఎప్పుడైనా పొత్తుపై నిర్ణయం తీసుకోవచ్చు. ఈ లోపల మీరు చేసే పని మీరు చేయండి’ అని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment